mortgage
-
రూ.10 వేల కోట్ల రుణంపై తర్జనభర్జన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల భూములను తాకట్టు పెట్టడం ద్వారా మూలధనం, ఇతర అవసరాల కోసం రుణ సేకరణ చేయాలనుకున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. రుణ మార్కెట్ నుంచి రూ.10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు, ఎఫ్ఆర్బీఎం పరిమితులు అడ్డుపడుతుండటంతో, అవాంతరాలను అధిగమించడంపై సర్కారు తర్జనభర్జన పడుతోంది. రుణ సేకరణ కోసం హైదరాబాద్‌లోని అత్యంత విలువైన సుమారు 400 ఎకరాల భూములను ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలకు తాకట్టు పెట్టాలని గతంలో నిర్ణయించారు. కోకాపేట, రాయదుర్గంలో ఉన్న ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.20 వేల కోట్లుగా అంచనా వేశారు. అయితే గతంలో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణం తీసుకున్న అనుభవం లేకపోవడంతో ‘మర్చంట్ బ్యాంకర్ల’కు రుణ సేకరణ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. మర్చంట్ బ్యాంకర్ల వివరాలపై మౌనం మర్చంట్ బ్యాంకర్ల ఎంపికకు ఈ ఏడాది జూలైలో శ్రీకారం చుట్టారు. రుణమార్కెట్ నుంచి అప్పులు తేవడంలో అనుభవం కలిగిన బ్యాంకర్ల నుంచి జూలై 5 నుంచి 12వ తేదీ వరకు బిడ్లను స్వీకరించారు. అదే నెల 15న సాంకేతిక బిడ్లను తెరిచి అర్హత కలిగిన మర్చంట్ బ్యాంకర్లను ఎంపిక చేశారు. అయితే ఎంపికైన బిడ్డర్ల వివరాలను వెల్లడించేందుకు ఆర్థిక, పరిశ్రమల శాఖ అధికారులు సుముఖత చూపడం లేదు. 2019 నుంచి 2023 మధ్యకాలంలో కనీసం రూ.1,500 కోట్ల నుంచి రూ.20 వేల కోట్లకు పైగా రుణాలు సేకరించిన అనుభవం కలిగిన సంస్థలను మర్చంట్ బ్యాంకర్లుగా ఎంపిక చేసినట్లు తెలిసింది.వీరు ఈఎండీ రూపంలో రూ.కోటి, పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ కింద మరో రూ.4 కోట్లు కూడా ప్రభుత్వానికి చెల్లించినట్లు సమాచారం. కాగా మర్చంట్ బ్యాంకర్లు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా రుణ సేకరణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. రుణం ఇప్పించే మర్చంట్ బ్యాంకర్‌కు కనీసం ఒక శాతం చొప్పున లెక్క వేసినా రూ.100 కోట్లు కమీషన్ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్ సంస్థల షరతులు అప్పుల కోసం ప్రభుత్వం తరపున ఫైనాన్స్ సంస్థల వద్దకు వెళ్లిన మర్చంట్ బ్యాంకర్లకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నట్లు తెలిసింది. రూ.10 వేల కోట్ల రుణం కోసం రూ.20 వేల కోట్లు విలువ చేసే విలువైన భూములను తాకట్టు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనా, భూముల తాకట్టుతో పాటు రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే మంజూరు చేస్తామని మెలిక పెడుతున్నాయి. ఇక్కడే ప్రభుత్వానికి చిక్కొచ్చి పడింది. రుణ మొత్తానికి గ్యారంటీ ఇస్తే ‘ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ’ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలను కేంద్రం వర్తింపజేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.రాష్ట్ర ప్రభుత్వాలు చేసే ఏ తరహా రుణాలైనా ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణ పరిమితికి లోబడే ఉండాలని రిజర్వు బ్యాంకు ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. రుణమార్కెట్ నుంచి తెచ్చే అప్పులకు సంబంధించిన సమాచారం ఆర్బీఐకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలను అధిగమించి, ఎఫ్ఆర్బీఎం నిబంధనలు వర్తించకుండా రుణ సమీకరణ విషయంలో ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ప్రభుత్వం గ్యారంటీ ఇస్తేనే అప్పులు తేవడం సాధ్యమవుతుందని మర్చంట్ బ్యాంకర్లు సైతం తేల్చి చెబుతున్న నేపథ్యంలో దీని సాధ్యాసాధ్యాల పరిశీలనలో అధికారులు నిమగ్నమయ్యారు. -
బెటర్ డాట్ కామ్ రియల్ ఎస్టేట్ యూనిట్ షట్‌డౌన్.. వేల మంది ఉద్యోగుల తొలగింపు
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో మార్ట్గేజ్ సంబంధిత సేవలను అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫాం బెటర్.కాం (Better.com) సంచలన నిర్ణయం తీసుకుంది. తన రియల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు బెటర్.కాం వ్యవస్ధాపక సీఈవో విశాల్ గార్గ్ వెల్లడించారు. మార్ట్గేజ్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే, మార్ట్గేజ్ వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు కంపెనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో 4,000 మంది ఉద్యోగుల తొలగింపు ముందే ఊహించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు సోషల్ మీడియా సంస్థ రెడిట్ 90 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్ధిక అనిశ్చితి కారణగా గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు భారతీయ స్టార్టప్‌లు కూడా గత ఏడాదిగా ఏకంగా 27,000 మందికిపైగా విధుల నుంచి తొలగించినట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఉద్యోగులందరూ లేఆఫ్.. రియల్ ఎస్టేట్ యూనిట్ మూసివేత
ఆన్లైన్ మార్ట్గేజ్ సంస్థ బెటర్ డాట్ కామ్ (Better.com) తాజా లేఆఫ్‌లలో భాగంగా తమ రియల్ ఎస్టేట్ యూనిట్‌ను మొత్తానికే ఎత్తేసి అందులోని ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెక్లూసివ్ (TECHLUSIVE) నివేదిక ప్రకారం.. బెటర్ డాట్ కామ్ సీఈవో భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2021 డిసెంబర్ నుంచి నుంచి ఇప్పటివరకు యూఎస్, భారత్ దేశాల్లో 4,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. అయితే తాజా రౌండ్ తొలగింపుల ప్రభావం ఎంత మంది ఉద్యోగులపై పడుతుందో స్పష్టత లేదు. బెటర్ డాట్ కామ్ అంతర్గత ఏజెంట్ మోడల్ నుంచి భాగస్వామ్య ఏజెంట్ మోడల్‌కు మారాలని యోచిస్తున్నట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించినందుకు విశాల్ గార్గ్ విమర్శలు ఎదుర్కొన్నారు. 2022 మే లో ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు అవకాశం ఇవ్వగా దాదాపు 920 మంది రాజీనామాలు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో అమెజాన్, బెటర్ డాట్ కామ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అమెజాన్ ఉద్యోగులు తమ కంపెనీ షేర్లను తనఖా కోసం అవసరమైన ప్రారంభ చెల్లింపునకు ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం 'ఈక్విటీ అన్‌లాకర్' అనే ప్రోగ్రామ్‌ను బెటర్ డాట్ కామ్ పరిచయం చేసింది. ఇది అమెజాన్ ఉద్యోగులు తమ వెస్టెడ్ ఈక్విటీని సెక్యూరిటీగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. బెటర్ డాట్ కామ్ తరచూ ప్రకటిస్తున్న లేఆఫ్‌లు మార్ట్గేజ్ రంగంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
1.1 బిలియన్ డాలర్లు ముందస్తు చెల్లింపు
న్యూఢిల్లీ: తనఖాలో ఉన్న అదానీ గ్రూప్ సంస్థల షేర్లను విడిపించుకునేందుకు ప్రమోటర్లు 1.1 బిలియన్ డాలర్లను ముందస్తుగా చెల్లించనున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్స్ (ఏపీసెజ్) , అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్ (ఏటీఎల్) సంస్థల షేర్లు వీటిలో ఉన్నాయి. ఇవి వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో మెచ్యూర్ కానున్నాయి. ఇటీవల మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు అదానీ గ్రూప్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అదానీ గ్రూప్ సంస్థల ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలతో కంపెనీల షేర్లు కుప్పకూలిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకటన ప్రకారం తనఖా ఉంచిన షేర్లకు సంబంధించి ఏపీసెజ్‌లో 12 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 3 శాతం, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 1.4 శాతం ప్రమోటర్ల వాటాలను విడిపించనున్నారు. అదానీ ట్రాన్స్మిషన్ లాభం 73 శాతం అప్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అదానీ ట్రాన్స్మిషన్ లాభం దాదాపు 73 శాతం పెరిగి రూ. 478 కోట్లకు చేరింది. అమ్మకాల వృద్ధి, వన్‌టైమ్ ఆదాయం నమోదు కావడం ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో లాభం రూ. 277 కోట్లు. తాజాగా ఆదాయం రూ. 2,623 కోట్ల నుంచి రూ. 3,037 కోట్లకు చేరింది. -
ఇదేం చోద్యం.. ఏకంగా చెరువు భూమినే తనఖా పెట్టేశారు!
పట్టాదారులమంటూ.. కోర్టు ఆదేశం ఉందంటూ పోలీసులు బందోబస్తుతో నాడెం చెరువు తూమును ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకోవడంతో ధ్వంసం చేయించిన వారు తోక ముడిచారు. ఆ తర్వాత బుల్డోజర్ను సీజ్ చేసి కారకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా మూడు నెలల క్రితం జరిగిన సంఘటన. తాజాగా హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఓ బ్యాంకులో చెరువు భూమిని తనఖా పెట్టి రూ.12కోట్ల రుణం తీసుకోవడంతో నాడెం చెరువు పేరు తిరిగి తెరపైకి వచ్చింది. ఘట్కేసర్: చెరువులు, కుంటలు, జల వనరుల సంక్షరణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కాని క్షేత్రస్థాయిలో పరిస్థితి వారి మాటలకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా చెరువులు కబ్జా చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో చెరువులు, కుంటలు కనుమరుగవుతున్నాయి. తాజాగా వెంకటాపూర్ నాడెం (నల్ల) చెరువులోని భూమిని తనఖా పెట్టి కొందరు రూ.12 కోట్ల రుణం తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. నాడెం చెరువుపై ఆధారపడి వెంకటాపూర్‌కు చెందిన 105 మంది ముదిరాజ్ మత్స్యకారులు జీవనోపాధి పొందుతున్నారు. నీటిని తొలగించే అధికారం లేకున్నా... రెవెన్యూ రికార్డులో ఉన్న చెరువును అందులో ఉన్న నీటిని తొలగించే అధికారం నీటి పారుదల శాఖ అధికారులకే ఉంది. నాడెం చెరువులో నీరు లేదంటూనే చెరువులో చేపలు పట్టొందంటూ కొందరు కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్డు ఆర్డర్ ఉందని ఆగస్టు 3, 2022న పోలీస్‌బందో బస్తుతో చెరువు కల్వర్టును ధ్వంసం చేశారు. మత్స్యకారులు చెరువులోకి దిగితే కేసులు పెడతామని పోలీసులు బెదిరించారని మత్స్యకారులు గతంలో ఆరోపించారు. తక్షణమే రంగంలోకి దిగిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కోర్టు ఆదేశం చూపించాలని కోరడంతో తోక ముడుచుకున్నారు. పోలీసుల అండతోనే ధ్వంసం.. చెరువులో చేపలు పడితే కేసు పెడతామని గతంలో పోలీసులు బెదిరించారని మత్స్యకారులు పేర్కొన్నారు. పోలీసుల అండతోనే అక్రమార్కులు కల్వర్టు ధ్వంసం చేశారని అప్పట్లో సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి. మత్స్యకారుల నుంచి విషయం తెలుసుకున్న అధికారులు తూము ధ్వంసాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్, రోడ్డు భవనాల శాఖాధికారులు ఘట్కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగులపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ఎన్ఓసీ ఇవ్వలేదు ఈ విషయమై తహసీల్దార్ విజయలక్ష్మి, ఇరిగేషన్ ఏఈ పరమేశ్‌ను వివరణ కోరగా బ్యాంకు రుణం కోసం మేము ఎటువంటి ఎన్ఓసీ ఇవ్వలేదని తెలిపారు. బ్యాంకు డాక్యూమెంట్లు చూస్తే కాని ఏమి చెప్పలేమని పేర్కొన్నారు. చెరువు విస్తీర్ణం 62 ఎకరాలు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ సర్వేనంబర్ 814, 816లో 62 ఎకరాల విస్తీర్ణంలో నాడెం చెరువును నీటి పారుదల శాఖ అధికారులు గుర్తించారు. ఘట్కేసర్ పరిసరాల్లో భూమి విలువ పెరగడంతో అక్రమార్కుల కన్ను చెరువుపై పడింది. రాజకీయ నాయకుల అండతో నీటిని తొలగించి చెరువు లేకుండా చేయాలని యత్నిస్తున్నారు. చెరువులోని భూమికి రుణం ఎలా ఇచ్చారు.? భూమి పరిశీలించకుండానే చెరువులో నీట మునిగిన భూమికి బ్యాంకు ఎలా రుణం ఇచ్చిందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. లక్ష రుణం కోసం చెప్పులరిగేలా తిప్పుకునే బ్యాంకు అధికారులు నీటిలో ఉన్న భూమికి రుణం ఇవ్వడమేమిటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (క్లిక్ చేయండి: స్వామి వారి పేరు మార్చి... రికార్డులు ఏమార్చి!) -
మరోసారి వార్తల్లో కెక్కిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్!
ప్రముఖ మార్టిగేజ్ సంస్థ బెటర్‌డాట్ కామ్ ఉద్యోగులకు షాకిచ్చింది. మొత్తం మూడు దశల్లో 4వేల మందిని ఉద్యోగుల్ని తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 250 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. ఆగస్ట్ 23న బెటర్ డాట్ కామ్ 250 ఉద్యోగులపై వేటు వేసింది. వేటు వేసిన ఉద్యోగులు ఏ విభాగానికి చెందిన వారనేది తెలియాల్సి ఉండగా.. తాజాగా ఆ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం మరోసారి సంచలనంగా మారింది. ఎందుకంటే ? గతేడాది డిసెంబర్ నెలలో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల వ్యవధిలో 900 మంది ఉద్యోగుల్ని తొలగించి వారి ఆగ్రహానికి కారణమయ్యారు. అలా నాటి నుంచి ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశారు విశాల్ గార్గ్. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్ జరిగే సమయంలో 900మందిని, ఈ ఏడాది మార్చిలో 2వేల మందిని, ఏప్రిల్‌లో వెయ్యిమందిని ఇంటికి సాగనంపారు. ఇప్పటి వరకు సుమారు 4వేల మందిపై వేటు వేయగా..తాజాగా 250మందిని తొలగించడంతో చర్చాంశనీయమయ్యారు. ఫైర్ చేసిన ఉద్యోగులు, స్వచ్ఛందంగా బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. కాగా, కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు బెటర్ డాట్ కామ్ సీఈవో గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. చదవండి👉 పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
ఎంపీకే టోకరా.. రూ. 25 కోట్లకు కుచ్చుటోపి
న్యూఢిల్లీ: బ్యాంకులో తనఖా పెట్టి.. 20 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్న ప్రాపర్టీని.. మాయమాటలు చెప్పి.. మరో వ్యక్తికి ఏకంగా 5 కోట్ల రూపాయలకు అంటగట్టారు నిందితులు. ఇక్కడ మోసపోయిన వ్యక్తి ఓ ఎంపీ కావడం విషేశం. నిందితులను అరెస్ట్ చేశారు ఆర్థిక నేరాల విభాగం అధికారులు. ఆ వివరాలు.. ఝాన్సీ ఎంపీ అనురాగ్ శర్మకు నాలుగేళ్ల క్రితం నిందితుడు వినోద్ కుమార్ శర్మతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వినోద్ కుమార్ ఢిల్లీలో తనకు ఓ ప్రాపర్టీ ఉందని.. దాని విలువ సుమారు 5 కోట్ల రూపాయలుంటుందని తెలిపాడు. ఆ ప్రాపర్టీని ఢిల్లీ మెట్రో రైల్వై ప్రాజెక్ట్ లీజుకు తీసుకుందని.. నెలకు 8-9 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుందని నమ్మబలికాడు. (చదవండి: చందమామపై ఇల్లు 289 కోట్లే!) వినోద్ మాటలు నమ్మిన అనురాగ్.. అతడు చెప్పిన మేరకు 5.6 కోట్ల రూపాయలు చెల్లించి 2017, ఫిబ్రవరి 21న కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అసలు మోసం వెలుగులోకి వచ్చింది. విషయం ఏంటంటే అనురాగ్‌కు ప్రాపర్టీని అమ్మడానికి ముందే వినోద్ దాని మీద కెనరా బ్యాంక్‌లో 20.2 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నాడు. ఆ ప్రాపర్టీ మీద కెనరా బ్యాంక్ అనేక చార్జీలు విధించినట్లు తెలుసుకున్నారు. (చదవండి: ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!) అంతేకాక ప్రాపర్టీని అనురాగ్ శర్మకు అమ్మిన తర్వాత నిందితుడు.. ఆ విషయాన్ని దాచిపెట్టి డీఎంఆర్‌సీతో చేసుకున్న లీజ్ అగ్రిమెంట్‌ను తన పేరు మీదనే పొడగించుకున్నాడు. మోసపోయానని తెలుసుకున్న అనురాగ్ శర్మ.. నిందితుల మీద ఫిర్యాదు చేయడంతో ఆర్థిక నేరాల విభాగం అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక వినోద్ శర్మ తనను తాను మాజీ న్యాయశాఖ అధికారిగా పరిచయం చేసుకున్నట్లు విచారణలో వెల్లడయ్యింది. చదవండి: ‘రూ.30 లక్షలు కట్టు.. గవర్నమెంట్ జాబ్ పక్కా’ -
ఎస్బీఐ బంపర్ ఆఫర్..! అతి తక్కువ ధరకే ఇళ్లను సొంతం చేసుకోండిలా..!
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ 25న దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ-ఆక్షన్‌లో పాల్గొన వచ్చని తెలిపింది. సాధారణంగా అత్యవసర లోన్ కోసం బ్యాంక్‌లో ఆస్తుల్ని చూపెట్టి..వాటి ఆధారంగా లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. వాటినే మాటిగేజ్ లోన్ అంటారు. ఒకవేళ తీసుకున్న లోన్ తీర్చలేని పక్షంలో సంబంధిత బ్యాంక్‌లు మాటిగేజ్‌లో ఉన్న ఆస్తుల్ని వేలం వేస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ కూడా అదే చేస్తోంది. ఈ నెలలో దేశ వ్యాప్తంగా మాటిగేజ్ లోన్లపై ఉన్న ఆస్తులపై ఈ-వేలం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.ఈ-వేలంలో మాటిగేజ్ ఇళ్లు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌లను ప్రస్తుత మార్కెట్ కంటే తక్కువకే సొంతం చేసుకోవచ్చని ట్వీట్లో పేర్కొంది. Your next big investment opportunity is here! Join us during the e-auction and place your best bid. Know more: https://t.co/vqhLcagoFF #Auction #EAuction #Properties #SBIMegaEAuction pic.twitter.com/e24yoxgh1C — State Bank of India (@TheOfficialSBI) October 13, 2021 మాటిగేజ్‌లో పాల్గొనేందుకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ► ఈ - ఆక్షన్‌లో పాల్గొనే వారికి ఈఎండీ (Earnest Money Deposit) తప్పసరిగా ఉండాలని ఎస్బీఐ పేర్కొంది. ► కేవైసీ డాక్యుమెంట్లను సంబంధిత ఎస్ బీఐ బ్రాంచ్‌లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ► వ్యాలిడ్ డిజిటల్ సిగ్నేచర్ తప్పని సరిగా కావాలి. ఇందుకోసం ఆక్షన్‌లో పాల్గొనే వారు డిజిటల్ సిగ్నేచర్ కోసం ఎస్బీఐ బ్రాంచ్ అధికారుల్ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే ఏజెన్సీలను ఆశ్రయించవచ్చు. ► ఎస్బీఐ బ్రాంచ్‌లో ఈఎండీ, కేవైసీ డాక్యుమెంట్లను సబ్మిట్ చేసిన తర్వాత వేలంలో పాల్గొనే బిడ్డర్లకు అధికారిక మెయిల్‌కు లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌లను పంపిస్తారు. అనంతరం వేలం నిబంధనల ప్రకారం ప్రకటించిన తేదీల్లో ఇ-వేలంలో పాల్గొనాలి ఎస్ బీఐ ఈ-ఆక్షన్‌లో ఎలా పాల్గొనాలి ► అధికారిక బిడ్డింగ్ పోర్టల్‌ను విజిట్ చేసి మీ అడ్రస్ ఫ్రూప్‌తో పాటు మెయిల్ ఐడీకి సెండ్ చేసిన పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి ► లాగిన్ అయిన తర్వాత నిబంధనలు, షరతుల్ని అంగీకరించి 'పార్టిసిపేట్' అనే బటన్‌పై క్లిక్ చేయండి. ► అవసరమైన కేవైసీ పత్రాలు, ఈఎండీ వివరాలు, ఎఫ్ఆర్క్యూ (మొదటి రేటు కోట్) ధరను అప్లోడ్ చేయాలి. ► పత్రాలను సమర్పించిన తర్వాత, కోట్ ధరను సమర్పించాలి. ఆస్తి లేదా ఆస్తి యొక్క రిజర్డ్వ్ విలువకు సమానంగా లేదా ఎక్కువగా ఉంటుంది. ► అవసరమైన వివరాలను, కోట్ ధరను పూర్తి చేయాలి. ఆపై సబ్మిట్ చేసి ఆ తర్వాత చివరిగా బటన్ పై క్లిక్ చేయండి. చివరిగా 'బ్రాంచ్‌లలో వేలం కోసం నియమించబడిన అధికారి ఉంటారు. వేలంలో పాల్గొనే వారు ఎవరైనా సరే వేలం ప్రక్రియ, లేదంటే ఈవేలంలో కొనుగోలు చేసే ఆస్తుల్ని తనిఖీ చేయాలంటే అధికారిని సంప్రదించవచ్చని' ఎస్బీఐ తెలిపింది. చదవండి: SBI: టాక్స్ పేయర్లకు ఎస్బీఐ గుడ్‌న్యూస్...! -
చందమామపై ఇల్లు 289 కోట్లే!
చిన్నప్పుడు అమ్మ గోరు ముద్దలు తినిపిస్తూ చందమామ రావే, జాబిల్లి రావే అని పిలిచేది. అప్పుడు జాబిల్లి రాకున్నా.. ఇప్పుడు మనమే జాబిల్లి దగ్గరికి వెళ్లే రోజు వచ్చేసింది. చంద్రుడిపై మనిషి ఎప్పుడో అడుగుపెట్టినా.. అక్కడ ఉన్నది కాసేపే. కానీ రోజులకు రోజులు, వీలైతే నెలల పాటు చంద్రుడిపైనే ఉండేందుకు.. అసలు చందమామను శాశ్వత ఆవాసంగా మల్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సహా చాలా సంస్థలు చంద్రుడిపైకి మనుషులను పంపేందుకు, అక్కడ కాలనీలు ఏర్పాటు చేసేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఆ దిశగా కొంత ముందడుగు కూడా వేశాయి. నాసా 2024లో తన ఆర్టిమిస్ మిషన్ ద్వారా మనుషులను చందమామపైకి పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రయోగాలన్నీ విజయవంతమై మనం చంద్రుడిపైకి వెళ్లొచ్చే రోజు దగ్గర్లోనే ఉంది. మరి చందమామపై గడపాలంటే ఎంత ఖర్చవుతుందో తెలుసా? ఈ లెక్క తేల్చేందుకే బ్రిటన్‌కు చెందిన కొందరు నిపుణులు ఓ స్టడీ చేశారు. చంద్రుడిపై ఇండ్లు కట్టడానికి, కరెంటు సహా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, టూరిస్టులు అక్కడ గడపడానికి ఎంతెంత ఖర్చవుతుందని లెక్కలు వేశారు. మూన్ మార్టిగేజ్ గైడ్ పేరుతో ఓ నివేదిక విడుదల చేశారు. ఎందుకింత వ్యయం? భూమిలాగా చందమామపై వాతావరణం లేదు. దాంతో మనం ఉండే ఇంట్లోనే ఉండాలి. బయటికి వెళితే స్పేస్ సూట్ తప్పనిసరి. చంద్రుడిపై వాతావరణం వేరు, ఒత్తిడి తక్కువగా ఉంటుంది కాబట్టి.. ఇంట్లో ప్రెషర్, ఆక్సిజన్, నీళ్లు, ఇతర సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికితోడు కరెంటు కోసం సోలార్ విద్యుత్ ప్యానెళ్లు కావాలి. చంద్రుడిపై ఉల్కలు గాల్లోనే మండిపోకుండా నేరుగా నేలపై పడతాయి. వాటిని తట్టుకునే సామర్థ్యమున్న గోడలు, అద్దాలు అమర్చాలి. వీటన్నింటికీ పెద్ద మొత్తంలోనే ఖర్చవుతుంది. దీనికితోడు చందమామపై ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవడమూ వ్యయంతో కూడుకున్నదే. అయితే మెటీరియల్ తయారీ, ఏర్పాట్లకు సంబంధించి మొదట్లో ఖర్చు ఎక్కువగా ఉంటుందని, తర్వాత తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యయం లెక్కలన్నీ చంద్రుడి నేలపై ఇల్లు కట్టేందుకేనని.. నేల దిగువన గుహల్లా కడితే ఖర్చు కొంత తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ►మొదటి ఇల్లు కట్టడానికయ్యే ఖర్చు రూ. 289.76 కోట్లు (40 మిలియన్ డాలర్లు) ►నెల రోజులు ఉండటానికి అయ్యే ఖర్చు రూ. 2.35 కోట్లు (3.25 లక్షల డాలర్లు) మనీ మ్యాగజైన్ రిపోర్ట్ మొదటి ఇల్లు కట్టడానికి అవసరమైన పరికరాలు, వర్కర్లను భూమిపై నుంచి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఖర్చు చాలా ఎక్కువ. తర్వాత పరికరాలు, వర్కర్లు అక్కడే ఉంటారు కాబట్టి.. తర్వాతి ఒక్కో ఇల్లు ఖర్చు తక్కువగా ఉంటుందని మనీ మేగజైన్ రిపోర్టులో పేర్కొంది. (చదవండి: ఆర్థిక నేరగాళ్లకు లండన్ స్వర్గధామం ఎలా ?) -
ఆస్తులు తాకట్టు పెట్టిన సోనూసూద్!
నేను బాగుంటే చాలు అనుకునే ఈ కాలంలో పది మంది బాగుంటే నేను బాగున్నట్లే అని గొప్పగా ఆలోచించిన వ్యక్తి సోనూ సూద్. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం మానేసిన సమయంలో ఆయన పేదల తరపున నిలబడ్డారు. కరోనా వైరస్ కన్నా దాని వల్ల విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది నిరుపేదల బతుకులు చితికిపోతుంటే వారిని కాపాడేందుకు దేవుడిలా దిగివచ్చి బడుగుల జీవితాల్లో వెలుగులు నింపారు. కన్న ఊరికి దూరమై బతుకు దెరువు కోసం పట్నానికి వచ్చి చిక్కుకుపోయిన వలసజీవులను సొంత గూటికి చేర్చారు. నోరు తెరిచి సాయం అర్థించిన వారికి కాదనుకుండా అన్నీ చేసుకుంటూ పోయారు. (చదవండి: టాప్ సెర్చ్డ్ సెలబ్రిటీ లిస్ట్ : అల్లు అర్జున్ ఏ ప్లేస్) అయితే ఇలా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ పోవడానికి ఆయన ఎంతగానో ఖర్చు చేశాడు. దీనికోసం తన ఆస్తులను తాకట్టు పెట్టినట్లు తెలిసింది. ముంబైలోని జుహులో ఎనిమది ఆస్తులను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు సేకరించినట్లు సమాచారం. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. సోనూసూద్ తన రెండు షాపులు, ఆరు ఫ్లాట్స్‌ను తాకట్టు పెట్టి రూ.10 కోట్లు అప్పు తీసుకున్నారట. దీనికి సంబంధించి సెప్టెంబర్ 15న అగ్రిమెంట్లపై ఆయన సంతకం చేయగా, గత నెల 24న రిజిస్ట్రేషన్ కూడా పూర్తి అయిందట. ఈ విషయాన్ని జేఎల్ఎల్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ రితేశ్ మెహతా ధ్రువీకరించారు. ఇప్పటికీ సాయం కోసం ఆయనకు ప్రతిరోజూ కుప్పలు తెప్పలుగా వినతులు వస్తూనే ఉన్నాయి. వారందరి కష్టాలను తీరుస్తానంటున్నాడీ హీరో. (చదవండి: ఆ ఒక్క మాటతో మీ వెంట ఉంటానన్నాను) -
రెరా పరిధిలో ఉంటే నో మార్టిగేజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్టిగేజ్ వ్యవస్థకు కాలం చెల్లనుంది. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్‌లకు మార్టిగేజ్ మినహాయింపునివ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. 200 చ.మీ. కంటే ఎక్కువ స్థలంలోని ప్రాజెక్ట్‌లకు 10 శాతం బిల్టప్ ఏరియాను మార్టిగేజ్ (తనఖా) చేయాలనే నిబంధన అమలులో ఉంది. ఈ స్థలాన్ని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) వచ్చిన తర్వాతే రిలీజ్ చేస్తారు. అయితే రెరా ప్రకారం.. కొనుగోలుదారులు అపార్ట్మెంట్ ధరలో 10 శాతం సొమ్మును ఓసీ వచ్చిన తర్వాతే డెవలపర్‌కు చెల్లించాలనే నిబంధన ఉంది. అలాంటప్పుడు ముందుగా జీహెచ్ఎంసీకి 10 శాతం స్థలాన్ని మార్టిగేజ్ చేయడమనేది సరైంది కాదని డెవలపర్ల సంఘాలు వాదిస్తున్నాయి. ప్రభుత్వం స్థలాన్ని, కొనుగోలుదారులు సొమ్మును మొత్తంగా 20 శాతం నిలిచిపోతే ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేసే డెవలపర్‌కు భారంగా మారుతుందని.. అందుకే రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్ట్‌లకు మార్టిగేజ్ నిబంధనను తొలగించాలని నిర్మాణ సంఘాలు కోరుతున్నాయి. కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ప్రతినిధులు బుధవారం జీహెచ్ఎంసీ కార్యాలయంలో కమీషనర్ దాన కిశోర్, సిటీ చీఫ్ ప్లానర్ దేవేందర్ రెడ్డిలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సంఘాల ప్రతినిధుల డిమాండ్లు ఏంటంటే.. అపార్ట్మెంట్ల ఎత్తు 21 మీటర్లు.. జీహెచ్ఎంసీ పరిధిలో ఎకరం లోపు స్థలంలో నిర్మించే అపార్ట్మెంట్లకు తప్పనిసరి సెల్లార్ నిబంధనను తొలగించాలి. 33 శాతం స్థలం పార్కింగ్ నిబంధన కారణంగా సెల్లార్, స్టిల్ట్ రెండూ తీయాల్సి వస్తుంది. మున్సిపల్ నిబంధనల ప్రకారం.. 18 మీటర్ల లోపు ఉండే నివాస సముదాయాలకు అగ్నిమాపక శాఖ నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) అవసరం లేదు. దీన్ని 21 మీటర్లకు పెంచాల్సిన అవసరముంది. దీంతో జీ+5 భవనాలకు సెల్లార్ అవసరం లేకుండా రెండు స్టిల్ట్స్ నిర్మించే వీలుంటుంది. దీంతో సెల్లార్ తవ్వకం, వ్యర్థాలను పారేయడం వంటి అదనపు ఖర్చులు తగ్గుతాయి. పైగా అపార్ట్మెంట్ల ఎత్తును గణించడంతో జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ ఒక్కొక్కరిదీ ఒక్కో తీరు. మున్సిపల్ విభాగం ప్రకారం అపార్ట్మెంట్ ఎత్తు పార్కింగ్ నుంచి మొదలైతే.. అగ్నిమాపక శాఖ మాత్రం గ్రౌండ్ లెవల్ నుంచి లెక్కిస్తుంది. వెంటిలేషన్ 10 శాతం చాలు.. ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరణ (వెంటిలేషన్) సరిగా ఉండేందుకు గది బిల్టప్ ఏరియాలో 7.5 మీటర్లకు ఒక్క కిటికీ ఉండాలనే నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ) చెబుతోంది. అయితే ఈ రోజుల్లో భవన నిర్మాణాలే గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడు వెంటిలేషన్స్ను కూడా ఎన్బీసీ నిబంధనలు వర్తింపజేయడం సరైంది కాదు. గ్రీన్ బిల్డింగ్ ప్రకారం.. గోడల ఏరియాలో 10 శాతం కిటికీలు ఉంటే సరిపోయేలా నిబంధనల్లో మార్పు చేయాల్సిన అవసరముంది. డీపీఎంఎస్అప్గ్రేడ్ వర్షన్ అపార్ట్మెంట్లకు సెట్‌బ్యాక్స్, ఎత్తు వంటి నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆన్లైన్ డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. 21 రోజుల్లోనే అనుమతులు కూడా వచ్చేస్తున్నాయి. అదే.. మల్టీ స్టోర్, గేటెడ్ కమ్యూనిటీ వంటి ప్రత్యేక ప్రాజెక్ట్‌ల విషయంలో మాత్రం ఆన్లైన్ డీపీఎంఎస్‌లో సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక్కో ప్రాజెక్ట్‌కు సుమారు 4 నెలల సమయం పడుతుంది. అందుకే ప్రత్యేక ప్రాజెక్ట్‌లకూ డీపీఎంఎస్ వినియోగంలో ఇబ్బందుల్లేకుండా సాఫ్ట్‌వేర్‌ను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. -
కర్ణాటకను విలన్‌గా చూస్తున్నారు: సిద్ధరామయ్య
బెంగళూరు: ‘మైసూరు నగర నిర్మాత దివంగత నల్వడి కృష్ణదత్త రాజ ఒడెయార్ బంగారు నగలను తాకట్టు పెట్టి కే.ఆర్.ఎస్ డ్యాంను నిర్మించారు. ఇక హారంగి, కబిని, హేమావతిలను కూడా మన సొంత డబ్బు ఖర్చుపెట్టి నిర్మించుకున్నాం. ఈ నాలుగు జలాశయాల నిర్మాణానికి కేంద్ర ప్రభత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. అయినా నీటిని సేకరించి ఈ నాలుగు జలాశయాల్లో నిల్వ చేసి పొరుగున ఉన్న తమిళనాడుకు మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక రకంగా కావేరి విషయంలో కర్ణాటక బలిపశువయ్యింది.’ అని సిద్ధరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని గాంధీ భవన్లో జరిగిన గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సాధారణంగా ‘కావేరి’ జలాశయాల్లో ఈశాన్య రుతుపనాలు బాగా పడితే 257 టీఎంసీల నీరు ఉండాలని, అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల 129 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందన్నారు. ఇందులో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ మొదటి వరకూ నీటిని వదిలామని గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ నాలుగు జలాశయాల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవన్నారు. ఈ విషయాలన్నీ చెప్పినా కూడా కావేరి నీటిని తమిళనాడుకు వదలాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఎందుకు ఆదేశిస్తోందో అర్థం కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడం లేదంటూ కర్ణాటకను ప్రతి ఒక్కరూ ఒక విలన్‌గా చూస్తున్నారన్నారు. అయితే కావేరి విషయంలో కర్ణాటక బలిపశువన్నదే సత్యమని సీఎం సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు. -
చీటింగ్ కేసులో నలుగురి అరెస్ట్
జంగారెడ్డిగూడెం : ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ ఎ.ఆనందరెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక బిల్డర్ డి.ఎస్.బి.రవికిరణ్ తన భవననాన్ని నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అద్దెకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో డబ్బులు అవసరం రావడంతో ఆ భవనాన్ని సేల్ రిజిస్ట్రేషన్‌పై కుదువ పెట్టి కర్పూరం గవరయ్య గుప్త, అద్దంకి వెంకట సతీష్, బచ్చు నారాయణరావు, కర్పూరం కేశవరావు వద్ద రూ.25 లక్షలు తీసుకున్నాడు. దీనికి మొదట్లో 1.50పైసలు వడ్డీ అని చెప్పారు. అంతేకాకS అదే భవనం ముందు ఉన్న రవికిరణ్‌కు ఉన్న ఖాళీ స్థలాన్ని వారు రూ.30 లక్షలకు కొన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నా.. డబ్బులు ఇవ్వలేదు. దీంతో రవికిరణ్ ప్రశ్నించగా, నువ్వు తీసుకున్న అప్పుకు వడ్డీ రూ.2 అని, ఇంకా తమకే రూ.రెండు కోట్లు ఇవ్వాలని ఆ నలుగురూ రవికిరణ్‌ను భయపెట్టి చెక్కులు, నోట్లపై సంతకాలు చేయించుకుని మోసం చేశారు. దీంతో రవికిరణ్ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
స్నాచింగ్ సొమ్ము ఎక్కడికి వెళుతోంది?
సాక్షి, ముంబై: దొంగలు అపహరించిన సొమ్మును ఏం చేస్తారు.. తెలిసిన వారికి తక్కువ ధరకు అమ్మేసుకుంటారు.. ఇదేనా మీ సమాధానం.. అయితే మీరు పప్పులో కాలేసినట్లే!! చైన్ స్నాచింగ్‌లకు పాల్పడే 80 శాతం మంది బంగారు ఆభరణాలను ప్రముఖ గోల్డ్‌లోన్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నట్లు తాజాగా వెల్లడైంది. స్నాచింగ్‌కు సొంత వాహానాలనే వాడుతున్నారని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉంటున్నారని డీసీపీ ధనుంజయ్ కుల్కర్ణి తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా నేరాలకు పాల్పడటంతో వీరు నాకాబందీ సమయంలో కూడా తప్పించుకుంటున్నారని కుల్కర్ణి తెలిపారు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించకుండా గోల్డ్ లోన్ సంస్థల్లో తాకట్టు పెడుతున్నారని చెప్పారు. వారికి ఈ విధానం అనుకూలంగా ఉందని, దీంతో మళ్లీ మళ్లీ స్నాచింగ్‌కు పాల్పడుతున్నారని రాష్ట్ర దర్యాప్తు సంస్థ సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలిపారు. బైకుల ద్వారా చోరీకి పాల్పడుతున్న వారిలో కల్యాణ్‌లోని అంబివెల్లిలో నివాసముంటున్న ఇరానియన్ల హస్తముందని దర్యాప్తులో తేలిందన్నారు. ఏడాదిలో వెయ్యికిపైగా కేసులు కాగా, నగరంలో 2015 జనవరి నుంచి 2016 ఏప్రిల్ వరకు 1,066 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని నగర పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు దుండగులు అత్యాధునిక బైక్‌లను ఉపయోగిస్తున్నారని అధ్యయనంలో తేలింది. చైన్ స్నాచింగ్‌కు సంబంధించి 80 శాతం నేరాలు బైకులు ఉపయోగించి చేసినవేనని వెల్లడైంది. నెలకు రూ.10 లక్షలు లక్ష్యం.. 2015 డిసెంబర్ 12న డీఎన్ నగర పోలీసులు ఇద్దరు చైన్ స్నాచర్లు అతిఫ్ అన్సారీ (32), ఇర్షద్ ఖాన్ (22)లను అరెస్టు చేశారు. నెలకు రూ.10 లక్షల విలువజేసే బంగారు చైన్లను దొంగిలించేలా లక్ష్యం పెట్టుకున్నట్లు వారు విచారణలో వెల్లడించారని కుల్కర్ణి తెలిపారు. ఆ ఇద్దరిపై ముంబై, థానేల్లో 60 వరకు కేసులు నమోదు అయ్యాయన్నారు. తన కొడుకు కేన్సర్ చికిత్స కోసం ఈ నేరాలను ఎంచుకున్నట్లు అన్సారీ చెప్పగా, బైకులను ఆధునీకరించే వ్యాపారం కోసం నేరాలకు పాల్పడినట్లు ఇర్షద్ చెప్పినట్లు వెల్లడించారు. -
ఆచరణ సాధ్యంకాని నిబంధనలు
-
మెలికల మాఫీ?
‘బంగారు’ రుణాలపై ఆంక్షలు ఆచరణ సాధ్యంకాని నిబంధనలు భారం తగ్గించుకునే పన్నాగం రుణమాఫీ ఓ ప్రహసనంగా మారింది. ఎన్నికల సమయంలో రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు ‘ఏరు దాటాక తెప్ప తగలేసిన’ చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా బంగారం తాకట్టుపెట్టి తీసుకున్న పంట రుణాలకు సంబంధించి ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం, అడంగల్ కాపీ సమర్పిస్తేనే మాఫీ చేస్తామని మెలిక పెట్టడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మచిలీపట్నం : తెలుగుదేశం ప్రభుత్వం రోజుకో రకమైన ఆంక్షను విధిస్తూ రుణమాఫీ భారాన్ని గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నికల ప్రచారం సమయంలో వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించడమే కాకుండా... రైతులెవరూ రుణాలు చెల్లించొద్దు తమ్ముళ్లూ అని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. అయితే వ్యవ సాయ రుణాలన్నింటినీ మాఫీ చేస్తామన్న పాలకులు తీరా పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు కంగుతిన్నారు. రుణమాఫీ జరగాలంటే ఆధార్ , పొలం సర్వేనంబరు, అడంగల్ కాపీ తదితర వివరాలను ఇవ్వాలనే ఆంక్షలు విధించడంతో మరింత గందరగోళానికి గురవుతున్నారు. అడంగల్ కాపీల్లో భూమి యజమాని పేరు వేరే ఉండగా ప్రస్తుతం సాగు చేస్తున్న రైతులు వేరే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడే రుణమాఫీకి సంబంధించి కొంతమేర కోత పడినట్లయ్యింది. అనంతరం ఉద్యానవన పంటలకు రుణమాఫీ వర్తించదని ప్రకటించారు. సంబంధిత పత్రాలు సమర్పిస్తేనే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామని మెలిక పెట్టారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఒక రైతుకు రూ. 75వేలకు మించి రుణం మంజూరు చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నాలుగైదు ఎకరాల పొలం ఉన్న రైతు పీఏసీఎస్ ద్వారా ఇచ్చే పంట రుణం రూ. 75వేలు కావడంతో మిగిలిన పెట్టుబడి కోసం బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్నారు. ఇప్పుడు కొంతమేరకే రుణమాఫీ అంటుండడంతో రైతు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. బంగారు రుణాలు రూ. 3,276 కోట్లు... జిల్లాలో 1,89,587 మంది రైతులు బంగారం తాకట్టు పెట్టి రూ. 3,276 కోట్ల రుణం తీసుకున్నారు. వరి సాగుకు సంబంధించి ఎకరానికి రూ. 24వేలు మాత్రమే పంట రుణంగా అందించే అవకాశం ఉంది. బ్యాంకు మేనేజరుకు, రైతుకు ఉన్న అవగాహన నేపథ్యంలో బంగారం తాకట్టు పెట్టి పంట రుణం తీసుకుంటే రూ. 24వేల కన్నా అధిక మొత్తంలోనే పంట రుణంగా మంజూరు చేశారు. ప్రభుత్వం తాజాగా ఎకరానికి పంట రుణం ఎంత మేర ఇచ్చే వెసులుబాటు ఉందో అంతే రుణమాఫీ చేస్తామనే ఆంక్షలు విధించటంతో రైతుల్లో మరింత ఆందోళన నెలకొంది. ఈ మేరకు బ్యాంకు అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రం మొత్తం మీద వ్యవసాయ రుణాలు రూ. 87 వేల కోట్లుండగా వాటిలో పంట రుణాల పేరుతో రూ. 35 వేల కోట్లకు కుదించారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రుణమాఫీ కోసం కేవలం రూ. 5వేల కోట్లు కేటాయించి అందులో వెయ్యి కోట్ల రూపాయలను నాన్‌ప్లాన్ గ్రాంటుగా ఉంచారని మిగిలిన రూ. 4వేల కోట్లను రుణమాఫీకి ఇచ్చేందుకు అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. -
ఆదమరిస్తే అంతే!
మునిసిపాలిటీల్లో మార్టిగేజ్ నిబంధనలకు తిలోదకాలు నిబంధనలకు విరుద్ధంగా అక్రమ రిజిస్ట్రేషన్లు కీలక పాత్ర పోషిస్తున్న టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు కోర్టుకెక్కుతున్న వినియోగదారులు అపార్ట్మెంట్లలో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు టౌన్ ప్లానింగ్‌లోని ‘మార్టిగేజ్’ నిబంధనలు దారి తప్పునున్నాయి. అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మునిసిపాలిటీలు తనఖా చేసిన ఆస్తులను కూడా భవన యజమానులు యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుకున్నారు. వీటి కొనుగోలు తర్వాత నిజం తెలిసి విక్రయదారులు బోరుమంటున్నారు. చిత్తూరులో జరిగిన ఓ సంఘటన ద్వారా ‘మార్టిగేజ్’పై ఆరా తీస్తే.. ప్రతి జిల్లాలోనూ అక్రమాలు బయటకొస్తున్నాయి. అయినా అధికారులు మాత్రం నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. సాక్షి, చిత్తూరు: కార్పొరేషన్, మునిసిపాలిటీల తనఖాలోని భవన సముదాయాలను సంబంధిత యజమానులు రిజిస్ట్రేషన్ అధికారులతో లాలూచీపడి ఇంకొకరికి విక్రయించి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారు. మార్టిగేజ్ చేసిన బహుళ అంతస్తుల సముదాయాలలోని ప్లాట్లు క్రయవిక్రయాలు చేయకుండా మునిసిపల్ అధికారులు రిజిస్ట్రేషన్ శాఖ వారికి సంబంధిత రికార్డులు ముందస్తుగా సమర్పిస్తారు. అయితే రిజిస్ట్రేషన్ శాఖలోని కొందరు ఉద్యోగులు అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తనఖాతాలో ఉన్న ఆస్తులను మునిసిపాలిటీ నుంచి అనుమతి జారీ(క్లియరెన్స్) ధ్రువపత్రం ఇచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. కానీ రిజిస్ట్రేషన్ శాఖ తద్భిన్నంగా వ్యవహరిస్తుండటంతో లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మునిసిపాలిటీ తనఖాలోని ఆస్తులను తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడంతో ఆలస్యంగా ఈ విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. మార్టిగేజ్ నిబంధనలు ఇవీ అపార్ట్మెంట్లలో నిర్మాణంలో అక్రమాలను నిలువరించడానికి ప్రభుత్వం జీవో నెంబర్ 569ని విడుదల చేసింది. దీని ప్రకారం బహుళ అంతస్తుల నిర్మాణం చేసేవారు 10 శాతం స్థలాన్ని పురపాలకశాఖకు రిజిస్ట్రేషన్‌తో సహా అప్పగించడమే మార్టిగేజ్ ! అపార్ట్మెంట్ల యజమానులు నిబంధనలు పాటింకపోతే మార్టిగేజ్ చేసిన స్థలాన్ని మునిసిపాలిటీ అధికారులు తనఖా విడిపించరు. తద్వారా అక్రమాలను నియంత్రించాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం! కాగా ఆచరణలో మాత్రం ఇది విఫలమవుతోంది. అనంత పురం, తిరుపతి, కడప, కర్నూలు, చిత్తూరు కార్పొరేషన్, మదనపల్లి, ప్రొద్దుటూరు, నంద్యాల, హిందూపురం లాంటి మునిసిపాలిటీల పరిధిలో మార్టిగేజ్ క్లియరెన్స్ చేసుకున్న అపార్ట్మెంట్లు చాలా తక్కువగా ఉన్నాయి. మార్టిగేజ్ క్లియరెన్స్ లేకుండానే చాలా అపార్ట్మెంట్లు ఉండటం గమనార్హం. అక్రమ రిజిస్ట్రేషన్లతో.. మునిసిపాలిటీకీ మార్ట్గేజ్ చేసిన పలు అపార్ట్మెంట్లులోని ప్లాట్లను సదరు కాంట్రాక్టర్లు విక్రయిస్తున్నారు. చిత్తూరు చర్చిరోడ్లో ఇటీవల ఓ సంఘటన వెలుగులోకి వచ్చి విక్రయదారుడు నేరుగా కోర్టును ఆశ్రయించారు. దీంతో తిరిగి యజమాని, అధికారులు సదురు వ్యక్తిని పిలిచి పంచాయతీ చేశారు. -తిరుపతిలో మార్ట్గేజ్ నిబంధనలను అతిక్రమించి క్రయవిక్ర యాలు కోకొల్లలుగా జరిగాయి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ శాఖలోని ఇద్దరు ఉద్యోగుల కనుసన్నల్లోనే సాగాయి. కొన్నేళ్లుగా ఆశాఖలో పాతుకుపోయిన వీరు టౌన్‌ప్లానింగ్ అధికారులతో కలిసి ఈ అక్రమాలను సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం గత ఏడాది మునిసిపాలిటీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో కూడా బట్టబయలైంది. - అనంతపురంలోని సుభాశ్రోడ్డు, రాంనగర్ కాలనీల్లో నిర్మించిన అపార్ట్మెంట్లోని మార్టిగేజ్ చేసిన ప్లాట్లను విక్రయాలు జరిపారు. దీనిని గుర్తించిన సదరు ప్లాట్ల యజమానులు తమకు జరిగిన నష్టంపై న్యాయవాదులతో నోటీసులు సైతం ఇప్పించారు. - కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, తిరుపతిలో అధికశాతం అపార్ట్మెంట్లు మార్ట్గేజ్ నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఎన్ఫోర్స్మెంట్ దష్టికి కూడా వచ్చినట్లు తెలిసింది. వీటిపై గతంలో పత్రికల్లో కథనాలు వచ్చినా అక్రమాలను అధికారులు నియంత్రించలేకపోతున్నారు. నిబంధనలు బేఖాతర్ - పూర్తి స్థాయిలో సెట్‌బ్యాక్ 12 మీటర్లు వదలకుండానే అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. - పార్కింగ్ స్థలంలో దుకాణాలు నిర్మించుకుని అద్దెలకు ఇస్తున్నారు. ఇది ప్రతీ మునిసిపాలిటీలోనూ సాధారణమైపోయింది. - పురపాలకశాఖ అధికారులు నిర్మాణాలను ప్రాథమిక దశలో అడ్డుకోకుండా పూర్తిగా నిర్మాణాలు చేసిన తర్వాతే మేల్కొంటున్నారు. తర్వాత అందినకాడికి పుచ్చుకుని నిమ్మకుండిపోతున్నారు. - చిత్తూరు చర్చిస్ట్రీట్‌లో 90శాతం షాపింగ్ కాంప్లెక్స్‌లకు పార్కింగ్ స్థలాలు లేవు. రోడ్డుపై వాహనాలు అడ్డంగా ఉంచి వెళుతున్నారు. కార్లలో షాపింగ్ వస్తే అంతే సంగతి. వీటి నిర్మాణ అనుమతులు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే! ఇటీవల చిత్తూరులో 20రోజుల పాటు ట్రాఫిక్ అధికారులు దుకాణదారులతో పాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేశారు. అయినా కార్పొరేషన్ సిబ్బంది స్పందించలేదు. కడప వైవీస్ట్రీట్లోనూ అచ్చం ఇదే పరిస్థితి. - కర్నూలులోని ఓ అపార్ట్మెంట్లో పార్కింగ్ కోసం కేటాయించిన స్థలంలో సూపర్‌మార్కెట్ నిర్మించారు. దీనిపై వివాదం న్యాయంస్థానం వరకూ వెళ్లింది. - అనంతపురం కార్పొరేషన్లో సుభాశ్రోడ్డులో నగరంలోనే పేరుమోసిన ఓఅపార్ట్మెంట్ ముందుభాగంలోని షాపింగ్ కాంప్లెక్స్‌కు పార్కింగ్ స్థలం లేదు. - అనంతపురంలో గుత్తిరోడ్డులోని మునిసిపాలిటీ కాలువను ఓ ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యే పూర్తిగా పూడ్చి అక్కడ ఓ సముదాయాన్ని నిర్మించారు. దీంతో అక్కడ నిత్యం డ్రైనేజీ సమస్య తలెత్తుతోంది.