ప్రముఖ మార్టిగేజ్ సంస్థ బెటర్‌డాట్ కామ్ ఉద్యోగులకు షాకిచ్చింది. మొత్తం మూడు దశల్లో 4వేల మందిని ఉద్యోగుల్ని తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 250 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. ఆగస్ట్ 23న బెటర్ డాట్ కామ్ 250 ఉద్యోగులపై వేటు వేసింది. వేటు వేసిన ఉద్యోగులు ఏ విభాగానికి చెందిన వారనేది తెలియాల్సి ఉండగా.. తాజాగా ఆ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం మరోసారి సంచలనంగా మారింది. ఎందుకంటే ?
గతేడాది డిసెంబర్ నెలలో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల వ్యవధిలో 900 మంది ఉద్యోగుల్ని తొలగించి వారి ఆగ్రహానికి కారణమయ్యారు.
అలా నాటి నుంచి ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశారు విశాల్ గార్గ్. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్ జరిగే సమయంలో 900మందిని, ఈ ఏడాది మార్చిలో 2వేల మందిని, ఏప్రిల్‌లో వెయ్యిమందిని ఇంటికి సాగనంపారు. ఇప్పటి వరకు సుమారు 4వేల మందిపై వేటు వేయగా..తాజాగా 250మందిని తొలగించడంతో చర్చాంశనీయమయ్యారు.
ఫైర్ చేసిన ఉద్యోగులు, స్వచ్ఛందంగా బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. కాగా, కానీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితులు బెటర్ డాట్ కామ్ సీఈవో గార్గ్‌ను ఆర‍్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment