vishal garg
-
‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యా’..మూడు నిమిషాల్లో 900 మంది తొలగింపుపై..
అనాలోచితమైన నిర్ణయాల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచే మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ మంచి నాయకుడిగా ఎదిగేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా టెక్నాలజీ మీడియా సంస్థ టెక్‌క్రంచ్ విశాల్ గార్గ్‌తో ఇంటర్వ్యూ జరిపింది. ఈ సందర్భంగా బెటర్ డాట్ కామ్‌లో మంచి బాస్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నించినట్లు తెలిపారు. 2021 డిసెంబర్ నెలలో సీఈవో విశాల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకున్నారు. లేఆఫ్స్ బాధితుల్లో అధిక వేతనాలు తీసుకున్న 250 మందికి పైగా ఉన్నారు. వాళ్లే చేయాల్సి పనివేళల గంటే ఎక్కువ సేపు పనిచేశారని ఫార్చ్యూన్ మ్యాగజైన్ తెలిపింది. శిక్షణ తీసుకున్నా అయితే, ఆ భారీ లేఆఫ్స్ తర్వాత మంచి బాస్‌గా ఎదిగేందుకు, సిబ్బంది తనని నమ్మేలా ప్రయత్నించినట్ల, ఇందుకోసం ట్రైనింగ్ తీసుకున్నట్లు టెక్ క్రంచ్‌కు చెప్పారు. తద్వారా ఉద్యోగులను చూసే ధోరణి మార్చుకున్నానని, వారిపట్లు సానుభూతితో మెలిగేలా శిక్షణ తీసుకున్నారు. కస్టమర్లతో సైతం అదే తరహాలో ఉండేలా కష్టపడినట్లు వెల్లడించారు. చిన్న లాజిక్ అర్ధమైంది కంపెనీ లక్ష్యం, సంస్థ ఎదుగుదలతో పాటు కస్టమర్లకు సంతృప్తి కలిగించడంపై దృష్టి సారించినట్లు గార్గ్ పేర్కొన్నారు. తన క్లయింట్లు సంతృప్తి చెందాలంటే తన ఉద్యోగులు సంతోషంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని తాను గ్రహించినట్లు చెప్పారు. ప్రస్తుతం Better.com లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారని గార్గ్ తెలిపారు. ఇటీవలే అరోరా అక్విజిషన్ కార్ప్ అనే సంస్థతో గార్గ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈ డీల్ కొంతకాలం వాయిదా పడింది. బెటర్.కామ్ షేర్లు నాస్డాక్ స్టాక్ మార్కెట్లో బీఈటీఆర్ గుర్తును ఉపయోగించి ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభం కాగానే షేరు విలువ 90 శాతానికి పైగా పడిపోయింది. ఇక, తాజాగా టెక్‌క్రంచ్ జూమ్ ఇంటర్వ్యూతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సంస్థ బాగుండాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. తనని తాను మార్చుకునే దిశగా విశాల్ గార్గ్ శిక్షణ తీసుకోవడంపై అభినందనలు తెలుపుతున్నారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Benjamin Young Savage (ᐱᓐᒋᐱᓐ) (@benjancewicz) December 3, 2021 -
బెటర్ డాట్ కామ్ రియల్ ఎస్టేట్ యూనిట్ షట్‌డౌన్.. వేల మంది ఉద్యోగుల తొలగింపు
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో మార్ట్గేజ్ సంబంధిత సేవలను అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫాం బెటర్.కాం (Better.com) సంచలన నిర్ణయం తీసుకుంది. తన రియల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు బెటర్.కాం వ్యవస్ధాపక సీఈవో విశాల్ గార్గ్ వెల్లడించారు. మార్ట్గేజ్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే, మార్ట్గేజ్ వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు కంపెనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో 4,000 మంది ఉద్యోగుల తొలగింపు ముందే ఊహించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు సోషల్ మీడియా సంస్థ రెడిట్ 90 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్ధిక అనిశ్చితి కారణగా గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు భారతీయ స్టార్టప్‌లు కూడా గత ఏడాదిగా ఏకంగా 27,000 మందికిపైగా విధుల నుంచి తొలగించినట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
మరోసారి వార్తల్లో కెక్కిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్!
ప్రముఖ మార్టిగేజ్ సంస్థ బెటర్‌డాట్ కామ్ ఉద్యోగులకు షాకిచ్చింది. మొత్తం మూడు దశల్లో 4వేల మందిని ఉద్యోగుల్ని తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 250 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. ఆగస్ట్ 23న బెటర్ డాట్ కామ్ 250 ఉద్యోగులపై వేటు వేసింది. వేటు వేసిన ఉద్యోగులు ఏ విభాగానికి చెందిన వారనేది తెలియాల్సి ఉండగా.. తాజాగా ఆ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం మరోసారి సంచలనంగా మారింది. ఎందుకంటే ? గతేడాది డిసెంబర్ నెలలో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల వ్యవధిలో 900 మంది ఉద్యోగుల్ని తొలగించి వారి ఆగ్రహానికి కారణమయ్యారు. అలా నాటి నుంచి ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశారు విశాల్ గార్గ్. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్ జరిగే సమయంలో 900మందిని, ఈ ఏడాది మార్చిలో 2వేల మందిని, ఏప్రిల్‌లో వెయ్యిమందిని ఇంటికి సాగనంపారు. ఇప్పటి వరకు సుమారు 4వేల మందిపై వేటు వేయగా..తాజాగా 250మందిని తొలగించడంతో చర్చాంశనీయమయ్యారు. ఫైర్ చేసిన ఉద్యోగులు, స్వచ్ఛందంగా బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. కాగా, కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు బెటర్ డాట్ కామ్ సీఈవో గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. చదవండి👉 పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి! -
బెటర్‌డాట్ కామ్ సీఈవో, పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!
జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మంది ఉద్యోగుల్ని తొలగించిన బెటర్.కామ్ సీఈవో విశాల్ గార్గ్ మరోసారి చర్చాంశనీయమయ్యారు. ఈ సారి ఏకంగా 920మంది భారతీయ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపారు. మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఆ సంస్థకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ ఆర్ధికంగా ఆదుకుంటుంది. బెటర్ డాట్ కామ్ సంస్థ నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1.5 బిలియన్ల నిధుల్ని సేకరించారు. అందులో వ్యక్తిగతంగా సాఫ్ట్ బ్యాంక్‌కు 750 మిలియన్ డాలర్లను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించారు. గతేడాది డిసెంబర్లో బెటర్ డాట్ కామ్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు విశాల్ గార్గ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్‌లో 900మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ తొలగింపు సంచలనం సృష్టించింది. తమ అనుమతులు లేకుండా విధుల నుంచి తొలగించడం ఎంతవరకు సమంజసం అంటూ ఉద్యోగులు గార్గ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సరే ఈ ఏడాది మార్చిలో 4వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించారు. ఇక మనదేశానికి చెందిన 920 ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలకు ఆమోదం తెలిపారు. అరోరాను సొంతం చేసుకునేందుకే గతేడాది నవంబర్‌లో అరోరా అక్విజిషన్ కార్ప్ సంస్థను బెటర్.కామ్ 1.5బిలియన్లకు కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల ఒప్పందంలో భాగంగా సాఫ్ట్ బ్యాక్ ఇచ్చే రుణం కోసం ఎదురు చూడకుండా అరోరా అక్విజిషన్ కార్ప్‌కు సగం చెల్లించి ఈ కొనుగోళ్ల డీల్‌ను క్లోజ్ గార్గ్ క్లోజ్ చేశారు. ఈ సందర్భంగా అరోరా ప్రతినిధులు మాట్లాడుతూ.. బెటర్ సంస్థ ఫౌండర్, అధినేత విశాల్ గార్గ్ సాఫ్ట్ బ్యాంక్‌కు రుణాల్ని ఇచ్చేలా వ్యక్తిగత హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పుడు ఆ రుణాల్ని చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. కాబట్టి స్వచ్ఛంగా సంస్థ నుంచి స్వచ్చందంగా వెళ్లి పోవాలనుకున్న 920మంది భారతీయ ఉద్యోగులు రాజీనామాల్ని అంగీకరించారు. ఈ క్రమంలో సాఫ్ట్ బ్యాంక్‌కు 750 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఇక నాదగ్గర ఏమీలేదు. ఇది నిజం. నేను వ్యక్తిగతంగా మూడు వంతుల బిలియన్ డాలర్లకు హామీ ఇచ్చాను. దానికి నేను వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తాను. "అని ఉద్యోగులకు పెట్టిన మెయిల్స్‌లో బెటర్ డాట్ కామ్ సీఈవో పేర్కొన్నారు. చదవండి👉విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే.. -
జూమ్ కాల్లో 800 మంది ఉద్యోగుల తొలగింపు! మరి ఇంత దుర్మార్గమా..ప్రధాని ఆగ్రహం!
మీకు బెటర్ డాట్ కామ్ సీఈఓ విశాల్ గార్గ్ చేసిన నిర్వాకం తెలిసే ఉంటుంది. భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2016నుంచి 'బెటర్ డాట్ కామ్' అనే సంస్థ ద్వారా మోర్టగేజ్ లెండింగ్ కార్యకాలాపాల్ని నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాజాగా మరో కంపెనీ సీఈఓ 3నిమిషాల జూమ్ కాల్లో 800మంది ఉద్యోగాల నుంచి తొలగించాడు. ప్రస్తుతం ఈ అంశం యూకే వ్యాప్తంగా హాట్ టాపిగ్గా మారింది. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ సైతం ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీ&ఓ ఫెర్రీస్ అనే బ్రిటీష్ షిప్పింగ్ కంపెనీ యూకే, ఐర్లాండ్, యూరప్ దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేస్తున్న 800 మందిని జూమ్ కాల్లో విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ జానెట్ బెల్ ప్రకటించారు. P&O ferries doing mass sacking by zoom call https://t.co/lhvkGTiP7g — David Dryburgh (@DavyDryburgh) March 17, 2022 నిధుల దుర్వినియోగం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్లో 1100 మంది ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు పీ&ఓ యాజమాన్యం యూకే ప్రభుత్వం నుంచి 10 మిలియన్లను అప్పుగా తీసుకుంది. అయితే కోవిడ్ దెబ్బతో గత రెండేళ్లలో కంపెనీ 200 మిలియన్ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. అదే సమయంలో యూకే ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అందుకే నష్టాల్ని కారణంగా చూపిస్తూ జానెట్ బెల్ జూమ్ కాల్ మీటింగ్ లో విధుల నుంచి ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆగ్రహం ఉద్యోగుల పట్ల పీ&ఓ ఫెర్రీస్ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. ఉద్యోగం నుంచి తీసివేస్తున్నామని ఇలా ప్రకటించడం సరైన పద్దతి కాదు. సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ, సంస్థను అలాగే అంటి పెట్టుకొని, కరోనా కష్టకాలంలో సంస్థకు వెన్నంటే ఉన్నారు. అలాంటి ఉద్యోగుల పట్ల మర్యాదగా మెలగాలి. ఇలా దుర్మార్గంగా వ్యవహరించకూడదు అంటూ యూకే ప్రధాని కార్యాలయం స్పోక్ పర్సన్ తెలిపారు. అంతేకాదు ఉద్యోగుల వ్యవహారంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. చదవండి: విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే.. -
అప్పుడేమో 900 మంది..ఇప్పుడు ఏకంగా 3వేల ఉద్యోగుల ఊస్టింగ్..!
జూమ్ వీడియో కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ అప్పట్లో వైరలైనా విషయం తెలిసిందే. మరోసారి కంపెనీ కి చెందిన మూడు వేల ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. అమెరికా, ఇండియా ఉద్యోగులను.. అమెరికా, భారత్‌లో పనిచేస్తున్న మరో 3,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బెటర్ డాట్ కాం కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఆయా దేశాల్లో శ్రామిక్ శక్తిని గణనీయంగా తగ్గించే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం బెటర్ డాట్ కాం వెబ్సైట్లో పోస్ట్ చేసిన ఒక లేఖలో బెటర్ డాట్ కాం తాత్కాలిక అధ్యక్షుడు కెవిన్ ర్యాన్ ఈ విషయం వెల్లడించారు. పెరుగుతున్న వడ్డీ రేట్లతో క్యాపిటల్‌లో తగ్గుదల కారణంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కెవిన్ ర్యాన్ చెప్పారు. ఈ తొలగించిన ఉద్యోగులకు కనీసం 60 పని దినాలు లేదా 80 పనిదినాల వరకు నగదు చెల్లింపులకు అర్హులని తాత్కాలిక చీఫ్ పేర్కొన్నారు. జూమ్ వీడియో కాల్లో..! బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. చదవండి: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ డెలివరూ -
విశాల్ గార్గ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే..
Laid Off In Zoom Better CEO Vishal Garg wanted to give one week of severance pay: బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్.. జూమ్ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి.. ప్రపంచవ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీఈవో గురించి విస్తూపోయే విషయాలు ఇప్పుడు వెలుగు చూశాయి. విమర్శల నేపథ్యంలో తన నిర్ణయంపై పశ్చాత్తాపం ప్రకటించి.. క్షమాపణలతో పాటు ఉద్యోగుల్ని తొలగించడానికి కారణం సైతం వివరించాడు విశాల్ గార్గ్. అయినా వ్యవహారం చల్లారకపోవడంతో ఆయన్ని బలవంతపు సెలవుల మీద పంపింది కంపెనీ. అంతేకాదు ఈ వ్యవహారంలో సమీప భవిష్యత్తులో ఆయనపై వేటు తప్పదని హింట్ కూడా అందించింది. ఇదిలా ఉంటే ఉద్యోగుల్ని తొలగించే ముందు విశాల్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడో వెలుగు చూసింది ఇప్పుడు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ ‘లే ఆఫ్’ ప్రకటన కంటే ముందు విశాల్ తన ఆధ్వర్యంలో డజనుకి పైగా మీటింగ్‌లు జరిపాడట. ఆ సమావేశంలో తొలగించబోయే ఉద్యోగులకు కేవలం వారం, మరీ కాదంటే రెండు వారాల జీతం మాత్రమే (severance pay) చెల్లించాలన్న ప్రతిపాదన చేశాడట విశాల్. విశేషం ఏంటంటే.. అప్పటికీ బెటర్ డాట్ కామ్ బోర్డు ఇంకా తొలగింపులపై ఒక స్పష్టతకి రాలేదట. ఈలోపే ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన పరిహారంలో కోతపై విశాల్ ఓ ప్రతిపాదన చేయడం.. ఈ అంశం గురించి బెటర్ డాట్ కామ్ బోర్డు అంతర్గత భేటీలో చర్చ జరగడం చకచకా జరిగిపోయాయి. చట్టపరమైన ఇబ్బందులు.. అయితే కొందరు ఎగ్జిక్యూటివ్స్ మాత్రం విశాల్ ప్రతిపాదనను (వారం, రెండు వారాల జీతం) వ్యతిరేకించారట. అయినా విశాల్ తన నిర్ణయానికే కట్టుబడి ఉండడంతో.. చేసేది లేక బోర్డు సైతం ఆయన ప్రతిపాదనను అమలు చేయాలని అనుకుంది. ఈ లోపు తెర మీదకు వచ్చిన కంపెనీ లీగల్ అడ్వైజర్లు, అమెరికా చట్టం (WARN Act)లోని పలు సెక్షన్ల గురించి బెటర్ డాట్ కామ్ ముందు ఉంచారు. ఇలా భారీ స్థాయిలో లే ఆఫ్‌లు ప్రకటించిన సమయంలో.. ఉద్యోగులకు 60 రోజుల ముందస్తు నోటీసుగానీ, ఒకవేళ ఉన్నపళంగా తొలగిస్తే రెండు నెలల జీతాలుగానీ చెల్లించాల్సి ఉంటుంది. లేకుంటే కంపెనీలు భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. ఈ విషయం విశాల్‌కి తెలిసి కూడా వారం పరిహారం నిర్ణయం వైపే మొగ్గు చూపడం విశేషం. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి వస్తుందన్న భయంతో బెటర్ డాట్ కామ్ బోర్డు.. విశాల్‌కు సర్దిచెప్పింది. చివరకు రెండు నెలల జీతం చెల్లింపు ప్రతిపాదనకు విశాల్ గార్గ్‌ను ఒప్పించింది బోర్డు. ఇక సుమారు 20 మందికి పైగా తొలగింపబడిన ఉద్యోగులు.. విశాల్ ఉద్యోగుల పట్ల కనీస మర్యాద లేకుండా వ్యవహరిస్తారంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆరోపణలపై స్పందించేందుకు విశాల్.. ఇష్టపడడం లేదు. చదవండి: జూమ్ మీటింగ్‌లో ఉద్యోగుల తొలగింపు.. విమర్శలపై స్పందన -
‘జూమ్‌లో 900 మంది తొలగింపు’.. విశాల్‌పై చర్యలు!
CEO Vishal Garg Who Fired 900 On Zoom Call Takes Time Off With Immediate Effect: బెటర్ డాట్ కామ్ సీఈవోగా కిందటి ఏడాది ఫోర్బ్స్ జాబితాకు ఎక్కిన విశాల్ గార్గ్.. ఈమధ్య జూమ్ మీటింగ్ వ్యవహారంతో విమర్శల పాలైన విషయం తెలిసిందే. జూమ్ మీటింగ్ జరుగుతుండగా మధ్యలో ఒకేసారి 900 మందితో ‘మీ ఉద్యోగాలు పోయాన’ని ప్రకటించాడు. దీంతో రగడ మొదలైంది. ఆన్లైన్ వేదికగా ఉద్యోగుల లేఆఫ్ ప్రకటన చేసిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ తీరును టెక్ దిగ్గజాలు సైతం తప్పుబట్టారు. ఈ విమర్శల పర్వం మధ్యే తాను చేసిన తప్పిదానికి క్షమాపణలు చెప్పాడు విశాల్. అయినప్పటికీ వివాదం సర్దుమణగడం లేదు. ఈ తరుణంలో శుక్రవారం అర్థాంతరంగా ఆయన్ని సెలవులపై తప్పించడం చర్చనీయాంశంగా మారింది. జూమ్‌లో ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన విశాల్‌కు.. ఈ-మెయిల్ ద్వారా సెలవులపై వెళ్లాలని బెటర్ డాట్ కామ్ కంపెనీ ఒత్తిడి చేసినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. ఈ మేరకు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కెవిన్ ర్యాన్ ప్రస్తుతం బెటల్ డామ్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. అంతేకాదు బోర్డుకు రిపోర్ట్ చేసే బాధ్యతను కూడా ఆయనే స్వీకరించారు అని ఆ కథనంలో పేర్కొంది. అయితే కెవిన్‌తో పాటు కీలక వ్యవహారాలను చూసుకునేందుకు స్వతంత్ర్య బోర్డు (మూడో పార్టీ)కు బాధ్యతలు అప్పగించడమే అసలు ఆసక్తికి కారణమైంది. బిజినెస్ టైకూన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తడం, షేర్ల విలువ పడిపోతుండడంతో విశాల్‌కు బెటర్ డాట్ కామ్ శాశ్వతంగా పక్కన పెట్టనుందా? అనే అనుమానం వ్యక్తం చేసింది రాయిటర్స్. అయితే ఇదంతా జిమిక్కు అని, వ్యవహారం చల్లబడే వరకు మాత్రమే బెటర్ డాట్ కామ్ తీసుకున్న చర్య మాత్రమేనని ఓ బిజినెస్ డెయిలీ కథనం ప్రచురించింది. పైగా క్రిస్మస్ బోనస్ అందుకున్న విషయాన్ని సైతం ప్రస్తావించింది. ఇదిలా ఉంటే ఈ ఊహాగానాలపై బెటర్ డాట్ కామ్ స్పందించలేదు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 ‘‘విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా. ఇక మరో వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఓ అడుగు ముందుకేశారు. ‘ఇది సబబేనా? కాదా? ఇలాంటి పొరపాటు తర్వాత ఆ కంపెనీ సీఈవో మనుగడ కొనసాగించగలడు అని మీరు భావిస్తున్నారా? అతనికి(విశాల్) మరో ఛాన్స్ ఇవ్వడం కరెక్టేనా? న్యాయమా?’ అంటూ ట్విటర్ ఫాలోవర్స్ అభిప్రాయాన్ని కోరారాయన. I’m curious whether you think a CEO can survive after a blunder like this? Is it fair, or not, to allow a second chance…? https://t.co/sPDcr9qmYE — anand mahindra (@anandmahindra) December 9, 2021 తొలగింపునకు కారణం ఇదే.. ఇదిలా 2016లో న్యూయార్క్ కేంద్రంగా బెటర్ డాట్ కామ్ మోర్టగేజ్ లెండింగ్ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్ డాట్ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే మార్కెట్, పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్లైన్లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. -
జూమ్ మీటింగ్‌లో చెప్పి తప్పు చేశా: విశాల్ క్షమాపణ
Better.com CEO Apology For Laying Off 900 Employees Via Zoom Call: జూమ్ మీటింగ్ వేదికగా 900 మంది ఉద్యోగుల్ని ఒకేసారి తొలగించిన ఘటన విమర్శలకు దారితీయడంతో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఎట్టకేలకు స్పందించాడు. భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్.. బెటర్ డాట్ కామ్. అనే మోర్టగేజ్ లెండింగ్ కంపెనీకి సీఈవో. గత ఏడాది నవంబర్ నెలలో వ్యాపార పత్రిక ఫోర్బ్స్ లో స్థానం సంపాదించుకున్నాడాయన. అయితే కిందటి వారం జూమ్ మీటింగ్‌లో ఆయన వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. సమావేశం జరుగుతుండగా.. ఒక్కసారిగా ఒకేసారి 900 ఎంప్లాయిస్ను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో షాక్ అవ్వడం ఉద్యోగుల వంతు అయ్యింది. ఆన్లైన్లో అదీ జూమ్ కాల్లో ఉండగా.. ఉద్యోగులకు అలాంటి షాక్ ఇవ్వడంపై విశాల్ తీరును చాలామంది తప్పుబట్టారు. ఓ ఉద్యోగి ద్వారా తొలింపునకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది కూడా. ఇక ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా లాంటి వాళ్లు సైతం ఇది పూర్తిగా తప్పు అంటూ అభిప్రాయం వెలిబుచ్చారు. విమర్శలు తారాస్థాయికి చేరడంతో విశాల్ గార్గే బహిరంగ లేఖ ద్వారా తొలగించిన ఉద్యోగులకు క్షమాపణలు తెలియజేశారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 అలా తొలగిస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పిదంగా పేర్కొంటూ క్షమాపణలు చెప్పాడు విశాల్ గార్గ్. ‘నేను ఇలా ప్రవర్తించిన తీరు వార్తల్లోకి ఎక్కడం పరిస్థితిని ఇంకా ఘోరంగా మార్చేసింది’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. మార్కెట్, పర్ఫార్మెన్స్, ప్రొడక్టివిటీ.. ఉద్యోగుల తొలగింపునకు కారణాలని స్పష్టత ఇచ్చాడు. తాను వ్యక్తిగతంగా ఉద్యోగులకు ఈ విషయం తెలియజేయాల్సి ఉండొచ్చని.. కానీ, అలా ఆన్లైన్లో ప్రకటించి వాళ్ల మనసు నొప్పించినందుకు క్షమించాలని గార్గ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఇదిలా 2016లో న్యూయార్క్ కేంద్రంగా బెటర్ డాట్ కామ్ సేవల్ని ప్రారంభించింది. అయితే ఈ మే నెలలోనే కంపెనీ ఐపీవోకు వెళ్తుందని సంకేతాలు ఇవ్వడంతో పాటు ఈ నెల మొదట్లో సాఫ్ట్‌బ్యాంక్‌తో హడావిడి ఒప్పందం కూడా ముగించింది. ఇదిలా ఉంటే 750 మిలియన్ డాలర్ల సేకరణ తర్వాత కంపెనీ.. ఇలా 9 శాతం ఉద్యోగుల్ని తొలగించడంతో బెటర్ డాట్ కామ్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి. -
900 మంది ఉద్యోగుల తొలగింపుపై హర్ష్ గోయెంకా కీలక వ్యాఖ్యలు!
జూమ్ వీడియో కాల్లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ వార్తలో వైరల్ అయ్యారు. అమెరికాకు చెందిన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ ఇలా చేశారు.. "విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు. బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తుంది అని అన్నారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది. My heart went out to the 900 employees sacked through Zoom by Vishal Garg. Totally wrong! Do it on a one on one basis. And in person. And not before Christmas and after a $750 mn recent infusion. This is how Corporates get a heartless tag!pic.twitter.com/9aPoFNybKp — Harsh Goenka (@hvgoenka) December 7, 2021 (చదవండి: అపర కుబేరుడి పెద్ద మనసు.. భారీగా సొమ్ము దానం!) -
జూమ్ కాల్లో 900 మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. ఎందుకో తెలుసా?
అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఉద్యోగులకు జూమ్ వీడియో కాల్లో అనుకోని పరిణామం ఎదురయ్యింది. బెట్టర్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ ఉద్యోగులతో మాట్లాడుతూ ఒక షాకింగ్ న్యూస్ తెలిపాడు. అమెరికాలో అన్నీ కంపెనీలు క్రిస్మస్ పండుగ సీజన్ ముందు అందరికీ సెలవులు ఇస్తుంటే, బెట్టర్ కంపెనీ సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నాడు. జూమ్ కాల్లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. బెట్టర్(Better.com) కంపెనీ సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్లో ఉద్యోగులతో మాట్లాడుతూ.. ఈ రోజు గొప్ప వార్తలు లేవు. ప్రస్తుతం ప్రపంచంలో మార్కెట్ మారింది, కంపెనీలు దానికి అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది అని తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. "ఇది మీరు వినాలనుకుంటున్న మంచి వార్త కాదు, కానీ ఇది నా నిర్ణయం, మీరు నేను చెప్పేది వినాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా సవాలుతో కూడుకున్న నిర్ణయం. నా కెరీర్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. చివరిసారి నేను ఈ పని చేసినప్పుడు, నేను ఏడ్చాను. ప్రస్తుతం అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తుంది. మీరు ఆ జాబితాలో ఉంటే చాలా దురదృష్టవంతులు. ఈ నిర్ణయం అన్నీ స్థాయిలలోని ఉద్యోగులకు వర్తిస్తుంది. అలాగే, ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుంది" అని జూమ్ వీడియో కాల్లో అన్నారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Bucky with the Good Arm (@benjancewicz) December 3, 2021 (చదవండి: ఏలియన్ల అన్వేషణ! ప్చ్.. ఇలాంటివన్నీ చైనాకే కనిపిస్తాయా?) ఎవరి ఉద్యోగం పోయింది అనేది కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ-మెయిల్ వస్తుందని విశాల్ గార్గ్ చెబుతారు. ఉద్యోగులకు 4 వారాల వేతనంతో పాటు, రెండు నెలల కవర్ అప్ లభిస్తుందని ఆయన తెలిపారు. గత ఏడాది నవంబర్ నెలలో వ్యాపార పత్రిక ఫోర్బ్స్ లో స్థానం సంపాదించిన వ్యవస్థాపకుడు విశాల్ గార్గ్. ఉద్యోగుల తొలగింపుపై సంస్థలో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ ఉద్యోగులంతా పనిచేయకుండా కొలీగ్స్, కస్టమర్ల శ్రమను దోచుకుంటున్నారని అందుకే, ఈ కంపెనీ వారిని తొలగించినట్లు తెలుస్తుంది. (చదవండి: గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?) -
మూడో రౌండ్లో చేతన్
న్యూఢిల్లీ: మూడుసార్లు జాతీయ చాంపియన్, ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి క్రీడాకారుడు చేతన్ ఆనంద్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ క్వాలిఫయింగ్ పోటీల్లో మూడో రౌండ్లోకి అడుగుపెట్టాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్లో చేతన్ 21-5, 21-15తో విశాల్ గార్గ్ (అస్సాం)పై గెలిచాడు. పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న చేతన్‌కు తొలి రౌండ్లో ‘బై’ లభించింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన రాహుల్ యాదవ్, త్రినాథ, అనీత్ కుమార్, ప్రశాంత్, ఎన్వీఎస్ విజేత కూడా మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో రాహుల్ యాదవ్ 16-21, 21-10, 21-10తో సుబ్రమణ్యం (తమిళనాడు)పై, త్రినాథ 21-11, 21-16తో సుబదన్బోర్ (మేఘాలయా)పై, అనీత్ కుమార్ 13-21, 21-16, 21-12తో అంకిత్ అరోరా (రాజస్థాన్)పై, ప్రశాంత్ 21-13, 21-14తో సంతోష్ (పాండిచ్చేరి)పై, విజేత 22-20, 21-14తో యష్ నైన్ (ఢిల్లీ)పై గెలిచారు. వృశాలి, శ్రీ కృష్ణప్రియ ముందంజ మహిళల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు వృశాలి, శ్రీ కృష్ణప్రియ, సంతోషి హాసిని, ప్రమద, హారిక, ఎం.పూజ, కె.వైష్ణవి మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్లో వృశాలి 28-26, 21-7తో శీతల్ (ఉత్తరాఖండ్)పై, శ్రీ కృష్ణప్రియ 21-2, 21-11తో షెహనాజ్ ఖాన్ (పంజాబ్)పై, సంతోషి హాసిని 21-18, 21-10తో నిశ్చిత (కర్ణాటక)పై, ప్రమద 21-8, 21-11తో దక్ష గౌతమ్ (హర్యానా)పై, హారిక 21-5, 21-15తో సీహెచ్ పూర్ణిమ (ఆంధ్రప్రదేశ్)పై, పూజ 21-16, 21-16తో స్వాతి శర్మ (ఉత్తరాఖండ్)పై, వైష్ణవి 21-15, 23-21తో జ్యోతి (హర్యానా)పై విజయం సాధించారు. మంగళవారం క్వాలిఫయింగ్ రౌండ్లు పూర్తవుతాయి. పురుషుల, మహిళల క్వాలిఫయింగ్ సింగిల్స్ విభాగాల నుంచి ఎనిమిది మంది చొప్పున మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధిస్తారు. బుధ, గురువారాల్లో జాతీయ అంతర్ రాష్ట్ర టోర్నమెంట్ జరుగుతుంది. శుక్రవారం నుంచి సోమవారం వరకు పురుషుల సింగిల్, డబుల్స్; మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాలలో మెయిన్ ‘డ్రా’ పోటీలు జరుగుతాయి.