జూమ్ వీడియో కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ అప్పట్లో వైరలైనా విషయం తెలిసిందే. మరోసారి కంపెనీ కి చెందిన మూడు వేల ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.
అమెరికా, ఇండియా ఉద్యోగులను..
అమెరికా, భారత్‌లో పనిచేస్తున్న మరో 3,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బెటర్ డాట్ కాం కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఆయా దేశాల్లో శ్రామిక్ శక్తిని గణనీయంగా తగ్గించే పనిలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మంగళవారం బెటర్ డాట్ కాం వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక లేఖలో బెటర్ డాట్ కాం తాత్కాలిక అధ్యక్షుడు కెవిన్ ర్యాన్ ఈ విషయం వెల్లడించారు. పెరుగుతున్న వడ్డీ రేట్లతో క్యాపిటల్‌లో తగ్గుదల కారణంగా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని కెవిన్ ర్యాన్ చెప్పారు. ఈ తొలగించిన ఉద్యోగులకు కనీసం 60 పని దినాలు లేదా 80 పనిదినాల వరకు నగదు చెల్లింపులకు అర్హులని తాత్కాలిక చీఫ్ పేర్కొన్నారు.
జూమ్ వీడియో కాల్‌లో..!
బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్‌లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది.
చదవండి: హైదరాబాద్‌లో అడుగుపెట్టిన లండన్ బేస్డ్ యూనికార్న్ కంపెనీ డెలివరూ
Comments
Please login to add a commentAdd a comment