జూమ్ వీడియో కాల్‌లో ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగించి బెటర్.కామ్ సీఈఓ విశాల్ గార్గ్ వార్తలో వైరల్ అయ్యారు. అమెరికాకు చెందిన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా స్పందించారు. ఈ మేరకు ఒక ట్వీట్ ఇలా చేశారు.. "విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించటం చూసి నా హృదయం చలించింది. ఇది పూర్తిగా తప్పు! ఉద్యోగుల తొలగింపుపై వారికి వ్యక్తిగతంగా చెప్పాల్సి ఉండేది. క్రిస్మస్ ముందు ఇటీవల 750 మిలియన్ డాలర్లు సేకరించిన తర్వాత ఈ నిర్ణయం సరైంది కాదు. ఈ విధానం వల్లే కార్పొరేట్లకు హృదయం లేదు అనే ముద్ర పడుతుంది" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
బెటర్.కామ్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్‌లో మాట్లాడుతూ.. ఒకేసారి 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. దీంతో, జూమ్ కాల్‌లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. ప్రస్తుతం అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తుంది అని అన్నారు. ఈ వీడియోను ఒక ఉద్యోగి షేర్ చేయడంతో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యింది.
My heart went out to the 900 employees sacked through Zoom by Vishal Garg. Totally wrong! Do it on a one on one basis. And in person. And not before Christmas and after a $750 mn recent infusion. This is how Corporates get a heartless tag!pic.twitter.com/9aPoFNybKp
— Harsh Goenka (@hvgoenka) December 7, 2021
Comments
Please login to add a commentAdd a comment