ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ ‘జూమ్’ కారణం లేకుండానే ప్రెసిడెంట్ Greg Tombను ఫైర్ చేసింది. సేల్స్ ఆపరేషన్స్, ఎర్నింగ్స్ కాల్స్‌లో కీరోల్ పోషించిన జార్జ్‌ను విధులు తొలగించడం చర్చాంశనీయంగా మారింది. మార్చి 03న జూమ్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జార్జ్‌కు సంస్థ తరుపు నుంచి అన్నీ ప్రయోజనాలకు కల్పిస్తూ ఎలాంటి కారణం లేకుండానే ఫైర్ చేస్తున్నట్లు పేర్కొంది.
గత నెలలో జూమ్ కంపెనీ 15 శాతం వర్క్ ఫోర్స్‌తో 1,300 మందిని ఫైర్ చేసింది. వారిలో సీఈవో ఎరిక్ యువాన్ సైతం ఉన్నారు. గూగుల్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన యువాన్ జూన్ 2022లో జూమ్‌లో చేరారు. వీడియో కాన్ఫరెన్స్ సర్వీసుల్లోని అవకాశాల్ని ఒడిసి పట్టుకొని సంస్థను లాభాలవైపు నడిపించారు.
వందల కోట్ల స్టాక్ గ్రాంట్
అనూహ్యంగా పింక్ స్లిప్ జారీ చేసిన ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్‌కు 45 మిలియన్ల విలువైన కంపెనీ స్టాక్స్‌తో పాటు బేస్ శాలరీ 4లక్షల బిలియన్ డాలర్లు, గతేడాది జూన్ నెలలో కంపెనీ 8శాతం బోనస్‌గా ఇస్తున్నట్లు తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా జూమ్ అధికార ప్రతినిధి శాన్ జోస్ మాట్లాడుతూ.. మాజీ ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్ స్థానంలో మరో వ్యక్తిని నియమించుకుంటున్నట్లు తెలిపారు, కానీ జార్జ్‌ను ఎందుకు తొలగించారనేదాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment