Recession
-
వినియోగదారుల రుణాలు రూ.90 లక్షల కోట్లు
కోల్‌కతా: వినియోగదారుల రుణాలు గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15 శాతం వృద్ధి చెంది రూ.90 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2022–23లో నమోదైన 17.4 శాతం వృద్ధితో పోలిస్తే కొంత క్షీణత కనిపించింది. వినియోగదారుల రుణాల్లో 40 శాతం వాటా కలిగిన గృహ రుణ విభాగంలో మందగమనం ఇందుకు కారణమని క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. 2023–24లో గృహ రుణాల విభాగంలో వృద్ధి 7.9 శాతానికి పరిమితమైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే విభాగం 23 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. రూ.35 లక్షలకు మించిన గృహ రుణాలకు డిమాండ్ పెరిగింది. సగటు రుణ సైజ్ 2019–20లో ఉన్న రూ.20లక్షల నుంచి 32 శాతం వృద్ధితో 2023–24లో రూ.26.5 లక్షలకు పెరిగింది. వ్యక్తిగత రుణాలకు డిమాండ్ ఇక వ్యక్తిగత రుణాల (పర్సనల్ లోన్)కు డిమాండ్ బలంగా కొనసాగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2023–24లో వ్యక్తిగత రుణాల విభాగంలో 26 శాతం వృద్ధి నమోదైంది. రూ.10లక్షలకు మించిన వ్యక్తిగత రుణాల వాటా పెరగ్గా.. అదే సమయంలో రూ.లక్షలోపు రుణాలు తీసుకునే వారి సంఖ్య అధికంగా ఉంది. బ్యాంకులు మంజూరు చేసిన రుణాల విలువ అధికంగా ఉండగా, ఎన్బీఎఫ్సీలు సంఖ్యా పరంగా ఎక్కువ రుణాలు జారీ చేశాయి. టూవీలర్ రుణాల జోరు ద్విచక్ర వాహన రుణ విభాగం సైతం బలమైన పనితీరు చూపించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధి నమోదైంది. 2022–23లో 30 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఆటోమొబైల్ రుణాల విభాగంలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో 22 శాతంగా ఉంది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రుణాలు గత ఆర్థిక సంవత్సరంలో 34 శాతం వృద్ధిని చూపించాయి. రుణాల సగటు విలువ కూడా పెరిగింది. ఎంఎస్ఎంఈ విభాగంలో వ్యక్తిగత రుణాల కంటే సంస్థాగత రుణాలు ఎక్కువగా వృద్ధి చెందాయి. వ్యక్తిగత ఎంఎస్ఎంఈ రుణాలు 29 శాతం, సంస్థలకు సంబంధించి ఎంఎస్ఎంఈ రుణాలు 6.6 శాతం చొప్పున పెరిగాయి. సూక్ష్మ రుణాలు సైతం బలమైన వృద్ధిని చూపించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ రుణాల్లో 27 శాతం వృద్ధి నమోదైంది. -
Stock Market: బేర్ విశ్వరూపం
ముంబై: అమెరికాలో మాంద్యం భయాలు మార్కెట్లను ముంచేశాయి. జపాన్ కరెన్సీ యెన్ భారీ వృద్ధి బెంబేలెత్తించింది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతలు వణికించాయి. వెరసి దలాల్ స్ట్రీట్ సోమవారం బేర్ గుప్పిట్లో విలవిలలాడింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయ షేర్ల విలువ భారీగా పెరిగిపోవడంతో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది. ఫలితంగా సెన్సెక్స్ 2,223 పాయింట్లు క్షీణించి 80 వేల స్థాయి దిగువన 78,759 వద్ద ముగిసింది. నిఫ్టీ 662 పాయింట్లు పతనమై 24,055 వద్ద నిలిచింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన రోజు జూన్ 4న (5.76% పతనం) తర్వాత ఇరు సూచీలకిదే భారీ పతనం. రోజంతా నష్టాల కడలిలో ... అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న సూచీలు ఏకంగా 3% నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 2,394 పాయింట్ల నష్టంతో 78,588 వద్ద, నిఫ్టీ 415 పాయింట్లు క్షీణించి 24,303 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఇన్వెస్టర్ల కొనుగోళ్లకు సాహసించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో కొట్టిమిట్టాడాయి. ఒకదశలో సెన్సెక్స్ 2,686 పా యింట్లు క్షీణించి 78,296 వద్ద, నిఫ్టీ 824 పాయింట్లు కుప్పకూలి 23,893 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. → బీఎస్ఈలోని అన్ని రంగాల సూచీలు ఎరుపెక్కాయి. సరీ్వసెస్ సూచీ 4.6%, యుటిలిటీ 4.3%, రియల్టీ 4.2%, క్యాపిటల్ గూడ్స్ 4.1%, ఇండస్ట్రీయల్ 4%, విద్యుత్ 3.9%, ఆయిల్‌అండ్‌గ్యాస్, మెటల్ 3.75% చొప్పున క్షీణించాయి. → సెన్సెక్స్ సూచీలో హెచ్‌యూఎల్(0.8%,) నెస్లే (0.61%) మాత్రమే లాభాలతో గట్టెక్కాయి. మిగిలిన 28 షేర్లు నష్టపోయాయి. ఇందులో టాటా మోటార్స్ 7%, అదానీ పోర్ట్స్ 6%, టాటాస్టీల్ 5%, ఎస్బీఐ 4.50%, పవర్ గ్రిడ్ 4% షేర్లు అత్యధికంగా పడ్డాయి. → చిన్న, మధ్య తరహా షేర్లలో భారీ లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 4%, 3.6% చొప్పున క్షీణించాయి. → బీఎస్ఈ ఎక్సే్చంజీలో లిస్టయిన మొత్తం 4,189 కంపెనీల షేర్లలో ఏకంగా 3,414 కంపెనీల షేర్లు నష్టాలు చవిచూశాయి. → రిలయన్స్ 3% పడి రూ. 2,895 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 4.50% పతనమై రూ.2,866 కనిష్టాన్ని తాకింది. మార్కెట్ క్యాప్ రూ. 70,195 కోట్లు ఆవిరై రూ. 19.58 లక్షల కోట్లకు తగ్గింది. → మార్కెట్లో ఒడిదుడుకులు సూచించే వొలటాలిటీ ఇండెక్స్(వీఐఎక్స్) 42.23 శాతం పెరిగి 20.37 స్థాయికి చేరింది. ఇంట్రాడేలో 61% ఎగసి 23.15 స్థాయిని తాకింది. లేమాన్ బ్రదర్స్, కోవిడ్ సంక్షోభాల తర్వాత ఈ సూచీ కిదే ఒక రోజులో అత్యధిక పెరుగుదల.2 రోజుల్లో రూ.19.78 లక్షల కోట్ల ఆవిరి ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మొత్తం విలువ సోమవారం ఒక్కరోజే రూ.15.32 లక్షల కోట్లు హరించుకుపోయాయి. శుక్రవారం కోల్పోయిన రూ.4.46 లక్షల కోట్లను కలిపితే గడచిన రెండు ట్రేడింగ్ సెషన్లో ఇన్వెస్టర్లకు మొత్తం రూ.19.78 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది. బీఎస్ఈలో మార్కెట్ విలువ రూ. 441.84 లక్షల కోట్లకు పడింది.84 దిగువకు రూపాయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టంఈక్విటీ మార్కెట్ల భారీ పతనంతో రూపాయి విలువ సరికొత్త జీవితకాల కనిష్టానికి పడిపోయింది. డాలర్ మారకంలో 37 పైసలు క్షీణించి 84 స్థాయి దిగువన 84.09 వద్ద స్థిరపడింది. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 83.78 వద్ద మొదలైంది. విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు, దలాల్ స్ట్రీట్ భారీ పతన ప్రభావంతో ఇంట్రాడే, జీవితకాల కనిష్టం 84.09 వద్ద స్థిరపడింది. ‘అమ్మో’రికా! ముసిరిన మాంద్యం భయాలు.. ఉద్యోగాల కోత.. హైరింగ్ తగ్గుముఖం.. మూడేళ్ల గరిష్టానికి నిరుద్యోగం.. 4.3%కి అప్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాల ఎఫెక్ట్... ఫెడ్ రేట్ల కోత సుదీర్ఘ వాయిదా ప్రభావం కూడాఅమెరికాకు జలుబు చేస్తే.. ప్రపంచమంతా తుమ్ముతుందనే నానుడిని నిజం చేస్తూ, ప్రపంచ స్టాక్ మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. యూఎస్ తయారీ, నిర్మాణ రంగంలో బలహీనతకు గత వారాంతంలో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా ఆజ్యం పోసింది. జూలైలో హైరింగ్ 1,14,000 ఉద్యోగాలకు పరిమితమైంది. అంచనాల కంటే ఏకంగా 1,80,000 జాబ్స్ తగ్గాయి. మరోపక్క, జూన్‌లో 4.1 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు.. జూలైలో 4.3 శాతానికి ఎగబాకింది. 2021 అక్టోబర్ తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు, ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్‌తో సహా మరికొన్ని కంపెనీలు తాజా కొలువుల కోతను ప్రకటించడం కూడా అగ్గి రాజేసింది. ఈ పరిణామాలన్నీ ఇన్వెస్టర్లలో మాంద్యం ఆందోళనలను మరింత పెంచాయి. వెరసి, గత శక్రవారం అమెరికా మార్కెట్లు కకావికలం అయ్యాయి. నాస్డాక్ 2.4% కుప్పకూలింది. డోజోన్స్ 1.5%, ఎస్అండ్పీ–500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించాయి. కాగా, గత నెలలో ఆల్‌టైమ్ రికార్డుకు చేరిన నాస్డాక్ అక్కడి నుంచి 10% పైగా పతనమై కరెక్షన్లోకి జారింది. ఆసియా, యూరప్ బాటలోనే సోమవారం కూడా అమెరికా మార్కెట్లు 3–6% గ్యాప్ డౌన్‌తో మొదలై, భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టెక్ స్టాక్స్.. ట్రిలియన్ డాలర్లు ఆవిరి రెండో త్రైమాసిక ఫలితాల నిరాశతో నాస్డాక్లో టాప్–7 టెక్ టైటాన్స్ (యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్వీడియా, టెస్లా, మెటా) షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఏఐపై భారీగా వెచి్చస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ వంటి కంపెనీలకు ఆశించిన ఫలితాలు రావడం లేదనే ఆందోళనలు నెలకొన్నాయి. ఇక బలహీన ఆదాయంతో అమెజాన్ షేర్లు 10% క్రాష్ అయ్యాయి. ఫలితాల నిరాశతో ఇంటెల్ షేర్లు ఏకంగా 26% కుప్పకూలాయి. 1985 తర్వాత ఒకే రోజు ఇంతలా పతనమయ్యాయి. కంపెనీ ఏకంగా 15,000 మంది సిబ్బంది కోతను ప్రకటించడంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. వెరసి, షేర్ల పతనంతో టాప్–7 టెక్ షేర్ల మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్లకు పైగా ఆవిరైంది. కాగా, సోమవారం ఈ షేర్లు మరో 6–10% కుప్పకూలాయి. ఎకానమీ పరిస్థితి బయటికి కనిపిస్తున్న దానికంటే చాలా బలహీనంగా ఉందని సీఈఓలు సిగ్నల్స్ ఇస్తున్నారు. యుద్ధ సైరన్..: పశ్చిమాసియాలో హమాస్ చీఫ్ హనియేను ఇజ్రాయిల్ తుదముట్టించడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. ఇజ్రాయిల్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించడంతో పూర్తి స్థాయి యుద్ధానికి తెరలేస్తోంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు సద్దుమణగక ముందే మరో వార్ మొదలైతే క్రూడ్ ధర భగ్గుమంటుంది. బ్యారల్ 100 డాలర్లను దాటేసి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తుంది. వెరసి ఎకానమీలు, మార్కెట్లపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్.. సునామీ అమెరికా దెబ్బతో ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ సోమవారం కూడా కుప్పకూలాయి. జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5 శాతం క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19 బ్లాక్ మండే (14.7% డౌన్) తర్వాత ఇదే అత్యంత ఘోర పతనం. నికాయ్ ఆల్ టైమ్ హై 42,000 పాయింట్ల నుంచి ఏకంగా 31,000 స్థాయికి దిగొచి్చంది. గత శుక్రవారం కూడా నికాయ్ 6% క్షీణించింది. ముఖ్యంగా జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యంపైకి ఎగబాకడంతో అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీరేట్ల పెంపు బాటలో వెళ్తోంది. గత బుధవారం కూడా రేట్ల పెంపు ప్రకటించింది. దీంతో డాలర్‌తో ఇటీవల 160 స్థాయికి చేరిన యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు పుట్టించింది. జపాన్, అమెరికా ఎఫెక్ట్ మన మార్కెట్ సహా ఆసియా, యూరప్ సూచీలను కుదిపేస్తోంది.ఫెడ్ రేట్ల కోతపైనే ఆశలు.. కరోనా విలయం తర్వాత రెండేళ్ల పాటు ఫెడ్ ఫండ్స్ రేటు 0–0.25% స్థాయిలోనే కొనసాగింది. అయితే, ద్రవ్యోల్బణం ఎగబాకి, 2022 జూన్‌లో ఏకంగా 9.1 శాతానికి చేరడంతో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్ల పెంపును మొదలెట్టింది. 2023 జూలై నాటికి వేగంగా 5.25–5.5% స్థాయికి చేరి, అక్కడే కొనసాగుతోంది. మరోపక్క, ద్రవ్యోల్బణం ఈ ఏడాది గతేడాది జూన్‌లో 3 శాతానికి దిగొచి్చంది. ఈ ఏడాది జూన్ క్వార్టర్లో (క్యూ2) యూఎస్ జీడీపీ వృద్ధి రేటు 2.8 శాతంగా నమోదైంది. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ, ఫెడ్ మాత్రం రేట్ల కోతను సుదీర్ఘంగా వాయిదా వేస్తూ వస్తోంది. గత నెలఖర్లో జరిగిన పాలసీ భేటీలోనూ యథాతథ స్థితినే కొనసాగించింది. అయితే, తాజా గణాంకాల ప్రభావంతో సెప్టెంబర్‌లో పావు శాతం కాకుండా అర శాతం కోతను ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం దిగొచి్చనప్పటికీ రేట్ల కోత విషయంలో ఫెడ్ సుదీర్ఘ విరామం తీసుకుందని, దీనివల్ల ఎకానమీపై, జాబ్ మార్కెట్‌పై ప్రభావం పడుతోందనేది వారి అభిప్రాయం. అధిక రేట్ల ప్రభావంతో మాంద్యం వచ్చేందుకు 50% అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ అంటోంది!– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్థిక మాంద్యంలోకి జపాన్
టోక్యో: జపాన్ మాంద్యంలోకి జారిపోయింది. జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, జూలై– సెప్టెంబర్‌లో 2.9% మేర క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగించిన సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలో ఉందనేందుకు గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీ నపడింది. ఫలితంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్..అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. -
మాంద్యంలో బ్రిటన్! పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం.. అసలేం జరుగుతోంది?
పెరుగుతున్న వడ్డీ రేట్లు, నిరుద్యోగం బ్రిటన్ను కలవరపెడుతున్నాయి. దేశం మాంద్యంలోకి వెళ్లిపోతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధికమవుతున్న నిరుద్యోగం కారణంగా బ్రిటన్ బహుశా ఇప్పటికే మాంద్యంలో ఉన్నట్లు బ్లూమ్‌బర్గ్ ఎకనామిక్స్ విశ్లేషణ పేర్కొంటోంది. వరుసగా తిరోగమనం వరుసగా రెండు త్రైమాసికాల్లో వృద్ధి మందగించిన క్రమంలో ఈ సంవత్సరం ద్వితీయార్థంలో తేలికపాటి మాంద్యం ఏర్పడే అవకాశం 52 శాతం ఉందని పరిశోధకులు అంచనా వేశారు. త్వరలో బ్రిటన్ జీడీపీ గణాంకాలు అధికారికంగా వెలువడనున్న నేపథ్యంలో ఈ విశ్లేషణ ప్రచురితమైంది. వృద్ధి సంకోచం తేలికపాటిగానే కనిపిస్తున్నప్పటికీ ఈ అసమానతలు మాంద్యానికి దారితీసినట్లు బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ అనలిస్ట్ డాన్ హాన్సన్ ప్రచురణ నోట్లో పేర్కొన్నారు. సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బ్రిటన్ జీడీపీ 0.1 శాతం పడిపోయిందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు. దేశంలో ప్రస్తుతం నిరుద్యోగం, 4.3 శాతం ఉండగా 2026 నాటికి ఇది 5.1 శాతానికి పెరుగుతుందని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది. రిషి సునక్‌కు తలనొప్పిగా మాంద్యం! బ్రిటన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక మాంద్యం ప్రధానమంత్రి రిషి సునక్‌కు తలనొప్పిగా మారనుంది. ఈ పరిస్థితుల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు అనివార్యం కానున్నాయి. తన అంచనాల్లో ఇప్పటికే తేలికపాటి మాంద్యాన్ని సూచించిన బ్లూమ్‌బెర్గ్ ఎకనామిక్స్ మూడో త్రైమాసికంలో జీడీపీ తిరోగమన అవకాశం 70 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. జులైలో 0.6 శాతం జీడీపీ క్షీణించగా ఆగస్టులో పెద్దగా పుంజుకోలేదు. కాగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ మాత్రం మాంద్యానికి 50 శాతం అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. -
ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట
ప్రపంచవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో కొన్నాళ్లుగా ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు కమ్ముకున్నాయి. చాలా కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఐటీ పరిశ్రమంలో పని చేస్తున్న టెక్ ఉద్యోగుల్లో ఉంది. అయితే ఈ భయంపై ఊరట కలిగించే మాటను గ్లోబల్ డేటా స్టోరేజ్ అండ్ సొల్యూషన్స్ మేజర్ నెట్‌యాప్ (NetApp) సీఈవో జార్జ్ కురియన్ (George Kurian) చెప్పారు. భారత్.. ఆసియాలో అతిపెద్ద మార్కెట్‌గా ఆవిర్భవిస్తుందని నెట్‌యాప్ అంచనా వేస్తోంది. దేశ ఆర్థిక బలం, పెరుగుతున్న యువ జనాభా ఇందుకు దోహం చేస్తాయని భావిస్తోంది. ఈ సంవత్సరం భారతదేశంలో 20 సంవత్సరాల కార్యకలాపాలను పూర్తి చేసిన ఈ సంస్థ, దేశంలో భాగస్వామ్యాలను, హెడ్‌కౌంట్‌ను విస్తరించడాన్ని కొనసాగిస్తుందని సీఈవో జార్జ్ కురియన్ పేర్కొన్నారు. తేలికపాటి మాంద్యం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి స్థాయి తగ్గడంతో ఐటీ పరిశ్రమలో తేలికపాటి మాంద్యం ఉండొచ్చని తెలిపారు. సంవత్సరం క్రితంతో పోలిస్తే, ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో వడ్డీ రేటు పెరుగుదల వేగం మందగించడం వల్ల అనిశ్చితి స్థాయి కొద్దిగా తగ్గింది. బిజినెస్ సెంటిమెంట్లు ఇప్పటికే వేగవంతమయ్యాయని చెప్పను కానీ విశ్వాసం మెరుగుపడటం ప్రారంభించిందని కురియన్ అభిప్రాయపడ్డారు. పరిస్థితులు మరింత దిగజారకపోతే అన్ని దేశాలూ మాంద్యం నుంచి బయటకు వస్తాయన్నారు. -
చైనా ముంగిట మాంద్యం ముప్పు? ఆమెరికాతో చెలిమికి డ్రాగన్ సై?
చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోనుందా? క్షీణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి మాంద్యం ముప్పును తేనుందా? చైనా ఇకపై తన వైఖరిని మార్చుకోనుందా? ఇటువంటి ప్రశ్నలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిన్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలో ఇప్పటికే విపరీతమైన నిరుద్యోగం ఉంది. ఇటువంటి పరిస్థితిలో చైనా తన ఉనికిని నేపాల్ నుండి శ్రీలంక వరకు విస్తరించడం, ఇందుకు ఆర్థిక సహకారాన్ని అందించడమే కాకుండా, తన ప్రత్యర్థి అమెరికా వైపు స్నేహ హస్తాన్ని కూడా చాచుతోంది. ఆర్థికవృద్ధికి ఇంతలా తాపత్రయ పడుతున్న చైనా విజయం సాధిస్తుందా? చైనా ప్రాపర్టీ రంగంలో భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. మీడియా నివేదికల ప్రకారం దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని చైనా మాజీ సీనియర్ ఎన్బిఎస్ అధికారి హె కెంగ్ తెలిపారు. ఈ సంఖ్య ఎంత ఉందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరని, కానీ ఈ ఇళ్లలో మూడు వందల కోట్ల మంది ప్రజలు నివసించవచ్చని అన్నారు. డాంగ్-గ్వాన్ చైనాలోని ఒక నగరం. ఇక్కడ ఖాళీగా ఉన్న ఇళ్ల సంఖ్య చైనా జనాభా కంటే రెట్టింపులో ఉందని కెంగ్ తెలిపారు. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారం దేశంలో 64.8 కోట్ల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లు అమ్ముడుపోని స్థితిలో ఉన్నాయి. అంటే 90 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 72 లక్షల ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ డేటా ఆగస్టు 2023 నాటిది. ఈ ప్రాజెక్టులు పూర్తయినా, వాటిని కొనుగోలు చేసే శక్తి ప్రజలకు లేదని తెలుస్తోంది. అయితే అంతకుముందు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చైనా ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో లేదని అన్నారు. ఇలాంటి వాదనలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాయని, జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరుకున్నదని పలు నివేదకలు చెబుతున్నాయి. జూలై 2023 నాటి గణాంకాల ప్రకారం 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన 21.3 శాతం మంది యువత ఉద్యోగాల కోసం వెదుకుతున్నారు. అంటే నిరుద్యోగిత రేటు 21 శాతం కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనాలో శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తింది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల చైనాకు చాలా నష్టం వాటిల్లింది. జీడీపీతో పోలిస్తే చైనా అప్పు కూడా భారీగానే ఉంది. చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపై కూడా ప్రభావం చూపుతున్నది. మరోవైపు దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గుతోంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ సంక్షోభం, నిరుద్యోగం, ఎగుమతుల తగ్గుదల, కంపెనీలపై నిబంధనల కఠినతరం మొదలైనవన్నీ చైనాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయి. తాజాగా చైనా తన విధానాలలో మార్పు కోరుకుంటుంది నేపాల్, అమెరికాతో చేతులు కలుపుతోంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ ఏడు రోజులపాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు అమెరికా, చైనాల దౌత్యవేత్తలు పరస్పరం కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న వాస్తవం అమెరికాకు ఇప్పుడు అర్థమైవుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచవ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు ప్రభావితమవుతుంది. అయితే చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఎలాంటి ఫలితాలను చూపుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఖలిస్తానీలకు కెనడా ముస్లింలు ఎందుకు మద్దతు పలుకుతున్నారు? -
‘నైరుతి’ నిష్క్రమణ ఆరంభం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి పశ్చిమ రాజస్థాన్ ప్రాంతం నుంచి వీటి ఉపసంహరణ మొదలవుతుంది. వాయవ్య భారతదేశంలో యాంటీ సైక్లోన్ అభివృద్ధి చెందడం, నైరుతి రాజస్థాన్‌లో పొడి వాతావరణం నెలకొనడం ద్వారా ఈ రుతుపవనాల నిష్క్రమణ మొదలు కానున్నట్టు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమై అక్టోబర్ 15 నాటికి దేశం నుంచి నైరుతి రుతు పవనాల నిష్క్రమణ పూర్తవుతుంది. సాధారణంగా నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రాజస్థాన్ నుంచి సెప్టెంబర్ 17 నుంచి ఆరంభమవుతుంది. కానీ.. ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా ఉపసంహరణ మొదలవుతోంది. ఈ ఏడాది నైరుతి ఆగమనం కూడా వారం రోజుల ఆలస్యంగానే మొదలైంది. వాస్తవానికి జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. అక్కడ నుంచి క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఇవి వారం రోజులు ఆలస్యంగా అంటే జూన్ 8వ తేదీన కేరళను తాకాయి. వీటి విరమణలోనూ అదే తీరును కనబరిచాయి. ఈ ఏడాది ‘నైరుతి’ విభిన్నం! ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు విభిన్నంగా ప్రభావం చూపాయి. ఈ రుతుపవనాల సీజన్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో బంగాళాఖాతంలో కనీసం ఐదారు అల్పపీడనాలు, మూడు వాయుగుండాలు, ఒకట్రెండు తుపానులు సంభవిస్తాయి. కానీ.. ఈ సీజనులో ఇప్పటివరకు నాలుగు అల్పపీడనాలు మాత్రమే ఏర్పడ్డాయి. ఇవి కూడా స్వల్పంగానే ప్రభావం చూపాయి తప్ప ఆశించిన స్థాయిలో వర్షాలను కురిపించలేదు. ఈ ఏడాది ఒక్క వాయుగుండం గాని, తుపాను గాని ఏర్పడలేదు. వాయుగుండాలు, తుపానులు ఏర్పడితే సమృద్ధిగా వానలు కురిసేందుకు దోహద పడేవి. ఈ దృష్ట్యా రాష్ట్రంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 16.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. తిరోగమనంలో వర్షాలు సాధారణంగా నైరుతి రుతుపవనాల తిరోగమనంలోనూ వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలకు ఆస్కారం ఉంటుందని, రుతుపవనాలు చురుకుదనం సంతరించుకుంటాయని, ఫలితంగా వానలు కురుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా తిరోగమనంలో కురిసే వర్షాలతో రాష్ట్రంలో నెలకొన్న లోటు వర్షపాతం సాధారణ స్థితికి చేరుకుంటుందని, వచ్చే నెల 15 వరకు వర్షాలు పడతాయని పేర్కొంటున్నారు. ఎందుకిలా జరిగిందంటే! ఈ సీజన్లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ప్రభావం చూపకపోవడానికి వాతావరణ నిపుణులు వివిధ కారణాలు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు భూమధ్య రేఖ ప్రాంతం నుంచి అరేబియా, బంగాళాఖాతం శాఖలుగా> విడిపోతాయి. వీటిలో బంగాళాఖాతం శాఖ ప శ్చిమ మధ్య బంగాళాఖాతంలో కాకుండా చైనా, జపాన్ దేశాల వైపు వెళ్లిపోయాయి. దీంతో చైనా సముద్రంలో ఈ సీజన్లో రెండు మూడు బలమైన తుపానులు ఏర్పడ్డాయి. పైగా.. రుతుపవన ద్రోణి దాదాపు నెల రోజులపాటు హిమాలయాల్లోనే ఉండిపోయింది. ఫలితంగా పశి్చమ బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడక రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవకుండా పోయాయి. దీనికి ఎల్‌నినో పరిస్థితులు కూడా తోడయ్యాయని వాతావరణ శాఖ విశ్రాంత అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు. -
మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి?
అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికమాంద్యం భయం చాలా కాలంగా వెంటాడుతోంది. చైనా సైతం ఇటీవల ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులను చవిచూసింది. అయితే ఇప్పటి వరకు భారత్‌లో మాద్యం తాలూకా లక్షణాలేమీ కనిపించలేదు. అయితే తాజాగా వెలువడిన ఓ సంకేతం ఆర్థిక నిపుణులను అప్రమత్తం చేసింది. బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు.. దేశంలో ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం లోదుస్తుల తయారీ కంపెనీలలో ఇన్వెంటరీ పెరిగింది. అమ్మకాలు తగ్గాయి. ఆర్థికవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ద్రవ్యోల్బణం కారణంగా జనం తమ బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు వారు మొదట లోదుస్తుల కొనుగోలును వాయిదా వేస్తారు. దేశంలోని పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మందగమనంలో జాకీ బ్రాండ్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లోదుస్తుల అమ్మకాలు క్షీణించిన కారణంగా పలు కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జాకీ బ్రాండ్ లోదుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్‌కి ఆదాయం తగ్గడంతో పాటు అమ్మకాలు కూడా తగ్గాయి.గత కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిమితులను మించిపోతోంది. ద్రవ్యోల్బణం సామాన్యుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది. ఫలితంగా వినియోగదారుల సెంటిమెంట్ ప్రభావితమవుతుంది. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు. జనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనడానికి ఇది సంకేతం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మాజీ అధిపతి అలాన్ గ్రీన్‌స్పాన్.. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల సూచికను రూపొందించారు. దీని ప్రకారం ఒక దేశంలో పురుషుల లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం అనేది ఆర్థిక వ్యవస్థలో మాంద్యానికి సంకేతం. 2007- 2009 మధ్య కాలంలో యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు లోదుస్తుల విక్రయాలు క్షీణించాయి. 2007- 2009 మధ్య అమెరికాలో ఏం జరిగింది? ఆర్థిక నిపుణులు గ్రీన్‌స్పాన్ 1970లలో పురుషుల లోదుస్తుల సూచిక సిద్ధాంతాన్ని వెలువరించారు. పురుషుల లోదుస్తుల విక్రయ గణాంకాలు కీలక ఆర్థిక సూచికలు అని ఆయన అన్నారు. లోదుస్తులు అనేవి ప్రైవేట్ దుస్తులు. అవి పైనున్న దుస్తులలో దాగివుంటాయి. అందుకే ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారినప్పుడు, మనిషి చేసే మొదటి పని లోదుస్తులు కొనుగోలు చేయడం మానివేస్తాడు. ఇది రాబోయే కాలంలో మాంద్యం లేదా ఆర్థిక మందగమనాన్ని సూచిస్తుంది. 2007- 2009 మధ్య అమెరికా తీవ్ర మాంద్యం ఎదుర్కొంది. 2007 ప్రారంభం నుండి ఆ దేశంలో పురుషుల లోదుస్తుల విక్రయాలలో భారీ క్షీణత కనిపించింది. 2010 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు, పురుషుల లోదుస్తుల అమ్మకాలు ఆటోమేటిక్‌గా పెరిగాయి. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
యూరప్ ఎకనమిక్ అవుట్‌లుక్ అధ్వాన్నం
ఫ్రాంక్ఫర్ట్: యూరోపియన్ యూనియన్ ఈ సంవత్సరం, వచ్చే ఏడాది ఆర్థిక వృద్ధి అంచనాను తగ్గించింది. తీవ్ర ద్రవ్యోల్బణంతో వినియోగదారులు వ్యయాలకు సుముఖత చూపడం లేదని, అధిక వడ్డీ రేట్లు పెట్టుబడికి అవసరమైన రుణాన్ని పరిమితం చేస్తున్నాయని యూరోపియన్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. సంబంధిత వర్గాల కథనం ప్రకారం, ఈయూ ప్రాంతంలో మాంద్యం భయాలు పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తీసుకురావాలనే లక్ష్యంతో వడ్డీరేట్లు మరింత పెంచాలా? వద్దా? అన్న చర్చ సర్వత్రా జరుగుతోంది. తాజా ప్రకటన ప్రకారం, 2023లో యూరో కరెన్సీ వినియోగిస్తున్న 20 దేశాల వృద్ధి రేటు క్రితం అంచనా 1.1 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గించడం జరిగింది. వచ్చే ఏడాది విషయంలో ఈ రేటు అంచనా 1.6 శాతం నుంచి 1.3 శాతానికి తగ్గింది. 27 దేశాల ఈయూ విషయంలో ఈ రేటును 2023కు సంబంధించి 1 శాతం నుంచి 0.8 శాతానికి, 2024లో 1.7 శాతం నుంచి 1.4 శాతానికి తగ్గించడం జరిగింది. రష్యా–యుక్రేయిన్ మధ్య ఉద్రిక్తతలు, రష్యా నుంచి క్రూడ్ దిగుమతులపై ఆంక్షలు యూరోపియన్ యూనియన్‌లో తీవ్ర ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. -
బలంగా ముందుకు సాగుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ
గ్లోబలైజేషన్ ప్రక్రియతో ప్రపంచం ‘కుగ్రామం’గా మారిపోతున్న తరుణంలో అమెరికా ఆర్థికవ్యవస్థ ఆరోగ్యమే అన్ని దేశాలకూ దిక్సూచి అవుతోంది. అట్లాంటిక్ మహాసముద్రానికి ఆవల ఉన్న ఈ అత్యంత ధనిక దేశం ఆర్థికస్థితి ఇప్పుడు బాగుందనే వార్త ప్రపంచ దేశాలకు ఉత్సాహాన్నిస్తోంది. 2023 రెండో క్వార్టర్లో అమెరికా ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంది. పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న ఆర్థికవేత్తలు, విశ్లేషకుల అంచనాలు తప్పని రుజువయ్యాయి. అమెరికా ఆర్థిక ప్రగతి బలపడుతోందన్న అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం చెప్పిన మాటలకు తాజా గణాంకాలు తోడయ్యాయి. ఈ ఏడాది రెండో క్వార్టర్ కాలంలో (ఏప్రిల్, మే, జూన్) అమెరికా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2.4 శాతం చొప్పున పెరిగిందని గురువారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది తమ దేశం ఆర్థిక మాంద్యంలో చిక్కుకునేది లేదని అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ఆర్థికవేత్తలు, అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ ఈ మధ్యనే చేసిన ప్రకటనలు నిజమయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో అర్హతలున్నవారికి ఉద్యోగాలు వస్తున్నాయి. వాస్తవానికి కొత్త ఉద్యోగాలు, ఉద్యోగ ఖాళీలన్నీ నింపడానికి తగినంత మంది అమెరికాలో దొరకడం లేదట. ఈ పరిస్థితి నిరుద్యోగ సమస్య బాగా తగ్గిపోయింది. ఆర్థికపరమైన ఆటుపోట్లు తట్టుకుని ముందుకు సాగే ‘లాఘవం’ నేడు అమెరికా ఆర్థికవ్యవస్థలో కనిపిస్తోందని ప్రసిద్ధ అకౌంటింగ్ సంస్థ ఆర్.ఎస్.ఎం ప్రధాన ఆర్థికవేత్త జో బ్రూస్యులస్ అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా అందరి అంచనాలకు భిన్నంగా అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగడం ప్రపంచానికి శుభసూచకమే. ఈ ఏడాది రెండో క్వార్టర్లో– ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి దర్పణంలా పనిచేసే జీడీపీలో 1.5% వృద్ధిరేటు కనిపిస్తుందని ప్రఖ్యాత ఆర్థిక వ్యవహారాల మీడియా సంస్థలు బ్లూంబర్గ్, వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూ చేసిన ఆర్థికవేత్తలు అంచనావేశారు. కాని, అంతకు మించి (2.4%) జీడీపీ రేటు ఉండడం అమెరికా పాలకపక్షానికి, ప్రజలకు ఆనందన్ని ఇస్తోంది. ఆర్థికమాంద్యం ఉందడని ఫెడ్ ప్రకటించాక రెండో క్వార్టర్ జీడీపీపై అంచనా ఈ ఏడాది అమెరికా ఆర్థికమాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా వాణిజ్య శాఖ రెండో క్వార్టర్ జీడీపీ అంచనా వివరాలు వెల్లడించింది. మరో ఆసక్తికర విషయం ఏమంటే వడ్డీ రేట్లను (25 బేసిక్ పాయింట్లు) ఫెడ్ బుధవారం పెంచింది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచడం ఇది 11వ సారి. గడచిన 20 ఏళ్లలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి వడ్డీ రేట్లను ఇంత ఎక్కువగా పెంచడం కొందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో వినియోగదారులు గతంతో పోల్చితే కాస్త ఎక్కువ ఖర్చుచేయడం, మొత్తం ఆర్థికవ్యవస్థలోకి వచ్చిన పెట్టుబడులు, రాష్ట్ర, స్థానిక, ఫెడరల్ స్థాయిల్లో ప్రభుత్వాల వ్యయం అమెరికా జీడీపీ పెరగడానికి దోహదం చేశాయని బ్యూరో ఆఫ్ ఇకనామిక్ ఎనాలిసిస్ అభిప్రాయపడింది. అన్ని ఉద్యోగ ఖాళీల భర్తీకి అవసరమైనంత మంది అందుబాటులో లేకపోవడం దేశంలో వేతనాలు పెరగడానికి దారితీసింది. జూన్ మాసంలో వార్షిక ద్రవ్యోల్బణం రేటు మూడు శాతానికి చేరుకుంది. అయితే, 2021 మార్చి నుంచి చూస్తే ఇదే అత్యల్పమని ఈ నెలలో ప్రభుత్వం ప్రకటించింది. అనేక కారణాల వల్ల 2023 ద్వితీయార్థంలో ద్రవ్యోల్బణం పరిస్థితి మెరుగవుతుందని గోల్డ్ మన్ శాక్స్ రీసెర్చ్ సంస్థలో ప్రధాన అమెరికా ఆర్థికవేత్త డేవిడ్ మెరికిల్ చెప్పారు. అనుకున్నదానికంటే మెరుగైన రీతిలో అమెరికా ఆర్థికవ్యవస్థ పయనించడంతో దేశంలోని వినియోగదారులు, వ్యాపారులేగాక అక్కడ చదువుకుంటున్న లక్షలాది మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఉద్యోగాలు ఆశించే సాంకేతిక నైపుణ్యాలున్న విదేశీ యువకులు సంతోషపడుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒక రైలింజనులా ముందుకు నడిపించే స్థితిలో అమెరికా ఆర్థిక ప్రగతి ప్రస్తుతం ఉంది. ప్రపంచీకరణ పూర్తవుతున్న దశలో అమెరికా ఆరోగ్యమే ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలకూ మహద్భాగ్యంగా ఇప్పటికీ ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. - విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
గోల్డ్‌మాన్ సాచెస్లో 125 మంది మేనేజింగ్ డైరెక్టర్ల తొలగింపు?
అంతర్జాతీయ ఆర్ధిక సేవల సంస్థ గోల్డ్‌మాన్ సాచెస్ కీలక నిర్ణయం తీసుంది. సంస్థలో మరోసారి ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడు దఫాలుగా లేఆఫ్స్ ఇచ్చిన గోల్డ్‌మాన్ సాచెస్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లోని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) స్థాయి ఉద్యోగాల్లో125 మంది ఎండీలను తొలగించాలని నిర్ణయించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ఆర్థిక మాంద్యం భయాలతో ప్రాజెక్ట్‌లలో తిరోగమనం, అమెరికాలో దిగ్గజ బ్యాంకుల్లో నెలకొన్న సంక్షోభంతో గోల్డ్‌మాన్ సాచెస్ పొదుపు చర్యలు పాటిస్తుంది. తాజాగా, ప్రపంచవ్యాప్తంగా ఎండీ స్థాయి అధికారుల తొలగిస్తున్నట్లు తేలింది. అయితే ఆ తొలగింపులపై గోల్డ్‌మాన్ సాచెస్ అధికారికంగా స్పందించలేదు. కాగా, 125 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించే అవకాశం ఉండగా.. ఇప్పటికే ఐదు నెలల క్రితం దాదాపు 4,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. -
‘పాపం సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. జాబులు పోయి బైక్ ట్యాక్సీలు నడుపుకుంటున్నారు’
ఒక పక్క మాంద్యం భయాలకు తోడు.. వ్యయాలు తడిసిమో పెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకగా.. వాటి సంఖ్య ఇంకా కొనసాగుతుంది. దీంతో కోవిడ్ -19 సంక్షోభంలో రెండు చేతులా సంపాదించిన ఐటీ ఉద్యోగులకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది. వ్యయ నియంత్రణ పేరుతో కంపెనీలు ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. దీంతో చేసేదీ లేక లేఆఫ్స్ గురైన ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారిలో మరి కొందరు మాత్రం కోరుకున్న రంగంలో నచ్చిన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూనే బైక్ ట్యాక్సీలను నడుపుకుంటున్నారు. తాజాగా, బెంగళూరుకు చెందిన హిందుస్తాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) జావా డెవలపర్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ అవతారం ఎత్తారు. ఆర్ధికమాంద్యం దెబ్బకు ఉన్న ఉద్యోగం ఊడిపోయి.. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బైక్ ట్యాక్స్ నడుపుతున్నట్లు తేలింది. ఆ బైక్ ట్యాక్సీని లవ్నీష్ ధీర్ బుక్ చేసుకున్నాడు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్ మార్గమధ్యలో తన ర్యాపిడో డ్రైవర్ గురించి తెలుసుకొని లవ్నీష్ ఆశ్చర్యపోయాడు. ‘తాను సెప్టెంబర్ 2020లో హెచ్‌సీఎల్‌లో జావా డెవలపర్‌గా చేరినట్లు.. ఆర్ధిక అనిశ్చితి కారణంగా ఈ ఏడాది జూన్‌లో ఉద్యోగం పోగొట్టుకున్నట్లు తెలిపారు. తన అనుభవానికి తగ్గట్లు మరో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాని, ర్యాపిడోలో పనిచేస్తే ఎక్కడ, ఏ సంస్థలో ఓపెనింగ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చని ఈ పనిచేస్తున్నట్లు లవ్నీష్కు తన స్టోరీని వివరించారు. అంతే లవ్నీష్ సదరు బైక్ ట్యాక్సీ డ్రైవర్‌కు ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. వెంటనే డ్రైవర్ స్టోరీతో పాటు అతని రెజ్యూమ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇతను హెచ్‌సీఎల్ ఉద్యోగి. జావా డెవలపర్‌గా పనిచేశారు. మీకు తెలిసిన కంపెనీల్లో ఎక్కడైనా జావా డెవలపర్ ఓపెనింగ్స్ ఉంటే నాకు చెప్పండి. అతని వివరాలను మీకు డైరెక్ట్ మెసేజ్ చేస్తాను అని ట్వీట్ చేశాడు. ఆపోస్ట్ వైరల్ కావడంతో బైక్ ట్యాక్సీ ఉద్యోగి గురించి నెటిజన్లు ఆరాలు తీయడం మొదలు పెట్టారు. My Rapido guy is a Java developer recently laid off from HCL driving rapido to get leads for any java developer openings. I have his cv. DM if you have any relevant openings. My @peakbengaluru moment 🤯 pic.twitter.com/PUI7ErdKoU — Loveneesh Dhir | Shardeum 🔼 (@LoveneeshDhir) June 22, 2023 చదవండి👉 వెయ్యి 'రెజ్యుమ్'లు పంపిస్తే.. ఒక్క ఉద్యోగం దొరకలే.. ఐటీ ఉద్యోగి ఆవేదన! -
ఒరాకిల్‌లో ఏం జరుగుతుంది.. మరోసారి ఉద్యోగుల తొలగింపు షురూ!
ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు ఖర్చు తగ్గించుకుంటున్నాయి.ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. తాజాగా గ్లోబల్ టెక్ కంపెనీ ఒరాకిల్ మరోసారి లేఆఫ్స్‌కు తెరతీసింది. ఈ ఏడాది ప్రారంభంలో 3,000 మందిని ఫైర్ చేసిన టెక్ దిగ్గజం..తాజాగా,ఆ సంస్థకు చెందిన హెల్త్ విభాగం యూనిట్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. ఒరాకిల్ 2021 డిసెంబర్ నెలలో ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ సంస్థ సెర్నెర్ను 28.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అనంతరం అవుట్ పేషెంట్స్‌కు ట్రీట్మెంట్, ఆర్మీ అధికారులకు జీవితకాలం హెల్త్ కేర్ సర్వీస్‌లను అందించే యూఎస్ ప్రభుత్వానికి చెందిన యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ ప్రాజెక్ట్‌కు దక్కించింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో నిర్వహణ సమయంలో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తాయి. కారణంగా యూఎస్ డిపార్ట్మెంట్ పలువురు పెషెంట్లతో కుదుర్చుకున్న ఒప్పొందాలు రద్దయ్యాయి. ఈ ఒప్పందాలు ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజాగా, ఆర్ధిక మాంద్యం దెబ్బకు ఒరాకిల్ తన సెర్నెర్లో పనిచేసే ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఇప్పటికే ఆ విభాగంలో కొత్తగా నియమించుకునేందుకు ఉద్యోగులకు జారీ చేసిన జాబ్ ఆఫర్లను కూడా వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధిత ఉద్యోగులకు ఒరాకిల్ నెల రోజుల వేతనంతో పాటు, ప్రతి ఏడాది సర్వీసుకు గాను అదనంగా ఓ వారం వేతనం, వెకేషన్ డేస్‌కు చెల్లింపులతో కూడిన పరిహార ప్యాకేజ్‌ను ఒరాకిల్ ఆఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది. -
వెయ్యి 'రెజ్యుమ్'లు పంపిస్తే.. ఒక్క ఉద్యోగం దొరకలే.. ఐటీ ఉద్యోగి ఆవేదన!
సాఫ్ట్వేర్! ఈ జాబ్‌కు ఉన్న క్రేజే వేరే. చదువు పూర్తయిందా. బూమింగ్‌లో ఉన్న కోర్స్ నేర్చుకున్నామా? జాబ్ కొట్టామా? అంతే. వారానికి ఐదురోజులే పని. వీకెండ్లో పార్టీలు, భారీ ప్యాకేజీలు, శాలరీ హైకులు, ప్రమోషన్లు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ ఆర్ధిక మాంద్యం భయాలతో ఆయా సంస్థలు తొలగించిన ఉద్యోగులు ప్రస్తుతం అనుభవిస్తున్న వెతలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఏడాది ప్రారంభంలో (జవవరి 18న) తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10,000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మార్చి నుంచి తొలగిస్తున్న వారికి సమాచారం అందించి మైక్రోసాఫ్ట్ యాజమాన్యం. వారిలో అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన నికోలస్ నోల్టన్ ఒకరు. సంస్థ లేఆఫ్స్‌తో మైక్రోసాఫ్ట్‌లో జాబ్ చేస్తూనే మరో కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించారు. కానీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా వెయ్యి సార్లు జాబ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. 'మైక్రోసాఫ్ట్‌లో నా ఉద్యోగం పోయింది. ఈ రోజే నా లాస్ట్ వర్కింగ్ డే. గత రెండు నెలలుగా కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అన్ని ప్రయత్నాలు చేశాను. ఇప్పటికే 1000కి పైగా రెజ్యూమ్‌లు పంపించా. అందులో 250 కిపైగా అప్లికేషన్లు సెలక్ట్, 57 రిక్రూటర్స్ కాల్స్, 15 హెరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూలు, 3 ఫైనల్ రౌండ్స్ ఇవన్నీ చేసినా.. ఒక్క ఆఫర్ రాలేదు’ అని వాపోయాడు. విచిత్రం ఏంటంటే ఆయా సంస్థలు లేఆఫ్స్ ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకునేందుకు వెనకడుగు వేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపారు. ప్రస్తుతం, ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. చివరిగా.. ఆర్ధిక మాంద్యంలో సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నా సరే.. ఐటీ జాబ్ కొట్టాలనే సంకల్పంతో చాలా మంది యువత పోటీపడడం గమనార్హం. ఇదీ చదవండి : ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
మరో కొత్త మాంద్యం! ఏంటది.. నిఖిల్ కామత్ ఏమన్నారు?
ప్రపంచాన్ని మరో కొత్త మాంద్యం చుట్టుముడుతుందట.. అదే ‘స్నేహ మాంద్యం’ (friendship recession). ప్రముఖ స్టాక్ బ్రోకరింగ్ సంస్థ జెరోధా (Zerodha) సహ వ్యవస్థాపకుడు, ఇటీవలే తన సోదరుడు, వ్యాపార భాగస్వామి నితిన్‌తో కలిసి ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్ట్ 2023లో చేరిన నిఖిల్ కామత్ ఈ మాట అన్నారు. జీవితంలో స్నేహం ప్రాముఖ్యతను ఇలా గుర్తు చేశారు. ఒంటరితనం, స్నేహ బంధానికి సంబంధించి అమెరికన్ పర్స్పెక్టివ్స్ సర్వే గ్రాఫిక్ చిత్రాలను నిఖిల్ కామత్ తన ట్విటర్లో షేర్ చేశారు. ఆప్యాయతను పంచే మిత్రులు, సంక్షోభ సమయాల్లో ధైర్యాన్నిచ్చే ఆత్మీయ స్నేహితులు తగ్గిపోవడాన్ని స్నేహ మాంద్యంగా ఆ చిత్రాల్లో పేర్కొన్నారు. ఒంటరితనం అనేది రోజుకు 15 సిగరెట్లు తాగడంతో సమానం అని కూడా అందులో రాసి ఉంది. తనకు సోదరులలాంటి ఐదుగురు స్నేహితులు ఉన్నారని, వారి కోసం తాను ఏదైనా చేస్తానని నిఖిల్ కామత్ వెల్లడించారు. స్నేహ బంధం జీవితాన్ని మారుస్తుందన్నారు. ఈ ట్వీట్లో ఆయన స్నేహానికి సంబంధించిన విషయాలతోపాటు మానవ సంబంధాలు, వాటి ప్రాముఖ్యతను కూడా గుర్తుచేశారు. వీటికి సంబంధించిన వివరణాత్మక గ్రాఫ్‌ను షేర్ చేశారు. The more #philosophy you read (not stoic), having a community seems to be the biggest precursor to #happiness (as fleeting as it might be). I have 5 bros in my life I would do all for, life-changing this is, seriously ♥️ pic.twitter.com/jMxVDKs031 — Nikhil Kamath (@nikhilkamathcio) May 26, 2023 ఇదీ చదవండి: Satyajith Mittal: బూట్లు అమ్మి రూ.లక్షలు సంపాదిస్తున్నారు.. చిన్నప్పుడు పడిన ఇబ్బందే ప్రేరణ! -
మాంద్యంలోకి జర్మనీ ఎకానమీ
బెర్లిన్: యూరోప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన జర్మనీ మాంద్యంలోకి జారిపోయింది. 2023 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) దేశ స్థూల దేశీయోత్పత్తి 0.3 శాతం క్షీణించినట్లు ఫెడరల్ స్టాటిస్టికల్ ఆఫీస్ గణాంకాలు పేర్కొన్నాయి. 2002 చివరి త్రైమాసికం అంటే అక్టోబర్–డిసెంబర్ మధ్య దేశ జీడీపీ 0.5 శాతం క్షీణించింది. ఇదీ చదవండి: వామ్మో! ఏటీఎం నుంచి విషపూరిత పాము పిల్లలు: షాకింగ్ వీడియో వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేకపోగా క్షీణత నమోదయితే దానిని ఆ దేశం మాంద్యంలోకి జారినట్లు పరిగణించడం జరుగుతుంది. అధిక ధరలు వినియోగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు ఎకనమిస్టులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం ఏకంగా 7.2 శాతంగా ఉంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. (ప్రొడక్టవిటీ కావాలంటే ఉద్యోగుల్ని పీకేయండి: టెక్ దిగ్గజాలకు మస్క్ సంచలన సలహా) మరిన్ని బిజినెస్వార్తలు, ఇ ంట్రస్టింగ్ అప్డేట్స్ కోసం చదవండి: సాక్షి బిజినెస్ -
అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని ట్విస్ట్!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగుల తొలగింపుల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తొలగించిన ఉద్యోగుల్ని తిరిగి వెనక్కి తీసుకుంటున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆస్థిర ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్‌లో ఉద్యోగాల కోత కొనసాగుతుంది. అయితే, వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్న అమెజాన్..ఇప్పటికే తొలగించిన వారిని విధుల్లోకి తీసుకుంటుంది. ఈ ఏడాది అమెజాన్ 18,000 మంది సిబ్బందిని ఫైర్ చేసింది. వారిలో అమెజాన్ ప్రాడక్ట్ మేనేజర్ పైజ్ సిప్రియాని ఒకరు. సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరిన నాలుగు నెలలకే సిప్రియాని తొలగిస్తున్నట్లు అమెజాన్ యాజమాన్యం మెయిల్ పెట్టింది. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురైంది. ‘ఇది అత్యంత కఠినమైన సమయం. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు నేను సర్ధి చెప్పుకుంటున్నా. కానీ ఇంకా బాధగానే ఉంది. ఎందుకంటే? అమెజాన్‌లో నా కెరియర్ ప్రారంభమైంది ఇప్పుడే. అంతలోనే ఉద్యోగం పోగొట్టుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నా. సంస్థలో చాలా విలువైన క్షణాల్ని గడిపాను. అత్యద్భుతమైన సహచర ఉద్యోగుల్ని పొందాను. అందుకు తోడ్పడిన యాజమాన్యానికి సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఈ క్రమంలో పైజ్ సిప్రియాని మరోసారి లింక్డిన్లో తన జాబ్ గురించి అప్డేట్ చేశారు. విచిత్రంగా అమెజాన్‌లో పోగొట్టుకున్న జాబ్‌ను తిరిగి పొందగలిగాను. సంతోషంగా ఉంది. జనవరిలో సోషల్ మీడియా ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ విధులు నిర్వహిస్తుండగా అమెజాన్ పింక్ స్లిప్ ఇచ్చిందని గుర్తు చేశారు. అనూహ్యంగా మళ్లీ ఇప్పుడే అదే విభాగంలో, ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా రీజాయిన్ అయ్యాను అంటూ సంతోషం వ్యక్తం చేశారు. 9,000 మంది ఉద్యోగుల తొలగింపు తాజాగా, ప్రపంచ వ్యాప్తంగా ఆ సంస్థలో విధులు నిర్వహిస్తున్న మొత్తం 9,000 వేల మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. వారిలో 500 మంది భారతీయ ఉద్యోగులు సైతం ఉన్నారు. చదవండి👉 చంద్రుడి మీదకు మనుషులు.. అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్‌కు జాక్ పాట్! -
మెటాలో మరో 6,000 మంది ఉద్యోగుల తొలగింపు?
ప్రపంచ వ్యాప్తంగా పలు టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. అమెరికన్ మీడియా సంస్థ ‘వోక్స్’ నివేదిక ప్రకారం.. తొలగింపులపై మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు పేర్కొంది. ఉద్యోగుల ఉద్వాసనపై వెలుగులోకి వచ్చిన నివేదికల ఆధారంగా మెటా వచ్చే వారంలో 6 వేల మందిపై వేటు వేయనుంది. ఇప్పటికే గత ఏడాది నవంబర్‌లో 11వేల మందిని, ఈ ఏడాది మార్చిలో 4వేల మందికి పింక్ స్లిప్‌లు జారీ చేసింది. మే నెలలో 6 వేల మందిని ఇంటికి సాగనంపనుంది. ఈ సందర్భంగా, మెటా గ్లోబల్ అఫైర్స్ ప్రెసిడెంట్ నిక్ క్లెగ్ మాట్లాడుతూ.. వచ్చే వారం థర్డ్ వేవ్ ప్రారంభం కానుంది. ఇది నా సంస్థలోని బిజినెస్ టీమ్‌లతో సహా ప్రతి ఒక్కరిని ప్రభావితం చేస్తుంది’అని క్లెగ్ చెప్పారు. ఆందోళన, అనిశ్చితి సమయం ఇది. వాస్తవానికి, ప్రతి ఒక్కరూ ఆ అనిశ్చితితో ఇబ్బంది పడుతున్నప్పటికీ మీ పనితీరు అమోఘం అంటూ ఉద్యోగులపై ప్రశంసలు కురిపించారు. -
అమెజాన్‌లో లేఆఫ్స్.. భారత్‌లో 500 మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు సీఈవో యాండీ జెస్సీ ప్రకటించారు. రానున్న రోజుల్లో ఆర్ధిక అనిశ్చితి నెలకొనే అవకాశాలు ఉన్నాయని, ఆర్ధిక భారం తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇక, లేఆఫ్స్‌పై త్వరలోనే ఉద్యోగులకు సమాచారం ఇస్తామని అన్నారు. అమెజాన్ కఠిన నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని ఉద్యోగాలు కోల్పోగా.. వారిలో 500 మంది భారతీయులు ఉన్నారు. తొలగింపుకు గురవుతున్నవారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. తాజా లేఆఫ్స్‌తో ఏడాదిలో ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచేస్తున్న మరో ప్యాండమిక్? అదేంటంటే? -
కొనసాగుతున్న తొలగింపులు.. దిగ్గజ ఐటీ కంపెనీలో 600 మందిపై వేటు!
ప్రముఖ వీడియో గేమ్ సాఫ్ట్వేర్ సంస్థ ‘యూనిటీ’ మరోసారి లేఆఫ్స్‌కు శ్రీకారం చేట్టుంది. వరల్డ్ వైడ్‌గా ఆసంస్థలో పనిచేస్తున్న 8 శాతంతో సుమారు 600మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెరుగైన ఫలితాలు సాధించేలా సంస్థలోని అన్నీ విభాగాల్లో పునర్నిర్మాణం అవసరమని భావిస్తున్నామని, కాబట్టే వరుసగా మూడో దఫా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో జాన్ రిక్సిటిఎల్లో (John Riccitiello) యూఎస్ సెక్యూరిటీ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపారు. మూడు దఫాల్లో ఉద్యోగుల తొలగింపు యూనిటీ’కి ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 8 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది వ్యవధిలో మూడు సార్లు ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసింది. తొలిసారి గత ఏడాది జూన్‌లో 225 మంది సిబ్బందిని ఇంటికి సాగనంపగా.. ఈ ఏడాది ప్రారంభంలో 284 మందిని, తాజాగా 600 మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు సీఈవో జాన్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్‌లో తెలిపారు. హైబ్రిడ్ వర్క్ అమలు కోవిడ్ -19 అదుపులోకి రావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు సిబ్బందికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి పలికాయి. ఉద్యోగులు కార్యాలయాల నుంచి విధులు నిర్వహించాలని పిలుపు నిచ్చాయి. అందుకు భిన్నంగా యూనిటీ యాజమాన్యం ఈ ఏడాది జూన్ నుంచి ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్‌ను అమలు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వచ్చే నెల నుంచి ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్‌తో పాటు వారంలో మూడు రోజులు ఆఫీస్‌కు రావాలని ఆదేశించింది. కంపెనీ చరిత్రలో లాభాలు.. ఎంగాడ్జెట్ నివేదిక ప్రకారం, కంపెనీ చరిత్రలో అత్యుత్తమ ఆర్థిక త్రైమాసికంగా నమోదు చేసింది. అయినప్పటికీ ఉద్యోగుల్ని తొలగించేందుకు మొగ్గు చూపింది. ఫిబ్రవరిలో విడుదల చేసిన ఫలితాల్లో క్యూ4లో కంపెనీ 451 మిలియన్ల ఆదాయాన్ని గడించింది. 2021లో ఇదే కాలంతో పోలిస్తే 43 శాతంతో వృద్ధి సాధించింది. ఉద్యోగుల తొలగింపుకు కారణం యూనిటీ గణనీయమైన వృద్ధిని సాధించినప్పటి ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంస్థ పనితీరు పెట్టుబడిదారుల్ని ఆకట్టులేదేని, ఫలితంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆ సంస్థ స్టాక్ వ్యాల్యూ సుమారు 11 శాతం తగ్గినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి.. 2.70 లక్షల మంది తొలగింపు! -
నిరాశపరిచిన ఐటీ షేర్లు.. నష్టాలతో ముగిసిన దేశీ స్టాక్ సూచీలు
జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాలు, ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అయితే ఈ వారంలో ఆ లాభాలకు బ్రేకులు పడ్డాయి. సోమవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి 59910 వద్ద నిఫ్టీ 121 పాయింట్ల నష్టపోయి 17706 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా,హెచ్‌సీఎల్,ఎన్టీపీసీ,లార్సెన్, విప్రో, హెచ్డీఎఫ్సీ,టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్,సిప్లా షేర్లు నష్టపోగా.. నెస్లే,పవర్ గ్రిడ్ కార్పొరేషన్,ఎస్బీఐ, బ్రిటానియా, హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు గడించాయి. -
ఉద్యోగులపై వేలాడుతున్న లేఆఫ్స్ కత్తి.. 2.70 లక్షల మంది తొలగింపు!
ఐటీ,ఐటీయేతర కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోతలు ఆగడం లేదు. ఆయా సంస్థలు వరుసగా విసురుతున్న లేఆఫ్స్ కత్తులు టెక్కీలతో పాటు ఇతర రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు భయంతో వణికిపోయేలా చేస్తున్నాయి. ఉద్యోగం నుంచి తొలగించినట్లు అర్ధరాత్రి అపరాత్రి వేళల్లో వస్తున్న ఈ-మెయిల్స్ వారిని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా విడుదలైన ఓ నివేదిక సైతం క్యూ1లో అమెరికాకు చెందిన కంపెనీలు మొత్తం 2.70లక్షల మందికి ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపింది. లేఆఫ్స్‌కు గురైన ఉద్యోగుల్లో ఐటీ రంగానికి చెందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తేలింది. ఈ తరుణంలో చికాగోకు కేంద్రంగా ప్లేస్మెంట్ కార్యకలాపాలు నిర్వహించే ‘ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్’ అనే సంస్థ ఉద్యోగాల తొలగింపులపై ‘ఛాలెంజర్ రిపోర్ట్’ పేరుతో ఏప్రిల్ 6న ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్‌లో జనవరి 2023 నుంచి మార్చి నెల ముగిసే సమయానికి 396 శాతంతో అమెరికాలో సుమారు 2,70,416 మంది ఉద్యోగుల్ని ఆయా సంస్థలు ఇంటికి పంపినట్లు తెలిపింది. గత ఏడాది ఇదే సమయానికి మొత్తం 55,696 (క్యూ1) మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. ఈ ఏడాది క్యూ1లో 2,70,416 ఉద్యోగాలు కోల్పోయినట్లు హైలెట్ చేసింది. ఇక జనవరిలో 102,943, ఫిబ్రవరిలో 77,770, మార్చి నెలలో 89,703 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండ్రూ ఛాలెంజర్ మాట్లాడుతూ.. ఉద్యోగుల విషయంలో కంపెనీలు సానుకూల దృక్పదంతో ఉన్నాయని, కాకపోతే పట్టిపీడిస్తున్న ముందస్తు ఆర్ధిక మాంద్యం భయాలు, వడ్డీరేట్ల పెంపు, కంపెనీల ఖర్చలు తగ్గించుకునే ప్రణాళికల్లో భాగంగా ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తొలగింపుల్లో టెక్నాలజీ రంగంలో ఎక్కువగా ఉన్నాయని సూచించారు. 2023 జనవరి - మార్చి సమాయానికి ఉద్యోగం కోల్పోయిన వారిలో 38 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఉద్యోగుల తొలగింపులకు కారణం ఈ సంవత్సరంలో 167,575 ఉద్యోగుల తొలగింపులకు మార్కెట్, ఆర్థిక పరిస్థితులే కారణమని తెలుస్తోంది. మరో 24,825 మందిని ఫైర్ చేయడానికి కాస్ట్ కటింగ్ కారణం కాగా డిపార్ట్మెంట్ మూసివేతతో 22,109 మంది, ఆర్ధిక అనిశ్చితితో 9,870 మంది, పునర్వ్యవస్థీకరణ కారణంగా 8,500 ఉద్యోగాలు పోయాయి. ఈ ఏడాది వరుసగా 7,944 ఉద్యోగాల కోతలకు డిమాండ్ తగ్గుదల కారణమైనట్లు ‘ఛాలెంజర్ రిపోర్ట్’ నివేదిక హైలెట్ చేసింది. చదవండి👉 రాత్రికి రాత్రే ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ గుడ్‌న్యూస్! -
మెటా నుంచి యాపిల్ వరకు..ఉద్యోగుల తొలగింపులో టెక్ కంపెనీల దూకుడు!
కొత్త సంవత్సరంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకొన్నది. ఆర్థిక మాంద్యం భయాందోళనలతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ లేఆఫ్ దారిలో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి బడా సంస్థలు కూడా చేరాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. యాపిల్ కార్పొరేట్ రీటైల్ విభాగానికి చెందిన ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. వడ్డీరేట్లు పెంపు, ఆర్ధిక మాంద్యం ముందస్తు భయాల కారణంగా ఉద్యోగుల తొలగింపులు నిర్ణయం అనివార్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఎంతమంది ఉద్యోగుల్ని ఫైర్ చేసిందనే విషయంపై స్పష్టత లేదు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు టెక్ సంస్థలు ఎంతమందిని తొలగించాయో ఒక్కసారి పరిశీలిస్తే..మెటా మరోసారి వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. గతవారం నుంచి కొంత నెమ్మదించినట్టు కనిపించిన ఈ తొలగింపుల ప్రక్రియ, మళ్లీ ప్రారంభం కానుంది. గతేడాది నవంబర్‌లో 11 వేల మందిని ఇంటికి సాగనంపిన మెటా, ఈసారి కూడా వేలమందిని తీసేయనున్నట్టు బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది. గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో 12,000 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు దఫాలుగా ఉద్యోగాల కోతలతో అమెజాన్ ఇప్పటివరకు 27,000 మందిని ఇంటికి సాగనంపింది. మొదటి రౌండ్లో 18,000 మందిని, రెండవ రౌండ్లో 9000వేల మందికి పింక్ స్లిప్‌లు జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీస్ స్పేస్ లీజింగ్‌కు తగ్గిన డిమాండ్?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో కార్యాలయ స్థలాల (ఆఫీస్ స్పేస్) లీజు ఈ ఏడాది 25–30 శాతం క్షీణించొచ్చని (క్రితం ఏడాదితో పోలిస్తే) కొలియర్స్ ఇండియా, ఫిక్కీ నివేదిక తెలిపింది. ఆఫీస్ స్పేస్ లీజు 35–38 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ‘ఆఫీసు స్పేస్ విభాగంలో వస్తున్న ధోరణులు, అవకాశాలు – 2023’ పేరుతో కొలియర్స్ ఇండియా, ఫిక్కీ ఒక నివేదికను విడుదల చేశాయి. 2022లో స్థూలంగా కార్యాలయాల స్థలాల లీజు పరిమాణం 50.3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు ఏడాదిలో నమోదైన 32.9 మిలియన్ చదరపు అడుగుల లీజు పరిమాణంతో పోలిస్తే 50 శాతానికి పైగా వృద్ధి చెందింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె నగరాలకు సంబంధించిన వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. చదవండి👉 అపార్ట్మెంట్ ప్రారంభ ధర రూ.30 కోట్లు.. రెంట్ నెలకు రూ.10లక్షలు! ద్వితీయ భాగంలో డిమాండ్ ఆర్థిక సమస్యలు నెమ్మదిస్తాయని, మొత్తం మీద స్థలాల లీజుదారుల విశ్వాసాన్ని ఏమంత ప్రభావితం చేయవని ఈ నివేదిక అభిప్రాయపడింది. ఈ ఏడాది చివరికి లీజు లావాదేవీలు గణనీయంగా పెరగొచ్చని, తాత్కాలికంగా నిలిపివేసిన లీజులపై కార్పొరేట్లు నిర్ణయం తీసుకోవచ్చని అంచనా వేసింది. ఒకవేళ నిరాశావహ వాతావరణం ఉంటే, ఆర్థిక సమస్యలు కొనసాగితే డిమాండ్ రకవరీపై ప్రభావం పడుతుందని తెలిపింది. ప్రస్తుతానికి ఆఫీస్ స్పేస్ మార్కెట్ అనిశ్చితిగా ఉందని, అంతర్జాతీయ అనిశ్చితులు, ఇతర సమస్యలు నెమ్మదిస్తే అప్పుడు డిమాండ్ పుంజుకోవచ్చని తెలిపింది. ఈ ఏడాది ద్వితీయ భాగంలో బలమైన వ్యాపార మోడళ్లు ఉన్న స్టార్టప్‌లు, బీఎఫ్ఎస్ఐ సంస్థలు లీజుకు ముందుకు రావచ్చని పేర్కొంది. కరోనా ముందున్న గరిష్ట స్థాయి లీజు స్పేస్ పరిమాణానికి మించి డిమాండ్ తగ్గకపోవచ్చని నివేదిక స్పష్టం చేసింది. చదవండి👉 విదేశీయులకు షాకిచ్చిన కెనడా..ఆందోళన -
మాజీ ఉద్యోగులకు గూగుల్ భారీ షాక్?
మాజీ ఉద్యోగులకు గూగుల్ భారీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. మెటర్నిటీ, మెడికల్ లీవ్‌లో ఉండి..ఉద్యోగం కోల్పోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించబోవడం లేదని సమాచారం. అయితే గూగుల్ నిర్ణయం వెనుక గ్రూప్‌గా 100 మంది ఉద్యోగులే కారణమని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్‌లో పనిచేస్తున్న 100 మంది గ్రూప్‌గా ఉన్న ఉద్యోగులు Laid off on Leave తీసుకున్నారు. ఆ తర్వాత ఆర్ధిక అనిశ్చితితో గూగుల్ ఈ ఏడాది జనవరి 12వేల మందిని తొలగించింది. వారిలో ఆ 100 మంది ఉద్యోగులు ఉన్నారు. వారికి మెడికల్,పెటర్నిటీ బెన్ఫిట్స్ ఇచ్చేందుకు నిరాకరించింది. కానీ ఉద్యోగులు మాత్రం సంస్థ ఆమోదించినట్లుగానే పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉద్యోగుల బృందం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఫియోనా సిక్కోతో సహా ఎగ్జిక్యూటివ్‌లకు లేఖ రాశారు. ఆ లేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. కానీ గూగుల్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. గత సంవత్సరం గూగుల్ ఫుల్ టైమ్ ఉద్యోగులకు లీవ్‌ల సమయాన్ని పెంచింది. పేరంటల్ లీవ్ కింద 18 వారాలు, బర్త్ పేరెంట్స్‌కు 24 వారాలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పైగా పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు అసాధారణ ప్రయోజనాలను అందించాలని భావించింది. అనూహ్యంగా గూగుల్ 12వేల మందిని తొలగిస్తున్నట్లు జనవరిలో ప్రకటించింది. గూగుల్‌లో పనిచేసిన యూఎస్ ఆధారిత ఉద్యోగులకు ప్రతి సంవత్సరానికి 16 వారాల అదనపు వేతనంతో పాటు రెండు వారాలు అందించనుంది. ఈ చెల్లింపు నిబంధనలు గడువు మార్చి 31 వరకు విధించింది. ఈ తరణంలో మెడికల్ లీవ్‌లో ఉన్నప్పుడు తొలగించిన తమకు చెల్లింపులు అంశంలో స్పష్టత ఇవ్వాలని మాజీ ఉద్యోగులు గూగుల్‌ను కోరుతున్నారు. సంస్థ స్పందించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికాలో మన టెకీల మెడపై... ‘గడువు’ కత్తి!
వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్–1బీ ప్రొఫెషనల్స్ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (ఎఫ్ఐఐడీఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు దాపురించాయి’’ అంటూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 60 రోజుల గ్రేస్ పీరియడ్లోగా మరో ఉద్యోగం గానీ, ఉపాధి గానీ చూసుకోని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. జాబ్ మార్కెట్ అత్యంత ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తక్కువ సమయంలో మరో ఉద్యోగం వెతుక్కోవడం చాలామందికి దాదాపుగా అసాధ్యంగా మారుతోంది. దొరికినా అత్యంత సంక్లిష్టంగా ఉన్న హెచ్–1బీ మార్పు తదితర నిబంధనల ప్రక్రియను గ్రేస్ పీరియడ్లోపు పూర్తి చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో దాన్ని కనీసం 180 రోజులకు పెంచాలంటూ ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేయడం తెలిసిందే. ‘‘దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నా అవి ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గ్రేస్ పీరియడ్ పూర్తయ్యే వారికి నిస్సహాయంగా దేశం వీడటం మినహా మరో మార్గం లేదు’’ అంటూ ఎఫ్ఐఐడీఎస్ ఆవేదన వెలిబుచ్చింది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్ పెంపు సిఫార్సును పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేసింది. భారీగా ఉద్వాసనలు...: గూగుల్, మైక్రోసాఫ్ట్ మొదలుకుని పలు దిగ్గజ కంపెనీలు కొన్నాళ్లుగా భారీగా ఉద్యోగుల తొలగింపు బాట పట్టడం తెలిసిందే. దాంతో గత నవంబర్ నుంచి అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ తదితర ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. ‘‘వీరిలో దాదాపు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. ఆదాయ పన్ను చెల్లించే హెచ్–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు’’ అని ఎఫ్ఐఐడీఎస్ పేర్కొంది. -
గ్రేస్ పీరియడ్: హెచ్1బీ వీసాదారులకు భారీ ఊరట!
వాషింగ్టన్: మాంద్యం దెబ్బకు అమెరికాలో వరుసపెట్టి ఉద్యోగాలు కోల్పోతున్న హెచ్-1బి ఉద్యోగులకు ఊరట. ఉద్యోగం పోయిన రెండు నెలల్లోపే కొత్త కొలువు వెతుక్కోవాలన్న నిబంధనను సడలించి గ్రేస్ పీరియడ్‌ను ఆర్నెల్లకు పెంచాలని అధ్యక్షుని సలహా సంఘం సిఫార్సు చేసింది. తద్వారా కొత్త ఉపాధి అవకాశం వెతుక్కునేందుకు వారికి తగినంత సమయం దొరుకుతుందని అభిప్రాయపడింది. దీనికి అధ్యక్షుని ఆమోదం లభిస్తే కొన్నాళ్లుగా అమెరికాలో ఉద్యోగాలు కోల్పోతున్న వేలాది భారత టెకీలకు భారీ ఊరట కలగనుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత నిబంధనల మేరకు వారంతా 60 రోజుల్లోగా మరో ఉపాధి చూసుకోలేని పక్షంలో అమెరికా వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రేస్ పీరియడ్‌ను 180 రోజులకు పెంచాల్సిందిగా సిఫార్సు చేసినట్టు ఆసియా అమెరికన్లు తదితరులపై అధ్యక్షుని సలహా సంఘం సభ్యుడు అజన్ జైన్ భుటోరియా వెల్లడించారు. అమెరికాలో 2022 నవంబర్ నుంచి రెండు లక్షలకు పైగా ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో ఏకంగా 80 వేల మంది భారతీయులేనని అంచనా! గ్రీన్‌కార్డు దరఖాస్తుదారులకు ఊరట! మరోవైపు, ఈబీ-1, ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల్లో ఆమోదిత ఐ-140 ఉపాధి ఆధారిత వీసా పిటిషన్లుండి, ఐదేళ్లకు పైగా గ్రీన్‌కార్డు దరఖాస్తు పెండింగ్‌లో ఉన్నవారికి ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్లు (ఈఏడీ) జారీ చేయాలని అధ్యక్షుని సలహా కమిటీ తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు ఆమోదం లభిస్తే ఇమిగ్రెంట్ వారి వీసా దరఖాస్తులపై తుది నిర్ణయం వెలువడేదాకా అమెరికాలో వృత్తి, ఉద్యోగాలు కొనసాగించుకునేందుకు వీలు కలుగుతుందని కమిటీ సభ్యుడు అజన్ జైన్ భుటోరియా తెలిపారు. -
రెండు నెలల్లో 1.80 లక్షల మంది ఉద్యోగుల తొలగింపు!
ఆర్ధిక మాంద్యం భయాలు ప్రపంచ దేశాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఫలితంగా అమెరికాకు చెందిన కంపెనీలు గడిచిన రెండు నెలల్లో 1.80 లక్షల మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. జనవరిలో 1,02,943 మంది, ఫిబ్రవరిలో 77,770 మందికి పింక్ స్లిప్‌లు అందించినట్లు ఔట్‌ప్లేస్‌మెంట్ సర్వీసెస్ సంస్థ చాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక తెలిపింది. ఇక ఈ తొలగింపుల్లో హెల్త్‌కేర్ ఉత్పత్తుల రంగంలో ఫిబ్రవరి నెలలో 9749 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2023లో రిటైల్ రంగంలో 17,456 మందిని, ఫైనాన్సియల్ విభాగంలో 17,235 మంది ప్రభావితమయ్యారు. ఫిన్‌టెక్ కంపెనీలు 4675 మందిని తొలగించాయి. మీడియా రంగానికి చెందిన కంపెనీలు సైతం 9738 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా గ్రే అండ్ క్రిస్మస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ ఆండ్రూ చాలెంజర్ మాట్లాడుతూ..అమెరికాలోని కంపెనీలు ఆర్థిక మాంద్యంతో తలెత్తే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నాయని అన్నారు. ఇతర రంగాల్లో ఖర్చులు తగ్గించుకోవడంతోపాటు, పరిస్థితులు చేయిదాటితే ఉద్యోగుల తొలగింపుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. -
మామా.. చందమామా మరింత దూరమా?
చంద్రునితో భూమికి అవినాభావ సంబంధం. భూమికి ఉపగ్రహమైతే మనకేమో ఏకంగా చంద‘మామ’. భూమిపైనా, మనిషితో పాటు జంతుజాలం మీదా చంద్రుని ప్రభావమూ అంతా ఇంతా కాదు. సముద్రంలో ఆటుపోట్లు మొదలుకుని అనేకానేక విషయాల్లో ఆ ప్రభావం నిత్యం కనిపిస్తూనే ఉంటుంది. భూమిపై ప్రాణం ఆవిర్భావానికి చంద్రుడే కారణమన్న సిద్ధాంతమూ ఉంది. మన రోజువారీ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసే పలు కీలక వాతావరణ వ్యవస్థల్లో కూడా భూమి చుట్టూ చంద్రుని కక్ష్య తాలూకు నిర్మితి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతారు. అలాంటి చంద్రుడు భూమిపై రోజు తాలూకు నిడివి రోజురోజుకూ పెరిగేందుకు కూడా ప్రధాన కారణమట...! చాలాకాలం క్రితం. అంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. భూమ్మీద రోజు నిడివి ఎంతుండేదో తెలుసా? ఇప్పుడున్న దాంట్లో దాదాపు సగమే! సరిగ్గా చెప్పాలంటే 13 గంటల కంటే కాస్త తక్కువ!! అప్పట్నుంచీ అది క్రమంగా పెరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. ఈ పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉందట! చంద్రుడు క్రమంగా భూమికి దూరంగా జరుగుతుండటమే ఇందుకు కారణమని సైంటిస్టులు తేల్చారు!! భూమికి చంద్రుడు దూరంగా జరుగుతున్న తీరును శాస్త్ర పరిభాషలో ల్యూనార్ రిసెషన్గా పిలుస్తారు. ఇది ఎంతన్నది అపోలో మిషన్లలో భాగస్వాములైన ఆస్ట్రోనాట్లు ఇటీవల దీన్ని కచ్చితంగా లెక్కించారు. చంద్రుడు భూమికి ఏటా 3.8 సెంటీమీటర్ల మేరకు దూరంగా జరుగుతున్నట్టు తేల్చారు. అందువల్లే భూమిపై రోజు నిడివి అత్యంత స్వల్ప పరిమాణంలో పెరుగుతూ వస్తోందట. మహాసముద్రాలతో, అలలతో చంద్రుని సంబంధమే ఇందుకు ప్రధాన కారణమని యూనివర్సిటీ ఆఫ్ లండన్ రాయల్ హోలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవిడ్ వాల్టాం చెబుతున్నారు. ఆయన భూమి, చంద్రుని మధ్య సంబంధంపై చిరకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ‘‘ఇటు భూమి, అటు చంద్రుడు ఎవరి కక్ష్యలో వారు తిరిగే క్రమంలో చంద్రుని ఆకర్షణ వల్ల మహాసముద్రాల్లో ఆటుపోట్లు (అలల్లో హెచ్చు, తగ్గులు) సంభవిస్తూ ఉంటాయి. సదు అలల ఒత్తిడి భూ భ్రమణ వేగాన్ని అత్యంత స్వల్ప పరిమాణంలో తగ్గిస్తుంటుంది. అలా తగ్గిన శక్తిని చంద్రుడు తన కోణీయ గతి కారణంగా గ్రహిస్తుంటాడు. తద్వారా చంద్రుడు నిరంతరం హెచ్చు కక్ష్యలోకి మారుతూ ఉంటాడు. మరో మాటల్లో చెప్పాలంటే భూమి నుంచి దూరంగా జరుగుతూ ఉంటాడన్నమాట’’ అని ఆయన వివరించారు. అప్పట్లో రోజుకు రెండు సూర్యోదయాలు ‘‘అప్పట్లో, అంటే ఓ 350 కోట్ల ఏళ్ల క్రితం ఇప్పటి రోజు నిడివిలో ఏకంగా రెండేసి సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు జరిగేవి! ఎందుకంటే రోజుకు 12 గంటలకు అటూ ఇటుగా మాత్రమే ఉండేవి. ఈ నిడివి క్రమంగా పెరుగుతూ వచ్చింది, వస్తోంది’’ అని జర్మనీలోని ఫ్రెడరిక్ షిల్లర్ యూనివర్సిటీ జెనాలో జియోఫిజిసిస్టుగా చేస్తున్న టామ్ ఈలెన్ఫెల్డ్ వివరించారు. మరో విశేషం ఏమిటంటే, భూమికి చంద్రుడు దూరం జరుగుతున్న వేగం కూడా ఎప్పుడూ స్థిరంగా లేదు. అది నిత్యం మారుతూ వస్తోందట. ఉదాహరణకు 60 కోట్ల ఏళ్ల కింద చూసుకుంటే ఆ వేగం ఇప్పటికి రెట్టింపుండేదట. అంటే అప్పుడు చంద్రుడు భూమికి ఏటా సగటున 7 సెంటీమీటర్లు దూరం జరిగేవాడట! అలాగే ఈ వేగంలో భవిష్యత్తులో కూడా మార్పులు చోటుచేసుకుంటాయని ఈలెన్ఫెల్డ్ చెబుతున్నారు. ‘‘మహాసముద్రాల, ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రపు పరిమాణమే ఇందుకు కారణం కావచ్చు. అది గనక ఇప్పుడున్న దానికంటే కాస్త సన్నగా గానీ, వెడల్పుగా గానీ ఉంటే మూన్ రిసెషన్ వేగంలో పెద్దగా మార్పులుండేవి కావని నా అభిప్రాయం’’ అని చెప్పారాయన. కొసమెరుపు: ఏదెలా ఉన్నా, చంద్రుడు మాత్రం భూమికి ఎప్పటికీ శాశ్వతంగా దూరమైపోడంటూ సైంటిస్టులు భరోసా ఇస్తున్నారు! ‘‘అలా జరిగేందుకు కనీసం మరో 500 నుంచి 1,000 కోట్ల ఏళ్లు పట్టొచ్చు. కానీ అంతకు చాలాముందే సౌర కుటుంబమంతటికీ మహారాజ పోషకుడైన సూర్యుడే లేకుండా పోతాడు! సూర్యునితో పాటే భూమి, మొత్తం సౌరకుటుంబమే ఆనవాలు లేకుండా పోతాయి’’ అంటూ వారు చమత్కరించారు!! శతాబ్దానికి 1.09 మిల్లీ సెకను పెరుగుతున్న రోజు... చంద్రుడు క్రమంగా దూరం జరుగుతున్న కారణంగా భూమిపై రోజు నిడివి క్రీస్తుశకం 1,600 నుంచి ప్రతి శతాబ్దానికి సగటున 1.09 మిల్లీసెకన్ల మేరకు పెరుగుతూ వస్తోందని తాజా విశ్లేషణలు తేల్చాయి. ఇది 1.78 మిల్లీసెకన్లని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చూట్టానికి మిల్లీసెకన్లే అయినా, 450 కోట్ల భూ పరిణామ క్రమంలో రోజు తాలూకు నిడివిని ఇది ఊహాతీతంగా పెంచిందని సైంటిస్టులు అంటున్నారు. చంద్రుడు ఒకప్పుడు భూమికి ఇప్పటికంటే చాలా చాలా దగ్గరగా ఉండేవాడని ఇప్పటికే నిరూపితం కావడమే ఇందుకు రుజువని చెబుతున్నారు. ఉదాహరణకు చంద్రుడు ప్రస్తుతం భూమికి 2,38,855 మైళ్ల దూరంలో ఉన్నాడు. కానీ 320 కోట్ల ఏళ్ల కింద ఈ దూరం కేవలం 1,70,000 మైళ్లే ఉండేదని పలు అధ్యయనాల్లో తేలింది! ఢీకొంటున్న కృష్ణబిలాల జంటలు కృష్ణబిలం. అనంత శక్తికి ఆలవాలం. దాని ఆకర్షణ పరిధిలోకి వెళ్లిన ఏ వస్తువూ తప్పించుకోవడమంటూ ఉండదు. దానిలో కలిసి శాశ్వతంగా కనుమరుగైపోవాల్సిందే. అలాంటి రెండు అతి భారీ కృష్ణబిలాల జంటలు త్వరలో పరస్పరం ఢీకొననున్నాయట! వీటిలో ఒకటి భూమికి 76 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్133 అనే మరుగుజ్జు తారామండల సమూహంలో, మరొకటి 32 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని ఏ–బెల్1758ఎస్ అనే మరో మరుగుజ్జు గెలాక్సీలో ఉన్నాయి. నాసా తాలూకు చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ ఈ కృష్ణబిలాలను గుర్తించింది. అంతరిక్షంలో ఇలా భారీ కృష్ణబిలాలు ఢీకొట్టడానికి సంబంధించి మనకు నిదర్శనం లభించడం ఇదే తొలిసారి కానుంది. దీనిద్వారా తొలినాటి విశ్వంలో కృష్ణబిలాల వృద్ధి, మరుగుజ్జు గెలాక్సీల ఎదుగుదల తదితరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని నాసా భావిస్తోంది. ఆ రెండు మరుగుజ్జు గెలాక్సీల పరిమాణం 3 కోట్ల సూర్యుల సమష్టి ద్రవ్యరాశికి సమానం. అంటే మన పాలపుంత కంటే 20 రెట్లు తక్కువ! ఇలాంటి మరుగుజ్జు గెలాక్సీలు పరస్పరం కలిసిపోయి మనమిప్పుడు చూస్తున్న భారీ గెలాక్సీలుగా రూపొంది ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. శరవేగంగా విస్తరిస్తున్న తొలినాటి కృష్ణబిలం తొలినాటి విశ్వానికి చెందినదిగా భావిస్తున్న ఓ భారీ కృష్ణబిలాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ సైంటిస్టులు తాజాగా కనిపెట్టారు. ఇది ఊహాతీత వేగంతో విస్తరిస్తోందట. బహుశా అప్పట్లో అత్యంత భారీ కృష్ణబిలం ఇదే కావచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీన్ని లోతుగా పరిశోధిస్తే విశ్వావిర్భావపు తొలి నాళ్లలో భారీ నక్షత్ర మండలాలతో పాటు అతి భారీ కృష్ణ బిలాల ఆవిర్భావంపై మరిన్ని కీలక వివరాలు తెలిసే వీలుందని చెబుతున్నారు. ఈ కృష్ణ బిలం సీఓఎస్–87259గా పిలుస్తున్న ఓ గెలాక్సీ తాలూకు కేంద్ర స్థానంలో నెలకొని ఉంది. చిలీలోని అటకామా లార్జ్ మిల్లీమీటర్ అరే (ఏఎల్ఎంఏ) రేడియో అబ్జర్వేటరీ ద్వారా ఈ కృష్ణబిలం జాడ కనిపెట్టారు. ఇది మన పాలపుంత కంటే ఏకంగా వెయ్యి రెట్లు ఎక్కువ వేగంతో నక్షత్రాలకు జన్మనిస్తోందట! సూర్యుని వంటి వంద కోట్ల నక్షత్ర ద్రవ్యరాశులకు ఇది ఆలవాలమట. దీని తాలూకు ప్రకాశం వల్ల సీఓఎస్–87259 గెలాక్సీ అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగిపోతూ కనువిందు చేస్తోందట! ఈ అధ్యయన ఫలితాలను రాయల్ ఆస్ట్రనామికల్ సొసైటీ తాలూకు జర్నల్ మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జూమ్ ప్రెసిడెంట్‌కి షాక్ ఇచ్చిన కంపెనీ: కారణం లేకుండానే
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ ‘జూమ్’ కారణం లేకుండానే ప్రెసిడెంట్ Greg Tombను ఫైర్ చేసింది. సేల్స్ ఆపరేషన్స్, ఎర్నింగ్స్ కాల్స్‌లో కీరోల్ పోషించిన జార్జ్‌ను విధులు తొలగించడం చర్చాంశనీయంగా మారింది. మార్చి 03న జూమ్ తన రెగ్యులరేటరీ ఫైలింగ్‌లో జార్జ్‌కు సంస్థ తరుపు నుంచి అన్నీ ప్రయోజనాలకు కల్పిస్తూ ఎలాంటి కారణం లేకుండానే ఫైర్ చేస్తున్నట్లు పేర్కొంది. గత నెలలో జూమ్ కంపెనీ 15 శాతం వర్క్ ఫోర్స్‌తో 1,300 మందిని ఫైర్ చేసింది. వారిలో సీఈవో ఎరిక్ యువాన్ సైతం ఉన్నారు. గూగుల్ ఉద్యోగిగా విధులు నిర్వహించిన యువాన్ జూన్ 2022లో జూమ్‌లో చేరారు. వీడియో కాన్ఫరెన్స్ సర్వీసుల్లోని అవకాశాల్ని ఒడిసి పట్టుకొని సంస్థను లాభాలవైపు నడిపించారు. వందల కోట్ల స్టాక్ గ్రాంట్ అనూహ్యంగా పింక్ స్లిప్ జారీ చేసిన ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్కు 45 మిలియన్ల విలువైన కంపెనీ స్టాక్స్‌తో పాటు బేస్ శాలరీ 4లక్షల బిలియన్ డాలర్లు, గతేడాది జూన్ నెలలో కంపెనీ 8శాతం బోనస్‌గా ఇస్తున్నట్లు తన ఫైలింగ్‌లో పేర్కొంది. ఈ సందర్భంగా జూమ్ అధికార ప్రతినిధి శాన్ జోస్ మాట్లాడుతూ.. మాజీ ప్రెసిడెంట్ జార్జ్ టాంబ్ స్థానంలో మరో వ్యక్తిని నియమించుకుంటున్నట్లు తెలిపారు, కానీ జార్జ్‌ను ఎందుకు తొలగించారనేదాని మీద ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. -
మూలిగే నక్కపై తాటికాయ పడినట్టు.. మరింత దిగజారుతున్న పాక్ పరిస్థితి..
ఇస్లామాబాద్: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతుండగా.. ఇప్పుడు పరిశ్రమలు కూడా మూతపడుతున్నాయి. దీంతో వేల మంది ఉద్యోగాలు కోల్పోయే ముప్పు ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు దిగుమతి చేసుకోలేక పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే పాకిస్తాన్లో కర్యకలాపాలు నిలివేశాయి. సుజుకీ మోటార్ కార్పోరేషన్ మరికొన్ని రోజుల పాటు కార్యకలాపాలు నిలివేస్తున్నట్లు ప్రకటించింది. టైర్లు, ట్యూబ్‌లు తయారు చేసే ఘంధారా టైర్, రబ్బర్ కంపెనీ తమ ప్లాంట్‌ను మూసివేస్తున్నట్లు చెప్పింది. ముడిసరుకు దిగమతికి ఇబ్బందులు, వాణిజ్య బ్యాంకుల నుంచి కన్‌సైట్‌మెంట్ క్లియరెన్స్ పొందడానికి అడ్డంకులు ఎదురవుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ రెండు కంపెనీలు కేవలం ఉదాహరణలే. ఫర్టిలైజర్స్, స్టీల్, టెక్స్ట్టైల్స్ రంగాలకు చెందిన అనేక పరిశ్రమలు పాకిస్థాన్‌లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. పాకిస్తాన్ విదేశీ కరెన్సీ నిల్వలు 3.19 బిలియన్ డాలర్లే ఉండటంతో దిగుమతులకు నిధులు సమకూర్చలేకపోతుంది. నౌకాశ్రయాల్లో వేలాది కంటైనర్ల సరఫరా నిలిచిపోయింది. పరిశ్రమల ఉత్పత్తి ఆగిపోయింది. వేల మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. పరిశ్రమలు మూతపడితే నిరుద్యోగం పెరిగి ఆర్థిక వృద్ధిపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని పాక్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో పరిశ్రమలు మూతపడటం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. సుజుకీతో పాటు హోండా మోటార్, టొయోటా మోటార్ కూడా కొద్దివారాల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశాయి. దీంతో పాకిస్తాన్లో కార్ల సేల్స్ జనవరిలో 65శాతం పడిపోయాయి. ఆర్థిక సంక్షోభం వల్ల డిమాండ్ భారీగా తగ్గడమూ దీనికి మరో కారణం. చదవండి: లీటర్ పాలు రూ.250, కేజీ చికెన్ రూ.780.. పాకిస్తాన్ దివాళా తీసిందని ఒప్పుకున్న మంత్రి.. -
బ్రిటన్కేమైంది? ముసురుకుంటున్న మాంద్యం.. తీవ్ర ఆర్థిక సంక్షోభం!
యునైటెడ్ కింగ్డమ్. స్థిరత్వానికి మారుపేరు. ఎన్ని సంక్షోభాలు, ప్రపంచ యుద్ధాలు జరిగినా ఆర్థిక మూలాలు చెక్కు చెదరని దేశం. కానీ ఇప్పుడు ఆ దేశం కనీవినీ ఎరుగని గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. ఏడాదిలో ముగ్గురు ప్రధానమంత్రులు మారారు. అయినా బలహీనపడిపోతున్న ఆర్థిక వ్యవస్థని కాపాడే దిక్కు లేకుండా పోయింది. ధనిక దేశాల కంటే అన్నింట్లోనూ వెనుకబడిపోతూ మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటోంది. నానాటికీ పతనం... బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకి పతనమైపోతోంది. ధరాభారం ప్రజల జేబుల్ని గుల్ల చేస్తోంది. పెరుగుతున్న ధరలకి తగ్గట్టుగా ఆదాయాలు పెరగకపోవడంతో ప్రజలకి కొనుక్కొని తినే స్థోమత కూడా కరువు అవుతోంది.దీంతో సమాజంలోని వివిధ వర్గాలు వేతనాల పెంపు డిమాండ్‌తో సమ్మెకు దిగుతున్నాయి. ప్రపంచంలోని మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలు ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకుంటే బ్రిటన్ మరింత క్షీణిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) అంచనా వేస్తోంది. ఆర్థిక మాంద్యం ఎదుర్కోక తప్పదని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రతో చమురు లభ్యత చాలా దేశాలకు అతి పెద్ద సమస్యగా మారింది. అమెరికా తన సొంత గడ్డపై లభించే శిలాజ ఇంధనాలపై ఆధారపడితే, ఫ్రాన్స్ అణు విద్యుత్‌పైనా, నార్వే జలవిద్యుత్‌పైన ఆధారపడ్డాయి. యూకే గ్యాస్‌పైనే ఆధారపడే దేశం కావడంతో విద్యుత్ బిల్లులు తడిసిపోపెడైపోయాయి. ఒకానొక దశలో 100% పెరిగాయి. దేశం ఆర్థికంగా కుదేలు కావడానికి ఇంధనం అసలు సిసలు కారణమని ఫిస్కల్ స్టడీస్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ కార్ల్ ఎమ్మర్సన్ అభిప్రాయపడ్డారు. జీ–7 దేశాల్లో వెనక్కి అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాల కంటే బ్రిటన్ ఎందుకు వెనుకబడిందనే చర్చ జరుగుతోంది. కరోనా మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రపంచ ఆర్థిక వ్యవస్థలనే ఛిన్నాభిన్నం చేశాయి. కరోనా విసిరిన సవాళ్ల నుంచి కోలుకునే దశలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన యుద్ధం పులి మీద పుట్రలా మారింది. అన్నింటిని తట్టుకొని ధనిక దేశాలు మళ్లీ పూర్వ స్థితికి వస్తూ ఉంటే బ్రిటన్ మాత్రం కోలుకోలేకపోతోంది. ఇందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. రాజకీయాలు, వాతావరణ పరిస్థితులు వంటివి కూడా ప్రభావం చూపిస్తాయి. ఇతర దేశాలు విద్య, ఆరోగ్య రంగం ఆధారంగా పరిస్థితుల్ని అంచనా వేస్తే బ్రిటన్ మాత్రం సేవల ఆధారంగా నిర్ణయిస్తుంది. జీ–7 దేశాలన్నీ ఈ ఏడాది కోలుకుంటాయని ఐఎంఎఫ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. కానీ బ్రిటన్ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. డాలర్‌తో పౌండ్ విలువ : 0.83 బ్రిటన్ జీడీపీ వృద్ధి రేటు అంచనా: 0.6% ద్రవ్యోల్బణం : 10.1% బ్రెగ్జిట్ దెబ్బ... ప్రపంచదేశాలు కరోనా, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాలను ఎదుర్కొంటే బ్రిటన్ ఆర్థిక సమస్యలకు బ్రెగ్జిట్ అదనపు కారణంగా నిలిచింది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ దేశానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. బ్రెగ్జిట్ కారణంగా యూకే ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి ఏకంగా 10 వేల కోట్ల పౌండ్ల నష్టం వాటిల్లుతోందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. దీర్ఘకాలంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 4 శాతానికి తగ్గుతుందని తెలిపింది. 2021 జనవరి నుంచి బ్రిటన్ నుంచి ఈయూకు ఎగుమతులు 16% పడిపోయాయి. ఈయూ నుంచి వచ్చే పెట్టుబడులు 2,900 కోట్ల పౌండ్లు తగ్గిపోయాయి. శ్రామికులు కావలెను... బ్రెగ్జిట్ ముందు వరకు ఈయూ నుంచి బ్రిటన్‌కి స్వేచ్ఛగా పని చేయడానికి వచ్చేవారు. ఇప్పుడు వర్కర్లు రావడం మానేశారు. ఫలితంగా ఆతిథ్యం, వ్యవసాయం, సేవా రంగాల్లో సిబ్బంది కొరత ఏర్పడింది. యువత పని చేయడం కంటే ఉన్నత చదువులపై దృష్టి పెడుతూ ఉంటే, వయసు మీద పడ్డ వారు ముందస్తుగా పదవీ విరమణ చేస్తున్నారు. అత్యధికులు రోగాల పాలై ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారే తప్ప పని చేసే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తోంది. ఇవన్నీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నిర్దాక్షిణ్యంగా ఉద్యోగుల తొలగింపు.. ఐటీ రంగంలో వీళ్లకి తిరుగులేదు!
ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు తక్కువ స్థాయిలో ఉండనున్నట్లు పలు సర్వేలు వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ ఆ రంగానికి చెందిన సీనియర్ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోతుందన్న భయాలు నెలకొన్న తరుణంలో చిన్న చిన్న కంపెనీల నుంచి బడా కంపెనీల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. దీంతో మిగిలిన రంగాల పరిస్థితులు ఎలా ఉన్న టెక్నాలజీ రంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల్లో ఈ లేఆఫ్స్ భయాలు ఎక్కువగా ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ప్రముఖ దేశీయ ఎంప్లాయిమెంట్ సంస్థ నౌకరీ.. 1400 మంది రిక్రూట్లు, జాబ్ కన్సల్టెన్సీలతో సర్వే నిర్వహించింది. ఆ అధ్యయనంలో 20 శాతం మంది రిక్రూటర్లు సీనియర్ ఉద్యోగుల తొలగింపులు ఎక్కువగా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఫ్రెషర్ల నియామకం ముమ్మరంగా కొనసాగనుందని, లేఆఫ్స్ .. ఫ్రెషర్ల రిక్రూట్ మెంట్‌పై తక్కువ ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఐటీ రంగంలో 6 నెలలు పాటు అట్రిషన్ రేటు అధికంగా 15 శాతం ఉండనుందని, అదే సమయంలో గ్లోబుల్ మార్కెట్లో అనిశ్చితులు నెలకొన్నప్పటికీ కొత్త రిక్రూట్మెంట్ భారీగా ఉంటుదని రిక్రూటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అధ్యయనంలో పాల్గొన్న సగం మందికి పైగా 29 శాతంతో కొత్త ఉద్యోగాల రూపకల్పనలో నిమగ్నం కాగా.. 17 శాతం ఉద్యోగులు సంఖ్యను అలాగే కొనసాగించాలని భావిస్తున్నారు. 2023 మొదటి అర్ధభాగంలో (6 నెలలు) నియామక కార్యకలాపాలపై ఆశాజనకంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నందున .. భారతీయ ఉద్యోగులు గణనీయమైన ఇంక్రిమెంట్లను పొందవచ్చని అంచనా. సర్వే చేసిన మొత్తం రిక్రూటర్లలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ మంది సగటు పెరుగుదలను 20 శాతానికి పైగా అంచనా వేస్తున్నారు. ప్రపంచ స్థాయిలో నియామకాల ట్రెండ్లపై ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా క్యాంపస్ సెలక్షన్లు ఎక్కువ జరుగుతాయని సమాచారం. -
ఫోర్డ్లో వేలాది మంది ఉద్యోగుల తొలగింపు
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా జర్మనీలో 2,300 మందిని, యూకేలో 200 మందిని తొలగిస్తున్నట్లు ఫోర్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోర్డ్ భవిష్యత్ ప్రణాళికల్ని వివరించింది. 2035 నాటికల్లా యూరప్ అంతటా ఈవీ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక కొనుగోలు దారులు ఈవీ కార్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్న తరుణంలో ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల అవసరం తక్కువ ఉంటుందని భావిస్తుంది. యూరప్‌లో 3,400 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండగా.. 2025 నాటికి వారిలో 2,800 మంది ఇంజనీర్లకు పింక్ స్లిప్‌లు జారీ చేయనుంది. ఇక మిగిలిన 1000 మందిని అడ్మినిస్ట్రేటీవ్ విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఇది అంత్యత కఠినమైన నిర్ణయం. మా టీం సభ్యుల మధ్య ఈ తొలగింపులతో అనిశ్చితి నెలకొంది. తొలగించిన ఉద్యోగులకు మా మద్దతు ఉంటుందని యూరప్ ఫోర్డ్ ఈ మోడల్ జనరల్ మేనేజర్ మార్టిన్ సుందర్ అన్నారు. -
జాబ్ పోయిందనే సంతోషంలో ఉద్యోగులు..బ్లూమ్ బర్గ్ సంచలన సర్వే!
ఉద్యోగుల్లో రోజు రోజుకీ అసహనం పెరిగి పోతుంది. ఒకరి లక్ష్యం కోసం మనమెందుకు పనిచేయాలి’అని అనుకున్నారో.. ఏమో! ఆర్ధిక మాంద్యం భయాలతో సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పుడా తొలగింపులతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పీడా విరగడైందని తెగ సంబరపడిపోతున్నారు. సాధారణంగా ఒక సంస్థ విధుల నుంచి తొలగించిందంటే సదరు ఉద్యోగి కెరియర్లో ఆటుపోట్లు ఎదురైనట్లే. 1969 జనవరి నుంచి ప్రస్తుతం ఈరోజు వరకు ఎన్నడూ లేనంతగా జాబ్ మార్కెట్లో నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. కానీ వాల్ స్ట్రీట్ నుంచి సిలికాన్ వ్యాలీ టెక్ సంస్థల వరకు ఉద్యోగులు ఉపాధి కోల్పోయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలనుంచి తప్పుకున్నందుకు సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతూనే.. కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా లాస్ ఎంజెల్స్‌లో ఈ-స్పోర్ట్స్ కంపెనీలో సోషల్ మీడియా ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న బోబిన్ సింగ్‌ను ఇంటికి సాగనంపింది సదరు యాజమాన్యం. దీంతో హమ్మాయ్యా... ఇకపై టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియోల కోసం ఫ్రీల్సాన్ వీడియో ఎడిటింగ్ వర్క్ చేసుకోవచ్చు. నా న్యూఇయర్ రెసొల్యూషన్ ఇదే. తక్కువ పని.. నచ్చిన రంగంపై దృష్టిసారిస్తా’ అని అంటోంది. ఈ తరహా ధోరణి జెన్ జెడ్ కేటగిరి ఉద్యోగుల్లో 20 శాతం, 15 శాతం మంది మిలీనియల్స్ ఉన్నట్లు బ్లూమ్ బర్గ్ నిర్వహించిన సర్వేలో తేలింది. జనవరి 18న జార్జియాకు చెందిన 43 ఏళ్ల రిక్రూటర్‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి తొలగించింది. లేఆఫ్స్ గురించి తెలిసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించింది. చివరికి ఓ కంపెనీలు జాబ్ దొరికింది. ‘నా ఉద్యోగం పోయిందని తెలిసే సమయానికి నన్న తొలగించినందుకు సంతోషించాను. ఎందుకంటే నేను చేరబోయే కొత్త కంపెనీలో ఉద్యోగం నాకు సంతృప్తినిస్తుందని అనిపించింది. నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన 47 ఏళ్ల కేసీ క్లెమెంట్‌ను గతేడాది జూలైలో గేమ్‌స్టాప్ సంస్థ అతన్ని ఫైర్ చేసింది. తొలగింపులతో ‘తొలగింపులు నా ఆలోచన ధోరణిని మార్చేశాయి. విభిన్న కోణాలను చూసేందుకు, అవకాశాలను సృష్టించుకోవడానికి సహాయ పడింది అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడం..తన రంగంలో ఎక్స్పీరియన్స్ కారణంగా వరుసగా ఏడు కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి. ఇలా లేఆఫ్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల గురించి.. తొలగింపులు గతంలో కంటే భవిష్యత్‌లో వారి కెరియర్ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు. ఉద్యోగులు సైతం ఇదే తరహా ఆలోచిస్తున్నారంటూ బ్లూమ్ బర్గ్ సర్వేలో తెలిపింది. -
ఆమెను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోదీ
బెంగళూరు యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ అనే నినాదంతో ఐదురోజుల పాటు ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా అన్నీ రంగాలకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వారిలో లే ఆఫ్ ఐటీ ఉద్యోగి, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యో శ్రద్దా జైన్ ఉన్నారు. మోదీ తనని చూసి ‘అయ్యో’ అని పిలిచారని అన్నారు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా.మోదీకి కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో తెగ చక్కెర్లు కొడుతున్నారు. ఇంతకీ ఈ శ్రద్దా జైన్ ఎవరు? మోదీ ఆమెను చూసి అయ్యో అని ఎందుకు పిలిచారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. (ఇదీ చదవండి: Mass Layoffs "ఓన్లీ ప్యాకేజ్, నో బ్యాగేజీ" ఉద్యోగ కోతలపై మామూలు చురకలు కాదు! వైరల్ వీడియో) ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది ఐటీ ఉద్యోగి అంటే లగ్జరీ లైఫ్. కావాల్సినంత జీతంతో కోరుకున్న జీవితం. సమాజంలో వారికంటూ ఓ స్టేటస్. అందుకే కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఐటీ ఉద్యోగమంటే ఓ క్రేజ్. అయితే, అన్ని రోజులూ ఒకేలా ఉండవు కదా! నిన్న మొన్నటి వరకు రెండు చేతులా సంపాదించిన ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది. లాభాలు లేవనే కారణంతో.. మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీలైన గూగుల్ మైక్రోసాఫ్ట్, అమెజాన్,ట్విటర్, మెటా నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. ఆ తొలగింపుల్ని ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. శాలరీలు ఎక్కువ ఇస్తుంటే తగ్గించి ఉద్యోగుల్ని కొనసాగించవచ్చు కదా అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఉన్న ఉద్యోగం ఊడింది. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన పెన్నులు, మగ్గులు, మాస్కులు తప్ప ఇంక ఏం మిగల్లేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ అలా ఉద్యోగం కోల్పోయిన వారిలో శ్రద్దాజైన్ ఒకరు. నెటిజన్లకు అయ్యో శ్రద్దా జైన్‌గా సుపరిచితురాలైన ఆమె..ఉద్యోగుల తొలగింపులపై ఐటీ కంపెనీలపై వ్యంగ్యంగా సెటైర్లు వేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓన్లీ ప్యాకేజీ.. నో బ్యాగేజీ అంటూ చేసిన ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోను 20లక్షల మందికిపైగా వీక్షించారు. ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్షా గోయెంకా సైతం ఆ వీడియోను షేర్ చేశారు. తాజాగా, శ్రద్దా జైన్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ తనని ‘అయ్యో’ అని పిలవడాన్ని సంతోషం వ్యక్తం చేస్తూ నెటిజన్లతో పంచుకుంది. అయ్యో శ్రద్దా జైన్ తమిళులు అయ్యో అనే పదాన్ని ఎక్కువగా వినియోగిస్తుంటారు. ప్రతికూల పరిస్థితులు. లేదంటే ఏదైనా నష్టం, దుఃఖం, నిస్సహాయతను ఎదుటి వారితో వ్యక్తం చేసే సమయంలో ఆ పదాన్ని ఎక్కువగా చేర్చుతుంటారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్ శ్రద్దా జైన్ ప్రస్తుత సమాజంలో అన్నీ అంశాలపై స్పందిస్తూ వీడియోలు చేస్తున్నారు. ఆ వీడియోల్లో ఎక్కువగా అయ్యో అనే పదం వాడుతుండటం. ఆమె పేరు ముందు అయ్యో అనే పదం నిక్ నేమ్‌గా మారింది. A laid off techie….this is so funny @AiyyoShraddha pic.twitter.com/uIlVwHeX21 — Harsh Goenka (@hvgoenka) January 30, 2023 -
340 కంపెనీల్లో లక్షమందికి పైగా ఉద్యోగుల తొలగింపు...తాజాగా మెటాలో
ఫేస్బుక్ మాతృసంస్థ మెటా గత ఏడాది నవంబరులో 13శాతంతో 11,000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. తాజాగా మరికొంత మందిని తొలగించే యోచనలో ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. గత కొన్ని వారాలుగా విభాగాలకు కేటాయించే బడ్జెట్‌తో పాటు, హెడ్ కౌంట్ విషయంలో అస్పష్టత నెలకొందంటూ మెటాకు చెందిన ఇద్దరు ఉద్యోగులు చెప్పినట్లు తెలిపింది. ఇదే అంశంపై మెటా ఇప్పటి వరకు స్పందించలేదు. కొద్దిరోజుల క్రితం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ టీం లీడర్లు, డైరెక్టర్లను తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ఈ ఏడాదిని సమర్ధత కనబరిచే సంవత్సరంగా (year of efficiency) అభివర్ణించిన జుకర్ బర్గ్... పైన పేర్కొన్నట్లుగా ఉన్నత స్థాయి ఉద్యోగులు వర్క్ విషయంలో వ్యక్తి గతంగా శ్రద్ద వహించాలని లేదంటే సంస్థను వదిలి వెళ్లిపోవచ్చని అన్నారు. దీంతో పాటు పనితీరు తక్కువగా ఉన్న ప్రాజెక్టులను షట్‌డౌన్ చేయడంతో పాటు ఆ ప్రాజెక్ట్‌లలో లీమ్ లీడర్లుగా విధులు నిర్వహిస్తున్న వారిని తొలగించేందుకు సన్నద్దమైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది గడ్డు కాలమే గత ఏడాది సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందించిన విషయం తెలిసింది. ఆ కోతలు ఈ ఏడాదిలో సైతం కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 340 కంపెనీలు లక్షకు పైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్లు అంచనా. ఇటీవలే టిక్‌టాక్ ఇండియా భారత్‌లోని తమ ఉద్యోగులందరినీ తొలగించింది. యాహూ 1,600 మందిని, డెల్ 6,500 మందిని ఇంటికి సాగనంపాయి. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు కలిపి దాదాపు రూ.50,000 మందిని తొలగించాయి. -
ఐటీ దెబ్బ.. భారత్‌లో పరిస్థితి ఏంటి?
అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. పెద్ద ఐటీ, టెక్ కంపెనీల్లో వేలాదిమందికి అకస్మాత్తుగా ఉద్వాసన పలికారు. అదే భారతీయ కంపెనీల్లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇతరులతో పోలిస్తే మన కంపెనీలు కొంచెం మెరుగ్గా ఉండటం కారణం కావచ్చు. కానీ ఒక్క విషయమైతే స్పష్టం. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా... భారతీయ కంపెనీలు చేస్తున్న పనుల్లోనే కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒకరు సృజనాత్మక సృష్టి చేసేవారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారు. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఆల్ఫాబెట్ (గూగుల్), అమెజాన్, మెటా (ఫేస్బుక్), మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, ఆపిల్ వంటి దిగ్గజ కంపెనీలు గడచిన కొన్ని నెలల్లో ఒక్కొక్కటీ పదివేల కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. ప్రపంచం మొత్తమ్మీద ఈ లేఆఫ్‌లు పెద్ద ప్రకంపనలే సృష్టించాయి. మరోవైపు భారతీయ ఐటీ దిగ్గజాలు మాత్రం కొత్త ఉద్యోగులను తీసుకునే వేగాన్ని తగ్గించడం ద్వారా పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశాయి. ఇదే సమయంలో అమెరికన్ టెక్ కంపెనీల లేఆఫ్‌ల కారణంగా భారతీయ కంపెనీల్లో ‘అట్రి షన్ ’ (ఉద్యోగులు బయటికి వెళ్లిపోవడం) కూడా తగ్గింది. కరోనా మొదలైన సమయంలో ఈ అట్రిషన్ ప్రమాదకర స్థాయికి చేరు కున్న విషయం తెలిసిందే. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి భారీ భారతీయ కంపెనీలు ఐటీ సర్వీసుల రంగంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఉత్పత్తుల ఆధారిత కంపెనీలూ కొన్ని ఉన్నా వీటిల్లో అత్యధికం ఈమధ్య కాలంలో మొదలైనవనే చెప్పాలి. ఒక రకంగా స్టార్టప్‌ల లాంటివన్నమాట. కరోనా ఉధృతి దిగివస్తున్న క్రమంలో అటు స్టార్టప్‌లు, ఇటు పెద్ద టెక్ కంపెనీలు తీవ్ర సమస్యలు ఎదుర్కొ న్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉందన్న వార్తలు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచడం ఈ రెండు వర్గాల వారికి గోరుచుట్టుపై రోకటి పోటు చందమైంది. దీంతో ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులకు లేఆఫ్‌లు ఇవ్వడం మొదలైంది. వ్యాపారం తగ్గిపోవడం, పెట్టుబడులు వచ్చే అవకాశాలు సన్నగిల్లడంతో లాభా లను కాపాడుకునేందుకు ఈ చర్యలు అనివార్యమయ్యాయి. మారిన అంచనాలు.. పరిస్థితులు బాగున్న కాలంలో టెక్ కంపెనీల్లో వృద్ధి బాగా నమోదైంది. ఫలితంగా ఆయా కంపెనీలు క్లౌడ్ సర్వీసులు, కృత్రిమ మేధ వంటి రంగాల్లో వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు అంచనాలు మారిపోవడంతో మళ్లీ గతంలో మాదిరిగా పనులు చేసే ప్రయత్నం జరుగుతోంది. సరుకుల రవా ణాకు డ్రోన్ల వాడకం మొదలుకొని, గాలి బుడగల ద్వారా మూల మూలకూ ఇంటర్నెట్ అందించడం వంటి పలు ప్రాజెక్టులు అప్పట్లో గొప్ప ఆవిష్కరణలుగా అనిపించాయి, కానీ ఇప్పుడు అవి పెద్దగా పట్టించుకోని స్థితికి చేరాయి. సిలికాన్ వ్యాలీ కేంద్రబిందువు అని చెప్పుకునే శాన్ఫ్రాన్సిస్కో ప్రాంతంలోనే గత ఏడాది 80 వేల ఉద్యో గాలకు కోత పడిందంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే అర్థమవుతుంది. పెద్ద కంపెనీల్లో ఆపిల్, అమెజాన్ ఇప్పటికీ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. కాకపోతే గతం కంటే తక్కువగా. ఈ కంపెనీలిప్పుడు ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా ఇదే పనిలో ఉంది. ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 2023 ఏడాది తన సామర్థ్యం పెంచుకునే సంవత్సరమని ప్రకటించింది. నిర్ణయాలు వేగంగా తీసుకునేందుకు గానూ కంపెనీ నిర్మాణంలోని మధ్య పొరలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. భారత్‌లో పరిస్థితి ఏమిటి? భారత్‌లో సిలికాన్ వ్యాలీ కేంద్రంగా బెంగళూరును చెప్పుకోవచ్చు. గత మూడు నెలల్లో అతిపెద్ద ఐటీ కంపెనీలు ఏడింటిలో సుమారు ఐదు వేల మందికి ఉద్వాసన పలికారు. ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 2022 చివరినాటికి మునుపటి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు (నియామకాల నుంచి లేఆఫ్‌లు తీసేయగా) ఉండగా... టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ట్రీల్లో మాత్రం ఉద్యోగుల సంఖ్య తగ్గింది. ఈ ఏడు కంపెనీలు కూడా కొత్త కొత్త ప్రాజెక్టులు సంపాదించుకుంటున్నాయి. కానీ నైపుణ్యానికి చెల్లిస్తున్న మొత్తాలను నియంత్రించుకుంటూ, లాభాలను గరిష్ఠ స్థాయిలో ఉంచే ప్రయత్నం జరుగుతోంది. కరోనా వచ్చిన తొలి నాళ్లతో పోలిస్తే ఈ వైఖరి పూర్తిగా భిన్నం. అట్రిషన్ నియంత్రణకు, వ్యాపారాన్ని కాపాడుకునేందుకు అప్పట్లో కొత్త ఉద్యోగుల నియామ కాలు ఎడాపెడా జరిగాయి. పోటీ కంపెనీలు ఉద్యోగులను ఎగరేసుకు పోతే కొండంత ఆర్డర్లను సకాలంలో పూర్తి చేయలేమన్న ఆలోచనతో అప్పట్లో అలా జరిగింది. నైపుణ్యమున్న ఉద్యోగులకు, ఇండస్ట్రీ అవసరాలకు మధ్య అంతరం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది. ఈ తేడా ఈ ఏడాది పది శాతం వరకూ ఉంటుందని అంచనా. ఈ ఏడాది రెండో సగంలో ఉద్యో గుల నియామకాలూ పూర్వస్థితికి చేరుకుంటాయని కంపెనీలు ఆశా భావంతో ఉన్నాయి. తేడాకు కారణాలివీ... ఉద్యోగుల నియామకాలు, ఉద్వాసనల విషయంలో అమెరికా, భారతీయ కంపెనీల మధ్య కనిపిస్తున్న స్పష్టమైన తేడాకు కారణా లేమిటో చూద్దాం. కరోనా ప్రపంచాన్ని చుట్టేసిన సందర్భంలో కంపెనీలన్నీ డిజిటల్ మార్గం పట్టే ప్రయత్నం మొదలుపెట్టాయి. క్లౌడ్ సర్వీసులకు ప్రాధాన్యమేర్పడింది. అందివచ్చిన కొత్త అవ కాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ప్రతి కంపెనీ ఆశిం చింది. కోవిడ్ కారణంగా ఇంటికే పరిమితమైపోయి... అట్టడుగు వర్గాల నుంచి కూడా టెక్నాలజీ కోసం డిమాండ్ ఏర్పడటంతో కంపెనీలు కూడా తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చింది. టెక్నాలజీ సర్వీసులకు విపరీతమైన డిమాండ్ రావడంతో నియా మకాలు జోరందుకున్నాయి. దీని ఫలితంగా ఆట్రిషన్ సమస్య పుట్టుకురావడం, ఆ క్రమంలోనే ఉద్యోగుల వేతన ఖర్చులు పెర గడం జరిగిపోయింది. రెండేళ్ల తరువాత కోవిడ్ తగ్గుముఖం పట్టడం మొదలైంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచేశాయి. దీంతో మాంద్యం వచ్చేస్తుందన్న ఆందోళన మొదలైంది. చేతిలో ఉన్న నగదును కాపాడు కునే ప్రయత్నాల్లో భాగంగా కంపెనీలు టెక్నాలజీ రంగానికి కేటాయించిన నిధులకు కోత పెట్టాయి. ఇదే సమయంలో డిజిటల్ టెక్నాల జీలకు డిమాండ్ కూడా తగ్గిపోవడంతో వీటిని అభివృద్ధి చేసే కంపె నీలు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిస్థితుల్లో ఒక్క విషయమైతే స్పష్టం. భారతీయ సాఫ్ట్వేర్ దిగ్గజాలు పాశ్చాత్య కంపెనీల మాదిరిగా పూర్తిగా సృజ నాత్మక ఆలోచనలకు బదులు ముందుగానే నిర్ణయించిన పనులు చేయడంలోనే నిమగ్నమయ్యాయి. అమెరికా కంపెనీల మాదిరిగా సోషల్ మీడియా సృష్టించిందనుకున్న కొత్త ప్రపంచాన్ని అందుకునే ప్రయత్నాల్లో పడకుండా, భారతీయ కంపెనీలు చేసే పనుల్లోనే కొత్త కొత్త మార్గాలను అన్వేషించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే– ఒకరు సృజనాత్మక సృష్టి చేసే వారైతే, ఇంకొకరు వాటిని అమలు చేసేవారన్నమాట. వ్యాపార పరిస్థితుల్లో వేగంగా వచ్చిన మార్పుల ప్రభావం అమలు చేసేవారిపై పెద్దగా పడలేదు. ఈ తేడా కారణంగానే భారతీయ కంపెనీల్లో పెద్ద స్థాయిలో లేఆఫ్‌లు లేకుండా పోయాయి. మంచి హోదా, వేతనం కోసం యువత ఇప్పుడు పెద్ద టెక్ కంపెనీ స్టార్టప్‌ల వైపు చూడాలి. ఓ మోస్తరు వేతనంతో స్థిరంగా ఉండాలని అనుకుంటే మాత్రం అమలు చేసేవారి వద్ద పనిచేయడం మేలు. అదన్న మాట అమెరికా, భారత కంపెనీల మధ్య తేడా! వ్యాసకర్త సీనియర్ ఆర్థిక విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపులు
ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశాయి. ఆ తొలగింపులు ఎంత దూరం, ఎంత మేరకు ఉద్యోగులపై ప్రభావం చూపుతాయనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ ఏడాది జనవరిలో మైక్రో సాఫ్ట్ 10 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్న ప్రకటించింది. తాజాగా ఆ ప్రకటనకు అనుగుణంగా లే ఆఫ్స్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం.. అమెరికాలోని మైక్రోసాఫ్ట్ రెడ్ మాండ్ క్యాంపస్‌కు చెందిన హోలోలెన్స్, సర్ఫేస్,ఎక్స్ బాస్ డివిజన్లలో విధులు నిర్వహిస్తున్న 617 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ నివేదిక తెలిపింది. ఇప్పటికే తమకు టెర్మినేషన్ లెటర్లు అందినట్లు లేఆఫ్స్ ఉద్యోగులు లింక్డిఇన్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. ప్రశ్నార్ధకంగా హోలోలెన్స్ ఉద్యోగులు భవిష్యత్ హోలో లెన్స్ అంతటా ఉద్యోగుల తొలగింపులు 3వ తరం హోలో లెన్స్ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ల భవిష్యత్తు గురించి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని నివేదిక హైలైట్ చేస్తుంది. జనవరిలో యూఎస్ ప్రభుత్వం 400 మిలియన్ల ఖరీదైన 6,900 హోలోలెన్స్ గాగుల్స్‌ను కొనుగోలు చేయాలంటూ ఆర్మీ చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. ఈ తరుణంలో సంస్థ తొలగింపులతో ఆయా విభాగాల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
YahooLayoffs ఉద్యోగులకు చేదువార్త చెప్పిన టెక్ కంపెనీ
సాక్షిముంబై: టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత అప్రతిహతంగా కొనసాగుతోంది. అధిక ద్రవ్యోల్బణం, గ్లోబల్ మాంద్యం భయాలు, వ్యయాల నిర్వహణలో భాగంగా వేలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకు తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన టెక్ కంపెనీ యాహూ ఉద్యోగాల కోతను ప్రకటించింది. తన యాడ్ టెక్ యూనిట్ ప్రధాన పునర్నిర్మాణంలో భాగంగా తన మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 20శాతం కంటే ఎక్కువ మందిని తొలగించాలని యోచిస్తోంది. ఈ మేరకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను ఉటంకిస్తూ ఆక్సియోస్ గురువారం నివేదించింది. ఈ నివేదిక ప్రకారం, యాహూ యాడ్ టెక్ ఉద్యోగులలో 50శాతం కంటే ఎక్కువ మందిపై కోతలు ప్రభావం చూపుతాయి. అంటే 1600 కంటే ఎక్కువ మంది ఉద్యోగాలను కోల్పోనున్నారని సమాచారం. -
ఆర్ధిక మాంద్యం గుప్పిట్లో ఈకామర్స్.. వందల మందిని ఫైర్ చేసిన ఈబే
ప్రపంచ దేశాల్లో ఆయా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే గ్లోబల్‌గా 4 శాతం వర్క్ ఫోర్స్‌తో భాగమైన సుమారు 500 మందిని విధుల నుంచి తొలగించింది. ఈ సందర్భంగా ఈబే సీఈవో జామీ ఇయనోన్ లేఆఫ్స్ ధృవీకరిస్తూ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపారు. తన కస్టమర్లకు మెరుగైన ఎండ్-టు-ఎండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు, ప్లాట్‌ఫారమ్‌లో మరిన్ని ఇన్నోవేషన్స్, కంపెనీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యల్లో ఈ లేఫ్స్ భాగమని ఇయనోన్ చెప్పారు. ఈ మార్పు అధిక పెట్టుబడులు పెట్టేందుకు, భవిష్యత్‌లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహద పడుతుంది. కొత్త టెక్నాలజీలు, కస్టమర్ ఇన్నోవేషన్లు, మారుతున్న మ్యాక్రో,ఇ-కామర్స్, టెక్నాలజీ రంగాలకు అనుగుణంగా కంపెనీ కార్యకలాపాల్ని కొనసాగించేలా ప్రభావవంతంగా, మరింత వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఫైలింగ్ నోట్లో పేర్కొన్నారు. -
భారత్‌లో డిమాండ్ ఉన్న జాబ్స్ స్కిల్స్ ఇవే
ప్రపంచ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోవడం, ప్రజల ఆర్జన శక్తి తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాలు తగ్గిపోయే పరిస్థితులు ఎదుర్కొనబోతున్న నేపథ్యంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమల నుంచి బడాబడా టెక్ కంపెనీల వరకు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. అయితే జాబ్ మార్కెట్ ఎక్కువగా ఉండే దేశాలతో పాటు భారత్ వంటి దేశాల్లో కొత్త ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికలకు కొనసాగింపుగా.. భారత్‌లో ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్‌కు బుధవారం నాటికి 56 శాతం వృద్దితో 100 మిలియన్ల మంది యూజర్లను దాటినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. దీంతో మైక్రోసాఫ్ట్‌కు చెందిన లింక్డ్ ఇన్ గ్లోబల్ ఎక్కువ మంది యూజర్లు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఇక భారత్‌కు చెందిన యూజర్లు లింక్డ్ ఇన్‌లో ఎక్కువగా సాఫ్ట్వేర్ & ఐటీ, మ్యానిఫ్యాక్చరింగ్, కార్పొరేట్ సర్వీస్,ఫైనాన్స్, ఎడ్యూకేషన్ రంగాలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. నేర్చుకునేందుకు 4.6 మిలియన్ల గంటలు 2022లో లింక్డ్ ఇన్‌లో భారత్‌కు చెందిన యూజర్లు ఎక్కువగా నేర్చుకునేందుకు సమయం వెచ్చించారు. యూఎస్ యూజర్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా భారత్ యూజర్లు లెర్నింగ్ కోసమే 4.6 మిలియన్ గంటలు వెచ్చించారు. టాప్ 10 స్కిల్స్ ఇవే మనదేశంలో డిమాండ్ ఉన్న టాప్ 10 స్కిల్స్ జాబితాలో మేనేజ్మెంట్ (1వ స్థానం), కమ్యూనికేషన్ (4),సేల్స్ (10), సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (2), ఎస్‌క్యూఎల్ (3), జావా (5), లీడర్షిప్ (6), అనటికల్ స్కిల్స్ (8)ఈ జాబితాలో ఉన్నాయి. -
లేఆఫ్ బాటలో ‘పేపాల్’.. 2వేల మంది ఉద్యోగుల తొలగింపు!
టెక్ కంపెనీల్లో లేఆఫ్‌ల పరంపర కొనసాగుతోంది. వేలాదిగా ఉద్యోగులను వదిలించుకుంటున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీల బాటలో ప్రముఖ ఆన్లైన్ చెల్లింపుల వేదిక ‘పేపాల్’ పయనిస్తోంది. మందగించిన ఆర్థిక పరిస్థితులను సాకుగా చూపుతూ దాదాపు 2వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. 2వేల మందిని లేదా మొత్తం ఉద్యోగుల్లో 7 శాతం మందిని తొలగించనున్నట్లు కంపెనీ యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. స్థూల ఆర్థిక పరిస్థితుల్లో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ డ్యాన్ షుల్మన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యయాన్ని తగ్గించుకుని ప్రధాన లక్ష్యాల సాధనపై మరింత దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పేపాల్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 429 మిలియన్ మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఎక్కువ మంది యూక్టివ్ యూజర్లు గల కంపెనీల జాబితాలో 5వ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నేపథ్యంలో పేపాల్ సంస్థ గత నవంబర్‌లో తమ కంపెనీ రెవెన్యూ వృద్ధి అంచనాను తగ్గించుకుంది. కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపర 12వేల మందిని తొలగిస్తున్నట్లు గూగుల్ గత నెలలోనే ప్రకటించింది. అదే బాటలో మైక్రోసాఫ్ట్ 10వేల మందిని, సేల్స్ ఫోర్స్ 7వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశీయ మ్యూజిక్ స్ట్రీమింగ్ కంపెనీ స్పోటిఫై దాదాపు 10వేల మందిని తొలగిస్తున్నట్లు గత వారమే వెల్లడించింది. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
ఆర్ధిక మాద్యం దెబ్బ..భారత్‌లో భారీగా పెరిగిపోతున్న ఉద్యోగుల తొలగింపు
వరల్డ్ వైడ్‌గా లక్షలాది కంపెనీలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో దేశీయ స్టార్టప్ కంపెనీలు పయనిస్తున్నాయి. ఇప్పటి వరకు 3-4 నెలలో వేలాది మంది వర్క్ ఫోర్స్‌కు పింక్ స్లిప్‌లు జారీ చేశారు. యూనికార్న్‌లతో సహా 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు 21వేల మంది అంతకంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపినట్లు తెలుస్తోంది. ఓలా, ఎంపీల్, ఇన్నోవాకర్, అనాకాడెమీ, వేదాంతు, కార్స్24,ఓయో, మీషో, ఉడాన్ వంటి మరెన్నో కంపెనీలు ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. ఇప్పటి వరకు 16 ఎడ్యూటెక్ స్టార్టప్‌లు 8,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. జనవరి ప్రారంభంతో ఇప్పటికే దేశంలోని 16కి పైగా స్వదేశీ స్టార్టప్‌లు ఉద్యోగులను తొలగించాయి. సోషల్ మీడియా సంస్థ షేర్ చాట్ (మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్) అనిశ్చిత మార్కెట్ పరిస్థితుల కారణంగా 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఉద్యోగుల తొలగింపు కంపెనీలో దాదాపు 500 మందిపై ప్రభావం చూపింది ఇక హెల్త్ యూనికార్న్ ఇన్నోవేకర్ దాదాపు 245 మంది ఉద్యోగులను తొలగించింది. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ డెలివరీ వృద్ధి మందగించడంతో కంపెనీ 380 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ధృవీకరించింది. ఎండ్-టు-ఎండ్ డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ అయిన మెడీబడీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా అన్నీ విభాగాలలో దాదాపు 200 మంది ఉద్యోగులను తొలగించింది అయితే రానున్న రోజుల్లో లేఆఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ముంచుకొస్తోంది..ఆర్ధిక మాంద్యం
మాంద్యం... ప్రపంచాన్ని ఇప్పుడు వెంటాడుతున్న పదం ఇది. కరోనా దెబ్బతో కకావికలమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి... ఇప్పుడు ధరాభారంతో పెనం మీంచి పొయ్యిలో పడినట్లయింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలయ్యాక యూరప్, అమెరికా దేశాల్లోనే కాదు ఆసియాలోని చాలా దేశాల్లోనూ ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ద్రవ్యోల్బణం సెగను తగ్గించేందుకు అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచుతుండటం... చైనాలో మళ్లీ కరోనా భయాలతో అంతర్జాతీయ వాణిజ్యం మందగించడం.. రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలతో చమురు, గ్యాస్ రేట్లు భగ్గుమనడం.. ఇలా అనేక పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం కోరల్లో చిక్కుకునేలా చేస్తున్నాయి. ప్రపంచ బ్యాంకు ఇప్పటికే 2023లో చాలా దేశాలు ఆర్థిక మాంద్యంలోకి జారిపోవచ్చనే డేంజర్ బెల్స్ మోగించింది. యూరప్, అమెరికాలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని కూడా చెబుతోంది. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, గూగుల్, హెచ్‌పీ వంటి అనేక అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాల కోతలు ప్రకటించడం కూడా మాంద్యం ఆందోళనలను మరింత పెంచుతోంది. అసలు ఆర్థిక మాంద్యం వస్తే ఏం జరుగుతుంది? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎందుకింత ఘోరంగా తయారైంది? కొలువుల కోతలకు కారణమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి! శివరామకృష్ణ మిర్తిపాటి 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు తాజా వార్నింగ్... అంచనాలను మించిన ద్రవ్యోల్బణం.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు అకస్మాత్తుగా పెరిగిన వడ్డీరేట్లు, మళ్లీ కోవిడ్ మహమ్మారి భయాలు, బలహీన డిమాండ్ ప్రభావంతో ప్రపంచ ఎకానమీ వృద్ధి రేటు 2023లో 1.7 శాతానికి పడిపోవచ్చని ప్రపంచ బ్యాంకు తాజా వార్షిక నివేదికలో పేర్కొంది. గత అంచనా 3 శాతం కాగా, దాదాపు సగానికి కోతపెట్డడం గమనార్హం. ఒకవేళ అమెరికా మాంద్యాన్ని తప్పించుకున్నప్పటికీ, వృద్ధి రేటు మాత్రం 0.5 శాతానికి పడిపోవచ్చని లెక్కగట్టింది. అధిక ధరలు, తీవ్ర వడ్డీరేట్లు, ప్రపంచ ఆర్థిక బలహీనతలు అమెరికా వ్యాపార సంస్థలు, వినియోగదారుల నడ్డివిరుస్తాయని ప్రపంచ బ్యాంకు విశ్లేషించింది. కోవిడ్ మరింత విస్తరించి, ఉక్రెయిన్–రష్యా యుద్ధం ముదిరిపోతే... సరఫరా వ్యవస్థలు కుప్పకూలుతాయని.. అంతిమంగా మాంద్యానికి దారితీయొచ్చని వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు... బలహీన చైనా ఎకానమీ కారణంగా, యూరప్ దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంది. అమెరికా, యూరప్, చైనా ఏకకాలంలో మందగమనంలో ఉండటం అనేది ప్రపంచ ఎకానమీకి పెను ముప్పుగా మారుతుందని ఐఎంఎఫ్ అధిపతి క్రిస్టీనా జార్జియేవా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఈయూ ఎకానమీ వృద్ధి 0 స్థాయిలో... చైనా వృద్ధి 4.3 శాతానికి, బ్రెజిల్ వృద్ధి రేటు 0.8 శాతానికి దిగజారవచ్చనేది ప్రపంచ బ్యాంక్ అంచనా. భారత్ బెటర్... అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వృద్ధి రేటు 2022తో పోలిస్తే ఈ ఏడాది సగానికి పడిపోయే అవకాశం ఉన్నప్పటికీ.. మెరుగైన స్థాయిలో 3.4 శాతంగా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ముఖ్యంగా, భారత్ జీడీపీ తగ్గినా కూడా మిగతా దేశాలతో పోలిస్తే మెరుగైన పనితీరును నమోదు చేయొచ్చని చెబుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. 2022–23 ఏడాది అంచనా 6.9 శాతంగా ఉంది. దీని ప్రకారం చూస్తే ఏడు అతిపెద్ద వర్ధమాన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల్లో అత్యంత వేగవంతమైన వృద్ధి రేటు సాధించిన దేశంగా ఈ ఏడాది భారత్ నిలుస్తుంది. 2020–21లో కోవిడ్ కారణంగా భారత్ జీడీపీ 7.3 శాతం క్షీణించినా, 2021–22లో తిరిగి కోలుకోవడమే కాకుండా 8.7 శాతం వృద్ధి చెందింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో ఈ ఏడాది వృద్ధి రేటు 7 శాతానికి పరిమితం కావచ్చనేది ప్రభుత్వ అంచనా. మొత్తంమీద చూస్తే ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారినప్పటికీ, భారత్ మాత్రం దీన్ని తప్పించుకునే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. అంతా అమెరికానే చేసింది!! 2007–2009 ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ట్రిలియన్ల కొద్దీ డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించడంతో పాటు వడ్డీరేట్లను దాదాపు సున్నా స్థాయిలోనే అనేక సంవత్సరాలు కొనసాగించింది అమెరికా. పరిస్థితులు కాస్త సద్దుమణగడం.. అమెరికా స్టాక్ మార్కెట్ల జోరు నేపథ్యంలో 2018లో వడ్డీరేట్లను నెమ్మదిగా పెంచడం మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్. అయితే, పులి మీద పుట్రలా కరోనా మహమ్మారి 2020లో ప్రపంచాన్ని అతలాకుతలం చేయడంతో అన్ని దేశాల ఎకానమీలు ఒక్కసారిగా స్తంభించిపోయి, కుప్పకూలాయి. దీంతో మళ్లీ అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను అమాంతం సున్నా స్థాయికి తీసుకొచ్చి, లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించాల్సి వచ్చింది. కోవిడ్ నుంచి గట్టెక్కుతున్న తరుణంలో.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ముంచుకొచ్చింది. అమెరికా, యూరప్ ఇతరత్రా వాటి మిత్ర దేశాలు రష్యాపై పరోక్ష యుద్ధానికి కాలుదువ్వడం.. ఆంక్షల కొరడా ఝుళిపించడంతో క్రూడ్, ఆహారోత్పత్తుల ధరల మంట మొదలైంది. ద్రవ్యోల్బణం దూసుకెళ్లడంతో అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు తప్పనిసరి పరిస్థితుల్లో వడ్డీరేట్లను ఎకాయెకిన పెంచేయడం మొదలెట్టాయి. అమెరికా తన ఆర్థిక ప్యాకేజీలను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. కాగా, చైనాలో మళ్లీ కరోనా కల్లోలం, యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించకపోవడంతో ధరాఘాతం మరికొన్నాళ్లు కొనసాగవచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఈ ఏడాదీ వడ్డీరేట్లు మరింత పెరిగిపోవచ్చనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇదే జరిగితే.. ఎకానమీలు మరింత మందగిస్తాయని.. వెరసి ప్రపంచ మాంద్యానికి ఇంకాస్త చేరువకావడం ఖాయమని కూడా వారు హెచ్చరిస్తున్నారు. ‘ప్రపంచ వృద్ధి తీవ్రంగా మందగిస్తోంది. ఇది మరింత దిగజారితే, చాలా దేశాలు మాంద్యంలోకి జారిపోతాయి. ఈ ధోరణులు చాలాకాలం కొనసాగనుండటం అందోళనకరమైన విషయం. ఇదే జరిగితే వర్థమాన దేశాల ప్రజలు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటారు’ అని ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ డేవిడ్ మల్పాస్ అభిప్రాయపడ్డారు. వణికిస్తున్న వడ్డీరేట్లు... 2007లో దాదాపు 5 శాతం స్థాయిలో ఉన్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేటు.. అప్పటి ఆర్థిక సంక్షోభం తర్వాత సున్నా స్థాయికి దిగొచ్చింది. దాదాపు 2016 వరకూ ఇదే స్థాయిలో కొనసాగింది. అయితే, తర్వాత మళ్లీ పెరుగుతూ 2.25 శాతానికి చేరింది. ఆ సమయంలో కోవిడ్ దెబ్బకు మళ్లీ 2020లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటును సున్నాకు తగ్గించేసింది. రెండేళ్లపాటు అక్కడే ఉంచింది. ఎకానమీ కాస్త మెరుగైన సంకేతాలకు తోడు.. ద్రవ్యోల్బణం దాదాపు 9 శాతానికి చేరి (40 ఏళ్ల గరిష్ఠం) ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఈ ఏడాది మళ్లీ పెంపు మొదలుపెట్టి డిసెంబర్ నాటికి 4.5 శాతానికి చేర్చింది. ఈ ఏడాదిలో ఇది 5.25 శాతానికి చేరే అవకాశం ఉంది. దీంతో డాలరు విలువ ఎగబాకి.. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీలను కుదేలు చేసింది. మన రూపాయి కూడా దాదాపు 83 స్థాయికి బక్కచిక్కి ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోవడం తెలిసిందే. అయితే, మిగతా కరెన్సీలతో పోలిస్తే మనదే కాస్త తక్కువ క్షీణించడం విశేషం. అమెరికా వడ్డీరేట్ల పెంపు జోరు, ద్రవ్యోల్బణంపై పోరు కారణంగా అటు యూరప్‌తో పాటు ఇతర దేశాల సెంట్రల్ బ్యాంకులూ వడ్డీరేట్లను తప్పక పెంచాల్సి వస్తోంది. మన ఆర్బీఐ కూడా కీలక రెపో రేటును 4 శాతం నుంచి ఇప్పుడు 6.25 శాతానికి పెంచడంతో కార్పొరేట్లు, ఇటు రిటైల్ రుణ గ్రహీతలపై వడ్డీ భారం తడిసిమోపెడవుతోంది. వెరసి ఆర్థిక వ్యవస్థలు మరింత మందగిస్తున్నాయి. యూరప్ సెల్ఫ్ గోల్... అసలే అంతంతమాత్రంగా ఉన్న యూరోపియన్ ఆర్థిక వ్యవస్థ.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో మరింత దిగజారింది. ముఖ్యంగా అమెరికా ప్రోద్బలంతో రష్యాపై విధించిన ఆంక్షలు చివరికి యూరప్ దేశాల మెడకే చుట్టుకున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ సరఫరాలను నిలిపివేయడం, ఇతరత్రా కమోడిటీ దిగుమతులపై ఆంక్షలకు తోడు జర్మనీకి గ్యాస్ సరఫరా చేసే నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్‌ను పేల్చివేయడం (అమెరికా ఏజెంట్లే చేశారన్నది రష్యా ఆరోపణ)తో యూరోపియన్ దేశాల్లో ద్రవ్యోల్బణం కనీవినీ ఎరుగని స్థాయికి (చాలా దేశాల్లో ఆల్‌టైమ్ గరిష్ఠం) ఎగబాకింది. రష్యా చౌక గ్యాస్, క్రూడ్‌ను కాదని భారీ మొత్తానికి అమెరికా ఇతర దేశాల నుంచి యూరప్ దిగుమతి చేసుకుంటోంది. దీంతో అక్కడి పరిశ్రమలు అధిక వ్యయాలతో మూతబడే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగాల కోతకు దారితీస్తోంది. బ్రిటన్ ఎకానమీ ఇప్పటికే క్షీణతలోకి (2022 మూడో త్రైమాసికంలో జీడీపీ మైనస్ 0.3% క్షీణించింది) జారుకొని మాంద్యాన్ని చవిచూస్తోంది. మిగతా దేశాలూ అదే బాటలోకి వెళ్లే ప్రమాదం ఉంది. యూరప్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తే అది ప్రపంచ ఎకానమీపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. మొత్తంమీద రష్యా విషయంలో అమెరికా వలలో చిక్కుకుని యూరప్ సెల్ఫ్ గోల్ వేసుకుందనేది ఆర్థికవేత్తల విశ్లేషణ. ధరదడ... స్టాగ్ఫ్లేషన్! పశ్చిమ దేశాల విచ్చలవిడి కరెన్సీ ప్రింటింగ్‌కు తోడు కరోనా దెబ్బతో సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ధరలకు రెక్కలొచ్చాయి. ధరల దెబ్బకు సామాన్యుడే కాదు, ఆర్థిక వ్యవస్థలు సైతం అల్లాడిపోతున్నాయి. మన పొరుగున ఉన్న శ్రీలంకలో ద్రవ్యోల్బణం దెబ్బకు ప్రజలు ఎలా రోడ్డెక్కి అధ్యక్షుడిని సైతం పారిపోయేలా చేశారో మనం కళ్లారా చూశాం. అలాగే పాకిస్తాన్లో గోధుమ పిండి, ఇతరత్రా నిత్యావసరాల కోసం జరుగుతున్న కొట్లాటలకూ ధరల తీవ్రతే కారణం. మరోపక్క, ఆర్థిక మందగమనం కూడా కొనసాగుతుండటంతో ప్రస్తుతం ప్రపంచం ‘స్టాగ్ఫ్లేషన్’ను ఎదుర్కొంటోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అధిక ద్రవ్యోల్బణానికి తోడు జీడీపీ వృద్ధి అంతకంతకూ పడిపోతూ ఉండటం, ఫలితంగా నిరుద్యోగం తీవ్రతరం కావడాన్ని స్టాగ్‌ఫ్లేషన్‌గా పేర్కొంటారు. కంపెనీల లాభదాయకత పడిపోవడంతో ఉద్యోగాల కోతకు దారితీస్తుంది. మాంద్యం–ద్రవ్యోల్బణంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఇది పాలసీ నిర్ణయాల విషయంలో డైలమాకు కారణమవుతుంది. ఎందుకంటే, అధిక ధరలకు కళ్లెం వేయాలంటే కొన్ని నెలల పాటు వడ్డీరేట్లను పెంచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఫలితంగా డిమాండ్ సన్నగిల్లి, ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోతుంది. ధరలు కట్టడి అయ్యేంతవరకూ సెంట్రల్ బ్యాంకులు అదేపనిగా వడ్డీరేట్లను పెంచడం వల్ల నిరుద్యోగం మరింత పెరగడంతో పాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థ కూడా మాంద్యంలోకి వెళ్లిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. చైనాలో జీరో కోవిడ్ పాలసీ దెబ్బ... కరోనాతో 2020లో పాతాళానికి పడిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు.. 2021లో మళ్లీ పుంజుకోవడం మొదలైంది. అయితే, చైనా మాత్రం జీరో కోవిడ్ పాలసీ పేరుతో విధించిన ఆంక్షలకు తోడు, 2022లో కొత్త వేరియంట్ బీఎఫ్7 కారణంగా లాక్డౌన్లకు తెరతీసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ప్రపంచ తయారీ భాండాగారంగా పేరొందిన చైనా నుంచి వాణిజ్యం కుంటుపడటం.. ద్రవ్యోల్బణాన్ని మరింత ఎగదోసింది. ఈ పరిణామాలతో చైనాలో పారిశ్రామిక, వ్యాపార కార్యకలాపాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థ ఘోరంగా పడిపోయింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2022లో 3 శాతానికి పరిమితమైంది. 2020లో కోవిడ్ వల్ల 2.2 శాతానికి పడిపోయిన ఉదంతాన్ని మినహాయిస్తే, 1976 తర్వాత ఇంత తక్కువ స్థాయిలో నమోదవడం ఇదే తొలిసారి. 2021లో జీడీపీ వృద్ధి 8.1 శాతం కావడం గమనార్హం. అయితే, ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో జీరో కోవిడ్ పాలసీకి 2022 డిసెంబర్లో చైనా చెల్లు చెప్పినప్పటికీ.. తిరిగి మళ్లీ ఎకానమీ పుంజుకోవడానికి చాలా నెలలు పట్టొచ్చనేది ఆర్థిక వేత్తల మాట. పెరుగుతున్న కోవిడ్ కేసులు.. రియల్ ఎస్టేట్ మార్కెట్ క్షీణత, బలహీన ప్రపంచ డిమాండ్ వంటివి 2023లో చైనాకు పెను సవాళ్లుగా నిలుస్తాయని మూడీస్ ఎకనమిస్ట్ హ్యారీ మర్ఫీ క్రూయిజ్ విశ్లేషిస్తున్నారు. రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కుంటుపడటం అంటే ప్రపంచ మాంద్యానికి మరింత దగ్గరైనట్లేనని కూడా పేర్కొంటున్నారు. ఒకపక్క మాంద్యం భయాలకు తోడు... వ్యయాలు తడిసిమోపెడవుతుండంతో టెక్నాలజీ కంపెనీలు గత ఏడాది నుంచే కొలువుల కోతకు తెరతీశాయి. అంతేకాదు, చాలా కంపెనీలు కొత్త ఉద్యోగాలను కూడా (హైరింగ్) తాత్కాలికంగా ఆపేస్తుండటం ఆర్థిక వ్యవస్థల్లో బలహీనతకు నిదర్శనం. ప్రపంచ టాప్ టెక్నాలజీ కంపెనీలన్నీ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. దీంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి పుండుమీద కారంలా తయారైంది. గూగుల్ దాదాపు 12,000 ఉద్యోగాల్లో కోత పెట్టనుండగా, హెచ్‌పీ దాదాపు 6,000 మందిని సాగనంపింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా సైతం ఆదాయాలు పడిపోతుండటంతో 11,000 కొలువులకు కోత పెట్టింది. ఇక ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సిబ్బందిని సగానికి సగం తగ్గించి, దాదాపు 3,500 మందిని ఇంటికి పంపారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ అయితే, ఏకంగా 18,000 మందిపై వేటు వేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతిపెద్ద కోత. ఇందులో భారత్‌లోనూ 1,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. తాజాగా మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా 10,000 కొలువులు (మొత్తం ఉద్యోగుల్లో 5%) కట్ చేస్తామని ప్రకటించింది. ఇంకా చిన్నాచితకా టెక్ కంపెనీలతో పాటు పెప్సికో, ఫోర్డ్ వంటి తయారీ రంగ కంపెనీలు సైతం ఇదే బాటలో వెళ్తున్నాయి. ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది టెక్నాలజీ కంపెనీలు దాదాపు 1,50,000 ఉద్యోగులను తొలగించినట్లు అంచనా. ఇక 2023 విషయానికొస్తే, ఇప్పటికే 104 పైగా కంపెనీలు సుమారు 26,000 మందికి పింక్ స్లిప్స్ ఇచ్చాయి. అంటే రోజుకు 1,600 మంది కొలువులు కోల్పోయారన్నమాట! ఆర్థిక వృద్ధి మరింత పడిపోయి, వడ్డీరేట్ల పెంపు కొనసాగితే రానున్నకాలంలో ఒక్క టెక్నాలజీ కంపెనీలే కాకుండా అన్ని రంగాల్లోనూ మరిన్ని కోతలు తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2007లో ప్రపంచం నెత్తిన పడిన అమెరికా సబ్‌ప్రైమ్ సంక్షోభం ఇంకా మన కళ్లముందు కదలాడుతూనే ఉంది. ఎందుకంటే ఆ దెబ్బకు ప్రపంచమంతా అత్యంత ఘోరమైన ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోయింది. స్టాక్ మార్కెట్లు పేకమేడల్లా కుప్పకూలాయి. లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. అనేక బ్యాంకులు, పరిశ్రమలు దివాలా తీశాయి. నిరుద్యోగం ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 2009 జూన్ వరకు ఇది ప్రపంచ దేశాలను కుదిపేసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, ఇంకా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్న అత్యంత తీవ్ర మాంద్యంగా అది చరిత్రలో నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ దాదాపు 14 ఏళ్ల తర్వాత ప్రపంచాన్ని మరో మాంద్యంలోకి తోసేస్తున్నది కూడా అమెరికానే కావడం గమనార్హం. గత సంక్షోభాల నుంచి గట్టెక్కేందుకు సహాయ ప్యాకేజీల రూపంలో ఎడాపెడా డాలర్లను ప్రింట్ చేసి, కృత్రిమంగా ఎకానమీలను నిలబెట్టిన అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకులకు ఇప్పుడు దాని సెగ బాగానే తగులుతోంది. ద్రవ్యోల్బణం అంతకంతకూ కొండెక్కి... ప్రజల జేబులను గుల్ల చేస్తుండటంతో చేసేదేమీలేక అవి వడ్డీరేట్ల పెంపు బాట పట్టాయి. అంతేకాదు, గతంలో అందించిన సహాయ ప్యాకేజీ సొమ్మును వ్యవస్థ నుంచి వెనక్కి తీసుకోవడంతో పాటు, అత్యంత వేగంగా వడ్డీరేట్లను పెంచుకుంటూ పోతుండటంతో ఆర్థిక వ్యవస్థలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. వెరసి, డిమాండ్ సన్నగిల్లి పరిశ్రమలు పడకేసే పరిస్థితి నెలకొనడం వల్ల గ్లోబల్ ఎకానమీకి మాంద్యం ముప్పు అంతకంతకూ తీవ్రమవుతోంది. ఇప్పట్లో ధరలు దిగొచ్చే పరిస్థితి లేకపోవడం, వడ్డీరేట్లు కూడా మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో ప్రపంచం 2023లో మరో మాంద్యానికి చేరువ కావచ్చని ఆర్థికవేత్తలతో పాటు ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు అంచనా వేస్తున్నాయి. అయితే, మరికొంత మంది ఆర్థిక వేత్తలు మాత్రం ఇది మందగమనం మాత్రమేనని, ఒకవేళ మాంద్యం వచ్చినా చాలా స్వల్పకాలమే ఉంటుందని లెక్కలేస్తున్నారు. -
లక్షల్లో ఐటీ ఉద్యోగాలు ఊడుతున్న వేళ..టీసీఎస్ సంచలనం!
సాఫ్ట్వేర్ కొలువు.. ఐటీ రంగంలో కెరీర్.. దేశంలో డిగ్రీ స్థాయి కోర్సులు చదువుతున్న ప్రతి ఒక్కరి స్వప్నం! చదివిన డొమైన్‌తో సంబంధం లేకుండా.. ఇప్పుడు అధికశాతం మంది ఐటీ జాబ్స్ కోసం అన్వేషణ సాగిస్తున్న పరిస్థితి! కాని∙క్యాంపస్ డ్రైవ్స్ కేవలం ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న టాప్ కాలేజీల విద్యార్థులకే లభిస్తున్నాయనే భావన! ఇలాంటి వారు తమ సాఫ్ట్వేర్ కొలువు కలను సాకారం చేసుకునేందుకు మార్గం.. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్!! దేశంలో టాప్–5 ఐటీ కంపెనీల జాబితాలో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ టీసీఎస్.. ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో చేపడుతున్న నియామక విధానమే.. స్మార్ట్ హైరింగ్! తాజాగా స్మార్ట్ హైరింగ్–2023 ప్రక్రియను టీసీఎస్ ప్రారంభించింది. ఈ నేపథ్యంలో.. స్మార్ట్ హైరింగ్‌కు దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం, సిలబస్ తదితర వివరాలు ఐటీ కంపెనీల్లో నాన్–ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ కొలువు అందని ద్రాక్షే అనే అభిప్రాయముంది. దీనికి భిన్నంగా.. సైన్స్, మ్యాథమెటిక్స్,స్టాటిస్టిక్స్, ఒకేషనల్, కంప్యూటర్స్/ఐటీ సబ్జెక్ట్లతో బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు సాఫ్ట్వేర్ జాబ్ ఖరారు చేసేందుకు ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్..ఆఫ్ క్యాంపస్ విధానంలో చేపడుతున్న నియామక ప్రక్రియే.. టీసీఎస్ స్మార్ట్ హైరింగ్. అర్హతలు నిర్దేశిత గ్రూప్‌లలో 2023లో డిగ్రీ పూర్తి చేసుకోనున్న విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను టీసీఎస్లోప్రారంభించింది.∙బీసీఏ, బీఎస్సీ(మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ఎలక్ట్రానిక్స్/బయో కెమిస్ట్రీ/కంప్యూటర్ సైన్స్/ఐటీ), కంప్యూటర్ సైన్స్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సులను 2023 లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులను అర్హులుగా పేర్కొంది. ∙పదో తరగతి నుంచి బ్యాచిలర్ డిగ్రీ వరకు ప్రతి స్థాయిలో కనీసం 50 శాతం మార్కులు లేదా 5 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించాలి. ∙బ్యాచిలర్ డిగ్రీలో ఒక బ్యాక్లాగ్ మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. ∙అకడమిక్‌గా గ్యాప్ రెండేళ్ల కంటే ఎక్కువ ఉండకూడదని కూడా పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 18–28 ఏళ్ల మధ్య ఉండాలి. ‘సైన్స్ టు సాఫ్ట్వేర్’ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రధాన ఉద్దేశం..ఆఫ్ క్యాంపస్ డ్రైవ్‌ను విస్తృతం చేయడం.అదే విధం గా.. నిర్దేశిత సబ్జెక్ట్ గ్రూప్‌లతో డిగ్రీ పూర్తి చేసిన వారికి సాఫ్ట్వేర్ కొలువులు ఖరారు చేయడం. ఇందుకోసం ప్రత్యేకంగా సైన్స్ టు సాఫ్ట్వేర్ పేరుతో వినూత్న ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. దీనిలో భాగంగా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, బయో కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్‌లతో బీ ఎస్సీ..అదే విధంగా బీసీఏ,సీఎస్/ఐటీలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ కోర్సు చివరి సంవత్సరం విద్యార్థుల కోసం స్మార్ట్ హైరింగ్ ప్రక్రియను చేపడుతోంది. సమయం ఆదాటీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియలో మరోప్రధాన ఉద్దేశం.. సమయం ఆదా చేయడం. వాస్తవానికి క్యాంపస్ డ్రైవ్స్ విధానంలో నియామక ప్రక్రియ పూర్తయి.. అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసేందుకు దాదాపు మూడు నెలల సమయం పడుతోంది. దీంతో అటు విద్యార్థులకు, ఇటు సంస్థకు సమయం ఆదా అయ్యేలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ దోహదపడుతుంది. 40 వేల మంది టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రక్రియ ద్వారా ఏటా దాదాపు 35 వేల నుంచి 40 వేల మంది వరకూ ఫ్రెషర్స్‌ను రిక్రూట్ చేసుకుంటోంది. ఈ సంఖ్యను ప్రతి ఏటా సంస్థ నియామక ప్రణాళిక ఆధారంగా నిర్ధారిస్తున్నారు. జాతీయ స్థాయిలో దాదాపు రెండువేలకు పైగా ఇన్స్టిట్యూట్ల విద్యార్థులకు ఈఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. ఆరు నెలల శిక్షణ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆఫర్ ఖరారు చేసుకున్న వారికి ఆరు నెలల పాటు శిక్షణ అందిస్తారు. కోడింగ్, ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇండస్ట్రీ 4.0 టెక్నాలజీ అంశాలు, కమ్యూనికేషన్ స్కిల్స్,బిహేవియర్ స్కిల్స్, ఇతర సాఫ్ట్ స్కిల్స్‌లోనూ నైపుణ్యం పొందేలా శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు వారి ఆసక్తి మేరకు ఐటీ లేదా బీపీఎస్ విభాగాల్లో నియామకాలు ఖరారు చేస్తారు. రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. మూడు దశల ఎంపిక ప్రక్రియ టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ విధానంలో మూడు దశల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ. తొలిదశ రాత పరీక్ష ఫిబ్రవరి 10వ తేదీన టీసీఎస్ ఐయాన్ సెంటర్లలో జరుగుతుంది. రాత పరీక్ష.. మూడు విభాగాలు తొలుత ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం మూడు విభాగాల(వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమరిక్ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో విభాగం నుంచి 15–20 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. పరీక్ష వ్యవధి 50 నిమిషాలు. రెండో దశ.. టెక్నికల్ ఇంటర్వ్యూ ఆన్లైన్ టెస్ట్‌లో సంస్థ నిర్దేశించిన కటాఫ్ మార్కులు సాధించిన వారిని తదుపరి దశ టెక్నికల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ దశలో ఐటీ రంగానికి సంబంధించిన అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానం,సాఫ్ట్వేర్ రంగంపై ఆసక్తి, అకడమిక్ నేపథ్యం ఆధారంగా సంబంధిత సబ్జెక్ట్‌లలో నైపుణ్యాలను పరీక్షిస్తారు. చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూ టెక్నికల్ ఇంటర్వ్యూలోనూ విజయం సాధించిన వారికి చివరగా హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది.ఇందులో అభ్యర్థుల వ్యక్తిత్వాన్ని,నాయకత్వ లక్షణాలను,సాఫ్ట్ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. ఈ ప్రక్రియలో నూ విజయం సాధిస్తే.. నియామకం ఖరారు చేసి..ఆరు నెలలపాటు నిర్వహించే శిక్షణకు పంపుతారు. రాత పరీక్షలో విజయం ఇలా తొలి దశగా నిర్వహించే రాత పరీక్షలో.. 3 విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది. అవి.. వెర్బల్ ఎబిలిటీ యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్,ది ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, యాక్టివ్–ప్యాసివ్ వాయిస్, క్లోజ్ టెస్ట్, వెర్బల్ అనాలజీస్, సెంటెన్స్ కరెక్షన్, పేరా రైటింగ్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, ఫ్రేజెస్, డైరెక్ట్–ఇన్‌డైరెక్ట్ స్పీచ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఇంగ్లిష్ గ్రామర్‌పై పదో తరగతి స్థాయిలో పూర్తి అవగాహన పొందాలి. అదే విధంగా సెంటెన్స్ ఫార్మేషన్, కరెక్షన్, కాంప్రహెన్షన్ల కోసం ఇంగ్లిష్ న్యూస్ పేపర్స్ చదవడం ఉపయుక్తంగా ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ ఈ విభాగంలో కోడింగ్, డీ కోడింగ్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, బ్లడ్ రిలేషన్స్, అనాలజీ,సిరీస్, పజిల్స్, లెటర్ సిరీస్, వెన్ డయాగ్రమ్స్, విజువల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ ఈ విభాగంలో ఫ్రాక్షన్స్,ప్రాబబిలిటీ, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్స్, యావరేజెస్, ఈక్వేషన్స్, ఏరియా,స్సేస్, పెరిమీటర్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, వర్క్ అండ్ టైమ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, నంబర్ సిస్టమ్, ఎల్సీఎం, హెచ్‌సీఎం, పర్సంటేజెస్ వంటి ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వీటికి సమాధానం ఇవ్వడం కోసం 12వ తరగతి స్థాయిలోప్యూర్ మ్యాథ్స్, అదే విధంగా అర్థమెటిక్ పుస్తకాలు అధ్యయనం చేయడం ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు సగటున 50 సెకన్ల నుంచి ఒక నిమిషం వ్యవధి మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్‌కు ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి. రిజిస్ట్రేషన్ ఇలా టీసీఎస్ స్మార్ట్ హైరింగ్–2023కు హాజరుకావాలనుకునే విద్యార్థులు ఆన్లైన్లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం https://nextstep.tcs.com/campus/#/ లో లాగిన్ ఐడీ,పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఐటీ, బీపీఎస్ విభాగాల్లో తమకు ఆసక్తి ఉన్న విభాగంపై క్లిక్ చేయాలి. తర్వాత దశలో ఆన్లైన్ అప్లికేషన్‌ను పూర్తి చేయాలి. అదే విధంగా నిర్దేశిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్య తేదీలు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: జనవరి 31, 2023 ఆన్లైన్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి 10, 2023 ∙పూర్తి వివరాలకు వెబ్సైట్: www.tcs.com/careers/india/tcs-smart-hiring-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్: https://nextstep.tcs.com/campus/# -
‘మొహం మీద కొట్టినట్లుగా’.. గూగుల్ నుంచి ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు!
టెక్ దిగ్గజం గూగుల్ తొలగించిన 12వేల మంది ఉద్యోగుల్లో జెరెమీ జోస్లిన్ ఒకరు. జోస్లిన్ 2003 నుంచి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే ఆర్ధిక మాంద్యం భయాలు, నష్టాల్ని కారణంగా చూపిస్తూ అతడిని తొలగిస్తూ యాజమాన్యం మెయిల్ చేసింది. ఆ మెయిల్‌పై జోస్లిన్ విచారం వ్యక్తం చేస్తూ లింక్డ్ఇన్లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక ఆ పోస్ట్‌లో ఏముందంటే? నేను గత 20ఏళ్లుగా టెక్కీగా పనిచేస్తున్నాను. గూగుల్ తొలగింపుల్లో నేను కూడా ఉన్నాను. మొహం మీదే కొట్టినట్లుగా యాజమాన్యం నుంచి ఊహించని విధంగా ఇమెయిల్ వచ్చింది. అది చదివి టెక్ జెయింట్‌లో ఇదే నా లాస్ట్ వర్క్ డే అని ఊహించుకోవడం కష్టంగా ఉంది. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన సహచర ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘ఆహా ఓహో అంటూ ఉద్యోగం నుంచి ఊడబీకారు’!..గూగుల్ మహిళా ఉద్యోగి ఆవేదన
వారానికి ఐదురోజులే పని. ఐదంకెల జీతం. లగ్జరీ జీవితం. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్. కరోనాలోనూ తరగని ఆదాయం. ఛాన్సుంటే రెండు కంపెనీల్లో జాబ్. బిటెక్ చేశామా? బోనస్‌గా ఏదో ఒక కోర్స్ చేశామా? ఐటీ జాబ్‌లో చేరిపోయామా? అంతే! లైఫ్ సెటిల్ బిందాస్‌గా బ్రతికేయొచ్చు. కొంచెం టెన్షన్ ఎక్కువే అయినా దానికి తగ్గట్లు ఇన్ కమ్ ఉంటుంది. ఇతర ఫెసిలిటీస్ ఎలాగూ ఉంటాయి. ఇంకాస్త అదృష్టం తోడైతే విదేశాలకు వెళ్లొచ్చు. డాలర్లను జేబులో వేసుకోవచ్చు. అందుకే యూత్‌కు ఐటీ జాబ్స్ అంటే వెర్రీ. కాలు కదపకుండా కంప్యూటర్ ముందు చేసే ఉద్యోగమంటే క్రేజ్. కానీ ఎప్పుడూ లాభాలు వస్తే అది వ్యాపారం ఎందుకవుతుంది. ప్రతీ రోజూ ఈజీగా గడిచి పోతే అది ఉద్యోగం ఎందుకవుతుంది. ఇప్పుడు ఐటీ ఉద్యోగులకు ఆర్ధిక మాంద్యం సెగ తగులుతోంది. లాభాలు లేవనే కారణంతో.. మాంద్యం వస్తుందన్న భయంతో బడా కంపెనీల నుంచి చిన్న చిన్న స్టార్టప్స్ వరకు ఉన్నవాళ్లను పీకేస్తున్నాయి. కొత్త వాళ్లను వద్దంటున్నాయి. దీంతో టెక్కీల ఆదాయం, ఆనందం ఆవిరవుతుంది. ఆహా ఓహో అంటూ తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా 12000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారికి పింక్ స్లిప్ జారీ చేస్తూ ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ ఈమెయిల్స్ పంపారు. అంతే ఆ పింక్ స్లిప్‌లు చూసిన టెక్కీల ఆనందం ఆవిరై సోషల్ మీడియా వేదికగా తమ బాధల్ని వెళ్లగక్కుతున్నారు. గూగుల్ ఫైర్ చేసిన ఉద్యోగుల్లో ప్రోగ్రామ్ మేనేజర్ కేథరీన్ వాంగ్ ఒకరు. ఆహా ఓహో అంటూ ఆకాశానికెత్తిన సంస్థ.. ఆ మరోసటి రోజు లేఆఫ్స్ ప్రకటించి అగాధంలోకి నెట్టిందని లింక్డ్ఇన్ పోస్ట్‌లో వాపోయారు. ఉద్యోగం నుంచి తొలగించడం బాధగా ఉంది సంస్థ నుంచి టెర్మినేషన్ లెటర్ రావడంతో నేనెందుకు? ఇప్పుడెందుకు అనే ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఇలాంటి సిచ్యూవేషన్స్ను జీర్ణించుకోవడం చాలా కష్టం. ముఖ్యంగా నా పనితీరు బాగుందని రివ్వ్యూ ఇచ్చిన వెంటనే ఫైర్ చేయడం బాధాకరంగా ఉంది. నేను నిర్వహించిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులలో ఇది ఒకటి. ఇక లేఆఫ్స్‌తో 34 వారాల గర్భిణిగా కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, నెలల తరబడి ప్రసూతి సెలవుపై వెళ్లడం దాదాపూ అసాధ్యం' అని కేథరిన్ వాంగ్ పేర్కొన్నారు. ఒంట్లో వణుకు పుడుతుంది నా బిడ్డ క్షేమం గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ప్రతికూల భావోద్వేగాలను నియంత్రించ లేకపోతున్నాను. ఎందుకంటే నా లోపల (గర్బిణి) ఉన్న వాళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ ఉద్యోగం పోవడంతో వణుకుతున్న నా చేతుల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నానంటూ విచారం వ్యక్తం చేశారు. ఐ లవ్ గూగుల్ నేను ఇప్పటికీ గూగుల్‌ను ప్రేమిస్తున్నారు. గూగుల్‌ను మేము ఒక కుటుంబంగా భావిస్తాను. ఇప్పటికీ టీం సహచర ఉద్యోగులకు, నాకు వెన్నుదన్నుగా నిలిచినందుకు కృతజ్ఞతలు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో సానుకూల వ్యాపార ధోరణిని అవలంభిస్తున్న గూగుల్ కంపెనీలు పనిచేయడం గర్వంగా ఉందని వాంగ్ ముగించారు. చదవండి👉 జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా! -
రోజుకు 3,000 మంది ఔట్.. ఇంతకీ ఐటీ రంగంలో ఏం జరుగుతోంది?
ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, ఆర్ధిక మాంద్యం భయాలతో పాటు ఇతరాత్ర కారణాల వల్ల ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్న సంస్థల జాబితా ఈ ఏడాది జనవరి 1 నుంచి వాటి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపే జాబితాలో టెక్ దిగ్గజ కంపెనీలైన అమెజాన్, మెటా,ట్విటర్,విప్రో, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలు చేరిపోయాయి. వెరసీ వరల్డ్ వైడ్‌గా రోజుకు 3వేల మంది ఉద్యోగాలు కోల్పోతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ►టెక్ కంపెనీల నుంచి సేకరించిన డేటా ఆధారంగా 166 టెక్నాలజీ రంగా నికి చెందిన సంస్థ 65వేల మందిని ఇంటికి సాగనంపాయి. ►గూగుల్ ఇటీవల తన వర్క్ ఫోర్స్‌లో 6 శాతంతో 12వేల మందిని ఫైర్ చేసింది. ►గత వారం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. సంస్థలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు. ముఖ్యంగా ఫైనాన్షియల్ -2023, క్యూ3లో సుమారు 10వేల మంది ఉద్యోగులపై వేటు వేస్తామని అన్నారు. ►అమెజాన్ సైతం ప్రపంచ వ్యాప్తంగా 18వేల మందిని ఉద్యోగుల్ని తొలగించగా వారిలో వెయ్యి మంది భారత్‌కు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ►దేశీయ సోషల్ మీడియా దిగ్గజం షేర్ చాట్ మార్కెట్లో నెలకొన్ని అనిశ్చితుల కారణంగా సుమారు తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 20 శాతంతో 500 ఉద్యోగుల్ని పక్కన పెట్టింది. ►టెక్ జెయింట్ విప్రో ఇంటర్ననల్‌గా అసిస్మెంట్ టెస్ట్‌లో పేలవమైన పనితీరు కారణంగా 452 మంది ఫ్రెషర్స్‌పై వేటు వేసింది. ►వృద్ది రేటు తక్కువగా ఉందని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌స్విగ్గీ 380 మందిని ఫైర్ చేసింది. ►సంస్థలో పునర్నిర్మాణం పేరుతో డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫారమ్ మెడిబడ్డీ 2వేల మందిని తొలగించింది. ►ఓలా 200 మంది సిబ్బందని పక్కన పెట్టేయగా, వాయిస్ ఆటోమెటెడ్ స్టార్టప్ స్కిట్.ఏఐ లేఆఫ్స్ ప్రకటించి చర్చనీయాంశంగా మారింది. ►కాస్ట్ కటింగ్ అంటూ గ్రోసరీ డెలివరీ సంస్థ డున్జో 3శాతం వర్క్ ఫోర్స్‌ను తగ్గించాయి. ►ఇక ఈఏడాది లో టెక్ కంపెనీలు ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపుల్ని ప్రకటించాయి. వాటిలోసైబర్ సెక్యూరిటీ కంపెనీ సోఫోస్ 450 మంది సిబ్బందిని ఫైర్ చేయగా ..వృద్ది రేట్లు, లాభ,నష్టాలనే కారణాల్ని చూపెట్టింది. ►లేఆఫ్స్,ఎఫ్‌వైఐ ప్రకారం.. గతేడాది మొత్తం వెయ్యి కంపెనీలు 154,336 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేశాయి. చదవండి👉 నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ? -
‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్
సాఫ్ట్వేర్ రంగం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. కరోనా సమయంలో ఎన్నో రంగాలు కుదేలైనా ఐటీ పరిశ్రమ పడిపోలేదు. ఇంకా కొత్త ఉద్యోగుల్ని తీసుకొని వర్క్ హోమ్‌తో ఆదుకున్నాయి. ఇలా దూసుకుపోతున్న సాఫ్ట్ వేర్ సెక్టార్‌కు ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం లెక్కకు మించి పడిపోతుంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలకు చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి. గత ఏడాది అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడంతో ఆ భారం విదేశీ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఆర్ధిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకతో పాటు పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇలా అనేక కారణాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, ట్విటర్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. తాజాగా గూగుల్ సైతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 12వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇటీవల బడా టెక్ కంపెనీలు మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్ ప్రపంచలోకి ఆర్థిక మాంద్యం’ అంటూ ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. తాజాగా సుందర్ పిచాయ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మెయిల్ చేశారు. ఆ మెయిల్స్‌లో ఏముందంటే? ‘‘గూగులర్స్..ఈ వార్త షేర్ చేయడం నాకు కష్టంగా ఉంది. మేము మా వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12,000 వేలు తగ్గించాలని నిర్ణయించుకున్నాము. యూఎస్‌లో లేఆఫ్స్‌కు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్స్ పంపాము. ఇతర దేశాల్లో సంస్థ తొలగించిన ఉద్యోగులకు మెయిల్స్ పంపేందుకు సమయం పడుతుంది. కష్టపడి పనిచేసిన, పని చేయడానికి ఇష్టపడే మరికొంత మంది ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని కోల్పోవడాన్ని చింతిస్తున్నాం. సంస్థ తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతాయనే వాస్తవం వినడానికే భారంగా ఉంది. మమ్మల్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టేలా తీసుకున్న నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తాను’ అని ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.’’ యూఎస్‌లో గూగుల్ లేఆఫ్స్ ఉద్యోగులకు ►గూగుల్ ఫైర్ చేసిన యూఎస్ ఉద్యోగులకు నోటిఫికేషన్ వ్యవధిలో (కనీసం 60 రోజులు) ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపింది. ► కోతకు ప్రభావితమయ్యే ఉద్యోగులకు గూగుల్ సెవరెన్స్ ప్యాకేజ్‌ను ఆఫర్ చేస్తోంది. గూగుల్‌లో ప్రతి అదనపు సంవత్సరానికి 16 వారాల జీతంతో పాటు, రెండు వారాల సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వనుంది. మరో 16 వారాల్లో జీఎస్‌యూ సర్టిఫికెట్‌ను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయనుంది. ►2022 బోనస్‌లు,మిగిలిన సెలవులకు వేతనం చెల్లిస్తాము. ►6 నెలల హెల్త్ కేర్, ఉద్యోగ నియామక సేవలు, ఇమ్మిగ్రేషన్ సపోర్ట్ చేస్తుంది. ►యూఎస్ కాకుండా మిగిలిన దేశాలకు చెందిన ఉద్యోగులకు స్థానిక చట్టాల ప్రకారం చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. చదవండి👉 పాక్ అభిమాని గూబ గుయ్‌మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది -
‘ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు భారీ షాక్!’
ఈ ఏడాది మొదట్లోనే ఐటీ ఉద్యోగులకు కంపెనీలు భారీ షాక్ ఇస్తున్నాయి. ఆర్ధిక మాంద్యం భయంతో సంస్థలు ఉద్యోగుల్ని తొలగించుకుంటున్నాయి. జాబ్ నుంచి తొలగిస్తున్నట్లు హఠాత్తుగా మెయిల్స్ పంపిస్తున్నాయి. అలా ప్రపంచ వ్యాప్తంగా 91 కంపెనీల్లో 24వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపాయి. తాజాగా, కఠినమైన ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫోర్స్‌ను తగ్గిస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. బ్లూమ్ బెర్గ్ సైతం మైక్రోసాఫ్ట్ ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైందని తన నివేదికలో పేర్కొంది. మరో 5 నుంచి 10శాతం ఉద్యోగాలు ఉష్ కాకి మైక్రోసాఫ్ట్‌లో మొత్తం 220,000 మంది పనిచేస్తుండగా..గతేడాది రెండు సార్లు ఉద్యోగుల్ని ఫైర్ చేయగా.. తాజాగా కంపెనీ వార్షిక ఫలితాల్ని వెలు వరించకముందే ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఈ సందర్భంగా ‘గత కొన్ని వారాలుగా మేం సేల్స్‌ఫోర్స్, అమెజాన్ నుండి గణనీయంగా హెడ్‌కౌంట్ తగ్గడం చూశాం. టెక్ సెక్టార్లో మరో 5 నుండి 10 శాతం సిబ్బంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందంటూ వెడ్‌బుష్ నివేదించింది. ఈ కంపెనీల్లో చాలా వరకు 1980 నాటి తరహాలో డబ్బు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ధిక అనిశ్చితికి అనుగుణంగా ఖర్చుపై నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒట్టి రూమర్లే! ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు వస్తున్న వార్తలపై మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు స్పందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు వస్తున్న నివేదికల్ని ఖండించారు. ఒట్టి రూమర్సేనని కొట్టిపారేశారు. చదవండి👉 నీ ఉద్యోగానికో దండం.. విసుగెత్తిన ఉద్యోగులు..రాజీనామాల సునామీ? -
15 రోజులు.. 91 టెక్ కంపెనీల్లో 24 వేల మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ భయాలు భారత్‌లో ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఉటంకిస్తూ.. ఉద్యోగుల తొలగింపుల్ని ట్రాక్ చేసే సంస్థ లేఆఫ్స్.ఎఫ్‌వైఐ. తాజాగా ఈ ఏడాదిలో అంటే జనవరి 1 నుంచి జనవరి 16 వరకు 91 సంస్థలు సుమారు 25,151 మందిని తొలగించినట్లు తెలిపింది. ఆ సంస్థలో అమెజాన్,సేల్స్‌ఫోర్స్, కాయిన్‌బేస్ తో పాటు ఇతర కంపెనీలున్నాయి. క్రిప్టో ఎక్ఛేంజ్ క్రిప్టో.కామ్ గత వారంలో ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మంది సిబ్బందిని తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఓలా (200 మంది ఉద్యోగులను తొలగించింది), వాయిస్ ఆటోమేటెడ్ స్టార్టప్ స్కిట్.ఏఐ వంటి కంపెనీలు జనవరిలో భారీ ఎత్తున ఉద్యోగుల్ని ఫైర్ చేశాయి. లేఆఫ్స్.ఎఫ్‌వైఐ ప్రకారం..2022లో మెటా,ట్విటర్,ఒరాకిల్,ఎన్విడియా,స్నాప్,ఉబెర్,స్పాటిఫై,ఇంటెల్,సేల్స్‌ఫోర్స్ సంస్థలు 153,110 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేశాయి.నవంబర్‌లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య తారాస్థాయికి చేరుకున్నట్లు నివేదించింది. ఒక్క నెలలోనే 51,489 మంది టెక్కీలు ఉపాధి కోల్పోయారు. మరో టెక్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ వరుస లేఆఫ్స్‌తో 2023 సైతం టెక్నాలజీ రంగంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ నెలాఖరులో టెక్ రంగ సంస్థలు త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయోనని జాబ్ మార్కెట్ నిపుణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
‘ఉద్యోగాల ఊచకోత’.. వందల మందిని తొలగిస్తున్న షేర్ చాట్!
ద్రవ్యోల్బణం,స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితుల కారణంగా టెక్ కంపెనీలు కాస్ట్ కటింగ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ షేర్ చాట్ భవిష్యత్‌లో తలెత్తే ఆర్ధిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న 20 శాతం మంది ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్, టెమాసెక్ వంటి టెక్ దిగ్గజ కంపెనీల పెట్టుబడులతో బెంగళూరు కేంద్రంగా మొహల్లా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యానికి చెందిన షేర్‌చాట్, షార్ట్ వీడియో కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఆర్ధిక మాద్యం భయాలతో పెట్టుబడి దారులు ప్రకటనలపై వెచ్చించే ఖర్చును భారీగా తగ్గించారు. దీంతో ప్రకటనల మీద ఆదాయాన్ని గడించే మొహల్లా టెక్‌ను నష్టాలు చుట్టుముట్టాయి. ఈ తరుణంలో 5 బిలియన్ల డాలర్ల మార్కెట్ వ్యాల్యూషన్ ఉన్న షేర్‌చాట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, షార్ట్ వీడియో యాప్ మోజ్లో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో 500 మందిని తొలగించే అవకాశం ఉంది. ఉద్యోగుల తొలగింపుపై ఆ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ..‘మా కంపెనీ చరిత్రలో కఠినమైన, బాధాకరమైన నిర్ణయాలను తీసుకునే సమయం ఆసన్నమైంది. సంస్థ ప్రారంభం నుంచి మాతో జర్నీ చేస్తున్న మా అద్భుతమైన, ప్రతిభావంతులైన ఉద్యోగులలో 20శాతం మందిని వదులుకోవాల్సి వచ్చింది. ఖరీదైన మూలధనం (పెట్టుబడులు) కారణంగా కంపెనీలు తమ వైఖరిని మార్చుకోవాలి. లాభదాయకమైన ప్రాజెక్ట్‌లలో మాత్రమే పెట్టుబడులు పెట్టాలి’ అని అన్నారు. డిసెంబర్ 2022లో మొహల్లా టెక్ తన ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ జీత్11ని షట్‌డౌన్ చేసిన దాదాపు 100 మంది ఉద్యోగులను తొలగించిది. తాజాగా మరో సారి ఉద్యోగుల విషయంలో హైర్ అండ్ ఫైర్ పాలసీని అప్లయ్ చేస్తుంది. చదవండి👉 ‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’ -
‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ లేఆఫ్స్ నిర్ణయంతో ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు పోతున్నాయని తెలిసిన సిబ్బంది కార్యాలయాల క్యాబిన్లలో వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. తాజాగా అమెజాన్‌లో ఐదేళ్ల పాటు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసిన ఓం ప్రకాశ్ శర్మ ఉద్యోగం పోవడంతో తాను ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్ని నెటిజన్లతో పంచుకున్నారు. లింక్డ్ఇన్ పోస్ట్‌లో అమెజాన్ మాజీ ఉద్యోగి, సీనియర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఓంప్రకాష్ శర్మ లేఆఫ్స్‌పై స్పందించారు.‘2022 నా జీవితంలో అత్యంత సవాళ్లతో కూడుకున్న సంవత్సరం. ఐసీయూలో రెండు, మూడు నెలల ట్రీట్మెంట్ తర్వాత మా నాన్నని కోల్పోయాను. ఆ కారణంగా నాలుగు నెలలు పాటు ఆఫీస్ వర్క్ చేయలేదు. ఈ ఏడాది జనవరి 11న అమెజాన్ తొలగించిన ఉద్యోగుల్లో నేను ప్రభావితమయ్యాను’ అని పేర్కొన్నారు. అమెజాన్‌లో ఉద్యోగం చేసిన ఐదేళ్లు ప్రొఫెషనల్ కెరియర్లోనే అత్యంత అద్భుతమైన సమయం. సహచర ఉద్యోగులతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాధించాను. అయితే, వారి సపోర్ట్‌కు కృతజ్ఞతలు. నాకు ఇప్పుడు మీ సహాయం అవసరం. దయచేసి నాకు సరైన అవకాశం కల్పించేలా చూడండి అని శర్మ లింక్డ్ఇన్లో రాశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి👉 ‘70 ఉద్యోగాలకు అప్లయ్ చేశా.. ఒక్క జాబ్ రాలేదు..ఇండియాకి తిరిగి వచ్చేస్తా’ -
ఆర్ధిక మాంద్యం భయాలు.. ఆఫీసుల్ని ఖాళీ చేస్తున్న మెటా, మైక్రోసాఫ్ట్!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో దిగ్గజ సంస్థలు భారీ ఎత్తున ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉద్యోగుల్ని తొలగించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. పనిలో పనిగా ఆఫీసుల్ని ఖాళీ చేయడం వంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా మెటా, మైక్రోసాఫ్ట్ సంస్థలు కార్యాలయాల్ని ఖాళీ చేసినట్లు సీటెల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా, మైక్రోసాఫ్ట్ విడివిడిగా వాషింగ్టన్‌లోని సీటెల్, బెల్లేవ్‌లోని కార్యాలయ భవనాలను ఖాళీ చేస్తున్నాయి.టెక్ సెక్టార్లో మార్పులు, ఆఫీస్ మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల మధ్య సీటెల్‌లోని అర్బోర్ బ్లాక్ 333లో ఆరు అంతస్తులు,బెల్లేవ్‌లోని స్ప్రింగ్ డిస్ట్రిక్ట్ బ్లాక్ 6లో 11అంతస్తుల తన కార్యాలయాలను సబ్‌లీజ్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు మెటా ధృవీకరించినట్లు సీటెల్ టైమ్స్ నివేదించింది. కాలిఫోర్నియాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం మెన్లో పార్క్‌తో పాటు ఇతర సీటెల్ ప్రాంత కార్యాలయ భవనాల లీజులను సమీక్షిస్తున్నట్లు తెలిపింది. మెటాతో పాటు మైక్రోసాఫ్ట్ సైతం జూన్ 2024లో లీజు ముగిసే సమయానికి సిటీ సెంటర్ ప్లాజా బెల్లేవ్‌లోని 26 అంతస్తుల భవన లీజు పునరుద్ధరించేలా నిర్ణయం తీసుకోవడం లేదని ధృవీకరించింది. రిమోట్ వర్క్, భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు, టెక్ రంగంలో మందగమనం కారణంగా సీటెల్, ఇతర ప్రాంతాలలో ఆఫీస్ స్పేస్ డిమాండ్‌ను తగ్గించాయని సీటెల్ టైమ్స్ పేర్కొంది. ఈ సందర్భంగా మెటా ప్రతినిధి ట్రేసీ క్లేటన్ సీటెల్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. లీజింగ్ నిర్ణయాలు, రిమోట్ వర్క్, ఆర్ధిక మాంద్యం భయాలకు అనుగుణంగా మెటా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని అంగీకరించారు. చదవండి👉‘అప్పుడు తండ్రిని.. ఇప్పుడు ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాను’ -
అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. ఈసారి ఎంతమంది అంటే?
ఆర్ధిక మాద్యం భయాల కారణంగా ఆదాయం తగ్గిపోతుండడంతో ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 18వేలమందిని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించిన అమెజాన్ తాజాగా మరో 1200 అంత కంటే ఎక్కువ మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం.. ఖర్చుల్ని తగ్గించుకుంటున్న అమెజాన్ వరుస లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో యూకేకి చెందిన ఆ సంస్థ మూడు వేర్ హౌస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 1200మంది ఉద్యోగులపై వేటు పడనుంది. వేర్ హౌస్‌లను ఎందుకు షట్‌డౌన్ చేస్తుందనే అంశంపై స్పష్టత లేనప్పటికి వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు, కస్టమర్లకు మెరుగైన సేవలందించే క్రమంలో కొన్ని వేర్‌హౌస్‌ల మూసివేత, మరికొన్నింటిలో విస్తరణ చేపడతామని, అవసరమైన చోట న్యూ సైట్స్‌ను ఓపెన్ చేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అంతేకాదు తొలగిస్తున్న ఉద్యోగులు ఉపాధి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని,లేఆఫ్స్ ఉద్యోగులు అమెజాన్ సంస్థకు చెందిన ఇతర సర్వీసుల్లో లేదా సైట్లలో పని చేసే అవకాశాన్ని పొందుతారని కంపెనీ ప్రతినిధి ధృవీకరించారు. రాబోయే మూడేళ్లలో అమెజాన్ ఫిల్ఫుల్ సెంటర్లను ప్రారంభించాలని వెల్లడించారు. తద్వారా 2,500మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. -
టీసీఎస్ సంచలనం, ఇక ‘ఐటీ ఉద్యోగులకు పండగే!’
ప్రముఖ దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున ఇంటికి పంపిచేస్తున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం’ అంటూ కారణాలు చెప్పి చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ టీసీఎస్ అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంది. రానున్న రోజుల్లో సుమారు 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. టెక్ దిగ్గజం తాజాగా క్యూ3 ఫలితాల్ని విడుదల చేసింది. ఈ సందర్భంగా ..టీసీఎస్ జనవరి 9న 2023-24 ఆర్ధిక సంవత్సరం నాటికి సుమారు 1.25 లక్షల మంది నుంచి 1.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు గతేడాది డిసెంబర్ నెల ముగిసే సమయానికి సంస్థలో 613,974 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. క్యూ3లో 2,197 మంది ఉద్యోగులు సంస్థకు రిజైన్ చేశారు. అదే సమయంలో గడిచిన 18 నెలల కాలంలో భారీ ఎత్తున సిబ్బందిని హైర్ చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు రానున్న రోజుల్లో టీసీఎస్ నియామకాలు జోరుగా చేపట్టనున్నట్లు ఆ సంస్థ సీఈవో గోపీనాథన్ తెలిపారు. 150,000 మంది నియామకం టీసీఎస్ త్రైమాసిక ఫలితాల విడుదల అనంతరం కంపెనీ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపినాథన్ విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఉద్యోగుల్ని ఎలా నియమించుకున్నామో.. రానున్న రోజుల్లో ఆ తరహా ధోరణి కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1,25,000-1,50,000 మందిని నియమించుకోనున్నాం’ అని తెలిపారు. చదవండి👉 మూన్‌లైటింగ్ దుమారం, ఉద్యోగులపై ‘కాస్త సానుభూతి చూపించండయ్యా’ -
ఉద్యోగులకు దిగ్గజ కంపెనీ భారీ షాక్.. ఇక వేలాది మంది ఇంటికే
ఆర్ధిక మాంద్యం భయాల్లో ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్ భయాలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు దిగ్గజ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్మెంట్ బ్యాకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3,200 ఉద్యోగుల్ని ఫైర్ చేయనుంది. అస్థిరంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా కార్పొరేట్ డీల్స్‌లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్‌మన్ సాచ్చ్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ప్రకటించింది. చదవండి👉 ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ? -
కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో!
అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు వెరసి కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్‌ల మంత్రం అనుసరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు, కంపెనీ నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థలోని 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గతంలో కూడా ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే. 18 వేల మంది తొలగింపు ‘ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని మేము నవంబర్లోనే ప్రకటించాము. ప్రస్తుతం 18,000 సిబ్బందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని’ సీఈఓ ఆండీ జాస్సీ ఒక ప్రకటనలో తెలిపారు. జాస్సీ మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాల తొలగింపు చాలా మందిని ప్రభావితం చేస్తాయని తెలుసు, కానీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ లేఆఫ్‌లు వల్ల ప్రభావితమైన వారికి సపోర్ట్ ఇచ్చేందుకు కంపెనీ సహకరిస్తుందన్నారు. వారి చెల్లింపులు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, వేరే కంపెనీలో ఉద్యోగం కోసం కావాల్సిన సపోర్ట్ వంటి ప్యాకేజీలను అందిస్తున్నామని చెప్పారు. కొన్ని తొలగింపులు యూరప్‌లో ఉంటాయని, జనవరి 18 నుంచి ఎవరని తొలగించారనేది తెలుస్తుందని జాస్సీ చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల మంది ఉద్యోగులుండగా.. తాజా నిర్ణయాలతో 6 శాతం మంది ఉద్యోగులు ఇంటి బాటపట్టనున్నారు. చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు! -
ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం పోతే ఎలా?
ఆర్థిక మాంద్యం భయాలు మరో విడత కంపెనీలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలుగా పిలుచుకునే గూగుల్, ఫేస్ బుక్, అమెజాన్ అనే కాదు.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఐటీ, ఇతర రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. భారత్‌లో అమెజాన్, ట్విట్టర్ ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి. ప్రైవేటు రంగంలో ఉద్యోగానికి భద్రత తక్కువే. పని చేయించుకునే సంస్థలు, ప్రతికూల పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా సాగనంపుతాయి. కనుక ఎవరికి వారు తమవంతుగా భద్రత కల్పించుకోవాల్సిందే. ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా నెగ్గుకురావాలో ప్రణాళిక ఉండాలి. అందుకు ముందు నుంచే సన్నద్ధమై, దానికంటూ ఓ బడ్జెట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండగలరు. ఉపాధి కోల్పోయినప్పుడు మన ముందున్న మార్గాలేంటి? ముందస్తు సన్నాహేలేంటన్నది తెలియజేసే కథనమే ఇది. వ్యయాలపై నియంత్రణ కనీసం మీ వద్ద 3–4 నెలల అవసరాలు, రుణ ఈఎంఐల చెల్లింపులకు సరిపడా ఉంటే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదు. అప్పుడు ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకునే ప్రణాళిక ఉంటే సరిపోతుంది. అంత మేర లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయాలను చూడాలి. మన ఆర్జన ఆగినా, రుణానికి చెల్లింపులు చేస్తూనే ఉండాలి. నెలవారీ ఇంటి అద్దె, మొబైల్, డిష్ బిల్లుల విషయంలో రాజీపడలేరు. కనుక ఇతర వ్యయాలపై నియంత్రణ ఒక్కటే మార్గం. అందుబాటులో ఉన్న వనరులు ఎన్ని, దాంతో ఎన్ని నెలలు నెట్టుకురావచ్చన్న అంచనాకు రావాలి. బయట రెస్టారెంట్లలో తినడాలు, పర్యటనలు, సెలవుల్లో ఊర్లకు వెళ్లడాన్ని వాయిదా వేసుకోవాలి. వ్యక్తిగత వాహనాన్ని ఇంట్లోనే పెట్టేసి ప్రజా రవాణాను వినియోగించుకోవచ్చు. వారాంతపు పార్టీలకు విరామం పలకాలి. సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం మానేయాలి. మరీ కష్టంగా ఉంటే పెట్టుబడులను సైతం నిలిపివేసుకోక తప్పదు. పెట్టుబడుల ఉపసంహరణ – రుణ మార్గం ఉద్యోగం పోయిందని చెప్పి కంగారుగా పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవద్దు. సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వారు ముందుగా రెండు నెలల అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవాలి. బ్యాంకులో ఎఫ్డీ ఉంటే దాన్ని రద్దు చేసుకోవడం తప్పేమీ కాదు. ఆర్జన ఉండి, నెలవారీ చెల్లింపులు చేయగలిగినప్పుడే రుణాలు తీసుకోవడం సరైనది అవుతుంది. ఆర్జన నిలిచిపోయిన సమయాల్లో కొత్తగా రుణం తీసుకోకుండా ఉండడమే మెరుగైన మార్గం అవుతుంది. కానీ, పొదుపు లేనప్పుడు, మరో మార్గం లేకపోతే చివరిగా రుణాన్ని తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బంగారంపై తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. దీనిపై నెలవారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. వీటి గడువు ఏడాది, రెండేళ్లు ఉంటుంది. గడువు ముగిసిన రోజున అసలు చెల్లించడం లేదంటే తిరిగి అంతే కాలానికి రెన్యువల్ చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీపైనా రుణ సదుపాయం పొందొచ్చు. దీనిపైనా వడ్డీ రేటు తక్కువే. ఒక నెలపాటు ఉపాధి లేని వారు ఈపీఎఫ్ నిధి నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. తిరిగి ఉద్యోగం లభించిన తర్వాత పాత ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం అయితే రెండు నెలల పాటు ఉపాధి లేకుండా ఉంటే ఈపీఎఫ్ నిధి నుంచి మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించే వారు. అందుబాటులోని మార్గాల్లో తమకు ఏది అనుకూలమైనదో నిర్ణయించుకుని ముందుకు వెళ్లాలి. బీమా రక్షణ అవసరం జాబ్ లాస్ ఇన్సూరెన్స్ అంటూ ఒకటి ఉందని మెజారిటీ ఉద్యోగులకు తెలియని విషయం. కేవలం కొన్ని కంపెనీలే వీటిని ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో చాలా పరిమితులు ఉంటాయి. రుణ చెల్లింపుల బాధ్యతలు ఎక్కువగా ఉన్న వారికి ఇవి అనుకూలం. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన సందర్భాల్లో మూడు నెలల ఈఎంఐలకు సరిపడా చెల్లింపులు చేస్తాయి. ఇలా చెల్లించే మొత్తం అప్పటి వరకు పొందిన నెలవారీ వేతనంలో 50 శాతం మించకుండా ఉంటుంది. ఈ పాలసీ వార్షిక ప్రీమియం తాము పొందే వేతనంలో 5 శాతంలోపు ఉంటేనే తీసుకోవాలి. అంతకుమించి ప్రీమియం ఉంటే అది లాభదాయకం కాదు. ఇతర పాలసీలకు అనుబంధంగాం వీటిని బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ప్రమాదం కారణంగా శాశ్వత, పాక్షిక అంగవైకల్యానికి గురై ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడిన సందర్భాల్లోనూ ఇవి చెల్లింపులు చేస్తాయి. ఈ విషయంలో జాగ్రత్త జాబ్ లాస్ ఇన్సూరెన్స్‌లో ఉన్న ప్రధాన ప్రతిబంధకం.. కంపెనీ తొలగించిన సందర్భాల్లోనే వీటి కింద పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్లు ఆదరణకు నోచుకోకపోవడానికి ఇదే ముఖ్య కారణమని చెప్పుకోవాలి. కానీ, స్వచ్చందంగా ఉద్యోగం మానేసే వారు ముందుగానే సన్నద్ధమై ఆ పనిచేయవచ్చు. ఉన్నట్టుండి కంపెనీ తొలగించినప్పుడే కదా బీమా అవసరం ఏర్పడేది. మురో ముఖ్యమైన అంశం.. పనితీరు బాగాలేదని చెప్పి తొలగించినట్టయితే పరిహారానికి అర్హత లభించదు. కంపెనీల మధ్య విలీనం, కొనుగోలు కారణంగా తప్పించినప్పుడు కూడా బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్కరిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు షరతులు, నియమ, నిబంధనలు, మినహాయింపులు అన్నీ చదివి తెలుసుకోవాలి. కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందనే దానికి ఆధారంగా ఎలాంటి డాక్యుమెంట్ లేకపోయినా, పరిహారం లభిస్తుందా? అన్నది కనుక్కోవాలి. కాంట్రాక్టు ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ పాలసీలు ఇవ్వరు. ఆయా అంశాల్లో నిపుణుల సూచనలు అవసరం. ఈఎస్ఐసీ బీమా.. సంఘటిత రంగంలో పనిచేస్తూ, ఈఎస్ఐసీ కిందకు వచ్చే వారికి రాజీవ్ గాంధీ శ్రామిక్ కల్యాణ్ యోజన (ఆర్జీఎస్కేవై) పథకం ఒకటి ఉంది. దీని కింద ఉపాధిని కోల్పోయిన వారికి రెండేళ్లపాటు పరిహారం లభిస్తుంది. అప్పటి వరకు పొందిన వేతనంలో 50 శాతం ఏడాది పాటు, 13వ నెల నుంచి 24వ నెల వరకు 25 శాతం చొప్పున చెల్లిస్తారు. అదే కాలంలో ఈఎస్ఐ హాస్పిటల్స్, డిస్పెన్సరీల్లో ఉచిత వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయి. తన తప్పిదం లేకుండా ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వారు 30 రోజుల్లోపు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. రూ.21వేల వేతనంలోపు వారికే ఈఎస్ఐ సదుపాయం పరిమితం. ఇంతకుమించి వేతనం ఉన్న వారు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే. వీటిని మిస్ కాకూడదు కష్టకాలంలో రుణ ఈఎంఐలను చెల్లించకపోతే, అది వ్యక్తిగత రుణ చరిత్రలో పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. భవిష్యత్తులో రుణం లభించడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వచ్చినా, అధిక రుణ రేటును చెల్లించాల్సి రావచ్చు. అందుకుని ఈఎంఐ చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపివేయకూడదు. అలాగే, బీమా పాలసీల ప్రీమియం చెల్లింపుల్లోనూ విఫలం కావద్దు. ఒకవేళ పెట్టుబడులకు సంబంధించి ఆటోడెబిట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటే వాటిని వెంటనే నిలిపివేయడం సరైనది. ఇదీ ఒక అవకాశమే ఉపాధి లేనప్పుడు చేతిలో బోలెడంత సమయం ఉంటుంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని, తమ నైపుణ్యాలను మరింత పెంచుకునే మార్గాలను చూడొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మరింత వేతనంతో కూడిన అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, ఇతరులతో పోలిస్తే మెరుగైన వృద్ధిని చూడగలరు. ఆర్జన ఆగిందని చెప్పి, ఆందోళనతో ఉండిపోకూడదు. అవకాశాలను వెతుక్కోవాలి. అప్పటి వరకు తాము పనిచేస్తున్న రంగంలోని పని పరిస్థితులు నచ్చని వారికి.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇతర నైపుణ్యాలతో వేరే రంగంలోని ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అత్యవసర నిధి ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉండదు. ఊహించని విధంగా ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోయినా.. లేదా నచ్చక మానేసినా అత్యవసర నిధి ఆదుకుంటుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక సలహాదారులు తరచూ సూచించేంది ముందు చూపుతోనే. దీన్ని ఆచరణలో పెట్టిన వారు నిశ్చితంగా ఉండొచ్చు. ప్రతికూల పరిస్థితులను సులభంగా అధిగమించొచ్చు. అత్యవసర నిధిని లిక్విడ్ ఫండ్స్ లేదంటే బ్యాంకు ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అత్యవసర నిధి ఆరు నెలలు లేదా ఏడాది అవసరాలకు సరిపడా ఉండాలన్నది కేవలం ఒక సాధారణ సూత్రమే. ఆర్థిక బాధ్యతలు అందరికీ ఒకే విధంగా ఉండవు. ఎంత కాలం అవసరాలకు సరిపడా సమకూర్చుకోవాలన్నది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన సమయంలో అత్యవసర నిధిని వివేకంగా ఖర్చు చేయడం కూడా అవసరం. ఎందుకంటే తిరిగి మళ్లీ ఉద్యోగం సంపాదించి, కుదురుకోవడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ఇలా ఖర్చు చేసిన మేర, తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత సమకూర్చుకోవడం అంతే ముఖ్యం. ఆదాయ మార్గాలు ఉద్యోగం కోల్పోయినప్పుడు సహజంగా తిరిగి ఉపాధి కోసం అన్వేషణ మొదల పెడుతుంటారు. మరో ఉపాధి లభించేంత వరకు రోజులు వృథా కాకుండా, తాత్కాలిక పనిలో అయినా కుదరడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల కుటుంబ వ్యయాలకు ఎంతో కొంత సమకూర్చుకోవచ్చు. ఈ కామర్స్, రిటైల్ రంగంలో తాత్కాలిక ఉపాధి అవకాశాలను పొందొచ్చు. నైపుణ్యాలు ఉండి, తక్కువ వేతనానికి పనిచేస్తానంటే ఆర్థిక సంక్షోభ సమయాల్లో కొన్ని కంపెనీలు ఉపాధి కల్పిస్తుంటాయి. అలాంటివి మార్గాలను అన్వేషించొచ్చు. తక్కువ వేతనానికి ఎందుకు చేరాలి? మంచి ఉద్యోగమే చూసుకుందాం! అని కాకుండా, మంచి ఉద్యోగ ఆఫర్‌ను గుర్తించేంత వరకు ఇలాంటి సంస్థల్లో చేరిపోవచ్చు. తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఏదో ఒక తాత్కాలిక ఉపాధి పొందడం నేడు అంత కష్టమైన పనికాదు. హెల్త్ ఇన్సూరెన్స్ ముందే అనుకున్నట్టు ప్రైవేటు రంగంలో ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. మెరుగైన వేతనం, పని పరిస్థితుల కోసం సంస్థను మార్చొచ్చు. ఇలా తరచూ కంపెనీలను మార్చే వారికి ఆయా సంస్థలు అందించే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌పైనే ఆధారపడడం అంత సురక్షితం అనిపించుకోదు. సంస్థను బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు, కవరేజీ భిన్నంగా ఉంటాయి. కొన్ని సంస్థలు అసలు హెల్త్ ఇన్సూరెన్స్నే ఆఫర్ చేయడం లేదు. ఒక ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్య అవసరాల గురించి కంపెనీలకు అవగాహన ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దీర్ఘకాల వ్యాధులు, జీవనశైలి వ్యాధులు ఉండొచ్చు. లేదంటే తమ కుటుంబంలో ఈ విధమైన వ్యాధుల చరిత్ర ఉండొచ్చు. అలాంటి వారి హెల్త్ ఇన్సూరెన్స్ అవసరాలు ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కనుక కంపెనీలు అందించే గ్రూప్ హెల్త్ ప్లాన్‌తో సంబంధం లేకుండా.. ప్రతి ఉద్యోగి అవివాహితులు అయితే ఇండివిడ్యువల్, పెళ్లయిన వారు ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలి. ఇలా తీసుకునే ప్లాన్ తమ అవసరాలు అన్నింటినీ తీర్చే విధంగా జాగ్రత్తపడాలి. -
రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో బడా కంపెనీలు కొత్త ఏడాది తమ స్థానాలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా కసరత్తు చేయనున్నాయి. దీంతో 2023లోనూ కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి అవకాశాలు ఆశావహంగానే కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణంపరమైన ప్రతికూలతలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళనల కారణంగా పరిశ్రమ కొంత ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు తెలిపారు. సమర్ధమంతమైన పెద్ద సంస్థలకు చాలా మటుకు చిన్న రిటైలర్లు తమ వ్యాపారాలను విక్రయించి తప్పుకునే అవకాశాలు ఉండటంతో 2023లో కన్సాలిడేషన్ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ పార్ట్నర్ రజత్ వాహి చెప్పారు. కస్టమరుకు అత్యుత్తమ అనుభూతిని ఇచ్చేందుకు స్టోర్స్‌లో టెక్నాలజీ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మిగతా కీలక మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో రిటైల్ విభాగం మెరుగైన వృద్ధి సాధించగలదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఓఎన్డీసీ (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్) వంటి కాన్సెప్టులతో రాబోయే రోజుల్లో అసంఖ్యాకంగా చిన్న రిటైలర్లు డిజిటల్ కామర్స్‌లో పాలుపంచుకుంటారని వివరించారు. ఆదాయాల్లో 20 శాతం వరకూ వృద్ధి .. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సంఘటిత రంగ ఆహార, నిత్యావసరాల రిటైలర్ల ఆదాయాలు 15–20 శాతం శ్రేణిలో పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది. అయితే, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్లు 5–6 శాతం శ్రేణికి పరిమితం కావచ్చని వివరించింది. సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం, మెట్రో నగరాలను దాటి కార్యకలాపాలను విస్తరించడం తదితర అంశాలపై కంపెనీలు దృష్టి పెట్టనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై భారత విభాగం లీడర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్, రిటైల్) అంశుమన్ భట్టాచార్య తెలిపారు. ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించే తరుణంలో ఒకసారి 2022లో రిటైల్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు కొన్ని చూస్తే .. ► ఏకంగా 16,600 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్ రిటైల్ దేశీయంగా అతి పెద్ద ఆఫ్‌లైన్ రిటైలరుగా ఎదిగింది. 18 బిలియన్ డాలర్ల ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ రిటైలర్లలో 56వ స్థానంలోనూ, అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మన్ రిటైల్ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. అలాగే, అబు జానీ సందీప్ ఖోస్లా (ఏజేఎస్కే), పర్పుల్ పాండా ఫ్యాషన్స్ మొదలైన పలు ఫ్యాషన్స్ బ్రాండ్స్‌లో, రోబోటిక్స్ కంపెనీ యాడ్వర్బ్లోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ► ఆదిత్య బిర్లా గ్రూప్‌లో బాగమైన టీఎంఆర్‌డబ్ల్యూ సంస్థ ఫ్యాషన్ కేటగిరీలో ఎనిమిది డిజిటల్ ఫస్ట్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్‌లో మెజారిటీ వాటాలు తీసుకుంది. ► ఆన్లైన్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా వీ–మార్ట్ సంస్థ లైమ్‌రోడ్‌ను కొనుగోలు చేసింది. ► దేశీ రిటైల్ పరిశ్రమలో దిగ్గజంగా వెలుగొందిన ఫ్యూచర్ రిటైల్ కుప్పకూలింది. దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది. -
న్యూ ఇయర్లో లేఆఫ్స్ బాంబ్.. భారీ ఎత్తున గూగుల్,అమెజాన్ ఉద్యోగుల తొలగింపు!
వచ్చే ఏడాదిలో భారీ ఎత్తున ఉద్యోగులు తొలగింపు ఉంటుందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్,అమెజాన్ ఉద్యోగులపై లేఆఫ్స్ బాంబు పేల్చాయి. 2023లో పనితీరు సరిగ్గా లేని కారణంగా 6 శాతం ఉద్యోగుల్ని గూగుల్ ఫైర్ చేయనున్నట్లు సమాచారం. గూగుల్ బాటలో అమెజాన్ సైతం లేఆఫ్స్‌కు తెరతీసింది. గత వారం గూగుల్ తన ఉద్యోగులతో సమావేశం నిర్వహించింది. ఆ మీటింగ్‌లో ఫుల్ టైమ్ ఉద్యోగుల్లో 6 శాతం (10వేల) మంది పేలవమైన పనితీరు ప్రదర్శిస్తున్న జాబితాలో ఉన్నట్లు గూగుల్ అంచనా వేస్తోంది. 22 శాతం మంది ఉద్యోగులు పనితీరు బాగుండగా..మరికొంత మంది ఉద్యోగులు సంస్థ తెచ్చిన కొత్త వర్క్ కల్చర్‌లో విధానపరమైన, సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేస్తున్నారని నివేదిక పేర్కొంది. అంచనాలకు మించి పనితీరు ఆధారంగా వర్క్ ఫోర్స్‌ని తగ్గించాలని గూగుల్ యోచిస్తున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. కంపెనీ కొత్త విధానంలో ఉద్యోగుల పనితీరును అంచనా వేస్తోంది. నివేదిక ప్రకారం, ఒక ఉద్యోగి అత్యధిక రేటింగ్ పొందిన కేటగిరీలో ఉండాలనుకుంటే తప్పనిసరిగా సంస్థ అంచనాలను మించి పనితీరు ఉండాలి. స్పందించని సుందర్ పిచాయ్ గూగుల్ నిర్వహించిన ఉద్యోగుల మీటింగ్‌లో లేఆఫ్స్‌పై ప్రకటన వస్తుందని సిబ్బంది ఆందోనళన వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా సీఈవో సుందర్ పిచాయ్ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడ లేదు. అయితే కంపెనీ ప్రతిదానిపై పూర్తి పారదర్శకతను ఉంచుతుందని ఉద్యోగులకు చెప్పినట్లు, లేఆఫ్స్ ఉన్నాయా? లేవా? హెడ్కౌంట్లను ఎలా ఫైర్ చేయాలో ఆలోచిస్తున్నట్లు సదరు నివేదిక హైలెట్ చేసింది. ముందుగానే హెచ్చరికలు వచ్చే ఏడాది తొలగింపులు ఉంటాయంటూ ఈ ఏడాది నుంచి గూగుల్ ఉద్యోగుల్ని అప్రమత్తం చేసింది. గూగుల్‌తో పాటు అమెజాన్ సైతం వచ్చే ఏడాది ఉద్యోగుల తొలగింపులపై ధృవీకరించింది. ఆ తొలగింపు సంఖ్యపై ఆ సంస్థ యాజమాన్యం స్పందించలేదు. కానీ అమెజాన్ 20వేల మందిని తొలగించాలని యోచిస్తోందంటూ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. -
ఐటీ ఉద్యోగుల్ని ముంచెత్తనున్న లేఆఫ్స్ సునామీ?
ఐటీ జాబ్స్! యువతకు డ్రీమ్ డెస్టినేషన్. భారీ వేతనాలు, వారంలో రెండు రోజుల సెలవులు, ఉద్యోగంలో చేరిన కొద్ది రోజులకే కొత్త ఇల్లు సహా.. ఏదైనా కొనగలిగే సమర్ధత. ఈఎంఐ సౌకర్యంతో ఏదైనా కొనేసే ఆర్ధిక స్థోమత. మొత్తంగా ఐటీ ఉద్యోగం అంటే లైఫ్ సెటిల్ అన్న ఫీలింగ్. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే ఆర్ధిక నిపుణుల అంచనాల కారణంగా స్టార్టప్స్ నుంచి దిగ్గజ టెక్ కంపెనీల వరకు ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే చిన్న, పెద్ద, మధ్య తరహా సంస్థలు ఈ ఏడాదిలో లక్షల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. గతేడాది టాప్ టెక్ దిగ్గజ సంస్థలైన ట్విటర్, యాపిల్, మెటాతో పాటు ఇతర కంపెనీలు వందల మందిని ఫైర్ చేశాయి. తాజాగా అమెరికాకు చెందిన ప్లేస్మెంట్ సంస్థ ఛాలెంజర్, గ్రే అండ్ క్రిస్మస్ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది 965 సంస్థలు లక్షా 50 వేల మందికి పింక్ స్లిప్‌లు జారీ చేసినట్లు తేలింది. వచ్చే ఏడాదిలో ఆ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచిత్రంగా ప్రస్తుతం తొలగింపులు 2008-09లో తలెత్తిన ఆర్ధిక మాద్యం వల్ల పోగొట్టుకున్న ఉద్యోగాల కంటే ఎక్కువగా ఉంది. 2018లో టెక్ కంపెనీలు 65,000 మంది ఉద్యోగులను తొలగించాయని, 2019లో కూడా అదే సంఖ్యలో టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయారని సంస్థ గత నివేదికలు తెలిపాయి.కోవిడ్-19 ప్రారంభమైనప్పటి నుండి సుమారు 1400 టెక్ కంపెనీలు 2 లక్షల మందికి పైగా ఉద్యోగులను తొలగించాయని లేఆఫ్స్.ఫైఐ డేటా వెల్లడించింది. 2022 టెక్ రంగానికి అత్యంత చెత్త సంవత్సరంగా కాగా...2023 ప్రారంభంలో టెక్ పరిశ్రమ మరింత అధ్వాన్నంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. నవంబర్ మధ్య నాటికి, మెటా, ట్విటర్, సేల్స్ ఫోర్స్ , నెట్‌ఫ్లిక్స్ తో పాటు ఇతర టెక్ కంపెనీలు యుఎస్ టెక్ రంగంలో 73,000 మందికి పైగా సిబ్బందని తొలగించగా.. భారత్‌లో 17000 మందికి పైగా ఉపాధి కోల్పోయారు. టెక్ విభాగంలో తొలగింపులు సంవత్సరం మొదటి అర్ధభాగంలో ప్రారంభమై సంవత్సరం పొడవునా కొనసాగుతాయి. 2023 మొదటి అర్ధభాగంలో టెక్ తొలగింపులు మరింత దిగజారుతాయని నివేదికలు సూచిస్తున్నాయి. మెటా, అమెజాన్, ట్విటర్, నెట్ ఫ్లిక్స్ సహా అనేక పెద్ద టెక్ కంపెనీలు ఇప్పటికే 2022 వరకు వందలు, వేల మంది తొలగించాయి. ట్విటర్, మెటా, అమెజాన్ తో పాటు అనేక ఇతర టెక్ కంపెనీలు ఇప్పటికే తొలగించగా.. గూగుల్ వంటి కంపెనీలు రాబోయే నెలల్లో దాదాపు వేలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
అంతర్జాతీయ తయారీదారులను ఆకర్షించాలి
న్యూఢిల్లీ: భారత్‌ను అంతర్జాతీయ తయారీ కేంద్రంగా, వనరుల సమీకరణ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు, కావాల్సిన విధానాలను రూపొందించాలని దేశీ పరిశ్రమను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యం రిస్క్‌లను ఎదుర్కొంటున్న వేళ అక్కడ వ్యాపారాలు ఎలా నడుస్తున్నాయో అధ్యయనం చేయాలని సూచించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్రం ఎన్నో వసతులతోపాటు, నిబంధనలను కూడా సవరించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ‘‘పాశ్చాత్య, అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మాంద్యం నేపథ్యంలో మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. అక్కడి తయారీ దారులను భారత్‌కు తీసుకొచ్చేందుకు కావాల్సిన వ్యూహాలపై పనిచేసేందుకు ఇదే సరైన సమయం. ఆయా కంపెనీల ప్రధాన కార్యాలయాలు అక్కడే ఉన్నా కానీ.. ఎన్నో ఉత్పత్తులు, విడిభాగాలను ఇక్కడి నుంచి సమీకరించుకోవడం వాటికి సైతం సాయంగా ఉంటుంది. కొంతవరకు తయారీని ఇక్కడ చేయడం అవసరం’’అని మంత్రి శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 95వ వార్షిక సమావేశంలో భాగంగా పరిశ్రమకు సూచించారు. దీర్ఘకాలం కొనసాగే మాంద్యం వల్ల యూరప్‌పై ప్రభావం పడుతుందన్న మంత్రి.. భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చన్నారు. యూరప్ తదితర పాశ్చాత్య ప్రపంచంలో పనిచేసే కంపెనీలకు, భారత్ ప్రత్యామ్నాయ కేంద్రం కాగలదన్నారు. ఇప్పుడు ప్లస్ 2..: భారత్ చైనా ప్లస్1గా పనిచేస్తోందని, యూరప్ ప్లస్ వన్‌గా కూడా మారుతోందని మంత్రి సీతారామన్ అన్నారు. ‘‘కనుక ప్లస్ వన్ ఇప్పుడు ప్లస్ 2గా మారింది. ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో వసతులు కల్పించింది. నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది. భారత్‌కు తయారీ వసతులను తరలించాలనుకుంటున్న కంపెనీలతో సంప్రదింపులు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కొందరు భారత్ తయారీపై దృష్టి సారించొద్దని, కేవలం సేవలపైనే దృష్టి పెట్టాలన్న సూచనలు చేస్తున్నారు. కానీ ఇదీ కుదరదు. తయారీపై, కొత్త విభాగాలపై తప్పకుండా దృష్టి పెట్టాల్సిందే’’అని మంత్రి స్పష్టత ఇచ్చారు. చైనా తయారీ నమూనాను గుడ్డిగా అనుసరించకుండా, భారత్ సేవలపైనే దృష్టి కొనసాగించాలంటూ పలువురు ఆర్థికవేత్తలు, నిపుణులు సూచిస్తున్న క్రమంలో మంత్రి దీనిపై మాట్లాడారు. ఇప్పటికే మన దేశ జీడీపీలో ఐటీ ఆధారిత సేవల రంగం వాటా 60 శాతంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు. వాతావరణ మార్పులు తమపై ఏవిధమైన ప్రభావం చూపిస్తున్నాయన్నది పరిశ్రమ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. తమపై దీనికి సంబంధించి వ్యయాల భారాన్ని ఎలా తగ్గించాలో కూడా సూచనలు ఇవ్వాలని కోరారు. వృద్ధి ఆధారిత బడ్జెట్ వచ్చే బడ్జెట్లోనూ (2023–24) పూర్వపు బడ్జెట్ స్ఫూర్తి కొనసాగుతుందని, వృద్ధికి మద్దతుగా ఉంటుందని మంత్రి సీతారామన్ సంకేతం ఇచ్చారు. భారత్‌ను వచ్చే 25 ఏళ్ల కాలానికి ముందుకు నడిపించే పునాదిగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరానికి భారత్ జీడీపీ వృద్ధి అంచనాలను ఆర్బీఐ సహా అంతర్జాతీయ ఏజెన్సీలు తగ్గిస్తున్న తరుణంలో.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మంత్రి సీతారామన్ సమర్పించే బడ్జెట్ కీలకంగా మారింది. వచ్చే ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు మంత్రి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. 2024–25లో 5 ట్రిలియన్ డాలర్లకు: నితిన్ గడ్కరీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తోందని, 2024–25 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.410 లక్షల కోట్లు) స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యాన్ని సాధిస్తామని కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఫిక్కీ నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం సుస్థిరాభివృద్ధి కోసం వృద్ధిని, ఉపాధిని పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. -
ఆర్థిక మాంద్యమనే బెంగే వద్దు, పిలిచి మరీ జాబ్ ఇస్తున్నారు..లక్షల్లో ఉద్యోగాలు
ఆర్ధిక మాంద్యం భయాలతో అమెజాన్, ట్విటర్, మెటా, విప్రో, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. రానున్న 18 నెలలు ఉద్యోగులకు గడ్డు కాలమేనని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ కంపెనీల్లో పరిస్థితులు ఇలా ఉంటే మనదేశానికి చెందిన స్టార్టప్స్‌లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. లక్షల స్టార్టప్‌లలో లక్షల ఉద్యోగాలు ఉన్నట్లు తేలింది. ఆయా స్టార్టప్‌లు అవసరాన్ని బట్టి ఇప్పటికే 2 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్య భారీ స్థాయిలో పెరగనుంది. ఆర్థిక సేవల ప్లాట్‌ఫారమ్, స్ట్రైడ్‌వన్ నివేదిక ప్రకారం 2022లో మనదేశానికి స్టార్టప్‌లు 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాయి. స్టార్టప్‌ల ద్వారా ఉద్యోగాల కల్పన 2017-22 మధ్య 78 శాతం వృద్ధి సాధించినట్లు నివేదిక వెల్లడించింది. అదనంగా, దేశ ప్రభుత్వం డిజిటల్ ఎకానమీపై దృష్టి సారించడంతో ఉద్యోగాల కల్పన 2025 నాటికి 70 రెట్లు పెంచుతుందని హైలైట్ చేసింది. ఇండియన్ స్టార్టప్ ఈకో సిస్టం అమెరికా, చైనా తర్వాత ప్రపంచ దేశాల్లో మూడవ అతి పెద్ద దేశంగా భారత్ అవతరించింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం(ఇంటర్నల్ ట్రేడ్) విభాగంలో 770,000 పైగా స్టార్టప్‌లు నమోదు చేసుకున్నాయి. 108 యునికార్న్‌లతో కూడిన, స్టార్ట్ అప్ల సంయుక్త విలువ $400 బిలియన్లకు పైగా ఉంది. ఈ సందర్భంగా స్ట్రైడ్‌వన్ వ్యవస్థాపకుడు ఇష్ప్రీత్ సింగ్ గాంధీ మాట్లాడుతూ..స్కేలబిలిటీ, ఆల్టర్నేట్ ఫండింగ్ ఆప్షన్లు, గ్లోబల్ మార్కెట్లోకి విస్తరించడం వంటి వివిధ అంశాలలో పర్యావరణ వ్యవస్థ పెరుగుదల అనేక అవకాశాలను సృష్టించిందని, తద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించే సామర్ధ్యాన్ని కూడా పెంచింది. దీంతో భారతదేశ జీడీపీకి సుమారు 4-5 శాతం దోహదపడే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది’ అని చెప్పారు. -
ఉద్యోగులను పీకేసిన మరో దిగ్గజ కంపెనీ.. 4 వేల మందికి భారీ షాక్!
టెలికం పరికరాల తయారీ సంస్థ సిస్కో ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. సంస్థ నుంచి సుమారు 4వేల మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. అన్నీ కంపెనీల తరహాలో సిస్కో సైతం ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుంది. ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఫైర్ చేస్తున్నాం’ అని వెల్లడించింది. రీబ్యాలెన్సింగ్‌లో భాగంగా కొన్ని వ్యాపారాల దిద్దుబాటు క్రమంలో సిస్కో 4000 మంది ఉద్యోగులను సాగనంపే ప్రక్రియను ప్రారంభించిందనే వార్తలు టెకీల్లో కలకలం రేపింది. మరోవైపు తొలగించిన ఉద్యోగులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇక, సిస్కో తొలగించనున్న ఉద్యోగులు తమకు వేరే కంపెనీల్లో జాబ్‌ల కోసం రిఫర్ చేయాలని వారు ఆయా వేదికలపై అభ్యర్ధించారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అధికారికంగా సిస్కో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. -
ఆర్బీఐ కీలక నిర్ణయం, దేశంలో పెరిగిపోతున్న ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకపు నిల్వలు (ఫారెక్స్) వరుసగా నాలుగో వారం కూడా పురోగమించాయి. డిసెంబర్ 2వ తేదీతో ముగిసిన వారంలో 11 బిలియన్ డాలర్లు పెరిగి 561.162 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్ 2021న దేశ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్లకు చేరాయి. అయితే అంతర్జాతీయ పరిణామాలు, రూపాయి బలహీనత, ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు ఆర్బీఐ పరిమిత జోక్యం, తదితర కారణాల నేపథ్యంలో క్రమంగా 520 బిలియన్ డాలర్ల వరకూ దిగివచ్చాయి. ఒక దశలో వరుసగా ఎనిమిది నెలలూ దిగువబాటన పయనించాయి. కొంత ఒడిదుడుకులతో డిసెంబర్ 2తో గడచిన నెలరోజుల్లో ఫారెక్స్ పెరుగుదల ధోరణి ప్రారంభమైంది. తాజా గణాంకాలు విభాగాల వారీగా చూస్తే.. ►డాలర్ల రూపంలో పేర్కొనే వివిధ దేశాల కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ) 9.694 బిలియన్ డాలర్లు పెరిగి 496.984 బిలియన్ డాలర్లకు చేరాయి. ►పసిడి నిల్వలు 1.086 బిలియన్ డాలర్లు పెరిగి 41.025 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ►అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 164 మిలియన్ డాలర్లు తగి 18.04 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ►ఇక ఐఎంఎఫ్ వద్ద రిజర్వ్ పరిస్థితి 75 మిలియన్ డాలర్లు తగ్గి 5.108 బిలియన్ డాలర్లకు చేరింది. -
‘ఏ పూట ఉద్యోగం ఊడుతుందో’, మరోసారి గూగుల్,అమెజాన్ షాకింగ్ నిర్ణయం?
ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యోగుల తొలగింపులు నిపుణులు అంచనాలకు మించి ఉంటాయంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఇటీవల ప్రకటించిన కంపెనీ ఫలితాల్లో నష్టాలు రావడంతో మెటా 11 వేల మందిని ఫైర్ చేసింది. రెసిషన్ ముప్పుతో సంస్థలు అడ్వటైజ్మెంట్పై చేసే ఖర్చు తగ్గించుకోవడం వల్లే నష్టాలు వచ్చిపడుతున్నాయని, కాబట్టే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపింది. ఇక తాజాగా మెటా దారిలో గూగుల్, అమెజాన్లు మరోసారి భారీ ఎత్తున లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. 20వేలు కాదు అంతకంటే ఎక్కువే? మెటా తర్వాత అమెజాన్ ఉద్యోగుల తొలగింపులపై అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి నుంచి 2023 ప్రారంభం వరకు సంస్థలోని అన్నీ విభాగాల్ని రివ్యూ చేస్తున్నాం. ఆ రివ్యూ ఆధారంగా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా ఉద్యోగుల్ని తొలగిస్తామని అమెజాన్ సీఈవో జెఫ్‌బెజోస్ తెలిపారు. అయితే ఎంతమందికి అమెజాన్ పింక్ స్లిప్‌లు జారీ చేయనుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. పలు నివేదికల ప్రకారం.. 20వేల మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టనుందని తెలిపగా.. నవంబర్ నెలలో 10వేల మందిపై వేటు వేసింది. త్వరలో 20 వేలు, అంతకంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపనుందని సమాచారం. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా అమెజాన్ పలు ప్రాజెక్ట్‌ల్ని బీటా టెస్టింగ్‌కే పరిమితం చేసింది. ఏ మాత్రం లాభాసాటి లేని వ్యాపారాల్ని (భారత్‌లో అమెజాన్ అకాడమీ) షట్ డౌన్ చేస్తుంది. అమెజాన్ దారిలో గూగుల్ గూగుల్ సైతం తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 6 శాతం అంటే 10వేల మందిని ఫైర్ చేయగా.. 2023 ప్రారంభం నాటికి పనితీరును బట్టి ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనుంది. ఇందుకోసం ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలని సెర్చ్ దిగ్గజం మేనేజర్లను కోరింది. తద్వారా పేలవ పనితీరు కనబరిచిన వారిని తొలగించే అవకాశం ఉంది. ఈ ఏడాది క్యూ4 నిరాశజనకమైన ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న యాజమాన్యం నియామకాల్ని నిలిపేసింది. ఖర్చులను ఆదా చేయడానికి ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తే నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. కానీ ఉద్యోగుల్ని ఫైర్ చేయడం, పింక్ స్లిప్‌లు జారీ చేసిన ఉద్యోగులకు ఇతర బెన్ఫిట్స్ అందించ లేమని తేల్చి చెప్పింది. చదవండి👉 ‘ఇక నిద్ర పోండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం! -
ఆ మూడు సంస్థల ఉద్యోగులకు భారీ షాక్, త్వరలోనే తొలగింపు
ఆర్ధిక మాద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలు కాస్ట్ కటింగ్ రూల్‌ను ఫాలో అవుతున్నాయి. అందులో భాగంగా ఇటీవల ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 20వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయగా..అడోబ్ సైతం మరో 100 మందిని ఇంటికి సాగనంపనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా స్విగ్గీ, ఎడ్యూటెక్ కంపెనీ వేదాంతులు’ వందల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నాయి. ఫుడ్ ఆగ్రిగేటర్ స్విగ్గీ ఈ డిసెంబర్ నెలలో 250మంది తొలగించనున్నట్లు సమాచారం. దీంతో పాటు రానున్న నెలల్లో స్విగ్గీకి చెందిన ఫుడ్ గ్రాసరీకి చెందిన వందల మందిపై వేటు వేసే ప్రణాళికల్లో ఉండగా..ఈ తొలగింపులపై ఆ సంస్థ ప్రతినిధులు స్పందించలేదు. కానీ పనితీరు ఆధారంగా ఉద్యోగుల్ని ఉంచాలా? తొలగించాలా? అనేది తదుపరి నిర్ణయం తీసుకుంటామని యాజమాన్యం చెబుతుంది. సంస్థకు అనుగుణంగా విధుల నిర్వర్తించలేని ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇప్పటికే సమాచారం అందించింది. ఖర్చుల్ని ఆదా చేసేందుకు కంపెనీ తన ఇన్‌స్టామార్ట్ ఉద్యోగుల్ని సైతం ఉద్యోగం నుంచి తొలగించనుంది. అదేవిధంగా ఎడ్యుటెక్ కంపెనీ వేదాంతు 385 మంది ఉద్యోగులను తొలగించింది . కంపెనీ తన వర్క్ ఫోర్స్‌ను 11.6 శాతం తగ్గించినట్లు నివేదించింది. నిధుల కొరత కారణంగా ఈ ఏడాది వేదాంతు దాదాపు 1100 మందికి పింక్ స్లిప్ జారీ చేయగా..ప్రస్తుతం ఈ ఎడ్యుటెక్ కంపెనీలో 3,300 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. కొన్ని రోజుల క్రితం,అడోబ్ ఖర్చులను తగ్గించుకోవడానికి సేల్స్ విభాగంలో 100 మందిని తొలగించనున్నట్లు సమాచారం.అడోబ్ ‘కొంతమంది ఉద్యోగులను ఆయా డిపార్ట్మెంట్లకు మార్చింది. విధులకు అవసరమైన వారిని నియమించుటుంది. అవసరానికి మించి ఉన్న వారిని తొలగిస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. -
'సారీ..అంత ఇచ్చుకోలేం!', మెటా ఉద్యోగులకు మరో భారీ షాక్?
సంస్థ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వేరే దారి లేదంటూ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పెట్టారు. తప్పులేదు. అంతవరకు బాగానే ఉన్న. జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తూ.. సదరు సిబ్బందికి సెవరన్సు పే (Severance Pay) అందిస్తామని చెప్పారు. సెవరన్సు పే అంటే? సంస్థ అకస్మాత్తుగా ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు..రానున్న రోజుల్లో ఉద్యోగి, అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ 11వేల మందికి పింక్ స్లిప్ జారీ చేసే సమయంలో మెటాలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 16 వారాల బేస్ సెరారెన్స్ పేతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల వేతనాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 6 నెలల పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ అలవెన్స్‌లు వర్తిస్తాయని తెలిపింది. అయితే తాజాగా మెటా కేవలం 8 వారాల బేస్ పే, మూడు నెలల ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. తాము కాంట్రాక్ట్ ఉద్యోగులం కాదని, అయినా తమ పట్ల యాజమాన్యం ఇలా ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఫైర్ చేసిన ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే జుకర్ బర్గ్ హామీ ఇచ్చినట్లు బెన్ఫిట్స్ అందిస్తున్నారని, మిగిలిన ఉద్యోగుల విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగం కోల్పోయి తక్కువ సెవరన్సు పే పొందిన ఉద్యోగుల గురించి సమాచారం కావాలని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇతర ఎగ్జిక్యూటీవ్లకు లేఖ పంపారని, సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
చావు కబురు చల్లగా అన్నట్టు: కార్పొరేట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యం కారణంగా పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పలు దిగ్గజ సంస్థల్లో కొనసాగుతోంది. తాజాగా ఈ బాటలో మరో గ్లోబల్‌సంస్థ పెప్సీకో నిలిచింది. స్నాక్స్ అండ్ శీతల పానీయల కంపెనీ వందలాదిమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పెప్సీకో అంతర్గత మెమో జారీ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది.ఉత్తర అమెరికాలో వందలాది కార్పొరేట్ ఉద్యోగాలను తొలగిస్తోందని తెలిపింది. ఈ వార్తలతో అంతర్జాతీయ దిగ్గజసంస్థ పెప్సీకో తన కంపెనీ ఉద్యోగుల్లు గుండెల్లో బాంబు పేలింది. పెప్సికో పెప్సి కోలా డ్రింక్‌తో పాటు డోరిటోస్, లేస్ చిప్స్ , క్వేకర్ ఓట్స్‌ని తయారు చేస్తుంది. పెప్సీకోలో ప్రపంచవ్యాప్తంగా 309,000 మంది ఉద్యోగులున్నారు. వీరిలో 40శాతానికి మంచి అమెరికాలోనే ఉన్నారు. స్వచ్ఛంద పదవీ విరమణ కార్యక్రమం ద్వారా ఇప్పటికే స్నాక్స్ యూనిట్లో ఉద్యోగాల కోత నేపథ్యంలో ఇక పానీయాల వ్యాపారంలో కోతలు భారీగా ఉంటాయని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. అయితే ఈ వార్తలపై పెప్సీకో కంపెనీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. (లేఆఫ్స్ బాంబు: టాప్ మేనేజర్స్‌తో సహా 20 వేల మందిపై వేటు!) కాగా ప్రపంచం ఆర్థికమాంద్యం ముప్పు భయాలతో పలు దిగ్గజ కంపెనీలు ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. దీనికి తోడు ఆదాయాలు పడిపోతూ ఉండటంతో నిర్వహణ ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఇప్పటికే పలు టెక్, మీడియా కంపెనీల్లో లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెజాన్, ఆపిల్, మెటా, వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ ఇంక్, సీఎన్ఎన్, కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. (రెండేళ్లలో 10వేల సినిమా హాళ్లు..సినిమా చూపిస్త మామా!) -
వందల మంది ఉద్యోగం ఊడింది..‘2 నెలల జీతం ఇస్తాం..ఆఫీస్‌కు రావొద్దు’
అదిగో..! ఆర్ధిక మాంద్యం వచ్చేస్తోంది. సంపాదించిన డబ్బుల్ని ఖర్చు చేయకండి. దాచుకోండి అంటూ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ భవిష్యత్‌పై జోస్యం చెప్పారు. అప్పటి దాకా రెసిషన్ ప్రభావం ఎంత మేరకు ఉంటుందో తెలియని ఉద్యోగులు సైతం..జనాలతో డబ్బులు ఖర్చు పెట్టించే బిజినెస్ చేస్తున్న బెజోస్ ఇలా మాట్లాడడం ఏంటోనని ముక్కున వేలేసుకున్నారు. కానీ మాంద్యం వస్తుందని ప్రచారం ఊపందుకునే లోపే చిన్నా చితకా కంపెనీల నుంచి స్టార్టప్‌లు, దిగ్గజ సంస్థలు మాంద్యం ప్రభావం గట్టిగానే ఉంటుందని హెచ్చరిస్తున్నాయి. విధుల నుంచి పీకేస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో దేశీయ స్టార్టప్ కంపెనీ ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి కారణంగా సంస్థలు ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగిస్తున్నాయి. ఇప్పటికే నవంబర్ 17న న్యూయార్క్ టైమ్స్(ఎన్‌వైటీ) కు అమెజాన్ సీఈవో ఆండీ మెస్సీ భారీ లేఫ్స్ ఉంటాయని, కానీ ఎంతమందిపై వేటు వేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. ఎన్‌వైటీ తన నివేదికలో..అందుకు ఊతం ఇచ్చేలా అమెజాన్ లెవల్ 1 నుంచి లెవల్ 7 ర్యాంక్ ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా 20 వేల మందికి పైగా ఉపాధి కోల్పోనున్నారు. ఉద్యోగుల్ని తొలగిస్తున్న అమెజాన్ దిగ్గజ కంపెనీల బాటలో భారత టెక్ స్టార్టప్ హెల్తిఫైమి తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 150 మందిని తొలగించింది. ప్రొడక్ట్, క్వాలిటీ కంట్రోల్ , మ్యాటర్ ఎక్స్పర్ట్స్, మార్కెటింగ్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. ఫైర్ చేసిన ఉద్యోగులకు నష్టపరిహారంగా రెండు నెలల జీతం,కౌన్సెలింగ్, అవుట్‌ప్లేస్‌మెంట్ తో పాటు ఇతర బెన్ఫిట్స్ అందిస్తామంటూ ఉద్యోగులకు సర్ధి చెప్పింది. చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సురభిగుప్తాను ఫైర్ చేసింది. సురభి భారత్‌కు చెందిన నెట్‌ఫ్లిక్స్ హిట్ షో ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 1లో యాక్ట్ చేసి అందరి అందరి మన్ననలు పొందింది. ఓవైపు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్ట్ చేస్తూ మెటాలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసేవారు. అంతేకాదు 2018 మిస్ భారత్ కాలిఫోర్నియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక, సంస్థ తొలగించిన వేలాది మంది ఉద్యోగుల్లో తాను కూడా ఉన్నట్లు తాజాగా తెలిపింది. ఆర్ధిక మాంద్యం గుప్పిట్లో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. 2007 డిసెంబర్ నుంచి జూన్ 2009 వరకు అమెరికాలో హౌసింగ్ మార్కెట్ పతనం,తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన క్రెడిట్, తగినంత నియంత్రణ లేకపోవడంతో అమెరికాలో రెసిషన్ ఓ కుదుపు కుదిపేసింది. మాంద్యం దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం నాటి పరిస్థితులే మరోసారి పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. ఇటీవల మెటా తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 13శాతం అంటే 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో గుప్తా ఒకరు. ఈ సందర్భంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2009 నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా. నన్ను విధుల నుంచి తొలగిస్తారని అస్సలు ఊహించలేదు. ఆఫీస్‌లో నేను పనిరాక్షసిని. కానీ నా ఉద్యోగం పోవడమే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మెటా చేసిన ప్రకటనతో ఆ రాత్రి మాలో ఎవరూ నిద్రపోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నాకు ఇమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌తో నేను నా కంప్యూటర్ను, ఆఫీస్ జిమ్ని యాక్సెస్ చేయలేకపోయాను. అప్పుడే అనిపించింది మెటాలో నా ఉద్యోగం పోయిందని.15 ఏళ్లకు పైగా యుఎస్‌లో ఉండేందుకు చాలా కష్టపడ్డానంటూ ఈ సందర్భంగా సురభి గుప్తా గుర్తు చేసుకున్నారు. చదవండి👉 ‘మీ ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించి నేను పెద్ద తప్పే చేశా : మస్క్’ -
ఉద్యోగాల ఊచకోత..వందల మందిని తొలగిస్తున్న టెక్ కంపెనీలు..ఇదే బాటలో
ఆతిథ్య సేవల్ని అందించే ఓయో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌లో ఆర్ధిక మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనతో సంస్థకు చెందిన 600మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. ఓయోలో దేశ వ్యాప్తంగా 3700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో సంస్థ పున: నిర్మాణం (రీ బ్యాలెన్స్)లో భాగంగా ఇంజినీరింగ్,వెకేషన్ హోమ్ టీమ్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులపై వేటు వేసింది. అదే సమయంలో పార్ట్నర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, బిజినెస్ డెవెలప్మెంట్ విభాగాల్లో ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇక యాప్‌లో గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్, పాట్రన్ ఫెసిలిటేట్ కంటెంట్ వంటి కాన్సెప్ట్‌లను అభివృద్ధి చేస్తున్న టీమ్ సభ్యుల్లో ఉద్యోగుల్ని తగ్గించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. -
ఊహించని షాక్‌లు, ఉద్యోగులను వణికిస్తున్న ఐటీ కంపెనీలు.. టెక్కీల తక్షణ కర్తవ్యం?
సాఫ్ట్వేర్ రంగంలో.. మరోసారి సంక్షోభం! 2008 తర్వాత.. దాదాపు ఆ స్థాయిలో.. మాంద్యం పరిస్థితులు! అగ్రరాజ్యం అమెరికా కేంద్రంగా.. కార్యకలా΄ాలు నిర్వహిస్తున్న దిగ్గజ ఐటీ సంస్థల ఆదాయాల్లో తిరోగమనం! పర్యవసానం.. భారీ సంఖ్యలో కొలువుల కోతలను ప్రారంభించిన సంస్థలు!! మూడు నెలలుగా సంకేతాలు ఇస్తున్న సంస్థలు.. తాజాగా దశల వారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ లే అఫ్స్ ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపుతోందన్న వార్తల నేపథ్యంలో.. ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు, తక్షణ కర్తవ్యం ఏమిటి, భవితకు భరోసా ఇచ్చే నైపుణ్యాలపై దృష్టి పెట్టడం ఎలా.. తదితర వివరాలతో సమగ్ర కథనం.. అమెరికాలో ఆర్థిక మాంద్యం సంకేతాల ప్రభావం జాబ్ మార్కెట్‌పై పడింది. ప్రముఖ ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో హెచ్–1బీ వీసాపై యూఎస్‌లోని సంస్థల్లో పని చేస్తున్న మన దేశ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. కారణం.. వారు ఉద్యోగం కోల్పోయిన 60 రోజుల లోపు కొత్త ఉద్యోగం దక్కించుకోకుంటే.. స్వదేశానికి తిరిగొచ్చేయాల్సి ఉంటుంది. ఫాంగ్ మొదలు స్టార్టప్స్ వరకు ఫాంగ్ (ఎఫ్ఏఏఎన్జీ) సంస్థలుగా గుర్తింపు ΄÷ందిన ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్ మొదలు వందల సంఖ్యలోని స్టార్టప్ సంస్థల వరకూ.. ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. ఫేస్బుక్లో 11 వేలు, అమెజాన్‌లో పది వేలు, గూగుల్‌లో పది వేలు, నెట్‌ఫ్లిక్స్ సంస్థలో మొత్తం ఉద్యోగుల్లో 4 శాతం మేరకు కొలువుల కోతలు ్ర΄ారంభమయ్యాయి. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. చైనాలో కోవిడ్ ఆంక్షలు, ఐఫోన్14 ్ర΄ో తయారీలో ఇబ్బందులు తదితర కారణాలతో రాబడులు తగ్గడంతో యాపిల్ సంస్థ లేఅఫ్స్కు సిద్ధమైనట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక స్పష్టం చేసింది. మైక్రోబ్లాగింగ్ వేదిక ట్విటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాన్ మస్క్ చేతిలోకి రాగానే భారీ సంఖ్యలో ఉద్యోగాల కోత పడింది. ట్విటర్ ఇండియా ఆఫీస్‌లో 90 శాతం మంది తొలగింపునకు గురయ్యారు. వీటితో΄ాటు ఇంటెల్ సంస్థలో రానున్న రెండేళ్లలో దశల వారీగా 20 వేల ఉద్యోగాలు, హెచ్‌పీలో ఆరు వేల మంది, సిస్కోలో నాలుగు వేల మందికిపైగా తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఐటీ రంగ సంస్థల్లోనే కాకుండా.. సర్వీసెస్ విభాగంగా పరిగణించే ఉబెర్, జొమాటో, బుకింగ్ డాట్ కామ్, బైజూస్, గ్రూప్ ఆన్ తదితర కంపెనీల్లో కూడా కోతలు మొదలయ్యాయి. మాంద్యం.. ముందు జాగ్రత్త ప్రస్తుతం సంస్థలు ఉద్యోగులను తొలగించడానికి రానున్న కొద్ది నెలల్లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందనే సంకేతాలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇది వాస్తవ పరిస్థితుల్లో ఇప్పటికే ఆయా సంస్థల ఆర్థిక రాబడుల్లో ప్రతిబింబించింది. దాదాపు అన్ని సంస్థల రెండో త్రైమాసిక ఫలితాల్లో నికర ఆదాయం తగ్గింది. దీంతో.. సదరు సంస్థలు వ్యయ నియంత్రణలో భాగంగా, ముందు జాగ్రత్త చర్యగా.. మానవ వనరులపై చేసే వ్యయాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులను తొలగిస్తున్నాయనే అభి్ర΄ాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడేం చేయాలి ఇప్పటికే దాదాపు లక్షన్నర మంది వరకు ఉద్యోగాలు కోల్పోయారు. ఇలాంటి వారు ‘ఇప్పుడేం చేయాలి?’ అనే ప్రశ్న ఎదురవుతుంది. సంస్థలు.. పనితీరు, సామర్థ్యం ఆధారంగా తొలగిస్తున్నాం అని చెబుతుండటంతో.. ఉద్యోగాలు కోల్పోయిన వారు ‘తమ పనితీరు బాగా లేదా’ అనే ఆవేదనకు గురవుతున్నారు. అదే విధంగా.. కొత్త రిక్రూట్మెంట్లపైనా సంస్థలు కొంత కాలం నిషేధం విధించే అవకాశముంది. దీంతో తమ పరిస్థితి ఏంటి? అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఆందోళన చెందకుండా.. ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషించాలి. ఫ్రెషర్స్, మిడిల్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ తమ ్ర΄÷ఫైల్‌కు అనుగుణంగా స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కిల్ గ్యాప్ తగ్గించుకోవడమే ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయిన వారు తక్షణం తమ స్కిల్ గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకు ్ర΄÷ఫెషనల్ నెట్వర్కింగ్ సైట్స్‌ను ఆసరగా తీసుకోవాలి. అందులోని జాబ్ లిస్టింగ్స్‌లో పేర్కొన్న డిమాండింగ్ స్కిల్స్‌ను పరిశీలించాలి. తమ అర్హతలకు అనుగుణంగా మెరుగుపరచుకోవాల్సిన నైపుణ్యాలపై స్పష్టత తెచ్చుకోవాలి. ఉదాహరణకు లింక్డ్ఇన్ జాబ్ ΄ోస్టింగ్స్ను పరిగణనలోకి తీసుకుంటే.. మీరు ΄ోస్ట్ చేసిన రెజ్యుమే ఆధారంగా మీ డొమైన్‌కు సంబంధించి కొత్త జాబ్ ΄ోస్టింగ్ను తెలియజేయడంతో΄ాటు.. మీరు పెంచుకోవాల్సిన స్కిల్స్ ఏంటి అనే విషయాన్ని గురించి కూడా వివరించేలా ఉంటుంది. దీంతో మీరు ఇంకా పెంచుకోవాల్సిన స్కిల్స్‌ను స్పష్టంగా తెలుసుకునే వీలుంటుంది. ఇలా స్పష్టత తెచ్చుకున్నాక..సదరు నూతన నైపుణ్యాల సాధనకు కృషి చేయాలి. లింక్డ్ఇన్తో΄ాటు షైన్డాట్ కామ్, మాన్స్టర్ ఇండియా, నౌకరీ డాట్ కామ్ వంటి వాటి ద్వారా మీ డొమైన్, జాబ్ ్ర΄÷ఫైల్‌కు అనుగుణంగా అవసరమవుతున్న స్కిల్స్ గురించి తెలుసుకొని.. వాటిపై పట్టు సాధించాలి. స్పెషలైజ్డ్ నైపుణ్యాలు స్కిల్ గ్యాప్‌ను తగ్గించుకుని కొత్త ఉద్యోగాల వేటలో ముందంజలో నిలిచేందుకు వీలుగా స్పెషలైజ్డ్ నైపుణ్యాలు సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. మీ అకడమిక్ డొమైన్‌కు సరితూగే ప్రత్యేక స్కిల్స్‌పై పట్టు సాధించాలి. ఉదాహరణకు మీరు ఐటీ విభాగంలో ఉంటే.. కొత్తగా ఆటోమేషన్ స్కిల్స్‌ను పెంచుకోవడానికి కృషి చేయాలి. అదే విధంగా మీరు సంప్రదాయ డిగ్రీ నేపథ్యం గల వారైతే.. ఇప్పటివరకు చేసిన ఉద్యోగానికి సంబంధించి కొత్తగా వచ్చిన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. డేటాసైన్స్, ఈఆర్పీ సొల్యూషన్స్ వంటి కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. సర్టిఫికేషన్స్‌పై దృష్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయా విభాగాల్లో సర్టిఫికేషన్స్ పూర్తి చేయడం కూడా ఉద్యోగాన్వేషణలో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా జాబ్ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఏఐ–ఎంఎల్, రోబోటిక్స్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి వాటిపై ఆన్లైన్ సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని రెండు నెలలలోపు పూర్తి చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన 5జీ టెక్నాలజీస్‌పైనా దృష్టి పెడితే అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. ముఖ్యంగా కోడింగ్, ్ర΄ోగ్రామింగ్, ఇండస్ట్రీ 4.0 వంటి ఐటీ స్కిల్స్‌పై మైక్రోసాఫ్ట్, ఐబీఎం, గూగుల్, హెచ్‌పీ, ఏడబ్ల్యూఎస్, సిస్కో, వీఎంవేర్, ఒరాకిల్ వంటి పలు సాఫ్ట్వేర్ సంస్థలు నేరుగా ఆన్లైన్ విధానంలో సర్టిఫికేషన్ కోర్సులను అందిస్తున్నాయి. ఖాళీగా ఉండకుండా ఉద్యోగం కోల్పోయిన వారు ఎక్కువ రోజులు ఖాళీగా ఉండటం సరికాదు. తమ అర్హతలకు సరితూగే ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్ జాబ్స్ అవకాశాలను అన్వేషించి.. వాటిని సొంతం చేసుకునేలా అడుగులు వేయాలి. పలు జాబ్ ΄ోర్టల్స్, సంస్థల వెబ్‌సైట్స్‌లో ఈ అవకాశాల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ, వేతనాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా కొలువులో చేరి.. మెరుగైన అవకాశం లభించే దాకా కొనసాగాలి. కొన్ని సందర్భాల్లో చిన్న΄ాటి స్టార్టప్ సంస్థల్లో ΄÷ందిన అనుభవమే భవిష్యత్తులో మంచి సంస్థల్లో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు దోహదం చేస్తుందని గుర్తించాలి. మిడ్ లెవల్ ఎగ్జిక్యూటివ్స్ 12 నుంచి 15ఏళ్ల అనుభవమున్న వారిని మిడ్ లెవల్, సీనియర్ లెవల్ ఉద్యోగులుగా పరిగణిస్తారు. వారిని కూడా సంస్థలు తొలగిస్తున్నాయంటే.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా నాలెడ్జ్ అప్డేట్ చేసుకోక΄ోవడం కూడా ఒక కారణమై ఉంటుందనే వాదన వినిపిస్తోంది. ఇలాంటి సీనియర్ ఉద్యోగులు తాము ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించిన విభాగాలు, వాటికి సంబంధించి మార్కెట్లో ఆవిష్కృతమవుతున్న కొత్త నైపుణ్యాలను తెలుసుకుని.. వాటిని సొంతం చేసుకునే దిశగా అడుగులు వేయాలి. సోషల్ నెట్వర్కింగ్ ఉద్యోగాలు కోల్పోయిన వారు.. నూతన ఉద్యోగ సాధనలో భాగంగా..సోషల్ నెట్‌వర్కింగ్‌ను విస్తృతంగా వినియోగించుకోవాలి. సదరు నెట్వర్కింగ్ ద్వారా ఆయా రంగాల్లోని నిపుణులతో సంప్రదింపులు చేయాలి. ఇప్పటి వరకు తమ ఉద్యోగ జీవితంలో సాధించిన విజయాలు, అవి సంస్థ అభివృద్ధికి తోడ్పడిన తీరు వంటి వాటిని వారిని మెప్పించే రీతిలో వివరించాలి. కొత్త ఉద్యోగాలకు తమను సిఫార్సు చేసే విధంగా ఆయా రంగాల్లోని నిపుణులను ఒప్పించాలి. సాఫ్ట్ స్కిల్స్ ప్రస్తుతం పనితీరు ఆధారంగా తొలగింపులు అని ప్రకటిస్తున్న సంస్థలు.. ఉద్యోగుల్లోని సాఫ్ట్‌స్కిల్స్‌ను కూడా మదింపు చేస్తున్నాయి. కాబట్టి సాఫ్ట్‌స్కిల్స్‌లో కీలకంగా భావించే కమ్యూనికేషన్ స్కిల్స్, బిహేవియరల్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి నైపుణ్యాలు పెంచుకునే దిశగా అడుగులు వేయాలి. అదే విధంగా వీలైతే తమను తొలగించడానికి గల నిర్దిష్ట కారణాన్ని తమ టీమ్ హెడ్ లేదా ప్రాజెక్ట్ హెడ్ ద్వారా తెలుసుకుని లో΄ాలను అధిగమించే ప్రయత్నం చేయాలి. ఆత్మ విశ్వాసం ఉద్యోగ తొలగింపునకు గురైనవారు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి. ఆందోళన నుంచి బయటపడాలి. సాధించగలమనే మనో ధైర్యంతో కొత్త అవకాశాలను దక్కించుకోవాలి. చదవండి: అలర్ట్: అమలులోకి వచ్చే కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాలండోయ్! -
ఉద్యోగాలు ఊడుతున్న వేళ.. గుడ్ న్యూస్ చెబుతున్న కంపెనీలు
ప్రపంచ దేశాల్లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడం, ఇంధన ధరలు పెరిగిపోవడం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, కోవిడ్-19 వంటి కారణాలతో వచ్చే ఏడాది ఆర్ధిక మాంద్యం అతలా కుతలం చేస్తుందంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ సర్వేలో 63 శాతం మంది ఆర్ధిక వేత్తలు హెచ్చరించారు. దీంతో ముందస్తు జాగ్రత్తగా చిన్నా చితకా,పెద్ద, మధ్య తరగతి ఇలా కంపెనీ ఏదైనా సరే ఎంప్లయూస్ను వదిలించుకునేందుకు రెడీ అవుతున్నాయి.అదే సమయంలో వందలాది కంపెనీలు ఉద్యోగులకు ఊరట కల్పిస్తూ నిర్ణయాలు తీసుకోవడం చర్చాంశనీయంగా మారింది. సాఫ్ట్వేర్ మొదలు ఈ కామర్స్ కంపెనీల దాకా..చిన్నా పెద్దా అనే తేడాలేదు. అన్నీ కంపెనీలదీ అదే బాట. అదే మాట. ఉద్యోగుల్ని ఇంటికి పంపేందుకే నిర్ణయించుకుంటున్నాయి. మొన్న ట్విటర్ ఆ తర్వాత మెటా, ఇప్పుడు జొమాటో, అమెజాన్ ఇలా వరుసపెట్టి ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టాయి. అయితే ఈ నేపథ్యంలో యూకేకి చెందిన కంపెనీలు వేతనాల్ని తగ్గించకుండా ఉద్యోగులందరు వారానికి నాలుగురోజులు పనిచేసేందుకు అంగీకరిస్తున్నాయి. 100 కంపెనీల్లో విధులు నిర్వహిస్తున్న 2,600 మంది పనిదినాల్ని తగ్గించాయి. రానున్న రోజుల్లో యూకే దేశానికి చెందిన మొత్తం కంపెనీలు ఈ తరహా పని విధానాన్ని అమలు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ హెచ్ఆర్ విభాగం నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్టివిటీ పెరుగుతోంది 5 రోజుల పనిదినాల్ని 4రోజులకు తగ్గించడం వల్ల సంస్థల్లో సిబ్బంది పనితీరు మెరుగుపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే పనిని తక్కువ గంటల్లో పూర్తి చేసేలా సంస్థల్ని ప్రోత్సహిస్తుందని వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ పని విధానాన్ని ముందుగా అమలు చేసిన సంస్థల్లో ఉద్యోగులు రిజైన్ చేయడం కానీ లేదంటే ఆఫర్ పేరతో మరో సంస్థలో చేరే సాహాసం చేయరని తెలుస్తోంది. కొత్త వర్కింగ్ ప్యాటర్న్‌పై కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, బోస్టన్ యూనివర్సిటీల సైంటిస్ట్‌లు పరిశోధనలు నిర్వహించారు. వారి రీసెర్చ్‌లో సైతం ఆయా సంస్థలు 88 శాతం వారానికి 4రోజుల పని కారణంగా రోజూవారీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతున్నట్లు తేలింది. చదవండి👉 ఉద్యోగం పోయిందా?.. అయితే ఇది మీ కోసమే! -
అమెజాన్‌లో ఏం జరుగుతోంది? భారత్‌లో మరో బిజినెస్ మూసివేత!
దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల్లో రెసిషన్ భయాలు వెంటాడుతున్న తరుణంలో భారత్‌లో ఏ మాత్రం లాభసాటి లేని బిజినెస్‌లను షట్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలోనే అమెజాన్ తన ఫుడ్ డెలివరీ,ఎడ్యుకేషన్ సర్వీస్‌ను మూసిసేంది. తాజాగా మరో బిజినెస్‌కు స్వస్తి పలికినట్లు సమాచారం. అమెజాన్ దేశీయంగా డిస్ట్రిబ్యూషన్ సేవల్ని అందిస్తుంది. డిస్ట్రిబ్యూషన్ యూనిట్ కంపెనీల నుండి వినియోగదారులకు, రీటైలర్లకు సంబంధిత ప్రొడక్ట్‌లను డెలివరీ చేస్తుంది. అయితే ఆర్థిక మందగమనం నేపథ్యంలో డిస్టిబ్యూషన్ సర్వీస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. కంపెనీ ఇప్పుడు ప్రధాన వ్యాపారాలపై మరింత దృష్టి పెడుతుందని పేర్కొంది. అమెజాన్ అకాడమీ టూ అమెజాన్ ఫుడ్ అమెజాన్ ఇండియా తన వార్షిక నిర్వహణ ప్రణాళిక సమీక్ష ప్రక్రియలో భాగంగా ఫుడ్ డెలివరీ సర్వీసుల్ని నిలిపివేసింది. వారం రోజుల ముందు ఎడ్ టెక్ సర్వీస్, అమెజాన్ అకాడమీని సైతం షట్ డౌన్ చేసింది. ముఖ్యంగా కోవిడ్ -19 లాక్డౌన్ సమయంలో బైజూస్, అన్ అకాడమీ, వేదాంతు’లు భారీ లాభాల్లో గడిస్తున్న సమయంలో అమెజాన్ అకాడమీని ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి👉 ‘మీతో పోటీ పడలేం!’,భారత్‌లో మరో బిజినెస్‌ను మూసేస్తున్న అమెజాన్ -
మన ఎగుమతులపై అంతర్జాతీయ సవాళ్ల ప్రభావం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితులు, మాంద్యం పరిస్థితుల ప్రభావం భారత ఎగుమతులపై ఉండడం సహజమేనని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఎగుమతుల్లో బలహీనత ఉండొచ్చన్నారు. అదే సమయంలో సేవల ఎగుమతులకు భారీ అవకాశాలున్నట్టు చెప్పారు. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నడుమ భారత్ ఆశాకిరణంగా కనిపిస్తున్నట్టు అభివర్ణించారు. టైమ్స్‌నౌ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు. ధరల ఒత్తిళ్లను తగ్గించేందుకు (ద్రవ్యోల్బణం) ప్రభుత్వం పలు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. అంతర్జాతీయంగా మాంద్యం పరిస్థితుల నేపథ్యంలో.. రెండేళ్ల తర్వాత మన దేశ ఎగుమతులు అక్టోబర్ నెలకు ప్రతికూల జోన్‌కు వెళ్లడం గమనార్హం. 16.65 శాతం తగ్గి 29.78 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. జ్యుయలరీ, ఇంజనీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, రెడీ మేడ్ గార్మెంట్స్, టెక్స్టైల్స్, కెమికల్స్, ఫార్మా, మెరైన్, తోలు ఉత్పత్తుల ఎగుమతులు క్షీణించాయి. వాణిజ్య లోటు సైతం 26.91 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఎగుమతులు 12.55 శాతం పెరిగి 263.35 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు సైతం 33 శాతం పెరిగి 437 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. -
రిజైన్ చేయాలని ఉద్యోగుల్ని బలవంతం చేయడం లేదు
కేంద్ర కార్మిక జారీ చేసిన నోటీసులపై అమెజాన్ స్పందించింది. భారత్‌కు చెందిన ఏ ఉద్యోగిని రాజీనామా చేయాలని బలవంతం చేయలేదని స్పష్టం చేసింది. అమెజాన్ భారత చట్టాల్ని ఉల్లంఘిస్తుందని నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఆరోపించింది. అంతేకాదు ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలన్న అమెజాన్ ఆదేశాలపై ఉద్యోగుల సంఘం కేంద్ర కార్మిక శాఖకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు కార్మిక శాఖ బెంగళూరులోని డిప్యూటీ లేబర్ కమిషనర్ ముందు అమెజాన్ ప్రతినిధి నేరుగా హాజరవ్వాలని సూచించింది. లేఆఫ్స్‌పై వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. కార్మిక శాఖ పంపిన నోటీసులకు అమెజాన్ స్పందించింది. ఉద్యోగులు రాజీనామా చేయాలని బలవంతం చేయడం లేదు. స్వచ్ఛందంగా ఉద్యోగానికి రిజైన్ చేస్తే నష్టపరిహారం చెల్లిస్తామని మాత్రమే చెప్పాం. మేం(అమెజాన్) ప్రతి ఏడు అన్నీ విభాగాలకు చెందిన ఉద్యోగులపై సమీక్షిస్తాం. పునర్వ్యవస్థీకరణ అవసరమని భావిస్తే ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని, అందుకు పరిహార ప్యాకేజీ చెల్లిస్తుంటాం. రిజైన్ చేయాలన్న ప్రతిపాదనలకు అంగీకరించడం, లేదంటే రాజీనామా చేయడం అనేది ఉద్యోగులదే తుది నిర్ణయం. మేం ఏ ఒక్క ఉద్యోగిని సంస్థను విడిచి వెళ్లాలని బలవంతం చేయడం లేదని లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. చదవండి👉 భారీ షాక్, మరో రంగానికి చెందిన వేలాది మంది ఉద్యోగుల తొలగింపు -
ఈ ఉద్యోగాలకు ఏమైంది?
మొన్న మైక్రోసాఫ్ట్, ట్విట్టర్... నిన్న వాట్సప్, ఫేస్‌బుక్‌ల మాతృసంస్థ మెటావర్స్... నేడు అమెజాన్... హెచ్‌పీ! వరుసగా ఉద్యోగాల్లో కోతల వార్తలే. అమెరికన్ టెక్ సంస్థలు అనేకం ఉద్యోగస్థుల్ని తగ్గించుకొనే పనిలో పడడంతో వేలమంది వీధిన పడనున్నారు. సదరు సంస్థల భారతీయ శాఖల్లో పనిచేస్తున్న మనవాళ్ళ మీదా అనివార్యంగా ఆ ప్రభావం ఉండనుంది. ఏ రోజు ఏ కంపెనీ ‘పింక్ స్లిప్’ ఇస్తుందో తెలియని కంగారు పుట్టిస్తోంది. ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక పరిణామాలతో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తుబిస్తుగా మారింది. లాభాలు పడిపోతూ, ప్రపంచమంతటా మాంద్యం తప్పదనే భయం నెలకొంది. అమెజాన్ నుంచి డిస్నీ దాకా దిగ్గజ టెక్ సంస్థలు శ్రామికశక్తిని పునర్వ్యవస్థీకరించు కుంటున్నదీ అందుకే. ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియని ఈ పరిస్థితి భారత్ సైతం అప్రమత్తం కావాలని గుర్తుచేస్తోంది. శ్రామికశక్తి పునర్మూల్యాంకనంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 850కి పైగా టెక్ కంపెనీల్లో లక్షా 37 వేల వైట్ కాలర్ ఉద్యోగులు ఇంటి బాట పట్టాల్సి వచ్చిందని ఓ అంతర్జాతీయ అంచనా. లిఫ్ట్, స్ట్రైప్, కాయిన్‌బేస్, షాపిఫై, నెట్‌ఫ్లిక్స్, శ్నాప్, రాబిన్‌హుడ్, చైమ్, టెస్లా అనేక సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికా కేంద్రంగా నడుస్తున్న భారీ సంస్థలు ఒక్క గత నెలలోనే 33,843 ఉద్యోగాలకు మంగళం పలికాయి. ఉద్యోగాల కోత సుమారు 13 శాతానికి ఎగబాకింది. 2021 ఫిబ్రవరి నుంచి గత నెల వరకు చూస్తే – ఒకే నెలలో ఇన్ని ఉద్యోగాలపై వేటు పడడం ఇదే అత్యధికం. పులి మీద పుట్రలా గూగుల్ సైతం ఈ వారం ఉద్వాసనల బాట పట్టింది. లక్షా 87 మందితో టెక్ రంగంలో అతి పెద్ద ఉద్యోగ సంస్థ అయిన గూగుల్ 10 వేల మందిని ఇంటికి సాగనంపడానికి సిద్ధమవుతోందని ప్రాథమిక వార్త. ఆ సంస్థకు అననుకూలమైన మార్కెట్ పరిస్థితులు నెలకొన్నాయి. పైపెచ్చు సంస్థలో గణనీయమైన వాటాతో యాజమాన్య నిర్ణయాలను ప్రభావితం చేసే ‘యాక్టివిస్ట్ హెడ్జ్ ఫండ్’ నుంచి ఒత్తిడి ఉంది. అలా 6 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకొనే పనిలోకి దిగింది. పని తీరులో రేటింగు అతి తక్కువగా ఉన్నవారినే తొలగిస్తామన్నది గూగూల్ చెబుతున్న మాట. దానికి సమర్థమైన ర్యాంకింగ్ విధానం ఉందంటున్నా, అది ఏ మేరకు లోపరహితమో చెప్పలేం. ప్రస్తుత కోతల పరిస్థితి గూగుల్ స్వయంకృతమని నిపుణుల మాట. అవసరానికి మించి శ్రామిక శక్తి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా, పెడచెవిన పెట్టి గత త్రైమాసికంలో ఆ సంస్థ ఎడాపెడా కొత్త ఉద్యోగస్థుల్ని తీసుకుంది. అదీ భారీ వేతనాలకు తీసుకోవడం మెడకు గుదిబండైంది. లాక్డౌన్లలో పని నడపడానికి అమెరికా లాంటి చోట్ల తీసుకున్న ఉద్యోగాలు ఇప్పుడు వాటికి ఎక్కువయ్యాయి. ఉద్యోగస్థానాల్లో గణనీయంగా ఊపందుకున్న ఆటోమేషన్ ప్రభావం సరేసరి. వెన్నాడుతున్న ఆర్థిక మాంద్యానికి తోడు కరోనా అనంతర విక్రయాలు తగ్గాయి. ఫలితంగా పదేళ్ళుగా వీర విజృంభణలో ఉన్న టెక్‌సంస్థలు కొత్త వాస్తవాన్ని జీర్ణించుకోవాల్సి వచ్చింది. ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ పరికరాల ఉత్పత్తి సంస్థ హెచ్‌పీ వచ్చే 2025 చివరికి 6 వేల ఉద్యోగాలను తగ్గించుకుంటామని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ 10 వేల మందికి పింక్ స్లిప్పులు ఇస్తామనేసరికి, మన దేశంలోని దాని శాఖలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ‘మీ అంతట మీరు ఉద్యోగాలు వదిలేయం’డంటూ అమెజాన్ ఇండియా తన ఉద్యోగులకు ‘స్వచ్ఛంద వీడ్కోలు పథకం’ (వీఎస్పీ) ప్రకటించడం చర్చ రేపుతోంది. మూకుమ్మడిగా ఇంటికి సాగనంపడాన్ని వ్యతిరేకిస్తూ మన కార్మిక శాఖకు ఫిర్యాదులు రావడం, వీఎస్పీ వివరాలను అందించాలంటూ మన ప్రభుత్వం ఇక్కడి శాఖను అడగడం చకచకా జరిగాయి. నిజానికి, కరోనా సంక్షోభం తర్వాత ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనా, ఐరోపాలు మూడూ బాగా మందగించాయి. అందుకే, వచ్చే 2023లో ప్రపంచానికి మాంద్యం తప్పదని వరల్డ్ బ్యాంక్ అధ్యయనం. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నిదానించి, మరిన్ని దేశాలు మాంద్యం లోకి జారితే వర్ధమాన ఆర్థిక వ్యవస్థల్లోని ప్రజానీకం దుష్పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది. ప్రపంచానికి మెడ మీద కత్తిలా మాంద్యం భయపెడుతున్న వేళ, మనమూ అప్రమత్తం కావాలి. ప్రపంచీకరణతో ఇవాళ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణికి మనం ముడిపడి ఉన్నాం. ముందు జాగ్రత్త చర్యలకు దిగాలంటున్నది అందుకే. రానున్న పరిణామాల్ని దీటుగా ఎదుర్కోవడానికి ఏ మేరకు సిద్ధంగా ఉన్నామన్నది కీలకం. ప్రపంచశ్రేణి టెక్ సంస్థల కార్యకలాపాల్లో మన ఐటీ సంస్థల ప్రమేయముంది గనక ఉద్యోగ విపణిలో సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలి. ఐటీ రంగంలో మొదలైన కోతలు ఇతర రంగాలకూ పాకే ముప్పుంది. సత్వరం మన ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే మార్గాలు వెతకాలి. అదనపు పెట్టుబడులు వచ్చేలా, ఉత్పాదకత పెరిగేలా విధానాలు నిర్ణయించడం దారిద్య్ర నిర్మూలనకూ, వృద్ధికీ కీలకం. కార్మిక హక్కులను నీరుగార్చి, ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో తెలియని అనిశ్చితి, అభద్రత కల్పించడం ఏ రంగానికైనా మంచివి కావు. అసలే కరోనాలో ఉపాధి పోయి రోజువారీ శ్రామికులు చిక్కుల్లో ఉన్నారు. ఇప్పుడు వైట్ కాలర్ ఐటీ రంగ ఉద్యోగుల పరిస్థితీ అదే అంటే ఉన్న సంక్షోభం ఇంకా తీవ్రమవుతుంది. ఇప్పటికీ మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మెరుగ్గా ఉందంటున్న పాలకులు మేకిన్ ఇండియా స్వప్నాలను చూపడమే కాక, ఉద్యోగక్షేత్రంలోనూ దాని ఫలాలు అందించగలిగితే మంచిది. కిందపడ్డా మళ్ళీ పైకి లేస్తాం! -
Recession: ముందు నుయ్యి... వెనుక గొయ్యి
పెట్టుబడిదారీ వ్యవస్థ డొల్లతనం ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు మరణశాసనం లిఖిస్తోంది. సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల, వృద్ధి రేటు పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. ఆదాయం తగ్గిపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయి వస్తు సేవల వినియోగం తగ్గిపోతోంది. ఈ స్థితిలో ప్రజల కొనుగోలుశక్తిని పెంచడం కోసం ప్రభుత్వాలు కరెన్సీ ముద్రిస్తున్నాయి. ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. ద్రవ్యోల్బణం తగ్గించడానికి వడ్డీరేట్లు పెంచుతున్నారు. దీంతో ఉత్పాదకత తగ్గిపోతోంది. మొత్తం మీద ఒక అనివార్య చక్రబంధంలో పెట్టుబడిదారీ దేశాలు చిక్కుకు పోయాయి. ప్రపంచ పెట్టుడిదారీ వ్యవస్థ ఇప్పటి వరకూ వాయిదా వేసిన తన అధికారిక మరణ ప్రకటనను నేడు ముఖాముఖి ఎదుర్కోక తప్పని స్థితి ఏర్పడింది. నిజానికి వ్యవస్థ తాలూకు అంతిమ వైఫల్యం 3, 4 దశాబ్దాల క్రితమే నిర్ధారణ అయిపోయింది. 1979ల తర్వాత పెట్టుబడి దారి ధనిక దేశాలలో ఆయా వ్యవస్థలు ఇక ఎంత మాత్రమూ ప్రజలకు ఉపాధిని కల్పించలేని పరిస్థితులు వేగవంతం అయ్యాయి. దీనికి కారణాలుగా అప్పటికే పెరిగిపోసాగిన యాంత్రీకరణ; ఈ దేశాలలో కార్మికులు, ఉద్యోగుల వేతనాలు అధికంగా ఉన్నాయి గనుక అక్కడి నుంచి పరిశ్రమలు చైనా వంటి చౌక శ్రమ శక్తి లభించే దేశాలకు తరలిపో నారంభించడం వంటివి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధనిక దేశాలు అన్నీ, మరీ ముఖ్యంగా అమెరికా వంటివి తమ పారిశ్రామిక పునాదిని కోల్పోయాయి. అలాగే 1990ల అనంతర సాఫ్ట్వేర్, ఇంటర్నెట్ విప్లవా లతో ఈ దేశాలలోని సేవారంగం కూడా (ఐటీ, బీపీఓ) భారత దేశం వంటి దేశాలకు తరలిపోయింది. ఈ క్రమంలోనే ఆయా ధనిక దేశాలలోని ప్రజలకు ఇక ఎంత మాత్రమూ ఉపాధి కల్పించలేని ప్రభుత్వాలూ, వ్యవస్థలూ ఆ ప్రజలలో అసంతృప్తి జ్వాలలు రగులకుండానూ, వారి కొనుగోలు శక్తి పతనం కాకుండానూ కాపాడుకునేందుకు దశాబ్దాల పాటు క్రెడిట్ కార్డుల వంటి రుణ సదుపాయాలపై ఆధారపడ్డాయి. అలాగే 1990లలో యావత్తూ... సుమారు 2001 వరకూ ఇంటర్నెట్ ఆధారిత హైటెక్ కంపెనీల షేర్ల విలువలలో భారీ వృద్ధి ద్వారా జరిగిన షేర్ మార్కెట్ సూచీల పెరుగుదల పైనా వ్యవస్థలు నడిచాయి. ఇక చివరగా 2003 తర్వాతి కాలంలో... 2008 వరకూ రియల్ ఎస్టేట్ బూమ్‌పై ఆధారపడి ప్రజల కొనుగోలు శక్తి కొనసాగింది. అంతిమంగా 2008 చివరిలో ఈ రియల్ బుడగ పగిలిపోవడంతో వ్యవస్థలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు వేరే దారిలేక ఈ ధనిక దేశాలన్నీ ప్రజల కొనుగోలు శక్తిని నిలబెట్టేందుకు, ఉద్దీపన రూపంలో కరెన్సీల ముద్రణను మార్గంగా ఎంచుకున్నాయి. దీంతో ధనిక దేశాలన్నింటిలోనూ ద్రవ్యోల్బణం 4 దశాబ్దాల రికార్డు స్థాయికి చేరింది. ఈ ద్రవ్యోల్బణ పరిస్థితికి మరో ముఖ్యమైన కారణం ధనిక దేశాలలో దేశీయంగానే సరుకులూ, సేవల ఉత్పత్తి తాలూకూ పారిశ్రామిక పునాదులు లేకపోవడం. ఫలితంగా ఈ దేశాలలో ముద్రించబడిన డబ్బు, అవి విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోన్న సరుకులు, సేవలకు ఖర్చవుతోంది. అందుకే ద్రవ్యోల్బణం తగ్గడంలేదు. దాంతో ప్రస్తుతం దరిదాపు అన్ని ధనిక దేశాలూ ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్యాంకు వడ్డీ రేట్లను పెంచసాగాయి. ఈ క్రమంలో పెరిగిన వడ్డీ రేట్ల వలన ఆయా దేశాలలో రుణ స్వీకరణ తగ్గిపోతోంది. ఇది వేగంగా ప్రజల కొనుగోలు శక్తి పతనానికీ... అంటే అంతిమంగా వృద్ధి రేటు పతనానికీ దారితీస్తోంది. అదీ కథ! అంటే ఆర్థిక మాంద్య స్థితిలో ఉద్దీపన కోసం కరెన్సీలు ముద్రిస్తే రెండో ప్రక్కన ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. అలాగని వడ్డీ రేట్లను పెంచితే తక్షణమే ఆర్థిక వృద్ధి రేటు పడిపోయి నిరుద్యోగం పెరుగుతోంది. కొద్ది నెలల క్రితం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే పేరిట అమెరికాలో వడ్డీ రేట్లు పెంచగానే తర్వాతి త్రైమాసిక కాలం నుంచీ ఆర్థిక వృద్ధి రేటు అకస్మాత్తుగా పడిపోసాగింది. వ్యవస్థ పరిమితులలో పరిష్కారం సాధ్యంకాని చిక్కుముడిగా... వైరుధ్యంగా ఈ పరిస్థితి తయారయ్యింది. ముందు నుయ్యి... వెనుక గొయ్యి స్థితి ఇది. స్థూలంగానే... ఆయా ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థల్లో ఆర్థిక సంక్షోభ కాలంలో ఉద్దీపనలు లేదా వాటి ద్వారా ప్రభుత్వమే పూను కొని (ప్రైవేటు పెట్టుబడి దారులకు బదులు) ఉపాధి కల్పన చేసి వ్యవస్థను తిరిగి గట్టెక్కించే అవకాశాలు నేడు సన్నగిల్లి పోయాయి. యాంత్రీకరణ వేగం పెరగడం... విపరీతమైన స్థాయిలో మర మనుషుల వినియోగం పెరగడం వంటి వాటి వలన నేడు ఈ దేశాలలో ఉపాధి కల్పనకు అవకాశాలు ఇక ఎంత మాత్రమూ లేకుండా పోతున్నాయి. వాస్తవంలో నేటి ప్రపంచంలో జరిగిన... జరుగుతోన్న హైటెక్ సాంకేతిక విప్లవం ప్రజల జీవితాలను మరింత మెరుగు పరచాల్సింది. ఎందుకంటే ప్రతి కొత్త సాంకేతిక ఆవిష్కరణ ప్రజల కనీస అవసరాలను తీర్చడానికి భారీగా ఉత్పత్తిని పెంచి తద్వార జన జీవితాన్ని మరింత సులువైనదిగా, సంపన్నవంతమైనదిగా మార్చ గలగాలి. కానీ ఇప్పుడు జరుగుతోంది... సాంకేతిక పురోగతి వేగం పుంజుకున్న కొద్దీ నిరుద్యోగం పెరుగుదల... వృద్ధి రేట్ల పతనం వంటి రూపాలలో ప్రజల జీవితం అతలాకుతలం అవుతోంది. అంటే కమ్యూనిస్టు సిద్ధాంతకారుడు కారల్ మార్క్స్ పరిభాషలో చెప్పాలంటే... నేడు జరుగుతోంది ఉత్పత్తి శక్తులు ఎదుగుతున్న కొద్దీ అవి ప్రజలకు మేలుచేయక పోగా... వినాశకరకంగా మారడమే. ఈ పరిస్థితికి కారణం నేటి వ్యవస్థ తాలూకు కీలక చలన సూత్రం లాభాల కోసం మాత్రమే పెట్టుబడులు పెట్టడం. అంటే ఇక్కడ... ఈ వ్యవస్థలో నిర్జీవమైన డబ్బును... లాభార్జన ద్వారా... మరింత అధిక డబ్బుగా మార్చడం అనేదే ప్రాథమిక సూత్రం. దీనిలో ప్రాణం ఉన్న మనుషులు... ప్రాణం లేని పెట్టుబడీ, దాని తాలూకు లాభాల కోసం పని చేస్తున్నారు. అందుచేత ఇక్కడ మనుషుల స్థానంలో యంత్రాలను పెట్టుకొని లాభాలు సంపాదించుకోగలిగితే అది పెట్టుబడి దారులకు మహా సంతోషం. అలాగే ఈ పెట్టుబడిదారులు తమ ఈ ఆలోచనా విధానం వలన ఏర్పడిన ఆర్థిక మాంద్యాల కాలంలో ప్రజల కొనుగోలు శక్తి, డిమాండ్ పడిపోయినప్పుడు ఆ స్థితి నుంచి వ్యవస్థను గట్టెక్కించేందుకు ఇక ఎంత మాత్రమూ కొత్తగా పెట్టుబడులు పెట్టరు. అప్పుడు ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రజల కొనుగోలు శక్తిని కాపాడవలసి రావడమే ప్రతి ఆర్థిక మాంద్య కాలంలోనూ జరిగింది. అయితే 1980ల నుంచి ప్రపంచవ్యాప్తంగా అమలులోకి వచ్చిన నయా ఉదారవాద సంస్కరణలు కనీసం ప్రభుత్వాలైనా ప్రజల కొనుగోలు శక్తిని పెంచే దిశగా నికరంగా పూనుకోగలగడాన్ని చాలా వరకూ ఆటంక పరుస్తున్నాయి. ఈ సంస్కరణల తాలూకు ఆలోచనా విధానంలో ప్రభుత్వ పాత్ర కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ధనవంతులకు అనుకూలంగా వ్యవహారిస్తేనే దానివలన పెట్టుబడులు పెరిగి ప్రజలకు ఉపాధి లభిస్తుందనేది కీలక విధానంగా ఉండడం. అంటే ఈ ప్రపంచీకరణ విధానాలకు ముందరి... 1980ల ముందరి సంక్షేమ రాజ్య ఆలోచనలైన ఉద్యోగులు, కార్మికుల జీతభత్యాలు బాగుండి, వారి ఆర్థిక స్థితి బాగుంటేనే వ్యవస్థలో కొనుగోలు శక్తి... డిమాండ్ స్థిరంగా ఉంటాయనే దానికి తదనంతరం తిలోదకాలిచ్చారు. అలాగే ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల కలగలుపు అయిన ఈ ఉదారవాద సంస్కరణలు ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వం పాత్ర తక్కువగా ఉండాలని సిద్ధాంతీకరించాయి. అంటే పూర్తిగా డిమాండ్ సరఫరాలపై ఆధారపడిన మార్కెట్ ఆలోచనా విధానం ఈ సంస్కరణలకు కేంద్ర బిందువు. అందుచేత ఈ విధానాలను విశ్వసించేవారు ఆర్థిక సంక్షోభ కాలంలో కూడా తమ తమ దేశాల ఆర్థిక వ్యవస్థలలో ప్రభుత్వ పాత్రను తిరస్కరించే గుడ్డితనానికి పోతున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రపంచ పెట్టుబడి దారి వ్యవస్థ వేగంగా తిరిగి కోలుకోలేని సంక్షోభంలోకి జారిపోతోంది. 2008 ఆర్థిక సంక్షోభ అనంతరం కాగితం కరెన్సీల ముద్రణపై ఆధారపడి తమ మరణ శాసనాలను వాయిదా వేసుకున్న పెట్టుబడిదారీ పాలకులు నేడు ఇక ఎంత మాత్రమూ వ్యవస్థను కాపాడుకోలేని స్థితిలో పడిపోయారు! డి. పాపారావు, వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు మొబైల్: 98661 79615 -
ఉద్యోగం పోయిందా?.. అయితే ఇది మీ కోసమే!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్ దేశాల్లో ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఆ ప్రభావం ఇతర ప్రపంచ దేశాలపై చూపిస్తోంది. దీంతో దిగ్గజ టెక్ కంపెనీల నుంచి స్టార్టప్స్ వరకు పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. నిర్వాహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని ఇంటికి పంపిస్తున్నాయి. ఇటీవల ట్విటర్,మెటా, అమెజాన్ సంస్థలు భారీ ఎత్తున ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేశాయి. దీంతో ఉద్యోగం కోల్పోయే కుటుంబ పోషణ మరింత భారం అవుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో తొలగింపులు, ఉద్యోగం కోల్పోయిన వారు.. భవిష్యత్‌లో తలెత్తే ఇబ్బందుల నుంచి కుటుంబ సభ్యుల్ని సురక్షితంగా ఉంచడం, ఉద్యోగం పరంగా ఒత్తిడిను జయించి ఎలా ముందుకు సాగాలో తెలిపిన నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. ఉద్యోగుల తొలగింపుకు కారణాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే కొవిడ్ దెబ్బకు అతలాకుతలమైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ఉక్రెయిన్, రష్యా యుద్ధ ప్రభావం పడింది. కోవిడ్ సమయంలో ఏం ఊహించామో అదే జరుగుతోంది. మహమ్మారి విజృంభిస్తుండడంతో ఇతర రంగాలు భారీ ఎత్తున కుదేలయ్యాయి. అదే సమయంలో టెక్ రంగం పుంజుకుంది. డిమాండ్‌ను బట్టి వస్తున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయా సంస్థలు భారీ ఎత్తున నియామకాలు చేపట్టాయి. కానీ ఇప్పుడు టెక్నాలజీ విభాగం సైతం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయి. అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ద్రవ్యోల్బణం, దాని వల్ల వచ్చిన ఆర్ధిక మాంద్యం భయాలతో ప్రజల్లో ఖర్చు పెట్టే స్థోమత తగ్గింది. ఆ ప్రభావం టెక్ కంపెనీలపై పడింది. ప్రాజెక్ట్‌లు తక్కువయ్యాయి. అందుకే ఖర్చు తగ్గించేందుకు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నాయి. వెంటాడుతున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా ఉపాధి కోల్పోయిన అభ్యర్ధులు స్కిల్స్ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రస్తుతం మన దేశంలో టెక్నాలజీకి విపరీతమైన డిమాండ్ ఉంది. డిమాండ్ అనుగుణంగా కోర్సులు నేర్చుకోవాలి. ఉద్యోగం కోల్పోయామనే ఆందోళన చెందకుండా అవకాశాల్ని సృష్టించుకోవాలి.’ అని డెలాయిట్ ఇండియా డైరెక్టర్ వంశీ కరవాది తెలిపారు. భారత్‌పై ప్రభావం అంతంత మాత్రమే.. కానీ ప్రపంచ దేశాలల్లో ఉద్యోగుల తొలగింపులతో పోలిస్తే భారత్‌పై ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల తరహాలో మనదేశంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదన్నారు వంశీ కరవది. కానీ భారత్‌లో ఆటోమెషిన్, ఉద్యోగి పనితనం, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలపై పనిచేస్తున్న విభాగాల్లోని ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని పేర్కొన్నారు. ఉద్యోగం కోల్పోతే వ్యక్తిగతంగా, ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ విశ్వాసాన్ని కోల్పోవద్దని, ఉద్యోగం పోగొట్టుకున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు ఇచ్చిన కొన్ని సూచనలు ఇలా ఉన్నాయి. మీ నైపుణ్యంపై ప్రభావం పడకూడదు సంస్థ తొలగిస్తే ఆ ప్రభావం ఉద్యోగి పనితీరుపై పడకూడదు. తొలగింపులు అనేవి మార్కెట్ అస్థిరతకు అనుగుణంగా ఉంటాయి. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోతే అది మీ పనితీరు, మీ సామర్ధ్యాల వల్ల కాదని గుర్తుంచుకోవాలి. అవసరం అయితే షార్ట్ టర్మ్ ఆన్లైన్ కోర్స్‌లు నేర్చుకొని కొత్త కొత్త నైపుణ్యాలు పెంపొందించుకోవాలి. ఆ నైపుణ్యాల వల్ల తాత్కాలికంగా ఎలాంటి లాభం లేకపోవచ్చు. భవిష్యత్‌లో ఉపయోగపడతాయి. - నేహా బగాహారియా జాబ్స్ ఫర్ హర్ ఫౌండర్ - సీఈవో జాబ్ పోయిందని మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ఆర్ధిక మాంద్యం భయాలలో ఇదొక భాగమనే గుర్తుంచుకోవాలి’ - సుమిత్ సబర్వాల్, టీం లీజ్ హెచ్ఆర్ టెక్నాలజీ సీఈవో మీ బలాల్ని గుర్తించడం ఉద్యోగి వారి బలాల (Strength) ఆధారంగా కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ వారి బలహీనతలు కాకుండా.. బలాలేంటో తెలుసుకోవాలి. ఆ బలాలు ఎవరో చెబితే.. తెలుసుకోవడం కాదు. మీకు మీరుగా తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా స్కిల్స్‌ను పెంచుకోవాలి. - సుధాకర్ రాజా, ఫౌండ్ అండ్ సీఈవో టీఆర్‌ఎస్‌టీ అప్పుల జోలికెళ్లొద్దు ఉపాధి కోల్పోయామని ఎక్కువ వడ్డీతో అప్పు చేసే ప్రయత్నం చేయొద్దు. పొదుపును అలవాటు చేసుకోవాలి. ఉద్యోగం చేసే సమయంలో దాచిపెట్టుకున్న సేవింగ్స్‌ను జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మానసికంగా దృఢంగా ఉండాలి సంస్థ తొలగించిన ఉద్యోగులు మానసికంగా దృఢంగా ఉండాలి. ఉద్యోగం పోతే ఆ బాధ నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. భవిష్యత్ అవకాశాల గురించి చర్చించాలి. అదే సమయంలో సోషల్ మీడియా వినియోగిస్తూ నెట్ వర్క్‌ను పెంచుకోవాలి నెట్ వర్కింగ్‌పై ఫోకస్ ఉద్యోగం పోయిన క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వారి నెట్‌వర్క్‌పై ఫోకస్ చేయాలి. అంటే వారు ఏ రంగంలో నిష్ణాతులో .. ఆ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌తో లింక్డిన్లో కనెక్ట్ అవ్వాలి. స్నేహితుల వాట్సాప్ గ్రూప్స్‌లో జాబ్స్ గురించి తెలుసుకోవాలి. అలా నెట్ వర్కింగ్‌పై దృష్టి సారించడం వల్ల జాబ్స్ త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సర్వేలో 80 శాతం ఉద్యోగాలు నెట్ వర్కింగ్ ద్వారా అభ్యర్ధులు ఉద్యోగాలు సాధిస్తున్నట్లు తేలింది. చదవండి👉 వైరల్: ‘ట్విటర్లో మా ఉద్యోగాలు ఊడాయ్’..లైవ్‌లో చూపించిన ఉద్యోగులు -
Recession In India 2022: భారత్‌లో మాంద్యానికి ఆస్కారమే లేదు
న్యూఢిల్లీ: ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకోనుందన్న భయాలు నెలకొన్న నేపథ్యంలో భారత్‌లో అటువంటి పరిస్థితేమీ రాబోదని నీతి ఆయోగ్ మాజీ వైస్–చైర్మన్ రాజీవ్ కుమార్ చెప్పారు. అంతర్జాతీయ అనిశ్చితి పరిస్థితుల ప్రభావం భారత్‌పై పడినా .. దేశీయంగా మాంద్యం తలెత్తబోదని స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24)లో వృద్ధి రేటు 6–7 శాతం స్థాయిలో ఉంటుందని కుమార్ ధీమా వ్యక్తం చేశారు. అమెరికా, యూరప్, జపాన్‌తో పాటు చైనా తదితర దేశాల్లో ఏకకాలంలో మందగమనం కనిపిస్తోందని, దీనితో రాబోయే నెలల్లో ప్రపంచ ఎకానమీ మాంద్యంలోకి జారుకునే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో కుమార్ చెప్పారు. మరోవైపు రిటైల్ ద్రవ్యోల్బణం మరికొంత కాలం పాటు 6–7 శాతం స్థాయిలోనే ఉండవచ్చని ఆయన చెప్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా అంతర్జాతీయ చమురు ధరలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల కారణంగా క్రూడాయిల్ రేట్ల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని, అలా కాకపోతే దేశీయ సానుకూల అంశాల కారణంగా ద్రవ్యోల్బణం దిగి రాగలదని కుమార్ చెప్పారు. ఎగుమతులపై దృష్టి పెట్టాలి.. వాణిజ్య లోటు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులను పెంచుకోవడానికి తగిన విధానాలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కుమార్ చెప్పారు. ఒక్కో రాష్ట్రంలో పరిస్థితి ఒక్కో రకంగా ఉన్నప్పుడు దేశం మొత్తానికి ఒకే ఎగుమతుల విధానం అమలుపర్చడం సరికాదన్నారు. సముద్ర తీరమే లేని పంజాబ్‌కు, శతాబ్దాలుగా సముద్ర వాణిజ్యం చేస్తున్న తీర ప్రాంత రాష్ట్రం తమిళనాడుకు ఒకే తరహా ఎగుమతుల విధానాలు పని చేయవని కుమార్ చెప్పారు. -
సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ
నాంపల్లి (హైదరాబాద్): దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత నాలుగేళ్లుగా జాతీయ ఆర్థిక అభివృద్ధి సూచిక దారుణంగా పడిపోయిందని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సామాజిక సదస్సులో పాల్గొన్న నాగేశ్వర్, సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. కారణాలు–ప్రభావాలు అనే అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. దేశంలో 23 కోట్ల మంది ప్రజలు ఇప్పటికీ పేదరికంలో ఉన్నారని పేర్కొన్నారు. దేశ సంపదలో 20 శాతం కేవలం ఒక శాతం జనాభా చేతిలో ఉందన్నారు. బ్రిటన్ దేశాన్ని అధిగమించి ఐదవ పెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగినప్పటికీ భారతదేశం తలసరి ఆదాయం, బ్రిటన్ ప్రజల తలసరి ఆదాయం కంటే 20 రెట్లు తక్కువగా ఉందన్నారు. కేంద్రం కార్పొరేట్ కంపెనీలకు ఆదాయ పన్నును ఒకేసారి పది శాతం తగ్గించిందని చెప్పారు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థకు రూ.లక్షా 80 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోయిందని, ఈ విషయాన్ని నీతి ఆయోగ్ నివేదికలే చెప్తున్నాయని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉన్న దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛగా ఆలోచించడం, మతాచారాలను పాటించే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో అధికారంలో ఎవరున్నా వ్యక్తుల ఇష్టాఇష్టాలు, వ్యక్తిగత సిద్ధాంతాల ప్రాతిపదికన పరిపాలన సాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ద్రవ్యోల్బణంతో పాటు ఎగుమతి, దిగుమతుల మధ్య పెరిగిపోతున్న అంతరం, రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయన్నారు. కరోనా తర్వాతి కాలంలో కేంద్రం తీసుకున్న ఉద్దీపన చర్యల్లోనూ నిజాయితీ లోపించడంతో ప్రజల కు ఏ రకమైన ఉపశమనం లభించలేదన్నారు. సద స్సులో టీఎన్జీఓ కేంద్ర సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌రావు, తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి ఎర్రోజు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఎల్ఆర్ఎస్.. గప్‌చుప్! చడీచప్పుడు లేకుండా వెంచర్ల క్రమబద్ధీకరణ -
మాంద్యం ముప్పు ఎవరికి?
నవంబరు 9న ‘మెటా’ అనే కంపెనీ తన ఉద్యోగుల్లో 11 వేల మందిని తీసేస్తున్నట్టు ప్రకటించింది. ‘ట్విట్టర్’ అనే కంపెనీ 3 వేల 7 వందల మందినీ, ‘బైజూ’ అనే కంపెనీ 2 వేల 5 వందల మందినీ.. ఇలా అనేక డజన్ల కంపెనీలు తమ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగుల్ని వందల్లో, వేలల్లో తీసేసినట్టు వార్తలు వచ్చాయి. ఈ ఉద్యోగాల కోత ప్రపంచవ్యాప్తంగా గత 6 నెలల నించీ జరుగుతూనే వుంది. మొన్న జులై నెలలో ‘అమెజాన్’ అనే కంపెనీ లక్షమందిని ఉద్యోగాల్లో నించీ తీసేసింది. ఈ జాబితా చాలా పొడుగ్గా వుంటుంది. ఈ ఉద్యోగాలు పోవడం అనేది కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, వస్తువులు తయారు చేసే పరిశ్రమల్లో (మాన్యుఫ్యాక్చర్ రంగంలో) కూడా లక్షల్లో జరుగుతోంది. కొన్ని నెలలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం సేకరించే సంస్థల (ఉదా: సి.ఎం.ఐ.ఇ) నివేదికలు చూస్తే నిరుద్యోగ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్ధం అవుతుంది. అమెరికా లాంటి పెట్టుబడిదారీ దేశాల్లో కార్మికుల్ని ఉద్యోగాల్లో నించీ తీయదలుచుకుంటే వాళ్ళకి గులాబీ రంగు కాగితం (పింక్ స్లిప్) మీద ‘రేపటి నించీ నువ్వు పనిలోకి రానక్కరలేదు’ అని రాసిచ్చేవారు. ఇప్పుడు కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక ఎక్కడెక్కడో నివసించే ఉద్యోగులందరినీ ఒక తెర మీద కనిపించేలాగా సమా వేశపరిచి (దీన్ని బడాయిగా ‘జూమ్ మీటింగ్’ అని చెప్పుకుంటారు.) చల్లగా చావు కబురు చెపుతారు. ఆ మధ్య ‘బెటర్.కామ్’ అనే కంపెనీ ఒకే ఒక్క జూమ్ సమావేశం పెట్టి ఒక్క దెబ్బతో 3 వేలమంది ఉద్యోగుల్ని ‘రేపటినించీ మీరు పనిలోకి రానక్కర లేదు’ అని చెప్పేశారని ఒక వార్త! ఇంతగా ఉద్యోగాలు పోవడం అనేది చరిత్రలో ఎన్నడూ లేదు. కేవలం పెట్టుబడిదారీ విధానంతోనే అది మొదలైంది. గత సమా జాలలో లేదు. బానిసలకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఫ్యూడల్ కౌలు రైతులకి నిరుద్యోగ సమస్య ఉండేది కాదు. ఎటొచ్చీ ఈనాటి కార్మికులకే (వీళ్ళది ‘వేతన బానిసత్వం’ అంటాడు మార్క్స్) ఈ నిరుద్యోగ సమస్య వుంది. కార్మికులు అన్నప్పుడు వాళ్ళు శారీరక శ్రమలు చేసేవారే అనుకోకూడదు. మేధాశ్రమలు చేసే వారందరూ (ఉదా: టీచర్లూ, డాక్టర్లూ, జర్నలిస్టులూ) కూడా కార్మికులే! ఉద్యోగుల్ని తీసేయడానికి కంపెనీల వాళ్ళు చెప్పుకునే కారణాలు (సాకులు) కొన్ని: 1. కంపెనీకి ఆదాయాన్ని మించిన ఖర్చులు అవుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోడానికి ఉద్యోగుల సంఖ్యని తగ్గించుకోవడం మినహా మార్గం లేదు. 2. ఉద్యోగులు ఎక్కువగానూ, సమర్థంగానూ ఉత్పత్తి చెయ్యడం లేదు. (దీన్నే ఉత్పాదకత –ప్రొడక్టివిటీ – సమస్యగా చెపుతారు). 3. బ్యాంకులు వడ్డీరేట్లని పెంచేస్తూ పోతున్నాయి. ఇలాంటప్పుడు, వ్యాపారాన్ని నడపాలన్నా, పెంచాలన్నా అప్పులు తీసుకోవాలంటే పెంచిన వడ్డీ రేట్లు పెద్ద భారం. అందుకే ఉన్న ఉద్యోగుల్ని తగ్గించి, తక్కువ మందితో ఎక్కువ పని చేయించుకోవడమే మార్గం. 4. ఇతర దేశాలలో కూడా ఇవే పరిస్థితులు ఉండడం వల్ల ఎగుమతులు కూడా తగ్గి పోతున్నాయి. 5. ఒకే రకమైన సరుకులు తయారు చేసే ఇతర కంపెనీలతో పోటీ ఒకటి తలనొప్పిగా వుంది. 6. తయారైన సరుకులు మందకొడిగా (నెమ్మదిగా) అమ్ముడవుతున్నాయి. (దీన్నే ‘మాంద్యం’ అంటారు. కాబట్టి, ఉన్న సరుకులు అమ్ముడు కాకుండా కొత్త సరుకులు తయారు చేయించడం కుదరదు. అందుచేత, కొంతమందిని ఉద్యోగాల్లోనించీ తీసివేయక తప్పదు). ఈ రకమైన పరిస్థితిని చూపించి ఆర్థికవేత్తలు ‘ముంచుకొస్తున్న మాంద్యం’ అని హెచ్చరికలు చేస్తారు. అంతేగానీ తయారైన సరుకుల అమ్మకాలు మందకొడిగా ఎందుకు జరుగుతాయి? దానికి పరిష్కారం ఏమిటి?– అనే ప్రశ్నలకు వారి దగ్గిర సరైన సమాధానం వుండదు. మార్క్స్ తన ‘కాపిటల్’ లో విమర్శించినట్టు, ‘‘పాఠ్య పుస్తకాల ప్రకారం ఉత్పత్తి విధానం సాగించి వుంటే సంక్షోభాలు సంభ వించవు.. అని నొక్కి చెప్పడం ద్వారా పెట్టుబడిదారీ ఆర్థికవేత్తలు సంతృప్తి పడతారు’’. ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందంటే, అనేక కంపెనీల్లో సరుకుల గుట్టలు మార్కెట్ అవసరాల్ని మించిపోయి ఆకాశం ఎత్తున పెరిగిపోవడం వల్ల! ఈ గుట్టలు పెరగడం ఎందుకు జరుగు తుందంటే, ఆ ఉత్పత్తుల్ని తయారు చేయించే వాళ్ళ మధ్య సమష్టి ప్లాను లేకపోవడం వల్ల! ఆ సమిష్టి ప్లాను లేకపోవడం ఎందుకు జరుగుతుందంటే, వాళ్ళందరూ ప్రైవేటు పెట్టుబడిదారులు అవడం వల్ల! పెట్టుబడిదారీ జన్మ ప్రారంభమైన తర్వాత, ఆ జన్మకి లక్ష్యం లాభం రేటే! ఆ లక్ష్యానికి ఒక పరిమితీ, ఒక నీతీ, ఏదీ ఉండదు. ఆఖరికి మార్కెట్ అవసరాల్ని గమనించుకోవాలనే తెలివి అయినా ఉండదు. పోటీలో నిలబడడానికి ఏకైక మార్గం – ఉత్పత్తి శక్తుల్ని పెంచడం! అంటే, సరుకుల్ని తక్కువ ఖర్చులతో తయారుచేసి, వెనకటి ధరలతోనే అమ్మాలని ప్రయత్నం! ఆ రకంగా కొంతకాలం జరిగిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే కంపెనీల నిండా సరుకుల గుట్టలు పేరుకుపోయి కనపడతాయి. అమ్మకాలు మందగించిన ప్రమాద సంకేతాలు ఎదురవుతాయి. దాన్ని గమనించుకున్న కంపెనీ యజమాని, పునరుత్పత్తి క్రమాల్ని తగ్గించెయ్యడం గానీ, ఆపెయ్యడం గానీ చేస్తాడు. అలా ఆపెయ్యడం వల్ల కార్మికులతో అవసరం తగ్గిపోతుంది. ఆ కంపెనీ నించి ఒక పిడికెడు మంది కార్మికులు తప్ప, మిగతా అందరూ ఉద్యోగాలు పోయి వీధుల్లో పడతారు. అసలు కార్మిక వర్గంలో, కొంత జనం ఎప్పుడూ నిరుద్యోగంలోనే వుంటారు. కానీ, సంక్షోభాల కాలాల్లో ముంచుకువచ్చే నిరుద్యోగాల పరిస్థితి అలాంటిది కాదు. ఒక కంపెనీలో నిన్నటి దాకా 100 మంది కార్మికులు వుంటే, ఇవ్వాల్టికి కనీసం 90 మంది నిరుద్యోగులైపోతారు. ఇది ఒక్క శాఖలోనే కాదు, అనేక శాఖల్లో జరుగుతుంది. శారీరక శ్రమల్లోనూ, మేధా శ్రమల్లోనూ కూడా ఇది జరుగుతుంది. సరుకుల పునరుత్పత్తి క్రమాలే తగ్గిపోయి, యంత్రాలే ఆగిపోయినప్పుడు, ఇక కార్మికులతో ఏం అవసరం ఉంటుంది? అయితే, ఆ కార్మికులందరూ ఏమైపోతారు? రెగ్యులర్‌గా జీతాలు అందుతూ వున్నప్పుడే కార్మిక కుటుంబాలు, సమస్యల వలయాల్లో కూరుకుపోయి వుంటాయి. అలాంటి కుటుంబాలకు జీతాలే ఆగిపోతే, తిండే ఉండదు. అద్దె ఇళ్ళు ఖాళీ చేసి చెట్ల కిందకి చేరవలసి వస్తుంది, చెట్లయినా వుంటే! పిల్లల్ని స్కూళ్ళు మానిపించవలసి వస్తుంది. ఆకలి – జబ్బులు మొదలవుతాయి. వైద్యం ఉండదు. చావులు ప్రారంభం! బతికి వుంటే పిచ్చెత్తడాలూ, ఆత్మహత్యలూ, నేరాలూ పెరిగి పోతాయి. కార్మిక జనాలు పిట్టలు రాలినట్టు రాలి పోతారు. ఉదాహరణకి, ప్రభుత్వ లెక్కల ప్రకారమే భారతదేశంలో 2021లో లక్షా 64 వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళలో 43 వేలమంది రోజూ వారీ కూలీలూ, నిరుద్యోగులూనూ అని తేలింది. లెక్కకు రానివి ఎన్నో! రంగనాయకమ్మ, ప్రముఖ రచయిత్రి -
‘టీవీలు, ఫ్రిజ్‌లు కొనకండి.. ప్రమాదం ముందుంది’.. జెఫ్ బెజోస్ షాకింగ్ వ్యాఖ్యలు!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆశాజనకంగా లేదని, మాంద్యం ముప్పు ముంచుకొస్తోందని ప్రజలు అందుకు తగ్గట్టు సన్నద్ధంగా ఉండాలని ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ సూచించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అనవసర ఖర్చులకు ప్రజలకు దూరంగా ఉండాలన్నారు. ఇకపై డబ్బులు దాచుకోవాలన్న బెజోస్, టీవీ ,ఫ్రీజ్, కారు కొనాలనే ఆలోచన ఉంటే వాటిని దూరంగా ఉండాలన్నారు. సాధ్యమైనంత వరకు నగదుని మీ వద్దే ఉంచుకునేందుకు ప్రయత్నించాలని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆర్థిక వ్యవస్థ అంత గొప్పగా కనిపించడం లేదు. దీని ప్రభావమే అనేక రంగాలలో ఉద్యోగుల తొలగింపులు అనివార్యమైనట్లు చెప్పారు. ఈ క్రమంలోనే చిరు వ్యాపారులు తమ వద్ద నగదు నిల్వ ఉంచుకొని.. కొత్త వస్తువుల కొనుగోలు నిలిపి వేయాలని సూచించారు.కాగా, బెజోస్ తన సంపదలో సింహ భాగం సమాజ సేవకు ఉపయోగించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం బెజోస్ విలువ $123.9 బిలియన్ డాలర్లు ఉన్నాయి. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కింద రూ.50వేల వరకు రుణాలు! -
డిసెంబర్ క్వార్టర్లో మాంద్యంలోకి యూరప్ దేశాలు
ఫ్రాంక్ఫర్ట్: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. -
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన అమెజాన్..
-
ఐటీలో మొదలై అక్కడి వరకు.. ఉద్యోగులపై వేటుకు రెడీగా ఉన్న ప్రముఖ ఓటీటీ సంస్థ!
అంతర్జాతీయ పరిస్థితులు, ఆర్థిక మాంద్యం భయాలు, ఆశించిన ఫలితాలు అందుకోవడంలో విఫలం.. ఇవన్నీ కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ కంపెనీలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో ఇప్పటికే వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, మెటా లాంటి దిగ్గజ సంస్థలు తొలగింపులను ప్రకటించగా తాజాగా స్టీమింగ్ దిగ్గజం డిస్నీ ఉద్యోగాలను తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై కంపెనీ సీఈఓ మాట్లాడుతూ.. ప్రస్తుతం కంపెనీ ఖర్చలను తగ్గించే పనిలో ఉన్నాం. ఆ ప్రక్రియపైనే మా సిబ్బంది పని చేస్తున్నారు. ఇటీవల ఆశించిన ఫలితాలు పొందలేకపోయాం, పైగా అంతర్జాతీయంగా పరిణామాలు కూడా తిరోగమనంవైపు సూచిస్తున్నాయి. అందుకే మేము కొంత సిబ్బంది తగ్గించాలని అనుకుంటున్నాం, అయితే ఆ సంఖ్యను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. ఉద్యోగులపై వేటు మాత్రమే కాకుండా వ్యాపార పర్యటనలను పరిమితం చేయాలని ఆయన సంస్థలోని ముఖ్య అధికారులను కోరారు. అవసరమైన ప్రయాణాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం కఠినమైన, అసౌకర్య నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం డిస్నీలో దాదాపు 190,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వసూళ్ల పరంగా డిస్నీ ఇటీవల పెద్దగా రాణించలేదు. నివేదికల ప్రకారం, కంపెనీ షేర్లు బాగా పడిపోయాయి, కొత్తగా వచ్చిన ఫలితాలను చూస్తే 52 వారాల కనిష్టానికి చేరాయి. గతంలో, వార్నర్ బ్రదర్స్, నెట్‌ఫ్లిక్స్‌తో సహా స్ట్రీమింగ్ కంపెనీలు ఈ సంవత్సరం వాల్యుయేషన్స్ మందగించడంతో తమ వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకున్నాయి. ప్రస్తుతం డిస్నీ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే ప్లాన్ ఉన్నప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
వణుకుతున్న ఉద్యోగులు.. ఏడాది చివరికల్లా మాంద్యంలోకి ఆ దేశాలు!
ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. అయితే మాంద్యం ప్రభావం ఎక్కువగా ఉద్యోగులపై ఉండవచ్చని ఇదివరకే నిరూపితం కాగా ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. దీంతో ఆ దేశాల్లో ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. చదవండి: ఏంటి బ్రో, చేరిన 2 రోజులకే నా ఉద్యోగం ఊడింది.. ఓ ఐఐటియన్ బాధ ఇది! -
Ned Davis Research: ముంచుకొస్తున్న మాంద్యం
ప్రపంచాన్ని మాంద్యం మేఘాలు కమ్ముకుంటున్నాయి. వచ్చే ఏడాదికల్లా ఆర్థిక మాంద్యం అతలాకుతలం చేసేలా కన్పిస్తోంది. కరోనా దెబ్బ నుంచి కోలుకోకముందే వచ్చిపడ్డ రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ఆర్థిక వృద్ధి క్రమంగా కుంటుపడుతూ ప్రధాన దేశాలన్నీ మాంద్యం వైపు అడుగులేస్తున్నాయి.... (డి.శ్రీనివాసరెడ్డి) ప్రపంచం ఆర్థిక మాంద్యం బారిన పడటం ఖాయమని ఫ్లోరిడాకు చెందిన నెడ్ డేవిస్ రీసెర్చ్ చెబుతోంది. మాంద్యాన్ని అంచనా వేయడంలో ఈ సంస్థ అందెవేసిన చేయి. దాని లెక్క ప్రకారం వచ్చే ఏడాదికల్లా ప్రపంచం మాంద్యం గుప్పెట్లో చిక్కేందుకు 98.1 శాతం ఆస్కారముంది. వాల్‌స్ట్రీట్ జర్నల్ జూలైలో చేసిన సర్వేలో మాంద్యం తప్పదని 49 శాతం ఆర్థికవేత్తలు పేర్కొనగా అక్టోబర్‌లో వారి సంఖ్య 63 శాతానికి పెరిగింది! 12 నెలల్లోపే అమెరికా మాంద్యం కోరల్లో చిక్కడం ఖాయమని సర్వే తేల్చింది. వర్ధమాన దేశాలపై ఇది సుదీర్ఘ ప్రభావమే చూపవచ్చని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్ఫాస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, యుద్ధం, వాతావరణ విపరణామాలు ప్రపంచాన్ని అంధకారంలోకి నెడుతున్నాయని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఎండీ క్రిస్టలినా జార్జివా హెచ్చరించారు. కుంటినడకన ఆర్థికం... చాలా దేశాల్లో జీడీపీ వృద్ధిరేటు నానాటికీ పడిపోతోంది. 2022లో ప్రపంచ ఆర్థిక పురోగతి రేటు 6.1 శాతముంటే 2023 నాటికి ఏకంగా సగానికి సగం పడిపోయి 3.2 శాతానికి పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ అంచనా వేసింది. సంపన్న దేశాల ఆర్థిక వృద్ధి కూడా నేల చూపులే చూస్తోంది. యూరప్ జీడీపీ 1.2 శాతానికి, బ్రిటన్ కేవలం 0.3, ఫ్రాన్స్ 0.7కు పరిమితం కావచ్చని అంచనా. సవరించిన వృద్ధి రేట్ల ప్రకారం చూసినా అమెరికా 1 శాతం, చైనా 3.2 శాతంతో సరిపెట్టుకునేలా ఉన్నాయి. 2016తో పోలిస్తే ప్రపంచ జీడీపీ 23 శాతం పెరగాలన్నది అంచనా కాగా కరోనా, యుద్ధం తదితరాల దెబ్బకు 17 శాతానికే పరిమితమైంది. ఇలా పడిపోయిన ఉత్పాదకత విలువ ఏకంగా 17 లక్షల కోట్ల డాలర్లు. అంటే ప్రపంచ ఆదాయంలో ఏకంగా 20 శాతం! ఎందుకీ దుస్థితి...? కరోనా, యుద్ధం నేపథ్యంలో విపరీతంగా పెరిగిపోయిన ధరలకు కళ్లెం వేసేందుకు ఈ ఏడాది ఏకంగా 90 దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచేశాయి. ఈ దెబ్బకు ఉత్పాదకత తగ్గడంతో పెట్టుబడులు, వినియోగం పడిపోయి మాంద్యం ముంచుకొస్తోంది. ధరల అదుపు కోసమని పదేపదే వడ్డీ రేట్లు పెంచితే మాంద్యం బారిన పడక తప్పదని జార్జ్ వాషింగ్టన్ వర్సిటీ ప్రొఫెసర్ పావ్లిన్ టియెన్ అన్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు వడ్డీ రేట్ల పెంపుతో 90 దేశాల కరెన్సీ విలువలు పతనమయ్యాయి. గతేడాది 125.7గా ఉన్న ఆహారోత్పత్తుల ధరల సూచీ ఈ ఏడాది 146.94 పాయింట్లకు పెరిగింది. మాంద్యం దెబ్బకు కంపెనీలు నియామకాలకు కత్తెర వేస్తున్నాయి. అమెరికాలో నిరుద్యోగిత వచ్చే డిసెంబర్ నాటికి 3.7 శాతానికి, 2023 జూన్‌కల్లా 4.7కు పెరుగుతుందని అంచనా. మాంద్యమంటే... మామూలు పరిభాషలో వరుసగా రెండు త్రైమాసికాలు గనక జీడీపీ తిరోగమనంలో సాగితే ఆ దేశంలో మాంద్యంలోకి జారుకున్నట్టు పరిగణిస్తారు. ఇవీ సంకేతాలు... ► సుదీర్ఘంగా సాగేలా కన్పిస్తున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ► డాలర్ ముందు కుదేలవుతున్న అన్ని దేశాల కరెన్సీలు ► చుక్కలనంటుతున్న ద్రవ్యోల్బణం ► వడ్డీరేట్లను పెంచేస్తున్న అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు ► నియామకాలు బాగా తగ్గిస్తున్న కార్పొరేట్ సంస్థలు ► నానాటికీ మందగిస్తున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి మనకూ తిప్పలే... మన జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది 6.8 శాతం ఉంటుందని, 2023లో 6.1 శాతానికి తగ్గుతుందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే ఇది మెరుగేనని కితాబిచ్చింది. కానీ మాంద్యం ఎఫెక్ట్ భారత్‌పైనా గట్టిగానే ఉంటుందని అంచనా. అమెరికాకు మన ఎగుమతులు 2011 10.1 శాతముంటే ఇప్పుడు 18.1 శాతానికి పెరిగాయి. మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో ఏకంగా 54.8 శాతం అమెరికాకే వెళ్తున్నాయి. అగ్రరాజ్యం మాంద్యంలో చిక్కితే వీటిపై గట్టి ప్రభావమే పడుతుంది. మన విదేశీ మారక నిల్వలు వరుసగా తొమ్మిదో వారమూ తిరోగమన దిశలో ఉన్నట్టు అక్టోబర్ 7నాటి నివేదికలో రిజర్వ్ బ్యాంకే పేర్కొంది. అమెరికాతో భారత వాణిజ్య లోటు 3.8 శాతానికి ఎగబాకుతుందని అంచనా! -
ఐటీలో అసలేం జరుగుతోంది! ఉద్యోగుల తొలగింపు, ఆఫర్ లెటర్స్ లేవు.. అన్నింటికీ అదే కారణమా
గత కొంత కాలంగా ఐటీ రంగంలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. దిగ్గజ కంపెనీలు సైతం ఆఫర్ లెటర్లు ఇచ్చినా.. జాయినింగ్ లెటర్స్ జారీలో జాప్యం, సంస్థలో తొలగింపులు వంటివి చేపడుతున్నాయి. ఇవి ఆ రంగంలోని ఉద్యోగులను, ఐటీ కొలువు కోసం వేచి చూస్తున్న విద్యార్ధులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. అంతేకాకుండా మరికొన్ని సంస్థలు.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి.. సదరు ఆఫర్‌ను తిరస్కరిస్తున్నట్లుగా సమాచారం కూడా ఇస్తున్నాయి. ఇలా ఆఫర్ తిరస్కరణ సందర్భంలో.. ‘మా సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా మీ అర్హతలు లేవు’ అనో.. లేదా ‘మీరు మీ ్ర΄÷ఫైల్‌కు సరిపడే సర్టిఫికేషన్స్ పూర్తి చేయలేదు’ అనో పేర్కొంటున్నాయి. దీంతో క్యాంపస్ డ్రైవ్‌లో తమ అకడమిక్ ప్రతిభను, మార్కులను, స్కిల్స్‌ను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసి, ఆఫర్ లెటర్లు ఇచ్చిన సంస్థలు.. ఇప్పుడు వెనక్కి తీసుకోవడం ఏంటి? అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు ► ప్రస్తుత పరిస్థితుల్లో పలు ఎంఎన్సీ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపులు ఉంటాయనే సంకేతాలు ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ► ఇప్పటికే ఫేస్బుక్ ఆధ్వర్యంలోని మేటా సంస్థలో 12 వేల మందిని పనితీరు ప్రతిపాదికగా తొలగించనున్నట్లు ప్రకటించారు. ► దాదాపు 1.15 లక్షల ఉద్యోగులు ఉన్న ఇంటెల్ సంస్థ.. అంతర్జాతీయంగా 20 శాతం మేరకు ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది. ► దేశీయంగానూ ప్రముఖ ఎడ్టెక్ సంస్థ బైజూస్ రెండున్నర వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. n గూగుల్ సంస్థ కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో నికర రాబడిలో తగ్గుదలతో నూతన నియామకాల విషయంలో కొంతకాలం స్వీయ నిషేధం విధించింది. మాంద్యం సంకేతాలే కారణమా! ► ఐటీలో ఆన్‌బోర్డింగ్ ఆలస్యానికి అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందనే సంకేతాలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మన దేశంలోని సంస్థల్లో అధిక శాతం అమెరికాలోని కంపెనీలకు ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలందిస్తున్నాయి. అమెరికా మాంద్యం ముంగిట నిలిచిందనే అంచనాల కారణంగా.. అక్కడి కంపెనీల్లో కార్యకలా΄ాలు మందగిస్తున్నాయి. ఫలితంగా ఆయా సంస్థలు కొత్త ప్రాజెక్ట్‌ల విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. దీంతో.. సదరు సంస్థలకు సేవలపై ఆధారపడిన మన ఐటీ కంపెనీలపై ఆ ప్రభావం కనిపిస్తోంది. ఇది అంతిమంగా ఆన్ బోర్డింగ్‌లో జాప్యానికి కారణమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ ఒడిదుడుకుల కారణంగా కొత్త ప్రాజెక్ట్‌లు రావడం కొంత కష్టంగా ఉంది. ఇది కూడా ఆన్ బోర్డింగ్‌లో జాప్యానికి మరో కారణమని చెబుతున్నారు. చదవండి: ‘కోహినూర్ వజ్రం కోసం ఇలా ట్రై చేస్తే’.. హర్ష గోయెంకా ట్వీట్‌కి నవ్వకుండా ఉండలేరు! -
ఆర్ధిక మాంద్యంపై ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆర్థిక మాంద్యంపై స్పందించారు. 2024 మార్చి వరకు ఆర్ధిక మాంద్యం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. చైనా, ఐరోపాలో తలెత్తిన ఆర్థికమాంద్యం కారణంగా టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ తగ్గిందంటూ మస్క్ పేర్కొన్నారు. అదే విషయంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 2024 వరకు మాంద్యం కొనసాగే అవకాశం ఉన్నట్లు తాను భావిస్తున్నానని మస్క్ అన్నారు. కాగా, టెస్లా కార్లకు గిరాకీ తగ్గిందన్న మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో టెస్లా కంపెనీ షేరు 6.6 శాతం తగ్గి 207.28 డాలర్లకు పడిపోయింది. చదవండి👉 భారత్‌తో ఎలాన్ మస్క్ చర్చలు.. ప్రధాని మోదీ అందుకు ఒప్పుకుంటారా? -
భారత్‌కంటూ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయ్.. డోంట్ వర్రీ!
అమెరికా, యూరోజోన్ మాంద్యం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, భారత్ ఈ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్పీ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్ ఆర్థిక వ్యవస్థ ‘‘పూర్తిగా అనుసంధానం’’కాని స్వభావం దీనికి కారణమని విశ్లేషించింది. ‘‘భారతదేశం ఇంధన నికర దిగుమతిదారు. అయినప్పటికీ, దేశీయ పటిష్ట డిమాండ్ కారణంగా భారత్‌కంటూ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో విషయాల్లో విడిగా ఉందనే భావించాల్సి ఉంటుంది. భారత్‌కు ఒకవైపు తగినంత ఫారెక్స్ నిల్వలు ఉన్నాయి. అలాగే కంపెనీలు పటిష్ట బ్యాలెన్స్ షీట్లను నిర్వహిస్తున్నాయి’’అని ఎస్అండ్పీ గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఎఫ్ గ్రున్వాల్డ్ ఇక్కడ విలేకరులతో అన్నారు. గ్లోబల్ మార్కెట్లతో అనుసంధానం విషయంలో కూడా భారత్ మిగిలిన దేశాలతో పోల్చితే స్వతంత్రంగా వ్యవహరిస్తోందని అన్నారు. వృద్ధి 7.3 శాతం... అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని, 2023–24లో ఈ రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్ రేటింగ్స్ (ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్‌కు క్రిసిల్ రేటింగ్స్‌లో మెజారిటీ వాటా) చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఎస్అండ్పీ గ్లోబల్ చీఫ్ ఎకనామిస్ట్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్ ఎఫ్ గ్రున్వాల్డ్ దాదాపు ఏకీభవిస్తూ, ‘‘పలు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారతదేశం మిగతా ప్రపంచం కంటే చాలా మెరుగ్గా పని చేస్తుంది’’ అని అన్నారు. చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది! -
రెసిషన్ భయాలు: రుపీ మరోసారి క్రాష్
సాక్షి, ముంబై: గ్లోబల్ మాంద్యం భయాలతో డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి బలహీనపడింది ప్రపంచ వ్యాప్తంగా దిగ్గజ దేశాలకు కూడా ఆర్థిక కష్టాలు తప్పవనే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ఆరంభంలోనే రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 11 పైసలు పడిపోయి 79.82 వద్దకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన కేంద్ర బ్యాంకులు మాంద్యంలోకి వెళ్లవచ్చని తాజాగా హెచ్చరించాయి. దీనికి తోడు అమెరికాలోద్రవ్యోల్బణం స్థాయి కూడా ఊహించని రీతిలో ఉండటతో వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేటువడ్డన భారీగా ఉంటుందనే అంచనాలు ఇన్వెస్టర్లను సెంటిమెంట్‌ను దెబ్బ తీసాయి. గురువారం ముగింపు 79.7012తో పోలిస్తే, కీలకమైన 80 స్థాయికి అతి వేగంగా జారిపోతోంది. దీనికి తోడు ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు కూడా రూపాయి క్షీణతకు దారి తీసింది.సె న్సెక్స్ ఒక దశలో ఏకంగా 750 పాయింట్లు కుప్పకూలి 60వేల దిగువకు, అనంతరం 59500 దిగువకు పడిపోయింది. అటు నిఫ్టీ కూడా కీలకమైన మద్దతుస్థాయిని 18వేలను, ఆ తరువాత 17750 స్థాయిని కూడా కోల్పోయింది. -
నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్ సెటైర్లు: తీవ్ర చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాల డిమాండ్‌పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్ స్వామి సెటైర్లు వేశారు. ఆర్థిక మాంద్యం భయాలు, భారత్ కరెన్సీ రూపాయి విలువ పతనం తదితర అంశాలను ప్రస్తావించిన నిర్మలా సీతారామన్ దేశంలో మాంద్యం పరిస్థితులన్న ప్రశ్నేలేదని స్పష్టం చేశారు. డాలర్ మారకంలోభారత్ రూపాయి విలువ కుప్పకూలలేదని అది తన సహజ స్థాయిని కనుగొంటోందని ఆమె వ్యాఖ్యానించారు. దీనిపై బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ వ్యంగ్యంగా స్పందించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లే ప్రసక్తే లేదు.. నిజమే, ఆమె సరిగ్గా చెప్పారు. ఎందుకంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏడాది క్రితమే మాంద్యంలోకి జారుకుందంటూ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇక మాంద్యం లోకి జారుకోవడం అనే ప్రశ్న లేదంటూ విమర్శించారు. తద్వారా దేశ ఆర్థికపరిస్థితి, నిర్మలా సీతారామన్ ప్రకటనపై ట్వీట్ చేసి మోదీ సర్కార్‌పై వ్యంగ్య బాణాల్ని సంధించడమే కాదు, తీవ్ర చర్చకు తెర తీశారు. (ఆనంద్ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్ మామూలుగా లేవు!) “No question of the Indian economy getting into recession” says Finance Minister according to media today. She is right!! Because Indian economy has already got into recession last year. So question of getting into recession does not arise. — Subramanian Swamy (@Swamy39) August 2, 2022 కాగా ద్రవ్యోల్బణంపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన సందర్భంగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేశారు. కోవిడ్ మహమ్మారి విసిరిన సవాళ్లు,సంక్షోభం ఉన్నప్పటికీ దేశం మంచి స్థితిలోనే ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్థగా భారత్ నిలుస్తోందని, అలాగే పరిస్థితులను నియంత్రించేందుకు రిజర్వు బ్యాంక్ చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. ముఖ్యంగా అమెకా పరిస్థితిని ప్రస్తావిస్తూ, భారత్‌లో మాంద్యం వచ్చే ప్రశ్నే లేదని సీతారామన్ తెలిపిన సంగతి తెలిసిందే. (బ్లెస్సింగ్స్ అడిగిన కస్టమర్‌కు ఆనంద్ మహీంద్ర అదిరిపోయే రిప్లై) -
అంతర్జాతీయంగా పసిడి పరుగు
వాషింగ్టన్: ఆర్థిక అనిశ్చితి ధోరణుల్లో అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర గురువారం 35 డాలర్లకుపైగా పెరిగి 1,752 డాలర్లపైన ట్రేడవుతోంది (రాత్రి 11 గంటల సమయంలో). అమెరికాలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, మాంద్యం పరిస్థితుల్లో ఇకముందు ఫెడ్ ఫండ్ రేటు మరింత దూకుడుగా ఉండబోదన్న అంచనాలు, 20 సంవత్సరాల గరిష్టం 109 నుంచి వెనక్కు తగ్గిన డాలర్ ఇండెక్స్ (ఈ వార్త రాస్తున్న సమయంలో 106.4 వద్ద ట్రేడింగ్) వంటి కీలక అంశాలు దీనికి నేపథ్యం. ఇక అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా దేశీయంగా ముంబై ప్రధాన బులియన్ మార్కెట్లో ధర రూ.500 వరకూ లాభపడింది. -
‘మాంద్యం’లోకి జారిన అమెరికా!
వాషింగ్టన్: అమెరికా జూన్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలేకపోగా 0.9 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. అగ్రరాజ్య జీడీపీ క్షీణతలో ఉండడం వరుసగా ఇది రెండవ త్రైమాసికం. మార్చి త్రైమాసికంలో ఎకానమీ 1.6 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. వరుసగా రెండు త్రైమాసికాలు ఎకానమీ క్షీణ బాటలో ఉంటే దానిని అనధికారికంగా (సాంకేతికంగా) మాంద్యంగానే పరిగణిస్తారు. తాజా పరిస్థితిని క్షీణతగా ఎంతమాత్రం భావించరాదని అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొంటున్నారు. ఎకానమీలో పలు రంగాలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను క్షీణతలోకి జారిందని పేర్కొనడం సరికాదన్నది వారి వాదన. తీవ్ర ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు వంటి పరిణామాల నేపథ్యంలో రుణ వ్యయాలు పెరిగిపోయి అమెరికా వినియోగదారులు, వ్యాపారులు తీవ్ర ఒత్తిడులను ఎదుర్కొంటున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ‘మాంద్యం’ అంటే ఏమిటన్న ప్రశ్నపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ద్రవ్యోల్బణ అదుపునకు జనవరి మొదలు ఇప్పటివరకూ వడ్డీ రేటును ఫెడ్ 2.25 శాతం పెంచింది. దీనితో ఫెడ్ ఫండ్స్ రేట్లు 2.25 –2.5 శాతానికి చేరాయి. అయితే ఇకపై రేటు పెంపులో దూకుడు ఉండకపోవచ్చని అంచనా. -
అమెరికాలో ఆర్థిక మాంద్యం రాదు: బైడెన్
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలో చిక్కుకుంటుందని భావించడం లేదని అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. వరుసగా రెండో త్రైమాసికంలోనూ జీడీపీ మరింత పడిపోతుందనే అంచనాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగిత గణాంకాలు ఆశాజనకంగా ఉన్నందున..ప్రస్తుత వేగం పుంజుకున్న అభివృద్ధి, స్థిరత్వాన్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు కూడా మాంద్యం భయాలను కొట్టిపారేస్తున్నారు. పటిష్టమైన లేబర్ మార్కెట్ల వల్ల అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో జీడీపీలో 1.6%క్షీణత నమోదైంది. రెండో త్రైమాసికంలోనూ ఇదే పరిస్థితి పునరావృతం అయ్యే అవకాశముందని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అయితే, స్వల్ప వృద్ధి నమోదవుతుందనే విషయంలో ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందా?... భయాందోళనలో అధికారులు
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీస్తోందేమోనని యూఎస్ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐతే అదేం ఉండదని, భయపడాల్సిన అవసరం లేదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వారం తరువాత వచ్చే జీడీపీ గణాంకాలు వరుసగా రెండోవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నట్లు చూపవచ్చు అని చెప్పారు. ఈ మేరకు బైడెన్ మాట్లాడుతూ...మేము ఆర్థిక మాంద్యంలో ఉండకపోవచ్చునని భావిస్తున్నా. మేము వేగవంతమైన వృద్ధి నుంచి స్థిరమైన వృద్ధి వెళ్తాము. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో తిరోగమనం అనేది అసంభవం అని తేల్చి చెప్పారు. అదీగాక ఆర్థిక వేత్తల ఏకాభిప్రాయ సూచన ఇప్పటికీ స్వల్ప వృద్ధిని కోరుతోందని అన్నారు. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ తదుపరి చర్యగా డిమాండ్‌ని తగ్గించే ప్రయత్నంలో వడ్డిరేట్లను మరో మూడోంతులు శాతం పెంచింది. ఈ మేరకు ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఈ చర్య అత్యవసరం అని చెప్పారు. ఐతే యూఎస్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా సాధించడమే లక్ష్యం అని నొక్కి చెప్పారు. (చదవండి: ‘శ్రీలంకలో మరో 12 నెలల పాటు ఇంధన కొరత తప్పదు’) -
ఇది టీజర్ మాత్రమే.. అసలు కథ ముందుంది.. రిలయన్స్ వార్నింగ్
Reliance Industries: ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉందని రిలయన్స్ సంస్థ హెచ్చరించింది. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు రిఫైనింగ్ ఫ్యాక్టరీ గల రిలయన్స్.. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2022-23 ఏప్రిల్-జూన్) అంచనాల కంటే తక్కువ లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో లాభాల విషయంలో ఫలితాలు అనుకున్నంత ఆశాజనకంగా ఉండకపోవచ్చని పేర్కొంది. రిలయన్స్ జాయింట్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వీ శ్రీకాంత్ ఈ విషయమై మాట్లాడుతూ.. పెరుగుతున్న సరుకు రవాణా, ఇన్పుట్ ధరల కారణంగా అధిక నిర్వహణ ఖర్చులు వంటి అనేక సవాళ్లను ఎదర్కోవాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ త్రైమాసికంలో ముడి సరుకుల ధరలు 76% పెరిగాయి. ఇదిలా ఉంటే, ఈ నెలాఖరులోగా ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటు ఔట్‌లుక్‌ను తగ్గించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకటించింది. పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు, మార్కెట్లకు మూలధన ప్రవాహం మందగించడం, కొనసాగుతున్న మహమ్మారి, చైనాలో మందగమనం లాంటివి వీటికి పెనుసవాళ్లుగా మారాయి. చదవండి: విమాన ప్రయాణంలో ఫోన్లో ఫ్లైట్ మోడ్ ఎందుకు ఆన్ చేస్తారో తెలుసా? -
అయ్యయ్యో.. రూపాయి...ఈ పతనం ఎందాకా?
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయికి కష్టాలు తప్పడం లేదు. సోమవారం మరో రికార్డు కనిష్టానికి జారుకుంది. గ్లోబల్ మాంద్యం, ముడిచమురు సరఫరా, మార్కెట్లలో మిశ్రమ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి 79.40 వద్ద ఆల్ లైం కనిష్టాన్ని నమోదు చేసింది. శుక్రవారం79.26 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుతున్న రూపాయి ప్రస్తుతం 80 మార్క్‌కు చేరువలో ఉండటం ఆందోళన రేపుతోంది. దేశీయ,అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థికవృద్ధి ఆందోళన, చమురు మార్కెట్లో అస్థిరత డాలర్‌కు బలాన్నిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు వరుసగా మూడు సెషన్ల లాభాలకు స్వస్తి చెప్పిన స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 54156 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 16137 వద్ద కొనసాగుతోంది. కాగా రోజుకు మరింత పతనమవుతున్న రూపాయని ఆదుకునేందుకు ఇటీవల ఆర్బీఐ కొన్ని చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొన్ని సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
మరో 300మందికి ఉద్వాసన పలికిన నెట్‌ఫ్లిక్స్
సాక్షి, ముంబై: మార్కెట్లో ప్రత్యర్థుల పోటీ, విపరీతంగా సబ్స్క్రైబర్లను కోల్పోతున్న స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కటింగ్‌లో భాగంగా రెండో విడత ఉద్యోగాల్లో కోత విధించింది నెట్‌ఫ్లిక్స్. ఉద్యోగుల్లో 4శాతం లేదా దాదాపు 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది. గత నెలలో చేసిన కట్ కంటే రెండు రెట్లు ఎక్కువ. వ్యాపారంలో గణనీయంగా పెట్టుబడులను కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని సర్దుబాట్లు, ఆదాయ వృద్ధికి అనుగుణంగా పెరుగుతున్న ఖర్చులను తగ్గించుకునేందుకే ఈ నిర్ణయమని నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. నెట్‌ఫ్లిక్స్ వృద్ధికి వారు చేసిన కృషికి కృతజ్ఞులం, ఈ కష్టకాలలో వారికి మద్దతివ్వడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. మార్కెటింగ్ బడ్జెట్‌ను తగ్గించడంలో భాగంగా మేలో కొంత మంది ఉద్యోగులను నెట్‌ఫ్లిక్స్ తొలగించింది. దీంతోపాటు, ఏప్రిల్‌లో కొంతమంది కాంట్రాక్ట్ కార్మికులు, ఇతర కీలక సిబ్బందిని కూడా తొలగించింది. కాగా 2022 తొలి త్రైమాసికంలో 2 లక్షల సబ్స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌కు గుడ్‌బై చెప్పారు. తదుపరి త్రైమాసికంలోనూ ఇదే కొనసాగు తుందని అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగానే సబ్స్క్రిప్షన్ ఆధారిత రాబడి మోడల్‌ను పెంచి, సంస్థ కార్యకలాపాలను రీటూల్ చేస్తోంది. జనవరిలో ధరల పెంపు కారణంగా నెట్‌ఫ్లిక్స్ కష్టాలు కొద్దిగా తగ్గాయి. అయితే అమెజాన్, వాల్డిస్నీ, హులూ స్ట్రీమింగ్ కంటెంట్‌తో అధిక పోటీసంస్థ ఆదాయాన్ని దెబ్బ తీస్తోంది. మరోవైపు వరుస తొలగింపులు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు ఉద్యోగులను ఆందోళనలోకి నెడుతున్నాయి. -
జీడీపీ యూటర్న్!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ కోలుకుంది. కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో రెండు త్రైమాసికాల వరుస క్షీణ రేటుతో ‘సాంకేతికంగా’ మాంద్యంలోకి జారిపోయిన భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) మెజారిటీ విశ్లేషణలకు అనుగుణంగానే అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో వృద్ధి బాట పట్టింది. ఆర్థి క సంవత్సరం మూడవ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. తాజా సవరిత గణాంకాల ప్రకారం మొదటి త్రైమాసికం ఏప్రిల్–జూన్ మధ్య జీడీపీ భారీగా 24.4 శాతం క్షీణత నమోదు చేసింది. రెండవ త్రైమాసికం జూలై–సెప్టెంబర్‌లో క్షీణత 7.3 శాతానికి పరిమితమైంది (నవంబర్ 20నాటి తొలి అంచనాల ప్రకారం ఈ క్షీణ రేట్లు వరుసగా 23.9 శాతం, 7.5 శాతంగా ఉన్నాయి). రెండు త్రైమాసికాలు వరుస క్షీణతను మాంద్యంగా పరిగణిస్తారు. మూడవ త్రైమాసికంలో వృద్ధి నమోదుకావడంతో భారత్ ఎకానమీ మాంద్యం కోరల నుంచి బయటపడినట్లయ్యింది. ప్రధానంగా వ్యవసాయం, సేవలు, నిర్మాణ రంగాలు ఇందుకు దోహదం చేశాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు 3.3 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం జీడీపీలో దాదాపు 15 శాతం వాటా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు డిసెంబర్ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. ► తయారీ రంగం స్వల్పంగా 1.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. ► నిర్మాణ రంగం భారీగా 6.2% వృద్ధి చెందింది. ► విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర వినియోగ సేవల విభాగంలో భారీగా 7.3 శాతం వృద్ధి నమోదయ్యింది. ► మూలధన పట్టుబడులకు సంబంధించిన ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ విభాగంలో 2.6 శాతం వృద్ధి నమోదయ్యింది. ► వాణిజ్య, హోటెల్ పరిశ్రమ కరోనా మహమ్మారి సవాళ్ల నుంచి బయటకు రాలేదు. మూడవ త్రైమాసికంలోనూ క్షీణత 7.7%గా నమోదైంది. ► ప్రభుత్వ వినియోగ వ్యయాలు 1.1%క్షీణిస్తే, ప్రైవేటు వినియోగ వ్యయం 2.4% తగ్గింది. 0.4 శాతం ఎలా అంటే... మూడవ త్రైమాసికంలో మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువ రూ.36.22 లక్షల కోట్లు. 2019–20 ఇదే కాలంలో ఈ విలువ రూ.36.08 లక్షల కోట్లు. వెరసి తాజా సమీక్షా త్రైమాసికంలో వృద్ధి 0.4 శాతంగా ఉన్నట్లు లెక్క. 2020–21లో క్షీణత అంచనా 8 శాతం ! నేషనల్ అకౌంట్స్ రెండవ ముందస్తు అంచనాల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎకానమీ క్షీణ రేటు 8 శాతంగా ఉంటుందని ఎన్ఎస్ఓ పేర్కొంది. తొలి అంచనాల ప్రకారం ఈ రేటు 7.7 శాతంగా ఉండడం గమనార్హం. 2019–20లో 4 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. తాజా అంచనాల ప్రకారం 2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ విలువ 145.69 లక్షల కోట్లు. అయితే 2020–21లో ఈ విలువ 134.09 లక్షల కోట్లకు పడిపోయే వీలుంది. అంటే క్షీణత 8 శాతం ఉంటుందన్నమాట. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) ఎకానమీ 7.5 శాతం క్షీణతను నమోదుచేసుకుంటుందని అంచనావేసిన ఆర్బీఐ, మూడవ త్రైమాసికంలో 0.1%, నాల్గవ త్రైమాసికంలో 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని సమీక్షలో విశ్లేషించింది. తలసరి ఆదాయం 9.1% డౌన్! తాజా గణాంకాల ప్రకారం 2011–12 ధరలను ప్రాతిపదికగా (ద్రవ్యోల్బణం సర్దుబాటుతో) తీసుకుంటే, 2020–21లో తలసరి ఆదాయం రూ.85,929 ఉంటుందని అంచనా. 2019–20లో ఈ విలువ రూ.94,566. అంటే తలసరి ఆదాయంలో 9.1 శాతం క్షీణత నమోదయ్యే అవకాశం ఉంది. కాగా ప్రస్తుత ధరల ప్రాతిపదిగా చూస్తే, తలసరి ఆదాయం 4.8 శాతం క్షీణతతో రూ.1,34,186 నుంచి రూ.1,27,768కి పడిపోతుంది. -
1946 తరువాత ఎన్నడూ లేనంత పతనం
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక వ్యవస్థ గత 74 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత పతనాన్ని 2020లో నమోదుచేసుకుంది. క్షీణత 3.5 శాతంగా నమోదయ్యింది. అయితే నాల్గవ త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 4 శాతం వృద్ధి నమోదుకావడం కొంత ఊరటనిచ్చే అంశం. వార్షికంగా చూస్తే, 1946 తరువాత ఇంత తీవ్ర పతనాన్ని చూడ్డం ఇదే తొలిసారని వాణిజ్య మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపాయి. కోవిడ్–19 నేపథ్యంలో రెస్టారెంట్లు, ఎయిర్‌లైన్స్ వంటి పలు సేవా రంగాలు తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాయని, దాదాపు కోటి మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయారని... ఈ ఫలితం గురువారం విడుదలైన వార్షిక గణాంకాల్లో కనిపించందనీ ఉన్నత స్థాయి వర్గాలు వ్యాఖ్యానించాయి. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో అమెరికా జీడీపీ 33 శాతంపైగా పతనమైన సంగతి తెలిసిందే. జనవరి–మార్చి త్రైమాసికంలో క్షీణరేటు 5 శాతంగా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు సమయం 1946లో 11.6 క్షీణత తర్వాత ప్రపంచ ఆర్థిక సంక్షోభం 2009 కాలంలో ఎకానమీ 2.5 శాతం పతనమైంది. 1932 తీవ్ర మాంద్యం సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ 12.9 శాతం పతనమైంది. అమెరికా జీడీపీ వృద్ధి గణాంకాలను మూడుసార్లు సవరించడం జరుగుతుంది. దీని ప్రకారం తాజా– డిసెంబర్ త్రైమాసిక గణాంకాలను మరో రెండు సార్లు సవరిస్తారు. 2021 సంవత్సరానికి సంబంధించి ఎకానమీ అవుట్‌లుక్ అనిశ్చితిగానే కొనసాగుతుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ దేశ వ్యాప్తంగా లభ్యం అయ్యేంత వరకూ క్లిష్ట పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు. -
టోకు ధరలూ పెరిగాయ్!
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 1.48 శాతం ఎగసింది. అంటే 2019 అక్టోబర్‌తో పోల్చితే 2020 అక్టోబర్‌లో టోకు వస్తువుల బాస్కెట్ ధర 1.48 శాతం పెరిగిందన్నమాట. ఎనిమిది నెలల్లో ఈ స్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇదే తొలిసారి. తయారీ ఉత్పత్తుల ధరల పెరుగుదల దీనికి ప్రధాన కారణం. ఆర్థిక మందగమనం, వ్యవస్థలో డిమాండ్ లేకపోవడం, కరోనా ప్రతికూలతలు వంటి అంశాల నేపథ్యంలో టోకు ధరల సూచీ ‘జీరో’ లేదా ప్రతిద్రవ్యోల్బణం స్థాయిలో నమోదవుతోంది. సూచీలోని ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలు మాత్రమే పెరుగుదలను సూచిస్తున్నాయి. అయితే వ్యవస్థలో కొంత డిమాండ్ నెలకొనడంతోపాటు, బేస్ ఎఫెక్ట్ (2019 అక్టోబర్‌లో ‘జీరో’ ద్రవ్యోల్బణం) కూడా తాజాగా సూచీ పెరుగుదలకు ఒక కారణమవుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆవిష్కరించిన తాజా గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► మొత్తం సూచీలో దాదాపు 12% వెయిటేజ్ ఉన్న ఆహార ఉత్పత్తుల ధరలు టోకును 6.37% పెరిగాయి. ఒక్క కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలూ ధరలు ఏకంగా 107.70% ఎగశాయి (2019 అక్టోబర్ ధరలతో పోల్చితే). ► సూచీలో 12% వెయిటేజ్ ఉన్న నాన్–ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు 2.85 శాతం, 9.11 శాతం చొప్పున ఎగశాయి. ► మొత్తం సూచీలో దాదాపు 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు 2.12 శాతం ఎగశాయి. ► 14% వెయిటేజ్ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్‌లో అసలు పెరుగుదల లేకపోగా 10.95% క్షీణించాయి. ఆర్బీఐ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చు... ద్రవ్యోల్బణం తీవ్రత నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రక్రియకు ఇక తెరపడినట్లేనని నిపుణులు అంచనావేస్తున్నారు. వచ్చే నెల్లో జరగనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో యథాతథ రేటును కొనసాగించే వీలుందన్నది వారి విశ్లేషణ. టోకు ధరలే తీవ్రంగా ఉంటే, ఇక రిటైల్ ధరలు మరింత పెరుగుతాయని వారు విశ్లేషిస్తున్నారు. ప్లస్ 2 లేదా మైనస్ 2తో 4 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండాలని కేంద్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి నిర్దేశిస్తోంది. అయితే ఈ స్థాయికి మించి ఈ రేటు నమోదవుతోంది. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ, రిటల్ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్ నెలల్లో జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే సెప్టెంబర్ త్రైమాసికంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉన్నా, డిసెంబర్, మార్చి త్రైమాసికాల్లో లక్ష్యాల మేరకు దిగివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ అంచనావేస్తోంది. -
మాంద్యంలో దేశ జీడీపీ: ఆర్బీఐ
న్యూఢిల్లీ: సాంకేతికంగా దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంబారిన పడినట్లు రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తాజాగా పేర్కొంది. నౌక్యాస్ట్ పేరుతో ఆర్బీఐ తొలిసారి విడుదల చేసిన నివేదిక.. సెప్టెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ 8.6 శాతం క్షీణించినట్లు తెలియజేసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(జులై- సెప్టెంబర్)లోనూ దేశ ఆర్థిక వ్యవస్థ క్షీణ పథం పట్టడంతో మాంద్యంలోకి జారినట్లేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ పాత్ర అధ్యక్షతన ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. తొలి త్రైమాసికం(ఏప్రిల్- జూన్)లోనూ జీడీపీ మరింత అధికంగా 24 శాతం వెనకడుగు వేసిన విషయం విదితమే. వరుసగా రెండు త్రైమాసికాలలో ఆర్థిక వ్యవస్థ క్షీణతను నమోదు చేస్తే.. సాంకేతికంగా మాంద్యంలోకి జారుకున్నట్లుగా ఆర్థికవేత్తలు భావిస్తారు. వెరసి ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో దేశ జీడీపీ రెసిషన్‌లోకి ప్రవేశించిందని నౌక్యాస్ట్ తెలియజేసింది. దేశ చరిత్రలో జీడీజీ మాంద్య పరిస్థితులను ఎదుర్కోవడం ఇదే తొలిసారికావడం గమనార్హం! 27న గణాంకాలు ఈ నెల 27న ప్రభుత్వం అధికారిక గణాంకాలు ప్రకటించనుంది. కాగా.. అమ్మకాలు తగ్గినప్పటికీ కంపెనీలు వ్యయాలలో కోత విధించడం, తద్వారా నిర్వహణ లాభాలను పెంచుకోవడం వంటి అంశాలను ఆర్బీఐ ఆర్థికవేత్తలు పరిగణనలోకి తీసుకున్నారు. వాహన అమ్మకాలు, బ్యాంకింగ్ లిక్విడిటీ తదితరాలను సైతం మదింపు చేశారు. అక్టోబర్‌లో ఆర్థిక రివకరీని ఇవి సంకేతిస్తున్నట్లు తెలియజేశారు. ఈ పరిస్థితులు కొనసాగితే.. మూడో త్రైమాసికం(అక్టోబర్- డిసెంబర్)లో ఆర్థిక వ్యవస్థ తిరిగి వృద్ధి బాట పట్టనున్నట్లు నివేదిక అభిప్రాయపడింది. ఆర్థిక వృద్ధికి దన్నుగా సరళ పరపతి విధానాలను కొనసాగించనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత నెలలో పేర్కొన్నారు. అయితే ధరల ఒత్తిడి, ద్రవ్యోల్బణ అంచనాలు వంటివి పాలసీ నిర్ణయాలకు ఆటంకాలను సృష్టిస్తున్నట్లు ఆర్బీఐ ఆర్థికవేత్తలు తెలియజేశారు. సెకండ్ వేవ్‌లో భాగంగా ఇటీవల పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వృద్ధికి విఘాతం కలిగించే అవకాశమున్నట్లు వివరించారు. అటు కార్పొరేషన్లు, ఇటు కుటుంబాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ఇది ఫైనాన్షియల్ రిస్కులను పెంచే వీలున్నదని తెలియజేశారు. ఫలితంగా సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదురవుతున్నట్లు వివరించారు. -
కోవిడ్-19 : మాంద్యం గుప్పిట్లో ప్రపంచం
న్యూయార్క్ : 1930ల నాటి గ్రేట్ డిప్రెషన్ తర్వాత తీవ్ర ఆర్థిక మాందాన్ని ప్రపంచం చవిచూస్తోందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ డేవిడ్ మల్పాస్ అన్నారు. పలు వర్ధమాన, పేద దేశాలకు కోవిడ్-19 పెను ముప్పుగా ముంచుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ విస్తృతితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఆయా దేశాలోల రుణ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాక్ వార్షిక సమావేశాలను పురస్కరించుకుని మల్పాస్ మీడియాతో మాట్లాడారు. చాలా లోతైన ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని చుట్టుముట్టిందని, పేదరికంతో కొట్టుమిట్డాడుతున్న దేశాలను ఇది భారీగా దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఆయా దేశాలకు భారీ వృద్ధి కార్యక్రమాన్ని ప్రపంచ బ్యాంక్ రూపొందిస్తోందని చెప్పారు. ఇక వ్యాక్సిన్లను సమకూర్చుకోలేని దేశాలకు వ్యాక్సిన్లు, మందుల సరఫరా కోసం 1200 కోట్ల డాలర్ల హెల్త్ ఎమర్జెన్సీ కార్యక్రమాల విస్తరణకు ప్రపంచ బ్యాంక్ బోర్డు ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. కోవిడ్-19తో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగేందుకు సహకరిస్తున్నారని, అసంఘటిత రంగంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి సామాజిక భద్రతా పథకాలతో ప్రభుత్వాలు ఆదుకుంటున్నాయని చెప్పారు. పేద దేశాల్లో ప్రజలకు అదనపు సామాజిక భద్రత కలిగించే దిశగా ప్రపంచ బ్యాంక్ కసరత్తు సాగిస్తోందన్నారు. వ్యవసాయంలో ఎదురయ్యే సవాళ్ల పరిష్కారంపైనా పనిచేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. చదవండి : భారత్‌పై వరల్డ్ బ్యాంక్ కీలక అంచనాలు -
కరోనా కష్టంతో 9.6% క్షీణత
వాషింగ్టన్: భారత్ ఆర్థిక వ్యవస్థ 2020 (ఏప్రిల్)–2021 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో 9.6 శాతం క్షీణతను నమోదుచే సుకుంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనావేస్తోంది. కరోనా కట్టడికి విధించిన కఠిన లాక్డౌన్ పరిస్థితులు, గృహాలు, పరిశ్రమల ఆదాయాలు పడిపోవడం వంటి అంశాలు దీనికి కారణంగా వివరించింది. ‘దక్షిణాసియా ఆర్థిక పరిస్థితిపై దృష్టి’ పేరుతో గురువారంనాడు విడుదలైన ప్రపంచబ్యాంక్ నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. భారత్ ఇంతకుముందెన్నడూ లేని దారుణ పరిస్థితులను ఎదుర్కొంటోందని పేర్కొంది. తొలి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) భారత స్థూల దేశీయోత్పత్తి 23.9 శాతం క్షీణించిన నేపథ్యంలో ప్రపంచబ్యాంక్ తాజా నివేదిక విడుదలైంది. ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వార్షిక సమావేశాల నేపథ్యంలో విడుదలైన నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు... ► దక్షిణాసియా ప్రాంతం ఆర్థిక వ్యవస్థ గడచిన ఐదేళ్ల నుంచీ వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదుచేసుకోగా, 2020లో 7.7 శాతం క్షీణించనుంది. అయితే 2021లో ఈ ప్రాంతం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకునే అవకాశం ఉంది. ► కరోనా వైరస్ ప్రభావంతో భారత్‌లో సరఫరాలు–డిమాండ్ పరిస్థితుల మధ్య సమతౌల్యత పూర్తిగా దెబ్బతింది. ► వృద్ధికి మౌలిక రంగంలో పెట్టుబడులు అవసరం. అయితే ఇప్పుడు ద్రవ్య వనరులను ఆరోగ్యం, సామాజిక భద్రతపై అధికంగా కేంద్రీకరించాల్సి ఉంటుంది. ఆయా అంశాలకు అనుగుణంగా మధ్య కాలానికి ద్రవ్య వ్యవస్థ–వ్యయ ప్రక్రియలను పునఃసమీక్షించాల్సి ఉంటుంది. అయితే క్లిష్ట ద్రవ్య పరిస్థితుల్లోనూ కేంద్రం తన వంతు తగిన చర్యలను సమర్థవంతంగా తీసుకుంటోంది. ► అసలే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి మరింత దెబ్బతీసింది. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి అవకాశాలను కోల్పోయారు. దీనితో పేదరికం సమస్య తీవ్రమవుతోంది. ఏడాదిలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య 33 శాతం పెరిగే అవకాశం ఉంది. ► బ్యాంకింగ్‌లో పెరుగుతున్న మొండిబకాయిల (ఎన్పీఏ) పరిమాణం ఆందోళన కలిగిస్తోంది. అన్ని అంచనాలూ క్షీణతలోనే... మొదటి త్రైమాసికం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో భారత్ ఆర్థిక వ్యవస్థ 23.9% క్షీణ రేటును నమోదుచేసుకున్న నేపథ్యంలో... 2020–21లో అంచనాలను పరిశీలిస్తే (అంచనాలు శాతాల్లో).. -
వాటాల అమ్మకానికి ఆ బ్యాంకులు..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, ఐడీబీఐ) తదితర బ్యాంక్‌లలో కేంద్ర ప్రభుత్వం మెజారిటీ వాటా ఉంది. అయితే కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ప్రభావంతో బ్యాంకుల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనితీరును మెరుగు పరిచేందుకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఈ క్రమంలో పైన పేర్కొన్న (నాలుగు బ్యాంకుల) వాటాలో కొంత ప్రైవేట్ సంస్థలకు అమ్మకానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు పీఎమ్ఓ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. కాగా గత నెలలో సగానికిపైగా బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు వాటా ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు ర్యూటర్స్ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: బంధన్ బ్యాంక్‌కు వాటా విక్రయ షాక్ -
మహమ్మారితో పెను సంక్షోభం
న్యూయార్క్ : కరోనా మహమ్మారితో ఈ శతాబ్ధంలోనే అతిపెద్ద ఆర్థిక మాంద్యం ఎదురైందని, రెండో దశ ఇన్ఫెక్షన్స్ వెల్లువెత్తకపోయినా వైరస్ ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) నివేదిక హెచ్చరించింది. కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోగా, సంక్షోభంతో పేదలు, యువత ఎక్కువ నష్టపోయారని, అసమానతలు పెచ్చుమీరాయని అంతర్జాతీయ ఆర్థిక నివేదికలో ఓఈసీడీ పేర్కొంది. ఓఈసీడీ ఆవిర్భావం తర్వాత ఇంతటి అనిశ్చితి, నాటకీయ పరిస్ధితులు నెలకొనడం ఇదే తొలిసారని సంస్థ సెక్రటరీ జనరల్ ఏంజెల్ గురియా అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సహజంగా తాము వెల్లడించే అంచనాలనూ అందించలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ రెండో దశ ఇన్ఫెక్షన్లు తలెత్తని పక్షంలో ఈ ఏడాది అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి 6 శాతం పడిపోతుందని, వచ్చే ఏడాది వృద్ధి రేటు 2.8 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. వైరస్ మరోసారి ఎదురైతే ప్రపంచ ఆర్థిక వృద్ధి 7.6 శాతం పడిపోతుందని ఓఈసీడీ విశ్లేషించింది. రెండోసారి వైరస్ విజృంభించినా, తగ్గుముఖం పట్టినా పరిణామాలు మాత్రం తీవ్రంగా, దీర్ఘకాలం కొనసాగుతాయని నివేదిక స్పష్టం చేసింది. మహమ్మారి రాకతో ఆరోగ్యమా, ఆర్థిక వ్యవస్ధా అనే డైలమా ప్రభుత్వాలకు, జీవితమా..జీవనోపాథా అనే ఆలోచనలో వ్యక్తులు పడిపోయారని పేర్కొంది. మహమ్మారి అదుపులోకి రాని పక్షంలో ఆర్థిక వ్యవస్థ కోలుకోలేదని వెల్లడించారు. వైరస్ రెండో దశ తలెత్తిన పక్షంలో సగటు నిరుద్యోగిత రేటు పది శాతానికి ఎగబాకుతుందని పేర్కొంది. ఆరోగ్య వసతుల్లో పెట్టుబడుల ద్వారా అసమానతలను తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషిచేయాలని కోరింది. మందుల సరఫరాలు, వ్యాక్సిన్, చికిత్సతో పాటు మహమ్మారి ప్రభావం అధికంగా ఉన్న రంగాలను ఆదుకునేలా చొరవ చూపాలని ఓఈసీడీ సూచించింది. చదవండి : కోవిడ్-19 రోగి బలవన్మరణం -
1870 తరువాత ఇదే అత్యంత దారుణమైన మాంద్యం
వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంతో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. లాక్ డౌన్, ఆర్థిక కార్యకలాపాల ప్రతిష్టంభన కారణంగా తీవ్రమైన ఆర్థిక మాంద్య పరిస్థితి ఏర్పడనుందని చెప్పింది. దీంతో ఈ ఏడాది ప్రపంచ వృద్ధి 5.2 శాతం తగ్గిపోతుందని ప్రపంచ బ్యాంక్ సోమవారం తెలిపింది. అంతేకాదు కరోనా అధికంగా ఉన్న దేశాల్లో ఆర్థిక కష్టాలు దారుణంగాఉంటాయని తెలిపింది. తలసరి ఆదాయం ఈ ఏడాది 3.6 శాతం మేర తగ్గవచ్చునని, ఇది లక్షలాదిమంది పేదలను కడు పేదరికంలోకి నెట్టివేస్తుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఆర్థిక ప్రభావంతో పాటు అంతకుమించిన తీవ్రమైన, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక ప్రభావాలుంటాయని తెలిపింది. తద్వారా ఇది దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను బలహీనపరుస్తుందని వ్యాఖ్యానించింది. (కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ) ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ సోమవారం విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదికలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయిన కారణంగా నెలకొన్న సంక్షోభం, ఆర్థికమాంద్యం ఏర్పడిందని 1870 తర్వాత వచ్చిన అత్యంత దారుణమైన మాంద్యం ఇదేనని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్పాస్ తెలిపారు. మహమ్మారి అత్యంత తీవ్రంగా ఉన్న దేశాలలో, ప్రపంచ వాణిజ్యం, పర్యాటక రంగం, వస్తువుల ఎగుమతులు , విదేశీ రుణాలపై అధికంగా ఆధారపడే దేశాలలో ఈ దెబ్బ తీవ్రంగా ఉంటుందని దీంతో వర్ధమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధి మైనస్ 2.5 శాతంగా ఉండవచ్చునన్నారు. 60 ఏళ్లలో ఇంతటి ప్రభావం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు మరిన్ని చర్యలు తీసుకోవాలని మాల్పాస్ పిలుపునిచ్చారు. అప్పుడే ఆర్థిక పునరుత్తేజం సాధ్యమన్నారు. ఈ మాంద్యంలో వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల వాటా 90 శాతానికి పైగా ఉంటుందని, ఇది 1930-32 మహా మాంద్యం సమయం నాటి 85 శాతం కంటే ఎక్కువన్నారు. (కరోనా : మూసివేత దిశగా 25 వేల దుకాణాలు) రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతటి దారుణ పరిస్థితులు ఇప్పుడు కనిపించవచ్చునని పేర్కొంది. 1870 నుండి14 ఆర్థిక మాంద్యాలను ప్రపంచం ఎదుర్కొందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. 1870, 1876, 1885, 1893, 1908, 1914, 1917 -1921, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009, 2020 లలో ప్రపంచంలో ఆర్థికమాంద్యం వచ్చిందని తెలిపింది (భారత ఆర్థిక వృద్ధి రేటు ప్రతికూలం) -
కరోనా : మాంద్యంలోకి అమెరికా ఆర్థిక వ్యవస్థ
వాషింగ్టన్: కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం తప్పదన్నఆందోళనల నేపథ్యంలో ఇప్పటివరకూ ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిన అమెరికాకు సంబంధించి అధికారిక షాకింగ్ రిపోర్టు వెలువడింది. కరోనా వైరస్ మహమ్మారి, లాక్ డౌన్ ఫలితంగా గత ఫిబ్రవరిలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ అధికారికంగా మాంద్యంలోకి ప్రవేశించిందని ఆర్థిక నిపుణుల తాజా పరిశోధనలో వెల్లడైంది. బిజినెస్ సైకిల్ డేటింగ్ కమిటీ నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకటించిన దాని ప్రకారం మహమ్మారి దేశాన్ని తుడిచి పెట్టేసింది. తద్వారా అధికారికంగా 128నెలల ఆర్థిక వృద్ధికి ముగింపు పలికి మాంద్యం లోకి ప్రవేశించింది. అమెరికా మహమ్మారి కారణంగా ఉపాధి కల్పన, ఉత్పత్తి క్షీణతలో అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా మందగించడంతో ఊహించిన దానికంటే వేగంగా మాంద్యంలోకి జారుకుంది. దేశంలో రెండోసారి వైరస్ విజృంభిస్తే అమెరికా పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. (కరోనా : మూసివేత దిశగా 25 వేలదుకాణాలు) అయితే వచ్చే ఏడాది ద్వితీయార్థలో ఆర్ధిక వ్యవస్థలో కొంత సానుకూల మార్పు రావొచ్చని అంచనా. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత రెండుసార్లు ఏర్పడిన మాంద్యం ఆరు నుండి 18 నెలల వరకు కొనసాగింది. 1929 లో ప్రారంభమైన మహా మాంద్యం 43నెలల పాటు కొనసాగింది. అయితే గత మాంద్యాల మాదిరిగానే ఇపుడు కూడా శాశ్వత ప్రభావాన్ని కలిగి ఉంటుందా లేదా అనేది నిర్ణయించేందుకు రికవరీ వేగం ముఖ్యమైందని వ్యాఖ్యానించారు. ఉదాహరణకు 2007- 2009 కాలంలో అనేక లక్షల బ్లూ కాలర్ ఉద్యోగాలు శాశ్వతంగా కోల్పోవడం, దీర్ఘకాలిక నిరుద్యోగం, మధ్య, తక్కువ-ఆదాయ కుటుంబాల బలహీనమైన వేతన వృద్ధి లాంటి అంశాలను గుర్తు చేసిన పరిశోధన ఆర్థిక వృద్ది పురోగమనం వీటిపై ఆధారపడి వుంటుందని తేల్చి చెప్పింది. మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధం 1946 తర్వాత అమెరికా జీడీపీ ఏకంగా దారుణంగా పతనమైంది. అమెరికా స్థూల జాతీయోత్పత్తి ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 4.8 శాతం పడిపోయింది. ప్రస్తుత త్రైమాసికంలో చారిత్రాత్మక కనిష్టానికి పడిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా, ఈ త్రైమాసికంలో దాదాపు 54 శాతం తగ్గుతుందని అంచనా వేసింది. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో రికార్డు కనిష్టం 3.5 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌లో 14.7 శాతానికి, మే నెలలో 13.3 శాతానికి చేరింది. (పరిస్థితి మరింత దిగజారుతోంది: డబ్ల్యూహెచ్ఓ) కాగా కనబడని శత్రువు కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పకపోవచ్చునని దేశ ఆధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు ఈ సంక్షోభం నేపథ్యంలో మరో ఆర్థిక ఉపశమన ప్యాకేజీకి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ ప్రతినిధి సోమవారం వెల్లడించారు. మరోవైపు అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశాలు ఈ వారం ప్రారంభం కానున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ చర్యలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టనున్నారని భావిస్తున్నారు. పెట్టుబడిదారులకు భారీ ఊరట లభించనుందని అంచనా వేస్తున్నారు. -
జపాన్ ఆర్థిక వ్యవస్థకు కరోనా షాక్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కల్లోలానికి జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. గత నాలుగున్న సంవత్సరాల కాలంలో మొదటిసారిగా మాంద్యంలోకి పడిపోయింది. సోమవారం వెల్లడించిన జీడీపీ డేటా ప్రకారం ,వరుసగా రెండవ త్రైమాసికంలో ఆర్ధికవ్యవస్థ కుంచించుకుపోయింది. కరోనా వైరస్ సంక్షోభంతో వ్యాపారాలు కుదేలవ్వడంతో యుద్ధానంతర తిరోగమనానికి చేరుకుందని విశ్లేషకులు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మూడవ అతిపెద్దదైన జపాన్ ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో దారుణంగా దెబ్బతింది. ప్రైవేటు వినియోగం, మూలధన ప్రాథమిక ,ఎగుమతులు పడిపోవడంతో గత ఏడాదితో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 3.4 శాతం కుప్పకూలింది. 2015 తర్వాత ఇదే అతిపెద్ద పతనమని భావిస్తున్నారు. వాస్తవానికి జపాన్ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించలేదు. కానీ ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ అమలు చేయడంతో అక్కడ వ్యాపారాలు నిలిచిపోయాయి. దీంతో జీడీపీలో ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 3.4 శాతం నష్టంతో పాటు గత ఏడాది చివరి క్వార్టర్లో 6.4 శాతం నష్టం వల్ల సాంకేతికంగా జపాన్ సంక్షోభంలోకి జారుకుంది. (వాళ్లను అలా వదిలేయడం సిగ్గు చేటు - కిరణ్ మజుందార్ షా) ప్రస్తుత త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించిందని మీజీ యసుడా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎకనామిస్ట్ యుయిచి కోడామా అన్నారు. దీంతో జపాన్ పూర్తిస్థాయి మాంద్యంలోకి ప్రవేశించిందని విశ్లేషించారు. ముఖ్యంగా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో సగానికి పైగా ఉన్న ప్రైవేట్ వినియోగం 0.7శాతం పడిపోయింది. ఆర్థికవేత్తలు 1.6 శాతంగా వుంటుందని భావించారు. నాల్గవ త్రైమాసికంలో 1.5 శాతంగా అంచనాలతో పోలిస్తే మూలధనం గణనీయంగా 0.5 శాతానికి పడిపోయింది. కార్పొరేట్ జపాన్‌పై వైరస్ ప్రభావం చూపింది. కార్లతో సహా వివిధ ఉత్పత్తుల ఎగుమతులు మొదటి త్రైమాసికంలో 6 శాతం తగ్గాయి. ఇవన్నీ కార్మిక మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చాయి. మార్చిలో నిరుద్యోగిత రేటు సంవత్సరంలో అత్యధిక స్థాయికి చేరుకోగా, ఉద్యోగ లభ్యత మూడేళ్ల కన్నా తక్కువ స్థాయికి పడిపోయింది. (శాశ్వతంగా ఇంటినుంచేనా? నో...వే..) -
క్రూడ్ క్రాష్..
న్యూయార్క్/న్యూఢిల్లీ: ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా మహమ్మారి దెబ్బకు ముడిచమురు ధర పాతాళానికి పడిపోయింది. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో లైట్ స్వీట్ క్రూడ్(డబ్లూటీఐ) బేరల్ మే నెల కాంట్రాక్ట్ ధర సోమవారం ఒకానొక దశలో కుప్పకూలి... మైనస్ 28 డాలర్ల స్థాయికి పడిపోయింది. చరిత్రలో క్రూడ్ ధర ఈ స్థాయిలో పతనాన్ని చవిచూడడం ఇదే మొదటి సారి. కరోనా ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చమురుకు డిమాండ్ భారీగా తగ్గిపోయింది. ఉత్పత్తిదారుల వద్ద నిల్వలు గరిష్ట స్థాయిలకు చేరుకుంటున్నాయి. దీంతో తమ నిల్వలను తగ్గించుకునేందుకు ఉత్పత్తిదారులే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడినట్టే. నిల్వలు భారీగా పేరుకుపోతున్న ధోరణి, కనుచూపుమేర కనిపించని ఆర్థిక రికవరీ నేపథ్యంలో మళ్లీ ముడిచమురు ధరలు ఎప్పుడు పుంజుకుంటాయోనని ఉత్పత్తిదారులు గగ్గోలు పెడుతున్నారు. భౌగోళిక ఉద్రిక్తతల నుంచి కరోనా, ప్రైస్‌వార్ వరకూ... నిజానికి 2020 తొలి నాలుగు నెలల్లోనే అంతర్జాతీయంగా క్రూడ్ ధర తీవ్ర హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020 జనవరిలో అమెరికా దాడుల్లో ఇరాన్ మేజర్ జనరల్ ఖాసిం సులేమానీ మరణించడం, దీనితో భౌగోళిక ఉద్రిక్త పరిణామాలతో క్రూడ్ ధర ఒక్కసారిగా ఎగిసి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అయితే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, తర్వాత కరోనా ప్రభావంతో రష్యా–సౌదీ అరేబియాల మధ్య చోటుచేసుకున్న ఈ ‘ధరల యుద్ధం’తో క్రూడ్ ధర పతనమవుతూ వచ్చింది. ఫలించని ఒపెక్ ఒప్పందాలు.. క్రూడ్ ధరలు మరింత పతనమై, తమ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలకుండా పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య ఒపెక్ పది రోజుల క్రితం అసాధారణ చర్యలు తీసుకుంది. ఈ మేరకు కుదిరిన ఒక డీల్ ప్రకారం జూలై దాకా ఒపెక్, దాని భాగస్వామ్య దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 10 మిలియన్ బ్యారెళ్ల మేర (బీపీడీ) తగ్గించుకోవాలని నిర్ణయించాయి. అమెరికాతో పాటు మరిన్ని దేశాలు కూడా తమవంతుగా ఉత్పత్తి కోతలపై నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెట్టాయి. ఆయా పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ఉత్పత్తిలో 15 శాతానికి కోతపడుతుందన్న అంచనాలు వెలువడ్డాయి. అయితే, డిమాండ్ పెంచేందుకు ఒపెక్, అమెరికాలు చేసిన ప్రయత్నమేదీ ఫలించలేదని కేవలం 10 రోజులకే స్పష్టమైపోయింది. ఇప్పటికే నిల్వలు భారీగా పేరుకుపోయిన పరిస్థితి నెలకొనడం ఇక్కడ ఒక కారణమైతే, ఉత్పత్తి కోతలపై ఆయా దేశాలు ఆలస్యంగా నిర్ణయాలు తీసుకున్నాయన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఒకవేళ ఉత్తర అమెరికన్ సంస్థలు 5 మిలియన్ బ్యారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించుకున్నా.. ఇంకా 5–10 మిలియన్ బీపీడీ మేర సరఫరా అధికంగానే ఉంటుందని విశ్లేషణ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు స్టోరేజీ పూర్తి స్థాయిలో నిండుగా ఉందని అంచనా. 7.4 బిలియన్ బ్యారెళ్ల చమురు, తత్సంబంధ ఉత్పత్తుల నిల్వలు ఉన్నాయని.. ఇవి కాకుండా 1.3 బిలియన్ బ్యారెళ్లు రవాణాలో ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి అమెరికాలోని ఒక్లహోమాలో క్రూడ్ నిల్వల హబ్‌లో నిల్వల పరిస్థితి దాదాపు దాని పూర్తి సామర్థ్యానికి చేరుకుంటోందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడ వర్కింగ్ స్టోరేజ్ సామర్థ్యం 76 మిలియన్ బేరళ్లయితే, 55 మిలియన్ బేరళ్లకు ఈ స్టోరేజ్‌కి చేరినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగితే, కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్‌ను తీసుకువెళ్లాలని తమ కస్టమర్లపై చమురు ఉత్పత్తిదారులు ఒత్తిడి తీసుకుని వచ్చే పరిస్థితి ఉంటుందన్నది విశ్లేషణ. అంతేకాదు అవసరమైతే కొనుగోలుదారులకు ఎదురు డబ్బులు ఇచ్చిమరీ నిల్వలు తగ్గించుకోవాల్సి రావచ్చని కూడా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలియట్‌వేవ్ సిద్ధాంతం ప్రకారం వచ్చే దశాబ్దంలో ఎప్పడోకప్పుడు ముడిచమురు ధర 4–10 డాలర్ల స్థాయికి పడిపోవచ్చు. మళ్లీ ఆల్‌టైమ్ గరిష్టాన్ని (147.67 డాలర్లు) చూడాలంటే చాలా ఏళ్లే పడుతుంది. – 2009లో ఎలియట్‌వేవ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు రాబర్ట్ ప్రెషెర్ అంచనా 1999 జనవరిలో క్రూడ్ కనిష్ట స్థాయి: 11.72 డాలర్లు 2008 జూన్ క్రూడ్ ఆల్‌టైమ్ గరిష్టం: 147.67 డాలర్లు 2020 ఏప్రిల్ 20న క్రూడ్ కనిష్ట స్థాయి: మైనస్ 28 డాలర్లు -
సంక్షోభం ఏదైనా.. ఆగకూడదు ప్రణాళిక
చరిత్రలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆర్థిక మాంద్యాలు, ఆరోగ్యపరమైన సంక్షోభాలను ప్రపంచం విజయవంతంగా అధిగమించి ప్రగతి దిశగా అడుగులు వేస్తూనే ఉంది. ఈ క్రమంలో 2020లో కరోనా వైరస్ (కోవిడ్–19) ప్రపంచ దేశాలకు సవాల్‌గా మారింది. గతంలో పడి లేచిన కెరటాల్లాంటి ఎన్నో అనుభవాలు ఉన్నప్పటికీ.. ఇటీవలి కరోనా వైరస్ ఆధారిత మార్కెట్ పతనం.. ఇన్వెస్టర్లలో తమ పెట్టుబడులకు దీర్ఘకాల భద్రత ఏంటన్న ఆందోళనకు దారితీసింది. ఎంతో మంది ఇన్వెస్టర్లు నిపుణులు, బ్రోకరేజీలు, ఫండ్స్ హౌస్‌లకు తమ ఆందోళనలను ప్రశ్నల రూపంలో సంధిస్తున్నారు. పెట్టుబడులకు సంబంధించి, మార్కెట్ల పతనంలో అవకాశాలు, తదితర విషయాలపై అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కు చెందిన పరిశోధక బృందం తరచుగా ఇన్వెస్టర్ల నుంచి తమకు ఎదురైన ప్రశ్నలు, వాటికి నిపుణుల సమాధానాలు, సూచనలను విడుదల చేసింది. కరోనా సంక్షోభం అనంతరం ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల విషయమై ఏ విధంగా వ్యవహరించాలన్నది వీటి ఆధారంగా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయానికి వచ్చేందుకు వీలుంటుంది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ టీమ్ విడుదల చేసిన ప్రశ్నలు, జవాబుల జాబితా ఇది... కొనుగోళ్లకు ఇది సరైన తరుణమేనా..? నిర్దేశిత పరిమాణం కంటే ఈక్విటీల్లో తక్కువ ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే.. ఫండ్స్ పథకాల్లో సిప్ రూపంలో పెట్టుబడులను ప్రారంభించుకోవచ్చు. ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫం డ్స్ లేదా నేరుగా స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. రిస్క్ తీసుకునే వారు 100 నుంచి తమ వయసును తీసివేయగా మిగిలిన శాతం పెట్టుబడులను ఈక్విటీలకు (ఫండ్స్ లేదా స్టాక్స్) కేటాయించుకోవచ్చు. ఒకవేళ రిస్క్ ఎక్కువగా తీసుకోలేని వారు 100కు బదులు 70 నుంచి తమ వయసును తీసివేసి, మిగిలిన శాతాన్ని ఈక్విటీలకు కేటాయించుకోవాలి. మిగిలిన పెట్టుబడులను స్థిరాదాయ పథకాలైన ఎఫ్డీలు, బాండ్ ఫండ్స్ లేదా చిన్న మొత్తాల పొదు పు పథకాలు, బంగారానికి కేటాయించుకోవచ్చు. ఫండ్స్ పెట్టుబడుల విలువ పడిపోతే? ప్రపంచ వ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు వాటి ఇటీవలి గరిష్టాల నుంచి రెండు నెలల వ్యవధిలోనే 40 శాతం పడిపోయాయి. ఫండ్స్ లేదా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు అందరూ ఈ నష్టాలను చూస్తున్నారు. గడిచిన 34 ఏళ్లలో (ఆరు భారీ బేర్ మార్కెట్లు (40% అంతకంటే ఎక్కువ నష్టపోవడం) ఎదురయ్యాయి. కానీ, ప్రతీ పతనం తర్వాతి రెండు మూడేళ్ల కాలంలో మార్కెట్లు కోలుకున్నాయి. ప్రస్తుత స్థాయిలో మార్కెట్లో కరెక్షన్ ముగి సిందని చెప్పలేం. వచ్చే కొన్నేళ్ల కాలానికి డబ్బు అవసరం లేని వారు తమ ఈక్విటీ పెట్టుబడులను కొనసాగించుకోవచ్చు. అయితే, ప్రస్తుతం, భవిష్యత్తులోనూ సమయానుకూలంగా తమ పెట్టుబడులను సమీక్షించుకోవడం మర్చిపోవద్దు. సిప్‌ను కొనసాగించాలా..? ప్రస్తుత మార్కెట్ కరెక్షన్ కారణంగా ఫండ్స్ పథకాల్లోని పెట్టుబడులు నష్టాలు చూపిస్తున్నాయని సిప్‌ను ఆపేద్దామని అనిపించొచ్చు. కానీ, అలా చేస్తే అది పెద్ద తప్పిదమే అవుతుంది. ఇటువంటి మార్కెట్ల దిద్దుబాట్లు ఫండ్స్ యూనిట్ల కొనుగోలు ఖర్చును తగ్గిస్తాయి. తక్కువ ధరల కారణంగా అధిక యూనిట్లను సమకూర్చుకునే అవకాశం ఇటువంటి సందర్భాల్లోనే లభిస్తుంది. కనుక వీలైనంత వరకు సిప్‌ను ఇప్పుడు కొనసాగించాలి. వీలుంటే సిప్ మొత్తాన్ని పెంచుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. అయితే, పనితీరు సజావుగా లేని పథకాల్లో సిప్ ఆపేసి, మంచి పథకాల్లో సిప్ కొనసాగించడం, పెంచుకోవడం చేయాలి. ఎఫ్ అండ్ ఓ లతో రక్షణ ఎలా? రిస్క్ నిర్వహణకు డెరివేటివ్స్ (ఎఫ్‌అండ్‌వో) చాలా ముఖ్యమైన సాధనం. హెడ్జింగ్ రూపంలో నష్టాల నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. నిఫ్టీ పుట్ ఆప్షన్ల కొనుగోలు ద్వారా మీ పోర్ట్‌ఫోలియోకు సులభంగా హెడ్జ్ చేసుకోవచ్చు. అయితే, హెడ్జింగ్ అన్నది బీమా కవరేజీ వంటిది. ఒకవేళ మార్కెట్లు పడిపోకుండా పెరిగితే పుట్ ఆప్షన్ల కోసం చెల్లించిన ప్రీమియం నష్టపోవాల్సి వస్తుంది. కానీ, మీ పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో లాభపడింది కనుక దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అన్ని వేళలా హెడ్జింగ్ కాకుండా.. మార్కెట్లు పెద్ద కరెక్షన్లు లేకుండా దీర్ఘకాలం పాటు గణనీయంగా పెరిగిన సందర్భాల్లో హెడ్జ్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. దేశీయ స్టాక్ మార్కెట్ల చరిత్రలో బేర్ మార్కెట్లు ఎంత కాలం పాటు కొనసాగాయి? 1992, 2000, 2008 సందర్భాల్లో బేర్ మార్కెట్లను చవిచూశాం. 1992 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ తన పూర్వపు గరిష్టాలను అధిగమించేందుకు రెండున్నరరేళ్ల సమయం తీసుకుంది. 2000–2001 కరెక్షన్ తర్వాత సెన్సెక్స్ గరిష్టాలకు చేరుకునేందుకు నాలుగేళ్లు పట్టింది. 2008 తర్వాత పూర్వపు గరిష్టాలను దాటేందుకు సెన్సెక్స్‌కు ఆరేళ్లు పట్టింది. బంగారంలో ప్రాఫిట్ బుక్ చేయొచ్చా? అంతర్జాతీయ సంక్షోభ సమయంలో బంగారం అన్నది విశ్వసనీయమైన పెట్టుబడి సాధనం. ఈక్విటీలకు బంగారం వ్యతిరేక దిశలో ఉంటుంది. కనుక ఈక్విటీ మార్కెట్ల పతనం సమయంలో బంగారం సురక్షిత సాధనం. ప్రస్తుత సమయాల్లో బంగారంలో పెట్టుబడులను కొనసాగించుకోవడమే సూచనీయం. ఈక్విటీ మార్కెట్లు కనిష్టాలకు చేరినట్టు ధ్రువీకరణ అయిన తర్వాత బంగారంలో కొంత లాభాలను స్వీకరించొచ్చు. మొదటి సారి ఇన్వెస్ట్ చేస్తే...? మొదటి సారి పెట్టుబడులు పెట్టే వారికి ప్రస్తుత సమయం అనుకూలమైనది. మంచి నాణ్యమైన ఐపీవోలకు దరఖాస్తు చేసుకోవడంతోపాటు, మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో సిప్ ద్వారా పెట్టుబడులు ప్రారంభించుకోవాలి. తగినంత అనుభవం, పరిజ్ఞానం సంపాదించిన తర్వాత నాణ్యమైన కంపెనీల షేర్లలో నేరుగానూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌తో ప్రయోజనం పొందే రంగాలు? ఫార్మాస్యూటికల్స్, హెల్త్‌కేర్, టెలికం, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ రంగ కంపెనీలు, ఇంటర్నెట్ ఆధారిత వ్యాపారాలు లౌక్‌డౌన్ సమయంలో కొనసాగుతున్నాయి. ఇతర కంపెనీలతో పోలిస్తే ఇవి సంక్షోభాన్ని మెరుగ్గా అధిగమించగలవు. ఒక్కసారి లౌక్‌డౌన్ ముగిస్తే ఆకర్షణీయంగా ఉన్న ఇతర రంగాల వైపు మళ్లొచ్చు. నష్టాలను బుక్ చేసుకోవచ్చా..? భవిష్యత్తు పరిస్థితుల గురించి అవగాహన లేకుండా చెప్పుడు మాటల ద్వారా, విన్న వార్తల ద్వారా ఏవైనా కొనుగోలు చేసి ఉంటే, ఈ సమయంలో ఆ కంపెనీల ఫండమెంటల్స్, ఇటీవలి పరిణామాలు, సూచీలతో పోలిస్తే స్టాక్ ధర పరంగా జరిగిన నస్టాన్ని సమీక్షించుకోవడం చేయాలి. ఈ అంశాల్లో బలహీనంగా కనిపిస్తే ఆ పెట్టుబడులను వెనక్కి తీసుకుని, దీర్ఘకాలంలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని భావించే వాటిల్లో, నిపుణుల సూచనల మేరకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. -
మాంద్యం గుప్పిట్లోకి ప్రపంచం!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలు తీవ్రమైన మాంద్యం పరిస్థితులను ఎదుర్కోనున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలినా జార్జీవా అన్నారు. కరోనా వైరస్ కారణంగా 1930 తీవ్ర మాంద్యం తర్వాత మరో విడత అటువంటి తీవ్ర పరిస్థితులు 2020లో రానున్నాయని, 170 దేశాలలో తలసరి ఆదాయం వృద్ధి మైనస్‌లోకి వెళ్లిపోవచ్చన్నారు. వాషింగ్టన్లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ‘సంక్షోభాన్ని ఎదుర్కోవడం: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముందున్న ప్రాధాన్యతలు’ అనే అంశంపై జార్జీవా మాట్లాడారు. ‘‘నేడు ప్రపంచం ఇంతకుముందెన్నడూ లేనటువంటి సంక్షోభంతో పోరాడుతోంది. కరోనా వైరస్ కాంతి వేగంతో మన సామాజిక, ఆర్థిక క్రమాన్ని అస్తవ్యస్తం చేసింది. మన జీవిత కాలంలో గుర్తున్నంత వరకు ఈ స్థాయి ప్రభావాన్ని చూడలేదు’’ అని జార్జీవా పేర్కొన్నారు. వైరస్‌పై పోరాడేందుకు లాక్డౌన్ అవసరమని, ఇది వందల కోట్ల ప్రజలపై ప్రభావం చూపిస్తోందన్నారు. ప్రపంచం అసాధారణ అనిశ్చితిని చవిచూస్తోందని, ఈ సంక్షోభం తీవ్రత, ఎంత కాలం కొనసాగేదీ తెలియడం లేదని పేర్కొన్నారు. ఫలితంగా 2020లో ప్రపంచ వృద్ధి ప్రతికూల దశలోకి వెళ్లిపోతుందన్నది స్పష్టమన్నారు. వర్ధమాన దేశాలకు ట్రిలియన్ డాలర్ల నిధుల సాయం అవసరమని, ఇందులో ఆయా దేశాలు కొంత వరకే సమకూర్చుకోగలవని చెప్పారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రకటించిన ద్రవ్యపరమైన చర్యలు 8 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆమె తెలిపారు. -
బాబోయ్ కరోనా జీడీపీకి షాక్!
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వృద్ధికి కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ గట్టిగానే తగలనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది ఏకంగా 30 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ అంచనా వేసింది. 2020–21లో వృద్ధి రేటు కేవలం 2 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. గత అంచనాలైన 5.6 శాతాన్ని ఇటీవల మార్చిలో 5.1 శాతానికి కుదించిన ఫిచ్ .. తాజాగా సగం పైగా తగ్గించేయడం గమనార్హం. లాక్డౌన్లతో ప్రపంచ దేశాలను చుట్టుముట్టిన ఆర్థిక మాంద్యం ప్రభావాలు భారత్‌పైనా గణనీయంగా ఉండబోతున్నాయని వివరించింది. చైనాలో తొలి దశలో తయారీ కార్యకలాపాల నిలిపివేతతో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ఈ ప్రభావాలు మరింతగా విస్తరించాయని పేర్కొంది. ‘ఈ ఏడాది అంతర్జాతీయంగా మాంద్యం వస్తుందని అంచనాలున్నాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం భారత అంచనాలను 2 శాతానికి కుదిస్తున్నాం‘ అని ఫిచ్ తెలిపింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ గత వారమే 2020లో భారత వృద్ధి రేటు అంచనాలను 5.3 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించేసిన సంగతి తెలిసిందే. అటు ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ 3.5 శాతానికి, ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ 3.6 శాతానికి కుదించాయి. చిన్న సంస్థలు, బ్యాంకులకు దెబ్బ... వినియోగదారులు ఖర్చులు తగ్గించుకోనుండటంతో లఘు, చిన్న, మధ్యతరహా సంస్థలు, సేవల రంగాలపై అత్యధికంగా ప్రతికూల ప్రభావం పడుతుందని ఫిచ్ పేర్కొంది. సాధారణంగా నాన్–బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల (ఎన్బీఎఫ్సీ) నుంచి రుణాలు తీసుకునే వారి ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుందని, వారి ఆదాయాలేమైనా తగ్గిన పక్షంలో రుణాలు చెల్లించలేని పరిస్థితి తలెత్తవచ్చని తెలిపింది. ‘ఈ పరిస్థితుల్లో భారత్‌లోని ఎన్బీఎఫ్సీలు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా కార్యకలాపాలు దెబ్బతినొచ్చు. కరోనా కేసులు స్థానికంగా పెరిగితే ఆర్థికంగా సెంటిమెంటుపై కూడా దెబ్బతింటుంది. దీనితో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఎన్బీఎఫ్సీలు మళ్లీ పట్టాలు తప్పే అవకాశముంది‘ అని ఫిచ్ తెలిపింది. వచ్చే ఏడాది రికవరీ: ఏడీబీ అంతర్జాతీయంగా హెల్త్ ఎమర్జెన్సీ అమలవుతున్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత వృద్ధి రేటు 4 శాతానికి పరిమితం కావొచ్చని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. కరోనా వైరస్ ప్రతికూల ప్రభావాలు దీర్ఘకాలం కొనసాగిన పక్షంలో ప్రపంచ ఎకానమీ మరింత మాంద్యంలోకి జారిపోతుందని, భారత వృద్ధి ఇంకా మందగించవచ్చని పేర్కొంది. ఒకవేళ ఇది భారత్‌లోనే శరవేగంగా విస్తరిస్తే, ఆర్థిక కార్యకలాపాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు తప్పవని ఏడీబీ తెలిపింది. అయితే, స్థూల ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత రికవరీ మరింత పటిష్టంగా ఉండగలదని ఏషియన్ డెవలప్మెంట్ అవుట్‌లుక్ (ఏడీవో) నివేదికలో ఏడీబీ తెలిపింది. ‘ప్రస్తుతం అసాధారణ గడ్డుకాలంగా నడుస్తోంది. కరోనా ప్రజల జీవితాలతో పాటు వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా ఇతరత్రా ఆర్థిక కార్యకలాపాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది‘ అని ఏడీబీ ప్రెసిడెంట్ మసాత్సుగు అసకావా తెలిపారు. ‘ప్రపంచ వృద్ధికి, భారత రికవరీకి కరోనా పెను సవాలుగా మారింది. కానీ భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నందున వచ్చే ఆర్థిక సంవత్సరంలో గట్టిగా కోలుకోవచ్చు. సంస్కరణల ఊతంతో అప్పుడు 6.2% ఉండొచ్చు‘ అని ఏడీబీ చీఫ్ ఎకానమిస్ట్ యసుయుకి సవాడా చెప్పారు. మహమ్మారి బారిన పడిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత్ వేగంగా స్పందించిందన్నారు. వ్యక్తిగత, కార్పొరేట్ ట్యాక్స్ రేట్లపరంగా కొనసాగుతున్న సంస్కరణలు, వ్యవసాయం.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక రంగాన్ని గట్టెక్కించేందుకు తీసుకుంటున్న చర్యలు రికవరీకి తోడ్పడగలవని చెప్పారు. ప్రపంచానికి 4.1 ట్రిలియన్ డాలర్ల నష్టం.. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్ జీడీపీలో ఇది 2.3–4.8%కి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. టూరిజం, వాణిజ్యం, రెమిటెన్సులు వంటి విషయాల్లో ప్రపంచ దేశాలతో ఎక్కువగా అనుసంధానమై ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. కమోడిటీల ధరల పతనం కూడా కొన్ని దేశాలపై ఒత్తిడి పెంచుతోందని వివరించింది. 2020లో వృద్ధి 4.1 శాతానికి తగ్గి, 2021లో 6 శాతానికి రికవర్ కాగలదని తెలిపింది. -
‘ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నాం’
న్యూయార్క్ : రాబోయే రోజుల్లో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కోబోతున్నామని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరించారు. రెండో ప్రపంచ యుద్దం తరువాత ఇలాంటి పరిస్థితిని ప్రపంచం ఎప్పుడు చూసి ఉండదని అంచనా వేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనావైరస్ మహమ్మారి ప్రభావం ఆర్ధిక రంగంపై అత్యధికంగా ఉందని, కనీవినీ ఎరుగని ఆర్ధికమాంద్యాన్ని ప్రపంచం చూడబోతుందన్నారు. ఈ స్ధాయి ఆర్ధిక మాంద్యాన్ని ఎప్పుడు చూసి ఉండరని అంచనా వేశారు. కరోనా వైరస్ ప్రభావం అత్యంత అస్థిరత, ఆశాంతి, ఆందోళనలకు దారితీయబోతుందని చెప్పారు. సామాజికార్ధిక పరిస్థితులపై కరోనావైరస్ ప్రభావంపై నివేదిక విడుదల చేసే సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ప్రపంచదేశాలు కలిసికట్టుగా కరోనా వైరస్‌పై పోరాటం చేయాల్సిన సమయమని అన్నారు. రాజకీయ విషయాలు పక్కన పెట్టిన మానవాళిని రక్షించుకోవడానికి అన్ని దేశాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్య సమితి చరిత్రలో ఈ స్ధాయి ఆరోగ్య సంక్షోభాన్ని ఎప్పుడూ చూడలేదని నివేదికలో అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఆరోగ్యరంగాకే పరిమితం కాకుండా అన్ని రంగాలపై ప్రభావం చూపుతూ మానవ సంక్షోభానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. (కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు) కరోనాను ఎదుర్కోవడానికి ఎవరికి వారు సొంత ఎజెండాలతో ముందుకు సాగుతున్నారని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను ఖాతరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య రంగంలో మౌలిక వసతులు లేని దేశాలకు అభివృద్ధి చెందిన దేశాలు అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరి సహకారంతోనే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలమని అభిప్రాయపడ్డారు. -
కరోనా షాక్ : భారత్, చైనాకు మినహాయింపు
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కోవిడ్-19 సృష్టించిన విలయానికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపూర్వమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ముప్పు ఏర్పడనుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలంటే 2.5 ట్రిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్సిటిఎడి) కాన్ఫరెన్స్ అంచనావేసింది. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్-19 షాక్’ పేరుతో ఒక నివేదికను సంస్థ విడుదల చేసింది. ఎక్కువగా వినియోగ వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే వచ్చే రెండేండ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపింది. అంతేకాదు అనేక అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభం ముదరనుందని తెలిపింది. ఆరోగ్యం సంక్షోభం వస్తే, ఈ దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరకుపోతాయని అంచనావేసింది. ఆర్థిక ఆరోగ్య సంక్షోభం కలయిక చాలా దుర్మార్గంగా వుంటుందని వ్యాఖ్యానించింది. కాబట్టి ఆ దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, సేవలను బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని పేర్కొంది. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, మహమ్మారి కరోనా ఆర్ధిక షాక్ అభివృద్ధి చెందుతున్న దేశాలను భారీగా తాకనుందని యుఎన్సిటిఎడి తెలిపింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లలో ప్రపంచ ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపింది. చైనా, భారతదేశం మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుందని పేర్కొంది. కొనసాగుతున్న ఆర్ధిక పతనాన్ని ఊ హించడం చాలా కష్టం, కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడకముందే పరిస్థితులు మరింత దిగజారిపోతాయనేస్పష్టమైన సూచనలు ఉన్నాయని యుఎన్సిటిఎడి సెక్రటరీ జనరల్ ముఖిసా కిటుయ్ చెప్పారు. ఈ సంవత్సరం దూసుకుపోతున్న ఆర్థిక సునామీ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2-3 ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని కేటాయించాలన్నారు. అలాగేమాంద్యాన్ని నివారించేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు చైనా కూడా తమ ఆర్థిక వ్యవస్థల్లోకి భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తున్నాయని, జీ 20 కూటమి దేశాలు కూడా ఇటీవలే తమ ఆర్థిక వ్యవస్థల్లోకి 5 ట్రిలియన్ డాటర్లను పంపింగ్ చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేసింది. ఇది అసాధారమైన సంక్షోభానికి అసాధారణమైన ప్రతిస్పందన లాంటిదని పేర్కొంది. ‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో మాంద్యంలోకి జారుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. అయితే ఈ మ్యాంద్యం ప్రభావం ఇండియా, చైనాలపై ఉండకపోవచ్చు అని వెల్లడించింది. నాలుగు పాయింట్ల రికవరీ ప్రణాళిక ఇందుకు నాలుగు పాయింట్లు రికవరీ ప్రణాళికను ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా 2009 కేటాయింపులకు మించిన ఆర్థిక కేటాయింపులు ప్రస్తుతం జరగాలిల. బలహీ ఆర్థికవ్వవస్థలకు ఒక ట్రిలయన్ డాలర్లకు పైగా పెట్టుబడులను అందించాలి. రెండవ చర్యగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ అప్పులో సగం రద్దు చేసిన మాదిరిగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక వ్యవస్థలకు రుణాలను రద్దు చేయాలి. లేదా గణనీయంగా తగ్గించాలి. మూడవ చర్యగా పేద దేశాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు, సంబంధిత సామాజిక సహాయ కార్యక్రమాలకుగాను 500 బిలియన్ల పెట్టుబడులను కల్పించాలి. చివరగా, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఇప్పటికే పెరుగుతున్న మూలధన ప్రవాహాన్ని తగ్గించడానికి నియంత్రణలను ఆయా దేశాలు అమలు చేయాలని పిలుపునిచ్చింది. UNCTAD urgently calls for a $2.5 trillion #coronavirus aid package to help developing countries avoid worst-case scenarios and impacts. https://t.co/0ORP07QKkd#COVID19 pic.twitter.com/0B97uMweju — UNCTAD (@UNCTAD) March 30, 2020 -
తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?
సాక్షి, ముంబై: ప్రపంచంలో తీవ్రమైన ఆర్థికమాంద్య పరిస్థితులు వచ్చేశాయన్న ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పుంజుకుంటున్నాయి. దీర్ఘకాలిక మాంద్యం ఆందోళనలతో అంతర్జాతీయంగా బంగారు ధరలు లాభపడ్డాయి. దీంతో దేశీయంగా ఎంసీఎక్స్ మార్కెట్ లో గోల్డ్ ఏప్రిల్ ఫ్యూచర్స్ మార్చి 30 న స్వల్పంగా 0.02 శాతం లాభపడిన పది గ్రాముల పుత్తడి ధర రూ. 43,580 వద్ద వుంది. అయితే జూన్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.6 శాతం పడి రూ. 43,302 కు చేరుకుంది. ఇదే బాటలో పయనించిన వెండి ధర (మే ఫ్యూచర్స్) కిలోకు 3 శాతం క్షీణించింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 39,758 వద్ద కొనసాగుతోంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో, బంగారానికి సంబంధించిన ట్రేడింగ్ లో గత 12 ఏళ్లలో లేని విధంగా గత వారంలో ఉత్తమంగా నిలిచిందనీ, ఈ ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అభిప్రాయం. బంగారం ధరలు క్షీణించిన ప్రతిసారీ పెట్టుబడిదారులు కొనుగోలుకు మొగ్గు చూపే అవకాశం వుందని ఎల్ కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అంచనా వేశారు. ట్రేడర్ల లాభాల స్వీకరణతో ఊగిసలాట ధోరణి ఉన్నప్పటికీ పది గ్రాముల ధర రూ. 39500 వద్ద సాంకేతిక మద్దతువుందని పేర్కొన్నారు. దేశీయంగా దిగి వచ్చిన ధర కరోనా మహమ్మారి విజృంభణతో కొనుగోళ్లు పడిపోవడంతో దేశీయంగా పసిడి ధర పతనమైంది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ 1,925 తగ్గి 43,375కు చేరింది. అటు 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,940 రూ. 39,830కి పడిపోయింది. ఇక కేజీ వెండి ధర రూ.1,910కి తగ్గడంతో రూ.39,500కి పడిపోయింది. జువెలర్ల నుంచి డిమాండ్ తగ్గడమే బంగారం ధరలు తగ్గడానికి కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా కోవిడ్ -19 సంక్షోభంతో 2009 నాటి కంటే ఘోరమౌపమాంద్యంలోకి జారుకున్నామని ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా మార్చి 27 నాటి విలేకరుల సమావేశంలో అన్నారు. కాగా భారతదేశంలో పసిడి ధర గత వారం 10 గ్రాములకు రూ. 3000 పెరిగాయి. మరోవైపు కరోనా సంక్షోభంతో చమురు ధరలు భారీగా క్షీణించాయి. సోమవారం బ్యారెల్ ధర 20 డాలర్లు దిగువకు చేరింది. అటు డాలరు ధర మార్చి 17న రికార్డు కనిష్టాన్ని నమోదు చేసింది. గ్రీన్ బ్యాక్ ఆరు కరెన్సీలతో పోలిస్తే డాలరు నేడు 0.34 శాతం స్వల్ప లాభంతో 98.69వద్ద వుంది. ఇలాగే దేశీయ కరెన్సీ వరుసగా రికార్డు పతనాన్ని నమోదు చేసింది. డాలరుమారకంలో 32 పైసలు పతనమై 75.21 వద్ద కొనసాగుతోంది. శుక్రవారం 74.89 వద్ద ముగిసింది. -
మాంద్యం వచ్చేసింది..
వాషింగ్టన్: కరోనా కారణంగా ప్రపంచం మాం ద్యంలోకి జారిపోయిందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టలీనా జార్జియేవా స్పష్టం చేశారు. 2009 నాటి అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే పరిస్థితులు మరింత దారుణంగా ఉండబోతున్నాయని వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ దేశాలు మాంద్యంలోకి జారుకున్నాయన్నది సుస్పష్టం. ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిల్చిపోవడంతో వర్ధమాన మార్కెట్ల ఆర్థిక అవసరాలకు 2.5 లక్షల కోట్ల డాలర్లు అవసరమవుతాయని ఐఎంఎఫ్ అంచనా. ఇది కనీస స్థాయి మాత్రమే. ఇంతకు మించే అవసరం ఉండవచ్చు‘ అని ఆమె తెలిపారు. -
బ్లాక్ మండే: బ్యాంకింగ్ షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: ఆర్థిక మాంద్య భయాలతో ఆసియా మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి. 10శాతం పతనంతో లోయర్ సర్క్యూట్‌ను తాకడంతో 45 నిమిషాలు నిలిపివేయబడింది. విరామం తరువాత స్వల్పంగా కోలుకున్నా, అనంతరం మరింత దిగజారి బెంచ్ మార్క్ సెన్సెక్స్ 3,499,( 11.7శాతం) 26,417 వద్ద, నిఫ్టీ 50 ఇండెక్స్ 1,008(11.5శాతం) నష్టంతో 7737.25 పాయింట్లకు పడిపోయి మరో బ్లాక్ మండే నమోదైంది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 12 శాతం పతనమై ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను నమోదు చేసుకుంటోంది. ముఖ్యంగా దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఏడాది గరిష్ట స్థాయి నుంచి కేవలం కొన్ని వారాల వ్యవధిలోనే ఈ స్టాక్స్ ఏకంగా 45 శాతం పైగా పతనం అయ్యాయంటే.. అమ్మకాల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 552 కాగా.. ఇవాల్టి ట్రేడింగ్‌లో 15 శాతం క్షీణించి రూ. 293.85కు పడిపోయింది. యాక్సిస్ బ్యాంక్ పరిస్థితి మరీ దారుణం ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 827 నుంచి రూ. 342కు పడిపోయింది. ఈ ఒక్క రోజే యాక్సిస్ బ్యాంక్ షేర్ ధర 20 శాతం క్షీణించింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 14 శాతానికి పైగా కుప్పకూలింది. దీంతో పాటు ప్రభుత్వ రంగ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, 11 శాతం బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ 5 నుంచి 11 శాతం నష్టాలను మూటగట్టుకున్నాయి. కాగా ప్రపంచ మాంద్యం నెలకొనే అవకాశం, ఆయా దేశాల సెంట్రల బ్యాంకుల తీవ్ర చర్యలు, లాక్డౌన్ల ఆటుపోట్ల కారణంగా ఆసియా షేర్లు పడిపోయాయని రాయిటర్స్ నివేదిక తెలిపింది. అలాగే ఆర్థిక వ్యవస్థలో తగినంత ద్రవ్యతను నిర్ధారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బహిరంగ మార్కెట్ కార్యకలాపాలతో సహా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇన్వెస్టర్ల ఆందోళన అప్రతిహతంగా కొనసాగుతోంది. రూ .30,000 కోట్ల ప్రభుత్వ బాండ్లను బహిరంగ మార్కెట్ ద్వారా రెండుసార్లు( మార్చి 24, మార్చి 30) కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. చదవండి: 12 ఏళ్లలో మొదటిసారి... -
కరోనా: దిగ్గజ ఆటో కంపెనీల ప్లాంట్ల మూత
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విజృంభణతో ఆర్థిక వ్యవస్థ అల్లకల్లోమవుతోంది. పలు కంపెనీలు తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతున్నాయి. ఆర్థికమందగమనం, డిమాండ్ క్షీణత నేపథ్యంలో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయిన ఆటో మొబైల్ పరిశ్రమ మరోసారి దిగ్భంధనంలో చిక్కుకుంది. తాజాగా కోవిడ్-19 వ్యాధి విస్తరణ , రక్షణ చర్యల్లో భాగంగా పలు ఆటో కంపెనీలు తమ ఉత్పత్తులను నిలిపివేశాయి. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగగా దేశంలో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని దిగ్గజ కంపెనీలు వెల్లడించాయి. వ్యాధి విస్తరణ మరింత ముదరకుండా ముందు జాగ్రత్త చర్యగా కార్యాలయాలకు తాళాలు వేసేసాయి. ముఖ్యంగా అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి కంపెనీలు మూసివేత నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతోపాటు కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించడం విశేషం. స్పోర్ట్-యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా హర్యానాలోని ప్లాంట్ లో ఉత్పత్తిని, కార్యకలాపాలను వెంటనే మూసివేస్తునట్టు తెలిపింది. దీంతోపాటు మహారాష్ట్రలోని ఒక ప్లాంట్‌లో తయారీని నిలిపివేసిందని, సోమవారం నుంచి మరో రెండు ప్లాంట్లను నిలిపివేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే తన ఉత్పాదక కర్మాగారాలలో కరోనావైరస్ రోగులకు వెంటిలేటర్లను తయారు చేయడం ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వెంటనే పనులు ప్రారంభిస్తామని గ్రూప్ కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. హాలిడే రిసార్టులను తాత్కాలిక సంరక్షణ సౌకర్యాలుగా మలుస్తామని, అలాంటి కేంద్రాలను నిర్మించడంలో ప్రభుత్వానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద ఆటో హబ్‌లలో ఒకటిగా ఉన్న ముంబైలో అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులను నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర, పూణే లలోపి అనేక కార్ల తయారీదారులు ఉత్పత్తిని నిరవధికంగా లేదా మార్చి 31 వరకు నిలిపివేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేసాయి. మార్చి 31 వరకు పూణే ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేస్తామని మెర్సిడెస్ బెంజ్, ఫియట్ , బైక్ తయారీదారు బజాజ్ ఆటో ప్రకటించాయి. భారతదేశం, బంగ్లాదేశ్, కొలంబియాలోని అన్ని ప్లాంట్లలో తయారీని నిలిపివేసినట్లు ప్రముఖ బైక్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ లిమిటెడ్ ఆదివారం తెలిపింది. పూణేలోని తన ప్టాంట్ లో మూడు వారాలపాటు ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, తమ ఉద్యోగుల భద్రతకు భరోసా ఇస్తున్నట్లు ఫోక్స్ వ్యాగన్ తెలిపింది. మహారాష్ట్రలోని తన కార్ల కర్మాగారంలో కార్యకలాపాలను బాగా తగ్గించామనీ, కరోనావైరస్ గురించి ఆందోళనలు తీవ్రతరం అయితే మూసివేయడానికి సిద్ధమని టాటా మోటార్స్ ఇప్పటికే సంసిద్ధతను వ్యక్తం చేసింది. మెర్సిడెస్ బెంజ్ , ఫియట్ క్రిస్లర్ ఆటోమొబైల్స్ లాంటి కంపెనీలు ప్లాంట్ల మూసివేత నిర్ణయాన్ని ఆదివారం ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను నిలిపివేస్తున్న గ్లోబల్ దిగ్గజం ఐషర్ మోటార్స్ తెలిపింది. యూరప్, అమెరికా కెనడా , మెక్సికోలలో వాహనదారులు ప్లాంట్లను మూసివేత నిర్ణయాన్ని గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా కరోనావైరస్ కారణంగా ప్రపంచ మరణాల సంఖ్య 14,000 దాటింది. భారతదేశంలో ఇప్పటివరకు సుమారు 400 మందికి ఈ వ్యాధి సోకగా, ఐదుగురు చనిపోయారు. దేశవ్యాప్తంగా రైలు, మెట్రో సేవలు నిలిచిపోయాయి. మార్చి 31 వరకు పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ప్రముఖ ఆటో కంపెనీ ఎంట్రీ : ఓలా, ఉబెర్‌కు చెక్? -
మాంద్యం కోరల్లో!
ముంబై: కరోనా వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించిందంటూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటనతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు బుధవారం తీవ్రరూపం దాల్చాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు కుదేలు కాగా మన మార్కెట్లు సైతం అదే బాటలో నడిచాయి. దీనికితోడు టెలికం కంపెనీల ఏజీఆర్ చెల్లింపుల సమీక్షకు అనుమతించేది లేదని సుప్రీంకోర్టు కరాఖండిగా తేల్చేయడం బ్యాంకు స్టాక్స్‌కు ప్రతికూలంగా మారింది. బ్యాంకు స్టాక్స్‌ను విదేశీ ఇన్వెస్టర్లు తెగ బాదేశారు. కోటక్ మహీంద్రా బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10%పైనే పతనమయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇండస్ఇండ్ బ్యాంకులోనూ సమస్యలు ఉన్నాయనే వదంతులతో కంపెనీ షేరు కుదేలయింది. ఇంట్రాడేలో ఇండస్ఇండ్ బ్యాంకు షేరు 38 శాతం నష్టంతో రూ.382.55 వరకు పడిపోగా (ఏడాది నూతన కనిష్ట స్థాయి), ఆ తర్వాత కొంత కోలుకుని 24% నష్టంతో సరిపెట్టుకుంది. 2017 జనవరి తర్వాత సెన్సెక్స్ 29,000 మార్క్ దిగువకు చేరింది. మాంద్యం భయాలు... భారత వృద్ధి అంచనాలను తగ్గిస్తూ ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ చేసిన ప్రకటన ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పింది. 2020 సంవత్సరంలో భారత జీడీపీ 5.7 శాతం వృద్ధి సాధించొచ్చన్న గత అంచనాలను తాజాగా 5.2 శాతానికి ఎస్అండ్పీ తగ్గించింది. అలాగే, కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి ప్రవేశించినట్టు ప్రకటించింది. ఆసియా పసిఫిక్ వృద్ధి 2020లో సగానికి సగం తగ్గి 3 శాతం లోపునకు పడిపోవచ్చన్న అంచనాలను ఎస్అండ్పీ విడుదల చేసింది. అంతర్జాతీయ మార్కెట్లు కుదేలు అంతర్జాతీయంగా ఈక్విటీ, చమురు మార్కెట్లు బుధవారం కుప్పకూలాయి. ఎన్ని ఉద్దీపనలు ప్రకటించినా కానీ, కరోనా ప్రతాపంతో ప్రపంచ వృద్ధి రేటు దారుణంగా పడిపోవచ్చన్న భయాలతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు పోటీపడ్డారు. యూరోప్ మార్కెట్లు లండన్, ప్యారిస్, ఫ్రాంక్ఫర్ట్ ఐదు శాతం పడిపోగా, ఆసియా మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. షాంఘై, హాంకాంగ్, సియోల్, జపాన్ 5 శాతం వరకు నష్టపోయాయి. ప్యారిస్‌లో అయితే ఒక నెల పాటు షార్ట్ సెల్లింగ్‌ను నిషేధించారు. అలాగే ఒక రోజు పాటు ట్రేడింగ్‌ను కూడా నిలిపివేశారు. అమెరికా, బ్రిటన్ భారీ ప్యాకేజీలు అమెరికాలో ఇప్పటికే 300 బిలియన్ డాలర్ల పన్ను చెల్లింపులను వాయిదా వేయగా, ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని సిద్ధం చేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ముంచిన్ ప్రకటించారు. అంటే 2008 నాటి ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో ప్రకటించిన ప్యాకేజీలను ఇది మించిపోనుంది. కరోనాతో అమెరికాలో నిరుద్యోగ రేటు 20 శాతానికి పెరిగిపోతుందని ముచిన్ పేర్కొన్నారు. ‘‘ప్రజలు ఉద్యోగాలు కోల్పోకూడదు. జీవించడానికి డబ్బుల్లేని పరిస్థితిలోకి వెళ్లకూడదని మేము కోరుకుంటున్నాం’’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అటు బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్ కూడా బిలియన్ డాలర్ల ప్యాకేజీలను ప్రకటించాయి. మాంద్యం, టెలికం ఏజీఆర్ ప్రభావం ‘‘మార్కెట్లు మూడేళ్ల కనిష్టం వద్ద క్లోజయ్యాయి. కోవిడ్–19 ప్రభావంతో అంతర్జాతీయ మాంద్యం తప్పదంటూ రేటింగ్ ఏజెన్సీల హెచ్చరికలతో ఆసియా, యరోప్ మార్కెట్లు నష్టపోగా, మన మార్కెట్లు అదే బాట పట్టాయి. అదనంగా సుప్రీంకోర్టు టెలికం కంపెనీలకు ఏజీఆర్ విషయంలో ఎటువంటి ఉపశమనం కల్పించలేదు. దీంతో టెలికం కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకు స్టాక్స్‌పై ఎక్కువగా ప్రభావం పడింది. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 7 శాతం వరకు పడిపోయింది’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ► ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంకు 24 శాతం, పవర్‌గ్రిడ్ 12 శాతం, కోటక్ బ్యాంకు , బజాజ్ ఫైనాన్స్ 11 శాతం చొప్పున, హెచ్డీఎఫ్సీ బ్యాంకు 10 శాతం, ఎన్టీపీసీ 8 శాతం వరకు పనతమయ్యాయి. ఇన్వెస్టర్ల సంపదకు తూట్లు ఈ వారంలో మొదటి మూడు రోజుల్లో అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.15,72,913 కోట్ల మేర తరిగిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,13,53,329 కోట్లకు పడిపోయింది. భారత్ ‘వృద్ధి’కి ఎస్ అండ్ పీ కోత న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 2020 వృద్ధి అంచనాలకు రేటింగ్ దిగ్గజ సంస్థ ఎస్ అండ్ పీ కోత పెట్టింది. క్యాలెండర్ ఇయర్లో ఇంతక్రితం అంచనా 5.7 శాతంకాగా, తాజాగా దీనిని 5.2 శాతానికి తగ్గిస్తున్నట్లు పేర్కొంది. మరో అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం 5.3 శాతం అంచనాకన్నా ఇది తక్కువ కావడం గమనార్హం. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తుండడం తమ తాజా అంచనాలకు కారణంగా పేర్కొంది. ఆసియా–పసిఫిక్ ఆర్థిక వృద్ధి రేటు సగానికన్నా ఎక్కువగా పతనమై, 3 శాతంకన్నా దిగువనకు పడిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కరోనా ప్రభావంతో రానున్న రెండు త్రైమాసికాల్లో అంతర్జాతీయ పర్యాటక రంగం కుదేలయ్యే అవకాశం ఉందని పేర్కొన్న ఎస్ అండ్ పీ, అమెరికా, యూరోప్ నుంచి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పడిపోయే వీలుందని తెలిపింది. 2020లో చైనా వృద్ధి రేటును 4.8 శాతం నుంచి 2.9 శాతానికి కుదించింది. వృద్ధి అనేది కరోనా అదుపుపైనే ఆధారపడి ఉందని రేటింగ్ దిగ్గజం అభిప్రాయపడింది. కరోనా ప్రభావం ఉపాధి, ఉద్యోగుల పని గంటలు, వేతనాల కోతలకు దారితీయవచ్చని పేర్కొంది. కాగా, ఈ ఏడాది భారత్‌లో ఆర్బీఐ రెపో రేటు 1.75 శాతం తగ్గొచ్చని ఫిచ్ అంచనావేసింది. 2020లో ప్రపంచ వృద్ధి 1 శాతమే: ఈఐయూ న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి ప్రతికూల ప్రభావంతో 2020లో ప్రపంచ వృద్ధి 1%కి పడిపోనున్నట్లు ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ఒక నివేదికలో తెలిపింది. వైరస్ వ్యాప్తికి ముందు వృద్ధి 2.3%గా ఉంటుందని అంచనా వేశారు. పెద్ద ఎకానమీలైన జపాన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ పూర్తి ఏడాది మాంద్యంలోకి జారిపోవచ్చని ఈఐయూ పేర్కొంది. ప్రపంచ జనాభాలో 50% మంది ప్రజలకు వైరస్ సోకవచ్చని.. 20% కేసులు తీవ్రంగా ఉంటాయని, 1–3% మరణాలు సంభవించవచ్చని తెలిపింది. క్రూడ్, బంగారం మరింత పతనం కోవిడ్–19 భయాల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించి అంతర్జాతీయంగా ఇన్వెస్టర్ల భయాందోళనలు కొనసాగుతున్నాయి. ఈక్విటీలతో పాటు బంగారం, క్రూడ్ సహా ప్రతి ఒక్క సాధనం నుంచీ పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయి. డాలర్ మాత్రం లాభాల్లో ట్రేడవుతోంది. ► రాత్రి ఈ వార్తరాసే 10.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఔన్స్ (31.1గ్రాములు) ధర 37 డాలర్ల నష్టంతో (2.5 శాతం) 1,489 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 1,484 డాలర్ల స్థాయిని కూడా తాకింది. ► ఇక క్రూడ్ విషయానికి వస్తే, స్వీట్ బ్యారల్ ధర 18 శాతం (5 డాలర్లు) నష్టంతో 22.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బ్రెంట్ ఆయిల్ 12 శాతంపైగా (3 డాలర్లు) నష్టంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇవి 18 సంవత్సరాల కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. ► ఇక ఆరు దేశాల కరెన్సీతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 2 శాతం (2 డాలర్లు)పైగా లాభంతో 101.868 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
ప్రపంచవ్యాప్తంగా స్టాక్, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం
ట్రంప్ ట్రేడ్‌వార్ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లను కుదిపేస్తోంది. ఇక కార్చిచ్చులా ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న కరోనా.. ఇన్వెస్టర్లను బెంబేలెత్తిస్తోంది. ఈ రెండింటికీ సౌదీ అరేబియా–రష్యా మధ్య మొదలైన చమురు ధరల యుద్ధం ఆజ్యం పోసింది. ఇక చెప్పేదేముంది! మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు మహా పతనాన్ని చవిచూశాయి. చమురు ఊచకోతకు గురైంది. ఒక్క జపాన్ యెన్ మినహా... ప్రపంచ కరెన్సీలన్నీ ఊహించని విధంగా పతనమయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే... ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా, ఏ దశలోనూ ఇన్వెస్టర్లకు ఉపశమనం కనిపించలేదు. ♦ ముడిచమురు ఉత్పత్తి తగ్గించుకునే విషయంలో ఒపెక్ కూటమి – రష్యా మధ్య రేగిన విభేదాలతో.. సౌదీ భారీగా రేట్లు తగ్గించేసింది. ఫలితం.. ఒకేరోజు ముడి చమురు ధరలు ఏకంగా 30 శాతానికిపైగా పతనమయ్యాయి. ఒక దశలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 31 డాలర్ల స్థాయికి పడిపోయి, తర్వాత కాస్త కోలుకుంది. 1991 గల్ఫ్ యుద్ధ సమయం తర్వాత ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. ♦ తాజా పరిణామాలతో రూపాయి ఏకంగా 17 నెలల కనిష్టానికి క్షీణించి డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద క్లోజయ్యింది. జపాన్ యెన్ మినహా అమెరికా డాలర్, ఇతర కరెన్సీలూ రూపాయి దార్లోనే వెళ్లాయి. సోమవారం రాత్రి 11 గంటల సమయానికి అమెరికా మార్కెట్ల ప్రామాణిక సూచీ డోజోన్స్ 1,600 పాయింట్లకు పైగా నష్టంతో (6 శాతం) ట్రేడవుతోంది. జపాన్, జర్మనీ, ఇంగ్లండ్, ఫ్రాన్స్ మార్కెట్లు సైతం 5 నుంచి 7 శాతం మధ్యలో భారీగా నష్ట పోయాయి. మంగళవారం హోలీ సందర్భంగా మన మార్కెట్లకు సెలవు కావటంతో.. పతనానికి కూడా తాత్కాలికంగానైనా విరామం దొరికినట్లయింది. ఆయిల్ వార్, కరోనా ఫియర్ స్టాక్ మార్కెట్లను కుదిపేయడంతో ఆసియా నుంచి అమెరికా దాకా సోమవారం బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు భారీ నష్టాలతో ముగిశాయి. అదుపులోకి రాని కరోనా వైరస్ పెట్టుబడిదారులను బెంబేలెత్తించడంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. మరోవైపు ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 30 శాతం కుప్పకూలింది. మరో ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటామేమోననే భయం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దశాబ్దకాలంలో అతిపెద్ద సింగిల్–డే పతనంతో మార్చి 9వతేదీ ,2020 భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో బ్లాక్ మండేగా నిలిచిపోయింది.7లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. క్రూడ్(ముడి చమురు) ధరల పతనానికి బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం 1,942 పాయింట్లు కుప్పకూలింది. చరిత్రలో ఇదే అత్యంత భారీ పతనం. కోవిడ్–19 (కరోనా) వైరస్ కల్లోలానికి ముడి చమురు ధరల పోరు జత కావడంతో స్టాక్ మార్కెట్ కనీవినీ ఎరుగని రీతిలో క్షీణించింది. సెన్సెక్స్ 36,000 పాయింట్లు, నిఫ్టీ 10,500 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. ప్రస్తుతం మందగమనంలో ఉన్న అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ... కోవిడ్–19 వైరస్, ముడి చమురు ధరల పోరు కారణంగా మాంద్యంలోకి జారిపోతుందనే భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇక దేశీయంగా యస్‌బ్యాంక్ సంక్షోభం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 30 పైసలు తగ్గడం వంటి అంశాలు కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. ఇంట్రాడేలో 2,467 పాయింట్ల మేర పతనమైన సెన్సెక్స్ చివరకు 1942 పాయింట్లు క్షీణించి 35,635 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 695 పాయింట్లు పతనమైన నిఫ్టీ చివరకు 538 పాయింట్ల నష్టంతో 10,451 పాయింట్ల వద్దకు చేరింది. శాతాలపరంగా చూస్తే, సెన్సెక్స్ 5.1 శాతం, నిఫ్టీ 4.9 శాతం చొప్పున నష్టపోయాయి. శాతం పరంగా చూస్తే, ఈ రెండు సూచీలు గత ఐదేళ్లలో ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు ఒక్క రోజులోనే ఇన్నేసి పాయింట్లు నష్టపోవడం (ఇంట్రాడే, ముగింపులో కూడా)ఇదే మొదటిసారి. ఆరంభంలోనే భారీ నష్టాలు.... ఆసియా మార్కెట్ల బలహీనతతో మన మార్కెట్ భారీ నష్టాలతోనే ఆరంభమైంది. సెన్సెక్స్ 627 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సమయం Výæడిచే కొద్దీ నష్టాలు పెరిగాయే కానీ తరగలేదు. అన్ని రంగాల షేర్లు పతనమయ్యాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి స్టాక్ మార్కెట్ నష్టాలు కొనసాగుతున్నాయి. అప్పటి నుంచి చూస్తే, సెన్సెక్స్ 5,088 పాయింట్లు (12.4 శాతం), నిఫ్టీ 1,511 పాయింట్లు(12.6 శాతం) చొప్పున క్షీణించాయి. ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముప్పిరిగొన్నందున సెంటిమెంట్ బలహీనంగా ఉందని, మన మార్కెట్‌పై ఒత్తిడి కొనసాగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిఫ్టీ మద్దతు స్థాయిలు 10,295–10,138 పాయింట్లని, ఒక వేళ పుల్ బ్యాక్ ర్యాలీ చోటు చేసుకుంటే నిరోధ స్థాయిలు 10,637–10,744 పాయింట్లని విశ్లేషకులు పేర్కొన్నారు. పతనానికి పంచ కారణాలు... ♦ చమురు ధరల పతనం... చమురు ఉత్పత్తి చేసే దేశాల్లో ఉత్పత్తి కోతకు సంబంధించి చర్చలు విఫలమయ్యాయి. ఒపెక్ దేశాలు ప్రతిపాదించిన ఉత్పత్తి కోతను రష్యా వ్యతిరేకించడం.. నచ్చని సౌదీ అరేబియా ప్రతి చర్యలు ప్రకటించింది. తాము ఉత్పత్తి చేసే క్రూడ్ ధరలను తగ్గించడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఇది అంతర్జాతీయంగా వృద్ధి మరింతగా దెబ్బతీస్తుందన్న భయాలు మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయని నిపుణులంటున్నారు. కోవిడ్–19 విలయం భారత్‌లో కోవిడ్–19 (వైరస్) బాధితుల సంఖ్య 43కు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ బాధితుల సంఖ్య లక్షకు, మరణాల సంఖ్య 3,600కు పెరిగాయి. ఇటలీలో ఒక్క రోజులోనే 130కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. కోటిన్నరకు పైగా ప్రజలను ఈ దేశం క్వారంటైన్లో ఉంచింది. మరిన్ని దేశాలకు ఈ వైరస్ విస్తరిస్తుండటంతో మరిన్ని కష్టాలు ముందు ముందు ఉంటాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ వైరస్ మరింత విస్తరిస్తే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా తదితర అభివృద్ధి చెందిన దేశాలు మాంద్యంలోకి జారిపోతాయని మూడీస్ సంస్థ హెచ్చరించడం ఆందోళన రేకెత్తించింది. ప్రపంచ మార్కెట్ల పతనం కోవిడ్–19 వైరస్ విస్తరిస్తుండటం, ముడి చమురు ధరల హఠాత్ పతనం కారణంగా ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ మార్కెట్లు భారీగా క్షీణించాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి సురక్షిత సాధనాలైన పుత్తడి, అమెరికా డాలర్, బాండ్లలోకి పెట్టుబడులు తరలిపోతున్నాయి. ఫలితంగా సోమవారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. షాంఘై, హాంగ్‌కాంగ్, దక్షిణ కొరియా, జపాన్ సూచీలు 5 శాతం మేర క్షీణించాయి. ఆరంభంలోనే 6% మేర నష్టపోయిన యూరప్ మార్కెట్లు అదే స్థాయిలో ముగిశాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు... కరోనా కల్లోలానికి సెంటిమెంట్ దెబ్బతినడంతో విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ నికర కొనుగోలుదారులుగా ఉన్న విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగుతున్నాయి. సోమవారాన్ని కూడా కలుపుకుంటే వరుసగా 11వ రోజూ విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగానే నిలిచారు. ఈ 11 ట్రేడింగ్ సెషన్లలో రూ.25,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. యస్ బ్యాంక్ సంక్షోభం .. భారత బ్యాంకింగ్ రంగం స్థిరత్వంపై ఆందోళనను, సంశయాలను పెంచింది. పలు ఆర్థిక సంస్థలు యస్ బ్యాంక్ బాండ్లలో ఇన్వెస్ట్ చేశాయి. ఈ బాండ్ల రేటింగ్‌ను పలు రేటింగ్ సంస్థలు డౌన్‌గ్రేడ్ చేశాయి. మరోవైపు బాసెల్ టూ, టైర్–1 బాండ్ల వడ్డీ చెల్లింపుల్లో యస్ బ్యాంక్ విఫలమైంది. మొత్తం మీద యస్ బ్యాంక్ ప్రభావం తీవ్రంగానే ఉండగలదన్న భయాలు నెలకొన్నాయి. నేడు మార్కెట్లకు సెలవు నేడు హోలీ పండుగ సందర్భంగా సెలవు. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ట్రేడయ్యింది. ఆరంభంలోనే ఏడు శాతం మేర çపతనమై లోయర్ సర్క్యూట్‌ను తాకింది. దీంతో ట్రేడింగ్‌ను నిలిపేశారు. 15 నిమిషాల అనంతరం ఆరంభమైనప్పటికీ నష్టాలు తగ్గలేదు. కరోనా ప్రభావం పెరుగుతుండటం, ముడి చమురు ధరలు తగ్గడం ప్రభావం చూపాయి. రాత్రి గం.11.30 ని. లకు డోజోన్స్ 1,794 పాయింట్లు, నాస్డాక్ 500 పాయింట్ల నష్టాల్లో ట్రేడయ్యాయి. మంగళవారం సెలవు కావడంతో మేలైందని, లేకుంటే అమెరికా, యూరప్ మార్కెట్ల నష్టాల ప్రభావంతో మన మార్కెట్‌కు భారీ నష్టాలు ఉండేవని విశ్లేషకులంటున్నారు. రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్ మహా పతనం కారణంగా రూ. 7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.6, 84, 278 కోట్లు హరించుకుపోయి రూ.1,37,46,947 కోట్లకు పడిపోయింది. షేర్లు కకావికలం... ♦ ఓఎన్జీసీ.. 15 ఏళ్ల కనిష్టానికి ముడి చమురు ధరలు 30 శాతం మేర పతనం కావడంతో చమురు అన్వేషణ, తయారీ ప్రభుత్వ రంగ కంపెనీ ఓఎన్జీసీ భారీగా నష్టపోయింది. 16 శాతం నష్టంతో రూ.74.65 వద్ద ముగిసింది. ఇది దాదాపు 15 ఏళ్ల కనిష్ట స్థాయి. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ♦ రెండో స్థానానికి రిలయన్స్ చమురు ఉత్పత్తి రంగంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ కూడా బాగా పతనమైంది. 12 శాతం నష్టంతో రూ.1,113 వద్దకు చేరింది. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. లక్ష కోట్లు ఆవిరైంది. ఈ నష్టం కారణంగా అత్యధిక మార్కెట్ క్యాప్‌గల భారత కంపెనీ అనే ఘనతను కోల్పోయి రెండో స్థానానికి పడిపోయింది. మొదటి స్థానం టీసీఎస్ షేర్‌కు దక్కింది. ♦ యస్ బ్యాంక్ జోరు... ఎస్బీఐ బేజారు.... సంక్షోభంలో చిక్కుకున్న యస్‌బ్యాంక్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్న ఎస్బీఐ షేర్ 6 శాతం పతనమై రూ.254కు చేరింది. మరోవైపు యస్ బ్యాంక్ షేర్ 31 శాతం లాభపడి రూ.21 వద్ద ముగిసింది. ♦ చమురు షేర్లు రయ్... ముడి చమురు ధరలు 30 శాతం మేర తగ్గడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు–హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ షేర్లు లాభపడ్డాయి. హెచ్‌పీసీఎల్ షేర్ 6 శాతం లాభంతో రూ.213కు, బీపీసీఎల్ షేర్ 5.2 శాతం పెరిగి రూ.424కు పెరిగాయి. ♦ ఏడాది కనిష్టానికి 800 షేర్లు... దాదాపు 800కు పైగా షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. బీఎస్ఈ 500 సూచీలో ప్రతి నాలుగు షేర్లలో ఒక షేర్ ఏడాది కనిష్టానికి పడిపోయింది.∙ప్రపంచ పరిణామాలకు యస్ బ్యాంకు సంక్షోభం తోడవటంతో బీఎస్ఈ సెన్సెక్స్ సోమవారం ఒక్కరోజే 1,942 (5.1%) పాయింట్లు కుదేలైంది. చరిత్రలో ఇదే అత్యంత దారుణ పతనం. నిఫ్టీ సైతం 538 పాయింట్లు (4.9%) నష్టపోయింది. శాతాల పరంగా గత ఐదేళ్లలో ఇదే భారీ నష్టం కాగా.. పాయింట్ల పరంగా ఇది రికార్డు. ఓఎన్జీసీ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు సైతం 15 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి. ఫలితంగా ఒక్కరోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల మేర ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. -
చెక్‌డ్యామ్‌లకు నాబార్డ్ రుణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నదులు, వాగులు, వంకలపై నిర్మిస్తున్న చెక్‌డ్యామ్‌లకు నిధుల కొరత లేకుండా నాబార్డ్ నుంచి రుణాలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఆర్థిక మాంద్యం నేపథ్యం లో రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధుల కేటాయింపులు కష్ట సాధ్యం కావడంతో ఈ మేరకు రుణాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. మొత్తంగా రూ.1,650 కోట్ల మేర రుణాలు తీసుకునేలా నాబార్డ్ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1,235 చెక్‌డ్యామ్‌లను నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం కాగా, వీటికి రూ.4,920 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంది. తొలి విడతగా ఈ ఏడాది గోదావరి బేసిన్లో 410, కృష్ణాబేసిన్‌లో 200 చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేయాలని తలపెట్టి ఇప్పటికే సాంకేతిక అనుమతులు ఇచ్చే ప్రక్రియ వేగిరం చేశారు. ఇలా 250 చెక్‌డ్యామ్‌లకు అనుమతులివ్వగా, 100 వరకు టెండర్లు పిలిచారు. మిగతా వాటికి టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వాటికి నిధుల కొరత లేకుండా ఈ మార్చి నెల వరకు నిర్మించే చెక్‌డ్యామ్‌ల అవసరాలకు రూ.150 కోట్లు, ఆ తర్వాత వార్షిక ఏడాదికి మరో రూ.1500 కోట్లు రుణాలు తీసుకునేలా చర్చలు జరుపుతోంది. దీనిపై మరో వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
అదనపు ఆదాయం ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్వేషణ మార్గాలను వెతుక్కునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో వచ్చే ఏడాది రాబడులు కూడా అం తంత మాత్రంగానే ఉంటా యనే అంచనాల నేపథ్యంలో వాస్తవిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్న సీఎం కేసీఆర్... బడ్జెట్ ప్రతిపాదనలకు తగినట్లు నిధులు రాబట్టుకోవడంపై దృష్టి పెట్టారు. బడ్జెట్ తయారీ సన్నాహక సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సలహాదారు జీఆర్ రెడ్డి తదితరులతో బడ్జెట్ రూపకల్పనపై నిర్వహిస్తున్న సమావేశాల్లో ఆయన ఈ మేరకు చర్చిస్తున్నారు. బడ్జెట్ నిర్వహణకు అడ్డంకులు కలగకుండా ఉండేందుకు అదనపు ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలపై అధికారులతో చర్చిస్తున్నారు. అం దులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్ను పెంపు అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ఆస్తిపన్ను పెంచడం ద్వారా స్థానిక సంస్థలకు సర్దుబాటు చేయాల్సిన నిధుల్లో వెసులుబాటు వస్తుందనే చర్చ జరిగింది. పల్లెలు, పట్టణాల్లో ప్రగతి పేరుతో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు పలు అభివృద్ధి కార్యకలాపాలు చేపట్టి ఠంచన్‌గా నెలవారీ నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రాకపోవచ్చనే అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైనట్లు సమాచారం. అయితే పన్ను పెంచడమా లేక లీకేజీలు లేకుండా పన్ను 100 శాతం వసూలు చేయడమా అనే అంశంపైనా చర్చ జరిగింది. గ్రామ పంచా యతీల విషయానికి వస్తే రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, నారాయణపేట, మంచిర్యాల లాంటి జిల్లాలు మినహా మిగిలిన చోట్ల ఇంటి పన్ను నామమాత్రంగానే వసూలవుతోందని, ఈ పన్నును సజావుగా రాబట్టుకోవడం ద్వారా ఏటా రూ.200 కోట్ల వరకు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు నిధులు సమకూర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, లీకేజీలు అరికట్టడమే లక్ష్యం గా గ్రామాలు, పట్టణాల్లో ఆస్తిపన్ను వసూలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై కొంత ఆర్థిక భారం తగ్గించుకోవచ్చనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఆస్తిపన్ను ప్రతి పాదనను సీఎం తోసిపుచ్చలేదని కూడా సమాచా రం. ఇక విద్యుత్ టారిఫ్ పెంపు అంశాన్నీ కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణ కేటగిరీలో ఉండే ప్రజలకు భారం పడకుండా విద్యుత్ చార్జీల ను పెంచుకోవడం ద్వారా డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తం నుంచి ప్రభుత్వానికి ఊరట కలుగుతుం దని, విద్యుత్ సబ్సిడీల రూపంలో ఇస్తున్న దాంట్లో దాదాపు రూ. 2 వేల కోట్ల భారం తగ్గించుకోవచ్చనే భావనతో త్వరలోనే చార్జీల పెంపునకు సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. భూముల విలువలు సవరిస్తే...! ఇక భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ అంశం కూడా ఆర్థిక శాఖ సమీక్షలో సీఎం చర్చించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రంలోని భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించలేదు. కారణమేదైనా రెండేళ్లకోసారి సవరించాల్సిన ఈ ధరలు ఆరేళ్లయినా మార్చలేదు. దీంతో ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ. వేల కోట్లలోనే ఆదాయం కోల్పోతోంది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులతోపాటు భూముల విషయంలో ప్రజల అభిప్రాయం కూడా రిజిస్ట్రేషన్ విలువల సవరణకు అనుకూలంగానే ఉంటుందనే చర్చ ఈ సమావేశంలో జరిగింది. దీంతో ఈ ఏడాది భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించాలని తద్వారా రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా నెలవారీ వచ్చే అదనపు ఆదాయంతో నెలవారీగా వచ్చే ఆర్థిక ఇబ్బందులను కూడా అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతోపాటు గతేడాది ప్రతిపాదించిన విధంగానే మరోమారు భూముల అమ్మకాలను కూడా ప్రతిపాదించాలనే దానిపైనా ఆర్థిక శాఖ అధికారులతో సీఎం చర్చించారు. ఈ ఏడాది కొత్తగా ఆపద్బంధు పథకం, కుట్టు మిషన్ల పంపిణీ లాంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండడంతోపాటు నెలనెలా పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ. 500 కోట్ల వరకు అవసరం అవుతున్నందున ఖజానాకు లోటు రాకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అవసరానికి తగినట్లు భూముల విక్రయాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. భూముల అమ్మకాల ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 10–12 వేల కోట్ల వరకు ఆదాయాన్ని రిజర్వు చేసుకోవాలని, మిగిలిన మార్గాల్లో కలిపి మొత్తం రూ. 20 వేల కోట్లను అదనంగా అందుబాటులో ఉంచుకొనే విధంగా ముందుకెళ్లాలని ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. -
వాస్తవిక బడ్జెట్!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో వాస్తవిక పరిస్థితులకు తగ్గట్లు 2020–21కి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. బడ్జెట్ రూపకల్పనపై సీఎం కేసీఆర్ సీనియర్ అధికారులతో గురువారం ప్రగతి భవన్లో రాత్రి 11:30 గంటల వరకు సుదీర్ఘ కసరత్తు చేశారు. రాష్ట్ర ఆదాయం, అవసరాలను బేరీజు వేసుకొని వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన జరగాలని అధికారులకు సూచించారు. ఎప్పటిలాగే ఈ బడ్జెట్లో సైతం వ్యవసాయం, నీటిపారుదల, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తూనే ఇతర రంగాలకు అవసరమైన మేర కేటాయింపులు చేయాలని కోరారు. కొత్త హామీల అమలుపై కసరత్తు... గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన వ్యవసాయ రుణాల మాఫీ, ఉద్యోగులకు పీఆర్సీ అమలు, వృద్ధాప్య పింఛన్ల అర్హత వయోపరిమితి 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు తదితర కార్యక్రమాలను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. వ్యవసాయ రుణమాఫీకి ఏటా రూ. 6 వేల కోట్లు, వృద్ధాప్య పింఛన్లకు వయో అర్హతలను 57 ఏళ్లకు తగ్గిస్తే కొత్తగా అర్హత సాధించనున్న 8.5 లక్షల మందికి పింఛన్ల పంపిణీకి ఏటా రూ.2,500 కోట్లతో పాటు ఉద్యోగులకు పీఆర్సీ అమలుకు అవసరమైన కేటాయింపులను సమీక్షించారు. వచ్చే బడ్జెట్లో ఈ మూడు హామీల అమలుకు నిధుల కేటాయింపులు జరపాలని ముఖ్యమంత్రి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 10–12% పెరగనున్న కేటాయింపులు... గత లోక్‌సభ ఎన్నికలకు ముందు రూ. 1.82 లక్షల కోట్ల అంచనాలతో 2019–20కి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికలు ముగిసిన తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలను రూ. 1.46 లక్షల కోట్లకు కుదించుకుంది. రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటుపై ఆర్థిక మాంద్యం ప్రభావం పడటంతో ప్రభుత్వం బడ్జెట్ అంచనాలను భారీగా కుదించుకోక తప్పలేదు. ఆర్థిక మాంద్యం ప్రభావం ఇంకా కొనసాగుతుండటంతోపాటు 2020–21కి సంబంధించిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాను కేంద్రం రూ. 19,718 కోట్ల నుంచి రూ. 15,987 కోట్లకు తగ్గించింది. వాటి ప్రభావం రాష్ట్ర బడ్జెట్‌పై పడనుంది. ఈ నేపథ్యంలో కేవలం 10–12 శాతం వృద్ధితో రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. రూ. 1.60 లక్షల కోట్ల నుంచి రూ. 1.65 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ రూపకల్పన చేసేందుకు ముఖ్యమంత్రి కసరత్తు నిర్వహించినట్లు తెలిసింది. దాదాపు 9.5 శాతానికిపైగా రాష్ట్ర ఆదాయాభివృద్ధి రేటు ఉండగా మిగిలిన నిధులను కోకాపేటలోని విలువైన ప్రభుత్వ భూములను విక్రయించడం ద్వారా సమీకరించాలని ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారు. ఈ భూముల విక్రయం ద్వారా రూ. 10 వేల కోట్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించనున్నామని ఈ బడ్జెట్లో మరోసారి ప్రతిపాదించబోతున్నారు. మార్చి 6 నుంచి బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చి 6 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. మార్చి 6 నుంచి నెలాఖరు వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశముంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలను ఖరారు చేసే అంశంపై సీఎం కేసీఆర్ అధికారులతో చర్చించినట్లు తెలిసింది. మరో 2, 3 రోజులపాటు సీఎం బడ్జెట్ రూపకల్పనపై కసరత్తు నిర్వహించనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. సీఎంతో సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రొనాల్డ్ రోస్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్‌రావు, ఆర్థిక సలహాదారు జీఆర్.రెడ్డి, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక మాంద్యం లేదు
సాక్షి, అమరావతి: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మాదిరే మన రాష్ట్రంలోనూ ప్రభుత్వ ఆదాయం కొంత మేర తగ్గింది తప్పితే, ఆర్థిక మాంద్యం (రెసిషన్) వంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో మంత్రి జవాబిచ్చారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాదిలో కేవలం 8 శాతం మాత్రమే ప్రభుత్వ ఆదాయం తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగని కారణంగా కేంద్రం నుంచి విడుదల కావాల్సిన నిధులు నిలిచిపోయాయని, ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులు తక్కువగా ఉండడం వంటి కారణాలతో ఆదాయం తగ్గిందని చెప్పారు. నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలో మాత్రం గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఆ కాలానికి కేవలం నాలుగు శాతం మాత్రమే తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం తమ ప్రభుత్వానికి దాదాపు రూ. 60 వేల కోట్ల బిల్లుల బకాయిలు పెట్టిపోయిందని చెప్పారు. ఈ ఆరు నెలల్లో తమ ప్రభుత్వం రూ. 20 వేల కోట్ల బకాయిలు చెల్లించిందని చెప్పారు. రాష్ట్ర కాగా, తమ సూచనలు వినాలని నాలెల్జ్ తెచ్చుకోవాలని టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బుగ్గన మండిపడ్డారు. నియోజకవర్గం అభివృద్ధి పనుల గురించి అప్పటి విపక్ష సభ్యులు అప్పటి సీఎంను కలిస్తే, తమ పార్టీ వాళ్లు కాదని, నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పారని తెలిపారు. రంగులపై మీరా విమర్శించేది?: పెద్దిరెడ్డి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్మశానం గోడలకూ ఆ పార్టీ రంగులు వేయించిందని.. ఇప్పుడు ఆ పార్టీ నేతలు సచివాలయ భవనాల రంగులపై తమ పార్టీని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నట్టు జాతీయ జెండాకు ఎక్కడా వైఎస్సార్సీపీ రంగు వేయలేదని వివరించారు. సర్పంచుల ఆధ్వర్యంలోనే గ్రామ సచివాలయాలు పనిచేస్తాయని, సచివాలయ భవనాలలోనూ సర్పంచికి ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసినట్టు వివరించారు. మార్చిలోగా ఇమామ్‌లకు ఇళ్ల స్థలాలు: అంజాద్ బాషా అర్హత గల ఇమామ్‌లు, మౌజన్లకు వచ్చే ఏడాది మార్చిలోగా ఇళ్ల స్థలాలను కేటాయించి, రిజిస్టర్ చేయిస్తామని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా శాసనమండలిలో చెప్పారు. రాష్ట్రంలో సుమారు 9,000 మంది ఇమామ్‌లు, మౌజన్లు ఉన్నారని చెప్పారు. రాష్ట్ర రాజధానిలో కొత్తగా హజ్ హౌస్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం రెండు మూడు స్థలాలు పరిశీలనలో ఉన్నట్టు తెలిపారు. -
భారత్‌లో మాంద్యం లేదు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థలో మాంద్యం లేదని ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించి వుండవచ్చుకానీ మాంద్యంలోకి మాత్రం జారిపోదని ఆమె స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆర్థిక వ్యవస్థపై జరిగిన చర్చకు ఆమె ఈ సమాధానం ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి తన మొదటి బడ్జెట్లో పలు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆయా అంశాలు సత్ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయని వివరించారు. ఆటోమొబైల్ వంటి కొన్ని రంగాలు రికవరీ బాటన నడుస్తున్న సంకేతాలు వస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదాయ పరిస్థితులపై ఆందోళనలు అక్కర్లేదని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలలనూ (2019 ఏప్రిల్–అక్టోబర్) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, అటు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఇటూ వస్తు, సేవల పన్ను వసూళ్లు పెరిగాయని ఆర్థికమంత్రి తెలిపారు. అయితే కాంగ్రెస్, టీఎంసీ, వామపక్ష పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని వల్లెవేస్తున్నారు తప్ప, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టడం లేదని ఆయా పార్టీలు విమర్శించాయి. వరుసగా రెండు త్రైమాసికాలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) పెరక్కపోగా, మైనస్‌లోకి జారితే దానిని మాంద్యంగా పరిగణిస్తారు. ఆర్థిక మంత్రి సమాధానంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి చర్యనూ తీసుకోవడం జరుగుతోంది. ► యూపీఏ–2 ఐదేళ్ల కాలంతో పోల్చిచూస్తే, 2014 నుంచీ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. ద్రవ్యోల్బణం అదుపులో నిర్దేశిత శ్రేణి (2 శాతం ప్లస్ లేదా మైనస్ 2తో)లో ఉంది. ఆర్థిక వృద్ధి తీరు బాగుంది. ఇతర ఆర్థిక అంశాలు కూడా బాగున్నాయి. ► గడచిన రెండేళ్లలో స్థూల దేశీయోత్పత్తి మందగించిన మాట వాస్తవం. అయితే ఇందుకు రెండు కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి బ్యాంకింగ్ మొండిబకాయిల భారం. రెండవది కార్పొరేట్ భారీ రుణ భారం. ఈ రెండు అంశాలూ యూపీఏ పాలనా కాలంలో ఇచ్చిన విచక్షణా రహిత రుణ విపరిణామాలే. ► జూలై 5 బడ్జెట్ తరువాత బ్యాంకింగ్‌కు రూ.70,000 కోట్ల అదనపు మూలధన మంజూరు జరిగింది. దీనితో బ్యాంకింగ్ రుణ సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ► బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత) సమస్య లేదు. ► దివాలా కోడ్ వంటి సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ సెంట్రల్ జీఎస్టీ వసూళ్లు రూ.3.26 లక్షల కోట్లు. బడ్జెట్ అంచనాలు రూ.6,63,343 కోట్లలో అక్టోబర్ ముగిసే నాటికి దాదాపు సగం వసూళ్లు జరిగాయి. కాగా ప్రత్యక్ష పన్నుల వసూళ్ల బడ్జెట్ లక్ష్యం రూ.13,35,000 కోట్లయితే, అక్టోబర్ ముగిసే నాటికి నికర వసూళ్లు రూ.5,18,084 కోట్లుగా ఉన్నాయి. ► 2014–15లో జీడీపీలో ప్రత్యక్ష పన్నుల నిష్పత్తి 5.5 శాతం ఉంటే, 2018–19లో ఈ నిష్పత్తి 5.98 శాతానికి పెరిగింది. ► 2009–14 మధ్య విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం 189.5 బిలియన్ డాలర్లయితే, తరువాతి ఐదేళ్లలో ఈ మొత్తం 283.9 బిలియన్ డాలర్లుగా ఉంది. ► 2020 ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాలుష్య ప్రమాణాలు ప్రస్తుత బీఎస్ 4 నుంచి బీఎస్ 6కు మారాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో వాహన రంగంలో ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. అయితే, ప్రభుత్వ చర్యలతో క్రమంగా ఈ రంగం రికవరీ బాట పడుతోంది. -
మాంద్యం ఎఫెక్ట్ : ‘ఇళ్లు’.. డల్లు..
యాదాద్రి దేవాలయం ఆధునీకరణతో భువనగిరి, యాదగిరిగుట్ట, బీబీనగర్, రాయగిరి, చౌటుప్పల్ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల అమ్మకాలు గత రెండేళ్ల కాలంగా జోరందుకున్నాయి. కానీ, ఈ ఏడాది జనవరి నుంచి అక్కడి రియల్ రంగం కుదేలైంది. రోజూ వందల సంఖ్యలో జరిగే క్రయ విక్రయాలు ఇప్పుడు పదుల సంఖ్యకు తగ్గిపోయాయి. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థిక మాంద్యం.. ఈ రంగాన్ని కుదిపేస్తోంది. గత మూడు, నాలుగు నెలలుగా ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు నిలిచిపోవ డంతో రియల్ వ్యాపారులు బెంబేలెత్తు తుండగా.. ఈ రంగాన్నే నమ్ముకున్న ఏజెంట్లు ఆదాయం లేక అల్లాడుతు న్నారు. ఔటర్ రింగు రోడ్లు లోపల, బయటా, రీజనల్ రింగ్ రోడ్డు ప్రతి పాదిత ప్రాంతాలు, ఖరీదైన నగర శివా ర్లుగా పేరొందిన మాదాపూర్, గచ్చి బౌలి, నానక్‌రాంగూడ, నార్సింగి, కోకా పేట తదితర ఏరియాలూ మాంద్యం కుదుపునకు గురయ్యాయి. బ్రాండెడ్ కంపెనీలు సైతం తమ లగ్జరీ ఫ్లాట్లు అమ్ముకునేందుకు పడరాని పాట్లు పడు తున్నాయి. ఆర్థిక మాంద్యం రియల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని, మూడో వంతు కొనుగోళ్లు తగ్గిపోయా యని ప్రముఖ రియల్ సంస్థ అధ్యయ నంలో తేలింది. వచ్చే ఏడాది జూన్ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని ప్రముఖ నిర్మాణ సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ ఒకరు చెప్పారు. ఎందుకీ పరిస్థితి? ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు రియల్ ఎస్టేట్ సీజన్ కొంత మేర తగ్గినా ఈ స్థాయిలో తగ్గుదలకు ఆర్థిక మాంద్యమే కారణమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు, అప్పులు ఇచ్చే వాళ్లు తగ్గిపోవడంతో పాటు ఒకే ఏడాదిలో భారీగా స్థలాల రేట్లు పెరిగి పోయాయని.. సంవత్సరానికి ఒకటి, రెండు రెట్లు పెరగాల్సి ఉండగా, ఏకంగా నాలుగైదు రేట్లు పెరిగిపోవడంతో కొనుగోళ్లు నిలిచిపోయాయని వివరిస్తున్నారు. ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్)లో ఔటర్ రింగ్‌రోడ్డు ఆవల గజ్వేల్, భువనగిరి, వలిగొండ, చౌటుప్పల్, నారాయణపూర్, మర్రిగూడ, చింతపల్లి, మాల్, షాద్‌నగర్, చేవెళ్ల, కంది ప్రాంతాల్లో కొనుగోళ్లు, అమ్మకాలు పెద్ద స్థాయిలోనే జరిగాయి. కొందరు బడా కాంట్రాక్టర్లు కూడా ఈ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌ను ఎంచుకోవడంతో స్థలాల రేట్లు విపరీతంగా పెరిగాయి. కానీ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ప్రతిపాదన పక్కకు జరిగిందన్న ప్రచారంతో ఈ ప్రాంతాల పరిధిలో స్థలాల కొనుగోలుకు, వెంచర్లు చేసేందుకు ఏవరూ ధైర్యం చేయడంలేదు. తగ్గిన రిజిస్ట్రేషన్లు.. ఆర్థిక మాంద్యం కారణంగా రియల్ కార్యకలాపాలు తగ్గిపోయాయనే విషయం రిజిస్ట్రేషన్ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రంలో ఎక్కువగా రిజిస్ట్రేషన్లు జరిగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గత నాలుగైదు నెలల రిజిస్ట్రేషన్ లావాదేవీలను పరిశీలిస్తే క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో గతేడాది ఏప్రిల్‌లో 2,135 లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,816కి తగ్గిపోయింది. సెప్టెంబర్ విషయానికి వస్తే 2018లో 1,859 లావాదేవీలు జరగ్గా ఇప్పుడు 1,296కు పడిపోయింది. ఇక రంగారెడ్డి జిల్లాలో గత ఏడాది ఏప్రిల్‌లో 33,013 రిజిస్ట్రేషన్ లావాదేవీలు జరిగితే ఈ ఏడాది ఏప్రిల్‌లో 31,831 మాత్రమే నమోదయ్యాయి. ఆ తర్వాత నుంచి క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. సెప్టెంబర్‌లో అక్కడ రిజిస్ట్రేషన్ల సంఖ్య 27,492కు పడిపోయింది. అవి కూడా కొత్త కొనుగోళ్లకు సంబంధించినవి కావని, గతంలో జరిగిన ఒప్పందాల మేరకు జరిగిన రిజిస్ట్రేషన్లతో పాటు లీజ్ డాక్యుమెంట్లు ఎక్కువగా వస్తున్నాయని రిజిస్ట్రేషన్ల శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరుపైనే అధిక ప్రభావం.. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలపై ఇటీవల అన్‌రాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ అనే సంస్థ చేసిన అధ్యయనంలో హైదరాబాద్‌లో అమ్మకాలు ఘోరంగా తగ్గిపోయిన విషయం వెల్లడైంది. మన రాజధానిలో ఏకంగా 32–35 శాతం ఇళ్ల అమ్మకాలు పడిపోయాయని తేలింది. ఆ మూడు నెలల్లో (జూలై– సెప్టెంబర్) కేవలం 3వేల యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని, గతేడాది ఇదే సమయానికి 10 వేలకు పైగా అమ్మకాలు జరిగాయని ఈ సంస్థ పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఏడు నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయని.. అందులో హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఎక్కువ ఆర్థిక మాంద్యం ప్రభావానికి గురయ్యాయని వివరించింది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ సంస్థలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఈ రెండు నగరాల్లో ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలు పడిపోవడం పట్ల బడా నిర్మాణ సంస్థలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవానికి, దేశంలో ఆర్థిక మాంద్యం ప్రారంభమైన నాటి నుంచే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 9 శాతం అమ్మకాలు పడిపోగా, రెండో త్రైమాసికంలో అది సగటున 18 శాతానికి తగ్గింది. ఈ రెండు త్రైమాసికాలే కాకుండా వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు ఆర్థిక మాంద్యం ప్రభావం ఉంటుందని మరో ప్రముఖ ఆర్థిక సంస్థ నిర్వహించిన అధ్యయనం పేర్కొంది. కొనేవారు కరువు ‘ఆరు నెలల క్రితం వరకు నెలకు కనీసం నాలుగు ప్లాట్లు అమ్మించేవాడిని. ఆర్ధిక మాంద్యం ప్రభావం వల్ల భూములు అమ్మేవారు ఉన్నా.. కొనేవారు ముందుకు రాకపోవడంతో ఒక్క ప్లాట్ కూడా అమ్ముడుపోవడం లేదు. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువ మంది బ్యాంకుల్లో డబ్బులు నిల్వ ఉంచడం కంటే భూములపై పెట్టుబడులు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అసాధారణ ధరలకు స్థలాలు, భూములు కొనుగోలు చేశారు. దీంతో ప్రజల దగ్గర ఉన్న డబ్బులో అధిక శాతం ఖర్చయిపోయింది. ప్రస్తుతం ఎక్కడో ఒకచోట అమ్మితేనే మరోచోట కొనడానికి అవకాశం ఉంది. కానీ కొనేవారే దొరకడం లేదు. గతంలో పలికిన రేటు తగ్గించి చెప్పినా కొనడానికి ముందుకు వచ్చేవారు లేరు.’ – సామ భీంరెడ్డి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ జనవరి వరకు ఇలాగే ఉండొచ్చు ‘రియల్ ఎస్టేట్ రంగంలో కొంత స్తబ్దత ఉంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. యూరోప్, అమెరికా తదితర దేశాల్లో ఇప్పుడు అంతా హాలిడే మూడ్ ఉంటుంది. పెట్టుబడులు మన దేశానికి పెద్దగా రావు. దీంతోపాటు ఆర్థిక మాంద్యం కారణంగా మార్కెట్లో ‘క్యాష్ క్రంచ్’ ఏర్పడింది. మూడు నెలల క్రితం వరకు మార్కెట్ బాగానే ఉన్నా ప్రస్తుతం ప్లాట్ల అమ్మకాలు 50శాతం పడిపోయాయి. అగ్రిమెంట్లు జరిగినా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ముందుకు రావడంలేదు. ఈ పరిస్థితి జనవరి వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది.’ – లక్ష్మీనారాయణ, సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎండీ -
నేలచూపులు ఇదే రియల్
సాక్షి, హైదరాబాద్: స్థిరాస్తి రంగంలో స్తబ్ధత నెలకొంది. ఆర్థిక మాంద్యం.. నింగినంటిన ధరలతో రియల్టీ నేల చూపులు చూస్తోంది. అక్కడక్కడా లావాదేవీలు జరుగుతున్నా.. గతంలో చేసుకున్న ఒప్పందాలే తప్ప.. కొత్త కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం రియల్ ఎస్టేట్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపింది. అసాధారణంగా పెరిగిన ధరలు కూడా కొనుగోలుదారులు వెనక్కి తగ్గేలా చేశాయి. మరోవైపు ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్)పై నీలినీడలు కమ్ముకున్నట్లు వార్తలు రావడంతో రియల్‌రంగం పతనానికి కారణమైంది.ఈ రహదారి నిర్మాణంతో మహర్దశ పడుతుందని ఆశించిన సామాన్య, మధ్యతరగతి ప్రజలతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకున్న వారు హైదరాబాద్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ప్లాట్లు, వ్యవసాయ భూములపై పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపారు. దీంతో మహబూబ్‌నగర్, ఆలంపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, దేవరకొండ, మిర్యాలగూడ, నకిరేకల్, కామారెడ్డి, సిద్దిపేట, జనగామ, జహీరాబాద్, తాండూరు తదితర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు కాకముందే బ్రోకర్ల మాయాజాలంతో ధరలు ఆకాశన్నంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరనందున ప్రతిపాదిత రహదారి అటకెక్కినట్లేనన్న ప్రచారం.. రియల్ మార్కెట్æ భారీ కుదుపునకు గురిచేసింది. దీంతో అప్పటివరకు దూకుడు మీద ఉన్న వ్యాపారం చతికిలపడింది. అగ్రిమెంట్లు చేసుకొని అమ్ముకుందామనే దశలో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో ఆర్థికంగా బాగా నష్టపోతున్నారు. ఆర్థిక మాంద్యంతో కుదేలు! ఆర్థిక మాంద్యం స్థిరాస్తి రంగాన్ని కుదేలు చేస్తోంది. ప్రచార, ప్రసారమాధ్యమాల్లో ఈ మాంద్యం ప్రభావం తీవ్రంగా ఉండనుందనే ప్రచారం కూడా దీనికి తోడు కావడంతో ఇళ్ల స్థలాలు, భూముల కొనుగోళ్లు దాదాపు నిలిచిపోయాయి. అటు నిర్మాణ రంగంలోనూ ఈ ప్రభావం కన్పిస్తోంది. నిర్మాణ ఖర్చులు పెరిగిపోవడంతో విల్లాలు, ఫ్లాట్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ధరలకు అనుగుణంగా కొనుగోళ్లు లేకపోవడంతో గృహాల అమ్మకాల్లో తగ్గుదల కనిపిస్తోంది. ఈ తరుణంలో విల్లాలు, ఫ్లాట్ల నిర్వహణ వ్యయం భారీగా ఉండటంతో పాటు ఆర్థిక స్థోమతను దృష్టిలో పెట్టుకొని కొనుగోలుదారులు స్థలాల కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్ల అమ్మకాల్లో క్షీణత కనిపిస్తోంది. ఎడాపెడా పెట్టుబడులు! స్థిరాస్తిరంగం కాసులు కురిపిస్తుండటంతో బడాబాబులు, సంపన్నవర్గాల పెట్టుబడులకు ఇది కేంద్రబిందువుగా మారింది. దీనికి తోడు కేంద్రం బ్యాంకు లావాదేవీలపై నియంత్రణ విధించడంతో నల్లధనం కూడా వెల్లువలా వచ్చింది. దీంతో భూముల విలువ అమాంతం చుక్కలను తాకాయి. తాజాగా నెలకొన్న పరిస్థితులతో పెట్టుబడులపై సంపన్న వర్గాలు కూడా ఆచీతూచీ అడుగేస్తుండటం కూడా రియల్ రంగం ఒడిదుడుకులకు కారణంగా చెబుతున్నారు. 20% అధిక ఆదాయం.. ఆషాఢమాసంలో రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.500 కోట్ల ఆదాయం చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే గతేడాదితో పోలిస్తే 20 శాతం అధికంగా రూ.2,250 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇళ్ల కొనుగోలుపై దృష్టి చూపని వారంతా స్థలాలు, వ్యవసాయ భూముల కొనుగోలు వైపు మళ్లుతున్నట్లు అర్థమవుతోంది. కాగా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఇబ్రహీంపట్నం(సబ్‌రిజిస్ట్రార్)లో గత మూడు నెలలుగా భూముల క్రయవిక్రయాలు తగ్గుముఖం పట్టినట్లు నమోదైన రిజిస్ట్రేషన్ల సంఖ్యను బట్టి తెలుస్తోంది. టీసీఎస్, లాజిస్టిక్ పార్క్, ఫార్మాసిటీ, బీడీఎల్, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, కొత్త కలెక్టరేట్‌తో ఇక్కడ కొన్నాళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగింది. ఆర్థిక మాంద్యం, అమాంతం పెరిగిన ధరలు ఈ ప్రాంతంలోనూ తీవ్ర ప్రభావం చూపినట్లు రిజిస్ట్రేషన్లను బట్టి తెలుస్తోంది. మూడు నెలల్లో ఏకంగా వేయి డాక్యుమెంట్లు తగ్గిపోగా.. రూ.60 లక్షల ఆదాయంలోను తేడా వచ్చింది. -
ఆటో రయ్.. రయ్..
సాక్షి, అమరావతి : కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా ఆటో మొబైల్ అమ్మకాలు భారీగా క్షీణిస్తున్న దశలో రాష్ట్రంలో మాత్రం ఆటోల అమ్మకాలు పెరగడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమ అమ్మకాలు 15.89 శాతం మేర క్షీణించినట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో మన రాష్ట్రంలో ఈ క్షీణత కేవలం 9.4 శాతానికి మాత్రమే పరిమితమైంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఐదు నెలల కాలానికి ద్విచక్ర వాహనాల దగ్గర నుంచి భారీ వాహనాల వరకు దేశ వ్యాప్తంగా అమ్మకాలు 1.15 కోట్ల నుంచి 97.31 లక్షలకు పడిపోయాయి. కానీ ఇదే సమయంలో రాష్ట్రంలో అమ్మకాలు 5.10 లక్షల నుంచి 4.62 లక్షలకు మాత్రమే తగ్గాయి. ఆటో అమ్మకాల్లో భారీ వృద్ధి ఆర్థిక మాంద్యంతో ఒకపక్క వాహనాల విక్రయాలు తగ్గుతుంటే రాష్ట్రంలో ఆటో అమ్మకాలు 17.18 శాతం పెరగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గడిచిన ఐదు నెలల్లో రాష్ట్రంలో 20,139 ఆటోలు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో అమ్ముడైంది 17,187 మాత్రమే. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఆటోల అమ్మకాలు 2,33,865 నుంచి 2,16,907కు పడిపోవడంతో 7.25 క్షీణత నమోదైంది. మందగమనం నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన వారు ఆటోలు నడుపుకోవడానికి ఆసక్తి చూపిస్తుండటంతో పాటు, విజయవాడలో సీఎన్జీ ఆటోలను ప్రవేశపెట్టడం వల్ల అమ్మకాలు పెరిగాయని డీలర్లు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం మీద కార్లు, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు భారీగా పడిపోయాయి. కార్ల అమ్మకాలు 21 శాతం, సరుకు రవాణా వాహనాలు 24 శాతం, ప్యాసింజర్ల వాహనాల అమ్మకాలు 14.64 శాతం మేర క్షీణించాయి. రాష్ట్రంలో నిర్మాణ రంగ పనులు మందగించడం వాణిజ్య వాహనాల అమ్మకాలు తగ్గడానికి కారణమని డీలర్లు పేర్కొంటున్నారు. దసరా, దీపావళిపై ఆశలు గత నాలుగు నెలల నుంచి అమ్మకాలు తగ్గుతుండటంతో వచ్చే దసరా, దీపావళి పండుగలపై డీలర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ – అక్టోబర్ పండుగల సమయంలో కృష్ణా జిల్లాలో 4,000 ద్విచక్ర వాహనాలు విక్రయిస్తే సెప్టెంబర్ ముగుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 700 మాత్రమే విక్రయించామంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ సంస్థ ప్రతినిధి వాపోయారు. ప్రస్తుతం పండగల సీజన్‌కు తోడు కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను భారీగా తగ్గించడంతో భారీ డిస్కౌంట్లు ఇవ్వడానికి ఆయా సంస్థలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇంతకాలం పన్నులు తగ్గుతాయని కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వారు ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు లేదనే స్పష్టత రావడంతో అమ్మకాలు పుంజుకుంటాయని భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు వచ్చినా.. పెట్రోలు, డీజిల్ వాహనాలను రద్దుచేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టత ఇవ్వడం వల్ల కూడా అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. పండగల తర్వాత పరిశ్రమ కోలుకుంటుందన్న ఉద్దేశంతో గత నాలుగు నెలలుగా అమ్మకాలు లేకపోయినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగిస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. పండగల తర్వాత పరిస్థితిలో మార్పు లేకపోతే అప్పుడు ఉద్యోగుల తొలగింపు గురించి ఆలోచించాల్సి వస్తుందన్నారు. సంక్షోభంలో విస్తరిస్తాం... ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం సంక్షోభం వల్ల చిన్న డీలర్లు భారీగా దెబ్బ తింటున్నారు. దేశ వ్యాప్తంగా 15,000 మందికి పైగా డీలర్లు ఉంటే ఇప్పటి వరకు 300 మంది వరకు డీలర్‌షిప్‌లు వదులుకున్నారు. అమ్మకాలు లేక, బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్ అందక చిన్న డీలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరుణ్ మోటార్స్ ఎప్పుడూ ఇటువంటి సంక్షోభాల సమయంలోనే భారీగా విస్తరణ కార్యక్రమాలు చేపట్టేది. ఈ సమయంలో తయారీ సంస్థల నుంచి ఆఫర్లు బాగుంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. ఒకటి రెండు నెలల్లో పరిస్థితులను గమనించాకే విస్తరణపై ఒక స్పష్టత వస్తుంది. – ప్రభుకిషోర్, చైర్మన్, వరుణ్ గ్రూపు -
పరిశ్రమ డీలా..
సాక్షి, సంగారెడ్డి: పటాన్చెరు నియోజకవర్గంలో వేలాది పరిశ్రమలు ఉన్నాయి. సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పరిశ్రమలు వెలిశాయి. స్థానికులకు ఉపాధి అవకాశాలు దొరకడంతోపాటు బీహర్, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులు పరిశ్రమల్లో పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యంతో నాలుగు, ఐదు రోజులు మాత్రమే పని దినాలు కల్పిస్తున్నారు. దీంతో కార్మికులు జీవనోపాధి పొందడానికి ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని మహీంద్ర అండ్ మహీంద్ర ఆర్థిక మాంద్యం ప్రభావంతో సుమారు 30 శాతం ఉత్పత్తి తగ్గించిందని యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. వెయ్యి మంది కార్మికులు ఉపాధికి దూరమయ్యారని వారు తెలిపారు. ఈ పరిశ్రమపై ఆధారపడిన అవంతి, పోలాల్ లాంటి చిన్న పరిశ్రమలు మూత పడే పరిస్థితిలో ఉన్నాయి. ఎంఆర్ఎఫ్లో కాంట్రాక్టు కార్మికులకు వారానికి మూడు రోజుల వీక్లీ ఆఫ్ ఇస్తున్నారు. దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీఐడీసీ పరిశ్రమలో ఉత్పత్తి సగానికి పడిపోయింది. దీంతో నాలుగు వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సుమారు 250 పరిశ్రమల్లో ఆర్థిక మాంద్యం ప్రభావంతో మూతపడే దశలో ఉన్నాయి. ఆటోమొబైల్ రంగానికి పొంచి ఉన్న ప్రమాదం.. ఆర్థిక మాంద్యంతో ఆటోమోబైల్ రంగాలపై ఆధారపడిన పరిశ్రమలకు ప్రమాదం పొంచి ఉంది. ఈ పరిశ్రమల్లో తయారు చేసిన ఉత్పత్తులు అమ్మకాలు జరగడం లేదు. ఈ పరిశ్రమలపై ఆధారపడిన చిన్న తరహా పరిశ్రమల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. కార్మికులకు ఉపాధి లేకుండా పోతోంది. దీంతో వేరే రంగాలకు వెళ్లలేక వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 20 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోవడంతో వారి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. -
బీజేపీ స్వయంకృతం
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మాని... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం బీజేపీ స్వయంకృతమని, అన్ని అంశాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే వృద్ధిరేటు మందగమనంలో సాగుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం.. ఆర్థిక మాంద్యం కొనసాగుతోందనేందుకు సూచన అని ఆయన చెప్పారు. ఇంతకంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక వేత్తలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. తయారీ రంగం వృద్ధి 0.6 శాతం మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో లోపాల ఫలితాల నుంచి దేశం బయటపడలేదు అనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు. మోదీ హయాంలో దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, వాటి స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్బీఐ నుంచి అందిన రూ.1.76 లక్షల కోట్లతో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నది నిజమైతే... ఆర్బీఐకు పరీక్షేనని అన్నారు. పన్ను ఆదాయంలో భారీ కోత పడగా.. చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల వేధింపులకు గురవుతున్నారన్నారు. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని, గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
సంక్షోభంలో డైమండ్ బిజినెస్
సాక్షి, గుజరాత్ : ఓ పక్క బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతుంటే మరోపక్క డైమండ్ పరిశ్రమ రాను రాను సంక్షోభంలో కూరుకుపోతోంది. మరోసారి మాంద్యం పరిస్థితులు, అటు పరిశ్రమను, ఇటు కార్మికులను చుట్టుముడుతోంది. ప్రధానంగా సూరత్‌లోని వజ్రాల పరిశ్రమ మాంద్యం కారణంగా అత్యంత ఘోరమైన దశలను ఎదుర్కొంటోంది. ఆభరణ పరిశ్రమ రంగంలో సూరత్ భారత దేశానికి మార్గదర్శిగా ఉన్న విషయం తెలిసిందే. ఆర్థిక మాంద్యానికి తోడు డైమండ్ వ్యాపారుల స్కాంలు బ్యాంకులను భయపెడుతున్నాయి. డైమండ్ కింగ్, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, జతిన్ మెహతాల కుంభకోణాల తరువాత బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతోపాటు నోట్ల రద్దు, జీఎస్టీ పరిశ్రమపై ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. దీంతో డిమాండ్ తగ్గి భారీగా నష్టపోతున్న డైమండ్ వ్యాపారం దాదాపు మరణశయ్యపై కునారిల్లుతోంది. ఇప్పటికే ఉద్యోగాన్నికోల్పోయిన సూరత్ వజ్రాల కార్మికుడు సుభాష్ మన్సూరియా స్పందిస్తూ తాను ఉద్యోగం వదిలి రెండు నెలలయిందని తన కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆరు సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్న తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు. కనీసం తాను చేసిన పనికి సరైన వేతనం కూడా చెల్లించలేదని యూనియన్ల సహకారంతో తాను వేతనం పొందానని అన్నారు. ఇదంతా తమ దురదృష్టమని వాపోయారు. తేజస్ పటేల్ అనే మరో వజ్ర ఉద్యోగి మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే రంగాన్ని నమ్ముకున్నానని అన్నారు. ప్రస్తుతం 18,000తో తన కుటుంబాన్ని పోషిస్తున్నానన్నారు. తాను పెద్దగా చదువుకోలేదని ఏ రంగంలో నైపుణ్యం లేదని భవిష్యత్ గురించి తలచుకుంటేనే భయమేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు సంఘటితం కాకపోవడం బాధాకరమని తమ హక్కుల గురించి పోరాడే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది ఉపాది కోల్పోగా కేవలం సూరత్ నుంచే13వేల మంది ఉండడం గమనార్హం. గత జనవరినుంచి చాలా కంపెనీల యజమానులు ఉద్యోగులను, పని గంటలను తగ్గించుకుంటున్నాయని చెప్పారు. కఠిన పరీక్షలను ఎదుర్కొంటున్నాం నీరవ్ మోడీ, చోక్సీ, జతిన్ మెహతాల అవినీతి ఆరోపణల కారణంగానే బ్యాంకులు వజ్ర పరిశ్రమకు రుణాలు ఇవ్వట్లేదని శ్రేయాన్ బిజినెస్ పేర్కొంది. అందుకే వజ్ర వ్యాపారాన్ని వృద్థిలోకి తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల ఎగ్జిబిషన్‌ను నిర్వహించామని సూరత్ డైమండ్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని డైమండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రన్మల్ జిలారియా తెలిపారు. ఇప్పటికే 900 మందికి పైగా ఉద్యోగాలు కోల్పాయన్నారు. కంపెనీలు కనీసం నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నాయన్నారు. ఉపాధి కోల్పోయిన వారి వివరాలను సేకరిస్తున్నామని, ప్రభుత్వమే తమ ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని కోరారు. కాగా సూరత్‌లో భారీ, సూక్ష్మ స్థాయి పరిశ్రమలు వజ్రాల వ్యాపారంలో ప్రముఖంగా ఉండగా దాదాపు 6 లక్షల మందికిపైగా ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారు. గత పదేళ్ళ కాలంలో రెండవసారి మాంద్యం ముప్పు ముంచుకొస్తుండడం ఆందోళన పుట్టిస్తోంది. 2017 దీపావళి తరువాత, అనేక వజ్రాల పరిశ్రమలు పనిచేయడం మానేశాయి. వాటిలో 40 శాతం మూతపడ్డాయి. 2018లో సుమారు 750 మంది ఉద్యోగులను తొలగించారు. గుజరాత్ డైమండ్ వర్కర్స్ యూనియన్ లెక్కల ప్రకారం, 2018లో 10 మందికి పైగా డైమండ్ ఆభరణాల చేతివృత్తులవారు ఉద్యోగం కోల్పోయిన తరువాత ఆత్మహత్య చేసుకున్నారు. -
మిస్టర్ పీఎం.. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తోంది
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక మందగమనం తొలగిపోయే సూచనలే కనిపించడం లేదన్న ఓ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ.. దేశంలోకి ఆర్థిక మాంద్యం పూర్తిస్థాయిలో ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసమర్థురాలని విమర్శించిన రాహుల్.. త్వరలోనే ఈ మాంద్యం నుంచి బయటపడతామని ఆమె చెప్తే నమ్మవద్దని, మందగమనం నుంచి మాంద్యం శరవేగంగా ముంచుకొస్తుందని ఆయన ట్వీట్ చేశారు. -
నల్లధనమే ఆ సంక్షోభం నుంచి బయటపడేసింది!
పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ.. అభినందిస్తూ పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తుండగా.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం వివాదాస్పదమైన కామెంట్లు చేశారు. ప్రపంచ ఆర్థికసంక్షోభం సమయంలో భారత ఆర్థికవ్యవస్థను బ్లాక్మనీనే రక్షించిందని నిపుణులు అభిప్రాయం పడ్డారని ఆయన మంగళవారం పేర్కొన్నారు. "నల్లధనం ఉత్పత్తి చేయరాదు. ఈ విషయంలో నేను చాలా క్లారిటీగా ఉన్నా. కానీ ప్రపంచమంతా ఆర్థికసంక్షోభంలో కూరుకున్నప్పుడు భారత్ ఆ పరిస్థితుల నుంచి బయటపడేసింది మాత్రం నల్లధనమే. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి సమాంతరంగా భారత్‌లో బ్లాక్‌మనీ ఉండటమే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేశారు'' అని అఖిలేష్ పేర్కొన్నారు. తాను బ్లాక్‌మనీని వ్యతిరేకిస్తున్నానని, తనకు అసలు ఆ డబ్బే వద్దని వాఖ్యానించారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆకస్మాత్తు నిర్ణయంపై స్పందించిన ఆయన ఈ కామెంట్లు చేశారు. బ్లాక్‌మనీని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రజలు బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద భారీ క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వం చాలా కష్టాలను విధిస్తుందని విమర్శించారు. బ్లాక్‌మనీని చెక్ చేయడానికి ఈ నోట్ల రద్దు ఏమీ ప్రయోజనం కలిగించదని వ్యాఖ్యానించారు. అవినీతిని చెక్ చేయడానికి మాత్రం ఇది ఓ మంచి చర్యఅని, అవినీతికి పాల్పడకూడదనే విషయంపై చాలామంది ప్రజలు అవగాహన పొందుతారని పేర్కొన్నారు. కానీ ఎవరైతే నల్లధనాన్ని రూ.500, రూ.1000 నోట్లలో దాచిపెట్టుకుని ఉంటారో, వారు మాత్రం ప్రస్తుతం రూ.2,000 నోట్ల కోసం వేచిచూస్తున్నారని అఖిలేష్ తెలిపారు. -
స్టీవ్ జాబ్స్‌తో మా జాబులు గల్లంతు...
స్టాక్‌హోం: ఆపిల్ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్ జాబ్స్‌పై ఫిన్లాండ్ ప్రధాని అలెగ్జాండర్ స్టబ్ అక్కసు వెళ్లగక్కారు. స్టీవ్ జాబ్స్ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసి విక్రయించడం వల్లే తమ దేశంలో పలువురు ఉద్యోగాలు కోల్పోయారనీ, ఫిన్లాండ్ కంపెనీలు ఆత్మరక్షణలో పడిపోయాయనీ చెప్పారు. ‘మా ఆర్థిక వ్యవస్థ ఐటీ, పేపర్ అనే రెండు దిమ్మెలపై నిలబడి ఉండేది. ఐఫోన్ రాకతో నోకియా (ఫిన్లాండ్ కంపెనీ) సంక్షోభంలో పడిపోయింది. ఐప్యాడ్ ప్రవేశంతో పేపరు వినియోగం క్షీణించింది..’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టబ్ వ్యాఖ్యానించారు. మొబైల్ పరికరాల ఉత్పత్తిలో ఒకనాడు ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచిన నోకియా సంక్షోభంలో చిక్కుకోవడంతో ఫిన్లాండ్కు కష్టాలు మొదలయ్యాయి. హ్యాండ్సెట్ల వ్యాపారాన్ని నోకియా గత ఏప్రిల్‌లో అమెరికాకు చెందిన సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు విక్రయించింది. రెండేళ్లు పీడించిన ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కేందుకు ఫిన్లాండ్ అష్టకష్టాలు పడుతోంది. ఈ నేపథ్యంలోనే స్టబ్ గత నెలాఖరులో ఆ దేశ ప్రధానమంత్రి అయ్యారు. ‘మార్పు ఇప్పుడే మొదలైంది. మా ఐటీ పరిశ్రమ గేమింగ్ వైపు మళ్లుతోంది.. అడవులు కాగితం ఉత్పత్తి కేంద్రాలుగా కాకుండా బయోఎనర్జీ సెంటర్లుగా ఆవిర్భవిస్తున్నాయి. దేశం వెంటనే ఆర్థికాభివృద్ధి సాధిస్తుందని నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో సంస్థాగత సవరణలు, ఈయూ మార్కెట్ సరళీకరణ, ప్రపంచస్థాయిలో వ్యాపారాన్ని పెంచుకోవడం అనే మూడు చర్యలతో అభివృద్ధిని వేగవంతం చేయవచ్చు...’ అని ఆయన పేర్కొన్నారు. -
మహిళలకు టాటా ప్రత్యేక హోమ్‌లోన్
ముంబై: టాటా క్యాపిటల్ సంస్థ మహిళల కోసం తక్కువ వడ్డీ రేటుకే రుణాలను ఆఫర్ చేస్తోంది. ఎస్బీఐ, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థల మాదిరి టాటా క్యాపిటల్ కూడా ఈ తరహా రుణాలను అందిస్తోంది. మహిళలకు రూ.40 లక్షల లోపు రుణాలను 10.15 శాతానికే అందిస్తామని కంపెనీ పేర్కొంది. గతంలో ఈ వడ్డీరేటు 10.50 శాతంగా ఉండేదని పేర్కొంది. ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన వచ్చే నెల 8 వరకూ అందుబాటులో ఉంటుందని వివరించింది. మహిళలు తాము కలలు గన్న ఇంటిని సొంతం చేసుకోవడం ద్వారా మహిళల ఆర్థిక సాధికారితకు తోడ్పడం తమ లక్ష్యమని కంపెనీ పేర్కొంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మహిళలకు గృహ రుణాలు 10.10% వడ్డీకే అందిస్తోంది. ఇక ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ మహిళల కోసం ప్రత్యేక గృహరుణ పథకాన్ని ఆఫర్ చేస్తోంది.