ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సురభిగుప్తాను ఫైర్ చేసింది. సురభి భారత్‌కు చెందిన నెట్‌ఫ్లిక్స్ హిట్ షో ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 1లో యాక్ట్ చేసి అందరి అందరి మన్ననలు పొందింది. ఓవైపు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్ట్ చేస్తూ మెటాలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసేవారు. అంతేకాదు 2018 మిస్ భారత్ కాలిఫోర్నియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక, సంస్థ తొలగించిన వేలాది మంది ఉద్యోగుల్లో తాను కూడా ఉన్నట్లు తాజాగా తెలిపింది.
ఆర్ధిక మాంద్యం గుప్పిట్లో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. 2007 డిసెంబర్ నుంచి జూన్ 2009 వరకు అమెరికాలో హౌసింగ్ మార్కెట్ పతనం,తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన క్రెడిట్, తగినంత నియంత్రణ లేకపోవడంతో అమెరికాలో రెసిషన్ ఓ కుదుపు కుదిపేసింది. మాంద్యం దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం నాటి పరిస్థితులే మరోసారి పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి.
ఇటీవల మెటా తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 13శాతం అంటే 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో గుప్తా ఒకరు. ఈ సందర్భంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2009 నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా. నన్ను విధుల నుంచి తొలగిస్తారని అస్సలు ఊహించలేదు. ఆఫీస్‌లో నేను పనిరాక్షసిని. కానీ నా ఉద్యోగం పోవడమే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మెటా చేసిన ప్రకటనతో ఆ రాత్రి మాలో ఎవరూ నిద్రపోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నాకు ఇమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌తో నేను నా కంప్యూటర్‌ను, ఆఫీస్ జిమ్‌ని యాక్సెస్ చేయలేకపోయాను. అప్పుడే అనిపించింది మెటాలో నా ఉద్యోగం పోయిందని.15 ఏళ్లకు పైగా యుఎస్‌లో ఉండేందుకు చాలా కష్టపడ్డానంటూ ఈ సందర్భంగా సురభి గుప్తా గుర్తు చేసుకున్నారు.
చదవండి👉 ‘మీ ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించి నేను పెద్ద తప్పే చేశా : మస్క్’
Comments
Please login to add a commentAdd a comment