Meta Layoffs 2022
-
సీఈవో అండదండలున్న నో జాబ్ గ్యారెంటీ!
ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయాలు, తగ్గిపోతున్న ప్రాజెక్ట్‌లతో పాటు ఇతర కారణాల వల్ల చిన్న చిన్న స్టార్టప్‌ల నుంచి అంతర్జాతీయ టెక్ సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. లేఆఫ్స్ తెగుబడుతున్న సంస్థలు సామర్ధ్యం పేరుతో వారిని బలి చేస్తున్నాయి. అయితే, తాజాగా పనితీరు బాగున్నా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మేలో మెటా సంస్థ సుమారు 6000 మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో ఓ ఉద్యోగి మెటాలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని లింక్డిన్లో పోస్ట్ చేశారు. మెటాలో ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్‌గా పనిచేస్తూ టాప్ పెర్మార్లలో ఒకరిగా నిలిచారు. పనితీరు విషయంలో సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసలు సైతం అందుకున్నారు. కానీ కంపెనీలో చేరిన ఏడాదిన్నర తర్వాత విధుల నుంచి తొలగించినట్లు వాపోయారు. టాప్ పెర్ఫామర్, సీఈవో మార్క్ జుకర్బర్గ ప్రశంసలతో మెటాలో తన జాబ్‌కు ఢోకా ఉండదని భావించారు. కానీ అనూహ్యంగా 6,000 లేఆఫ్స్‌లో తాను ఒకరిగా ఉండటాన్ని నమ్మలేకపోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం, వేరే జాబ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు లింక్డిన్ పోస్ట్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. -
మెటాలో భారీ లేఆఫ్స్...ఈ సారి ఎంతమంది అంటే?
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ వారంలో వేలాది మంది ఉద్యోగుల్ని ఫైర్ చేయనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో మెటా కంపెనీ చరిత్రలోనే తొలిసారిగా 13శాతంతో 11వేల మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా తలెత్తిన ఆర్ధిక అనిశ్చితితో మరోసారి సిబ్బందిని ఇంటికి సాగనంపేందుకు సిద్ధమైంది మెటా. మేనేజర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. రెండో దఫా తొలగింపులపై బ్లూమ్‌బర్గ్ ఫిబ్రవరిలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఇప్పుడు ఆ కథనానికి కొనసాగింపుగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు జారీ చేసేందుకు మెటా సిద్ధమైంది. జుకర్ బర్గ్ నిర్ధేశించిన ఆర్ధిక లక్ష్యాలను చేరుకునేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ మెటా ఇంటర్నల్ మీటింగ్‌లో పాల్గొని..పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఉద్యోగి తెలిపారు. కంపెనీల నుంచి మెటాకు వచ్చే యాడ్స్ తగ్గిపోవడంతో సంస్థ వర్చువల్ రియాలిటీ మెటావర్స్‌పై దృష్టిసారించింది. పొదుపు మంత్రం జపిస్తూనే ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. అందుకే ఏ ఉద్యోగిని ఉంచాలి? ఎవర్ని తొలగించాలో చెప్పాలంటూ డైరెక్టర్లను, వైస్ ప్రెసిడెంట్లను అడుగుతున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
మేనేజర్లు అయితే ఏంటీ.. పనిచేయకపోతే రాజీనామా చేయండి: జుకర్‌బర్గ్
మెటా కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రానున్న రోజుల్లో మరికొంత మంది ఉద్యోగులను తొలగించేలా ఉన్నారు. తాజాగా ఆయన కంపెనీలోని మేనేజర్లు, డైరెక్టర్లకు ఇచ్చిన వార్నింగ్ చూస్తే లేఆఫ్స్‌పై హింట్ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. గతేడాది నవంబర్‌లో ట్విటర్ సగం మంది ఉద్యోగులను తొలగించిన కొన్ని రోజులకే జుకర్‌బర్గ్ కూడా మెటా సంస్థలో 11 వేల ఉద్యోగాలను పీకేశారు. జుకర్‌బర్గ్ తాజా హెచ్చరికలతో ఉద్యోగుల్లో మళ్లీ లేఆఫ్ భయాలు నెలకొన్నాయి. గత వారం కంపెనీలో జరిగన అంతర్గత సమావేశంలో సీఈఓ జుకర్‌బర్గ్.. మేనేజర్లు, డైరెక్టర్ల స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులకు పలు హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మరింత ఎఫీషియెన్సీ కనబర్చాలన్నారు. కేవలం సిబ్బందితో పనిచేయించడమే కాదు.. పనిలో వ్యక్తిగత పాత్ర కూడా ఉండాలని, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. లేఆఫ్స్ ప్రారంభ దశలో జుకర్‌బర్గ్ మరింత ఎఫీషియన్సీ దిశగా పనిచేయనున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం.. రానున్న రోజుల్లో మెటా కంపెనీలో సీనియర్ మేనేజర్లు సైతం కింద స్థాయి ఉద్యోగులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కోడింగ్, డిజైనింగ్, రీసెర్చ్ వంటి వాటిపై దృష్టి పెట్టకుండా కేవలం ఇన్‌చార్జ్‌లుగా ఉంటామంటే కుదరదు. ఉద్యోగుల పనితీరుపై కంపెనీలో నిరంతర సమీక్షలు కొనసాగుతున్నాయి. పనితీరు బాగా లేని ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. (ఇదీ చదవండి: Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్.. భారీగా జీతం వదులుకున్న సీఈఓ!) -
'సారీ..అంత ఇచ్చుకోలేం!', మెటా ఉద్యోగులకు మరో భారీ షాక్?
సంస్థ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వేరే దారి లేదంటూ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పెట్టారు. తప్పులేదు. అంతవరకు బాగానే ఉన్న. జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తూ.. సదరు సిబ్బందికి సెవరన్సు పే (Severance Pay) అందిస్తామని చెప్పారు. సెవరన్సు పే అంటే? సంస్థ అకస్మాత్తుగా ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు..రానున్న రోజుల్లో ఉద్యోగి, అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ 11వేల మందికి పింక్ స్లిప్ జారీ చేసే సమయంలో మెటాలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 16 వారాల బేస్ సెరారెన్స్ పేతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల వేతనాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 6 నెలల పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ అలవెన్స్‌లు వర్తిస్తాయని తెలిపింది. అయితే తాజాగా మెటా కేవలం 8 వారాల బేస్ పే, మూడు నెలల ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. తాము కాంట్రాక్ట్ ఉద్యోగులం కాదని, అయినా తమ పట్ల యాజమాన్యం ఇలా ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఫైర్ చేసిన ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే జుకర్ బర్గ్ హామీ ఇచ్చినట్లు బెన్ఫిట్స్ అందిస్తున్నారని, మిగిలిన ఉద్యోగుల విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఉద్యోగం కోల్పోయి తక్కువ సెవరన్సు పే పొందిన ఉద్యోగుల గురించి సమాచారం కావాలని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇతర ఎగ్జిక్యూటీవ్లకు లేఖ పంపారని, సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ! -
Surbhi Gupta: ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’
అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. అమెరికా టెక్ సంస్థలు ఉద్యోగులతో పాటు వలసేతర హెచ్1బి వీసా హోల్డర్లని విధుల నుంచి తొలగిస్తున్నాయి. వారిలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్ పనిచేస్తున్న సురభిగుప్తా ఒకరు. తాజాగా మెటాలో ఉద్యోగం కోల్పోవడంపై జర్నలిస్ట్ సవితా పటేల్‌తో మాట్లాడారు. మెటాలో ఉద్యోగం, లేఫ్స్పై హెచ్ 1 బీ వీసాపై ఆమె మనోగతం ఏంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ రోజు మా అమ్మ పుట్టిన రోజు. ఆమెకు శుభాకాంక్షలు చెప్పేందుకు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో మెటా ఉద్యోగుల్ని తొలగించడం ప్రారంభించింది. లేఆఫ్స్‌పై నాతో పాటు నా సహచర ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటల (స్థానిక కాలమానం) మెటా నుంచి మెయిల్. ఉద్యోగం నుంచి నన్ను తొలగించారని. ఈ ఏడాది ప్రారంభంలో మెటాలో ప్రొడక్ట్ మేనేజర్‌గా చేరాను. నా విధుల్ని నేను చక్కగా నిర్వర్తిస్తా. నా ఉద్యోగం పోయిందని తెలిసి నా టీమ్ సభ్యులు షాక్‌గురయ్యారు. ఉద్యోగం కోల్పోయారు కదా మీకెలా అనిపించింది నా స్కూల్ డేస్‌లో ఓ టీచర్ ఎప్పుడూ ఒక మాట చెప్పే వారు. వర్క్ ఈజ్ వర్షిప్. అదే మోటోతో పనిచేస్తున్నాను. కానీ నా ఉద్యోగం పోయిందని తెలిసి టైటానిక్ షిప్‌లా మునిపోతున్నట్లు అనిపించింది. మెయిల్, ఆ తర్వాత ల్యాప్‌టాప్ యాక్సెస్ కోల్పోయాను. అందుకు విరుద్ధంగా లింక్డ్ ఇన్‌లో చాలా మంది సహోద్యోగులు, మాజీ సహోద్యోగులు, స్నేహితులు ఇలా చాలా మంది నాకు మద్దతుగా నిలిచారు. నాకు అప్పుడే అనిపించింది నా అనేవాళ్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారని. మార్చి వరకే డెడ్‌లైన్ ఇక మెటాలో నా లాస్ట్ వర్క్ డే జనవరి వరకు ఉంది. నాకు హెచ్1 -బీ వీసా (అమెజరికాలోని సంస్థలు ఆరు సంవత్సరాల వరకు విదేశీయులను నియమించుకోవడానికి అనుమతించే నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా) తో మరో 60 రోజులు యూఎస్‌లో ఉండొచ్చు. కాబట్టి మార్చి ప్రారంభం వరకు మరో ఉద్యోగం వెతుక్కునేందుకు సమయం ఉంది. ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే డిసెంబరులో సెలవుల కారణంగా ఉద్యోగం వెతుక్కోవడం కొంచెం కష్టమే. కానీ మరో ఉద్యోగంలో చేరే విషయంలో చాలా పట్టుదలతో ఉన్నాను. అనుకున్నది సాధిస్తా. ‘ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా’ జీవితంతో ఎప్పుడు రాజీ పడకూడదు. అనుకున్నది సాధించేలా సంక్షోభంలోనూ అవకాశాల్ని ఎలా చేజిక్కించుకోవాలి నా తల్లిదండ్రులు నాకు నేర్పించారు. అంతేకాదు ఇప్పుడు మనం ఒకటి కోల్పోయామంటే భవిష్యత్‌లో ('ఔర్ కుచ్ అచ్చా మిల్ జాయేగా') ఇంతకంటే మంచి అవకాశం దొరుకుతుందని చెప్పేవారు. మెటా నన్ను ఫైర్ చేసిన తర్వాత మరో జాబ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించా. హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంది కానీ అమెరికాలో పని చేయడం, ఇక్కడ ఉండే హక్కు నా హెచ్1-బీ వీసాపై ఆధారపడి ఉంటుంది. నేను 2009లో యుఎస్‌కి వచ్చా. ఎవరి ప్రోత్సాహాం లేకుండా స్వశక్తి, తెలివి తేటలతో నా కెరియర్ను నిలబెట్టుకున్నాను. అందుకోసం ఏళ్ల తరబడి కష్టపడ్డాను. టెస్లా, ఇన్ట్యూట్ (Intuit) వంటి కంపెనీల్లో పనిచేశా. మంచి మంచి ప్రొడక్ట్‌లను తయారు చేశా. టాప్ రేటింగ్‌లో పనిచేశా. పన్నులు చెల్లించా. ఇక్కడి (యూఎస్) ఆర్థిక వ్యవస్థకు 15 సంవత్సరాలకు పైగా సహకరించాను. ఇక్కడే పర్మినెంట్ నివసించే హక్కు పొందాను. నేను మిస్ భారత్ కాలిఫోర్నియా అందాల పోటీల్లో నా ఆరాధ్య, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ చేతుల మీదిగా కిరీటం పొందాను. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో ర్యాంప్‌పై నడిచాను. టెక్ కంపెనీల ఉద్యోగాల తొలగింపుపై అమెరికా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు భారతీయుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయినా సరే మెటా, అమెజాన్, ట్విట్టర్ లే ఆఫ్‌లు భారతీయులు అమెరికాకు రావాలని, ఇక్కడే స్థిరపడాలన్న కలల్ని నాశనం చేయవు’ అంటూ సురభిగుప్తా తన మనోగతాన్ని వివరించారు. చదవండి👉 ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది! -
ప్చ్, పాపం..మెటాలో ‘సురభిగుప్తా’ ఉద్యోగం ఊడింది!
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా సురభిగుప్తాను ఫైర్ చేసింది. సురభి భారత్‌కు చెందిన నెట్‌ఫ్లిక్స్ హిట్ షో ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 1లో యాక్ట్ చేసి అందరి అందరి మన్ననలు పొందింది. ఓవైపు నెట్‌ఫ్లిక్స్‌లో యాక్ట్ చేస్తూ మెటాలో ప్రొడక్ట్ మేనేజర్‌గా పనిచేసేవారు. అంతేకాదు 2018 మిస్ భారత్ కాలిఫోర్నియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఇక, సంస్థ తొలగించిన వేలాది మంది ఉద్యోగుల్లో తాను కూడా ఉన్నట్లు తాజాగా తెలిపింది. ఆర్ధిక మాంద్యం గుప్పిట్లో ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. 2007 డిసెంబర్ నుంచి జూన్ 2009 వరకు అమెరికాలో హౌసింగ్ మార్కెట్ పతనం,తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన క్రెడిట్, తగినంత నియంత్రణ లేకపోవడంతో అమెరికాలో రెసిషన్ ఓ కుదుపు కుదిపేసింది. మాంద్యం దెబ్బకు అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయాయి. అయితే ప్రస్తుతం నాటి పరిస్థితులే మరోసారి పునరావృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ప్రముఖ టెక్ దిగ్గజాలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపుతున్నాయి. ఇటీవల మెటా తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 13శాతం అంటే 11వేల మంది ఉద్యోగుల్ని తొలగించింది. వారిలో గుప్తా ఒకరు. ఈ సందర్భంగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 2009 నుంచి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నా. నన్ను విధుల నుంచి తొలగిస్తారని అస్సలు ఊహించలేదు. ఆఫీస్‌లో నేను పనిరాక్షసిని. కానీ నా ఉద్యోగం పోవడమే నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మెటా చేసిన ప్రకటనతో ఆ రాత్రి మాలో ఎవరూ నిద్రపోలేదు. ఆ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు నాకు ఇమెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌తో నేను నా కంప్యూటర్ను, ఆఫీస్ జిమ్ని యాక్సెస్ చేయలేకపోయాను. అప్పుడే అనిపించింది మెటాలో నా ఉద్యోగం పోయిందని.15 ఏళ్లకు పైగా యుఎస్‌లో ఉండేందుకు చాలా కష్టపడ్డానంటూ ఈ సందర్భంగా సురభి గుప్తా గుర్తు చేసుకున్నారు. చదవండి👉 ‘మీ ఇద్దరిని ఉద్యోగం నుంచి తొలగించి నేను పెద్ద తప్పే చేశా : మస్క్’ -
2 నెలల్లో 1.25 లక్షల తొలగింపు.. భారతీయ టెకీలపైనే ఎక్కువ ప్రభావం?
► (కంచర్ల యాదగిరిరెడ్డి) క్రికెట్ మ్యాచ్‌లో వెంట వెంటనే వికెట్లు పడిపోతుంటే అభిమానుల గుండె బరువెక్కిపోతుంది తప్ప ఇతరత్రా కష్టనష్టాలు ఉండవు. అదే ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు టపటప ఊడిపోతుంటే.. కుటుంబాలు కుటుంబాలు కష్టాలపాలవుతాయి. ఆ కుటుంబాల మీద ఆధారపడ్డ చిన్న చిన్న వ్యాపారాలు దెబ్బతింటాయి. కోవిడ్ కష్టాలు ముగిసి మార్కెట్ పట్టాలెక్కుతోందని అందరూ అనుకుంటున్న సమయంలో మాంద్యం వార్తలు, ఐటీ కంపెనీల భారీ లేఆఫ్‌లు, కేవలం రెండు మాసాల్లో 1.25 లక్షలకు పైగా ఉద్యోగాలు పోవడం.. టెకీలకు, వారి కుటుంబసభ్యులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మాంద్యంపై సర్వత్రా చర్చ పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఉద్యోగులు ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్లు కొనుగోలు చేయవద్దని అమెజాన్ సీఈఓ చెప్పారంటే భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ మాంద్యం ఎప్పటిదాకా ఉంటుందన్న దానిపై ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. మాంద్యం వస్తుందని ప్రచారం ఊపందుకునే లోపే ఫేస్బుక్ మాతృసంస్థ మెటా మాంద్యం ఛాయలు అప్పుడే మొదలయ్యాయంటూ వెల్లడించింది. మెటాతో పాటు ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగులను ఫైర్ చేయడం (తొలగించడం) మొదలుపెట్టాయి. మెటా, అమెజాన్, తాజాగా ట్విట్టర్ పింక్ స్లిప్‌ల (ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామంటూ ఇచ్చే నోటీసులు) జారీ ప్రారంభించాయి. లేఆఫ్స్ఎఫ్వైఐ వెబ్సైట్ లెక్కల ప్రకారం ఈ ఒక్క ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 టెక్ కంపెనీలు 1.4 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఇందులో దాదాపు 90 శాతం (1.25 లక్షలకు పైగా) తొలగింపులు జరిగింది అక్టోబర్, నవంబర్ నెలల్లోనే. ఎక్కువగా భారతీయులే బాధితులు సంస్థ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగులకు గుడ్‌బై చెప్పింది. వీరిలో దాదాపు 80 శాతం అంటే 8,800 పై చిలుకు ఉద్యోగులు భారతీయులే. ‘ఖర్చులు తగ్గించుకునేందుకు నాకు ఇంకో దారి కనపడలేదు’అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులకు పంపిన వీడియో సందేశంలోనే చెప్పుకున్నాడంటే పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది. మెటాలో తొలగింపులు మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం వరకూ ఉంటే, ఈ–కామర్స్ సంస్థ అమెజాన్‌లో ఇది మూడు శాతం మాత్రమే. అంటే ఈ మూడు శాతంలో పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలోనూ దాదాపు 70 శాతం అంటే అంటే 7 వేల మంది భారతీయులే కావడం గమనార్హం. ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్, బుకింగ్.కామ్, సిస్కో, బైజూస్, ఎయిర్ బీఎన్బీ, ఇన్‌స్టాకార్ట్ వంటి కంపెనీల్లోనూ రెండు వేల నుంచి దాదాపు ఐదు వేల మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఉబర్ వేర్వేరు విభాగాలకు చెందిన సుమారు ఆరు వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మాంద్యం భయమే కారణమా? టెక్నాలజీ కంపెనీల్లో హైర్ అండ్ ఫైర్ పాలసీ కొత్తదేమీ కాదు. డాట్ కామ్ కంపెనీలు దివాలా తీసినప్పుడు, 2008 నాటి సబ్ ప్రైమ్ క్రైసిస్ సమయంలోనూ పలు కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. అయితే కోవిడ్ కష్టకాలంలో బోలెడన్ని లాభాలు ఆర్జించిన తరువాత కంపెనీలు ఎందుకీ లే–ఆఫ్‌లు ప్రకటిస్తున్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అమెరికాతో పాటు అనేక దేశాల్లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో మాంద్యం ముంచొకొస్తోందన్న ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. మరోవైపు స్టాక్ మార్కెట్లు నేల చూపు చూస్తున్నాయి. సరిగ్గా ఏడాది క్రితం న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో మెటా ఒక్కో షేరు ధర 340 డాలర్లు కాగా గడచిన సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి ఆ షేర్ ధర 109.86 డాలర్లు కావడం గమనార్హం. ఆదాయం తగ్గుతుందన్న అంచనాలతో.. అత్యధికంగా ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో అనేకం ప్రకటనలపై ఆధారçపడేవి. అయితే, ద్రవ్యోల్బణం నేపథ్యంలో కంపెనీలు ప్రకటనల ఖర్చులను తగ్గించుకున్నాయి. ఉద్యోగులకు రాసిన లేఖలో జూకర్బర్గ్ అదే చెప్పారు. భవిష్యత్తులో ఆదాయం తగ్గిపోతుందన్న అంచనాలు బలపడటంతోనే ఉద్యోగులకు లేఆఫ్‌లు ప్రకటిస్తున్నాయి. మెటా లాంటి సంస్థలకు స్నాప్‌చాట్, టిక్‌టాక్ వంటి కంపెనీల నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. ఈ కారణంగానే 18 ఏళ్ల కంపెనీ చరిత్రలోనే మొదటి సారిగా ఫేస్బుక్ రోజువారీ వినియోగదారుల సంఖ్య తగ్గిపోయింది. పైగా మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లోనూ ఆదాయం తగ్గినట్లు ప్రకటించింది. అంతేకాదు మెటావర్స్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సరం సుమారు వెయ్యి కోట్ల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉండటం కూడా ఖర్చులు తగ్గించుకోవాలని మెటా సంస్థ అనుకునేందుకు మరో కారణమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇతర రంగాలపైనా ప్రభావం! అమెరికాలో గత నెలలో 2.61 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చి చేరాయి. అయినప్పటికీ టెక్ కంపెనీల లేఆఫ్‌లపై ఆర్థిక వేత్తలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. సాధారణంగా ఆర్థిక రంగంలో ఏం జరుగుతోందన్న దానికి టెక్ కంపెనీల పనితీరు ఓ కొలమానంగా ఉంటుందని, ఈసారి అక్కడి పరిస్థితుల ప్రభావం ఇతర రంగాలపై కూడా పడనుందని వారు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు ఇంకా పెంచే అవకాశముందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు మరిన్ని దెబ్బలు తప్పవని అంచనా. అయితే లేఆఫ్‌లు లేకున్నప్పటికీ కొన్ని ఇతర రంగాల్లోనూ ఆదాయాలు తగ్గిపోతుండటం గమనార్హం. క్రిస్మస్ సెలవులను దృష్టిలో పెట్టుకుంటే అమెరికాలో ఆర్థిక లావాదేవీలు చాలా చురుకుగా జరగాల్సిన సమయమిది. కానీ వాస్తవ పరిస్థితులు దీనికి పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. మన టెకీల్లో ధీమా అమెరికన్ టెక్ కంపెలల్లో అత్యధికులు భారతీయులేనన్నది, అందులోనూ తెలుగు రాష్ట్రాల వారు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారనేది అందరికీ తెలిసిందే. అయితే పెద్ద పెద్ద కంపెనీల లేఆఫ్‌ల ప్రభావం మనవాళ్లపై ఉండదా? కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కొంతమంది హెచ్–1బీ వీసాదారులు తమ ఉద్యోగాలు కోల్పోయారు కూడా. కొత్త ఉద్యోగం దొరక్కపోతే ఆరు నెలల కాలంలో వారు భారత్‌కు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కానీ, మన టెకీలు తక్కువ వేతనాలు తీసుకునేందుకు అలవాటు పడిన నేపథ్యంలో వారు తేలిగ్గానే ఉద్యోగాలు సంపాదించుకోగలరనే ధీమాతో ఉన్నారు. అవసరానికి మించి ఉద్యోగులు! గత కొన్నేళ్లుగా ఐటీ కంపెనీల్లో నియామకాలకు చిత్ర విచిత్రమైన ప్రాతిపదికలు కనిపించాయి. భవిష్యత్తులో వచ్చే అవకాశమున్నప్రాజెక్టుల కోసం పెద్ద ఎత్తున ఉద్యోగులను తీసుకోవడం, ప్రాజెక్టు రాకపోతే వారిని ఇతర ప్రాజెక్టులకు మళ్లించడం వంటి చర్యలు చేపట్టాయి. ఫలితంగా చాలా కంపెనీల్లో అవసరానికి మించి ఉద్యోగులు చేరిపోయారు. ఫలితంగా ఖర్చులు పెరిగిపోయాయి. ప్రాజెక్టుల ద్వారా వచ్చే ఆదాయంపై నిలకడ లేకుండా పోయిందని నిపుణులు అంటున్నారు. అమెరికా ఫెడరల్ బ్యాంకు గత నాలుగు త్రైమాసికాలు వరుసగా వడ్డీ రేట్లు పెంచుతూ పోవడం కూడా టెక్ కంపెనీలకు శాపంగా మారింది. రియల్ ఎస్టేట్, కార్లు అమ్ముకునే కంపెనీలపై ఇది తీవ్రమైన దు్రష్పభావం చూపింది. నిరుద్యోగంపై లేఆఫ్‌ల ప్రభావం తక్కువే.. టెక్ కంపెనీల భారీ లేఆఫ్‌లు ఆర్థిక మాంద్య పరిస్థితులకు సూచికలా? కావచ్చు, కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే టెక్ కంపెనీలు, వాటిల్లో ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువని, ఫలితంగా లేఆఫ్‌ల ప్రభావం నిరుద్యోగంపై పెద్దగా పడదని అంతర్జాతీయ సంస్థ గోల్డ్‌మ్యాన్ శ్యాక్స్ అంచనా వేస్తోంది. టెక్ కంపెనీలు తొలగించిన ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి, ఇతర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతుందని చెబుతోంది. గతంలోనూ టెక్ కంపెనీల భారీ లేఆఫ్‌లు ఇతర రంగాల్లో ఉద్యోగాల కోతకు దారితీయలేదని ఈసారి కూడా అలాంటి పరిస్థితి ఉండదు కాబట్టి మాంద్యం అవకాశాలు తక్కువేనని విశ్లేషించింది. లేఆఫ్‌లు తాత్కాలిక పరిణామమే.. ఐటీ కంపెనీల లేఆఫ్‌లు తాత్కాలిక పరిణామమే. ఆర్థిక వ్యవస్థ తాలూ కూ సహజసిద్ధ హెచ్చుతగ్గుల్లో భాగం. భారత ఐటీ రంగం ఏడాదికి 10% చొప్పున పెరుగుతోంది. భవిష్యత్తులోనూ ఇది ఇలాగే కొనసాగే చాన్స్ ఉంది. సమీప భవిష్యత్తులో ఐటీ రంగంలో సుమారు 2 లక్షలకుపైగా ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ఏఐ/ఎంఎల్, వెబ్ 3.0 వంటి టెక్నాలజీల ఆధారంగా ఐటీ రంగం వృద్ధి చెందనుంది. -క్రిస్ గోపాలకృష్ణన్ ఇన్ఫోసిస్వ్యవస్థాపకులు అనివార్యంగానే లేఆఫ్‌లు ఒక రకంగా చూస్తే టెక్ కంపెనీల లేఆఫ్‌లు అనివార్యమైనవనే చెప్పాలి. ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తాయి. ఒకటి కోవిడ్ సమయంలో ప్రతి టెక్నాలజీని రిమోట్ ఫ్రెండ్రీగా, మొబైల్ ఫ్రెండ్లీగా మార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఫలితంగా ఐటీ నిపుణులతోపాటు సహాయక సిబ్బందికీ డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగా నియామకాలూ జరిగాయి. ఇప్పుడా పరిస్థితులు లేవు. రెండో కారణం.. ఉత్పాదకత విషయంలో కంపెనీల ఆలోచనలు మారడం. ఇక మూడో కారణం.. స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు వెంచర్ క్యాపిటలిస్టులు, ఎంజిల్ ఇన్వెస్టర్ల నుంచి అంత సులువుగా నిధులు రాకపోవడం! -మురళి బుక్కపట్నం వైస్ చైర్మన్, ద ఇండస్ ఎంట్రప్రెన్యూర్స్ (గ్లోబల్) -
‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు!
నిన్న ట్విటర్..మెటా. నేడు అమెజాన్. సంస్థ ఏదైనా సందర్భం ఒక్కటే. అదే కాస్ట్ కట్. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌తో పాటు..ఆ రంగానికి అనుసంధానంగా ఉన్న ఇతర రంగాల్లో నడుస్తున్న చర్చ ఇది. డిజిటల్ అడ్వటైజ్మెంట్ నుంచి వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడం, మాంద్యం భయాలు వెంటాడుతున్న వేళ ఉద్యోగం ఉంటుందో.. ఊడుతుందో తెలియదు. ఎప్పుడు ఎటువంటి వార్త వినాల్సి వస్తుందో తెలియక ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు సంస్థలు మీటింగ్ అని పిలిచి వేరే ఉద్యోగం చూసుకోమని చీటింగ్ చేయడం కొసమెరుపు ప్రపంచ దేశాల్లో కోవిడ్-19 సంక్షోభం కారణంగా డిజిటల్ వినియోగం విపరీతంగా పెరిగింది. కూర్చున్న చోటు నుంచే కావాల్సిన పనులన్నీ చక్కబెట్టుకోవడంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు, ఓటీటీలు, యాప్స్, యూపీఐ పేమెంట్స్, సోషల్ మీడియా, ఈకామర్స్ సేవలు, ఆన్లైన్ సర్వీసులు ఇలా ఊహించని విధంగా డిజిటల్ కార్యకలాపాలు జోరందుకున్నాయి. మరి ఆ కార్యకలాపాలు నిర్విరామంగా కొనసాగాలంటే ఐటీ రంగం, అందులో పనిచేసేందుకు ఉద్యోగులు కావాలి. దీంతో టెక్ కంపెనీలు డిమాండ్‌కు మించి ఉద్యోగుల్ని నియమించున్నాయి. నాస్కామ్ నివేదిక ప్రకారం. ఒక్క భారత్‌లో 2021- 2022 ఆర్ధిక సంవత్సరంలో సుమారు నాలుగున్నర లక్షల మందికి పైగా కొత్తగా ఈ రంగంలో ఉపాధి పొందారు. ఇక వారిని నిలుపుకునేందుకు దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్‌ల వరకు శాలరీల పెంపు, ప్రోత్సాహకాలు, ఉద్యోగుల్ని నిలుపుకునేందుకు డబుల్ శాలరీలు, ఇన్సెంటీవ్స్లు, బోనస్‌లు ఇచ్చాయి. మహమ్మారి కారణంగా రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్ ఇలా అన్నీ రంగాలు కుదేలయ్యాయి. కానీ ఒక్క ఐటీ రంగం ఎన్నడూ లేని విధంగా లాభాల్ని గడించింది. . కానీ ఇప్పుడు పరిస్థితుల మారాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా, యూరప్‌తో పాటు మిగిలిన దేశాలపై ఆ ప్రభావం తీవ్రంగా పడింది. భారత్‌కు చెందిన దిగ్గజ టెక్ కంపెనీలు 80శాతం ప్రాజెక్ట్‌లు అమెరికా, యూరప్ దేశాల మీద ఆధారపడ్డాయి. ఆ దేశాల్లో ఆర్ధిక మాంద్యం కారణంగా వడ్డీ రేట్లు పెంచడం, ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడం, జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో ఖర్చు తగ్గించుకునేందుకు మెటా, ట్విటర్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. మెటా మొత్తం ఉద్యోగుల్లో 13 శాతం అంటే 11 వేల మందిపై వేటు వేయగా, ట్విటర్ ప్రపంచ వ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేసింది. భారత్‌లో ట్విటర్ ఉద్యోగులు 200 మంది ఉండగా వారిలో 12 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు సమాచారం. వీటితో పాటు స్ట్రైప్, సేల్స్ ఫోర్స్, మైక్రోసాఫ్ట్, జిల్లో, స్నాప్,రాబిన్ హుడ్ వంటి సంస్థలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో 10వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. మీటింగ్ పేరుతో ఉద్యోగుల్ని పిలిపించి రెండు నెలల్లోగా వేరే ఉద్యోగాలు చూసుకోవాలని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. అందుకు ఊతం ఇచ్చేలా లింక్డిన్ పోస్టులు దర్శనమిస్తున్నాయి.అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్ బిజినెస్, క్లౌడ్ గేమింగ్ ప్లాట్‌ఫామ్, కిండిల్ ఇలా 126 వంటి విభాగాలకు చెందిన ఉద్యోగులపై లేఆఫ్స్ ఎఫెక్ట్ అధికంగా ఉందని ఉద్యోగులు వాపోతున్నారు. పైన పేర్కొన్న సంస్థలతో పాటు ఇతర కంపెనీలు లేఆఫ్స్‌కు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆర్ధిక మాంద్యం కారణంగా ఖర్చును తగ్గించుకునేందకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే విధుల నుంచి తొలగించడంపై ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉 ‘ట్విటర్లో నా ఉద్యోగం ఊడింది’, 25 ఏళ్ల యశ్ అగర్వాల్ ట్వీట్ వైరల్