సంస్థ ప్రారంభించిన నాటి నుంచి ఎన్నడూ జరగనంత స్థాయిలో మెటా 11 వేల మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకు వేరే దారి లేదంటూ మార్క్ జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇంటర్నల్ మెయిల్స్ పెట్టారు.
తప్పులేదు. అంతవరకు బాగానే ఉన్న. జుకర్ బర్గ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగుల్ని ఫైర్ చేస్తూ.. సదరు సిబ్బందికి సెవరన్సు పే (Severance Pay) అందిస్తామని చెప్పారు. సెవరన్సు పే అంటే? సంస్థ అకస్మాత్తుగా ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించినప్పుడు..రానున్న రోజుల్లో ఉద్యోగి, అతని కుటుంబానికి ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా సంస్థలు కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి.
ఉద్యోగులకు అందించే బెన్ఫిట్స్ విషయంలో వెనక్కి తగ్గినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ 11వేల మందికి పింక్ స్లిప్ జారీ చేసే సమయంలో మెటాలో ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు 16 వారాల బేస్ సెరారెన్స్ పేతో పాటు ప్రతి సంవత్సరం సర్వీస్‌కు రెండు అదనపు వారాల వేతనాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. దీంతో పాటు ఉద్యోగులకు, వారి కుటుంబాలకు 6 నెలల పాటు హెల్త్ ఇన్స్యూరెన్స్ అలవెన్స్‌లు వర్తిస్తాయని తెలిపింది.
అయితే తాజాగా మెటా కేవలం 8 వారాల బేస్ పే, మూడు నెలల ఇన్సూరెన్స్ మాత్రమే ఇస్తుందని ఉద్యోగులు చెబుతున్నారు. తాము కాంట్రాక్ట్ ఉద్యోగులం కాదని, అయినా తమ పట్ల యాజమాన్యం ఇలా ఎందుకు కఠినంగా వ్యవహరిస్తుందో అర్ధం కావడం లేదని వాపోతున్నారు. ఫైర్ చేసిన ఉద్యోగుల్లో కొంతమందికి మాత్రమే జుకర్ బర్గ్ హామీ ఇచ్చినట్లు బెన్ఫిట్స్ అందిస్తున్నారని, మిగిలిన ఉద్యోగుల విషయంలో వ్యత్యాసం చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ఉద్యోగం కోల్పోయి తక్కువ సెవరన్సు పే పొందిన ఉద్యోగుల గురించి సమాచారం కావాలని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ ఇతర ఎగ్జిక్యూటీవ్‌లకు లేఖ పంపారని, సమస్యను పరిష్కరించాలని కోరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
చదవండి👉 ఉద్యోగులకు ఊహించని షాక్!..ట్విటర్,మెటా బాటలో మరో దిగ్గజ సంస్థ!
Comments
Please login to add a commentAdd a comment