ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. వాట్సప్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలగనుంది.
గతంలో మీ వాట్సప్ నెంబర్ నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఓ మెసేజ్ పంపి ఉంటారు. అత్యవసరంగా ఆ మెసెజ్ ఇప్పుడు కావాలి. వెతకాలంటే సమయం పడుతుంది. మరి ఇప్పుడు దానిని సెకన్లలో గుర్తించడం ఎలా? దీనికే వాట్సప్ మాతృ సంస్థ మెటా పరిష్కారం కనిపెట్టింది.
ఇందుకోసం వాట్సప్ వెబ్‌లో ‘సెర్చ్ బై డేట్’ ఫీచర్‌పై పనిచేస్తుంది. దీని సాయంతో వాట్సప్‌లో వీడియోలు, టెక్ట్స్ ఇతర ఆడియో ఫైల్స్‌ని మీరు ఎప్పుడు, ఎవరికి ఏం పంపారో ఈజీగా తెలుస్తుంది. అవతలి వారు మీకు పంపిన మెసేజ్‌లను సైతం గుర్తించవచ్చు.
ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. వాట్సప్ వెబ్ కోసం కొత్త సెర్చ్ బై డేట్ ఫీచర్‌తో యూజర్లు పంపిన మెసేజ్‌లను లేదంటే రిసీవ్ చేసుకున్న వాటిని సులభంగా చూసేందుకు పైన ఇమేజ్‌లో పేర్కొన్నట్లుగా క్యాలెండర్‌ను ఓపెన్ చేసింది. అందులో తారీఖు, సంవత్సరం, నెలను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఎంచుకున్న తేదీని బట్టి మీ వాట్సప్ డేటా డిస్‌ప్లే అవుతుంది. అయితే, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే మరికొన్ని ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment