text
-
వారెవ్వా! వాట్సప్‌లో ఇకపై అన్నీ ఇన్‌స్టంట్‌గానే..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. వాట్సప్‌లో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉండగా.. మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం కలగనుంది. గతంలో మీ వాట్సప్ నెంబర్ నుంచి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఓ మెసేజ్ పంపి ఉంటారు. అత్యవసరంగా ఆ మెసెజ్ ఇప్పుడు కావాలి. వెతకాలంటే సమయం పడుతుంది. మరి ఇప్పుడు దానిని సెకన్లలో గుర్తించడం ఎలా? దీనికే వాట్సప్ మాతృ సంస్థ మెటా పరిష్కారం కనిపెట్టింది. ఇందుకోసం వాట్సప్ వెబ్‌లో ‘సెర్చ్ బై డేట్’ ఫీచర్‌పై పనిచేస్తుంది. దీని సాయంతో వాట్సప్‌లో వీడియోలు, టెక్ట్స్ ఇతర ఆడియో ఫైల్స్‌ని మీరు ఎప్పుడు, ఎవరికి ఏం పంపారో ఈజీగా తెలుస్తుంది. అవతలి వారు మీకు పంపిన మెసేజ్‌లను సైతం గుర్తించవచ్చు. ఫీచర్ ట్రాకర్ నివేదిక ప్రకారం.. వాట్సప్ వెబ్ కోసం కొత్త సెర్చ్ బై డేట్ ఫీచర్‌తో యూజర్లు పంపిన మెసేజ్‌లను లేదంటే రిసీవ్ చేసుకున్న వాటిని సులభంగా చూసేందుకు పైన ఇమేజ్‌లో పేర్కొన్నట్లుగా క్యాలెండర్‌ను ఓపెన్ చేసింది. అందులో తారీఖు, సంవత్సరం, నెలను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఎంచుకున్న తేదీని బట్టి మీ వాట్సప్ డేటా డిస్ప్లే అవుతుంది. అయితే, ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవాలంటే మరికొన్ని ఆగాల్సిందే. -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన విర్చ్యువల్ అసిస్టెంట్ 'ఎం'ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఫేస్బుక్ మెస్సెంజర్‌లోని ఒక టెక్ట్స్ రోబోట్. ఈ వీఆర్ ఎం ను ఫేస్బుక్ 2015 ఆగస్టులో ప్రారంభించింది. దాదాపు రెండున్నరేళ్లపాటు సేవలందించిన దీనికి త్వరలో వీడ్కోలు పలకనున్నారు. 2018 జనవరి 19 వీఆర్ ఎం కు చివరి రోజు కానుంది. ప్రజల అవసరాలను తెలుసుకోవడానికి దీనిని తయారు చేశామని, తద్వారా ఫేస్బుక్ చాలా విషయాలను తెలుసుకుందని యంత్రాంగం తెలిపింది. ఫేస్‌బుక్‌లోని ఇతర విభాగాల్లో ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటామని ఫేస్బుక్ తెలిపింది. అంతేకాకుండా మరో కీలక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం 'ఎం' 2వేల మందికి మాత్రమే ఉపయోగకరంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి పరిచి అందరికీ ఉపయోగ పడేలా తిరిగి బీటా వెర్షన్లో తీసుకువస్తామని ప్రకటించింది. మానవ మేధా శక్తితో సమానంగా ఉండగలిగి మరింత మందికి చేరువయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది. -
సకాలంలో..సాధ్యమేనా..?
- ఏటా ఇదే మాట ... చేతికి అందని పుస్తకం - ఏ పుస్తకం లేకుండానే నెలలతరబడి కాలక్షేపం - అప్పటి విద్యాశాఖ డైరెక్టర్ కృషి ఫలితం 2014లో మాత్రమే నెరవేరిన లక్ష్యం - ఈ విద్యా సంవత్సరంలోనూ ఎండమావేనా...? - జిల్లాలో 3,190 ప్రాథమిక, 361 ప్రాథమికోన్నత, 634 ఉన్నత పాఠశాలలు, 14 హయ్యర్ సెకండరీ పాఠశాలలు ఉన్నాయి. - ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సుమారు నాలుగు లక్షల మంది తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ ఏడాది 24 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రతిపాదన. - ఇప్పటికే పుస్తక డిపోలో 1.40 లక్షల పుస్తకాలున్నాయి. ఇందులో 40శాతం ఇంగ్లిషు మీడియం, 60 శాతం తెలుగు మీడియం పుస్తకాలు అవసరం. - మార్చి 20తో విద్యా సంవత్సంర ముగుస్తోంది. ఇప్పటి వరకూ కానరాని కొత్త స్టాకు రాయవరం: విద్యార్థికి, ఉపాధ్యాయుడికి పాఠ్య పుస్తకం ఎంతో అవసరం. అటువంటి పాఠ్య పుస్తకాలను సకాలంలో అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగుస్తోంది. ఏటా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేస్తామని ప్రభుత్వం చెప్పే మాట. వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉండగా అవి సకాలంలో చేరుకుంటాయా అనేది సందేహాస్పదంగా ఉంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ఏప్రిల్ నెలాఖరుకు పుస్తకాల గోదాంకు చేరే అవకాశం ఉన్నట్లు ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏటా ప్రహసనమే.. ప్రతి ఏటా పాఠ్య పుస్తకాలు సమయానికి విద్యార్థులకు అందడం లేదు. 2014లో మాత్రమే ఫిబ్రవరి నెలలో పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరి పంపినీ ప్రహసనంగా మారుతోంది. విద్యా సంవత్సరం ముగియడానికి ముందుగానే పాఠ్య పుస్తకాలు పాఠశాలలకు చేరాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అప్పుడే విద్యా సంవత్సరాన్ని క్రమపద్ధతిలో ప్రారంభించడానికి వీలవుతుందన్నది సుస్పష్టం. పాఠ్య పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా సంవత్సరం ప్రారంభమైనా పాఠ్య పుస్తకాలు సకాలంలో విద్యార్థులకు చేరడం లేదు. 2014లో మాత్రమే బడులు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు అందజేశారు. అప్పట్లో రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌గా పనిచేసిన పూనం మాలకొండయ్య ముందుచూపుతో వ్యవహరించినందునే పిల్లలకు ప్రయోజనం చేకూరింది. 2015లో ఆగస్టు నాటికి కూడా పాఠశాలలకు పూర్తి స్థాయిలో పుస్తకాలు సమకూరకపోగా, 2016లోనూ అదే పరిస్థితి. ఈ ఏడాదైనా పాఠశాలలు పునఃప్రారంభం నాటికి పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు సరఫరా అవుతాయా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 24 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం.. జిల్లాలో 3,190 ప్రాథమిక, 361 ప్రాథమికోన్నత, 634 ఉన్నత పాఠశాలలు, 14 హయ్యర్ సెకండరీ పాఠశాలల విద్యార్థులకు ప్రతీఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లాలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న సుమారు నాలుగు లక్షల మంది తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ మీడియం విద్యార్థులకు ఈ ఏడాది 24 లక్షల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ గుర్తించింది. ఇప్పటికే పుస్తక డిపోలో 1.40 లక్షల పుస్తకాలున్నాయి. ఇందులో 40శాతం ఇంగ్లిషు మీడియం, 60 శాతం తెలుగు మీడియం పుస్తకాలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. జిల్లాకు ఒక్క పుస్తకం రాలేదు.. రాజమహేంద్రవరంలో ఉన్న పుస్తక డిపోకు ఇప్పటి వరకు సంబంధించి ఒక్క పుస్తకం కూడా రాలేదు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 164 టైటిల్స్ రావాల్సి ఉంది. తెలుగు, ఇంగ్లిషు మీడియంలకు సంబంధించిన పాఠ్య పుస్తకాలు ఇంకా డిపోలకు చేరాల్సి ఉన్నట్లు డిపో మేనేజర్ జేమ్స్వేరీ ‘సాక్షి’కి తెలిపారు. జిల్లా డిపోకు చేరిన అనంతరం పాఠ్య పుస్తకాలు మండల కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది. మండల కేంద్రాలకు పుస్తకాలను చేరవేసేందుకు ప్రతి ఏటా టెండర్ ప్రక్రియను నిర్వహిస్తారు. టెండర్ దక్కించుకున్న వారు పాఠ్య పుస్తకాలను మండల కేంద్రాలకు చేరవేస్తారు. పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే సమయానికి పూర్తి స్థాయిలో సరఫరా చేస్తే పాఠశాలలు ప్రారంభం తేదీనే విద్యార్థులకు పూర్తి స్థాయిలో అందజేసేందుకు వీలుంటుందని విద్యావేత్తలు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పుస్తకాల ముద్రణ ప్రారంభం కాలేదని సమాచారం. పుస్తకాల ముద్రణ అనంతరం వచ్చే నెలాఖరుకు జిల్లాలోని పుస్తక డిపోకే చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు నివేదించాం... జిల్లాకు 24 లక్షల పుస్తకాలు అవసరమని గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ నెలాఖరుకు పుస్తక డిపోకు పుస్తకాలు చేరతాయని భావిస్తున్నాం. పుస్తకాలు డిపోకే చేరిన వెంటనే మండల కేంద్రాలకు తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. – ఎస్.అబ్రహం, డీఈవో, కాకినాడ -
ఎంబీబీఎస్‌లో పాఠ్యాంశంగా క్రిటికల్‌కేర్
సాక్షి, సిటీబ్యూరో: అత్యవసర వైద్య సేవల్లో క్రిటికల్‌కేర్ స్పెషలిస్టుల పాత్రే కీలకమని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీరి కొరత తీవ్రంగా ఉన్నందున సమస్య పరిష్కారానికి ఎంబీబీఎస్‌లో క్రిటికల్ కేర్‌ను ఓ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారం హోటల్ మరియట్లో జరిగిన క్రిటికల్‌కేర్ సౌత్‌జోన్ సదస్సులో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు చెందిన 500 మంది వైద్యులు, 250 మంది నర్సులు హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో థుంబై ఆస్పత్రి సీఎండీ డాక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలోనే క్రిటికల్కేర్పై అవగాహన కల్పించడం వల్ల రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఐసీయూ కేర్ సేవలందించేందుకు సమగ్ర బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఐసీయూలో విధిగా నిపుణులను నియమించాలని, లేనిపక్షంలో వాటిని మూసివేయడమే ఉత్తమని సూచించారు. దేశీయంగా తయారైన వైద్య పరికరాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నారు. సదస్సులో మ్యాక్స్‌క్యూర్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ ఘన్‌శ్యామ్, కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ జె.శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సెమ్మెస్‌తో పవర్ ఆన్.. ఆఫ్
రూపొందించిన వరంగల్ జిల్లా యువ ఇంజనీర్ ఆత్మకూరు : ఒక్క ఎస్సెమ్మెస్.. టెక్ట్స్ అయినా, వాయిస్ అయినా ఇట్టే పవర్ ఆన్ అవుతుంది... ఆఫ్ అవుతుంది. ఏ ఊర్లో ఉన్నా ఇంట్లో ఫ్యాన్లు, లైట్లు ఆన్ చేయొచ్చు.. ఆఫ్ చేయొచ్చు. దీన్ని ఆత్మకూరు మండలంలోని కామారం గ్రామానికి చెందిన ఓ యువ ఇంజీనీరింగ్ రూపొం దించాడు. గ్రామానికి చెందిన తోట రాజ్‌కుమార్ పెంబర్తిలోని విద్యాభారతి ఇంజినీరింగ్‌కళాశాలలో 2011లో బీటెక్(ఈసీఈ) పూర్తిచేశాడు. ఈఏడాది వరంగల్‌లోని పాత్‌ఫైండర్ కాలేజీలో ఎంటెక్ పూర్తిచేశాడు. ఇతను ఎస్సెమ్మెస్ ద్వారా పవర్ ఆన్.. ఆఫ్ విధానాన్ని రూపొందించాడు. ఈపరికరాన్ని ఎలా రూపొందించాడో అతని మాటల్లోనే...‘మనం నిజజీవితంలో వాడే ఫ్యాన్, బల్బ్ తదితర విద్యుత్ ఉపకరణాలను స్విచ్‌ల ద్వారా కాకుండా మెస్సేజ్, వాయిస్‌ల ద్వారా కంట్రోల్ చేయవచ్చు. బ్లూ టూత్ లేదా ఏఎంఆర్ వాయిస్ అనే అప్లికేషన్‌తో వాయిస్ కంట్రోల్ ద్వారా కూడా ఆపరేట్ చేయవచ్చు. 8051 మైక్రో కంట్రోల్ పరికరంతో మన ఇంట్లో వస్తువుల అనుసంధానం ద్వారా వీటిని కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ఎంబడ్డెడ్ సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ కాంపోనెంట్స్ ఎల్సీడీ, క్రిస్టల్ ఆస్కిలేటర్, 8051 మైక్రో కంట్రోలర్, జీఎస్ఎం సెట్, మ్యాక్స్232, పీసీ, బ్లూటూత్, రిలేస్, ఫ్యాన్, లైట్ ఉపయోగించాలి. దీనిలో జీఎస్ఎం సెట్ చేసి ఉంటుంది. ఇందులో ఒక సిమ్‌కార్డు ఉంచి ఆనబర్కు మెసేజ్ చేయడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో ముఖ్యమైంది ఏఆర్ఎంటీ(ఎల్పీసీ2148) ప్రాసెసర్ ఫిక్స్ చేయబడి ఉండి మన ఆదేశాలను తీసుకొని బైనరీ ఫామ్‌కు మార్చుకొని మనకు అవుట్‌పుట్‌ని అందిస్తాయి. దీన్ని ఇంటర్నెట్ మరియు మొబైల్ద్వారా ఎస్సెమ్మెస్ చేసి ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. వాయిస్ కంట్రోల్ అయితే 20 మీటర్ల దూరం నుంచి బ్లూటూత్సహాయంతో , ఆటోమేటిక్ కాల్లిఫ్టర్, జీఎస్ఎం సెట్ ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. ఈపరికరంతో బహుళ అంతస్తుల భవనాలు, కంపెనీలు, షోరూంలు, సంస్థలు, గృహాల్లో తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువగా లబ్ధి పొందవచ్చు.’ తనకు ఆర్థికసాయం చేస్తే ఈపరికరాన్ని మార్కెట్లోకి తీసుకువస్తానని రాజ్‌కుమార్ పేర్కొన్నారు. -
గజిబిజి టెక్స్ట్‌కు గుడ్‌బై...
ఈమెయిళ్లుగానీ, వెబ్సైట్ల నుంచి కాపీ చేసుకున్న టెక్స్ట్ కానీ... వర్డ్ప్రాసెసర్ ద్వారా ప్రింట్ చేశామనుకోండి. రకరకాల గుర్తులతో, అక్షరాలు దూరదూరంగా ప్రింట్ అవుతాయి. ఒరిజినల్ టెక్ట్స్‌లో ఉన్న ఫార్మాట్ల ఫలితమిది. వీటిని సులువుగా తొలగించుకునేందుకు ఎన్నో ఆప్షన్లున్నాయి. వాటిల్లో మచ్చుకు మూడు మీకోసం... స్ట్రిప్ మెయిల్: నెట్లో (ఠీఠీఠీ.ట్టటజీఞఝ్చజీ.్ఛ్ట) ఉచితంగా లభించే చిన్న సాఫ్ట్వేర్ ఇది. అన్ని రకాల ఈమెయిల్ క్లైయింట్లతో పనిచేస్తుంది. ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలో మామూలుగా కనిపించే కొన్ని గుర్తులను చెరిపేసి... టెక్ట్స్ సాఫీగా ఉండేలా చేస్తుంది. అక్షరాలు మొత్తం కుడివైపు నుంచి కుదురుగా మొదలవడంతోపాటు పేరాలుగా ఉండేలా చేస్తుంది. కేవలం 279 కిలోబైట్ల సైజుండే ఈ సాఫ్ట్‌వేర్‌ను డెస్క్టాప్పై ఉంచుకుని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. తద్వారా టెక్ట్స్ చూడటానికి బాగా కనిపిస్తుంది. కాగితం వృథా కాదు కూడా. ఈమెయిల్ స్ట్రిప్పర్: మెయిల్ ఫార్వర్డ్ చేసిన ప్రతిసారీ లైన్ మొదలయ్యే చోట ’ాాాా ’ గుర్తులు కనిపించడం మనం చూసే ఉంటాం. ఈ మెయిల్స్ట్రిప్పర్ సాఫ్ట్‌వేర్‌తో ఈ ఇబ్బందికి చెక్ పెట్టవచ్చు. ఎన్నిసార్లు ఫార్వర్డ్ చేసిన మెయిలైనా ఒకసారి దీంట్లో పడితే క్లీన్‌గా మారిపోతుంది. ఈమెయిల్‌లోని సమాచారం మొత్తాన్ని ఈ సాఫ్ట్‌వేర్‌లో పడేయడం ఒక్కటే మీరు చేయాల్సింది. ఆ తరువాత మీరు యథావిధిగా టెక్స్ట్‌ను కాపీ చేసి మెయిల్లో పేస్ట్ చేసి వాడుకోవచ్చు. సీనెట్ వంటి సైట్లలో ఉచితంగా లభిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అన్ని వెర్షన్ల విండోస్‌తో, లీనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనూ పనిచేయగలదు. క్లిప్పీ: ఫార్వర్డ్ చేసిన మెయిళ్లలో హెచ్‌టీఎంఎల్ ట్యాగ్లతోపాటు అనవసరమైన గుర్తులన్నింటినీ చెరిపేసి టెక్ట్స్‌ను కంటికి నదురుగా మార్చి ఇస్తుంది ఈ క్లిప్పీ సాఫ్ట్వేర్. రీఫార్మాట్ చేయాల్సిన టెక్స్ట్‌ను క్లిప్‌బోర్డ్‌లో పేస్ట్ చేసి సిస్టమ్ ట్రేలో ఉన్న క్లిప్పీ ఐకాన్‌ను క్లిక్ చేస్తే చాలు. దీంతోపాటు పదాలను లెక్కించేందుకు, పదాల మధ్యలో ఉండే అనవసరమైన వైట్ స్పేసెస్‌ను తొలగించేందుకు, కొన్ని ఇతర పనులకు కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని విండోస్ ఓఎస్ వెర్షన్లతో పనిచేస్తుంది. -
పాఠ్యాంశంగా యోగా
గవర్నర్ వీఆర్ వాలా సూచన సాక్షి, బెంగళూరు: సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యమయమైన జీవనాన్ని పొందేందుకు గాను చిన్నతనం నుంచే ‘యోగా’ను నేర్చుకోవాలని, ఇందుకోసం ఒకటో తరగతి నుంచే పాఠ్యాంశాల్లో ‘యోగా’ను తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని గవర్నర్ వజూభాయ్ రుడాభాయ్ వాలా సూచించారు. కర్ణాటక యోగా అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రకళాక్షేత్రలో నిర్వహించిన ప్రముఖ యోగాగురు డాక్టర్ బీకేఎస్ అయ్యంగార్ సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చిన్నారులకు యోగాపై ఆసక్తిని పెంపొందించేందుకు గాను ఒకటో తరగతి నుంచి యోగా, ధ్యానానికి సంబంధించిన శిక్షణను పాఠ్యాంశంగా చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి విధానాన్ని ఇదివరకే గుజరాత్లో అమల్లోకి తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉదాత్త భావాలు, సరళమైన జీవనశైలి భారతీయ సంస్కృతిలో భాగమని, అయితే ఇప్పటి తరం ఎక్కువగా పాశ్యాత్య సంస్కృతి వైపు మొగ్గు చూపిస్తోందని అన్నారు. ఏరోబిక్స్, జిమ్ తదితర వ్యాయామాలు శారీరక ధారుడ్యాన్ని మాత్రమే ఇస్తాయని, అయితే యోగా మాత్రం శారీరక ధారుడ్యంతో పాటు మానసిక ధారుడ్యాన్నీ పొందేందుకు సహకరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యోగా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ హెచ్ఆర్ నాగేంద్ర, శ్వాసగురు వచనానందస్వామీజీ తదితరులు పాల్గొన్నారు.