
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన విర్చ్యువల్ అసిస్టెంట్ 'ఎం'ను మూసివేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇది ఫేస్‌బుక్ మెస్సెంజర్‌లోని ఒక టెక్ట్స్ రోబోట్. ఈ వీఆర్ ఎం ను ఫేస్‌బుక్ 2015 ఆగస్టులో ప్రారంభించింది. దాదాపు రెండున్నరేళ్లపాటు సేవలందించిన దీనికి త్వరలో వీడ్కోలు పలకనున్నారు. 2018 జనవరి 19 వీఆర్ ఎం కు చివరి రోజు కానుంది. ప్రజల అవసరాలను తెలుసుకోవడానికి దీనిని తయారు చేశామని, తద్వారా ఫేస్‌బుక్ చాలా విషయాలను తెలుసుకుందని యంత్రాంగం తెలిపింది.
ఫేస్‌బుక్‌లోని ఇతర విభాగాల్లో ఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకుంటామని ఫేస్‌బుక్ తెలిపింది. అంతేకాకుండా మరో కీలక ప్రకటన కూడా చేసింది. ప్రస్తుతం 'ఎం' 2వేల మందికి మాత్రమే ఉపయోగకరంగా ఉందని, దీనిని మరింత అభివృద్ధి పరిచి అందరికీ ఉపయోగ పడేలా తిరిగి బీటా వెర్షన్‌లో తీసుకువస్తామని ప్రకటించింది. మానవ మేధా శక్తితో సమానంగా ఉండగలిగి మరింత మందికి చేరువయ్యేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అందుబాటులోకి తెస్తామని తెలిపింది.