గూగుల్‌ ఉద్యోగికి ఫేస్‌బుక్‌ రూ. 44 లక్షల నజరానా | FB Fixes Messenger Bug That Allowed Hackers To Spy On Users | Sakshi
Sakshi News home page

గూగుల్‌ ఉద్యోగికి ఫేస్‌బుక్‌ రూ. 44 లక్షల నజరానా

Published Mon, Nov 23 2020 10:30 AM | Last Updated on Mon, Nov 23 2020 12:20 PM

FB Fixes Messenger Bug That Allowed Hackers To Spy On Users - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఏంతో మంది వాడుతున్న ఫేస్‌బుక్‌ యొక్క మెసెంజర్ యాప్‌లో కీలకమైన లోపాన్ని గుర్తించిన గూగుల్‌ ఉద్యోగికి భారీ నజరానా లభించింది. ఈ లోపంతో హ్యాకర్లు మెసెంజర్ యాప్‌లో ఇద్దరి మధ్య జరిగే కాల్ సంభాషణలను వినే అవకాశం ఉన్న విషయాన్ని గూగుల్‌కి చెందిన ప్రాజెక్ట్ జీరో బగ్‌-హంటింగ్‌లో పనిచేసే నటాలీ సిల్వనోవిచ్‌ అనే మహిళా ఉద్యోగి గుర్తించారు.  కేవలం ఆండ్రాయిడ్ మెసేంజర్ యాప్‌లో మాత్రమే ఈ లోపాన్ని గుర్తించినట్టు సదరు ఉద్యోగి తన రిపోర్ట్‌లో పేర్కొన్నారు ఫేస్‌బుక్ వినియోగదారులపై ఈ లోపం ద్వారా హ్యాకర్లు నిఘా పెట్టడానికి సహాయపడుతుందని జెడ్‌నెట్ నివేదించింది. ‌

అయితే, ఈ బగ్‌ని అక్టోబరు 6వ తేదీన గుర్తించిన ఆమె..ఫేస్‌బుక్‌కి సమాచారం అందించిందట. ఈ లోపాన్ని గుర్తించినందుకు గాను ఫేస్‌బుక్‌ సిల్వనోవిచ్‌కు 60 వేల డాలర్ల (సుమారు 44 లక్షలు రూపాయిలు) బహుమతిని అందించింది. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా ఆ లోపాన్ని సరిచేసినట్లు తెలిపింది. గతంలో కూడా సిల్వనోవిచ్‌ వాట్సాప్‌, ఐమెసేజెస్‌, విఛాట్‌, సిగ్నల్, రిలయన్స్‌ జియో ఛాట్ వంటి యాప్స్‌లో లోపాల్ని గుర్తించింది. (చదవండి: దేశంలో స్మార్ట్ స్పీకర్లకు భారీ డిమాండ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement