
న్యూఢిల్లీ: వాట్సాప్, ఫేస్‌బుక్‌పై నిషేధం విధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) కేంద్రాన్ని కోరింది. వాట్సాప్ యూజర్ల యొక్క వ్యక్తిగత డేటా, చెల్లింపు లావాదేవీలు, కాంటాక్ట్స్, లొకేషన్, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని సేకరించడాన్ని సీఐఐటి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను దేశంలో అమలు చేయకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు పంపిన లేఖలో సీఐఐటి పేర్కొంది.(వాట్సాప్‌తో బతుకు బహిరంగమేనా..?)
ప్రస్తుతం దేశంలో 200 మిలియన్లకు పైగా ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్నారు. ఒక సంస్థ ప్రతి యూజర్ డేటాను యాక్సెస్ చేయటం ఆర్థిక వ్యవస్థకు మాత్రమే కాకుండా దేశ భద్రతకు కూడా తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది అని సీఐఐటి పేర్కొంది. "ఉప్పును మాత్రమే అమ్మడానికి భారతదేశంలోకి ప్రవేశించిన ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత దేశాన్ని ఆక్రమించిన రోజులను ఇది గుర్తుచేస్తుంది. అయితే, ప్రస్తుత సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ, సామాజిక నిర్మాణం మొదలైన వాటి వెన్నెముకను నాశనం చేయడానికి ఇది వారికీ చాలా కీలకమైన డేటా. వాట్సాప్, ఫేస్‌బుక్‌లను వినియోగించినందుకు యూజర్లు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా ఇప్పుడు వినియోగదారుల డేటాను తస్కరించడం వారి యొక్క కుటిలత్వాన్ని బయటపెట్టింది. ఈ నిర్ణయంతో భారతదేశం యొక్క వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ప్రయత్నిస్తుంది"అని సీఐఐటి కేంద్రానికి రాసిన లేఖలో తెలిపింది.
"వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలు వ్యక్తి యొక్క గోప్యతను ఆక్రమించడం, భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉంది. అందుకే ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని సీఐఐటి కోరింది" అని సిఐఐటి జాతీయ అధ్యక్షుడు బిసి భారతీయ, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment