గత సంవత్సరంతో పోల్చితే న్యూ ఇయర్ ఈవెంట్ రోజున వాట్సాప్ వీడియో, వాయిస్ కాల్స్ 50 శాతం పెరిగినట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ ల్లో ఒకటి. వాట్సాప్ ద్వారా ఎటువంటి ఆటంకం లేకుండా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా చాలా మంది ఇంటిలోనే ఉంటున్నారు. వారిలో చాలా మంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వాట్సాప్ కాల్స్ సేవలను ఉపయోగించారు. వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ న్యూ ఇయర్ ఈవెంట్ కి సంబందించిన కొన్ని గణాంకాలను విడుదల చేసింది. న్యూ ఇయర్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 1.4 బిలియన్లకు పైగా వీడియో, వాయిస్ కాల్స్ చేసుకున్నట్లు తెలిపింది. అలాగే సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా లైవ్ స్ట్రీమ్స్ చేసినట్లు పేర్కొంది.(చదవండి: గెలాక్సీ ఎస్ 21 టీజర్ విడుదల)
Comments
Please login to add a commentAdd a comment