
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ మీడియాలో సాధారణంగా మనకు నచ్చిన ప్రతీ వీడియోను పోస్ట్ చేస్తూ ఉంటాం. అందుకోసం వాట్సాప్ స్టేటస్, ఫేసుబుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లోని స్టోరీస్ లలో వీటిని పోస్ట్ చేస్తుంటాం. ట్విటర్ లో కూడా ఫ్లీట్స్ పేరుతో పిలవబడే ఒక ఫీచర్ ఉంది. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ అందులో ఉన్న ఒక భారీ లోపం తాజాగా బయటపడింది. ట్విటర్ ఫ్లీట్స్‌లో చేసిన పోస్టులు 24 గంటలు తర్వాత ఆటో మేటిక్‌గా డిలీట్ కావాలి. కానీ సాంకేతిక సమస్య కారణంగా వాటిలో ట్విటర్ ఫ్లీట్స్‌లో చేసిన పోస్టులు 24 గంటల తర్వాత కూడా కనిపిస్తున్నాయి.
ట్విటర్ ఫ్లీట్స్‌లో పెట్టిన పోస్టులు బగ్ వల్ల 24 గంటలకు పైగా కనబడుతున్న విషయాన్ని ముందుగా ట్విట్టర్ యూజర్ @donk_enby గుర్తించి దాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, ఈ లోపం కారణంగా ఫ్లీట్స్ లో పెట్టిన పోస్టులను ఎవరు చూస్తున్నారో మరియు డౌన్‌లోడ్ చేసుకుంటున్నారో ఫ్లీట్ యూజర్లకు తెలియజేయడం లేదని టెక్ క్రంచ్ తెలిపింది. ‘ఫ్లీట్స్ లో కొన్ని మీడియా URLలు సాంకేతిక లోపం కారణంగా 24 గంటల తర్వాత కూడా అందుబాటులో ఉంటున్నాయని, వీటిని త్వరగా పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాము అని’ అని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతానికి, ఎవరైనా పోస్టులను ఫ్లీట్ లో పోస్ట్ చేయాలనుకుంటే మాత్రం సమస్యను పరిష్కరించేంత వరకు ఆ పోస్టులను ఇతర సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమో లేదా విరమించుకోవడం మంచిదని తెలిపారు. (చదవండి: గూగుల్ ఉద్యోగికి ఫేస్‌బుక్ రూ. 44 లక్షల నజరానా)
Comments
Please login to add a commentAdd a comment