ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా డౌన్‌..! ట్విటర్‌లో యూజర్ల అరాచకం...! | Social Humour Memes Soared In Twitter As IG FB Whatsapp Down | Sakshi
Sakshi News home page

FB, Whatsapp, Instagram Down: ట్విటర్‌లో యూజర్ల గోలాగోలా..! ఇవి చూస్తే నవ్వలేక చచ్చిపోవాల్సిందే..!

Published Tue, Oct 5 2021 4:19 PM | Last Updated on Tue, Oct 5 2021 4:23 PM

Social Humour Memes Soared In Twitter As IG FB Whatsapp Down - Sakshi

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మన అందరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్‌మీడియాలో గంటల కొద్ది కాలక్షేపం చేస్తూ ఉంటాం. నిన్న ఒక్కసారిగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అవ్వడంతో యూజర్లు కంగారు పడ్డారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టా డౌన్‌ అవ్వడంతో ట్విటర్‌లో యూజర్లు రకరకాలుగా స్పందించారు. 

ట్విటర్‌కు పరుగోపరుగు..!
నిన్న ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ డౌన్‌ అయిన విషయం తెలిసిందే. మనలో చాలా మంది ఫేస్‌బుక్‌ సర్వర్లు డౌన్‌ ఐనా విషయం తెలియకా మన స్మార్ట్‌ఫోన్లను స్విచ్‌ ఆఫ్‌ చేసి మళ్లీ అన్‌ చేసి ఉండే ఉంటాం. మరి కొంత మంది యూజర్లు ఇంటర్నెట్‌ సరిగ్గా రావడం లేదంటూ ఆయా నెట్‌వర్క్‌ ప్రొవైడర్లకు ఫోన్‌ చేశారు. తరువాత కొద్ది సేపు అయ్యాక ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సర్వర్లు డౌన్‌ ఐనా విషయాన్ని తెలుసుకుని యూజర్లు కాస్త కుదుటపడ్డారు. ఈ మూడు యాప్స్‌ డౌన్‌ అవ్వడంతో యూజర్లు ఒక్కసారిగా ట్విటర్‌, టెలిగ్రాం, స్నాప్‌చాట్‌ పరుగులు పెట్టారు. మనలో కూడా చాలా మంది ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మనము కూడా వెళ్లాము. 
చదవండి: ఫేస్‌బుక్‌ యూజర్లకు మరో భారీ షాక్‌..!

మీమ్స్‌తో హల్‌చల్‌..!
ట్విటర్‌లో కొంతమంది యూజర్లు అసహనం కోల్పోయి ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, వాట్సాప్‌ సర్వీసెస్‌పై వీపరితమైన  మీమ్స్‌తో హల్‌చల్‌చేశారు. సందు దొరికింది కదా అని ట్విటర్‌  కూడా ‘హాలో లీట్‌ర్లలీ ఎవ్రీవన్‌’ అంటూ ట్రోల్‌ చేసింది. ప్రముఖ ఆస్ట్రోనాట్‌ టెర్రీ వీర్ట్స్ ట్విటర్‌లో...‘ ఇక్కడ అంతరిక్షంలో కూడా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయడం లేదంటూ’ ట్విట్‌ చేశాడు.  ట్విటర్‌లో యూజర్లు షేర్‌ చేసిన మీమ్స్‌ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే....

ట్విటర్‌ ట్రెండ్‌ ఐనా కొన్ని మీమ్స్‌ మీ కోసం...!

చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్‌ ఫేస్‌బుక్‌ ట్రెండ్‌! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్‌, టెలిగ్రామ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement