servers down
-
బీసీ బంధు: సాయం సరే..దరఖాస్తెలా?
సాక్షి, హైదరాబాద్/కుత్బుల్లాపూర్: వెనుకబడిన వర్గాల్లోని కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం..బీసీ కులాల వారు కుత్బుల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రోజంతా పడిగాపులు కాశారు. దరఖాస్తుకు గడువు మంగళవారం ముగియనుండటంతో అధిక సంఖ్యలో బీసీలు అక్కడికి వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో కార్యాలయం గేటుకు తాళం వేయడంతో సర్టిఫికెట్లు అందనివారు సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. విధులు ముగించుకుని వెళ్తున్న తహసీల్దార్ సంజీవరావుకు తమ గోడు చెప్పుకున్నారు. సర్టిఫికెట్లు లేకపోతే లక్ష సాయం అందకుండా పోతుందని వాపోయారు. చింతల్‌కు చెందిన మంగలి సంగమేశ్వర్ చొక్కా విప్పి గేటు ముందు బైఠాయించారు. ఈ నెల 8న ఆదాయ పత్రం కోసం మీ సేవలో దరఖాస్తు చేశానని, మూడు రోజులుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయం చుట్టూ తిరిగినా పని అవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల కోసం ఇక్కడ 12,240 దరఖాస్తులు అందగా కేవలం 4 వేలు మాత్రమే పరిష్కారమయ్యాయి. కాగా సర్వర్ డౌన్ కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తహసీల్దార్ చెప్పారు. సిబ్బంది పగలు, రాత్రి పనిచేస్తున్నారని వివరించారు. ఒక్క కుత్బుల్లాపూర్ మండలంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. చాలామంది ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా మంగళవారం కూడా సర్టిఫికెట్లు అందలేదు. మరోవైపు సర్టిఫికెట్లు అందినవారు దరఖాస్తు చేసుకునేందుకు కూడా ఇబ్బందులెదురయ్యాయి. 5 లక్షలకు పైగానే దరఖాస్తులు లక్ష రూపాయల సాయానికి దరఖాస్తు చేసుకునే గడువు మంగళవారం అర్ధరాత్రి 12 గంటలతో ముగుస్తుండడం, గడువు పెంచేది లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేయడంతో ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీసేవా సెంటర్లు, ఇతర కంప్యూటర్ సెంటర్లు దరఖాస్తుదారులతో కిటకిటలాడాయి. మరోవైపు కుల, ఆదాయం సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు కనిపించాయి. సర్టిఫికెట్లు పొందలేని వారు నిరాశతో వెనుదిరిగారు. ఇక దరఖాస్తులు ఒక్కసారిగా పోటెత్తడంతో చాలా ప్రాంతాల్లో సర్వర్ మొరాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల దరఖాస్తులు మాత్రమే వస్తాయని ప్రభుత్వం భావించినప్పటికీ, భారీ స్పందన నేపథ్యంలో మంగళవారం రాత్రి 8 గంటల వరకే 5 లక్షల దరఖాస్తులు వ చ్చి నట్లు బీసీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. అయితే రాత్రి పొద్దుపోయే వరకు అందిన సమాచారం మేరకు 5 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో అర్హులను ఎంపిక చేసి జూలై 15 నుంచి దశల వారీగా ఆర్థిక సాయం చెక్కుల రూపంలో అందజేస్తారు. దరఖాస్తు గడువు తేదీ పొడిగించాలి రూ.లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు గౌడ కులస్తులకు మొన్ననే అవకాశం ఇచ్చారు. దరఖాస్తు చేసుకుందామని మీ సేవా కేంద్రానికి వెళితే సర్వర్ డౌన్ అయిందని చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక ఇంటికొచ్చా. ప్రభుత్వం దరఖాస్తు గడువు పొడిగించాలి. లేకపోతే మాలాంటి నిరుపేద చేతి వృత్తుల వారికి ఆర్థిక సాయం అందకుండా పోతుంది. –ముత్తంగి ఇందిర, కొత్లాపూర్, సంగారెడ్డి జిల్లా వారం క్రితం దరఖాస్తు చేసినా సర్టిఫికెట్లు రాలేదు లక్ష సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కుల, ఆదాయ సర్టిఫికెట్లు అవసరం. వాటికోసం ఈనెల 14వ తేదీన దరఖాస్తు ఇస్తే ఇప్పటికీ ఇవ్వలేదు. తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయా. మంగళవారం చివరి రోజు కావడంతో నల్లగొండ ఆర్డీవో కార్యాలయంలో సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారని తెలిసి ఇక్కడికి వచ్చా. సర్టిఫికెట్లు ఎప్పుడు వస్తాయో, దరఖాస్తు చేస్తానో లేదో తెలియడం లేదు. – బొడ్డుపల్లి నరసింహ, నల్లగొండ టౌన్ -
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లపై దాడి.. చైనా హ్యాకర్ల పనే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లోని సర్వర్లపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌పై సైబర్ దాడి చైనా హ్యకర్ల పనేనని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. హ్యకింగ్‌కు గురైన లక్షల మంది రోగుల వివరాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందాయని పేర్కొంది. ‘ఎయిమ్స్ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే. హ్యకింగ్ చైనా నుంచే జరిగినట్లు విచారణలో తేలింది. మొత్తం 100 సర్వర్లున్న ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్‌గా 60 వర్చువల్‌గా పనిచేస్తున్నాయి.ఇందులో ఐదు ఫిజికల్ సర్వర్లలో హ్యకింగ్ జరిగింది. ఇది చాలా నష్టాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు హ్యకింగ్‌కు గురైన అయిదు సర్వర్లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందాం’ అని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది. మొదట నవంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సిస్టమ్స్ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఎయిమ్స్‌లోని సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు గుర్తించింది. అయితే సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు హ్యాకర్లు రూ. 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఖండించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్లపై దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారణ చేపట్టింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్ సెక్యూరిటీ హెడ్ మాట. చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం -
స్తంభించిన గూగుల్ సేవలు..! ట్విట్టర్లో యూజర్ల అరాచకం..!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచి గూగుల్ వెబ్ సైట్ ఓపెన్ కాలేదు. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌తో పాటు జీమెయిల్ సర్వీస్, యూట్యూబ్,గూగుల్ మ్యాప్స్ సైతం పనిచేయడం లేదంటూ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గూగుల్‌లో సెర్చ్ చేసే సమయంలో గూగుల్ సర్వర్‌లో 502 ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. టెంపరరీగా ఆగిపోవడంతో పాటు ప్లీజ్ ట్రై ఎగైన్ ఇన్ 30 సెకెండ్స్ అని చూపిస్తుంది. ఇంటర్నల్ సర్వర్లలో అంతరాయం ఏర్పడించింది. మీ రిక్వెస్ట్‌ను ప్రాసెసింగ్ చేస్తున్నాం అంటూ రిప్లయి రావడంపై యూజర్లు..గూగుల్‌కు మెయిల్స్ పెడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో వెంటనే సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు. అదే సమయంలో దేశ వ్యాప్తంగా గూగుల్ ట్రెండ్స్ కూడా పనిచేయడం లేదని తెలుస్తోంది. గూగుల్ ట్రెండ్స్ విభాగం ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. అందులో బ్లాంక్ పేజ్ కనిపించడంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యూజర్లు..గూగుల్ పనిచేయడం లేదంటూ ఆ సంస్థకు వరుస ట్వీట్లు చేస్తున్నారు. కొంత యూజర్లు ఏకంగా గూగుల్‌ను వదిలేసి ట్విట్టర్‌ను వినియోగిస్తామంటూ ట్వీట్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. ప్రస్తుతం ఆ మీమ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా అవి మీకోసం. everyone in the world running to twitter after using google : pic.twitter.com/c4OzMoCxc1 — Carla Ng (@cnntwlc) August 9, 2022 Me omw to twitter to check if google is down for anyone else since I cant google search it #googledown pic.twitter.com/g797tcAv1q — Ur mom (@bigfatBUSSY6) August 9, 2022 Me switching to twitter after experiencing error 500 in google#Google #googledown pic.twitter.com/hu4TMsB2K5 — 1038 (@remier_acbang) August 9, 2022 Se cayó Google alv xd pic.twitter.com/WO1HDNblta — Yisus Gonzalez🍀🚂🇲🇽🐉 (@YisusRGR) August 9, 2022 trying to revive internet explorer with google being down pic.twitter.com/zujf1vNbpr — mou ☘️🌐 (@pxresouls) August 9, 2022 -
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా డౌన్..! ట్విటర్లో యూజర్ల అరాచకం...!
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మన అందరి జీవితంలో ఒక భాగమైపోయింది. సోషల్‌మీడియాలో గంటల కొద్ది కాలక్షేపం చేస్తూ ఉంటాం. నిన్న ఒక్కసారిగా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అవ్వడంతో యూజర్లు కంగారు పడ్డారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా డౌన్ అవ్వడంతో ట్విటర్లో యూజర్లు రకరకాలుగా స్పందించారు. ట్విటర్‌కు పరుగోపరుగు..! నిన్న ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్ అయిన విషయం తెలిసిందే. మనలో చాలా మంది ఫేస్బుక్ సర్వర్లు డౌన్ ఐనా విషయం తెలియకా మన స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి మళ్లీ అన్ చేసి ఉండే ఉంటాం. మరి కొంత మంది యూజర్లు ఇంటర్నెట్ సరిగ్గా రావడం లేదంటూ ఆయా నెట్వర్క్ ప్రొవైడర్లకు ఫోన్ చేశారు. తరువాత కొద్ది సేపు అయ్యాక ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ ఐనా విషయాన్ని తెలుసుకుని యూజర్లు కాస్త కుదుటపడ్డారు. ఈ మూడు యాప్స్ డౌన్ అవ్వడంతో యూజర్లు ఒక్కసారిగా ట్విటర్, టెలిగ్రాం, స్నాప్‌చాట్ పరుగులు పెట్టారు. మనలో కూడా చాలా మంది ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మనము కూడా వెళ్లాము. చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..! మీమ్స్‌తో హల్చల్..! ట్విటర్లో కొంతమంది యూజర్లు అసహనం కోల్పోయి ఫేస్బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ సర్వీసెస్‌పై వీపరితమైన మీమ్స్‌తో హల్చల్చేశారు. సందు దొరికింది కదా అని ట్విటర్ కూడా ‘హాలో లీట్ర్లలీ ఎవ్రీవన్’ అంటూ ట్రోల్ చేసింది. ప్రముఖ ఆస్ట్రోనాట్ టెర్రీ వీర్ట్స్ ట్విటర్లో...‘ ఇక్కడ అంతరిక్షంలో కూడా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ పనిచేయడం లేదంటూ’ ట్విట్ చేశాడు. ట్విటర్లో యూజర్లు షేర్ చేసిన మీమ్స్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే.... ట్విటర్ ట్రెండ్ ఐనా కొన్ని మీమ్స్ మీ కోసం...! Nope doesn’t work here either https://t.co/boMPVETqZG pic.twitter.com/F7PDAV44AH — Terry Virts (@AstroTerry) October 4, 2021 Twitter right now as WhatsApp, Instagram and Facebook crash #instagramdown pic.twitter.com/zSHya9uxC0 — Thando (@whoistedo) October 4, 2021 Mark Zuckerberg right now: pic.twitter.com/QzwPkJcymz — Ntuthuko (@ntux_SA) October 4, 2021 People coming to Twitter to check what's going on with Facebook and Whatsapp : pic.twitter.com/ZPID626KUI — عبـّود (@i6tx2) October 4, 2021 Mark Zuckerberg right now. #instagramdown #whatsappdown pic.twitter.com/TkybG8hay5 — Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) October 4, 2021 Mark trying to fix Whatsapp, Instagram and Facebook at the same time. pic.twitter.com/n0WZSwLYon — Mazi Gburugburu Son (@Maziify07) October 4, 2021 Mark zuckerberg right now. 😂 pic.twitter.com/CaMX9fqzWy — Thoha Yasin 🇲🇻 (@ThohaYasin) October 4, 2021 Me after switching between my wifi and data only to realise that instagram and facebook are down #instagramdown pic.twitter.com/DaoQijRAXM — Benji (@Cule_Ben) October 4, 2021 చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
ప్రాంతీయ భాషల్లో వెబ్సైట్లకు సర్వర్లు సిద్ధం
న్యూఢిల్లీ: తెలుగు సహా తొమ్మిది భారతీయ భాషల్లో వెబ్సైట్లను రిజిస్టర్ చేసుకునేందుకు ఉపయోగపడేలా అంతర్జాతీయ ఇంటర్నెట్ సర్వర్లు సిద్ధమవుతున్నాయి. జూన్ కల్లా ఈ ప్రక్రియ పూర్తి కాగలదని యూనివర్సల్ యాక్సెప్టెన్స్ స్టీరింగ్ గ్రూప్ (యూఏఎస్జీ) చైర్మన్ అజయ్ డాటా తెలిపారు. ఈ తొమ్మిది భాషల్లో తెలుగు సహా తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతి, బెంగాలీ, ఒరియా మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్ కాకుండా దేవనాగరి, అరబిక్, మాండరిన్, రష్యన్ తదితర కొన్ని భాషల్లో మాత్రమే వెబ్‌సైట్‌ను నమోదు చేసుకోవడానికి వీలుంటోంది. ఇంటర్నెట్ వెబ్సైట్ల పేర్లు తదితర అంశాలను సమీక్షించే అంతర్జాతీయ సమాఖ్య ఐకాన్‌లో భాగంగా యూఏఎస్జీ ఏర్పాటైంది. అరబిక్, హీబ్రూ, జపానీస్, థాయ్ తదితర భాషల్లో వెబ్సైట్ల నమోదుకు అవసరమైన ప్రమాణాలను రూపొందించే బాధ్యత దీనికి అప్పగించారు. -
‘ఈ-పాస్’ ఇక్కట్లు
మహారాణిపేట(విశాఖపట్నం): ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసరాలు పక్కదారి పట్టకుండా అడ్డుకట్ట వేసే లక్ష్యంతో అమలు చేస్తున్న ఈ-పాస్ (ఎలక్ట్రానిక్ పేమెంట్ అండ్ అప్లికేషన్ సిస్టమ్) ఆదిలోనే ఇక్కట్ల పాల్జేస్తోంది. ప్రారంభానికి ముందే మిషన్లు మొరాయిస్తున్నాయి. సెల్నెట్వర్క్లు సరిగా పనిచేయడం లేదు. తరచూ సర్వర్లు డౌన్ అయిపోతున్నాయి. ఏప్రిల్1వ తేదీ నుంచి అమలు చేయనున్న ఈ విధానం అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతుంది. జిల్లాలో 2063 రేషన్ దుకాణాలుండగా తొలిదశలో జీవీఎంసీతో పాటు భీమిలి, అనకాపల్లి, నర్సీపట్నం, యలమంచలి మున్సిపాల్టీల పరిధిలో ఉన్న 686 షాపుల్లో అమలు చేయాలని సంకల్పించారు. కానీ తొలి విడతలో 430 మిషన్లు మాత్రమే కేటాయించడంతో వాటిలో జీవీఎంసీ పరిధిలో 290, ఇతర మున్సిపాల్టీల్లో 90 షాపులకు కేటాయించారు. మిగిలినవి రిజర్వుగా ఉంచారు. ఆ తర్వాత దశల వారీగా జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీప్రాంతాల్లో అమలు చేయాలని నిర్ణయించారు. కేటాయించిన మిషన్ల ద్వారా ఆయా షాపుల పరిధిలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి క్రమం తప్పకుండా రేషన్ తీసుకునేందుకు వచ్చే కుటుంబసభ్యుల వేలిముద్రలు సేకరిస్తున్నారు. ఇక్కడే అసలు సమస్యమొదలవుతోంది. వేలిముద్రలుతీసుకునే సమయంలో ఈ మిషన్లు సరిగాపనిచేయకపోవడం...సర్వర్లు డౌన్వడం..నెట్‌వర్క్‌లు పనిచేయకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ‘ఈ పాస్’ పనిచేసే తీరు ఇలా..! రేషన్‌కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే హైదరాబాద్‌లోని సెంట్రల్ సివిల్ సప్లయిస్ సర్వర్‌తోనూ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెంగుళూరులోని ఆధార్ సర్వర్తోను కనెక్ట్ అవుతుంది. వేలిముద్రలుతీసుకోగానే కార్డు తీసుకున్నప్పుడు సేకరించిన వేలి ముద్ర లతో సెంట్రల్ సర్వర్ నుంచి సరిపోల్చుకుంటుంది. అలా ఈ మూడు సర్వర్ల నుంచి క్షణాల్లో మిషన్‌కు సంకేతాలొస్తాయి. అన్నీ సరిపోతే ఆరేషన్కార్డులో ఎంతమంది సభ్యులున్నారు? వారికి ఏ సరుకులు ఎంత కేటాయించారు? దరఎంత? అనేవివరాలు మిషన్‌లో చూపిస్తాయి. కానీ ఇప్పుడు వేలిముద్రలు సేకరించే సమయంలోనే మిషన్లు మొరాయిస్తుండడం అధికారులకు తలనొప్పిగా మారింది. నెట్వర్కింగ్ అసలు సమస్య..! ఈ-పాస్ మిషన్లు పని చేయకపోవడానికి ప్రభుత్వం ఇచ్చిన సిమ్కార్డులే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. 1జీబీ కెపాసిటీ గల సిమ్‌కార్డులు ఇవ్వడంతో వాటి ద్వారా సిగ్నల్స్ రాక నెట్వర్క్ (ఇంటర్నెట్)కనెక్ట్ కాకపోవడంతో రోజంతా సమయం వృధా అవుతోంది.విశాలంగా ఉన్న ప్రాంతాల్లో పని చేస్తున్నాయని, ఇరుకుగా, చిన్నచిన్న సందుగొందులుగా ఉన్న ప్రాంతాల్లో అసలు పనిచేయడంలేదని సిబ్బంది వాపోతున్నారు. మిషన్లలో నాణ్యత లేకపోవడమా లేక సిమ్కార్డులే పనిచేయడం లేదా అనేది అధికారులు చెప్పలేక పోతున్నారు. వేలిముద్రలకు నరకయాతనే: రేషన్ తీసుకోవాలంటే లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లో ముందుగా ఈ పాస్ మిషన్లులో వేలిముద్రలు నమోదు చేయించుకోవాలి. అలా చేస్తేనే రేషన్ వస్తోంది. దీనికోసం లబ్ధిదారులు రేషన్‌దుకాణాల ఎదుట రోజంతా బారులు తీరి ఉంటున్నారు. మిషన్లు పని చేయకపోవడం, సిమ్‌లు పనిచేయకపోవడం వంటి కారణాలతో రోజంతా క్యూలో ఉన్న లబ్ధిదారులు ఉస్సూరంటూ ఇంటిబాట పడుతున్నారు. మరుసటి రోజు మళ్లీ క్యూ కడుతున్నారు. త్వరలో ఐరిష్‌తో సరుకులిస్తాంః జేసీ సిమ్‌లు చాలా ఏరియాల్లో పనిచేయయడం లేదని ఫిర్యాదులొస్తున్నాయి.ప్రత్యామ్నాయంగా బీఎస్ఎన్ఎల్ సిమ్‌లు ఇస్తున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి ఇబ్బందులుతలెత్తకుండా ఉండేందుకు ప్రతీరేషన్షాపునకు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ కనెక్షన్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంటికి వచ్చే సిబ్బందికి కుటుంబంలో ఎవరో ఒకరి వేలిముద్రల ఇస్తే సరిపోతుంది. అందరి వేలిముద్రలు ఒకేసారి ఇవ్వనసరం లేదు. ఒకటి రెండు నెలల్లోఐరిష్తో అనుసంధానం చేయనున్నాం. ఒకటో తేదీ నుంచి ఈ పాస్ మిషన్లను ఉపయోగించి ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ల ద్వారానే సరుకులు ఇస్తాం. - నివాస్ జనార్ధనన్, జిల్లా జాయింట్ కలెక్టర్ -
దేవుడికీ తప్పని కంప్యూటర్ సర్వర్ల సమస్య!
తిరుపతి: తిరుమలలో శ్రీవారికి కూడా కంప్యూటర్ సర్వర్ల సమస్య తప్పలేదు. సర్వర్లు మొరాయించడంతో శ్రీవెంటేశ్వరుని దర్శనానికి వచ్చిన భక్తులు నానా అవస్తలు పడుతున్నారు. సర్వర్లు డౌన్ కావడంతో భక్తులకు గదుల కేటాయింపు ఆగిపోయింది. గదుల కోసం భక్తులు గంటల తరబడి వేచి చూస్తున్నారు. భక్తులు ఖాళీ చేసిన గదులను ఇతర భక్తులకు కేటాయించడం సాధ్యంకావడంలేదు. గదుల కేటాయింపు మాన్యువల్‌గా చేయడానికి టిటిడి సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరో రెండు గంటల వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుందని టిటిడి కంప్యూటర్ సిబ్బంది తెలిపారు. **