సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రకరకాల ప్రకటనలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, గూగుల్ ప్లాట్‌ఫారమ్స్‌లో ఇవి అధికంగా కనిపిస్తుంటాయి. వీటిలో ఏవి నిజమైనవి, ఏవి నకిలీవి అని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. నిజమని నమ్మి మోసపోయే బాధితుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ప్రకటనల పేరుతో జరిగే ఈ ఆర్థిక మోసాల బారిన పడకుండా ఉండాలంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
ఫేస్‌బుక్ ద్వారా..
మోసగాళ్లు నకిలీ అకౌంట్స్‌ను ఓపెన్ చేస్తారు. వీటిని ఫేక్ లైక్స్, షేర్స్, ఫాలోవర్స్, పోస్ట్‌లను రూపొందించడానికి ఉపయోగిస్తారు. ఈ నకిలీ అకౌంట్స్ ద్వారా వచ్చే యాడ్స్‌కు ఎటువంటి వాస్తవిక ఆధారాలు ఉండవు. ఫేస్‌బుక్ ప్రకటనలపై క్లిక్ లను రూపొందించడానికి ఆటోమేటెడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తారు. దీని ద్వారా కృత్రిమంగా క్లిక్ త్రూ రేట్లను పెంచి, ప్రకటనదారులకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచుతారు. అలాగే, యాడ్ నెట్‌వర్క్‌ను మోసగించడానికి చట్టబద్ధమైన వెబ్‌సైట్‌లు లేదా యాప్స్‌ను అనుకరిస్తారు. దీంతో మోసపూరిత వెబ్‌సైట్‌లలో ఈ యాడ్స్ కనిపిస్తుంటాయి.
ఇన్‌స్టాగ్రామ్‌లో..
♦ కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్లు ఫేక్ ఫాలోవర్లను కొనుగోలు చేయడం ద్వారా మోసానికి పాల్పడవచ్చు. లేదా వారి ప్రజాదరణను పెంచుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవచ్చు. అయితే, దీని ద్వారా ప్రకటనదారులు ఆశించిన ప్రయోజనాన్ని పొందలేరు.
♦మోసగాళ్లు ఫేక్ గ్రూప్‌లను క్రియేట్ చేస్తారు. ఒకరి పోస్ట్‌లను లైక్, షేర్, రివ్యూ చేయడానికి ఒప్పుకుంటారు. దీని ద్వారా వినియోగదారులు నమ్మకాన్ని పొందేందుకు ఒక భ్రమను సృష్టిస్తారు. తమ యాడ్స్‌ను ప్రచారం చేసే విధంగా మలుచుకుంటారు.
♦ ఫేక్ గ్రూప్స్ మాదిరిగానే పాడ్ నెట్‌వర్క్‌లను ఏర్పాటుచేస్తారు. దీని ద్వారా సభ్యులు ఒకరి పోస్ట్‌లపై మరొకరు కృత్రిమమైన ఎంగేజ్‌మెంట్‌ను పెంచుకుంటారు. ఎక్కుమంది వ్యూవర్స్‌ను చేరుకోవడానికి ఇదో తరహా ఎత్తుగడ.
ట్విటర్
► ఫేక్ ఫాలోవర్లు, రీ ట్వీట్‌లు, లైక్స్ క్రియేట్ చేయడానికి మోసగాళ్లు ఆటోమేటెడ్ బాట్‌లను అమలు చేస్తారు. వారు హ్యాష్‌ట్యాగ్స్ లేదా టాపిక్స్‌ను విస్తరించడానికి బాట్స్‌ను ఉపయోగిస్తారు. ఇది ట్రెండింగ్ భ్రమను సృష్టిస్తుంది.
► మోసగాళ్లు కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లు లేదా టాపిక్స్‌తో జనాదరణ పొందేలా, ట్రెండింగ్‌లో ఉండేలా కృత్రిమ ప్రచారం చేస్తారు. ఎక్కువ మందిని చేరుకోవచ్చనే ఆశతో ప్రకటనదారులు ఈ మార్గాన్ని ఎంచుకుంటారు.
► హ్యాష్‌ట్యాగ్స్, రీ ట్వీట్స్ చేయడానికి, విస్తరించడానికి ఫేక్ అకౌంట్స్‌ను క్రియేట్ చేస్తారు. దీని ద్వారా కంటెంట్, విజిబిలిటీతో వ్యూవర్స్‌ను రీచ్ అవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు.
ప్రచార మోసానికి మార్గాలు
♦ మోసగాళ్లు క్లిక్‌బైట్ మెసేజ్‌లను ఎస్సెమ్మెస్, వాట్సాప్, ఇ–మెయిల్ లేదా సోషల్ మీడియా యా ద్వారా పంపుతారు.
♦ సోషల్ మీడియా ΄ఫ్లాట్‌ఫారమ్‌లలో, గూగుల్ ప్రకటనలలో ఫేక్ యాడ్స్ సృష్టిస్తారు. ముఖ్యంగా కొత్త ఐ ఫోన్ మోడల్ వంటి ట్రెండింగ్‌లో ఉన్న విషయాలను ప్రచారం చేస్తారు.
♦ ప్రకటనలకు ఆకర్షితుడై మోసగాడిని సంప్రదించినప్పుడు అతను బుకింగ్ లేదా అడ్వాన్స్ చెల్లించమని అడుగుతాడు.
♦ కోరుకున్న వస్తువు డిస్కౌంట్ రేట్‌లో లభిస్తుందనే ఆశతో మోసగాడు చెప్పిన మొత్తాన్ని బాధితుడు ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తాడు. ఆ తర్వాత డెలివరీ, జీఎస్టీ, ఎక్స్‌ప్రెస్ డెలివరీ ఛార్జీలు మొదలైనవాటికి అదనపు మొత్తాన్ని చెల్లించమని బాధితుడిని కోరతాడు.
♦ మోసగాడు చెప్పింది నిజమని బాధితుడు నమ్మి డెలివరీ ట్రాకింగ్ వివరాలను పంపుతాడు. లేదంటే, అడిగినంత మొత్తాన్ని చెల్లిస్తాడు.
♦ బాధితుడు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత మోసగాడు కాల్స్‌ను, ఇతర కమ్యూనికేషన్ మార్గాలను బ్లాక్ చేస్తాడు.
మోసాన్ని అధిగమించడానికి ..
► మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రముఖ వ్యాపార ప్రకటనల నెట్‌వర్క్‌లు, పబ్లిషర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఏవైనా అడ్వర్టైజింగ్, పార్టనర్‌షిప్‌లలోకి ప్రవేశించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి, తగిన శ్రద్ధ తీసుకోవాలి.
► ప్రకటనల మోసాన్ని గుర్తించి, నిరోధించడంలో సహాయపడే ధ్రువీకరణ సాధనాలు, టెక్నాలజీని ఉపయోగించాలి. ఇవి, అనుమానాస్పద యాడ్స్ లోని లొసుగులను కనిపెట్టగలవు. క్లిక్ ఫ్రాడ్, ఇంప్రెషన్ ఫ్రాడ్ వంటి వివిధ రకాల మోసాలకు వ్యతిరేకంగా ఇవి రక్షణను అందిస్తాయి.
► ఏవైనా అనుమానాస్పద యాడ్స్‌ను గుర్తించడానికి ఇతర యూజర్ల క్రమాన్ని కూడా పర్యవేక్షించాలి. అంటే, అసహజంగా అనిపించే లైక్స్, షేర్స్ వేగంగా పెరగడం వంటివి ఉన్నాయేమో చెక్ చేయాలి.
► మోసాన్ని గుర్తించే లెర్నింగ్ టెక్నిక్స్‌ను ఉపయోగిస్తే ఇవి మోసపూరిత తేడాలను గుర్తించగలవు.
► మీ యాడ్స్... సంబంధిత ఫ్లాట్‌ఫారమ్‌లలో కనిపించేలా చూసుకోవడానికి స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలి. అనుమానాస్పదమైన, క్వాలిటీ లేని వెబ్‌సైట్స్, మోసపూరిత కార్యకలాపాలకు గురయ్యే యాప్‌లలో ప్రకటనలను ఉంచడం మానుకోవాలి.
► ఈ తరహా తాజా మోసాలను మీ టీమ్ అంటే.. బంధుమిత్రుల సమూహాలకు అవగాహన కల్పించాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యేందుకు ఇండస్ట్రీ కాన్ఫరెన్స్‌లు, వెబినార్లు, వర్క్‌షాప్స్‌కు హాజరవ్వాలి.
► ప్రకటనల ప్రచారాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలి. డేటాలో ఏవైనా తేడాలు ఉన్నాయేమో సరిచూసుకోవాలి.
మీరు మోసపూరిత కార్యకలాపాలను అనుమానించినట్లయితే, వాటిని సంబంధిత యాడ్ ఫ్లాట్‌ఫారమ్స్ లేదా నెట్‌వర్క్‌లకు తెలియజేయాలి. మోసపూరిత ప్రకటనల విధానాలను పంచుకోవడం ద్వారా మిగతావారిని అలెర్ట్ చేయవచ్చు.
► ప్రకటనల మోసాన్ని ఎదుర్కోవడానికి నిజాయితీని ప్రోత్సహించే ఇండస్ట్రీ అసోసియేషన్స్‌తో కనెక్ట్ అయి ఉండటం శ్రేయస్కరం.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల
డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment