Social Media profile plays key role in Visa and Jobs - Sakshi
Sakshi News home page

నిమిషాల్లోనే మీరేంటో చెప్పేయొచ్చు.. ఫేస్‌బుక్, ట్విట్టర్‌, ఇన్‌స్టా ప్రొఫైల్‌ బాగుందా!?

Published Mon, Feb 20 2023 7:39 AM | Last Updated on Mon, Feb 20 2023 3:21 PM

Social Media Profiles Playing Key Role IN Visa Jobs - Sakshi

ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్క­ల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కండక్ట్‌ సర్టిఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్‌ ప్రొఫైలింగ్‌ అంటారు.

సుదీప్‌ బీటెక్‌ పూర్తి చేశాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్‌ సీటు వచ్చింది. వీసా కోసం నిరీక్షిస్తుండగా వీసా రిజెక్ట్‌ అని మెసేజ్‌ వచ్చింది..అన్నీ సక్రమంగానే ఉన్నా వీసా ఎందుకు రిజెక్ట్‌ అయ్యిందో సుదీప్‌కు అర్థంకాలేదు.

ఉన్నత విద్యావంతురాలైన శ్రీవిద్యకు మాట్రిమొనీ వెబ్‌సైట్‌లో ఓ ఎన్‌ఆర్‌ఐ సంబంధం రావడంతో ఆమె తండ్రి ఉబ్బితబ్బిబయ్యాడు. కానీ అంతలోనే ‘మీ సంబంధం వద్దని మా అబ్బాయి అంటున్నాడు’ అని పెళ్లికొడుకు తండ్రి. కారణం చెప్పకుండానే ఫోన్‌ కట్‌ చేశాడు.  

ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్న వినీష్కు మరో కంపెనీలో మంచి పొజిషన్, జీతం పెంపుతో ఆఫర్‌ వచ్చింది. దేశాల్లోని ఆన్‌సైట్‌ ప్రాజెక్టుకు ఎంపికయ్యాడు. కానీ వారం తర్వాత ఆఫర్‌ లెటర్‌ రిజెక్ట్‌ అయినట్లు అతనికి ఈ–మెయిల్‌ వచ్చింది. 

సుదీప్‌కు వీసా రాకపోవడానికి... శ్రీవిద్య పెళ్లి సంబంధం చెడిపోవడానికి... వినీష్‌ జాబ్‌ ఆఫర్‌ రిజెక్ట్‌ కావడానికి కారణం ఒక్కటే ...వారి సోషల్‌ ప్రొఫైల్‌ బాగోలేకపోవడం. ఆకతాయి చేష్టలతో ఆన్‌లైన్‌లో వారు పెట్టిన కామెంట్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర పోస్ట్‌లు ఇప్పుడు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. సోషల్‌ ఫ్రొఫైలింగ్‌తో వారంతా చిక్కుల్లో పడ్డారు.

సాక్షి, హైదరాబాద్‌: ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్క­ల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కాండక్ట్‌ సరి్టఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్‌ ప్రొఫైలింగ్‌ అంటారు. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, టెలిగ్రామ్‌ ఇలా అనేక సోషల్‌ మీడియా ఖా­తాల ద్వారా మనం నిత్యం ఏదో ఒక సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అందులో ఒక వ్యక్తి పెట్టే కామెంట్లు, చేసే పోస్ట్‌లు, ఫొటోలు పంచుకునే భావాలను అంచనా వేసి ఆ వ్యక్తి గురించి అంచనా వేయడమే సోషల్‌ ప్రొఫైలింగ్‌. 

విద్యార్థులు హద్దు దాటితే కష్టమే.. 
సోషల్‌ మీడయా యాప్‌లలో యువత, విద్యార్థులు గంటల తరబడి చాటింగ్‌లు, మీటింగ్‌లలో కొందరు హద్దు దాటుతున్నారు. ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు తోటి విద్యార్థులను సైబర్‌ బుల్లీయింగ్‌ (తప్పుడు వ్యా­ఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. మరికొంద­రు రాజకీయపరమైన వ్యాఖ్యలు, మతపరమైన వి­వాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. ఇవే చిక్కు­లు తెచి్చపెడుతున్నాయి. యూకే, కెనడా, అమె­రికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకొనే వారి సోషల్‌ మీ­డి­యా ఖాతాలను ఆయా దేశాల ఎంబసీలు పరిశీ­లించి వీసాల జారీలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయన్న విషయాన్ని మరుస్తున్నారు. 

ఉద్యోగులకు జాగ్రత్త తప్పదు.. 
ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్‌ మీడియా వాడకంలో సంయమనం పాటించకపోతే చిక్కులు తప్పవు. మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా పోస్టులు పెడితే అవి కెరీర్‌పరంగా ఎదిగేందుకు అడ్డంకిగా మారొచ్చు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేసే ఓ టైపిస్ట్‌ కొంత బడ్జెట్‌ సమాచారాన్ని సోషల్‌ మీడియాలో పెట్టాడన్న కారణంతో అతన్ని వెంటనే సస్పెండ్‌ చేశారు. 

డిజిటల్‌ ఫుట్‌ప్రింట్‌ మనమే ఇస్తున్నాం.. 
సోషల్‌ మీడియాలో మన వ్యక్తిగత వివరాలను, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, స్నేహితులు ఎవరు, ఎక్కడికి తరచూ వెళుతుంటాం తదితర అంశాలను నిత్యం షేర్‌ చేస్తున్నాం. సోషల్‌ ప్రొఫైలింగ్‌కు కారణమయ్యే ఈ సమాచారాన్నే డిజిటల్‌ పుట్‌ప్రింట్స్‌ ఆన్‌ సోషల్‌ మీడియా అని అంటారు. 

హనీట్రాప్‌లలో చిక్కే ప్రమాదం... 
ఏదైనా కంపెనీ లేదా కీలక ప్రభుత్వరంగ సంస్థల్లోని కొందరు ఉద్యోగులను హనీట్రాప్‌ (వలపు వల) ద్వారా అ«దీనంలోకి తెచ్చుకొని సమాచారం రాబట్టేందుకు సైతం వారి సోషల్‌ ప్రొఫైలింగే కీలకం అవుతోంది. సదరు వ్యక్తి బలహీనతలు గుర్తించి ట్రాప్‌ చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా హీరోయిన్‌ గురించి ఎక్కువ ప్రస్తావన, లైక్, కామెంట్లు ఉన్నట్లయితే ఆ బలహీనతనే ఎరగా వేసి హనీట్రాప్‌ చేసే ప్రమాదం ఉంటుంది. 

వివరాలు ఇవ్వకపోవడం ఉత్తమం.. 
ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియాకు దూరంగా ఉండటం సాధ్యం కాని పరిస్థితి. సోషల్‌ మీడి­యాలో మన సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత, కుటుంబ సభ్యు­ల వివరాలు, ఫొటోలను సాధ్యమైనంత వరకు పెట్టకూడదు. కుల, మత, ప్రాంత, రాజకీయపరమైన పోస్టులేవీ పెట్టకపోవడం ఉత్తమం. యువత ఈ విషయాన్ని గుర్తిస్తేనే వారు భవిష్యత్తులో చిక్కుల్లో పడకుండా ఉంటారు. 
– ప్రసాద్‌ పాటిబండ్ల, సైబర్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు, ఢిల్లీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement