Visa
-
వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే. -
US Visa: ఇండియన్స్ కు భారీ షాక్
-
భారతీయ విద్యార్థులకు ఎఫ్-1 వీసా జారీలో 38 శాతం తగ్గుదల
-
హమాస్‌తో లింకులు? భారతీయ రీసెర్చర్ అరెస్ట్
అగ్రరాజ్యంలో మరో భారతీయ వ్యక్తిపై బహిష్కరణ వేటు పడింది. హమాస్ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో బాదర్ ఖాన్ సూరి అనే రీసెర్చర్‌ను అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్ చేశారు. త్వరలో ఆయన్ని భారత్‌కు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఈ చర్యలను సవాల్ చేస్తూ ఆయన కోర్టుకు ఎక్కారు.బాదర్ ఖాన్ సూరి(Badar Khan Suri).. వాషింగ్టన్ జార్జిటౌన్ యూనివర్సిటీలో రీసెర్చర్‌గా ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వర్జినీయాలోని ఆయన నివాసం వద్ద ఫెడరల్ ఏజెంట్లు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన వీసా కూడా రద్దు చేసినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ(DHS) తెలిపింది. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉండడం, సోషల్ మీడియాలో యూదు వ్యతిరేకతను ప్రచారం చేయడం లాంటి నేరాలకు పాల్పడినందుకుబాదర్ ఖాన్ సూరిని అదుపులోకి తీసుకున్నట్లు, ఆయన్ని భారత్‌కు పంపించే ప్రయత్నాల్లో ఉన్నట్లు డీహెచ్ఎస్ స్పష్టం చేసింది.మరోవైపు తన అరెస్ట్, తరలింపు ప్రయత్నాలను ఇమ్మిగ్రేషన్ కోర్టులో సూరి సవాల్ చేశారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత లేదని తన పిటిషన్లో సూరి పేర్కొన్నారు.బాదర్ నేపథ్యం ఇదే..భారత్‌కు చెందిన బాదర్ ఖాన్ సూరి.. స్వస్థలం ఎక్కడ అనేదానిపై స్పష్టత లేదు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్ స్డడీస్పైన పీహెచ్డీ చేసిన ఆయన.. ఆపై ఇరాక్, అఫ్గనిస్థాన్‌లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలూ చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్.. మఫెజ్ అహమద్ యూసఫ్ సలేహ్ అనే పాలస్తీనా మూలాల ఉన్న అమెరికన్ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్‌లో కీలక నేత అయిన అహ్మద్ యూసెఫ్గా డీహెచ్ఎస్ ప్రకటించింది. బాదర్ ఖాన్ సూరి అరెస్ట్ కావడంతో.. జాతీయ భద్రతా, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం.. లాంటి అంశాలు చర్చకు వచ్చాయి. Georgetown University researcher detained by ICE, accused of ‘actively spreading Hamas propaganda and promoting antisemitism’: report https://t.co/HBqSGzG6PR pic.twitter.com/wkXWKSYRSh— New York Post (@nypost) March 20, 2025అమెరికా ఫారిన్ పాలసీ ప్రకారం.. ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్‌ను అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్‌కార్డ్ హోల్డర్ అయిన మహమ్మూద్ ఖలీల్‌ను అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు.రంజనీ స్వీయ బహిష్కరణఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో.. పాలస్తీనాకు మద్దతుగా కొలంబియా యూనివర్శిటీ విద్యార్థులు ఇటీవల అమెరికాలో పెద్దఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసనల్లో పాల్గొన్న భారతీయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్(Ranjani Srinivasan)ను రద్దు చేసిన డీహెచ్ఎస్.. స్వీయ బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను సైతం డీహెచ్ఎస్ రిలీజ్ చేసింది.ప్రత్యేక యాప్‌తో.. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనేవాళ్లను స్వీయ బహిష్కరణ పేరిట అక్కడి నుంచి పంపించేందుకు డీహెచ్ఎస్ సీబీపీ హోమ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ను ఉపయోగించే రంజనీ శ్రీనివాసన్‌ను పంపించేశారు. ‘‘అమెరికాలో నివసించడానికి, చదువుకోవడానికి వీసా మంజూరుచేస్తాం. కానీ, మీరు ఉగ్రవాద సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపినప్పుడు వాటిని రద్దు చేస్తాం. అలాంటివారు ఈ దేశంలో ఉండకూడదు. మిలిటెంట్ సంస్థలకు మద్దతుగా నిరసనలు తెలిపిన కొలంబియా యూనివర్శిటీ విద్యార్థిని ఒకరు స్వీయ బహిష్కరణ కోసం సీబీపీ హోమ్ ఆప్ ఉపయోగించిందనందుకు సంతోషిస్తున్నా’’ అని డీహెచ్ఎస్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ప్రకటించారు. -
యూఏఈకి ఉచిత వీసాలు.. విమాన టికెట్స్
మోర్తాడ్: నకిలీ ఏజెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ ప్రభుత్వరంగ సంస్థ ఏడీఎన్‌హెచ్ ఉచిత వీసాలను జారీ చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూలు నిర్వహించి అనేకమంది నిరుద్యోగులకు యూఏఈలో ఉపాధి అవకాశాలు కల్పించింది. ఆ సంస్థకు చెందిన లైసెన్స్డ్ ఏజెన్సీ జీటీఎం ఆధ్వర్యంలో మరోసారి వీసాల జారీ కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 21, 22 తేదీలలో జగిత్యాల, నిజామాబాద్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కేటరింగ్, సపోర్టింగ్గ్ సర్వీసెస్ రంగంలో వలస కార్మికులకు ఉచిత వీసాలను జారీ చేయనున్నట్లు పేర్కొంది.ఈసీఎన్ఆర్ పాస్‌పోర్టు (ECNR Passport) కలిగి, బేసిక్ ఇంగ్లిష్ మాట్లాడేవారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని జీటీఎం సంస్థ చైర్మన్ సతీశ్‌రావు కోరారు. 250 మందికి వీసాలు జారీ చేసే అవకాశం ఉందన్నారు. భారతీయ కరెన్సీలో రూ.23 వేల వేతనం, ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. వీసాల కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.వీసాల జారీతో పాటు యూఏఈకి వెళ్లడానికి విమాన టికెట్‌ను సంస్థే ఉచితంగా సమకూరుస్తుందని వెల్లడించారు. ఆసక్తిగలవారు 86868 60999 (నిజామాబాద్), 83320 62299 (ఆర్మూర్), 83320 42299 (జగిత్యాల), 93476 61522 (సిరిసిల్ల) నంబర్లలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకుని టోకెన్లు పొందాలని సూచించారు. అమెరికాలో విషాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి -
భారతీయ విద్యార్ధిని రంజనీ వీసా రద్దు కారణం ఇదే..!
-
అమెరికాలో రంజనీ శ్రీనివాసన్ వీసా రద్దు.. కారణం ఇదే..
వాషింగ్టన్: భారత్‌కు చెందిన రంజనీ శ్రీనివాసన్‌కు వీసా రద్దు కావడంతో ఆమె తనంతట తానుగా అమెరికాను వీడారు. పాలస్తీనాకు అనుకూలంగా నిరసనల చేసిందుకు అక్కడి అధికారులు.. ఆమె వీసాను రద్దు చేశారు. దీంతో, రంజనీ శ్రీనివాస్ స్వదేశానికి వచ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది.భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజనీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది. కాగా, ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేసినట్టు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. అయితే, రంజనీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు. ఇక, 2025 మార్చి 5న విదేశాంగ శాఖ ఆమె వీసాను రద్దు చేసినట్టు ప్రకటనలో ఉంది. ఈ క్రమంలో ఆమె అమెరికాను వీడుతున్న వీడియోను హోంలాండ్ సెక్యూరిటీ శాఖ విడుదల చేసింది. ఈ వీడియోలో లాగార్డియా విమానాశ్రయంలో ఆమె తన లగేజీతో వెళ్తున్నట్టు కనిపిస్తోంది.ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.NEW: Columbia rioter Ranjani Srinivasan self deported after her student visa was revoked pic.twitter.com/Fnneiko5qs— End Wokeness (@EndWokeness) March 14, 2025విశ్వవిద్యాలయంపై ఒత్తిడి..ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొలంబియా విశ్వవిద్యాలయం కష్టాలను ఎదుర్కొంటోంది. అమెరికా ప్రభుత్వం 400 మిలియన్ డాలర్ల ఫెడరల్ గ్రాంట్లు, ఒప్పందాలను రద్దు చేసింది. ఇందులో ఎక్కువ భాగం వైద్య పరిశోధనల కోసమే ఉంది. పాలస్తీనాకు సంబంధించిన నిరసనల సమయంలో ఇజ్రాయెల్ సైనిక చర్యలను విమర్శించిన విద్యార్థులు, అధ్యాపకులపై యూనివర్శిటీ కఠినంగా చర్యలు తీసుకోకపోవడానికి శిక్షగా ఈ ఒప్పందాలను రద్దుచేసింది. -
పౌరసత్వంపై ట్రంప్ సంచలన ప్రకటన.. వారందరికీ ‘గోల్డ్‌కార్డు’ వీసా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా పౌరసత్వం విషయంలో ట్రంప్ కొత్త ప్లాన్ రూపొందించారు. పెట్టుబడిదారుల పౌరసత్వానికి ‘గోల్డ్ కార్డ్’ వీసాను తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో ఐదు మిలియన్ డాలర్ల(భారత కరెన్సీ ప్రకారం దాదాపు 44కోట్లు) పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామని ట్రంప్ తెలిపారు.అమెరికాలో పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన వీసా(ఈబీ-5 వీసా) పాలసీని మార్చే యోచనలో ఉన్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులకు ‘గోల్డ్ కార్డ్’ వీసాను మంజూరు చేస్తామన్నారు. ఈ వీసాను ఐదు మిలియన్ డాలర్లను వెచ్చించి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ వీసాను పొందే వ్యక్తులు అమెరికాలో ధనవంతులై ప్రభుత్వానికి పన్నులు చెల్లించే అవకాశం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఇది గ్రీన్ కార్డు తరహా సౌలభ్యాలను ఇస్తుందని, ఇది అమెరికన్ పౌరసత్వానికి ఒక మార్గం కాబోతుందన్నారు. ఈ కార్డును కొనుగోలు చేయడం ద్వారా సంపన్నులు తన దేశంలోకి వస్తారని ఆయన అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను మరో రెండు వారాల్లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ మేరకు తాజాగా అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ సమక్షంలో ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు.కాగా.. ఈ తరహా ‘గోల్డెన్ వీసా’లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలు జారీ చేస్తున్నాయి. యూకే, స్పెయిన్, గ్రీస్, మాల్టా, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ వంటి దేశాలు పెట్టుబడులను ఆకర్షించేందుకు సంపన్నులకు ఈ వీసాలు ఇస్తున్నాయి. తాజాగా ట్రంప్ కూడా ఇదే తరహా విధానాన్ని అమలు చేయనున్నారు. BREAKING:Trump announces USA will start selling gold cards in 2 weeks.“We're gonna put a price on that card of about $5 million and that's going to give you green card privileges plus. It's going to be a route to citizenship and wealthy people will come to our country” pic.twitter.com/OJnhFLeWAL— Visegrád 24 (@visegrad24) February 25, 2025ఈబీ-5 వీసా అంటే? యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) వెబ్సైట్ ప్రకారం, ఈబీ-5 వీసా విధానాన్ని.. ఉద్యోగ కల్పన-విదేశీ పెట్టుబడిదారుల మూలధన పెట్టుబడుల ద్వారా యూఎస్ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి 1990లో కాంగ్రెస్ ఆమోదించింది. 2021 సెప్టెంబరు నుంచి 2022 సెప్టెంబరు 30వ తేదీ వరకు దాదాపు 8వేల మంది ఈ ఇన్వెస్టర్ వీసాలను పొందారు. ఈబీ-5 ద్వారా పెట్టుబడిదారులు, వారి జీవిత భాగస్వాములు.. 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అవివాహిత పిల్లలు నాన్-టార్గెటెడ్ ఎంప్లాయిమెంట్ ఏరియా (టీఈఏ) ప్రాజెక్టులో 1.8 మిలియన్ డాలర్లు లేదా టీఈఏ ప్రాజెక్టులో కనీసం 800,000 డాలర్లు పెట్టుబడి పెడితే శాశ్వత నివాసానికి అర్హులు. అయితే, ఈ వీసా విధానంతో మోసాలు జరుగుతున్నాయని, కొందరు అక్రమంగా నిధులు పొందుతున్నారని అధికారులు గుర్తించారు.జన్మతః పౌరసత్వం రద్దు..అంతకుముందు.. రెండోసారి అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత జన్మతః పౌరసత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదని ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతోంది. -
Canada New Visa Rules : భారతీయ విద్యార్థులు, వర్కర్లకు పీడకల!
వలసదారుల విషయంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా కఠిన చర్యలు ఆందోళన కొనసాగు తుండగానే కెనడా ప్రభ్తుత్వం కూడా షాకిస్తోంది. స్టడీ, వర్క్ వీసాలపై కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది.. ఇటీవల తమ దేశంలోని ప్రవేశించిన అక్రమ వలసదారులను గుర్తించి, వారిని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టిన అమెరికా బాటలోనే కెనడా కూడా నడుస్తోంది.కెనడా ప్రభుత్వం వలసదారుల నిబంధనల్లో భారీ మార్పులు తీసుకొచ్చింది. ఈ కొత్త వీసా నియమాలు భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు ఒక పీడకలగా మారవచ్చని నిపుణులు అంచనావేస్తున్నారు. ఈ కొత్త నియమాలు ఫిబ్రవరి నుండి అమల్లోకి వచ్చాయి . ఉద్యోగులు, వలసదారుల వీసా స్థితిని ఎప్పుడైనా మార్చడానికి కెనడియన్ సరిహద్దు అధికారులకు విచక్షణాధికారాలను ఇస్తున్నాయి.జనవరి 31 నుంచి అమల్లోకి వచ్చిన ఇమ్మిగ్రేషన్ అండ్ రెఫ్యూజీ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ ద్వారా బోర్డర్ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్ (ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసా (టీఆర్వీ) వంటి డాక్యుమెంట్లను రద్దు చేసే అధికారం అధికారులకు ఉంటుంది. అయితే, పర్మిట్లు, వీసాలను తిరస్కరించడానికి కొన్ని మార్గదర్శకాలు పాటించాలి. బస గడువు ముగిసిన తర్వాత వ్యక్తి కెనడాను విడిచిపెడతారని నమ్మకం లేకపోతే, గడువు ఉన్నప్పటికీ ప్రవేశాన్ని తిరస్కరించవచ్చు లేదా వారి అనుమతిని రద్దు చేయవచ్చు. తాజా చర్యలు భారతదేశం నుండి వచ్చిన వారితో సహా పదివేల మంది విదేశీ విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అప్పటికే కెనడాలో ఉంటున్న వారి అనుమతులు రద్దైన పక్షంలో విదేశీయులను పోర్ట్ ఆఫ్ ఎంట్రీ(ఎయిర్‌పోర్టు) నుంచే వెనక్కు పంపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారతీయులను ఎక్కువగా వెళుతున్న దేశాల్లో కెనడా కూడా ఉంది. మరీ ముఖ్యంగా ఇటీవలి ట్రంప్ ఆంక్షల తరువాత కెనడాను ఎంచుకుంటున్న భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య మరింత పెరిగిందని చెప్పవచ్చు. ప్రభుత్వ డేటా ప్రకారం కెనడాలో సుమారు 4.2లక్షల మంది భారతీయులు ఉన్నత విద్యనభ్యిస్తున్నారు.ఇక భారతీయ టూరిస్టుల విషయానికి వస్తే 2024లో 3.6 లక్షల మంది భారతీయులకు టూరిస్టు వీసాలు జారీ చేసింది. అంతకుముందు 3.4 లక్షల మంది టూరిస్టు వీసాపై కెనడాను సందర్శించారు. మూడు నెలల క్రితమే (2024 నవంబర్), కెనడా స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ లేదా SDS వీసా ప్రోగ్రామ్‌ను రద్దు చేసిన విషయం విదితమే. -
తప్పుడు సమాచారం ఇస్తే వీసాలు రద్దు!
టోరంటో: ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో కెనడా ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. నూతన ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ ప్రొటెక్షన్ నిబంధనలు ఈ ఏడాది జనవరి 31వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి. వీటిద్వారా ఇమ్మిగ్రేషన్, బోర్డర్ అథారిటీ అధికారులకు మరిన్ని అధికారాలు లభించాయి. స్టడీ వీసాలు, వర్క్ వీసాలతోపాటు ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్స్(ఈటీఏ), టెంపరరీ రెసిడెంట్ వీసాలు(టీఆర్వీ) రద్దుచేసే అధికారం దక్కింది. వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లు సైతం రద్దు చేయొచ్చు. ఈ కొత్త నిబంధనల వల్ల వేలాది మంది విదేశీయులకు నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ప్రధానంగా కెనడాలో ఉంటున్న భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుందని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగస్థులు, టెంపరరీ రెసిడెంట్ విజిటర్లకు ఇబ్బందులు ఎదురు కానున్నాయని పేర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చినా, నేర చరిత్ర ఉన్నట్లు తేలినా కెనడా అధికారులు వీసాలు రద్దు చేస్తారు. వీసా గడువు ముగిసినా సదరు వీసాదారుడు కెనడా విడిచి వెళ్లే అవకాశం లేదని అధికారులు భావిస్తే వీసా రద్దు కావొచ్చు. వీసా పత్రాలను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా, ధ్వంసమైనా, తప్పుడు సమాచారంతో ఆ వీసా మంజూరు చేసినట్లు గుర్తించినా.. రద్దు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కొత్త నిబంధనల వల్ల దాదాపు 7,000 వీసాలు రద్దయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కొన్ని రెసిడెంట్ వీసాలు, వర్క్ పర్మిట్లు, స్టడీ పర్మిట్లపై వేటు తప్పదని అంటున్నారు. ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు కెనడా వైపు అధికంగా మొగ్గు చూపుతుంటారు. ప్రస్తుతం కెనడాలో 4.27 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. -
సులభతర వీసా విధానం అవసరం
న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ ‘హీల్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో కలసి పనిచేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ‘హీల్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత ప్రభుత్వంతో కలసి పనిచేయాలన్నది మా ఆలోచన! ఈ–వీసాలను మరింత పెంచాలి’ అని మీడియాతో చెప్పారు.పొరుగు దేశాలైన థాయిలాండ్, టర్కీ, ఫిలిప్పీన్స్, సింగపూర్ దేశాలు ఎక్కువ మంది రోగులను ఆకర్షిస్తున్నాయని, దేశంలోకి వచ్చిన వెంటనే వీసా జారీ విధానాన్ని అమలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. భారత్‌లో అధిక నాణ్యమైన హెల్త్‌కేర్ వసతులు ఉన్నాయంటూ.. ప్రపంచ సగటు ధరల్లో పదో వంతుకే అందిస్తున్నట్టు చెప్పారు. కాబట్టి విదేశీ రోగుల రాకను సులభతరం చేయాలని, మెడికల్ వీసాలను వేగంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైద్య పర్యాటకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఎంతో కీలకంగా చూస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ ప్రీతారెడ్డి అన్నారు.ఇదీ చదవండి: ‘చిన్న షేర్ల విషయంలో అప్పుడే హెచ్చరించాం’‘వీసా ప్రక్రియలను మెరుగ్గా మార్చాలి. భారత్‌లోకి ప్రవేశ అనుభవం మెరుగ్గా ఉండాలి. మనకు చాలా పట్టణాల్లో అద్భుతమైన విమానాశ్రయ వసతులు ఉన్నాయి’ అని అమె గుర్తు చేశారు. ఐఐటీ, ఇతర సంస్థలతో కలసి ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్ కృషి చేస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదేళ్లలో రూ.3,000 పడకలు పెంచుకోనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. -
అమెరికా అంత ఈజీ కాదా..!
-
వీసా కష్టం.. పైసా నష్టం..
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యార్జన, ఉజ్వల భవిష్యత్తు కోసం, ఇతర కారణాలతో విదేశాలకు వెళ్లేవారు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోగా.. మరోవైపు వీసా తిరస్కరణ (Visa Reject) బాధితుల సంఖ్యా ఎక్కువగానే పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన వారి వీసాలూ అధిక సంఖ్యలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. దేశవ్యాప్తంగా వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాదిలో నష్టపోయిన మొత్తం రూ.660 కోట్ల పైమాటేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. పర్యాటకులను స్వాగతించే దేశంగా పేరున్న యూఏఈ వీసాలు పొందడంలో సైతం ఎదుర్కొన్న ఇబ్బందులను చాలామంది గత ఏడాది చివరిలో సోషల్ మీడియా (Social Media) వేదికగా పంచుకున్నారు.జనవరి నుంచి అక్టోబర్ 2024 మధ్యకాలంలో 24.8% మంది భారతీయలు (Indians) యూఏఈని సందర్శించారు. భారతీయ పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ గమ్యస్థానాలలో ఒకటిగా యూఏఈ (UAE) ఉంది. అయితే కొంతకాలం క్రితం దుబాయ్ ఇమ్మిగేషన్ విభాగం ప్రవేశపెట్టిన కఠినమైన నిబంధనల కారణంగా భారీ స్థాయిలో వీసాలు తిరస్కరణలకు గురయ్యాయి. కోవిడ్ అనంతరం ఇతర అనేక దేశాలు కూడా తమ వీసా నిబంధనలను సవరించాయి. ఈ నేపథ్యంలో వీసాల తిరస్కరణ కారణంగా గత ఏడాది భారతీయులు రూ.664 కోట్లను నష్టపోయారని గణాంకాలు చెబుతున్నాయి. తిలా పాపం తలా పిడికెడువీసా నిబంధనలు కఠినతరం చేసిన దేశాలలో యూఏఈతో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే ప్రధానంగా ఉన్నాయి. గత ఏడాది న్యూజిలాండ్ 32.5 శాతం భారతీయ వీసా (Indian Visa) దరఖాస్తులను తిరస్కరించింది, ఆస్ట్రేలియా 29.3 శాతం, యూకే 17 శాతం మందిని తిరస్కరించాయి. స్కెంజెన్ ఏరియా (యూరప్) 15.7 శాతం వీసాల్ని తిరస్కరించింది. యూఏఈ భారతీయ వీసాల తిరస్కరణ రేటు గత ఏడాది 6 శాతానికి చేరుకుంది. అయితే 2019లో వీసా ఆమోదం రేట్లతో పోల్చనప్పుడు. 2024లో భారతీయుల కోసం అధిక శాతం వీసాలను ఆమోదించిన దేశంగా అమెరికా నిలిచింది. 2019లో 28 శాతం భారతీయ వీసా దరఖాస్తులను యూఎస్ తిరస్కరించగా, 2024లోకి వచ్చేసరికి ఇది 16 శాతానికి తగ్గింది. అయితే అమెరికా వెళ్లేందుకు మనవారి వీసా దరఖాస్తుల సంఖ్య పరంగా చూస్తే ఈ 16 శాతం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ తర్వాత కఠినంగా..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే, యూఏఈ వంటి దేశాలు వీసా నిబంధనలను కఠినతరం చేయడం అనేది..కరోనా మహమ్మారి అనంతరం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిన వీసా దరఖాస్తుల సూక్ష్మస్థాయి పరిశీలన, ఎంపిక ధోరణిని ప్రతిబింబిస్తోంది. వీసాల తిరస్కరణ రేటు పెరుగుదల భారతీయ ప్రయాణీకులను ఆందోళనకు గురిచేస్తోంది. దరఖాస్తుదారులు.. తమకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, తమ దరఖాస్తులు పూర్తి దోష రహితంగా ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ పరిస్థితి స్పష్టం చేస్తోంది.సర్వ సాధారణంగా మారిన తిరస్కరణలు‘ఎంఫార్మ్ కోసం అమెరికా వీసాకు దరఖాస్తు చేస్తే రెండుసార్లు తిరస్కరణకు గురైంది. మరోసారి అప్లయ్ చేయబోతున్నా. ఇప్పటివరకు రూ.42 వేలు ఖర్చయ్యింది. నా స్నేహితుడు ఒకరికి 10 సార్లు వీసా నిరాకరించారు..’అని పంజాగుట్ట నివాసి ప్రవీణ్ చెప్పాడు. ఇక రెండుసార్లు, మూడుసార్లు వీసా తిరస్కరణలకు గురి కావడమనేది సర్వసాధారణంగా మారుతోంది. యూకేకి రూ.12 వేలు మొదలుకుని రూ.లక్ష పైగా వీసా దరఖాస్తు ఫీజులు ఉన్నాయి. అలాగే ఆ్రస్టేలియాకు రూ.4 వేల నుంచి రూ.60 వేలు వరకూ, న్యూజిలాండ్‌కు రూ.11 వేల నుంచి రూ.1.15లక్షల వరకూ, యూఏఈకి రూ.8 వేల నుంచి రూ.35 వేలు ఆపైన ఉన్నాయి.చదవండి: ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!అమెరికాకు రూ.20 వేల వరకూ వీసా ఫీజులు ఉన్నాయి. అయితే వెళ్లే కారణాన్ని బట్టి, వీసా పొందడానికి ఎంచుకున్న విధానాన్ని బట్టి ఈ ఫీజులు ఇంతకంటే పెరగవచ్చు కూడా. ‘మా అబ్బాయి అమెరికా వీసాకి మొదటిసారి రూ.70 వేల దాకా పెట్టిన ఖర్చు వృథా అయ్యింది. రెండవసారి దాదాపు అంతే ఖర్చు పెట్టి వీసా తెచ్చుకున్నాం..’ అని మల్కాజిగిరికి చెందిన లక్ష్మి చెప్పారు. మొత్తంగా చూస్తే వీసా తిరస్కరణల కారణంగా పెద్ద మొత్తంలోనే నష్టం జరుగుతోందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో వీసా నిబంధనలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని, డాక్యుమెంట్లన్నీ పూర్తి కచ్చితత్వంతో ఉండేలా చూసుకున్న తర్వాతే దరఖాస్తు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
హసీనా వీసా గడువు పెంపు
న్యూఢిల్లీ: విద్యార్థుల ఉద్యమం, ఎగసిన అల్లర్లతో స్వదేశం వీడి భారత్‌లో తలదాచుకుంటున్న పదవీచ్యుత బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమెకు ఇచ్చిన వీసా గడువును పొడిగించింది. గత ఏడాది జూలై–ఆగస్ట్‌లో బంగ్లాదేశ్‌లో దేశ విమోచన పోరాటయోధుల కుటుంబాలు, వారసులకు నియామకాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మొదలైన ఉద్యమాన్ని హసీనా ఉక్కుపాదంతో అణిచేసి దారుణాలకు పాల్పడ్డారని ఆమెను విచారిస్తామని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించడం తెల్సిందే. ఆమె పాస్ట్‌పోర్ట్‌ను రద్దుచేస్తున్నట్లు మొహమ్మద్ యూనుస్ సర్కార్ మంగళవారం ప్రకటించిన వేళ ఆమె వీసా గడువను భారత్ తాజాగా పొడిగించడం గమనార్హం. ఆమెతోపాటు 75 మంది పాస్ట్‌పోర్ట్‌లను రద్దుచేస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. -
న్యూజిలాండ్ వీసా నిబంధనల్లో... సడలింపులు
వెల్లింగ్టన్: కార్మికుల కొరత తదితరాల నేపథ్యంలో వీసా నిబంధనలను న్యూజిలాండ్ సరళతరం చేసింది. ఇమిగ్రేషన్ ప్రక్రియను క్రమబద్దీకరిస్తూ గణనీయమైన మార్పులు చేసింది. పని అనుభవం, వేతనాలు, వీసా వ్యవధి తదితరాలను మార్చింది. న్యూజిలాండ్‌లో ఉపాధి పొందాలనుకునే కార్మికులకు కనీస అనుభవ అర్హతను మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించింది. దాంతో ఇకపై ఆ దేశంలో ఉపాధి పొందడం మరింత సులభతరం కానుంది. న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయులకు ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. వీసాల్లో మార్పు.. సీజనల్ వర్కర్లు న్యూజిలాండ్‌లో ఉండేందుకు రెండు కొత్త మార్గాలను కూడా ప్రవేశపెట్టారు. అనుభవజు్ఞలైన సీజనల్ కార్మికులకు మూడేళ్ల మల్టీ–ఎంట్రీ వీసా, తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల సింగిల్–ఎంట్రీ వీసాలు ఇవ్వనున్నారు. గుర్తింపు పొందిన ఎంప్లాయర్ వర్క్ వీసా (ఏఈడబ్ల్యూవీ), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (ఎస్పీడబ్ల్యూవీ)లకు సగటు వేతన ప్రమాణాలను తొలగించారు. కొత్త నిబంధనల ప్రకారం యజమానులు ఉద్యోగ అవకాశాలను పోస్ట్ చేయాల్సి ఉంటుంది. మార్కెట్ రేటు ప్రకారం జీతాలివ్వాల్సి ఉంటుంది. అలాగే ఆస్ట్రేలియన్ అండ్ న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ఏఎన్జెడ్ఎస్సీఓ) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 పరిధిలోకి వచ్చే ఉద్యోగాలకు రెండేళ్ల వీసా వ్యవధిని మూడేళ్లకు పెంచారు. ఇప్పటికే రెండేళ్ల వీసా ఉన్న ఉద్యోగులు ఏడాది పొడిగింపు కోరవచ్చు. వలసదారులు తమ పిల్లలను వెంట తీసుకొచ్చేందుకు కనీస వార్షిక వేతనాన్ని 55,844 డాలర్లకు పెంచారు. విద్యార్థుల వీసాలో సవరణ పోస్ట్ స్టడీ వర్క్ వీసా (పీఎస్ డబ్ల్యూవీ)ను కూడా న్యూజిలాండ్ సవరించింది. దీని ప్రకారం విద్యార్థులు అర్హతలను బట్టి అక్కడ మూడేళ్ల పాటు ఉండటానికి, పని చేయడానికి అనుమతిస్తారు. పీజీ డిప్లొమా తర్వాత మాస్టర్స్ పూర్తి చేసిన విద్యార్థులు పోస్ట్ స్టడీ వర్క్ వీసాకు అర్హత కోల్పోకుండా ఉండేందుకూ ఈ నిబంధనలు వీలు కలి్పస్తాయి. శ్రామిక రంగ కంపెనీలకు కార్మికులను తీసుకోవడం మరింత సులభతరం కానుంది. స్టూడెంట్ వీసా తదితరాల నుంచి ఏఈడబ్ల్యూవీకి మారాలనుకునే వలసదారులకు వచ్చే ఏప్రిల్ నుంచి మధ్యంతర పని హక్కులు కూడా ఇస్తారు. -
విదేశీ విద్యార్థులకు రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలు
న్యూఢిల్లీ: ఉన్నత విద్య కోసం భారత్‌కు వచ్చే విదేశీ విద్యార్థుల కోసం రెండు ప్రత్యేక కేటగిరీ వీసాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ–స్టూడెంట్ వీసా, ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసాలను కేంద్ర హోం శాఖ ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు రకాల వీసాల కోసం విదేశీ విద్యార్థులు స్టడీ ఇన్ ఇండియా(ఎస్ఐఐ) పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించాయి. ఈ–స్టూడెంట్ వీసాలను అర్హులైన విదేశీ విద్యార్థులకు మంజూరు చేస్తారు. వారిపై ఆధారపడినవారు ఈ–స్టూడెంట్–ఎక్స్ వీసా ద్వారా భారత్‌కు రావచ్చు. వీటి కోసం పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్–టర్మ్, షార్ట్–టర్మ్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ పోర్టల్ ద్వారా సేవలు పొందే వెసులుబాటు ఉంది. కేంద్ర విద్యా శాఖ ప్రాజెక్టు కింద దేశంలో 600కు పైగా విద్యా సంస్థలు విదేశీయులకు ప్రవేశాలు కలి్పస్తున్నాయి. వేర్వేరు రంగాలకు సంబంధించి 8 వేలకు పైగా కోర్సులు అందిస్తున్నాయి. -
న్యూజిలాండ్ వీసా కొత్త రూల్స్ ఇవే..
అమెరికా వీసా నిబంధనలలో మార్పులు ప్రకటించిన అనంతరం.. న్యూజిలాండ్ కూడా అదే బాటలో వీసాలో మార్పులు చేసింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలను సులభతరం చేయడానికి మాత్రమే కాకుండా.. కీలక ఆందోళనలను పరిష్కరించడానికి, న్యూజిలాండ్ తన వీసా.. ఉపాధి అవసరాలకు అనేక మార్పులను ప్రకటించింది.న్యూజిలాండ్ వీసాలోని మార్పులలో ఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV), స్పెసిఫిక్ పర్పస్ వర్క్ వీసా (SPWV) పాత్రల కోసం వేతన పరిమితులను తొలగించడం, వలసదారులకు అనుభవ అవసరాన్ని తగ్గించడంతో పాటు.. కార్మికుల కోసం కొత్త మార్గాలను పరిచయం చేయడం వంటివి ఉన్నాయిన్యూజిలాండ్ వీసా నిబంధనల్లో మార్పులుఎంప్లాయర్ వర్క్ వీసా (AEWV) హోల్డర్లు తమ పిల్లలను న్యూజిలాండ్‌కు తీసుకురావాలనుకుంటే.. వారు ఏడాదికి సుమారు రూ. 25 లక్షల కంటే ఎక్కువ సంపాదించాలి. ఈ ఆదాయ పరిమితి 2019 నుండి మారలేదు. ఎందుకంటే వలస వచ్చిన కుటుంబాలు ఆర్థికంగా బాగా జీవించడానికి దీనిని ప్రవేశపెట్టారు.దేశంలో కార్మికుల కొరతను తగ్గించడానికి, వలసదారుల వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించారు. ఈ కొత్త రూల్ మరింత మంది ఉద్యోగాల కోసం.. న్యూజిలాండ్ వెళ్ళడానికి సహాయపడుతుంది.న్యూజిలాండ్ కాలానుగుణ కార్మికుల కోసం రెండు కొత్త మార్గాలను ప్రవేశపెట్టింది. ఎక్స్పీరియన్స్ కలిగిన కార్మికులకు మల్టీ-ఎంట్రీ వీసా మూడు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది. అయితే తక్కువ నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏడు నెలల పాటు సింగిల్ ఎంట్రీ వీసా అందుబాటులో ఉంటుంది.ఇదీ చదవండి: యూఎస్ వీసా నిబంధనల్లో భారీ మార్పులు! కొత్తేడాది నుంచి అమల్లోకి..ఆస్ట్రేలియన్ & న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ అక్యుపేషన్స్ (ANZSCO) స్కిల్ లెవల్స్ 4 లేదా 5 కింద పరిగణించే ఉద్యోగాలను పొందడానికి.. ఉద్యోగులు రెండేళ్ల ముందు వీసా నుంచి మూడు సంవత్సరాల వర్క్ వీసాను పొందుతారు. ప్రస్తుతం ఈ ఉద్యోగాల్లో ఉన్నవారు మరో సంవత్సరం పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.ఏప్రిల్ 2025 నుంచి.. ఏదైనా ఇతర పని లేదా స్టూడెంట్ వీసాల నుంచి AEWVకి మారాలనుకునే వారికి మధ్యంతర ఉద్యోగ హక్కులు ఇవ్వబడతాయి. ఉపాధిలో ఉండేందుకు తమ కొత్త వీసాల ఆమోదం కోసం చూస్తున్న వలసదారులకు ఇది సహాయం చేస్తుంది. -
ఇలాన్ మస్క్ బూతు ప్రయోగం
హెచ్-1బీ వీసా, ఇమ్మిగ్రేషన్ సంస్కరణల విషయంలో సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే దీనికి ప్రపంచ కుబేరుడు 'ఇలాన్ మస్క్'(Elon Musk) మద్దతుగా నిలిచారు. ఈ వీసాల పరిరక్షణ కోసం అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పారు. హెచ్-1బీ వీసాలను వ్యతిరేకిస్తున్న వారిపై బూతు ప్రయోగం కూడా చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్స్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.స్పేస్ ఎక్స్ఎం, టెస్లా వంటి కంపెనీలను స్థాపించడానికి మాత్రమే కాకుండా.. నేను ఇప్పుడు అమెరికాలో ఉన్నానంటే దానికి కారణం హెచ్-1బీ వీసా (H-1B Visa) అని మస్క్ స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసాల కారణంగానే దేశం బలమైన దేశంగా అవతరించింది. కాబట్టి వీసాలను వ్యతిరేకిస్తున్నవారు ఓ అడుగు వెనక్కి వేయండి అని టెస్లా బాస్ అన్నారు.నిజానికి హెచ్-1బీ వీసాలను జారీ చేయడం వల్ల అమెరికాలోని ఉద్యోగాలను బయటి వ్యక్తులు సొంతం చేసుకుంటారు. కాబట్టి అమెరికా ఫస్ట్ నినాదాన్ని అమలు చేయనంటే ఈ వీసాల జారీ చేయకూడదని కరడుగట్టిన రిపబ్లికన్లు చెబుతున్నారు. దీనిపై ప్రస్తుతం మిశ్రమ స్పందనలు వినిపిస్తున్నాయి.The reason I’m in America along with so many critical people who built SpaceX, Tesla and hundreds of other companies that made America strong is because of H1B.Take a big step back and FUCK YOURSELF in the face. I will go to war on this issue the likes of which you cannot…— Elon Musk (@elonmusk) December 28, 2024త్వరలో ప్రారంభం కానున్న ట్రంప్ క్యాబినెట్‌లోని.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) కో-హెడ్స్ మస్క్, వివేక్ రామస్వామి హెచ్-1బీ వీసాల ద్వారా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ అమలు చేయనున్నారు. దీనిపై కూడా కొన్ని వ్యతిరేఖ నినాదాలు వినిపిస్తున్నాయి.10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలుఇదిలా ఉండగా భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది. ఇందులో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం. -
భారతీయులకు 10 లక్షలకు పైగా అమెరికా వీసాలు
భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచుకోవడానికి అమెరికా అంకిత భావంతో పనిచేస్తోంది. ఇందులో భాగంగానే.. భారతీయులకు వరుసగా రెండో ఏడాది ఏకంగా 10 లక్షల కంటే ఎక్కువ 'నాన్ ఇమ్మిగ్రేషన్ వీసా'లను జారీ చేసింది.గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో చదువుకోవడానికి వెల్లవారు మాత్రమే కాకుండా, సందర్శనార్ధం వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. ఇటీవల జారీ చేసిన 10 లక్షల నాన్ ఇమ్మిగ్రేషన్ వీసాలలో ఎక్కువ భాగం విజిటర్ వీసాలు (పర్యాటకుల వీసాలు) ఉన్నట్లు సమాచారం.హెచ్-1బీ (H-1B) వీసాల రెన్యువల్‌కు సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అమలు చేసింది. దీని వల్ల ఎంతోమంది భారతీయులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. కాగా.. గత నాలుగు సంవత్సరాలలో భారతదేశం నుంచి అమెరికాకు వెళ్లే సందర్శకుల సంఖ్య ఐదు రెట్లు పెరిగింది. 2024 మొదటి 11 నెలల్లో 20 లక్షల కంటే ఎక్కువ మంది ఇండియన్స్ యుఎస్ వెళ్లారు. 2023తో పోలిస్తే ఈ సంఖ్య 26 శాతం ఎక్కువ.ఇప్పటికే 50 లక్షల కంటే ఎక్కువ మంది భారతీయులు యుఎస్‌ని సందర్శించడానికి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇలాంటి వీసాలను ప్రతిరోజూ జారీ చేస్తున్నట్లు రాయబార కార్యాలయం వెల్లడించింది.చదువుకోవడానికి ఇండియా నుంచి అమెరికా (America) వెళ్లే విద్యార్థులకు కూడా వీసాలను జారీ చేస్తున్నారు. ఈ వీసాల సంఖ్య కూడా భారీగా పెరుగుతోంది. అంటే అక్కడ ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు స్పష్టమవుతోంది. 2008 - 2009 విద్యాసంవత్సరంలో అమెరికాకు ఎక్కువ మంది విద్యార్థులను పంపిన దేశంగా 'భారత్' రికార్డ్ క్రియేట్ చేసింది. సుమారు 3,31,000 మంది భారతీయులు అమెరికాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ఛేంజ్ విజిటల్ వీసాలు పొందిన భారతీయులు కూడా యునైటెడ్ స్టేట్స్లో ఉండగలుగుతున్నారు. USలో వారి ప్రోగ్రామ్‌లను పూర్తి చేసిన తర్వాత రెండు సంవత్సరాల పాటు అక్కడే ఉండవచ్చు. కాబట్టి ఇది వారి కెరీర్, విద్యను కొనసాగించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఎక్స్ఛేంజ్ విజిటర్స్ స్కిల్స్ లిస్ట్ నుంచి ఇండియాను తొలగించడం వల్ల భారతీయ J-1 నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా హోల్డర్లకు ఎక్కువ సౌలభ్యం లభించింది. మొత్తం మీద భారతదేశం నుంచి అమెరికాకు వివిధ కారణాల వల్ల వెళ్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
ఈ 12 దేశాలకు వెళ్లాలంటే.. వీసా అవసరమే లేదు
కొత్త సంవత్సరానికి కౌంట్‌డౌన్ మొదలైపోయింది. సంక్రాంతి సెలవులు కూడా త్వరలోనే రానున్నాయి. ఇలాంటి సమయంలో కొంతమంది ఆలా.. సరదాగా విదేశాల్లో చక్కర్లు కొట్టి వచ్చేద్దాం అనుకుంటారు. అయితే వీసా (Visa) సమస్య కారణంగా మిన్నకుండిపోతారు. కానీ వీసా అవసరం లేకుండానే కొన్ని దేశాలను చుట్టి వచ్చేయొచ్చని బహుశా కొందరికి తెలిసుండకపోవచ్చు.వీసా అవసరం లేకుండానే కొన్ని దేశాల్లో.. కొన్ని రోజులు ఉండవచ్చు. ఇలాంటి దేశాలు 12 వరకు ఉన్నాయి. భారతీయులు (Indians) వీసాతో పనిలేకుండానే (Visa Free Countries) పర్యటించగల దేశాల జాబితా..●థాయిలాండ్●భూటాన్●నేపాల్●మారిషస్●మలేషియా●ఇరాన్●అంగోలా●డొమినికా●సీషెల్స్●హాంకాంగ్●కజఖ్‌స్థాన్●ఫిజీభారతీయులు పైన పేర్కొన్న దేశాల్లో దాదాపు 60 రోజుల వరకు వీసా లేకుండానే ఉండవచ్చు. పర్యాటకాన్ని పెంచుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగటానికి కొన్ని దేశాలు ఈ వీసా రహిత విధానం ప్రవేశపెట్టాయి. ఇది ఆ దేశాల ఆర్ధిక వ్యవస్థను బలపరచడానికి మాత్రమే కాకుండా.. పర్యాటకులు కూడా అనుకూలంగా ఉంటుంది. -
కరోనా ఎఫెక్ట్.. అమెరికా కోసం చైనా భారీ ప్లాన్!
బీజింగ్: కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు రకాల ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చైనా కూడా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో టూరిజంపై చైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అమెరికా సహా పలు దేశాల పర్యాటకులను ఆకర్షించేందుకు సరికొత్త పాలసీని తీసుకువచ్చింది.ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగిన చైనా.. కరోనా కారణంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మూడేళ్లపాటు టూరిజం విషయంలో ఒంటరిగానే పోరాడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో టూరిజంపై ఫోకస్ పెట్టిన డ్రాగన్ కంట్రీ.. తాజాగా వీసా రహిత రవాణా విధానాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఎక్కువ మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించడం, చైనా ఆర్థిక వ్యవస్థను పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది.ఇందులో భాగంగా.. ఇకపై చైనాకు వెళ్లే విదేశీ ప్రయాణికులు 10 రోజుల వరకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. ఇందులో అమెరికాతో సహా అనేక దేశాల నుంచి విదేశీ ప్రయాణికులు ఉన్నారు. విదేశీ పర్యాటకులు.. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో 10 రోజుల పాటు ఉండేందుకు అనుమతించారు. ఇంతకుముందు, ప్రయాణికులు దేశంలో ఎక్కడ సందర్శించారు అనేది ఆధారంగా 72 గంటల నుంచి 144 గంటలు మాత్రమే ఉండేందుకు అనుమతించేవారు.China's 144-hour visa-free transit policy has continued to fuel the popularity of "China Travel. pic.twitter.com/5OZnLTr5Zi— jasony (@JalisaJackson13) December 18, 2024ఇక, చైనా తీసుకువచ్చిన వీసా రహిత పాలసీ విధానం అమెరికా, కెనడా, అనేక యూరోపియన్, ఆసియా దేశాలతో సహా 54 దేశాలకు వర్తించనుంది. అయితే, ఈ పాలసీ ప్రయోజనాన్ని పొందడానికి విదేశీ ప్రయాణికులు తప్పనిసరిగా 10 రోజులలోపు చైనా నుంచి నిష్క్రమించడానికి ధృవీకరించిన టిక్కెట్‌ను కలిగి ఉండాలి. ఈ వీసా పాలసీలో భాగంగా పర్యాటకులు.. రాజధాని బీజింగ్, చైనాలో అతిపెద్ద నగరం షాంఘైతో సహా 24 ప్రావిన్సులలోని 60 ప్రదేశాల నుంచి యాత్రికులు దేశంలోకి ప్రవేశించవచ్చు. దీంతో, అనేక దేశాల మధ్య పర్యాటకం, వాణిజ్యపరంగా లాభాలను పెంచుతుందని అక్కడి అధికారులు భావిస్తున్నారు.మరోవైపు.. చైనా విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది. కరోనా సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఇజ్రాయెల్-రష్యా యుద్ధంలో చైనా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఇటీవల చైనా కోసం ప్రయాణ విధానాన్ని లెవల్-3 నుంచి లెవెల్-2కి తగ్గించింది. ఇదిలా ఉండగా.. అమెరికాను చేరువ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇటీవల చైనా కీలక ప్రకటన చేసింది. కొన్నేళ్లుగా చైనా నిర్బంధంలో ఉన్న ముగ్గురు అమెరికన్లను విడుదల చేసింది. అనంతరం, వీసాకు సంబంధిచిన నిర్ణయాన్ని అమలోకి తీసుకువచ్చింది. -
భారతీయుల దుబాయ్ విహారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రముఖ పర్యాటక నగరమైన దుబాయ్‌లో విహరించాలనుకునే భారతీయులకు ఎదురుదెబ్బ తగులుతోంది. హాలీడే ట్రిప్పులు, కుటుంబ సభ్యులతో వెకేషన్ కోసం దుబాయ్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిరాశే మిగులుతోంది. ఒకప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే దుబాయ్ వీసా మంజూరయ్యేది. కానీ, ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన దుబాయ్ ఇర్ముగ్రేషన్ నిబంధనలు భారతీయ పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని వారాలుగా వీసాల తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు వీసా దరఖాస్తుల్లో 99 శాతం ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు 94–95 శాతానికి పడిపోయింది. ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కఠిన పర్యాటక వీసా నిబంధనలను అమలు చేస్తోంది. దుబాయ్‌లో పర్యటించాలనుకునేవారు తమ వీసా దరఖాస్తుతో పాటు ఏ హోటల్లో బస చేస్తారో.. ఆ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్, విమాన రిటర్న్ టికెట్లను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హోటల్లో కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలనుకుంటే.. సంబంధిత నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు తప్పనిసరి చేసింది. ఈ పత్రాలన్నీ ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది. అలాగే అదనంగా దుబాయ్‌లో ఉండటానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. హోటల్లో బస చేయాలనుకుంటే కనీస బ్యాలెన్స్ రూ.50 వేలు చూపిస్తూ చివరి మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, పాన్‌కార్డును సమర్పించాలి. వీటిలో ఏది లేకున్నా వీసా మంజూరుకు అవరోధం ఏర్పడినట్టే. తాజాగా ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉన్నా.. వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ట్రావెల్ ఏజెన్సీలు వాపోతున్నాయి.ఆర్థి కంగానూ నష్టమే.. వీసా దరఖాస్తుల తిరస్కరణ పర్యాటకులపై తీవ్ర ఆర్థి క భారాన్ని మోపుతోంది. వీసా దరఖాస్తు రుసుమును కోల్పోవడంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న విమాన, హోటల్ టికెట్ల కోసం చెల్లించిన డబ్బును కూడా నష్టపోతున్నారు. అలాగే ఒక కుటుంబ సభ్యుడి వీసా తిరస్కరణకు గురైతే.. కుటుంబంలోని మిగిలిన సభ్యులు కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోంది. సెలవులు సీజన్ రాబోతుండటంతో పాటు డిసెంబర్, జనవరిలో దుబాయ్‌లో షాపింగ్ ఫెస్ట్ జరగబోతున్న సమయంలో పెద్ద ఎత్తున వీసాలు తిరస్కరణకు గురవుతుండటం భారతీయ పర్యాటకులతో పాటు ట్రావెల్ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. వారి సంఖ్యను కాస్త తగ్గించేందుకే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. -
అటు అమెరికా..ఇటు కెనడా భారతీయులంటే ఎందుకంత..?
-
ఫాస్ట్ ట్రాక్ వీసాలకు కెనడా మంగళం
న్యూఢిల్లీ: ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ నిజ్జర్ హత్యోదంతం తిరిగి తిరిగి చివరకు భారతీయ విద్యార్థులకు స్టడీ వీసా కష్టాలను తెచ్చిపెట్టింది. కెనడా–భారత్ దౌత్యసంబంధాలు అత్యంత క్షీణదశకు చేరుకుంటున్న వేళ కెనడా ప్రభుత్వం భారతీయ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కల్గించే నిర్ణయాన్ని అమలుచేసింది. విద్యార్థి వీసాలను వేగంగా పరిశీలించి పరిష్కరించే ఫాస్ట్ ట్రాక్ వీసా విధానం స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్(ఎస్డీఎస్)ను నిలిపేస్తున్నట్లు కెనడా శుక్రవారం ప్రకటించింది. తమ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తున్నట్లు పేర్కొంది. దీంతో కెనడాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు వీసా జారీ ప్రక్రియ పెద్ద ప్రహసనంగా మారనుంది. ఇన్నాళ్లూ భారత్, చైనా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, వియత్నాంసహా 13 దేశాల విద్యార్థులకే ఎస్డీఎస్ కింద ప్రాధాన్యత దక్కేది. ఈ దేశాల విద్యార్థులకు స్టడీ పర్మిట్లు చాలా వేగంగా వచ్చేవి. తాజా నిర్ణయంతో ఈ 13 దేశాల విద్యార్థులు సాధారణ స్టడీ పర్మిట్ విధానంలోని దరఖాస్తుచేసుకోవాల్సి ఉంటుంది. తాజా నిర్ణయాన్ని కెనడా సమర్థించుకుంది. జాతీయతతో సంబంధంలేకుండా అన్ని దేశాల విద్యార్థులకు సమాన అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతోనే ఎస్డీఎస్ను నిలిపేశామని వివరణ ఇచ్చింది. -
‘వారంలో ఏడు రోజులు ఫ్రీగా పని చేస్తాను’
యూకేలో ఉండడానికి ఉచితంగా పని చేయాడానికైనా సిద్ధంగా ఉన్నట్లు ఓ భారతీయ విద్యార్థిని తెలిపింది. గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వెళ్లిన ఆమె అక్కడే ఉండేందుకు ఉచితంగా పని చేస్తానని లింక్డ్ఇన్ పోస్ట్‌లో తెలియజేశారు. 2022లో గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు శ్వేత చెప్పారు. తాను రోజు 12 గంటలపాటు వారంలో ఏడు రోజులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈపోస్ట్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.‘నా పేరు శ్వేత. నేను గ్రాడ్యుయేషన్ చేసేందుకు యూకే వచ్చాను. నా గ్రాడ్యుయేట్ వీసా మూడు నెలల్లో ముగియనుంది. నేను యూకేలో వీసా అందించే కంపెనీల్లో ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 2022లో నా గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పటి నుంచి 300 కంటే ఎక్కువగానే ఉద్యోగాలకు దరఖాస్తు చేశాను. యూనివర్శిటీ ఆఫ్ లీసెస్టర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్సీ పట్టా పొందాను. వీసా స్పాన్సర్డ్ డిజైన్ ఇంజినీర్ ఉద్యోగాల కోసం చూస్తున్నాను. మీరు యూకేలో కంపెనీ నిర్వహిస్తూ డిజైన్ ఇంజినీర్ల కోసం వెతుకుతున్నట్లయితే నన్ను వెంటనే ఉద్యోగంలోకి తీసుకోండి. వారంలో ఏడు రోజులపాటు రోజువారీ 12 గంటలు పని చేస్తాను. ఒక నెలపాటు నాకు ఎలాంటి జీతం అవసరం లేదు. నా పనితీరు గమనించండి. నచ్చితే కొనసాగించండి. లేదంటే ఎలాంటి వివరణ ఇవ్వకుండా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించండి. ఈ పోస్ట్‌ను అంతర్జాతీయ విద్యార్థులు చదువుతుంటే దీన్ని రీపోస్ట్ చేయండి’ అని తెలుపుతూ దానికి సంబంధించిన ఇమేజ్ను కూడా శ్వేత షేర్ చేశారు.ఇదీ చదవండి: ‘నవంబర్ 8న సెలవులో ఉంటాను.. బై’!మిమ్మల్ని మీరు నమ్మండిఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ‘మీరు వెళ్లిన దేశంలో ఉండటానికి ఉచితంగా పని చేయడం లేదా అన్నేసి గంటలు పనిచేయడం అసంబద్ధం. మీకు ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను’ అంటూ ఒకరు కామెంట్ చేశారు. ‘యూకేలో ఉండడం కోసం ఇలా చేయనవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మండి. మీరు తెలివైనవారు. ప్రపంచంలో ఎక్కడైనా గుర్తింపు పొందుతారు’ అని మరొకరు రిప్లై ఇచ్చారు. -
ట్రంప్ మానియా..ఐటీపై ప్రభావం ఎంత?
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్‌నకు అక్కడి ప్రజలు పట్టంకట్టారు. అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన గతంలో ప్రకటించారు. దాంతో అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులు కొంత నిరాశ చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత హయాంలో మాదిరిగానే ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉంటుందనే ఆందోళనలు సహజంగా వ్యక్తమవుతున్నాయి. 80 శాతం పైగా భారత్ ఐటీ సర్వీసుల ఆదాయం అమెరికా నుంచే వస్తోంది. హెచ్1బీ/ఎల్1 వీసాలపై(యూఎస్ కంపెనీలు విదేశీయులకు అందించే వీసాలు) ట్రంప్ తొలిసారి అధికారం వచ్చిన వెంటనే నిబంధనలను కఠినతరం చేయడం తెలిసిందే.వీసా పరిమితులు?గతంలో ట్రంప్ హయాంలో విదేశీ ఐటీ సంస్థలు ఉద్యోగాల్లో అమెరికన్లకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో పాటు వీసాల జారీపైనా పరిమితులు విధించారు. దీంతో అప్పట్లో ఐటీ కంపెనీలు వ్యయ భారాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ప్రభావంతో వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు విదేశీ సెంటర్లలో స్థానిక నిపుణులకే పెద్దపీట వేశాయి. 2016–17లో అమెరికాలో భారతీయ ఐటీ సంస్థల ఉద్యోగుల్లో మూడింట రెండొంతులు హెచ్1బీ/ఎల్1 వీసాల ద్వారానే నమోదుకాగా, ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఎడిట్ చేసిన ఫొటోను షేర్ చేసిన మస్క్కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు..ఐటీ అగ్ర త్రయం టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో హెచ్1బీ వీసాలు గత పదేళ్లలో 50–80% తగ్గిపోయినట్లు అంచనా. ట్రంప్ నియంత్రణల తర్వాత ఇది జోరందుకుంది. 2019–20లో ఇన్ఫీ గ్లోబల్ సిబ్బంది 65 శాతానికి, విప్రోలో 69 శాతానికి ఎగబాకినట్లు బ్రోకరేజ్ సంస్థ జేఎం ఫైనాన్షియల్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ 2.0 హయాంలో మళ్లీ వీసా పరిమితులు, కఠిన నిబంధనలు విధించినప్పటికీ.. పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు దేశీయ కార్యకలాపాలపై కార్పొరేట్ ట్యాక్స్‌ను 21% నుంచి 15%కి తగ్గిస్తామన్న ట్రంప్ ప్రతిపాదనలు కూడా భారత్ ఐటీ కంపెనీలకు సానుకూలాంశమని విశ్లేషకులు చెబుతున్నారు. వీసా నియంత్రణలు ఉన్నప్పటికీ ట్రంప్ తొలి విడతలో దేశీ ఐటీ షేర్లు పుంజుకోవడం విశేషం. టీసీఎస్ 185 శాతం, ఇన్ఫోసిస్ 174 శాతం, విప్రో 140 శాతం చొప్పున ఎగబాకాయి. -
ఇలా చేస్తే భారీగా విదేశీ పర్యాటకులు
న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు, పర్యాటక రంగం వృద్ధికి వీలుగా బుకింగ్ డాట్ కామ్ కీలక సూచనలు చేసింది. అంతర్జాతీయంగా మరిన్ని ప్రాంతాల నుంచి డైరెక్ట్ విమాన సరీ్వసులను అందుబాటులోకి తీసుకురావడం, వీసా ప్రక్రియలను సులభతరం చేయడం, భారత్‌లోని విభిన్న, విస్తృతమైన పర్యాటక ప్రదేశాల గురించి ప్రచారం చేయాలని సూచించింది. వివిధ భాగస్వాముల నుంచి సమిష్టి చర్యలకు తోడు నిర్దేశిత పెట్టుబడులతో భారత పర్యాటకం కొత్త శిఖరాలకు వెళుతుందని పేర్కొంది. రానున్న ఏడాది, రెండేళ్లలో భారత్‌ను సందర్శించాలని అనుకుంటున్న వయోజనుల అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుని బుకింగ్ డాట్ కామ్ ఒక నివేదిక విడుదల చేసింది. 19 దేశాలకు చెందిన 2,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకుంది. భారత్‌కు రావాలనుకుంటే, ఎదుర్కొనే సవాళ్లు, ప్రోత్సాహకాలు, ప్రాధాన్యతలు ఏంటని ప్రశ్నించి, వారి అభిప్రాయాలు రాబట్టింది. విదేశీ పర్యాటకుల్లో సగం మంది కేవలం భారత్‌ను చూసి వెళ్లేందుకే వస్తున్నారు. మూడింట ఒక వంతు భారత్‌తోపాటు, ఆసియాలో ని మరికొన్ని దేశాలకూ వెళ్లేలా ట్రావెల్ ప్లాన్‌తో వస్తున్నారు. యూఎస్, యూకే, జర్మనీ, యూఏఈ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు. సంప్రదాయంగా చైనా, కెనడా, బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చేవారు. భారత్‌కు వస్తున్న విదేశీ పర్యాటకులకు సంబంధించి టాప్–10 దేశాల్లో ఆ్రస్టేలియా, ఇటలీ, నెదర్లాండ్స్ తాజాగా చేరాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, జైపూర్ విదేశీ పర్యాటకులు సందర్శించే వాటిల్లో టాప్–5 ఎంపికలుగా ఉంటున్నాయి. హంపి, లేహ్‌కు ఆదరణ పెరుగుతోంది. పతి్నటాప్, పెహల్గామ్, మడికెరి, విజయవాడ, ఖజురహో ప్రాంతాలను సైతం సందర్శించేందుకు విదేశీ పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నారు. -
యూఏఈ వీసా ఆన్ అరైవల్.. షరతులు వర్తిస్తాయి
అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. యూఏఈ ప్రభుత్వం భారత జాతీయుల కోసం నూతనంగా వీసా ఆన్ అరైవల్ విధానాన్ని ప్రకటించింది. అయితే, ఇందుకు ఓ షరతు విధించింది. అమెరికా, యూకే, ఇతర ఏదైనా యూరోపియన్ యూనియన్ దేశం శాశ్వత నివాస కార్డు లేదా వీసా ఉన్న వ్యక్తులే వీసా ఆన్ అరైవల్‌కు అర్హులు. ఈ విధానం ద్వారా యూఏఈలో అడుగు పెట్టిన వెంటనే వీరికి 14 రోజుల వీసా లభిస్తుంది. అవసరమైన ఫీజు చెల్లించిన పక్షంలో మరో 60 రోజుల వరకు దీనిని పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇందుకుగాను..అమెరికా వీసా, నివాస కార్డు లేక గ్రీన్ కార్డు ఉన్న వారు.. ఏదేని యూరోపియన్ యూనియన్ దేశం లేక యునైటెడ్ కింగ్డమ్ వీసా లేక నివాస ధ్రువీకరణ కార్డు ఉన్నవారు అర్హులు. కనీసం ఆరు నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్టు కూడా వీరు చూపాల్సి ఉంటుంది. భారత్–యూఏఈల బంధం బలపడుతున్న వేళ ఈ నూతన విధానం అమల్లోకి రావడం విశేషం. యూఏఈలో ప్రస్తుతం 35 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. -
డమ్మీ కాన్సులేట్‌లో వీసా ఇంటర్వ్యూ
సాక్షి, హైదరాబాద్: నగర శివారులోని ఓ స్టార్ హోట ల్లో అమెరికన్ కాన్సులేట్ సెట్ వేసిన ఓ ముఠా.. గుజరాత్‌కు చెందిన వ్యాపారిని మోసం చేసింది. వీసా ఇంటర్వ్యూల పేరిట రూ.41.5 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదుతో అహ్మదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌లో కొందరు హైదరాబాద్‌కు చెందినవారు ఉన్నారని అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి ఓ ప్రత్యేక బృందం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్‌కు రానుంది. ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయం.. అహ్మదాబాద్‌లో వస్త్ర వ్యాపారం చేసే వ్యాపారికి స్నేహితుల ద్వారా మీన్‌చంద్ పటేల్ అనే ట్రావెల్ ఏజెంట్‌తో పరిచయమైంది. తనతో సహా 19 మంది స్నేహితులు, కుటుంబీకులు అమెరికా విహారయాత్రకు వెళ్లాలని భావిస్తున్నట్టు మీన్‌చంద్‌కు చెప్పాడు. అందరి వీసాలు ప్రాసెస్ చేయడానికి అంగీకరించిన ఇతగాడు వారి నుంచి టూర్ ప్యాకేజీ కూడా సిద్ధం చేశారు. మొత్తం 19 మంది నుంచి పాస్‌పోర్ట్ కాపీలు తీసుకున్నాడు. అప్లికేషన్ ఫీజు పేరుతో రూ.1.5 లక్షలు వసూలు చేసిన మీన్‌చంద్ వారికి కొన్ని దరఖాస్తులు ఇచ్చి పూరించమని చెప్పాడు. వ్యాపారిని మోసం చేయాలని నిర్ణయించిన ఈ ఏజెంట్, దానికోసం మరికొందరితో కలిసి భారీ స్కెచ్ వేశాడు.హైదరాబాద్ కాన్సులేట్‌లో మాత్రమే తమకు కావాల్సిన సమయంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పి నమ్మించాడు. వీసా ఇంటర్వ్యూ కోసం అంతా అక్కడకు వెళ్లాలంటూ ప్రత్యేక బస్సులో తీసుకొచ్చాడు. దీనికి ముందే తన అనుచురులు కొందరిని హైదరాబాద్‌కు పంపిన మీన్ చంద్ శివార్లలోని ఓ స్టార్ హోటల్లో బాంక్వెట్ హాల్ బుక్ చేయించాడు. అందులో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు ఉంచి యూఎస్ కాన్సులేట్ బ్రాంచ్ ఆఫీస్‌గా మార్చాడు. గుజరాత్‌కు చెందిన వారికి వీసాలు జారీ కావడం కష్టమంటూ అహ్మదాబాద్ వ్యాపారికి చెప్పిన మీన్‌చంద్... తనకు ఉన్న పరిచయాలు వినియోగించి ప్రాసెస్ పూర్తయ్యేలా చేస్తున్నానని నమ్మబలికాడు.అయితే భద్రతా కారణాల నేపథ్యంలో నానక్‌రామ్‌గూడలో ఉన్న అమెరికన్ కాన్సులేట్‌లోకి ఎక్కువ మందిని అనుమతించట్లేదని, గ్రూప్ వీసా ప్రాజెక్టులో భాగంగా ఓ హోటల్లో ఇంటర్వ్యూలు చేయడానికి కాన్సులేట్ అధికారులు అంగీకరించారని నమ్మించాడు. దాదాపు మూడు నెలల క్రితం అందరినీ హైదరాబాద్ తీసుకొచ్చిన మీన్‌చంద్ మరో హోటల్లో బస చేయించాడు. అక్కడ నుంచి వాళ్ల బస్సులోనే ఈ స్టార్‌హోటల్‌కు తీసుకొచ్చాడు. నేరుగా బాంక్వెట్ హాల్‌కు తీసుకెళ్లి... అప్పటికే సిద్ధంగా ఉన్న తన అనుచరుల్ని కాన్సులేట్ అధికారులు, ప్రతినిధులుగా నమ్మించాడు.అలా 19 మందికీ డమ్మీ ఇంటర్వ్యూలు చేయించి వారిని మీన్‌చంద్ తిరిగి అహ్మదాబాద్‌కు తీసుకెళ్లాడు. ఆపై వీసా ఫీజుల పేరుతో మరో రూ.40 లక్షలు వసూలు చేశాడు. ఎన్నాళ్లు వేచి చూసినా వీసాలు ప్రాసెస్ కాకపోవడంతో అనుమానించిన వ్యాపారి అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ స్కామ్‌లో మీన్‌చంద్‌కు హైదరాబాద్‌కు చెందిన వారూ సహకరించి ఉంటారని అనుమానిస్తున్న అక్కడ పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల సేకరణ కోసం త్వరలో నగరానికి రానున్నారు. -
మస్కట్ పిలుస్తోంది!
సెప్టెంబర్ నెలలో రాజధాని నగరం మస్కట్ నగరంలో విహరించమని పర్యాటకులకు ఆహ్వానం పలుకుతోంది ఒమన్ దేశం. చల్లటి వాతావరణంలో టూరిస్టుల తాకిడి తక్కువగా ఉన్న సమయం షాపింగ్‌కి అనువైన కాలం అంటూ ఈ వీసా సౌకర్యం కల్పిస్తోంది ఒమన్ టూరిజం. ఇక్కడ ఏమేమి చూడవచ్చు, ఏమేమి కొనవచ్చు! ఓ లుక్ వేద్దాం.మస్కట్ నగరంలో పురాతన కోటలున్నాయి, అద్భుతంగా నిర్మించిన మసీదులున్నాయి, కనువిందు చేసే ΄ార్కులు, సంస్కృతి సంప్రదాయాలు చరిత్రకు ఆలవాలంగా భారీ మ్యూజియాలున్నాయి. అల్ జలాయ్ ఫోర్ట్‌ను చూడాలి. 16వ శతాబ్దంలో ΄ోర్చుగీసు స్వాధీనంలోకి వెళ్లిన అరబ్బుల కోట ఒమన్ చరిత్రకు ప్రతిబింబం. ఇక ప్రార్థన మందిరాలను చూడాలంటే సుల్తాన్ ఖాబూస్ గ్రాండ్ మాస్క్. ఇది ఎంత పెద్దదంటే ఒకేసారి ఇరవై వేల మంది ప్రార్థనలు చేసుకోవచ్చన్నమాట. ఇక షాపింగ్ చేయాలంటే ముత్రాహ్ సౌక్‌ను తప్పకుండా చూడాలి. అరబిక్ సంప్రదాయం కళ్ల ముందు ప్రత్యక్షమైనట్లు ఉంటుంది. ముండూస్ (ఆభరణాల పెట్టె), టర్కీ కార్పెట్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, పోస్ట్ కార్డ్, పెర్ఫ్యూమ్, కర్జూరాలను కొనుక్కోవచ్చు. కశ్మీర్ కార్పెట్లు ఈ మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణ.మ్యూజియం చేసే మ్యాజిక్: నేషనల్ మ్యూజియంలోకి వెళ్లిన తర్వాత మనకు తెలియకుండానే టైమ్ మెషీన్‌లోకి వెళ్లి΄ోతాం. ఎన్ని గంటలకు బయటకు వస్తామో చెప్పలేం. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది బైట్ అల్ జుబైర్ గురించి. ఇది ఓమన్ సంప్రదాయ వాస్తుశైలి నిర్మాణం. ఫర్నిచర్, హస్తకళాకృతులు, స్టాంపులు, నాణేల సుమహారం. ఇదీ సింపుల్‌గా మస్కట్ నగరం. ముంబయి నుంచి డైరెక్ట్ ఫ్లయిట్ ఉంది. రెండున్నర గంటల ప్రయాణం. -
భారత్‌తో సహా 34 దేశాలు.. శ్రీలంక సంచలన నిర్ణయం
సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే వీసా తప్పనిసరి. వీసాతో అవసరం లేకుండా తమ దేశాలను సందర్శించవచ్చని గతంలో కొన్ని దేశాలు ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రీలంక కూడా చేరింది.శ్రీలంక ప్రభుత్వం 2024 అక్టోబర్ 1 నుంచి ఇండియా, యూకే, అమెరికా వంటి 35 దేశాల పౌరులకు వీసా అవసరం లేదని ప్రకటించింది. అంటే ఈ దేశ పౌరులు శ్రీలంకకు వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఈ విషయాన్ని శ్రీలంక టూరిజం మంత్రి హరీన్ ఫెర్నాండో వెల్లడించారు.భారతదేశం, యుకె, చైనా, యుఎస్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, స్పెయిన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, పోలాండ్, కజకిస్తాన్, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, మలేషియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, చెక్ రిపబ్లిక్, ఇటలీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, ఇజ్రాయెల్, బెలారస్, ఇరాన్, స్వీడన్, దక్షిణ కొరియా, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, న్యూజిలాండ్ దేశాల ప్రజలు వీసాతో పనిలేకుండానే శ్రీలంకను సందర్శించవచ్చు.శ్రీలంక ప్రభుత్వం వీసా రహిత సందర్శన అవకాశాన్ని కేవలం ఆరు నెలలు మాత్రమే అందిస్తుంది. దీనికి శ్రీలంక క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగానే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
శ్రీలంకకు ఇక వీసా అక్కర్లేదు
కొలంబో: భారత పౌరులకు ఆరు నెలలపాటు వీసారహిత ప్రవేశాన్ని కల్పించాలని శ్రీలంక ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌తో పాటు మరో 35 దేశాలకు ఈ సౌకర్యాన్ని కలి్పంచడానికి శ్రీలంక మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి వీసారహిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని పర్యాటక శాఖ సలహాదారు హరిన్ ఫెర్నాండో వెల్లడించార -
బంగ్లాలో అల్లర్ల ఎఫెక్ట్.. భారత్ కీలక నిర్ణయం
ఢాకా: భారత్ పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లడంతో శాంతి భద్రతలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు.. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాలో భారత్ వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు.వివరాల ప్రకారం.. బంగ్లాలో అల్లర్లు కొనసాగుతున్న సందర్భంగా అనేక మంది పౌరులు ఆ దేశాన్ని వీడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో బంగ్లాలోని భారత దౌత్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీసా దరఖాస్తు కేంద్రాలను నిరవధికంగా మూసివేశారు. ఈ మేరకు భారత్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే ఆన్లైన్ పోర్టల్‌లో ఓ మెసేజ్‌ను పెట్టారు. ఈ క్రమంలో..‘బంగ్లాదేశ్ వ్యాప్తంగా అన్ని వీసా దరఖాస్తు సెంటర్లను తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు మూసివేస్తున్నాం. అస్థిర పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తదుపరి దరఖాస్తు తేదీపై ఎస్ఎంఎస్ ద్వారా సమాచారమిస్తాం అని తెలిపారు. ఇక, భారత్‌కు ఢాకాలో హైకమిషన్‌తో పాటు చిట్టగాంగ్, రాజ్‌షాషీ, ఖుల్నా, సిల్హెట్ నగరాల్లో కాన్సులేట్లు ఉన్నాయి. Indian visa application centre at Bangladesh will remain closed till further notice and Bangladesh is set to form new interim government headed by Muhammad Yunus. The oath taking ceremony will be held at 8 pm on 08.08.2024.#MuhammadYunus #BangaldeshUnderAttack pic.twitter.com/Zanj8z3LfH— Lokendra Dixit (@LokendraDixit12) August 8, 2024ఇదిలా ఉండగా.. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఇప్పటికే పలువురు మన దేశంలోకి వచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. కానీ, బీఎస్ఎఫ్ దళాలు వారిని అడ్డగించినట్టు సమాచారం. మరోవైపు.. ఒడిశా తీరంలో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. 480 కిలోమీటర్ల తీర ప్రాంతంలో పటిష్ట నిఘాను ఏర్పాటుచేశారు. -
నీరజ్ ‘గోల్డ్’ గెలిస్తే అందరికీ... ఓ సీఈవో అదిరిపోయే ఆఫర్!
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics 2024)లో బంగారు పతకం సాధిస్తే అందరికీ ఉచిత వీసాలు ఇస్తామని ఆన్లైన్ వీసా స్టార్టప్ సంస్థ అట్లీస్ సీఈవో మోహక్ నహ్తా హామీ ఇచ్చారు. ఆయన ప్రకటించిన ఆఫర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.తన లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకుంటూ.. "ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే నేను వ్యక్తిగతంగా అందరికీ ఉచిత వీసా పంపుతాను" అంటూ ప్రకటించారు. జూలై 30న నహ్తా పోస్ట్ పెట్టిన వెంటనే, ఈ ఆఫర్‌కు సంబంధించి యూజర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో తన ఆఫర్‌ను వివరిస్తూ మరో పోస్ట్‌ను మోహక్ నహ్తా షేర్ చేశారు."నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిస్తే అందరికీ ఉచిత వీసా ఇస్తామని జూలై 30న వాగ్దానం చేశాను. చాలా మంది అడిగారు కాబట్టి, ఇవిగో వివరాలు.." అంటూ తాజా పోస్ట్‌లో పూర్తి వివరాలు అందించారు. పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా ఆగస్ట్ 8న పతకాల కోసం పోటీపడతాడు. ఆయన బంగారు పతకం సాధిస్తే, ఒక రోజంతా వినియోగదారులందరికీ ఒక ఉచిత వీసా అందిస్తామన్నారు. ఆ రోజు అన్ని దేశాలకు వీసా ఖర్చును కంపెనీ భరిస్తుందని ఆయన తెలిపారు.వినియోగదారులు తమ ఈమెయిల్ అడ్రస్‌ను కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే కంపెనీ ఉచిత వీసా క్రెడిట్‌తో యూజర్ తరపున ఖాతాను సృష్టిస్తుందన్నారు. సీఈవో మోహక్ నహ్తా పోస్ట్ లింక్డ్ఇన్ ప్లాట్‌ఫారమ్‌లో భాఈగా రీపోస్ట్‌లు, లైక్‌లు, కామెంట్లను పొందింది. యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా ఉన్న అట్లీస్ కంపెనీకి భారత్‌లోని ఢిల్లీ, ముంబైలలో శాఖలు ఉన్నాయి. -
అమెరికాలో వారి కలలు కల్లలేనా!?
ప్రణీత, జెఫ్రీన్, రోషన్ లాంటి పరిస్థితిని అమెరికాలో 2.50 లక్షల మంది ఎదుర్కొంటున్నారు. వీరిలో చాలామంది భారతీయు లే. వీరంతా చిన్నవయసులో తమ కుటుంబ సభ్యులతో కలిసి చట్టబద్ధంగానే అమెరికాకు చేరుకున్నారు. కానీ, అమెరికాలోనే శాశ్వతంగా ఉండే అవకాశం మాత్రం లేదు. వీసాలను మార్చుకోకపోతే 21 ఏళ్లు దాటగానే స్వదేశాలకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి. వీరిని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అని పిలుస్తున్నారు. ఇలాంటి వారికి అమెరికాలో ఉండేందుకు, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచాలని అధికార డెమొక్రటిక్ పార్టీ భా విస్తుండగా, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ మాత్రం అంగీకరించడం లేదు. బయటకు పంపించాల్సిందేనని పట్టుబడుతోంది. సెనేట్‌లో రెండు సార్లు వ్యతిరేకంగా ఓటు వేసింది. ఎందుకీ సమస్య? లాంగ్ టర్మ్ వీసా కలిగి ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో కలిసి డిపెండెంట్‌గా అమెరికాకు వచ్చినవారు 21 ఏళ్ల వయసు వచ్చేదాకా అమెరికాలో ఉండేందుకు వీలుంది. ఆ తర్వాత వీసా మార్చుకోకపోతే బయటకు వెళ్లిపోవాల్సిందే. తల్లిదండ్రులకు/ కుటుంబ సభ్యులకు గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస హోదా) లభిస్తే ఎలాంటి ఇబ్బంది లేదు. డిపెండెంట్లు కూడా అమెరికాలో నివసించేందుకు అవకాశం ఉంది. కానీ, గ్రీన్‌కార్డు లభించడానికి ఇప్పుడు 15 ఏళ్లకుపైగా సమయం పడుతోంది. ఈలోగా డిపెండెంట్లకు 21 ఏళ్ల వయసు దాటేస్తోంది. దాంతో వెనక్కి వెళ్లిపోవాల్సి వస్తోంది. ప్రతిభావంతులను వదులుకుంటారా? డిపెండెంట్లను బయటకు పంపించడాన్ని డెమొక్రటిక్ పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చట్టాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికాలో జని్మంచకపోయినా ఇక్కడే పెరిగి, పెద్ద చదువులు చదువుకొని, ఉన్నత ఉద్యోగాలు కూడా చేస్తున్న ప్రతిభావంతులను వదులుకోవడం తెలివైన పని కాదని అంటున్నారు. దేశ అభివృద్ధికి వారి సేవలు అవసరమని చెబుతున్నారు. ఇక్కడ నేర్చుకున్న నైపుణ్యాలను మరో దేశం కోసం ధారపోయడం ఏమిటని వాదిస్తున్నారు. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్‌కు అమెరికాలో నివసించే, ఉద్యోగాలు చేసుకొనేందుకు వీలు కలి్పంచే బైపారి్టషన్ అమెరికాస్ చి్రల్డన్స్ యాక్ట్ పెండింగ్‌లో ఉంది. ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేలోగా తమకు చట్టబద్ధమైన నివాస హోదా కలి్పంచాలని డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ కోరుతున్నారు. → ఇండియాలో జని్మంచిన ప్రణీత 8 ఏళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచి్చంది. క్లౌడ్ ఇంజనీరింగ్ చదివింది. శాశ్వత నివాస హోదా లేకపోవడంతో 15 ఏళ్లకుపైగా డిపెండెంట్‌గా నివసిస్తోంది. అమెరికాలో ఉండాలంటే తరచుగా వీసాలు మార్చుకోవాల్సి వస్తోంది.→ జెఫ్రీనా 2005లో ఏడేళ్ల వయసులో కుటుంబంతో కలిసి హెచ్4(డిపెండెంట్) వీసాపై అమెరికా వెళ్లింది. 2010లో ఆమె కుటుంబం గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. అదెప్పుడొస్తుందో తెలియదు. జెఫ్రీనాకు 21 ఏళ్లు దాటడంతో ఇండియాకు వెళ్లిపోవాలి.→ రోషన్ పదేళ్ల వయసులో తల్లి, సోదరుడితో కలిసి హెచ్4 వీసాపై అమెరికా వచ్చాడు. 16 ఏళ్లు అక్కడే చదువుకున్నాడు. సెమీకండక్టర్ల తయారీ కంపెనీలో చేరాడు. అమెరికాను తన సొంత దేశంగానే ఇన్నాళ్లూ భావించాడు. కానీ, అక్కడి ప్రభుత్వం అతన్ని గత నెలల్లో ఇండియాకు బలవంతంగా తిరిగి పంపించివేసింది. -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
‘గోల్డెన్ వీసా’ నిబంధనలు!
విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఇండోనేషియా ప్రత్యేక వీసా ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అయితే ఈ ‘గోల్డెన్ వీసా’ను అందుకోవాలంటే ఇన్వెస్టర్లు కనీసం 3,50,000 డాలర్ల(రూ.2.9 కోట్లు) నుంచి 50 మిలియన్ డాలర్లు(రూ.410 కోట్లు) వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నిబంధనలను అనుసరించి ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఈ వీసా చెల్లుబాటు అవుతుందని ఇండోనేషియా ప్రభుత్వం పేర్కొంది.ఆగ్నేయాసియాలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఇండోనేషియా విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఐదేళ్లు, పదేళ్ల కాలపరిమితికిగాను ‘గోల్డెన్ వీసా’లను ప్రవేశపెట్టింది. ఐదేళ్ల వీసా పొందడానికి వ్యక్తిగత పెట్టుబడిదారులు ఆ దేశంలో కనీసం 2.5 మిలియన్ డాలర్ల(రూ.20 కోట్లు)తో కంపెనీని స్థాపించాలి. పదేళ్ల వీసా కోసం 5 మిలియన్ డాలర్లతో(రూ.40 కోట్లు) సంస్థ ప్రారంభించాలి. కంపెనీ స్థాపించడానికి ఆసక్తి లేని వారు ఐదేళ్ల కోసం 3,50,000 డాలర్లు(రూ.2.9 కోట్లు), పదేళ్లకోసం రూ.5.8 కోట్లు ఇన్వెస్ట్ చేయాలి. ఈ నిధులను ఇండోనేషియా ప్రభుత్వ బాండ్లు, పబ్లిక్ కంపెనీ స్టాక్‌లు లేదా డిపాజిట్‌ల్లో పెట్టుబడి పెట్టాలి.కార్పొరేట్ ఇన్వెస్టర్లు మాత్రం ఐదు సంవత్సరాల వీసా పొందేందుకు 25 మిలియన్ డాలర్లు(రూ.205 కోట్లు), పదేళ్ల కోసం 50 మిలియన్ డాలర్ల(రూ.410 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఇదే తరహా వీసా పథకాలను గతంలో కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు అందించాయి. కానీ ఈ పథకాలు సమర్థవంతంగా ఉద్యోగాలను సృష్టించలేవని, ఊహాజనిత ప్రయోజనాల కోసం మాత్రమే ఉంటాయని ఆయా దేశాలు నిర్ధారించాయి.ఇదీ చదవండి: భారమవుతున్న విద్యారుణాలు!ఇండోనేషియా ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి గత సంవత్సరం ట్రయల్ దశ ప్రారంభించింది. దాదాపు 300 మంది దరఖాస్తుదారులకు గోల్డెన్ వీసాలు మంజూరు చేసింది. దీని ద్వారా 123 మిలియన్ డాలర్ల(రూ.1,029 కోట్లు) పెట్టుబడులు సమకూరాయి. ఇండోనేషియా సంతతికి చెందిన విదేశీ పౌరులకు ప్రత్యేక హోదాను మంజూరు చేయాలనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకునే భారత్‌లోని కార్పొరేట్లు ఈ పథకాన్ని పరిశీలించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌లోనూ ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్యక్రమం అమలులో ఉంది. దీని ప్రకారం భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు ఇండియాలో తాత్కాలికంగా నివసించడానికి, స్థానికంగా పని చేయడానికి, ప్రయాణించడానికి అనుమతులున్నాయి. -
అమెరికా చిన్నారికి అత్యవసర వీసా..
కరీంనగర్: రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చింతలపెల్లి అఖిలేందర్రెడ్డి ఉపాధి నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన భార్య కేతిరెడ్డి శ్రుతిరెడ్డి తండ్రి కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన మోహన్‌రెడ్డి ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన తండ్రి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 6న డల్లాస్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరగా.. ఖత్తర్ ఎయిర్వేస్ సిబ్బంది ఆరు నెలల చిన్నారికి యశ్నకు ఫెలైట్ ఎక్కడానికి అనుమతించలేదు.శ్రుతిరెడ్డి భారతీయ పౌరురాలు. అమెరికాలో జన్మించిన ఆమె కూతురు యశ్నకు అమెరికా పౌరసత్వం ఉన్నా.. భారతీయ మూలాలున్నవారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఈ) కార్డు లేదా ఇండియా విజిట్ వీసా ఉండాలి. ఈ ఆరు నెలల పాపకు ఈ రెండు లేకపోవడంతో.. అక్కడ ఖత్తర్ ఎయిర్వేస్ సిబ్బంది ఫెలైట్ ఎక్కడానికి అనుమతి ంచలేదు.విషయం తెలుసుకున్న అఖిలేందర్ తండ్రి కొత్త పేట మాజీ ఎంపీటీసీ చింతలపెల్లి గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దృష్టికి శనివారం తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన జీవన్‌రెడ్డి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సమన్వయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి చిన్నారి యశ్నకు అత్యవసర వీసా ఇప్పించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు ఆదివారం అంత్యక్రియల కోసం ఫైలెట్లో బయలుదేరారు. సోమవారం నాగులపేటలో కేతిరెడ్డి మోహన్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని అంతిమ వీడ్కోలు పలకనున్నారు. -
భారతీయులకు శుభవార్త.. సౌదీ వెళ్లడానికి కొత్త ఎంట్రీ వీసాలు
సౌదీ అరేబియా పర్యాటకాన్ని పెంచే దిశగా భారతీయ పౌరుల కోసం కొత్త వీసా ఎంపికలను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇందులో స్టాప్ఓవర్ వీసాలు, ఈవీసాలు, వీసా ఆన్ అరైవల్ వంటివి ఉన్నాయి. 2024 చివరి నాటికి సౌదీ అరేబియాను సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య 20 లక్షల కంటే ఎక్కువ ఉండాలని ఈ కొత్త వీసాలను ప్రవేశపెట్టడం జరిగింది.భారతీయులు ఇప్పుడు స్టాప్ఓవర్ వీసా కోసం అప్లై చేసుకోవచ్చు. ఇది గరిష్టంగా 96 గంటలు చెల్లుతుంది. ఈ వీసాను సౌదియా ఎయిర్‌లైన్ వెబ్సైట్ ద్వారా 90 రోజులు ముందుగానే పొందవచ్చు. దీనికోసం నామినల్ ఫీజు వంటివి చెల్లించాల్సి ఉంటుంది.యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్ లేదా స్కెంజెన్ దేశం నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలను కలిగి ఉన్న భారతీయ పౌరులు ఈవీసా పొందటానికి అర్హులు. ఈ దేశాలలో శాశ్వత నివాసితులు లేదా సౌదీ అరేబియాలోకి ప్రవేశించిన తేదీ కంటే కనీసం మూడు నెలల చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈవీసా అధికారిక పోర్టల్ ద్వారా దీనిని పొందవచ్చు.ఈవీసా కోసం అవసరమైన ప్రమాణాలు ఉన్నవారు.. వీసా ఆన్ అరైవల్ కూడా పొందవచ్చు. యూఎస్, యూకే, స్కెంజెన్ దేశాల నుంచి చెల్లుబాటు అయ్యే పర్యాటక లేదా వ్యాపార వీసాలు కలిగిన వారికి మాత్రమే కాకుండా ఈ దేశాలలో శాశ్వత నివాసితులకు వీసా ఆన్ అరైవల్ పొందవచ్చు. దీని కోసం సౌదీ విమానాశ్రయాల్లోని సెల్ఫ్-సర్వీస్ కియోస్క్‌లు లేదా పాస్‌పోర్ట్ కార్యాలయాల్లో అప్లై చేసుకోవచ్చు.సౌదీ అరేబియా భారతీయ పౌరుల కోసం అందిస్తున్న ఈ వీసాల కోసం.. ముంబై, ఢిల్లీ, కొచ్చిన్, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగుళూరు, లక్నో, కోల్‌కతా, కాలికట్లలోని 10 వీసా ఫెసిలిటేషన్ కేంద్రాలలో అప్లై చేసుకోవచ్చు. ఇవి కాకుండా మరిన్ని నగరాల్లో కూడా ప్రత్యేక కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 2030నాటికి 75 లక్షల మంది ప్రయాణికులను సౌదీ అరేబియా ఆహ్వానించనుంది. -
ప్లీజ్.. ఎవరైనా సాయం చేయండి.. మంచు లక్ష్మి విజ్ఞప్తి!
టాలీవుడ్ నటి,నిర్మాత మంచులక్ష్మి తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన కుమార్తె కోసం అమెరికా వెళ్లేందుకు సాయం చేయాలని కోరింది. తన కూతురికి పాఠశాల సెలవులు త్వరలోనే ముగియనున్నాయని ఇన్‌స్టా వేదికగా తెలిపింది. నా యూఎస్ వీసా జారీ అయి నెల రోజులకు పైగానే అయిందని వివరించింది. ఎంబసీ కార్యాలయం సైట్ సాంకేతిక లోపం రావడంతో.. వీసా తనకు చేరడంలో ఆలస్యమైందని పేర్కొంది. దీనికి ఎవరైనా సాయం చేయగలరా? అంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులను అభ్యర్థించింది. ఇన్‌స్టాలో మంచులక్ష్మి రాస్తూ..'నా అమెరికా వీసా ఒక నెల క్రితమే ఆమోదించారు. కానీ అది నాకు ఇప్పటికీ అందలేదు. నా కుమార్తె పాఠశాల సెలవులు ముగిశాయి. నేను ఎక్కాల్సిన విమానం విమానం జూలై 12న ఉంది. ఎంబసీ వెబ్సైట్ డౌన్ కావడంతో.. వారిని సంప్రదించడానికి నాకు మార్గం లేకుండా పోయింది. ఇప్పటికే రెండు నెలలు దాటింది. దయచేసి ఎవరైనా స్పందించి సహాయం చేయగలరా?' అంటూ పోస్ట్ చేసింది. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు రాయబారి ఎరిక్ గార్సెట్టి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ ట్యాగ్ చేస్తూ తన పరిస్థితి వివరించారు. సాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) -
న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో మార్పులు
న్యూజిలాండ్ వీసా రూల్స్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ దేశంలో కొన్ని పాత్రల్లో పనిచేస్తున్న విదేశీయులు తమ ద్వారా తమవారికి వర్క్, విజిటర్, స్టూడెంట్ వీసాలకు స్పాన్సర్ చేయడానికి అనుమతించని కొత్త ఇమ్మిగ్రేషన్ నిబంధనలను న్యూజిలాండ్ ప్రకటించింది.వీసా స్పాన్సర్లు న్యూజిలాండ్ ఆర్థిక, ఇమ్మిగ్రేషన్ ప్రాధాన్యతలకు అనుగుణంగా నిర్దిష్ట ప్రమాణాలను చేరుకునేలా వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించడమే ఈ నిబంధనల లక్ష్యం. వీటి ప్రకారం జూన్ 26 నుంచి ఆస్ట్రేలియన్, న్యూజిలాండ్ స్టాండర్డ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ (ANZSCO) లెవల్స్ 4, 5 లో రెసిడెన్సీ పాత్‌వేస్ (వివిధ రంగాల్లో నైపుణ్యాలు) లేకుండా అక్రిడేటెడ్ ఎంప్లాయర్ వర్క్ వీసా ఉన్నవారు ఇకపై తమ భాగస్వాములు, పిల్లల కోసం వర్క్, విజిట్, స్టూడెంట్ వీసా దరఖాస్తులకు మద్దతు ఇవ్వలేరు.ఈ సంవత్సరం ప్రారంభంలో ఏఈడబ్ల్యూవీ పథకానికి చేసిన విస్తృత సవరణలకు అనుగుణంగా ఈ సర్దుబాటు ఉంటుంది. అయితే భాగస్వాములు, పిల్లలు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే ఎక్రిడేటర్ ఎంప్లాయర్ వర్క్ వీసా లేదా అంతర్జాతీయ స్టూడెంట్ వీసా వంటి వాటి కోసం సొంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే భాగస్వాములుగా లేదా డిపెండెంట్ పిల్లలుగా వీసాలను కలిగి ఉన్నవారిపై ఈ మార్పుతో ప్రభావం ఉండదని న్యూజిలాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఇండియాకు మాజీ చీఫ్ టి ప్రభాకర్ రావు
-
జోబైడెన్ కీలక నిర్ణయం.. అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట!
వాషింగ్టన్ : వీసా దారులకు అమెరికా జోబైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.అమెరికా పౌరుల భాగస్వాములకు సరైన డాక్యుమెంట్లు లేకపోయినా పర్మనెంట్ రెడిడెంట్స్ (గ్రీన్ కార్డ్) పొందే ప్రక్రియను సులభతరం చేస్తూ జో బైడెన్ కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది.నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్, మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌లు పోటీపడుతున్నారు.ఈ తరుణంలో అమెరికా పౌరుల్ని ప్రసన్నం చేసుకునేందుకు జోబైడెన్ సర్కార్ పీఆర్ నిబంధనల్ని సడలించేందుకు సిద్ధమైంది.అయితే ఈ కొత్త రూల్స్ ప్రకారం..అమెరికా పీఆర్ కోసం అప్లయ్ చేసుకునేందుకు కాదని, ఇప్పటికే పీఆర్‌కు అర్హులైన వారికి మాత్రమే ఈ కొత్త నిబంధనలు వర్తించనున్నట్లు సమాచారం. గ్రీన్ కార్డ్ కావాలంటే అర్హులైన వారు వారి సొంత దేశంలోని యూఎస్ ఎంబసీ కార్యాలయం నుంచి అప్లయ్ చేసుకోవాల్సి ఉంది. కొత్త రూల్స్ అమెరికా విడిచి వెళ్లే అవసరం లేకుండా అక్కడి నుంచే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.అమెరికా ఇమిగ్రేషన్ నిర్ణయంతో జూన్ 17,2024 ముందు వరకు వివాహ అయ్యిండి.. కనీసం అమెరికా పౌరులుగా కనీసం 10ఏళ్లు ఉంటే పీఆర్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు.ఇమ్మిగ్రేషన్ అధికారుల అంచనా ప్రకారం..పీఆర్ కోసం అప్లయ్ చేసుకునే వారి సంఖ్య 5లక్షలు ఉండొచ్చని అంచనా.అదనంగా, అమెరికన్ సిటిజన్లు దత్తత తీసుకున్న 50వేల మంది పిల్లలు ఉన్నారు. -
యూరప్ ట్రిప్ మరింత భారం.. భారీగా పెరిగిన వీసా ఫీజులు
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. నేటి నుంచి (జూన్11)షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజు 12 శాతం పెరిగింది. గతనెలలో వీసా ధరఖాస్తు ఫీజును పెంచుతూ యూరోపియన్ కమిషన్ ఆమోదించడంతో వీసా ధరఖాస్తు ఫీజు పెరగడం అనివార్యమైంది. ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, సివిల్ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు. -
భారత్‌లో జెన్‌జెడ్‌లు..థాయ్‌లాండ్‌ను చుట్టేస్తున్నారు
భారత్ యువత అవకాశం దొరికినప్పుడల్లా థాయ్‌లాండ్‌కు క్యూకడుతున్నారంటూ పాపులర్ రెంటల్ కంపెనీ ఎయిర్‌బీఎన్‌బీ పలు ఆసక్తికర విషయాల్ని వెలుగులోకి తెచ్చింది. ఎయిర్‌బీఎన్‌బీ డేటా ప్రకారం.. 2022- 2023లో భారతీయులు 60 శాతం కంటే ఎక్కువ మంది టూరిస్ట్‌లు థాయ్‌లాండ్‌లో తమ సంస్థ రూముల్ని బుక్ చేసుకున్నారని తెలిపింది.హోలీ,ఈస్టర్ సమయంలో భారతీయులు థాయ్‌లాండ్‌ను సందర్శించారు. వారం రోజుల పొడువున జరిగిన ఈ ఫెస్టివల్లో థాయ్‌లాండ్‌కు వచ్చే భారతీయులు 200 శాతం కంటే ఎక్కువ పెరిగారని ఎయిర్‌బీఎన్‌బీ డేటా హైలెట్ చేసింది.భారతీయులు థాయ్‌లాండ్ ఆకర్షితులయ్యేందుకు పెరిగిపోతున్న జనాభ, ప్రయాణలపై మక్కువతో పాటు ఇతర కారణాలున్నాయని ఎయిర్‌బీఎన్‌బీ పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో జెన్‌జెడ్ యువత ఎక్కువగా ఉందని, కాబట్టే వారికి థాయ్‌లాండ్‌తో పాటు ఇతర ప్రపంచంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనే ధోరణి పెరిగినట్లు వెల్లడించింది.దీనికి తోడు రెండు దేశాల పౌరులకు థాయ్ ప్రభుత్వం వీసా మినహాయింపును పొడిగింపు టూరిజంకు ఊతం ఇచ్చినట్లైందని ఎయిర్‌బీఎన్‌బీ జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు.a ఇక థాయ్‌లాండ్‌లో భారతీయలు బ్యాంకాక్,ఫుకెట్,చియాంగ్ మై,క్రాబి,స్యామ్యూయి ప్రాంతాలున్నాయి.ఎయిర్బీఎన్బీఅమెరికాలోని శాన్‌ఫ్రాన్సిక్సో వేదికగా ఎయిర్‌బీఎన్‌బీ అనే సంస్థ పర్యాటకుల కోసం పనిచేస్తోంది. వారికి హోటల్, బస, పర్యాటక ప్రాంతాలకు సంబంధించి బుకింగ్, ఇతర సేవలందిస్తోంది.జెన్‌జెడ్ అంటే 1997 నుంచి 2012 మధ్య జన్మించినవారిని జనరేషన్ జెడ్ (జెన్ జెడ్)గా పరిగణిస్తారు. -
అమెరికా వీసా ఫీజులు పెంపు.. గగ్గోలు పెడుతున్న ఇండియన్ ఐటీ కంపెనీలు
అమెరికా హెచ్-1బీ వీసా అప్లికేషన్ ఫీజు పెంపుపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీసా ధరఖాస్తు రుసుముల పెంపుతో ఇండియన్ ఐటీ కంపెనీలు గణనీయమైన సవాళ్లు, వారి ఆర్థిక పరిస్థితుల్ని దెబ్బతీస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. భారత్‌లో డిమాండ్ ఉన్నప్పటికీ అమెరికాలో కొరత ఉన్న కొన్ని ప్రత్యేకమైన విభాగాల్ని భర్తీ చేస్తేందుకు పలు ఐటీ కంపెనీలు అత్యంత నైపుణ్యం ఉన్న వేలాది మంది టెక్కీలను అమెరికాకు పంపిస్తుంటాయి. అయితే ఈ తరుణంలో హెచ్-1బీ సహా కొన్ని కేటగిరీల అప్లికేషన్ ఫీజులను పెంచింది అమెరికా.రూ.లక్షా పదివేలకు చేరిన ఎల్-1 వీసా దరఖాస్తు ఫీజు తాజా నిర్ణయంతో హెచ్-1బీ వీసా దరఖాస్తు ధర ఒకేసారి రూ.38వేల నుంచి (460 డాలర్లు), రూ.64వేలకు (780 డాలర్లకు) పెంచింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్ ధరను రూ.829 (నాడు 10 డాలర్ల) నుంచి రూ.17వేలకు (215 డాలర్లు) పెంచినట్లు అధికారులు వెల్లడించారు. ఇక, ఎల్-1 వీసా దరఖాస్తు రుసుమును రూ.38వేల ( 460 డాలర్ల) నుంచి రూ.లక్షా పదివేలకు (1,385 డాలర్లకు) పెంచారు.ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను రూ.3లక్షల నుంచి (3,675 డాలర్ల) నుంచి ఏకంగా రూ.9లక్షలకు ( 11,160 డాలర్లకు) పెంచినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ తమ ఫెడరల్ నోటిఫికేషన్లో పేర్కొంది.వీసా దారుడిపై అదనపు భారంఫలితంగా నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ ప్రకారం.. హెచ్-1బీ వీసా దారుడు ఉద్యోగం ఇచ్చినందుకు లేదా చేస్తున్న ఉద్యోగం కాలపరిమితి పెంచుతున్నందుకు అమెరికాకు అదనంగా 33వేల డాలర్లు చెల్లించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని వీసా దారుడు అప్లయి చేసుకున్న ప్రతి సారి చెల్లించాల్సి ఉంటుంది. వీసా ఫీజులపై కోర్టులో వాదనలుదీనిపై పలువురు ఇమ్మిగ్రేషన్ నిపుణులు.. భారత్ ఐటీ ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగాన్ని మరింత ఖరీదైనదిగా చేసే ప్రయత్నం చేస్తోందని ఇమ్మిగ్రేషన్ లిటిగేషన్ సంస్థ వాస్డెన్ లా మేనేజింగ్ అటార్నీ జోనాథన్ వాస్డెన్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కోర్టులో వీసా రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీజుల పెంపును సవాలు చేస్తూ కోర్టులో వాదిస్తున్న వారిలో వాస్డెన్ ఒకరు. ఇది అమెరికాకే నష్టంఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ సైతం వీసా రుసుముల పెంపుపై భారత్ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. గణనీయమైన డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్న సమయంలో ఫైలింగ్ ఫీజుల పెరుగుదల వ్యాపారంపై తీవ్రం ప్రభావాన్ని చూపుతోందని నాస్కామ్ వైస్ ప్రెసిడెంట్ శివేంద్ర సింగ్ అన్నారు. అదే సమయంలో వీసా ఫీజుల పెంపు అమెరికా ఆర్ధిక వ్యవస్థకు ప్రతికూలం ప్రభావం చూపిస్తుందని ఆయన హెచ్చరించారు. భిన్నాభిప్రాయలు వ్యక్తం ఫీజు పెంపుదల వల్ల కాలక్రమేణా హెచ్-1బీ వీసాల వినియోగం తగ్గుతుందని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నప్పటికీ, మరికొందరు కంపెనీలు తమకు అవసరమైన నైపుణ్యాలను పొందేందుకు అయ్యే ఖర్చులను భరిస్తూనే ఉంటాయని మరోలా స్పందిస్తున్నారు. -
బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. నెల రోజులైనా రాలేదు!
బాలీవుడ్ భామ కిరణ్ రాథోడ్ తెలుగు వారికి సైతం పరిచయం అక్కర్లేదు. హిందీ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. నువ్వు లేక నేను లేను చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ చిత్రాలు చేసింది. అయితే 2016 నుంచి సినిమాలు చేయడం ఆపేసిన ముద్దుగుమ్మ.. గతేడాది జరిగిన తెలుగు బిగ్‌బాస్ సీజన్-7 మెరిసింది. అయితే మొదటివారంలోనే ఎలిమినేట్ అయి ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ బ్యూటీ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వీసా విషయంలో తలెత్తిన సమస్యతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్లు పోస్ట్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందో ఓ సారి తెలుసుకుందాం.ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌కు కిరణ్ రాథోడ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం ఆమె ఇప్పటికే గతనెలలోనే వీసాకు అప్లై చేసింది. కానీ ఇప్పటికీ ఆమెకు వీసా జారీ కాలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.కిరణ్ రాథోడ్ ఇన్‌స్టాలో రాస్తూ..'కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు మే 13వ తేదీనే వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే మా టీమ్ అంతా అక్కడికి చేరుకున్నారు. నేను మాత్రం నెల రోజులైనా వీసా కోసం ఎదురు చూస్తూనే ఉన్నా. ఇప్పటికే ముందస్తుగా హోటల్ బుకింగ్, ట్రావెల్ బుకింగ్ ఖర్చుల కోసం రూ.15 లక్షలు వెచ్చించా. దీంతో తాను మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యా. దీనిపై సదరు వీసా సంస్థ సమాధానం చెప్పాలి.' అని రాసుకొచ్చింది. పాపం.. ఇప్పటికైనా కిరణ్ రాథోడ్‌కు వీసా వస్తుందేమో చూడాల్సిందే. View this post on Instagram A post shared by Keira Rathore (@kiran_rathore_official) -
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్‌టౌన్‌కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్‌పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది. -
వీసా లేకుండా 62 దేశాలు చుట్టొచ్చు
సాక్షి, అమరావతి: వీసా రహిత విదేశీ పర్యటనలకు భారతీయ పాస్‌పోర్టు విస్తృత అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక అద్భుతాలను అన్వేíÙంచడానికి మార్గాన్ని సులభతరం చేస్తోంది. యూకేకు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్–2024 నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. గతేడాది నుంచి పాస్‌పోర్టు ర్యాంకింగ్స్‌లో భారత్ స్థిరంగా ఉన్నప్పటికీ, వీసా రహిత గమ్యస్థానాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వీసా అవసరంలేకుండా భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య 57 నుంచి 62కు పెరిగింది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతోనే ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా, కరేబియన్ దేశాలు తమ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, సహజమైన బీచ్‌లు, సాంస్కృతిక ప్రదేశాల్లో వీసా రహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి. టాప్‌లో ఆరు దేశాలు.. అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు ప్రయాణాల్లో ఆసియా, ఐరోపా దేశాలు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి. 👉 సింగపూర్, జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు 227 విదేశీ గమ్యస్థానాలకుగాను 194 ప్రదేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తున్నాయి. 👉 దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్లాండ్ల పాస్‌పోర్టులు 193 గమ్యస్థానాలకు యాక్సెస్‌గా ఉంటూ రెండో స్థానంలో.. 👉 ఆ్రస్టియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 192 దేశాలకు ఉచిత వీసా అనుమతులను అందిస్తూ మూడో స్థానంలో నిలుస్తున్నాయి. 👉యూఏఈ గడిచిన దశాబ్దంగా అత్యతంగా వేగంగా వృద్ధి చెందుతూ 11వ స్థానానికి చేరుకుని 183 దేశాల్లో ఫ్రీ వీసా ప్రయాణ సౌలభ్యాన్ని సాధించింది. 👉 ఇక గతేడాదితో పోలిస్తే చైనా రెండు స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో 85 దేశాలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతిస్తోంది. ఏడో స్థానానికి యూఎస్ వీసా పరిమితం.. అమెరికా పాస్‌పోర్టు సామర్థ్యం దశాబ్దకాలంలో దిగజారింది. 2006–2014 మధ్య అగ్రస్థానంలో కొనసాగగా 2020 నుంచి ఏడో స్థానానికి పరిమితమైంది. పాస్‌పోర్టు ర్యాంకుల్లో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున నిలుస్తూ కేవలం 28 దేశాలకు మాత్రమే ఫ్రీ వీసా ప్రవేశాలు లభిస్తున్నాయి. సిరియా 29, ఇరాక్ 31, పాకిస్తాన్ 34, యెమెన్ 35 దేశాలకు ఉచిత వీసా ప్రయాణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరంలేకుండా సగటు ప్రయాణికులు వెళ్లిన గమ్యస్థానాల సంఖ్య 2006లో 58 నుంచి 2024 నాటికి 111కి రెట్టింపు కావడం విశేషం.భారత్ పాస్పోర్టుతో వీసాలేకుండా ప్రయాణించే దేశాలు..అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్ దీవులు, జి»ౌటి, డొమినికా, ఎల్ సల్వడార్, ఇథియోపియా, ఫిజీ, గాబన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేసియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజఖస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావో (ఎస్ఏఆర్ చైనా), మడగాస్కర్, మలేసియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేíÙయా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా,ౖ సమోవా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్–నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్–గ్రెనడైన్స్, టాంజానియా, థాయ్‌లాండ్, తైమూర్–లెస్టే, ట్రినిడాడ్–టొబాగో, ట్యునీíÙయా, తువాలు, వనాటు, జింబాబ్వే. -
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్‌తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసాస్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్‌కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తేపలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా?అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
అలెర్ట్ : యూకే వీసా నిబంధనలు కఠినతరం.. తక్షణమే అమల్లోకి
లండన్ : 2025 జనవరిలో జరగనున్న యూకే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్‌తో ఓడిపోనున్నారా? ఆ ఓటమి నుంచి గట్టెక్కేందుకు వీసా మంజూరులో కొత్త నిబంధనల్ని తీసుకొచ్చారా? అంటే అవుననే అంటున్నాయి యూకేలోని తాజా పరిణామాలు. వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త నిబంధనల్ని అమల్లోకి తెచ్చింది. యూకేకు వలసదారుల్ని తగ్గించే ప్రణాళికల్లో భాగంగా యూకేలో విధులు నిర్వహిస్తూ వారికి కుటుంబ సభ్యులకు వీసా స్పాన్సర్ చేయాలంటే అవసరమైన కనీస ఆదాయ పరిమితిని పెంచినట్లు యూకే ప్రకటించింది. కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తున్నట్లు తెలిపింది. స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా స్పాన్సర్డ్స్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీస ఆదాయ పరిమితిని 55 శాతం పెంచింది. అంటే స్పాన్సర్డ్ ఫ్యామిలీ వీసా పొందాలంటే కనీసం 18,600 నుంచి 29,000 పౌండ్స్ ఆదాయం ఉండాలి. వచ్చే ఏడాది వచ్చే ఏడాది ప్రారంభం నుంచి 38,700 పౌండ్స్‌కు పెంచుతున్నట్లు యూకే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే పలు నివేదికల ప్రకారం.. యూకేలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని నిర్ధేశించడంలో ఇమ్రిగ్రేషన్ అంశం కీలకం.ఈ నేపథ్యంలో ఆయా పొలికల్ ఏజెన్సీలు,మీడియా సంస్థలు సర్వేలు చేయగా అందులో ఇప్పటికిప్పుడు ఎన్నికలొచ్చిన అధికార కన్జర్వేటీవ్ పార్టీలో సగానికిపైగా ఎంపీలో ఓటమి పాలవుతారని సర్వేలు హైలెట్ చేశారు. ఇంతకంటే సులభమైన మార్గం లేదా? అందుకే వలస దారుల్ని కట్టడి చేయడంతో పాటు యూకేలోని పన్ను చెల్లింపు దారులపై భారం పడకుండా ఉండేలా యూకే ప్రధాని రిషి సునాక్ ప్రణాళికల్లో ఓ భాగమని చెబుతున్నాయి.వీసా మంజూరులో కొత్త నిబంధనలపై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవర్లీ మాట్లాడుతూ.. యూకే ప్రజలకు ఆమోదయోగ్యం పరిపాలన అందిస్తూ..దేశంలోకి వలసలు విపరీతంగా పెరగుతున్న తరుణంలో వాటికి కట్టడి చేసేందుకు మాకు ఇంతకంటే సులభమైన మార్గం కన్పించలేదని తెలిపారు. -
న్యూజిలాండ్ వీసా నిబంధనలు కఠినతరం
వెల్లింగ్టన్: వలసలను నియంత్రించేందుకు వీసా నిబంధనలను న్యూజిలాండ్ కఠినతరం చేసింది. ఇకపై తక్కువ నైపుణ్యమున్న పనివారు కూడా ఇంగ్లిష్‌పై పట్టు సాధించాల్సి ఉంటుంది. వారికి ఐదేళ్ల నివాస పరిమితిని మూడేళ్లకు తగ్గించింది. వీసాదారులకు నైపుణ్యం, అనుభవాలకు సంబంధించి పలు నిబంధనలు విధించింది. వెల్డర్లు, ఫిట్టర్లు, టర్నర్లు తదితర 11 కేటగిరీల వారిని ఫాస్ట్ ట్రాక్ విధానంలో తీసుకోవాలనే ప్రతిపాదనను సైతం ప్రభుత్వం ప్రస్తుతానికి పక్కనబెట్టింది. అవసరమైతే వీసా నిబంధనలను మరింత కఠినం చేయెచ్చని కూడా సంకేతాలిచ్చింది. -
ఆ దేశం వెళ్లాలంటే ఇక కష్టమే.. వీసా నిబంధనల్లో భారీ మార్పులు
వెల్లింగ్టన్ : మీరు ఆ దేశానికి వెళ్లేందుకు, అక్కడ పనిచేసేందుకు మక్కువ చూపుతున్నారా? ఇందుకోసం వీసాకి అప్లయి చేస్తున్నారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేశానికి వెళ్లడం కొంచెం కష్టంతో కూడుకున్న పనేనని విసా నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగాలు, చదువు అనేది సగటు మధ్యతరగతి కుటుంబాల నుంచి ఉన్నత వర్గాల వారి వరకూ విదేశం అనేది ఓ కల. అందుకే దేశీయంగా ఆదరణ, అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్స్‌లు చదివి విదేశాలకు క్యూకడుతుంటారు. దీనికి తోడు ఆయా దేశాల అభివృద్దిలో భాగం చేసేందుకు వీసా మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నాయి. వలసదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి. ఈ తరుణంలో న్యూజిలాండ్ ఎంప్లాయింటెంట్ వీసా ప్రోగ్రాంలో భారీగా మార్పులు చేసింది. గత ఏడాది రికార్డ్ స్థాయిలో విదేశీయులు తమ దేశానికి వలదారులు భారీ ఎత్తున క్యూ కట్టారని, దీంతో విసాలో మార్పులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చాలా తక్కువ నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో పనిచేసే వారికి న్యూజిలాండ్‌లో వసతి ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. న్యూజిలాండ్ వీసాలో చేసిన కీలక మార్పులు తక్కువ నైపుణ్యం కలిగిన లెవల్ 4, లెవల్ 5 కోసం ఉద్యోగాల్లో పనిచేసేందుకు మక్కువ చూపుతున్న వలసదారులకు ఇంగ్లీష్ తప్పని సరి చేసింది. కనీస నైపుణ్యాలు వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో మార్పులు లెవల్ 4, లెవల్ 5 వంటి లో స్కిల్డ్ ఉద్యోగాల్లో పనిచేసేందుకు ఆయా సంస్థలు సంబంధిత విభాగాల ఉద్యోగులకు వీసా ఇచ్చే విషయంలో వారి జీతాల్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. లెవల్ 4, లెవల్ 5 ఉద్యోగులకు న్యూజిలాండ్‌లో నివసించే కాలవ్యవధిని 5 నుంచి 3ఏళ్లకు తగ్గించింది. ఫ్రాంఛైజీ అక్రిడిటేషన్‌ను రద్దు చేసింది. విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి సంస్థలు ప్రామాణిక, హైవ్యాల్యూమ్ ఉపాధి అక్రిడిటేషన్ ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా న్యూజిలాండ్‌లో నైపుణ్యం కొరత ఉన్న సెకండరీ టీచర్ల వంటి అత్యంత నైపుణ్యం కలిగిన వలసదారులను ఆకర్షించడం,నిలుపుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది’ అని ఇమ్మిగ్రేషన్ మంత్రి ఎరికా స్టాన్ఫోర్డ్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే సమయంలో నైపుణ్యాల కొరత లేని ఉద్యోగాల కోసం న్యూజిలాండ్ వాసులు ముందు వరుసలో ఉండేలా చూసుకోవాలి అని ఆమె అన్నారు. కాగా, గత సంవత్సరం, దాదాపు 173,000 మంది న్యూజిలాండ్‌కు వలస వెళ్ళారు. సుమారు 5.1 మిలియన్ల జనాభా ఉన్న న్యూజిలాండ్‌కు కోవిడ్ తగ్గుముఖం పెట్టిన తర్వాత విదేశీయుల తాకిడి ఎక్కువైంది. పొరుగున ఉన్న ఆస్ట్రేలియా కూడా వలసదారులు పెరిగారు. దీంతో రాబోయే రెండేళ్లలలో వలసదారుల్ని తగ్గించేందుకు సన్నాహకాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. -
వీసా ఉంటే చాలు.. రూ. 1.25 లక్షల జీతం!
ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం లోకల్ క్లర్క్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. శాశ్వత, తాత్కాలిక ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఒక నోటీసును ప్రచురించింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ప్రాథమిక అర్హత. కంప్యూటర్ పరిజ్ఞానం, ఎంఎస్ ఆఫీస్ నైపుణ్యం ఉండాలి. ఇంకా ఏమేం ఉండాలంటే.. ఖతార్‌లోని ఇండియన్ ఎంబసీలో ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంగ్లీషు, హిందీ భాషల్లో ప్రావీణ్యం ఉండాలి. 2024 ఫిబ్రవరి 29 నాటికి 21 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గుర్తింపు ఉన్న సంస్థ లేదా కార్యాలయంలో క్లరికల్ పనిలో మూడేళ్ల అనుభవం ఉండాలి. అరబిక్‌లో ప్రావీణ్యం అదనపు అర్హత. అభ్యర్థులు తమ అదనపు అర్హతలు, పని అనుభవం లేదా సర్టిఫికెట్లను అప్లికేషన్లో చూపవచ్చు. అన్ని అలవెన్సులతో కలిపి నెలవారీ జీతం 5,500 ఖతార్ రియాల్స్ అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 1.25 లక్షలు ఉంటుంది. చెల్లుబాటు అయ్యే నివాస వీసా ఉన్న అభ్యర్థులు 2024లోపు ఏప్రిల్ 7 దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ పంపడానికి ప్రచురించిన నోటీసుతో పాటు ఇండియన్ ఎంబసీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో లింక్ అందుబాటులో ఉంటుంది. -
అమెరికా ప్రయాణం.. తప్పని వీసా ఇంటర్వ్యూ కష్టాలు
అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. అందులో ప్రధానంగా వీసాకోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూలకు పిలవకుండా కాలం వెళ్లదీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు వీసా(ఎఫ్1) ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. సాధారణంగా ఫాల్ సీజను ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుతుంది. అందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. ఈసారి మార్చి నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు విడుదల చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందుగా మాత్రమే ఇంటర్వ్యూ తేదీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందుకు తక్కువ సమయం ఉండగా స్లాట్లు విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవనే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రెండు దఫాలే స్లాట్లు జారీ.. గతంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉంటే మూడు దఫాల వరకు ఇంటర్వ్యూకు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండేది. ఇక నుంచి రెండుసార్లకు పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జూన్, జులై నెలల్లో విడుదల చేసే స్లాట్లలో వీసా రాకపోతే పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు రెండో వారం తరవాత నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో.. -
గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్-1బీ వీసా ప్రక్రియ ఇక మరింత సులభతరం!
హెచ్-1బీ వీసా కోసం అప్లయ్ చేశారా? ప్రాజెక్ట్ నిమిత్తం అమెరికాకు వెళ్లే యోచనలో ఉన్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. హెచ్1- బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను సులభతరం చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా ఫిబ్రవరి 28,2024న యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ విభాగం (యూఎస్సీఐఎస్) మైయూఎస్సీఐఎస్ పేరుతో కొత్త సేవల్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పద్దతిలో హెచ్-1బీ వీసా ప్రాసెస్ మరింత సులభ తరం అయ్యేలా ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను వినియోగించుకునే సదుపాయాన్ని కల్పించింది. హెచ్-1బీ వీసా ప్రాసెస్ వేగవంతం ప్రపంచ వ్యాపంగా ఆయా కంపెనీలు తమ ప్రాజెక్ట్‌ల నిమిత్తం ఉద్యోగుల్ని అమెరికాకు పంపిస్తుంటాయి. ఇందుకోసం ఉద్యోగులు హెచ్-1బీ వీసా తప్పని సరిగా ఉండాలి. ఇప్పుడు ఆ హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వేగవంతం జరిగేలా చర్యలు తీసుకుంది జోబైడెన్ ప్రభుత్వం. ఇందులో భాగంగా మైయూఎస్సీఐఎస్లోని ఆర్గనైజేషనల్ అకౌంట్లో సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులు, లీగల్ అడ్వైజర్లు హెచ్1-బీ వీసా రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషిన్ ప్రాసెస్ చేయొచ్చు. కొత్త పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరం జోబైడెన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మైయూఎస్సీఐఎస్ ఈ కొత్త వీసా పద్దతి హెచ్-1బీ వీసా పిటిషనర్లకు వరంగా మారుతుందని వీసా నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త వీసా ప్రాసెస్‌లో సంస్థలే హెచ్-1బీ ప్రాసెస్ చేసుకోవచ్చు.హెచ్-1బీ రిజిస్ట్రేషన్, పిటిషన్స్‌తో పాటు ఫారమ్ ఐ-907కి సంబంధించిన కార్యకలాపాల్ని చక్కబెట్టుకోవచ్చు. ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు అంతేకాదు మైయూఎస్సీఐఎస్ ఉన్న డేటా ఆధారంగా అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారులు వలసదారుల (noncitizens) అర్హతని బట్టి ఇచ్చే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు కల్పించాలా? వద్దా? అనే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని యూఎస్సీఐఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దశ చాలా అవసరం మార్చి 2024 నుండి సంస్థలు హెచ్-1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో పాల్గొనడానికి కొత్త ఆర్గనైజేషనల్ అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ పిటిషన్లను ఫైల్ చేయాలనుకుంటున్న వారికి ఈ దశ చాలా అవసరం. ఫారమ్ ఐ-907 అంటే? ఇందులో కొత్త మొత్తాన్ని చెల్లించి వీసా ప్రీమియం ప్రాసెసింగ్ సర్వీసులు పొందవచ్చు. ఉదాహరణకు పిటిషన్స్, అప్లికేషన్లు. హెచ్-1బీ రిజిస్ట్రేషన్, హెచ్-1బీ పిటిషన్స్ అంటే? ఉదాహరణకు భారతీయులు అమెరికాలో ఏదైనా సంస్థలో పనిచేయాలనే వారికి హెచ్-1బీ వర్క్ పర్మిట్ తప్పని సరి. ఈ హెచ్-1బీ వీసా అప్లయ్ చేయడాన్ని హెచ్-1బీ రిజిస్ట్రేషన్ అంటారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఎంపికైనా అభ్యర్ధులకు తర్వాత జరిగే ప్రాసెస్‌ను హెచ్-1బీ పిటిషన్ అని అంటారు. -
దుబాయ్ వెళ్లే భారతీయులకు శుభవార్త - ఏంటో తెలుసా..
దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) భారత్.. దుబాయ్ మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టింది. ఈ వీసా పొందిన వారు ఐదు సంవత్సరాల పాటు మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్ సదుపాయాన్ని పొందుతారు. భారత్ నుంచి 2023 సంవత్సరంలో ఏకంగా 2.46 మిలియన్ల మంది దుబాయ్ వెళ్లినట్లు, ఈ సంఖ్య కరోనా వ్యాపించడానికి ముందు రోజుల కంటే 25 శాతం ఎక్కువని తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే 2023లో మొత్తం 17.15 మిలియన్ల మంది దుబాయ్ సందర్శించారు. 2022 ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన వారు 1.84 మిలియన్స్ కాగా.. 2019లో ఈ సంఖ్య 1.97 మిలియన్స్ మాత్రమే. ప్రపంచ వ్యాప్తంగా 2022లో దుబాయ్ వెళ్లిన పర్యాటకుల సంఖ్య 14.36 మిలియన్స్. అంటే ప్రపంచవ్యాప్తంగా 2022లో కంటే గత ఏడాది ఎక్కువ మంది దుబాయ్ సందర్శించినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: కాబోయే కోడలి కోసం ఖరీదైన కానుకలు.. ఎంతైనా అంబానీ రేంజే వేరు.. ఐదేళ్ల మల్టిపుల్ ఎంట్రీ వీసా అభ్యర్థన స్వీకరించిన తరువాత అన్ని విధాలా ఆమోదం పొందితే.. కేవలం 2 నుంచి 5 పనిదినాల్లో వీసా జారీ చేస్తారు. ఈ వీసా పొందిన తరువాత సంవత్సరంలో 180 రోజులు లేదా 3 నెలలు దుబాయ్‌లో ఉండవచ్చు. అయితే వారు ప్రతి 90 రోజులకు ఒకసారి అనుమతి పొందాల్సి ఉంటుంది. 180 రోజులు దుబాయ్‌లో ఉంటే రెండు సార్లు అనుమతి పొందాల్సి ఉంటుంది. -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే.. భారత్‌కు ఎన్నో స్థానం అంటే
న్యూఢిల్లీ: హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు చోటు దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా 194 ప్రపంచ దేశాల్లో ప్రయాణించొచ్చు. ➦ఈ దేశాల తర్వాత ఫిన్లాండ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 193 దేశాల్ని చుట్టి రావొచ్చు. ➦భారత్ పాస్‌పోర్ట్ ఉంటే వీసా లేకపోయినా 62 దేశాలకు ప్రయాణించే సౌకర్యం ఉండడంతో హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితాలో 85వ స్థానాన్ని దక్కించుకుంది. ఇండోనేషియా, మలేషియా,థాయిలాండ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలకు భారతీయులకు వీసా అవసరలేదు. అయితే హెన్లీ ఇండెక్స్‌లో భారత్ గతేడాది 84వ స్థానంతో పోలిస్తే భారత్ ఒక ర్యాంక్ దిగజారడం గమనార్హం. ➦దక్షిణాఫ్రికా (55), మాల్దీవులు (58), సౌదీ అరేబియా (63), చైనా (64), థాయిలాండ్ (66), ఇండోనేషియా (69), ఉజ్బెకిస్థాన్ (84) వంటి దేశాల కంటే భారత్ వెనుకబడి పోయింది. ➦భారత్‌కు పొరుగు దేశాలైన పాకిస్తాన్ సూచీలో 106వ స్థానంలో ఉండగా, శ్రీలంక 101వ స్థానంలో, బంగ్లాదేశ్ 102వ స్థానంలో, నేపాల్ 103వ స్థానంలో నిలిచాయి. ➦వీసా లేకుండా 192 దేశాలకు ప్రయాణించే అర్హత ఉన్న పాస్‌పోర్ట్‌ల జాబితాలో యూకే, ఐర్లాండ్, డెన్మార్క్, ఆస్ట్రియాలు ఇండెక్స్‌లో మూడవ స్థానంలో ఉంది. ఆ దేశాల తర్వాత మూడు యూరోపియన్ దేశాలు బెల్జియం, నార్వే, పోర్చుగల్, 191 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌తో నాల్గవ స్థానాన్ని ఆక్రమించాయి. ➦ఆస్ట్రేలియా, గ్రీస్, మాల్టా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్‌లు 190 దేశాలకు వీసా రహిత యాక్సెస్‌ను కలిగి ఉన్న తర్వాత ఇండెక్స్‌లోని మొదటి 5 స్థానాల్లో ఉన్నాయి. ➦ప్రపంచంలోని అత్యంత వలసలు ఎక్కువగా ఉన్న దేశాలలో ఒకటి కెనడా కాగా, దాని పొరుగున ఉన్న అమెరికా, రెండు యూరోపియన్ దేశాలైన పోలాండ్, చెకియాతో పాటు ఆరవ స్థానంలో ఉంది. ➦అమెరికా, కెనడా, పోలాండ్, చెకియా 189 దేశాలకు వీసా రహిత ప్రాప్యతను కలిగి ఉన్న తర్వాత సూచికలో ఆరవ స్థానంలో ఉన్నాయి. ➦ఈ సూచీ ఆఫ్ఘనిస్తాన్ 109వ స్థానంలో ఉండగా.. ప్రపంచంలోనే అత్యంత బలహీనమైన పాస్‌పోర్ట్‌తో ఆఫ్ఘనిస్తాన్ 28 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ➦సిరియా (108వ స్థానం), ఇరాక్ (107వ స్థానం), యెమెన్ (105వ స్థానం), పాలస్తీనా టెరిటరీ (103వ స్థానం) వంటి దేశాలు ఆఫ్ఘనిస్తాన్ కంటే ముందు ఉన్నాయి. పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్ ఎలా నిర్ణయిస్తారు? 2006 నుంచి హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల ర్యాంకింగ్‌ను నిరంతరం విడుదల చేస్తోంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్ అథారిటీ డేటా ఆధారంగా. ఒక దేశంలోని ప్రజలు అనేక దేశాలకు ప్రయాణించడం ఎంత సులభమో తెలియజేస్తుంది. -
వీసాపై ఆర్బీఐ ఆంక్షలు!
ముంబై: కార్డు చెల్లింపులను స్వీకరించని సంస్థలకు మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరపడాన్ని నిలిపివేయాలంటూ కార్డు నెట్వర్క్ సంస్థ వీసాను ఆర్బీఐ ఆదేశించినట్లు సమాచారం. ఇలాంటి లావాదేవీల ద్వారా పెద్ద మొత్తంలో నిధులు చట్టవిరుద్ధంగా బదిలీ అవుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది. ‘కార్డు ద్వారా చెల్లింపులను స్వీకరించని సంస్థలకు నిర్ధిష్ట మధ్యవర్తుల ద్వారా చెల్లింపులు జరిగేలా ఒక కార్డ్ నెట్వర్క్ సంస్థ ఒప్పందం చేసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది‘ అంటూ వీసా పేరును ప్రస్తావించకుండా రిజర్వ్ బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యవహారంపై చేపట్టిన అధ్యయనం పూర్తయ్యే వరకు అటువంటి ఒప్పందాలను నిలిపివేయాలని కార్డు కంపెనీకి సూచించినట్లు వివరించింది. అయితే, క్రెడిట్ కార్డుల సాధారణ వినియోగంపై ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొంది. ఆర్బీఐ ప్రత్యేకంగా పేరు ప్రస్తావించనప్పటికీ సదరు కార్డు నెట్వర్క్ సంస్థ వీసానే అని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిబంధనల ప్రకారం ఇది కూడా ఒక తరహా చెల్లింపు విధానం కిందకే వస్తుందని, అధికారికంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ పేర్కొంది. -
కార్డుల ద్వారా ఆ పేమెంట్లు వద్దు.. ఆర్బీఐ షాకింగ్ ఆదేశాలు
కార్డుల ద్వారా కంపెనీలు చేసే వాణిజ్య చెల్లింపులను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) పేమెంట్ టెక్నాలజీ సంస్థలైన మాస్టర్ కార్డ్ ( Mastercard ), వీసా ( Visa ) లను కోరింది. ఫిబ్రవరి 8న జారీ చేసిన లేఖ ప్రకారం.. తదుపరి నోటీసు వచ్చేవరకు అన్ని బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ ( BPSP ) లావాదేవీలను నిలిపివేయాలని ఈ సంస్థలను ఆర్బీఐ ఆదేశించింది. వాణిజ్య, వ్యాపార చెల్లింపులలో బిజినెస్ పేమెంట్ సొల్యూషన్ ప్రొవైడర్స్ పాత్ర ఎలా ఉండాలన్న దానిపై పరిశ్రమ నుంచి సమాచారం కోరుతూ ఫిబ్రవరి 8న ఆర్బీఐ నుంచి ఒక కమ్యూనికేషన్ అందినట్లు వీసా ఒక ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. అన్ని బీపీఎస్పీ లావాదేవీలను నిలిపివేయాలన్న ఆదేశాలు ఆర్బీఐ నుంచి వచ్చిన ఆ కమ్యూనికేషన్లో ఉన్నట్లు వీసా పేర్కొంది. పీఏ పీజీ (పేమెంట్ అగ్రిగేటర్/పేమెంట్ గేట్‌వే) మార్గదర్శకాల ప్రకారం బీపీఎస్పీలు ఆర్బీఐ నియంత్రణలో ఉంటాయని, వాటికి సెంట్రల్ బ్యాంకే లైసెన్సులు జారీ చేస్తుందని వీసా తెలిపింది. ఈ అంశానికి సంబంధించి ఆర్బీఐతోపాటు వ్యవస్థలోని భాగస్వాములతో చర్చలు కొనసాగిస్తున్నట్లు కార్డ్ పేమెంట్ సంస్థ పేర్కొంది. కాగా కార్పొరేట్ కార్డ్-టు-బిజినెస్ అకౌంట్ నగదు బదిలీ లావాదేవీల విషయంలో అనుసరించాల్సిన వ్యాపార నమూనాకు సంబంధించి కొంతమంది బ్యాంకర్లతో సహా మాస్టర్ కార్డ్, వీసా సంస్థలు ఫిబ్రవరి 14న ఆర్బీఐని సంప్రదించి స్పష్టత ఇచ్చినట్లు నివేదికలు తెలిపాయి. కంపెనీలు సాధారణంగా నెట్ బ్యాంకింగ్ లేదా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) ద్వారా చెల్లింపులు చేస్తుంటాయి. కానీ ఎన్కాష్, కార్బన్, పేమేట్ వంటి కొన్ని ఫిన్‌టెక్‌లు మాత్రం సప్లయర్స్, వెండర్లకు కార్డ్‌ల ద్వారా చెల్లింపులు చేస్తున్నాయి. అటువంటి చెల్లింపుల మొత్తం నెలవారీ లావాదేవీ పరిమాణం రూ. 20,000 కోట్లకు మించి ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ ఆదేశాల విషయమై ఎన్కాష్, మాస్టర్‌కార్డ్ సంస్థలు స్పందించలేదు. సెంట్రల్ బ్యాంక్ ఆదేశాలకు కట్టుబడి ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేమేట్ వెల్లడించింది. ఈ చర్యలకు గల కారణాన్ని ఆర్బీఐ వెల్లడించనప్పటికీ, నాన్ కేవైసీ వ్యాపారులకు కార్డుల ద్వారా అధిక మొత్తంలో నగదు ప్రవాహం కేంద్ర బ్యాంక్‌కు చికాకు కలిగించి ఉండొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. -
ఇంగ్లండ్ క్రికెటర్‌కు వీసా సమస్య.. ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేత!?
భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టును వీసా సమస్య వెంటాడుతోంది. తాజాగా మరో ఇంగ్లీష్ ఆటగాడికి వీసా సమస్య ఎదురైంది. ఇంగ్లండ్ జట్టు స్వల్ప విరామం తర్వాత మూడో టెస్టు కోసం దుబాయ్ నుంచి రాజ్‌కోట్‌కు సోమవారం చేరుకుంది. ఈ క్రమంలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆ జట్టు ఆ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్ హిస్సోర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. స్పోర్ట్‌స్టార్ రిపోర్ట్ ప్రకారం.. అహ్మద్ కేవలం సింగిల్-ఎంట్రీ వీసాను మాత్రమే కలిగి ఉన్నందున విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున అత్యవసర పరిస్థితి కింద స్ధానిక అధికారులు 2 రోజుల వీసాను రెహాన్‌కు మంజూరు చేసినట్లు సమాచారం. అదే విధంగా మరో రెండు రోజుల్లో వీసా సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ అధికారులు సూచించినట్లు స్పోర్ట్‌స్టార్ తమ నివేదికలో పేర్కొంద. అయితే దుబాయ్ నుంచి వచ్చిన ఇంగ్లండ్ జట్టులో రెహాన్ ఒక్కడే ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. మిగితా జట్టు సభ్యులందరూ తాము బసే చేసే హోటల్‌కు చేరుకున్నారు. రెహాన్ కాస్త ఆలస్యంగా జట్టుతో చేరాడు. కాగా అంతకుమందు మరో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వీసా జారీలో జాప్యం కారణంగా జట్టుతో పాటు సకాలంలో భారత్ చేరుకోలేకపోయాడు. చదవండి: IND vs ENG: సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు! 3 ఏళ్ల తర్వాత -
'వీసా లేకుండా ఎంట్రీ' - ఇరాన్ నాలుగు షరతులు ఇవే..
ప్రపంచంలోని కొన్ని దేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరి, మరికొన్ని దేశాలు వీసా లేకుండా.. షరతులతో అనుమతి కల్పిస్తాయి. ఈ జాబితాలో ఇప్పుడు ఇరాన్ చేరింది. ఇరాన్ వెళ్లాలనుకునే భారతీయులకు ఇది పెద్ద శుభవార్త. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. భారతీయులకు వీసా మినహాయింపు కల్పించిన దేశాల వరుసలో ఇరాన్ చేరింది. దీంతో వీసా అవసరం లేకుండా 15 రోజులు ఇరాన్ దేశంలో పర్యటించడానికి ఢిల్లీలోని ఇరాన్ రాయభారి కార్యాలయం ఇటీవలే ప్రకటించింది. భారతదేశానికి మాత్రమే కాకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం వీసా-ఫ్రీ ప్రోగ్రామ్‌ను ఆమోదించింది. ఇరాన్ దేశంలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి వీసా ఫ్రీ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు ఇరాన్ పర్యాటక మంత్రి 'ఇజ్జతుల్లా జర్గామి' (Ezzatollah Zarghami) వెల్లడించారు. దీని ద్వారా ప్రపంచంలోని చాలా దేశాల సందర్శకులు ఇరాన్ సందర్శిస్తారని, తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థ కూడా ఆశాజనకంగా ఉంటుందని తెలిపారు. వీసా లేకుండా ఇరాన్ వెళ్లాలనుకునే వారికి షరతులు సాధారణ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న వ్యక్తులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు. వీరు కేవలం 15 రోజులు మాత్రమే ఇరాన్ దేశంలో పర్యటించడానికి అర్హులు. వీసా ఫ్రీ అనేది కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌లోకి ప్రవేశించే వ్యక్తులకు మాత్రమే ప్రత్యేకంగా వర్తిస్తుంది. భారతీయులు 15 రోజుల కంటే ఎక్కువ కాలం ఇరాన్ దేశంలో పర్యటించాలనుకుంటే.. తప్పకుండా భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం నుంచి ప్రత్యేక వీసాలు పొందాల్సి ఉంటుంది. ఎయిర్ బోర్డర్ ఎంట్రీ అనేది వైమానిక సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశించే భారతీయ పౌరులకు ప్రత్యేకంగా ఇదీ చదవండి: ఇప్పుడే నేర్చుకోండి.. లేకుంటే ఉద్యోగాలు పోతాయ్ - నిర్మలా సీతారామన్ -
వీసా ఫీజులు పెంచిన అమెరికా
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ, ఎల్–1, ఈబీ–5 తదితర నాన్ ఇమిగ్రెంట్ వీసా దరఖాస్తుల ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజా పెంపు ప్రకారం..భారతీయ టెక్కీలు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే హెచ్–1బీ వీసా ఫీజు ప్రస్తుతమున్న 460 డాలర్ల నుంచి ఏకంగా 780 డాలర్లకు పెరిగింది. హెచ్–1బీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా 10 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్లకు పెరగనుంది. రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుంది. అదే విధంగా, ఎల్–1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు, ఇన్వెస్టర్ల వీసాగా పిలిచే ఈబీ–5 కేటగిరీ వీసా ఫీజును ప్రస్తుతమున్న 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచుతున్నట్లు ఫెడరల్ ప్రభుత్వం బుధవారం ఒక నోటిఫికేషన్లో వివరించింది. 2016 తర్వాత మొదటిసారిగా చేపట్టిన వీసా ఫీజుల పెంపు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు కానుంది. -
2023లో భారతీయులకు 14 లక్షల వీసాలు
సాక్షి, న్యూఢిల్లీ: 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలను జారీ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. 2022తో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువని వివరించింది. ఏ దేశానికీ ఇన్ని వీసాలు జారీ కాలేదని పేర్కొంది. విజిటింగ్ వీసా అపాయింట్మెంట్ వెయిటింగ్ సమయం 1,000 రోజుల నుంచి 250 రోజులకు (75 శాతం) తగ్గిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులేనని ప్రకటించింది. బీ1, బీ2 కేటగిరీల విజిటర్ వీసాల కోసం మునుపెన్నడూ లేనంతగా 7 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపింది. స్టూడెంట్ వీసాల జారీలో దేశంలో ముంబై, డిల్లీ, హైదరాబాద్, చెన్నై టాప్‌లో ఉన్నాయంది. అమెరికాలో చదివే 10 లక్షల పైచిలుకు అంతర్జాతీయ విద్యార్థుల్లో 2.5 లక్షల మంది భారతీయులేనని ఢిల్లీ ఎంబసీ తెలిపింది. -
ఆస్ట్రేలియా గోల్డెన్ వీసా రద్దు!
ఆస్ట్రేలియా ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా అక్కడి ప్రభుత్వ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే అందులో భాగంగా విదేశీయులు అక్కడ పెట్టుబడి పెట్టేందుకు వీలుగా, అక్కడే కొన్ని రోజులు నివసించేందుకు అనువుగా జారీచేస్తున్న ‘గోల్డెన్ వీసా ’లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ఈ వీసా ప్రోగ్రామ్ ఆశించిన ఫలితాలను ఇవ్వట్లేదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఈ వీసాల స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు పేర్కొంది. గోల్డెన్ వీసా నిబంధనల ప్రకారం కనీసం రూ.27 కోట్లు పెట్టుబడి పెట్టేవారు ఐదేళ్ల పాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 2012లో ఈ నిబంధనను తీసుకొచ్చింది. హోంశాఖ గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్ కింద ఆసీస్‌లో ఉండేలా అవకాశం సంపాదించారు. ఇందులో 85శాతం చైనా మిలియనీర్లు ఉన్నారు. ఇదీ చదవండి: ఎగిరిన కొత్త ఫ్లైట్.. దేశంలోనే తొలిసారి! కొంతకాలంగా ఈ ప్రోగ్రామ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలిస్తున్నారనే వాదనలున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్ ఓ నీల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్‌లను రద్దు చేశాయి. -
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన!
హెచ్-1బీ వీసాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. హెచ్-1బీ వీసా ధరఖాస్తుల కోసం ఆన్లైన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని తెలిపింది. దీంతో పాటు హెచ్-1బీ వీసా కోసం రిజిస్ట్రేషన్ల సమర్పణను ప్రారంభించే ఆర్గనైజేషనల్ అకౌంట్స్‌ను ప్రారంభించనుంది. వీటిని సంస్థాగత ఖాతాలు అని పిలుస్తారు. సంస్థాగత ఖాతాల్లో ఒక సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న వారి కోసం సంస్థ తరుపున పనిచేసే న్యాయపరమైన వ్యవహారాలు చూసుకునే ప్రతినిధులను హెచ్ -1బీ రిజిస్ట్రేషన్లు, ఫారమ్ ఐ-129, వలసేతర వర్కర్ కోసం ప్రీమియం ప్రాసెసింగ్ దరఖాస్తుదారుల కోసం ఫారమ్-ఐ 907ను అనుమతి ఇస్తుంది. యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) విభాగాల్లో కీలక మార్పులు చేటుచేసుకున్నాయి. వాటిల్లో ప్రధానంగా ఫీచర్లు: హెచ్-1బీ రిజిస్ట్రెంట్ ఖాతాలతో చట్టపరమైన ప్రతినిధులు, సంస్థల కోసం సంస్థాగత ఖాతాలు మెరుగైన డిజైన్ కేస్ మేనేజ్మెంట్ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఫైలింగ్ ఆప్షన్స్ : హెచ్-1బీ పిటిషనర్లు తమ సంస్థ ఖాతాల ద్వారా ఫారమ్‌లు ఐ-129, అనుబంధిత ఫారమ్ ఐ-907 ప్రీమియం ప్రాసెసింగ్ అభ్యర్థనలను ఆన్లైన్లో ఫైల్ చేయవచ్చు. ఆన్లైన్ ఫైలింగ్ కోసం చట్టపరమైన ప్రతినిధి ద్వారా చేసుకోవచ్చు. లేదంటే పేపర్ ఆధారిత ఫైలింగ్‌ని ఎంచుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ : హెచ్-1బీ వీసా నమోదు ప్రక్రియ ప్రత్యేకంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. యూజర్ ఫీడ్ బ్యాక్ : యూఎస్సీఐఎస్ వివిధ స్టేక్ హోల్డర్స్‌తో కలిసి యుజబిలిటి టెస్టింగ్‌ను నిర్వహించనుంది. ఫలితంగా ఆర్గనైజేషనల్ అకౌంట్ పూర్తి స్థాయిలో మార్పులు చోటు చేసుకోనున్నాయి. కంటిన్యూడ్ ఫీడ్‌బ్యాక్ : యూఎస్ సీఐఎస్ వినియోగదారుల అభిప్రాయాన్ని సేకరించి, యూజర్ ఎక్స్పీరీయన్స్ను అందించే ప్రయత్నాలు చేయనుంది. నేషనల్ ఎంగేజ్మెంట్: యూఎస్సీఐఎస్ జనవరి 23, జనవరి 24న నేషనల్ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రక్రియ ద్వారా సంస్థలు, చట్టపరమైన ప్రతినిధులకు నిర్దేశం చేసేందుకు సంస్థాగత ఖాతాల సమాచారాన్ని అందిస్తుంది. ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ : హెచ్-1బీ ప్రక్రియలో పాల్గొన్న వ్యక్తులను సమాచార సెషన్లకు హాజరు కావడానికి యూఎస్సీఐఎస్ ప్రోత్సహిస్తుంది. సంస్థాగత ఖాతాలు, ఆన్లైన్ ఫైలింగ్ వివరాలు హెచ్ -1బీ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీలో అందుబాటులో ఉంటాయి. -
వీసాతో పనిలేకుండానే విదేశాలకు రయ్.. రయ్!
సాక్షి, విశాఖపట్నం: ‘భారతీయులూ.. వీసా లేకుండా మా దేశాన్ని సందర్శించండి’ అంటూ ఇటీవల వివిధ దేశాలు వరుసగా ప్రకటిస్తున్నాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ.. ఇంటర్నేషనల్ ట్రిప్స్ కోసం ఎదురుచూస్తున్న వారంతా విమానంలో ప్రయాణించేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు అనుగుణంగా భారతీయులకు ప్రయాణ అవకాశాల్ని మరిన్ని కల్పించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. టైర్–2 సిటీస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలపై దృష్టి సారించాయి. వీటిలో విశాఖ ముందువరుసలో ఉంది. ఇప్పటికే విశాఖ నుంచి థాయ్‌లాండ్‌కు విమాన సర్వీసు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ఎయిర్ ఏషియా సంస్థ.. తాజాగా మలేషియా వెళ్లేందుకు మరో సర్వీసును మొదలు పెట్టేందుకు ముహూర్తం చూసుకుంటోంది. ఈ సర్వీసు ప్రకటనతో విదేశాలకు విమాన సర్వీసులు విశాఖ నుంచి ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తుండటం విశేషం. వీసాలతో పని లేకుండా.. వీసా ఉంటేనే విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఎంట్రీ లేదా టూరిస్ట్ వీసాలు దొరక్క.. తమకు నచ్చిన దేశంలో విహరించే ఆలోచనలను మధ్యలోనే విరమించుకుంటున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడు గోల్డెన్ చాన్స్ వచ్చేసింది. పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. టికెట్ బుక్ చేసుకుని కొన్ని దేశాలకు ట్రిప్‌కు వెళ్లి రావొచ్చు. భారతీయ పాస్‌పోర్టు బలమైందిగా మారడమే దీనికి కారణం. ఇటీవల ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) విడుదల చేసిన వీసా ఫ్రీ దేశాల జాబితాలో ప్రపంచ దేశాల్లో భారత్ 83వ స్థానంలో నిలిచింది. ఈ కారణంగా కొన్ని దేశాలు భారతీయుల్ని విహారానికి వీసా లేకుండానే ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ అవకాశాల్ని విమానయాన సంస్థలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. థాయ్‌లాండ్, మలేషియాకు.. ఎయిర్ ఏషియా సంస్థ జైపూర్, గోవా, వారణాసితో పాటు విశాఖ నుంచి వీసా ఫ్రీ దేశాలకు సర్వీసులు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా విశాఖపై ఎయిర్ ఏషియా స్పెషల్ ఫోకస్ పెట్టింది. దక్షిణ భారతదేశంలోని వివిధ నగరాల నుంచి కౌలాలంపూర్‌కు లిమిటెడ్ పీరియడ్‌తో ప్రత్యేక ప్రమోషన్ చార్జీలతో విమాన సర్వీసుల్ని ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి కూడా సర్వీసులు నడపాలని నిర్ణయించింది. సౌత్ ఇండియా నుంచి ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో మొత్తంగా 69 వీక్లీ సర్వీసులు నడుపుతూ ఏడాదికి 1.5 మిలియన్ సీట్లతో రెండు దేశాల మధ్య సేవలను గణనీయంగా పెంచనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే మరో వీసా ఫ్రీ ప్రకటించిన థాయ్‌లాండ్‌కు కూడా విశాఖ నుంచి ఏప్రిల్‌లో సర్వీసులు మొదలు పెడుతున్నట్టు ఎయిర్ ఏషియా ప్రకటించింది. ఏప్రిల్ 9 నుంచి మంగళవారం, గురువారం, శనివారం రోజుల్లో సర్వీసులు నడపనున్నట్టు వెల్లడించింది. మరోవైపు.. విశాఖ నుంచి సింగపూర్‌కు స్కూట్ సర్వీస్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి రోజూ కనీసం 300 నుంచి 350 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న థాయ్, కౌలాలంపూర్ సర్వీసులతో విశాఖ నుంచి ఏకంగా మూడు విదేశీ సర్వీసులు నడవనున్నాయి. ఫిబ్రవరిలో ఇండిగో సంస్థ కూడా మరో విదేశీ సర్వీసు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఈ సర్వీసుల రాకతో విదేశీ ప్రయాణాలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు గేర్ మార్చినట్టుగా అధికారులు భావిస్తున్నారు. దూసుకుపోతున్న ఎయిర్ ఏషియా ఇప్పటివరకూ దాదాపు 60 దేశాలు వీసా ఫ్రీ ప్రకటించాయి. 30 నుంచి 90 రోజుల వరకూ వీసా లేకుండానే భారతీయులు తమ దేశానికి వచ్చి ఆతిథ్యాన్ని ఎంజాయ్ చెయ్యొచ్చని ప్రకటించాయి. తాజాగా తమ దేశ పర్యాటకానికి ఊతమిచ్చేందుకు వియత్నాం, థాయ్‌లాండ్, శ్రీలంక మాదిరిగానే మలేషియా కూడా భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి మలేషియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఇలా వీసా ఫ్రీ టూర్‌కు వివిధ దేశాలు అవకాశమిస్తున్న తరుణంలో విమానయాన సంస్థలు తమ సర్వీసుల్ని పెంచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో ఎయిర్ ఏషియా సంస్థ అగ్రభాగంలో ఉంది. ఈ సంస్థ టైర్–2 నగరాల్లోని ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల్నే టార్గెట్ చేస్తూ కొత్త సర్వీసుల్ని మొదలు పెడుతోంది. -
ఈడీ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 12, 16వ తేదీల్లో కూడా కార్తీకి సమన్లు పంపారు. అయితే, అవసరమైన పత్రాల సేకరణకు సమయం కావాలంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. పంజాబ్‌లో ఏర్పాటవుతున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును చైనా కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ గడువులోగా పనులను పూర్తి చేయలేదు. దీంతో, 263 మంది చైనా సిబ్బందికి దేశంలో ఉండేందుకు అవసరమైన వీసాలను మళ్లీ మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీసాల మంజూరు కోసం 2011లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు రూ.50 లక్షలు ముట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకే ఈడీ అధికారులు కార్తీకి నోటీసులు పంపారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను వేధించే చర్యల్లో భాగంగానే తనపై కక్షగట్టారని కార్తీ ఆరోపిస్తున్నారు. ఒక్క చైనీయుడి వీసా మంజూరుకు కూడా తాను ఎన్నడూ సాయపడలేదన్నారు. కార్తీ చిదంబరంపై ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్‌సెల్–మ్యాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. -
భారతీయులకు షాకుల మీద షాకులిస్తున్న యూకే ప్రధాని రిషి సునాక్!
భారతీయులతో పాటు, ఇతర విదేశీయులకు యూకే ప్రధాని రిషి సునాక్ వీసా మంజూరులో షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే నాన్ రీసెర్చ్ పీజీ విద్యార్థులు తమ వెంట కుటుంబ సభ్యులను (dependent visa) తీసుకుని వచ్చేందుకు అవసరమయ్యే డిపెండెంట్ వీసాను రద్దు చేశారు. తాజాగా యూకేలో ఇపై జాబ్ చేయాలంటే ఉద్యోగుల (skilled worker visa) జీతం ఎక్కువగా ఉండాలనే కొత్త నిబంధనను తెచ్చింది. దీంతో విద్యార్ధులతో పాటు ఉద్యోగం చేసే వారు సైతం ఇకపై యూకేకి వెళ్లడం మరింత కఠినంగా మారనుంది. వచ్చే ఏడాది యూకేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ దేశ ప్రధాని రిషి సునాక్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా దేశంలోకి వలసల్ని నిరోధించేలా వీసా మంజూరులో కఠిన ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. యూకేలో ఫ్యామిలీ వీసా రూల్స్? తాజాగా, స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే ఉద్యోగుల కనీస వేతనాన్ని 47 శాతం అంటే 29,000 యూరోల నుంచి 38,700 యూరోలకు పెంచింది. అయితే ఈ కనీస వేతనం హెల్త్ కేర్, సోషల్ కేర్ విభాగాలకు వర్తించదు. కేర్ వర్క్‌ర్లు వాళ్ల కుటుంబ సభ్యుల్ని యూకేకి తెచ్చుకునేందుకు అనుమతి లేదు. యూకేకి పెరిగిపోతున్న విదేశీయుల తాకిడి ఈ ఏడాది జూన్‌లో 70,000 మంది విదేశీయులు యూకేలో నివసించేందుకు వచ్చారు. అయితే, రోజురోజుకు విదేశీయుల తాకిడి పెరుగుతుండటంతో వసతుల కల్పన బ్రిటన్ సర్కార్‌కు ఇబ్బందికరంగా మారింది. కాబట్టే ఈ ఆంక్షల్ని విధించింది. అదే సమయంలో ఇప్పటికే వీసా ఉండి దానిని రెన్యూవల్ చేసుకునే వీసా దారులకు కొత్త నిబంధనలు వర్తించవని యూకే ఇమ్మిగ్రేషన్ విభాగం హోం ఆఫీస్ తెలిపింది. స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే? యూకే విధించిన కొత్త నిబంధనల ఆధారంగా స్కిల్డ్ వర్క్ వీసా పొందాలంటే వీసా దారులు కనీసం 70 పాయింట్స్ ఉండాలి. అందులో 50 పాయింట్లు మీరు కనీస నైపుణ్య స్థాయి కంటే ఎక్కువ జాబ్ ఆఫర్‌ను కలిగి ఉండటం, ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా పొందవచ్చు. మిగిలిన 20 పాయింట్లు ఎక్కువ జీతం, చేస్తున్న విభాగంలో ఉద్యోగుల కొరత ఉండాలి. లేదంటే చేసే జాబ్‌కు అనుగుణంగా పీహెచ్డీ చేసి ఉండాలి. యూకేలో ఉద్యోగుల కొరత ఎక్కువగా ఉన్న విభాగాలు తక్కువ వేతనం ఉండి ఉద్యోగుల డిమాండ్ ఎక్కువగా ఉన్న విభాగాలకు చెంది ఉండి ఉంటే పైన పేర్కొన్న విధంగా 70 పాయింట్లు లభిస్తాయి. వీసా ఈజీగా దొరుకుతుంది. ఇక యూకేలో ఉద్యోగులు తక్కువగా ఉన్న విభాగాల్ని పరిశీలిస్తే ఆరోగ్యం, విద్యా కేర్ టేకర్లు గ్రాఫిక్స్ డిజైనర్లు కన్‌స్ట్రక్టన్ వర్కర్లు పశువైద్యులు నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు నో ఛాన్స్ భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులకు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని అమెరికా, బ్రిటన్, కెనడా వంటి దేశాలకు తరలివెళుతుంటారు. వారితో పాటు వారి కుటుంబసభ్యులు డిపెండెంట్ వీసాను అందిస్తుంటాయి. జనవరి 1 నుంచి యూకే ప్రభుత్వం నాన్ రీసెర్చి కోర్సుల్లోని పీజీ విద్యార్ధులకు డిపెండెంట్ వీసాను రద్దు చేసింది. బ్రిటన్ విధానం ప్రకారం వీసా హోల్డర్‌పై ఆర్థికంగా ఆధారపడిన వారిని మాత్రమే డిపెండెంట్‌గా పరిగణిస్తారు. ఆ జాబితాలోకి జీవిత భాగస్వామి అంటే భార్య లేదా భర్త, 18 ఏండ్ల లోపు పిల్లలు వస్తారు. కొన్ని సందర్భాల్లో 18 ఏండ్లు దాటిన పిల్లలు, తల్లిదండ్రులు, బామ్మలు, తాతయ్యలు వస్తారు. -
అమెరికన్ వీసా మంజూరులో మార్పులు.. తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!
డాలర్ డ్రీమ్‌ను నెరవేర్చుకోవాలనుకునే ప్రతి పౌరుడి కలల్ని నిజం చేసేలా అమెరికా ప్రభుత్వం వీసాల మంజూరులో తగు మార్పులు చేస్తూ వస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠినంగా వ్యవహరిస్తుంది. ఈ తరుణంలో 2023 వీసాల జారీ అంశంలో జోబైడెన్ ప్రభుత్వం ఏయే మార్పులు చేసిందో తెలుసుకుందాం. హెచ్-1బీ, ఈబీ-5, స్టూడెంట్ వీసాలు (ఎఫ్, ఎం, జే) సహా వివిధ కేటగిరీలను ప్రభావితం చేసేలా 2023లో గణనీయమైన మార్పులు చేసింది. వాటిల్లో హెచ్-1బీ వీసా పునరుద్ధరణకు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే టెక్నాలజీ రంగాల్లో ప్రతిభావంతులైన నిపుణులకు హెచ్-1 బీ వీసా తప్పని సరి. ఇప్పుడీ వీసాల పునరుద్ధరణ కోసం ఈ ఏడాది పైలట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. జనవరిలో అమెరికా విదేశాంగ శాఖ హెచ్-1బీ డొమెస్టిక్ వీసా రెన్యువల్ పైలట్‌ను పరిమితంగా ప్రవేశపెట్టి 20,000 మందిని తమ వీసాలను రెన్యువల్ చేసుకునేందుకు అనుమతించింది. ఇందులో భాగంగా దరఖాస్తుదారులు వీసా రెన్యూవల్ కోసం వారి దేశానికి వెళ్లే పనిలేకుండా తమ దేశంలోనే రెన్యూవల్ చేసుకోవచ్చని తెలిపింది. అయితే వారి జీవిత భాగస్వాములు ఈ ప్రక్రియకు అనర్హులుగా గుర్తించింది. హెచ్-1బీ రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్లలో అధిక ప్రాతినిధ్యాన్ని అరికట్టేందుకు అమెరికా ప్రభుత్వం 2023లో కఠిన చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఉద్యోగికి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అవసరం. అయితే ఇప్పుడు యజమానులు ప్రతి నమోదుదారుకు పాస్ పోర్ట్ సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. నో పేపర్.. ఇకపై అంతా అన్లైన్ 2023లో అమెరికా ప్రభుత్వం వీసా ధరఖాస్తును ఆన్లైన్లోనే చేసుకునే వెసలు బాటు కల్పించింది. పేపర్ వర్క్ వల్ల చిన్న చిన్న పొరపాట్లు తలెత్తి వీసా రిజెక్ట్‌లు అవుతున్న సందర్భాలు అనేకం. దీని వల్ల అభ్యర్ధులు అమెరికాకు వెళ్లడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందుల్ని అధిగమించేలా పేపర్‌పై ధరఖాస్తు చేసుకోవడాన్ని తగ్గించింది. ఆన్లైన్లో వీసా ప్రాసెస్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈబీ-5 వీసా దరఖాస్తుదారులకు అక్టోబర్ 2023 లో, యూఎస్ఐఎస్ (యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్) ఈబీ -5 వీసా విధానంలో మార్పులు చేసింది. ఎవరైతే ఈబీ-5 వీసా పొంది దాన్ని రీఎంబర్స్మెంట్ చేయించుకున్న రెండేళ్ల తర్వాత గ్రీన్ కార్డ్‌కు అర్హులుగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈబీ-5 వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ వేగాన్ని కూడా యూఎస్ సీఐఎస్ గణనీయంగా పెంచింది. ఈబీ–5 వీసా అంటే.. అమెరికాలో గ్రీన్కార్డ్కు దాదాపు సమానమైన గుర్తింపు ఉన్నదే ఈబీ–5 వీసా. అంతటి ప్రాధాన్యమున్న ఈ వీసా పొందాలంటే వ్యక్తులు అమెరికాలో కనీసం 8 లక్షల అమెరికన్ డాలర్లను (భారతీయ కరెన్సీలో రూ.6.57 కోట్లు) పెట్టుబడిగా పెట్టడంతోపాటు కనీసం 10 ఉద్యోగాలను కల్పించాలి. దాంతో వారికి పెట్టుబడిదారుల హోదా కింద ఈబీ–5 వీసాను జారీచేస్తారు. ఈబీ–5 వీసాకు దరఖాస్తు చేయాలంటే గతంలో 5 లక్షల అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టాలని నిబంధన ఉండేది. కానీ, ఈ వీసాల కోసం డిమాండ్ పెరుగుతుండడంతో యూఎస్సీఐఎస్ ఈ కనీస పెట్టుబడి మొత్తాన్ని 2022లో 8 లక్షల డాలర్లకు పెంచింది. స్టూడెంట్ వీసా పాలసీల అప్ డేట్ అమెరికన్ కాన్సులర్ అధికారులు చేసే వీసా ప్రాసెసింగ్‌కు సంబంధించిన ఖర్చులకు అనుగుణంగా ఎఫ్, ఎం, జే వీసాల ప్రాసెసింగ్ ఫీజులను పెంచుతున్నట్లు జోబైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక, కాన్సులర్ అధికారులు ఇప్పుడు విద్యార్థుల వీసా దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపింది. -
కెనడాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
2024 ఆగస్ట్ నెల సమయానికి కెనడా ఆర్ధిక మాంద్యంలోకి జారిపోనుంది. తద్వారా ఆర్ధిక వ్యవస్థ మరింత కుంటుపడనుంది. ఇప్పటికే వడ్డీ రేట్ల పెంపు, డాలర్ విలువ మరింత పడిపోవడంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆందోళనకు గురవుతున్నారు. ఈ తరుణంలో దేశ ఎకానమీకి ఊతం ఇచ్చేలా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన పౌరులకు భారీ ఊరట కలగనుంది. ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం నుంచి దేశాన్ని రక్షించేందుకు కెనడా నడుం బిగించింది. నిబంధనలు పాటిస్తున్నా.. సరైన డాక్యుమెంట్లు లేని కారణంగా విదేశీయులకు పౌరసత్వం ఇవ్వడాన్ని కెనడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే.. ఆర్ధిక అనిశ్చితి నుంచి బయటపడేలా వారందరికి పౌరసత్వం ఇచ్చేలా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రిఫ్యూజీస్, సిటిజన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. ఆర్ధిక వ్యవస్థకు ఊతంగా 2025 నాటికి 5 లక్షల మందికి వలసదారులకు తమ దేశానికి ఆహ్వానిస్తామని అన్నారు. జనాబా పెరిగే కొద్ది దేశ ఆర్ధిక వ్యవస్థ మరింత బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 3 నుంచి 5 లక్షల మంది వలస దారులకు పలు నివేదికల ప్రకారం.. కెనడాలో సరైన పత్రాలు లేకుండా 3 లక్షల నుంచి 6 లక్షల మంది జీవిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. ఆ డాక్యుమెంట్లు నిర్ణీత సమయానికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే వారు సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి మాత్రం ఇబ్బందే అయితే కెనడా త్వరలో అమలు చేయనున్న వీసా నిబంధనలతో సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వలసదారులకు, తాత్కాలికంగా నివసిస్తూ వీసా గడువు ముగియనున్న వర్కర్లకు, విద్యార్ధులకు మరింత లబ్ధి చేకూరనుంది. కానీ, ఇటీవల దేశంలోకి ప్రవేశించిన వారికి ఈ కార్యక్రమం అందుబాటులో ఉండదని మంత్రి మిల్లర్ స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు లేని వలసదారులు సిటిజన్ షిప్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందేలా రాబోయే క్యాబినెట్ సమావేశాల్లో బిల్లుల్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. వలసదారులకు ఆహ్వానం హౌసింగ్ సవాళ్లు, పెరిగిన ద్రవ్యోల్బణ రేట్ల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ ఆర్థిక ఆందోళనలు ఉన్నప్పటికీ, ప్రస్తుత వలస లక్ష్యాలను రాబోయే రెండు సంవత్సరాలకు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2023 లో 465,000 కొత్త నివాసితులు, 2024 లో 485,000 కొత్త నివాసితులు, 2025 లో 500,000 మందిని ఆహ్వానించాలని కెనడా లక్ష్యంగా పెట్టుకుంది. -
వీసా లేకున్నా ఇరాన్ వెళ్లొచ్చు
టెహ్రాన్: ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇరాన్‌కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్‌తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ. భారతీయులు ఇకపై తమ దేశానికి వీసాతో పనిలేకుండా రావొచ్చంటూ ఇటీవలే మలేసియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
వీసా లేకుండానే భారతీయులు ఈ దేశాలకు వెళ్లి రావొచ్చు
ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలితో కలిసి ఇష్టమైన ప్రాంతాలను చుట్టేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పని ఒత్తిడితో విసిగిపోయి ఉన్న వారికి ఈ విహార యాత్రలు, ప్రయాణాలు ఎంతో ఊరట కలిగిస్తాయి. మన దేశంలో అయితే ఏ ప్రాంతానికి అయినా వెళ్లొచ్చు కానీ విదేశాలకు వెళ్లాలంటే మాత్రం వీసా ఉండాల్సిందే. అయితే వీసాతో పని లేకుండా భారతీయులను మా దేశానికి రండి అంటూ ఆహ్వానం పలుకున్నాయి కొన్ని దేశాలు. అవేంటో చూసేయండి. మలేషియా ఎంత చూసినా తనివి తీరని భౌగోళిక సౌందర్యం మలేషియా. పచ్చని అడవులు, అందమైన ద్వీపాలు,అడవులు.. ఇలా ఎంతో అందమైన పర్యాటక ప్రదేశంగా మలేషియాకు పేరుంది. ఇకపై అక్కడికి వెళ్లాలంటే వీసా అవసరం లేదు. సుమారు 30 రోజుల పాటు అక్కడ సేద తీరవచ్చు. బొలీవియా: ఇక్కడ సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. సమోవా: దీనిని 'కార్డెల్ ఆఫ్ పాలినేషియా' అని కూడా పిలుస్తారు, సమోవా అనేది ఉత్కంఠభరితమైన ద్వీపాల సమూహం. ఈ ద్వీప దేశానికి వెళ్లడానికి భారతీయులకు వీసా అవసరం లేదు. శ్రీలంక: భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు ఇటీవలె శ్రీలంక అనుమతి ఇచ్చింది. కెన్యా: సముద్రంలో ఉప్పు తయారీ, రంగురంగుల కొండలు తదితర సందర్శనీయ ప్రాంతాలున్నాయి. ఈ దేశానికి వెళ్లిన తర్వాత వీసా పొందవచ్చు. 90 రోజుల గడువు ఉంటుంది. మారిషస్: భారతీయులకు అతి గొప్ప ఆతిథ్యమిచ్చే ఆహ్లాదకరమైన దేశాల్లో మారిషస్ ఒకటి. అందమైన బీచ్‌లు, అడ్వెంచర్లు ఎన్నో ఉన్న ఈ దేశానికి మీకు వీసా అవసరం లేదు. మారిషస్‌ను వీసా లేకుండా, మీరు గరిష్టంగా 90 రోజులు పర్యటించవచ్చు. ఫిజీ: అందమైన దృశ్యాలు, పగడాలు, దీవులకు పెట్టింది పేరు ఫిజీ దేశం. ఈ దేశానికి భారతీయ పర్యాటకుల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీసా లేకుండా 120 రోజులు అంటే సుమారు నాలుగు నెలలు హాయిగా గడపొచ్చు. భూటాన్: భారతదేశానికి అత్యంత సమీపంలో, పొరుగు దేశంగా ఉన్న భూటాన్‌కు మీరు వీసా లేకుండానే వెళ్లవచ్చు. ఇది ప్రపంచంలోని సంతోషకరమైన దేశాలలో ఒకటిగా గుర్తింపు పొందింది.రోడ్డు, విమానం, రైలు ద్వారా కూడా భూటాన్ చేరుకోవచ్చు. బార్బడోస్: బార్బడోస్ ప్రకృతి అందాలకు పెట్టింది పేరు.ప్రశాంతమైన దీవుల్లో సెలవులను గడపాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. కాస్ట్లీ హోటళ్లు, తీర ప్రాంతాలు ఇక్కడి స్పెషల్. భారతీయ పౌరులు బార్బడోస్ సందర్శించడానికి వీసా అవసరం లేదు. మీరు ఇక్కడ వీసా లేకుండా 90 రోజుల వరకు గడపవచ్చు. వీటితో పాటు జమైకా, కజికిస్తాన్, ఇండోనేషియా,టాంజానియా, జోర్డాన్,లావోస్ కాంబోడియా,వంటి దేశాలకు కూడా వీసా లేకుండా చుట్టిరావొచ్చు. -
చదువుకోవడం కష్టమేనా.. విదేశీ విద్యార్ధులకు భారీ షాకిచ్చిన కెనడా!
జీవన వ్యయం పెరిగిపోతున్న తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇతర దేశాల నుంచి కెనడాలో చదువుకునేందుకు వచ్చే విద్యార్ధుల డిపాజిట్ మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రస్తుతం ఆ మొత్తం 10వేల డాలర్లు (రూ.6.14లక్షలు) ఉండగా దాన్ని ట్రూడో ప్రభుత్వ 20,635 డాలర్లు (రూ.12.7లక్షల)కు పెంచింది. జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. తాజా కఠిన నిర్ణయంతో భవిష్యత్‌లో కెనడాలో చదుకోవాలనుకునే విద్యార్ధుల భవిష్యత్ మరింత ఆందోళన కరంగా మారింది. సాధారణంగా భారతీయ విద్యార్ధులు కెనడాకు వెళ్లాలంటే..వారి బ్యాంక్ బ్యాలెన్స్ కనీసం రూ.6.14 లక్షలు ఉండాలి. అలా ఉంటేనే కెనడాకు వచ్చిన తర్వాత ఉపాధి లేకపోయినా ఆర్ధిక ఇబ్బందులు ఉండవనే ఈ షరతు విధిస్తుంది. ఇలా కెనడాయే కాదు.. ఇతర దేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్ధులు ఆయా దేశాల్ని బట్టి డిపాజిట్ మొత్తాన్ని సంబంధిత వీసా అధికారులకు చూపించాల్సి ఉంటుంది. కెనడా రూ.6.14లక్షల డిపాజిట్ నిబంధనను 2000 నుంచి కొనసాగిస్తూ వచ్చింది. కాస్ట్ ఆఫ్ లివింగ్ థ్రెషోల్డ్‌లో మార్పులు ఈ నేపథ్యంలో కెనడా కాస్ట్ ఆఫ్ లివింగ్ థ్రెషోల్డ్‌ను మారుస్తున్నామని, తద్వారా పెరిగిపోతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇబ్బందుల నుంచి విద్యార్ధులకు ఉపశమనం కలుగుందని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ అన్నారు. ఆర్ధిక ఇబ్బందులతో.. ఫుడ్ బ్యాంక్‌ల వైపు అద్దె చెల్లించలేక ఆర్ధిక సంక్షోభం పాటు ఆహారం కోసం ఫుడ్ బ్యాంక్‌ల వైపు మొగ్గు చూపుతున్నానే వార్తల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక్కడికి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులకు తగిన వసతి కల్పించని విద్యాసంస్థలపై ఇమిగ్రేషన్, రెఫ్యూజెస్ అండ్ సిటిజన్ షిప్ కెనడా (ఐఆర్సీసీ) చర్యలు తీసుకోనుంది. విద్యా సంస్థలు ఎంతమందికి వసతి సౌకర్యం కల్పిస్తాయో.. ఆ మేరకే విద్యార్ధులకు అనుమతులు ఇస్తాయని తాము భావిస్తున్నట్లు మార్క్ మిల్లర్ పేర్కొన్నారు. ఓ రకంగా మంచికే వీటితోపాటు అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్ బయట పని పరిమితిపై ఇచ్చిన మినహాయింపు (వారానికి 20 గంటల కంటే ఎక్కువ)ను వచ్చే ఏడాది ఏప్రిల్ 30వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కెనడాలో ఉన్నవారితోపాటు డిసెంబర్ 7నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. -
యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు కొత్త రూల్స్ - రిషి సునాక్ సంచలన ట్వీట్..
స్వదేశీయులకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి.. ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి బ్రిటన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలను ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బ్రిటన్ ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ను తగ్గించడానికి "రాడికల్ యాక్షన్" ప్రకటించింది. ఇందులో భాగంగానే నైపుణ్యం కలిగిన విదేశీయుడు యూకేలో పనిచేయడానికి వీసా కావాలనుకుంటే.. కనీస వేతనాన్ని కూడా భారీగా పెంచింది. 2022లో ప్రభుత్వం జారీ చేసిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్య 745000. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికంగా కావడం గమనార్హం. పెరిగిన ఇమ్మిగ్రేషన్ విసాల సంఖ్యను మూడు లక్షల కంటే తక్కువకు తీసుకురావాలనుకునే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని ఆ దేశ హోమ్ మినిష్టర్ 'జేమ్స్ క్లెవెర్లీ' (James Cleverly) తెలిపారు. అంతే కాకుండా కొత్త రాకపోకలను తగ్గిస్తానని ప్రతిజ్ఞ చేసిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై ఒత్తిడి పెరగటం కూడా ఇందుకు ఒక కారణం అని తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ చాలా ఎక్కువగా ఉందని గణాంకాలు వెల్లడించాయి, దానిని తగ్గించడానికి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు, ఇవన్నీ యూకే ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఉంటాయని.. రిషి సునాక్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదీ చదవండి: ఆర్బీఐ సంచలన నిర్ణయం.. మరో బ్యాంక్ లైసెన్స్ క్యాన్సిల్ విదేశీ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకుని రావడంపై కూడా నిషేధం ఉంది. అయితే రీసెర్చ్ డిగ్రీలు చేసే పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఇందులో నుంచి మినహాయింపు ఉంటుంది. విదేశీ ఉద్యోగుల జీతం కూడా 38,000 పౌండ్లకు (రూ.40,01,932) పెంచింది. గతంలో యూరోపియన్ యూనియన్ దేశాల వారు ఎక్కువగా బ్రిటన్ దేశానికీ వలసలు వచ్చేవారు. అయితే ఈ మధ్యకాలంలో ఇండియా, నైజీరియా, చైనా నుంచి బ్రిటన్ వెళ్లేవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్త నిబంధనలు అమలులోకి వచ్చిన తరువాత ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని సమాచారం. Immigration is too high. Today we’re taking radical action to bring it down. These steps will make sure that immigration always benefits the UK. pic.twitter.com/osz7AmcRgY — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 We've just announced the biggest ever cut in net migration. No Prime Minister has done this before in history. But the level of net migration is too high and it has to change. I am determined to do it. — Rishi Sunak (@RishiSunak) December 4, 2023 -
అమెరికా వీసా ప్రాసెస్ : భారతీయులకు భారీ ఊరట!
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారులకు జారీ చేసే వీసా విషయంలో పాత సంప్రదాయ పద్దతికి స్వస్తి పలకనున్నారని సమాచారం. త్వరలో అమెరికా వీసాలు 'పేపర్‌లెస్'గా మారనున్నాయని నివేదికలు వెలుగులోకి వచ్చాయి. దీంతో వీసాల మీద స్టాంపింగ్ వేసే సంప్రదాయ పద్ధతి కనుమరుగు కానుంది. ఇటీవల, జోబైడెన్ ప్రభుత్వం పేపర్‌లెస్ వీసాల కోసం పైలెట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించి..సత్ఫలితాలు రాబట్టింది. పూర్తి స్థాయిలో స్టాంపింగ్ ప్రాసెస్‌ను డిజిటలైజ్ చేసే యోచనలో ఉన్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ మాట్లాడుతూ..‘‘మేం పేపర్‌లెస్ వీసా ప్రాసెస్ కోసం పైలెట్ ప్రాజెక్ట్ చేశాం. మంచి ఫలితాలు రాబట్టాం. త్వరలోనే ఈ పద్దతిని అమలు చేస్తాం. కానీ దీనిని విస్తృతంగా వినియోగించాలంటే 18 నెలల సమయం పట్టొచ్చు. భవిష్యత్తులో పేపర్ లెస్ వీసాలు జారీ చేస్తున్న దేశాల జాబితాలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇందుకోసం వీసా స్టేటస్‌ను వివరించేలా యాప్ అవసరమవుతుందని ’’భావిస్తున్నట్లు జూలీ స్టప్ చెప్పారు. -
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
అగ్రరాజ్యం అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త. హెచ్-1బీ వీసా రెన్యూవల్ కోసం దేశం వచ్చే అవసరం లేకుండా అక్కడే ఉండి వీసా రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని బైడెన్ ప్రభుత్వం కల్పించనుంది. కొన్ని కేటగిరీల హెచ్-1బీ వీసాలను దేశీయంగానే (అమెరికాలో ఉండి) రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబర్ నెలలో ప్రారంభించనుంది. తద్వారా అమెరికాలో ఉంటున్న ఎక్కువ మంది భారత ఐటీ నిపుణులకు లబ్ధి చేకూరనున్నట్లు యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ జూలీ స్టఫ్ మాట్లాడుతూ.. ‘‘భారత్‌లో యూఎస్ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అమెరికా వీసా కావాలంటే సుమారు ఆరు నెలల లేదంటే ఏడాది పాటు ఎదురు చూడాల్సి వస్తుంది. ఇకపై అలా ఎదురు చూసే అవసరం లేకుండా ప్రణాళికల్ని సిద్ధం చేశాం. ఇందులో భాగంగా అమెరికాలో ఉంటూ యూఎస్ వీసా రెన్యూవల్ కోసం ఎదురు చూస్తున్న విదేశీయుల (అందులో భారతీయులు కూడా ఉన్నారు) కోసం ప్రత్యేకంగా డొమెస్టిక్ వీసా రెన్యూవల్ ప్రోగ్రామ్‌ను త్వరలో ప్రారంభించనున్నాం. డిసెంబర్లో ప్రారంభించబోయే వీసా రెన్యూవల్ పైలెట్ ప్రోగ్రామ్‌లో సుమారు 20వేల వీసాల్ని రెన్యూవల్ చేసే అవకాశం కల్పించనున్నాం. ఈ ప్రాజెక్ట్‌తో అమెరికాలో నివసిస్తున్న ఎక్కువ మంది భారతీయులకు లబ్ధి చేకూరుతుంది. దశల వారీగా వీసా రెన్యూవల్ సంఖ్యను మరింత పెంచుతాం’’ అని జూలీ స్టఫ్ అన్నారు. 20 ఏళ్ల క్రితం అమెరికాలో నివసిస్తున్న నిపుణుల్లో భారతీయులే ఎక్కువ. అయితే ఈ నిపుణులకు స్థానిక కంపెనీలు హెచ్-బీ వీసాను అందిస్తుంటాయి.రెన్యూవల్ సైతం అక్కడే ఉండి చేసుకోవచ్చు. ఈ వీసా రెన్యూవల్ ప్రాసెస్ 2004 వరకు ఉండేది. అయితే క్రమంగా వీసా నిబంధనలు మారాయి. అలా అమెరికాలో ఉంటున్న భారతీయులు వీసా రెన్యూవల్ కోసం భారత్ వచ్చి వీసా రెన్యూవల్ చేయించుకుని తిరిగి వెళ్లే వారు. కానీ భారత ప్రధాని మోదీ ఈ ఏడాది జూన్ 21 నుంచి 24 వరకు చేసిన అమెరికా పర్యటనతో వీసా జారీలలో అనేక మార్పులు చేస్తూ వచ్చింది. తాజాగా 20 ఏళ్ల తర్వాత అమెరికాలోనే ఉండి హెచ్-1 బీ వీసాలను అక్కడే ఉండి రెన్యూవల్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం తీసుకున్నారు. -
భారతీయులకు గుడ్‌న్యూస్.. ఆ దేశానికి వెళ్లాలంటే నో ‘వీసా’
కౌలాలంపూర్: విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులకు గుడ్‌న్యూస్. తాజాగా మలేషియా ప్రభుత్వం భారతీయులకు శుభవార్త అందించింది. భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశానికి వెళ్లొచ్చు. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని, వీసా లేకుండా 30 రోజుల పాటు తమ దేశంలో ఉండొచ్చని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. అయితే, ఈ అవకాశాన్ని భారతీయులతో పాటు చైనా దేశస్తులకు కూడా కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వివరాల ప్రకారం.. తమ దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిచేందుకు మలేషియా ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నది. ఇందులో భాగంగానే పెట్టుబడుల్ని, పర్యాటకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో మలేషియా ప్రభుత్వం భారత్, చైనా నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే తమ దేశంలోకి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం వెల్లడించారు. ఈ సందర్బంగా మలేషియా ఆర్థికంగా ముందుకెళ్లాలంటే పర్యాటక రంగ అభివృద్ధి ముఖ్యమని తెలిపారు. ఈ క్రమంలో చైనా, భారత పౌరులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి చైనా, భారతీయ పౌరులు వీసా లేకుండా మలేషియాలో పర్యటించే వీలుంటుందని స్పష్టంచేశారు. తమ దేశంలోకి ప్రవేశించాక 30 రోజుల పాటు ఉండొచ్చని వెల్లడించారు. ఇక, భారతీయులకు వీసా అవసరం లేకుండానే పర్యటించే సౌలభ్యాన్ని ఇటీవల థాయిలాండ్, శ్రీలంక ప్రభుత్వాలు కూడా కల్పించాయి. నవంబర్ 10 నుంచి థాయిలాండ్ దీన్ని అమల్లోకి తీసుకువచ్చింది. ఇక, భారతీయులకు వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించేందుకు అక్టోబర్ నెలలోనే శ్రీలంక అనుమతినిచ్చింది. #Malaysia will grant 30-day visa-free travel for #Chinese citizens starting Dec. 1 this year, Prime Minister Anwar Ibrahim announced on Sunday. pic.twitter.com/YvmGPe1rY6 — iChongqing (@iChongqing_CIMC) November 27, 2023 -
కెనడాకు మళ్లీ ఈ వీసా సేవలు
ఒట్టావా/న్యూఢిల్లీ: కెనడాతో దౌత్య వివాదం నేపథ్యంలో ఆ దేశస్థులకు నిలిపేసిన ఎల్రక్టానిక్ వీసాల జారీ సేవలను కేంద్రం పునరుద్ధరించింది. ఒట్టావాలోని భారత హై కమిషన్ బుధవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్ట్‌లో ఈ మేరకు వెల్లడించింది. చేసింది. కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాద నేత హర్దీప్సింగ్ నిజ్జర్ గుర్తు తెలియని వ్యక్తుల కాల్పుల్లో మరణించడం, అది భారత గూఢచారుల పనేనని ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దాంతో ఇరు దేశాల సంబంధాలు బాగా క్షీణించాయి. -
భారత్ కీలక నిర్ణయం.. కెనడియన్లకు వీసా పునరుద్ధరణ
ఢిల్లీ: జీ20 వర్చువల్ సమావేశం నిర్వహించడానికి ముందు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడా పౌరులకు ఎలక్ట్రానిక్ వీసా సేవలను పునరుద్ధరించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు రెండు నెలల తర్వాత వీసా సేవలను ప్రారంభించడం గమనార్హం. ఈ చర్యతో పర్యటక వీసాతో పాటు కెనడాకు అన్ని రకాల వీసాలను పునరుద్దరించినట్లయింది. కెనడాకు వ్యాపర, మెడికల్ వీసా సేవలను భారత్ గత నెలలోనే ప్రారంభించింది. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసు వివాదంలో సెప్టెంబర్ 21న కెనడాకు భారత్ వీసాలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్య వేత్తల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్లో ఆరోపించాడు. ఈ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రూడో ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ అంశంపై ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొంది. ఇరుదేశాలు తమ పౌరులకు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి. కెనడా వీసాలను భారత్ రద్దు చేసింది. ఇరుదేశాలు దౌత్య వేత్తలను సమాన సంఖ్యలో ఉంచాలని భారత్ డిమాండ్ చేసింది. ఎక్కువ సంఖ్యలో ఉన్న కెనడా దౌత్య వేత్తలను ఉపసంహరించుకోవాలని గడువు కూడా విధించింది. ఈ వివాదంలో భాగంగానే భారత్ నుంచి కెనడా 41 మంది దౌత్య వేత్తలను కూడా ఉపసంహరించుకుంది. నిజ్జర్ హత్య కేసులో దర్యాప్తుకు సహకరించేలా భారత్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చెసింది కెనడా. పశ్చిమాసియా దేశాల పర్యటనల్లోనూ ట్రూడో ఈ అంశాన్ని లేవనెత్తారు. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఇటీవల యూకే వేదికగా జరిగిన ప్రపంచ స్థాయి సమావేశంలో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ అంశంపై స్పందించారు. నిజ్జర్ కేసులో దర్యాప్తును భారత్ తోసిపుచ్చడం లేదు.. కానీ ఆధారాలు సమర్పించాలని డిమాండ్ చేశారు. నిరాధారమైన ఆరోపణలతో దర్యాప్తు కోరకూడదని చెప్పారు. ఇదీ చదవండి: బందీల విడుదలకు హమాస్‌తో డీల్.. ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం -
వీసా లేకుండానే వియత్నాంకి: టూరిస్టులకు బంపర్ ఆఫర్
థాయ్‌లాండ్, శ్రీలంక తరువాత వియత్నాం కూడా త్వరలోనే భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పనేంది. వీసా లేకుండా ఆ దేశంలో పర్యటించేందుకు భారతీయులకు అవకాశం కలగనుంది. టూరిస్టులను ఆకర్షించే పథకంలో భాగంగా ఈ యోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదే జరిగితే శ్రీలంక, థాయ్‌లాండ్ తర్వాత భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తున్న మూడో దేశంగా వియత్నాం అవతరించనుంది. వియత్నాం సంస్కృతి, క్రీడలు మరియు పర్యాటక శాఖ మంత్రి న్గుయిన్ వాన్ జంగ్, చైనా, భారత్ వంటి ప్రధాన మార్కెట్లకు స్వల్పకాలిక వీసా మినహాయింపులపై కీలక సూచన చేశారు. దేశ పర్యాటక రంగం పునరుద్ధరణ కోసం పిలుపునిచ్చిన ఆయన కొంతకాలం పాటు ఈ మినహాయింపు నిచ్చేందుకు యోచిస్తోందని వియత్నాం వార్తా సంస్థ VnExpress నివేదించింది. 2023 ఏడాదిలో తొలి పది నెలల్లో, వియత్నాంను సందర్శించిన అంతర్జాతీయ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 మిలియన్ల దాటింది. 2022 నుండి 4.6 రెట్లు పెరిగింది.కోవిడ్‌కు ముందు, వియత్నాంను సందర్శించిన ఇండియా టూరిస్టలు సుమారు 1,70,000 మంది . ప్రస్తుతం జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, ఇటలీ, స్పెయిన్, డెన్మార్క్ , ఫిన్లాండ్ జాతీయులు ప్రస్తుతం వీసా లేకుండా వియత్నాంలో ప్రయాణించవచ్చు. కాగా అక్టోబర్‌లో, థాయ్‌లాండ్ ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ 10 నుండి మే 10, 2024 వరకు ఆరు నెలల పాటు భారతదేశం, తైవాన్ నుండి పర్యాటకులకు వీసా రహిత ప్రవేశానికి అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. -
యాపిల్‌కి షాకిచ్చిన కోర్టు.. వందల కోట్లు చెల్లించేలా
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. అమెరికా న్యాయం స్థానంలో కొనసాగుతున్న ఓ కేసుకు సంబంధించి రూ.208 కోట్లుకు పైగా చెల్లించేందుకు అంగీకరించింది. యాపిల్ సంస్థలోని పలు విభాగాల్లో ఉద్యగ అవకాశాల్ని అమెరికా పౌరులు, గ్రీన్ కార్డ్ దారుల కంటే వలసదారులకు అనుకూలంగా ఉండటం ద్వారా కంపెనీ ఫెడరల్ చట్టాల్ని ఉల్లంఘించిందనే ఆరోపణల్ని పరిష్కరించి, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఎదుట 25 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. గ్రీన్ కార్డులు, అమెరికా వచ్చే వలసదారులకు స్పాన్సర్ చేయడానికి సంస్థలకు అనుమతించే ఫెడరల్ కార్యక్రమం కింద అర్హులైన ఉద్యోగాల కోసం అమెరికన్ పౌరులు, గ్రీన్ కార్డ్ వీసా దారుల్ని నియమించుకోవడంలో విఫలమైంది. తద్వారా పౌరసత్వం ఆధారంగా వివక్షను నిషేధించే చట్టాలను ఉల్లంఘిస్తుందని న్యాయ శాఖ గత వారం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానికంగా ఉన్న అమెరికన్ కంపెనీలు హెచ్1బీ, ఎల్1,ఎల్1 వీసా వంటి యూఎస్ వర్క్ వీసా దారుల్ని ఉద్యోగంలో నియమించుకోవాల్సి ఉంటుంది. కానీ అన్నీ సంస్థలు అలా చేయడం లేదు. నిబంధల్ని ఉల్లంఘించి విదేశీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. దీనిపై అమెరికా న్యాయ శాఖ కఠిన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వం ఆధారంగా వివక్షకు సంబంధించిన కేసుల్లో న్యాయశాఖ గతంలో ఎన్నడూ లేనంతగా సంస్థల నుంచి నష్టపరిహారం చెల్లించేలా సంస్థల్ని పట్టుబట్టింది. నిబంధనల ప్రకారం యాపిల్ 6.75 మిలియన్ డాలర్లను సివిల్ పెనాల్టీల రూపంలో చెల్లించాలని, 18.25 మిలియన్ డాలర్లను బాధిత కార్మికులకు కేటాయించాలని పేర్కొంది. ఈ ఆరోపణలపై స్పందించిన యాపిల్ తాము అనుకోకుండా డీఓజే ప్రమాణాలను పాటించలేదని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కంపెనీ తన నిబద్ధతను వ్యక్తం చేస్తూ నష్టపరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. -
సాక్షి ఇమ్మిగ్రేషన్ టాక్ షో @ 10 November 2023
-
సాక్షి ఇమ్మిగ్రేషన్ లైవ్ టాక్ షో @ 04 November 2023
-
టూరిస్టులకు థాయ్‌లాండ్ బంపర్ ఆఫర్
పర్యాటకులకు థాయ్‌లాండ్ (Thailand) ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్, తైవాన్ నుంచి వచ్చే పర్యాటకులకు వీసా లేకుండానే ఉచిత ప్రవేశాన్ని కల్పించాలని నిర్ణయించింది. సీజన్ సమీపిస్తున్నందున ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకున్నట్టు థాయ్ప్రభుత్వ అధికారి మంగళవారం తెలిపారు. తాజా నిర్ణయంతో భారత్ తైవాన్ నుంచి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజులు థాయ్‌లాండ్‌లో పర్యటించవచ్చని అధికార ప్రతినిధి చై వచరోంకే తెలిపారు. ఈ నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకూ ఈ వెసులుబాటు అందుబాటులో ఉంటుంది. ఈ ఏడాది సీజన్లో 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని థాయ్‌లాండ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రయాణ రంగం ద్వారా వచ్చే ఆదాయంతో ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారిన బలహీన ఎగుమతులను లోటును భర్తీ చేయాలని కొత్త ప్రభుత్వం యోచిస్తోంది. కాగా థాయ్‌లాండ్‌కు చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత భారత్నుంచే ఎక్కువ పర్యాటకుల తాకిడి ఉంటుంది. జనవరి -అక్టోబర్ 29 మధ్య, థాయ్‌లాండ్‌కు 22 మిలియన్ల మంది సందర్శకులు వచ్చారు. తద్వారా దేశానికి భారీ ఆదాయమే సమకూరింది. 2019లో రికార్డు స్థాయిలో వచ్చిన 39 మిలియన్ల టూరిస్టుల్లో 11 మిలియన్లతో టాప్‌లోని లిచింది చైనా.ఈ నేపథ్యంలోనే అయిన కోవిడ్ తరువాత టూరిజం మార్కెట్‌కు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన చైనీస్ టూరిస్టుల కోసం సెప్టెంబరులో వీసా అవసరం లేకుండానే పరిమిత కాల పర్యటనకు అవకాశం కల్పించింది. -
జయకు పాస్‌పోర్ట్ వచ్చిం... దహో!
హమ్మయ్య! జయకు పాస్‌పోర్ట్ అండ్ వీసా వచ్చింది. జయ ఇక హాయిగా నెదర్లాండ్స్‌కు వెళ్లవచ్చు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టవచ్చు. ఇంతకీ సదరు జయ మనిషి కాదు. వీధి శునకం. ల్యాబ్రడార్, జర్మన్ షెప్పర్డ్, పమేరియన్లను ముద్దు చేసే వాళ్లలో చాలామంది వీధికుక్కలను మాత్రం ‘అసుంట’ అంటారు. మెరల్ మాత్రం అలా అనుకోలేదు. నెదర్ ల్యాండ్స్‌కు చెందిన మెరల్ మన దేశానికి వచ్చింది. వారణాసిలో ఆమెకు ఒక వీధికుక్క కనిపించింది. ఈ శునకంపై వేరే శునకాలు దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు వాటి బారినుంచి మెరల్ దానిని కాపాడింది. ఆ కృతజ్ఞతతో మెరల్ ఎటు వెళితే అటు వచ్చేది కుక్క. ఆ కుక్కను చూస్తే మెరల్‌కు జాలిగా అనిపించింది. దాని చురుకుదనం, అందం మెరల్‌కు నచ్చి, ఆ కుక్కను దత్తత తీసుకొని నెదర్లాండ్స్‌కు తీసుకు పోవాలని డిసైడైపోయింది. దత్తత, పాస్‌పోర్ట్, వీసా ప్రక్రియ కోసం కొంతకాలం అదనంగా మన దేశంలో ఉంది. ‘పెద్ద ప్రక్రియ పూర్తయి పోయింది. ఎట్టకేలకు జయను నాతోపాటు తీసుకువెళుతున్నందుకు సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్ పెట్టింది మెరల్. -
కెనడా పౌరులకు వీసా సేవల పునరుద్ధరణ
న్యూఢిల్లీ: దౌత్యపరమైన ఉద్రిక్తతల నడుమ వీసా సేవల్ని నిలిపివేసిన భారత్.. తిరిగి కెనడా పౌరుల కోసం ఆ సేవల్ని పునరుద్ధరించింది. ఈ మేరకు ఒట్టావాలోని భారత రాయబార కార్యాలయం(Indian High Commission) బుధవారం ప్రకటనల విడుదల చేసింది. ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసాలను జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 26 నుంచి తాత్కాలికంగా ఈ వీసా సేవల్ని అందించనున్నట్లు ఆ ప్రకటనలో భారత హైకమిషన్ స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇంతకాలం వీటిని నిలిపివేయాల్సి వచ్చిందని.. సమీక్ష అనంతరం తిరిగి ఈ సేవల్ని ప్రారంభిస్తున్నట్లు భారత హైకమిషన్ ప్రెస్ రిలీజ్లో పేర్కొంది. ఖలీస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ప్రమేయంలో భారత ఏజెంట్ల జోక్యం ఉందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రత్యక్షంగా ఆరోపణలు ఇరు దేశాల మధ్య గ్యాప్ నెలకొంది. భారత్‌కు కెనడాకు మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ చివరి వారం నుంచి వీసా సేవల్ని నిలిపివేసుకున్నాయి ఇరు దేశాలు. -
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్‌తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు
శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఏడు దేశాలకు ఉచిత వీసాల జారీచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటకశాఖ మంత్రి ఆమోదం తెలిపారు. భారత్, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేయిషయా, థాయ్‌లాండ్ పౌరులకు ఉచితం వీసాలు జారీ ప్రతిపాదనను శ్రీలంక కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ జాబితాలో అమెరికా లేకపోవడం గమనార్హం పైలట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమం తక్షణలమే అమల్లోకి వస్తుందని, మార్చి 31 వరకూ కొనసాగనుందని విదేశాంగమంత్రి అలీ సబ్రీ పేర్కొన్నారు. శ్రీలంకకు పర్యాటకులను ఆకర్షించే ఉద్ధేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పర్యాటకశాఖ పేర్కొంది. ఈ చర్యతో పర్యాటకానికి ఊతం లభిస్తుందని తాము భావిస్తున్నట్టు శ్రీలంక పేర్కొంది. రాబోయే రోజుల్లో శ్రీలంకకు వచ్చే పర్యాటకుల సంఖ్య 5 మిలియన్లకు చేరుతుందని తాము ఆశిస్తున్నట్టు వెల్లడించింది. కాగా ద్వీప దేశమైన శ్రీలంకకు పర్యాటకం ప్రధాన ఆదాయవనరుగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దేశం ప్రకటించిన ఉచిత వీసాల జాబితాలో మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయ్‌లాండ్ దేశాలు పర్యాటకుల తాకిడి అధికంగా ఉన్న రాష్ట్రాలు కావడం విశేషం. శ్రీలకం నిర్ణయంతో ఆయా దేశాలకు చెందిన పర్యాటకులకు వీసా ఖర్చు, సమయం తగ్గనుంది. చదవండి: రావణుడి వైభోగం ఎంత.. అవశేషాలు ఎక్కడ ఉన్నాయి Cabinet approves issuing of free visas to India, China, Russia, Malaysia, Japan, Indonesia & Thailand with immediate effect as a pilot project till 31 March - — M U M Ali Sabry (@alisabrypc) October 24, 2023 -
భారత్ వ్యవహారాల్లో కెనడా జోక్యం
న్యూఢిల్లీ: కెనడా దేశస్తులకు వీసా సేవల పునరుద్ధరణ అంశం, ఆ దేశంలోని భారత దౌత్యవేత్తలకు కల్పించే భద్రతపై ఆధారపడి ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కుండబద్దలు కొట్టారు. కెనడాతో దౌత్యపరమైన సమానత్వం వియన్నా సూత్రాల ప్రకారమే భారత్ కోరుతోందని కూడా ఆయన స్పష్టం చేశారు. భారత్ నుంచి 41 మంది దౌత్యాధికారులను కెనడా ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపథ్యంలో భారత్–కెనడా సంబంధాలపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కెనడా భారత్ అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కొనసాగిస్తోందనే ఆందోళనతోనే దౌత్యపరమైన సమానత్వంపై పట్టుబట్టాల్సి వస్తోందని మంత్రి వివరించారు. ‘ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కాలక్రమంలో మరికొన్ని అంశాలు బయటకు వస్తాయి. భారత్ చర్యలపై చాలా మందికి ఎందుకు అసౌకర్యం కలిగిందనే విషయం ప్రజలు అర్థం చేసుకుంటారు’అంటూ వ్యాఖ్యానించారు. ‘కెనడాతో సంబంధాలు ప్రస్తుతం ఇబ్బందికరంగా మారాయి. ఆ దేశ రాజకీయాల్లోని ఒక వర్గం, దానికి సంబంధించిన విధానాలతో మాకు కొన్ని సమస్యలున్నాయి. కెనడాలోని మన దౌత్యాధికారుల భద్రత ప్రమాదంలో పడింది. అందుకే వీసాల జారీని నిలిపివేశాం. పరిస్థితుల్లో మార్పు కనిపిస్తేనే వీసాల జారీ పునరుద్ధరణ సాధ్యమవుతుంది’ అని జైశంకర్ అన్నారు. దౌత్యాధికారుల భద్రత, రక్షణ అంశం వియన్నా సూత్రాల్లో కీలకమైందని వివరించారు. జూన్‌లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది నిజ్జర్ హత్యకు గురయ్యాడు. ఘటన వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముందంటూ కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలతో ఉద్రిక్తతలు మొదలైన విషయం తెలిసిందే. -
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు శుభవార్త!
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు జో బైడెన్ సర్కారు శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు అక్కడ చట్టబద్ధంగా ఎలాంటి ఉద్యోగాలైనా చేసేందుకు అనుమతించే ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్–ఈఏడీ (అంటే వర్క్ పర్మిట్ అన్నమాట) గడువు కాలాన్ని ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు ఈఏడీల కోసం అప్లయ్ చేసుకునే వారికి లేదంటే రెన్యూవల్ కోసం ప్రయత్నిస్తున్న వారికి సైతం వర్తిస్తుంది. అమెరికాలో హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, 21 ఏళ్లలోపు వయసున్న వారి పిల్లలు ఉద్యోగం చేసుకోవడానికి వీలుగా హెచ్-4 వీసాలు జారీ చేస్తుంటారు. అయితే హెచ్-4 వీసాదారులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారు తప్పనిసరిగా ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయి ఆథరైజేషన్ వస్తేనే వారు ఉద్యోగం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. కొన్ని సార్లయితే ఏడాదిపైనే పట్టొచ్చు. దీనివల్ల హెచ్-4 వీసాదారులు మంచి ఉద్యోగ అవకాశాలు కోల్పోవాల్సి వస్తోంది. వారి తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ లేదంటే వారిని విడిచి పెట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతమున్న ఈఏడీ నిబంధనలు మార్చడంతో హెచ్-1 బీ వీసా దారులకు, వారి ఇతర కుటుంబ సభ్యులకు భారీ ఊరట కలిగినట్లైంది ఇటీవల ఓ నివేదిక ప్రకారం.. ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం 1.05 మిలియన్లకు పైగా భారతీయులు క్యూలో ఉన్నారని నివేదిక హైలైట్ చేసింది. వారిలో 4 లక్షల మందికి పైగా భారతీయులు తమ జీవిత కాలంలో గ్రీన్ కార్డ్ కళ్లజూడలేరని తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది! ఆ లోపే వారు కన్ను మూస్తారని అభిప్రాయపడింది. అమెరికాలో ఈ ఏడాది ఉద్యోగాధారిత గ్రీన్ కార్డ్ పెండింగు దరఖాస్తులు ఏకంగా 18 లక్షలు దాటాయి. వీటిలో ఏకంగా 63 శాతం, అంటే 11 లక్షలకు పైగా భారతీయులవే! దాదాపు 2.5 లక్షలు, అంటే 14 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది. -
చైనాపై నిరసనల హోరు.. జిన్‌పింగ్ దిష్టిబొమ్మ దహనం
ఇటానగర్: ఉషు ఆటగాళ్లను ఆసియా క్రీడల్లో పాల్గొనకుండా చేసినందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అరుణాచల్ ప్రదేశ్వాసులు. తమ రాష్ట్రానికి చెందిన ముగ్గురు క్రీడాకారులకు చైనా వీసాలు నిరాకరించడాన్ని నిరసించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్‌లోని లోహిత్ యూనిట్, ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్ తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ స్టూడెంట్స్ యూనియన్ సహకారంతో రాష్ట్రంలో ఆందోళన నిర్వహించారు. ముగ్గురు క్రీడాకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముగ్గురు క్రీడాకారులు ఒనిలు తేగా, నేమన్ వాంగ్సు, మెపుంగ్ లాంగులకు చైనా వీసాలను రద్దు చేయడంతో చైనాలో జరిగిన ఆసియా క్రీడలలో పాల్గొనలేకపోయారు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని తమదిగానే పేర్కొంటూ చైనా ఈ చర్యకు పాల్పడింది. అరుణాచల్‌ను ప్రత్యేక దేశంగా పరిగణించనందున వీసాలను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. తమ రాష్ట్ర ఆటగాళ్లు అవకాశం కోల్పోవడంతో అరుణాచల్ ప్రదేశ్వాసులు నిరసనలు చేపట్టారు. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ స్పందించారు. ఆటగాళ్లు భారత ఉషు జట్టులో పాల్గొనేవారుగానే పరిగణించబడతారని చెప్పారు. రూ.20 లక్షల ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. ఆటగాళ్ల కోచ్‌కు కూడా ప్రోత్సాహకంలో కొంత భాగం కేటాయించినట్లు సీఎం ఖండూ చెప్పారు. 2026లో టోక్యోలో జరగనున్న ఆసియా గేమ్స్‌కు అవకాశం దక్కుతుందని హామీ ఇచ్చారు. ఆటగాళ్ల భవిష్యత్‌కు తాను భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్న సీఎం.. ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కెనడా ప్రధాని క్షమాపణలు -
ముగ్గురు భారత అథ్లెట్లకు చైనా వీసా నిరాకరణ
న్యూఢిల్లీ: ఆసియా క్రీడలకు సంబంధించి అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వుషు పోటీల్లో పాల్గొనాల్సిన 11 మంది సభ్యుల భారత బృందంలో ముగ్గురికి చైనా ప్రభుత్వం వీసా నిరాకరించింది. ఈ ముగ్గురూ అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారే. అరుణాచల్‌ప్రదేశ్‌కు సంబంధించి భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వీసా నిరాకరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముగ్గురు మహిళా వుషు ప్లేయర్లు నైమన్ వాంగ్సూ, ఒనిలు టెగా, మేపుంగ్ లంగులను భారత అథ్లెట్లుగా గుర్తించేందుకు చైనా నిరాకరించింది. దాంతో శుక్రవారం రాత్రి వీరు మినహా మిగిలిన ముగ్గురు ఆసియా క్రీడల కోసం చైనా బయల్దేరి వెళ్లారు. ఈ అంశంపై కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసియా క్రీడలకు హాజరయ్యేందుకు చైనాకు వెళ్లాల్సిన ఠాకూర్... తాజా పరిణామాలకు నిరసనగా తన పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. -
కెనడాకు వీసా సేవలను నిలిపివేసిన కేంద్రం
ఒట్టావా: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని వ్యాఖ్యల తర్వాత భారత్.. కెనడా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతలోనే కెనడాలో జరిగిన మరో ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ అలియాస్ సుఖ దునెకె హత్య నేపథ్యంలో కెనడా వీసాలను భారత్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రెండు రోజులుగా ఈ రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతల కారణంగా కెనడియన్ పౌరులకు వీసాల జారీని తదుపరి నోటీసు వచ్చేంత వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది భారత్. కెనడాలోని వీసా దరఖాస్తు కేంద్రాలను నడుపుతున్న BLS ఇంటర్నేషనల్ సర్వీసెస్ సంస్థ.. కొన్ని కారణాల వల్ల వీసా దరఖాస్తు ప్రక్రియ 21 సెప్టెంబర్ 2023 నుండి అమలులోకి వస్తుంది, తదుపరి నోటీసు వచ్చేవరకు భారతీయ వీసా సేవలు నిలిపివేయబడ్డాయి. దయచేసి తదుపరి అప్డేట్స్ కోసం BLS వెబ్‌సైట్‌ను ఫాలో అవుతూ ఉండండని నోటీస్ ఇచ్చింది. కెనడాలో పెరుగుతున్న ఖలిస్థాన్ తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని భారత్ పలుమార్లు ఆ దేశానికి విజ్ఞప్తి చేసినా ఆ దేశం వారిపై ఉదాసీబాటతో వ్యవహరించడమే కాకుండా ఖలిస్థాన్ తీవ్రవాది హార్డెప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందంటూఆ దేశ ప్రధాని వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారాన్ని రేపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో వీసా సేవలను నిలిపివేస్తున్నట్టు కేంద్రం నిర్ణయం తీసుకుంది. HUGE: India suspends visa services for Canadians. Major diplomatic step by New Delhi against Canada’s blatant provocation and unsubstantiated baseless allegations. This is not an India of the past which will look the other way. India goes on attack mode against Justin Trudeau. pic.twitter.com/6fLVLnquQs— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 21, 2023 ఇది కూడా చదవండి: కెనడాలో గ్యాంగ్‌వార్: మరో ఖలిస్తానీ తీవ్రవాది హతం -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా..! అయితే జాగ్రత్త..!!
జగిత్యాల: ఇలా ఒకరిద్దరు కాదు.. సుమారు 25 మంది యువకులను కెనడా, జర్మనీ వంటి దేశాలకు పంపిస్తానని చెప్పి సాయితేజ అనే ఏజెంట్ సుమారు రూ.కోటి వరకు దండుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీళ్లంతా జగిత్యాల పోలీసులను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఉత్త లెటర్లే.. సాధారణంగా కెనడా, జర్మనీ వంటి దేశాలకు వెళ్లేవారు ఆయా దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఉన్నట్లు వాటికి సంబంధించిన ఆఫర్ లెటర్లను ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఈ ఆఫర్ లెటర్ల ఆసరాగా ఆయా కంపెనీలకు వెళ్లడానికి అవసరమైన అర్హతలు, మెడికల్, బయోమెట్రిక్ వంటి ఇతర అర్హత పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. అయితే సదరు ఏజంట్‌గా పనిచేసిన వ్యక్తి యూరప్ కంపెనీల బోగస్ ఆఫర్ లెటర్లను సృష్టించి ఉపాధి కోసం వలస వెళ్లే యువకులకు ఇచ్చి వాటితో హైదరాబాద్‌లో మెడికల్, బయోమెట్రిక్, స్టాంపింగ్ చేయించడం గమనార్హం. ఇదే రీతిలో కొల్వాయికి చెందిన ఏజంట్ ఓ వ్యక్తిని జర్మనీకి పంపగా.. అతడిని అక్కడి ఎయిర్‌పోర్టు నుంచి తిప్పి పంపినట్లు సమాచారం. ఆందోళనలో యువకులు.. జగిత్యాల, కోరుట్ల, బీర్పూర్, సారంగాపూర్ ప్రాంతానికి చెందిన సుమారు 25 మంది యువకులు ఏడాదిన్నరగా యూరప్ దేశాలకు ఉపాధి కోసం వెళ్లాలన్న ఆశతో కొల్వాయికి చెందిన ఏజెంట్‌ను ఆశ్రయించినట్లు సమాచారం. అతడు ఒక్కో యువకుడి నుంచి సుమారు రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు తీసుకుని కెనడా, జర్మనీ దేశాలకు పంపేతంతును పూర్తి చేసినట్లు సదరు ఏజెంట్ నమ్మించినట్లు తెలిసింది. సుమారు ఏడాదిన్నరపాటు తమను యూరప్ దేశాలకు పంపుతాడని ఆశపడ్డ యువకులు కొన్నాళ్లపాటు వేచిచూసి చివరకు తాము మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. కేసులు నమోదు చేశాం.. యూరప్ దేశాలకు పంపిస్తానని నకిలీ పత్రాలు ఇచ్చి మోసం చేసినట్లు కొంతమంది యువకులు మాకు ఫిర్యాదు చేశారు. ఆయా యువకులు మోసపోయిన ఏరియాల్లోని పోలీస్స్టేషన్లలో రెండు కేసులు నమోదు చేశాం. – వెంకటస్వామి, డీఎస్పీ, జగిత్యాల ‘మాది కోరుట్ల. కెనడాకు వెళ్దామని మా ఫ్రెండ్ ద్వారా బీర్పూర్ మండలం కొల్వాయికి చెందిన సాయితేజను ఏడాది క్రితం సంప్రదించిన. ఆయన నా దగ్గర రూ.ఏడు లక్షలు తీసుకున్నాడు. నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చి మెడికల్, బయోమెట్రిక్ చేయించాడు. తరువాత రెండు నెలలకు ఆయనే అవి నకిలీవని చెప్పి మీ డబ్బులు మీకు ఇస్తానన్నాడు. తరువాత ఓ చెక్ ఇచ్చాడు. అది బౌన్స్ అయింది. నెలరోజులుగా సాయితేజ ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. వాళ్లింటికి వెళితే ఇంట్లో ఎవరూ లేరు. చైతన్య, కోరుట్ల -
అమెరికాలో నిద్రలేని రాత్రుల్ని గడుపుతున్న భారతీయులు.. కారణం అదేనా?
అమెరికాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారనుందా? ఓ వైపు ఆర్ధిక మాంద్యం, మరోవైపు లేఆఫ్స్‌తో గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా అక్కడ నెలకొన్న పరిస్థితులు. అగ్రరాజ్యంలో శాశ్వత నివాస హోదా పొందాలంటే ‘గ్రీన్ కార్డ్’ తప్పని సరి. ఇప్పుడీ గ్రీన్ కార్డ్ పొందే విషయంలో లక్షల మంది భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు లక్ష మందికిపైగా పిల్లలు వారి తల్లిదండ్రుల్ని వదిలి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలు నివేదికలు చెబుతున్నాయి. 18లక్షలు దాటిన సంఖ్య అమెరికాలో తాత్కాలికంగా ఉద్యోగం చేయడానికి విదేశీయులకు జారీ చేసే అనుమతి పత్రమే హెచ్1బీ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన వారికి వీటిని జారీ చేస్తారు. అయితే, ఇప్పుడా హెచ్1బీ వీసా దారులు అమెరికాలో శాస్వత నివాసం ఉండేందుకు గ్రీన్ కార్డ్ కావాలి. వారి సంఖ్య 18 లక్షలు దాటింది. 134ఏళ్లు ఎదురు చూడాలా? ప్రతి ఏడాది ఆయా దేశాల బట్టి అగ్రరాజ్యం గ్రీన్ కార్డ్‌లను మంజూరు చేస్తుంది. అలా భారత్‌కు ప్రతి ఏడాది 7 శాతం అంటే 65,000 గ్రీన్ కార్డ్‌లను అందిస్తుంది. అయితే గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్న 18 లక్షల మందికి వాటి (గ్రీన్ కార్డ్) ప్రాసెసింగ్‌కు పడుతున్న సమయాన్ని లెక్కలోకి తీసుకుంటే ఎదురు చూడాల్సి సమయం అక్షరాల 134 ఏళ్లు. తల్లిదండ్రుల నుంచి విడిపోవడం తప్పదా? ఉద్యోగం చేస్తూ చాలా సంవత్సరాలుగా అమెరికాలో ఉంటున్న ఇతర దేశస్థులకు పర్మినెంట్ రెసిడెన్సీ హోదాను గ్రీన్ కార్డ్ కల్పిస్తుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో హెచ్-1బీ వంటి వీసాలు ఉంటాయి. చాలా మంది ఉద్యోగం చేస్తూనే అక్కడ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటారు. వీరి పిల్లలు.. 21ఏళ్ల వయస్సు వచ్చేంతవరకు తల్లిదండ్రుల వద్ద ఉండొచ్చని హెచ్-4 వీసా నిబంధనలు చెబుతున్నాయి. ఈలోపు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డ్ వస్తే మంచిదే! లేకపోతే.. పిల్లలు, సొంత దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసా, గ్రీన్ కార్డ్ అంటే ఏంటి? అమెరికాలో గ్రీన్‌కార్డ్, సిటిజన్ షిప్ కావాలంటే హెచ్1బీ అనే వర్క్ పర్మిట్ మీద అక్కడికి వెళ్లాలి. ఆ వర్క్ పర్మిట్ రావాలంటే అమెరికాలో ఉన్న కంపెనీ మన దేశంలో ఉన్న మనకి ఈ హెచ్1బీ వీసా ఇస్తుంది. హెచ్1 బీ వీసా వచ్చింది. అమెరికాకు వెళ్లిన తర్వాత అక్కడ కనీసం 6 ఏళ్ల పని చేయాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల నిర్ణీత సమయంలో ఆ గ్రీన్ కార్డ్‌ను పొందలేకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాలి. ఒక ఏడాది పాటు అక్కడే ఉండి హెచ్1బీ వీసా మీద అమెరికాకు వచ్చి గ్రీన్ కార్డ్ కోసం అప్లయ్ చేసుకోవచ్చు. గ్రీన్ కార్డ్ వచ్చిన 5 ఏళ్ల తర్వాత అమెరికా పౌరులుగా (american citizenship) గుర్తింపు పొందుతాం. గ్రీన్ కార్డ్‌కి, సిటిజన్ షిప్కి తేడా హెచ్1 బీ వీసాతో అమెరికాకు వెళ్లి ఉద్యోగం పోతే కొత్త ఉద్యోగం పొందాలంటే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అదే గ్రీన్ కార్డ్, లేదంటే అమెరికా సిటిజన్ షిప్ ఉంటే ఉద్యోగాలు త్వరగా వస్తాయి. జీతాలు సైతం భారీగా ఉంటాయి. భారత్‌లో ఉంటే కష్టమే భారత్‌లో ఉండి హెచ్1బీ వీసా తెచ్చుకోవడం కొంచెం కష్టమే. కాబట్టే భారతీయ విద్యార్ధులు చదువు కోసం అమెరికా వెళతారు. ఎడ్యుకేషన్ వీసాతో అమెరికా వెళ్లి 2ఏళ్ల పాటు చదివితే హెచ్1 బీ వీసా లేకపోయినా మరో 3ఏళ్లు అక్కడ ఉండే అవకాశం కలుగుతుంది. రెండేళ్లు చదువు పూర్తి చేసుకున్న అనంతరం జాబ్ చేస్తాం కాబట్టి హెచ్1 బీ వీసా వెంటనే పొందవచ్చు. మోదీ పర్యటనతో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన ముందు బైడెన్ సర్కార్ అమెరికాలోని భారతీయులకు మేలు కలిగించే నిర్ణయం తీసుకుంది. ఎంప్లాయిమెంట్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడి) కోసం కొత్త మార్గ దర్శకాలను జారీ చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వేలాది మంది భారతీయులకు ప్రయోజనం కలగనుంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డ్ అర్హతలను సరళతరం చేసింది. ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హతలకు సంబంధించి కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న వారి కలను సాకారం చేసుకునేందుకు ఈ నిర్ణయం దోహద పడుతుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లి అక్కడే శాస్వతంగా స్థిరపడాలనుకునే వలసదారులకు అమెరికా పర్మినెంట్ రెసిడెంట్ కార్డ్ గ్రీన్ కార్డ్ లను జారీ చేస్తారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం.. ప్రతి ఏటా లక్షా 40 వేల గ్రీన్ కార్డ్‌లను జారీ చేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే గ్రీన్ కార్డ్ కార్డ్‌లను జారీ చేస్తారు. ప్రస్తుతం, మొత్తం ధరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7 శాతం మాత్రమే కేటాయిస్తున్నారు. ఈ ఏడీ అర్హతలు ఉన్నవారికి మాత్రమే గ్రీన్ కార్డ్‌లను జారీ చేస్తున్నారు. తాజాగా, ఈఏడీ నిబంధనల్ని సడలించిన నేపథ్యంలో అమెరికాలో సవాళ్లతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలగనుంది.గ్రీన్ కార్డ్ కోసం కొత్తగా ధరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా ఈ నూతన మార్గదర్శకాలు వర్తింప చేయనున్నట్లు అమెరికా వెల్లడించింది. చదవండి👉మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం -
గుడ్ న్యూస్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, రూ.33 లక్షల వరకు డబ్బు ఆదా
దేశ పౌరులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తొలిసారి సొంతింటి కలల్ని నిజం చేసేలా 40,000 డాలర్ల (భారత కరెన్సీలో రూ.33,04,918) వరకు డబ్బుల్ని ఆదా చేసుకునే వెసలు బాటు కల్పించింది. దీంతో పాటు విధులు నిర్వహించే వారికి వర్క్ పర్మిట్, ఇతర దేశాలకు చెందిన విద్యార్ధులు కెనడాలో నివసిస్తున్నట్లైతే వారికి వీసా ఎలిజిబులిటీ గడువును పొడిగించింది. ఇందుకోసం అర్హులు నివాసానికి సంబంధించిన పత్రాల్ని అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కెనడాలో సొంత ఇల్లు తీసుకోవాలని ఉండి, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆగిపోయిన వారికి మరింత ప్రయోజనం చేకూరుతుంది. పన్ను ప్రోత్సాహకాలు పొందడంతో పాటు డబ్బు ఆదా అవుతుంది. దీంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చి కెనడాలో పనిచేస్తున్న ఉద్యోగులు, విద్యార్ధులు సైతం సొంతింటిని కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. వర్క్ పర్మిట్ హోల్డర్లు, ఇతర దేశాల విద్యార్థులను ఆహ్వానించి వారికి అవకాశాలు కల్పించే విషయంలో తమ నిబద్ధతను చాటి చెప్తుంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన వారు కెనడాలో కొత్త ఇల్లు తీసుకునే సదుపాయం ఉంటుంది. ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ (ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ) అర్హతలు కెనడా ప్రభుత్వం అందించే పథకంతో లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫస్ట్ హోం సేవింగ్స్ అకౌంట్ తప్పని సరి వీటితో పాటు తొలిసారి ఇల్లు కొనుగోలు చేస్తేనే : కెనడాలో గడిచిన ఐదేళ్లలో భార్య లేదా భర్త / భాగస్వామి పేరు మీదు ఇల్లు కొనుగోలు చేయకూడదు. కనీసం 18 సంవత్సరాలు నిండాలి : ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్‌ను ప్రారంభించిన నాటికి అర్హులైన వయస్సు 18 ఏళ్ల నుంచి 71 ఏళ్ల వయస్సు ఉండాలి. కెనడియన్ నివాసి : కెనడియన్ రెసిడెంట్ (పౌరులు, శాశ్వత నివాసితులు, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం నివాస అవసరాలను తీర్చే కొంతమంది తాత్కాలిక నివాసితులు). వర్క్ పర్మిట్ హోల్డర్లు, అంతర్జాతీయ విద్యార్థులు నివాసితులుగా అర్హత పొందడానికి ట్యాక్స్ ఇయర్ సంవత్సరంలో కనీసం 183 రోజులు దేశంలో నివసించాలి. ఆర్థిక సంస్థలు ప్రస్తుతం అందిస్తున్న మూడు రకాల ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ అకౌంట్లు డిపాజిటరీ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది నగదు, టర్మ్ డిపాజిట్లు లేదా గ్యారెంటీడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్లు (జిఐసి) కలిగి ఉన్న బ్యాంకు ఖాతా. ట్రస్ట్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఈ ఖాతాను ట్రస్టీగా ట్రస్ట్ కంపెనీతో తెరవవచ్చు. నగదు, టర్మ్ డిపాజిట్లు,జీఐసీలు, ప్రభుత్వ .. కార్పొరేట్ బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నిర్దేశిత స్టాక్ ఎక్ఛేంజ్‌లలో లిస్ట్ అయిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు అర్హతను కలిగి ఉంటుంది. ఇన్స్యూర్డ్ ఎఫ్‌హెచ్‌ఎస్‌ఏ : ఇది యాన్యుటీ (లైసెన్స్ పొందిన యాన్యుటీ ప్రొవైడర్) ఒప్పందం. కాగా, అర్హత కలిగిన నివాసాలలో సింగిల్-ఫ్యామిలీ గృహాలు, పాక్షికంగా విడిపోయిన గృహాలు, టౌన్ షిప్‌లు, కండోమినియం యూనిట్లు (లేదా కాండోలు), అపార్ట్మెంట్ యూనిట్లు, మొబైల్ గృహాలు ఉన్నాయి. -
ఐన్‌స్టీన్ వీసా అంటే ఏంటో తెలుసా? ఆ వీసా పొందాలంటే ఏం చేయాలి?
ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది అమెరికా వీసా, సిటిజన్ షిప్ కోసం ప్రయత్నిస్తుంటారు. కొన్ని సార్లు విఫలమై భారీ మొత్తంలో ఖర్చు పెట్టీ మరి వీసా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయినప్పటికీ ఫెయిల్ అవుతున్నారు. ఈ తరుణంలో భారత్‌లో నవీ ముంబైకి చెందిన మంగేష్ ఘోగ్రే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐన్‌స్టీన్ వీసాను సొంతం చేసుకున్నారు. ఇంతకీ ఈ ఐన్‌స్టీన్ వీసా అంటే ఏమిటీ? ఈ వీసాను ఎలా పొందవచ్చో తెలుసుకుందాం. 2004లో ఎంబీఏ పూర్తి చేసిన భారతీయ సంతతికి చెందిన మంగేష్ ఘోగ్రే నవీ ముంబై కేంద్రంగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేసేవారు. తాజాగా, మంగేష్ ఈ ఐన్‌స్టీన్ వీసాను దక్కించుకున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేస్తూనే క్రాస్ వర్డ్‌లను (ఫజిల్)పూరించడంలో ప్రావిణ్యం సంపాదించారు. మంగేష్ ఘోగ్రే రూపొందించిన ఫజిల్స్ అంతర్జాతీయ మీడియా సంస్థలైన న్యూయార్క్ టైమ్స్, ది వాషింస్టన్ పోస్ట్, ది వాల్ స్ట్రీట్ జర్నల్స్లు ప్రచురితమయ్యాయి. ఇటీవల, అమెరికన్ రైటర్ బ్రెండన్ ఎమ్మెట్ క్విగ్లీతో కలిసి న్యూయార్క్ టైమ్స్‌లో క్రాస్‌వర్డ్ రూపొందించారు. తాజ్ మహల్ ఫజిల్‌లో క్రియేట్ చేయడంతో హైలెట్‌గా నిలిచారు. దీనిని స్వాతంత్ర్య దినోత్సవం తర్వాత రోజు అంటే ఆగస్ట్ 16,2016న న్యూయార్క్ టైమ్స్ దీనిని ప్రచురించింది. అందుకే ఆ ఘనత న్యూయార్క్ టైమ్స్ క్రాస్‌వర్డ్ కాలమ్‌లో భారతీయుడు కనిపించడం చాలా అరుదు. దాన్ని ఇప్పుడు ఘోగ్రే అధిగమించాడు. మహాత్మా గాంధీ, భారతీయ చిహ్నాలకు నివాళులర్పించే పజిల్స్‌ను సృష్టించారు. ఫలితంగా ఈ ఐన్‌స్టీన్ వీసాను దక్కించుకున్నాడు. ఐన్ స్టీన్ వీసా అంటే? ఐన్‌స్టీన్‌ను ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమిగ్రేషన్ (ఈబీ-1) వీసా అని అంటారు. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ పోర్టల్ ఈబీ-1 వీసా వివరాల ప్రకారం.. సైన్స్, ఆర్ట్స్, ఎడ్యుకేషన్, బిజినెస్, అథ్లెట్ వంటి రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిపుణులై ఉండాలి. ఐన్ స్టీన్ ఈ వీసాతో అమెరికాలో అడుగు పెట్టారు. అందుకే దీన్ని ఐన్ స్టీన్ వీసా అంటారు. చదవండి👉 చంద్రయాన్-3 విజయం, భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు? -
అమెరికా వర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా?
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో విద్యాభ్యాసంకోసం వెళ్లాలనుకునే విద్యార్థుల కోసం యూఎస్ కాన్సులేట్ పలు సూచనలు చేసింది. అమెరికాలో చదువు, ఆపై ఉద్యోగం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతీ సంవత్సరం వేలాది మంది విద్యార్థులు వెళ్తున్న విషయం విదితమే. అమెరికా వెళ్లే విద్యార్థులు ఆయా యూనివర్సిటీల్లో అడ్మిషన్లు ఎలా పొందాలి? యూనివర్సిటీల ఎంపిక ఎలా? వీసా దరఖాస్తు ఎలా చేసుకోవాలి? వీసా ఇంటర్వ్యూలకు ఎలా సన్నద్ధం కావాలన్న అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ‘సాక్షి టీవీ, సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్, నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి, యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్రాంతీయ అధికారి సుజనా మైరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లార్సెన్ మాట్లాడుతూ, అమెరికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వారిలో తెలుగువారు కూడా ఉన్నారని, అమెరికాలో చదువుకుని స్థిరపడే వారి సంఖ్య ప్రతీయేటా పెరుగుతోందని ఆమె వివరించారు. వీసాల మంజూరులో... యూఎస్ వెళ్లే వారికి వీసా మంజూరులో ఆలస్యమవుతోందన్న ప్రశ్నకు నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా చీఫ్ ఎమ్మి సమాధానమిస్తూ వీసాల జారీని సులభతరం చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా వారికి అనుకున్న సమయంలోనే వీసా ప్రక్రియను పూర్తి చేస్తున్నామని చెప్పారు. స్లాట్లు విడుదలకాగానే బుక్ చేసుకోవాలని, వీసాకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ధ్రువపత్రాలు చెక్ చేసిన తర్వాత, ఫింగర్‌ప్రింట్స్‌ను నమోదు చేసి, అన్ని సక్రమంగా ఉన్నాయని చెక్ చేసిన వెంటనే వీసాను మంజూరు చేస్తున్నామని వివరించారు. వీసా స్లాట్ల బుకింగ్ కోసం విద్యార్థులు ఇబ్బందులు పడుతుండటంపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా నాలుగు యూఎస్ కాన్సులేట్స్‌లో అందుబాటులో ఉన్న స్లాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలని చెప్పారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్.. అమెరికాలో చదవాలనే విద్యార్థులకు ఉచితంగా ‘స్టడీ ఇన్‌ద యూఎస్ యూనివర్సిటీ ఫెయిర్’ నిర్వహిస్తున్నట్లు యూఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ రీజనల్ ఆఫీసర్ సుజనా మైరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని నొవాటెల్ కన్వెన్షన్‌లో ఆగస్ట్ 26 ఉదయం 10 నుంచి 1 గంట వరకు ఫెయిర్ నిర్వహిస్తామని, విద్యార్థుల అనుమానాలన్నింటినీ ఉచితంగా నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. మరిన్ని వివరాలకు డబ్లు్యడబ్లు్యడబ్లు్య.యూఎస్ఐఈఎఫ్.ఓఆర్జీ.ఐ వెబ్సైట్ సందర్శించాలని సూచించారు. అమెరికాలో 4,700 యూనివర్సిటీలు ఉన్నాయని, ఈనెల 26న నిర్వహించే ఫెయిర్‌కు 40 ప్రముఖ యూనివర్సిటీల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రశ్నలకు యూనివర్సిటీ ప్రతినిధులు సమాధానమిస్తారన్నారు. ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా కనుక్కోవాలి? ఫేక్ యూనివర్సిటీల వివరాలు ఎలా తెలుసుకోవాలి అన్న ప్రశ్నకు సుజనా సమాదానమిస్తూ... అమెరికా ప్రభుత్వం ఆ దేశంలోని యూనివర్సిటీల వివరాలను అధికారికంగా వెబ్సైట్లలో ఉంచుతుందని చెప్పారు. జాయిన్ కావాలనుకున్న యూనివర్సిటీ వివరాలు వెబ్సైట్లో ఉన్నాయో లేదో విద్యార్థులు చెక్ చేసుకోవాలన్నారు. విద్యకు సంబంధించి అమెరికాకు చెందిన 8 కేంద్రాలు ఇండియాలో ఉన్నాయని.. వీటిలో సంప్రదించినా గుర్తింపు పొందిన యూనివర్సిటీల వివరాలు తెలుసుకోవచ్చన్నారు. -
వీసా లేకుండానే 57 దేశాలకు!
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. – సాక్షి, అమరావతి -
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఇదే!
ప్రపంచమంతా చుట్టి రావాలని ప్లాన్ చేసుకుంటున్నారా? ఇందుకోసం వీసా అనుమతి కోరుతున్నారా? మీకు సింగపూర్ పాస్ట్‌పోర్ట్ ఉంటే చాలు వీసా లేకుండా ప్రపంచంలోని 227 దేశాల్లో 192 దేశాల్ని చుట్టి రావొచ్చు. ఈ మేరకు హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ అనే సంస్థ తాజాగా 2023లో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాను విడుదల చేసింది. అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం (IATA) నుంచి సేకరించిన డేటా ఆధారంగా హెన్లీ సంస్థ 199 దేశాలతో కూడిన జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో ప్రపంచంలోనే శక్తివంతమైన పాస్‌పోర్ట్ జాబితాలో సింగపూర్ తొలిస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ పాస్‌పోర్ట్‌లు ఉన్నాయి. ఆసక్తికరంగా, గత ఐదేళ్లుగా పవర్ఫుల్ పాస్ పోర్ట్‌ల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న జపాన్ మూడవ స్థానానికి దిగజారింది. పదేళ్ల క్రితం శక్తివంతమైన పాస్‌పోర్ట్‌లలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. కాలక్రమేణా ఆ పాస్‌పోర్ట్ స్థానం మరింత దిగజారుతూ వచ్చింది. 2017లో ఏకంగా రెండవ స్థానం నుంచి నాలుగవ స్థానానికి పడిపోయింది. పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితా హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాను విడుదల చేసింది. అందులో సింగపూర్ తొలిస్థానంలో ఉండగా జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌కు 2వ స్థానం, ఆస్ట్రియా, ఫిన్‌ల్యాండ్, ఫ్రాన్స్, జపాన్, లక్సెమ్‌బర్గ్, సౌత్ కొరియా, స్వీడన్‌కు 3వ స్థానం, డెన్మార్క్,ఐర్లాండ్,నెదర్లాండ్, యూకేలు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి. పరోక్షంగా చైనానే కారణమా? చైనాలో భౌగోళిక రాజకీయ అంశాల కారంగా డ్రాగన్ కంట్రీలో ప్రైవేట్ సంస్థలు ఆర్ధికంగా కుదేలవుతున్నాయి. దీంతో వ్యాపారస్థులు, సామాన్యులు సింగపూర్‌కు వలస వెళ్లారు. మరోవైపు ఆర్ధికంగా పుంజుకోవడం వంటి అంశాలు సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అంత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌గా అవతరించేందుకు దోహదపడినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. చదవండి👉 రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. అదే నిజమైతే బడ్జెట్ ధరలో లగ్జరీ ప్రయాణం! -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? కచ్చితంగా ఇవి తెలుసుకోండి!
చక్రవర్తి (40) ఐటీ టెక్నికల్ మేనేజర్. శుభ్ర (32) ఐటీ బిజినెస్ అనలిస్ట్. ఈ దంపతులు మెరుగైన ఉద్యోగ అవకాశాల కోసం, నాణ్యమైన జీవితం కోరుకుంటూ 2019లో విదేశానికి వెళ్లిపోయి స్థిరపడాలని నిర్ణయించుకున్నారు. కెనడా శాశ్వత నివాస హోదా కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరికి 2022 మార్చిలో వీరు టొరంటోకు వెళ్లిపోయారు. ఇదొక్క ఉదాహరణ మాత్రమే. విద్యార్థులు ఉన్నత విద్య పేరుతో వెళ్లి, కోర్సు ముగిసిన అనంతరం అక్కడే అవకాశాలు వెతుక్కుని స్థిరపడుతున్నారు. ఇక్కడ కెరీర్ మొదలు పెట్టిన వారు కూడా విదేశీ అవకాశాల కోసం అన్వేíÙస్తున్నారు. కానీ, వలసపోవడం అంత సులభ ప్రక్రియ కాదు. దానికి చాలా సమయం తీసుకుంటుంది. అనుకున్న గడువు కంటే ముందుగా ఆరంభించాలి. దీనికి ఎన్నో పత్రాలు సమరి్పంచాలి. ముందస్తు ప్రణాళిక మేరకు నడుచుకుంటే అనుకున్న విధంగా విదేశీయానం సుఖవంతమవుతుంది. ఈ దిశగా ఆలోచన చేసే వారు నిపుణుల సూచనలు తెలుసుకోవడం వల్ల మెరుగైన ప్రణాళిక వేసుకోవడం సాధ్యపడుతుంది. ‘ప్యూ రీసెర్చ్’ అధ్యయనం ప్రకారం ప్రపంచ దేశాల్లో ఉద్యోగ వలసలు భారత్ నుంచే ఎక్కువగా ఉంటున్నాయి. ‘‘2020లో 1.79 కోట్ల మంది అంతర్జాతీయ వలసవాదుల మూలాలు భారత్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత 1.12 కోట్ల మంది మెక్సికో, 1.08 కోట్ల మంది రష్యా మూలాలు కలిగి ఉన్నారు’’అని ‘ప్యూ రీసెర్చ్’ నివేదిక వెల్లడించింది. మన దేశం నుంచి ఏటా లక్షల సంఖ్యలో విదేశాలకు వలస పోతున్నట్టు ఈ నివేదికలోని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ‘‘విదేశీయాన ప్రక్రియను ముందుగా ప్రారంభించాలి. అప్పుడు అది సులభతరం అవుతుంది. ఏదైనా ఊహించని ఘటన ఎదురైనా ఎదురుకావచ్చు. మరో ఆరు నెలల్లో వెళ్లాలని అనుకుంటే ఇప్పుడే ఆ ప్రక్రి యను ప్రారంభించాలి’’అనిక్యానమ్ ఎంటర్ప్రైజెస్ సీఈవో క్యాలబ్రెస్ సూచించారు. క్యానమ్ అనేది న్యూయార్క్‌కు చెందిన బహుళజాతి పెట్టుబడుల నిర్వహణ సంస్థ. వివరాలతో సరైన ప్రణాళిక ఎలా..? చక్రవర్తి, శుభ్ర 2019లో కెనడా వెళ్లాలని ప్లాన్ చేసుకోగా, 2020లో కరోనా రాకతో ఆలస్యం అయింది. కాకపోతే భారత్‌లో వారు పనిచేస్తున్న కంపెనీయే ఇద్దరు బదిలీకి ఏర్పాట్లు చేయడంతో ఆలస్యమైనా సాఫీగా విదేశానికి తరలిపోయారు. కానీ, ప్రతి ఒక్కరికీ ఇలా జరగాలని లేదు. ‘‘కొందరు విద్యార్థులుగానే విదేశాలకు వెళ్లి గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే ఉద్యోగంలో చేరిపోతారు. కొందరు స్వదేశంలోనే విద్య పూర్తి చేసుకుని నిపుణులుగా తర్వాత విదేశీ ఉద్యోగానికి వెళ్లిపోతుంటారు. కొందరు వ్యాపారవేత్తలుగా వెళ్లి వ్యాపారాలు ప్రారంభిస్తుంటారు. చివరిగా పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా విదేశీ పౌరసత్వం సొంతం చేసుకోవచ్చు’’అని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన గ్లోబల్‌గేట్ గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్ అభినవ్ లోహియా వివరించారు. విదేశంలో ఉద్యోగం సంపాదించి వలసపోవడం అన్నింటిలోకి ప్రముఖమైనది. ‘ఎక్స్‌పాట్ ఇన్సైడర్ 2021’ సర్వే ప్రకారం విదేశాల్లో పనిచేస్తున్న 59 శాతం మంది భారతీయులు కెరీర్లో మెరుగైన అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లినవారే. అంతర్జాతీయంగా ఈ రేటు 47 శాతంగానే ఉంది. ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో 23 శాతం మంది సొంతంగా ఉద్యోగాన్ని వెతుక్కోగా, 19 శాతం మందిని అంతర్జాతీయ సంస్థలు సొంతంగా నియమించుకున్నాయి. 14 శాతం మందిని వారి సంస్థలే పంపించాయి. కేవలం 3 శాతం మంది వ్యాపారం పేరుతో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. బ్రిటన్ను తీసుకుంటే భారత్ నుంచి ఎక్కువమంది స్కిల్డ్ వర్కర్ వీసా ద్వారానే అక్కడికి వెళుతున్నారు. 2022లో భారతీయులు 1,03,000 యూకే వీసాలను సొంతం చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 148 శాతం ఎక్కువ. 2022లో యూకే జారీ చేసిన వర్కర్ వీసాల్లో 46 శాతం భారతీయులకే దక్కాయి. జాబ్ ఆఫర్ ఉన్న వారికే స్కిల్డ్ వర్కర్ వీసా జారీ చేస్తారు. అభ్యర్థులకు ఇంగ్లిష్ ప్రావీణ్యం కూడా ఉండాలి’’అని ఏవై అండ్ జే అసోసియేట్స్ డైరెక్టర్ యాష్ దుబాల్ తెలిపారు. స్టూడెంట్ వీసా ద్వారా విదేశాలకు వెళ్లడం మరో మార్గం. ఇది పరోక్ష మార్గం కిందకు వస్తుంది. సాధారణంగా స్టూడెంట్ వీసా గడువు పూర్తయిన తర్వాత, విద్యార్థులు ఏడాది గడువుతో కూడిన విజిట్ పాస్ పొందొచ్చు. ఈ కాలంలో ఉద్యోగం వెతుక్కోవచ్చు. ఉద్యోగం పొందిన ఆరు నుంచి రెండేళ్ల అనంతరం (వివిధ దేశాల్లో వివిధ కాల వ్యవధి) శాశ్వత నివాస హోదా పొందొచ్చు. స్టూడెంట్ వీసా ఖర్చు అన్నది వివిధ దేశాల మధ్య మారిపోతుంటుంది. కొన్ని దేశాల్లో పౌరసత్వం కొనుగోలు చేసుకోవడం మరొక మార్గం. పరిమితి మేరకు పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈబీ–5 వీసా తీసుకోవచ్చు. అమెరికాలో ఈబీ–5 వీసా కోసం యునైటెడ్ స్టేట్స్ సిటిజన్íÙప్ సర్వీస్ ప్రాయోజిత ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. అమెరికాకు స్వల్ప వ్యవధిలోనే పౌరసత్వం ద్వారా వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం ఇది. విద్యార్థులు అయితే యూనివర్సిటీ ర్యాంకింగులు చూడాలి. కెరీర్ వృద్ధి, ఉద్యోగ స్థిరత్వాన్ని పరిశీలించాలి. వ్యాపారం ప్రారంభించేందుకు వెళ్లేవారు ముందే విజయావకాశాలను అంచనా వేసుకోవాలి. వ్యయాలు చూడాలి.. ఏ దేశానికి, ఏ రూపంలో వెళ్లాలనే దాని ఆధారంగా ఖర్చు మారిపోతుంది. ఓ కంపెనీలో పనిచేసే నిపుణుడు అదే కంపెనీ ఉద్యోగిగా వేరే దేశానికి వెళ్లేట్టు అయితే టికెట్, రవాణా చార్జీలను పెట్టుకుంటే చాలు. ఇమిగ్రేషన్ చార్జీలను కంపెనీలే భరిస్తాయి. వీసా, లీగల్ ఫీజు వంటి ఇతర వ్యయాలు కూడా ఉంటాయి. ‘‘నా స్నేహితులు కొందరు ఉద్యోగం కోసం ఇక్కడకు (కెనడాకు) వచ్చారు. తగిన ఉద్యోగం వెతుక్కునేందుకు కొన్ని నెలల పాటు ఇక్కడ ఉండాల్సి వచి్చంది. ఇక్కడ అద్దెలు చాలా ఎక్కువ. కనుక ఇక్కడకు వచ్చే వారు ముందుగానే ఈ ఖర్చుల గురించి తెలుసుకోవాలి. అందుకు సరిపడా బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసుకుని రావాలి. తమ ఖర్చులకు సరిపడా డబ్బులున్నట్టు ఆధారాలు కూడా చూపించాలి’’అని శుభ్ర తెలిపారు. కెనడాకు వెళ్లాలంటే ఒక వ్యక్తికి ఎంతలేదన్నా 15,500 కెనడియన్ డాలర్లు కావాలి. అదే దంపతులకు అయితే 21,000 డాలర్లు, పిల్లలతో వెళ్లాలంటే 30,000 డాలర్లు అవసరమవుతాయి. అమెరికాకు వెళ్లాంటే గ్రీన్ కార్డ్ కోసం కనీసం 1.8 మిలియన్ డాలర్ల పెట్టుబడి అవసరం అవుతుంది. అదే ఆ్రస్టేలియాకు వెళ్లాలంటే నలుగురు సభ్యుల కుటుంబానికి 30,000 నుంచి 40,000 ఆ్రస్టేలియన్ డాలర్లు కావాలి. ‘‘ఈబీ–5 వీసా కోసం పెట్టుబడి వేర్వేరుగా ఉంటుంది. అమెరికా అయితే ఈబీ–5 వీసా ఖర్చు 8 లక్షల డాలర్లు. కెనడా అయితే 12 లక్షల కెనడియన్ డాలర్లు. ఈబీ–5 వీసాకు ముందు లోతైన పరిశీలన ఉంటుంది. సంబంధిత వ్యక్తి చేసే పెట్టుబడులకు మూలాలు, ఎంత మందికి ఉపాధి కలి్పస్తున్నారన్నది చూస్తారు. దీనికి అదనంగా అమెరికాలో పరిపాలనా, న్యాయపరమైన చార్జీలు 75,000 డాలర్లు అవుతాయి. అటార్నీ ఫీజులు 10,000–20,000 డాలర్లు పెట్టుకోవాలి. అదే యూకే అయితే స్కిల్డ్ వర్కర్ వీసా కోసం దరఖాస్తు ఫీజు 625 నుంచి 1,423 బ్రిటిష్ పౌండ్లు ఉంటుంది. హెల్త్‌కేర్ సర్‌చార్జీ మరో 624 బ్రిటిష్ పౌండ్ల వరకు ఉంటుంది. కస్టమ్స్ డ్యూటీ, హోటల్ తదితర చార్జీలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. వెళ్లే ముందుగా.. ‘‘విదేశానికి వలస వెళ్లే వరకు రెండు దేశాల కరెన్సీని దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే కొత్త దేశానికి వెళ్లి సెటిల్ అవ్వడానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. నివసించే దేశానికి సంబంధించి పన్ను నిబంధనలు, పౌర చట్టాల గురించి తెలుసుకోవాలి. విదేశాల్లో నివాస ప్రమాణాలు చాలా ఎక్కువ. కనుక తగినన్ని నిధులు సిద్ధం చేసుకుని వెళ్లాలి. పెద్ద మొత్తంలో ఖర్చులు ఎదురుకావచ్చు’’ అని ఎప్సిలాన్ మనీ మార్ట్ ప్రొడక్ట్స్ హెడ్ నితిన్ రావు సూచించారు. ఇక బీమా తీసుకోవడం కూడా మర్చిపోవద్దు. చాలా దేశాల్లో దీన్ని తీసుకోవడం తప్పనిసరిగా అమల్లో ఉంది. తీసుకునే బీమాలో వేటికి కవరేజీ ఉంది, లేనిదీ తెలుసుకోవాలి. విదేశాలకు వెళ్లిన తర్వాత భారత్‌లో కేవైసీల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దేశీయంగా పెట్టుబడులు కలిగిన ఆరి్థక సంస్థలకు విదేశాల్లోని చిరునామా ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా హోదా మార్చుకోవాలి. అప్పుడు స్వదేశంలో పెట్టుబడులు, పన్నుల బాధ్యతలు కొనసాగించుకోవచ్చు. విదేశాలకు తరలిపోయే వారు స్వదేశంలో విలువ తరిగిపోయే ఆస్తులను వదిలించుకుని వెళ్లడమే సరైనది. విలువ పెరిగే రియల్ ఎస్టేట్ వంటి ఆస్తులు ఉంటే వాటి సంరక్షణ బాధ్యతలను ఎవరో ఒకరు చూసేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా అన్ని అంశాలను సమగ్రంగా తెలుసుకుని, అన్నీ విచారించుకుని, తగిన ప్రణాళికతో బయల్దేరితే విదేశీయానం సుఖవంతమవుతుంది. -
అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!
న్యూఢిల్లీ: అమెరికాలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో వీలైనన్ని వీసా దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా దౌత్య వర్గాలు తీవ్రంగా కృష్టి చేస్తున్నాయని అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ గురువారం ప్రకటించారు. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) ప్రధాని అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాబోయే పర్యటనలో దౌత్యం, ఇమ్మిగ్రేషన్ వీసా సమస్యలకు సంబంధించి అమెరికా నుంచి ఇండియా ఏమి ఆశించవచ్చనే ప్రశ్నకు సమాధామిచ్చిన మాథ్యూ మిల్లర్ వీసా సమస్యల పరిష్కారానికే తమ తొలి ప్రాధాన్యత అని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని కూడా వ్యాఖ్యానించారు. (స్టన్నింగ్ డ్రెస్‌తో మెస్మరైజ్ చేసిందిగా: ధరెంతో తెలిస్తే ఔరా అంటారు!) భారత్‌తో అమెరికా భాగస్వామ్యం ఇరు దేశాలకు కీలకమని, ఉమ్మడి లక్ష్యాల దిశగా అమెరికా, భారత్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకమైన వీసాలకు సంబంధించి, తమ కాన్సులర్ బృందాలు అనేక వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేయడానికి భారీ ప్రయత్నాలే చేస్తున్నాయన్నారు. జూన్ 21-24 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్న విషయం తెలిసిందే.\ మరిన్ని ఇంట్రస్టింగ్ వార్తలు, బిజినెస్ అప్డేట్స్ కోసం చదవండి సాక్షిబిజినెస్ -
చైనా ఇది తగునా.. భారత్ విషయంలో మరో చెత్త నిర్ణయం!
బీజింగ్: డ్రాగన్ దేశం చైనా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలో ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్టు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని తాజాగా చైనా ఆదేశాలు జారీ చేసింది. దీని కోసం ఈ నెల చివరి వరకు గడువు ఇచ్చినట్లు సమాచారం. దీంతో చైనాలో ఇప్పటివరకు ఉన్న ఒకే ఒక్క భారత మీడియా ప్రతినిధి కూడా అక్కడ నుంచి రావాల్సి ఉంటుంది. వివరాల ప్రకారం.. ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్ ఒకరు చైనాలో ఉన్నారు. అయితే, భారత జర్నలిస్టుల వీసా రెన్యూవల్ చేసేందుకు చైనా ప్రభుత్వం నిరాకరించింది. చైనాలో ఈ ఏడాది మొదటివరకు పలు భారత మీడియా సంస్థల నుంచి నలుగురు జర్నలిస్టులు విధులు నిర్వహించారు. హిందుస్థాన్ టైమ్స్‌కు చెందిన ఓ రిపోర్టర్ గత ఆదివారమే చైనా వదిలి వచ్చేశారు. దూరదర్శన్, ద హిందూకు చెందిన రిపోర్టర్లను ఏప్రిల్‌లోనే పంపించేశారు. ఇక, మిగిలిన పీటీఐ రిపోర్టర్‌ను కూడా చైనా ఇంటికి పంపించనుంది. కాగా, దీనిపై ఇరుదేశాల విదేశాంగ శాఖల నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు. మరోవైపు.. విదేశీ మీడియా ప్రతినిధులకు సంబంధించి చైనా కండీషన్స్ పెడుతోంది. అయితే, జర్నలిస్టుల వీసాకు సంబంధించి భారత ప్రభుత్వం గత నెలలో ఓ ప్రకటన చేసింది. భారత్‌లో పనిచేసే చైనా జర్నలిస్టులకు ఎటువంటి ఆటంకాలు లేనప్పటికీ.. చైనాలో భారత జర్నలిస్టులకు మాత్రం ఇలాంటి వెసులుబాటు లేదని పేర్కొంది. ఇక, లడాఖ్, సిక్కిం వద్ద జరిగిన ఘర్షణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. సరిహద్దు విషయంలో కొంతకాలంగా ప్రతిష్టంభన కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టులకు వీసా రెన్యువల్ చేయలేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: విషాదం: మాజీ ప్రధాని కన్నుమూత -
వీసా ప్రక్రియను సరళతరం చేయండి.. ప్రభుత్వానికి ఫిక్కీ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చే దిశగా వీసా ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేయాలని, యూజర్లకు సులభతరంగా ఉండేలా చూడాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ పేర్కొంది. అలాగే భారత్ వచ్చే టూరిస్టుల్లో భద్రతపరమైన ఆందోళనలను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ నాంగియా ఆండర్సన్‌తో కలిసి రూపొందించిన నివేదికలో ఫిక్కీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఈ రిపోర్టు ప్రకారం 2022 – 2027 మధ్య కాలంలో భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా 12 శాతం పెరగనుంది. ఇతరత్రా అవసరాలపై వెచ్చించగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, మధ్య తరగతి జనాభా వృద్ధి చెందుతుండటం, పర్యాటకానికి గమ్యస్థానంగా భారత్ గుర్తింపు పొందుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. మహమ్మారిపరమైన సవాళ్లు తలెత్తినప్పటికీ 2022లో భారత్‌కు 62 లక్షల మంది విదేశీ టూరిస్టులు వచ్చారు. ఇది 2021లో వచ్చిన 15.2 లక్షల మందితో పోలిస్తే దాదాపు 307 శాతం అధికం. 2022లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ట్రావెల్, టూరిజం రంగం వాటా 9.2 శాతంగా నిల్చింది. 4.46 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. పర్యాటకుల దృష్టికోణంలో భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అమలు చేయతగిన విధానాలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడగలదని నాంగియా ఆండర్సన్ మేనేజింగ్ పార్ట్నర్ సూరజ్ నాంగియా చెప్పారు. నివేదికలోని మరిన్ని అంశాలు .. ►వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. పర్యాటకం వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి. టెక్నాలజీని వినియోగించుకోవాలి. ►టూరిస్ట్ పోలీసుల సంఖ్యను పెంచడం ద్వారా పర్యాటకులకు భద్రతపరమైన భరోసా కల్పించాలి. టూరిస్టుల వేధింపులు, వారిపై నేరాలను కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ► భారత్‌లో ఆకర్షణీయమైన, విశిష్టమైన సాంస్కృతిక, సహజ సిద్ధ పర్యాటక స్థలాలు ఉన్నాయి. హెరిటేజ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నె స్ టూరిజం వంటివి ఆఫర్ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేయవచ్చు. ఇందుకోసం మార్కెటింగ్పరమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడం వంటి అంశాలు పరిశీలించవచ్చు. -
అమెరికాలో ఎవరు మనోళ్లు.. ఎవరు పరాయి వాళ్లు?
* మనలో మనకే ఇంత వివక్షా? * "మనోళ్లు "" మనోళ్ళని " చిన్నచూపు చూస్తారా ? (చాలా కాలంగా అమెరికాలో స్థిరపడి అక్కడి సమాజాన్ని నిశితంగా పరిశీలించిన ఒక వ్యక్తికి కౌన్సిలింగ్ ఇస్తుంటే , ఆ వ్యక్తి నాతో పంచుకొన్న సమాచారం ఇది) ఓ కుటుంబం ముప్పై అయిదేళ్ల క్రితమే అమెరికా కు వలసపోయారు. అక్కడే ఉన్నత విద్య, ఉద్యోగం, పిల్లలు. ముందుగా వీసా .. అటుపై గ్రీన్ కార్డు .. అటుపై అమెరికా పౌరసత్వం . వారి పిల్లలు అక్కడే పుట్టారు- జన్మతః అమెరికా పౌరసత్వం. మరో కుటుంబం.. వీరు ఇటీవలే అమెరికాకు వెళ్లారు . ఇంకా వీసా పైనే వున్నారు. వారికో అమ్మాయి / అబ్బాయి. వీరిని పెళ్లి చేసుకొంటారా ? పెళ్లి దాక ఎందుకు ? వారు వీరిని చిన్న చూపు చూస్తారు. దగ్గరకు కూడా రానివ్వరు. ఎందుకంటారా? వివరంగా మీరే చదవండి. ముప్పై / నలభై ఏళ్ళ క్రితం అమెరికాకు వలస పోయి, ఇప్పుడు ఆ దేశ పౌరసత్వాన్ని సాధించిన వారు మేమే గొప్ప, ఉన్నతం అనుకొంటారు. చదువుకునేందుకు లేదా ఉద్యోగం చేసేందుకు వచ్చే వారిని చిన్న చూపు చూస్తారు. ఇలాంటి వారికి తమ అబ్బాయి / అమ్మాయిని ఇవ్వడానికి ఇష్టపడరు. సంబంధాలు చేసుకోరు. పెద్ద వారికంటే, అక్కడే పుట్టి అమెరికా పౌరసత్వాన్ని జన్మతః సాధించుకొన్న రెండవ తరం వారికి జాత్యహంకార భావన చాలా ఎక్కువ . తాము" బ్రౌన్ తోలు కలిగిన శ్వేత జాతీయులు "అనుకొంటారు. అదేంటి?" బ్రౌన్ తోలు కలిగిన తెల్ల జాతివారు"? అనుకొంటున్నారా ? అవునండీ .. తమ తల్లితండ్రులు" ఆసియా నుండి వలస వచ్చారు కాబట్టి తమకు ఇంకా బ్రౌన్ స్కిన్ ఉందని .. తాము వాస్తవంగా అంటే ఆలోచనల్లో ఆంగ్లం మాట్లాడే పద్దతిలో శ్వేతజాతీయులం అని వారు నమ్ముతారు. చదవండి: భారతీయ అమెరికన్ల విలువ పెంచిన ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా ఎన్నిక వీసాపై వచ్చి అక్కడ ఉద్యోగం చేస్తున్న భారతీయులంటే వారికి చిన్న చూపు. కాలేజీలు, ఆఫీస్‌లలో ఈ బ్రౌన్ తోలు తెల్ల దొరలు , సాధారణ వీసాల వారితో కలవరు, దగ్గరకు రానివ్వరు. ఇక పెళ్లిళ్ల విషయానికి వస్తే బ్రౌన్ తోలు తెల్ల దొరలు , తమలాంటి బ్రౌన్ తోలు తెల్లదొరలనే పెళ్లి చేసుకొంటారు. వీసా వారు తక్కువ జాతివారు ; వారితో పెళ్లి సమస్యే లేదు . అక్కడి మ్యారేజ్ బ్యూరోల్లో " బ్రౌన్ తోలు తెల్ల దొరలకు" వేరే బ్యూరో .. "వీసా వారికి" వేరే బ్యూరో ఉంటుంది . నేను ఒక ప్రశ్న అడిగాను. "అదేంటి అమెరికా దేశాన్ని జాతుల సంగమ దేశంగా పిలుస్తారు కదా ? అక్కడ జాతుల పేరు చెప్పడమే తప్పు . పైగా జాతి అంతరాలు మరచి పెళ్లిళ్లు కూడా చేసుకొంటున్నారు అనుకొంటున్నారా ? అవునండీ .. అది అసలే కాపిటలిస్ట్ దేశం . ప్రతి దానికి ఒక లెక్క ఉంటుందట. ఆ దేశంలో అత్యుత్తమ జాతి ఏది ? శ్వేత జాతి కదా ? రెండో స్థానం బ్రౌన్ తోలు తెల్ల దొరలు / దొరసానులు . అంటే ఇండియా చైనా లాంటి దేశాల నుండి వలస వచ్చిన తల్లితండ్రులకు పుట్టి జన్మతః ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన వారు . ఇక అట్టడుగు స్థాయిలో ఉన్న వారు వీసాపై వచ్చి చదువుకుంటున్న వారు, ఉద్యోగాలు చేస్తున్నవారు. శ్వేత జాతి అమ్మాయి, రెండో కేటగిరీకి చెందిన వారినో పెళ్లి చేసుకుంటుందా ? మామూలుగా అయితే జరగదు కానీ.. ఒక లెక్క ప్రకారం జరిగే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా / ఇండియా మూలం కలిగిన వ్యక్తి బాగా డబ్బు సంపాదించాడు. తెల్ల అమ్మాయికి ఉద్యోగం లేదు. లేదా తక్కువ జీతం వచ్చే ఉద్యోగం . ఇప్పుడు తాను, తన జాతి పరమైన ఉన్నత స్థానాన్ని ట్రేడింగ్ చేసుకొంటుంది . స్టార్ స్టేటస్ పొందిన నల్ల / బ్రౌన్ జాతి మూలాల్ని కలిగిన యువకుడ్ని పెళ్లి చేసుకొంటే .. వీడికి తెల్ల అమ్మాయి దొరికింది అనే తృప్తి. ఆమెకు కాష్ ఫ్లో .. రేపు పెళ్లి పెటాకులు అయితే .. కావాలని పెటాకులు చేసుకొన్నా.. సగం జీతం .. ఆస్థి లో సగం . దెబ్బకు రెండు పిట్టలు . జాతులు కలిసిపోయి కొత్త తరం మానవాళి రూపొందడం ఉత్తుత్తి మాటే .. అక్కడ సరి కొత్త జాతులు వెలుస్తున్నాయి. చర్మం రంగు .. గ్రీన్ కార్డు / పొరసత్వం , శాలరీ ప్యాకేజీ వీటి ఆధారంగా సరి కొత్త జాతులు వస్తున్నాయి. ఇక్కడ ఇంకో తిరకాసు. దక్షిణ భారతీయులు కొంత లిబరల్ అట. ఉత్తర భారత దేశ మూలాలు కలిగిన వారైతే మహా ముదుర్లు అట . మనిషి ..మానవత్వం ..మట్టి.. మశానం..అన్ని ఉత్తుత్తి మాటలే .నువ్వు అమెరికన్ సిటిజానా ? లేక ఆకు పచ్చ కార్డు ? ఆకు పచ్చ కార్డు అయితే ఇక్కడ "ఎర్ర బస్సు ఎక్కి వచ్చిన జనాలు" అంటారే .. అలాగే ట్రీట్ చేస్తారట . దీనికి తోడు నీ శాలరీ ప్యాకేజీ ఏంటి ? బ్యాంకు బాలన్స్ ఎంత ? .. అక్కడితో అయిపోయిందా ? చదివింది ఎక్కడ ? నువ్వు వీసా పైన ఉన్నా.. ఐఐటీ సరుకైతే కాస్త గౌరవం . అదే చైనా కోళ్లఫారాల సరుకంటే మాహా చిన్న చూపంట.ఇలాంటి వారికి ఏదో పేర్లు వున్నాయి. ఇక్కడి మీడియాకు ఎవరైనా చెప్పండయ్యా బాబు .. " మనోళ్లు " మనోళ్లు " అని రాస్తుంటే / చెబుతుంటే ఏదో ఫీలింగ్ వస్తోంది. చివరాకరికి మనోళ్లు కేటగిరీ అయితే .. జో బిడెన్ .. బరాక్ ఒబామా .. చైనా లో ఫుట్ పాత్ పై వస్తువులు అమ్ముకొనే చున్ వన్ ఉఛ్ .. మెక్సికో నుంచి వలస వచ్చి అమెరికా ఇళ్లల్లో పని చేసుకొనే ఇసాబెల్లా .. కెరిమెన్ .. అందరూ.. అందరూ.. అందరూ మనోళ్లే . వారిది మనది హోమో సేపియన్స్ అనే ఒకటే జాతి . కానీ మనోళ్లు అనే ఫీలింగ్ లేని వారిని.. కనీస మానవ విలువలు లేని వారిని ఎగేసుకొని మనోళ్లు మనోళ్లు అనడం పరమ అసహ్యంగా ఉంటుందా ? ఉండదా ? ఇంత ఆత్మ న్యూనత.. ఇంత ఐడెంటిటీ క్రైసిస్ ఏంటో ? వాసిరెడ్డి అమర్ నాథ్, విద్యావేత్త, మానసిక పరిశోధకులు -
భారతీయులకు ఈసారి 10 లక్షలకుపైగా వీసాలు..!
వాషింగ్టన్: భారత్, అమెరికా సంబంధాలు మరింత బలపడుతున్నవేళ భారతీయుల వీసా ప్రక్రియను వేగిరం చేసి ఈ ఏడాది 10 లక్షలకుపైగా వీసాలు జారీచేస్తామని అమెరికా ఉన్నతాధికారి ఒకరు ప్రకటించారు. విద్యార్థి వీసాలకు అధిక ప్రాధాన్యతనిచ్చేందుకు బైడెన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉందని అమెరికా సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా విభాగం) డొనాల్డ్ లూ పీటీఐ వార్తాసంస్థతో చెప్పారు. ‘ వీసా ప్రాసెసింగ్ ప్రక్రియలో హెచ్–1బీ, ఎల్–వీసాలకూ తగిన ప్రాధాన్యత కల్పిస్తాం. విద్యార్థి వీసాలు, ఇమిగ్రెంట్ వీసాలుసహా మొత్తంగా ఈ ఏడాది ఏకంగా 10 లక్షలకుపైగా వీసాలను మంజూరుచేస్తాం. ఈసారి సమ్మర్ సీజన్లో అమెరికాలో విద్యనభ్యసించనున్న భారతీయ విద్యార్థుల సౌలభ్యం కోసం అన్ని స్టూడెంట్ వీసాల ప్రాసెసింగ్‌ను పూర్తిచేస్తాం’ అని చెప్పారు. బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) కేటగిరీలుసహా తొలిసారిగా వీసా కోసం దరఖాస్తుచేసుకున్న వారి అప్లికేషన్ల వెరిఫికేషన్ వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉన్న విషయం విదితమే. అమెరికాకు వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో సంఖ్య పరంగా ప్రపంచంలో భారత్ రెండోస్థానంలో ఉంది. కొన్ని చోట్ల 60 రోజుల్లోపే.. ‘హెచ్–1బీ, ఎల్ వీసాల జారీపైనా దృష్టిపెట్టాం. భారత్‌లోని కొన్ని కాన్సులేట్లలో ఈ వీసాల కోసం వేచిఉండే కాలం 60 రోజుల్లోపే. అమెరికా, భారత్ ఇరుదేశాల ఆర్థికవ్యవస్థకు ఈ వర్కింగ్ వీసాలు కీలకం. అందుకే వీటి సంగతీ చూస్తున్నాం’ అని వెల్లడించారు. ‘ పిటిషన్ ఆధారిత నాన్ఇమిగ్రెంట్ విభాగాల కింద దరఖాస్తుచేసిన వీసాదారులు తమ వీసా రెన్యువల్ కోసం మళ్లీ స్వదేశానికి వెళ్లిరావాల్సిన పనిలేకుండా అమెరికాలోనే పని పూర్తిచేసుకునేలా ఏర్పాటుచేయదలిచాం. ఇక ఆర్థిక అనిశ్చితి కారణంగా ఉద్యోగాలు కోల్పోయి 60 రోజుల్లోపు అమెరికాను వీడాల్సిన ప్రమాదం ఎదుర్కొంటున్న హెచ్–1బీ వీసాదారులకు.. అవకాశమున్న మరికొన్ని ‘వెసులుబాట్ల’ను వివరిస్తూ అదనపు సమాచారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ ఇచ్చింది’ అని వివరించారు. -
యూఏఈలో విజిట్ వీసా నిబంధనలు కఠినతరం
మోర్తాడ్(బాల్కొండ): వీసా నిబంధనల ఉల్లంఘనలను అరికట్టడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. విజిట్ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిన తర్వాత ఒక్కరోజు కూడా ఎక్కువగా ఉండడానికి వీలు లేకుండా చర్యలు చేపట్టింది. సాధారణంగా యూఏఈ 30, 60 రోజుల విజిట్ వీసాలను జారీ చేస్తుంటుంది. ఈ వీసాలపై యూఏఈకి వచ్చినవారు గడువు ముగిసిపోకముందే వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇకపై తమ దేశంలో ఒక్కరోజు ఎక్కువగా ఉన్నా నిషేధిత జాబితాలో చేరుస్తామని అక్కడి సర్కారు ప్రకటించింది. దీనివల్ల వీసా నిబంధనలు ఉల్లంఘించినవారు యూఏఈతో పాటు ఇతర గల్ఫ్ దేశాల్లో ప్రవేశానికి అనర్హులు అవుతారు. విజిట్ వీసాలపై వచ్చి యూఏఈలో చట్టవిరుద్ధంగా ఉంటున్నవారి సంఖ్యను తగ్గించుకోవడంతో పాటు ఎవరైనా చట్టబద్ధంగానే తమ దేశంలో ఉండే విధంగా యూఏఈ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది. యూఏఈలో ఉపాధి చూపిస్తామని.. తొలుత విజిట్ వీసాపై వెళ్లాక, తర్వాత వర్క్ వీసా ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్ల మాటలను నిరుద్యోగులు నమ్మవద్దని గల్ఫ్ వలస కారి్మక సంఘాల ప్రతినిధులు సూచిస్తున్నారు. -
అమెరికా వీసాకు తగ్గిన ఎదురుచూపులు
వాషింగ్టన్: అమెరికా వీసా ఇంటర్వ్యూలకు వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గిందని ఆ దేశ విదేశాంగ శాఖ డెప్యూటీ అసిస్టెంట్ (వీసా సేవలు) జూలీ స్టఫ్ వెల్లడించారు. పర్యాటక వీసా ఇంటర్వ్యూల వెయిటింగ్ 60 శాతం తగ్గిపోయిందని పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దౌత్య సేవలను పెంచినట్టు వివరించారు. కోవిడ్ ఆంక్షలు ఎత్తేశాక అమెరికా వీసాల కోసం భారత్ నుంచి దరఖాస్తులు వెల్లువెత్తడం తెలిసిందే. దాంతో బిజినెస్, టూరిస్ట్ వీసాల వెయిటింగ్ పిరియడ్ 2022 అక్టోబర్‌లో ఏకంగా 1,000 రోజులకు పెరిగింది. ఈ ఏడాది విద్యార్థి, ఉద్యోగి సహా అన్ని కేటగిరీల్లో 10 లక్షల వీసాలు జారీ చేయాలన్నది లక్ష్యమని స్టఫ్ చెప్పారు. ‘వందకు పైగా దౌత్య మిషన్ల ద్వారా భారతీయులకు వీసాలు జారీ చేస్తున్నాం. బ్యాంకాక్, ఫ్రాంక్ఫర్ట్, లండన్, అబూదాబీల్లోనూ దరఖాస్తులను ప్రాసెస్ చేస్తున్నాం. భారత్‌లో వీసాల జారీ ప్రక్రియ 40 శాతం పెరిగింంది. గత నెలలో గరిష్టాన్ని తాకింది. కొన్ని విభాగాల్లో ఇంటర్వ్యూలను ఎత్తేయడంతో ప్రాసెసింగ్ ప్రక్రియ వేగవంతమైంది. రెన్యువల్‌కు కోసం అమెరికాలోనే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాం. ఇది భారత టెకీలకు పెద్ద ఊరట’’ అని చెప్పారు. -
HYD: హైటెక్నాలజీతో యూఎస్ కాన్సులేట్.. ఖర్చు తెలిస్తే మైండ్ బ్లాంక్!
హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూఎస్ కాన్సులేట్ సేవలు నానక్‌రాంగూడలోని నూతన కార్యాలయం నుంచి మంగళవారం ప్రారంభమయ్యాయి. బేగంపేట నుంచి నానక్‌రాంగూడలో కొత్తగా నిర్మించిన కార్యాలయానికి మారిన తర్వాత పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నామని కాన్సులేట్ అధికారులు తెలిపారు. మొదటి యూఎస్ పాస్‌పోర్టును జారీచేసినట్టు ఫొటోలను కాన్సులేట్ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ఖర్చు ఎంతో తెలుసా.. అయితే, హైదరాబాద్ నగరంలో ఆసియాలోనే అతిపెద్ద, విశాలమైన అమెరికన్ కాన్సులేట్ కట్టి అగ్రరాజ్యం నిర్మించింది. దాదాపు 2800 కోట్లు(340 మిలియన్ యూఎస్ డాలర్స్) ఖర్చుతో ఆధునిక భవనాన్ని నిర్మించింది. దాదాపు 12.2 ఎకరాల విస్తీర్ణంలో హై టెక్నాలజీతో ఈ భవనాన్ని నిర్మించింది. కాగా, తెలుగు రాష్ట్రాలు, దేశం నుంచి అమెరికాకు స్టూడెంట్ వీసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓ పెద్ద ఆఫీసును నిర్మించాలని అమెరికా 2017లోనే కాన్సులేట్ భవన నిర్మాణానికి ప్లాన్ చేసింది. ఇందుకు కావాల్సిన సదుపాయాలు, డబ్బులను అమెరికా ప్రభుత్వం కేటాయించింది. కానీ, కోవిడ్ కారణం భవన నిర్మాణం కొంచెం ఆలస్యమైంది. హైదరాబాదే స్పెషల్.. ఇక, తాజాగా భవన నిర్మాణం పూర్తి కావడంతో మంగళవారం నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త కాన్సులేట్ నుంచి పాస్‌పోర్టులను కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇండియాలో ఢిల్లీలోని అమెరికన్ ఎంబసీ కాకుండా వీసా కార్యకలాపాలు, దౌత్య కార్యకలాపాల కోసం దేశవ్యాప్తంగా నాలుగు కాన్సులేట్స్ ఉన్నాయి. వీటన్నింటిలో అతిపెద్దదిగా ఇప్పుడు హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ గుర్తింపు పొందింది. వీసా కోసం.. వీసా ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మొదట హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌లోని వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ కూడా అక్కడే తీసుకుంటారు. వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూ మినహాయింపు కలిగిన వారు వీసా అప్లికేషన్ సెంటర్లో డాక్యుమెంట్స్ దాఖలు చేస్తే చాలు. ఇంటర్వ్యూ అవసరం ఉన్నవారు మరో రోజు నానాక్‌రాంగూడలోని కొత్త అమెరికన్ కాన్సులెట్ కార్యాలయానికి వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. Yesterday, @usandhyderabad opened a new state-of-the-art facility in the city’s bustling Financial District. This new Consulate chancery represents a tangible investment by the United States in growing the U.S.-India bilateral relationship. pic.twitter.com/EApWzxY3Ud — Vedant Patel (@StateDeputySpox) March 21, 2023 కాగా, కొత్త కాన్సులేట్ నుంచి తెలంగాణ, ఏపీ, ఒడిషా రాష్ట్రాలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని అమెరికన్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లారెన్స్ తెలిపారు. మరోవైపు, వాషింగ్టన్లో అమెరికన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వేదాంత్ పటేల్ స్పందిస్తూ.. కొత్త భవనాన్ని పూర్తి పర్యావరణహితంగా నిర్మిణించినట్టు స్పష్టం చేశారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి శుద్ధిచేసేలా.. మళ్లీ ఆ నీటిని తిరిగి వినియోగించుకునేలా నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. అలాగే, ఇండియా నుంచి అమెరికాలో పెట్టుబడులను కూడా ప్రోత్సహించడానికి నూతన కాన్సులేట్ దోహదపడుతుందని అన్నారు. Here’s a short video on how one can reach the Visa Application Center (VAC), located at the Lower Concourse, HITEC City Metro Station, Madhapur, HYD 500081. pic.twitter.com/hyJuhzrIBR — U.S. Consulate General Hyderabad (@USAndHyderabad) March 17, 2023 -
హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్.. ఇక వీసాల జారీ మరింత సులభతరం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ అత్యాధునిక హంగులతో నిర్మించిన సొంత భవనంలోకి మారిపోయింది. నానక్‌రామ్‌గూడలోని కొత్త, శాశ్వత అమెరికన్ కాన్సులేట్ భవనంలో సోమవారం కార్యకలాపాలు మొదలయ్యాయని కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ ప్రకటించారు. భారత్–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇదో మైలురాయి అని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. వీసాల జారీని సులభతరం చేసేందుకు ఇక్కడ అధికారుల సంఖ్య పెంచుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాకు అమెరికా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2008వ సంవత్సరంలో హైదరాబాద్‌లో తొలిసారి అమెరికన్ కాన్సులేట్ ప్రారంభం కాగా, ఇప్పటివరకూ అది బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో పనిచేసిన విషయం తెలిసిందే. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి శాశ్వత భవన నిర్మాణం కోసం నానక్‌రామ్ గూడలో సుమారు 12 ఎకరాల స్థలం కేటాయించారు. అందులోనే అమెరికా సుమారు 34 కోట్ల డాలర్ల (రూ.2,800 కోట్లు) వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించుకుంది. చిరునామా: సర్వే నంబరు 115/1, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్ గూడ, హైదరాబాద్, తెలంగాణ, 500032. ♦ అత్యవసర కాన్సులర్ సేవల కోసం (అమెరికా పౌరులైతే) +91 040 6932 8000 నంబరులో సంప్రదించవచ్చు. ♦ సాధారణ సేవల కోసం ‘‘HydACS@state.gov.’’ఐడీకి మెయిల్ చేయవచ్చు. ♦ వీసా ఇంటర్వ్యూలు నిర్దిష్ట సమయాల్లో నానక్‌రామ్ గూడలోని కొత్త కార్యాలయంలో జరుగుతాయి. ♦ వీసాలకు సంబంధించిన ఇతర సరీ్వసులు (బయోమెట్రిక్స్, అపాయింట్మెంట్స్, ‘డ్రాప్‌బాక్స్’పాస్‌పోర్ట్ పికప్, అపాయింట్మెంట్స్ (ఇంటర్వ్యూ వెయివర్)లు ♦ మాదాపూర్‌లోని హైటెక్ సిటీ మెట్రోస్టేషన్లో ఏర్పాటు చేసిన ‘వీసా అప్లికేషన్ సెంటర్’లో కొనసాగుతాయి. ♦ కాన్సులర్ సేవలకు సంబంధించిన ప్రశ్నల కోసం +91 120 4844644 లేదా +91 22 62011000 నంబర్లను సంప్రదించవచ్చు. చదవండి: 11 గంటలు .. 14 ప్రశ్నలు.. కవిత సమాధానాలు పూర్తిగా వీడియో రికార్డింగ్ -
నటి కార్తికకు దుబాయ్ ప్రభుత్వం అరుదైన గౌరవం
సీనియర్ నటి రాధ కుమార్తె కార్తిక నాయర్‌కు యుఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకుంది. దుబాయ్‌లోని ఉదయ్ సముద్ర గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, కొన్ని సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను అభివృద్థి చేయడంలో విశేషమైన పాత్ర పోషిస్తుంది కార్తిక. ఈ క్రమంలో కొన్నేళ్లగా అక్కడే స్థిరపడి యంగ్ ఎంట్రప్రెన్యూవర్‌గా గుర్తింపు పొందిన కార్తికకు గోల్డెన్ వీసా అందజేశారు. దుబాయ్‌లోని టూఫోర్ 54 ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో యుఎఇకి చెందిన హమద్ అల్మన్సూరి కార్తికకు గోల్డెన్ వీసాను అందజేశారు. ఈ సందర్భంగా కార్తీక ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ‘‘యువ మహిళా పారిశ్రామికవేత్తగా స్వాగతం పలికినందుకు యుఎఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉంది’’ అని కార్తీక నాయర్ అన్నారు. కార్తిక తల్లి రాధ గురించి పరిచయం అవసరం లేదు. 1980ల్లో ఆమె స్టార్ హీరోయిన్గా రాణించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఆమె నటించారు. నటిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలను గుర్తించి గతంలో రాధకు కూడా గోల్డెన్ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే! కేరళలోనూ ఉదయ్ సముద్ర గ్రూప్ హోటళ్లు, రిసార్టులు, కన్వెన్షన్ సెంటర్లు, విద్యా సంస్థలు ఉన్నాయి. తాజాగా తనకు లభించిన గుర్తింపుతో వ్యాపార అభివృద్ధికి మరింత సహకరిస్తానని కార్తిక తెలిపారు. -
వీసాల జారీ.. రష్యా కీలక నిర్ణయం!
రష్యా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. భారత్‌తో పాటు మరో 5 దేశాలకు చెందిన అర్హులైన పౌరులకు వీసాలను తక్షణమే జారీ చేసేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు. తద్వారా వీసాల మంజూరులో కాలయాపన జరగదని, త్వరగా వీసా పొందే వీలుకలుగుతుందని రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఇగోర్ ఇవానోవ్ (Igor Ivanov) రష్యా న్యూస్ ఏజెన్సీ టీఏఎస్ఎస్తో అన్నారు. వీసా జారీ చేసే విధానాల విషయంలో రష్యా ప్రభుత్వం భారత్‌తో పాటు అంగోలా, వియత్నాం, ఇండోనేషియా, సిరియా, ఫిలిప్పీన్స్‌లతో కలిసి పని చేస్తోంది" అని ఇవనోవ్ చెప్పారు. ఇంతకుముందు, రష్యా వీసా- ఫ్రీ ట్రిప్స్ కోసం సౌదీ అరేబియా, బార్బడోస్, హైతీ, జాంబియా, కువైట్, మలేషియా, మెక్సికో, ట్రినిడాడ్‌తో సహా 11 దేశాలతో వీసా రహిత పర్యటనలపై రష్యా అంతర్ ప్రభుత్వ ఒప్పందాలను కూడా సిద్ధం చేస్తోందని ఇవనోవ్ చెప్పారంటూ టీఏఎస్ఎస్ నివేదించింది. -
యూఎస్ వీసా: అన్నంత పని చేసిన అమెరికా, ఈ వీడియోతో దిల్ ఖుష్!
న్యూఢిల్లీ: భారతీయులకు వీసాను మరింత దగ్గరిచేసే క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీసా జారీ కోసం వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గించే చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ముంబైలో వీసా కార్యకలాపాల సహాయం నిమిత్తం అమెరికా తాత్కాలిక వీసా అధికారులను నియమించింది. ఇక్కడ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కాన్సులర్ అధికారులు పనిచేస్తున్నారని, దీన్ని ఉపయోగించుకోవాలని యుఎస్ కాన్సులేట్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలక అధికారులు తమ సాధారణ విధులను విడిచి పెట్టి మరీ ఈ విధుల్లో చేరారని ముంబైలోని యూఎస్ కాన్సులేట్ ఒక ట్వీట్లో తెలిపింది.(StudentVisa అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే న్యూస్!) వీసా వెయిటింగ్ సమయాన్ని తగ్గించేందుకు వీరంతా ఒక్కటయ్యారు అని ట్వీట్ చేసిది. దీనికి సంబంధించి ముంబైలో వీసా కాన్సులర్ ఆఫీసులో ఉన్న టాప్ అధికారుల బృందంతో ఒక వీడియోను షేర్ చేసింది. వాషింగ్టన్ డీసీ, జపాన్‌లోని ఒకినావా , హాంకాంగ్ నుంచి ఎంపిక చేసిన నలుగురు అధికారులను ఈ వీడియోలో చూడొచ్చు. వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయాన్ని తగ్గించి, అమెరికా ప్రయాణాన్ని సులభం చేయడం, భారతదేశం-యుఎస్ వ్యాపార అవకాశాలను పెంపు, కుటుంబ పునరేకీకరణ లాంటి సమస్యల పరిష్కారానికి మద్దతు వంటి బాధ్యతలను ఈ అధికారులకు అప్పగించారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయనున్నామని గతంలో యూఎస్ సర్కార్ ప్రకటించింది. అలాగే అమెరికాలో చదువు కోవాలనుకునే విద్యార్థులకు ఏడాది ముందుగానే వీసాకోసం దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలిపింది. All hands on deck to reduce visa wait times! Our incredible team of consular officers have temporarily left their regular duties around the world, from @StateDept in D.C. to the @USConsulateNaha, to help out with visa operations in Mumbai. Together, we are #HereToServe. pic.twitter.com/T2MpNp8Mb5 — U.S. Consulate Mumbai (@USAndMumbai) February 28, 2023 -
మీరేంటో ఇట్టే చెప్పేయొచ్చు.. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా ప్రొఫైల్ బాగుందా!?
ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కండక్ట్ సర్టిఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు. ♦ సుదీప్ బీటెక్ పూర్తి చేశాడు. అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ సీటు వచ్చింది. వీసా కోసం నిరీక్షిస్తుండగా వీసా రిజెక్ట్ అని మెసేజ్ వచ్చింది..అన్నీ సక్రమంగానే ఉన్నా వీసా ఎందుకు రిజెక్ట్ అయ్యిందో సుదీప్‌కు అర్థంకాలేదు. ♦ ఉన్నత విద్యావంతురాలైన శ్రీవిద్యకు మాట్రిమొనీ వెబ్సైట్లో ఓ ఎన్ఆర్ఐ సంబంధం రావడంతో ఆమె తండ్రి ఉబ్బితబ్బిబయ్యాడు. కానీ అంతలోనే ‘మీ సంబంధం వద్దని మా అబ్బాయి అంటున్నాడు’ అని పెళ్లికొడుకు తండ్రి. కారణం చెప్పకుండానే ఫోన్ కట్ చేశాడు. ♦ ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న వినీష్కు మరో కంపెనీలో మంచి పొజిషన్, జీతం పెంపుతో ఆఫర్ వచ్చింది. దేశాల్లోని ఆన్సైట్ ప్రాజెక్టుకు ఎంపికయ్యాడు. కానీ వారం తర్వాత ఆఫర్ లెటర్ రిజెక్ట్ అయినట్లు అతనికి ఈ–మెయిల్ వచ్చింది. ♦ సుదీప్‌కు వీసా రాకపోవడానికి... శ్రీవిద్య పెళ్లి సంబంధం చెడిపోవడానికి... వినీష్ జాబ్ ఆఫర్ రిజెక్ట్ కావడానికి కారణం ఒక్కటే ...వారి సోషల్ ప్రొఫైల్ బాగోలేకపోవడం. ఆకతాయి చేష్టలతో ఆన్లైన్లో వారు పెట్టిన కామెంట్లు, ఫొటోలు, వీడియోలు, ఇతర పోస్ట్‌లు ఇప్పుడు వారి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. సోషల్ ఫ్రొఫైలింగ్‌తో వారంతా చిక్కుల్లో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే స్నేహితులు, చుట్టాలను, చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకొనేవాళ్లు. స్కూల్, కాలేజీల్లో ఇచ్చే కాండక్ట్ సరి్టఫికెట్లను చూసేవాళ్లు. పెళ్లంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల గురించి వాకబు చేసేవారు. కానీ ఇప్పుడు సాంకేతిక యుగంలో నిమిషాల్లోనే మన ప్రవర్తనను అంచనా వేస్తున్నారు. దీన్నే సోషల్ ప్రొఫైలింగ్ అంటారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ ఇలా అనేక సోషల్ మీడియా ఖాతాల ద్వారా మనం నిత్యం ఏదో ఒక సమాచారం పంచుకుంటూనే ఉంటాం. అందులో ఒక వ్యక్తి పెట్టే కామెంట్లు, చేసే పోస్ట్‌లు, ఫొటోలు పంచుకునే భావాలను అంచనా వేసి ఆ వ్యక్తి గురించి అంచనా వేయడమే సోషల్ ప్రొఫైలింగ్. విద్యార్థులు హద్దు దాటితే కష్టమే.. సోషల్ మీడయా యాప్‌లలో యువత, విద్యార్థులు గంటల తరబడి చాటింగ్‌లు, మీటింగ్‌లలో కొందరు హద్దు దాటుతున్నారు. ఎదుటి వారిని కించపర్చేలా వ్యాఖ్యలు పోస్టు చేస్తున్నారు. ఇంకొందరు తోటి విద్యార్థులను సైబర్ బుల్లీయింగ్ (తప్పుడు వ్యాఖ్యలతో వేధించడం) చేస్తున్నారు. మరికొందరు రాజకీయపరమైన వ్యాఖ్యలు, మతపరమైన వివాదాస్పద కామెంట్లు పెడుతున్నారు. ఇవే చిక్కులు తెచి్చపెడుతున్నాయి. యూకే, కెనడా, అమెరికా లేదా ఇతర దేశాలకు వెళ్లాలనుకొనే వారి సోషల్ మీడియా ఖాతాలను ఆయా దేశాల ఎంబసీలు పరిశీలించి వీసాల జారీలో వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటాయన్న విషయాన్ని మరుస్తున్నారు. ఉద్యోగులకు జాగ్రత్త తప్పదు.. ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సైతం సోషల్ మీడియా వాడకంలో సంయమనం పాటించకపోతే చిక్కులు తప్పవు. మతం, ప్రాంతం, కులాన్ని కించపర్చేలా పోస్టులు పెడితే అవి కెరీర్‌పరంగా ఎదిగేందుకు అడ్డంకిగా మారొచ్చు. ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖలో పనిచేసే ఓ టైపిస్ట్ కొంత బడ్జెట్ సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టాడన్న కారణంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు. డిజిటల్ ఫుట్‌ప్రింట్ మనమే ఇస్తున్నాం.. సోషల్ మీడియాలో మన వ్యక్తిగత వివరాలను, చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, స్నేహితులు ఎవరు, ఎక్కడికి తరచూ వెళుతుంటాం తదితర అంశాలను నిత్యం షేర్ చేస్తున్నాం. సోషల్ ప్రొఫైలింగ్‌కు కారణమయ్యే ఈ సమాచారాన్నే డిజిటల్ పుట్‌ప్రింట్స్ ఆన్ సోషల్ మీడియా అని అంటారు. హనీట్రాప్‌లలో చిక్కే ప్రమాదం... ఏదైనా కంపెనీ లేదా కీలక ప్రభుత్వరంగ సంస్థల్లోని కొందరు ఉద్యోగులను హనీట్రాప్ (వలపు వల) ద్వారా అ«దీనంలోకి తెచ్చుకొని సమాచారం రాబట్టేందుకు సైతం వారి సోషల్ ప్రొఫైలింగే కీలకం అవుతోంది. సదరు వ్యక్తి బలహీనతలు గుర్తించి ట్రాప్ చేస్తారు. ఉదాహరణకు ఎవరైనా హీరోయిన్ గురించి ఎక్కువ ప్రస్తావన, లైక్, కామెంట్లు ఉన్నట్లయితే ఆ బలహీనతనే ఎరగా వేసి హనీట్రాప్ చేసే ప్రమాదం ఉంటుంది. వివరాలు ఇవ్వకపోవడం ఉత్తమం.. ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు దూరంగా ఉండటం సాధ్యం కాని పరిస్థితి. సోషల్ మీడియాలో మన సమాచారాన్ని వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత, కుటుంబ సభ్యుల వివరాలు, ఫొటోలను సాధ్యమైనంత వరకు పెట్టకూడదు. కుల, మత, ప్రాంత, రాజకీయపరమైన పోస్టులేవీ పెట్టకపోవడం ఉత్తమం. యువత ఈ విషయాన్ని గుర్తిస్తేనే వారు భవిష్యత్తులో చిక్కుల్లో పడకుండా ఉంటారు. – ప్రసాద్ పాటిబండ్ల, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
హెచ్–1బీ, ఎల్1 రెన్యువల్ ఇక అమెరికాలోనే
వాషింగ్టన్: ‘డొమెస్టిక్ వీసా రీవాలిడేషన్’ ప్రక్రియను పునఃప్రారంభించాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అమెరికాలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, ప్రధానంగా భారతీయులకు ఎక్కువ మేలు జరుగనుంది. హెచ్–1బీ, ఎల్1 వంటి నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల గడువు ముగిస్తే స్వదేశానికి తిరిగి వెళ్లి, రెన్యువల్ చేసుకోవాల్సిన పని ఉండదు. అమెరికాలోనే ఆ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. 2004 వరకూ నాన్–ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యువల్, ఎక్సటెన్షన్ స్టాంపింగ్‌ను అమెరికాలోనే చేసేవారు. తర్వాత ఈ విధానాన్ని రద్దుచేశారు. ఇప్పుడు పునరుద్ధరించబోతున్నారు. త్వరలోనే ఇది అమల్లోకి రాబోతోంది. -
అమెరికాలో నివసిస్తున్న ఇండియన్ ఐటీ ఉద్యోగులకు శుభవార్త!
ఆర్ధిక మాంద్యం దెబ్బకు చేస్తున్న ఉద్యోగాలకు గ్యారెంటీ లేదు. దీంతో బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్న భారతీయులకు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ‘దేశీయ వీసా రీవాలిడేషన్’ పేరుతో హెచ్-1బీ, ఎల్1 వీసాలను అమెరికాలోనే పునరుద్దరించే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం అమెరికాలో లేఆఫ్స్‌కు గురై.. కొత్త జాబ్ కోసం అన్వేషిస్తున్న వారికి భారీ ఊరట కలగనుంది. 2004 కి ముందు వీసా పునరుద్ధరణ లేదా స్టాంపింగ్ కోసం అమెరికాను విడిచి బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, మార్పులు చేయడంతో హెచ్-1బీ వీసా దారులు రెన్యువల్ కోసం తమ సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల నెలల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ముఖ్యంగా ఉద్యోగుల తొలగింపులతో ఈ సమస్యను పరిష్కరించాలని జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వీసా ఉంటేనే ఎంట్రీ లేఆఫ్స్ గురైన ఉద్యోగులు వీసా పునరుద్దరించేందుకు సమయం పడుతుంది. ఆ లోగా వీసా గడువు దాటితే దేశం వదిలి వెళ్లి పోవాలి. లేదంటే కొత్త ఉద్యోగం వెతుక్కొని వీసా రెన్యూవల్ చేయించుకోవాలి. అక్కడే వీసా లబ్ధి దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వీసా రెన్యూవల్, ఉన్న ఉద్యోగం పోయి కొత్త ఉద్యోగం దొరుకుతుందా? లేదా? అన్న సందిగ్ధంతో ఆందోళన చెందుతున్నారు. జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి ఈ ఆందోళనలపై అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు జోబైడెన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వీసాల రెన్యూవల్ విషయంలో మార్పులు చేయాలని కోరుతున్నారు. ఈ తరుణంలో వీసాల విషయంలో జోబైడెన్ ప్రభుత్వం విధించిన నిబంధనల్ని సడలించింది. వీసా రెన్యూవల్ కోసం కొత్త కొత్త పథకాల్ని అందుబాటులోకి తెస్తుంది. తాజాగా అమెరికా ప్రభుత్వం వీసా రెన్యూవల్‌ను చేసేందుకు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించనున్నట్లు తెలిపింది. విదేశీ ఉద్యోగులు వీసా రెన్యూవల్లో ఇబ్బందులు పడకుండా వీసాల పునరుద్దరణ (రెన్యూవల్), స్టాంపింగ్ చేసేందుకు సిద్ధమైంది. ఇబ్బందుల్ని తొలగించాలనే సాధారణంగా ఆయా రంగాల్లో నిపుణులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే వారికి హెచ్-1బీ వీసా తప్పని సరి. ఆ వీసాలను అమెరికన్ కంపెనీలు అభ్యర్ధులు అందిస్తాయి. అందుకే ఆ వీసాలకు భారీ ఎత్తున డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది ఆ వీసాలు పొందిన చైనా, భారతీయులు వేలల్లో అమెరికాకు వెళుతుంటారు. అక్కడి వెళ్లిన వారు వీసా గడువు ముగిసి.. రెన్యూవల్ చేయించుకునే సమయంలో అష్టకష్టాలు పడుతున్నారు. ఆ సమస్యల్ని అధిగమించేందుకు జోబైడెన్ ప్రభుత్వం నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) కేటగిరీల వీసా సేవల్ని పునఃప్రారంభించే ప్రణాళికలపై తీవ్రంగా కృషి చేస్తుంది.ఈ ఏడాది చివర్లో పైలట్‌ను ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాం. వీసాలను పునరుద్ధరించడానికి దరఖాస్తుదారులు విదేశాలకు వెళ్లే అవసరాన్ని తగ్గిస్తుంది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఎన్ని వీసాలో చెప్పలేం వీసాలను ఎన్ని పునరుద్దరిస్తారని విషయంపై యూఎస్ కాన్సులేట్ అధికారులు మాట్లాడుతూ.. వీసా రెన్యూవల్ ప్రాజెక్ట్ ప్రారంభంలో ఎంత మంది వీసా హోల్డర్లు అర్హులు అవుతారనే దానిపై స్పష్టత ఇవ్వలేం. తక్కువ సంఖ్యలో ప్రారంభించింది. దశల వారీ వీసాల జారీని పెంచుకుంటూ వెళతామని అన్నారు. -
యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త!
యూకేలో స్థిరపడాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇకపై బ్రిటన్‌లో నివసించేందుకు స్పాన్సర్, జాబ్స్‌తో సంబంధం లేకుండా ఉండేలా అక్కడి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేసింది. యూకే యంగ్ ప్రొఫెషన్ స్కీమ్ పేరుతో తెచ్చిన ఈ కొత్త పథకంలో 18ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య వయస్సు వారు రెండేళ్ల పాటు ఎలాంటి జాబ్స్, స్పాన్సర్స్ లేకపోయినా నివసించ వచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను ట్వీట్లో పేర్కొంది. యూకే- ఇండియా యంగ్ ప్రొఫెషన్ స్కీంలో ప్రతి సంవత్సరం యూకేకి చెందిన 3వేల ప్రాంతాల్లో పైన పేర్కొన్న పరిమిత వయస్సు గల భారతీయులు ఉండేందుకు అర్హులు. యూకే ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా భారతీయులకు యూకేకు వెళ్లేందుకు అప్లికేషన్లను ఫిబ్రవరి 28 నుంచి మార్చి2 లోపు సబ్మిట్ చేయాలని భారత్‌లోని యూకే రాయిబారి కార్యాలయం ట్వీట్ చేసింది. మార్చి 2లోపు అభ్యర్ధులు సబ్మిట్ చేసిన అప్లికేషన్లలో నుంచి లక్కీ డ్రా రూపంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయనుంది. అక్కడ అర్హులైన అభ్యర్ధులు వీసాకు అప్లయి చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అర్హతలు , దరఖాస్తు చేసే విధానం ►రాయబారి కార్యాలయం పేర్కొన్నట్లు ధరఖాస్తు చేయాలి ►ఆ ధరఖాస్తును నిర్ణీత గడువులో సబ్మిట్ చేయాలి. ►దరఖాస్తు తేదీకి 6 నెలల కంటే ముందు జారీ చేయబడిన స్థానిక పోలీసు సర్టిఫికేట్ లేదా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్‌ను అందించాలి ► బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ కి సమానమైన లేదా అంతకంటే ఎక్కువ విద్యా అర్హతను కలిగి ఉండాలి. ►విద్యా అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్లను జతచేయాలి ►దరఖాస్తుదారు అవసరమైన అర్హత కలిగి ఉన్నారనేలా కాలేజీ నుంచి లేదా యూనివర్సిటీ నుండి వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. -
విదేశాల నుంచి అమెరికా వీసా!
న్యూఢిల్లీ: అమెరికా వీసా కోసం ఇకపై సుదీర్ఘంగా నిరీక్షించాల్సిన అవసరం లేకుండా భారతీయులకు అమెరికా రాయబార కార్యాలయం అరుదైన అవకాశం కల్పించింది. అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరమున్న వారు ఇతర దేశాల్లోని ఎంబసీల నుంచి కూడా వీసా కోసం దరఖాస్తు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. బీ1, బీ2 బిజినెస్, పర్యాటక వీసాలకు ప్రస్తుతం హైదరాబాద్, కోల్‌కతా, ముంబైల్లో ఏడాదికి పైగా వెయిటింగ్ ఉంది! బ్యాంకాక్‌లో కేవలం 14 రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతోంది. అందుకే అత్యవసరంగా వెళ్లాలనుకునేవారు విదేశీ ఎంబసీల్లో దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు సూచించారు. సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నంల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. -
అమెరికా వెళ్లాలనుకునేవారికి శుభవార్త.. 14 రోజుల్లోనే వీసా..!
న్యూఢిల్లీ: అమెరికా వీసా ఆశావహులు ప్రస్తుతం భారత్‌లో నెలల తరబడి ఎదురు చూస్తున్నారు. బీ1, బీ2 వీసాల కోసం వేల మంది దరఖాస్తు చేస్తున్నారు. మొదటిసారి దరాఖాస్తుదారుల్లా అందరికీ ఇంటర్వ్యూ మినహాయింపు లేకపోవడంతో వీసా అపాయింట్మెంట్ కోసం ఎక్కువ రోజులు ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే భారతీయుల కోసం ఈ సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తోంది అమెరికా. బ్యాంకాక్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం దేశాల్లోని అమెరికా ఎంబసీలు భారతీయులు బీ1, బీ2 వీసాల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా రెండు మూడు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితమే అమెరికా వీసా గడువు ముగిసిన భారతీయులు ఈ దేశాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే వీసా త్వరగా లభిస్తుంది. ప్రస్తుతం కోల్‌కతా నుంచి అమెరికా బీ1, బీ2 వీసాల కోసం ధరఖాస్తు చేస్తే ఇంటర్వ్యూ కోసం 589 రోజులు ఎదురు చూడాల్సి వస్తోంది. ముంబై నుంచి అయితే ఏకంగా 638 రోజులు వేచి చూడాలి. చెన్నైలో అయితే 609 రోజులు, హైదరాబాద్‌లో అయితే 596 రోజులు, ఢిల్లీలో అయితే 589 రోజులు వెయిట్ చేయాలి. కానీ భారతీయులు బ్యాంకాక్ వెళ్లి అక్కడి అమెరికా ఎంబసీ నుంచి వీసా కోసం దరఖాస్తు చేస్తే 14 రోజుల్లోనే ఇంటర్వ్యూ ప్రక్రియ పూర్తవుతుంది. వీసా త్వరగా రావాలనుకునే వారు ఈ దేశాలకు వెళ్తే సరిపోతుంది. జనవరిలో తాము లక్ష వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ శనివారం వెల్లడించింది. 2019 జులై తర్వాత ఒక్క నెలలో ఇన్ని దరఖాస్తులు పరిశీలించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. రానున్న రోజుల్లో సిబ్బంది పెరుగుతారు కాబట్టి ఇంకా ఎక్కువ వీసాలను ప్రాసెస్ చేస్తామని పేర్కొంది. కరోనా సమయంలో అమెరికా ఎంబసీలు వేల మంది సిబ్బందిని ఇంటికి పంపాయి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత వారిలో కొంతమందిని మాత్రమే తిరిగి విధుల్లో చేర్చుకున్నాయి. ఈ కారణంగానే వీసాల జారీ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. అయితే భారతీయుల కోసం అమెరికా కొన్ని ప్రత్యేక మినహాయింపులు ఇచ్చింది. బీ1, బీ2 వీసాల కోసం తొలిసారి దరఖాస్తు చేసుకునేవారికి ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చింది. చదవండి: డబ్బు ఉందా?.. దుబాయ్‌లో మంచి ఇల్లు.. బోలెడు రెంటు.. ఆపై గోల్డెన్ వీసా -
భారత్‌తో టెస్టు సిరీస్.. ఫ్లైట్ మిస్సయిన ఆసీస్ క్రికెటర్
టీమిండియాతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు బుధవారం భారత్‌కు బయలుదేరనుంది. అయితే ఆసీస్ టెస్టు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా మాత్రం ఒకరోజు ఆలస్యంగా వెళ్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) పేర్కొంది. వీసా సమస్యే అందుకు కారణమని సీఏ తెలిపింది. ''ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అందరికి వీసాలు మంజూరు అయ్యాయని.. ఉస్మాన్ ఖవాజాకు మాత్రం వీసా ప్రాబ్లమ్ ఏర్పడింది. బుధవారం సాయంత్రం వరకు అది పరిష్కారమవుతుంది. ఈరోజు సాయంత్రంలోగా ఖవాజాకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తామని.. గురువారం ఉదయం కొంతమంది సహాయక సిబ్బందితో కలిసి భారత్‌కు వెళ్తాడని'' క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డుకు చెందిన అధికారి ఒకరు పేర్కొన్నారు. అయితే తాను ఫ్లైట్ మిస్సయిన విషయాన్ని ఖవాజా ఒక పాపులర్ మీమ్‌తో సరదాగా ట్విటర్లో పంచుకున్నాడు. భారతీయ వీసా కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నట్లుగా నా పరిస్థితి తయారూంది. అంటూ పేర్కొన్నాడు.ఇక టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఫిబ్రవరి 9న ప్రారంభం కానుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి తొలి టెస్టు మొదలుకానుంది. టెస్టు సిరీస్ అనంతరం ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనుంది. ఈ టెస్టు సిరీస్ టీమిండియాకు కీలకం కానుంది. ఇప్పటికే డబ్ల్యూటీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుకుంది. ఆసీస్‌తో సిరీస్‌ను టీమిండియా 3-1తో గెలిస్తే టీమిండియా ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడే చాన్స్ ఉంటుంది. View this post on Instagram A post shared by Usman Khawaja (@usman_khawajy) Me waiting for my Indian Visa like... #stranded #dontleaveme #standard #anytimenow https://t.co/pCGfagDyC1 — Usman Khawaja (@Uz_Khawaja) February 1, 2023 చదవండి: నెగెటివ్ ట్వీట్‌ను లైక్ చేసిన క్రికెటర్.. కోపాన్ని చెప్పకనే చెప్పాడు IND Vs AUS: తొలి టెస్టుకు శ్రేయాస్ దూరం.. జడ్డూ రీఎంట్రీ -
కువైట్ వెళ్లేవారికి కొత్త నిబంధన.. వలస కార్మికులు ఆవేదన
మోర్తాడ్(బాల్కొండ): మనదేశం నుంచి వెళ్లే వారికిగాను కువైట్ వీసా నిబంధనలను సవరించింది. కువైట్ నుంచి వీసాలు జారీ అయిన తరువాత అవి అసలువో నకిలీవో తేల్చడానికి ఆ దేశ కాన్సులేట్ల పరిశీలన కోసం పంపాల్సి ఉంది. ఈ కొత్త నిబంధన పదిహేను రోజుల కింద అమలులోకి వచ్చింది. వీసాలను కాన్సులేట్ పరిశీలన కోసం పంపడం వల్ల కాలయాపనతో పాటు ఆర్థికంగా భారం పడుతుందని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కువైట్‌లో ఉపాధి పొందాలనుకునే వారు లైసెన్స్డ్ ఏజెన్సీలు, లేదా తమకు తెలిసిన వారి ద్వారా వీసాలను పొందిన తరువాత పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ (పీసీసీ) తీసుకోవాల్సి ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఒక్క కువైట్‌కు మాత్రమే పీసీసీ తప్పనిసరి అనే నిబంధన ఉంది. వీసా కాపీల పరిశీలనను ఇప్పుడు అదనంగా చేర్చారు. కువైట్ నుంచి వీసాలను ఆన్లైన్లోనే జారీ చేస్తున్నారు. ఈ వీసాలు అన్ని కువైట్ విదేశాంగ శాఖ ద్వారానే జారీ అవుతున్నాయి. విదేశాంగ శాఖ ఆమోదంతోనే వీసాలు జారీ కాగా, వాటిని మరోసారి తమ కాన్సులేట్‌ల్లో పరిశీలనకు పంపాలని కువైట్ ప్రభుత్వం సూచించడం అర్థరహితమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఢిల్లీ, ముంబైలోనే కాన్సులేట్లు కువైట్ విదేశాంగ శాఖకు సంబంధించిన కాన్సు లేట్లు ఢిల్లీ, ముంబైలలోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి కువైట్‌కు భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాల నుంచి వలస కార్మికులు కోరుతున్నారు. కువైట్ ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినా ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. కువైట్ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లో తీసుకురావడంతో కాన్సులేట్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది. (క్లిక్ చేయండి: లే ఆఫ్స్ దెబ్బకి భారత ఐటీ ఉద్యోగుల విలవిల) -
వేసవికల్లా వీసా చిక్కులకు చెల్లు
సాక్షి, హైదరాబాద్: అమెరికా వీసాల జారీలో జరుగుతున్న జాప్యాన్ని త్వరలోనే అధిగమిస్తామని, వచ్చే వేసవికల్లా జారీ వేగవంతం అవుతుందని చార్జ్ డి అఫైర్స్ ఎ.ఎలిజబెత్ జోన్స్ స్పష్టం చేశారు. వీసాల జారీ జాప్యాన్ని అత్యంత ప్రాధాన్యం గల అంశంగా పరిగణిస్తున్నామని చెప్పారు. ఆమె మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సమస్యపై ఇప్పటికే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఆంటోనీ జాన్ బ్లింకిన్, జయశంకర్ చర్చించారని చెప్పారు. వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమిస్తున్నామన్నారు. వచ్చే వేసవికల్లా భారత్‌లో కోవిడ్‌కు ముందు ఉన్నదాని కంటే ఎక్కువ మంది సిబ్బంది పనిచేస్తారని వివరించారు. ‘సాధారణంగా బీ1, బీ2 వీసాల జారీలోనే జాప్యం ఎక్కువగా జరుగుతోంది. దీన్ని తగ్గించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం. హైదరాబాద్‌లోనూ అదనపు సిబ్బంది త్వరలోనే అందుబాటులోకి వస్తారు. గత ఏడాది విద్యార్థులకు 1.25 లక్షల వీసాలు జారీ చేయగా.. ప్రస్తుతం మరోసారి వీసాలకు డిమాండ్ పెరిగింది. విద్యార్థి వీసాలకు ప్రాధాన్యమిచ్చి వారు సకాలంలో తమ కోర్సుల్లో చేరేలా వీసాలు జారీ చేస్తాం’అని ఎలిజబెత్ తెలిపారు. భారత్ పరిస్థితిని అర్థం చేసుకున్నాం భారత్‌కు పూర్తిస్థాయి దౌత్యవేత్త నియామకం రెండేళ్లుగా జరక్కపోవడంపై ఎలిజబెత్ జోన్స్ మాట్లాడుతూ.. దాని ప్రభావం ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదని స్పష్టం చేశారు. పూర్తిస్థాయి దౌత్యవేత్త లేకున్నా అనేకమంది అమెరికా పార్లమెంటు సభ్యులు భారత్‌ను సందర్శించారని, ఇరుదేశాల మిలటరీ దళాలు సంయుక్తంగా విన్యాసాలు నిర్వహించాయని, వాణిజ్యం కూడా పెరిగిందని తెలిపారు. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ పరిస్థితిని మేము సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఏ దేశమైనా తమ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తుంది. అందుకే విదేశీ వ్యవహారాల్లో ఏ దేశం ఎలా వ్యవహరించాలో మేము ఎప్పుడూ నిర్ణయించం’అని ఆమె చెప్పారు. ఆయా దేశాల సమస్యలను అర్థం చేసుకుని.. వాటికి లోబడే ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ఉక్రెయిన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం అందించడం భారత్ చేస్తున్న అతిపెద్దమేలని పేర్కొన్నారు. జీ–20 అధ్యక్ష స్థానంలో ఉన్న భారత్‌తో కలిసి పనిచేసేందుకు అమెరికా నుంచి మరిన్ని బృందాలు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం భేష్ అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అన్ని రకాలుగా మద్దతు లభిస్తోందని, మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారాన్ని అమెరికా వ్యాపారవేత్తలు ఎంతగానో ప్రశంసిస్తున్నారని ఎలిజబెత్ జోన్స్ చెప్పారు. అయితే, మేకిన్ ఇండియా కార్యక్రమంలో తామెలా భాగం కావాలన్నది వారికి ఇంకా స్పష్టం కావడం లేదని, భారతీయ కంపెనీలతో కలిసి ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వివరించారు. చైనాతో భారత్ సరిహద్దు వివాదాల విషయంలో అమెరికా పాత్ర ఏమీ ఉండదని, కాకపోతే భారతీయ భౌగోళిక సమగ్రతకు ఎలాంటి ముప్పు రాకూడదని అమెరికా భావిస్తోందని తెలిపారు. హైదరాబాద్‌లో కొత్త కాన్సుల్ జనరల్ భవనం త్వరలోనే అందుబాటులోకి వస్తుందని, ఈ కొత్త భవనానికి నిపుణుల అనుమతి లభించాల్సి ఉందని చెప్పారు. కొత్త భవనంలో మరింత ఎక్కువ మంది సిబ్బంది పనిచేసేందుకు సౌకర్యాలు ఉన్నాయన్నారు. -
కరోనా పరీక్షలు.. దక్షిణ కొరియా, జపాన్‌పై చైనా ప్రతీకార చర్యలు..
బీజింగ్: చైనాలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఆ దేశం నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి దక్షిణ కొరియా, జపాన్. అయితే ఈ దేశాల తీరుపై డ్రాగన్ దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ప్రతీకార చర్యలకు దిగింది. తమ దేశస్థులపై కరోనా ఆంక్షలు విధించినందుకు బదులుగా దక్షిణ కొరియా దేశస్థులకు షార్ట్ టర్మ్ వీసాల జారీని సస్పెండ్ చేసింది చైనా. సియోల్‌లోని చైనా ఎంబసీ మంగళవారం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. అలాగే జపాన్ దేశస్థులపైనా ఇలాంటి ఆంక్షలే విధించింది. చైనా తీరును చూస్తుంటే ప్రతీకార చర్యల్లో భాగంగానే వీసాల జారీని తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. కరోనా విషయంలో తమపై కొన్ని దేశాలు వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయని డ్రాగన్ దేశం ఇదివరకే తీవ్ర విమర్శలు చేసింది. ఇప్పుడు ఏకంగా కక్షపూరిత చర్యలకు దిగుతోంది. చైనాలో జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటి నుంచి కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి. ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయి. వేల మంది చనిపోయి శ్మశానాల్లో ఖాళీ లేని పరిస్థితి. చైనా మాత్రం కరోనా కేసుల లెక్కలను వెల్లడించలేదు. కోవిడ్ బాధితులను ట్రాక్ చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తేసింది. ఈనేపథ్యంలోనే అమెరికా, భారత్ సహా పలు దేశాలు చైనా ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. మరోవైపు దాదాపు మూడేళ్ల తర్వాత సరిహద్దులను ఆదివారం తెరిచింది చైనా. కరోనా కేసులు వెలుగు చూసిన తొలినాళ్లలో వీటిని మూసివేసింది. అన్నిదేశాలు ఎప్పుడో ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ చైనా మాత్రం డిసెంబర్ 7న జీరో కోవిడ్ పాలసీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించింది. తాజాగా ఇతర దేశాలతో సరిహద్దులను కూడా తెరిచింది. చదవండి: షాకింగ్.. విమానంలోకి పామును తీసుకెళ్లబోయిన మహిళ.. ఫొటో వైరల్.. -
హైటెక్‌సిటీ మెట్రోస్టేషన్లో యూఎస్ వీసా దరఖాస్తు కేంద్రం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్లో అమెరికా వీసా దరఖాస్తు కేంద్రం ఆదివారం ప్రారంభం కానుంది. వీసా అప్లికేషన్ సెంటర్‌గా పిలిచే ఈ కేంద్రంలో అమెరికాకు వెళ్లాలనుకునేవారి వేలిముద్రల సేకరణ, వీసా దరఖాస్తు పత్రాల సమర్పణ, ఇంటర్వ్యూ తదితర సేవలను అందించనున్నట్లు మెట్రో అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేంద్రాన్ని అమెరికా కాన్సులేట్ అధికారులు ఏర్పాటుచేశారన్నారు. స్టేషన్ మధ్యభాగం (కాన్కోర్స్)లో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నా రు. కాగా ప్రస్తుతం ఈ కేంద్రం బేగంపేట్‌లోని కాన్సులేట్ సమీపంలోని గౌరా గ్రాండ్ భవన్లో ఉన్న విషయం విదితమే. నగరవాసులు, మెట్రో ప్రయాణికులు ఈ కేంద్రాన్ని వినియోగించుకోవాలని మెట్రో అధికారులు కోరారు. చదవండి: Hyderabad: మలక్‌పేట హోటల్లో అగ్ని ప్రమాదం.. కార్మికుడి మృతి -
అమెరికా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్!
వీసాల విషయంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసాల జారీ కోసం నిర్వహించే ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. మినహాయింపు సమయాన్ని డిసెంబర్ 31, 2023కు పొడిగిస్తున్నట్లు ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. తొలిసారి లేదంటే ఇప్పటికే వీసా ఉండి.. ఆ వీసాను రెన్యూవల్ చేసుకునే వారికి ఇది వస్తున్నట్లు స్పష్టం చేసింది. విదేశాంగ విధాన వ్యవహారాల బాధ్యతలు నిర్వహించే యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ విభాగం కీలక ప్రకటన చేసింది. విదేశాలకు చెందిన విద్యార్ధులు, వర్క్ వీసా హోల్డర్లు దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లు గుర్తించిన అమెరికా ప్రభుత్వం ఇంటర్వ్యూలు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో పాటు వలసేతర వీసాల కోసం వేచి ఉండే సమయం మరింత తగ్గించేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు పేర్కొంది. ఎవరికి వర్తిస్తుందంటే టెంపరరీ అగ్రకల్చర్, నాన్ అగ్రికల్చరల్ వర్కర్స్ (హెచ్-2 వీసా), స్టూడెంట్ (ఎఫ్ అండ్ ఎం వీసా), అకడమిక్ ఎక్ఛేంజ్ విజిటర్స్ (అకడమిక్ జే వీసా) లబ్ధిదారులకు వర్తిస్తుంది. వీరితో పాటు ప్రత్యేకంగా తాత్కాలిక వర్కింగ్ వీసా పొందిన నాన్- ఇమిగ్రెంట్స్(హెచ్-1బీ వీసా), ట్రైనీ లేదా స్పెషల్ ఎడ్యూకేషన్ విజిటర్స్ (హెచ్-3 వీసా), ట్రాన్స్ ఫర్ మీద ఇతర దేశం నుంచి అమెరికాకు వెళ్లే(ఎల్ వీసా), సైన్స్, ఎడ్యుకేషన్,ఆర్ట్స్, అథ్లెట్స్, మోషన్ పిక్చర్స్, టెలివిజన్ ఇండస్ట్రీ విభాగాల్లో అసాధారణమైన ప్రతిభ, విజయాలు సాధించిన (ఓ వీసా), అథ్లెట్స్, ఎంటర్టైన్(పీ వీసా), అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాలు (క్యూ వీసా) నిర్వహించే వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు అమెరికా తెలిపింది. చదవండి👉 అదిరిపోయేలా జియో న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్..బెనిఫిట్స్ ఎక్కువే! -
దరఖాస్తుదారులు ఓపిక పట్టాలి.. వీసాల జారీపై దృష్టి పెట్టాం: అమెరికా
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం భారత్‌లో విపరీతమైన డిమాండే సుదీర్ఘమైన వెయిటింగ్ పీరియడ్‌కు కారణమని యూఎస్ చార్జ్ డి అఫైర్స్ రాయబారి ఎలిజబెత్ జోన్స్ అన్నారు. ‘‘దీన్ని వీలైనంతగా తగ్గించడానికి అమెరికా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంది’’ అని శుక్రవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమె మీడియాకు తెలిపారు. ‘‘భారీగా కౌన్సెలర్లను నియమించుకుంటున్నాం. వారందరికీ వాషింగ్టన్లో యుద్ధ ప్రాతిపదికన శిక్షణ నడుస్తోంది. వారిలో వీలైనంత మందిని భారత్‌కు రప్పించుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. వచ్చే వేసవికల్లా ఢిల్లీ, ఇతర కాన్సులేట్లలో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులోకి వస్తారు’’ అని చెప్పారు. దరఖాస్తుదారులంతా ఓపిక పట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం అమెరికా వీసాకు తొలిసారిగా దరఖాస్తు చేసుకుంటున్న వారు ఇంటర్వ్యూల కోసం ఏకంగా మూడేళ్ల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది! -
అమెరికా వీసా కావాలంటే 1000 రోజులు
న్యూఢిల్లీ: రోజురోజుకీ అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. అమెరికా బిజినెస్ (బీ–1), టూరిస్ట్ (బీ–2) వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయంతొలిసారిగా వేయి రోజులకు చేరింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది. ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్‌వాసులు 994 రోజులు, ఢిల్లీ 961 రోజులు, చెన్నై 948 రోజులు, కోల్‌కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి చెప్పారు. అత్యవసరంగా ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే అపాయింట్మెంట్ వెంటనే ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో అడ్మిషన్లు ఉండటంతో విద్యార్థి వీసాలు మంజూరుకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర వీసాల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది. -
అమెరికా వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా?.. అయితే మీకు బిగ్ షాక్!
కోవిడ్ ముగిసిన తర్వాత ప్రజలు తమ విహార యాత్రలు, వ్యాపార పనులంటే మళ్లీ విదేశీ పర్యటనలు మొదలుపెట్టారు. మీరు ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లే ప్లాన్ చేస్తున్నారా? అయితే అటువంటి వారు మరో 3 సంవత్సరాలు ఆగక తప్పదు. ఎందుకంటే అమెరికా పర్యాటక వీసా అపాయింట్మెంట్ కోసం దాదాపు 1000 రోజుల వెయిటింగ్ లిస్ట్ ఉంది. వెయ్యి రోజుల ఆగాల్సిందే! యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ ప్రకారం.. మంగళవారం నాటికి మొదటి సారి ఇంటర్వ్యూ అవసరమయ్యే బీ1(వ్యాపారం), బీ2(పర్యాటక) దరఖాస్తుదారుల కోసం వేచి ఉండాల్సిన సమయం వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైలో 999 రోజులు; హైదరాబాద్‌లో 994 రోజులు; ఢిల్లీలో 961 రోజులు; చెన్నైలో 948, కోల్‌కతాలో 904గా ఉంది. దీనర్థం ప్రస్తుత పరిస్థితుల్లో నాన్-ఇమ్మిగ్రెంట్ విభాగంలో ఎవరైనా బీ1(బిజినెస్), బీ2(టూరిస్ట్) వీసాపై అగ్రరాజ్యం వెళ్లాలని దరఖాస్తు చేసుకుంటే వారికి 2025కి వీసా అపాయింట్మెంట్ లభించనుంది. ‘కేవలం కొత్తగా వీసా పొందేవారికే నిరీక్షణ సమయం ఎక్కువగా ఉంటోంది. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తుదారులకు అత్యవసర అపాయింట్మెంట్లు రోజుల్లో అందుబాటులో ఉంటాయి. వీలైనంత త్వరగా వెయిటింగ్ పీరియడ్‌ని తగ్గించడంతో పాటు వీసా జరీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము, ”అని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ఒక ట్వీట్లో తెలిపింది. మరో వైపు అధికారులు గత రెండు నెలల్లో భారతదేశంలో ఉన్న ఈ వెయిటింగ్ సమయాన్ని తగ్గించడం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఉన్న బ్యాక్లాగ్, దరఖాస్తుల సంఖ్యను బట్టి, ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ వెయిటింట్ పీరియడ్( నిరీక్షణ సమయం) తగ్గేందుకు చాలా సమయం పట్టేలా ఉంది. చదవండి: Amazon Layoffs అమెజాన్ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్! -
హెచ్ - 1బీ వీసా: భారతీయులకు భారీ ఉపశమనం
అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న భారతీయులకు భారీ ఉపశమనం కలగనుంది. వచ్చే ఏడాది జూన్ లేదా జులై తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఇక వీసాల అనుమతులు,స్లాట్ల గురించి వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ♦ రాయబార కార్యాలయంలో లక్ష హెచ్ - 1బీ వీసాలకు డ్రాప్‌బాక్స్‌ను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇప్పటికే 26 వేల స్లాట్స్ బుక్ చేసుకునే అవకాశం ఉంది ♦ హెచ్-1బీ, బీ1/ బీ2 డ్రాప్ బాక్స్ కోసం వేచి ఉండే సమయాన్ని 9 నెలలకు తగ్గించగలిగాం. ♦ ఎంబసీ ఉద్యోగులు, ఇతర ఉన్నతాధికారులు వీసాల అనుమతి కోసం సంబంధిత అధికారులకు అప్లికేషన్లను నిర్విరామంగా పంపిస్తున్నారు. ♦ వచ్చే ఏడాది మే నెల నుంచి హెచ్-1బీ వీసా డ్రాప్ బాక్స్కోసం వేచి చూసే సమయం 9 నెలల నుంచి 4 లేదా 5 నెలలకు తగ్గుతుందని, దశల వారిగా 3 నెలలు ఇలా సమయం తగ్గించే ప్రయత్నం చేస్తామని మినిస్టర్ కాన్సులర్ డాన్ హెఫ్లిన్ వివరించారు. #CNBCTV18Exclusive | #DropBox cases in categories of #student visas, H-1B & L visa & B1/B2 visas are a priority. 1,28,000 H-1B applicants in the queue for H-1B Drop Box applications, says Don Heflin, Minister Counselor for Consular Affairs pic.twitter.com/WapB7vPdtV — CNBC-TV18 (@CNBCTV18Live) November 22, 2022 -
భారతీయులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సునాక్!
UK-India Young Professionals Scheme: ఇండోనేషియాలో బాలి వేదికగా జరుగుతున్న జీ20 తొలిరోజు సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కాసేపు ఇరువురు నేతలు ముచ్చంటించారు. అదీగాక సునాక్ ప్రధాని అయ్యాక వారివురు భేటీ అవ్వడం ఇదే తొలిసారి. సమావేశం అనంతరం యూకే ప్రధాని భారత్‌కి ఒక పెద్ద వీసా స్కీం ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు యూకేలో ఉండి, పనిచేసేలా భారత యువ నిపుణలు కోసం ప్రతి ఏడాది సుమారు 3 వేల వీసాలకు అనుమతిస్తున్నట్లు బ్రిటన్ కార్యాలయం పేర్కొంది. గతేడాది అంగీకరించిన యూకే భారత్ స్వేచ్ఛ వలసల ఒప్పంద(మొబిలిటీ అండ్ మైగ్రేషన్ అగ్రిమెంట్) భాగస్వామ్యన్ని గురించి నొక్కి చెబుతూ ఇటువంటి పథకం కింద ప్రయోజనం పొందిన మొదటి దేశం భారత్ అని బ్రిటన్ ప్రభుత్వ పేర్కొంది. ఈ మేరకు ధృవీకరించిన యూకే యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ కింద 18 నుంచి 30 ఏళ్ల వయసు కలిగి, డిగ్రీ చదివిన భారతీయ పౌరులు రెండేళ్ల వరకు యూకేలో ఉండి, పనిచేయడం కోసం 3 వేల వీసాలకు అనుమతిచ్చింది బ్రిటన్. ఈ పథకం ద్వారా భారత్ బ్రిటన్ల ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడం తోపాటు ఇండో పసిఫిక్ ప్రాంతంలో బలమైన సంబంధాలు ఏర్పడటానికి ఉపకరిస్తుందని యూకే ప్రధాని డౌన్ స్ట్రీట్ కార్యాలయం పేర్కొంది. అలాగే ఇండో ఫసిఫిక్ ప్రాంతాల్లో దాదాపు అన్ని దేశాల కంటే యూకే భారత్‌తోనే ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నట్లు తెలిపింది. అంతేగాక బ్రిటన్‌లో అంతర్జాతీయ విద్యార్థుల్లో దాదాపు నాలుగింట ఒక వంతు భారత్‌కి చెందిన వారు ఉన్నారని అందువల్ల యూకేలోని భారత్ పెట్టుబడితో యూకే అంతటా వారికి సుమారు 9,500 ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందని చెప్పింది. ప్రస్తుతం యూకే భారత్‌తో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది. ఒకవేళ ఈ ఒప్పందం ఖరారు అయితే యూరోపియన్ దేశంతో జరుపుకున్న తొలి ఒప్పందం అవుతుందని పేర్కొంది. అదిగాక ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న దాదాపు 24 బిలయిన్ పౌండ్ల వాణిజ్య సంబంధాలను ఈ ఒప్పందం మరింత బలపరుస్తుందని చెప్పింది. అభివృద్ధి చెందుతున్న దేశం అయిన భారత్ ఈ ఆర్థిక అవకాశాలను వినియోగించుకునేలా బ్రిటన్‌తో వాణిజ్య ఒప్పందాలను కొనసాగించాలని బ్రిటన్ ఆకాంక్షిస్తోంది. భారత్‌తో మొబిటిటీ(స్వేచ్ఛ) భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేలా ఇమ్మిగ్రేషన్ నేరస్తులను తొలగించే సామర్థ్యాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు బ్రిటీష్ ప్రభుత్వం పేర్కొంది. The British government said that India is the first visa-national country to benefit from such a scheme, highlighting the strength of the UK-India Migration and Mobility Partnership agreed last year.@RishiSunak #UK #India #Visa https://t.co/VWRRWoRvoh pic.twitter.com/oDN1B6jULH — Khaleej Times (@khaleejtimes) November 16, 2022 (చదవండి: జీ20: బైడెన్‌తో మీట్.. సునాక్‌తో ముచ్చట్లు.. ఆయనతో షేక్‌హ్యాండ్) -
ఇకపై నెలకు లక్ష వీసాలు జారీ
న్యూఢిల్లీ: అమెరికా వీసాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూపులు ఇక బాగా తగ్గే అవకాశాలున్నాయి. వచ్చే ఏడాది వేసవి తర్వాత వీసాల మంజూరుకయ్యే రోజులు బాగా తగ్గిపోతాయని, నెలకి లక్ష వీసాలు మంజూరు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారి ఒకరు వెల్లడించారు. 2023 ఏడాది వేసవి నాటికి వీసా దరఖాస్తులు 12 లక్షలకు చేరుకుంటాయన్న అంచనాలున్నాయని తెలిపారు. కోవిడ్–19 కారణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గిపోవడం, వీసాల జారీ తాత్కాలికంగా నిలిపివేత వంటి కారణాలతో భారతీయులు వీసాల కోసం ఏడాదికి పైగా ఎదుచు చూడాల్సిన పరిస్థితి ఉంది. ‘వీసాల మంజూరులో భారత్‌కు మేము అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం. వచ్చే ఏడాది నాటికి కరోనా కంటే ముందున్న పరిస్థితులు వస్తాయి. నెలకి లక్ష వీసాలు మంజూరు చేయడమే మా లక్ష్యం’’ అని ఆయన చెప్పారు. వీసాల త్వరితగతి మంజూరు కోసం సిబ్బందిని పెంచడం, డ్రాప్ బాక్స్ సదుపాయం కల్పన వంటి చర్యల్ని తీసుకుంటామని ఆ అధికారి వెల్లడించారు గతంలో కొన్ని కేటగిరీల వీసా కోసం 450 రోజులు ఎదరుచూడాల్సి వచ్చేదని, ఇప్పుడది తొమ్మిది నెలలకి తగ్గిందని వివరించారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త డెబిట్ కార్డులు: రివార్డులు, ఆఫర్లు
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), వీసా భాగస్వామ్యంతో తన ఖాతాదారుల కోసం కొత్తగా రెండు ప్రీమియం డెబిట్ కార్డులను విడుదల చేసింది. ‘బీవోబీ వరల్డ్ ఒపులెన్స్’అన్నది సూపర్ ప్రీమియం వీసా ఇన్ఫినైట్ డెబిట్ కార్డు కాగా, మరొకటి, ‘బీవోబీ వరల్డ్ సాఫైర్’. క్రెడిట్ కార్డుల మాదిరే వీటిపై రివార్డులు, ప్రయోజనాలను ఆఫర్ చేస్తోంది. (Elon Musk సంచలనం: పరాగ్ అగర్వాల్‌కు మరో షాక్!) బోవోబీ వరల్డ్ ఒపులెన్స్ వీసా ఇన్ఫినైట్ కార్డుపై కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ పికప్, డ్రాప్ సేవ, అపరిమితంగా ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ సందర్శనలు, క్లబ్ మారియట్ సభ్యత్వం, హెల్త్, వెల్నెస్, డైనింగ్ ప్రయోజనాలను అందిస్తోంది. ఆరంభంలో జాయినింగ్ ఫీజు కింద రూ.9,500, ఆ తర్వాత ఏటా రూ.9,500 కస్టమర్లు ఈ కార్డు కోసం చెల్లించుకోవాలి. ఇలాంటి ప్రయోజనాలే కలిగిన బీవోబీ వరల్డ్ సాఫైర్ జాయినింగ్ ఫీజు రూ.750. ఏటా రూ.750 ఫీజు ఉంటుంది. -
భారతీయులకు యూకే తీపి కబురు
-
వలస కార్మికులకు ఉచిత ప్రయాణం
మోర్తాడ్ (బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కంపెనీ ఏడీఎన్‌హెచ్.. 150 మంది వలస కార్మికులకు దుబాయ్ వెళ్లడానికి ఉచిత వీసాలు, విమాన టికెట్లు సమకూర్చింది. కార్మికులకు క్లీనింగ్, క్యాటరింగ్ సెక్షన్లలో ఉపాధి కల్పిస్తోంది. వలస కార్మికులకు వీసాలను జారీ చేయడానికి లైసెన్స్డ్ ఎజెన్సీలు, సబ్ ఏజెంట్లు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తూ, వివిధ పట్టణాల్లో బ్రాంచీలు కలిగి ఉన్న జీటీఎం కంపెనీ ద్వారా ఏడీఎన్‌హెచ్ రిక్రూట్ చేసుకుంది. ఉచిత వీసాల వల్ల వలస కార్మికులందరికీ కలిపి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు తప్పింది. వీసాలు పొందిన కార్మికులు దుబాయ్ వెళ్లేందుకు ముంబైకి బయలుదేరి వెళ్లారు. గతంలో ఇదే కంపెనీ ఖతర్‌లో, అబుదాబీల్లో పనిచేయడానికి 2,200 మందికి ఉచిత వీసాలు అందజేసింది. ‘సాక్షి’కథనం వల్లే.. వలస కార్మికులకు బంపర్ ఆఫర్ శీర్షికన ‘సాక్షి’లో వచ్చిన కథనం వల్ల జీటీఎం నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరయ్యాం. ఎలాంటి సొమ్ము చెల్లించకుండానే దుబాయ్‌కు వెళ్లడం సంతోషంగా ఉంది. పేద కార్మికులకు దీని వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతోంది. – పవన్ కళ్యాణ్, పెంబి, నిర్మల్ జిల్లా -
అమెరికాలో చదువుకోవాలనుకునే వారికి శుభవార్త
అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్ధులకు శుభవార్త. తమ దేశంలో చదువుకోండంటూ జనవరి నుంచి ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్ కోసం వీసా ధరఖాస్తు కోసం అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇటీవల భారత్-అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ.. వీసాల కోసం భారతీయులు ఎక్కువ కాలం ఎదురు చూడడం ఇబ్బందికరంగా ఉందని వ్యాఖ్యానించారు. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన అమెరికా ప్రభుత్వం పలు దేశాల్లోని అమెరికా కార్యాలయాల నుంచి సిబ్బందిని భారత్‌కు పంపటానికి రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఎడ్యుకేషన్ వీసాలను జారీ చేసేందుకు అమెరికా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. కోవిడ్-19 నుంచి అన్ని రకాల వీసాలను జారీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టేది. దీంతో మిగిలిన వీసాల జారీని నిలిపివేసి కేవలం చేసి గడిచిన విద్యా సంవత్సరంలో ఎఫ్-1 వీసాలకు ప్రాధాన్యం ఇచ్చింది. కాగా, గత ఎడ్యుకేషన్ ఇయర్ 82వేల మందికి ఎఫ్-1 వీసాలు జారీ చేయగా.. త్వరలో ప్రారంభమయ్యే ఎడ్యుకేషన్ ఇయర్‌కు అదే తరహాలో వీసా జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
యూఏఈ ప్రభుత్వం ఖుషీ ఖబర్.. స్పాన్సర్ లేకుండా సొంతంగా వ్యాపారం
మోర్తాడ్ (బాల్కొండ): విదేశాల నుంచి తమ దేశానికి వచ్చే వలసదారులకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రభుత్వం ఖుషీ ఖబర్ అందించింది. వీసా నిబంధనలను సవరిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న సరికొత్త నిర్ణయంతో ఆ దేశానికి వెళుతున్న వలసదారులకు అనేక రకాల ప్రయోజనాలు కలుగనున్నాయి. యూఏఈ పరిధిలోని దుబాయ్, అబుదాబి, అజ్మన్, షార్జా తదితర ప్రాంతాల్లో ఇప్పటివరకు సొంతంగా వ్యాపారం చేయాలనుకునే విదేశీయులకు ఆ దేశానికి చెందిన వారి ద్వారానే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. ఇలా స్పాన్సర్ మధ్యవర్తిత్వం ద్వారా వ్యాపారం చేయాలనుకుంటే 51 శాతం స్పాన్సర్ పెట్టుబడి, మిగిలిన 49 శాతం వలసదారుడు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్పాన్సర్ పెట్టుబడి పెట్టినా పెట్టకపోయినా వలసదారుడే మొత్తం పెట్టుబడి పెట్టి లాభాల్లో వాటాను పంచిపెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్పాన్సర్‌తో సంబంధం లేకుండా యూఏఈ ప్రభుత్వం అనుమతితో ఎవరైనా ఆ దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించారు. విజిట్ వీసా గడువు 60 రోజులకు పెంపు విజిట్ వీసా కాలపరిమితి 30 రోజులే ఉండగా ఇప్పుడు 60 రోజులకు పెంచారు. అనుకోని సందర్భంలో ఉద్యోగం కోల్పోయినవారు వెంటనే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఆరు నెలల వరకు అక్కడే ఉండి మరో కంపెనీలో పని వెతుక్కుని వీసాను రెన్యువల్ చేసుకోవచ్చు. గతంలో కంపెనీ ఉద్యోగం నుంచి తొలగిస్తే ఇంటికి రావడం లేదా కార్మికునిగా ఉండిపోయి పోలీసులకు దొరికితే కటకటాల పాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఐదు సంవత్సరాల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా ఉన్నవారు వరుసగా మూడు నెలల పాటు యూఏఈలో ఉండవచ్చు. గ్రీన్ వీసా పొందినవారు తమకు ఉన్న పర్మిట్ పూర్తయితే రెన్యువల్ చేసుకోవడానికి ఆరు నెలల గడువును పొడిగించారు. ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తూ యూఏఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈనెల 3 నుంచి అమలులోకి వచ్చింది. యూఏఈకి వలస వెళుతున్న వారిలో భారతీయుల సంఖ్యనే అధికంగా ఉండటంతో వీసా నిబంధనల సవరణ ప్రయోజనాలు ఎక్కువ శాతం మనవారికే కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అమెరికా వీసాల వేగవంతానికి చర్యలు
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితులకు కరోనా మహమ్మారియే కారణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ నిందించారు. కొద్ది నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్లో మంగళవారం బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు. వీసా అపాయింట్మెంట్ల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నట్టు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా సంక్షోభంతో 2020 మార్చి నుంచి కొద్ది నెలల పాటు వీసా ప్రక్రియ నిలిపివేయడంతో వేచి చూసే సమయం పెరిగిపోయిందని, వీసాల త్వరితగతి మంజూరు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని బ్లింకెన్ స్పష్టం చేశారు. ‘‘కరోనా కారణంగా మా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించాం. ఇప్పుడు మళ్లీ సిబ్బందిని పెంచడానికి ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడతాం. మరి కొద్ది నెలల్లోనే వీసాల జారీ వేగవంతం అవుతుంది’’ అని బ్లింకెన్ స్పష్టం చేశారు. వీసా ప్రక్రియ వేగవంతం చేయడం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని జైశంకర్ అన్నారు. వీసాల జారీలో అడ్డంకుల్ని అధిగమించాలన్నారు. -
వీసా లేకుండా విదేశాలకు వెళ్లొచ్చు..!
-
మునుగోడు నిరుద్యోగులకు కేఏ పాల్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన ప్రకటన చేశారు. మునుగోడు నిరుద్యోగ యువతకు బంఫర్ ఆఫర్ ఇస్తున్నట్టుగా తెలిపారు. తన 59వ జన్మదినం సందర్భంగా మనుగోడు నియోజకవర్గంలోని 59మంది నిరుద్యోగులను లాటరీ పద్ధతిన ఎంపిక చేసి వారికి పాస్‌పోర్ట్, అమెరికా వీసా ఉచితంగా ఇప్పించనున్నట్లు తెలిపారు. మునుగోడు నిరుద్యోగ యువత రెజ్యూమ్‌లు తీసుకుని సెప్టెంబర్ 25న (ఆదివారం) మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య శ్రీవారి హోమ్స్ గ్రౌండ్స్‌కు రావాలని సూచించారు. తన 59వ పుట్టినరోజు కానుకగా వచ్చిన ప్రతి ఒక్కరిలో లాటరీ ద్వారా 59 మందిని ఎంపిక చేసి.. వారికి పాస్ పోర్టు చేయించి, అమెరికా వీసా స్పాన్సర్ షిప్ చేయించి ఇస్తానని వెల్లడించారు. తన జన్మదిన కానుకగా అందిస్తున్న సదావకాశాన్ని మునుగోడు యువత అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ మేరకు కేఏ పాల్ మంగళవారం వీడియో రిలీజ్ చేశారు. -
వీసా అపాయింట్మెంట్ల పెంపునకు కృషి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ కారణంగా తగ్గిపోయిన వీసా అపాయింట్మెంట్లను పెంచడానికి శాయశక్తులా కృషి చేయబోతున్నా మని హైదరాబాద్‌లో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లా ర్సన్ తెలిపారు. హైదరాబాద్‌లో యూఎస్ఏ కాన్సుల్ జనరల్‌గా నియమితులైన జెన్నిఫర్‌ను అమెరికాలో ప్రవాసాంధ్రులు ఘనంగా సత్కరించారు. కొద్దిరోజుల్లో ఆమె హైదరాబాద్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. జెన్నిఫర్ మాట్లాడుతూ.. అమెరికా, భారత్ మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించేందుకు తన వంతు కృషి చేస్తాన న్నారు. వచ్చే నవంబర్‌లో ఆసియాలోనే అతిపెద్ద ఎంబసీని హైదరాబాద్‌లో ప్రా రంభించనున్నట్లు తెలిపారు. ఈ కొత్త భవన సముదాయంలో 55 వీసా విండోస్‌తో వేగంగా ప్రాసెస్ అవుతుందని అన్నారు. ఈ సందర్భంగా సమాజానికి అందించిన ఉత్తమసేవలకు గుర్తింపుగా ప్రతి ఏటా ఇచ్చే ‘ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు’ను సాఫ్ట్వేర్ రంగంలోని వ్యాపారవేత్త రవి పులికి అందించారు. 2019లో కోవిడ్ సందర్భంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయులను రవి ప్రత్యేక విమానంలో స్వదేశానికి చేర్చారు. 5,279 గంటల వాలంటరీ సమయాన్ని ఆయ న సమాజహితం కోసం కేటాయించడం గర్వించదగినదని జెన్నిఫర్ కొనియాడారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అవార్డుతోపాటు ఇచ్చే ‘బటన్’ను రవికి బహూకరించారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా భారత కాన్సులేట్ మినిస్టర్(ఎకనామిక్) డాక్టర్ రవి కోటతోపాటు యూఎస్ఐబీసీ, సీఐఐ, ఎఫ్ఐసీసీఐ, యూఎస్ఇండియా ఎస్ఎంఈ కౌన్సిల్, ఇండియన్ ఎంబసీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా!
వాషింగ్టన్: భారతీయులకు బీ1, బీ2 వంటి సాధారణ వీసాల జారీ ప్రక్రియ పునర్ప్రారంభమైన తరుణంలో అమెరికా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే వీసాలు మంజూరు చేయాలని కాన్సులర్ అధికారులను విదేశాంగ శాఖ ఆదేశించింది. అయితే డిసెంబర్ 31వరకు దరఖాస్తు చేసుకున్న నిర్దిష్ట కేటగిరీల దరఖాస్తుదారులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఎఫ్, హెచ్-1,హెచ్-3, హెచ్-4, నాన్ బ్లాంకెట్ ఎల్,ఎం, ఓ, పీ, క్యూ, అకాడమిక్ జే విసాలకు ఈ కొత్త నిబంధన వర్తిస్తుందని అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. వీసా గడువు ముగిసిన తర్వాత 48 నెలల లోపు రెనివల్ చేయించుకునే వారికి కూడా ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించింది. కానీ గతంలో వీసాలు తిరస్కరణకు గురైన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ నాన్ఇమిగ్రాంట్ వీసా అపాయింట్మెంట్ల వెయిటింగ్ పీరియడ్ మాత్రం ఎక్కువ కాలం ఉండనుంది. కరోనా సమయంలో కలిగిన ఇబ్బందులే ఇందుకు కారణమని అమెరికా చెప్పింది. ఇప్పటికే వీసా దరఖాస్తు రుసుం చెల్లించిన వారు వీసాల జారీకీ ఆలస్యం అవుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా ఎంబసీ పేర్కొంది. కరోనా సమయంలో పేమెంట్ చేసిన వారి వ్యాలిడిటీని 2023 సెప్టెంబర్ 23వరకు పొడిగించనున్నట్లు తెలిపింది. చదవండి: పరాన్నజీవులూ, వెళ్లిపొండి -
క్షమాపణలు కోరిన బ్రిటిష్ హై కమిషనర్: వీడియో వైరల్
న్యూఢిల్లీ: యూకే వీసా అనుమతుల్లో జాప్యం విషయమై భారత్‌లోని బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ స్పందించారు. వీసాలు అనుమతుల్లో జాప్యం గురించి వివరిస్తూ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో సందేశాన్ని పంపించారు. ఈ మేరకు అలెక్స్ వీడియోలో....యూకే వీసాల విషయమై ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఎల్లిస్ ఇలా అన్నారు. " మీలో చాలా మంది 15 రోజుల పని నిమిత్తం యూకేకి వెళ్లడానికి వీసాలను దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించి పలు వీసా అప్లికేషన్స్ వచ్చాయి. ఆయా వీసాల ప్రాసెసింగ్‌కి సమయం పడుతోంది. ఈ ఆలస్యం కారణంగా నష్టపోతున్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాను. కోవిడ్ అనంతరం యూకే వీసాలకు డిమాండ్ పెరింగింది. అంతేకాకుండా రష్యా ఉక్రెయిన్ల యుద్ధం వల్ల కూడా ఈ డిమాండ్ మరింత ఎక్కువైందని చెప్పారు. అలాగే ఈ వీసా ప్రక్రియ వేగవంతం చేసుకునేలా ప్రజలకు శిక్షణ ఇస్తాం. మొదటగా చాలాముంది ప్రాదాన్యత ఇచ్చే వీసా సేవనే మీకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మీ వద్ద కావల్సిన సరైన పత్రాలు ఉన్నయని నిర్థింరించడంలో మాకు సహకరించండి. అలాగే మీ వీసా సురక్షితంగా ఉండే వరకు మీ విమాన టిక్కెట్‌కు కట్టుబడి ఉండొద్దు. యూకే వీసాలు పరిమితి గడువులోగా మంజూరయ్యేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. కేవలం సందర్శకుల వీసాలు జారీ చేయడానికే ప్రస్తుతం ఆరువారాల సమయం పడుతుంది. కొన్నిరకాల వీసా అప్లికేషన్లకు మూడువారాలకు పైగా పట్టొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ ఈ వీసాలు జారీ చేసేలా తాము కృషి చేస్తున్నాం" అని అన్నారు. A lot of you have been in touch about visa delays; many apologies, as I know this is causing a lot of problems. Here’s what we’re doing, and what you can do. pic.twitter.com/QJm7HceDq6 — Alex Ellis (@AlexWEllis) August 12, 2022 (చదవండి: International Youth Day 2022: యంగిస్తాన్!) -
ఉత్కంఠ రేపుతున్న వీసా సమస్య.. ఫ్లోరిడాకు చేరుకోని భారత ఆటగాళ్లు!
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు విచిత్ర పరిస్థితులు ఎదురవుతూనే ఉన్నాయి. లగజీ సమస్య మొదలుకొని వీసా వరకు టీమిండియా ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెడుతున్నాయి. ఇక ఫ్లోరిడాలో జరగనున్న టి20 మ్యాచ్‌లు.. ప్రారంభానికి ముందే పెద్ద థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. మ్యాచ్‌లో చోటు చేసుకోవాల్సిన ఉత్కంఠ.. వీసాల రూపంలో టీమిండియా ఆటగాళ్ల వెంట పడుతుంది. నేరుగా ఫ్లోరిడా వెళ్లే అవకాశం లేకపోవడంతో ముందుగా ఇరుజట్లను గయానాకు పంపించారు. అక్కడి అమెరికా ఎంబసీ వీసాలు ఇవ్వడంలో అభ్యతంరం చెప్పడంతో సమస్య మొదటికి వచ్చింది. దీంతో బుధవారం గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ చొరవతో ఆటగాళ్ల వీసా సమస్య క్లియర్ అయింది. ఇక శుభం అని మనం అనుకునే లోపే మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. గురువారం రెండు జట్లు ప్లోరిడాకు బయలుదేరగా కొంతమంది ఆటగాళ్లు మాత్రం విండీస్‌లోనే ఉండిపోయారంట. ఆ మిగిలిపోయిన ఆటగాళ్లు కూడా టీమిండియా సభ్యులేనట. ఫ్లోరిడాకు చేరుకున్న వారిలో విండీస్ ఆటగాళ్లు మొత్తం ఉండగా.. భారత్ జట్టులో సగం మంది మాత్రమే ఉన్నారు. మిగతా సగం వీసా సమస్యలతో వెస్టిండీస్‌లోనే ఆగిపోయారనే వార్తలు వస్తున్నాయి. అయితే టీమిండియాలోని మిగిలిన ఆటగాళ్లు ఈరోజు బయలుదేరుతారని.. మ్యాచ్‌లు జరుగుతాయని విండీస్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. కాగా ఒక టీమిండియా అభిమాని మాత్రం ''బ్రేకింగ్ న్యూస్.. టీమిండియా పూర్తిస్థాయి జట్టు ఫ్లోరిడాకు చేరుకోలేదు.. మ్యాచ్‌లు ప్రశ్నార్థకమేనా?'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఫ్లోరిడా వేదికగా ఆగస్టు 6, 7 తేదీల్లో నాలుగు, ఐదు టి20లు జరగనున్నాయి. ఒకవేళ సకాలంలో ఆటగాళ్లు చేరుకోలేకపోతే.. మ్యాచ్‌లు ఒకరోజు వాయిదా వేసే అవకాశం ఉందని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నాయి. అయితే విండీస్ సిరీస్ ముగించుకొని టీమిండియా జట్టులోని సీనియర్లు మినహా మిగిలిన ఆటగాళ్లు వెంటనే జింబాబ్వే పర్యటనకు బయలుదేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విండీస్‌తో మిగతా టి20లు ప్రశ్నార్థకంగా మారాయనే చెప్పొచ్చు. చదవండి: వీసా ఇచ్చేందుకు ససేమిరా.. అధ్యక్షుడి చొరవతో లైన్ క్లియర్ IND Vs WI: విండీస్‌లో భారత్‌కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు Breaking News : Full Indian Squad Has Not Reached Florida — Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) August 4, 2022 -
వీసా ఇచ్చేందుకు ససేమిరా.. అధ్యక్షుడి చొరవతో లైన్ క్లియర్
టీమిండియా, వెస్టిండీస్ ఆటగాళ్ల వీసా సమస్యలు తొలిగిపోయాయి. టోర్నీలో భాగంగా చివరి రెండు టి20లు జరగనున్న ప్లోరిడాకు వెళ్లేందుకు ఆటగాళ్లకు మార్గం సుగమమైంది. గయానా అధ్యక్షుడి చొరవతో టీమిండియా, వెస్టిండీస్ ఆటగాళ్లకు సంబంధించిన వీసా ప్రక్రియ పూర్తైంది. ఇక గురువారం సాయంత్రం వరకు భారత్, విండీస్ ఆటగాళ్లు ప్లోరిడాకు చేరుకోనున్నారు. శనివారం(ఆగస్టు 6), ఆదివారం(ఆగస్టు 7) నాలుగు, ఐదు టి20లు జరగనున్నాయి. కాగా టోర్నీలో మిగిలిన రెండు మ్యాచ్‌లు జరిగే అమెరికాకు వెళ్లేందుకు ఇరుజట్లు కలిపి 14 మందికి వీసా క్లియర్ కాలేదు. దీంతో బుధవారం ఇరుజట్లను గయానాలోని జార్జిటౌన్‌కు పంపించారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేయగా.. మొదట అమెరికా ఎంబసీ అడ్డుచెప్పింది. దీంతో గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎంబసీ అధికారులతో చర్చించి ఆటగాళ్ల వీసాలకు సంబంధించిన ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించారు. ఒక రకంగా ఆయన చొరవతోనే ఆటగాళ్లకు వీసా సమస్య తొలిగిపోయింది. ఈ సందర్భంగా గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీకి క్రికెట్ వెస్టిండీస్ బోర్డు(సీడబ్ల్యూఐ) కృతజ్ఞతలు తెలిపింది. సీడబ్ల్యూఐ అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. ''గయానా ప్రభుత్వం చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతలు. ముఖ్యంగా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ జోక్యంతోనే ఇరుజట్ల ఆటగాళ్లకు వీసా క్లియరెన్స్ వచ్చింది. గయానా అధ్యక్షుడి నుంచి ఇది గొప్ప ప్రయత్నం'' అని పేర్కొన్నాడు. ఇక ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. తొలి మ్యాచ్ టీమిండియా గెలవగా.. రెండో మ్యాచ్ విండీస్ గెలిచింది. ఇక మూడో టి20లో టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగడంతో భారత్ 7 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకొని సిరీస్‌లో ఆధిక్యంలోకి వచ్చింది. చదవండి: విండీస్‌లో భారత్‌కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ -
విండీస్‌లో భారత్‌కు వింత పరిస్థితి.. లగేజీ మొదలు వీసా సమస్య వరకు
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముందు లగేజీ సమస్య రాగా.. తాజాగా ఆటగాళ్లకు వీసా సమస్య వచ్చి వచ్చింది. విషయంలోకి వెళితే.. విండీస్‌తో చివరి రెండు టి20లు అమెరికాలోని ఫ్లోరిడాలోని మియామిలో జరగనున్నాయి. కాగా మొదట అమెరికా వెళ్లేందుకు ఇరుజట్లలోని ఆటగాళ్లకు వీసాలు రాకపోవడంతో మ్యాచ్‌ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన విండీస్ క్రికెట్ బోర్డు వీసా ఎంట్రీకి సంబంధించిన కార్యచరణను పూర్తి చేయాల్సి వచ్చింది. ముందుగా బుధవారం ఇరుజట్ల ఆటగాళ్లు గయానాలోని జార్జిటౌన్‌కు చేరుకోనున్నారు. గయానాలోని అమెరికా ఎంబసీలో ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్స్ బుక్ చేశారు. అన్ని సక్రమంగా జరిగితే గురువారం సాయంత్రం వరకు ఆటగాళ్లు ప్లోరిడాలోని మయామికి చేరుకుంటారు. క్రికెట్ వెస్టిండీస్ బోర్డు(సీడబ్ల్యూఐ) అధ్యక్షుడు రికీ స్కెరిట్ మాట్లాడుతూ.. ''ఆటగాళ్లకు వీసా సమస్య తీరిపోయినట్లేనని భావిస్తున్నాం. గయానా నుంచి ఆటగాళ్లకు వీసా అపాయింట్మెంట్ ఇప్పించాం. ముందుగా గయానాకు వెళ్లనున్న ఆటగాళ్లు అక్కడి నుంచి ఫ్లోరిడాకు చేరుకుంటారు. ఇక ఫ్లోరిడాలో మ్యాచ్‌లు జరుగడం ఇదే చివరిసారి అనుకుంటా. అంతకమించి ఎక్కువ చెప్పలేం.'' అంటూ పేర్కొన్నాడు కాగా ఇంతకముందు రెండో టి20కి ముందు టీమిండియా ఆటగాళ్లకు లగేజీ సమస్య ఎదురైంది. ట్రినిడాడ్ నుంచి సెయింట్ కింట్స్‌కు లగేజీ రాక ఆలస్యం కావడంతో మ్యాచ్ దాదాపు మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్ల లగేజీ సమస్యపై విండీస్ క్రికెట్ బోర్డు క్షమాపణ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ఫ్లోరిడాలోని మియామిలో ఆగస్టు 6,7 తేదీల్లో చివరి రెండు టి20లు జరగనున్నాయి. ఇప్పటికైతే ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇక మూడో టి20 మ్యాచ్‌లో వెన్నునొప్పితో కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరగడంతో మిగతా టి20లు ఆడడం అనుమానంగానే ఉంది. ఒకవేళ రోహిత్ దూరమైతే.. మిగతా రెండు టి20లకు పంత్ టీమిండియా స్టాండింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రానున్న ఆసియా కప్ దృష్టిలో పెట్టుకొని రోహిత్ గాయం నుంచి కోలుకున్నప్పటికి ఆడించడం అనుమానంగానే ఉంది. ఈ విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకోనుంది. చదవండి: Suryakuamar Yadav: దంచికొట్టిన సూర్యకుమార్.. లగ్జరీ కారు ఇంటికొచ్చిన వేళ IND vs WI: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. తొలి భారత కెప్టెన్‌గా! -
81 మంది చైనా పౌరులకు నోటీసులు 117 మందికి బహిష్కరణ
న్యూఢిల్లీ: భారత్‌లో వీసా నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా ఉంటున్న విదేశీయులపై భారత ప్రభుత్వం కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రావు ఎంతమంది విదేశీయులపై చర్యలు తీసుకున్నారో వివరించారు. ఆయన మాట్లడుతూ...2019 నుంచి 2021 మధ్య కాలంలో భారత్‌లో వీసా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఉంటున్న సుమారు 81 మంది చైనా పౌరులకు భారత్‌ని వదిల వెళ్లేలా నోటీసుల, అలాగే మరో 117 మందిని మూడేళ్ల పాటు బహిష్కరించినట్లు వెల్లడించారు పైగా సుమారు 726 మంది చైనీయులను వీసా నిబంధనలను ఉల్లంఘంచిన ప్రతికూల జాబితాలో ఉన్నారని చెప్పారు. విదేశాల నుంచి భారత్‌కి వచ్చే వారి రికార్డును ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందన్నారు. కొంతమంది విదేశీయులు నిర్లక్ష్యంతోనో లేక చికిత్స నిమిత్తంగానో లేక మరేదైనా వ్యక్తిగత కారణాలతో వీసా గడువు ముగిసిపోయినా ఉండిపోతున్నారని చెప్పారు. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో అనుకోకుండా నిబంధనలు ఉల్లంఘించి ఎక్కువ కాలం ఇక్కడ ఉండిపోతే జరిమాన విధించి వీసాను క్రమబద్ధీకరించడం లేదా గడువు పొడిగించడం జరుగుతుందన్నారు. అలా కాకుండా కావాలనే వీసా నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ కాలం ఉండిపోతే విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా భారత్‌ని వదిలి వెళ్లేలా నోటీసులు జారీ చేసి జరిమాన విధించడం జరుగుతుందని తెలిపారు. (చదవండి: ఢిల్లీలో మరో కేసు... ఎనిమిదికి చేరిన కేసులు) -
అయ్యో మనీషా! కానరాని దేశంలో అవస్థలు.. చార్జీల కోసం వాట్సాప్ వీడియో
తెర్లాం (విజయనగరం): విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం వస్తుందని ఓ ఏజెంట్ చెప్పిన మాయమాటలను నమ్మి మోసపోయిన ఓ వివాహిత ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. దేశం కాని దేశంలో ఉద్యోగం లేక, తినడానికి తిండిలేక అవస్థలు పడుతోంది. విజిటింగ్ వీసా గడువు కూడా ఈ ఆదివారంతో ముగియనుండడంతో ఏమి చేయాలో తెలియక దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. దుబాయ్ నుంచి వచ్చేందుకు విమాన చార్జీలు ఎవరైనా దాతలు పంపిస్తే తాను ఇండియాకు వస్తానని, తనను ఆదుకోవాలని దుబాయ్ నుంచి వాట్సాప్ వీడియోను శనివారం ఆమె పోస్ట్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. విజయనగరం జిల్లా, తెర్లాం గ్రామానికి చెందిన మనీషా ఉద్యోగం కోసమని కొన్నిరోజుల క్రితం దుబాయ్ వెళ్లింది. విశాఖపట్నానికి చెందిన ఓ ఏజెంట్ ఆమెతో రూ.80 వేలు కట్టించుకుని, దుబాయ్‌లో మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో ఆమె తన దగ్గరున్న సొమ్మునంతా ఆ ఏజెంట్‌కు ఇచ్చి, అతడి విజిటింగ్ వీసాతో ఆమె దుబాయ్ వెళ్లింది. ఇలా దుబాయ్‌కు వెళ్లిన కొద్దిరోజుల్లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చూపించాడు. ఆ ఉద్యోగాలు నచ్చకపోవడంతో మంచి ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికాడు. ఆ తర్వాత అతడు కొన్నాళ్లకు పరారయ్యాడు. దీంతో ఆ మహిళకు ఏమి చేయాలో, ఎక్కడకు వెళ్లాలో తెలియలేదు. ఆఖరికి దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించింది. తాను మోసపోయిన విషయం వివరించింది. ఆమె వద్ద ఉన్న వీసాను రాయబార కార్యాలయ అధికారులు పరిశీలించగా, అది విజిటర్స్ వీసా అని, ఆదివారంతో గడువు ముగుస్తుందని తెలిపారు. ఇండియాకు వెళ్లేందుకు తన వద్ద ఒక్క రూపాయి కూడా లేదని, కొన్ని రోజులుగా తిండి కూడా తినలేదని, దాతలెవరైనా తనను ఇండియా తీసుకువచ్చేందుకు ఆర్థిక సాయం చేయాలని ఆమెతో ఓ వీడియో చిత్రీకరించి, దానిని వాట్పాప్‌లో పోస్ట్ చేసింది. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మనీషా వివరాలపై అధికారుల ఆరా.. మనీషా వివరాలపై విజయనగరం ఎస్బీ(స్పెషల్ బ్రాంచ్) అధికారులు శనివారం ఆరా తీశారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎస్బీ అధికారులు తెర్లాం గ్రామం, మండలంలోని పలువురికి ఫోన్ చేసి, ఆమె వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
పాస్‌పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకపోయినా 60 దేశాలు చుట్టేయచ్చు!
ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం చాల మారిపోయింది. కొన్ని వేల కిలోమీటర్లు దూరంలో ఉన్న దేశాలకు కూడా విద్య, వ్యాపారరీత్యా వెళ్లాల్సి రావడం షరా మామూలైంది. అయితే మనం ఇతర దేశాలకు వెళ్లాలంటే ఆ దేశ అనుమతి(వీసా) తప్పనిసరి. అది లేకపోతే ఆ దేశంలోకి ప్రవేశించడం చట్టరిత్యా నేరం. అయితే కొన్ని దేశాలకు మాత్రం ఈ నిబంధనల్లో సడలింపులు ఉన్నాయి. ఆ దేశ పాస్‌పోర్ట్ ర్యాంక్ ఆధారంగా అందులోని పౌరులు వీసా లేకుండానే ఇతరు దేశాలకు ప్రయాణించే వీలు ఉంటుంది. తాజాగా హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్ ప్రకారం భారత్ 87వ స్థానం దక్కించుకుంది. దీని ప్రకారం భారతీయులు వీసా అవసరం లేకుండా 60 దేశాలకు ప్రయాణించే వెసలుబాటు ఉంది. ఈ జాబితాలో.. జపాన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టును కలిగి ఉన్న దేశంగా నిలిచింది. జపాన్ పౌరులు వీసా లేకుండా 193 దేశాలు చుట్టేయవచ్చు. రెండో స్థానంలో సింగపూర్, దక్షిణ కొరియాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమాచారం ఆధారంగా హెన్లీ ఆండ్ పార్టనర్స్ పరిశోధకుల బృందం ప్రతి ఏటా ఈ జాబితా రూపొందిస్తుంది. చదవండి: SBI Change Rule: ఏటీఎం యూజర్లకు గమనిక, ఆ నిబంధన అందరికీ రానుందా? -
తీరిన కోరిక: పాకిస్తాన్ వెళ్లాలి మా ఇల్లు చూడాలి
15 ఏళ్ల వయసులో దేశ విభజన సమయంలో రావిల్పిండిని వదిలి వచ్చేసింది రీనా వర్మ కుటుంబం. అప్పటి నుంచి పాకిస్తాన్ వెళ్లి తన ఇంటిని చూసుకోవాలని బాల్యాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని ఆమె కోరిక. ఎన్ని దశాబ్దాలు ప్రయత్నించినా వీసా ఇవ్వలేదు. ఇప్పుడు 90 ఏళ్ల వయసు ఆమెకు. వీసా వచ్చింది. 75 ఏళ్ల తర్వాత వాఘా సరిహద్దును దాటి పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. ఆమె ఉద్వేగాలు ఎలా ఉంటాయో. ఎవరికైనా ఇది ఎంత గొప్ప అనుభవమో. గత సంవత్సరమే హిందీలో ఒక సినిమా వచ్చింది. నీనా గుప్తా లీడ్ రోల్. సినిమా పేరు ‘సర్దార్ కా గ్రాండ్సన్’. ఇందులో అమృత్‌సర్‌లోని 90 ఏళ్లు దాటిన ఓ వృద్ధురాలు లాహోర్‌లో ఉన్న తన ఇంటిని చూడాలనుకుంటుంది. దేశ విభజన సమయంలో అల్లర్లకు భర్త చనిపోగా నెలల బిడ్డను తీసుకొని సైకిల్ తొక్కుకుంటూ లాహోర్ విడిచిపెట్టి భారత్‌కు చేరుకుంటుందామె. మళ్లీ పాకిస్తాన్ వెళ్లడం కుదరదు. తన ఇంటితో ముడిపడ్డ జ్ఞాపకాలను తలచుకోని రోజు ఉండదు. పోయే ముందు ఆ ఇంటిని చూసి పోవాలని ఆమె కోరిక. కాని ప్రయాణం చేసే శక్తి ఉండదు. ఆమె బాధను మనవడు అర్థం చేసుకుంటాడు. ఆమె పాకిస్తాన్ వెళ్లకపోతే ఏమి ఆమె ఉన్న ఇంటినే ఇక్కడకు తెస్తాను అని పాకిస్తాన్ వెళ్లి ఆ ఇంటికి చక్రాలు కట్టి (బిల్డింగ్ మూవర్స్ సహాయంతో) తెచ్చి ఆమెకు చూపిస్తాడు. ఇది కొంచెం కష్టసాధ్యమైనా సినిమాలో ఎమోషన్ పండింది. అయితే రీనా వర్మ విషయంలో ఇంత ప్రయాస లేదు. అదృష్టవశాత్తు ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ వీసా ఇచ్చింది. కాకపోతే 1965 నుంచి ట్రై చేస్తుంటే 2022కు. మొన్న శనివారం (జూలై 16) వాఘా సరిహద్దు దాటి ఆమె పాకిస్తాన్లోకి అడుగుపెట్టింది. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌ను వదిలాక ఇన్నేళ్ల తర్వాత తన ఇంటిని చూసుకోవడానికి అక్కడకు వెళ్లింది రీనా వర్మ. రావల్పిండిలో బాల్యం పూణెలో నివసిస్తున్న 90 ఏళ్ల రీనా వర్మ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో పుట్టి పెరిగింది. అక్కడి ‘ప్రేమ్‌నివాస్’ అనే ఏరియాలో ఆమె బాల్యం గడిచింది. ‘మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పని చేసేవాడు. నాకు నలుగురు తోబుట్టువులు. నేను అక్కడి మోడర్న్ స్కూల్లో చదువుకున్నాను. మా నాన్న ఆ రోజుల్లోనే చాలా ప్రోగ్రెసివ్. ఆడపిల్లలను చదివించాలనుకున్నాడు. మా పెద్దక్క 1930లలోనే కాలేజీలో చదివింది. రావల్పిండి శివార్లలో మూరీ అనే హిల్ స్టేషన్ ఉంది. కొన్నాళ్లు అక్కడ మా నాన్న పని చేశాడు. అక్కడంతా బ్రిటిష్ వాళ్లు ఉండేవాళ్లు. వాళ్లతో మేము కలిసి మెలిసి ఉన్నాం’ అని చెప్పింది రీనా వర్మ. ఆమె అసలు పేరు రీనా చిబ్బర్. పెళ్లయ్యాక రీనా వర్మ అయ్యింది. దేశ విభజన 1932లో పుట్టిన రీనా వర్మకు దేశ విభజన నాటికి 15 ఏళ్లు. ‘దేశ విభజన వరకూ మాకు మత కలహాలు అంటే తెలియదు. మా ఇంటికి ముస్లింలు, శిక్కులు వచ్చి పోతుండేవారు. అందరూ స్నేహంగా ఉండేవాళ్లు. కాని దేశ విభజన సమయానికి అల్లర్లు పెరిగిపోయాయి. మా అమ్మ అసలు దేశం విడిపోతుందంటే నమ్మలేదు. కాని మేము ఢిల్లీ వచ్చేశాం’ అంది రీనా వర్మ. ‘ఢిల్లీ వచ్చాక ఆమె తొలి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనడం నాకొక గొప్ప అనుభూతి. అప్పుడు నెహ్రూగారిని చూశాను. మళ్లీ 1962 ఇండో చైనా యుద్ధం తర్వాత జరిగిన రిపబ్లిక్ డేలో లతా మంగేష్కర్ ‘ఏ మేరే వతన్ కే లోగో’ పాడుతున్నప్పుడు నేను నెహ్రూ గారి వెనుకనే కూచుని ఉన్నాను. ఆయన కన్నీరు కార్చడం నేను చూశాను’ అంటుంది రీనా. పెళ్లి తర్వాత ఆమె బెంగళూరు వచ్చి కావేరీ ఎంపోరియమ్‌లో పని చేయడం మొదలెట్టింది. భర్త హెచ్.ఏ.ఎల్ (హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్)లో చేసేవాడు. కాని ఎక్కడ ఉన్నా ఆమెకు ఒక్కసారి తిరిగి రావల్పిండి చూసి రావాలనే కోరిక వేధించేది. 1965 నుంచి ప్రయత్నిస్తే... 1965లో పాకిస్తాన్ వీసా కోసం ప్రయత్నిస్తే రాలేదు. కాని మధ్యలో క్రికెట్ మేచ్‌ల కోసం వీసాలు ఇస్తున్నారంటే 1990లో లాహోర్‌కు వెళ్లింది కాని రావల్పిండికి వెళ్లలేకపోయింది. 2021లో ఆమె తన ఫేస్బుక్లో రావల్పిండి గురించి రాస్తే పాకిస్తాన్‌కు చెందిన సజ్జద్ హైదర్ అనే వ్యక్తి రావల్పిండిలోని ఆమె ఇంటి ఫొటో తీసి పంపాడు. అది చూసినప్పటి నుంచి ఆమెకు ఇంకా ఆ ఇల్లు చూడాలనే కోరిక పుట్టింది. మళ్లీ వీసా కోసం అప్లై చేస్తే రాలేదు. ఇంకోసారి వీసాకు అప్లై చేసి ఆ విషయాన్ని ఫేస్బుక్లో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీకి ట్యాగ్ చేయడంతో 90 ఏళ్ల రీనా వర్మ కోరికను మన్నించాల్సిందిగా ఆమె ఆదేశాలు ఇచ్చింది. పాకిస్తాన్ హై కమిషన్ ఆమెకు వెంటనే మూడు నెలల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు గుండా ఆమె రోడ్డు మార్గంలో పాకిస్తాన్లో అడుగుపెట్టింది. మాలాంటి వాళ్ల కోసం నిజానికి భారత్, పాకిస్తాన్ల మధ్య 60 ఏళ్లు దాటిన వారి కోసం సరిహద్దుల్లో తక్షణ వీసాలు ఇచ్చే ఒప్పందం ఉంది. కాని దానిని పాటించడం లేదు. ‘విడిపోకుండా ఉంటే బాగుండేది. సరే విడిపోయాం. కాని మాలాంటి వాళ్ల కోసం ఇరుదేశాలు వీసాలు ఇస్తే కొన్ని పాత జ్ఞాపకాలను సజీవం చేసుకుంటాం’ అంటుంది రీనా వర్మ. ఈ కథనం అంతా వాఘా దాటిన వెంటనే రాస్తున్నది. ఆమె అక్కడ ఏం చూసిందో ఏం చేసిందో మరో కథనంలో చెప్పుకుందాం. ఒక మంచి తలంపును గట్టిగా తలిస్తే నెరవేరుతుంది అనడానికి రీనా వర్మ ఒక ఉదాహరణ.