వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్‌సీఐఎస్ తెలిపింది.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్‌సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో యూఎస్‌సీఐఎస్ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని వివరించింది.
భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment