registration
-
BC Declaration బీసీలకు అభయ‘హస్తం’
బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణలో కాంగ్రెస్ (congress) ప్రభుత్వం చరి త్రాత్మకమైన కులగణన పూర్తి చేసింది. దీంతో ప్రతిపక్ష పార్టీల్లో వణుకు మొదలైంది. కులగణనను శాస్త్రీయంగా పూర్తిచేసి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభు త్వాన్ని అభినందించాల్సింది పోయి... ప్రతిపక్షాలు దిగజారుడుతనంతో విమర్శలు కొనసాగించడం బాధాకరం. జనాభాలో సగంపైగా ఉన్న బీసీలకు సమ న్యాయం జరగాలనే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... తొలుత తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దీనిపై ముందడుగు వేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే 2023 నవంబర్‌లో కామారెడ్డి బహిరంగ సభలోకాంగ్రెస్ ‘బీసీ డిక్లరేషన్’ (BC Declaration) ప్రకటించింది. ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాష్ట్రంలో కులగణన చేపడుతామని చెప్పారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కుల గణన అంశాన్ని చేపట్టి పూర్తి చేసింది. రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీ జనాభా ఉందని నిర్ధారణ కావడంతో బీసీలకు న్యాయం చేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపుల్ల లేస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివరాలను కేసీఆర్ సర్కార్ ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో బీసీ జనాభా 56 శాతానికి పైగా ఉందంటే, తక్కువ చేసి చూపిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు గగ్గోలు పెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేలా శాసనం చేసేందుకు అనేక చట్టపరమైన ప్రక్రియలుంటాయి. దీనికి సమయం పట్టే అవకాశం ఉండడంతో కాలయాపన జరగకుండా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రక టించినట్టు బీఆర్ఎస్, బీజేపీలు కూడా 42 శాతం బీసీలకు టికెట్లిస్తాయా అని ప్రశ్నిస్తే ఆ పార్టీలు సరైన రీతిలో స్పందించకుండా అసలు విషయాన్ని దారి మళ్లిస్తున్నాయి. గతంలో స్థానిక ఎన్నికల్లో 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించింది బీఆర్ఎస్. ఇప్పుడు అది నిరాధార ఆరోపణలతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తోంది.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJ)P)దేశంలో జనగణన చేపట్టకుండా తాత్సారం చేస్తోంది. తక్షణమే జనగణన నిర్వహించి, అందులో భాగంగా కులగణన కూడా చేపట్టి జనాభా ప్రాతిపదికన సంబంధిత సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలికంగా డిమాండ్ చేస్తున్నా ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మనుశాస్త్ర ధర్మాన్ని అనుసరిస్తూ, రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్‌నే అవమా నిస్తున్న బీజేపీ నుండి సామాజిక న్యాయం ఆశించడం అత్యాశే అవుతుంది. బీజేపీవారు దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై అర్థరహిత వ్యాఖ్యలు చేస్తున్నారు.దేశంలో జనగణన, కులగణన చేపట్టాలని సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ కోరుతుంటే వారి కులాలను ప్రస్తావించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తు న్నారు. ముస్లింలను బీసీ సామాజికవర్గంలో ఎలా చేరుస్తారనీ, వారికి రిజర్వేషన్లు ఎలా కల్పిస్తారనీ బీజేపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో మత ఉద్రిక్తతలు సృష్టించాలని చూస్తున్నారు. ముస్లింలలో వెనుకబడిన వారు లేరా? బీజేపీ వారి మోడల్‌గా చెప్పుకునే గుజరాత్లో ఓబీసీ ముస్లింలుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఉండకూడదా? తెలంగాణ ప్రభుత్వం కులగణన నివేదిక అనంతరం బీజేపీ రాజ్యసభ సభ్యులు, బీసీ నేత ఆర్.కృష్ణయ్య ఈ అంశాన్ని స్వాగతిస్తుంటే, ఆ పార్టీలో మరికొందరు కులగణన తప్పుడు లెక్కలంటూ వ్యాఖ్యానించడడం ఆ పార్టీ ద్వంద్వ నీతికి నిదర్శనం. బలహీన వర్గాలకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను విఫలం చేయడానికి ప్రతి పక్షాలు పన్నుతున్న కుట్రలను వెనుకబడిన తరగతుల ప్రజలు గమనించాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం ప్రధాని మోదీని ఒప్పించ గలరా? ఇందుకోసం బీఆర్ఎస్ కూడా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. 2023 ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పిన బీజేపీ... ఎన్నికల సమయానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన బండి సంజ య్‌ను తొలగించి, ఆయన స్థానంలో ఓసీ వర్గీయుడైన కిషన్‌రెడ్డిని నియమించింది. తెలంగాణకు ముఖ్య మంత్రిగా దళితుడిని చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే అందలమెక్కారు. ఈ రెండు పార్టీలకు భిన్నంగా సామాజిక న్యాయం పాటిస్తూ కాంగ్రెస్... బీసీ సామాజిక వర్గానికి చెందిన నన్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. కాంగ్రెస్‌తోనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని, బీసీ లకు కాంగ్రెస్సే అభయహస్తం ఇవ్వగలదని కుల గణనతో మరోసారి నిరూపితమైంది. ప్రతిపక్షాలు కీలకమైన విషయాలను పక్కదారి పట్టిస్తే రాష్ట్రంలోని బీసీ సామాజికవర్గం సరైన సమయంలో బుద్ధి చెప్పడం ఖాయం. -బి. మహేశ్ కుమార్ గౌడ్ వ్యాసకర్త ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు -
ఎయిడెడ్ పాఠశాలలపై కొరడా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని గత మూడేళ్లుగా చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. 2024–25 విద్యా సంవత్సరం యూడైస్ ఆధారంగా 40 కంటే ఎక్కువ మంది విద్యార్థులను పెంచుకోలేని ఎయిడెడ్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది. అలాంటి స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే నివేదిక పంపాలని కోరింది. దీంతోపాటు ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించేందుకు మండల స్థాయిలో త్రీమెన్ కమిటీని ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇందులో డీవైఈవో, ఎంఈవో, సీనియర్ హెచ్ఎం సభ్యులుగా ఉంటారు. ఇప్పటికే యూడైస్, వాస్తవ హాజరులో తేడా ఉన్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఎయిడెడ్ పాఠశాలల్లోని ప్రవేశ రిజిస్టర్లు, విద్యార్థుల రికార్డులను ఒకటికి రెండుసార్లు త్రీమెన్ కమిటీ పరిశీలించనుంది. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు పాఠశాలలు, మండలాలు, జిల్లాల వారీగా వాస్తవ హాజరు నమోదు ఎంత అనేది నిర్ధారించి రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టరేట్‌కు నివేదిక అందిస్తారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 595 ఎయిడెడ్ పాఠశాలలు కొనసాగుతుండగా, 3,010 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 40 మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్లు 126 కాగా, అసలు విద్యార్థులే లేకుండా 80 స్కూళ్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ‘ఎయిడెడ్ టీచర్లకు న్యాయం చేయాలి’ఎయిడెడ్ ఉపాధ్యాయులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు బదలాయించి న్యాయం చేయాలని, మొత్తం ఎయిడెడ్ సెక్టార్‌ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఎయిడెడ్ స్కూళ్లల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.చిట్టిబాబు, ఎల్కే చిన్నప్ప, ప్రతినిధి సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. -
పారామెడికల్ వెబ్ఆప్షన్ నమోదుకు అవకాశం
సాక్షి, అమరావతి: 2024–25 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్ఆప్షన్ల స్వీకరణ ప్రారంభించింది.ఈ నెల 10వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు గడువు ఇచ్చారు. ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్ట్‌ను అధికారిక వెబ్సైట్లో గురువారం పొందుపరిచారు. -
హెచ్-1బీ వీసాదారులకు అలర్ట్!
వాషింగ్టన్ : 2025-26 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 7 నుంచి ప్రారంభమై మార్చి 24న ముగియనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ విభాగం అధికారికంగా ప్రకటించింది.భారత్ నుంచి ఎక్కువ డిమాండ్ ఉండే హెచ్-1బీ వీసా ఉద్యోగులకు ఆయా కంపెనీలు స్పాన్సర్ చేస్తుంటాయి. అందుకు అయ్యే ఈ-రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీ మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంది. ఉద్యోగికి ఏదైనా సంస్థ హెచ్-1బీ వీసా ఇచ్చేందుకు ఈ-రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపెనీలు పది డాలర్లు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ కంపెనీలే ఏకంగా ఏడాదికి 125 డాలర్ల రుసుము చెల్లించాల్సి వస్తుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. The initial registration period for the fiscal year 2026 H-1B cap will run from noon ET on March 7 to noon ET on March 24. Prospective petitioners & representatives must use a USCIS online account to register each beneficiary ... (1/3)— USCIS (@USCIS) February 5, 2025హెచ్-1బీ రిజిస్ట్రేషన్ గతేడా జోబైడెన్ ప్రభుత్వం బెనిఫిషియరీ సెంట్రిక్ సిస్టమ్‌ను ప్రారంభించింది. ఆ విధానం ఈ ఏడాది కొనసాగుతుంది. ఈ విధానంలో ప్రతి దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసినా ఒక్కసారి మాత్రమే అతడి పేరు లాటరీలో నమోదవుతుంది. -
అందుకు వెనుకాడుతున్న సహజీవన జంటలు..!
డెహ్రాడూన్:ఉత్తరాఖండ్‌లో యూనిఫామ్ సివిల్‌కోడ్(యూసీసీ) జనవరి 27న అమలులోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా అన్ని మతాల్లోని వ్యక్తులకు వివాహం,ఆస్తిహక్కులు తదితర అంశాల్లో ఒకే రకమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఏ మతంలోనూ బహుభార్యత్వాన్ని యూసీసీ అనుమతించదు. వీటికితోడు యూసీసీ కింద సహజీవనాలను సైతం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటలు దరఖాస్తు చేసుకుని తమ సహజీవనాన్ని నమోదు చేసుకోవాలి. అయితే సహజీవనాల నమోదుకు ఇప్పటివరకు 5 దరఖాస్తులు రాగా కేవలం ఒక సహజీవనం మాత్రమే రిజిస్టర్ అయింది. అయితే సహజీవనాల నమోదుకు పెద్దగా స్పందన లేదన్న వాదన కొంత మంది వినిపిస్తున్నారు. దీనిని మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. చట్టంపై ప్రజల్లో అవగాహన రావడానికి సమయం పడుతుందంటున్నారు. సహజీవనాల నమోదుకు చాలా మంది ఇష్టపడడం లేదన్న వాదనా ఉంది. అయితే సహజీవనం నమోదు చేసుకోకపోతే యూసీసీ కింద జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.సహజీవనాల నమోదును చాలా మంది వ్యతిరేకించినప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. శ్రద్దావాకర్ తరహా ఘటనలు పునరావృతం కావద్దంటే సహజీవనాల నమోదు తప్పనిసరన్న నిబంధనను తీసుకువచ్చింది. -
సడన్ ఫేమ్.. డీప్‌సీక్‌పై సైబర్ ఎటాక్
జనరేటివ్ ఏఐ సేవలందిస్తున్న చైనీస్ టెక్ స్టార్టప్ డీప్‌సీక్(DeepSeek)పై సైబర్‌దాడి జరిగినట్లు ప్రకటించింది. ఈ దాడి కారణంగా కొత్త వినియోగదారుల రిజిస్ట్రేషన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో సైట్లో నమోదు చేసుకునే వినియోగదారుల సంఖ్యపై ప్రభావం పడింది. సైబర్‌దాడి(Cyber Attack) పరిమిత విభాగానికి చెందిందని, రిజిస్టర్డ్ వినియోగదారులు సాధారణంగా లాగిన్ చేయవచ్చని స్పష్టం చేసింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్(AI Chat Bot) సేవలందించే డీప్‌సీక్ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తోంది. ఓపెన్ ఏఐకు సవాలు విసురుతూ జనరేటివ్ ఏఐ రంగంలో విప్లవాత్మక మార్పునకు పునాది వేసింది. చాటీజీపీటీ పెయిడ్ వర్షన్ అందించే సేవలకు ధీటుగా డీప్‌సీక్‌కు చెందిన ఆర్-1 ఉచితంగానే సర్వీసు అందిస్తున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంతో అమెరికన్ టెక్ కంపెనీ స్టాక్‌లు ఇటీవల గణనీయంగా పడిపోయాయి. కంపెనీపై జరిగిన సైబర్ దాడి వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తుంది.కంపెనీ స్పందన..డీప్‌సీక్‌కు పెరుగుతున్న ప్రజాదరణతో సైబర్ మోసగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు కంపెనీ స్టేటస్ పేజీ ద్వారా తెలిసింది. సమస్యలను పరిష్కరించడానికి, నిరంతర సేవను అందించేందుకు కృషి చేస్తున్నామని డీప్‌సీక్ వినియోగదారులకు హామీ ఇచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగంలో అమెరికా, చైనాల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంపై ఈ సైబర్ దాడి చర్చలకు దారితీసింది. డీప్‌సీక్ వేగవంతమైన పురోగతి, తక్కువ ఖర్చు కారణంగా హడావుడిగా సేవలు ప్రారంభించి, సరైన భద్రత ప్రమాణాలు పాటించడంలేదని కొంతమంది యూఎస్ టెక్ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.డీప్‌సీక్ ఆర్-1భవిష్యత్తులో చైనా ఏఐ స్టార్టప్ డీప్‌సీక్ అభివృద్ధి చేసిన ఆర్-1 అమెరికా టెక్ కంపెనీలు అభివృద్ధి చేస్తున్న చాట్‌జీపీటీ, ఓపెన్ ఏఐ తదితరాలకు తీవ్ర పోటీతో చెక్ పెట్టనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఏఐలో చైనా వేగాన్ని నిలువరించేందుకు వీలుగా ఇప్పటికే అమెరికా ఆధునిక సెమీ కండక్టర్ టెక్నాలజీలను ఎగుమతి చేయకుండా నిషేధించింది. ఎన్విడియా రూపొందిస్తున్న ఏఐ చిప్స్ తదితరాలపై ఆంక్షలు విధించింది. డీప్‌సీక్ అభివృద్ధి చేసిన తాజా ఏఐ మోడల్‌ను గత వారమే మార్కెట్లో విడుదల చేసింది. ఇది ఓపెన్ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్‌కు దీటైన పోటీని ఇవ్వనున్నట్లు టెక్నాలజీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానంగా అమెరికా టెక్ దిగ్గజాలు వందల కోట్ల డాలర్లు వెచ్చించి అభివృద్ధి చేస్తున్న ఏఐ సేవలకు దీటుగా చైనీస్ ఏఐ చౌకగా సేవలు అందించే వీలుందని విశ్లేషకులు అంటున్నారు. ఇది తీవ్ర పోటీకి తెరతీయడంతో యూఎస్ టెక్ దిగ్గజాల పెట్టుబడులపై ఆశించిన స్థాయిలో రిటర్నులకు తెరపడవచ్చని ఆందోళన నెలకొంది. ఫలితంగా ఉన్నట్టుండి టెక్ కౌంటర్లలో అమ్మకాలు నమోదవుతున్నట్లు నిపుణులు తెలియజేశారు.ఇదీ చదవండి: భారత్‌లో క్రెడిట్ కార్డుల జోరుఆందోళనలు.. ‘డీప్’గత వారమే విడుదలైన డీప్‌సీక్ తాజా ఏఐ మోడల్.. అమెరికా ఐఫోన్ల టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్ యాప్ స్టోర్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరినట్లు తెలుస్తోంది. దీంతో క్వాంట్ ఫండ్ చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ ఏర్పాటు చేసిన ఈ ఓపెన్ సోర్స్ ప్రొడక్ట్.. ఓపెన్ ఏఐ, మెటా ప్లాట్‌ఫామ్స్ కు పోటీగా నిలుస్తుందన్న అంచనాలు పెరిగాయి. వెరసి అడ్వాన్స్డ్ చిప్స్, అత్యున్నత కంప్యూటింగ్ పవర్‌లపై ఆధారపడిన ప్రస్తుత యూఎస్ ఏఐ బిజినెస్ మోడల్‌ను ఆర్-1 దెబ్బతీయవచ్చన్న ఆందోళనలు వ్యాప్తిస్తున్నాయి. ఏఐ విస్తృతిలో ప్రధానంగా ఎన్విడియాకు భారీ అవకాశాలు లభించాయి. అయితే ఆర్1 సెగ ఎన్విడియాకు అధికంగా తగులుతుందనేది నిపుణులు మాట. -
వారంలోనే పాస్‌పోర్ట్ స్లాట్!
సాక్షి, హైదరాబాద్: పాస్‌పోర్ట్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకొన్న తర్వాత వారం రోజులలోపే స్లాట్ లభించేలా చర్యలు చేపట్టామని హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి (ఆర్పీఓ) జొన్నలగడ్డ స్నేహజ తెలిపారు. ప్రస్తుతం కొన్ని కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చే సుకొన్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని చెప్పా రు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘కోవిడ్ అనంతరం పాస్‌పోర్ట్ స్లాట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. దీంతో స్లాట్ కోసం 30 నుంచి 40 రోజులు వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని సంస్కరణలు చేపట్టడం ద్వారా ప్రస్తుతం దీనిని గరిష్టంగా 8 పని దినాలకు తగ్గించాం. 2025లో వారం రోజుల్లోనే స్లాట్ దొరికేలా చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’అని వివరించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాస్‌పోర్ట్ ఎన్వలప్ కవర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఆదిలాబాద్, కామారెడ్డిలో మరుసటి రోజే స్లాట్.. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్కే), 14 పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే) ఉన్నాయని స్నేహజ తెలిపారు. పీఓపీఎస్కేల్లోనూ వారం రోజుల్లోనే అపాయింట్మెంట్ దొరుకుతోందని చెప్పారు. ఆదిలాబాద్, కామారెడ్డి కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న మరుసటి రోజే స్లాట్ లభిస్తోందని వెల్లడించారు. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన తర్వాత పోలీసు వెరిఫికేషన్‌కు పట్టే సమయాన్ని మినహాయించి తత్కాల్ పాస్‌పోర్టును ఒకటి నుంచి మూడు పని దినాలు, సాధారణ పాస్‌పోర్టును ఐదు నుంచి ఏడు పనిదినాల్లో జారీ చేస్తున్నాం’అని వివరించారు.సందేహాల నివృత్తికి వాట్సాప్ నంబర్దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించడానికి సికింద్రాబాద్‌లోని రీజినల్ పాస్‌పోర్ట్ కార్యాలయంలో పబ్లిక్ డేలు నిర్వహిస్తున్నామని స్నేహజ తెలిపారు. ప్రతి గురువారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు అపాయింట్మెంట్ లేకుండానే నేరుగా రావచ్చని, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకున్నవాళ్లు సోమ, మంగళ, శుక్రవారాల్లో రావాలని సూచించారు. ఈ రెండు రకాల సేవలను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ–మెయిల్, ఎక్స్, వాట్సాప్, ఫోన్‌కాల్స్ ద్వారానూ అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం ‘81214 01532’వాట్సాప్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో మొబైల్ వ్యాన్ ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందిస్తామని తెలిపారు. రెండేళ్లకు మించి శిక్షపడితే పాస్‌పోర్ట్ ఇవ్వం..పాస్‌పోర్ట్ పొందడానికి కనిష్ట, గరిష్ట వయో పరిమితులు లేవని స్నేహజ తెలిపారు. పోలీసు వెరిఫికేషన్‌లో ప్రతికూల అంశాలు తెలిసినా, దరఖాస్తుదారుడికి ఏదైనా కేసులో రెండేళ్లకు మించి శిక్షపడినా పాస్‌పోర్ట్ జారీ చేయబోమని చెప్పారు. అలాంటివారికి కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తామని పేర్కొన్నారు. సింగిల్ పేరెంట్ మైనర్ల విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరి నుంచి అనుమతి చాలని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిపారు.‘పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న వాళ్లు ఆ దరఖాస్తుతో ఎఫ్ఐఆర్ కాపీని జత చేయక్కర్లేదు. మీ–సేవా కేంద్రం నుంచి తీసుకున్న ‘లాస్ట్’ సర్టీఫికెట్ ఇస్తే సరిపోతుంది. వివాహానంతరం ఇంటి పేరు మారిన మహిళలు తాజా అడ్రస్ ప్రూఫ్‌తో డాక్యుమెంట్లు ఇస్తే చాలు. మ్యారేజ్ సర్టీఫికెట్ తప్పనిసరి కాదు’అని పేర్కొన్నారు. బ్రాంచ్ సెక్రటేరియేట్ నుంచి గత ఏడాది 1,400 సర్టీఫికెట్ల అటెస్టేషన్ లేదా అపోస్టల్ చేశామని వివరించారు.‘పాస్‌పోర్టు’ సమస్యలు..సందేహాలా?89777 94588 నంబర్‌కు వాట్సాప్ చేయండి.. పాస్‌పోర్ట్ ఆఫీసర్ స్నేహజ సమాధానాలిస్తారుపాస్పోర్టు కోసమే కాకుండా.. అది వచ్చిన తర్వాత కూడా ప్రజలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఎస్కే), పోస్టాఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాలు (పీఓపీఎస్‌కే), వెబ్సైట్ లాంటివి ఉన్నా సామాన్యుడికి ఇప్పటికీ అనేక సందేహాలు, సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతిక అంశాలు అర్థంకాక ఇప్పటికీ పలువురు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. కేవలం రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయం జారీ చేసే పాస్‌పోర్టు విషయంలోనే కాదు.. దీనికి అనుబంధంగా ఉండే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బ్రాంచ్ సెక్రటేరియెట్ అందించే అటెస్టేష¯న్ అండ్ అపోస్టల్ సేవల పైనా పలు సందేహాలు ఉంటున్నాయి. ఈ సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు ముందుకు వచ్చింది ‘మీతో సాక్షి’. మీ వివరాలు, సమస్య, సందేహాన్ని 89777–94588 నంబర్‌కు టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌ల రూపంలో వాట్సాప్ చేయండి. ‘మీతో సాక్షి’ వీటిని రీజనల్ పాస్‌పోర్టు అధికారిణి జొన్నలగడ్డ స్నేహజ దృష్టికి తీసుకెళుతుంది. మీ సందేహాలు, సమస్యలకు పరిష్కారం చూపుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ సమస్యలు, సందేహాలు వెంటనే తెలియజేయండి. -
కార్మికా.. మేలుకో
రోజంతా రెక్కాడితే గానీ డొక్కాడని కూలీ కుటుంబాలవి. చేతినిండా పని దొరికితేనే కడుపు నిండేది. లేకపోతే పస్తులు ఉండాల్సి వస్తుంది. భవన నిర్మాణ రంగంలో పని చేసే దినసరి కార్మికుల పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ క్రమంలోనే వారి సంక్షేమం కోసం కార్మిక శాఖ పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అయితే, ఈ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇందులో సభ్యుడిగా చేరడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఈ కార్డును ఎలా తీసుకోవాలి? ఇందువల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. కడప కోటిరెడ్డిసర్కిల్: భవన నిర్మాణ రంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని ద్రాక్షలా మారాయి. రిజి్రస్టేషన్ చేసుకున్న కార్మికులకు సంబంధించి కడప నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా 3,65,648 మందికి పైగా కార్మికులు ఉన్నారు. అయితే గుర్తింపు కార్డు పొందని కార్మికులు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణ రంగంతోపాటు పెయింటర్లు, కార్పెంటర్లు, ఫ్లంబర్లుగా అనేక మంది పని చేస్తున్నారు. ప్రస్తుతం కార్మికులు రోజూ పని కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కడప నగరంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ఉదయం జెడ్పీ కార్యాలయం, అప్సర సర్కిల్లోని అడ్డాలకు చేరుకుని వేచి చూస్తుంటారు. కొందరికి పని దొరకుతున్నా, మరికొందరు ఇబ్బంది పడుతున్నారు. అవగాహన లేమితో నష్టపోతున్న వైనం కార్మికులకు అవగాహన లేకపోవడంతో ఎక్కువ మంది గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారు. కార్డులు కలిగిన కార్మికులకు నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇవ్వాల్సి ఉండగా, శిక్షణ కాలంలో రూ.300 స్టయిఫండ్ ఇస్తారు. అలాగే 60 ఏళ్లు దాటిన కార్మికులకు రూ.1000–5000 పెన్షన్ అందజేస్తారు. కార్మికుల పిల్లలకు ఉచిత విద్య, వివాహాలకు నగదు అందిస్తారు. భవన యజమానులు నిర్మాణ రిజిస్ట్రేషన్ చేసి.. పని చేసే కార్మికుల పేరిట ఒక శాతం కార్మిక శాఖకు సెస్ చెల్లించాలి. వీటిపై అధికారులు సరైన అవగాహన కల్పించకపోవడంతో కార్మికులు నష్టపోతున్నారు. ఈ విషయాలపై అధికారులు అవగాహన కల్పించి.. అన్ని పథకాలు అందేలా చూడాలని పలువురు కార్మికులు కోరుతున్నారు. వివిధ వృత్తుల్లో..భవన నిర్మాణ రంగానికి సంబంధించి పలు విభాగాల కార్మికులు పని చేస్తున్నారు. మట్టి పని, పునాది గుంతలు తీయడం, చదును, తాపీ మేస్త్రీ, కూలీలు, రాడ్‌బెండింగ్, కార్పెంటర్లు, పెయింటర్లు, సెంట్రింగ్, ఫ్లంబర్లు, ఎల్రక్టీíÙయన్లు, పాలీష్ వేసే వారు ఉన్నారు. సీలింగ్, కంకర కార్మికులు, రోడ్డు నిర్మాణ కూలీలు, క్రేన్, పొక్లెయినర్ ఆపరేటర్లు తమ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. చెరువులు తవ్వడం, పూడిక తీయడం, బోర్‌వెల్స్, సిమెంటు ఇటుకలు తయారు చేసే వారు ఇదే రంగంపై ఆధారపడి ఉన్నారు. వీరికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయడంతోపాటు పని భద్రత కల్పించాలి. గుర్తింపు కార్డులు పొందాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో ఆధార్, రెండు ఫొటోలు, నామిని ఆధార్ కార్డుతోపాటు రూ.50 సభ్యత్వ రుసుం చెల్లించాలి. -
రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు చెల్లదు
సాక్షి, అమరావతి: రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రిజిస్టర్డ్ సేల్డీడ్లను రద్దు చేసే ముందు బాధితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినడం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏకపక్ష రిజిస్టర్డ్ సేల్డీడ్ల రద్దు వల్ల ఆస్తిపై హక్కు కోల్పోయే బాధితులకు తమ వాదన వినిపించేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమే కాక, ఏకపక్ష అధికార వినియోగమేనని తేల్చి చెప్పింది. ఇందుకు సంబంధించిన నిబంధన ఏదీ రిజిస్ట్రేషన్ రూల్స్‌లో నిర్ధిష్టంగా లేకపోయినప్పటికీ, అది రూల్స్‌లో ఉన్నట్టుగానే భావించి అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ‘ఏపీ రిజిస్ట్రేషన్ రూల్స్ 26(కె)(1) ప్రకారం సేల్డీడ్లను రద్దు చేయాలంటే.. సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు ప్రభుత్వ/అసైన్డ్/దేవదాయ లేదా రిజిస్టర్ చేయడానికి వీల్లేని భూములు అని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి ఉండాలి. అప్పుడే ఆ ఉత్తర్వులను అమలు చేయాల్సిన సివిల్ కోర్టు/ప్రభుత్వ అధికారి సంబంధిత ఆస్తుల సేల్డీడ్లను రద్దు చేయడం సాధ్యమవుతుంది. రిజిస్టర్డ్ సేల్డీడ్లలో పేర్కొన్న ఆస్తులు పైన పేర్కొన్న కేటగిరీలో ఉన్నట్టు ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోతే, సేల్డీడ్ల రద్దుకు రూల్ 26(కె)(1) వర్తించదు. ఈ రూల్‌లో ఎక్కడా ఆస్తి స్వభావంపై అధికారులు విచారణ చేపట్టాలని లేదు. సేల్డీడ్లలోని భూమి ఫలానా భూమి అంటూ ప్రభుత్వ ఉత్తర్వులు ఉంటే.. దాని ఆధారంగా అధికారాన్ని ఉపయోగించవచ్చని మాత్రమే ఉంది. సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేదు కాబట్టి, దానిని అలా వదిలేయాలా? దీనికి సుప్రీంకోర్టు గతంలో ఓ కేసులో సమాధానం చెప్పింది. నోటీసులు ఇచ్చి వాదనలు వినే అవసరం గురించి రూల్స్‌లో లేకుంటే.. ఆ రూల్స్‌ను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అధికారుల చర్యలను ఏకపక్షంగా ప్రకటించాలని కోరవచ్చని ఆ తీర్పులో చెప్పింది. అందువల్ల సేల్డీడ్ల రద్దుకు ముందు బాధిత వ్యక్తులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు వినాలని రూల్స్‌లో లేకపోయినా.. అది రూల్స్‌లో ఉన్నట్లే భావించాలి’ అని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ఇటీవల తీర్పు వెలువరించారు.సేల్డీడ్ల రద్దుపై న్యాయ పోరాటం విశాఖ జిల్లా సబ్బవరం మండలం గాలి భీమవరం గ్రామానికి చెందిన జోరీగల బంగారం తనకు ఇరువాడ, అసకపల్లి గ్రామాల్లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 4.90 ఎకరాల భూమిని జి.నాగేశ్వరరావు, ఎన్.రమణ, షేక్ ఆసీఫ్ పాషాలకు 2013లో విక్రయించారు. సబ్బవరం రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పూర్తయింది. అధికారులు సేల్డీడ్లు కూడా జారీ చేశారు. 2014లో ఆ సేల్డీడ్లను అధికారులు రద్దు చేశారు. దీనిని సవాల్ చేస్తూ బంగారం తదితరులు 2014లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఇటీవల జస్టిస్ రఘునందన్‌రావు తుది విచారణ జరిపి పైవిధంగా తీర్పు వెలువరించారు. -
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? అయితే రవాణా శాఖ లెక్కల్లో అది లేనట్టే. అలాంటి వాహనాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే. అంతేకాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయడం కూడా సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేని వాహనాలకు రవాణా శాఖ ఆమోదం లేనట్లుగానే భావించాలి. వాటిపై ఆర్టీఏ నుంచి ఎలాంటి పౌరసేవలు లభించవు. ఇంత కీలకమైన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమలుకు నోచుకోవడం లేదు. వాహనదారులు ఇష్టారాజ్యంగా తమకు నచి్చన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికైనా హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమర్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనాల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్ఎస్ఆర్పీ అమల్లోకి వచి్చంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమలు తీరు నత్తనడకను తలపిస్తోంది. లక్షలాది వాహనాలు హెచ్ఎస్ఆర్పీకి దూరంగానే ఉన్నాయి. నాణ్యతపై నమ్మకం లేక.. ఆరీ్టఏలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతీ వాహనానికి ఒక కోడ్‌ను కేటాయిస్తూ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లో హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో నమోదైన కోడ్ ఆధారంగానే రవాణా శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వాహనం ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలన్నా, పన్నులు, ఫీజులు చెల్లించాలన్నా ఈ కోడ్ ఆధారంగానే సాధ్యమవుతుంది. చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల నాణ్యత నాసిరకంగా ఉందని, అమర్చిన కొద్దిరోజులకే ఇవి పాడవుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్యూమినియం నంబర్ ప్లేట్‌పై నల్లటి రంగులో రాసే అంకెలు సైతం ఎక్కువ కాలం ఉండడం లేదు. ఒకటి రెండేళ్లలోనే చెదిరిపోతున్నాయి. దీంతో వాహనదారులు తమకు నచి్చన విధానంలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? ⇒వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ప్రభుత్వం హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమల్లోకి తెచి్చంది. దీని అమలు బాధ్యతను అప్పట్లో ఆర్టీసీకి అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే హెచ్ఎస్ఆర్పీ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ కొత్తగా రిజి్రస్టేషన్ అయ్యే వాహనాల డిమాండ్ మేరకు హెచ్ఎస్ఆర్పీ సరఫరాలో ఆ సంస్థ విఫలమైంది. ⇒ ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతుండగా రోజుకు కనీసం వెయ్యి వాహనాలకు కూడా నంబర్ప్లేట్లు అందడంలేదు. దీంతో వాహనదారులు రిజి్రస్టేషన్ల కోసం 3 నుంచి 6 నెలల వరకు పడిగాపులు కాయాల్సివస్తోంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులు తయారీ సంస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు నంబర్ ప్లేట్ ఉంటేనే బండి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేశారు. అయినా పెద్దగా పురోగతి కనిపించడంలేదు. ఆర్టీఓ స్థాయిలోనే మార్పు హెచ్ఎస్ఆర్పీ లేకపోవడం వల్ల నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్‌ను పునరుద్ధరించే సదుపాయం ఇప్పటి వరకు రవాణా కమిషనర్ కార్యాలయానికే పరిమితం కాగా.. ఇటీవల దీనిని వికేంద్రీకరించారు. కిందిస్థాయిలో జిల్లా, ప్రాంతీయ రవాణా అధికారులు కూడా పునరుద్ధరించే సదుపాయం కలి్పంచారు. వాహనదారులు ఇందుకోసం హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకొని అధికారులను సంప్రదించవచ్చు. -
ఉపాధ్యాయులూ మేల్కొనండి!
వరంగల్–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా.. ఓటు నమోదుపై ఉపాధ్యాయులు పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లుండగా.. ప్రస్తుతం మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.నవంబర్ 6 వరకు గడువు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 30న ఓటరు నమోదు షెడ్యూల్‌ను విడుదల చేసింది. నవంబర్ 6వ తేదీ ఆఖరు తేదీగా ప్రకటించింది. గత ఎన్నికల ఓటరు జాబితా రద్దు చేశామని.. గతంలో ఓటు ఉన్న వారు కూడా తిరిగి నమోదు చేసుకోవాలని ఎన్నికల అధికారులు చెప్పారు. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానంలో ఓటర్ నమోదుకు అవకాశం కల్పించారు. ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభమై నెల రోజులు దాటింది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం 12 కొత్త జిల్లాలున్నాయి. అందులో ఇప్పటి వరకు 10,089 మంది మాత్రమే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. పెరిగిన ఉపాధ్యాయుల సంఖ్యఓటరు నమోదుకు ఆఖరి తేదీ నవంబరు 6. ఇంకా 10 రోజులు మాత్రమే గడువుంది. గత ఎన్నికల్లో 20,880 మంది ఓటర్లు ఉన్నందువల్ల ఈసారి ఉపాధ్యాయుల సంఖ్య కూడా పెరిగింది. ఓటర్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రధానంగా హైస్కూల్ ఉపాధ్యాయులు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, బీఈడీ కళాశాలల అధ్యాపకులతోపా టు ప్రభుత్వ రికగ్నైజ్డ్ హైస్కూళ్లు, కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఓటర్ నమోదుపై స్పందించాల్సి ఉంది. నివాసమే ప్రామాణికం..ఓటర్లుగా ఉపాధ్యాయులు, అధ్యాపకుల నమోదు గడువు నవంబర్ 1 అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ తేదీ కంటే ముందు కనీసం 3 ఏళ్లు కచ్చితంగా బోధించి ఉండాలి. ఎన్నిచోట్ల పని చేసినప్పటికీ 3 ఏళ్లు బోధించినట్లు సర్వీస్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత విద్యాశాఖాధికారి సంతకం తప్పనిసరిగా ఉంటేనే ఓటు నమోదుకు అవకాశం ఉంటుంది. నివాస ప్రాంతాన్నే ఎన్నికల సంఘం ఓటర్ నమోదుకు ప్రామాణికంగా నిర్ణయించింది. ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ చిరునామా ఆధారంగా ఓటు నమోదు చేసుకోవాలి. బోధన ఎక్కడ చేసినప్పటికీ అది ప్రామాణికం కాదు. ఉదాహరణకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో నల్లగొండలో నివసిస్తున్న వ్యక్తి వరంగల్ జిల్లాలో పనిచేస్తే.. ఆ వ్యక్తి నల్లగొండ చిరునామాతోనే ఓటు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ మూడు జిల్లాల్లో ఎక్కడైనా ఉపాధ్యాయుడు పని చేస్తూ.. కరీంనగర్ జిల్లాలో నివసిస్తుంటే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఓటు నమోదుకు చేసుకున్న దరఖాస్తుల ఆధారంగా వారి చిరునామాకు వెళ్లి.. దరఖాస్తుదారు ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడా? లేడా? అనేది సిబ్బంది పరిశీలించాలి. ఒకవేళ అక్కడ నివాసం లేకుంటే ఆ దరఖాస్తును తిరస్కరిస్తారు. ఉపాధ్యాయులు ఎక్కడ నివాసం ఉంటే.. అక్కడ ఓటు నమోదు చేసుకుంటేనే ఆ దరఖాస్తు చెల్లుబాటవుతుంది. నివాసం ప్రామాణికంగానే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి కోరుతున్నారు. -
ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు!
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదుకు సర్వర్ కష్టాలు వెంటాడుతున్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, యాప్ సరిగా పనిచేయకపోవడం వంటి సాంకేతిక సమస్యలకు తోడు శాఖల మధ్య సమన్వయ లోపంతో ఈ పంట నమోదులో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటున్నది. దాదాపు రెండు నెలలు ఆలస్యంగా ప్రారంభమైన ఈ పంట నమోదు నత్తనడకన సాగుతున్నది. గడిచిన నెల రోజుల్లో కేవలం 31 శాతం మాత్రమే పూర్తయింది. మరొక వైపు ఏది ఏమైనా సెపె్టంబర్ నెలాఖరులోగా పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలిస్తుండడంతో క్షేత్రస్థాయి సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు.సర్వర్లు పనిచేయక..ఫొటోలు అప్లోడ్ కాక.. రాష్ట్రంలో సాగుయోగ్యమైన భూముల వివరాలను మండల వ్యవసాయాధికారులు సర్వే నంబర్ల వారీగా ఈ–పంట వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. తొలుత గ్రామాల సర్వే నంబర్ల ఆధారంగా భూముల వివరాలను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆర్బీకే రైతులు సాగు చేసే పంట వివరాలను ఈ–పంట వెబ్సైట్లో నమోదు చేయాలి. ఈ ప్రొసీజర్ మొత్తం కంప్యూటర్లో మాత్రమే చేయాలి. గతంలో మాదిరిగా మొబైల్లో నమోదుకు అవకాశం ఇవ్వలేదు. మార్పులు, చేర్పులు చేయాలంటే పొలాల నుంచి మళ్లీ ఆఫీసుకు వచ్చి ఎడిట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. రెండో దశలో మొబైల్ ఫోన్ లేదా ట్యాబ్‌లలో ఈ–పంట అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని రిజి్రస్టేషన్ చేసుకుని ఈ–పంట వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వివరాల ఆధారంగా రైతు పొలం వద్దకు వెళ్లి జియో కో–ఆర్డినేట్స్‌తో సహా పంట ఫొటోలు తీసి అప్లోడ్ చేయాలి. నెట్వర్క్ సమస్యల వల్ల పంట ఫొటోలు తీసుకోవడం లేదు. రోజుకు 10 కిలోమీటర్లకు పైగా.. 200 మీటర్ల వరకు మాగాణి, 50 మీటర్ల వరకు మెట్ట పొలాలకు వెసులుబాటు ఇచ్చినప్పటికీ రోజుకు 10 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మూడో దశలో అప్లోడ్ చేసిన పంట వివరాలు, ఫొటోలను తొలుత వీఏఏలు,ఆ తర్వాత వీఆర్వోలు, చివరగా రైతులు అథంటికేషన్ (ఈ కేవైసీ) చేయాలి. కొన్ని జిల్లాలకు మాత్రమే సర్వర్లు ఇవ్వడం, ఆ సర్వర్లు కాస్తా సరిగా పనిచేయకపోవడంతో ఈ కేవైసీ నమోదులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రోజుకు వంద ఎకరాలు చేయాలంటూ ఒత్తిడి! ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు వ్యవసాయ, ఉద్యాన, పట్టు తదితర పంటలకు సంబంధించి 1,34,48,611 ఎకరాలు సాగవగా, వీఏఏలు 59,27,115 ఎకరాల వివరాలను మాత్రమే డౌన్లోడ్ చేసుకున్నారు. వాటిలో ఇప్పటి వరకు 31 శాతం మాత్రమే ఈ–పంట నమోదు పూర్తయింది. వెబ్సైట్, యాప్, సర్వర్లు మొరాయిస్తుండడంతో రోజుకు ఆర్బీకే పరిధిలో 30–40 ఎకరాలకు మించి ఈ–పంట నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ రోజుకు 100 ఎకరాల్లో పంట నమోదు చేయాల్సిందేనంటూ ఉన్నతాధికారులు జారీ చేస్తున్న ఆదేశాలు క్షేత్రస్థాయి సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.జియో కో– ఆర్డినేట్స్ పరిధిని పెంచాలి.. రాష్ట్రంలో ఈ–క్రాప్ నమోదు సజావుగా సాగడం లేదు. సర్వర్ సరిగా పనిచేయక, యాప్ సకాలంలో ఓపెన్ కాక నమోదులో జాప్యం జరుగుతోంది. నిర్ణీత గడువులోగా పూర్తికాకపోతే పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకోవడంలో కానీ, సంక్షేమ ఫలాలు పొందడంలో రైతులు నష్టపోతారు. విత్తనాల పంపిణీలో మహిళా కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్లను ఏ విధంగా సహాయకులుగా నియమించారో అదేరీతిలో ఈ–పంట నమోదులో వీఏఏలకు సహాయకులుగా వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్లను నియమించాలి. జియో ఫెన్సింగ్ మాగాణిలో 500 మీటర్లు మెట్టలో 250 మీటర్లకు పెంచాలి. – ఎం.హరిబాబు, ప్రధాన కార్యదర్శి, ఏపీ కౌలు రైతు సంఘం -
ఒకే రోజు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో కళ్లు బైర్లు కమ్మే అక్రమాలు వెలుగు చూశాయి. ఇటీవల బదిలీపై వెళ్లిన ఓ సబ్ రిజిస్ట్రార్ వెళుతూ.. వెళుతూ పెద్ద ఎత్తున అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. ఒకే రోజు ఏకంగా సుమారు 350 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు తేలింది. ఒక్కరోజే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయడంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు గురువారం సాయంత్రం ఈ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన విషయం విదితమే.తనిఖీలు రాత్రంతా జరిగాయి. శుక్రవారం ఉదయం ఏడు గంటల వరకు అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీలు చేస్తున్న సమయంలో కార్యాలయంలోని ఓ అధికారి రూ.96 వేల నగదును కార్యాలయం కిటికీలోంచి బయటకు విసిరేయడం కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఏసీబీ.. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న 64 డాక్యుమెంట్లను ఏసీబీ సీజ్ చేసింది. ఈ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు.ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు..!ఏసీబీ అదుపులోకి తీసుకున్న అధికారులిద్దరూ ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. పటాన్చెరు ప్రాంతంలో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను ఈ అధికారులు రిజిస్ట్రేషన్ చేసినట్లు సమాచారం. జిల్లా ఏసీబీ అధికారులకు తెలియకుండా..ఈ తనిఖీలు నిర్వహించేందుకు హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయం నుంచి ఏసీబీ అధికారులు రావడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ కార్యాలయం ఉంటుంది. అయితే ఈ కార్యాలయం అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా నేరుగా రాష్ట్ర కార్యాలయంలోని సీఐయూ విభాగం అధికారులు తనిఖీలు చేపట్టారు. -
భూమి హక్కులకు ‘కొత్త చట్టం’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ‘ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్–2024’ పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చింది. భూహక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటివరకు పాస్‌బుక్‌లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూహ క్కుల రికార్డు తయారు చేసుకునే అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశాలుగా ఈ చట్టాన్ని రూపొందిస్తున్నట్టు పేర్కొంది.రిజి్రస్టేషన్, మ్యుటేషన్, భూ ఆధార్, ఆబాదీలకు ప్రత్యేక హక్కుల రికార్డు, అప్పీల్, రివిజన్ వంటి సెక్షన్లను ముసాయి దా బిల్లులో ప్రతిపాదించారు. దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాక.. ప్రత్యేకంగా అసెంబ్లీ ని సమావేశపర్చి బిల్లుకు ఆమోదం తీసుకునే అవ కాశాలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ⇒ భూమి హక్కుల బదలాయింపు కోసం 18 రకాల పద్ధతులు గుర్తించి.. వాటిలో ఏ రకంగా హక్కుల బదలాయింపు జరిగినా ‘రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)’లో నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ దస్తావేజులు, వారసత్వం, భాగ పంపకాల ద్వారా హక్కుల బదలాయింపునకు పాత చట్టంలోని నిబంధనను కొనసాగించారు. ఈ పద్ధతుల్లో తహసీల్దారే రిజి్రస్టేషన్, మ్యుటేషన్ చేస్తారు. అయితే మ్యుటేషన్ చేసే సమయంలో విచారణ జరిపే వెసులుబాటు ఉంటుంది. ⇒ ఆ విచారణలో తప్పులేమైనా గుర్తిస్తే.. ఆయా కారణాలను వివరిస్తూ మ్యుటేషన్ నిలిపేయవచ్చు. ప్రస్తుత చట్టంలో ఈ అవకాశం లేదు. రిజిస్టర్డ్ దస్తావేజులు, భాగ పంపకాలు, వారసత్వ హక్కుల మ్యుటేషన్‌ను విచారించే అధికారం తహసీల్దార్లకు ఉంటుంది. మిగతా అంశాలకు సంబంధించి ఆర్డీవోకు అధికారం ఉంటుంది. ⇒ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసేటప్పుడు సర్వే మ్యాప్ తప్పనిసరి చేశారు. రిజిస్ట్రేషన్‌కు వెళ్లేవారు ఈ మ్యాప్‌ను తీసుకెళ్లాల్సి ఉంటుంది. భవిష్యత్తు వివాదాలకు చెక్ పెట్టేలా గతంలో లేని ఈ కొత్త నిబంధన తెస్తున్నారు. అయితే ప్రభుత్వం నిర్దేశించిన తేదీ తర్వాత (ఇందుకు అవసరమైన వ్యవస్థను తయారు చేసుకున్నాక) మాత్రమే ఈ మ్యాప్ తప్పనిసరి అవుతుందని బిల్లులో పొందుపరిచారు. ⇒ ఇప్పటికే తీసుకున్న సాదాబైనామా దరఖాస్తులను కొత్త చట్టం కింద చేసుకున్న దరఖాస్తులుగానే పరిగణించాలి. తద్వారా పెండింగ్‌లో ఉన్న 9.4లక్షల దరఖాస్తులు అలాగే కొనసాగుతాయి. వాటి పరిష్కార సమయంలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. అయితే కొత్తగా సాదాబైనామాల దరఖాస్తులను తీసుకుని పరిష్కరించే అధికారాన్ని ఈ బిల్లులో పొందుపరిచారు. కొత్త దరఖాస్తుల పరిష్కార సమయంలో మాత్రం స్టాంపు డ్యూటీ, రిజి్రస్టేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సాదాబైనామాల పరిష్కార అధికారం గతంలో కలెక్టర్లకు ఉండగా.. కొత్త చట్టంలో ఆర్డీవోలకు అధికారాలిచ్చారు. ⇒ ప్రతి భూకమతానికి తాత్కాలిక, శాశ్వత భూదార్ (ప్రత్యేక గుర్తింపు సంఖ్య) ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత రికార్డులను పరిశీలించి తాత్కాలిక సంఖ్య ఇస్తారు. సర్వే తర్వాత శాశ్వత భూదార్ జారీ చేస్తారు. ఈ భూదార్‌కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుంది. ⇒ కొత్తగా గ్రామీణ ప్రాంత ఇంటి స్థలాలకు (ఆబాదీ) కూడా ప్రత్యేక హక్కుల రికార్డు తయారు చేయాలని బిల్లులో పొందుపరిచారు. భూదార్తోపాటు ఈ ఆబాదీల ఆర్వోఆర్కు అవసరమైన నిధులు కేంద్రం నుంచి తెచ్చుకోవచ్చు. గత చట్టంలో ఆర్వోఆర్ రికార్డుకు, గ్రామ పహాణీకి సంబంధం ఉండేదికాదు. ఈ కొత్త చట్టంలో.. హక్కుల బదలాయింపు జరగ్గానే గ్రామ పహాణీలో ఆ హక్కుల రికార్డును నమోదు చేసేలా నిబంధన విధించారు. ⇒ తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజి్రస్టేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే.. అప్పీల్, రివిజన్‌కు కొత్త చట్టం అవకాశం ఇవ్వనుంది. కలెక్టర్లు లేదా అడిషనల్ కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. తర్వాత సీసీఎల్ఏకు సెకండ్ అప్పీల్ చేసుకోవచ్చు. ఇది పాత చట్టంలో లేదు. ⇒ రివిజన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం లేదా సీసీఎల్ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. గతంలో జాయింట్ కలెక్టర్లకు ఉన్న రివిజన్ అధికారాలను ఇప్పుడు సీసీఎల్ఏకు దఖలు పర్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే.. సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అయితే అడిషనల్ కలెక్టర్ స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.2020 చట్టంలో ఈ అంశం లేదని.. కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లాల్సి ఉంటుందని, తద్వారా కోర్టులపై భారం తగ్గుతుందని అంటున్నాయి. రూపకల్పన కోసం విస్తృత కసరత్తు ‘రికార్డ్ ఆఫ్ రైట్స్–2024 చట్టం’è ముసాయిదా బిల్లు రూపకల్పన కోసం రెవెన్యూ వర్గాలు విస్తృతస్థాయిలో కసరత్తు చేశాయి. తెలంగాణలో ఇప్పటివరకు అమలైన 1936, 1948, 1971, 2020 నాటి చట్టాలను పరిశీలించి.. వాటి అమలు వల్ల వచి్చన ఫలితాలను బేరీజు వేసి కొత్త చట్టాన్ని రూపొందించారు. తెలంగాణలో ఆర్వోఆర్ చట్టాల అమలు చరిత్ర, ప్రస్తుత సమస్యలు, రాబోయే అవసరాలను అంచనా వేసి 20 సెక్షన్లతో ముసాయిదాను సిద్ధం చేశారు.ఈ క్రమంలో 18 రాష్ట్రాల్లోని ఆర్వోఆర్ చట్టాలను పరిశీలించడంతోపాటు బిహార్‌లో అమల్లో ఉన్న మ్యుటేషన్ చట్టాన్ని కూడా అధ్యయనం చేశారు. భూములకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య (భూదార్), గ్రామీణ ప్రాంత ఆస్తుల రికార్డు తయారు చేయడం ద్వారా.. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన వెసులుబాటును కలి్పంచనున్నారు. ముసాయిదా రూపకల్పనలో భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్, సీఎంఆర్వో పీడీ వి.లచి్చరెడ్డి కీలకపాత్ర పోషించారు. ప్రజల సలహాలు, సూచనలకు అవకాశం ఈ ముసాయిదా బిల్లుపై రాష్ట్ర ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ వెల్లడించింది. సీసీఎల్ఏ వెబ్సైట్ ( ccla.telan gana.gov.in ) లో ఈ బిల్లును అందుబాటులో ఉంచుతున్నామని.. ఈ నెల 2వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రభుత్వానికి అభిప్రాయాలు తెలియజేయాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు తమ సలహాలు, సూచనలను ror2024-rev@telangana.gov.in కు ఈ–మెయిల్ ద్వారా పంపవచ్చని.. లేదా ల్యాండ్ లీగల్ సెల్, సీసీఎల్ఏ కార్యాలయం, నాంపల్లి స్టేషన్‌రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, అబిడ్స్, హైదరాబాద్–500001కు పోస్టు ద్వారా పంపవచ్చని వెల్లడించారు. -
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో జనరల్ డైరీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో జనరల్ డైరీ పెట్టాలి.. అందులో రిజిస్ట్రేషన్‌కు వచ్చే ప్రజలు(కక్షిదారులు) వివరాలన్నీ పేర్కొనాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఎందుకు వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. లాంటి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో వస్తున్న అవాంతరాలను తగ్గించేందుకు అధికారులు, ప్రజలకు హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు ఈ మార్గదర్శకాలు అమలు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్డర్ కాపీని సంబంధిత అధికారులకు చేరేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు వివాదం పరిష్కారమైన తర్వాత కూడా రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంత రామేశ్వరిదేవితోపాటు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ.శ్రవణ్‌కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకరిద్దరు అధికారులు కాదు.. అసలు రెవెన్యూ వ్యవస్థలోనే లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు.కోర్టులో విచారణ ముగిసినా మళ్లీ ఆదేశాలు తీసుకురావాలంటూ వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదవారు కొద్దోగొప్పో భూమి కొనుగోలు చేద్దామని అనుకుంటే రిజిస్ట్రేషన్, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నారని.. ఇప్పుడు బాధితులకు కోర్టు ఫీజులు అదనంగా మారాయని స్పష్టం చేసింది. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకున్నా పిటిషనర్లకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్ట్రార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులకు మార్గదర్శకాలు ⇒ ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రజలు సంప్రదించినప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం–1908, ఇండియన్ స్టాంప్ ప్రకారం అన్ని చట్టప్రకారం ఉంటే వారంలోగా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయాలి. లేనిపక్షంలో తిరస్కరించాలి. ఇదే విషయాన్ని వారికి తెలియజేయాలి. తిరస్కరణ మౌఖికంగా ఉండకూడదు. లిఖితపూర్వక పత్రం ఇవ్వాలి. ⇒ ఒకవేళ రిజిస్ట్రేషన్ పత్రాలు తిరస్కరిస్తే అప్పటికే చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వాపసు ప్రక్రియ సరళీకృతం చేయాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించే ముందు ప్రజలు వాపసు విధానాన్ని కూడా తెలుసుకోవాలి. ⇒ కోర్టు ఆదేశాలు లేనప్పుడు, ఉత్తర్వులు ఎత్తివేసినప్పుడు, అప్పీల్ పెండింగ్ లేనప్పుడు.. మళ్లీ దానిపై న్యాయస్థానం ఆదేశాలు కావాలని ప్రజలను ఒత్తిడి చేయకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సర్క్యులర్లు, నోటిఫికేషన్లు జారీ చేయాలి. ∙తీర్పు వెల్లడించిన, కొట్టివేసిన పిటిషన్లలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను రిజిస్టరింగ్ అథారిటీలు తిరస్కరించకూడదు.⇒ ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వాచ్ రిజిస్టర్/జనరల్ డైరీ నిర్వహించాలి. ప్రజల తమ పత్రాల రిజిస్ట్రేషన్‌కు వచి్చన తేదీ, సమయాన్ని అందులో పేర్కొనాలి. వారు ఎందుకు వచ్చారో కూడా నమోదు చేయాలి. అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం, తప్పులు జరగకుండా ఇది తోడ్పడుతుంది. ⇒ కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా సబ్ రిజిస్ట్రార్, మండల్ రెవెన్యూ అధికారి ఉత్తర్వులు జారీ చేయాలి. ∙వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుల్లో న్యాయస్థానాలు ఇచి్చన మార్గదర్శకాలను రిజిస్టరింగ్ అధికారులు పాటించాలి. ప్రజల(కక్షిదారులు)కు సూచనలు.. ⇒ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే వాచ్ రిజిస్ట్రర్ లేదా జనరల్ డైరీలో తమ వివరాలు నమోదు చేయాలి. అసలు కక్షిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రాలేదు.. రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు సమర్పించలేదని భవిష్యత్‌లో అధికారులు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ⇒ రిజిస్ట్రర్ కార్యాలయాన్ని సంప్రదించే ముందు పార్టీలు ప్రతిపాదిత ఆస్తి నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి. ∙ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే చట్టం ప్రకారం ఆ జాబితా నుంచి ఆస్తిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ నేరుగా కోర్టును ఆశ్రయించకూడదు. ⇒ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమరి్పంచిన పత్రాలు ఆ చట్టంలోని నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలి. -
నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. 4వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు 12వ తేదీ వరకు అవకాశం ఉంది. అనంతరం ధ్రువపత్రాల పరిశీలన, వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. https://tgeapcet.nic.in అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయి రిజిస్ట్రేషన్ , స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ఈఏపీసెట్ కౌన్సెలింగ్ క్యాంప్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ ఏడాది జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ఇంజనీరింగ్ విభాగం నుంచి 1,80,424 మంది అర్హత సాధించారు. వీళ్ళంతా కౌన్సెలింగ్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. ర్యాంకు ఆధారంగా కన్వినర్ కోటా సీట్లు కేటాయిస్తారు. గత ఏడాది లెక్కల ప్రకారం కన్వీనర్ కోటా సీట్లు 90 వేల వరకూ ఉన్నాయి. స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఈ నెల 8వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 8 వరకు ఆల్ క్లియర్! రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏయే బ్రాంచీల్లో ఎన్ని సీట్లున్నాయనే వివరాలు ఇంతవరకూ క్యాంపు కార్యాలయానికి అందలేదు. ఈ వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే విద్యా ర్థులు వెబ్ ఆప్షన్లపై కసరత్తు చేయడానికి వీలుటుంది. ఈ వివరాలు ఈ నెల 8వ తేదీ నాటికి అందుతాయని అధికారులు భావిస్తున్నారు. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అఫ్లియేషన్ రాకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వీసీలు తమ పదవీ కాలం ముగిసేలోపే ప్రైవేటు కాలేజీల్లో తనిఖీలు చేపట్టారు. ఫ్యాకల్టీ, మౌలిక వసతులు పరిశీలించారు. అయితే అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మరోసారి కాలేజీల తనిఖీలు చేయాలని కొత్తగా వీసీలుగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారులు భావిస్తున్నారు. ఈ కారణంగానే సీట్ల వివరాలు అందలేదని తెలుస్తోంది. దీంతో పాటు డిమాండ్ లేని బ్రాంచీల్లో సీట్లు తగ్గించి, సీఎస్ఈ సీట్లు పెంచాలని పలు కాలేజీలు కోరుతున్నాయి. ఈ ప్రతిపాదనలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతి లభించింది. కానీ యూనివర్సిటీల నుంచి అనుమతి రావాల్సి ఉంది. దీంతో ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై స్పష్టత లేకుండా పోయింది. అయితే ఈ ప్రక్రియ అంతా విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చే సమయానికి పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇంజనీరింగ్ తొలి దశ కౌన్సెలింగ్ ఇలా.. 4–7–24 నుంచి 12–7–24 రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ 6–7–24 నుంచి 13–7–24 ధ్రువపత్రాల పరిశీలన 8–7–24 నుంచి 15–7–24 వెబ్ ఆప్షన్లు ఇవ్వడం 19–7–24 సీట్ల కేటాయింపు 19–7–24 నుంచి 23–7–24 సెల్ఫ్ రిపోర్టింగ్ -
అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు షురూ
అమర్నాథ్ యాత్రకు వచ్చే మహాశివుని భక్తుల కోసం జమ్మూ సిద్ధమయ్యింది. జూన్ 26 నుంచి తత్కాల్ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం నగరంలో వివిధ ప్రాంతాల్లో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతోపాటు టోకెన్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. నేటి(బుధవారం) నుంచి టోకెన్లు జారీ చేయనున్నారు. గురువారం నుంచి టోకెన్ తీసుకునే యాత్రికులకు తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.ఏడీసీ శిశిర్ గుప్తా రిజిస్ట్రేషన్ కేంద్రాలను సందర్శించి యాత్రకులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఎండ నుంచి రక్షణకు కేంద్రాల వద్ద షెడ్లు, టెంట్లు వేస్తున్నమని, తాగునీరు, ఆహారం విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని గుప్తా తెలిపారు. సరస్వతి ధామ్, జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో భక్తులు తమ ప్రయాణపు టోకెన్లు అందుకోవచ్చు. అనంతరం కేంద్రంలో యాత్రికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకోసం వారు గాంధీనగర్ ప్రభుత్వ ఆస్పత్రి, సర్వల్ ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాల్సి ఉంటుంది.యాత్రికుల కోసం బేస్ క్యాంప్ అయిన బాల్తాల్‌లో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు. జూన్ 29 నుంచి వార్షిక అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. జూన్ 28, శుక్రవారం నాడు జమ్ము నగరంలోని భగవతి నగర్ బేస్ క్యాంపు నుంచి యాత్రికుల బృందం కశ్మీర్ వ్యాలీకి బయలుదేరనుంది. -
‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
గోపాలపట్నం: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల ఉద్యోగులకు మాత్రమే వర్తించే బీహెచ్ రిజిస్ట్రేషన్ వాహనాల అమ్మకాల్లో పలువురు డీలర్లు మోసాలకు పాల్పడిన ఘటన వెలుగులోకొచ్చింది. ఇటీవల లైఫ్ టాక్స్ కట్టాల్సిన వాహనాల వివరాలు సేకరించే క్రమంలో ఇది బయటపడింది. విశాఖలో వాహనాలు కొనుగోలు చేసి అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని లైఫ్ టాక్స్ ఎగ్గొట్టేందుకు చేసిన ప్రయత్నాలు బయటపడ్డాయి. ఇందులో ప్రధానంగా కార్లు ఉన్నాయి.కేంద్ర ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ఉద్యోగులమంటూ పలువురు ఫేక్ డాక్యుమెంట్లతో కార్లు కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. విశాఖలో 16 మంది కార్ల డీలర్లు 400పైగా కార్లను ఈ విధంగా అమ్మినట్లు తెలుస్తోంది. దీని వల్ల రవాణా శాఖకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు గుర్తించారు. ఈ అమ్మకాల్లో కొన్ని నిజమైనవి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఇందులో ఫేక్ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్లు ఎన్ని జరిగాయో పరిశీలిస్తున్నట్టు తెలిపారు. అదే అదనుగా.. గతంలో అమ్మకాలపై రవాణా శాఖకు నిరంతరం సమాచారం ఉండేది. కానీ ఇప్పుడు డీలర్ల రిజిస్ట్రేషన్ వల్ల వాటిపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో డీలర్లు ఇష్టానుసారంగా మోసాలకు పాల్పడుతున్నారు. నెలలో ఎన్ని వాహనాలు అమ్ముతున్నారు? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి? లైఫ్ టాక్స్‌లు ఎన్ని వస్తున్నాయన్న సమాచారం అధికారులకు ఇవ్వకపోవడం వల్లే ఇలాంటి మోసాలకు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. కాగా, పలు రాష్ట్రాల్లో పని చేసే ఉద్యోగులకు వెసులుబాటు కలిగించేందుకు భారత్ రిజిస్ట్రేషన్ సదుపాయం కలిగించింది.అయితే అందుకు తగిన పత్రాలు అందించాలి. కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తూ ఇతర రాష్ట్రాలకు బదిలీపై వెళ్లే వారికి, నాలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కంపెనీలు ఉన్న ప్రయివేటు సంస్థల్లో ఉద్యోగులు, బదిలీలపై వెళ్లే వారికి భారత్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ వాహనాలు ఏ రాష్ట్రంలోనైనా తిరగొచ్చు. రాష్ట్రం మారాక ఆ రాష్ట్రంలో మళ్లీ రిజిస్ట్రేషన్ మార్చుకునే పని ఉండదు. దీని ద్వారా లైఫ్ ట్యాక్స్ తగ్గుతుంది. ఇది అదునుగా చేసుకుని కొందరు డీలర్లు బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించేందుకు ఇక్కడ వాహనాలను అమ్మి, అరుణాచల్‌ప్రదేశ్‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. దీంతో ఇక్కడి కొనుగోలు చేసిన వాహనాలకు ఇక్కడి లైఫ్ ట్యాక్స్‌లు కట్టే పరిస్థితి లేకపోయింది. నలుగురు డీలర్లపై చర్యలు, 10 మందికి నోటీసులు400 కార్ల బీహెచ్ రిజిస్ట్రేషన్‌పై ఉప రవాణా కమిషనర్ రాజారత్నం చర్యలు తీసుకున్నారు. కొద్ది రోజులుగా బీహెచ్ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టి అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. లైఫ్ ట్యాక్స్‌లు తగిన స్థాయిలో రాక పోవడం వల్ల అనుమానాలకు దారి తీసిందన్నారు. ఫేక్ ధ్రువపత్రాలతో బీహెచ్ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు నలుగురు డీలర్ల ప్రమేయంపై స్పష్టమైన ఆధారాలు ఉండడంతో వీరిపై చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. మరో 10 మంది డీలర్లకు నోటీసులిచ్చామన్నారు. దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
ఇక వాహన శాశ్వత రిజిస్ట్రేషన్లూ షోరూంలలోనే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసిన షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషషన్లు చేసేందుకు రవాణా శాఖ తాజాగా కసరత్తు చేపట్టింది. వాహన యజమానులకు ఇబ్బందులు తలెత్తకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి సారించింది. ఇప్పటికే ఈ విధానం ఏపీలో విజయవంతంగా అమలవుతుండటంతో ఇక్కడ సైతం అదే పద్ధతిని అమలు చేసేందుకు అనుసరించాల్సిన విధివిధానాలపై అధ్యయనం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వాహనాల షోరూంల వివరాలతోపాటు నిత్యం నమోదయ్యే వాహనాల వివరాలను సేకరిస్తోంది. ఒక్కో డీలర్ విక్రయించే వాహనాల సంఖ్య, షోరూంలలోనే వాహనాల శాశ్వత నమోదు ప్రక్రియ చేపడితే అవసరమయ్యే సాంకేతిక పరిజా్ఙనం తదితర అంశాలపై ఈ కసరత్తు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికల అనంతరం షోరూంలలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం షోరూంలలో వాహనాలకు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు (టీఆర్) చేస్తున్నారు. రవాణాశాఖ నుంచే ఈ టీఆర్‌లు అందుతున్నప్పటికీ అందుకోసం వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లట్లేదు. వాహనంతోపాటు షోరూంలోనే టీఆర్ పత్రాలను తీసుకుంటున్నారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ (పీఆర్) కూడా షోరూంలకే బదిలీ అయితే వాహనదారులకు ఇకపై పీఆర్ స్మార్ట్ కార్డులు చేతికి అందుతాయి. 2016లోనే కేంద్రం మార్గదర్శకాలు... కేంద్రం ప్రభుత్వం రహదారి భద్రత చట్టంలో వాహనదారులకు ఊరట కలి్పంచే అనేక అంశాలను పొందుపరిచింది. వాహనాల రిజి్రస్టేషన్లను షోరూంలలోనే పూర్తి చేసేలా 2016లోనే మార్గదర్శకాలు రూపొందించింది. ఏపీ సహా పలు రాష్ట్రాలు ఈ సదుపాయాన్ని వాహనదారులకు అందుబాటులోకి తెచ్చాయి. కానీ తెలంగాణలో మాత్రం వాహనాలు కొనుగోలు చేసిన సమయంలో మొదట టీఆర్ తీసుకొని ఆ తరువాత సంబంధిత ప్రాంతీయ రవాణా కార్యాలయంలో పీఆర్ పొందే విధానం కొనసాగుతోంది. అయితే ఈ ప్రక్రియ దళారులతోపాటు కొందరు అధికారుల అక్రమార్జనకు దోహదం చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్రం మార్గదర్శకాలు రాష్ట్రంలోనూ అమలైతే షోరూంలోనే పీఆర్ స్మార్ట్ కార్డుతోపాటు వాహనానికి హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్ కూడా లభించనుంది. గ్రేటర్లో భారీగా వాహనాల అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని పది ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో నిత్యం సుమారు 2,500 కొత్త వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 1,600కుపైగా ద్విచక్ర వాహనాలుకాగా మిగతావి కార్లు, ఇతర వాహనాలు ఉన్నాయి. ప్రస్తుతం వాహనదారుల చిరునామా పరిధిలోని ఆర్టీఓ కార్యాలయంలో శాశ్వత రిజి్రస్టేషన్ చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు వందల సంఖ్యలో శాశ్వత రిజి్రస్టేషన్ల వల్ల వాహనాల రద్దీతోపాటు అందరి సమయం వృథా అవుతోంది. అలాగే ఆన్లైన్లో స్లాట్ నమోదు మొదలు అధికారుల తనిఖీ పూర్తయ్యే వరకు వాహనదారులు ఆర్టీఏ ఏజెంట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. షోరూం రిజిస్ట్రేషన్లు అమల్లోకి వస్తే దళారుల అక్రమ దందాకు తెరపడనుంది. -
చార్ధామ్ యాత్రకు రిజిస్ట్రేషన్ షురూ!
చార్ధామ్ యాత్రకు నేటి (సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఉదయం 7 గంటల నుంచి రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ఓపెన్ కానుంది. దీంతోపాటు మొబైల్ యాప్, వాట్సాప్ నంబర్, టోల్ ఫ్రీ నంబర్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రిలను సందర్శించే భక్తులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. పర్యాటక శాఖ చార్ధామ్ రిజిస్ట్రేషన్ కోసం సన్నాహాలు పూర్తి చేసింది. ఈసారి చార్ధామ్ యాత్ర ప్రారంభానికి 25 రోజుల ముందు నుంచే యాత్రికులకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. తద్వారా వారు తమ ప్రయాణ ప్రణాళికలను తగిన విధంగా రూపొందించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. రిజిస్ట్రేషన్ కోసం యాత్రికులు తమ వివరాలతో పాటు మొబైల్ నంబర్, చిరునామాను జతచేయాలి. పర్యాటక శాఖ వెబ్సైట్ registrationandtouristcare.uk.gov.inకు లాగిన్ అయి, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 8394833833కు యాత్ర అని రాసి సందేశం పంపడం ద్వారా కూడా పేరు నమోదు చేసుకోవచ్చు. వెబ్సైట్లో పేరు నమోదు చేసుకునే అవకాశం లేని ప్రయాణికులు పర్యాటక శాఖ టోల్ ఫ్రీ నంబర్ 01351364కు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. గత ఏడాది 74 లక్షల మంది యాత్రికులు చార్ధామ్ యాత్రకు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. 56 లక్షల మంది చార్‌ధామ్‌ను సందర్శించారు. ఈసారి కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండవచ్చని పర్యాటకశాఖ అంచనా వేస్తోంది. మే 10 నుంచి చార్ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. -
ఆర్బీఐ కఠిన చర్యలు.. నాలుగు కంపెనీల రిజిస్ట్రేషన్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, ఓ ప్రైవేటు బ్యాంక్‌పై కఠిన చర్యలు తీసుకుంది. నాలుగు ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను రద్దు చేసింది. అలాగే ఓ ప్రైవేటు బ్యాంకుకు రూ.1కోటి జరిమానా విధించింది. ఆర్బీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన కంపెనీలలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుండల్స్ మోటార్ ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తమిళనాడుకు చెందిన నిత్య ఫైనాన్స్ లిమిటెడ్, పంజాబ్ ఆధారిత భాటియా హైర్ పర్చేజ్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాచల్ ప్రదేశ్ ఆధారిత జీవన్‌జ్యోతి డిపాజిట్స్ అండ్ అడ్వాన్సెస్ లిమిటెడ్ ఉన్నాయి. ఆర్బీఐ చట్టంలో నిర్వచించిన విధంగా ఈ కంపెనీలు ఇప్పుడు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వ్యాపార లావాదేవీలను నిర్వహించలేవు. ఇక 'రుణాలు, అడ్వాన్సులు - చట్టబద్ధమైన ఇతర పరిమితులు'పై ఆర్బీఐ మార్గదర్శకాలను పాటించనందుకు గానూ ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంకు రూ.1కోటి పెనాల్టీ విధించింది. తమ ఆదేశాలు, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు ఈ బ్యాంకుకు ఇదివరకే షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. -
గుడ్‌న్యూస్.. హెచ్-1బీ వీసా నమోదు గడువు పొడగింపు
వాషింగ్టన్: 2025 ఆర్థిక సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువును యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) పొడిగించింది. మార్చి 22వ తేదీతో ఈ గడువు ముగియనుండగా మరో మూడు రోజులు అంటే మార్చి 25 వరకూ పొడిగించినట్లు యూఎస్సీఐఎస్ తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తాత్కాలికంగా సాంకేతిక సమస్యలు తలెత్తిన నేపథ్యంలో గడువును యూఎస్సీఐఎస్ పొడిగించింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్-1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
హెచ్–1బీ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ మార్చి 22
వాషింగ్టన్: 2025వ సంవత్సరానికి గాను హెచ్–1బీ వీసాల ప్రాథమిక నమోదుకు గడువు మార్చి 22వ తేదీతో ముగియనుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) తెలిపింది. అభ్యర్థులు ఆన్లైన్లో యూఎస్సీఐఎస్ వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని, సంబంధిత ఫీజును చెల్లించాలని సూచించింది. ఇందుకు అవసరమైన ఐ–907, ఐ–129 వంటి ముఖ్యమైన దరఖాస్తులను కూడా ఆన్లైన్లో సమర్పించవచ్చని వివరించింది. అదేవిధంగా, హెచ్–1బీ క్యాప్ పిటిషన్లకు ఏప్రిల్ ఒకటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరిస్తామని పేర్కొంది. నాన్ క్యాప్ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండే తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది. భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా దరఖాస్తు చేసుకునే నాన్ ఇమిగ్రాంట్ వీసా హెచ్–1బీ. అమెరికా కంపెనీలు భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మంది విదేశీ ఐటీ నిపుణులను ఈ వీసాపైనే నియమించుకుంటాయి. -
రబీ ఉత్పత్తుల కొనుగోళ్లకు శ్రీకారం
సాక్షి, అమరావతి: మార్కెట్లో కనీస మద్దతు ధర దక్కని రబీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. శనగల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఆర్బీకేల ద్వారా రైతుల రిజిస్ట్రేషన్‌కు శ్రీకారం చుట్టారు. త్వరలో పెసలు, మినుముల కొనుగోలుకు సన్నాహాలు చేస్తున్నారు. మద్దతు ధరకు సేకరణ... రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది క్వింటాల్‌కు శనగలకు రూ.5440, పెసలకు రూ.8558, మినుముకు రూ.6950, వేరుశనగకు రూ.5850 చొప్పున కనీస మద్దతు ధరలను నిర్ణయించింది. రబీ–2023 –24 సీజన్లో 7 లక్షల ఎకరాల్లో శనగ, 7.50 లక్షల ఎకరాల్లో మినుము, 1.92 లక్షల ఎకరాల్లో పెసలు, 1.61 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగయ్యాయి. శనగ 4.50 లక్షల టన్నులు, మినుము 3.89 లక్షల టన్నులు, వేరుశనగ 1.86 లక్షల టన్నులు, పెసలు 84 వేలటన్నుల దిగుబడులొస్తాయని అంచనా. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్‌కు పెసలకు రూ.9 వేల నుంచి 9300, మినుముకు రూ.9 వేల నుంచి 9500 ఉండగా, శనగలు మాత్రం రూ.5300 నుంచి రూ.5600 మధ్య ఉంది. కనీస మద్దతు ధరకు 1.14,163 టన్నుల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన అనుమతి మేరకు ఆర్బీకేల ద్వారా శనగలు కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఏర్పాట్లు చేసింది. గురువారం నుంచి రైతుల రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. 26వతేదీ నుంచి కొనుగోలు చేపట్టనున్నారు. అదే రీతిలో మిగిలిన పంట ఉత్పత్తుల కొనుగోలుకు కూడా అనుమతి కోరుతూ మార్క్‌ఫెడ్ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కొనుగోళ్లకు శ్రీకారం చుట్టనున్నారు. సన్న, చిన్నకారు రైతులకు ప్రాధాన్యం పంట నమోదు (ఈ–క్రాప్) ఆధారంగానే ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రైతు రబీలో సాగుచేసిన పంట వివరాలను సమీప ఆర్బీకేలో నమోదు చేసుకోవాలి. కొనుగోలు సందర్భంగా సన్న, చిన్నకారు రైతులకే తొలుత ప్రాధాన్యతనిస్తారు. పంట కోతల తేదీ ఆధారంగా కొనుగోలు తేదీని నిర్ధారిస్తారు. పంట సేకరణ తేదీ, కొనుగోలు కేంద్రం సమాచారాన్ని ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తారు దళారుల బెడద లేకుండా బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. కొనుగోలు వేళ రైతులకు ఈ–రసీదు ఇస్తారు. సేకరించిన ఉత్పత్తులను సులభంగా ట్రాక్ చేయడానికి వీలుగా సంచులకు క్యూఆర్ కోడ్/ఆర్ఎఫ్ ఐడీట్యాగ్ వేస్తున్నారు. చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఈ–సైన్ అమలు చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలకనుగుణంగా కొనుగోళ్లు జరిగేలా థర్డ్ పార్టీ ఆడిట్ చేస్తున్నారు. పారదర్శకంగా కొనుగోళ్లు... కనీస మద్దతు ధరకు రైతుల నుంచి శనగల సేకరణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. చిన్న, సన్న కారు రైతులకు తొలుత ప్రాధాన్యతనిస్తాం. ప్రభుత్వం అనుమతి రాగానే మినుము, పెసలు, వేరుశనగ కూడా మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. – డాక్టర్ గెడ్డం శేఖర్‌బాబు, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్ -
‘అహ్లాన్ మోదీ’కి 65 వేల రిజిస్ట్రేషన్లు
మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ప్రధాని నరేంద్ర మోదీకి అపరిమితమైన ఆదరణ ఉంది. యూఏఈలో జరగబోయే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఏకంగా 65 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 13న అంటే నేడు (మంగళవారం) యూఏఈలో జరిగే ‘అహ్లాన్ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇండియన్ పీపుల్ ఫోరమ్ ప్రెసిడెంట్, ‘అహ్లాన్ మోదీ’ ఇనిషియేటివ్ హెడ్ జితేంద్ర వైద్య ఈ ఈవెంట్ గురించి మీడియాకు తెలిపారు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమమని, ప్రవాస భారతీయుల కమ్యూనిటీ దీనికి సకల ఏర్పాట్లు చేస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 65 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అంతకుమించి జనం వస్తే, వసతి కల్పించలేమని, అందుకే రిజిస్ట్రేషన్లు ఇక నిలిపివేయాల్సి వచ్చిందని యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనలో యూఏఈ, ఖతార్‌లోని ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు. యూఏఈలో నిర్మితమైన హిందూ దేవాలయాన్ని 14న ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐదు వేల మంది భక్తులు హాజరుకానున్నరని అంచనా. 2015 తర్వాత ప్రధాని మోదీ యూఏఈలో పర్యటించడం ఇది ఏడోసారి. -
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు చరిత్రాత్మకం
సాక్షి, అమరావతి: పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేసే కార్యక్రమం విజయవంతంగా సాగుతోందని, ఇది చరిత్రాత్మకమని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ చెప్పారు. ఒకేసారి లక్షల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు చేయడం ఏ రాష్ట్రంలోనూ జరగలేదని, ఏపీలోనే తొలిసారి జరుగుతోందని తెలిపారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పేదలకు ఇచ్చిన ఇళ్లపై వారికి పూర్తి హక్కు కల్పిస్తూ, వారికి ఒక ఆస్తిగా దాన్ని సమకూర్చి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇంత పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేయడం తమ శాఖకు చాలెంజింగ్ వంటిదని, అత్యంత క్లిష్టమైన ఈ పనిని అందరి సహకారంతో సజావుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేయడానికి లక్షలాది మంది లబ్ధిదారుల ఆధార్ కార్డులు, వారి ఆస్తి వివరాలు, సర్వే నంబర్లు, హద్దులు, రెవెన్యూ గ్రామాల సమాచారాన్ని అప్లోడ్ చేశామని చెప్పారు. ఆ తర్వాత 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజి్రస్టార్లుగా గుర్తించడంతో వారికి లాగిన్లు ఇవ్వడం, ప్రభుత్వం తరఫున రిజిస్ట్రేషన్లు చేసే 15 వేల మంది వీఆర్వోలకు లాగిన్లు ఇవ్వడం పూర్తి చేసినట్టు చెప్పారు. వివిధ శాఖల నుంచి వచ్చిన ఈ డేటా మొత్తాన్ని మ్యాపింగ్ చేశామన్నారు. ఈ పని చేయడమే అత్యంత క్లిష్టమని, దాన్ని పూర్తి చేయడంతో రిజిస్ట్రేషన్లు ఇబ్బంది లేకుండా జరుగుతున్నట్లు వెల్లడించారు. వీరందరి ఆధార్ ఈ–సిగ్నేచర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం వల్ల నకిలీ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేదని చెప్పారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు ఇప్పటివరకు 6.5 లక్షల రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామని తెలిపారు. సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతిచ్చిందని రామకృష్ణ తెలిపారు. సాధారణంగా సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయాలంటే రూ.5 వేల ఫీజు కట్టాల్సి ఉంటుందని, దానికి ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్టు తెలిపారు. రోజుకు లక్షకుపైగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, త్వరలో ప్రభుత్వం లక్ష్యానికనుగుణంగా అన్ని రిజిస్ట్రేషన్లను పూర్తి చేస్తామని వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం ఈ కార్యక్రమంతో సాకారమైందని తెలిపారు. మొన్నటివరకు భూముల రీ సర్వే పూర్తయిన 4 వేల గ్రామాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు చేసేవారని, ఇప్పుడు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయన్నారు. దీనివల్ల పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందికి పూర్తి అవగాహన వచ్చిందని తెలిపారు. పేదల ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ల వ్యవస్థ గ్రామ స్థాయికి పూర్తిస్థాయిలో చేరిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా ఈ–సిగ్నేచర్ యూజర్లు ఉన్న రాష్ట్రంగా ఏపీ నిలిచిందని తెలిపారు. 6.5 లక్షల రిజిస్ట్రేషన్ల కోసం 20 లక్షల ఈ–సిగ్నేచర్లు తీసుకున్నట్టు తెలిపారు. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ల వల్ల వారు పొందిన స్థలాలపై పేదలకు హక్కులు ఏర్పడతాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఇచ్చే కన్వేయన్స్ డీడ్లు పదేళ్ల తర్వాత సేల్ డీడ్లుగా మారడం వల్ల వారికి ఇబ్బందులుండవన్నారు. రెవెన్యూ ఎన్వోసీ లేకుండానే పదేళ్ల గడువు ముగిశాక ఆ స్థలాలపై పేదలకు సర్వ హక్కులు లభిస్తాయని, ఇది వారికి ఎంతో ఉపయోగకరమని రామకృష్ణ వివరించారు. -
శరవేగంగా ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు
-
రిజిస్ట్రేషన్ లేకుండా ‘లివ్ ఇన్’లో ఉంటే జైలుకే?
ఉత్తరాఖండ్.. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు చేసే తొలి రాష్ట్రం కానుంది. దీంతో ఆ రాష్ట్రంలో పలు నూతన నిబంధనలు అమలులోకి రానున్నాయి. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ‘లివ్-ఇన్’లో ఉంటూ, ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ. 25,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న జంట ఈ రిజిస్ట్రేషన్‌తో స్వీకరించే రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పీజీ సౌకర్యాన్ని పొందగలుగుతారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇటీవల సీఎం ధామీ ప్రభుత్వానికి సమర్పించిన యూసీసీ ముసాయిదాలో ఈ నిబంధన గురించి పేర్కొన్నారు. ‘యూసీసీ’లో ‘లివ్-ఇన్’ సంబంధం గురించి స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక వయోజన పురుషుడు, ఒక వయోజన మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండగలుగుతారు. అలాంటివారు ఇప్పటికే వివాహం చేసుకోకూడదు లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్షిప్లో లేదా నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ప్రతి వ్యక్తి తప్పనిసరిగా రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇటువంటి రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదుని అందజేస్తారు. ఆ రశీదు ఆధారంగా ఆ జంట ఇల్లు లేదా హాస్టల్ లేదా పీజీని అద్దెకు తీసుకోవచ్చు. అయితే ‘లివ్ ఇన్’ కోసం రిజిస్ట్రార్ రిజిస్టర్ చేయించుకున్న జంట ఆ విషయాన్ని తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ‘లివ్ ఇన్’లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు ఆ జంటకు చెందిన చట్టబద్ధమైన పిల్లలుగా గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. ‘లివ్-ఇన్’ రిలేషన్షిప్లో ఉంటున్నవారు విడిపోవాలనుకున్నా, తిరిగి ఆ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. -
ఇల్లెందులో వీగిన అవిశ్వాసం
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై కొందరు కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం వీగిపోయింది. సమావేశానికి త గిన కోరం లేనందున అవిశ్వాసం వీగిపోయినట్టుగా ఎన్నిక ల అధికారిగా వ్యవహరించిన కొత్తగూడెం ఆర్డీఓ శిరీష ప్రక టించారు. కౌన్సిలర్ల అవిశ్వాసం నేపథ్యంలో సోమవారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఈవో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొత్తం 24 మంది కౌన్సి లర్లకు గాను కోరం సరిపోవాలంటే 17 మంది హాజరు కావా ల్సి ఉంది. అయితే సమావేశ సమయానికి ఇద్దరు తక్కువగా 15 మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కొంత సమయం ఇస్తూ సమావేశం వాయిదా వేశారు. తర్వాత 12 గంటలకు మరోమారు సమావేశపర్చగా అప్పటికీ 15 మంది మాత్రమే ఉండడంతో కోరం లేదని ఈవో ప్రకటించారు.17 మంది రాత్రికే చేరుకున్నా..: అవిశ్వాస పరీక్ష నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న పెన్షనర్ భవన్ లోకి ఆదివారం రాత్రికే 17 మంది కౌన్సిలర్లు చేరుకున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వారంతా మున్సిపల్ కార్యాలయంలోకి పరుగులు తీశారు. అయితే మున్సిపల్ కార్యాలయం ఎదుట వేచి ఉన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ వారిని గమనించారు. కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్‌ను కాంగ్రెస్ శ్రేణులు ఎత్తుకుని ఎదురుగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయంలోకి వెళ్లి, వెనుక నుంచి రోడ్డుపైకి తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ కారులో హైదరాబాద్‌కు తరలించారు. ఇదే క్రమంలో పెన్షనర్ భవన్లో దాక్కుని ఉన్న సీపీఐ కౌన్సిలర్ కుమ్మరి రవీందర్ బయటకు రాగానే కాంగ్రెస్, దాని మిత్రపక్ష సీపీఐ శ్రేణులు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు అడ్డుకుని విడిపించారు. అయితే అప్పటికే మున్సిపాలిటీలో తమ సభ్యుడి కోసం కాచుకుని కూర్చున్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా రవీందర్‌తో మాట్లాడటంతో ఆయన కార్యాలయం వెనుక గోడ దూకి పారిపోయారు. ఇలా ఇద్దరు సభ్యులు తక్కువ కావడంతో కోరం చాలక అవిశ్వాసం వీగిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు వాగ్వాదానికి దిగారు. గంట పాటు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అక్కడి నుంచి ర్యాలీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకుని అధికార పార్టీ నేతలు, ఎమ్మెల్యే కోరం కనకయ్య, చైర్మన్ వెంకటేశ్వరావుపై ఫిర్యాదు చేశారు. కోరం కనకయ్యపై కేసు నమోదు తన భర్తను కిడ్నాప్ చేశారంటూ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కొక్కు నాగేశ్వరరావు సతీమణి వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు 17 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ఎంపీపీ నాగరత్నమ్మ, ఆమె భర్త జానీ తదితరులపై కేసు నమోదైందని వివరించారు. -
సులభంగా ఓపీ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: డిజిటల్ వైద్య సేవలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వండిజిటల్ విధానంతో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలనూ సులభతరం చేస్తోంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఓపీ రిజిస్ట్రేషన్‌ను తేలికగా పూర్తి చేస్తోంది. ఈ విధానంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. ఏపీలోని 909 ప్రభుత్వాస్పత్రుల్లో స్కాన్ అండ్ షేర్ విధానంలో ఓపీ రిజిస్ట్రేషన్ అమలు చేస్తోంది. ఇలా గడిచిన 4 నెలల్లో 23.80 లక్షల ఓపీలు నమోదయ్యాయి.55.04 లక్షలతో యూపీ తొలి స్థానంలో, 24.67 లక్షలతో కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వెళితే ఓపీ కౌంటర్లో వివరాలు నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, ఇతర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి పూర్తయిన తర్వాత రోగి ఏ సమస్యతో వైద్య సేవలు పొందాలనుకుంటున్నారో తెలుసుకుని, ఆ విభాగానికి రిఫర్ చేస్తూ టోకెన్ ఇస్తారు. దీనికి 5–10 నిమిషాలు పడుతుంది. పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల రోగులు ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చాలా సమయం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అదే క్యూఆర్ కోడ్‌తో త్వరగా అయిపోతుంది. రోగి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లి స్మార్ట్ ఫోన్ ద్వారా కోడ్ స్కాన్ చేసి, టోకెన్‌ను తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. క్యూలో వేచి ఉండటం, ఇతర అగచాట్లు తప్పుతాయి. ఇలా చేసుకోవాలి.. ► స్మార్ట్ ఫోన్ నుంచి ఆస్పత్రిలో ప్రదర్శించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే యూఆర్ఎల్ కోడ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే..ఆభా,ఆరోగ్యసేతు, వంటి యాప్‌లు కనిపిస్తాయి ► ఆ యాప్‌లు ఫోన్లో లేకపోతే ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి ► ఆయుష్మాన్ డిజిటల్ హెల్త్ అకౌంట్ (ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రిజిస్టర్ చేసిన ఫోన్ నంబర్/మెయిల్ ఐడీ ద్వారా యాప్‌లో రిజిస్టర్ అవ్వాలి ► యాప్‌లోకి లాగిన్ అయితే ఆభా వివరాలు వస్తాయి. వీటిని ఆస్పత్రితో షేర్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. షేర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే ఓ నంబర్ వస్తుంది. ఈ టోకెన్‌కు అరగంట వ్యాలిడిటీ ఉంటుంది. టోకెన్ నంబర్ వచ్చాక ఆస్పత్రిలోని కౌంటర్‌కు వెళ్లి ఆభా నంబర్, ఫోన్ నంబర్ చెప్పి, ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే సిబ్బంది ఓపీ స్లిప్ ఇస్తారు. దీన్ని తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. -
రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే..
జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను ఎగవేత అసాధ్యమనుకున్నా.. మోసపూరిత వ్యాపారులు దాన్ని సైతం ఛేదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర వ్యాపారాల్లో పన్ను ఎగవేస్తున్న వ్యాపారులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా జీఎస్టీ నంబర్లకు సంబంధించిన వ్యాపారులు పన్ను సరిగా కట్టకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం అంచనాకు వచ్చింది. క్షేత్రస్థాయిలో గట్టిగా తనిఖీలు చేసి వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని తాజాగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ దిశగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాణిజ్య పన్నులశాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు ప్రారంభించాయి. నకిలీ జీఎస్టీ ఇన్వాయిస్లు, రిజిస్ట్రేషన్లను తొలగించేందుకు చేపట్టిన డ్రైవ్‌లో కేంద్రం రూ.44వేల కోట్ల పన్ను ఎగవేతలను గుర్తించింది. ఎగవేతకు పాల్పడిన 29వేల సంస్థలను పట్టుకుంది. మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడి రూ.4,646 కోట్లు ఆదా చేసింది. మొత్తం ఏడున్నర నెలల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌లో 29వేల నకిలీ సంస్థలను, రూ.44వేల కోట్లకు పైగా జీఎస్టీ పన్ను ఎగవేతలను గుర్తించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉనికిలో లేని, బోగస్ రిజిస్ట్రేషన్లను గుర్తించే ప్రత్యేక డ్రైవ్ ఫలితాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వస్తువులు, సేవల సరఫరా లేకుండా చాలా బోగస్ కంపెనీలు ఇన్వాయిస్లను తయారు చేశాయని చెప్పింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జీఎస్టీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇదీ చదవండి: పన్ను ఆదాలో ఎన్పీఎస్ టాప్.. రెండో స్థానంలో ఈఎల్ఎస్ఎస్ తెలంగాణలో 117 బోగస్ సంస్థల ద్వారా రూ.536 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇందులో రూ.235 కోట్ల మొత్తాన్ని బ్లాక్/ రికవరీ చేయడంతోపాటు ఒకరిని అరెస్టు చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష రిజిస్టర్డ్ సంస్థల్లో 23 నకిలీ సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 19 బోగస్ సంస్థలు రూ.765 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించింది. ఇందులో రూ.11 కోట్ల మొత్తాన్ని బ్లాక్/రికవరీ చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్ష రిజిస్టర్డ్ సంస్థల్లో 5 నకిలీవి ఉన్నట్లు తెలిపింది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను బలోపేతం చేయడానికి ఆధార్ ధ్రువీకరణ విధానాన్ని గుజరాత్, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పైలెట్ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టారు. -
ఒకే జిల్లాలో 61వేల కొత్త ఓట్లు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లాలో భారీ సంఖ్యలో కొత్త ఓటర్ల నమోదు జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటేయడానికి నవతరం ఉత్సాహంగా ముందుకు వస్తోంది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 61,193 ఓట్లను కొత్తగా చేర్చారు. వీటిలో యువతవే 80 శాతం ఉన్నట్లు సమాచారం. మరోపక్క ఇబ్బడిముబ్బడిగా ఉన్న దొంగ ఓట్లను అధికారులు తొలగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాదిగా వచ్చిన ఫారం–6, ఫారం–7, 8లను ఎన్నికల అధికారులు వడపోసి, దొంగ ఓట్లను తొలగించి కొత్త ఓట్ల నమోదును చాలా వరకు పూర్తి చేశారు. ఇప్పటికే 46,116 అక్రమ ఓట్లను తొలగించారు. అన్నీ కలిపి మరో 600 దరఖాస్తులను పరిశీలించాల్సి ఉంది. వీటిలో కొత్త ఓట్లకు సంబంధించి 400 దరఖాస్తులు ఉన్నాయి. జనవరి 12వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. జనవరి 22 నాటికి తుది జాబితా విడుదల చేస్తారు. ఇప్పటివరకు నమోదైన కొత్త ఓట్లలో అత్యధికంగా అద్దంకిలో 12,883 నమోదయ్యాయి. బాపట్లలో 9,967, రేపల్లెలో 9,961, చీరాలలో 9,958, పర్చూరులో 9,385, వేమూరులో 9,039 ఉన్నాయి. ప్రలోభాలకు లొంగకుండా దొంగ ఓట్ల తొలగింపు జిల్లాలో 65 వేలకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని పర్చూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్, పలువురు అధికార పార్టీ నేతలు జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లను గుర్తించి వాటిని తొలగించాలని 65 వేలకు పైగా ఫారం–7 దరఖాస్తులను సమర్పించారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వచ్చిన ఫారం–7 దరఖాస్తులను అధికారులు సమగ్రంగా పరిశీలించి దొంగ ఓట్లను తొలగిస్తున్నారు. దీంతో తమ దొంగ ఓట్ల వ్యవహారం బయటపడుతుందని భావించిన పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధికార పార్టీ దొంగ ఓట్లు చేర్పిస్తోందంటూ ఆరోపణలకు దిగారు. అధికారులకు పదేపదే ఫిర్యాదు చేశారు. కోర్టును ఆశ్రయించారు. జిల్లా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. అయినా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం వేలాది ఫారం–7 దరఖాస్తులను నిశితంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఇప్పటివరకూ 46,116 దొంగ ఓట్లను గుర్తించి, తొలగించింది. వీటిలో అత్యధికంగా పర్చూరు నుంచి 10,468 ఓట్లను తొలగించారు. రేపల్లె పరిధిలో 8,880, చీరాల నుంచి 7,420, అద్దంకిలో 7,207, వేమూరులో 6,295, బాపట్ల నుంచి 5,846 ఓట్లను తొలగించారు. తొలగించిన ఓటర్లలో ఇతరప్రాంతాలకు వలస వెళ్లిన వారు, అక్కడే స్థిరపడిన వారు, చనిపోయిన వారు, రెండు చోట్లా ఓట్లు ఉన్నవారు ఉన్నారు. ఓటు హక్కుతో ఆనందం రాబోయే ఎన్నికల్లో తొలిసారి ఓటేసే ఆవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు వేస్తాను. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగను. మంచి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేందుకు నా వంతు తోడ్పాటు అందిస్తాను. మంచి పాలన అందించేవారికి మద్దతుగా నిలవాలన్నది కోరిక. – పూరేటి సంధ్య, కొప్పెరపాడు, బల్లికురవ మండలం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా నాకు ఓటు హక్కు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ఫీజు రీయింబర్స్ మెంట్‌తో చదువుకున్నాను. పేద, మధ్యతరగతి వారికి అండగా నిలిచే ప్రభుత్వాలకు ప్రజల మద్దతు ఎప్పుడూ ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాను. –ఎం.సాయి పూజిత, బీటెక్ విద్యార్థి, బాపట్ల ప్రజల కోసం పనిచేసే వారికే ఓటు తొలిసారి ఓటుహక్కు రావడం ఆనందంగా ఉంది. పేదలకు అండగా నిలిచి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికే రాబోయే ఎన్నికల్లో నా ఓటు. ఎవరి ప్రలోభాలకూ లొంగకుండా ఓటు వేస్తాను. అందరికీ మంచి జరగాలన్నదే నా కోరిక. – పి. వెంకట నాగ మణికంఠ రెడ్డి, దుండివారిపాలెం, కర్లపాలెం మండలం -
Winter Parliament Session 2023: పత్రికల రిజిస్ట్రేషన్ ఇక సులభతరం
న్యూఢిల్లీ: ప్రచురణ రంగానికి సంబంధించిన బ్రిటిష్ పాలన కాలం నాటి చట్టం స్థానంలో పత్రికల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. సమాచార, ప్రసార శాఖల మంత్రి అనురాగ్ వైష్ణవ్ గురువారం లోక్‌సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు–2023ను ప్రవేశ పెట్టారు. ఇప్పటిదాకా అమల్లో ఉన్న ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్(పీఆర్బీ) చట్టం–1867 ప్రకారం పత్రికలను రిజిస్టర్ చేసుకోవాలంటే ఎనిమిదంచెల కఠినమైన విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా బిల్లులో దీనిని సులభతరం చేశారు. కొత్తగా పత్రికను ప్రారంభించాలనుకునే వారు ఒకే ఒక విడతలో రిజిస్టర్ చేసుకునేందుకు వీలు కల్పించేలా నిబంధనలు తీసుకొచ్చారు. ఈ బిల్లు ఆగస్ట్ 3వ తేదీన రాజ్యసభ ఆమోదం పొందింది. -
ఆడుదాం ఆంధ్ర రిజిస్ట్రేషన్లకు గడువు పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ‘ఆడుదాం ఆంధ్ర’ మెగా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చురుగ్గా చేస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి యువత పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకు 30.50 లక్షల మంది క్రీడాకారులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు. మరో 1.36 లక్షల మందికి పైగా ప్రేక్షకులుగా నమోదయ్యారు. వీరిలో క్రీడల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన వారి కోసం శాప్ ప్రత్యేకంగా ఎడిట్ ఆప్షన్‌ను తీసుకొస్తోంది. అలాగే యువత నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు రిజిస్ట్రేషన్ల గడువును ఆదివారం వరకు పొడిగించింది. ప్రత్యేక డ్రెస్.. డిజిటల్ స్కోరింగ్ ఈ టోర్నీని ప్రొఫెషనల్ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ప్రత్యేక డ్రెస్ కోడ్ అమలు చేస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో విజేతలకు ప్రభుత్వం స్పోర్ట్స్ టీ షర్టులను పంపిణీ చేయనుంది. దాదాపు ఒక్కో సచివాలయం పరిధిలో ఐదు క్రీడాంశాల్లో(క్రికెట్, ఖోఖో, బ్యాడ్మింటన్ డబుల్స్, కబడ్డీ, వాలీబాల్)గెలిచిన 114 మంది మహిళలు, పురుషులకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో కూడిన టీషర్టులు అందించనుంది. తొలి దశలో 17.19 లక్షల టీషర్టులను అందజేయనుంది. అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన జిల్లా స్థాయి విజేతలకు స్పోర్ట్స్ డ్రెస్ కిట్లు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించింది. అలాగే సచివాలయాల పరిధిలో వలంటీర్ల సేవలను ‘ఆడుదాం ఆంధ్ర’ పోటీల కోసం ఉపయోగించుకోనున్నారు. జిల్లా కోచ్‌లు, పీఈటీలు, పీడీలతో పాటు వలంటీర్లకు అంపైరింగ్, డిజిటల్ స్కోరింగ్‌పై తొలి దశ శిక్షణ అందించారు. మరోసారి సాంకేతిక నిపుణులతో ప్రత్యేక యాప్‌లో స్కోరింగ్ నమోదుపై శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామ, వార్డు సచివాలయం, మండల స్థాయి వరకు ఆఫ్‌లైన్‌లో స్కోర్లు నమోదు చేసి వాటిని యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నియోజకవర్గస్థాయిలో క్రీడాకారులు, ప్రేక్షకులు తమ మొబైల్లోనే స్కోర్ చూసుకునే విధంగా పోటీల సమయంలోనే ఆన్లైన్లో స్కోరింగ్ నమోదు చేస్తారు. పది రోజుల పాటు వాయిదా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 9,060 క్రీడా మైదానాలను శాప్ అధికారులు గుర్తించారు. మైదానాల్లో గడ్డి తొలగించడంతో పాటు క్రీడలకు అనువుగా మార్చే ప్రక్రియను ప్రారంభించారు. కానీ తుపాను కారణంగా పలు జిల్లాల్లోని మైదానాల్లోకి నీళ్లు చేరాయి. ప్రస్తుతం వాటిని తొలగించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. దీంతో 15వ తేదీన ప్రారంభం కావాల్సిన టోర్నీని పది రోజుల పాటు వాయిదా వేశారు. మరోవైపు.. రిజిస్ట్రేషన్లకు గడువును ఆదివారం(డిసెంబరు 17) వరకు పొడిగించారు. -
మరింత సులభంగా జీఎస్టీ సేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా సులభతరం చేస్తూ ప్రభుత్వం జీఎస్టీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా పన్ను చెల్లింపుల్లో అక్రమాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా సరళీకృతం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 సేవా కేంద్రాలను ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ టాక్స్ విజన్, మిషన్ వాల్యూస్, ’జీఎస్టీ మిత్ర’ లోగోను ఆవిష్కరించారు. ఉత్తమ పనితీరు కనబర్చిన 195 మంది అధికారులు, సిబ్బందికి పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పన్ను చెల్లింపుదారులకు అనుకూల వాతావరణాన్ని కలి్పంచేలా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. సేవా కేంద్రాల ద్వారా వ్యాపార, వాణిజ్య వర్గాలకు ఉత్తమ సేవలు అందుతాయని, జీఎస్టీ ఎగవేతలను అరికట్టవచ్చని చెప్పారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతకు పాల్పడటం వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని తెలిపారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టు ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామన్నారు. దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. పన్ను చెల్లించే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో టాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లాం మాట్లాడుతూ వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత, సరళతర విధానాలు మంచి ఫలితాలు ఇస్తాయని చెప్పారు. టాక్స్ పేయర్, వాణిజ్య పన్నుల శాఖ సమన్వయంతోనే పారదర్శకత సాధ్యమైందన్నారు. పన్ను చెల్లింపుదారులకు సులభంగా అర్థమయ్యేలా వెబ్సైట్ ను తీర్చిదిద్దారని తెలిపారు. పన్ను చెల్లింపుల వ్యవహారంలో ఇతర దేశాల్లో మాదిరి మన రాష్ట్రంలో వేధింపులకు తావు లేదన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విశాఖ కస్టమ్స్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సంజయ్ పంత్, జీఎస్టీఎన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ధీరజ్ రస్తోగి, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్.గుల్జర్, స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ ఎం.గిరిజా శంకర్, గుంటూరు సెంట్రల్ టాక్సెస్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జీఎస్టీ రాబడిలో మొదటి స్థానం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పూర్తి స్వేచ్ఛతో వాణిజ్య పన్నుల శాఖలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలందించేలా సంస్కరణలు చేపట్టామని చెప్పారు. నిజాయితీగా పన్నులు కట్టే వారిక సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పన్ను చెల్లింపుదారుల వివరాల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ విధానాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. నవంబర్ నెలలో జీఎస్టీ పన్నుల వసూళ్లలో 31 శాతం వృద్ధి రేటుతో తమిళనాడు (20%), కేరళ (20%), తెలంగాణ (18%), కర్ణాటక (17%), ఒడిశా (3%) కన్నా ఆంధ్రప్రదేశ్ అగ్రగ్రామిగా ఉందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌నాటికి రూ.21,180.57 కోట్ల జీఎస్టీ వసూలు ద్వారా 90 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామన్నారు. గత ఏడాదితో పోలిస్తే జీఎస్టీ వసూళ్లలో 17.14 శాతం వృద్ధిని నమోదు చేశామన్నారు. -
మరో 4 జిల్లాల్లో ప్రైమ్ రిజిస్ట్రేషన్లు
సాక్షి, అమరావతి: తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం కార్డ్ ప్రైమ్ మరో 4 జిల్లాల్లో ప్రారంభమైంది. నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని 51 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో సోమవారం నుంచి ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచి కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని 24 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు. ఈ నెల 14న శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించనున్నారు. దశల వారీగా ఈ నెలాఖరుకల్లా అన్ని జిల్లాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై ఈ–సిగ్నేచర్తోనే.. ప్రస్తుతం డాక్యుమెంట్లో ఆస్తి యజమాని సంతకాలు పెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నా త్వరలో ఈ–సిగ్నేచర్‌ను మాత్రమే అనుమతించనున్నారు. సబ్ రిజిస్ట్రార్ సంతకాలు ఇప్పటికే ఈ–సైన్ల ద్వారా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ భూములైతే ఆన్లైన్లో నమోదు చేయించుకోవడానికి తహశీల్దార్ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ కూడా కొత్త విధానంలో జరిగిపోతుంది. రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను సంబంధిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్సీ కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. అవగాహన లేకే ‘జిరాక్సుల’ ప్రచారం కొత్త రిజిస్ట్రేషన్ల విధానంలో ప్రజల డాక్యుమెంట్లను వారికివ్వకుండా జిరాక్సులు మాత్రం వారికిచ్చి, ఒరిజినల్ డాక్యుమెంట్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే ఉంచుతారనే ప్రచారంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ స్పందించారు. లక్షల డాక్యుమెంట్లను దాచిపెట్టేటన్ని బీరువాలు, కప్‌బోర్డులు తమ ఆఫీసుల్లో లేవన్నారు. జిరాక్సుల ప్రచారం అపోహ మాత్రమేనని, అవగాహన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం తగదన్నారు. -
ఈ–క్రాప్ నమోదు 10కి పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్‌తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్‌సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. -
21 నుంచి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశానికి మరోవిడత దోస్త్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రిజిస్ట్రేషన్ చేసుకోనివారు, రద్దయిన అభ్యర్థులు ఈ నెల 21 నుంచి 24వ తేదీలోగా రూ.400 చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ద్వారా మిగిలిపోయిన వివిధ కాలేజీల్లోని సీట్లకు 21 నుంచి 25 వరకూ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 29న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. వచ్చే నెల 3, 4 తేదీల్లో అన్ని ప్రైవేటు కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించాలని మండలి పేర్కొంది. కాగా, సీటు పొందిన కాలేజీలో వేరే బ్రాంచీకి మారాలనుకునే అభ్యర్థులు ఈ నెల 19, 20 తేదీల్లో ఇంట్రా కాలేజీ వెబ్ ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 21న ఇంట్రా కాలేజీ సీట్ల కేటాయింపు ఉంటుంది. -
వైద్యవిద్య పీజీ ప్రవేశాల వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యాసంవత్సరానికి రాష్ట్ర కోటా పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు శుక్రవారం డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీచేసింది. ఇన్ సర్వీస్, నాన్ సర్వీస్ అభ్యర్థులు https:// pgcq.ysruhs.com వెబ్సైట్లో ఆదివారం ఉదయం 10 గంటలలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని సూచించింది. ఆప్షన్ల నమో దు సమయంలో సాంకేతిక సమస్యలు తలెత్తితే 7416563063, 7416253073, 9063400829 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని వీసీ డాక్టర్ బాబ్జీ సూచించారు. పలు కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలపై ఎన్ఎంసీ పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతి పత్రాలు వెలుగులోకి రావడంతో తొలిదశ కౌన్సెలింగ్‌ను రద్దుచేసినట్లు తెలిపారు. ఎన్ఎంసీ నుంచి స్పష్టత తీసుకుని రివైజ్డ్ సీట్ మ్యాట్రిక్స్‌ను వెబ్సైట్లో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో విద్యార్థులు మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. తొలిదశలో కేటాయించిన సీట్లు రద్దుచేసిన విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. జీఎస్ఎల్, మహారాజాల్లోను ఫేక్ అనుమతులు శాంతీరామ్ వైద్యకళాశాలలో ఫేక్ అనుమతుల వ్యవహారం బయటపడటంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు మిగిలిన కళాశాలల్లో సీట్లను పరిశీలించారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాలోని జీఎస్ఎల్, విజయనగరం జిల్లాలోని మహారాజా ప్రైవేట్ వైద్యకళాశాలల్లోని పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్లకు మధ్య వ్యత్యాసం గుర్తించారు. దీంతో ఎన్ఎంసీకి ఈ వ్యవహారంపై లేఖ రాశారు. ఆయా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపుదలకు తాము అనుమతులు ఇవ్వలేదని ఎన్ఎంసీ శుక్రవారం స్పష్టం చేసింది. సీట్లు పెంచుతూ వెలువడిన అనుమతులు ఫేక్/ఫోర్జరీవని తెలిపింది. మరోవైపు 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా అన్ని రాష్ట్రాల డీఎంఈలు ఎన్ఎంసీ వెబ్సైట్లో ఉన్న సమాచారాన్నే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. సాధారణ ప్రజలు సైతం ఇతర మాధ్యమాల్లో పొందుపరిచే సమాచారాన్ని నమ్మవద్దని సూచించింది. -
100 శాతం జీఈఆర్ సాధించాలి
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు. -
ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు చివరి చాన్స్
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కన్వినర్ సీటు కౌన్సెలింగ్ ద్వారా పొందడానికి ఇదే చివరి అవకాశం. ఇప్పటివరకూ సీటు కోసం ప్రయత్నించని వారు ఉంటే ఈ నెల 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వాలని సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 17 నుంచి 19 వరకూ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ నెల 23వ తేదీన ప్రత్యేక దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండు రోజుల్లో సీటు వచ్చిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత కూడా మిగిలిపోయిన సీట్లను ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్ల పేరిట ఆన్లైన్లో కాకుండా నేరుగా కాలేజీల్లోనే భర్తీ చేస్తారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సాంకేతిక విద్య విభాగం విడుదల చేయాల్సి ఉంది. అందుబాటులో 19 వేల సీట్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 19,049 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన సీట్లు దాదాపు 4 వేలకు పైనే ఉన్నాయి. ఒక్క సీఎస్సీలోనే 3,034 సీట్లు మిగిలాయి. సివిల్ ఇంజనీరింగ్‌లో 2,505, ఈసీఈలో 2,721, ఈఈఈలో 2,630, ఐటీలో 1,785, మెకానికల్‌లో 2,542 సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది పలు కాలేజీలు సివిల్, మెకానికల్ సీట్లు రద్దు చేసుకుని, ఆ స్థానంలో కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకున్నాయి. వీటితో పాటు మరో 7 వేల సీట్లు కొత్తగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో పెరిగాయి. మొత్తంగా కంప్యూటర్ సైన్స్ సీట్లు 14 వేల వరకు పెరిగాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు చేరువలో ఉండే కాలేజీల్లో కంప్యూటర్ కోర్సులు అందుబాటులో ఉన్నా అక్కడ చేరేందుకు విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఆయా కాలేజీల్లో మౌలిక వసతులు, సరైన ఫ్యాకల్టీ లేదని విద్యార్థులు భావిస్తున్నారు. కాగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో సీట్లు 90 శాతం వరకూ భర్తీ అయ్యాయి. లక్షకు చేరువలో చేరికలు ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో కన్వీనర్, యాజమాన్య కోటా కలిపి లక్ష మంది వరకు చేరే వీలుందని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 174 కాలేజీలుంటే, వీటిలో 83,766 కన్వినర్ కోటా సీట్లు, మరో 33 వేలు యాజమాన్య కోటా సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటాలో ఇప్పటికే 65 వేల మంది వరకూ చేరారు. ప్రత్యేక కౌన్సెలింగ్, స్పాట్ అడ్మిషన్ల ద్వారా మరో 6 వేల మంది వరకూ చేరే వీలుందని అంచనా వేస్తున్నారు. ఇక యాజమాన్య కోటా కింద దాదాపు 30 వేల వరకూ భర్తీ అయ్యే వీలుందని భావిస్తున్నారు. -
అభిమానులకు గుడ్‌న్యూస్.. వన్డే వరల్డ్ కప్ టికెట్లు రెడీ! ఆన్లైన్లో ఇలా
దుబాయ్: ఎట్టకేలకు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానులకు తీపి కబురు! టోర్నీ తొలి మ్యాచ్‌కంటే కేవలం 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టికెట్లను అమ్మకానికి ఉంచనుంది. మ్యాచ్‌ల తేదీలనే బాగా ఆలస్యంగా (100 రోజుల ముందు) ప్రకటించిన ఐసీసీ ఇప్పుడు వేర్వేరు కారణాలతో వాటిని సవరించి బుధవారం తుది షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పాటు ఫ్యాన్స్ తమ ప్రణాళికలు రూపొందించుకునేందుకు వీలుగా టికెట్ల అమ్మకాల వివరాలను కూడా ఐసీసీ వెల్లడించింది. ‘భారత్ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్‌లు’... ‘భారత్ ఆడని ఇతర మ్యాచ్‌లు’ అంటూ రెండు రకాలుగా టికెట్ల అమ్మకాలను ఐసీసీ విభజించింది. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌ల టికెట్లను కూడా ఆరు వేర్వేరు దశల్లో (వేదికల ప్రకారం) అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. అయితే ఇతర ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌ల తరహాలో నేరుగా అమ్మకపు తేదీ నుంచి టికెట్లు కొనేందుకు అవకాశం ఉండదు. వరల్డ్ కప్ టికెట్ల కోసం అభిమానులు ఆన్లైన్లో ముందుగా వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని ప్రకారమే ఆ తర్వాత కేటాయింపులు జరుగుతాయి. ఆగస్టు 15 నుంచి అభిమానులు https://www.cricketworldcup.com/register లో తమ వివరాలు నమోదు చేయాలి. టికెట్ల అమ్మకపు తేదీల వివరాలు 25 ఆగస్టు నుంచి: భారత్ మినహా ఇతర జట్ల వామప్ మ్యాచ్‌లు/ప్రధాన మ్యాచ్‌లు 30 ఆగస్టు నుంచి: భారత్ ఆడే రెండు వామప్ మ్యాచ్‌లు (గువహటి, తిరువనంతపురం) 31 ఆగస్టు నుంచి: చెన్నై (ఆస్ట్రేలియాతో), ఢిల్లీ (అఫ్గానిస్తాన్‌తో), పుణే (బంగ్లాదేశ్‌తో)లలో భారత్ ఆడే మ్యాచ్‌లు 1 సెప్టెంబర్ నుంచి: ధర్మశాల (న్యూజిలాండ్‌తో), లక్నో (ఇంగ్లండ్‌తో), ముంబై (శ్రీలంకతో)లలో భారత్ మ్యాచ్‌లు 2 సెప్టెంబర్ నుంచి: బెంగళూరు (నెదర్లాండ్స్‌తో), కోల్‌కతా (దక్షిణాఫ్రికాతో)లలో భారత్ ఆడే మ్యాచ్‌లు 3 సెప్టెంబర్ నుంచి: అహ్మదాబాద్‌లో (పాకిస్తాన్‌తో) భారత్ ఆడే మ్యాచ్ 15 సెప్టెంబర్ నుంచి: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు -
రెరాతో రియల్ దందాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ దందాలకు ఆస్కారం లేకుండా టీఎస్ రెరా (తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) కృషి చేస్తుందని ‘రెరా’ చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ’’ రాష్ట్రంలో 598 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా, 8 ఫ్లాట్లను మించి నిర్మించే ఏ అపార్ట్‌మెంట్‌కు అయినా... రెరా రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ‘ఏ వెంచర్ కోసం కొనుగోలు దారుల నుంచి వసూలు చేశారో.. ఆ మొత్తంలో 70 శాతం అదే వెంచర్లో ఖర్చు చేయాలి. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మాత్రమే అగ్రిమెంట్ సమయంలో చెల్లించాలి. ప్రాజెక్టు ప్లాన్ మార్చాలన్నా... కొనుగోలు దారుల్లో మూడింట రెండొంతుల మంది అనుమతి తప్పనిసరి’... ఇలాంటి నిబంధనలన్నింటినీ తప్పనిసరి చేసేందుకు ‘రెరా’ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ‘రెరా’ నిబంధనలకు లోబడే.. ప్రతీ ప్రాజెక్టు రియల్ వెంచర్ అయినా, భారీ అపార్ట్మెంట్ అయినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముందుగా చెప్పిన దానికి భిన్నంగా నిర్మాణం జరిపినా, పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా, సౌకర్యాలు కల్పించకపోయినా ‘రెరా’ చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో ఏమూలన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా, అపార్ట్మెంట్ కట్టినా ‘రెరా’ వద్ద ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించాలి. దీంతో కొనుగోలుదారుడికి, రియల్ వ్యాపారికి అనుసంధానంగా ఈ సంస్థ పనిచేస్తుంది. 2017లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,805 వెంచర్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ‘రెరా’ వద్దకు రాగా, అందులో 6,770కి అనుమతులు లభించాయి. మరో 35 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ‘రెరా’ చట్టం ప్రకారం రియల్ వెంచర్లు, ఫ్లాట్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (బ్రోకర్లు) కూడా ‘రెరా’ వద్ద రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు 2,912 మంది ఏజెంట్లు రిజిస్టర్ కాగా, మిగతా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ సత్యనారాయణ సూచించారు. కాగా, గతంలో జరిగిన రియల్ దందాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆ లావాదేవీలపైనా విచారించి తప్పు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
అక్కడ తగ్గుముఖం పట్టిన ఇళ్ల రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: హైదరాబాద్ ప్రాంత పరిధిలో మే నెలలో ఇళ్ల రిజిస్ట్రేషన్లు 7 శాతం తగ్గాయి. మొత్తం 5,877 ఇళ్ల రిజిస్ట్రేషన్లను నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. హైదరాబాద్‌తోపాటు, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో రిజిస్ట్రేషన్ల వివరాలు ఈ గణాంకాల్లో కలసి ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన రిజిస్ట్రేషన్లతో పోలిస్తే మే నెలలో 31 శాతం పెరిగాయి. కాకపోతే క్రితం ఏడాది మే నెలలో రిజిస్ట్రేషన్ల గణాంకాలతో పోలిస్తే 7 శాతం తగ్గాయి. మే నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లు జరిగిన ఇళ్ల విలువ రూ.2,994 కోట్లుగా ఉంది. మొత్తం రిజిస్ట్రేషన్లలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అత్యధికంగా 45 శాతం నమోదయ్యాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పరిధిలోని రిజిస్ట్రేషన్ల వాటా 39 శాతంగా ఉంది. ఇక హైదరాబాద్ రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతంగా ఉంది. రూ.25–50 లక్షల బడ్జెట్ మే నెలలో హైదరాబాద్ ప్రాంతంలో రిజిస్టర్ అయిన ఇళ్లలో ఎక్కువ శాతం రూ.25–50 లక్షల బడ్జెట్ మధ్య ఉన్నాయి. ఆ తర్వాత రూ.25 లక్షల్లోపు ఇళ్లు 17 శాతంగా ఉన్నాయి. రూ.కోటి రూపాయాలు అంతకుమించి విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లు 9 శాతంగా ఉన్నాయి. క్రితం ఏడాది మే నెలలో ఈ విభాగం రిజిస్ట్రేషన్లు 6 శాతంతో పోలిస్తే 50 శాతం పెరిగాయి. 1,000–2,000 చదపు అడుగుల ప్రాపర్టీల వాటా 70 శాతంగా ఉంది. (ఇదీ చదవండి: భారతదేశంలో ఫస్ట్ బిలీనియర్ ఇతడే.. సంపద ఎంతో తెలుసా?) సగటు లావాదేవీ విలువ క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 3 శాతం పెరిగింది. ‘‘హైదరాబాద్ నివాసిత మార్కెట్ ఆశావహంగా ఉంది. ఇళ్ల కొనుగోదారుల నుంచి బలమైన డిమాండ్ కనిపిస్తోంది. 1,000–2,000 చదరపు అడుగుల ఇళ్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయడం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది’’అని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ తెలిపారు. -
2023 మిస్ వరల్డ్ పోటీలు.. పాల్గొనాలనుందా? అయితే ఇలా చేయండి!
Miss World 2023: ప్రతిభావంతులైన ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ పోటీలు ఈ సారి ఇండియాలో జరగనున్న సంగతి తెలిసిందే. 27 సంవత్సరాల తరువాత మళ్లీ భారత్ ఈ అందాల పోటీలను నిర్వహిస్తుండడం విశేషం. 71వ మిస్ వరల్డ్ పోటీలు ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 1996 తరువాత మిస్ వరల్డ్ పోటీలు భారతదేశంలో జరగడం ఇదే మొదటి సారి. ఈ పోటీలను గురించి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ సీఈవో 'జూలియా మోర్లే' (Julia Morley) వెల్లడించారు. భారతదేశంలో జరగనున్న ఈ పోటీలలో మన దేశం తరపున మిస్ వరల్డ్ 'సినీ శెట్టి' (Sini Shetty) ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇందులో మొత్తం 130 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోటీలలో భాగంగా పాల్గొనే అందగత్తెల ప్రతిభ, సేవా దృక్పథం, క్రీడలలో వారికున్న ప్రతిభను ఆధారంగా చేసుకుని రౌండ్స్ నిర్వహిస్తారు. అన్ని రౌండ్స్‌లో ముందున్న వారు మిస్ వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకుంటారు. భారతదేశం ఇప్పటి వరకు ఆరు సార్లు మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. 1966లో మొదటి సారి ఇండియాకి చెందిన 'రీటా ఫరియా' మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. ఆ తరువాత 1994లో ఐశ్వర్యారాయ్ బచ్చన్, 1997లో డయానా హైడెన్, 1999 యుక్తాముఖి, 2000లో ప్రియాంక చోప్రా, 2017లో మానుషి చిల్లర్ విశ్వసుందరి కిరీటాలను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సారి జరగనున్న మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటాన్ని దక్కించుకునే విశ్వ సుందరి ఎవరో తెలియాల్సి ఉంది. భారతదేశం ఆథిత్యమివ్వనున్న మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలంటే ఏం చేయాలి? నియమాలు ఏంటి? రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ చూద్దాం.. నిజానికి మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనాలనుకునే వారు స్థానిక లేదా జాతీయ అందాల పోటీలలో పాల్గొని ఉండాలి. ఈ పోటీకి సన్నద్ధం కావడానికి ఒక కోచ్‌ని ఎంచుకోవాలి. మిస్ వరల్డ్‌లో ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది ముందుగానే అప్లై చేసుకోవాలి. ఆ తరువాత ప్రిలిమినరీ ఇంటర్వ్యూలో అర్హత సాధించాలి. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) నియమాలు మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనాలనుకునే వారు అవివాహితులై ఉండాలి. వయసు 17 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి వారు ఈ పోటీలకు అప్లై చేసుకోవచ్చు. అయితే దేశాన్ని బట్టి మారే కట్-ఆఫ్ తేదీలను ఖచ్చితంగా ద్రువీకరించాలి. పోటీలు జరిగే నాటికి మీకు నిర్దేశించిన వయసు తప్పకుండా ఉండాలి. జరిగే పోటీలు 'మిస్' అని ఉంటాయి కావున వివాహితులు పోటీ చేయడానికి అనర్హులు. మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే వ్యక్తికి గతంలో ఎటువంటి నేర చరిత్ర ఉండకూడదు. ఏ దేశం నుంచి పోటీ చేస్తున్నారో ఆ దేశం పౌరసత్వం ఖచ్చితంగా ఉండాలి. 'బ్యూటీ విత్ ఏ పర్సన్' అనే దాన్ని బట్టి బాహ్య సౌందర్యమే కాదు, అంతః సౌందర్యం కూడా చాలా ప్రధానం. కావున ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే మహిళలు ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన వ్యక్తుల కోసం డబ్బు లేదా అవగాహన పెంచడానికి ప్రాజెక్ట్‌లను నిర్వహించి ఉండాలి. డ్యాన్స్ మీద కూడా మంచి పట్టు ఉండాలి. మోడలింగ్ పోటీలలో పాల్గొనే వారు వస్త్ర ధారణ, ర్యాంప్ వాక్ వంటివి ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యమని మర్చిపోకూడదు. అన్ని అంశాలలోనే ఉత్తమ ప్రతిభను కనపరచిన వారిని విజేతగా న్యాయ నిర్ణేతలు ప్రకటిస్తారు. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) రిజిస్ట్రేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం క్లోజ్ అప్, మిడ్ లెంత్, ఫుల్ లెంత్ & మేకప్ లేకుండా ఉండే నాలుగు పోటోలను సిద్ధంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత రుజువు కోసం పాస్‌పోర్ట్ ప్రధానం. లేకుంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి ఉండాలి. మీ ఎత్తుకి సంబంధించిన ఖచ్చితమైన కొలతల కోసం VLCC కేంద్రాన్ని సందర్శించాలి. మీ ఇమెయిల్ ID లేదా మొబైల్ నంబర్‌తో సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేసుకున్న తరువాత 2 వేర్వేరు ఆడిషన్ టాస్క్ వీడియోలను అప్లోడ్ చేయండి (పరిచయానికి సంబంధించిన వీడియో & రాంప్‌వాక్ వీడియో). వీడియో పరిమితి 60 సెకన్లు వరకు మాత్రమే ఉండాలి. మొదటి మూడు దశలలో మీ ఫోటోలను, కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అప్లై చేసుకోవడానికి రూ. 2999 + ట్యాక్స్ వంటివి చెల్లించాలి. ఆతరువాత మీరు రిజిస్టర్ చేసుకున్న ఈ మెయిల్ అందుకున్న కోడ్ ఎంటర్ చేసుకోవాలి. అన్ని వివరాలను ఫిల్ చేసిన తరువాత T&Cలను అంగీకరించి సబ్మిట్ చేయాలి. ఇవన్నీ పూర్తయిన తరువాత మీకు ఒక ఈ మెయిల్ వస్తుంది. అప్లై చేసుకోవంలో ఎలాంటి సందేహం ఉన్నా ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య +91 9619937295 / +91 7039464909 నెంబర్‌కి కాల్ చేయవచ్చు, లేదా missindiaorg@timesgroup.comని సంప్రదించాలి. -
ఇ-స్టాంపింగ్ సేవలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్
-
రిజిస్ట్రేషన్ సేవలు ఇక సులభతరం
సాక్షి, అమరావతి: రిజిస్ట్రేషన్లను సులభతరం చేసే ఇ–స్టాంపింగ్ సేవలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు లేకుండా సురక్షితంగా రూపొందించిన ఇ–స్టాంపింగ్ విధానం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. www. shcilestamp. com వెబ్సైట్, ఇ–స్టాంపింగ్ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఇ–స్టాంపులను పొందవచ్చు. నగదు, చెక్కు, ఆన్లైన్ (నెఫ్ట్, ఆ ర్టీజీఎస్, పీఓఎస్, యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్బీఐ, ఆప్కాబ్, యూనియన్ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచిలు, సీఎస్సీ కేంద్రాలు, స్టాంప్ అమ్మకందార్లు, స్టాక్ హోల్డింగ్ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 పైగా కేంద్రాల వద్ద ఇ–స్టాంపింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చారు. మరో వెయ్యికిపైగా కేంద్రాల వద్ద త్వరలో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఆస్తుల క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 పైగా ఎంపిక చేసిన కేంద్రాల్లో ఇ–స్టాంపింగ్ ద్వారా స్టాంప్ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలను చెల్లించవచ్చు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సెంట్రల్ రికార్డు నిర్వహించే ఏజెన్సీ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సులభంగా సేవలందించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ విధానంలో వినియోగదారులే స్వయంగా తమ డాక్యుమెంట్లను తయారు చేసుకుని ఇ–స్టాంపింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణ స్వామి, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ఐటీ సలహాదారు శేషిరెడ్డి, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గుంటూరు డీఐజీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
మోటారు వాహనాల చట్ట సవరణ అమలులోకి.. పెరగనున్న లైఫ్ టాక్స్
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి వాహనాల ఎక్స్‌షోరూమ్ ధరల మీదనే జీవిత పన్ను విధిస్తారు. ఇంతకాలం వాహనం కొనుగోలుపై షోరూమ్ నిర్వాహకులు ఇచ్చే డిస్కౌంట్ పోను, మిగతా మొత్తం మీద మాత్రమే పన్ను విధించేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్ట సవరణ ఇప్పుడు అమలులోకి వచ్చింది. చట్ట సవరణ బిల్లుకు గత నెల చివరలో గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టం అమలుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ విడదుల చేసి, అమలు ప్రారంభించింది. మార్చికి ముందు కారుకొన్నా.. ఏప్రిల్‌లో రిజిస్ట్రేషన్ చేస్తే కొత్త విధానమే.. చట్ట సవరణ నేపథ్యంలో అమలుపై రవాణాశాఖ స్పష్టతనిచ్చింది. కారు ఏప్రిల్‌కు ముందు కొన్నా, రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరిగితే, కొత్త విధానమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం అమలులోకి రావటానికి ముందు గత నెలలో కార్లు కొన్నవాళ్లు చాలామంది ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందే కారు కొన్నందున తమకు కొత్త విధానం వర్తించదన్న ధీమాతో ఉన్నారు. కానీ, కారు ఎప్పుడు కొన్నా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్త విధానమే వర్తిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. పెరగనున్న పన్ను.. ధర ఎక్కువ కార్లపైనే ఈ కొత్త విధానం ప్రభావం ఉండనుంది. కారు కొన్నప్పుడు ఎక్స్‌షోరూం ధరపైన షోరూం నిర్వాహకులు డిస్కౌంట్ ఇవ్వటం సహజమే. ధర ఎక్కువగా ఉండే కార్లపై ఈ మొత్తం ఎక్కువగా ఉంటుంది. ఈ డిస్కౌంట్‌ను సాకుగా చూపి చాలామంది కొంతమేర పన్ను ఎగవేస్తున్నారు. ఇప్పుడు దానికి అవకాశం లేదు. రూ.5 లక్షల ధర ఉన్న కార్లపై 13 శాతం, రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉండే కార్లపై 14 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండే కార్లపై 17 శాతం, రూ.20 లక్షలకంటే ఎక్కువ ధర ఉండే కార్లపై 18 శాతం చొప్పున జీవిత పన్నును సవరిస్తూ గతేడాది రవాణాశాఖ ఉత్తర్వు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజా సవరణ ప్రకారం.. డిస్కౌంట్ మొత్తం మినహాయించక ముందు ఉండే ఎక్స్‌షోరూం ధరలపై పైన పేర్కొన్న నిర్ధారిత శాతంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తుల పేరు మీద కాకుండా సంస్థలు, కంపెనీల పేరుతో ఉండే కార్లపై అదనంగా రెండు శాతం, రెండో కారు తీసుకునేవారు అదనంగా 2 శాతం చెల్లించాల్సి ఉంటుంది. -
హైదరాబాద్‌లో ఏ మూలైతే ఏంటి? ఎక్కడా తగ్గేదెలే!
సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలు నిర్ణయంలో ధర, ప్రాంతం, వసతులతో పాటు వాస్తు కూడా ప్రధానమైనదే. భారతీయ గృహ కొనుగోలుదారులైతే వాస్తు తర్వాతే మిగతా అంశాలను ఎంపిక చేస్తుంటారు. అయితే హైదరాబాద్‌లోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ జోన్లలో ఏ దిక్కున ఎంత అభివృద్ధి చెందుతుంది? ఏడాది కాలంలో నగరంలో గృహ కొనుగోళ్ల విలువ, ధరల వృద్ధి తదితర అంశాలపై నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదికను వెలువరించింది. గత నెలలో హైదరాబాద్‌లో రూ. 3,352 కోట్ల విలువ చేసే ప్రాపర్టీలు రిజిస్ట్రేషన్ జరిగాయి. అంతకుముందు నెలతో పోలిస్తే మార్చిలో నగరంలో 12 శాతం వృద్ధి రేటుతో 6,414 అపార్ట్మెంట్లు రిజిస్టేషన్స్ అయ్యాయి. ఇందులో 53 శాతం ప్రాపర్టీలు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే రిజిస్టేషన్స్ కాగా.. 70 శాతం 1,000 నుంచి 2,000 చ.అ. ప్రాపర్టీలే ఉండటం గమనార్హం. పశ్చిమం.. సరఫరా అయిన గృహాల విలువ: 85 వేల కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 7,700 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 19 % టాప్–5 మైక్రో మార్కెట్లు: తెల్లాపూర్, కొండాపూర్, మణికొండ, గచ్చిబౌలి, నార్సింగి ఉత్తరం.. సరఫరా అయిన గృహాల విలువ: 26 వేల కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 1,900 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 22 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: కొంపల్లి, సైనిక్‌పురి, పోచారం, బాచుపల్లి, మియాపూర్ (ఇదీ చదవండి: షాకింగ్ రిపోర్ట్..! మొబైల్ ఛార్జ్ తక్కువున్నప్పుడు ఉబర్ ఛార్జ్ ఎక్కువవుతుందా?) దక్షిణం.. సరఫరా అయిన గృహాల విలువ: 3,400 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 310 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: రాజేంద్రనగర్, మహేశ్వరం, శంషాబాద్, ఆదిభట్ల, షాద్‌నగర్ తూర్పు.. సరఫరా అయిన గృహాల విలువ: 3,200 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 230 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20 శాతం టాప్ - 5 మైక్రో మార్కెట్లు: ఉప్పల్, ఘట్కేసర్, హబ్సిగూడ, నాగోల్, ఎల్బీనగర్ (ఇదీ చదవండి: భారత్‌లో లభించే టాప్ 5 బెస్ట్ సీఎన్జీ కార్లు - ధర తక్కువ & ఎక్కువ మైలేజ్!) సెంట్రల్.. సరఫరా అయిన గృహాల విలువ: 2,200 కోట్లు ఏడాది సగటున విక్రయమయ్యే ఇళ్ల విలువ: 180 కోట్లు ప్రాపర్టీ ధరల వృద్ధి: 20% టాప్ 5 మైక్రో మార్కెట్లు: అమీర్‌పేట, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం -
జూలై ఒకటి నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూ: హిమాలయాల్లో కొలువైన అమర్నాథ్ ఆలయ వార్షిక యాత్ర జూలై ఒకటో తేదీ నుంచి మొదలుకానుంది. ఆగస్ట్ 31 దాకా కొనసాగనుంది. ఈ నెల 17వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన ఆలయ బోర్డు భేటీలో ఈ మేరకు నిర్ణయించినట్టు అధికారులు చెప్పారు. యాత్రకు వివరాల కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. -
26న పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు
సాక్షి, అమరావతి: ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఆదివారం కూడా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ రామకృష్ణ తెలిపారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయించుకునే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల ఛార్జీలు, ఇతర చలానాలను ఆ రోజు రాష్ట్రంలోని 51 ఎస్బీఐ బ్రాంచిల్లో కట్టవచ్చని తెలిపారు. -
సహజీవనానికి రిజిస్ట్రేషనా?.. సుప్రీం ఘాటు స్పందన
న్యూఢిల్లీ: దేశంలో సహజీవనం చేసే జంట.. తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని గుర్తింపు పొందాలని, ఈ మేరకు నిబంధనల రూపకల్పన జరగాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టేసింది. దీన్నొక మూర్ఖపు ఆలోచనగా అభివర్ణిస్తూ పిటిషన్ కొట్టేశారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. దేశంలో సహజీవనానికి గుర్తింపు ఉండాలని, ఈ మేరకు రిలేషన్షిప్లో ఉండే ప్రతీజంట రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని, అలాగే.. ఆ జంటలకు సామాజిక భద్రత కల్పించాలంటూ ఓ న్యాయవాది ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఆ ఆలోచన ద్వారా సహజీవనంలో జరుగుతున్న నేరాల సంఖ్య తగ్గుతుందని అభిప్రాయపడ్డారు ఆ న్యాయవాది. అయితే.. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఘాటుగా స్పందించారు. ఎలాంటి విషయంతోనైనా ఇక్కడికి వస్తున్నారు. ఇలాంటి వాటిల్లో ఇకపై జరిమానాలు విధించడం మొదలుపెడతాం. ఏంటిది?.. రిజిస్ట్రేషనా? ఎవరితో? కేంద్ర ప్రభుత్వంతోనా? సహజీనవంలో ఉన్న జంటలతో కేంద్రం ప్రభుత్వానికి ఏం పని? ఏం సంబంధం అసలు? అంటూ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏ ఉద్దేశంతో పిటిషన్ వేశారని న్యాయవాదిని సీజేఐ ప్రశ్నించగా.. సోషల్ సెక్యూరిటీ అనే సమాధానం ఇచ్చారాయన. ఒకానొక తరుణంలో న్యాయవాదిపై ఆగ్రహం వెల్లగక్కిన సీజేఐ.. పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ ఘటన.. ఆపై వరుసగా మరో నాలుగైదు సహజీవన జంటల తాలుకా నేరాలు వెలుగులోకి రావడంతో కేంద్రం తరపు నుంచి లివింగ్ రిలేషన్‌షిప్‌లపై రిజిస్ట్రేషన్, గైడ్‌లైన్స్‌ల కోసం తాను సుప్రీంను ఆశ్రయించినట్లు చెప్పారా న్యాయవాది. ఇదీ చదవండి: ఓటీటీ కంటెంట్‌పై కేంద్రం సీరియస్! -
ప్రతి సచివాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయంగా మారబోతోంది : ధర్మాన
-
పదేళ్ళకు ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ రెన్యువల్
న్యూఢిల్లీ: శాటిలైట్ టీవీ ఎంఎస్‌వోల (మల్టీ–సిస్టం ఆపరేటర్లు) రిజిస్ట్రేషన్‌ను 10 ఏళ్ల వ్యవధికి రెన్యువల్ చేయాలని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ కేంద్రానికి సూచించింది. ఇందుకోసం ప్రాసెస్ ఫీజును రూ. 1 లక్షగా నిర్ణయించాలని సిఫార్సు చేసింది. కేబుల్ టీవీ నెట్వర్క్స్ నిబంధనల్లో ఎంఎస్‌వోల రిజిస్ట్రేషన్ల రెన్యువల్ నిబంధనలు లేకపోవడంతో తగు సూచనలు చేయాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ కోరిన మీదట ట్రాయ్ ఈ మేరకు సిఫార్సులు చేసింది. రెన్యువల్‌కి దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరిగేలా చూడాలని, బ్రాడ్కాస్ట్ సేవా పోర్టల్ ద్వారా పత్రాలన్నీ డిజిటల్ విధానంలో అప్లోడ్ చేసే వెసులుబాటు కల్పించాలని పేర్కొంది. అలాగే రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఎంఎస్‌వోల జాబితాను, నిర్దిష్ట గడువులోగా దరఖాస్తు చేసుకోని వాటి లిస్టును పోర్టల్‌లో పొందుపర్చాలని సూచించింది. ఒకవేళ దరఖాస్తు పరిశీలనలో ఉన్నా, నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో ఉంచినా తుది నిర్ణయం తీసుకునే వరకూ సదరు ఎంఎస్‌వోలకు పొడిగింపునివ్వాలని పే ర్కొంది. గడువు తేదీ ముగియడానికి ఏడు నుంచి రెండు నెలల ముందు వరకూ రెన్యువల్ కోసం దరఖాస్తులను స్వీకరించవచ్చని ట్రాయ్ సూచించింది. రెండు నెలల కన్నా తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే జాప్యానికి చూపిన కారణాలను పరిశీలించి శాఖ తగు నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. -
పవన్ కల్యాణ్ కొత్త వాహనాల రిజిస్ట్రేషన్.. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్..
సాక్షి, హైదరాబాద్: సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. కొత్తగా కొనుగోలు చేసిన ఆరు వాహనాలను ఆయన రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాటిలో ఒకటి బెంజ్, మరో రెండు స్కార్పియో కార్లు ఉ న్నాయి. టయోటా వైల్‌ఫైర్ వాహనంతో పాటు ఒక జీప్ ర్యాంగ్లర్, ఒక టాటా యోధ ట్రాన్స్‌పోర్టు వాహనం పవన్‌కల్యాణ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అలాగే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకున్నారు. ఉపరవాణా కమిషనర్ పాపారావు, ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి రాంచందర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: (కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం) -
ఆహార కల్తీకి చెక్! అధికారుల కొత్త రూల్స్.. లైసెన్స్ తీసుకుంటేనే సరి.. లేదంటే?
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయా రీ కేంద్రాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వందల సంఖ్యలో చిన్నచిన్న బండ్లపై, రోడ్డు పక్కన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అధికంగా ఏర్పాటవుతున్నాయి. పెద్దపెద్ద హోటళ్ల నుంచి చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు కనీస నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఆహార పదార్థాల విక్రయాల్లో కనీస నాణ్యత పాటించడం లేదని ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఆహార పదార్థాలు కల్తీకి గురవుతున్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఆహార కల్తీని కట్టడి చేయడంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహార ఉత్పత్తులు, భోజనం అందించేలా వ్యాపారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేని టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు, హోటళ్లపై అధికారులు దృష్టి సారించారు. వాటిని నిర్వహించే వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండడంతో పాటు చిరు వ్యాపారులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి శనివారం లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించేందుకు నిర్ణయించారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్లు లేనివే ఎక్కువ.. ఉమ్మడి జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం హోటళ్లు, బేకరీలు, టిఫిన్ సెంటర్లు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాల్ మిల్లులు తదితర ఆహార ఉత్పత్తుల కేంద్రాలు 5 వేలకు పైగానే ఉన్నాయి. వాటిలో లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగిన హోటళ్లు, రెస్టారెంట్లు 886 వరకు ఉండగా, చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఇతర ఫుడ్ కోర్టులు ఖమ్మం జిల్లాలో 1400, కొత్తగూడెంలో 700 ఉన్నాయి. మిగిలిన వాటికి లైసెన్సులు, రిజిస్ట్రేషన్లు లేకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వ్యాపారం చేసే టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఇతర ఫుడ్ కోర్టులు తప్పనిసరిగా తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. ఆపైన వ్యాపారం చేసే వారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం లైసెన్స్ పొంది ఉండాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు నిర్వహించే వారిపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. రిజిస్ట్రేషన్, లైసెన్స్ ఉండి నిబంధనలు పాటించకుంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులకు వీలుంటుంది. సిబ్బంది కొరత.. ఉమ్మడి జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ సెంటర్లు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో తనిఖీ చేసేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. ఉమ్మడి జిల్లాలో ఖమ్మంలో ఒక గెజిటెడ్ అధికారితో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో మరో అధికారి మాత్రమే ఉన్నారు. దీంతో హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఆహార పదార్థాలు కల్తీ జరిగినా గుర్తించేందుకు సిబ్బంది లేక తనిఖీలు చేయలేకపోతున్నారు. రోజుకు ఒకటి రెండు హోటళ్లను కూడా అధికారులు తనిఖీ చేయలేని పరిస్థితి ఉంది. ప్రతి శనివారం మేళా.. లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ లేకుండా భోజన వ్యాపారం నిర్వహిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి శనివారం ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో మేళా ద్వారా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, బేకరీలు, ఖరఖానాలు, దాల్ మిల్లులు, పిండి మిల్లులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఫుడ్ కోర్టులకు లైసెన్స్‌లు ఇవ్వడంతో పాటు రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించారు. వ్యాపారులకు అవగాహన కల్పించడంతో పాటు నాణ్యత పాటించకపోతే చట్టపరంగా తీసుకునే చర్యలను ఈ మేళా ద్వారా వివరిస్తున్నారు. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన తొలి మేళాలో 11 లైసెన్స్‌లు జారీ చేయగా, 20 మంది వ్యాపారులు తమ వ్యాపారాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. లైసెన్స్‌లు తప్పనిసరి.. ఉమ్మడి జిల్లాలో ఉన్న హోటళ్లు, దాల్ మిల్లులు, బేకరీలు, ఆహార పదార్థాల తయారీ కేంద్రాలు లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయవద్దు. చిన్నచిన్న టిఫిన్ సెంటర్లు, ఫుడ్ కోర్టులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు తమ వ్యాపారాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రిజిస్ట్రేషన్, లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తే చర్యలు తీసుకుంటాం. నాణ్యత లేకుండా, కల్తీ వ్యాపారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రతి శనివారం రిజిస్ట్రేషన్, లైసెన్స్ మేళా కేఎంసీలో ఉంటుంది. – కిరణ్‌కుమార్, జిల్లా గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఖమ్మం -
గుడ్ న్యూస్: కాకినాడ సెజ్ భూములు.. రైతులకు రీ రిజిస్ట్రేషన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గత పాలకులు స్వలాభంతో అవసరానికి మించి కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (కేఎస్ఈజెడ్) కోసం బలవంతంగా సేకరించిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి రైతులకు ఇచ్చేస్తోంది. ఇలా సెజ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇవ్వడమనేది దేశంలోనే ఇది మొదటిసారి. కేఎస్ఈజెడ్ అవసరం మేరకు ఉంచి, బలవంతంగా సేకరించిన భూములను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే భూ యజమానుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తోంది. నిజానికి.. నాడు భూసేకరణ వద్దని ఎదురుతిరిగిన రైతులను చంద్రబాబు సర్కారు వారిని గృహ నిర్బంధంలో పెట్టి భూములను బలవంతంగా లాగేసుకుంది. ఆ సమయంలో నాటి విపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి.. కేఎస్ఈజెడ్ బాధితుల గ్రామాల్లో పర్యటించారు. బలవంతంగా సేకరించిన భూములను అధికారంలోకి రాగానే తిరిగి ఇచ్చేస్తామని మాట ఇచ్చారు. ఆయన సీఎం అయ్యాక ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు. రైతుల పేరుతో తిరిగి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియకు ప్రభుత్వం ఇటీవలే శ్రీకారం చుట్టింది. దీనిపై బాధిత రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ప్లేటు ఫిరాయించిన ‘బాబు’ కాకినాడ తీరంలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుచేసేందుకు అవసరమైన భూముల సేకరణకు చంద్రబాబు సర్కార్ 2002లో నోటిఫికేషన్ ఇచ్చింది. 2006 నుంచి 2011 మధ్య భూ సేకరణ జరిగింది. ప్రభుత్వం 3,400.13 ఎకరాలు కొనుగోలు చేసి, కేఎస్ఈజెడ్కు ఇవ్వగా, 4,558.39 ఎకరాలను సెజ్ యాజమాన్యం కొనుగోలు చేసింది. ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమిలో 2,180 ఎకరాలకు చెందిన 1,307 మంది రైతులు అవార్డు తీసుకోలేదు.. భూములూ ఇవ్వలేదు. రైతులకు ఇబ్బంది కలగకూడదన్న వైఎస్సార్ 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యారు. ఆయన రైతులకు ఇబ్బందిలేని రీతిలో భూ సేకరణ జరగాలని ఆదేశించారు. కానీ, అధికారంలో ఉన్నప్పుడు రైతుల నోట మట్టికొట్టిన చంద్రబాబు.. అధికారం కోల్పోయేసరికి ప్లేటు ఫిరాయించారు. అక్రమంగా భూములు దోచుకుంటున్నారని, సెజ్‌ను రద్దుచేసే వరకూ నిద్రపోనని, అధికారంలోకి వచ్చాక సెజ్ భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. భూములను వైఎస్ కుటుంబమే కొనుగోలు చేసిందనే దుష్ప్రచారం చేశారు. 2014లో చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే మళ్లీ మాట మార్చారు. తన బినామీలకు లబ్ధిచేకూర్చేందుకు అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో రైతుల నుంచి భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాక.. సెజ్ బాధిత గ్రామాలపై పోలీసులు ఉక్కుపాదం మోపి, అనేకమందిపై అక్రమ కేసులు పెట్టారు. ఆ సమయంలో ప్రజాసంకల్ప యాత్ర కోసం వైఎస్ జగన్ కేఎస్ఈజెడ్ గ్రామమైన పెరుమాళ్లపురంలో పర్యటించారు. ‘సెజ్ భూములు నావేనని చంద్రబాబు అంటున్నారు. అదే నిజమైతే భూములన్నీ మీరే తిరిగి తీసేసుకోవచ్చు’ అని జగన్ ప్రకటించారు. అవసరానికి మించి చంద్రబాబు బలవంతంగా సేకరించిన భూములను ఆయా రైతులకు తిరిగి ఇచ్చేస్తామని కూడా హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన మాటను అమలుచేసేందుకు సీఎం జగన్ ఇప్పుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా.. కొత్తపల్లి, తొండంగి మండలాల్లో 148 ఎకరాలను 478 మంది రైతుల పేరుతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ రెండు మండలాల్లో 597 ఎకరాలను భూమికి భూమి పద్ధతిలో కొనుగోలు చేసి రైతులకు ఇచ్చారు. ఇది కూడా చదవండి: ఎంఎల్‌హెచ్‌పీలకు జోన్–2లోనే ఎక్కువ ఖాళీలు -
గుడ్‌న్యూస్! రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. గత నెల 15న మార్గదర్శకాలు జారీ చేసినా సైట్ తెరుచుకోడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌తోపాటు, కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది. (చదవండి: డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!) -
విలువైన భూమిపై ‘సూరి’ కన్ను
సాక్షి, పుట్టపర్తి: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత వరదాపురం సూరి అలియాస్ గోనుగుంట్ల సూర్యనారాయణ అనంతపురం నగరంలో రూ. 129 కోట్ల విలువైన 6.35 ఎకరాల స్థలంపై కన్నేశారు. నవోదయ కాలనీ 80 అడుగుల రోడ్డు పక్కనే ఈ స్థలం ఉంది. ఇక్కడ సెంటు రూ.20 లక్షలకు పైనే. అత్యంత విలువైన ఈ స్థలాన్ని నకిలీ పత్రాలతో భూమి తనదని చెప్పుకుంటున్న వ్యక్తి నుంచి తన కుమారుడు, అనుచరుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. సూరి అనుచరులు భూమి అసలు హక్కుదారులను ఖాళీ చేయాలంటూ బెదిరించారు. కబ్జాకు యత్నించారు. హక్కుదారుల ఫిర్యాదు మేరకు సబ్‌రిజిస్ట్రార్‌ను అధికారులు సస్పెండ్ చేశారు. సూరి కుమారుడు నితిన్‌సాయి, అనుచరుడు రాజుపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. మోసం చేశారిలా.. రాళ్లపల్లి నారాయణప్ప 1929లో గుండూరావు నుంచి 301 సర్వే నంబర్లో 7.77 ఎకరాలు కొని, పెద్ద మనవడు పెద్ద ఉలిగప్పకు 1933లో హక్కు ఇచ్చారు. 1935లో బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే.. దొడ్డమనేని మాలతేష్ అనే వ్యక్తి గుండూరావు తన చిన్నాన్న అంటూ 1985 నవంబర్ 19 తేదీతో అన్‌రిజిస్టర్డ్ వీలునామా సృష్టించారు. 1929 నాటికే గుండూరావు పింఛన్ తీసుకుంటున్నారు. అంటే అప్పటికే 60 ఏళ్లు పూర్తయి ఉంటాయి. దీన్నిబట్టి 1985 నాటికి గుండూరావు వయస్సు 116 సంవత్సరాలు. ఇంత వయస్సు ఉన్న వ్యక్తితో అన్ రిజిస్టర్డ్ వీలునామా ఎలా రాయిస్తారన్నది ప్రశ్నార్థకం. 2018లో 301–3 సర్వే నంబర్‌తో 4.46 ఎకరాలు మాలతేష్ పేరిట వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేశారు. దీనిపై రాళ్లపల్లి వంశస్తులు ఆర్డీవో కోర్టుకు వెళ్లారు. మాలతేష్ సమర్పించిన వీలునామా ఫోర్జరీ అని ఆర్డీవో ధ్రువీకరించారు. వెబ్‌ల్యాండ్ నుంచి మాలతేష్ పేరు తొలగించారు. రాళ్లపల్లి వంశస్తుల పేర్లు నమోదు చేశారు. 1933లో రాళ్లపల్లి వంశస్తులు ఆస్తి పన్ను చెల్లించిన పత్రాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ మాలతేష్ సర్వే నంబర్ 301ను 301–3గా చూపించి నితిన్ సాయి ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, వరదాపురం సూరి కుమారుడు గోనుగుంట్ల నితిన్‌సాయి పేరు మీద 4.30 ఎకరాలు, సూరి అనుచరుడు, ధర్మవరానికి చెందిన యంగలశెట్టి రాజు పేరిట 2.05 ఎకరాల స్థలాన్ని 2021 డిసెంబర్ 23న రిజిస్ట్రేష¯Œ చేశారు. నితిన్‌సాయి రూ.6 కోట్లు, రాజు రూ.1.50 కోట్లకు కొన్నట్లు చూపారు. వాస్తవానికి రాళ్లపల్లి వంశస్తుల వద్ద ప్రస్తుతం 3.57 ఎకరాలే ఉంది. వారి భూమిలో కొంత గతంలోనే వేరే వారికి అమ్మారు. 1982లో కొంత లేఅవుట్ వేశారు. మునిసిపాలిటీకి ఆస్తిపన్ను కూడా చెల్లిస్తున్నారు. దీనిని ప్లాట్ల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కానీ సూరి కుమారుడు, అనుచరుడి పేరిట 6.35 ఎకరాలు మాలతేష్ రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో మునిసిపల్ కార్పొరేషన్ 80 అడుగుల రోడ్డుకు సేకరించిన 0.66 ఎకరాల స్థలం, వార్డు సచివాలయమూ ఉన్నాయి. వెబ్‌ల్యాండ్‌లో మాలతేష్ పేరుపై భూమి లేకపోయినా, అన్ రిజిస్టర్డ్ వీలునామాకు ఎలాంటి విశ్వసనీయత లేనప్పటికీ, సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్, వరదాపురం సూరిది ఒకే ఊరని, అందువల్లే అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిందనే విమర్శలున్నాయి. అనంతరం సూరి అనుచరులు ఆ భూమి తమకు అప్పగించాలని రాళ్లపల్లి వంశస్తులను బెదిరించారు. ఈ వ్యవహారంపై రాళ్లపల్లి వంశస్తులు ఫిర్యాదు చేయడంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ మాధవి ఆదివారం అనంతపురం సబ్ రిజిస్ట్రార్ హరికృష్ణను సస్పెండ్ చేశారు. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వరదాపురం సూరి కుమారుడు నితిన్ సాయి, రాజు మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ అంశంపై డీఆర్వో నేతృత్వంలో విచారణకు కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్, అనంతపురం కార్పొరేషన్ కమిషనర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చర్యలు తీసుకుంటాం – గాయత్రీదేవి డీఆర్వో, అనంతపురం ఈ అక్రమ రిజిస్ట్రేషన్‌పై విచారణ జరుగుతోంది. కమిటీ సభ్యుల్లో ఒకరు నివేదిక ఇచ్చారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వెబ్‌ల్యాండ్‌లోకి ఎక్కించారని, వెంటనే తొలగించామని ఆర్డీవో చెప్పిన విషయాలను నివేదికలో పొందుపరిచారు. మరొక అధికారి నివేదిక ఇచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం. -
సెలవు దినాలైనా నేడు, రేపు పనిచేయనున్న 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు
సాక్షి, అమరావతి: ఈ నెల 26, 27 తేదీలు (నేడు, రేపు) సెలవు దినాలైనప్పటికీ రిజిస్ట్రేషన్లు చేయించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు. ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంపు ఫీజుల చలానాలు కట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 52 ఎస్బీఐ బ్రాంచ్‌లు ప్రత్యేకంగా పని చేయనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: 29న కొత్త జిల్లాలకు తుది రూపు? ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావడంతో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ల శాఖ ఈ ఏర్పాటు చేసింది. ఎస్బీఐ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపి సెలవు రోజుల్లో రిజిస్ట్రేషన్ ఫీజుల చలానాలు కట్టించుకునేలా ఒప్పించారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ రామకృష్ణ కోరారు. -
‘రియల్’ మోసాలకిక కళ్లెం
సొంతిల్లు కట్టుకోవడానికి తొలుత కాసింత స్థలం సమకూర్చుకోవాలన్నది సగటు మధ్యతరగతి కుటుంబం కల. ఈ కలను ఆసరాగా తీసుకుని కొందరు అక్రమార్కులు అక్రమ లే అవుట్లతో అందినకాడికి దోచుకుని, అమాయక ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి నగరాలు, పట్టణాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. సరైన అనుమతులు లేని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అందులో ఇల్లు కట్టుకోలేక, ఆ స్థలాన్ని తిరిగి అమ్ముకోలేక పడరాని పాట్లు పడుతున్నారు. ఈ కష్టాలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోనూ కొన్నేళ్లుగా సాగుతున్న రియల్ ఎస్టేట్ మోసాలను కట్టడి చేయడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏ సౌకర్యం లేని చోట ప్లాట్ కొని ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్రమ లే అవుట్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా కట్టడికి ఉపక్రమించింది. కనీసం రోడ్డు, కరెంటు లైన్, మంచి నీటి వసతి కూడా లేని అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొని సామాన్య ప్రజలు మోసపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లే అవుట్లలో రిజిస్ట్రేషన్లపై ఆంక్షలు విధిస్తూ తాజాగా ఆదేశాలుగా జారీ చేసింది. మరోవైపు ఒక వేళ ఇప్పటికే ఆ అక్రమ లే అవుట్లలో ఇంటి స్థలం కొన్న వారు సైతం నష్టపోకుండా.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అక్రమ లే అవుట్లను నియంత్రించడంతో పాటు వాటిలో ఇళ్ల ప్లాట్లను కొనుగోలు చేసే వారు మోసపోకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలో తగిన సూచనలు చేయాలంటూ ఇటీవల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రుల కమిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పుట్టగొడుగుల్లా అక్రమ లేఅవుట్లు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూముల్లో ఇళ్ల ప్లాట్ల లే అవుట్లు వేయడం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయింది. గత పదేళ్ల కాలంలో.. రాష్ట్ర వ్యాప్తంగా 431 మండలాల పరిధిలోని 3,716 గ్రామ పంచాయతీల పరిధిలో దాదాపు 78,303 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఇళ్ల నిర్మాణం కోసం 15,783 లే అవుట్లు కొత్తగా వెలిశాయి. అందులో 37,684 ఎకరాల్లో వేసిన 10,169 లే అవుట్లు అక్రమంగా వేసినవని పంచాయతీరాజ్ శాఖ ఇటీవల నిర్ధారించింది. ఇలాంటి అక్రమ లే అవుట్లలో 2,54,854 ఇళ్ల ప్లాట్లు ఉన్నాయి. 2015 నాటికే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 6,049 అక్రమ లే అవుట్లు ఉన్నాయని అప్పటి అధికారులు గుర్తించి, వాటిపై చర్యలు తీసుకోకుంటే ఆ ప్లాట్లు కొనుగోలు చేసిన వారు నష్టపోయే ప్రమాదం ఉందని నివేదికలు ఇచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఆ తర్వాత కూడా గ్రామాల్లో అక్రమ లే అవుట్ల దందా యధావిధిగా కొనుసాగింది. పర్యవసానంగా 2019 నాటికి అక్రమ లే అవుట్ల సంఖ్య 9,422కు పెరిగింది. 90 శాతం వాటిలో కరెంటు లైను కరువు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10,169 అక్రమ లే అవుట్లలో కేవలం 4,179 లే అవుట్లకు మాత్రమే రోడ్డు వసతి ఉంది. కేవలం 362 లేఅవుట్లకు మాత్రం మంచి నీటి సరఫరా సౌకర్యం అందుబాటులో ఉంది. 814 లే అవుట్లకు కరెంటు లైను వసతి ఉన్నట్టు అధికారులు తేల్చారు. అంటే 9,355 అక్రమ లే అవుట్లకు కరెంటు లైను కూడా లేదు. నిబంధనల ప్రకారం.. అనుమతులు పొందిన లే అవుట్లకు మాత్రమే కొత్తగా రోడ్డు వసతితోపాటు కరెంటు లైను, మంచి నీటి పైపులైను ఏర్పాటుకు ప్రభుత్వం, అర్బన్ డెవలప్మెంట్ అధారిటీలు, గ్రామ పంచాయతీలు ముందుకొస్తాయి. అనుమతులు పొందని వాటికి ఆ వసతుల కల్పనకు ఆటంకాలు ఉంటాయి. ఇళ్ల కోసం కొత్తగా ఎలాంటి లే అవుటు ఏర్పాటు చేయాలన్నా, ముందుగా సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి పొందడంతో పాటు లే అవుటు ప్లానింగ్‌కు సంబంధించి డీటీసీపీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. వ్యవసాయ భూమిలో లే అవుటు ఏర్పాటు చేస్తుంటే దానికీ వేరుగా అనుమతులు తీసుకోవాలి. ఈ సమయంలో లే అవుట్ల విస్తీర్ణం ప్రకారం నిబంధనల మేరకు వెడల్పైన అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. మొత్తం లే అవుట్ల విస్తీర్ణంలో పది శాతం భూమిని సంబంధిత గ్రామ పంచాయతీకి బదలాయించాల్సి ఉంటుంది. ఆ ప్రాంత స్థానికుల అవసరాల మేరకు భవిష్యత్‌లో అక్కడ పాఠశాల, పార్కు, మంచి నీటి ట్యాంకు వంటి వాటి ఏర్పాటుకు వీలుంటుంది. నగరాలు, పట్టణాల పక్కన ఉండే గ్రామాల్లోనే.. నగరాలు, పెద్ద పట్టణాలను ఆనుకొని ఉండే గ్రామాల్లోనే అక్రమ లే అవుట్ల దందా పెద్ద ఎత్తున సాగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 37,684 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు విస్తరించి ఉండగా, అందులో నగరాలు, పెద్ద పట్టణాలు ఆనుకొని ఉన్న గ్రామాల్లోనే 29,075 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు వెల్లడించారు. మిగిలిన గ్రామాల్లో కేవలం 8,609 ఎకరాల్లో ఈ అక్రమ లే అవుట్లు ఉన్నాయి. -
ఆదాయం పెరగాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయం పెరగడానికి తగిన ఆలోచనలు చేయడంతో పాటు ఆ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అదనపు ఆదాయాల కోసం వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఎస్ఓఆర్ (రాష్ట్రాల సొంత ఆదాయం)ను పెంచుకోవడానికి ఆయా రాష్ట్రాల్లో ఎలాంటి పద్ధతులు, విధానాలు పాటిస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఆదాయ ఆర్జన శాఖల మంత్రులు, అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదాయ ఆర్జనకు సంబంధించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించుకోవడానికి సంబంధిత శాఖల అధికారులు క్రమం తప్పకుండా సమావేశం కావాలని సూచించారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో కలెక్టర్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. పారదర్శక విధానాలను పాటిస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాబడులను పెంచుకునే క్రమంలో అధికారులు తమ విచక్షణాధికారాలను వాడేటప్పుడు కచ్చితమైన ఎస్ఓపీలను పాటించాలని స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న వ్యాట్ కేసులను పరిష్కరించడం ద్వారా బకాయిలను రాబట్టడంపై దృష్టి సారించాలని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వీలైనంతగా వేగవంతం చేయాలని సూచించారు. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే అందుతున్న రిజిస్ట్రేషన్ సేవలను సమీక్షించి.. తగిన మార్పులు, చేర్పులు చేయాలన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి ఘటనలు, లోపాలు తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రవేశించ కూడదని, ఆ మేరకు పటిష్టమైన ఎస్ఓపీలను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్) కె.నారాయణస్వామి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉచిత రిజిస్ట్రేషన్ల వల్ల పేదలకు భారీగా లబ్ధి ► ఇదివరకెన్నడూ లేని విధంగా ఓటీఎస్ పథకం ద్వారా ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా పేదలకు ఇప్పటి వరకు రూ.400.55 కోట్లు, టిడ్కో ఇళ్ల ఉచిత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపు రూపేణా మరో రూ.1,230 కోట్ల మేర (మొత్తంగా రూ.1630.55 కోట్లు) లబ్ధి చేకూరిందని అధికారులు వెల్లడించారు. ► గతంలో ఎన్నడూ ఇలా పేదల ఇళ్లకు ఉచిత రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ మినహాయింపులు జరగలేదు. చంద్రబాబు ప్రభుత్వంలో కేవలం కార్పొరేట్ కంపెనీలకు కేటాయించే స్థలాలకు మాత్రమే స్టాంపు డ్యూటీ మినహాయింపులు ఇచ్చారు. ► ఇప్పటి వరకు 3.70 లక్షల ఓటీఎస్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ పూర్తయింది. 51 గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. -
సంపూర్ణ హక్కుతో సంతోషం
ఫొటోలో కనిపిస్తున్న కంచెర్ల కృష్ణవేణిది తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం. చాలా ఏళ్ల క్రితం గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. రుణం చెల్లించకపోవడంతో ఇంటి పత్రాలు తనఖాలోనే ఉండిపోయాయి. గత ఏడాది సీఎం జగన్ ప్రభుత్వం ఇంటి రుణాలపై రాయితీ ఇస్తూ, నిర్దేశించిన మొత్తం చెల్లిస్తే ఇంటిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తామని ప్రకటించింది. దీంతో తన అప్పు వడ్డీ, అసలు కలిపి రూ. 50,620కు చేరిందని తెలుసుకుంది. అయితే, రూ.10 వేలు చెల్లిస్తే చాలని అధికారులు సూచించడంతో.. ఆ మొత్తాన్ని చెల్లించింది. సర్కారు సర్వహక్కులతో ఇంటిని తన పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడంతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న జి. వాణిప్రియది శ్రీకాకుళం జిల్లా రాజాం. రోజూ కూలి పనికి వెళ్తేగానీ పూట గడవని పరిస్థితి. ఈమెకు భర్త కూడా లేడు. రుణం తీసుకుని ఇల్లు నిర్మించుకుంది. ఆ ఇంటికి హక్కు పత్రాలు లేవు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రుణం కోసం బ్యాంకుకు వెళ్తే అప్పు కూడా పుట్టదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రవేశపెట్టడంతో వాణిప్రియ రూ.10వేలు కట్టేసి ఇంటిపై సంపూర్ణ హక్కులు పొందింది. దీంతో ఆ ఆస్తి విలువ ఇప్పుడు రూ.10 లక్షలకు పెరిగిందని ఆనందోత్సాహాలు వ్యక్తంచేస్తోంది. భవిష్యత్తులో బ్యాంకు రుణం వస్తుందని ధీమాగా ఉంది. .. ఇలా కృష్ణవేణి, వాణిప్రియ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది పేదలు ఈ పథకం కింద ఇళ్లపై సర్వహక్కులు పొందుతున్నారు. సాక్షి, అమరావతి: ‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ (జేఎస్‌జీహెచ్‌పీ) కింద 1983 నుంచి 2011 ఆగస్టు 15 వరకూ గృహ నిర్మాణ సంస్థ నుంచి రుణం పొంది, లేదా రుణం పొందకుండా నిర్మించిన ఇళ్లకు ప్రభుత్వం యాజమాన్య హక్కులు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 52 లక్షల మంది ఇళ్లు నిర్మించుకోగా వీరిలో 96% మందికి ఇళ్లలో నివసించే హక్కులు తప్ప, ఆస్తులపై ఇతర హక్కులు లేవు. దీంతో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం లబ్ధిదారులకు వరంలా మారింది. ఎంతో సంతోషంతో వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్నారు. కానీ, టీడీపీ, దాని అనుకూల పచ్చమీడియా ప్రభుత్వ నిర్ణయాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నాయి. ఈ పథకంపై ఎక్కడలేని దుష్ప్రచారం చేస్తున్నాయి. నిజానికి.. 2000 సంవత్సరం నుంచి ప్రభుత్వాలు ఓటీఎస్‌ను అమలుచేస్తూ వస్తున్నప్పటికీ 2014–2019 మధ్య టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ఓటీఎస్ అమలుచేయాలని ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గృహ నిర్మాణ సంస్థ పాలకవర్గం కోరినా చంద్రబాబు కనికరించలేదు. జగన్ సీఎం అయ్యాక జేఎస్‌జీహెచ్‌పీ ప్రవేశపెట్టడంతో ఇప్పటివరకూ రాష్ట్రవ్యాప్తంగా 9,69,786 మంది ముందుకొచ్చారు. వీరిలో 3,69,139 మంది పేర్లపై ఆస్తుల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. రూ.16 వేల కోట్ల మేర లబ్ధి 1983 నుంచి 2011 మధ్య గృహ నిర్మాణ సంస్థకు ఇళ్ల లబ్ధిదారులు పడిన బకాయి వడ్డీతో కలిపి రూ.14,400 కోట్లుగా ఉంది. ప్రస్తుతం జేఎస్‌జీహెచ్‌పీ ద్వారా ఓటీఎస్ రూపంలో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు మాఫీ చేసింది. అంతేకాక.. రిజిస్ట్రేషన్ సమయంలో చార్జీలు, ఫీజులను ఎత్తివేస్తూ రూ.6 వేల కోట్లు పేదలపై భారం పడకుండా చూసింది. ఇలా మొత్తంగా రూ.16 వేల కోట్ల మేర పేదలకు లబ్ధిచేకూర్చింది. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, మున్సిపాలిటీల్లో రూ.15 వేలు, కార్పొరేషన్లలో రూ.20వేలు చెల్లిస్తే ఇంటిపై ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తోంది. ఇక నిర్దేశించిన మొత్తం కన్నా అప్పు తక్కువగా ఉంటే లబ్ధిదారులు ఆ మొత్తాన్నే చెల్లించుకునే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. ఓటీఎస్ అమలుకు 03–11–2017న గృహ నిర్మాణ సంస్థ ఎండీ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన. ఈ తరహాలో 2014–19 మధ్యలో గత టీడీపీ ప్రభుత్వానికి గృహ నిర్మాణ సంస్థ ఐదుసార్లు ప్రతిపాదనలు పంపింది. అయినా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వడ్డీతో సహా వసూలుకే అప్పట్లో బాబు ప్రభుత్వం మొగ్గు చూపింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంతో ప్రయోజనాలివే.. ► పూర్తి యాజమాన్య హక్కులు రావడంవల్ల ఆస్తులను తనఖా పెడితే బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్ స్థలాలకు మార్కెట్లో విలువ తక్కువగా ఉంటుంది. రిజిస్ట్రర్ ఆస్తులతో పోలిస్తే ప్రాంతాలను బట్టి 20 నుంచి 50 శాతానికిపైగా విలువ తక్కువే. ఈ వ్యత్యాసం లేకుండా ఆస్తుల విలువ పెరుగుతుంది. ► డీ పట్టా, పొజిషన్ సర్టిఫికెట్లను వారసుల పేర్లపై బదలాయించడానికి ఆస్కారంలేదు. ఈ పథకం ద్వారా ఆస్తులను బదలాయించుకోవడంతో పాటు అమ్ముకోవచ్చు. రుణం రూ.51 వేలు.. కట్టింది రూ.10 వేలు 17 ఏళ్ల క్రితం ప్రభుత్వ రుణంతో ఇల్లు నిర్మించుకున్నాం. వడ్డీతో కలిపి రుణం రూ.51 వేలకు చేరుకుంది. ఇంటిపై అధికారికంగా మాకు ఎలాంటి హక్కులు లేవు. సీఎం వైఎస్ జగన్ ఎంత అప్పు ఉన్నా, కేవలం ఒకేసారి రూ.10 వేలు కడితే అప్పును పూర్తిగా రద్దుచేయడంతో, పాటు ఇంటి పత్రాలు ఇస్తామని చెప్పడంతో వెంటనే కట్టేశా. ఇల్లు నా పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. డాక్యుమెంట్లు తీసుకున్నా. – పి. అనంతమ్మ, పగిడిరాయి గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓటీఎస్ అమలుకు గృహ నిర్మాణ సంస్థ బోర్డు మీటింగ్ లో చేసిన తీర్మానంకు సంబంధించిన ప్రతి ఇన్నేళ్లకు సొంతింటి కల నేరవేరింది ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకున్నాం. ఇందులో మాకు నివసించే హక్కు తప్ప మా వారసులకు దీనిని బదలాయించే హక్కులేదు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా ఆ బెంగ తీరింది. ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు బ్యాంకు రుణాలు పుట్టవు. ఇది మాలాంటి వాళ్లకి పెద్ద సమస్య. మా సమస్యకు సీఎం జగన్ శాశ్వత పరిష్కారం చూపారు. చాలా ఏళ్లుగా సొంతింటిలో ఉంటున్నప్పటికీ ఇప్పటికి నా సొంతింటి కల వాస్తవ రూపం దాల్చింది. – జంగాల నాగమ్మ, జయంతి కాలనీ, రాజుపాలెం గుంటూరు జిల్లా దుష్ప్రచారం మానుకోవాలి గతంలో వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ముందుకు రాని చంద్రబాబు ఇప్పుడు ప్రభుత్వ చర్యను తప్పుపడుతున్నారు. బాబుకు పేదలు బాగుపడటం ఇష్టం ఉండదు. ప్రస్తుత ప్రభుత్వం అసలు, వడ్డీలో రాయితీ ఇచ్చి, ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పిస్తుండడాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. లబ్ధిదారులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి బాబు బుద్ధి మార్చుకోవాలి. – దావులూరు దొరబాబు, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ మా ఆస్తి విలువ పెరిగింది 15 ఏళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాం. మాది ప్రభుత్వం ఇచ్చిన స్థలం. డీ పట్టా ఉండటంతో మార్కెట్ ధరలతో పోలిస్తే మా ఆస్తి విలువ 50 శాతం తక్కువే పలుకుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేస్తుండటంతో ఇకపై మాది ప్రైవేట్ ఆస్తితో సమానం. దీంతో భవిష్యత్‌లో మేం అమ్మాలనుకున్నా కొనుగోలుకు ఎంతోమందిముందుకు వస్తారు. మాకు దిగులుండదు. ఇప్పుడు మా ఇల్లు రూ.35 లక్షల వరకు పలకనుంది. – కోనేటి రాజ్యలక్ష్మి, రమణయ్యపేట, కాకినాడ ఇంటి పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు సొంత ఇంట్లో ఉన్నా ఇంటిపై యాజమాన్య హక్కులు లేవని లోటు ఉండేది. 2007లో తీసుకున్న రుణం వడ్డీతో రూ.30 వేలు అయింది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి వలంటీర్ చెప్పగానే ఎవరి ప్రోద్బలం లేకుండా రూ.10 వేలు చెల్లించాం. సర్వహక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ పత్రాన్ని అధికారులు ఇంటికి తెచ్చిచ్చారు. – కోకిల, పలమనేరు, చిత్తూరు జిల్లా ఇంటి విలువ పెరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సంపూర్ణ గృహ హక్కు పథకం పేద, మధ్య తరగతి వర్గాలకు ఎంతో ఉపయోగపడుతోంది. నేను 2010లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకున్నాను. ఇప్పటివరకు అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.28 వేలకు చేరుకుంది. ప్రభుత్వం ఓటీఎస్ ప్రవేశపెట్టడంతో వెంటనే రూ.10 వేలు చెల్లించా. నా ఇంటికి సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను అందించారు. ఇప్పటివరకు ఇల్లు నాదైనా, దానికి ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడంవల్ల ఎంతో ఇబ్బందిపడ్డాం. ప్రస్తుతం డాక్యుమెంట్లు పక్కాగా రావడంవల్ల నా ఇంటి విలువ ఇప్పుడు రూ.20 లక్షలకు చేరుకుంది. – అల్లాబకాష్, నెరవాడ, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా -
స్థిరాస్తి ప్రాజెక్టులపై ‘రెరా’ కన్ను
సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది ప్రతిఒక్కరి కల. అన్ని వర్గాల వారు దీనిని సమకూర్చుకోవాలనుకుంటారు. అయితే, కొన్న ఫ్లాట్లకు ప్రభుత్వ అనుమతులు లేకుంటే బ్యాంకు రుణాలు రావు.. అలాగే, ఓపెన్ ప్లాట్ అయితే నిర్మాణానికి స్థానిక సంస్థల అనుమతులు తప్పనిసరి. ఈ రెండు రకాల అనుమతులు ఉన్న ఫ్లాట్ కొనుగోలు చేసినప్పటికీ కొన్ని కొన్ని నిర్మాణ సంస్థలు కొనుగోలుదారులను ఇబ్బంది పెట్టొచ్చు. అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి ప్రాధికార సంస్థ (ఏపీ రెరా) బాధితులకు అండగా ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలుదారులకు ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఓపెన్ ప్లాట్లు, బహుళ అంతస్తుల నిర్మాణలు చేపట్టే కంపెనీలు లేదా బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో రిజిస్టర్ చేయించాలని, లేదంటే వారికి న్యాయపరమైన చిక్కులు తప్పవని హెచ్చరిస్తోంది. రెరాలో నమోదైనవి 2,900 ప్రాజెక్టులే.. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది డెవలపర్లు స్థానిక సంస్థల నుంచిగాని, మున్సిపాలిటీలు, టౌన్‌ప్లానింగ్ విభాగం నుంచిగాని ఎలాంటి అనుమతులు లేకుండానే వెంచర్లు వేస్తున్నారు. సదరు సంస్థలు బోర్డు తిప్పేస్తే ఇలాంటి వాటిలో స్థలాలు, ఫ్లాట్లు కొనేవారికి రక్షణ ఉండదు. ఇవిగాక మున్సిపాలిటీలు, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టులు దాదాపు ఏడువేలకు పైగా ఉన్నట్లు టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి వీటన్నిటికీ ‘రెరా’ అనుమతి తప్పనిసరి. కానీ, రాష్ట్రంలో ‘రెరా’ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కేవలం 2,900 ప్రాజెక్టులు మాత్రమే ‘రెరా’లో నమోదయ్యాయి. ఈ ప్రాధికార సంస్థ అనుమతిలేకుంటే ఆ ప్రాజెక్టులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పాటు నిర్మాణదారుల వివరాలు నమోదు చేయిస్తున్నారు. ఇప్పటిదాకా తమ ప్రాజెక్టుల వివరాలు నమోదు చేయించకుంటే ‘రెరా’ చట్టంలోని సెక్షన్–3 ప్రకారం 10 శాతం వరకు పెనాల్టీ విధిస్తామని ‘రెరా’ పాలకవర్గం ప్రాజెక్టుల యజమానులకు సమాచారం పంపిస్తోంది. అప్పటికీ స్పందించకుంటే అలాంటి ప్రాజెక్టుల వివరాలను బ్యాంకులు, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపించి వాటి రుణ, రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపివేయించే యోచనలో కూడా ఉన్నట్లు తెలిసింది. కొనుగోలుదారులకు నష్టం జరగకుండా.. కొనుగోలుదారులు ఓపెన్ ప్లాట్ లేదా అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుగోలుకు వెళ్తే.. అన్ని అనుమతలు ఉన్నాయని, స్థానిక సంస్థల నుంచి, టౌన్‌ప్లానింగ్ నుంచి అనుమతి ఉన్నట్లు చెబుతారు. వీటితో పాటు రెరాలో రిజిస్టర్ అయ్యిందో లేదో చూసుకోవాలి. 500 చ.మీ. విస్తీర్ణంలో దాటిన వెంచర్లు, డెవలపర్లు నిర్మించే ఫ్లాట్ల సంఖ్య 8 మించి ఉంటే తప్పనిసరిగా ‘రెరా’లో నమోదు చేయించడంతో పాటు ప్రతి మూడు నెలలకోసారి పనుల పురోగతిని ‘రెరా’లో నమోదు చేయాలి. అలా చేయని పక్షంలో ఆయా నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇవ్వడంతో పాటు అవసరమైతే బ్లాక్‌లిస్ట్‌లో ఉంచే అధికారం ‘రెరా’కు ఉంది. కొనుగోలు ఒప్పందంలో పేర్కొన్నట్లుగా నిర్మాణం లేకున్నా.. మరేదైనా పెద్ద లోపాలు తలెత్తినా ఐదేళ్ల వరకు సదరు నిర్మాణదారుడే బాధ్యత వహించాలి. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ వచ్చిన ఐదేళ్ల వరకు నిర్మాణంలో తలెత్తే పెద్ద సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత సదరు బిల్డరుదే. ఆయా సమస్యలపై కొనుగోలుదారులు ‘రెరా’కు ఫిర్యాదు చేయవచ్చని పాలక మండలి చెబుతోంది. -
కేంద్రం కీలక సంస్కరణ.. దేశంలో ఏకరీతిగా భూ రిజిస్ట్రేషన్..!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్ 2022లో నూతన భూ సంస్కరణలు ప్రవేశపెట్టింది. ఒకే దేశం - ఒకే రిజిస్ట్రేషన్ కి సంబంధించిన విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్(NGDRS)తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. "మెరుగైన జీవన సౌలభ్యం కోసం, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి వీలుగా వన్ నేషన్ - వన్ రిజిస్ట్రేషన్ విధానం ఏర్పాటు చేయనున్నట్లు" సీతారామన్ తెలిపారు. అలాగే, దేశంలో సులభంగా వ్యాపారం చేయడానికి 25,000 ఒప్పందాలు తొలగించామని, 1,486 యూనియన్ చట్టాలను కూడా రద్దు చేసినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. చెల్లింపులలో జాప్యాన్ని తగ్గించడానికి ఆన్ లైన్ బిల్లు చెల్లింపు వ్యవస్థ గురించి అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలతో మాట్లాడినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అలాగే, ఎంటర్ప్రైజ్, హబ్‌ల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆర్థిక మండలాల చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొని రావాలని ఆమె తన బడ్జెట్ 2022 ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త చట్టం ఇప్పటికే ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను కవర్ చేస్తుందని, ఎగుమతులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తుంది అని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 'ఒకే దేశం ఒకే రిజిస్ట్రేషన్' సాఫ్ట్‌వేర్‌తో నేషనల్ జెనరిక్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్‌తో ఏకీకరణను అమలులోకి తీసుకోవడం, డీడ్స్, డాక్యుమెంట్లను ఎక్కడైనా ఏకరీతిగా నమోదు చేయడానికి ప్రోత్సహించబడుతుంది. - కేంద్రమంత్రి @nsitharaman #Budget2022 #AatmaNirbharBharatKaBudget pic.twitter.com/VbvRmJ8t71 — PIB in Telangana 🇮🇳#AmritMahotsav (@PIBHyderabad) February 1, 2022 (చదవండి: బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!) -
మార్చి 1 నుంచి హెచ్1–బీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
వాషింగ్టన్: భారత టెకీలు ఎంతో ఆత్రంగా ఎదురుచూసే హెచ్1–బీ వీసాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. అత్యున్నత సాంకేతిక నైపుణ్యం ఉన్నవారిని అమెరికా కంపెనీలు ఈ వీసాల కింద ఉద్యోగాల్లో నియమించుకుంటాయి. 2023 ఆర్థిక సంవత్సరానికిగాను ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి మార్చి 18 వరకు జరుగుతుందని అమెరికా సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) ఒక ప్రకటనలో వెల్లడించింది. హెచ్1–బీ వీసాలను ఆశించే వారు, కంపెనీ ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ రిజిస్ట్రేషన్‌కు 10 డాలర్ల రుసుము (రూ.750) చెల్లించాలి. ఆ తర్వాత లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసి మార్చి 31లోగా వీసా వచ్చిన వారికి తెలియజేస్తామని స్పష్టం చేసింది. ప్రతీ ఏడాది టెక్నాలజీ కంపెనీలు భారత్, చైనా నుంచి వేలాది మంది ఉద్యోగుల్ని హెచ్1–బీ వీసా ద్వారా ఉద్యోగాల్లోకి తీసుకుంటాయి. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టం ప్రకారం ప్రతీ ఏడాది యూఎస్సీఐఎస్ 65 వేల హెచ్1–బీ వీసాలను మంజూరు చేస్తుంది. అవే కాకుండా అమెరికా యూనివర్సిటీ నుంచి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్ సబ్జెక్టుల్లో) అంశాలలో ఉన్నత విద్యను అభ్యసించిన విదేశీ విద్యార్థులకు మరో 20 వేల హెచ్1–బీ వీసాలను ఏటా మంజూరు చేస్తుంది. ఈ వీసాల్లో అగ్రభాగం భారతీయ టెక్కీలకే దక్కుతుంటాయి. -
ఉచితంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి పేదలపై ఎలాంటి భారం లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేసి ఈ నెల చివరి వారంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధంగా ఉన్న 45 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్‌కు దాదాపు రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని పూర్తిగా భరించి లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 1.18 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వీటిలో జనవరి చివరి వారంలో 45 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించేందుకు టిడ్కో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. -
భూ..చోళ్ల ‘డబుల్’ దందా! ఎన్ఆర్ఐల భూములే టార్గెట్
చిత్తూరు జిల్లా కలకడ మండలం కోపూరివాండ్ల పల్లెకు చెందిన ఈమె పేరు ఎ.సరోజ. కూలి పనులు చేసుకుని జీవిస్తోంది. విదేశాల్లో స్థిరపడ్డ ఓ ఎన్ఆర్ఐ కుటుంబానికి చెందిన భూమికి ఈమె హక్కుదారు అని నమ్మించి.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించిన ఓ ముఠా హైదరాబాద్‌కి చెందిన ఓ విద్యావంతురాలైన మహిళనే మోసం చేసింది. తీరా మోసం బయటపడిన తర్వాత నిలదీస్తే.. అబ్బే ఎక్కడో పొరపాటు జరిగిందని, ఆ డబ్బుతో ఈ సారి డబుల్బెడ్రూం ఫ్లాట్ ఇప్పిస్తామని చెప్పుకొచ్చింది. ఇరుక్కున్న డబ్బులకు ఏదో ఒకటి వస్తుందిలే అనుకుంటే.. ఈ దఫా అమెరికాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ స్థల యజమాని వచ్చి.. ఆ ఫ్లాట్ ఎలా అమ్ముతారని కేసు వేశారు. ఇదీ భూ..చోళ్ల నయా మోసం. స్మార్ట్ సిటీ తిరుపతి చుట్టుపక్కల భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జారాయుళ్లు కొత్తమార్గాన్ని ఎంచుకున్నారు. విదేశాల్లో ఉంటున్న ఎన్నారైల భూములు ఎంచుకుని డబుల్ రిజిస్ట్రేషన్లు చేస్తూ భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారు. రూ.కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ ఒరిజినల్స్ కు ఏమాత్రం తీసిపోకుండా నకిలీ పత్రాలతో డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. తీరా కొనుగోలు చేసినవాళ్లకు అసలు యజమానుల నుంచి లీగల్ నోటీసులు వస్తుండటంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ల్యాండ్ మాఫియాలో ఓ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషించడంతో ఎస్పీ ప్రత్యేకంగా విచారణకు ఆదేశించారు. తిరుపతి సమీపంలో చెలరేగిపోతున్న డబుల్ రిజిస్ట్రేషన్ ముఠా అక్రమాల ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి రూరల్ మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని 1964 లో ఏర్పాటు చేశారు. మొత్తం 35 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లే అవుట్‌కు 1969లో అప్రూవల్ వచ్చింది. అప్పటి నుంచి ఇక్కడ ఒక్కొక్కరుగా వారికి కేటాయించిన ప్లాట్ల వారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో ఉద్యోగ విరమణ తర్వాత విదేశాల్లో స్థిరపడిన గెజిటెడ్ ఆఫీసర్స్ ఎక్కువమందే ఉన్నారు. ల్యాండ్ మాఫియాకి ఇదే అదనుగా మారింది. ముందుగా వారి స్థలాలనే కబ్జాకు ఎంచుకున్నారు. ఈ క్రమంలోనే సర్వే నెంబర్ 557లోని ప్లాట్ నెంబర్ 225లో 104 అంకణాల భూమిపై కన్ను వేశారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగశేఖరరెడ్డి, రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చెప్పుకునే శ్రీరాములు నాయుడు, బాలకృష్ణలు ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఆ 104 అంకణాల భూ యజమాని ఎన్నారై కుటుంబానికి చెందిన సరోజ అని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ఓ మాజీ బ్యాంకు ఉద్యోగి బి.పద్మజకు రూ.60లక్షలకు విక్రయించారు. చాలా తక్కువ ధరకే మీకు అమ్మించామంటూ ఎక్కువ కమీషనే తీసుకున్నారు. కొనుగోలు చేసిన పద్మజ ఆ భూమిలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తుండగా.. ఎన్ఆర్ఐ మధురిమ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ స్థలం మాదేనని, మీరు మోసపోయారని చెప్పింది. బిత్తరపోయిన పద్మజ.. విషయాన్ని సదరు ముఠాకి చెప్పి నిలదీయగా.. ఇలా కొంతమంది ఫేక్ వ్యక్తులు ఫోన్ చేస్తుంటారని మీరేమీ పట్టించుకోవద్దని బుకాయించారు. అయితే మధురిమ తన వద్దనున్న ఒరిజినల్ డాక్యుమెంట్లతో పోలీసులను ఆశ్రయించడంతో ముఠా మోసం బట్టబయలైంది. కానీ అప్పటికే ఆ స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మించుకుంటున్న పద్మజ.. మరో రూ.60లక్షలను అసలు భూమి యజమాని మధురిమకు ఇచ్చి కొనుగోలు చేసి మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మళ్లీ మళ్లీ మోసం తాను మోసపోయానని, తాను ఇచ్చిన రూ.60లక్షలను తిరిగి ఇచ్చేయాలని పద్మజ సదరు ముఠాని డిమాండ్ చేసింది. అయితే ఇక్కడే ఆ మాఫియా మరో మోసానికి తెర లేపింది. డబ్బులివ్వలేమని, అదే సొసైటీలోని ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇప్పిస్తామని నమ్మబలికింది. దక్కిందే దక్కనీ అనుకున్న పద్మజ అందుకు అంగీకరించారు. దీంతో గెజిటెడ్ ఆఫీసర్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సర్వే నెంబర్ 585 ప్లాట్ నెంబర్ 47లో నూతనంగా నిర్మాణం చేసిన హిల్ వ్యూ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూం 502 ఫ్లాట్‌ను రూ.30లక్షలకు కేటాయించారు. ఎంతోకొంత వచ్చిందని పద్మజ ఆనంద పడే టైంలోనే మళ్లీ మోసపోయామన్న సంగతి వెలుగుచూసింది. అసలు ఆ అపార్ట్మెంట్ ఉన్న స్థలం నాదంటూ ఎన్ఆర్ఐ నిరంజన్‌రెడ్డి అనే వ్యక్తి తెరపైకి వచ్చారు. తన స్థలంలో ఫేక్ డాక్యుమెంట్లతో అపార్ట్మెంట్ నిర్మించేసి ఫ్లాట్లు విక్రయించారంటూ ఆ మాఫియాతో పాటు కొనుగోలు చేసిన వారందరికీ నిరంజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపించారు. దీంతో మళ్లీ మోసపోయామని గ్రహించి పద్మజ సదరు కానిస్టేబుల్ సహా ముఠా సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేరుగా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పి వెంకట అప్పలనాయుడుని కలిసి ఈ నయా దందాను వివరించారు. నాలా చాలామంది మోసపోయారు అక్కడ భూములు కొన్న వాళ్లు చాలామంది మోసపోయారు.. ఆ కానిస్టేబుల్ అండ్ కో చేసే దందాలకు అంతులేదు. పోలీసులు లోతుగా విచారిస్తే చాలా అక్రమాలు బయటపడతాయి. – ఫిర్యాదుదారు పద్మజ నేను ఏ పాపం ఎరుగను.. నిజంగా నాకు ఏ పాపం తెలియదు. అప్పుడప్పుడు మా ఊరికి వచ్చే రామకృష్ణ అనే వ్యక్తి తిరుపతిలో నాకొక స్థలం ఉంది.. సొంత ప్లాట్ ఉంది.. నేను అమ్ముకుంటున్నాను.. నువ్వు సాక్షి సంతకం పెడితే నీకు ఎంతో కొంత ఇస్తానని నమ్మించారు. కానీ పది రూపాయలు కూడా ఇవ్వలేదు.. పైగా ఇప్పుడు అదంతా మోసం అంటున్నారు. నాకు చాలా భయంగా ఉంది. నిద్ర కూడా పట్టడం లేదు. ఏౖమైనా కేసులు పెడితే నా పరువేం కానూ.. మట్టి పనులు చేసుకునే నేను.. భూముల మాయ ఎలా చేయగలను – కలకడ మండలం కోపూరివాండ్ల పల్లెకు చెందిన ఎ.సరోజ గతంలోనే హెచ్చరించినా.. కానిస్టేబుల్ ముఠాని నేను గతంలోనే హెచ్చరించాను. 1964లో ఏర్పాటైన సొసైటీ మాది. అప్పట్లో కొనుగోలు చేసిన వారంతా ఇప్పుడు తొంభై ఏళ్ళ వయస్సుకి వచ్చేశారు. కొందరు చనిపోయారు. మరికొందరు విదేశాలకు వెళ్లిపోయారు. దీంతో ఆ ముఠానే కాదు.. భూమల పేరిట మాయ చేసే బ్యాచ్‌లు తిరుగుతూ మోసం చేస్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ మోసాలకు సంబంధించి ఇప్పటికి ఐదు కేసులు నా వద్దకు వచ్చాయి. అప్రమత్తంగా ఉండటమే పరిష్కారం – ప్రభాకర్, గెజిటెడ్ ఆఫీసర్స్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ ఖాకీ పాత్రపై విచారణ కానిస్టేబుల్ నాగశేఖరరెడ్డి పాత్ర ఉందంటూ ఫిర్యాదు వచ్చిన మాట నిజమే. నేను పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాను. అక్కడ చాలా మోసాలు జరిగాయని అంటున్నారు. మొత్తంగా విచారణ చేయాలని చెప్పాను. కానిస్టేబుల్‌ది తప్పని తేలితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – వెంకట అప్పల నాయుడు, అర్బన్ ఎస్పీ -
భూముల రిజిస్ట్రేషన్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
తెనాలిలోనే సినిమా పేర్ల రిజిస్ట్రేషన్
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించింది. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కల్యాణమండపంలో శుక్రవారం సీమాంధ్ర ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు. చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆమోదంతో సినిమాలకు టైటిల్స్, బ్యానర్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్సులు, లాబ్ లెటర్లు, డ్యూరేషన్ సర్టిఫికెట్లను జారీ చేసే అవకాశం తమ సంస్థకు లభించిందని చెప్పారు. తాము ఆమోదించిన టైటిల్స్‌కు కేంద్ర సెన్సార్ కార్యాలయం అనుమతిని ఇస్తుందన్నారు. అక్టోబరు మొదటి వారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు దిలీప్‌రాజా వెల్లడించారు. నిర్మాత చదలవాడ హరిబాబు, సినీ హీరోయిన్ మౌనికరెడ్డి, మిలటరీ ప్రసాద్, బి.జయకుమార్ ఉన్నారు. చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. -
‘దోస్త్’ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే దోస్త్ మూడో దశ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ గడువును ఈ నెల 23 వరకూ పొడిగించినట్లు ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. కొత్తగా బీఏ (ఆనర్స్) కోర్సును రెండు కాలేజీల్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. పొడిగించిన తేదీ వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవచ్చని, కొత్త కోర్సులను కూడా ఎంపిక చేసుకోవచ్చని ఆయన వివరించారు. -
పేరు నమోదైతేనే జాతీయ స్కాలర్షిప్
సాక్షి, అమరావతి: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులు తమ పేర్లను నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటేనే జాతీయ స్కాలర్షిప్ ఇకపై అందనుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్కాలర్షిప్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి.. అర్హులైనవారు నమోదు చేసుకుంటేనే స్కాలర్షిప్లు ఇచ్చేలా మార్పు చేసింది. పరీక్షలో మెరిట్ సాధించి ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత పోర్టల్‌లో పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. 2020 సంవత్సరానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ పరీక్షల్లో ఎంపికైన విద్యార్థులంతా ఈ సంవత్సరం తప్పనిసరిగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎస్‌సీహెచ్‌ఓఎల్‌ఏఆర్‌ఎస్‌హెచ్‌ఐపీఎస్.జీఓవీ.ఐఎన్’ లో నవంబర్ 15 లోగా నమోదు చేసుకోవాలని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కొత్త నిబంధన విధించింది. ఇలా పేరు నమోదు చేయని వారికి ఇకపై ఎప్పటికీ ఏ విధంగా స్కాలర్షిప్ మంజూరు కాదని స్పష్టం చేసింది. ఈ విద్యా సంవత్సరంలోని వారే కాకుండా 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఎంపికైన వారు గత సంవత్సరంలో పోర్టల్‌లో నమోదు చేసుకుని స్కాలర్షిప్ పొందుతున్న ప్రతి విద్యార్థి కూడా ఈ సంవత్సరం కూడా రెన్యువల్ కోసం తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. అలా చేసుకోని వారికి రానున్న కాలంలో స్కాలర్షిప్ అందదని పేర్కొంది. పాఠశాలలు/కాలేజీలు తమ విద్యార్థుల వివరాలను డిసెంబర్ 15 లోపల ఆమోదించాలి. డీఈవోలు డిసెంబర్ 31లోగా వాటికి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. విద్యార్థులు పోర్టల్‌లో నమోదు చేసి తమ అప్లికేషన్‌ను పాఠశాల, డీఈవో కార్యాలయాలు ఆమోదించాయో లేదో పరిశీలించుకోవాలని సూచించింది. స్కాలర్ షిప్‌లకు సంబంధించి ఇతర సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ను సందర్శించవచ్చని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. డీఈవో కార్యాలయాల్లో కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఇవీ చదవండి: వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
వీఆర్ఏల బాగోతం.. ధరణిలో స్లాట్ బుకింగ్ పేరుతో..
సాక్షి, బీబీపేట(నిజామాబాద్): రెవన్యూ వ్యవస్థలో అక్రమాలను నిలువరించేందుకు ప్రభుత్వం ఎన్ని సంస్కరణలు తీసుకొస్తున్నా పెద్దగా ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం ‘ధరణి’ తీసుకొచ్చినా అవకతవకలకు అడ్డుకట్ట పడట్లేదు. రెవెన్యూ సిబ్బంది దోపిడీ ఆగట్లేదు. వాస్తవానికి రెవెన్యూలో లంచాలను నివారించేందుకు ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థనే రద్దు చేసింది. భూ సమస్యల పరిష్కారానికి, సులువుగా రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల కోసం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినప్పటకీ రెవెన్యూ సిబ్బంది ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ధరణిలో స్లాట్ బుకింగ్ దగ్గరి నుంచీ రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల వరకూ అంతా వారి కనుసన్నల్లో జరిగేలా ‘పట్టు’ పెంచుకున్నారు. బుకింగ్ నుంచి మొదలుకొని.. రెవెన్యూలో సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది. దీంతో మండల కార్యాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ చేపడుతున్నారు. భూ కొనుగోలుదారులు ముందుగా మీసేవ కేంద్రాలకు వెళ్లి ధరణిలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్దేశిత తేదీ, సమయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇందులో ఇతరుల ప్రమేయం అవసరమే లేదు. అయితే, కొందరు వీఆర్ఏలు మాత్రం అన్నీ తామై కథ నడిపిస్తున్నారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్లకు సంబంధించి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వస్తున్న రైతులను బుట్టలో వేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తం తాము పూర్తి చేసిస్తామని, ఇంత మొత్తంలో ఖర్చవుతుందని మాట్లాడుకుంటున్నారు. ఒక్క మండలంలోనే 56 మందికి మెమోలు.. బీబీపేట మండలంలో ధరణి పోర్టల్ ద్వారా స్లాట్లు బుక్ చేస్తూ రైతులను మోసం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో అధికారులు స్పందించారు. మొత్తం 56 మంది వీఆర్ఏలకు ఇన్చార్జి తహసీల్దార్ శాంత రెండ్రోజుల క్రితం మెమోలు జారీ చేశారు. మరోసారి ఇలాంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చిరించినట్లు తెలిసింది. రైతులు మీసేవ కేంద్రాల్లోనే స్లాట్లు బుకింగ్ వద్దనే చేసుకోవాలని, వీఆర్ఏలను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. బీబీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు ఇటీవల భూమి కొనుగోలు చేశాడు. తహసీల్దార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో స్థానిక వీఆర్ఏను సంప్రదించాడు. అయితే, ముందుగా ధరణిలో స్లాట్ బుకింగ్ చేసుకోవాలని, దీంతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీల కోసం రూ.18 వేలు ఖర్చవుతుందని చెప్పాడు. అతడ్ని గుడ్డిగా నమ్మిన రైతు అడిగినంత ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. వాస్తవానికి రిజిస్ట్రేషన్ చార్జీలు, ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.8 వేలలోపే అవుతుంది. కానీ, వీఆర్ఏ చేతివాటం ప్రదర్శించి రైతును రూ.రెండు వేలకు ముంచాడు. ఇళ్లల్లోనే కంప్యూటర్లు, ప్రింటర్లు.. గ్రామాల్లో రైతులతో ఉన్న సత్సంబంధాలను వీఆర్ఏలు దోపిడీకి వినియోగించుకుంటున్నారు. స్లాట్ బుకింగ్, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ తాము పూర్తి చేయిస్తామని చెప్పి పెద్ద మొత్తంలో దండుకుంటున్నారు. ధరణి పోర్టల్‌లో ఎవరైనా స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశముంది. దీంతో వీఆర్ఏలు తమ ఇళ్లల్లోనే కంప్యూటర్లు, ప్రింటర్లు పెట్టుకుని రైతుల పేరిట స్లాట్ బుకింగ్ చేస్తున్నారు. ఇందుకోసం నిర్దేశిత ఫీజు కంటే రెట్టింపు వసూలు చేస్తున్నారు. ఇక, ఆయా రైతులను మండలాఫీసుకు తీసుకెళ్లి రిజిస్ట్రేషన్ త్వరగా పూర్తయ్యేలా చూస్తున్నారు. ఒకవేళ మీసేవ కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకుని వచ్చిన రైతుల ఫైళ్లు కింద పెట్టి, వీఆర్ఏలు బుక్ చేసిన ఫైలును మీద పెట్టి తొందరగా రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా చేస్తున్నారు. ఉన్నతాధికారులు పెద్దగా పట్టించుకోక పోవడంతో వీఆర్ఏల ఆగడాలకు అడ్డుకట్ట పడట్లేదు. -
చిట్టీ డబ్బులివ్వలేదు.. స్థలం రిజిస్ట్రేషన్ చేయలేదు..
పాల్వంచ: కష్టపడి చిట్టీ కట్టగా, డబ్బు ఇవ్వకుండా మోసం చేశారనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాల్వంచలోని జయమ్మ కాలనీకి చెందిన మల్లిపెద్ది వెంకటేశ్వరరావు (40) దగ్గరి బంధువైన నందిగం భానుకుమార్ వద్ద రూ.25 లక్షల చిట్టీలు రెండు కట్టాడు. చివరి వరకు చెల్లించాక రూ.50 లక్షలు ఇవ్వాలని కోరితే తిప్పుతుండటంతో కేసు పెడుతామని చెప్పాడు. దీంతో బొల్లేరుగూడెం ఏరియాలోని 747 గజాల స్థలాన్ని వెంకటేశ్వరరావుకు రాసిచ్చాడు. కానీ రిజిస్ట్రేషన్ చేయకుండా కాలయాపన చేయసాగాడు. ఇదిలా ఉండగా, వెంకటేశ్వరరావుకు తెలియకుండా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెకు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే స్థలాన్ని భానుకుమార్ అగ్రిమెంట్ చేశాడు. చివరికి వీరిద్దరికి కాకుండా మల్లెల దినేష్‌కు రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ స్థలంలో దినేష్ ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయమై పలుమార్లు పంచాయితీలు కూడా జరిగాయని సమాచారం. అయినా తనకు న్యాయం జరగడం లేదని భావించిన వెంకటేశ్వరరావు గురువారం రాత్రి ఇంటి వద్దే పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకటేశ్వరరావు మరణించాడు. కాగా, ఓ ఎమ్మెల్యే కుమారుడు, అధికార పార్టీ నేతలు, పోలీసులు కూడా తనకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారని, ఈ కారణంగానే మనస్తాపానికి గురైనట్లు వెంకటేశ్వరరావు పురుగు మందు తాగే ముందు ఎస్పీ పేరిట 43 మంది పేర్లతో రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఈ విషయమై పాల్వంచ ఎస్ఐ రితీశ్‌ను వివరణ కోరగా.. చిటీ డబ్బు విషయంలో మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అతని భార్య శ్రావణి ఫిర్యాదు చేసిందని తెలిపారు. -
H-1B Visa: భారత టెక్కీలకు మరో ఛాన్స్!
H-1B Visa Second Lottery: భారత టెక్కీలకు ఊరట ఇచ్చే వార్త ప్రకటించింది యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ. రెండో రౌండ్ లాటరీ పద్ధతిలో హెచ్-1బీ వీసాలు జారీ చేయనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) ప్రకటించింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో అభ్యర్థులను ఎంపిక చేయలేకపోయినందున.. జులై 28న మరికొందరిని ర్యాండమ్ సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపిక చేసినట్లు తెలిపింది. ఆగష్టు 2 నుంచి ప్రారంభం కాబోయే పిటిషన్ ఫైలింగ్ ప్రక్రియ నవంబర్ 3తో ముగియనన్నుట్లు అర్హులైన అభ్యర్థులకు సూచించింది. ఇదిలా ఉంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను (2021 అక్టోబర్ 1-2022 సెప్టెంబర్ 30) హెచ్-1బీ వీసా దరఖాస్తుల రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్లలో (ఏప్రిల్ 1 నుంచి 30 దాకా నమోదు చేసుకున్నవాళ్ల) మొదటి లాటరీలో ఎంపిక చేసింది. మొదటి లాటరీలో అనుకున్న స్థాయిలో ఎంపికలు చేయలేకపోయామని, కాబట్టే, ఇప్పుడు రెండో లాటరీ నిర్వహిస్తున్నట్లు USCIS వెల్లడించింది. తద్వారా అదనంగా వందల మంది ఆశావాహ టెక్కీలకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. ముఖ్యంగా ఇది స్టెమ్-ఓపీటీ స్టూడెంట్స్‌కు భారీ ఊరట ఇవ్వనుంది. కాగా, హెచ్-1బీ వీసాలకు విదేశీ వృత్తి నిపుణుల నుంచి అధిక డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ వీసాల జారీ విషయంలో సంప్రదాయ లాటరీ విధానాన్నే కొనసాగించాలని జో బైడెన్ ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం 85,000 కొత్త హెచ్ -1 బీ వీసాలను జారీ చేస్తుంటుంది. తద్వారా చైనీయులకు-భారతీయులకు ఆయా దేశాల ,ఐటీ సంస్థలకు భారీ ప్రయోజనం చేకూరునుంది. హెచ్-1బీ వీసాలు పొందినవారు అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఉద్యోగాల్లో చేరొచ్చు. ప్రతి ఏడాది వీదేశీయులకు 65 వేల హెచ్-1బీ వీసాలు జారీ చేస్తోంది. వీరు మాత్రమే హెచ్-1బీ క్యాప్ దరఖాస్తు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే మరో 20వేల హెచ్-బీ వీసాలు మాస్టర్ క్యాప్(అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం) కింద ఇస్తోంది. -
నిరీక్షణకు తెర.. సెల్ఫ్ అసెస్మెంట్తో పాటే ‘పీటీఐఎన్’
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో కొత్తగా ఇల్లు కొనుక్కున్న/నిర్మించుకున్నవారికి జీహెచ్ఎంసీ ఆస్తిపన్నుకు సంబంధించిన పీటీఐఎన్ (ఆస్తిపన్ను గుర్తింపు సంఖ్య) కోసం ఇక వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆస్తిపన్ను అసెస్మెంట్ కోసం ఆన్లైన్ ద్వారానే సెల్ఫ్ అసెస్మెంట్ను ఎంతో కాలం క్రితమే జీహెచ్ఎంసీ అందుబాటులోకి తెచ్చినప్పటికీ, ఆన్లైన్ ద్వారా ప్రజలు సమర్పించిన వివరాలను నిర్ధారించుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో స్వయంగా తనిఖీ చేశాకే పీటీఐఎన్ కేటాయించేవారు. ఇప్పుడిక సెల్ఫ్ అసెస్మెంట్కు సంబంధించి జతపర్చాల్సిన పత్రాలు జత చేశాక, నివాస గృహమా, వాణిజ్య భవనమా, జోన్, సబ్జోన్ తదితర అవసరమైన వివరాలన్నీ నమోదు చేశాక చెల్లించాల్సిన ఆస్తిపన్ను వివరాలు తెలుస్తాయి. ఆస్తిపన్నును ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. ఆస్తిపన్ను చెల్లించగానే పీటీఐఎన్ జనరేట్ అవుతుంది. చెల్లించిన ఆస్తిపన్నుకు సంబంధించిన డిమాండ్ నోటీసు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీటీఐఎన్ జనరేట్ అయ్యాక సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలతో ఆస్తిపన్ను ఖరారు చేస్తారు. హెచ్చుతగ్గులుంటే సవరిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలోనూ.. రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్ జరగ్గానే పీటీఐఎన్ జనరేట్ అయ్యే ప్రక్రియ కూడా అందుబాటులోకి తెచ్చినప్పటికీ, పూర్తిస్థాయిలో అమలుకు మరికొంత సమయం పట్టనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి పీటీఐఎన్ జనరేట్ అయితే ఆ వివరాలు జీహెచ్ఎంసీకి చేరతాయి. జీహెచ్ఎంసీలో సంబంధిత సర్కిల్‌స్థాయి అధికారులు సంబంధిత ఆస్తిని తనిఖీ చేసి ఆస్తిపన్ను నిర్ధారిస్తారు. అలాంటి వారు సెల్ఫ్అసెస్మెంట్ చేసుకోవాల్సిన పని ఉండదు. అంటే ఇప్పటి వరకు ఆస్తిపన్ను నిర్ధారణ అయ్యాక పీటీఐఎన్ జనరేట్ చేసేవారు. కొత్త పద్ధతి వల్ల పీటీఐఎన్ ముందుగానే జనరేట్ అవుతుంది. బర్త్ సర్టిఫికెట్ ఫైల్ ట్రాకింగ్ సిస్టం.. ఆస్పత్రుల్లో శిశువుల జననం జరిగినప్పటి నుంచి బర్త్ సర్టిఫికెట్ రెడీ అయ్యేంత వరకు ఫైల్ ట్రాకింగ్ సైతం తల్లిదండ్రులకు తెలిసేలా మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. డెత్ సర్టిఫికెట్ల జారీకి సైతం దాదాపుగా ఇదే విధానాన్ని అందుబాటులోకి తేనున్నారు. -
Telangana: దారిలోకి ‘ధరణి’
♦ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీల కోసం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ధరణి పోర్టల్ 8 నెలల తర్వాత రైతులకు వీలైనన్ని ఎక్కువ సేవలు అందించే స్థాయికి చేరింది. ♦ గత వారంలో పెండింగ్ మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు లేని భూములకు నాలా, కోర్టు కేసులున్న సర్వే నంబర్ల నుంచి ఏ కేసులు లేని భూముల తొలగింపు, లాక్డౌన్ కాలంలో బుక్ చేసుకున్న స్లాట్ల రీషెడ్యూల్ లాంటి ఆప్షన్లను అందుబాటులోకి తేవడం విశేషం. ♦ భూముల విస్తీర్ణం, పేర్ల నమోదులో తప్పుల సవరణ వినతులకు పరిష్కారం దొరకడంతో లక్షలాది మంది రైతులకు ఊరట కలుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ♦ పెండింగ్ మ్యుటేషన్ల (ధరణి కంటే ముందు జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి) కింద 1,21,643 దరఖాస్తులు రాగా, 1,21,167 దరఖాస్తులను పరిష్కరించారు. మొత్తం 29 రకాల సేవలు అందిస్తున్న ధరణి పోర్టల్ సాక్షి, హైదరాబాద్: ధరణి బాలారిష్టాలను దాటు తోంది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రిజి స్ట్రేషన్ల లావాదేవీల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తెచ్చిన ఈ పోర్టల్ దారిన పడుతోంది. సీసీ ఎల్ఏ వర్గాల నిర్లక్ష్యం, సాంకేతిక టీంను సమ కూర్చుకోవడంలో వైఫల్యం లాంటి కారణాలతో ధరణి అంటేనే అటు రైతులకు, ఇటు రెవెన్యూ వర్గా లకు విసుగు పుట్టేది. కనీసం పాస్‌పుస్తకంలో పేరు మార్చుకునేందుకు, భూమి తక్కువ పడితే ఉన్నంత మేరకు భూమిని నమోదు చేసుకునేందుకు తహసీ ల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్రమంగా అందు బాటులోకి వస్తున్న ఆప్షన్లు ధరణి పోర్టల్ ప్రయో జనాన్ని నెరవేరుస్తున్నాయనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, పూర్తి స్థాయిలో ఈ ఆప్షన్లకు సంబంధించిన సాంకేతిక సహకారం తక్షణమే సమకూరేలా చూడాలని, బ్యాకెండ్ సమాచారాన్ని అటు కలెక్టర్లకు గానీ, ఇటు తమకు గానీ అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనం ఉంటుందని తహశీల్దార్లు చెబుతున్నారు. వివాదాల పరిష్కారానికి ఆప్షన్లు తాజాగా పలు రకాల భూ సమస్యలు, వివాదాల పరిష్కారానికి కూడా కొన్ని ఆప్షన్లు ధరణి పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూము లుగా చూపడం, డూప్లికేట్ పాస్ పుస్తకానికి దర ఖాస్తు చేసినా రాకపోవడం, జీపీఏ రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు, పేర్లు, భూవిస్తీర్ణం నమోదులో తప్పుల సవరణ, కొన్ని సర్వే నంబర్లు నమోదు కాకపోవడం, రద్దు చేసుకున్న స్లాట్లకు చెల్లించిన రుసుము తిరిగి రైతులకు అందకపోవడం లాంటి సమస్యల పరిష్కారానికి ఆప్షన్లు వచ్చాయి. 8 నెలలు... ఆరు లక్షలు గత నవంబర్ 2న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 2 వరకు అంటే 8 నెలల కాలంలో మొత్తం 6 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో 4.5 లక్షలు రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు కాగా, 36 వేలకు పైగా వారసత్వం, 2,039 భాగపంపకాలు, 16,705 నాలా దరఖాస్తులు పరిష్కారమైనట్లు ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడించాయి. ఆప్షన్లు వచ్చినా....! ధరణిలో ఇటీవలి కాలంలో అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినా కొన్నింటి విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్పాయి. ఉదాహరణకు భూవిస్తీర్ణం తప్పు పడితే సరిచేసుకునేందుకు ఆప్షన్ ఇచ్చారు కానీ, ఆ విస్తీర్ణం సరిచేసే అధికారం అటు రెవెన్యూ వర్గాలకు కానీ, ఇటు కలెక్టర్‌కు కానీ ఇవ్వడం లేదన్నాయి. ఇంతవరకు నమోదుకాని సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేయడం, ప్రభుత్వ భూములు, భూసేకరణ జరిపిన భూముల సర్వే నంబర్లలో మిగిలిన పట్టా భూములకు లావాదేవీలు లాంటి సమస్యలను బ్యాకెండ్‌లో మార్చాల్సి ఉందని తహశీల్దార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చిన తర్వాత వెంటనే సంబంధిత సాంకేతిక సమస్యలను కూడా ఓ కొలిక్కి తేవాలని వారన్నారు. ధరణిలో అందుబాటులో ఉన్న సేవలివీ... 1) స్లాట్ బుకింగ్ 2) అమ్మకం, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ 3) మ్యుటేషన్ 4) వారసత్వం 5) భాగపంపకాలు 6) నాలా 7) పాస్‌బుక్ లేకుండా నాలా 8) మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ 9) లీజు దరఖాస్తు 10) ధరణి పోర్టల్ కంటే ముందు జరిగిన జీపీఏ లావాదేవీలు 11) ఆ తర్వాతి జీపీఏ లావాదేవీలు 12) జీపీఏ రిజిస్ట్రేషన్ 13) డెవలపర్ జీపీఏ రిజిస్ట్రేషన్ 14) పలు భూసమస్యలపై వినతులు, 15) నిషేధిత భూముల కేటగిరీలో పొరపాటున నమోదైన సర్వే నంబర్ల తొలగింపు 16) భూసేకరణ వినతులు 17) స్లాట్ రద్దు చేసుకునే అవకాశం 18) స్లాట్ రీషెడ్యూల్ 19) రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ధ్రువీకరణ 20) ఎన్ఆర్ఐ పోర్టల్ 21) ఆధార్ ధ్రువీకరణ కాని భూములకు పాస్‌పుస్తకాలు 22) ఫర్మ్‌లు, కంపెనీల భూములకు పాస్‌పుస్తకాలు 23) సెమీ అర్బన్ భూములకు పాస్ పుస్తకాలు 24) కోర్టు తీర్పుల ఆధారంగా పాస్‌పుస్తకాలు 25) డూప్లికేట్ పాస్‌పుస్తకాలు 26) కోర్టుకేసుల్లోని భూములపై లావాదేవీల నిలిపివేత దరఖాస్తులు 27) పెండింగ్ నాలా దరఖాస్తులు 28) సాంకేతిక సమస్యలకు సంబంధించిన వినతులు, 29) భూవివరాల గోప్యత (గమనిక: ఈ సేవలకు సంబంధించి పలు ఆప్షన్లు ఉంటాయి. భూవివాదం, అవసరాన్ని బట్టి ఆయా సేవలకు సంబంధించిన ఆప్షన్లను ఎంచుకుని ధరణి పోర్టల్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.) -
5 లక్షలు దాటిన ధరణి లావాదేవీలు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌లో లావాదేవీలు 5 లక్షల మార్కు దాటాయి. గతేడాది నవంబర్ 2 నుంచి ధరణి కార్యకలాపాలు ప్రారంభమవగా సోమవారం వరకు 5.20 లక్షల దరఖాస్తులు వివిధ లావాదేవీల రూపంలో పరిష్కారమయ్యాయని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. ఇందులో కేవలం రిజిస్ట్రేషన్ లావాదేవీల సంఖ్య 3.73 లక్షలు దాటగా మ్యుటేషన్లు లక్షకు మించి జరిగాయి. వారసత్వ పంపిణీ, భాగ పంపకాలు లాంటివి కలిపి మొత్తంగా ఇప్పటివరకు 5.20 లక్షల లావాదేవీలు పూర్తికావడం గమనార్హం. ఇక వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు మార్చేందుకుగాను ‘నాలా’దరఖాస్తులు 16 వేలకుపైగా రాగా అందులో 14,778 దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ఈ దరఖాస్తులను కూడా కలిపితే ఇప్పటివరకు ధరణి ద్వారా పరిష్కారానికి వచ్చిన మొత్తం 5.59 లక్షల దరఖాస్తుల్లో 5.34 లక్షలకుపైగా లావాదేవీలు పూర్తికావడం విశేషం. ఒక్కో రిజిస్ట్రేషన్ లావాదేవీకి సగటున 45 నిమిషాలు పడుతోందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అలాగే వారసత్వ పంపిణీకి 27 నిమిషాలు, భాగ పంపకాల లావాదేవీకి 28, మ్యుటేషన్‌కు 27, నాలా దరఖాస్తుకు 27 నిమిషాలు పట్టిందని పేర్కొన్నాయి. గరిష్టంగా ఒక మ్యుటేషన్ లావాదేవీ పూర్తికి సుమారు 10 గంటలు పట్టిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ పోర్టల్ ద్వారా చాలా రకాల లావాదేవీలకు పూర్తిస్థాయిలో ఆప్షన్లు రాలేదని, వాటినీ అందుబాటులోకి తెస్తే ప్రజలు తహశీల్ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
Corona Vaccine: పోస్టాఫీసులో టీకా నమోదు
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ టీకా తీసుకోవా లనుకునేవారు తమ పేరును ఇక పోస్టాఫీసు నుంచి కూడా నమోదు చేసుకోవచ్చు. తపాలా శాఖ తాజాగా ఈ సేవలు ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవడంలో కొందరికి ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ సేవను ప్రారంభించినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం తెలియనివారు, నిరక్షరాస్యులు సులభంగా తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ ఆధార్ కార్డు, ఫోన్ తీసుకుని పోస్టాఫీసుకు వెళ్లి వివరాలు చెబితే అక్కడి సిబ్బంది కోవిన్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా జరిగేది అయినందున, తమ వెంట కచ్చితంగా మొబైల్ ఫోన్ తీసుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికే 36 హెడ్ పోస్టాఫీసులు, 643 సబ్ పోస్టాఫీసులు, 10 బ్రాంచి పోస్టాఫీసుల్లో ఈ సేవ ప్రారంభించామని, త్వరలో 800 ఇతర బ్రాంచి పోస్టాఫీసుల్లో కూడా ప్రారంభిస్తామని తపాలా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరామిరెడ్డి తెలిపారు. ఇది ఉచితంగా అందించే సేవ అని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
TS EDCET 2021: ఎడ్‌సెట్ విజయం ఇలా
ఉపాధ్యాయ వృత్తిలో రాణించాలంటే.. బీఈడీ తప్పనిసరి. వృత్తిపరమైన నైపుణ్యాలను అందించే బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. ఎడ్‌సెట్ రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన విడుదలైంది. నూతన విద్యావిధానానికి అనుగుణంగా టీఎస్ ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షలో పలు మార్పులు చేర్పులు చేశారు. ఈ నేపథ్యంలో.. టీఎస్ ఎడ్‌సెట్ 2021కు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ అంశాల గురించి తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ వృత్తికి సంబం«ధించిన రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశం పొందాలంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టీఎస్ ఎడ్‌సెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. డిగ్రీ స్థాయి కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు టీఎస్ ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందకు అర్హులు. అర్హతలు ► కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ(హోంసైన్స్), బీసీఏ, బీబీఎం, బీఏ(ఓరియంటల్ లాంగ్వేజ్), బీబీఏ కోర్సు పూర్తిచేసిన అభ్యర్థులు/ఫైనల్ పరీక్షలకు హాజరైన వారు దరఖాస్తుకు అర్హులు. బీఈ/బీటెక్ కోర్సులను చదివిన వారు ఆయా కోర్సుల్లో కనీసం 50 శాతం మార్కులను సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తీర్ణత శాతంలో సడలింపు ఉంది. వీరు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ► వయసు జూలై1, 2021 నాటికి 19ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు. ► ఎంబీబీఎస్, బీఎస్సీ(అగ్రికల్చర్), బీవీఎస్సీ, బీహెచ్‌ఎంటీ, బీఫార్మసీ, ఎల్ఎల్బీ వంటి కోర్సులు చదివిన విద్యార్థులు టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షను రాసేందుకు, బీఈడీ కోర్సులో చేరేందుకు అనర్హులు. ► డిగ్రీ లేకుండా పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు కూడా ఎడ్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కాదు. పరీక్ష ఇలా ► ఎడ్‌సెట్ పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్–సీబీటీ) విధానంలో ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష నిర్వహిస్తారు. సబ్జెక్టు/కంటెంట్–60మార్కులకు(మ్యాథమెటిక్స్–20మార్కులు, సైన్స్–20మార్కులు, సోషల్ స్టడీస్–20 మార్కులు), టీచింగ్ అప్టిట్యూడ్–20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్–30మార్కులు, కంప్యూటర్ అవేర్నెస్–20 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఎడ్‌సెట్ పరీక్ష సమయం రెండు గంటలు. ► ఎడ్‌సెట్‌లో అర్హత పొందేందుకు కనీసం 25శాతం మార్కులు అంటే.. మొత్తం 150 మార్కులకు 38 మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ► గతంలో ఎడ్‌సెట్‌కు సంబంధించిన సిలబస్ డిగ్రీ స్థాయి వరకు ఉండేది. కానీ ప్రస్తుతం 2021 నుంచి మార్పులు చేశారు. దీనిలో చేసిన మార్పుల ప్రకారం–పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలు ఇస్తున్నారు. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా కంప్యూటర్‌కు సంబంధించిన సాంకేతిక అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్/తెలుగు, ఇంగ్లిష్/ఉర్దూ మాధ్యమంలో ఉంటుంది. సిలబస్ అంశాలు ఇవే ► తెలంగాణ స్టేట్ కరిక్యులానికి సంబంధించి పదోతరగతి వరకు ఉన్న పాఠ్యపుస్తకాలు అన్నీ చదవాలి. ► మ్యాథమెటిక్స్:సంఖ్యావ్యవస్థ(నంబర్ సిస్టమ్), వాణిజ్య గణితం(కమర్షియల్ మ్యాథమెటిక్స్), బీజగణితం(ఆల్జీబ్రా), జ్యామితి(జామెట్రీ), కొలతలు(మెన్సురేషన్), త్రికోణమితి(ట్రిగ్నోమెట్రీ), సమాచార నిర్వహణ(డేటా హ్యాడ్లింగ్). ► ఫిజికల్ అండ్ బయోలాజికల్ సైన్స్: ఆహారం(ఫుడ్), జీవులు(లివింగ్ ఆర్గానిజమ్స్), జీవన ప్రక్రియలు(లైఫ్ ప్రాసెస్ ), జీవవైవి«ధ్యం(బయోడైవర్సిటీ), కాలుష్యం(పొల్యూషన్), పదార్థం(మెటీరియల్), కాంతి(లైట్), విద్యుత్ అండ్ అయస్కాంతత్వం(ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నటిజమ్), వేడి(హీట్), ధ్వని(సౌండ్), కదలిక(మోషన్), మార్పులు(చేంజెస్),వాతావరణం(వెదర్ అండ్ క్లయిమెట్), బొగ్గు అండ్ పెట్రోల్(కోల్ అండ్ పెట్రోల్), కొన్ని సహజ సిద్దమైన దృగ్విషయం (సమ్ నేచురల్ ఫినామినా) నక్షత్రాలు, సౌరవ్యవస్థ(స్టార్స్ అండ్ సోలార్ సిస్టమ్), లోహశాస్త్రం(మెటాలజీ), రసాయన ప్రతిచర్యలు(కెమికల్ రియాక్షన్స్). ► సాంఘిక శాస్త్రం: భౌగోళికశాస్త్రం(జాగ్రఫీ), చరిత్ర(హిస్టరీ), రాజనీతి శాస్త్రం (పొలిటికల్ సైన్స్), అర్థశాస్త్రం(ఎకనామిక్స్). ► టీచింగ్ ఆప్టిట్యూడ్: ఆప్టిట్యూడ్ ప్రశ్నలు.. బోధన అభ్యసన ప్రక్రియ, క్లాస్ రూంలో పిల్లలతో వ్యవహరించే విధానం, విశ్లేషణాత్మక ఆలోచన, జనరల్ ఇంటెలిజెన్స్ వంటివి వాటిపై ఉంటాయి. ► జనరల్ ఇంగ్లిష్: రీడింగ్ కాంప్రహెన్షన్, స్పెల్లింగ్ ఎర్రర్, వొకాబ్యులరీ, ఫ్రేస్ రీప్లేస్మెంట్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ వర్డ్ అసోసియేషన్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► జనరల్ నాలెడ్జ్, ఎడ్యుకేషనల్ ఇష్యూ: కరెంట్ అఫైర్స్, ప్రస్తుత జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలు, సమకాలీన విద్యాసమస్యలు, జనరల్ పాలసీలు, సైంటిఫిక్ పరిశోధనలు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన అంశాలుంటాయి. ► కంప్యూటర్ అవేర్నెస్: కంప్యూటర్, ఇంటర్నెట్, మెమొరీ, నెట్వర్కింగ్, ఫండమెంటల్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రిపరేషన్ ఇలా ► ఎడ్‌సెట్ పరీక్షలో అర్హత సాధించాలంటే.. పాఠశాల స్థాయిలోని పదోతరగతి వరకు అన్ని సబ్జెక్టులను చదవాలి. ఇందుకోసం తెలంగాణ స్టేట్ కరిక్యులం ప్రాథమిక స్థాయి నుంచి పదోతరగతి వరకూ పుస్తకాలను సమగ్రంగా చదవాలి. ► చక్కని ప్రిపరేషన్, సబ్జెక్ట్‌పై పట్టు సాధిస్తే ఎంట్రన్‌లో మంచి మార్కులు(ర్యాంక్) సాధించేందుకు అవకాశం ఉంటుంది. ► ఎడ్‌సెట్ పరీక్షకు ఇంకా దాదాపు నాలుగు నెలల సమయం ఉంది. కాబట్టి నిర్ణిష్టమైన టైమ్ టెబుల్ సిద్ధం చేసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. ► పాఠ్య పుస్తకాలను చదివే సమయంలో సులువుగా గుర్తుండేలా ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఇది ఒక ఎడ్‌సెట్‌కే కాకుండా.. భవిష్యత్తులో టెట్, టీఆర్టీ వంటి పరీక్షలకు కూడా ఉపయోగపడుతుంది. ► కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ కోసం పత్రికలను చదవడం, న్యూస్ బుల్‌టెన్లను అనుసరించాలి. దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలను, పేపర్ కట్స్‌ను నోట్ రూపంలో సిద్ధం చేసుకొని ఎప్పటికప్పుడు చూస్తుండాలి. ► పరీక్ష సమయం వరకు ముఖ్యమైన అంశాలను సాధ్యమైనన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రాసి,సిద్ధం చేసుకున్న నోట్‌బుక్ ఉపయోగించాలి. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: టీఎస్ ఎడ్‌సెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. ఇందుకోసం ఎడ్‌సెట్ అధికారిక వెబ్సైట్ https://edcet.tsche.ac.in/లాగిన్ అవ్వాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ.450, మిగతా వారికి రూ.650. ► దరఖాస్తు చివరి తేదీ: 15.06.2021(ఆలస్య రుసం లేకుండా) ► హాల్‌టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: 10.08.2021 ► ఎడ్‌సెట్ పరీక్ష తేదీలు: 24.08.2021, 25.08.2021 ► వెబ్సైట్: https://edcet.tsche.ac.in/TSEDCET/EDCET_HomePage.aspx