సాక్షి, హైదరాబాద్: రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. గత నెల 15న మార్గదర్శకాలు జారీ చేసినా సైట్ తెరుచుకోడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్‌ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌తోపాటు, కొత్తగా అప్‌లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది.
గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది.
(చదవండి: డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!)
Comments
Please login to add a commentAdd a comment