date extended
-
గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడగించినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు బుధవారం టీఎస్పీఎసస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 భర్తీకి అభ్యర్థుల దరఖాస్తు గడువు.. అధికారికంగా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు గడువు పెంచింది. మొత్తం 563 పోస్టులకు ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేయగా.. మార్చి 13వ తేదీ వరకు సుమారు 2.70 లక్షల మంది గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణ: గ్రూప్–4 దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్–4 ఆశా వహులకు శుభవార్త. దరఖాస్తుల స్వీకరణ గడువును ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గత డిసెంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా జనవరి 30వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉన్న విషయం తెలిసిందే. గ్రూప్–4 కేటగిరీలో మరి కొన్ని కొలువులు జతచేస్తూ అనుబంధ ప్రకటన విడుదల చేయడం, అభ్యర్థుల నుంచి వినతులు రావడంతో గడువును పొడిగిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. గ్రూప్–4 ఉద్యోగాల కోసం ఇప్పటివరకు 8,47,277 దరఖాస్తులు వచ్చాయి. ఆదివారం 49 వేలు, సోమవారం 34,247 దరఖాస్తులు వచ్చాయి. మరో నాలుగు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు భావిస్తున్నాయి. మైనారిటీ గురుకుల దరఖాస్తుల గడువు పెంపు మైనారిటీ గురుకుల పాఠ శాల, జూనియర్ కాలేజీలో 2023–24 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లతో పాటు 6, 7, 8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించినట్లు మైనారిటీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ సెక్రెటరీ షఫీవుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు. సలహాలు, సూచనల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 040–23437909లో సంప్రదించవచ్చని తెలిపారు. మరో ఆరు డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాష్ట్ర ప్రభుత్వం మరో ఆరు డాక్టర్‌పోస్టుల భర్తీకి గ్రీన్సిగ్నల్ఇచ్చింది. వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధి లోని ఈఎన్టీ విభాగంలో 3 అసిస్టెంట్ ప్రొఫె సర్లు, మరో 3 స్పీచ్‌పాథాలజిస్టులను నియ మించనుంది. మెడికల్‌రిక్రూట్‌మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ పోస్టుల భర్తీ జరగనుంది. మరిన్ని వివరాలకు తమ బోర్డు వెబ్ సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు. -
గుడ్‌న్యూస్! రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: రైతు బీమా నమోదు గడువును ఈ నెల 13 వరకు పొడిగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల ఒకటో తేదీ వరకే రైతు బీమా రెన్యువల్, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది. గత నెల 15న మార్గదర్శకాలు జారీ చేసినా సైట్ తెరుచుకోడానికే మూడు రోజులు పట్టింది. పాత రెన్యువల్స్ 38.98 లక్షల ఎల్ఐసీ ఐడీలున్న రైతుల వెరిఫికేషన్‌తోపాటు, కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చినా గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది. గడువు కేవలం 15 రోజులే ఇవ్వడం, గత నెలలో వర్షాల నేపథ్యంలో అర్హులైన 50.82 లక్షల మంది రైతు బీమా నమోదు పూర్తి స్థాయిలో కాలేదు. తాజా గడువు తేదీ ఈనెల 13 సాయంత్రం 6 గంటల వరకు ఏఈవోలు రైతు బీమా నమోదు చేయడానికి అవకాశం కల్పించారు. ఇప్పటి వరకు నమోదు చేసుకోని రైతులు స్థానిక ఏఈవోలను సంప్రదించాలని వ్యవసాయశాఖ సూచించింది. (చదవండి: డిప్యుటేషన్ ఇష్టారాజ్యం.. ఇదేమని ప్రశ్నిస్తే ఆకాశ రామన్నల ఫిర్యాదులు తెరపైకి!) -
ఐటీ రిటర్న్స్: గుడ్ న్యూస్ చెప్పిన ఆదాయ పన్ను శాఖ!
IT Returns E Verification Date Extended: ఆదాయ పన్నుల చెల్లింపులు చేయడానికి 2021, డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలతో గడువు ముగిసింది. చాలామంది కోరుకున్నట్లుగా ఐటీ రిటర్న్స్ గడువును పొడిగించలేదు. పైగా పొడిగింపు ఉద్దేశమే లేదంటూ చివరిరోజు స్వయంగా ప్రభుత్వమే ప్రకటన చేసింది. కానీ, రిటర్న్ దాఖలుచేసినా.. ఈ-వెరిఫై పూర్తి కానివాళ్ల కోసం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్ను వెరిఫై ప్రాసెస్ పూర్తి కానివాళ్ల కోసం ఊరట ఇచ్చింది ఆదాయ శాఖ. ఆన్లైన్లో ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన టైంలో చాలామందికి కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆన్లైన్లో దాఖలు చేసిన తర్వాత రిటర్ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. వెరిఫై చేయటం అంటే.. పాన్‌తో ఆధార్ అనుసంధానమై, సంతకం అవసరం లేకుండా ఓటీపీ ద్వారా పంపటం. అయితే, ఓటీపీ వచ్చిన తర్వాత, పోర్టల్‌లో వేసినా ‘లోడింగ్’ కాకపోవడం వల్ల సబ్మిట్ అవ్వడం లేదు. దీనర్థం రిటర్నును దాఖలు చేసినప్పటికీ ఈ–వెరిఫై పూర్తి కాలేదని. ఇలా ఎంతో మంది .. గంటల తరబడి ప్రయత్నించినా వెరిఫై కాలేదు. ఈ కష్టాలను దృష్టిలో పెట్టుకుని గడువును 2022 ఫిబ్రవరి 28 వరకూ డిపార్ట్మెంటు పెంచింది. ఇది కేవలం వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉన్న వారికి మాత్రమే. రిటర్నులు వేయడానికి పొడిగించినట్లు కాదు. వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉంటే వారు వెంటనే వెరిఫై చేసుకోండి. ఇక పాన్‌తో ఆధార్ అనుసంధానం కాని వారు ‘‘వెరిఫై వయా ఫారం V’’ అని ఆప్షన్ పెట్టాలి. వారికి ఫారం V అంటే అక్నాలెడ్జ్మెంట్ జనరేట్ అవుతుంది. అటువంటి వారు ఫైల్ చేసిన రోజు నుంచి 120 రోజుల్లోగా ఫారంపై సంతకం చేసి బెంగళూరుకు పోస్ట్ ద్వారా పంపాలి. పైన చెప్పిన రెండు పద్ధతుల ద్వారా రిటర్న్ ఫైలింగ్ పూర్తి అయినట్లు చెప్పవచ్చు. గడువు తేది లోపల దాఖలు చేయకపోతే.. ఏ కారణం వల్లనైనా కానివ్వండి.. గడువు తేదీ లోపల రిటర్ను వేయలేకపోతే గాభరా పడక్కర్లేదు. ఈ ఆలస్యానికి, తప్పిదానికి, కాలయాపనకు ఒక వెయ్యి రూపాయలు లేదా రూ. 5,000 పెనాల్టీగా విధిస్తారు. ►1–1–2022 నుండి 31–3–2022 లోపల దాఖలు చేసినట్లయితే సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం రూ. 1,000 పెనాల్టీ చెల్లించాలి. రీఫండు క్లెయిమ్ చేసే వారికి ఆ రూ. 1,000 తగ్గిస్తారు. ► నికర ఆదాయం/ ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 దాటి ఉంటే పెనాల్టీ రూ. 5,000 చెల్లించాలి. ఈ రెండూ పెనాల్టీలే. చిన్న మొత్తాలతో వదిలిపోతుంది. ► నికర ఆదాయం లేదా ట్యాక్సబుల్ ఇన్‌కం రూ. 5,00,000 లోపలే ఉంటే గడువు తేదీ లోపలే వేసి ఉంటే రూపాయి కూడా పన్ను కట్టనవసరం లేదు. ► కొంత మందికి వ్యాపారం లేదా వృత్తిలో నష్టం వస్తుంది. గడువు తేదీ లోపల దాఖలు చేసిన వారికి మాత్రమే ఆ నష్టాన్ని రాబోయే సంవత్సరానికి బదిలీ చేయడం సాధ్యపడుతుంది. ఇలా బదిలీ చేయడం వల్ల రాబోయే సంవత్సరాలలో లాభానికి సర్దుబాటు (తగ్గింపు) చేసుకోవచ్చు. ► నష్టం ఉంటే సకాలంలో రిటర్నులు వేయనివారికి చాలా పెద్ద ఇబ్బంది. నష్టం. వారు నష్టాన్ని బదిలీ చేసుకునే హక్కును శాశ్వతంగా కోల్పోతారు. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఏది ఏమైనా, రిటర్నులు సక్రమంగా సకాలంలో వేయడం అన్ని రకాలుగా మంచిది. - కేసీహెచ్ ఏవీఎస్‌ఎన్ మూర్తి, కేవీఎన్ లావణ్య ట్యాక్సేషన్ నిఫుణులు -
మార్చిలోగా పాన్–ఆధార్ అనుసంధానం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాన్ కార్డ్ నంబర్‌తో ఆధార్ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. పాన్ నంబర్‌తో అనుసంధానానికి ఆధార్ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు సమరి్పంచాల్సిన గడువు తేదీ వాస్తవానికి ఈ ఏడాది సెపె్టంబర్ 30. కోవిడ్–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్ పాలసీ ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ సురభి అహ్లువాలియా ఒక ప్రకటన విడుదల చేశారు. ఆదాయపు పన్ను చట్టం–1961 కింద జరిమానా విచారణలు పూర్తి చేయడానికి గడువు కూడా 2022 మార్చి 31 వరకు పొడిగించారు. -
టీఎస్ ఎంసెట్ దరఖాస్తుల గడువు మరోసారి పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్– 2021 ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గురువారం ఓ ప్రకటనలో ఆయన సూచించారు. ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో ప్రవేశాలు గన్‌ఫౌండ్రీ(హైదరాబాద్): రాష్ట్రంలోని 6 ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కర్నాటిక్ సంగీతం, కూచిపూడి, కథక్ నృత్యాలు, భరతనాట్యం, సితార్, మృదంగం, వీణ, నాదస్వరం వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కనీసం 10 సంవత్సరాల వయసు కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–24758090, భక్త రామదాసు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–27801788, అన్నమాచార్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల కోసం 040–23523850, విద్యా రణ్య ప్రభుత్వ సంగీత కళాశాల కోసం 87024 23628 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
విద్యా సమాచారం: దరఖాస్తుల గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఐటీఐ పూర్తయిన విద్యార్థులు లేటరల్ ఎంట్రీ కింద పాలిటెక్నిక్ డిప్లొమాలో చేరేందుకు నిర్వహించే ఎల్పీసెట్– 2021 దరఖాస్తుల గడువును జూలై 12వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు దరఖా స్తు చేసుకోవచ్చని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి డాక్టర్ శ్రీనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. రూ. 100 ఆలస్య రుసుముతో జూలై 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. పరీక్షను జూలై 25వ తేదీన నిర్వహిస్తామని వెల్లడించారు. టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు కేయూ క్యాంపస్: రాష్ట్రంలోని కళాశాలల్లో 2021– 22 విద్యాసంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువును జూలై 8వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా దర ఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆచార్యులు కె.రాజిరెడ్డి పేర్కొన్నారు. పీఈసెట్ దరఖాస్తుల గడువు ఈ నెల 15 వరకు పెంపు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ దరఖాస్తుల గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలకు గడువు పెంపు సాక్షి, హైదరాబాద్: మోడల్ స్కూళ్లలో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తుల గడువును జూలై 7వ తేదీ వరకు పొడిగించారు. ఆరో తరగతిలో కొత్త ప్రవేశాలు, 7 నుంచి టెన్త్ వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాలను (https://telanganams.cgg.gov.in) పొందవచ్చని తెలిపింది. -
Telangana: ఎంసెట్, లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువును జూన్ 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. బుధవారం వరకు 2,01,367 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. వీరిలో ఇంజనీరింగ్ కోసం 1,35,151 మంది, అగ్రికల్చర్ కోసం 66,216 మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు తెలంగాణ లాసెట్ దరఖాస్తుల గడువును వచ్చే నెల 3వ తేదీ వరకు పొడిగించారు. అప్పటివరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని లాసెట్ కమిటీ పేర్కొంది. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోవాలని సూచించింది. చదవండి: Telangana: జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు జూలై రెండో వారంలో ఇంటర్ పరీక్షలు! -
రిటర్నుల దాఖలు; మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును మూడో విడత పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయపన్ను రిటర్నులను (ఆడిట్ అవసరం లేనివారు) జనవరి 10 వరకు ఎటువంటి ఆలస్యపు రుసుము లేకుండా దాఖలు చేసుకోవచ్చు. తమ ఖాతాలను ఆడిట్ చేసుకోవాల్సిన వ్యక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల వివరాలను రిపోర్ట్ చేయాల్సిన వారు.. అలాగే, ఆడిట్ అవసరమున్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకు ఉన్న రిటర్నుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకు తాజాగా అవకాశం కల్పించింది.(చదవండి: న్యూవిస్టాడోమ్ కోచ్‌తో మరుపురాని ప్రయాణం!) ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఐటీఆర్‌ల దాఖలులో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో మరికొంత గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వివాద్ సే విశ్వాస్ పథకం కింద డిక్లరేషన్ గడువును కూడా ప్రభుత్వం జనవరి 31 వరకు పొడిగించింది. అలాగే, 2019–20 ఆర్థిక సంవత్సరపు వార్షిక జీఎస్టీ రిటర్నుల గడువును రెండు నెలలు అంటే ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వం పొడిగించింది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల కారణంగా నిబంధనలను పాటించేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకుని గడువును పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది -
వైద్య పీజీ సీట్ల భర్తీకి గడువు పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో 2020–21 విద్యా సంవత్సరానికి సీట్ల భర్తీ కోసం ఆగస్టు 31 వరకు గడువు పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఉత్త ర్వులు జారీ చేసింది. కనీస అర్హత నిబంధనల సడలింపులపై భారత వైద్య మండలి (ఎంసీఐ), నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎన్ఈబీ)కి నివేదించుకోవాలని పేర్కొంది. కరోనా కారణంగా వైద్య విద్య పీజీ కోర్సుల్లో సీట్లు భర్తీ కాకపోవడంతో అర్హత నిబంధనలు సడలించి మిగిలిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని, భర్తీకి గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ ప్రైవేటు మెడికల్ అండ్ డెంటల్ కళాశాల యాజమాన్యాల సంఘం తరఫున న్యాయవాది అల్లంకి రమేశ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం జస్టిస్ రోహింటన్ ఫాలీనారీమన్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది కె.వి.విశ్వనాథన్, అల్లంకి రమేశ్ వాదనలు వినిపించారు. 2020–21 విద్యా సంవత్సరానికి వైద్య విద్యకు సంబంధించి పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు కనీస అర్హత నిబంధనలు సడలించాలని, నీట్ పీజీ కటాఫ్ మార్కులు తగ్గించడంగానీ, కనీస మార్కుల అర్హత నిబంధన తొలగించడంగానీ చేయా లని కోరారు. కాంపిటెంట్ అథారిటీ, మేనేజ్మెంట్ కోటాల్లో సీట్లు భర్తీ కానందున గడువు పొడిగించాలని కోరారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం ప్రస్తుత విద్యాసంవత్సరం సీట్ల భర్తీ గడువును ఆగస్టు నెలాఖరు వరకు పొడిగించింది. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద కనీస అర్హత నిబంధనలైన నీట్ ఉత్తీర్ణత వంటి నిబంధనలను సడలించేందుకు అధీకృత సంస్థలైన ఎంసీఐ, ఎన్‌ఈబీకి అధికారం ఉందని పిటిషనర్ తరపున న్యాయవాది చేసి న వ్యాఖ్యలతో ఏకీభవించిన ధర్మాసనం.. తగిన ఉత్తర్వుల కోసం ఆయా సంస్థలను సంప్రదించొచ్చని ఉత్తర్వులు జారీచేసింది. అన్ని రాష్ట్రాలకు ఆగస్టు 31 వరకు.. ఇదే రకమైన అభ్యర్థనతో బిహార్ కళాశాలలు, రాజస్తాన్ ప్రభుత్వం కూడా అభ్యర్థన దాఖలు చేశాయి. ఆయా కేసుల్లో వెలువడిన ఉత్తర్వులు, తెలంగాణ కేసులో వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా అన్ని రాష్ట్రాల్లో భర్తీకి గడువును ఆగస్టు నెలాఖరుకు పొడిగిస్తూ ఎంసీఐ సెక్రటరీ జనరల్ డాక్టర్ ఆర్.కె.వత్స్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆలస్య రుసుము అంతనా?
సాక్షి, హైదరాబాద్: అసలే కరోనా సంక్షోభం.. పనుల్లేవ్.. పైసల్లేవ్..! అందరికీ ఇబ్బందులే.. ఇక ప్రైవేటు ఉద్యోగులు, నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) ఆలస్య రుసుముల పేరుతో సెట్ కమిటీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నాయి. ఓ విధానం అంటూ లేదు. రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు ఆలస్య రుసుము విధిస్తున్నాయి. ఒక్కో సెట్ ఒక్కో రకంగా ఆలస్య రుసుమును వసూలు చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పోనీ పరీక్షల సమయం వచ్చేసింది.. ఇప్పటికిప్పుడు వారికి హాల్ టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాల కేటాయింపు చాలా కష్టం.. పైగా ఆయా విద్యార్థులు ఇన్నాళ్లు దరఖాస్తు చేసుకోకపోవడం తప్పు అన్న పరిస్థితి.. ఇప్పుడు లేనేలేదు. ఇంకా నెల రోజుల వరకు కూడా ప్రవేశ పరీక్షలు నిర్వహించే అవకాశమే కనిపించడం లేదు. అయినా దరఖాస్తులకు ఆలస్య రుసుములు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ విద్యార్థుల నుంచి దండుకుంటుండటం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కనీసం గతంలో ఫీజు చెల్లించిన వారు ఇప్పుడు ఉచితంగా దరఖాస్తుల సబ్మిట్ చేసే అవకాశం ఇవ్వలేదు. గతంలో ఫీజు చెల్లించినా.. ఇప్పుడున్న ఆలస్య రుసుమును చెల్లిస్తేనే దరఖాస్తులను స్వీకరిస్తామని వెబ్సైట్లో పెట్టడంతో విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. దరఖాస్తుల గడువును ముగించేశాయి.. పరీక్షల తేదీలు లేకపోయినా మెున్నటివరకు దరఖాస్తుల గడువును పలు సెట్ కమిటీలు ముగించేశాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సమస్యల కారణంగా 4 వేల మందికి పైగా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు.. కానీ దరఖాస్తులను సబ్మిట్ చేయలేకపోయారు. సైట్ ఓపెన్ చేసిన తరువాత ఫీజు చెల్లించారు.. ఆ తరువాత దరఖాస్తు ఫాం ఓపెన్ కావడంలో సమస్యలు ఎదుర్కొన్నారు. కొంతమంది నిర్దేశిత సర్టిఫికెట్లు, ఇతర వివరాలు ఆ సమయంలో అందుబాటులో దరఖాస్తు చేయలేకపోయారు. దీంతో వారంతా ఆందోళనకు గురయ్యారు. దీనిపై ‘సాక్షి’ప్రత్యేక కథనం ప్రచురించడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డికి ఆదేశాలు జారీ చేయడంతో ఆయన దరఖాస్తుల గడువును పొడిగించేలా సెట్ కమిటీలను ఆదేశించారు. దీంతో పలు సెట్ కమిటీలు దరఖాస్తుల గడువును పొడిగించాయి. అయితే ఇక్కడ మరో మెలిక పెట్టాయి. ఫీజు చెల్లించినా ఆలస్య రుసుము కట్టాల్సిందే.. దరఖాస్తుల గడువును కొన్ని సెట్స్‌కు ఈనెల 20 వరకు, మరికొన్నింటికి ఈనెల 25 వరకు, కొన్ని ఈనెల 31 వరకు ఆలస్య రుసుముతో పొడిగించాయి. గతంలోనే ఫీజు చెల్లించి, దరఖాస్తులను సబ్మిట్ చేయలేని వారు కూడా ఇపుడు విధించే ఆలస్య రుసుమును చెల్లించాల్సిందేనని నిబంధన పెట్టడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఐసెట్‌కు గతంలో ఫీజు చెల్లించి దరఖాస్తులను సబ్మిట్ చేయనివారు 1,358 మంది ఉన్నారు. రూ.1,000 ఆలస్య రుసుముతో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అవకాశం ఇచ్చింది. ఎడ్‌సెట్ దరఖాస్తులను సబ్మిట్ చేయని వారు 685 మంది రూ. 2 వేలు, లాసెట్ ఫారాలు సబ్మిట్ చేయని వారు 751 మంది రూ. 4 వేలు, ఈసెట్, ఎంసెట్ విద్యార్థులైతే రూ.10 వేలు ఆలస్య రుసుమును చెల్లిస్తేనే దరఖాస్తులను సబ్మిట్ చేసేలా అవకాశం ఇచ్చారు. -
ఆగస్టు 31వరకు జీఎస్టీ రిటర్నులు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ చెల్లింపుదారులు దాఖలు చేయాల్సిన దాదాపు అన్ని రిటర్నుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ఈ మేరకు పలు జీఎస్టీ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ అయ్యాయి. అదే విధంగా మార్చి 20, ఆ తర్వాత కాలపరిమితి ముగిసే ఈ–వే బిల్లులన్నింటి గడు వును కూడా ఆగస్టు 31 వరకు పొడిగించింది. కాంట్రాక్టర్లకు ఊరట.. వాస్తవానికి జీఎస్టీ పరిధిలోనికి వచ్చే డీలర్లు (వ్యాపారులు) పన్ను చెల్లింపు కోసం రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. సదరు డీలర్ల వార్షిక టర్నోవర్‌ను బట్టి జనరల్ డీలర్ అయితే ప్రతి నెలా, కాంపోజిట్ డీలర్ అయితే మూడు నెలలకోసారి ఇలా పన్ను చెల్లింపుల కోసం రిట ర్నులు సమర్పించాలి. అమ్మకపు వివరాలను జీఎస్టీఆర్ 1 ద్వారా, అమ్మకాలు, కొను గోళ్ల వివరాలను జీఎస్టీఆర్ 3బీ ఫారాలను దాఖలు చేయడం ద్వారా ప్రభుత్వానికి తెలియ జేయాల్సి ఉంటుంది. ఇప్పుడు కోవిడ్–19 ప్రభావం తీవ్రంగా ఉండటంతో ఈ రిటర్నుల దాఖలు గడువును పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం జనరల్, కాంపోజిట్ డీలర్లు దాఖలు చేసే అన్ని రిటర్నుల గడువు జూలై 31 వరకు పొడిగించింది. అలాగే కాంట్రాక్టర్లకు ఊరట కలిగించేలా ప్రతి నెలకు మరుసటి నెల 10వ తేదీ వరకు సమర్పించాల్సిన టీడీఎస్ రిటర్నులను (మార్చి నుంచి జూన్ వరకు) ఆగస్టు 31 వరకు పెంచింది. ఇటు ఎన్నారైలు, టీసీఎస్, ఇన్ పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ రిటర్నులను కూడా అదే తేదీ వరకు పొడిగించింది. ఇక పనిలో పనిగా ఎలక్ట్రానిక్ వే బిల్లులు (ఈ–వే బిల్లులు) చెల్లుబాటయ్యే కాలపరిమితి కూడా పెంచింది. ఈ ఏడాది మార్చి 24లోపు జనరేట్ అయి అదే నెల 20 లేదా ఆ తర్వాత ముగిసే ఈ–వే బిల్లులను ఆగస్టు 31 వరకు చెల్లుబాటయ్యే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. -
సీనియర్ సిటిజన్లకు మరో చాన్స్
ఎల్ఐసీ ఆఫర్ చేస్తున్న పెన్షన్ పథకమే ప్రధానమంత్రి వయవందన యోజన (పీఎంవీవీవై). ఇందులో చేసిన పెట్టుబడులపై పదేళ్ల పాటు క్రమం తప్పకుండా పెన్షన్ లభిస్తుంది. పదవీ విరమణ తీసుకున్న వారికి.. వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి అందుబాటులో ఉన్న మెరుగైన పథకాల్లో ఇది కూడా ఒకటి. దీనిని 2017 మే నెలలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. తొలుత ఏడాది పాటు ఇన్వెస్ట్‌మెంట్‌కు అవకాశం ఇవ్వగా, ఈ గడువును 2020 మార్చి వరకు పొడిగించారు. తాజాగా దీనిని మరో మూడేళ్ల పాటు 2023 మార్చి 31 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కనుక ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేయని వారికి మరో మూడేళ్ల పాటు ఇది అందుబాటులో ఉన్నట్టే. 60 ఏళ్లు, అంతకుపైన వయసున్న ప్రతీ ఒక్కరూ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అర్హులే. ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధి 10 ఏళ్లు. ఇన్వెస్ట్ చేస్తే పదేళ్ల పాటు పెన్షన్ అందుకోవచ్చు. గడువు తీరిన తర్వాత పెట్టుబడి మొత్తం(చార్జీలు పోను) తిరిగి వస్తుంది. ఒకవేళ పాలసీ కాల వ్యవధిలో మరణం చోటు చేసుకుంటే నామినికీ ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. ఎల్ఐసీ కార్యాలయానికి వెళ్లి కానీ, లేదా ఎల్ఐసీ ఆన్లైన్ పోర్టల్ నుంచి కానీ ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పెన్షన్ చెల్లింపులు ఇలా.. ఇన్వెస్ట్ చేసి, ప్రతీ నెలా నిర్ణీత మొత్తం పెన్షన్‌గా అందుకోవాలని ఆశించే వారి ముందున్న స్థిరాదాయ పథకాల్లో.. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌తోపాటు పీఎంవీవీవై కూడా ఒకటి. ఈ పథకంలో పెట్టుబడిపై 2020–21 ఆర్థిక సంవత్సరానికి 7.40 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. కనీస నెలవారీ పెన్షన్ రూ.1,000. గరిష్ట నెలవారీ పెన్షన్ రూ.10,000. త్రైమాసికం వారీగా అయితే కనీసం రూ.3,000, గరిష్టంగా రూ.30,000, ఆరు నెలలకోసారి అయితే కనీసం రూ.6,000, గరిష్టంగా రూ.60,000.. వార్షికంగా అయితే కనీసం రూ.12,000, గరిష్టంగా రూ.1,20,000 పెన్షన్ రూపంలో పొందే అవకాశం ఉంది. నెలవారీగా కనీసం రూ.1,000 పెన్షన్ తీసుకోవాలని భావిస్తే చేయాల్సిన పెట్టుబడి రూ.1,62,162. వార్షికంగా ఒకే విడత రూ.12,000 పెన్షన్ కోసం రూ.1,56,658ని ఇన్వెస్ట్ చేస్తే చాలు. ఈ పాలసీలో గరిష్టంగా ఒక వ్యక్తి రూ.15లక్షలను ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెఫ్ట్ లేదా ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ రూపంలో పెన్షన్ చెల్లింపులు అందుకోవచ్చు. రాబడులు.. వడ్డీ రేట్ల క్షీణత ప్రభావం పీఎంవీవీవైపైనా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు 8 శాతం రాబడి రేటు ఉండగా, దీనికి 7.40 శాతానికి కేంద్రం తగ్గించింది. పైగా 2020–21 సంవత్సరానికే ఈ రేటు వర్తిస్తుంది. ఆ తర్వాత ప్రతీ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో సంబంధిత సంవత్సరానికి రేటును నిర్ణయిస్తారు. చిన్న మొత్తాల పొదుపు పథకాల మాదిరే పీఎంవీవీవై పథకం రేట్లను కూడా సవరించాలని కేంద్రం తాజాగా నిర్ణయించడం గమనార్హం. పైగా గరిష్ట రేటు 7.75 శాతానికే పరిమితం చేశారు. ఈ ఏడాది మార్చి వరకు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.6 శాతం వడ్డీ రేటుతో అత్యంత ఆకర్షణీయమైన సాధనంగా ఉండేది. కానీ, ఇటీవలే కేంద్రం ఈ రేటును 7.4 శాతానికి తగ్గించేసింది. దీనికి తగినట్టుగానే పీఎంవీవీవై పథకంలో రేటును గతంలో ఉన్న 8 శాతం నుంచి 7.4 శాతానికి సవరించినట్టు అర్థం చేసుకోవాలి. దీంతో రాబడుల పరంగా రెండు పథకాల మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. పోస్టాఫీసు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత మూడేళ్లు కొనసాగించుకోవచ్చు. పీఎంవీవీవైతో పోలిస్తే తక్కువ కాల వ్యవధి ఉండడం ఇందులోని సౌలభ్యం. పన్ను బాధ్యతలు.. పీఎంవీవీవైలో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు లేవని గుర్తుంచుకోవాలి. ఈ పథకంలో అయినా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో అయినా అందుకునే రాబడి వ్యక్తిగత ఆదాయానికి కలుస్తుంది. ఎవరికి వారే తమ వ్యక్తిగత ఆదాయ శ్లాబు ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే అందుకునే ఆదాయం మొత్తం రూ.50వేలు మించకపోతే సెక్షన్ 80టీటీబీ కింద సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో పన్ను రాయితీ పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు పెట్టుబడుల్లో రూ.1.50 లక్షల మొత్తంపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ రెండింటిలో ఏ పథకంలో అయినా గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలుగానే ఉంది. కనుక ఒక పథకంలో రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయగా, ఇంకా అదనంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే రెండో పథకాన్ని ఎంచుకోవచ్చు. ముందుగా వైదొలగాలంటే.. పీఎంవీవీవై పదేళ్ల కాల వ్యవధి పథకం. అసాధారణ పరిస్థితుల్లో పదేళ్లకు ముందుగానే పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఉంది. ఉదాహరణకు.. ప్రాణాంతక, తీవ్ర వ్యాధుల్లో చికిత్సల కోసం పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు. పాలసీదారు, ఆమె లేదా అతని జీవిత భాగస్వామి చికిత్సల ఖర్చుల కోసం ఇం దుకు అనుమతిస్తారు. ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 98% సరెండర్ వ్యా ల్యూగా లభిస్తుంది. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత నుంచి రుణం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పెట్టుబడి మొత్తం విలువలో 75% వరకు రుణ అర్హత ఉంటుంది. ఎల్ఐసీయే రుణ సదుపాయం కల్పిస్తుంది. ఇచ్చిన రుణానికి చెల్లించాల్సిన మొ త్తాన్ని పెన్షన్ చెల్లింపుల నుంచి మినహాయించుకుంటుంది. గడువు తీరే వరకు ఆ రుణం బకాయిలు మిగిలి ఉంటే.. చివరిగా చేసే చెల్లిం పుల మొత్తం నుంచి ఆ మేరకు మినహాయించుకోవడం జరుగుతుంది. లుకప్ పీరియడ్.. పీఎంవీవీవైలో ఇన్వెస్ట్ చేసిన వారు తమకు పథకం వివరాలు నచ్చకపోతే 15 రోజుల్లోపు (ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేసిన వారికి 30 రోజులు) వెనక్కిచ్చేయవచ్చు. దీన్నే లుకప్ పీరియడ్‌గా పేర్కొంటారు. స్టాంప్ చార్జీల మేరకు నష్టపోవాల్సి వస్తుంది. చార్జీలు ఉన్నాయ్.. పీఎంవీవీవైలో పెట్టుబడులపై తొలి ఏడాది 0.50 శాతాన్ని వ్యయాల కింద కోసుకునేందుకు వీలుంది. రెండో ఏడాది నుంచి తదుపరి తొమ్మిదేళ్లు ఈ చార్జీ 0.3 శాతంగా అమలవుతుంది. అయితే, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో ఈ విధమైన చార్జీలు ఏవీ ఉండవు. కనుక రెండింటిలో ఒకటే కోరుకునేట్టు అయితే.. మూడు నెలలకు ఓసారి పెన్షన్ వచ్చినా ఇబ్బంది లేదనుకునే వారికి.. పీఎంవీవీవైతో పోలిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ బెటర్. పూర్తి భద్రత.. ఈ పథకంలో పెట్టుబడులు, రాబడులకు పూర్తి భద్రత ఉంటుంది. ఎందుకంటే ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. -
‘నీట్’ దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) దరఖాస్తు గడువును ఈ నెల 6 వరకు పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) బుధవారం నిర్ణయించింది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఆరోజు రాత్రి 11.50 గంటల వరకు తెరిచి ఉంచుతామని పేర్కొంది. వాస్తవంగా 2020–21కు సంబంధించి నీట్ పరీక్ష కోసం గత నెల 31 వరకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు. తాజా నిర్ణయంతో ఇప్పటివరకూ దరఖా స్తులు చేయనివారు ఇప్పుడు సమర్పించవచ్చని ఎన్టీఏ తెలిపింది. అయితే పరీక్షా షెడ్యూల్లో ఏ మార్పులూ ఉండవని తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు ఫారాలను ఈ నెల 15 నుంచి 31 వరకు సవరించుకోవచ్చు. నీట్ పరీక్ష మే నెల 3న నిర్వహిస్తారు. అనంతరం జూన్ 4న ఫలితాలు విడుదల చేస్తారు. ఇంగ్లీష్, హిందీతో సహా 11 భాషల్లో ఈ పరీక్ష జరుగుతుంది. ఈసారి ఎయిమ్స్, జిప్మర్ ఎంబీబీఎస్ కోర్సులలో ప్రవేశానికి కూడా నీట్ పరీక్ష రాయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 2,546 పరీక్షా కేంద్రాలు దేశవ్యాప్తంగా 154 నగరాల్లోని 2,546 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూలోనూ పరీక్ష ఉంటుంది. గతేడాది తెలంగాణ నుంచి 48,996 విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా, అందులో 33,044 మంది అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదేస్థాయిలో విద్యార్థులు నీట్ పరీక్ష రాసే అవకాశముందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు చెబుతున్నారు. -
రుణాల దరఖాస్తులకు 25 వరకూ గడువు
ఏలూరు (మెట్రో): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, 10 బీసీ ఫెడరేషన్లకు సంబంధించిన రుణాలకు దరఖాస్తుల గడువును ఈనెల 25వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఎటువంటి లబ్ధి పొందని వారు ఏపీ–ఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండల, మునిసిపల్, జిల్లా కమిటీల స్థాయిలో వివిధ కార్పొరేషన్ల నియమాలను అనుసరించి లక్ష్యాల మేరకు ప్రాథమిక ఎంపిక చేసి పథకాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3,500 మందికి రూ.54.40 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 248 మందికి రూ.2.88 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా 1,974 మందికి రూ.39.48 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 240 మందికి రూ.2.40 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 295 మందికి రూ.1.45 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్ల ద్వారా 196 గ్రూపుల్లో 2,945 మందికి రూ.58.90 కోట్లు, కాపు కార్పొరేషన్ ద్వారా 7,000 మందికి రూ.140 కోట్లు, కాపు గ్రూప్సు ద్వారా వేయి గ్రూపులకు రూ.50 కోట్లు మొత్తం 17,202 మందికి రు.349.51 కోట్ల రుణ లక్ష్యాన్ని నిరే్ధశించినట్టు కలెక్టర్ వివరించారు. -
పదో తరగతి 'తత్కాల్ ఫీజు' గడువు పొడిగింపు
హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు తత్కాల్ స్కీమ్ కింద పరీక్ష ఫీజు చెల్లించే గడువును ఈ నెల 18 వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తత్కాల్ స్కీము కింద రూ.1000 ఆలస్య రుసుముతో పదో తరగతి పరీక్ష ఫీజును చెల్లించవచ్చని సూచించారు. రెగ్యులర్, ఒకసారి ఫెయిలైనవారు, ప్రైవేటు అభ్యర్ధులు ఈ తత్కాల్ స్కీమ్ కింద దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
ఎడ్‌సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎడ్‌సెట్-2015 ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 7 నుంచి ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి.ప్రసాద్ తెలిపారు. రూ. 500 అపరాధ రుసుముతో ఈ నెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎడ్‌సెట్ జూన్ 6న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు.