రుణాల దరఖాస్తులకు 25 వరకూ గడువు
Published Wed, Oct 19 2016 2:11 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
ఏలూరు (మెట్రో): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, క్రిస్టియన్, 10 బీసీ ఫెడరేషన్లకు సంబంధించిన రుణాలకు దరఖాస్తుల గడువును ఈనెల 25వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. 2013 నుంచి సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఎటువంటి లబ్ధి పొందని వారు ఏపీ–ఓబీఎంఎంఎస్ ద్వారా వారి పేరును ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మండల, మునిసిపల్, జిల్లా కమిటీల స్థాయిలో వివిధ కార్పొరేషన్ల నియమాలను అనుసరించి లక్ష్యాల మేరకు ప్రాథమిక ఎంపిక చేసి పథకాలు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3,500 మందికి రూ.54.40 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 248 మందికి రూ.2.88 కోట్లు, బీసీ కార్పొరేషన్ ద్వారా 1,974 మందికి రూ.39.48 కోట్లు, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ద్వారా 240 మందికి రూ.2.40 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 295 మందికి రూ.1.45 కోట్లు, 10 బీసీ ఫెడరేషన్ల ద్వారా 196 గ్రూపుల్లో 2,945 మందికి రూ.58.90 కోట్లు, కాపు కార్పొరేషన్ ద్వారా 7,000 మందికి రూ.140 కోట్లు, కాపు గ్రూప్సు ద్వారా వేయి గ్రూపులకు రూ.50 కోట్లు మొత్తం 17,202 మందికి రు.349.51 కోట్ల రుణ లక్ష్యాన్ని నిరే్ధశించినట్టు కలెక్టర్ వివరించారు.
Advertisement
Advertisement