![tspsc group 1 application date extended two days - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/14/TSPSC.jpg.webp?itok=Mv419ObQ)
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడగించినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు బుధవారం టీఎస్‌పీఎసస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 భర్తీకి అభ్యర్థుల దరఖాస్తు గడువు.. అధికారికంగా నేటితో ముగియనుంది.
ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ మరో రెండు రోజులు గడువు పెంచింది. మొత్తం 563 పోస్టులకు ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేయగా.. మార్చి 13వ తేదీ వరకు సుమారు 2.70 లక్షల మంది గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment