Group - 1
-
రేపట్నుంచి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి (అక్టోబర్21) 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుంది. హైరరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద గూమికూడవద్దంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు. -
గ్రూప్-1: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-1 పంచాయితీ మళ్లీ హైకోర్టుకు చేరింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ గ్రూప్-1 అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు.కాగా ఈనెల 15న సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ముగ్గురు అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు వెళ్లారు. దీంతో మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.సుప్రీంలోనూ పిటిషన్తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థి పీ రాంబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా ప్రిలిమ్స్ నుంచి మెయిన్ ఎగ్జామినేషన్‌ను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అందరికీ వర్తింపజేయాలని కోరారు. ఓపెన్ కేటగిరీలో అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మెరిట్ విద్యార్థుల సంఖ్యను రిజర్వ్ కేటగిరి నుంచి మినహాయించవద్దని తెలిపారు. రిజర్వేషన్ కేటగిరి విద్యార్థుల పై ఇది ప్రభావం చూపుతుందని, సుప్రీంకోర్టు గత తీర్పులకు ఇది వ్యతిరేకమని పేర్కొన్నారు.అక్టోబర్ 21న మెయిన్స్ ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఈ కేసును త్వరగా విచారణ చేయాలని కోరారు. మెయిన్స్ ఎగ్జా మ్స్‌పై స్టే విధించకుండా ఈ కేసు పై నవంబర్ 20వ తేదీన తుది విచారణ జరపడం వల్ల విద్యార్థులకు అన్యాయమని అన్నారు. త్వరగా విచారణకు స్వీకరించాలని చీఫ్ జస్టిస్ కోర్టులో సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ మెన్షన్ చేశారు. అయితే సోమవారం విచారణ చేపడతామన్న సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం తెలిపింది.కాగా ఈనెల 15న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈనెల 21 నుంచి 27 వరకు యథావిధిగా మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు మళ్లీ కోర్టు మెట్లెక్కడంతో.. మెయిన్స్ పరీక్షల నిర్వహణపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి.మరోవైపు జీవో 29 రద్దుతోపాటు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ సంబంధిత అభ్యర్థులు గురువారం హైదరాబాద్‌లో ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. గాంధీనగర్‌లోని కెనరాబ్యాంకు సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ ఉద్యానంలో వారంతా ఆందోళన చేపట్టారు. అనంతరం ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. న్యాయం చేయాలంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు భారీగా మోహరించి వారిని అరెస్టు చేసేందుకు యత్నించడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ.. గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో 31 వేల మంది వరకు క్వాలిఫై అయితే.. 34 వేల మందిని మెయిన్స్ పరీక్షలను ఎలా అనుమతిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గ్రూప్-1పై న్యాయస్థానాల్లో ఉన్న కేసులు కొలిక్కివచ్చాకే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
TGPSC ఆఫీస్ ముందు పోస్టర్ల కలకలం
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలకు, గేట్లకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ, హైదరగూడలోని తెలుగు అకాడమీ ముందు గుర్తు తెలియని అగంతకులు పోస్టర్లను అతికించారు.ఆ పోస్టర్లలలో తెలుగు అకాడమి పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో వాటిని ఎవరు కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ముందు నేను ఒక నియంతని.. తప్పు జరిగితే ఒప్పుకోను అని పోస్టర్లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.అంతేకాదు గ్రూప్-1లో 150 ప్రశ్నలు తయారు చేయలేని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎందుకు అంటూ సిగ్గు..సిగ్గు, టీజీపీఎస్సీ తప్పులతో నిరుద్యోగులకు ఎన్ని తిప్పలో అంటూ పోస్టర్లు కనిపించాయి. పోస్టర్లపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లను ఎవరు అంటించారోనని ఆరా తీస్తున్నారు. -
గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్ : గ్రూప్–1పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గతంలో తెలంగాణ ప్రభుత్వం రెండోసారి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.పిటిషనర్ తరఫున జొన్నలగడ్డ సుధీర్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా..హైకోర్టు ప్రిలిమ్స్ మాత్రమే రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని పిటీషనర్ వాదించారు. ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10కి పెంచడానికి వీలులేదని తెలిపారు.అనంతరం, టీఎస్పీఎస్సీకి అన్ని అధికారలుంటాయని స్పెషల్ జీపీ (గవర్నమెంట్ ప్లీడర్)..చట్ట బద్ధంగా ఏర్పాటైన సంస్థ నియాకాల కోసం నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఇరుపక్ష వాదనల విన్న కోర్టు తదుపరి విచారణ సోమవారానికి (అక్టోబర్1కి) వాయిదా వేసింది. -
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి,హైదరాబాద్: టీజీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. 1:50 ప్రకారం మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. సెప్టెంబర్ 21 నుంచి 27వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఫలితాల కోసం క్లిక్ చేయండిఇదిలా ఉండగా.. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాల్లో 1:100 రేషియోతో అభ్యర్థుల ఎంపిక ఉండాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వం మాత్రం 1:50 రేషియాతో ఫలితాలను వెల్లడించడం గమనార్హం. -
జిల్లాకో నోడల్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఈ నెల 9న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పరీక్షకు 4.03 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్షల నిర్వహణలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్లతో పాటు ఒక పోలీసు ఉన్నతాధికారిని కూడా నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజినల్ కో ఆర్డినేటర్‌ను కూడా నియమించినట్లు చెప్పారు.రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లోని 897 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న ఈ పరీక్షల ఏర్పాట్లతో పాటు విత్తనాలు, ఎరువుల సరఫరా, మిషన్ భగీరథ, గ్రామాల్లో ఇంటింటి సర్వే, జిల్లాల్లో పాఠశాలలకు స్కూల్ యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై సీఎస్ గురువారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ని ర్వహించారు. గ్రూప్– 1 పరీక్షల ఏర్పాట్లను టీజీపీఎస్సీ చైర్మన్ ఎం.మహేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, క్షేత్రస్థాయి పరిస్థితిని నిశితంగా పరిశీలించేందుకు జిల్లా వ్యాప్తంగా పోలీసు, ఇతర అధికారులతో తక్షణమే సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. విత్తనాల బ్లాక్ మార్కెటింగ్‌పై నిఘా బ్లాక్ మార్కెటింగ్, విత్తనాల నిల్వలను అరికట్టడంలో చర్యలు తీసుకున్నందుకు జిల్లాల కలెక్టర్లను సీఎస్ అభినందించారు. రానున్న మూడు వారాల పాటు నిఘా కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్యాక్ చేసిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్ర గోడౌన్ల నుంచి మండల స్థా యి గోడౌన్ల వరకు ఎరువుల తరలింపును పర్యవేక్షించి సక్రమంగా అందేలా చూడాలని, పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయంతో పని చేసి పరిస్థితులను పర్యవేక్షించాలని ఆదేశించారు.ప్రతి విద్యారి్థకీ కనీసం జత యూనిఫాం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉందా? లేదా అనే విషయాన్ని నిర్ణిత గడువులోగా సర్వే చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు ప్రారంభించే నాటికి ప్రతి విద్యార్థికి కనీసం ఒక జత స్కూల్ యూనిఫాం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో డీజీపీ రవిగుప్తా, పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘు నందన్ రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ దివ్య, టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికొలస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 పరీక్ష దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడగించినట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. మరో రెండు రోజులు దరఖాస్తు చేసుకునేందుకు గడువును పొడిగించినట్లు బుధవారం టీఎస్పీఎసస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 భర్తీకి అభ్యర్థుల దరఖాస్తు గడువు.. అధికారికంగా నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ మరో రెండు రోజులు గడువు పెంచింది. మొత్తం 563 పోస్టులకు ప్రభుత్వం నోటీఫికేషన్ విడుదల చేయగా.. మార్చి 13వ తేదీ వరకు సుమారు 2.70 లక్షల మంది గ్రూప్-1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
2018 గ్రూప్-1 రద్దు తీర్పు.. ఆందోళన వద్దన్న ఏపీ ప్రభుత్వం
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) 2018లో నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మెయిన్స్‌ను మళ్లీ ఆరు నెలల్లోపు నిర్వహించాలంటూ బోర్డుకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉద్యోగులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం భరోసా ఇస్తోంది. 2018లో 167 పోస్టులతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఏపీపీఎస్సీ. అయితే.. డిజిటల్ ఎవాల్యూయేషన్ తర్వాత రెండుసార్లు మూల్యాంకన చేశారంటూ హైకోర్టుని అశ్రయించిన కొందరు అభ్యర్ధులు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఎపీపీఎస్సీ వాదించింది. ఈ క్రమంలో ఇరువర్గాల వాదనల అనంతరం.. మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందేనని జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఆదేశాలిచ్చారు అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరతామని అంటోంది. ఈ క్రమంలో.. ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్తామని ప్రకటించింది. -
ఆగస్టు 7, 8న గ్రూప్–2
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1, 2, 3 కేటగిరీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఆయా ఉద్యోగ పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఏడాది చివరినాటికల్లా గ్రూప్ సర్వీసులకు సంబంధించి అన్నిరకాల అర్హత పరీక్షలను పూర్తి చేసేలా ఈ షెడ్యూల్‌ను రూపొందించింది. ఇటీవల గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీచేసిన టీఎస్పీఎస్సీ.. ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జూన్ 9న నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ గ్రూప్–1 నోటిఫికేషన్‌కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21వ తేదీ నుంచి నిర్వహించనున్నట్టు తాజాగా వెల్లడించింది. ఇక పెండింగ్‌లో ఉన్న గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షల తేదీలను కూడా ఖరారు చేసింది. పెండింగ్‌లో ఉన్న పరీక్షల్లో.. టీఎస్పీఎస్సీ 2022 డిసెంబర్లో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి దరఖాస్తుల స్వీకరణ ముగిసినా.. పరీక్షల నిర్వహణ ముందుకు సాగలేదు. అభ్యర్థులు సన్నద్ధతకు సమయం కోరడం, పలు ఇతర కారణాలతో ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్‌ను దాదాపు మూడుసార్లు మార్చింది. ఇక 2022 ఏప్రిల్‌లో గ్రూప్–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన టీఎస్పీఎస్సీ.. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. డిసెంబర్ నాటికి ఫలితాల ప్రకటనతోపాటు 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను కూడా ప్రకటించింది. కానీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో ఆ గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దయింది. గత ఏడాది జూన్‌లో మరోమారు ప్రిలిమ్స్‌ను నిర్వహించినా.. పరీక్షల నిర్వహణలో లోపాలపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. రెండోసారి కూడా రద్దయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏర్పాటైన కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టింది. టీఎస్పీఎస్సీలో మార్పులు చేయడంతోపాటు ఆ గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. తాజాగా గత నెల 19న 563 పోస్టులతో కొత్తగా గ్రూప్–1 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీనికి ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇన్నాళ్లూ పరీక్షల రద్దు, ఇతర అంశాలతో అభ్యర్థులు నిరాశలో ఉన్న నేపథ్యంలో.. ఉత్సాహం నింపేలా టీఎస్పీఎస్సీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పరీక్షల నిర్వహణ తేదీలతో షెడ్యూల్‌ను విడుదల చేసింది. సన్నద్ధతకు సమయం టీఎస్పీఎస్సీ ముందస్తుగా గ్రూప్ ఉద్యోగాల అర్హత పరీక్షల తేదీలను ప్రకటించడంపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని పరీక్షలకు అభ్యర్థులు పలుమార్లు సన్నద్ధం కావాల్సి వచ్చింది. ఆయా పరీక్షలు జరగలేదు. ఈ క్రమంలో షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఏయే పరీక్షలకు ఏవిధంగా సన్నద్ధం కావొచ్చనే దానిపై అభ్యర్థులు వ్యూహాత్మక ప్రణాళిక తయారు చేసుకునే వీలు కల్పించినట్టు అయిందని నిపుణులు చెప్తున్నారు. ఈ ఏడాది మే లేదా జూన్ నెలలో గ్రూప్–1 ప్రిలిమ్స్ జరగనుంది. అంటే ఈ పరీక్షలకు మూడు, నాలుగు నెలల వ్యవధి లభించింది. తర్వాత గ్రూప్–2 పరీక్షలకు మరో రెండు నెలల సమయం ఉంది. ఆ తర్వాత గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు రెండు నెలల వ్యవధి ఉండటంతో సిద్ధమయ్యేందుకు వీలవనుంది. ఇక గ్రూప్–1 మెయిన్స్ తర్వాత నెల రోజులకు గ్రూప్–3 పరీక్షలు ఉన్నాయి. మొత్తంగా పరీక్షలకు సమయం సంతృప్తికర స్థాయిలో ఉందని, అభ్యర్థులు పక్కా ప్రణాళికతో సన్నద్ధం కావొచ్చని నిపుణులు సైతం సూచిస్తున్నారు. -
TSPSC: జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇటీవలే 563 పోస్టులకు గ్రూప్-1 నోటిఫికేషన్ రిలీజ్ కాగా.. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. దానికి అదనంగా మరిన్ని పోస్టులను చేర్చి కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవల.. ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం ఈ నెల 23 నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కమిషన్ వెల్లడించింది. మార్చి 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇప్పటికే అభ్యుర్థులు పెద్ద ఎత్తున గ్రూప్-1 పరీక్షలకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. చదవండి: గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్.. 563 ఖాళీల భర్తీ -
గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
-
తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనలో టీఎస్పీఎస్సీ పేర్కొంది. 563 పోస్టులకు టీఎస్పీఎస్సీ తిరిగి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ పేర్కొంది. మళ్లీ అభ్యర్థులుందరూ.. కొత్త నోటిఫికేషన్‌కు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. మే లేదా జూన్‌లో ప్రిలిమినరీ పరీక్ష.. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మెయిన్స్ పరీక్ష జరగునున్నట్లు తెలుస్తోంది. ఇక.. అభ్యర్థుల వయోపరిమితిని తెలంగాణ ప్రభుత్వం 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. చదవండి: తెలంగాణ పాత గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు -
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
-
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు అయింది. గత ప్రభుత్వం విడుదల చేసిన పాత నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ సోమవారం రద్దు చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక.. త్వరలో 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల మరో 60 గ్రూప్-1 పోస్టులకు సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గ్రూప్-1కు సంబంధించి పూర్తి వివరాలపై కమిషన్ విచారణ జరుపుతోంది. గత ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌ను ప్రజాప్రయోజనాల దృష్ట్యా రద్దు చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. పూర్తిస్థాయి విచారణ తర్వాత మళ్లీ నిర్ణయం తీసుకుంటామని కమిషన్ వెల్లడించింది. ఇక.. రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీక్ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. చదవండి: సీఎం రేవంత్ కొత్త జీవోను వ్యతిరేకిస్తూ.. సోనియాకు ఎమ్మెల్సీ కవిత లేఖ -
60 గ్రూప్–1 పోస్టులకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 కేటగిరీలో మరో 60 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక, హోం, కార్మిక, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల పరిధిలో ఈ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేందుకు అనుమతినిస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు మంగళవారం జీఓ నం.16 జారీ చేశారు. నోటిఫికేషన్ జారీ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోస్టుల వారీగా వివరాలు -
AP: గ్రూప్-1 దరఖాస్తు స్వీకరణకు గడువు పొడిగింపు
సాక్షి, విజయవాడ: రాష్ట్ర స్థాయిలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా గ్రూప్-1 దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 28 వరకు పొడిగించినట్లు తెలిపింది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుని, ఓటీపీఆర్‌తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో మార్చి 17న ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నట్టు సర్వీస్ కమిషన్ పేర్కొంది. కమిషన్ ప్రకటించిన గ్రూప్-1 విభాగంలో 9 డిప్యూటీ కలెక్టర్లు, 18 అసిస్టెంట్ ట్యాక్స్ కమిషనర్స్ పోస్టులు, 26 డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్స్, ఆర్టీవో, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్స్, జిల్లా బీసీ సంక్షేమ వంటి ఉన్నత స్థాయి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ 1 ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు సైతం ఆఫ్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహించనున్న విషయం తెలిసిందే చదవండి: AP: ESMSపై కొనసాగుతున్న శిక్షణ కార్యక్రమం -
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై హైకోర్టులో విచారణ
-
597 గ్రూప్–1, గ్రూప్–2 పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వివిధ శాఖల్లో 89 గ్రూప్–1, 508 గ్రూప్–2 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) చిరంజీవి చౌధరి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ఈ పోస్టులను నేరుగా భర్తీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వ్యవసాయ, సహకార, బీసీ సంక్షేమం, ఆర్థిక, హోం, మున్సిపల్ పరిపాలన, రెవెన్యూ, సాంఘిక సంక్షేమం, రవాణా, రహదారులు–భవనాల శాఖల్లో గ్రూప్–1 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్థిక, సాధారణ పరిపాలన, న్యాయ, లేజిస్లేచర్ తదితర శాఖల్లోనూ గ్రూప్–2 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–1లో అత్యధికంగా హోంశాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్–కేటగిరి–2లో 25 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్–2 కేటగిరీలో రాష్ట్ర సచివాలయంలో అత్యధికంగా 161 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. సంబంధిత శాఖలు ఆయా పోస్టుల వివరాలతో పాటు జోన్, జిల్లాల వారీగా ఖాళీలతో పాటు రోస్టర్ పాయింట్స్, విద్యార్హత వివరాలను వెంటనే ఏపీపీఎస్సీకి సమర్పించాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
గ్రూప్-1 ఫలితాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
-
గ్రూప్-1 ఫలితాలు సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ: గ్రూపు 1 పరీక్షల కేసును సోమవారానికి వాయిదా వేసింది హై కోర్టు. సోమవారం అడ్వకేట్ జనరల్ తన వాదనలు కోర్టుకు వినిపిస్తారని తెలిపారు AGP. కేసు ఇంకా విచారణ దశలోనే ఉన్నందున గ్రూప్ 1 పరీక్ష ఫలితాలు వెలువరించడంలో తొందరపడొద్దని, సోమవారం వరకు ఫలితాలను ప్రకటించవద్దని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తినప్పటికీ టీఎస్పీఎస్సీ అన్నిటినీ అధిగమించి పరీక్షలనైతే నిర్వహించింది కానీ అడుగడుగునా ఈ వ్యవహారం వారికి అగ్నిపరీక్షలా మారింది. తాజాగా ఎన్ ఎస్ యూఐ తోపాటు మరికొంత మంది అభ్యర్దులు గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో బయోమెట్రిక్ పెట్టలేదంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణ దశలో ఉండగానే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు ఫలితాలు ప్రకటించకుండా స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్ధించారు పిటిషనర్లు. దీంతో తదుపరి విచారణ జరిగే వరకు గ్రూప్ 1 ఫలితాలు ప్రకటించవద్దని హై కోర్ట్ ఓరల్ ఆర్డర్ జారీ చేసింది. -
ఏపీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 111 గ్రూపు-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుండి ఎంపికయ్యారు. గ్రూప్-1 పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ . జూన్ 3 నుండి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా వారిలో నుండి 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో మూల్యాంకనం స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది. ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు లక్షన్నర మంది డుమ్మా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు ఏకంగా దాదాపు 1.47 లక్షల మంది గైర్హాజరయ్యారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3,09,323 మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని... కానీ వారిలోనూ 2,33,248 మంది అభ్యర్థులే (61.37 శాతం మందే) హాజరైనట్లు టీఎస్పీఎస్సీ ప్రాథమికంగా వెల్లడించింది. గతేడాది నిర్వహించి పేపర్ లీకేజీ వల్ల రద్దు చేసిన ప్రిలిమ్స్‌కు 2.86 లక్షల మంది (79.15శాతం) హాజరవగా ఈసారి వారి సంఖ్య అనూహ్యంగా తగ్గింది. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగానికి పొందేందుకు మళ్లీ అవకాశం వచ్చినా దాన్ని వేలాది మంది సది్వనియోగం చేసుకోలేకపోవడం గమనార్హం. కరెంట్ అఫైర్స్, ఎకానమీ నుంచి లోతైన ప్రశ్నలు.. ప్రశ్నపత్రం కాస్త కఠినంగానే ఉందని అభ్యర్థులు, నిపుణులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్‌లో ఇచ్చిన ప్రశ్నపత్రంతో పోలిస్తే కాస్త సులభంగా ఉన్నప్పటికీ మెజారిటీ ప్రశ్నలు కఠినంగా వచ్చాయని చెప్పారు. యూపీఎస్సీ ప్రమాణాలకు మించి ప్రశ్నలను ఇచ్చినట్లు మరికొందరు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరెంట్ ఆఫైర్స్, ఎకానమికీ సంబంధించి అడిగిన ప్రశ్నలు చాలా లోతుగా ఉన్నాయన్నారు. అభ్యర్థులు సాధారణంగా రెండున్నర గంటల్లో 150 ప్రశ్నలకు జవాబిచ్చేలా... సగటున ఒక్కో ప్రశ్నకు ఒక్కో నిమిషం చొప్పున సమయం కేటాయించేలా ప్రశ్నలు ఉండాల్సి ఉండగా ఈసారి ప్రశ్నపత్రంలో ఒక్కో ప్రశ్నను చదివి అవగాహన చేసుకునేందుకే కనీసం రెండు నిమిషాలు పట్టిందని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ క్రమంలో పూర్తిస్థాయిలో ప్రశ్నలు చదివి జవాబులు ఇవ్వడం కష్టమైందని పలువురు అభ్యర్థులు అభిప్రాపడ్డారు. చాలా ప్రశ్నలకు మల్టి పుల్ జవాబులు ఉండటం అయోమయానికి గురిచేసిందని చెప్పారు. ఈసారి కటాఫ్ 70 నుంచి 75 మార్కుల మధ్యలో ఉండొచ్చని ప్రముఖ నిపుణురాలు బాలలత సామాజిక మాధ్యమంలో పోస్టు చేసిన వీడియోలో అభిప్రాయపడ్డారు. అయితే జోన్లవారీగా, కేటగిరీల వారీగా ఎంపిక ప్రక్రియ ఉండటంతో కటాఫ్ తగ్గుతుందన్నారు. కమిషన్ విడుదల చేసే ప్రాథమిక కీ అనంతరం కటాఫ్‌పై అంచనాలు వేసుకోవచ్చని, ప్రస్తుతానికి 75 మార్కులకు పైబడి వచ్చిన వారు మెయిన్ పరీక్షలకు సిద్ధం కావచ్చని చెప్పారు. ముందే బయటకు వచ్చిన అభ్యర్థిపై ఎఫ్ఐఆర్ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్లో తన హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా బబ్లింగ్ చేసినందుకు హాలు నుంచి సమయం కంటే ముందే బయటకు వచ్చేశాడు. దీంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని ఓ పరీక్షా కేంద్రంలో ప్రశ్నపత్రాలు తక్కువగా రాగా వాటిని అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా సర్దుబాటు చేసేందుకు 14 నిమిషాల సమయం ఆలస్యమైంది. ఆ మేరకు ఆయా అభ్యర్థులకు సమయాన్ని సర్దుబాటు చేశారు. కాగా, రంగారెడ్డి జిల్లాలోని ఓ కేంద్రంలో అరగంటకన్నా ముందే పేపర్లు తీసుకున్నారంటూ కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణ నిజం కాదని జిల్లా కలెక్టర్ హరీశ్ స్పష్టం చేశారు. -
ప్రిలిమ్స్ వాయిదా లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఇప్పుడు వాయిదా కోరుతూ పిటిషన్లు వేయడం సరికాదంది. ఆ పిటిషన్లను కొట్టివేసింది. పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్పీఎస్సీ సిబ్బందిలో ఎంతమందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. యూపీఎస్సీతో పరీక్ష నిర్వహించాలి.. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు.. కొనసాగుతోంది. కమిషన్‌లో పనిచేసే వారికి లీకేజీతో సంబంధం ఉందని కొందరిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు పూర్తి అయితేగానీ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తోంది. 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్–1 కోసం ఎదురుచూశారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో అధికారుల నియామకం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత కమిషన్ ఆధ్వర్యంలో పరీక్ష సాగుతున్నప్పుడే లీకేజీ జరిగింది. అలాంటప్పుడు అదే కమిషన్ తిరిగి ఎలా పరీక్ష నిర్వహిస్తుంది? యూపీఎస్సీ లాంటి ఏదైనా థర్డ్ పార్టీ కమిషన్‌తో నిర్వహిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం, అభ్యంతరం ఉండదు. ’అని అవినాశ్ దేశాయ్ తెలిపారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ‘పేపర్ లీకేజీ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి పరీక్షలను రద్దు చేసింది. ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీలోని ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు లీకేజీతో సంబంధం ఉందని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. వారిని దర్యాప్తు అధికారులు అరెస్టు కూడా చేశారు. పరీక్ష రద్దు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే త్వరగా నిర్వహించమని అడగాలి తప్ప.. వాయిదా కోరడం సరికాదు. జూన్ 11న పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3.18 లక్షల మంది గ్రూప్–1కు దరఖాస్తు చేయగా, ఇప్పటికే 1.13 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతావారు కూడా ఒకట్రెండు రోజుల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 995 సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదు...’ అని బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే ఆదివారమే పరీక్ష ఉన్న నేపథ్యంలో వాయిదా వేయలేమని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెడీ
-
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు రెడీ
-
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. గ్రూప్-1 పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గ్రూప్-1 వాయిదా పిటిషన్‌పై కోర్టుకు అడ్వకేట్ జనరల్ హాజరయ్యారు. 36 మంది అభ్యర్థుల కోసం 3 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తు పణంగా పెట్టగలమా అన్న ఏజీ.. పరీక్షలు సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు.. విచారణను నాలుగు వారాల పాటు కోర్టు వాయిదా వేసింది. గతేడాది అక్టోబర్‌లో గ్రూప్ వన్ పరీక్ష జరిగింది. ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే.. పేపర్ లీక్ వ్యవహారంతో గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు చేసింది టీఎస్పీఎస్సీ. తిరిగి జూన్ 11 న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈలోపు పరీక్ష వాయిదా కోరుతూ 36 మంది అభ్యర్థులు కోర్టుకెక్కడం గమనార్హం. -
అమ్ముడైంది 40లక్షలకు.. అందింది 23లక్షలు!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ‘ఆర్థికాంశాలు’ కొలిక్కివచ్చాయి. ఈ పత్రాల విక్రయంలో కేతావత్ రాజేశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నియామక పరీక్షకు సంబంధించిన మూడు ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు విక్రయించారని, ఇప్పటికే నిందితులకు రూ.23 లక్షలు ముట్టగా మిగతా సొమ్ము పరీక్ష ఫలితాలు వచ్చాక ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇందులో ఇప్పటికే రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్లను పంచుకున్నారే తప్ప అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ అట్ల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ పేపర్లు తస్కరించినట్లు ఇప్పటికే సిట్ స్పష్టం చేసింది. ఏఈ పరీక్ష పేపర్లను ప్రవీణ్ తన స్నేహితురాలైన రేణుక రాథోడ్, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు ఇచ్చాడు. నమ్మకమైన వారికే వీటిని విక్రయించాలని చెప్పాడు. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. డాక్యా ఈ పేపర్ల గురించి సమీప బంధువైన కేతావత్ రాజేశ్వర్‌కు చెప్పాడు. ఇతడు ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారానే గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ.40 లక్షలకు విక్రయించాడు. వీరి నుంచి రూ.23 లక్షలు వసూలు చేసిన రాజేశ్వర్.. అందులోంచి డాక్యాకు రూ.10 లక్షలిచ్చాడు. తన వాటాగా వచ్చిన దీని నుంచి ఇతగాడు మరో రూ.5 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్ తన వద్దకు వచ్చిన డబ్బులోంచి (మొత్తం రూ.10 లక్షలు) రూ.4 లక్షలు ఇంట్లోనే ఉంచుకుని, రూ.3.5 లక్షలు తన సమీప బంధువుకు ఇచ్చాడు. ఓ బీమా పాలసీకి సంబంధించి రూ.1.2 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇతర ఖర్చులకు వాడేశాడు. ఈ సొమ్ములో సిట్ అధికారులు రూ.7.5 లక్షలు రికవరీ చేశారు. గ్రామానికి రూ.8 లక్షలు వెచ్చించిన రాజేశ్వర్ గతంలో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్ నష్టాలు రావడంతో ఆపేశాడు. ఇతడి తల్లి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా ఉన్నారు. ఈమె తరఫున గ్రామంలో అభివృద్ధి పనులను ఇతడే పర్యవేక్షిస్తుంటాడు. పేపర్లు విక్రయించగా వచ్చిన మొత్తంలో డాక్యాకు ఇచ్చింది మినహా మిగిలింది తన వద్దే ఉంచుకున్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చేతికందే రూ.17 లక్షల నుంచి మిగిలిన వారికి వాటాలు ఇవ్వాలనుకున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ములో రూ.8 లక్షలు వెచ్చించి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మంజూరు చేశాక ఆ మొత్తం తాను తీసుకోవాలని భావించాడు. నిందితుడి విచారణలో సిట్ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బిల్లులకు సంబంధించిన మొత్తం తమకు అందేలా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని సీజ్ చేసి కోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు నోటీసులు ఇవ్వకుండా... సిట్ అధికారులు శనివారం కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చైర్మన్ ఆధీనంలోనే పని చేస్తుంది. ఈ స్కామ్ మొత్తం ప్రశ్నపత్రాలకు సంబంధించిందే కావడంతో చైర్మన్ వాంగ్మూలం నమోదు అనివార్యంగా మారింది. అయితే కార్యదర్శి, సభ్యులు, ఉన్నతోద్యోగుల మాదిరిగా చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ పోస్టు రాజ్యాంగ బద్ధమైంది కావడంతోపాటు ప్రస్తుత చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడానికి బదులు స్టేట్మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సోమవారమే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
Telangana: 15 పేపర్లు అవుట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించి ఏకంగా 15 క్వశ్చన్ పేపర్లు ముందే బయటకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. గ్రూప్–1 పేపర్ లీక్ ఐదుగురికే పరిమితమైందని, ఏఈ ప్రశ్నపత్రం పలువురికి విక్రయించారని, మిగతావి పెన్‌డ్రైవ్‌కే పరిమితమైనట్లు స్పష్టమైంది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు తస్కరించేందుకు కూడా నిందితులు పథకం వేసినట్లు బయటపడింది. అన్నీ మాస్టర్ ప్రశ్నపత్రాలే.. ఈ స్కామ్‌లో సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ పీఏ ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో పాటు 13 మంది నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. గతేడాది అక్టోబర్ మొదలు గత నెల ఆఖరి వారం వరకు సాగిన ఈ లీకేజ్ వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్‌ను ప్రవీణ్.. సురేష్, రమేష్‌లకు కూడా ఇచ్చాడు. రాజశేఖర్‌రెడ్డి.. షమీమ్‌కు, న్యూజిలాండ్‌లో ఉండే తన సమీప బంధువు ప్రశాంత్ రెడ్డికి ఇచ్చాడు. ఈ ఐదుగురికి మినహా మరెవరికీ ఈ ప్రశ్నపత్రం చేరినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. గత నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పత్రాలు నీలేష్, గోపాల్, ప్రశాంత్, రాజేంద్రకుమార్ ఖరీదు చేశారని తేల్చారు. వీరి ద్వారా మరికొందరికి చేరే అవకాశాలు తక్కువని చెప్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మొత్తం ఆరు పోస్టులకు సంబంధించిన పరీక్షల పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) టౌన్ ప్లానింగ్ బిజినెస్ ఓవర్సీర్ (టీపీబీఓ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని, ఇవన్నీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లని సిట్ అధికారులు చెప్తున్నారు. వీటిల్లో ఆయా ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. ఈ కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు తీసుకున్నవారు, ఏఈ పేపర్‌ను ఖరీదు చేసిన వారు.. సిద్ధం కావడం తేలికైంది. లేనిపక్షంలో సమాధానాలు వెతుక్కోవడానికి, ఆపై సిద్ధం కావడానికి మరికొంత సమయం అవసరమై ఉండేదని అంటున్నారు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు కొట్టేసేందుకూ ప్లాన్ గ్రూప్–1, ఏఈఈ మినహా మిగిలినవి ప్రవీణ్ వద్దే ఉండిపోయాయని, ఖరీదు చేసే వాళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే స్కామ్ వెలుగు చూసిందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబం«ధించిన పేపర్లు కూడా కస్టోడియన్ కంప్యూటర్ నుంచి తస్కరించాలని పథకం వేశారని, ఈ మేరకు షమీమ్, సురేష్, రమేష్, ప్రశాంత్‌రెడ్డిలకు సమాచారం ఇచ్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 8 గంటల పాటు విచారణ పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌లను సిట్ పోలీసులు రెండోరోజు గురువారమూ 8 గంటల పాటు ప్రశ్నించారు. ఎల్బీనగర్, సైదాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోని వారివారి ఇళ్లకు వెళ్లి ఆధారాల కోసం సోదాలు చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి మాస్టర్ ప్రశ్నపత్రాల కాపీలు స్వాధీనం చేసుకున్నారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం గురువారం మరోసారి నమోదు చేశారు. ఆ 15 ప్రశ్నపత్రాల జాబితా ఇది... 1. గ్రూప్–1 జనరల్ స్టడీస్ 2. ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ 3. ఏఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4. ఏఈఈ మెకానికల్ ఇంజనీరింగ్ 5. డీఏఓ జనరల్ స్టడీస్ 6. డీఏఓ మేథమెటిక్స్ 7. జనరల్ స్టడీస్ డిప్లొమా ఏఈ 8. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 9. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 10. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 11. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 12. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 13. టీపీబీఓ ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్–1 14. టీపీబీఓ ఇంటర్మీడియట్ ఒకేషనల్ పేపర్–2 15. జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ -
AP: గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతం
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏపీపీఎస్సీ పకడ్బందీగా ఏర్పాట్లు చేయడంతో కేవలం ఒక్క చోట స్వల్ప ఘటన మినహా సజావుగా పూర్తయ్యాయి. 2022 గ్రూప్–1 పరీక్షకు 1,26,449 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీరిలో 1,06,473 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా 87,718 మంది (82.38 శాతం) పరీక్ష రాశారు. గతంలో జరిగిన 2018 గ్రూప్–1 పరీక్షకు 73 శాతం మంది పరీక్షకు హాజరు కాగా ఈసారి మరింత పెరిగింది. రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో ప్రిలిమ్స్ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రశ్నల సరళి ఎలా ఉందంటే...? ఈసారి నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో ప్రశ్నలు అత్యున్నత ప్రమాణాలతో ఆయా అంశాలపై అభ్యర్థుల సమగ్ర అవగాహన, పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉన్నాయని పలువురు నిపుణులు, అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఎక్కడా డైరెక్ట్ ప్రశ్నలు లేవన్నారు. ఈదఫా గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నలు సివిల్స్ తరహాలో ఉన్నాయని గతంలో గ్రూప్–1 పరీక్షకు హాజరు కావడంతోపాటు సివిల్స్‌లో సైతం ఇంటర్వ్యూ వరకు వెళ్లిన ఓ అభ్యర్థి తెలిపారు. పేపర్ 1లో ఇచ్చిన 120 ప్రశ్నల్లో ఆరు మినహా తక్కినవన్నీ ఆయా అంశాలపై పూర్తి అవగాహన ఉన్నవారే కచ్చితమైన సమాధానం రాయగలుగుతారని చెప్పారు. పేపర్ 1, 2లో ప్రశ్నలకు ఇచ్చిన బహుళైచ్చిక సమాధానాలన్నీ సరైనవే అన్నట్లుగా ఉన్నాయని విశాఖలో తొలిసారి ఈ పరీక్షకు హాజరైన ఓ యువతి పేర్కొంది. సబ్జెక్టుపై పూర్తి అవగాహనతోపాటు క్షుణ్ణంగా అర్థం చేసుకొన్న వారే సరైన సమాధానం గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగారని తెలిపారు. పేపర్ 1 కంటే పేపర్ 2లో ప్రశ్నలు కష్టం గా ఉన్నాయని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆప్టిట్యూడ్ ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుక్కోవడం ఇబ్బంది అయిందని మరో అభ్యర్థి పేర్కొన్నారు. పేపర్ 2 లో జనరల్ స్టడీస్ అంశాలు పూర్తిగా గత ఏడాదిలో చోటు చేసుకున్న పరిణామాల పరిధిలోనివేనని తెలిపారు. గతంలో అనువాదం సరిగాలేక తప్పులు దొర్లడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు నష్టం వాటిల్లిందని, ఈసారి మాత్రం తెలుగు అనువాదంలో ఎక్కడా తప్పులు దొర్లలేదని పలువురు అభ్యర్థులు వెల్లడించారు. 1 : 50లో మెయిన్స్‌కు అవకాశమివ్వాలని వినతి ఉన్నత ప్రమాణాలతో గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించారని, దీనివల్ల మంచి పరిజ్ఞానం, నైపుణ్యం ఉన్నవారు అర్హత సాధించగలుగుతారని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే మెయిన్స్‌కి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలని నిపుణులతో పాటు అభ్యర్థులు కోరుతున్నారు. గతంలో గ్రూప్–1 ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1 : 50 చొప్పున అనుమతించేవారు. అయితే టీడీపీ హయాంలో దాన్ని మార్పు చేసి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఏ మేరకు అభ్యర్థులను ఎంపిక చేయాలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని కమిషన్‌కి కట్టబెట్టారు. గత ప్రభుత్వ హయాంలో 2018 గ్రూప్–1లో 1 : 50 ప్రకారం కాకుండా 1 : 12కి తగ్గించి అభ్యర్థులకు మెయిన్స్‌కి అవకాశమిచ్చారు. దీనివల్ల అనేకమంది ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి అవకాశం లభించక నష్టపోయారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ బీసీ తదితర రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ వర్గాల అభ్యర్థులు మెరిట్ మార్కులతో జనరల్ కేటగిరీలో చేరాల్సి ఉన్నా వారిని కేవలం వారి కేటగిరీకే పరిమితం చేశారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తరువాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక అదే మెయిన్స్‌ను కోర్టు ఆదేశాలతో మళ్లీ నిర్వహించాల్సి రాగా 1 : 50 చొప్పున అవకాశం ఇచ్చారని అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. దీనివల్ల అంతకు ముందు అవకాశం కోల్పోయిన వారు మెయిన్స్ రాయడంతో పాటు అందులో మెరిట్లో నిలిచారని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి 1 : 50 ప్రకారం అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. విజయవాడలో పట్టుబడ్డ అభ్యర్థి: విజయవాడ బెంజి సర్కిల్ సమీపంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఆదివారం గ్రూప్–1 పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ ఓ అభ్యర్థిపై కేసు నమోదైంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పోరంకికి చెందిన కె.వెంకటేష్ లోదుస్తుల్లో దాచిన సెల్ఫోన్లో జవాబులు చూసి రాస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
రేపు ఏపీలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష
-
గూప్–1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ పిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలను రద్దు చేయాలని, మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది. ఈ ప్రశ్నలు రద్దు... గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ కోడ్–22040 ‘కీ’ని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు. మూడు ప్రశ్నలకు మారిన ఆప్షన్లు... ప్రిలిమినరీ పరీక్షలో 3 ప్రశ్నలకు జవాబులు మారాయి. 57వ ప్రశ్నకు జవాబు 1, 107వ ప్రశ్నకు జవాబులు 1, 2, 3, 4, చివరగా 133వ ప్రశ్నకు జవాబు 1, 2గా నిపుణుల కమిటీ సూచించగా కమిషన్ ఖరారు చేసింది. అతిత్వరలో మెయిన్ పరీ క్షలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్పీ ఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా -
జనవరి 8న గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్ పరీక్షను జనవరి 8న నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పాలనా కారణాలతో డిసెంబర్ 18న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నామన్నారు. డిసెంబర్ 17 నుంచి 20 తేదీ వరకు బ్యాంకింగ్ పరీక్షలు జరగనున్నందున అభ్యర్థుల మేలు కోసం గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గ్రూప్–1 పోస్టుల నియామక ప్రక్రియను 9 లేదా 10 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్లతో పాటు త్వరలో వెలువరించనున్న వాటికీ నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ‘సాక్షి’కి వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం అనుమతులిచ్చిన అనేక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేశామని గుర్తు చేశారు. వీటిలో కొన్నింటికి పరీక్షలు నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించామని తెలిపారు. సవాంగ్ ఇంకా ఏం చెప్పారంటే.. పకడ్బందీ ప్రణాళికతో ముందుకు.. గ్రూప్–1తో సహా అన్ని పోస్టుల భర్తీలో ఎక్కడా జాప్యం లేకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. న్యాయవివాదాలు, పలుమార్లు ఫలితాల వెల్లడి, మెయిన్స్ మూల్యాంకనం రెండుసార్లు నిర్వహించాల్సి రావడం వంటి కారణాలతో 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వ చొరవతో ఆ న్యాయ వివాదాలన్నింటినీ పరిష్కరించి ఆ పోస్టులను భర్తీ చేశాం. సెప్టెంబర్ 30న గ్రూప్–1 కొత్త నోటిఫికేషన్ ఇచ్చాం. దీనిద్వారా 92 గ్రూప్–1 పోస్టులను భర్తీ చేస్తాం. గత గ్రూప్–1 నోటిఫికేషన్లో భర్తీ కాని పోస్టులు ఈ కొత్త నోటిఫికేషన్లో చేరతాయి. దీంతో ప్రస్తుత నోటిఫికేషన్‌లోని పోస్టుల సంఖ్య కొంత పెరిగే అవకాశముంది. కొన్ని పొరపాట్లతో అప్పటి గ్రూప్–1 పోస్టులకు వయోపరిమితి మించిపోయి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. గ్రూప్–1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2తో ముగిసినా 5 వరకు అవకాశం ఇచ్చాం. దీంతో 1.26 లక్షల దరఖాస్తులు వచ్చాయి. త్వరలో గ్రూప్–2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తాం. ఈ పోస్టుల భర్తీకి సీఎం అనుమతి కూడా ఇచ్చారు. అత్యంత ప్రతిభావంతుల ఎంపిక ఏపీపీఎస్సీ పకడ్బందీ చర్యలతో వివిధ కేడర్ పోస్టుల్లో అత్యంత ప్రతిభావంతులు ఎంపికవుతున్నారు. రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా 2018 గ్రూప్–1 పోస్టులకు అత్యంత ప్రతిభావంతులు ఎంపికయ్యారు. 2018 గ్రూప్–1 మెయిన్స్ డిజిటల్ వాల్యుయేషన్‌పై న్యాయ వివాదం ఏర్పడడంతో హైకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్‌గా 55 రోజుల్లో మూల్యాంకనాన్ని పూర్తి చేయించాం. ఇంటర్వ్యూలను గతంలో మాదిరి ఒక్క బోర్డుతో కాకుండా మూడు బోర్డులతో నిర్వహించాం. గతంలో కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఒకే బోర్డుతో వీటిని నిర్వహించేవారు. ఇప్పుడు మూడు బోర్డుల్లోనూ కమిషన్ సభ్యులతోపాటు ఇద్దరు చొప్పున సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులుగా యూనివర్సిటీ వీసీ/విశ్రాంత వీసీలను నియమించాం. దీంతో 11 రోజుల్లోనే ఇంటర్వ్యూలను పూర్తిచేశాం. ఐఏఎస్‌కు ఎంపికైననలుగురు, ఐపీఎస్‌కు ఎంపికైన ఇద్దరు ఈ గ్రూప్–1 పోస్టులకు ఎంపికయ్యారు. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ఈసారి గ్రూప్–1 పోస్టులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా న్యాయపరమైన అవాంతరాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇందుకు అనుగుణంగా నిర్దిష్ట విధానాలను రూపొందించాం. సాధ్యమైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తాం. ప్రభుత్వం నుంచి కూడా çసహకారాలు అందుతున్నాయి. -
వారాంతంలో గ్రూప్–1 ప్రిలిమినరీ కీ.. కసరత్తు చేస్తున్న టీఎస్పీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈ వారాంతంలో విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వేగవంతం కసరత్తు చేస్తోంది. ప్రాథమిక కీ విడుదలకు ముందే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటివరకు 60 శాతం స్కానింగ్ పూర్తయినట్లు సమాచారం. దీపావళి పండుగ తర్వాత స్కానింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి శనివారం నాటికి ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 16న 1,019 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న వారిలో 75 శాతం మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యారు. శుక్రవారం నాటికి స్కానింగ్ పూర్తి! ఈనెల 16న పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ... 18వ తేదీ నుంచి ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్ ప్రక్రియను ప్రారంభించింది. కమిషన్ ఆధ్వర్యంలోని సాంకేతిక విభాగం సామర్థ్యం ప్రకారం అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల స్కానింగ్‌కు కనీసం ఎనిమిది పని దినాల గడువు పడుతుందని అంచనావేసి ప్రకటించింది. శుక్రవారం నాటికి స్కానింగ్ ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు భావిస్తున్నారు. స్కానింగ్ పూర్తయిన వెంటనే అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాల కాపీలను వారి ఓటీఆర్ లాగిన్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ప్రాథమిక కీ విడుదల చేసి.. దానిపై ఏవైనా అభ్యంతరాలుంటే ఆన్లైన్ పద్ధతిలో స్వీకరించిన తర్వాత ఫైనల్ కీని విడుదల చేస్తారు. చదవండి: కాలుష్యానికి చెక్.. ఇక హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులే..! -
సమయం దాటినా గ్రూప్-1 పరీక్ష రాయించి గోప్యంగా ఉంచారు..అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ పరీక్షలు, ఉద్యో గాల భర్తీ కోసం నిర్వహించే పరీక్షలు ఏవైనా నిబంధనలు కఠినంగా ఉంటాయి. కొన్నింటికైతే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి రానివ్వరు. ఇక నిర్ణీత సమయం అయిపోయిందంటే.. జవాబు పత్రాన్ని లాక్కుని మరీ బయటికి పంపేస్తారు. కానీ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చేపట్టిన గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను ఒక కేంద్రంలో ఏకంగా రెండు గంటలు ఆలస్యంగా నిర్వహించిన విషయం కలకలం రేపుతోంది. అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగింది? హైదరాబాద్‌లోని లాలాపేట్ శాంతినగర్‌లో ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను ఆలస్యంగా నిర్వహించారు. ఈ నెల 16న ప్రిలిమ్స్ పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగాల్సి ఉంటే.. ఈ సెంటర్లోని మూడు గదుల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3:30 గంటల వరకు పరీక్ష నిర్వహించినట్టు వెల్లడైంది. పరీ„ý కేంద్రంలోకి అభ్యర్థులందరినీ సకాలంలో అనుమతించామని.. పరీక్ష సమయం ప్రారంభం కాగానే ప్రశ్నపత్రాలు అందజేశామని అధికారులు చెబుతున్నారు. 3 గదుల్లో మాత్రం ఇంగ్లిష్–తెలుగు ప్రశ్నపత్రానికి బదులుగా ఇంగ్లిష్ –ఉ ర్దూ పేపర్ ఇవ్వడంతో అభ్యర్థులు ఆందోళన కు దిగారని.. దీనితో ఆలస్యమైందని అంటున్నారు. తిరిగి అభ్యర్ధులకు కొత్త ప్రశ్నపత్రం, కొత్త ఓఎంఆర్ షీట్‌తోపాటు అదనపు సమ యం ఇచ్చి పరీక్ష రాయించినట్టు వివరిస్తున్నారు. కానీ ఈ విషయాన్ని టీఎస్పీఎస్సీ అధికారులు గోప్యంగా ఉంచడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యం వాస్తవమే: పరీక్షల అదనపు కో–ఆర్డినేటింగ్ అధికారి సెయింట్ ఫ్రాన్సిస్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో ప్రిలిమ్స్ పరీక్ష ఆలస్యంగా ప్రారంభం కావడం వాస్తవమేనని హైదరాబాద్ జిల్లా గ్రూప్–1 పరీక్షల అడిషనల్ కో–ఆర్టినేటింగ్ అధికారి, అదనపు కలెక్టర్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. మూడు గదుల్లోని 47 మంది అభ్యర్థులకు తెలుగు–ఇంగ్లిష్ ద్విభాషా ప్రశ్నపత్రాలకు బదులు ఇంగ్లిష్, ఇతర భాష ల్లో (తెలుగు కాకుండా) ముద్రించిన ప్రశ్నపత్రాలను ఇన్విజిలేటర్లు పంపిణీ చేశారని తెలిపారు. తర్వాత తప్పిదాన్ని గుర్తించి.. తెలుగు–ఇంగ్లిష్ ప్రశ్నపత్రాలను ఇచ్చారని వివరించారు. కానీ అభ్యర్థులు చాలాసేపు ఆందోళన చేశారని.. తమ జవాబుపత్రాలు చెల్లుబాటు అవుతాయనే అపోహతో ప్రశ్నపత్రం సెట్ తీసుకోవడానికి నిరాకరించారని వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు సుదీర్ఘంగా చర్చలు జరిపి నచ్చజెప్పడంతో.. మధ్యాహ్నం ఒంటి గంటకు అభ్యర్థులు పరీక్ష రాయడం ప్రారంభించారన్నారు. అభ్యర్థులంతా మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్ష పూర్తయ్యేదాకా సెంటర్లోనే ఉన్నారని తెలిపారు. అబిడ్స్‌లోని స్టాన్లీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇదే తరహా కారణాలతో ఇద్దరు అభ్యర్థులకు 15 నిమిషాలు, ఐదుగురు అభ్యర్ధులకు 30 నిమిషాలు.. అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో 15 మంది అభ్యర్థులకు 7 నిమిషాలు అదనపు సమయమిచ్చామని వివరించారు. పరీక్షకేంద్రంలో అవకతవకలు జరగలేదని, టీఎస్పీఎస్సీతో సంప్రదింపుల మేరకే అదనపు సమయం ఇచ్చామని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ఏఐవైఎఫ్ గ్రూప్–1 పరీక్షను నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం నిర్వహించడం అనుమానాలకు తావిస్తోందని, తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ నిర్వహించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధర్మేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు, పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంపై విచారణ జరపాలి: ఏఐఎస్ఎఫ్ గ్రూప్–1 పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిబంధ నల ప్రకారం ఉదయం 10.30 నుంచి ఒంటి గంట వరకు నిర్వహించాలనీ, కానీ హైదరా బాద్ లాలాపేట్, శాంతినగర్‌లోని ఎస్ఎఫ్ ఎస్ (సెయింట్, ఫ్రాన్సిస్ డీ సేల్స్) హైస్కూ ల్ పరీక్ష కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3.30 గంటల వరకు నిర్వహించారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మణి కంఠరెడ్డి, లక్ష్మణ్ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ప్రకటన జారీ చేశారు. ఉదయం నిర్వహించాల్సిన పరీక్ష మధ్యాహ్నం నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష నిర్వహించిన ఆయా సెంటర్లపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్-1.. హాజరైన అభ్యర్థులు (ఫొటోలు)
-
గ్రూప్–1 ఇంటర్వ్యూ ఫలితాలు వెల్లడించండి
సాక్షి, అమరావతి : గ్రూప్–1 ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియలో జోక్యానికి హైకోర్టు ధర్మాసనం సైతం నిరాకరించింది. ఇంటర్వ్యూలు, వాటి ఫలితాల వెల్లడి, తదనంతర నియామక ప్రక్రియను యథాతథంగా కొనసాగించవచ్చని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)కు హైకోర్టు స్పష్టం చేసింది. అయితే నియామకాలన్నీ కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉంటాయని, ఈ విషయాన్ని అభ్యర్థులకు ఇచ్చే నియామక ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని చెప్పింది. ఎంపికైన అభ్యర్థులు ఎలాంటి ప్రత్యేక హక్కులను (ఈక్విటీస్) కోరజాలరని, దీనిపై వారి నుంచి హామీ తీసుకోవాలని కమిషన్‌ను ఆదేశించింది సింగిల్ జడ్జి ముందున్న వ్యాజ్యాల్లో జూలై మొదటి వారానికల్లా కౌంటర్లు దాఖలు చేయాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఆ కౌంటర్లకు 13వ తేదీకల్లా సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు చెప్పింది. రిట్ పిటిషన్లను జూలై 14న లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఇరుపక్షాలూ ఎలాంటి వాయిదా కోరకుండా ఆ రోజున వాదనలు వినిపిస్తారని ఆశిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. గ్రూప్–1 మాన్యువల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని, అందువల్ల ఇంటర్వ్యూలు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఇంటర్వ్యూలు, నియామక ప్రక్రియ నిలుపుదలకు నిరాకరిస్తూ ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలువురు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్ ధర్మాసనం రెండు రోజుల క్రితం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది. ఈ ఆదేశాలతో అందరి ప్రయోజనాలు పరిరక్షించినట్లు అవుతుందని పేర్కొంది. సమాధాన పత్రాలు జాగ్రత్త చేయండి 2018 డిసెంబర్ 31 నాటి నోటిఫికేషన్ ఆధారంగా గ్రూప్–1 మెయిన్స్‌కు హాజరైన అభ్యర్థులందరి సమాధాన పత్రాలను జాగ్రత్త చేయాలని సర్వీస్ కమిషన్‌ను ధర్మాసనం తన తీర్పులో ఆదేశించింది. డిజిటల్ మూల్యాంకనంలో ఇంటర్వ్యూలకు అర్హత సాధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలు, వారు మాన్యువల్ మూల్యాంకనంలో సాధించిన మార్కుల వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచాలని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనంలో అర్హత సాధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలను కూడా సీల్డ్ కవర్లో తమ ముందుంచాలంది. కోర్టు ఏ సమాధాన పత్రం చూడాలన్నా తక్షణమే అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. మాన్యువల్ మూల్యాంకనం చేసిన వారిలో 50 శాతంకి తగిన అర్హతలు లేవని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే, 50 శాతం మందికి పీహెచ్డీ డిగ్రీలు ఉన్నాయని, వారు ఆయా సబ్జెక్టుల్లో మంచి పరిజ్ఞానం ఉన్న వారని ఏపీపీఎస్సీ చెబుతోందని తెలిపింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మూల్యాంకనకర్తల వివరాలను ముందే సోషల్ మీడియాలో పోస్టు చేసినా, వారికి అభ్యర్థుల పేర్లు తెలిసే అవకాశం లేదని, సమాధానపత్రాలన్నీ డీకోడ్ చేస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీపీఎస్సీ వాదన తోసిపుచ్చలేం మాన్యువల్ మూల్యాంకనంలో ఉత్తీర్ణత సాధించని అభ్యర్థులు దాఖలు చేసిన ఈ పిటిషన్లను సింగిల్ జడ్జి అనుమతించిప్పటికీ, వారికి మాత్రం ఉద్యోగాలు రావని, కోర్టు ఆదేశాల ప్రకారం మొత్తం ప్రక్రియను తిరిగి ప్రారంభించాల్సి ఉంటుందన్న ఏపీపీఎస్సీ వాదనను తోసిపుచ్చలేమని తెలిపింది. తమ అభిప్రాయాలు ఈ అప్పీళ్లను తేల్చడానికి మాత్రమే పరిమితం అవుతాయే తప్ప అంతకు మించి కాదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల ఫలితాలను ప్రభుత్వానికి పంపడానికి ఏపీపీఎస్సీకి 7–9 రోజులు పడుతుందని, ఆ తరువాత కమిషన్ సిఫారసులను ఆమోదించి, పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రభుత్వానికి 4–6 వారాల సమయం పడుతుందని తెలిపింది. అందువల్ల సింగిల్ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలను జూలై 14న లిస్ట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు తెలిపింది. -
గ్రూప్–1 దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు ఊరటనిచ్చిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తుల ప్రక్రియలో అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఊరటనిచ్చింది. బోనఫైడ్ సర్టిఫికెట్‌ను వెబ్సైట్లో అప్లోడ్ చేయకున్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 31తో గ్రూప్–1 దరఖాస్తు ప్రక్రియ ముగియనుండగా టీఎస్పీఎస్సీ తాజా నిర్ణయంతో దరఖాస్తుల సమర్పణ జోరందుకుంది. నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మెజారిటీ అభ్యర్థుల స్థానికతలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గతంలో వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన కమిషన్... ఈ మేరకు మార్పులు చేసుకోవాలని సూచిం చింది. దీంతో ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకున్న బోనఫైడ్ సర్టిఫికెట్ కాపీలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి వచ్చింది. ఈ నిబంధన చాలా మంది అభ్యర్థులకు ఇబ్బందులు తెచ్చిపెట్టిందనే విమర్శలు వచ్చాయి. పలువురు అభ్యర్థులు బోనఫైడ్ సర్టిఫికెట్ల కోసం పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో కమిషన్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వివరాలు సమర్పిస్తే..: ఓటీఆర్ ఎడిట్ ఆప్షన్ లేదా నూతన ఓటీఆర్ నమోదు సమయంలో అభ్యర్థులు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదువుకు న్న పాఠశాల, ప్రాంతం వివరాలను వెబ్సైట్లో ఎంట్రీ చేస్తే చాలు. ఆ తర్వాత గ్రూప్–1 దరఖాస్తును సమర్పించే వీలుంటుంది. అయితే ఇప్పుడు నమోదు చేసిన వివరాలకు సంబంధించిన అసలైన ధ్రువ పత్రాలను సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో మాత్రం తప్పకుండా చూపించాలి. ఒకవేళ ఉద్యోగానికి ఎంపికై సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలు చూపకుంటే అభ్యర్థిని ప్రాథమిక జాబితా నుంచి తొలగించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. అదేవిధంగా నమోదు చేసిన వివరాలు సరైనవి కాకుంటే అభ్యర్థిపై చట్టపరమైన చర్యలకు సిఫారసు చేసే అధికారం సైతం కమిషన్‌కు ఉంది. అందువల్ల అభ్యర్థులు సరైన వివరాలతో దరఖాస్తు సమర్పిస్తే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. -
మూలాల్లోకి వెళ్తే సక్సెస్ మీదే!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పుస్తకాలపై దృష్టికన్నా, సడలని ఆత్మ విశ్వాసమే అసలైన ఆయుధమని సామాజిక వేత్త, పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షల సిలబస్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ చెప్పారు. పైపైన చదవకుండా, మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేసిన వారే పరీక్షల్లో విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. విస్తృత భావజాలంతో గ్రూప్–1 సిలబస్‌ను రూపొందించామని.. విశాల ఆలోచనా ధోరణితో అవగాహన చేసుకుంటే అభ్యర్థులు సునాయాసంగా గెలుపు బాట పట్టవచ్చని తెలిపా రు. గ్రూప్స్ పరీక్షల నేపథ్యంలో హరగోపాల్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. స్థానిక చరిత్రకే ప్రాధాన్యం తెలంగాణ ఏర్పాటు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ విశాల దృక్పథంతో ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశలోనే పరీక్ష సిలబస్ విభిన్నంగా ఉండాలని నేను చైర్మన్‌గా 18 మందితో ప్రభుత్వం కమిటీ వేసింది. అందులో కోదండరాం, చుక్కా రామయ్య సహా పలువురు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు ఉన్నారు. తెలంగాణ చరిత్ర, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ నేపథ్యం. భౌగోళిక పరిస్థితులకు ప్రాధాన్యమిచ్చాం. ఈ అంశాల నుంచే 50 మార్కులకు పేపర్ ఉంటుంది. రాష్ట్ర పరిణామాలపై జనరల్ నాలెడ్జ్, ఆంగ్ల భాషా నైపుణ్యం (టెన్త్ స్టాండర్డ్స్)పై కనీస అవగాహన ఉండాలి. మేథ్స్ను కూడా సిలబస్‌లో జోడించాలనుకున్నాం. కానీ విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో చేయలేకపోయాం. ఇంటర్వ్యూ ఉంటేనే మేలు పాలనా సామర్థ్యం, ప్రజలతో డీల్ చేసే విధానం, వ్యక్తిత్వ వికాసం వంటివి ఇంటర్వ్యూ ద్వారానే తెలుస్తాయి. యూపీఎస్సీ కూడా ఇంటర్వ్యూకు అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. ఇంటర్వ్యూ తీసేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా ఉండాలనే కమిటీ అభిప్రాయపడింది. ఇప్పుడు తొలగించారు కాబట్టి రాతపరీక్షలోనే సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాలి. లోతుగా అధ్యయనం చేయాలి భారత రాజ్యాంగాన్ని లోతుల్లోకి వెళ్లి చదవాలి. ఉదాహరణకు ఆర్టికల్–3. నాటి దేశ పరిస్థితులను బట్టి దానిని రాజ్యాంగంలో పొందుపరిచారు. దేశం సమైక్యంగా ఉండాల్సిన అవసరాన్ని అప్పట్లో అంబేడ్కర్ ప్రతిపాదించారు. ఇలా లోతుగా తెలుసుకుంటేనే గ్రూప్స్ రాసే విద్యార్థులకు సమగ్ర అవగాహన ఉంటుంది. సులువుగా విజయం సాధిస్తారు. ఆదేశిక సూత్రాలను సూచించే పార్ట్–4 చాలా ముఖ్యం. ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనేది దీని నుంచే సమగ్రంగా తెలుసుకోవచ్చు. రాజ్యాంగం పార్ట్–3లో పౌరులకు స్వేచ్ఛ ఇస్తే.. పార్ట్–4లో సామాజిక న్యాయం ఉంటుంది.› ఈ రెండింటికీ మధ్య లింక్‌ను తాత్విక, సామాజిక కోణంలో అవగతం చేసుకున్న విద్యార్థి.. ఏ పరీక్షలోనైనా విజయం సాధించగలడు. ఇలాంటివాటిని గైడ్ ద్వారా ఫాలో అవడం కష్టం. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ గురించి మాత్రమే కాకుండా.. వాటి నేపథ్యం తెలుసుకుంటే మంచి మార్కులొస్తాయి. జనరల్ ఎస్సే విషయంలో సమకాలీన పరిస్థితులను ఎక్కువ అ«ధ్యయనం చేయాలి. నదీజలాలు, పర్యావరణ సమస్యలు వంటి తాజా పరిణామాలు, గత చరిత్ర తెలుసుకోవాలి. ఆత్మ విశ్వాసమే అసలు ఆయుధం ఒక్కో అభ్యర్థి ఒక్కో రకమైన భావజాలంలో ఉంటారు. గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు వెళ్లే అభ్యర్థులు ముందుగా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అదే అసలైన ఆయుధం. యూనివర్సిటీలు విద్యార్థులకు అందించాల్సింది ఇదే. ఈ మధ్య ప్రత్యేక కోచింగ్ సెంటర్లు పెడుతున్నారు. ఏపీ స్టడీ సర్కిల్, తెలంగాణ స్టడీ సర్కిళ్ల పేరుతో ప్రభుత్వాలే నడుపుతున్నాయి. అక్కడ చేయాల్సిందల్లా అభ్యర్థుల్లో ఆత్మ విశ్వాసం పెంచాలి. ఇంగ్లిష్ భాష అంటే భయపడొద్దు. కనీస పరిజ్ఞానం పొందితే చాలు. గ్రూప్–1 అధికారికి భాష ప్రధానం కాదు. ప్రజల మనోభావాలను అర్థం చేసుకునే శక్తి ఉండాలి. తెలిసినది కాదు.. అడిగింది రాయాలి.. పోటీ పరీక్షల్లో ఎప్పుడూ ప్రశ్నలను ట్విస్ట్ చేసి ఇస్తారు. చాలామంది ఈ విషయాన్ని సరిగా గమనించరు. మనకు తెలిసింది రాయాలనే ఉత్సాహం పరీక్షలో సరికాదు. పరీక్షలో అడిగింది రాయడమే ముఖ్యం. ప్రశ్నను రెండు మూడుసార్లు జాగ్రత్తగా చదవాలి. జవాబు రాసేప్పుడూ ప్రశ్నను మరోసారి చదవాలి. అప్పుడే సమాధానం సరిగా రాస్తున్నది లేనిది తెలుస్తుంది. అడిగింది రాసిన అభ్యర్థులు పాసవుతారు. యూపీఎస్సీలో గతంలో వచ్చిన పేపర్లు తెచ్చుకోవాలి. వాటిల్లోంచి కొన్ని ప్రశ్నలు ఎంపిక చేసుకోవాలి. పుస్తకాల నుంచి సమాధానం సంగ్రహించాలి. తర్వాత పుస్తకాలు చూడకుండా సమాధానాలు రాసే ప్రయత్నం చేయాలి. వాటిని నిపుణులకు చూపించి ఎలా ఉందో, ఇంకెలా రాయోలో తెలుసుకోవాలి. దీనివల్ల మంచి మార్కులు వచ్చే వీలుంది. కోచింగ్ సెంటర్లది వ్యాపారమే.. చాలా కోచింగ్ సెంటర్లు వ్యాపార ధోరణిలో వెళ్తున్నాయి. స్టడీ మెటీరియల్స్ లక్షల్లో అమ్ముడుపోతాయి. కానీ వాటిని ఏ విధమైన నైపుణ్యం లేని వ్యక్తులతో రూపొందిస్తున్నారు. ఎలాంటి అవగాహన లేని మెటీరియల్స్ మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. తెలంగాణపై జయశంకర్, అడపా సత్య నారాయణ వంటివారు రాసిన పుస్తకాలు చదవాలి. తెలుగు అకాడమీ డీలా పడింది గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షల కోసం మార్కెట్లో దొరికే ప్రతి పుస్తకం, మెటీరియల్‌ను కొనొద్దు. నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మెటీరియల్ అందించే క్రమంలో ఒక్కోసారి తెలుగు అకాడమీ కూడా తప్పులు చేస్తోంది. ఉదాహరణకు ‘అనార్కిజం’అనే పదాన్ని ‘అరాచకవాదం’అని తర్జుమా చేశారు. అనార్కిజం అంటే పరిమితుల్లేని స్వేచ్ఛ. ఇదో ఫిలాసఫీ. సబ్జెక్టుపై సమగ్ర అవగాహన ఉంటేనే ఇలాంటివన్నీ గుర్తించడం సాధ్యమవుతుంది. గైడ్లు తయారుచేసే వాళ్లకు ఇవి తెలియవు. నిజానికి ఇలాంటి సందర్భాల్లో తెలుగు అకాడమీ ముందుండాలి. ఓపెన్ యూనివర్సిటీ రంగంలోకి దిగాలి. అనుభవజ్ఞులతో స్టడీ మెటీరియల్ అందించాలి. అకాడమీ గందరగోళంలో ఉంది. పుస్తకాలు ప్రింట్ చేయడం లేదు. కీలక సమయంలో డీలా పడింది. ఇప్పటికైనా విద్యార్థులకు చేయూతగా ఉండాలి. -
తెలంగాణ గ్రూప్-1 పోస్టులకు అప్లై చేస్తున్నారా? బబ్లింగ్‌తో భద్రం!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలకు సంబంధించిన నిబంధనలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరింత కఠినతరం చేసింది. దరఖాస్తుల నుంచి ఓఎంఆర్ జవాబుపత్రం దాకా.. వివ రాల నమోదు, సమాధానాల గుర్తింపుపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. బబ్లింగ్‌లో ఎలాంటి తప్పిదాలు జరిగినా.. డబుల్ బబ్లింగ్ చేసినా.. ఆ అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమని ప్ర కటించింది. దరఖాస్తు చేసే సమయం నుం చే అప్రమత్తంగా ఉండాలని.. ప్రతి అంశాన్ని ఒకటికి రెండుసార్లు సరిచూ సుకుని నమో దు చేయాలని సూచించింది. దరఖాస్తుల ప్రక్రియ షురూ..: గ్రూప్–1 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచే ప్రారంభమవుతోంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ (వన్ టైమ్ రిజిస్ట్రేషన్) చేసుకున్న అభ్యర్థులు మాత్రమే గ్రూప్–1కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓటీఆర్ నమోదు చేసుకోనివారు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 31వ తేదీ వరకు గ్రూప్–1 దరఖా స్తులను స్వీకరిస్తారు. ఆన్లైన్లో గ్రూప్–1 దరఖాస్తును సమర్పించే అభ్యర్థులు.. వివ రాలన్నీ నింపాక కచ్చితంగా ఒకసారి ప్రి వ్యూ చూసుకుని.. క్షుణ్నంగా పరిశీలించాకే సబ్మిట్ ఆప్షన్‌ను క్లిక్ చేయాలని టీఎస్పీ ఎస్సీ సూచించింది. డబుల్ బబ్లింగ్‌తో ట్రబుల్!: సాధార ణంగా ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నంబ ర్, ఇతర వివరాలను పూరించడానికి, సమా ధానాలను గుర్తించడానికి.. అంకెలు, అక్షరా లను వినియోగించరు. బదులుగా నిర్దేశిం చిన అంకెలున్న వృత్తాలను బాల్ పాయిం ట్ పెన్‌తో నింపాల్సి ఉంటుంది. అది కూడా ఒక్కో వృత్తాన్ని మాత్రమే పూరించాలి. తప్పుగా వృత్తాలను పూరించిన వారు మళ్లీ అసలు వృత్తాన్ని కూడా నింపితే డబుల్ బబ్లింగ్ అంటారు. గతంలో గ్రూప్– 2 నియామకాల సమయంలో డబుల్ బబ్లింగ్ తీవ్ర వివాదం రేకెత్తించింది. కొందరు అభ్య ర్థులు ఓఎంఆర్ షీట్‌పై డబుల్ బబ్లింగ్ చేయడం, వైట్నర్ వినియోగించడం, ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లడంతో నియామకాల ప్రక్రియ దాదాపు నాలుగేళ్లు నిలిచిపోయింది. దీంతో ఈసారి టీఎస్ పీఎస్సీ ముందుజాగ్రత్తగా కఠిన చర్యలను ప్రకటించింది. అభ్యర్థి డబుల్ బబ్లింగ్ చేస్తే.. సదరు జవాబు పత్రాన్ని మూల్యాం కనం చేయబోమని స్పష్టం చేసింది. సాఫ్ ్టవేర్లో మార్పులు చేశామని, డబుల్ బబ్లింగ్ ఉన్న ఓఎంఆర్ షీట్లు తిరస్కరణకు గురవు తాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. సమస్యల పరిష్కారానికి హెల్ప్ డెస్క్ గ్రూప్–1 దరఖాస్తుల సమయంలో ఏవై నా సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్క రించేందుకు టీఎస్పీఎస్సీ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య.. 040– 23542185, 040–2354 2187 నంబర్ల కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసు కోవచ్చు. లేదా help@tspsc.gov.in ’కు ఈ–మెయిల్ చేయవచ్చు. -
ప్రిలిమ్స్ స్కోరే ‘మెయిన్’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువ డటంతో పోటీ పడేవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. మొదటిసారి ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా అత్యధిక సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటంతో అభ్యర్థుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై నెలాఖరు వరకు కొనసాగనుంది. వివిధ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. టీఎస్పీఎస్సీ తొలిసారిగా నిర్వహించే గ్రూప్–1 ఉద్యోగాల భర్తీపై అభ్యర్థుల్లోనూ ఆత్రుత, అయోమయం నెలకొంది. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధిస్తే మెయిన్ పరీక్షలకు మార్గం సుగమమవుతుందనే భావన అభ్యర్థుల్లో ఉంది. దీంతో చాలా మంది మెయిన్ పరీక్షలపై ఎక్కువ శ్రద్ధ పెడుతూ ప్రిలిమ్స్ వరకు సాధారణ స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఈ విధానం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు. మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్ మార్కులే కీలకం కానున్నాయి. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను ర్యాంకింగ్‌లోకి పరిగణించరని టీఎస్పీఎస్సీ చెబుతున్నప్పటికీ.. ఈ పరీక్షలో వచ్చే స్కోర్ ఆధారంగానే మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను టీఎస్పీఎస్సీ ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది ఎంపిక... గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష జూలై/ఆగస్టులో నిర్వహిం చనున్నట్లు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ప్రిలిమ్స్‌ను జనరల్ స్టడీస్, మెంటల్ ఎబి లిటీ(ఆబ్జెక్టివ్ టైప్) విభాగంలో 150 ప్రశ్నలతో నిర్వహిస్తారు. రెండున్నర గంటల పాటు సాగే ఈ పరీక్ష మొత్తం మార్కులు 150. ఇందులో ఎక్కువ మార్కులు స్కోర్ చేసిన వారిని నిర్దేశించిన కేటగి రీలు, రిజర్వేషన్ల వారీగా వడపోసి మెయిన్ పరీక్ష లకు ఎంపిక చేస్తారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో వివిధ ప్రభుత్వ శాఖల్లో 503 ఉద్యో గ ఖాళీలున్నాయి. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పు న మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ లెక్కన టాప్ 25,150 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఈ క్రమంలో ప్రిలిమ్స్ పరీక్షలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. -
గ్రూప్–1.. నో స్టాక్
సాక్షి, హైదరాబాద్: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే మెజార్టీ అభ్యర్థులు సాధన చేసే పుస్తకాలు తెలుగు అకాడమీవే. తాజాగా గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ఈ పుస్తకాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. తెలుగు అకాడమీ కౌంటర్ వద్ద అభ్యర్థులు క్యూ కడుతున్నారు. అయితే తెలుగు అకాడమీ బుక్ కౌంటర్లో పలు అంశాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవు. దీంతో పుస్తకాల కోసం సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. డిమాండ్ ఎక్కువ..లభ్యత తక్కువ సబ్జెక్టు ఏదైనా తెలుగు అకాడమీ పుస్తకాలకున్న ప్రాధాన్యతే వేరు. అన్ని అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం, విషయ నిపుణుల విశ్లేషణలతో కూడిన ఆ పుస్తకాలు పోటీ పరీక్షల్లో విజయానికి బాటలు వేస్తాయనే భావన అభ్యర్థుల్లో ఎప్పట్నుంచో ఉంది. కాగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా ఇటీవల గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల కావడం.. మొదటి నోటిఫికేషన్లోనే పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండడంతో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలపై ఆసక్తి చూపిస్తున్నారు. మంచి జీతాలతో ప్రైవేటు ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ కొలువులు చేస్తున్న వారు సైతం దీర్ఘకాలిక సెలవులు పెట్టి గ్రూప్–1 నియామకాల కోసం సిద్ధమవుతుండటంతో విపరీతమైన పోటీ ఏర్పడింది. ఈ క్రమంలో పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారు సంబంధిత సిలబస్ ఉండే పుస్తకాలు సేకరించే పనిలో పడ్డారు. ఇతర పబ్లికేషన్స్ మాటెలా ఉన్నా తెలుగు అకాడమీ పుస్తకాల లభ్యత సంతృప్తికరంగా లేకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కొత్తవి రావు.. తెలుగులో లేవు ఇంటర్వ్యూలను తొలగించడంతో గ్రూప్–1 పరీక్ష 900 మార్కులకు పరిమితమైంది. ఇందులో ప్రిలి మినరీ పరీక్షలో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ర్యాంకింగ్‌లో ఈ మార్కులకు ప్రాధాన్యత లేనప్పటికీ మెయిన్ పరీక్షలకు అర్హత సాధించాలంటే ప్రిలిమ్స్‌లో మంచి మార్కులు తప్పనిసరి. ఇక జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మార్కులు కూడా ర్యాం కింగ్ పరిధిలోకి రావు. ఈ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెలుగు అకాడమీలో అందుబాటులో ఉన్నాయి. కీలకమైన మెయిన్ పరీక్షల సబ్జెక్టు పుస్తకాలు, కరెంట్ అఫైర్స్ పుస్తకాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. మెయిన్ పరీక్షల్లో మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 24 అంశాలతో కూడిన సిలబస్ ఉంది. అయితే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్ వెర్షన్ పుస్తకాలు అందుబాటులో లేవు. చరిత్ర, తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఇంగ్లిష్ వెర్షన్లో మాత్రమే అం దుబాటులో ఉన్నాయి. హిస్టరీ, హెరిటేజ్, కల్చర్ ఆఫ్ తెలంగాణ పుస్తకాలు లేవు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొత్త వెర్షన్ కూడా లేదు. అభివృద్ధి, పర్యావరణ సమస్యలకు సంబంధించిన పుస్తకాలు కేవలం ఆంగ్లంలోనే ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో అభ్యర్థులకు సమయం అత్యంత కీలకంగా మారింది. ఎన్నాళ్లుగానో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు అందివచ్చిన అవకాశాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు అవసరమైన ప్రతి పుస్తకాన్నీ ఔపోసన పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు అకాడమీలో లేని పుస్తకాల కోసం ఇతర పబ్లికేషన్ల వైపు పరుగులు పెడుతున్నారు. కొత్త పుస్తకాల స్టాకు రాలేదంటున్నారు పోటీ పరీక్షలకు తెలుగు అకాడమీ పుస్తకాలు ఉత్తమమని మా ప్రొఫెసర్ చెప్పడంతో వాటినే చదువుతున్నాను. ప్రస్తుతం గ్రూప్–1 నోటిఫికేషన్ రావడంతో ఆ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నా. తాజా సమాచారంతో కూడిన పుస్తకాల కోసం నాలుగు రోజులుగా ప్రయత్నిస్తున్నా. కానీ కొత్త పుస్తకాల స్టాకు ఇంకా రాలేదని చెబుతున్నారు. ఎప్పుడు వస్తాయో చెప్పలేకపోతున్నారు. వారి దగ్గర అందుబాటులో ఉన్న పుస్తకాల సెట్ ఒక్కో దానికి రూ.1,150 వసూలు చేస్తున్నారు. – డి. నర్సింగ్‌రావు, గ్రూప్–1 అభ్యర్థి, హయత్‌నగర్, రంగారెడ్డి జిల్లా -
ఇంటర్వ్యూ రద్దుతో ‘రాత’ మారేనా!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల రద్దుతో పలురకాల పోస్టుల భర్తీలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిర్దేశించిన పోస్టులకు ఇప్పటివరకు ఇంటర్వ్యూలతో కలిపి అర్హతల నిర్ధారణ జరిగేది. కానీ ప్రస్తుతం మౌఖిక పరీక్షల భాగాన్ని ప్రభుత్వం తొలగించడంతో పరీక్ష విధానంలో మార్పులపై నియామక సంస్థలు తర్జనభర్జన పడుతున్నాయి. ఇంటర్వ్యూల రద్దుతో ఆ భాగానికి (పార్ట్) నిర్దేశించిన మార్కులు తొలగించాలా? లేక ఆ మార్కులను రాత పరీక్షలో కలపాలా? అనే అంశంపై కసరత్తు ప్రారంభించాయి. మరోవైపు ఇంటర్వ్యూ తొలగింపుపై విద్యారంగ నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం గమనార్హం. రెండు కేటగిరీల్లోనే కాదు.. ఇంటర్వ్యూల నిర్వహణ కేవలం గ్రూప్ ఉద్యోగాలకే పరిమితం కాలేదు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలతో పాటు తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే వైద్యుల నియామకాలు, తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా ప్రిన్సిపల్ పోస్టుల భర్తీకి, తదితరాలకు కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి. మరోవైపు జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు డెమో పరీక్షలు (తరగతి గదిలో పాఠాలు చెప్పడం) నిర్వహిస్తున్నారు. ఈ డెమో పరీక్షలు కూడా ఇంటర్వ్యూ విధానంలోకే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియలో పలు రకాల మార్పులు అనివార్యం కానున్నట్లు స్పష్టమవుతోంది. అర్హత పరీక్ష తప్పనిసరి తెలంగాణ రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు, వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించే వైద్యుల నియామకాల్లో కొన్నింటికి ఎలాంటి పరీక్షలు నిర్వహించకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అర్హతలు నిర్ధారించుకుంటున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూ రద్దు చేస్తే ఈ నియామకాలకు అర్హత పరీక్ష తప్పనిసరి కానుంది. దీంతో వారికి ప్రత్యేకంగా సిలబస్‌ను రూపొందించి పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. మరోవైపు తెలంగాణ గురుకుల నియామకాల బోర్డు ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో ప్రిన్స్‌పల్, జేఎల్, డీఎల్ నియామకాల ప్రక్రియలోనూ మార్పులు తప్పవని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంటర్వ్యూ, డెమోకు బదులుగా ఇతర కేటగిరీల్లో వారి సామర్థ్యాలను పరిశీలించాలని బోర్డు యోచిస్తున్నట్లు సమాచారం. వేగం..పారదర్శకత వివిధ పోస్టులకు నిర్వహించే ఇంటర్వ్యూలకు సగటున అరగంట సమయం పడుతున్నట్లు బోర్డుల వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం గ్రూప్–1 కేటగిరీలో 503 పైగా ఉద్యోగాలున్నాయి. మెయిన్ పరీక్షల అనంతరం 1:3 పద్ధతిలో అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలిస్తే 1,509 మందిని ఇంటర్వ్యూ చేయాలి. ఒక్కో అభ్యర్థిని అరగంట చొప్పున రోజుకు కనీసం 25 మందిని ఇంటర్వ్యూ చేసినా ఈ ప్రక్రియ పూర్తికి కనీసం మూడు నెలల సమయం పడుతుంది. ఇక గ్రూప్–2 కేటగిరీలో పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో వేలల్లో అభ్యర్థులను ఇంటర్వ్యూలు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇంటర్వ్యూల నిర్వహణ నియామక సంస్థలకు భారంగా మారుతోంది. ఈ పరిస్థితిని నివారించడం ద్వారా నియామకాల్లో వేగం పెంచడంతో పాటు అవకతకవకలకు ఆస్కారం ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసిందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. ఇంటర్వ్యూ సిలబస్ రాత పరీక్షలో.. గ్రూప్–1 ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుతం మూడు అంచెల్లో నియామక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు 900 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులున్నాయి. ఇంటర్వ్యూ రద్దుతో 100 మార్కులు తొలగించినప్పటికీ.. ఇంటర్వ్యూకు నిర్దేశించిన సిలబస్‌ను రాత పరీక్షలో కలపనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాత పరీక్ష సిలబస్‌లో మార్పులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతమున్న సిలబస్‌ను 2015లో విషయ పరిజ్ఞానం ఉన్న నిష్ణాతులతో కూడిన కమిటీ నిర్ణయించింది. ఇక గ్రూప్–2 నియామకాలకు పార్ట్–ఏ కింద ఆబ్జెక్టివ్ విధానంలో నాలుగు పేపర్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకు 600 మార్కులు ఉన్నాయి. పార్ట్–బీలో ఇంటర్వ్యూకు 75 మార్కులున్నాయి. ప్రస్తుతం ఇంటర్వ్యూకు మినహాయింపు ఇవ్వనుండడంతో అందుకు సంబంధించిన మార్కులు తొలగించి నాలుగు పేపర్లకు నిర్దేశించిన సిలబస్‌కు మరిన్ని అంశాలు అదనంగా జోడించే అవకాశం ఉంది. అపోహలు తొలగిపోతాయి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ఇంటర్వ్యూల విధానాన్ని రద్దు చేయడం మంచి పరిణామమే. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యవహారశైలి, కమ్యూనికేషన్ సామర్ధ్యంతో పాటు విషయ పరిజ్ఞానాన్ని నేరుగా పరిశీలిస్తారు. కానీ చాలా మందిలో ఇంటర్వ్యూలపై అక్రమాలు జరుగుతాయని, పైరవీలకు ఆస్కారం ఉంటుందనే అపోహలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అపోహలు తొలగిపోతాయి. కేవలం మెరిట్ ఆధారంగా పూర్తి పారదర్శకంగా నియామకాలు జరుగుతాయనే నమ్మకం పెరుగుతుంది. అయితే అర్హత సాధించిన అభ్యర్థికి నియామక పత్రం ఇచ్చే ముందు జరిగే వైద్య పరీక్ష పక్కాగా నిర్వహిస్తే బాగుంటుంది. – ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్, ప్రిన్స్‌పాల్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఓయూ అన్ని కేటగిరీల్లో పరిశీలించాల్సిందే.. రాష్ట్రస్థాయిలో ఉన్నత ఉద్యోగం అంటే గ్రూప్–1. ఈ నియామకాల్లో మౌఖిక పరీక్షలు ఉండడమే మంచిది. గ్రూప్–1 అధికారిపైన బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, శాఖాపరమైన కార్యక్రమాల నిర్వహణలో అతని పనితనం తెలియాలంటే అన్ని కేటగిరీల్లో అతని సామర్థ్యాలు పరిశీలించాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా అన్ని పరీక్షల్లో సామర్థ్యాలను చూడాలి. పైరవీల పేరిట సామర్థ్యాల పరిశీలనను కుదించడంతో సరైన అభ్యర్థుల ఎంపిక సాధ్యమవుతుందా అనేది ఆలోచించాలి. సివిల్స్‌లో ఇంటర్వ్యూ తప్పనిసరనే విషయం కూడా గమనంలోకి తీసుకోవాలి. – ప్రొఫెసర్ ఎన్.కిషన్, హెచ్ఓడీ, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓయూ -
గ్రూప్–1, 2 పోస్టులకు ఇంటర్వ్యూలు లేనట్టే! నేడో, రేపో..
సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్ష) తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులు, టీఎస్పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయ శాఖకు పంపడంతో పాటు కేబినెట్ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయంలోనూ లోతుగా పరిశీలించాయి. పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడం, టీఎస్పీఎస్సీ అధికారులతో కూడా జరిపిన సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రం గం సిద్ధమైంది. ఇక, ఇప్పటికే 30,453 వేల పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అనంతరం మరో 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్న ట్లు సమాచారం. టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పరీక్షకు హాజరయ్యేలా డీఎస్సీ ప్రకటనకు మార్గం సుగమం కానుంది. ఉపాధ్యాయ పోస్టులు, ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చిన పోస్టులు పోను మిగిలిన మరో 30 వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలిన పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు ఇచ్చే యోచనలో ముందుకెళుతోంది. -
గ్రూప్–1, 2 ఇంటర్వ్యూలకు గుడ్‌బై?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామక ప్రక్రియలో సంస్కరణలు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం రాత పరీక్షతోనే అభ్యర్థులను ఎంపిక చేసి నియామకాలు చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇంటర్వ్యూ(మౌఖిక పరీక్ష)లకు స్వస్తి పలకాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితే, ఉద్యోగ నియామకాల క్రతువు వేగంగా పూర్తి అవుతుందని, పొరపాట్లకు, ఆరోపణలకు ఆస్కారం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఎస్పీఎస్సీ ఇప్పటివరకు గ్రూప్–2, అంతకంటే తక్కువస్థాయి ఉద్యోగ నియామకాలు మాత్రమే చేపట్టింది. నూతన రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ నేపథ్యంలో సంస్కరణలతో నియామకాల ప్రక్రియ చేపట్టి నూతన ఒరవడిలో సాగవచ్చని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమేనా.... ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్–1 నియామకాల ప్రక్రియ 3 అం చెల్లో సాగింది. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహించేవారు. అనంత రం మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపట్టేవారు. ఇప్పటివరకు గ్రూప్–2లో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు గ్రూప్–1, గ్రూప్– 2ల సిల బస్, పరీక్షల విధానంపై ఇప్పటికే టీఎస్పీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూలను రద్దు చేస్తే సిలబస్‌లో ఏమైనా మార్పులుంటాయా అనే సందేహాలు కూడా వ్యక్తమ వుతున్నాయి. సిలబస్‌లో మార్పు చేస్తే నోటిఫికేషన్ల జారీ మరింత ఆలస్యమయ్యే అవకాశముం దని, నూతన సిలబస్ ఎంపిక, మెటీరియల్ ఫైనలైజేషన్ కొలిక్కి రావడానికి సమ యం పట్టవచ్చని పలువురు భావి స్తున్నారు. అయితే సిల బస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఇంటర్వ్యూలకు సంబం ధించిన అంశాలను కూడా ప్రిలిమ్స్, మెయిన్స్ రాతపరీక్షల్లో కవరయ్యే విధంగా కాస్త మార్పులు చేస్తే సరిపోతుందని సర్వీసు నిబంధనలపై పట్టున్న ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. పొరుగు రాష్ట్రంలో రద్దు గ్రూప్–1, గ్రూప్–2 ఇంటర్వ్యూలను రద్దు చేయాలని పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అక్కడ గత ప్రభుత్వంలోని పెద్దలు, కొందరు అధికారులు ఇంటర్వ్యూ ప్రక్రియను ఆసరాగా చేసు కుని ఇష్టానుసారంగా మార్కులు కేటాయించిన అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పారదర్శకత పాటించే విధంగా అక్కడి ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దుచేయాలని భావించింది. ఉత్తరాదిలో మరి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్వ్యూలు లేకుండా నియామకాలు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. నియామకాలను వేగంగా చేపట్టే లక్ష్యంతో సంస్కరణలు తీసుకురావడం శుభ పరిణామమని నిరుద్యోగులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: రైళ్లు ఢీకొనకుండా...ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’) -
ఏపీపీఎస్ ద్వారా త్వరలో 1,200కు పైగా పోస్టుల భర్తీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా 1,200కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీకానున్నాయి. ఇందుకు సంబంధించి పోస్టుల సంఖ్యపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలోనే సమగ్రంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. గ్రూప్–1, గ్రూప్–2 సహా 1,200కు పైగా పోస్టుల భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వుల అనంతరం ఆగస్టులో ఈ నోటిఫికేషన్లు జారీచేస్తామని ఏపీపీఎస్సీ సభ్యుడు ఎస్.సలాంబాబు మీడియాతో చెప్పారు. ‘ఇటీవల ప్రభుత్వం జారీచేసిన జాబ్ క్యాలెండర్‌పై కొందరిలో కొన్ని అపోహలు తలెత్తాయి. అవేవీ నిజం కాదు. వాస్తవానికి అనేక పోస్టుల భర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీపీఎస్సీ వద్ద 1,180 వరకు ఖాళీ పోస్టుల వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఇవికాకుండా గ్రూప్–1, గ్రూప్–2 కేటగిరీల్లో మరిన్ని పోస్టులు వచ్చే అవకాశం ఉంది’ అని ఆయన వివరించారు. 2018లో జారీచేసిన నోటిఫికేషన్లకు సంబంధించి అర్హులైన అభ్యర్థులు లేక దాదాపు 364 పోస్టులు భర్తీ కాలేదు. వాటితో పాటు ఇతర ఖాళీలభర్తీకి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు. -
ఏపీ: గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలు రద్దు
-
ఏపీ: గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో ఇంటర్వ్యూలు రద్దు
సాక్షి, విజయవాడ: గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఎంచుకోవచ్చు
సాక్షి, అమరావతి: ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు జరిగే గ్రూప్–1 పోస్టుల ఇంటర్వ్యూలను అత్యంత పారదర్శకంగా.. ఎలాంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పటిష్ట చర్యలు చేపట్టింది. గతంలో తలెత్తిన లోపాలను దృష్టిలో ఉంచుకొని.. ఈసారి వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేకుండా కొన్ని కొత్త విధానాలను అమలు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంటర్వ్యూ బోర్డు ఎంపిక అభ్యర్థులదే.. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. అభ్యర్థులు ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో తమకు తామే నిర్ణయించుకోవచ్చు. గతంలో ఏ బోర్డు ముందు ఇంటర్వ్యూకు హాజరు కావాలో ఏపీపీఎస్సీ ముందుగా నిర్ణయించి.. ఆ మేరకు అభ్యర్థులకు తెలిపేది. దీనివల్ల అనేక లొసుగులకు ఆస్కారం ఉండేది. అనేక ఆరోపణలు, విమర్శలూ వెల్లువెత్తేవి. ఇప్పుడు అలాంటి వాటికి చెక్ పెడుతూ అభ్యర్థులే ఇంటర్వ్యూ బోర్డును ఎంచుకునే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు అభ్యర్థులు కమిషన్ కార్యాలయంలోని డబ్బాలో 1, 2, 3 ఇంటర్వ్యూ బోర్డుల నంబర్లతో కూడిన చిట్టీల్లో ఒకదాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఏ బోర్డు నంబర్ వస్తే.. ఆ బోర్డు వద్దకు ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. బోర్డుల ఏర్పాటులో పలు జాగ్రత్తలు గ్రూప్–1 ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు రెండు లేదా మూడు బోర్డులను ఏర్పాటు చేయాలని ఏపీపీఎస్సీ భావిస్తోంది. ఈ బోర్డులకు చైర్మన్, సభ్యుల ఎంపికలోనూ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎవరు ఏ బోర్డులో ఉంటారో అనే విషయం ఆ సభ్యుడికి ఇంటర్వ్యూ సమయానికి కొద్ది నిముషాల ముందు మాత్రమే తెలియనుంది. గతంలో అయితే బోర్డులో ఎవరెవరు సభ్యులో ముందుగానే అందరికీ తెలిసిపోయేది. ఈ విధానంలో అవకతవకలకు, ఆరోపణలకు ఆస్కారమేర్పడుతోందన్న ఉద్దేశంతో ఇప్పుడీ కొత్త పద్ధతిని కమిషన్ ప్రవేశపెడుతోంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా ఐదుగురు ఏరోజుకారోజు ఇంటర్వ్యూ బోర్డుల కూర్పు ఉంటుంది. ప్రతి బోర్డులో చైర్మన్‌తో సహా మొత్తం ఐదుగురు ఉంటారు. వీరిలో ముగ్గురు ఏపీపీఎస్సీ సభ్యులు కాగా.. ఒకరు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి స్థాయి అధికారి, మరొకరు ఐటీ, తదితర రంగాలకు చెందిన ప్రముఖుడు ఉండేలా కమిషన్ చర్యలు చేపడుతోంది. ఒక్కో బోర్డు ఉదయం ఐదుగురికి, సాయంత్రం ఐదుగురికి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది. మార్కుల పద్ధతిలోనూ మార్పులు గ్రూప్–1 ఇంటర్వ్యూలను 75 మార్కులకు నిర్వహిస్తారు. గతంలో.. మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, కావాల్సినవారికి అత్యధిక మార్కులు వేస్తున్నారని, మిగతా వారికి అతి తక్కువ మార్కులు వేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తేవి. మొత్తం 75 మార్కుల్లో తమ వారికి 70కి పైగా వేస్తూ.. మిగతావారికి 10, 20 మార్కులతోనే సరిపెడుతున్నారని, దీనివల్ల రాతపరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన మెరిట్ అభ్యర్థులు అవకాశాలు కోల్పోతున్నారని విమర్శలు చెలరేగేవి. రాతపరీక్షల్లో 500 మార్కులతో అగ్రస్థానంలో ఉన్న అభ్యర్థికి ఇంటర్వ్యూలో 20 మార్కులతో సరిపెట్టి.. తమకు సంబంధించిన అభ్యర్థికి 450 మాత్రమే వచ్చినా ఇంటర్వ్యూలో 70కి పైగా మార్కులు వేయడంతో మెరిట్ అభ్యర్థులు నష్టపోయేవారు. ఇప్పుడు అలాంటి వాటికి ఆస్కారం లేకుండా కమిషన్ మార్కుల కేటాయింపులోనూ నిర్దిష్ట ప్రమాణాలు ఉండేలా చర్యలు చేపడుతోంది. గ్రేడుల ప్రకారం మార్కులు.. 45 నుంచి 68 మార్కుల వరకు ప్రతి నాలుగు మార్కులను ఒక గ్రేడుగా పరిగణిస్తారు. ఆ గ్రేడ్ల ప్రకారం.. అభ్యర్థులకు మార్కుల కేటాయింపు ఉంటుంది. ఎవరికీ 45 మార్కుల కంటే తక్కువ.. 68 మార్కుల కంటే ఎక్కువ ఉండకుండా అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. అనంతరం బోర్డు సభ్యులు ఆయా అభ్యర్థికి వచ్చిన గ్రేడ్ల మార్కులను అనుసరించి.. చివరిగా ఏకాభిప్రాయంతో ఒక గ్రేడ్‌ను నిర్ణయించి.. బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో తుది మార్కులను ఖరారు చేస్తారు. తర్వాత వాటిని రికార్డులోకి ఎక్కించి బోర్డు చైర్మన్, సభ్యులంతా సంతకం చేస్తారు. ‘మాకు తక్కువ వేశారు.. వారికి ఎక్కువ వేశారు’ అనే వాటికి ఆస్కారం లేకుండా జాగ్రత్త వహిస్తారు. ఇంటర్వ్యూ బోర్డు సభ్యులకు అభ్యర్థుల హాల్‌టిక్కెట్ నంబర్, వారు ఏం చదువుకున్నారన్న వివరాలను తప్ప మరే అంశాలను తెలియనివ్వరు. -
పావనికి గ్రూప్–1 కేడర్ ఉద్యోగం
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 ప్రభావంతో గతేడాది మరణించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేశ్ భార్య పావనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–1 కేడర్ ఉద్యోగం (వైద్య,ఆరోగ్య శాఖలో పరిపాలనా ధికారి) ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం పావనికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పావని ఉద్యోగం కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఈటలకు పావని కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పావని తండ్రి సత్యనారాయణ, కుమార్తెలు సంజని, శరణితో పాటు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డా.కత్తి జనార్దన్, సెక్రెటరీ జనరల్ డా. పూర్ణచందర్, వైస్ ప్రెసిడెంట్ డా.రాంబాబు తదితరులున్నారు. -
షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-1 పరీక్షలు: హైకోర్టు
సాక్షి, అమరావతి: గ్రూప్-1 పరీక్షలు వాయిదా వేయాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే గురువారం దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. గ్రూప్-1 పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే కొనసాగించాలని హైకోర్టు ఉత్వర్వులు జారీ చేసింది. అయితే ఈ నెల 14 నుంచి గ్రూప్-1 పరీక్షలు నిర్వహించేందుకు గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఏప్రిల్ 7 నుంచి గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి, అమరావతి : గ్రూప్1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 7వ తేదీ నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు గురువారం రివైజ్డ్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరి 4 నుంచి 16 వరకు ఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పలువురు అభ్యర్థుల నుంచి పరీక్షలు వాయిదా వేయాలని విన్నపాలు అందడంతో కమిషన్ ఇటీవల పరీక్షల్ని వాయిదా వేస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. తేదీల వారీగా, పేపర్ల వారీగా ఆయా పరీక్షల రివజ్డ్ షెడ్యూల్ ఇలా... ఏప్రిల్ 7 : తెలుగుపేపర్ (క్వాలిఫయింగ్ నేచర్) ఏప్రిల్ 8 : ఇంగ్లిష్ పేపర్ (క్వాలిఫయింగ్ నేచర్) ఏప్రిల్ 11 : పేపర్1 ఏప్రిల్ 13 : పేపర్2 ఏప్రిల్ 15 : పేపర్3 ఏప్రిల్ 17 : పేపర్4 ఏప్రిల్ 19 : పేపర్5 వీటితో పాటు గెజిటెడ్ పోస్టులకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 10, 11 : అసిస్టెంట్ బీసీ, సోషల్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ మే 11 : మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ మే 12 : సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, టెక్నికల్ అసిస్టెంట్ ఆటోమొబైల్ ,ఇంజనీరింగ్ పీటీవో, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ కెమిస్ట్ ఏపీ గ్రౌండ్ వాటర్, టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ -
ఏపీపీఎస్సీ ఉద్యోగాల్లో..ఇంటర్వ్యూలు రద్దు
-
గ్రూప్-1పై సందేహాల ముసురు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కీలకమైన గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీచేసిన నోటిపికేషన్‌పై అనేక అనుమానాలు ముసురుకుంటున్నాయి. స్క్రీనింగ్ టెస్టు, మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక, మెయిన్స్‌లో రిజర్వేషన్లను అమలుచేసే విధానంపై అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోపక్క.. గ్రూప్–1 పోస్టుల పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఉండడం, కొత్తగా ప్రకటించిన సిలబస్‌కు తగిన పుస్తకాలు అందుబాటులో లేకపోవడం కూడా అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. రేషియో తేల్చకుండా ఎంతమందిని తీస్తారు? ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో జీఓ 153.. ఆ తరువాత డిసెంబరు చివర్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ముందు 182 పోస్టులు భర్తీచేయిస్తామని జీవో ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత 125 పోస్టులను మాత్రమే ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటన విడుదల చేసింది. వీటిలో కీలకమైన డిప్యుటీ కలెక్టర్ పోస్టులు 30 మాత్రమే ఉన్నాయి. వాస్తవానికి డిప్యుటీ కలెక్టర్ పోస్టులను ప్రభుత్వం తమకు నచ్చిన వారికి పదోన్నతుల ద్వారా నియమించుకుంటుండడంతో పలు సంఘాలు దీనిపై ఆందోళన చేశాయి. దీనిపై ప్రభుత్వం నియమించిన కమిటీ.. డైరెక్టు రిక్రూట్మెంటులో 80 పోస్టులను భర్తీచేయాలని సూచించింది. కానీ, ప్రభుత్వం కేవలం 30 మాత్రమే ప్రకటించింది. వీటితోపాటు మరికొన్ని విభాగాల గ్రూప్–1 పోస్టులను కలిపింది. కాగా, గతంలో ప్రిలిమ్స్ ద్వారా మెయిన్స్‌కు 1 : 50 చొప్పున నిష్పత్తిలో కటాఫ్ మార్కులు నిర్ణయించి ప్రభుత్వం అభ్యర్థులను ఎంపిక చేసేది. కానీ, ఈసారి యూపీఎస్సీ విధానం అంటూ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారీగా కొత్త విధానాన్ని ప్రకటించింది. నోటిఫికేషన్లోనే ఏ నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉండాలో ప్రకటించాల్సి ఉన్నా ఇప్పటివరకు దాన్ని తేల్చలేదు. ఇది తేలిస్తే దాని ప్రకారం కటాఫ్‌పై కూడా స్పష్టత వస్తుంది. ఇప్పటివరకు నిష్పత్తి సంఖ్యను ప్రకటించకపోవడం వెనుక మర్మమేమిటన్న అనుమానాలు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్నాయి. తమకు కావలసిన వారిని మెయిన్స్‌కు ఎంపికయ్యేలా చేయడానికే నిష్పతి సంఖ్యను ప్రభుత్వం ముందుగా ప్రకటించడంలేదని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలి కాగా, డిసెంబరులో నోటిఫికేషన్ ఇచ్చి చదువుకునేందుకు తగినంత సమయం ఇవ్వకుండా ప్రిలిమ్స్ నిర్వహించడం సరికాదని, తమకు కొంత వ్యవధి ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. కొత్తగా సిలబస్ మార్చారని, ప్రామాణిక పుస్తకాలూ పేర్కొనలేదని, సరైన పుస్తకాలు లేక తక్కువ సమయంలో ప్రిపేర్ కాలేకపోతున్నందున ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. కానీ, ఇప్పటికే అభ్యర్థుల కోరిక మేరకు పరీక్ష తేదీని మార్చి 10 నుంచి మార్చి 31కి మార్చామని.. ఇక రెండోసారి పొడిగించలేమని ఏపీపీఎస్సీ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు.. రిజర్వేషన్ల విషయంలోనూ అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు అంటున్నారు. ప్రిలిమ్స్‌లో రిజర్వేషన్‌ను వినియోగించుకుని మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థి అదే కేటగిరీ పోస్టుకు పరిమితం కావలసి ఉంటుందని, ఓపెన్ కేటగిరీ పోస్టుకు అర్హతలేదని ఏపీపీఎస్సీ నిబంధన విధించింది. దీనిని హైకోర్టు తప్పుబడుతూ మెయిన్స్‌లో వారిని ఓపెన్ కేటగిరీలోనూ అనుమతించేలా నోటిఫికేషన్లో మార్పులు చేయాలని ఆదేశించింది. కానీ, కమిషన్ పట్టించుకోవడంలేదని అభ్యర్థులు వాపోతున్నారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం ఇదిలా ఉంటే.. ఇంటర్వ్యూ మార్కుల కేటాయింపుల్లో అనేక మతలబులు జరుగుతున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు అభ్యర్థుల నిష్పత్తి సంఖ్యను నిర్ణయించకపోవడం వెనక కూడా ఇదే కారణమై ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. తమకు కావలసిన వారిని ప్రభుత్వం మెయిన్స్‌కు ఎంపిక చేయించి ఇంటర్వ్యూల్లో ఎక్కువ మార్కులు వేయించడం ద్వారా వారికి గ్రూప్–1 పోస్టులు కట్టబెట్టాలన్న ప్రణాళిక దాగి ఉందేమోనని సందేహిస్తున్నారు. ఎందుకంటే గతంలోనూ ఇంటర్వ్యూ మార్కుల కేటాయింపుల్లో అభ్యర్థుల మధ్య చాలా వ్యత్యాసం ఉందంటున్నారు. గ్రూప్–1 మెయిన్స్‌లో 750 మార్కులకు ప్రధాన పరీక్ష, 75 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుంది. గతంలో ఇంటర్వ్యూల్లో కనిష్ట మార్కులు 20కి లోపే ఉండగా గరిష్ఠ మార్కులు 70 వరకు వేశారని గుర్తుచేస్తున్నారు. ఈ మార్కుల మధ్య వ్యత్యాసం 50 వరకు ఉంటోంది. రాతపరీక్షలో అత్యధిక మార్కులు సంపాదించిన వ్యక్తికి ఇంటర్వ్యూల్లో మార్కులు రాకపోతే తీవ్రంగా నష్టపోతున్నాడు. ప్రభుత్వంలోని పెద్దలు కమిషన్‌పై ఒత్తిడిచేసి ప్రిలిమ్స్ నుంచి తమ వారిని మెయిన్స్‌కు ఎంపిక చేయించుకుని ఇంటర్వ్యూలపైనా ప్రభావం చూపిస్తే రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన వారికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అలా కాకుండా ముందుగానే నిష్పత్తి సంఖ్యను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. -
గ్రూప్–1కు కొత్త సిలబస్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రూప్1 కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలకు కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచనల మేరకు ఈ కొత్త సిలబస్‌ను నిపుణుల కమిటీతో ఏపీపీఎస్సీ తయారు చేయించింది. ఈ ముసాయిదా సిలబస్‌ను తన వెబ్సైట్లో కమిషన్ పొందుపరిచింది. దీనిపై ప్రజలనుంచి, నిపుణులనుంచి సలహాలు, సూచనలు స్వీకరించిన అనంతరం మార్పులు చేర్పులతో తుది సిలబస్‌ను ఖరారు చేయనుంది. ఆగస్టు 3వ తేదీ వరకు తమ సలహాలు, సూచనలను కమిషన్ వెబ్సైట్ ఠీఠీఠీ.pటఛి.్చp.జౌఠి.జీn ద్వారా పంపించవచ్చని ఏపీపీఎస్సీ వివరించింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు రిజర్వుడ్ కేటగిరీల వారీగా అభ్యర్థుల ఎంపిక గ్రూప్1 ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కమిషన్ పలు మార్పులు చేసింది. ప్రిలిమ్స్నుంచి అర్హత సాధించిన వారిని మెయిన్స్‌కు ఎంపిక చేయడానికి కటాఫ్ మార్కులను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం ఇప్పడు కమిషన్‌కు అప్పగించింది. గతంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసేవారు. ఇందులో కేటగిరీలకు సంబంధం లేకుండా అభ్యర్థులు ఎంపికయ్యేవారు. కానీ ఈసారి యూపీఎస్సీ తరహాలో కేటగిరీల వారీగా ఆయా రిజర్వుడ్ పోస్టుల సంఖ్యకు అనుగుణంగా అభ్యర్థులను నిర్ణీత నిష్పత్తిలో ఎంపిక చేయనున్నారు. కటాఫ్‌ను నిర్ణయించి 1:15 లేదా అంతకు మరికొంత ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులను పరిమితం చేసి మెయిన్స్‌కు ఎంపిక చేయనున్నారు. మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్తో పాటు అయిదు సబ్జెక్టులుండేవి. జనరల్ ఇంగ్లిష్‌లో అర్హత మార్కులు సాధించాల్సి ఉండేది. ఇంటర్వ్యూల ఎంపికకు మిగతా అయిదు సబ్జెక్టుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకునే వారు. ఈసారి మెయిన్స్‌లో పేపర్లను ఏడుకు పెంచారు. జనరల్ ఇంగ్లిష్తో పాటు తెలుగు పేపర్‌ను పెడుతున్నారు. రెండింటిలోనూ అర్హత సాధించాల్సి ఉంటుంది. అలా అర్హత సాధించిన వారిలో.. తక్కిన అయిదు పేపర్లలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూలకు పిలవనున్నామని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ సాక్షికి వివరించారు. మెయిన్స్‌లో కొత్తగా తెలుగు సబ్జెక్టు.. గ్రూప్1 మెయిన్స్‌లో గతంలో జనరల్ ఇంగ్లిష్తో పాటు అయిదుపేపర్లు డిస్క్రిప్టివ్ తరహాలో ఉండేవి. ఇప్పుడు అదనంగా తెలుగు సబ్జెక్టును కమిషన్ జతచేసింది. జనరల్ ఇంగ్లిష్, తెలుగు పేపర్లతో పాటు మరో 5 పేపర్లను అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపర్లో 150 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 150 నిముషాల సమయాన్ని కేటాయిస్తారు. - ఇంగ్లిష్‌లో ఎస్సే, లెటర్ రైటింగ్, ప్రెస్ రిలీజ్, అప్పీల్, రిపోర్టు రైటింగ్, రైటింగ్ ఆన్ విజువల్ ఇన్ఫర్మేషన్, ఫార్మల్ స్పీచ్, ప్రిసీస్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్, ట్రాన్స్లేషన్ అంశాలపై ముసాయిదా సిలబస్‌ను కమిషన్ ఖరారుచేసింది. - తెలుగులో వ్యాసరచన (ఆయా అంశాలకు సంబంధించి తాత్వికత, ప్రస్తుత వ్యవహారాల ఆధారంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి) గద్యం, లేదా కవితను విశ్లేషించడం, వ్యాసాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయడం, ఫార్మల్ స్పీచ్, స్టేట్మెంటును రూపొందించడం, లేఖ రాయడం, డిబేట్ రైటింగ్, అప్లికేషన్ రైటింగ్, డైలాగ్ రైటింగ్, ఆంగ్లంనుంచి తెలుగులోకి తర్జుమా తెలుగు వ్యాకరణాంశాలపై సిలబస్‌ను కమిషన్ రూపొందించింది. - పేపర్1లో జనరల్ ఎస్సేలపై ప్రశ్నలుంటాయి. పేపర్2లో హిస్టరీ కల్చర్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, అండ్ ఆంధ్రప్రదేశ్ అంశాలపై ప్రశ్నలుండే వీలుగా సిలబస్‌ను రూపొందించింది. - పేపర్3లో పాలిటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్ అంశాలపై ప్రశ్నలిస్తారు. ఈ మేరకు ముసాయిదా సిలబస్‌ను కమిషన్ పొందుపరిచింది. పేపర్4లో ఎకానమీ, అండ్ డవలప్మెంటు ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ అంశాలపై ముసాయిదా సిలబస్‌ను ఖరారు చేసింది. పేపర్5లో సైన్సు అండ్ టెక్నాలజీ అంశాలపై సిలబస్‌ను పొందుపరుస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు.. ప్రిలిమ్స్‌లో జనరల్ స్టడీస్, జనరల్ ఆప్టిట్యూడ్ పేపర్లలో ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్షను నిర్వహించనున్నారు. ఒక్కో పేపర్‌కు 120 మార్కులకు 120 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. సమయం 120 నిముషాలు. పేపర్1లో హిస్టరీ కల్చర్ 30 మార్కులకు, కానిస్టిట్యూషన్, పాలిటీ, సోషల్‌జస్టిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌కు 30 మార్కులు, ఇండియన్, ఏపీ ఎకానమి, ప్లానింగ్‌కు 30 మార్కులు, జియోగ్రఫీకి 30 మార్కులకు ప్రశ్నలుంటాయి. అందుకు అనుగుణంగా ఆయా అంశాలను ముసాయిదా సిలబస్‌లో పొందుపరిచారు. పేపర్2లో జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్, అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్‌లో 60 మార్కులకు, సైన్స్ అండ్ టెక్నాలజీలో 30 మార్కులకు, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ అంశాల్లో 30 మార్కులకు ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. -
తల్లిదండ్రుల స్ఫూర్తి.. భరత్ కీర్తి
అనంతపురం, ఎస్కేయూ :తల్లి జిల్లా ఖజానా అధికారి , తండ్రి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో సెరికల్చర్ విభాగంలో ప్రొఫెసర్. ఒకరిది బోధన, పరిశోధన రంగం.. మరొకరిది ఆర్థిక పరిపాలన రంగం. ఉన్నత విద్యావంతులైన వారినే స్ఫూర్తిగా తీసుకున్నాడు వారి కుమారుడు. వారు అందించిన ప్రోత్సాహంతో గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. అకుంఠిత దీక్షతో సాగిన ఈ మహాయజ్ఞంలో గ్రూప్–1 విజేతగా నిలిచాడు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కేడర్‌లో ఉద్యోగానికి అర్హత సాధించిన అతనే.. అనంతపురానికి చెందిన ఎస్.భరత్ నాయక్. గ్రూప్–1 ఫలితాలు మార్చిలో వచ్చినప్పటికీ..., ఇటీవల ఫిజికల్ టెస్ట్.. ఫిటెనెస్ పరీక్షల్లో నెగ్గారు. దీంతో పోస్టు ఖాయమైంది. ఎంబీబీఎస్ నుంచి... అనంతపురంలోని శారదనగర్‌కు చెందిన ప్రొఫెసర్ ఎస్ .శంకర్‌నాయక్... శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెరికల్చర్ విభాగాధిపతి. తల్లి శాంతాబాయి.. అనంతపురం కలెక్టరేట్లో జిల్లా ఖజానా అధికారిగా పనిచేస్తున్నారు. వీరి కుమారుడు భరత్ నాయక్. పదో తరగతి వరకు స్థానిక ఎల్‌ఆర్‌జీ స్కూల్లో చదువుకున్నారు. ఇంటర్ పూర్తి చేసిన తర్వాత ఎంసెట్‌లో గణనీయమైన ర్యాంక్ సాధించి, అనంత మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. సివిల్స్ సాధనే లక్ష్యంగా ఎంచుకున్న అతను.. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు హైదరాబాద్‌లోని ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో చేరారు. తొలి విడతలోనే.. డాక్టర్‌గా ప్రొఫెషనల్ కెరీర్ ఉన్నప్పటికీ, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సివిల్స్ సాధనే లక్ష్యంగా శిక్షణ తీసుకుంటున్న తరుణంలోనే 2016లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్–1 నోటిఫికేషన్ వెలువడింది. దానిని చూసిన భరత్‌నాయక్.. తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో దరఖాస్తు చేసుకున్నారు. 2017లో ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు జరిగాయి. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, ఇంటర్వ్యూల్లో నెగ్గారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. కఠోర శ్రమతో... ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందేందుకు చేరిన భరత్ నాయక్.. శిక్షణ తరగతులతో కలిపి రోజూ దాదాపు పది గంటల పాటు ప్రశ్న పత్రాలపై సాధన చేసేవారు. ఎలాంటి పరిస్థిల్లోనూ ఒత్తిళ్లకు లోను కాకుండా లక్ష్య సాధనలో శ్రమించారు. నిత్యమూ వార్త పత్రికలను క్షుణ్ణంగా అధ్యయనం చేసేవారు. సిలబస్ అనుగుణంగా సన్నద్ధమయ్యారు. సివిల్స్‌పైనే దృష్టి ఎంబీబీఎస్ చేస్తున్నపుడే సివిల్స్, గ్రూప్స్ పరీక్షలపై అవగాహన పొందుతూ వచ్చాను. ఎంబీబీఎస్ తర్వాత శిక్షణ ప్రారంభించాను. తల్లిదండ్రుల అంగీకారంతో పట్టుదలతో చదివి ఈ స్థానానికి చేరుకున్నాను. క్రమశిక్షణ, ప్రణాళికాబద్ధంగా, ప్రయత్నిస్తే విజయం సాధించడం కష్టమేమీ కాదు. ప్రజలకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు సాధించడమే నా ముందున్న లక్ష్యం. సివిల్స్ సాధించితీరుతా. తమ్ముడు భార్గవ్‌నాయక్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో బీటెక్ చేస్తున్నాడు. గ్రూప్–1లో మేథమేటిక్స్ పేపరు క్లిష్టంగా ఉండటంతో రెండు నెలల పాటు తమ్ముడి వద్ద ప్రత్యేక శిక్షణ పొందాను. సాక్షిలో రోజూ వచ్చే భవిత మెటీరియల్ దోహదపడింది. సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఉన్న స్టడీ మెటీరియల్ సైతం బాగా ఉపయోగపడింది. ఇతరులతో మనం ఎపుడూ పోల్చుకోకూడదు. ఇంటర్వ్యూలో భారత్–చైనా– అమెరికా సంబంధాల గురించి అడిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పురోగతి గురించి వివరించమన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో సివిల్స్ సర్వీసెస్‌కు సంబంధించిన మెటీరియల్ దోహదపడింది.– ఎస్.భరత్ నాయక్, గ్రూప్–1 విజేత -
పట్టుదలతో సాధించారు!
ఆళ్లగడ్డ: పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించారు ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షంషాద్‌బాను. ఇటీవల విడుదలైన గ్రూప్–1 ఫలితాల్లో బీసీ– మహిళ కోటాలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకు సాధించారు. తద్వారా ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. షంషుద్దీన్, ఫాతిమాబీ దంపతుల కుమార్తె షంషాద్‌బాను. తల్లిదండ్రులు వంట మనుషులుగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పేదరికం కారణంగా షంషాద్‌బాను చదువంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే సాగింది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు స్థానిక ఎంపీపీ మెయిన్ స్కూల్, 6 నుంచి 10 వ తరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ స్థానిక రాఘవేంద్ర ఎయిడెడ్ కళాశాలలో చదివారు. అనంతరం కర్నూలులో డీఎడ్ పూర్తి చేశారు. 2000 నవంబర్‌లో నిర్వహించిన డీఎస్సీలో ఎస్జీటీ టీచర్‌గా ఎంపికయ్యారు. 2002లో వివాహమైంది. పెద్ద చదువులు చదివి ప్రజలకు సేవచేయాలన్న తలంపుతో ఉన్న షంషాద్‌బానుకు టీచర్ ఉద్యోగం పెద్దగా తృప్తినివ్వలేదు. దీంతో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశారు. భర్త మహమ్మద్‌రఫీ కూడా ఆమెను ప్రోత్సహించాడు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ.. మరోవైపు కుటుంబ బాధ్యతలు మోస్తూనే విరామ సమయంలో గ్రూప్స్‌నకు సిద్ధమయ్యారు. 2010 గ్రూప్–1లో ఇంటర్వ్యూ వరకు వెళ్లారు. అంతటితో నిరుత్సాహ పడకుండా మళ్లీ 2011 గ్రూప్–1లో పోటీపడ్డారు. ఇందులో 363 మార్కులు సాధించారు. బీసీ మహిళ కోటాలో స్టేట్ రెండో ర్యాంకు సాధించి..ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. ఈ పోస్టుపైనా పెద్దగా ఆసక్తి లేదని, ఎలాగైనా ఆర్డీవో పోస్టు సాధించడమే తన లక్ష్యమని, అందుకు ఇప్పటి నుంచే మళ్లీ ప్రిపేర్ అవుతున్నానని షంషాద్‌బాను చెప్పారు. -
ఇద్దరూ ఇద్దరే
కృషితో నాస్తి దుర్భిక్షం.. అన్న పదానికి సిసలైన నిదర్శనంగా నిలిచారు. రేయింబవళ్లు యజ్ఞంలా శ్రమించారు. అదే వారిద్దరినీ గ్రూప్ వన్ విజేతల్ని చేసింది. అత్యుత్తమ ర్యాంకుల్ని కట్టబెట్టింది. ప్రతిష్టాత్మకమైన గ్రూప్–1 పరీక్ష ఫలితాల్లో పార్వతీపురానికి చెందిన ఇద్దరికి వరుసగా 2, 3 ర్యాంకులు లభించడం విశేషం. పంచాయతీరాజ్ శాఖలో డివిజినల్ అకౌంట్స్ అధికారి కె.హేమలతకు రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంకు, పార్వతీపురం వివేక్ కాలనీకి చెందిన భవానీశంకర్‌కు రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు లభించాయి. పార్వతీపురం: శ్రీకాకుళం జిల్లా కనుగులవాని పేట గ్రామం వ్యవసాయ కుటుంబానికి చెందిన హేమలత తండ్రి రైతు. పిల్లలకు ఉన్నత విద్య చదివించి వారిని ప్రయోజకులను చేయాలని పరితపించేవారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగానే పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. హేమలత అక్క హైమావతి ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. సోదరుడు జగదీశ్వరరావు తెలంగాణా నీటిపారుదల శాఖలో ఏఈఈగా పనిచేస్తున్నారు. హేమలత భర్త నర్సీపట్నంలో అటవీ శాఖాధికారిగా పనిచేస్తున్నారు. 2007లో సివిల్స్‌లో 13 మార్కులతో, 2010లో 1 మార్కుతో ఇంటర్వ్యూ వరకు వచ్చి అవకాశం చేజార్చుకున్నారు. 2016లో గ్రూప్–1 మెయిన్స్ పరీక్షను రాసి తాజాగా రాష్ట్ర స్థాయిలో రెండోస్థానంలో నిలి చారు. మహిళా విభాగంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారు. రోజూ 13 గంటలు చదివా రోజుకు 13 గంటల పాటు చదివాను. రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకును సాధించుకున్నందుకు ఆనందంగా ఉంది. తొలి ప్రయత్నం తోనే 460.5 మార్కులు సాధించాను. ప్రజలకు ఏదైనా చేయడానికి నాకు ఒక అవకాశం లభించిందన్న సంతోషం ఎక్కువగా కలుగుతోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. – భవానీశంకర్, పార్వతీపురం తండ్రి స్ఫూర్తితో మూడో ర్యాంకు సాధించిన భవానీ శంకర్ స్వస్థలం గరుగుబిల్లి మండలం గిజబ గ్రామం. ప్రస్తుతం పార్వతీపురంలో నివసిస్తున్నారు. ఆయన తండ్రి అప్పలనాయుడు డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసేవారు. కార్యాలయంలో, ఇంటా బయటా తండ్రికి లభించే గౌరవం, ప్రజా సమస్యలపై ఎప్పుడు చర్చించడం గమనించేవాడు. ఏదైనా పనిచేసి పెడితే ప్రజలు చూపించే అభిమానంతో స్ఫూర్తి పొందాడు. తండ్రి అప్పలనాయుడు, తల్లి రూపాదేవి ప్రోత్సాహం లక్ష్యానికి తోడైంది. భవానీ శంకర్ 10వ తరగతి వరకు పార్వతీపురంలోనే చదివారు. ఎంసీఏ చేసినప్పటికీ గ్రూప్స్‌పై ఇష్టంతో కష్టపడి చదివి విజయం సాధించారు. -
మహిళా టాపర్‌గా హేమలత
మారుమూల పల్లెటూరు... సాధారణ వ్యవసాయ కుటుంబం... ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం... ఇవేవీ ఆమె లక్ష్యానికి అడ్డంకి కాలేదు! స్వయంకృషితో ఆమె ఒక్కో మెట్టూ ఎక్కుతుంటే కుటుంబం అండగా నిలిచింది! సివిల్ సర్వీసెస్ తర్వాత అంత అత్యున్నతమైన ఉద్యోగాన్ని సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి! తొలిసారిగా ఒక గ్రూప్–1 టాపర్‌ను సమాజసేవకు అందించిన కనుగులవానిపేటలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి! ఇంతటి భావోద్వేగాలకు కారణమైన ఆమె పేరు కనుగుల హేమలత! గ్రూప్–1 (2011)లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. మహిళల్లోనే టాపర్‌గా నిలిచింది. సిక్కోలు సిగలో మరో మణిపూసగా మెరిసింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:శ్రీకాకుళం రూరల్ మండలంలో ఇప్పిలి శివారు గ్రామమైన కనుగులవానిపేట ముద్దుబిడ్డే హేమలత! ఆమె తండ్రి ప్రసాదరావు, తల్లి సుజాత. వారిది వ్యవసాయ కుటుంబం. ఆరోగ్యపరమైన కారణాల వల్ల ప్రసాదరావు పాఠశాల స్థాయిలో అర్ధంతరంగా చదువు ముగించాల్సి వచ్చింది. ఆయన సోదరులంతా విద్యాభ్యాసం ద్వారానే మంచి స్థానంలోకి వెళ్లారు. ఉన్నత విద్యాభ్యాసం చేయాలి, సమాజసేవ చేయాలి అనే కలలను తన పిల్లల ద్వారా సాకారం చేయాలని తపించారు. అందుకు తగ్గట్లే హేమలత సహా ముగ్గురు పిల్లలూ గౌరవనీయమైన ఉద్యోగాలు సాధించారు. ప్రసాదరావు పెద్ద కుమార్తె హైమావతి ఆమదాలవలస మున్సిపల్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. కుమారుడు జగదీశ్వరరావు జలవనరుల శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని దేవరకొండలోనే ఆయన ఉన్నారు. ఇప్పుడు రెండో కుమార్తె హేమలత గ్రూప్–1లో టాపర్‌గా నిలిచారు. ఈ ర్యాంకు డిప్యూటీ కలెక్టరు ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజసేవ చేయడానికి, తద్వారా ఉన్నతస్థాయిలో తగిన గుర్తింపు పొందడానికి అవకాశం రావడంతో హేమలత కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. స్వయంకృషితోనే ఒక్కో మెట్టూ... కనుగులవానిపేటలో ప్రసాదరావు కుటుంబానికి మూడెకరాల మెట్టు భూమి ఉంది. గతంలో చిన్న రైస్‌మిల్లు కూడా ఉండేది. ఆయన ఆరోగ్యం అంతగా సహకరించకపోవడంతో వాటిపై వచ్చే ఆదాయంతోనే కుటుంబపోషణ చూసేవారు. కానీ ఏదేమైనా బాగా చదువుకోవాలని పిల్లలకు నూరిపోసేవారు. తండ్రి మనస్సును అర్థం చేసుకున్న పిల్లలు ముగ్గురూ కష్టపడి చదివారు. హేమలత ప్రాథమిక విద్యాభ్యాసం కనుగులవానిపేట పాఠశాలలోనే చదివారు. అయితే గురుకుల పాఠశాలలో చేర్పిస్తే చదువు బాగుంటుందనే విశ్వాసం అప్పట్లో ఉండేది. దీంతో తండ్రి ప్రోత్సాహంతో హేమలత ఎచ్చెర్లలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో సీటు సాధించింది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకూ అక్కడే విద్యాభ్యాసం సాగింది. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో 2001 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో ఉన్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు వచ్చింది. అప్పుడే తోటి స్నేహితుల మధ్య సివిల్స్, గ్రూప్–1 గురించి చర్చ వచ్చేదని, సమాజసేవ నేరుగా చేసే అవకాశం ఆ ఉద్యోగాల్లో ఉంటుందనే విషయం తెలిసిందని హేమలత చెప్పారు. కానీ ఇంటర్ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్ ఏడాది చేసినా ఆశించిన ర్యాంకు రాలేదు. అక్క హైమావతి ప్రోత్సాహంతో టీచర్ ట్రైనింగ్ వైపు దృష్టి పెట్టారు. 2002లో శ్రీకాకుళం డైట్లో సీటు సాధించారు. 2004లో కోర్సు పూర్తి చేస్తుండగానే డీఎస్సీ–2003 నోటిఫికేషన్ వెలువడింది. ఆ పరీక్షల్లోనూ రాష్ట్రస్థాయిలో మహిళా టాపర్‌గా హేమలత నిలిచారు. 2005లో సెకండ్‌గ్రేడ్ టీచర్ ఉద్యోగం పొందారు. ఎల్ఎన్ పేట మండలం బొత్తాడసింగి పాఠశాలలో, తర్వాత 2012 వరకూ ఎచ్చెర్ల మండలంలో పనిచేశారు. ఒకవైపు టీచర్ ఉద్యోగం చేస్తూనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కూడా పూర్తి చేశారు. 2012లో డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం పార్వతీపురంలో పనిచేస్తున్నారు. పదేళ్ల పరిశ్రమ ఫలించింది సివిల్స్, గ్రూప్స్ పరీక్షలకు 2007 సంవత్సరంలోనే హేమలత ప్రిపరేషన్ ప్రారంభించారు. గ్రూప్–1 2007 నోటిఫికేషన్లో తొలి ప్రయత్నంలోనే ఇంటర్వ్యూ దశ వరకూ వెళ్లారు. త్రుటిలో అవకాశం చేజారింది. తర్వాత మరో రెండు నోటిఫికేషన్లలోనూ ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. ఇక ఆఖరి ప్రయత్నంగా 2011 గ్రూప్–1 నోటిఫికేషన్లో దరఖాస్తు చేశారు. 2012లో మెయిన్స్, ఇంటర్వ్యూ ఆమె బాగానే చేశారు. కానీ న్యాయపరమైన వివాదాల వల్ల ఫలితాలు రద్దు చేసినా ఆమె నిరాశపడలేదు. 2016 సెప్టెంబర్‌లో మరోసారి మెయిన్స్ పరీక్షలు, ఇటీవలే నిర్వహించిన ఇంటర్వ్యూలో బాగానే అటెమ్ట్ చేశానని, తప్పక మంచి పోస్టు వస్తుందని ఆశించానని హేమలత చెప్పారు. ఆశించినట్లే రెండో ర్యాంకు, మహిళలలో ప్రథమ ర్యాంకు రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. భర్త నుంచి ప్రోత్సాహం హేమలత భర్త కె.తవిటినాయుడు ప్రస్తుతం విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ రేంజ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఈ దంపతులకు రెండేళ్ల కుమారుడు ప్రణవ్ ఉన్నాడు. తన విజయంలో తల్లిదండ్రులు, సోదరి, సోదరుడుతో భర్త ప్రోత్సాహం కూడా ఎంతో ఉందని హేమలత చెప్పారు. గ్రామీణ ప్రాంతవారమని నిరాశ వద్దు ‘ఉన్నత ఉద్యోగాల సాధనకు గ్రామీణ నేపథ్యం ఏమాత్రం అడ్డంకి కాదు. గ్రామీణ ప్రాంతవారమని అమ్మాయిలకు నిరాశ వద్దు. కష్టపడి, ఇష్టపడి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అభిరుచిని బట్టి ఏ రంగాన్ని ఎంచుకున్నా లక్ష్యం సాధించేవరకూ విశ్రమించకూడదు.’ – కనుగుల హేమలత, గ్రూప్–1 విజేత -
ఏపీ గ్రూప్1 తొలి ర్యాంకర్‌తో ముఖాముఖి
-
ఐఏఎస్ అయ్యింది.. ఐపీఎస్ ఆగింది
సాక్షి, హైదరాబాద్: కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారుల జాబితా కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నుంచి వారం క్రితమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. కానీ కన్ఫర్డ్ ఐపీఎస్‌ల జాబితా మాత్రం సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)లోనే మూలుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ 20 రోజుల క్రితం కన్ఫర్డ్ ఐపీఎస్ అధికారుల జాబితాను జీఏడీకి పంపింది. అప్పటి నుంచి ఇప్పటివరకు అసలు ఆ జాబితా ఎక్కడుంది? ఎందుకు పెండింగ్‌లో ఉంది? అనే విషయంపై స్పష్టత కరువైంది. ఇప్పటికే నాలుగేళ్లుగా ప్యానల్ జాబితా హస్తిన చేరక ఐపీఎస్‌ల కొరత ఏర్పడింది. సీనియారిటీ సమస్యతో పెండింగ్‌లో పడుతూ వస్తోంది. తీరా జాబితా తెప్పించుకొని రోజులు గడుస్తున్నా ఎందుకు పెండింగ్‌లో ఉందో పోలీస్ శాఖ సరైన కారణం చెప్పలేకపోతోంది. అన్నీ ఉన్నా.. డీఎస్పీల సీనియారిటీ సమస్యలతో కన్ఫర్డ్ ఐపీఎస్ ప్రతిపాదనలు ఆలస్యమవుతూ వస్తున్నాయి. కానీ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతికి సీనియారిటీతో సమస్య లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రూప్–1 నుంచి డీఎస్పీలుగా ఎంపికైనా అధికారులు కనీసం 8 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి కచ్చితమైన ఖాళీ పోస్టులో పనిచేస్తూ ఉంటే కన్ఫర్డ్ ఐపీఎస్‌కు పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే ఎలాంటి అడ్హాక్ పదోన్నతిపై పనిచేయకుండా ఉన్న అధికారుల జాబితానూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2007 బ్యాచ్ అధికారులు కచ్చితమైన సీనియారిటీ, ఖాళీ పోస్టులోనే పనిచేస్తున్నారు. అయినా జాబితా పెండింగ్‌లో ఉంచడం వెనుక కారణాలేంటని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఎస్పీ స్థాయి అధికారుల కొరత తీవ్రంగా ఉన్నందున ఉన్నతాధికారులు త్వరితగతిన జాబితాను హస్తినకు పంపించాలని సొంత శాఖ నుంచే డిమాండ్ వినిపిస్తోంది. -
కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది?
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ - 1, గ్రూప్ -2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర నియామక పరీక్షల్లో 150 మార్కులకు జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స ఒక భాగం. జనరల్ సైన్‌సలోని సబ్జెక్టుల్లో భౌతిక రసాయన శాస్త్రాలు, బయాలజీ ముఖ్యమైనవి. వీటిలో భౌతిక శాస్త్రానికి సంబంధించి 12 నుంచి 18, బయాలజీ నుంచి 10 - 15, రసాయన శాస్త్రానికి సంబంధించి 3 నుంచి 6 ప్రశ్నల వరకు అడుగుతారు. వీటితోపాటు సైన్స అండ్ టెక్నాలజీ విభాగం నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి. మొత్తంమీద జనరల్ సైన్స, సైన్స అండ్ టెక్నాలజీలకు కలిపి 25 నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఏ అంశంపై ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంది లాంటి అంశాలను తెలుసుకోవాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. భౌతిక శాస్త్రంలో ముందుగా భౌతిక రాశులు, బలం, ఉష్ణం, కాంతి, ధ్వని, అయస్కాంతత్వం, విద్యుత్ మొదలైన పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. వీటి కోసం 10వ తరగతి వరకు ఉన్న భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు శుద్ధగతిక శాస్త్రం, విశ్వ గురుత్వాకర్షణ, ప్రవాహిలు, తలతన్యత, ద్రవ్యరాశి కేంద్రం, ఆధునిక భౌతిక శాస్త్రం లాంటి అంశాలపై కూడా ఇటీవల ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి కోసం 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలతోపాటు ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలను కూడా చదవాలి. అభ్యర్థికి 10వ తరగతి వరకు ఉన్న అన్ని అంశాలపై సాధారణ అవగాహన ఉండాలనేది జనరల్ స్టడీస్ ముఖ్య ఉద్దేశం. పరీక్షల దృష్ట్యా జనరల్ సైన్సలో భౌతిక శాస్త్రానికి వెయిటేజీ ఉంది. శిక్షణా సంస్థల్లో కొంతమంది అధ్యాపకులు తరచుగా కొన్ని టాపిక్స్‌ను మాత్రమే బోధించి, వాటి నుంచే ప్రశ్నలు వస్తాయని చెబుతారు. కానీ పోటీ పరీక్షలకు సంబంధించి నిర్దిష్టంగా ఒక టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయని చెప్పలేం. వర్తమాన అంశాల ప్రాధాన్యాల ఆధారంగా ఏ పాఠ్యభాగం నుంచైనా ప్రశ్నలు ఇవ్వవచ్చు. అందువల్ల అభ్యర్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకొని వాటికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి. భౌతిక శాస్త్రంలో సాధారణంగా స్టాండర్డ జీకే, ప్యూర్ సైన్స, అప్లయిడ్ సైన్స లేదా జనరల్ సైన్స అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. శాస్త్రవేత్తలు, పరికరాల పేర్లు, ఆవిష్కరణలు- సంవత్సరాలు మొదలైనవి స్టాండర్డ జీకేకు సంబంధించిన అంశాలు. కొన్ని ఉదాహరణలు.. 1. టెలిస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 2. అచ్చుయంత్రాన్ని కనుగొన్నదెవరు? 3. విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదించిందెవరు? 4. ఐన్‌స్టీన్‌కు ఏ సిద్ధాంతానికి నోబెల్ బహుమతి లభించింది? 5. ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? 6. ‘యురేకా’ అని అరిచిందెవరు? సమాధానాలు 1) గెలీలియో 2) జాన్ గూటన్ బర్గ 3) న్యూటన్ 4) ఐన్‌స్టీన్ ‘ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్’ కనుగొన్నందుకు నోబెల్ బహుమతి లభించింది. వాస్తవానికి ఈయన సాపేక్ష సిద్ధాంతానికి నోబెల్ వస్తుందని భావించారు. 5)1921 6) ఆర్కిమెడిస్. గ్రీకు భాషలో ‘యురేకా’ అంటే ‘కనుగొన్నాను’ లేదా ‘తెలుసుకున్నాను’ అని అర్థం. నూతన విషయాన్ని కనుగొన్న సందర్భంలో ఆర్కిమెడిస్ ‘యురేకా’ అని గట్టిగా అరుస్తూ వీధుల వెంట తిరిగారు. ప్యూర్ సైన్సలో భాగంగా ఒక్కోసారి ఫిజిక్స్‌లో సమస్య (ప్రాబ్లం)లపై కూడా ప్రశ్నలు అడగవచ్చు. సులభమైన అంశాలు, దాదాపుగా నేరుగా సమాధానం గుర్తించేవిధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సమస్యలపై అడిగిన కొన్ని ప్రశ్నలను గమనించండి. 1. ఒక వస్తువు వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఎన్నిరెట్లు అవుతుంది? 2. ఒక రేడియోధార్మిక మూలకం అర్ధజీవిత కాలం 4 సంవత్సరాలు. అయితే అది 3/4వ వంతు విఘటనం చెందడానికి పట్టే కాలం ఎంత? 3. ఒక గ్రహం, దాని నక్షత్రానికి మధ్య ఉన్న దూరం రెట్టింపు అయితే దాని ఆవర్తన కాలం ఎన్ని రెట్లు అవుతుంది? సమాధానాలు 1) 4 రెట్లు 2) 8 సంవత్సరాలు 3) 2శీ2 రెట్లు మూడో విభాగమైన అప్లయిడ్ సైన్స నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తాయి. ఫిజిక్స్‌లో సుమారు తొంభై శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే ఉంటాయి. దీంట్లో భాగంగా మౌలికాంశాలతో పాటు వివిధ ధర్మాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, వాటి అనువర్తనాలపై ప్రశ్నలు అడుగుతారు. ఉదా: కాంతి ధర్మాలు, అయస్కాంతాల సాధారణ ధర్మాలు, ధ్వని ధర్మాలు. నియమాలకు సంబంధించి న్యూటన్ గమన నియమాలు, కెప్లర్ గ్రహగమన నియమాలు, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం, ఆర్కిమెడిస్ సూత్రం, ప్లవన సూత్రం, బెర్నౌలీ సిద్ధాంతం, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, పాస్కల్ సూత్రం మొదలైనవాటిని క్షుణ్నంగా చదవాలి. వీటి ఆధారంగా నిజ జీవితంలో జరిగే సంఘటనల్ని విశ్లేషించుకోవాలి. అభ్యర్థి సబ్జెక్ట్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించడంతో పాటు జనరల్ సైన్సలో ప్రశ్నలను అడగడంలో ఉన్న మరో ముఖ్య ఉద్దేశం విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించడం. విషయాన్ని బట్టీపట్టడం కంటే అర్థం చేసుకుంటూ చదివినప్పుడే ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు. ఎక్కువగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను చదవడం వల్ల నిర్మాణాత్మక పరిజ్ఞానం, సామర్థ్యం, తార్కిక విశ్లేషణ సాధ్యం కాదు. అందువల్ల ప్రధాన కాన్సెప్టులను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ప్రయోజనకరం. పాఠ్యాంశాలపై పట్టు సాధించిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా ప్రశ్నలను సాధన చేయాలి. అభ్యర్థులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో ఒక వస్తువు భారం దేంట్లో గరిష్ఠంగా ఉంటుంది? 1) శూన్య ప్రదేశం 2) హైడ్రోజన్ 3) గాలి 4) నీరు 2. నీటిలో తేలియాడుతున్న వస్తువు దృశ్యభారం ఎంత? 1) శూన్యం 2) వస్తువు నిజ భారంలో సగం 3) వస్తువు నిజ భారానికి సమానం 4) వస్తువు నిజ భారానికి రెట్టింపు 3. ఒక ప్రవాహిలో మునిగి ఉన్న వస్తువు ఘ.ప. 200 ఘనపు సెంటీమీటర్లు. అయితే అది ఎంత ఘనపరిమాణం ఉన్న నీటిని స్థానభ్రంశం చెందిస్తుంది? 1) 0 2) 50 ఘ.సెం.మీ. 3) 200 ఘ.సెం.మీ. 4) 400 ఘ.సెం.మీ 4. ఒక ప్రవాహిలో వేలాడుతున్న వస్తువు దృశ్యభారం ఎంత? 1) దాని నిజ భారానికి రెట్టింపు 2) నిజ భారానికి సమానం 3) నిజ భారంలో సగం 4) శూన్యం 5. ఆకుపచ్చని కాంతిలో పసుపు పచ్చని పుష్పం ఏ వర్ణంలో కనిపిస్తుంది? 1) తెలుపు 2) నలుపు 3) ఆకుపచ్చ 4) పసుపు పచ్చ 6. కిందివాటిలో ప్రాథమిక వర్ణం కానిది? 1) ఎరుపు 2) ఆకుపచ్చ 3) పసుపుపచ్చ 4) నీలం 7. అణు రియాక్టర్లలో మితకారిణి విధి ఏమిటి? 1) చర్యా వేగాన్ని మార్చడం 2) న్యూట్రాన్ల వేగాన్ని పెంచడం 3) న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం 4) ఉష్ణోగ్రతను తగ్గించడం 8. భారజలం రసాయనిక నామం? 1) డై హైడ్రోజన్ ఆక్సైడ్ 2) హైడ్రోజన్ డయాక్సైడ్ 3) డ్యుటీరియం ఆక్సైడ్ 4) హైడ్రోజన్ పెరాక్సైడ్ 9. ఒకే సైజు, ఒకే ఆకృతిలో ఉన్న అ, ఆ అనే రెండు లోహపు డబ్బాలను ఒకే పదార్థంతో తయారు చేశారు. వాటిని 40ఇ ఉష్ణోగ్రత వద్దనున్న నీటితో పూర్తిగా నింపి ఒకదాన్ని వేడిచేసి, మరో దాన్ని చల్లారిస్తే ఆ రెండింటిలో నీటి ఘనపరిమాణం ఏమవుతుంది? 1) అలో పెరిగి ఆలో తగ్గుతుంది 2) అలో తగ్గి ఆలో పెరుగుతుంది 3) రెండింటిలో పెరుగుతుంది 4) రెండింటిలో తగ్గుతుంది 10. పీడనం పెరగడం వల్ల నీటి భాష్పీభవన స్థానం? 1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు 11. కిందివాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది? 1) బంగారం 2) వజ్రం 3) కోబాల్ట్ 4) ఆల్కహాల్ 12. మాక్ నంబర్ దేనికి సంబంధించింది? 1) ఉష్ణోగ్రత 2) వేగం 3) పీడనం 4) భారం 13. ఒక ట్యూబ్ లైట్ 40 వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాన్ని ఎన్ని గంటలపాటు వెలిగిస్తే 1 యూనిట్ కరెంట్ వినియోగం అవుతుంది? 1) 40 2) 25 3) 24 4) 10 14. ఉష్ణోగ్రతతో నీటి స్పర్శ కోణం? 1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) స్పర్శ కోణం ఉష్ణోగ్రతపై ఆధారపడదు 15. భూస్థావర ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వద్ద తిరుగుతాయి? 1) 1000 కి.మీ. 2) 3200 కి.మీ. 3) 3600 కి.మీ. 4) 36,000 కి.మీ. 16. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్ది పీడనం? 1) తగ్గుతుంది 2) పెరుగుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు 17. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు? 1) టాలమీ 2) కోపర్నికస్ 3) గెలీలియో 4) న్యూటన్ 18. భూమిపై ప్రదేశం లేదా విశ్వంలోని ఏదైనా స్థానం ఆధారంగా ఒక వస్తువు ద్రవ్యరాశి, భారానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది? 1) ద్రవ్యరాశి, భారం రెండూ స్థిరంగా ఉంటాయి 2) ద్రవ్యరాశి, భారం రెండూ మారతాయి 3) ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది కానీ భారం మారుతుంది 4) భారం స్థిరంగా ఉంటుంది కానీ ద్రవ్యరాశి మారుతుంది 19. 1 కేజీ, 10 కేజీల ద్రవ్యరాశి ఉన్న రెండు వస్తువులను సమాన వేగాలతో నిటారుగా పైకి విసిరితే, ఆ రెండింటిలో ఏది గరిష్ఠ ఎత్తుకు చేరుతుంది? 1) 1 కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు 2) 10 కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు 3) రెండూ సమాన గరిష్ఠ ఎత్తునకు చేరుకుంటాయి 4) వాటి గరిష్ఠ ఎత్తు అనేది పైకి విసిరిన సాధారణ వేగంపై ఆధారపడి ఉంటుంది 20. కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది? 1) సెకన్ 2) నిమిషం 3) గంట 4) రోజు సమాధానాలు 1) 1; 2) 1; 3) 3; 4) 4; 5) 2; 6) 3; 7) 3; 8) 3; 9) 3; 10) 1; 11) 3; 12) 2; 13) 2; 14) 2; 15) 4; 16) 1; 17) 2; 18) 3; 19) 3; 20) 1