అమరావతి: ఏపీలో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 111 గ్రూపు-1 పోస్టులకు గాను 259 మంది ఇంటర్వ్యూ దశకు అర్హత సాధించారు. వీరిలో 39 మంది స్పోర్ట్ కోటా నుండి ఎంపికయ్యారు.
గ్రూప్-1 పరీక్ష జరిగిన కేవలం 34 రోజులలోనే ఫలితాలు విడుదల చేసింది ఏపీపీఎస్సీ . జూన్ 3 నుండి 10వ తారీఖు వరకు జరిగిన మెయిన్స్ పరీక్షలకు మొత్తం 5035 మంది హాజరు కాగా వారిలో నుండి 259 మంది ఇంటర్వ్యూకి అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి గ్రూప్-1 ఇంటర్వ్యూలు జరుగుతాయి.
ఏపీపీఎస్సీ ప్రతిష్టాత్మంకంగా నిర్వహించిన గ్రూపు-1 పరీక్షలు ఎటువంటి అక్రమాలకు, అవినీతికి తావివ్వకుండా జాగ్రత్తలు పాటిస్తూ నిర్వహించారు. ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, కార్యదర్శి జె.ప్రదీప్‌కుమార్ పర్యవేక్షణలో మూల్యాంకనం స్క్రూటినీ కార్యక్రమాలన్నీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా జరిగింది.
ఆగస్టు మొదటి వారంలో ఇంటర్వ్యూలను నిర్వహించి సెప్టెంబర్ నాటికి అభ్యర్థుల నియామకాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది కమిషన్. ముందుగా నిర్ణయించినట్టుగానే క్యాలెండర్ ప్రకారం సకాలంలోనే నియామకాలు జరుగుతాయని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment