ట్యాబ్స్ ద్వారా ప్రశ్నాపత్రాల పంపిణీ
షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
విశాఖ, విజయవాడ, అనంతపురం, తిరుపతిలలో సెంటర్లు
సాక్షి, అమరావతి: గ్రూప్–1 మెయిన్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏడు పేపర్లకు వరుసగా ఏడు రోజులు పరీక్షలు(డిస్క్రిప్టివ్) నిర్వహిస్తారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రశ్నాపత్రాలను ట్యాబ్స్ ద్వారా పంపిణీ చేయనున్నారు. 2023 డిసెంబర్‌లో 89 గ్రూప్–1 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు.
గతేడాది మార్చి 17న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50) 4,496 మంది మెయిన్స్‌కి ఎంపికయ్యారు. వీరికి మేలో విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి తెలిపారు.
పరీక్షల షెడ్యూల్ ఇదీ..
మే 3: తెలుగు పేపర్ (అర్హత పరీక్ష)
మే 4: ఇంగ్లిష్ పేపర్ (అర్హత పరీక్ష)
మే 5: పేపర్–1: జనరల్ ఎస్సే
మే 6: పేపర్–2: భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర–సంస్కృతి, భూగోళిక అంశాలు
మే 7: పేపర్–3: పాలిటీ,భారత రాజ్యాంగం, పాలన, లా అండ్ ఎథిక్స్
మే 8: పేపర్–4: భారత, ఆంధ్రప్రదేశ్‌ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి.
మే 9: పేపర్–5: సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు
Comments
Please login to add a commentAdd a comment