Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Press Meet On Pulivendula ZPTC Bypolls Updates1
చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎలక్షన్‌ కావొచ్చు: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతలు లేవనడానికి.. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా దాడులే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. సాక్షాత్తూ కలెక్టర్‌ సమక్షంలో దొంగ ఓట్లు వేయడం, పోలీసులే దగ్గరుండి రిగ్గింగ్‌ జరిపించడాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనబడటం లేదు. ప్రజాస్వామ్యం లేదన్నది ఎన్నికల్లో రుజువైంది. రాష్ట్రంలో ఎలాంటి పరిస్తితులున్నాయో చెప్పడానికి పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ఉదాహరణ. పోలింగ్ బూత్ లలో వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు లేరు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు బూత్ లలో లేకుండా చేసి రిగ్గింగ్ చేసుకున్నారు. పోలీసుల ప్రోద్భలంతో రిగ్గింగ్ చేసుకున్నారు. దేశంలో పోలింగ్ బూత్ ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరిగింది ఇక్కడేపులివెందులలో జరిగింది ఎన్నిక అంటారా?పోలింగ్ బూత్ ఏజెంట్లకు కొన్ని హక్కులు.. బాధ్యతలుంటాయ్. నకిలీ ఓటర్లను గుర్తించడం , అభ్యంతరాలను తెలియజేయడం , పోలింగే వివరాలను తెలుసుకోవడం వంటి బాధ్యతలుంటాయి. పోలింగ్ ఏజెంట్లను నియమించుకునేందుకు ఫామ్ -12 ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ఏజెంట్ల నుంచి ఫామ్ -12 ను పోలీసులు,టిడిపి వాళ్లు లాక్కున్నారు. పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఎన్నిక జరగడం చరిత్రలో ఎక్కడా చూడలేదు. ప్రజాస్వామ్యం ఇంతలా దిగజారిపోయిన పరిస్థితులు ఏపీలోనే చూస్తున్నాం. ఎన్నిక ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. ఇవన్నీ ఎన్నికలో జరిగాయా?. ఏజెంట్లే లేకుండా జరిగితే వాటిని ఎన్నికలు అంటారా?..ఇదే తరహాలో ఎన్నికలు జరిపితే హాస్యాస్పదమే అవుతుంది. ఇంతటి దానికి ఎన్నికలు జరపడం దేనికి. ప్రజలకు మంచి చేయాలనే ఉద్ధేశం ఈ ప్రభుత్వానికి లేదు. దోచుకో.. పంచుకో.. తినుకో.. ఇది వాళ్ల విధానం. ఒకప్పుడు బందిపోట్ల పేరు చెబితే వినిపించే చంబల్ లోయను మరిపించేలా చంద్రబాబు పులివెందుల ఎన్నిక జరిపారు. సాక్షాత్తూ పోలీసులు దగ్గరుండి ప్రోత్సహించారు. చంద్రబాబుకు ఇదే నా ఛాలెంజ్.. ప్రజలు మీకు ఓటు వేస్తారనే నమ్మకం ఉంటే ఎన్నికలను రద్దు చేయండి. కేంద్ర బలగాల సమక్షంలో ఎన్నిక జరపండి.. .. ప్రజాస్వామ్యంలో మీకు ఓట్లు వేసే అవకాశం లేదు. ప్రతీ బూత్ లో వెబ్ కాస్టింగ్, సీసీ ఫుటేజ్ ఇచ్చే ధైర్యం మీకుందా?. ఎవరెవరు బయటి నుంచి వచ్చారు..ఎవరెవరు బూత్ లను ఆక్రమించుకున్నారో ఆధారాలిస్తా. అడ్డగోలు రాజకీయాలు చేసే వాళ్లను మోసగాడు అంటారు. ఏ ఎన్నిక జరిగినా ఆ ఊర్లో ప్రజలే అక్కడ ఓటేస్తారు ... గతంలోనూ అదే జరిగిందిప్రత్యేకంగా ఈ ఎన్నికల్లో చంద్రబాబు పోలింగ్ బూత్ లను మార్చేశారు. పోలింగ్ బూత్ లు మార్చడం వల్ల నాలుగు వేల ఓట్ల పై ప్రభావం పడింది. పోలింగ్ బూత్ లకు వెళ్లకుండా దారిలోనే అడ్డుకున్నారు. పులివెందుల ఎన్నికలు ఆరు పంచాయతీల పరిధిలో జరిగాయి. ఈ ఆరు పంచాయతీల్లో 700 మంది పోలీసులను పెట్టారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు ఈ గ్రామాల్లో పాగా వేశారు. పోలీసులే వారిని ప్రోత్సహించారు.ఒక్కో ఓటర్‌కు ఒక్కోరౌడీని దింపారుపోలీసులు పచ్చ చొక్కాలేసుకున్నారు. ప్రతీ బూత్ లో 400 లకు పైగా టీడీపీ రౌడీలు తిష్ట వేశారు. ఒక్కో ఓటరుకి ఒక్కో రౌడీని పెట్టారు. మంత్రి సవిత మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి , ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మనుషులు పోలింగ్ బూత్ లలో తిష్టవేశారు. బిటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదు. కానీ కనంపల్లిలో తిష్టవేసి దౌర్జన్యం చేశాడు. ఓట్లు వేసేందుకు వెళ్లిన వారిని కొట్టి..వారి స్లిప్పులను లాగేసుకున్నారు. ఆ స్లిప్పులతో వాళ్లు ఓట్లేసుకున్నారు. టిడిపికి ఓటేసేవాడైతేనే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లనిచ్చారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేశారు. జమ్మలమడుగు నుంచి వచ్చిన టిడిపి నేతలు పులివెందులలో ఓట్లేశారు. ఇవాళ జరిగే రీపోలింగ్ లో కూడా దొంగఓట్లు వేశారు. అన్యాయమని ప్రశ్నిస్తే పోలీసులు తరిమితరిమి కొట్టారు. మహిళ ఏజెంట్లను కూడా ఇబ్బంది పెట్టారు. టీడీపీ వాళ్లు వందల మంది ఒకేచోట ఉన్నా.. షామియానాలు వేశారు.పోలీసులు.. పచ్చ చొక్కా వేసుకోవాల్సిందే!ఏరికోరి పోలీసులను నియమించుకున్నారు. పచ్చచొక్కాలు వేసుకుని పోలీసులు టిడిపికి పనిచేశారు. డీఐజీ కోయ ప్రవీణ్ .. టీడీపీ మాజీ ఎంపీ సమీప బంధువు. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజి కోయ ప్రవీణ్ పర్యవేక్షలో ఈ ఎన్నిక జరిపారు. చంద్రబాబు మాట వినకపోతే డిజి స్థాయి అధికారులైనా ఇబ్బంది పడాల్సిందే. పీఎస్.ఆర్ ఆంజనేయులు,సునీల్ కుమార్,విశాల్ గున్నీల పై కేసులు పెట్టారు ..కొందరిని అరెస్ట్ చేశారు. ఈ డీఐజీ మాఫియా రింగ్ లీడర్. బెల్ట్ షాపుల కలెక్షన్ల నుంచి పర్మిట్ రూమ్ లు , ఇసుక,మట్టి,క్వార్ట్జ్, సిలికా, పేకాట శిభిరాలకు అనుమతి వరకూ అంతా డిఐజినే చూసుకుంటున్నాడు. ఈ కలెక్షన్లలో వాటాలను చంద్రబాబు,చినబాబు,ఎమ్మెల్యేలకు పంచుతున్నాడు. ఇలాంటి డీఐజీ పర్యవేక్షణలో ఎన్నికలు జరిపించారువైఎస్సార్‌సీపీ వాళ్లే లక్ష్యంగా..ఉదయం 4 గంటల నుంచే టిడిపి వాళ్లు పోలింగ్ బూత్ లను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. పులివెందుల టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన టిడిపి నేతలు రెచ్చిపోయారు. మోట్నుతలపల్లిలో పోలింగ్ బూత్ లకు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓటర్లను అడ్డుకున్నారు. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోనికి రాకుండా అడ్డుకున్నారని ఓటర్లే చెబుతున్నారు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి పోలీసులు గన్ తో బెదిరించారుఎర్రబల్లిలో రిగ్గింగ్ చేయడానికి వచ్చిన టిడిపి వాళ్లకు పోలీసులే స్వాగతం పలికారు. కనంపల్లిలో పోలింగ్ బూత్ లకు ఏజెంట్లు వెళ్లకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నాడు. ఓటు వేయనివ్వండని ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. కనంపల్లి ఓటర్లు ఓటు వేయలేకపోయామని ఆవేదన చెందారు. పులివెందుల జడ్పీటీసి అభ్యర్ధి హేమంత్‌ను ఇంటి నుంచి కూడా బయటికి రానివ్వలేదు. భూపేజ్ రెడ్డి పీఏ సుదర్శన్ రెడ్డికి పులివెందులలో పనేంటి?. పులివెందుల రూరల్ లో ఎన్నికలు జరుగుతుంటే టౌన్ లో ఉన్న అవినాష్ రెడ్డి ఆఫీస్ కు వెళ్లి డిఐజి హడావిడి చేశాడు. పులివెందులలో డీఎస్పీ ‘‘కాల్చిపడేస్తా నాకొడకా’’ అని వైఎస్సార్‌సీపీ వాళ్లను బెదిరించాడు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంటిమిట్టలో పోలింగ్ బూత్ లో రౌడీయిజం చేశాడు. రాయచోటి ఎమ్మెల్యే,మంత్రి రాంప్రసాద్ రెడ్డికి ఒంటిమిట్టలో ఏం పని?చంద్రబాబుకి ఇదే హెచ్చరికప్రజలు ఓటేస్తారనే నమ్మకం నీకుంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం చంద్రబాబు. ప్రజలు నీకు ఓటు వేయరనే ఇలా దిగజారిపోయావు?. గతంలో నంద్యాల ఉప ఎన్నికల్లో కూడా ఇలానే చేశాడు. నంద్యాలలో గెలిచి సంకలు గుద్దుకున్నాడు. ఏడాదిలోనే నంద్యాలలో గెలిచాం. రాష్ట్రవ్యాప్తంగా టిడిపిని భూ స్థాపితం చేశాం. కళ్లుమూసి తెరిచేలోగా ఏడాదిన్నర గడిచిపోయింది. మరో మూడున్నరేళ్లు కూడా అలానే గడిచిపోతుంది. ప్రజాస్వామ్యం చేజారిపోతే నక్సలిజం పుడుతుంది. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలిజరిగిన రెండు ఎన్నికలను రద్దు చేయండి. చంద్రబాబు తప్పుడు పునాదులకు బీజం వేస్తున్నారు. రేపు ఇదే మీకు చుట్టుకుంటుంది. చంద్రబాబు జీవితానికి ఇదే చివరి ఎన్నిక కావొచ్చు. కృష్ణారామా.. అనుకుంటూ ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. మీడియా ప్రతినిధి: ఎన్నిక రద్దు కోరతారా?ఇలా జరిగేవాటికి ఎన్నికలు జరపడం ఎందుకు?. అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం డమ్మీగా మారింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థలు దిగజారిపోయారు. కచ్చితంగా ఈ ఎన్నికను కోర్టుల్లో సవాల్‌ చేస్తాం. మా అభ్యర్థులిద్దరినీ అందుకే పిలిపించాం. కేంద్ర బలగాల ఆధ్వర్యంలో.. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రెండు ఉప ఎన్నికలు జరిపించాలని కోర్టులను కోరతాం. మీడియా ప్రతినిధి: ఓట్‌ చోరీ పేరిట ఇండియా బ్లాక్‌ చేపట్టిన ర్యాలీకి దూరంగా ఎందుకు ఉన్నారు?ఓట్లు చోరీ అయ్యాయని మాట్లాడే రాహుల్ గాంధీ ఏపీ గురించి ఎందుకు మాట్లాడడు. ఎన్నికలకు సంబంధించి దేశంలోనే 12.5 శాతం తేడా ఉన్నది ఏపీలో మాత్రమే. అంటే.. పోలింగ్‌ నాటికి-కౌంటిగ్‌ నాటికి 48 లక్షల ఓట్లు పెరిగాయి. ఎలా?. ఏపీ కాంగ్రెస్ ఇంఛార్జి మాణికం ఠాకూర్ ఏరోజైనా చంద్రబాబు గురించి మాట్లాడాడా?. కానీ, నా గురించి మాట్లాడుతున్నాడు. ఏపీలో జరుగుతున్న అక్రమాల పై ఏరోజైనా మాట్లాడాడా?. కాంగ్రెస్‌ అధిష్టానంతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు. రేవంత్‌ ద్వారా రాహుల్ గాంధీకి టచ్‌లో ఉన్నారు. ఏపీలో ఎన్నో స్కామ్‌లు జరుగుతున్నాయి. అమరావతి నిర్మాణం పెద్ద స్కాం. పీపీఏల్లో కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వీటి గురించి కాంగ్రెస్‌ ఎందుకు మాట్లాడడం లేదు? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

YS Jagan Questioned By Rahul Gandhi Over Votes Issue In AP2
ఏపీలోనే భారీ ఓట్ల చోరీ.. అయినా రాహుల్‌ గాంధీ మాట్లాడరేం?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఓట్‌ చోరీ వ్యవహారంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సూటి ప్రశ్నను సంధించారు. దేశంలో అత్యధికంగా ఓట్ల గోల్‌మాల్‌ జరిగింది ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనేనని.. అలాంటిది రాహుల్‌ గాంధీ ఏపీ గురించి ఎక్కడా ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారాయన. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో పులివెందుల, ఒంటిమిట్ట అక్రమ ఎన్నికలపై వైఎస్‌ జగన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంలో ఓట్ల దొంగతనం వ్యవహారంపై ఇండియా కూటమికు మద్దతు గురించి జగన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన స్పందిస్తూ.. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగకముందు.. జరిగిన తర్వాత ఉన్న ప్రకటించిన ఓట్లకు.. లెక్కించిన ఓట్ల సంఖ్యకు సమారు 12.5శాతం వ్యత్యాసం ఉంది. ఆ మొత్తం 48లక్షల ఓట్లు. అంటే దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో అత్యధికంగా ఓట్ల చోరీ జరిగింది. మరి ఓట్ల చోరీ గురించి అవకతవకలు జరిగాయని అంటున్న రాహుల్‌ గాంధీ.. దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు. ఎందుకు?.. ఎందుకంటే.. రేవంత్‌ ద్వారా చంద్రబాబు కాంగ్రెస్‌ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారు. చంద్రబాబుతో రాహుల్‌ గాంధీ హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారు. అందుకే చంద్రబాబు గురించి ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణికం ఠాకూర్‌ ఒక్క కామెంట్‌ కూడా ఎందుకు చేయరు?. ఏపీలో ఎన్నో స్కాంలు జరుగుతున్నాయి. వాటిని కాంగ్రెస్‌ ఎందుకు ప్రశ్నించదు అని వైఎస్‌ జగన్‌ అన్నారు.ఇదే విషయాన్ని ప్రెస్‌మీట్‌ అనంతరం జాతీయ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ జగన్‌ వివరించారు. ఓట్ల గోల్‌మాల్‌పై మేం గతంలో కోర్టుకు వెళ్లాం. ప్రత్యేకించి ఒంగోలు ఓటింగ్‌ విషయంలో న్యాయ పోరాటం చేశాం అనే సంగతిని జగన్‌ గుర్తుచేశారు. అలాగే.. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో 2013 నుంచి వ‌రుస‌గా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, నాలుగోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారని, ఓటమి పాలైన అరవింద్‌ కేజ్రీవాల్‌ గురించి ఎందుకు మాట్లాడడం లేదు? అని రాహుల్‌ గాంధీని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. Amaravati, Andhra Pradesh: YSRCP President YS Jagan Mohan Reddy says, "12.5% is the difference in gap versus what was announced post-poll versus the actual number of votes that were counted. So this 12.5% is a huge gap. In fact, there's so much so the vote chori controversy what… pic.twitter.com/jVl9eTwB3C— IANS (@ians_india) August 13, 2025లోక్‌సభ ఎన్నికల్లో, అలాగే ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భారీ ఓట్ల చోరీ జరిగిందని, ఇందుకు బీజేపీకి ఈసీ సహకరించిందని రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది కేవలం ఎన్నికల కుంభకోణం మాత్రమే కాదని.. ప్రజాస్వామ్యానికి జరిగిన అతిపెద్ద ద్రోహం అంటూ పోరాటానికి సిద్ధమంటూ ప్రకటించారాయన.

Jaya Bachchan selfie incident: Kangana Ranaut slams Most spoilt privileged woman3
అమితాబ్‌ పరువు తీస్తోంది.. సిగ్గులేని మనిషి : జయపై కంగన ఫైర్‌

సమాజ్‌వాదీ పార్టీ , రాజ్యసభ ఎంపీ జయాబచ్చన్‌పై హిమాచల్ ప్రదేశ్‌లోని మండికి చెందిన బీజేపీ ఎంపి కంగనా రనౌత్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో తనతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని బచ్చన్ తోసేస్తున్న వీడియో వైరల్‌ అయిన నేపథ్యంలో కంగనా ఆమెపై తీవ్ర విమర్శలు చేసింది.ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో జయాబచ్చన్‌ వీడియోను షేర్ చేస్తూ ఇలా కాబెంట్‌ చేసింది. “అత్యంత చెడిపోయిన, విశేషాధికారం కలిగిన మహిళ” అని అంటూ విమర్శలు గుప్పించింది. అంతేకాదు భర్త అమితాబ్ బచ్చన్ మర్యాదను మంట గలుపుతోందంటూ వ్యాఖ్యానించింది.“ఆమె అమితాబ్ బచ్చన్ భార్య కాబట్టి ప్రజలు ఆమె కోపతాపాలను/అర్ధంలేని తనాన్ని సహించారు. సమాజ్‌వాదీ పార్టి కోడిపుంజులా పందెంకోడిలా, ప్రవర్తింస్తోందంటూ ఎద్దేవా చేస్తే, ఎంత అవమానం, సిగ్గుచేటు” అని కంగనా మండిపడింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యాలు నెట్టింట చర్చకు దారి తీశాయి. గతంలో జయాబచ్చన ఇలాంటి విమర్శలొచ్చిన సందర్భంలో కంగనా వెనకేసుకొచ్చింది. నిజం చెప్పాలంటే..ఆమె కోపిష్టిమనిషే కానీ అదే సమయంలో ఆమె గొప్ప వ్యక్తి అంటూ జయాను తెగ పొగిడేసింది. 1970లలో ఆమె సినీరంగంలో రాణించారని, సినీ పరిశ్రమలో అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఒకరు అంటూ జయను కంగనా ప్రశంసించింది. (జయా బచ్చన్‌కు మళ్లీ కోపమొచ్చింది...సెల్ఫీ తీసుకోబోతే)సెల్ఫీ కోసం ఆశతో వచ్చిన అభిమానిని తోసేసి ఏం చేస్తున్నావ్ (క్యా కర్ రహే హై ఆప్?) అంటూ ఆగ్రహం​ వ్యక్తం చేసి పక్కకు నెట్టేశారు.దీంతో సదరు వ్యక్తి సారీ చేప్పారు. ఈ అనూహ్య పరిణామానికి అక్కడున్నవారంతా హతాశులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్‌ హల్‌చల్‌ చేసింది. సింపుల్‌గా సెల్ఫీ వద్దు అంటే సరిపోయేది.. కానీ అతణ్ణి చేత్తో నెట్టివేయడం దారుణం అంటున్నారు. కొంతమంది యాటిట్యూడ్‌ అంటూ జయాబచ్చన్‌ను విమర్శించగా, మరి కొందరు జయ ప్రవర్తనను సమర్థించారు కూడా.

Supreme Court sensational verdict on telangana MLCs in Governor quota cancelled4
కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ నియామకం రద్దు

ఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ గవర్నర్ కోటాలో కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీల నియామకం రద్దు చేసింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలలో తాజా నామినేషన్లు తమ తుది తీర్పుకి లోబడే ఉంటాయని సుప్రీం వ్యాఖ్యానించింది. దాసోజ్‌ శ్రవర్‌,సత్యానారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించడంపై సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ అభ్యర్థిత్వాన్ని తిరస్కరించడంపై గతంలో దాసోజ్‌ శ్రవణ్‌, సత్యనారాయణలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తదుపరి విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

Indian origin man offers over Rs 302152 crore to Google just to buy Chrome5
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్‌కే ఆఫర్‌ ఇచ్చిన ఇండియన్‌

ప్రపంచ టెక్‌ దిగ్గజం గూగుల్‌కే ఆఫర్‌ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్‌ కథనం ప్రకారం.. పెర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ​్‌ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్‌ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్‌ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్‌ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్‌ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్‌ క్రోమ్‌ కొనుగోలుకు ఆఫర్‌ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్‌లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్‌ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్‌లైన్ సెర్చ్‌ మార్కెట్‌ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్‌పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్‌ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్‌ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్‌లోనే పనిచేసిన శ్రీనివాస్‌ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్‌లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్‌తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.

IMD Big Rain Alert August 13th Telangana Latest News Details6
తెలంగాణకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు

హైదరాబాద్‌: తెలంగాణ అంతటికీ వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నాలుగు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు విస్తారంగా కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలో.. బుధ, గురువారాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న మీడియాకు వెల్లడించారు. సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు రెడ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేసినట్లు నాగరత్న తెలిపారు. అలాగే.. హైదరాబాద్‌, హనుమకొండ, ఆదిలాబాద్‌, జనగామ, కామారెడ్డి, కుమురం భీం, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్‌ జిల్లాలకు ఆరెంజ్‌ కలర్‌ వార్నింగ్‌ జారీ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘‘నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశాం. రేపు మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో రెడ్ అలర్ట్.. రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశాం. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఉత్తర తెలంగాణలో 17న వర్ష తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయి’’ అని ఆమె అన్నారు. రాష్ట్రమంతటా రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వివరించారామె.అప్రమత్తమైన జీహెచ్‌ఎంసీభారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. సాయంత్రం నుంచి అధిక వర్షాలు పడే అవకాశం ఉండడంతో.. ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది. మరోవైపు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని, మ్యాన్‌హోల్స్‌ను ఎవరూ తెరవొద్దని హెచ్చరించింది.

How Gujarat Madhapar turns Asia Richest Village PN7
పేరుకే ప‌ల్లెటూరు.. చూస్తే సిటీ లెవ‌ల్‌!

ప‌ల్లెటూరు అన‌గానే మ‌న‌నందరికీ గుర్తుకు వ‌చ్చేది ప‌చ్చని పొలాలు, పొందికైన ఇళ్లు, నినాదంగా గ‌డిచే జీవితం. కానీ ఆ ఊరు అలా ఉండ‌దు. పేరుకే ప‌ల్లెటూరు, దాని తీరు చూస్తే న‌గ‌రానికి ఏమాత్రం తీసిపోదు. ఎందుకంటే ఆ ఊరు ఆసియాలోనే సంప‌న్న గ్రామం. ఇంత‌కీ ఇది ఎక్క‌డుంద‌నేగా మీ డౌటు. ఇంకెక్క‌డ మ‌న ఇండియాలోనే. ఏంటి ఏషియా రిచెస్ట్ విలేజ్ మ‌న‌దేశంలో ఉందా అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా! మ‌రి ఇంకేందుకు ఆల‌స్యం.. ఆ ఊరు ఎక్క‌డ ఉందో, దాని విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.గుజ‌రాత్‌లోని క‌చ్ జిల్లాలో ఉన్న మాధపర్ గ్రామం.. ఆసియాలోనే ధ‌నిక గ్రామంగా ప్ర‌సిద్ధికెక్కింది. ఎటు చూసినా కాంక్రీట్ బిల్డింగ్‌లు, ఆధునాత‌న సౌక‌ర్యాల‌తో అల‌రారుతూ ఉంటుంది ఈ విలేజ్‌. ఈ ఊర్లోని బ్యాంకుల్లో రూ. 7 వేల కోట్లు పైగా డిపాజిట్లు ఉన్నాయంటేనే అర్థ‌మ‌వుతుంది ఈ ఊరు రేంజ్. దేశంలోని మిగతా ప‌ల్లెటూళ్ల‌కు భిన్నంగా ఉంటుంది మాధపర్ (Madhapar). ఈ గ్రామంలో 20 వేల‌ ఇళ్లు ఉండ‌గా.. దాదాపు 32,000 మంది ప్రజలు నివ‌సిస్తున్నారు. బ‌ల‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ క‌లిగిన‌ ఈ ఊర్లో 17 బ్యాంకులు ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు త‌మ శాఖ‌ల‌ను తెరిచేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నాయి. ఈ ఊరు సంప‌న్న గ్రామంగా ఎలా ఎదిగింది, ఇక్క‌డివారు ఏం చేస్తార‌నే తెలుసుకోవాల‌నుకుంటున్నారా?గ్లోబల్ రూట్స్, లోక‌ల్ గ్రోత్‌మాధపర్ విజ‌య ర‌హ‌స్యం అక్క‌డి ప్ర‌జ‌లే. ఇక్క‌డి కుటుంబాల్లోని చాలా మంది అమెరికా, బ్రిట‌న్‌, కెనడా, న్యూజిలాండ్‌, ఆఫ్రికా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. వీరంతా స్వ‌గ్రామానికి దండిగా డ‌బ్బులు పంపిస్తుంటారు. తాము ఉంటున్న దేశంలో కంటే మాధపర్ బ్యాంకుల్లో డ‌బ్బును దాచుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. ఇంటికి డబ్బు పంపడమే కాకుండా గ్రామంలో విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలలో కూడా పెట్టుబడి పెడుతున్నారు. ఫ‌లితంగా స్థిరమైన వృద్ధితో ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించి సంప‌న్న గ్రామంగా ఎదిగింది మాధపర్ గ్రామం.ప్ర‌వాసంలో ఉంటున్నా.. దేవాలయాలు, వారసత్వ క‌ట్ట‌డాల‌ను సృష్టించడంలో సిద్ధ‌హ‌స్తులైన మిస్త్రి క‌మ్యునిటికి చెందిన వారు 12వ శతాబ్దంలో ఈ గ్రామాన్ని నిర్మించిన‌ట్టు తెలుస్తోంది. కాలక్రమేణా విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్క‌డ స్థిర‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం ప‌టేల్ క‌మ్యునిటికి చెందిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం విదేశాలకు ఇక్క‌డి నుంచి చాలా మంది వ‌ల‌స వెళ్ల‌డంలో మాధపర్ గ్రామం రూపురేఖ‌లు మారిపోయాయి. ప్ర‌వాసంలో ఉంటున్నా మూలాల‌ను మ‌రిచిపోకుండా సొంతూరిపై ఎన్నారైలు మ‌మ‌కారం చూప‌డంతో మాధపర్ ధ‌నిక గ్రామంగా ఎదిగింది. ప‌ట్ట‌ణాల‌కు దీటుగా సౌక‌ర్యాలు స‌మ‌కూర్చుకుంది. విశాల‌మైన రోడ్లు, నాణ్య‌మైన పాఠ‌శాల‌లు, కాలేజీల‌తో పాటు ఆధునిక వైద్యాన్ని అందించే ఆస్ప‌త్రులు కూడా ఉన్నాయి.చ‌ద‌వండి: డిబ్బి డ‌బ్బుల‌తో కాలేజీ ఫీజులు క‌ట్టేస్తున్న స్కూల్ పిల్ల‌లు!దేశానికి నమూనా మాధపర్ విజ‌య‌గాథ‌ కేవలం సంపదకు సంబంధించిన‌ది మాత్ర‌మే కాదు. ఐక్య‌త‌, దార్శనికత, తిరిగి ఇవ్వడం అనే మూడు అంశాల ఆధారంగా మాధపర్ గ్రామం స్వావలంబ‌న సాధించింది. అంతేకాదు ప్ర‌జ‌ల మ‌ధ్య బ‌ల‌మైన స‌మాజ‌ సంబంధాలు ఉంటే గ్రామీణ జీవితాన్ని కూడా అసాధార‌ణంగా మార్చ‌వ‌చ్చ‌ని ఈ ఊరు నిరూపించింది. గ్రామీణ జీవిత సౌందర్యాన్ని ఆధునిక జీవన సౌకర్యాలతో మిళితం చేసి దేశానికి న‌మూనాగా నిలిచింది.

KBC Slammed For Operation Sindoor Independence Day Special Episode8
ఆర్మీ దుస్తుల్లో రియాలిటీ షోకి.. ప్రొటోకాల్‌ ఉల్లంఘనేనా?

కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC).. భారతదేశంలో ప్రసిద్ధమైన హిందీ భాషా టెలివిజన్ క్విజ్ షో. నటదిగ్గజం అమితాబ్ బచ్చన్ హోస్టింగ్‌లో 17వ సీజన్‌ నడుస్తోంది ఇప్పుడు. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా టెలికాస్ట్‌ కాబోతున్న ప్రత్యేక ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా రిలీజ్‌ కాగా.. సోషల్‌ మీడియా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. Kaun Banega Crorepati (KBC) 2025 స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్‌ ఎపిసోడ్‌పై ఇప్పుడు నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హనరింగ్‌ హీరోస్‌ పేరిట ఓ స్పెషల్‌ ఎపిసోడ్‌ ప్రొమోను వదిలింది సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌. కర్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కమాండర్ ప్రేరణా దియోస్తలీ ఈ షోలో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రొమోలో.. అమితాబ్ బచ్చన్ వీరిని ఘనంగా స్వాగతించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఉద్దేశం ఏంటని ప్రశ్నించారాయ. దానికి కర్నల్ ఖురేషీ సమాధానమిస్తూ.. పాకిస్తాన్ తరచూ ఉగ్రదాడులు చేస్తోంది. స్పందన అవసరం. అందుకే ఆపరేషన్ సిందూర్ జరిగింది అని తెలిపారు. అయితే.. ఆర్మీ అధికారులను పూర్తి యూనిఫారంలో ఓ టీవీ రియాలిటీ షోలో చూపించడం పట్ల సోషల్ మీడియాలో కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లను అలా యూనిఫామ్‌లోనే ఆహ్వానించాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది ఇది సైనిక ప్రోటోకాల్‌కు అనుగుణంగా ఉందా? అని ప్రశ్నించారు. సైన్యం పీఆర్‌ ఏజెన్సీలా మారిపోయిందా?.. లేకుంటే రాజకీయ మైలేజ్‌ కోసం ఇలాంటి పని చేశారా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.భారత సాయుధ దళాలకు ఒక గౌరవం, హుందాతనం ఉన్నాయి. రాజకీయ నాయకులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాటిని నాశనం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు.. .. ఏ దేశంలోనైనా కీలకమైన సైనిక ఆపరేషన్ తర్వాత అధికారులు ఇలా టీవీ షోలలో పాల్గొనడం చూశామా? విధి నిర్వహణలో ఉన్నవారికి ఇలా ఎలా అనుమతిస్తారు? ప్రస్తుత ప్రభుత్వం తమ స్వార్థ రాజకీయాల కోసం మన సైన్యాన్ని సిగ్గు లేకుండా వాడుకుంటోంది.. ఆర్మీ అధికారులు.. అదీ యూనిఫాంలో.. ఆర్మీ ఆపరేషన్‌ గురించి మాట్లాడడం.. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా?Army officers in uniform going to KBC to talk about Op Sindoor with Amitabh Bachchan.Has something like this ever happened before? pic.twitter.com/hs5X0uJCKp— Arjun* (@mxtaverse) August 13, 2025ఆర్మీ ప్రోటోకాల్ ప్రకారం...ఆర్మీ డ్రెస్‌ రెగ్యులేషన్స్ ప్రకారం.. సాంస్కృతిక కార్యక్రమాల్లో అధికారిక యూనిఫారాన్ని ధరించడం అనుమతించబడదు. బహిరంగ ప్రదేశాలు అంటే రెస్టారెంట్లు వగైరా.. చివరకు వ్యక్తిగత ప్రయాణాల్లోనూ ధరించడానికి వీల్లేదు. తాజాగా మలయాళ స్టార్‌ నటుడు తన లెఫ్టినెంట్‌ కర్నల్‌ హోదాను అగౌరవపరుస్తూ.. కేరళ ప్రభుత్వ ప్రచారంలో యూనిఫాంతో కనిపించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఆయన ఆ ఆరోపణలు ఖండించారు. అయితే.. ఇక్కడ ఓ మినహాయింపు ఉంది. కమాండింగ్‌ ఆఫీసర్‌ చేత రాతపూర్వకంగా అనుమతి తీసుకుని.. అనధికారిక కార్యక్రమాలకు యూనిఫాం ధరించి వెళ్లొచ్చు. బహుశా.. ఇప్పుడు ఈ ముగ్గురు అలాగే హజరై ఉంటారని పలువురు భావిస్తున్నారు. పంద్రాగష్టున సోనీ టీవీలో సోనీలీవ్‌ ఓటీటీలో ఈ ఫుల్‌ ఎపిసోడ్‌ను వీక్షించొచ్చు.పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విజయవంతంగా దాడులు నిర్వహించింది. ఈ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలను కేంద్ర రక్షణ, విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఇంత క్లిష్టమైన ఆపరేషన్ గురించి దేశ ప్రజలకు వెల్లడించింది కర్నల్‌ సోఫియా ఖురేషి, వింగ్‌ కమాండర్‌ వ్యోమికా సింగ్‌లే. ఇక.. ప్రేరణా ప్రేరణా దియోస్తలీ.. కిందటి ఏడాది భారత నేవీలో వార్‌షిప్‌ తొలి కమాండ్‌గా గుర్తింపు దక్కించుకున్నారు.

This Player Could be IPL 2026 Auction Most Expensive Buy: Ashwin9
IPL 2026: ‘ఈసారి వేలంలో అతడికే అత్యధిక ధర’

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2026 మినీ వేలం గురించి టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి వేలంపాటలో భారత ప్లేయర్ల కంటే విదేశీ క్రికెటర్ల వైపే ఫ్రాంఛైజీలు మొగ్గుచూపుతాయని అంచనా వేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈసారి ఎక్కువ ధర పలికే అవకాశం ఉందని అంచనా వేశాడు.ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై (CSK), కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR) జట్లు చెత్త ప్రదర్శన కనబరిచాయి. ఐదుసార్లు చాంపియన్‌గా ఘనమైన రికార్డు ఉన్న చెన్నై జట్టు.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. మరోవైపు.. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన కేకేఆర్‌ ఎనిమిదో స్థానానికి పరిమితమైంది.వారిని వదిలేసేందుకు సిద్ధంఈ నేపథ్యంలో కెప్టెన్‌ అజింక్య రహానే సహా వెంకటేశ్‌ అయ్యర్‌ వంటి వారిని వదిలించుకునేందుకు కేకేఆర్‌ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు.. సీఎస్‌కే సైతం రచిన్‌ రవీంద్ర, డెవాన్‌ కాన్వేలను విడిచిపెట్టాలనే సూచనలు వస్తున్నాయి. ఇక అశ్విన్‌ సైతం సీఎస్‌కేను వీడేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.ఇలాంటి తరుణంలో అశ్విన్‌ ఐపీఎల్‌-2026 మినీ వేలం గురించి మాట్లాడాడు. ‘‘ఈసారి మినీ వేలం జరుగబోతోంది. కాబట్టి ఇందులో భారత ఆటగాళ్లను మనం చూడలేమని చెప్పవచ్చు. కచ్చితంగా ఈసారి రేసులోకి కొత్త ఆటగాళ్లు వస్తారు.అంతేకాదు.. ఈసారి ఖరీదైన ఆటగాళ్లుగా విదేశీ ప్లేయర్లు నిలుస్తారు. ఏదేమైనా.. ఏ ఫ్రాంఛైజీ అయినా సరే భారత్‌కు చెందిన ప్రముఖ క్రికెటర్‌ను విడుదల చేసింది అంటే.. అంతకంటే రిస్క్‌ మరొకటి ఉండదని చెప్పవచ్చు.నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. ఈ ఏడాది పంజాబ్‌ కింగ్స్‌లోకి రీప్లేస్‌మెంట్‌ ఆటగాడిగా వచ్చిన మిచెల్‌ ఓవెన్‌.. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ వేలంకి వస్తారు. వీరికి భారీ ధర దక్కడం ఖాయం.ముఖ్యంగా విదేశీ ఆల్‌రౌండర్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. మినీ ఆక్షన్‌లో అన్ని జట్లు రూ. 25. 30 కోట్ల వరకు ఖర్చుపెట్టే అవకాశం ఉంది’’ అని రవిచంద్రన్‌ అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే👉రిషభ్‌ పంత్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌- రూ. 27 కోట్లు- 2025 వేలం👉శ్రేయస్‌ అయ్యర్‌- పంజాబ్‌ కింగ్స్‌- రూ. 26.75 కోట్లు- 2025 వేలం👉వెంకటేశ్‌ అయ్యర్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రూ. 23.75 కోట్లు- 2025 వేలం👉మిచెల్‌ స్టార్క్‌- కోల్‌కతా నైట్‌ రైడర్స్‌- రూ. 24.75 కోట్లు- 2024 వేలం👉ప్యాట్‌ కమిన్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రూ. 20.50 కోట్లు- 2024 వేలం👉సామ్‌ కరాన్‌- పంజాబ్‌ కింగ్స్‌- రూ. 18.50 ​​కోట్లు- 2023 వేలం👉కామెరాన్‌ గ్రీన్‌- ముంబై ఇండియన్స్‌- రూ. 17.50 కోట్లు- 2023 వేలం👉బెన్‌ స్టోక్స్‌- చెన్నై సూపర్‌ కింగ్స్‌- రూ. 16.25 కోట్లు- 2023 వేలం👉క్రిస్‌ మోరిస్‌- రాజస్తాన్‌ రాయల్స్‌- రూ. 16.25 కోట్లు- 2021 వేలం👉యువరాజ్‌ సింగ్‌- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌- రూ. 16 కోట్లు- 2015 వేలం👉నికోలస్‌ పూరన్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌- రూ. 16 కోట్లు- 2023 వేలం.చదవండి: జేడన్‌ సీల్స్‌.. బ్యాటింగ్‌ ప్రపంచానికి ముంచుకొస్తున్న సరికొత్త ముప్పు

Actress Sada gets Emotional Over Stray Dogs Situation10
నాకేం చేయాలో దిక్కు తోచట్లేదు.. బోరుమని ఏడ్చేసిన సదా

వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. 11 సెకన్లకో కుక్కకాటు కేసు నమోదవుతోంది. పసికందులు, వృద్ధులపైనా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. ఒక్క ఏడాదిలోనే (2024) దేశంలో 37 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయంటే సమస్య తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుక్కదాడి వల్ల రేబిస్‌ సోకి ఎంతోమంది చనిపోతున్నారు.భౌభౌ.. ఇక కనిపించొచ్చు, వినిపించొద్దుఈ తరుణంలో.. దేశ రాజధాని ఢిల్లీలో అన్ని కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాని సుప్రీంకోర్టు సోమవారం (ఆగస్టు 11న) ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా దీన్ని అడ్డుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. న్యాయస్థానం తీర్పుపై సినీతారలు సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.తరలించడం జరగదు, చంపేస్తారా?తాజాగా హీరోయిన్‌ సదా మాట్లాడుతూ.. ఒక్క రేబిస్‌ కేసు కోసం 3 లక్షల కుక్కల్ని సిటీనుంచి తరలిస్తారు.. లేదా చంపేస్తారు. 8 వారాల్లో ప్రభుత్వం శునకాల కోసం షెల్టర్స్‌ ఎక్కడ? ఎలా? సిద్ధం చేయగలదు? ఇది జరగని పని! వాటికి ఆశ్రయం కల్పించడం సాధ్యపడదు కాబట్టి చివరకు చంపేస్తారు. మున్సిపల్‌ ఆఫీస్‌, ప్రభుత్వం.. వాటికి వ్యాక్సిన్‌ వేయకుండా ఏం చేసింది? ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ప్రోగ్రామ్‌కు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి ఉండుంటే పరిస్థితి ఇక్కడివరకు వచ్చేదే కాదు.మా జేబులో నుంచి తీస్తున్నాంజంతుప్రేమికులు, ఎన్జీవోలు.. తమ పరిధిలో ఉన్న కుక్కలు, పిల్లుల సంఖ్య పెరగకుండా తమశక్తిమేర ప్రయత్నిస్తున్నారు. వాటి ఆరోగ్యం బాగోలేదంటే మా జేబులో నుంచి డబ్బు తీసి చికిత్స అందిస్తున్నాం. ప్రభుత్వం ఆ మూగజీవాల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడం లేదు. వీధుల్లో శునకాలు ఉండకూడదన్న తీర్పు వచ్చేసింది. వాటి గురించి ఆలోచిస్తేనే మనసు ముక్కలవుతోంది. నాకేం చేయాలో తెలియడం లేదు. లోలోపలే చచ్చిపోతున్నా..ఎవరిని కలవాలి? ఎక్కడ నిరసన చేయాలి? ఏదీ తోచట్లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను.. ఈ తీర్పు నన్ను లోలోపలే చంపేస్తోంది. వాటిని చంపడం కరెక్ట్‌ కాదు. మన దేశాన్ని చూస్తుంటే సిగ్గుగా ఉంది. దయచేసి ఈ తీర్పు వెనక్కు తీసుకోండి అంటూ సదా ఏడ్చేసింది. సదా ఒక్కరే కాదు.. జాన్వీ కపూర్‌, చిన్మయి శ్రీపాద, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హ, భూమి పెడ్నేకర్‌.. తదితర సెలబ్రిటీలు సుప్రీం తీర్పును వ్యతిరేకిస్తున్నారు. View this post on Instagram A post shared by Sadaa Sayed (@sadaa17) చదవండి: గుడ్‌న్యూస్‌ చెప్పిన 'రంగస్థలం' నటుడు.. బేబీ బంప్‌తో భార్య!

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement