సాక్షి, హైదరాబాద్: త్వరలో భర్తీ చేయనున్న గ్రూప్ –1 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు (మౌఖిక పరీక్ష) తీసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు న్యాయ నిపుణులు, టీఎస్‌పీఎస్సీ అధికారులతో చర్చించి నేడో, రేపో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభుత్వ వర్గాలు ఆచితూచి వ్యవహరించాయి. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు ఫైలును న్యాయ శాఖకు పంపడంతో పాటు కేబినెట్ ఆమోదం అవసరమా.. కాదా.. అనే విషయంలోనూ లోతుగా పరిశీలించాయి.
పోటీ పరీక్షల నిర్వహణ విధానంలో మార్పుచేర్పులకు కేబినెట్ ఆమోదం అవసరం లేదని నిర్ధారించుకోవడం, టీఎస్‌పీఎస్సీ అధికారులతో కూడా జరిపిన సంప్రదింపుల అనంతరం దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ మేరకు జీవో విడుదల చేసేందుకు రం గం సిద్ధమైంది. ఇక, ఇప్పటికే 30,453 వేల పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వగా, ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అనంతరం మరో 20 వేల టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి ఇవ్వనున్న ట్లు సమాచారం.
టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు పరీక్షకు హాజరయ్యేలా డీఎస్సీ ప్రకటనకు మార్గం సుగమం కానుంది. ఉపాధ్యాయ పోస్టులు, ఇప్పటికే పరిపాలన అనుమతులు వచ్చిన పోస్టులు పోను మిగిలిన మరో 30 వేల పోస్టుల భర్తీకి కూడా ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అనుమతి ఇచ్చిన పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగానే మిగిలిన పోస్టుల భర్తీకి పరిపాలన అనుమతులు ఇచ్చే యోచనలో ముందుకెళుతోంది.
Comments
Please login to add a commentAdd a comment