
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి (అక్టోబర్21) 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుంది. హైరరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద గూమికూడవద్దంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment