Group 1 Mains
-
అంతులేని కథగా గ్రూప్ 1.. అసలేంటి జీవో 29 !
-
ఫలితాలకు ముందే.. తుది విచారణ ముగించాలి
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఇప్పటికే గ్రూప్–1 అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్లిపోయారు, మరికొందరు వెళ్తున్నారు. ఈ సమయంలో మేం స్టే ఎలా ఇస్తాం? స్టే ఇవ్వడం వలన గందరగోళానికి గురిచేసినట్టే అవుతుంది. ఈ సమయంలో మేం జోక్యం చేసుకోలేం’’ అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు వాయిదా అనేది అసాధారణ విషయమని పేర్కొంది. అయితే గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి ఫలితాలు వెలువడకముందే తుది విచారణ ముగించాలని రాష్ట్ర హైకోర్టుకు సూచించింది. గ్రూప్–1ను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించింది.గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని.. పరీక్షలను వాయిదా వేసేలా ఆదేశించాలని కోరుతూ రాంబాబు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అందరికీ వర్తింపజేయాలని, ఓపెన్ కేటగిరీలో మెరిట్‌తో అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని అందులో పేర్కొన్నారు. దీనిపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.ఇప్పుడు ఎలా స్టే ఇస్తాం?‘‘వేలాది మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నారు. ఈ సమయంలో పరీక్షలపై ఎలా స్టే ఇస్తాం’’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తీసుకువచ్చిందని కపిల్ సిబల్ సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఇన్నేళ్లకు తొలిసారి గ్రూప్–1 పరీక్షలు జరుగుతున్నాయని.. మళ్లీ ఇప్పట్లో గ్రూప్–1 నిర్వహించడం, పోస్టులు భర్తీ చేయడం జరగదని ధర్మాసనానికి వివరించారు. అభ్యర్థులు ఈసారి అవకాశం కోల్పోతే, జీవితంలో మరో చాన్స్ ఉండదని.. అందువల్ల జీవో 29పై స్పష్టత వచ్చే వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతున్నామని తెలిపారు.వాయిదా అనేది అసాధారణ విషయంఈ సమయంలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ జోక్యం చేసుకుంటూ.. ‘‘గ్రూప్–1 పరీక్షలను వాయిదా వేయాలని టీజీపీఎస్సీని ఎలా ఆదేశిస్తాం. అది చాలా అసాధారణ విషయం కదా’’ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కపిల్ సిబల్.. ఇది వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, ఎస్టీ వర్సెస్ భూపేంద్ర యాదవ్ కేసులోని సుప్రీం తీర్పు వివరాలను ధర్మాసనం ముందుంచారు. దీంతో.. ‘‘మీరు చెబుతున్నవన్నీ ఓకే.. కానీ పరీక్షలు వాయిదా వేయండి అని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ఎలా ఆపగలం’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయితే వాయిదా వేయకుంటే వేల మంది అభ్యర్థులు నష్టపోతారని సిబల్ విన్నవించారు.ఫలితాలకు ముందే హైకోర్టు విచారణ ముగించేలాగ్రూప్–1 కేసులో హైకోర్టులో టీజీపీఎస్సీ కౌంటర్ దాఖలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. అలాగే ప్రభుత్వం తమ వాదనలను కౌంటర్ రూపంలో అందజేయనుందని వివరించారు. హైకోర్టు విచారణ సందర్భంగా పరీక్షలు పూర్తవడానికి ఎంత సమయం పడుతుందని ప్రశ్నించిందని.. మూడు నెలల సమయం కావాలని టీజీపీఎస్సీ సమాధానం ఇచ్చిందని వెల్లడించారు. ఈ సమయంలో కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ‘‘ఫలితాలు వెలువడటానికి మూడు నెలలే సమయం ఉన్న కారణంగా ఈ కేసును ఈరోజే విచారించాలి.కేసుపై స్పష్టత రావాలి’’ అని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. ప్రస్తుతం తాము ఏ తీర్పు ఇచ్చినా పరీక్షల ప్రక్రియలో చాలా ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయని.. అందువల్ల మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ‘‘తమ తుది తీర్పునకు లోబడే నియామకాలు జరపాలని’’ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. అయితే పరీక్షల ఫలితాల విడుదలకు ముందే ఈ కేసులో తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు పేర్కొంది. -
మొదలైన గ్రూప్-1 పరీక్ష
-
భారీ భదత్ర నడుమ.. తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్
-
బీఆర్ఎస్,బీజేపీ రెచ్చగొడుతున్నాయి: పీసీసీ చీఫ్
సాక్షి,హైదరాబాద్:గ్రూప్ వన్ పరీక్షపై బీఆర్ఎస్,బీజేపీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.గాంధీభవన్‌లో ఆదివారం (అక్టోబర్20) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ‘బీఆర్ఎస్,బీజేపీ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నా.సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదు. జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బండి సంజయ్ చెప్పాలి.బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు’అని మహేశ్‌గౌడ్ మండిపడ్డారు.ఇదీ చదవండి: న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి -
రేపట్నుంచి తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి (అక్టోబర్21) 27వ తేదీ వరకూ జరిగే మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ పరీక్షలను 31,382 మంది అభ్యర్థులు రాయనున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు 46 కేంద్రాల్లో పరీక్షలు జరగనున్నాయి.గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నట్లు టీఎస్పీఎస్సీ అధికారులు వెల్లడించారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోసం తెలంగాణ ప్రభుత్వం బయోమెట్రిక్ కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించింది. పరీక్ష కేంద్రాలు, పరిస ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనుంది. హైరరాబాద్,రంగారెడ్డి,మేడ్చల్ కేంద్రాల్లో ఐపీఎస్ అధికారాలకు బాధ్యతలు అప్పగించింది. పరీక్షా కేంద్రాల వద్ద గూమికూడవద్దంటూ పోలీసులు సూచనలు జారీ చేశారు. -
గ్రూప్ 1 మెయిన్స్ యథాతథం
-
గ్రూప్–1 హాల్‌టికెట్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీ క్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వెబ్సైట్లో సోమవారం నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచామని, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ప్రకటించారు. మొదటి పరీక్ష ప్రారంభమయ్యే సమయం వరకు వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ రాత పరీక్షలు (కన్వెన్షియల్/డి్రస్కిప్టివ్ టైప్) జరగనున్నాయి. 563 పోస్టుల కోసం.. 18 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్.. గత నెలలో ఫలితాలు విడుదల చేసి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29కు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలి.. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు.. ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని కమిషన్ సూచించింది. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా మిగతా ఆరు పరీక్షలకు.. ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారం భాషను ఎంచుకుని జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు పరీక్షలను కూడా ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదు. అలా రాస్తే పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లిష్ పేపర్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దాని మార్కులను ర్యాంకింగ్‌లోకి తీసుకోరు. అభ్యర్థులు అన్ని పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క పరీక్ష రాయకున్నా అనర్హతకు గురవుతారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాల మూసివేత మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదు. ఇక సమయం తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష హాళ్లలో గడియారాలను ఏర్పాటు చేస్తారు. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సాంకేతిక సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040–23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని.. లేదా హెల్ప్‌డెస్‌్కను ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని టీజీపీఎస్సీ సూచించింది. కాగా గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువడనుంది. -
TG: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ప్రిలిమ్స్‌పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈ నెల 21 నుంచి యథావిధిగా మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై అభ్యర్థులు పలు పిటిషన్లు దాఖలు చేశారు. ప్రిలిమ్స్‌కి, రిజర్వేషన్ల జీవో 33, తదితర అంశాలపై పిటిషన్లు దాఖలు చేశారు.ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేయడంతో గ్రూప్-1 పరీక్షకు అడ్డంకి తొలిగింది. మరో ఆరు రోజుల్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుండి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల కోసం టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేసింది. 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షలు రాయనున్నారు.ఇదీ చదవండి: TG: డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదాహైకోర్టు తీర్పు నిరాశ కలిగిందని గ్రూప్-1 అభ్యర్థులు అంటున్నారు. కోర్టు తీర్పుతో మానసికంగా కుంగిపోయాం. మెయిన్స్‌లో ప్రిపరేషన్‌కు కొంత సమయం ఇవ్వాలి. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
తెలంగాణలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
2018 గ్రూప్-1 మెయిన్స్ రద్దు..ఏపీ ప్రభుత్వం భరోసా
-
Telangana: గ్రూప్ 1, 2, 3 పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ బుధవారం విడుదల అయ్యింది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్ 21న గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అదే విధంగా నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించనున్నారు. గ్రూప్-1లో 563, గ్రూప్-2లో 783, గ్రూప్-3లో 1388 పోస్టుల భర్తీకి పరీక్షలు జరగనున్నాయి ముఖ్యమైన తేదీలు: అక్టోబర్ 21 నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నవంబర్ 17,18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షల -
AP: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఈ సారి కొత్త విధానం
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. అభ్యర్థులకు ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. ఈసారి ఆఫ్ లైన్ లోనే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 10 జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలను ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్, ఏపీపీఎస్సీ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ పరిశీలించారు. పకడ్బందీ చర్యలు.. మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణ జరగనుంది. పరీక్షా కేంద్రాల్లోని సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్‌తో అనుసంధానం చేసినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులకు బయోమెట్రిక్‌తో పాటు తొలిసారి ఫేస్ రికగ్నైజేషన్ విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం 70 బయోమెట్రిక్ పరికరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 290 మంది దివ్యాంగులు పరీక్ష రాయనున్నారు. ఇందులో 58 మంది దివ్యాంగులు స్క్రైబ్స్ కు అనుమతి కోరారు. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు. చదవండి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’: గౌతం రెడ్డి -
తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. జూన్ 5 నుంచి 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో వారి చాయిస్ మేరకు పరీక్షలు రాయవచ్చు. జూన్-5: జనరల్ ఇంగ్లిష్(అర్హత పరీక్ష) జూన్-6: పేపర్-I - జనరల్ ఎస్సే జూన్-7: పేపర్-II - హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ జూన్-8: పేపర్-III - ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్, గవర్నెన్స్ జూన్-9: పేపర్-IV - ఎకానమీ అండ్ డెవలప్మెంట్, జూన్-10: పేపర్-V - సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ జూన్-12: పేపర్-VI - తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ ప్రతి పరీక్షకు మూడు గంటల సమయం. 150 మార్కులు. -
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్‌ఘాట్‌కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
గ్రూప్–1 మెయిన్స్‌కు తండ్రీ తనయుడు
యాదగిరిగుట్ట రూరల్: గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష రాసి మెయిన్స్‌కు తండ్రీ కొడుకులు అర్హత సాధించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు ఏలూరు బాలనర్సయ్య (48), ఏలూరు సచిన్ (22) శనివారం విడుదలైన ఫలితాల్లో ఒకేసారి ఈ ఘనత సాధించారు. బాలనర్సయ్య ఎల్ఐసీలో డెవలప్మెంట్ ఆఫీసర్‌గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సచిన్ హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటూ గ్రూప్–1కోసం ప్రయత్నిస్తున్నారు. కాగా తండ్రి ఇంతకుముందే గ్రామంలో సర్పంచ్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ఇద్దరూ ఒకేసారి మెయిన్స్‌కి అర్హత సాధించడం ఆనందంగా ఉందని బాలనర్సయ్య చెప్పారు. -
తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ రాసినవారిలో మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. ఈ మేరకు అభ్యర్థుల హాల్‌టికెట్ నంబర్లతో కూడిన జాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టింది. ఈ ఫలితాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు, విజ్ఞప్తులు ఉంటే టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేసి సంప్రదించవచ్చని సూచించింది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని.. ఆ పరీక్ష ప్యాటర్న్‌ను ఈనెల 18న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. 503 గ్రూప్–1 ఉద్యోగాలకు.. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తులు స్వీకరించిన టీఎస్పీఎస్సీ అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. మొత్తం 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. అక్టోబర్ నెలాఖరులో టీఎస్పీఎస్సీ అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో పెట్టింది. ప్రాథమిక కీ విడుదల చేసి.. అభ్యంతరాలను స్వీకరించింది. ఐదు ప్రశ్నలను తొలగించి తుది కీని ప్రకటించింది. తాజాగా మల్టీజోన్లు, రిజర్వేషన్లు, జెండర్ వారీగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే మల్టీజోన్–2 పరిధిలో విజువల్లీ హ్యాండిక్యాప్డ్ (విమెన్), హియరింగ్ ఇంపెయిర్డ్ (జనరల్) కేటగిరీల్లో 1:50 నిష్పత్తిలో అభ్యర్థులు లేకపోవడంతో ఆ రెండు కేటగిరీలను పక్కనపెట్టింది. మొత్తంగా 25,050 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేసి జాబితాను వెబ్సైట్లో పొందుపర్చింది. మహిళలకు 33శాతం రిజర్వేషన్లు.. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా.. నేరుగా 33% రిజర్వేషన్లు కలి్పస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఒకే మార్కులను ఇద్దరు లేదా అంతకు మించి అభ్యర్థులు సాధిస్తే.. వారి స్థానికత ప్రకారం అర్హతను ఖరారు చేసినట్టు కమిషన్ తెలిపింది. ఒకే మార్కులు సాధించిన వారు ఒకే స్థానికతతో ఉన్నప్పుడు అభ్యర్థుల పుట్టినతేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి హయ్యర్ ర్యాంకు ఇచి్చనట్టు వివరించింది. ఓఎంఆర్ పత్రాల్లో కమిషన్ సూచించిన విధంగా కాకుండా ఇష్టానుసారం బబ్లింగ్ చేసిన వారిని పరిగణనలోకి తీసుకోలేదని కమిషన్ తెలిపింది. వివరాలకు.. టీఎస్పీఎస్సీ వెబ్సైట్: ఠీఠీఠీ.్టటpటఛి.జౌఠి.జీn టీఎస్పీఎస్సీ హెల్ప్‌డెస్క్ నంబర్లు: 040–22445566, 040–23542185, 040–23542187 ఈ–మెయిల్: helpdesk@tspsc. gov. in -
గ్రూప్–1లో తెలుగు అర్హత పేపర్ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో తెలుగును అర్హత పేపర్‌గా ప్రవేశపెట్టాలని గ్రూప్–1 పరీక్ష అభ్యర్థులు టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను కోరారు. ఈ మేరకు వారు గురువారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు వినతి పత్రాలు అందజేశారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాల వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నారని, దీనివల్ల పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని వారు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. వినతి పత్రం సమర్పించిన వారిలో నరేందర్, నాగరాజు, రమేష్, శ్రీనివాస్, పి.వెంకటేశం తదితరులున్నారు. -
ఏపీ గ్రూప్- 1 మెయిన్స్ ఫలితాలు విడుదల
అమరావతి: 2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) బుధవారం విడుదల చేసింది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఏపీపీఎస్సీ వెబ్సైట్ (www.psc.ap.gov.in)లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారులు ఉంచారు. అభ్యర్థులకు జూన్ 14వ తేదీ నుంచి ముఖాముఖి పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఏపీపీఎస్సీ అధికారులు సూచించారు. చదవండి: ఆక్సిజన్ సిలిండర్ కోసం 24 గంటల్లో 1,500 కి.మీ జర్నీ చదవండి: రాబోయే 3, 4 వారాలు చాలా కీలకం.. మరింత జాగ్రత్త -
నెలలో 2011 ‘ఏపీ గ్రూప్ 1’ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఏపీపీఎస్సీ ఈ నెల 14 నుంచి నిర్వహించిన 2011 గ్రూప్ 1 మెయిన్స్ పునఃపరీక్షలు శనివారంతో ముగిశాయి. ఫలితాలు వెల్లడించడానికి నెల సమయం పడుతుందని ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు. 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్లో పేర్కొన్న 312 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫలితాల అనంతరం ఇంటర్వ్యూలు పూర్తి చేసి నియామకాల జాబితాను ప్రభుత్వానికి ఏపీపీఎస్సీ సమర్పించనుంది. -
పరీక్ష కేంద్రంలోనే ప్రశ్నపత్రాల ముద్రణ
లీకేజీ నివారణకు ఏపీపీఎస్సీ చిట్కా సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీని నివారించడానికి ఏపీపీఎస్సీ కొత్త విధానాన్ని చేపట్టింది. బుధవారం నుంచి ప్రారంభమైన 2011 గ్రూప్1 మెయిన్స్ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చింది. పరీక్ష తేదీలకు చాలా ముందుగా సెట్ల వారీ ప్రశ్నపత్రాలను రూపొందించడం, దరఖాస్తులనుబట్టీ వాటిలో రెండింటిని ముద్రణకు ఇచ్చి, నేరుగా ఆయా కేంద్రాలకు చేర్చడం జరుగుతున్న విధానం. దీనివల్ల ఏదో ఒక సందర్భంలో లీకవుతున్నాయి.ఈ దృష్ట్యా ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి ైవె వీఎస్టీ సాయిలు ఈసారి కొత్త పంథాను ఎంచుకున్నారు. రూపొందించిన నాలుగైదు సెట్ల ప్రశ్నపత్రాలను సాఫ్ట్ కాపీలుగా తమ వద్దే భద్రపరుచుకున్నారు. బుధవారం పరీక్ష ప్రారంభానికి గంట ముందు ఒక సెట్ ఎంపిక చేసి ఆయా కేంద్రాలకు ఆన్లైన్ ద్వారా పంపారు. పరీక్ష కేంద్రాల్లో వాటిని ప్రింట్ తీయించి అభ్యర్థులకు అందించడానికి సీసీ కెమెరాలతో ప్రత్యేక భద్రతతో గదిని కేటాయించారు. హైస్పీడ్ ప్రింటర్ల సాయంతో ప్రింట్ తీసి వాటిని ప్యాక్ చేసి సీల్ వేసి ఆయా గదుల్లోని ఇన్విజిలేటర్లకు పంపిణీ చేయించారు. ప్రశ్నపత్రం ఏదనేది ఏపీపీఎస్సీలోని అత్యున్నత స్థాయి వ్యక్తులకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.