పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వెబ్‌సైట్లోఅందుబాటులోకి..
ఈ నెల 21వ తేదీన ఉదయం వరకు డౌన్‌లోడ్ చేసుకునే చాన్స్
ఆ రోజు నుంచి 27వ తేదీ వరకు పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీ క్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వెబ్‌సైట్‌లో సోమవారం నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచామని, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ప్రకటించారు. మొదటి పరీక్ష ప్రారంభమయ్యే సమయం వరకు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ రాత పరీక్షలు (కన్వెన్షియల్/డి్రస్కిప్టివ్ టైప్) జరగనున్నాయి.
563 పోస్టుల కోసం..
18 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్.. గత నెలలో ఫలితాలు విడుదల చేసి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29కు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు.
ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలి..
గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న అభ్యర్థులు.. ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని కమిషన్ సూచించింది. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా మిగతా ఆరు పరీక్షలకు.. ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారం భాషను ఎంచుకుని జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు పరీక్షలను కూడా ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది.
ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదు. అలా రాస్తే పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లిష్ పేపర్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దాని మార్కులను ర్యాంకింగ్‌లోకి తీసుకోరు. అభ్యర్థులు అన్ని పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క పరీక్ష రాయకున్నా అనర్హతకు గురవుతారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాల మూసివేత మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరు.
అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదు. ఇక సమయం తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష హాళ్లలో గడియారాలను ఏర్పాటు చేస్తారు. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సాంకేతిక సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040–23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని.. లేదా హెల్ప్‌డెస్‌్కను ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని టీజీపీఎస్సీ సూచించింది. కాగా గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువడనుంది.
Comments
Please login to add a commentAdd a comment