Hall Ticket
-
AP: పోలీసు ఉద్యోగ పరీక్షలో దొడ్డిదారి యత్నం!
కర్నూలు: ఎలాగైన పోలీసు ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కొంతకాలంగా సాధన చేసిన ఓ అభ్యర్థి ఛాతీ, ఎత్తు కొలతల్లో ఫెయిల్ కావడంతో దొడ్డిదారిలో యత్నించి అడ్డంగా దొరికిపోయాడు. అధికారులను మోసగించే క్రమంలో అక్కడ సాంకేతికత ద్వారా గుర్తించి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని 4వ పట్టణ పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాల్లోకి పంపారు. పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌లో డిసెంబరు 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం కోసిగి మండలం దొడ్డి బెళగల్ గ్రామానికి చెందిన పి.నరసింహుడు కుమారుడు పబిత తిరుమల బయోమెట్రిక్‌కు హాజరయ్యాడు. అయితే, అతను ఎత్తు, ఛాతి కొలతల్లో ఫెయిల్ కావడంతో వె నక్కి పంపారు. అయితే క్వాలిఫై అయినట్లుగా హాల్ టికెట్‌ను కలర్ జిరాక్స్ తీసుకొని.. క్వాలిఫై అయినట్లు టిక్ మార్క్ వేసుకొని 1600 మీటర్ల పరుగులో పాల్గొనేందుకు వరుస క్రమంలో నిలబడి మోసగించేందుకు ప్రయత్నించగా...స్టాటింగ్ పాయింట్ బందోబస్తు డ్యూటీలో రిజర్వు ఇన్స్పెక్టర్ నాగభూషణం గుర్తించి అభ్యర్థి మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. పాడ్ క్యారియర్ లేకుండా 1600 మీటర్ల పాయింట్ వద్ద ఆర్ఎప్ఐడీ రిజిస్ట్రేషన్ కంప్యూటర్ ఆపరేటర్ జయరాం దగ్గరకు వెళ్లి పరిశీలించగా...సిస్టమ్‌లో అభ్యర్ధి పేరు చూపడం లేదని, హాల్ టికెట్లో మాత్రం క్వాలిఫై అయినట్లుగా నకిలీ తయారు చేసి టిక్ మార్క్ వేసుకున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయాన్ని ఎస్పీ బింధుమాదవ్ దృష్టికి తీసుకెళ్లగా.. 4వ పట్టణ పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. ఈ మేరకు అభ్యర్థి పబిత తిరుమలపై చీటింగ్ కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ గోపీనాథ్ తెలిపారు.కాగా 11 రోజు మంగళవారం పోలీసు కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలకు మొత్తం 600 మందిని ఆహ్వానించగా... 412 మంది వచ్చారు. వీరిలో ప్రధాన పరీక్షకు మంగళవారం 267 మంది ఎంపికయ్యారు. -
గ్రూప్–1 హాల్‌టికెట్లు రెడీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీ క్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ వెబ్సైట్లో సోమవారం నుంచే హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచామని, మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ ప్రకటించారు. మొదటి పరీక్ష ప్రారంభమయ్యే సమయం వరకు వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ నెల 21 నుంచి 27 వరకు ఈ రాత పరీక్షలు (కన్వెన్షియల్/డి్రస్కిప్టివ్ టైప్) జరగనున్నాయి. 563 పోస్టుల కోసం.. 18 రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని 563 గ్రూప్–1 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. జూలైలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్.. గత నెలలో ఫలితాలు విడుదల చేసి, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 29కు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ చేపట్టడంతో మొత్తం 31,382 మంది అభ్యర్థులు మెయిన్స్‌కు ఎంపికయ్యారు. ముందే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలి.. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 2గంటల నుంచి 5గంటల వరకు జరుగుతాయి. హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న అభ్యర్థులు.. ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని కమిషన్ సూచించింది. ప్రతి పరీక్షకు 3గంటల సమయం ఉంటుంది. ప్రతి పరీక్షకు గరిష్ట మార్కులు 150. జనరల్ ఇంగ్లిష్ పరీక్ష మినహా మిగతా ఆరు పరీక్షలకు.. ఇంగ్లి‹Ù, తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రశ్నపత్రాలు ఉంటాయి. అభ్యర్థి ఇష్టానుసారం భాషను ఎంచుకుని జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఆరు పరీక్షలను కూడా ఎంపిక చేసుకున్న ఒకే భాషలో రాయాల్సి ఉంటుంది. ఒక్కో పరీక్షను ఒక్కో భాషలో రాసే అవకాశం లేదు. అలా రాస్తే పరిగణనలోకి తీసుకోరు. జనరల్ ఇంగ్లిష్ పేపర్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. దాని మార్కులను ర్యాంకింగ్‌లోకి తీసుకోరు. అభ్యర్థులు అన్ని పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఏ ఒక్క పరీక్ష రాయకున్నా అనర్హతకు గురవుతారు. అరగంట ముందే పరీక్ష కేంద్రాల మూసివేత మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్షా కేంద్రాలను మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరు. అభ్యర్థి తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలి. డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదు. ఇక సమయం తెలుసుకునేందుకు వీలుగా పరీక్ష హాళ్లలో గడియారాలను ఏర్పాటు చేస్తారు. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సాంకేతిక సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040–23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని.. లేదా హెల్ప్‌డెస్‌్కను ఈమెయిల్ ద్వారా సంప్రదించాలని టీజీపీఎస్సీ సూచించింది. కాగా గ్రూప్–1 పరీక్షలకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై మంగళవారం తీర్పు వెలువడనుంది. -
అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) హాల్ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్ టికెట్‌పై అబ్బాయి ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారు. సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో పొరపాటు జరిగిందని, హాల్ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.తప్పులు సరిచేస్తామంటున్న విద్యాశాఖడీఎస్సీ పరీక్ష ఈ నెల 18 నుంచి మొదలవుతుంది. పరీక్షకు సీరియస్‌గా సన్నద్ధమవుతున్న యువత హాల్ టికెట్ల గందరగోళంతో కంగారు పడుతోంది. అయితే ఈ తప్పిదాలకు విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణ ఇచ్చారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామని వారు అంటున్నారు. సిస్టమ్ జనరేటెడ్ హాల్ టికెట్లను తాము చూసే అవకాశమే లేదంటున్నారు. తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి న్యాయం చేస్తున్నామని విద్యాశాఖ వెల్లడించింది.మొదట్నుంచీ వివాదమేడీఎస్సీ నిర్వహణ మొదట్నుంచీ వివాదాస్పదమే అవుతోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన వారికి ప్రిపరేషన్ లేకుండా డీఎస్సీ పెట్టడంపై అభ్యర్థులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ కోచింగ్ కేంద్రాలు, రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే నేతలు సృష్టించినవేనని ప్రభుత్వం కొట్టి పారేసింది. తాజాగా హాల్ టిక్కెట్లు ఈ నెల 11 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, చాలా చోట్ల అవి డౌన్లోడ్ కావడం లేదనే ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విద్యాశాఖ సోమవారం వివరణ ఇచ్చింది. అన్ని చోట్ల డౌన్లోడ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోమవారం విద్యార్థులు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఫొటోల తారుమారుమేడ్చెల్ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హాల్ టికెట్లో అతని పేరు సక్రమంగానే ఉంది. కానీ ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య డీఎస్సీలో ఎస్ఏ పోస్టుకు అప్లై చేసింది. ఆమె ఫొటో బాదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన అధికారులు ఆమె ఫొటో వచ్చేలా చేశారు.నిజంగా నెట్ సెంటర్లదే తప్పా?అభ్యర్థులు నెట్ సెంటర్లలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారి ఫొటో, సంతకాలను డిజిటల్ చేసి ఇస్తుంటారని తెలిపారు. ఎక్కువ మంది ఉండటంతో నెట్ యజమానులు ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో పెట్టారని అంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ఫొటో, సంతకం ఉంటుందో హాల్ టికెట్‌లోనూ అదే వస్తుందని, దీనికే తమను నిందిస్తే ఎలా అని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
ఏడేళ్లకు వచ్చిన అడ్మిట్ కార్డ్: షాకైన బెంగాలీ బాబు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వ్యవశాయ శాఖలో ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న 7 సంవత్సరాల తర్వాత ఆ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు వచ్చింది. దీంతో అది చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఆశ్యర్యకరమైన పరిణామం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. అటు రాజకీయంగా కూడా ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఇండియా టుడే కథనం ప్రకారం 2016 లో పశ్చిమ బెంగాల్‌లోని వ్యవసాయ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చింది. అసిస్టెంట్ పోస్టుకు ఆ ఏడాది మార్చిలో వార్తాపత్రికలో ప్రకటన వచ్చింది. ఈ నోటిఫికేషన్‌ను చూసి ఆశిష్ బెనర్జీ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు వర్ధమాన్ జిల్లాకు చెందిన ఆశిష్ బెనర్జీ. పరీక్ష డిసెంబర్ 18, 2016న జరగాల్సి ఉంది. కానీ దీనికి సంబంధించిన అడ్మిట్ కార్డు లేదా హాల్ టికెట్ రాలేదు. దీని కోసం కొన్నాళ్లు ఎదురుచూసి, ఇక దాని సంగతే మర్చిపోయాడు. కానీ ఆశ్యర్యకరంగా దాదాపు ఏడేళ్ల తరువాత షాక్య్యే ఘటన చోటు చేసుకుంది. (80 కోట్లమంది పేదలకు ప్రయోజనం: ప్రధాని మోదీ కీలక ప్రకటన) ఇటీవల (2023 నవబంరు 1వ తేదీ) ఆశిష్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ వ్యవసాయ శాఖ నుంచి ఒక సీల్డ్ కవరు అందింది. దాని లోపల ఏడేళ్ల క్రితం జరిగిన పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఉంది. దీంతో ఇంత కాలానికా.. జీవిత కాలం లేటు అన్నట్టుగా ఆశ్చర్యపోవడం ఆశిష బెనర్జీ వంతైంది. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే 2016 డిసెంబరు 18 వ తేదీనే నిర్వహించడం, పరీక్ష రాసి, సెలక్ట్ అవ్వడం, వారు ఉద్యోగంలో చేరిపోవడం అన్నీ జరిగిపోయాయి. (షాకింగ్ వీడియో: ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం, ఒకరు మృతి) దీంతో ఈ వ్యవహారంపై ఆశిష్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు. తనకు అడ్మిట్ కార్డు ఆలస్యం కావడానికి కారణం ఏమిటో దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశాడు. చేయని తప్పుకు తాను మూల్యం చెల్లించాల్సి వచ్చిందని తప్పు ఎవరిదో తేలాలని పట్టుబడుతున్నాడు. అంతేకాదు రాష్ట్రంలోని ఇతర ఉపాధి స్కామ్‌ల మాదిరిగానే ఈ కేసులో కూడా కుంభకోణం జరిగిదంటే ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆశిష్. -
కొలువుల అర్హత పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: పలు ఉద్యోగ నియామకాల అర్హత తేదీలను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఖరారుచేసింది. ఇంటర్మీడియట్ విద్య కమిషనరేట్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగ అర్హత పరీక్షలను సెప్టెంబర్ 12 నుంచి సబ్జెక్టుల వారీగా నిర్వహించనున్నట్లు స్పష్టంచేసింది. అన్ని సబ్జెక్టులకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (సీబీఆర్టీ) విధానంలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్ 12న ప్రారంభం కానున్న పరీక్షలు అక్టోబర్ 3 వరకు దాదాపు 11 రోజులపాటు పరీక్షలు కొనసాగనున్నాయి. ఆగస్టు 8న ఏఓ, జేఏఓ పరీక్ష..: పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని పట్టణ స్థానిక సంస్థ (యూఎల్బీ)ల్లోని అకౌంట్స్ ఆఫీసర్ (ఏఓ), జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పరీక్షను ఆగస్టు 8న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. నిర్దేశించిన రోజున ఉదయం, మధ్నాహ్నం రెండు సెషన్లలో పరీక్షలను సీబీఆర్టీ పద్ధతిలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పై అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష తేదీకి వారం ముందు హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పింది. -
ఏపీ పాలీసెట్ 2022: విద్యార్థులూ ఇవి తెలుసుకోండి
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): ఏపీలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం (మే 29) నిర్వహించనున్న పాలీసెట్–2022కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి కమిషనర్ పోల భాస్కర్ తెలిపారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్ జరుగుతుందన్నారు. పది గంటల నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని తెలిపారు. హాల్‌టికెట్‌లో ఫొటోలు సరిగా లేని విద్యార్థులు పరీక్షకు వచ్చేటప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతోపాటు బాల్ పెన్ను, పెన్సిల్, రబ్బరును మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1,37,371 మంది విద్యార్థులు పాలీసెట్‌కు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష పూర్తి అయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగాలు కల్పించేలా పరిశ్రమలతో చర్చలు జరుపుతున్నామని వివరించారు. -
సన్నీలియోన్‌కు 20 ఏళ్ల కొడుకు? ఫన్నీ రిప్లై!
బాలీవుడ్ తారలు ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ ఇద్దరూ కేవలం ఓ పాటలో మాత్రమే కలిసి నటించారు. కానీ వీళ్లకు పెళ్లైందని, బిహార్‌కు మకాం మార్చారని, ఈ జోడీకి డిగ్రీ చదివే కొడుకున్నాడంటూ ఈ మధ్య ఓవార్త తెగ హల్చల్ అవుతోంది. ఇది కాస్తా సన్నీలియోన్ కంటపడగా ఆమె తేలికగా నవ్వేశారు. ఆ విద్యార్థి చేసిన తుంటరి పనికి ఏమీ అనలేక మెచ్చుకోలుగా చమత్కరించారు. అసలేం జరిగిందంటే.. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల కుందన్ కుమార్.. ధనరాజ్ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడు తప్పుడు వివరాలతో హాల్ టికెట్‌కు దరఖాస్తు చేశాడు. తల్లి పేరు రాయాల్సిన కాలమ్‌లో సన్నీలియోన్ అని, తండ్రి అని ఉన్న దగ్గర ఇమ్రాన్ హష్మీ అన్న పేర్లను రాశాడు. (చదవండి: రాజకీయాల్లో రాణించాలి: చిరంజీవి) తల్లిదండ్రుల పేర్లు బాలీవుడ్ సెలబ్రిటీలను సూచిస్తుండటంతో ఆ ఎక్జామ్ అప్లికేషన్ ఫామ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. తుంటరి పని చేసిన సదరు విద్యార్థిపై చర్యలు తీసుకుంటామని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. అయితే బాలీవుడ్ భామ సన్నీలియోన్ మాత్రం ఆ విద్యార్థి చేసిన పనికి సరదాగా నవ్వుకున్నారు. అతడిని అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. అతడు ఇలాగే ఎప్పుడూ పెద్ద పెద్ద కలలు కంటూ ఉండాలి అని చమత్కరించారు. అయితే ఇలా సన్నీలియోన్ పేరు వార్తల్లో నిలవడం ఇదేమీ కొత్త కాదు. గతంలో బిహార్ జూనియర్ పరీక్షలో సన్నీలియోన్ టాపర్‌గా నిలిచిందని, దీంతో ఆమె కోల్‌కతాలోని కళాశాలకు ఎంపికైందని వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఆవిడ ఫన్నీగా స్పందిస్తూ మీ అందరినీ కాలేజీలో కలుస్తానని చెప్పుకొచ్చారు. కాగా ఆమె వ్యాఖ్యాతగా వ్యవహరించే స్ప్లిట్స్ విల్లా తర్వాతి సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (చదవండి: తల్లి సన్నీ లియోన్.. తండ్రి ఇమ్రాన్ హష్మి) This kids awsome !!!!! Way to dream big :)))))))) XO hahahaha https://t.co/VEkTnsv4VT — sunnyleone (@SunnyLeone) December 12, 2020 -
తల్లి పేరు సన్నీ లియోన్.. షాక్‌తో మైండ్ బ్లాక్
పట్నా: హెడ్డింగ్ చూడగానే వీరిద్దరికి వివాహం ఎప్పుడు అయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఆగండి ఇంకో విషయం కూడా చెప్తాము.. ఆ తర్వాత మీ ఆశ్చర్యం మరి కాస్తా ఎక్కువవతుంది. అది ఏంటంటే వీరిద్దరు ఉత్తర బిహార్‌లోని ఓ టౌన్లో ఉంటున్నారని.. వీరికి 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చదువుతుంటేనే గందరగోళంగా అనిపిస్తుంది కదా.. హాల్‌టికెట్ తీసుకుని చూసుకున్న తర్వాత సదరు యువకుడు మనకంటే ఎక్కువ ఆశ్చర్యపోయుంటాడు. ఇంకా చెప్పాలంటే షాక్‌తో మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ఓ కాలేజీ స్టూడెంట్ అడ్మిట్ కార్డ్ మీద అతడి తల్లి దండ్రుల పేర్ల స్థానంలో ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్ పేర్లు ప్రింట్ చేశారు కాలేజీ యాజమాన్యం. (చదవండి: జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి) వివరాలు.. కుందన్ కుమార్(20) అనే యువకుడు ధనరాజ్ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతుండటంతో హాల్ టికెట్ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు. దాన్ని చూసిన అతడు ఒక్కసారి షాక్ అయ్యాడు. ఎందుకంటే దాని మీద అతడి తండ్రి పేరుకు బదులు ఇమ్రాన్ హష్మి అని.. తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్ అని ఉంది. దీని గురించి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఈ అడ్మిట్ కార్డ్ తెగ వైరలవుతోంది. యూనివర్సిటీ రిజాస్టారర్ రామ్ కృష్ణ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘విద్యార్థి వల్లనే ఈ తప్పిదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. దర్యాప్తు చేస్తున్నాం.. బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
అడ్మిట్ కార్డ్ మీద స్టార్ హీరో ఫోటో..!
అలహాబాద్ : విద్యార్థులకే కాక జంతువులకు అడ్మిట్ కార్డ్ ఇచ్చిన యూనివర్సిటీలు ఉన్న దేశం మనది. వాటికి పోటీగా మరో యూనివర్సిటీ వచ్చి చేరింది. అయితే ఈ యూనివర్సిటీ మాత్రం కాస్తా పద్దతిగా విద్యార్థి స్థానంలో జంతువుకు బదులు ఓ స్టార్ హీరో ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చింది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దంపట్టే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ గొండా జిల్లాలో చోటు చేసుకుంది. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ పరిధిలోని రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ్ కాలేజిలో అమిత్ ద్వివేది అనే విద్యార్థి బీ ఈడీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఈ ఏడాది పరీక్షల నిమిత్తం ఇచ్చిన అడ్మిట్ కార్డ్ మీద అమిత్ ఫోటోకు బదులుగా బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఫోటోని ప్రింట్ చేసి ఇచ్చారు. ఇది గమనించిన అమిత్ ఈ విషయాన్ని అధ్యాపకుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అందుకు వారు పొరపాటున అలా జరిగి ఉంటుంది.. ఏం కాదు అంటూ పరీక్షలకు అనుమతిచ్చారని తెలిపాడు. అయితే అమితాబ్ బచ్చన్ ఫోటోతో ఉన్న అడ్మిట్ కార్డ్‌తో పరీక్షలు రాశాను.. ఇప్పుడు మార్క్స్ షీట్ మీద కూడా అమితాబ్ బచ్చన్ ఫోటో వస్తే నా పరిస్థితి ఏంటి అంటూ వాపోతున్నాడు అమిత్. ఈ విషయం గురించి రవీంద్ర సింగ్ స్మారక్ మహావిద్యాలయ్కు చెందిన ఓ సీనియర్ అధికారిని ప్రశ్రించగా.. ‘అమిత్ ఇంటర్ నెట్ సెంటర్లో పరీక్ష ఫీజు చెల్లించే సమయంలో తప్పిదం దొర్లడం వల్ల ఈ సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. లేదా ఇది యూనివర్సిటీ తప్పిదం కూడా అవ్వొచ్చు. ఏది ఏమైనా ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయుని దృష్టికి తీసుకెళ్లాం. తప్పును సరిదిద్ది, మార్క్స్ షీట్లో అమిత్ ఫోటో వచ్చేలా చేస్తాం’ అని తెలిపారు. -
‘టీఆర్టీ’ ఫలితాల్లో గందరగోళం
సాక్షి, జనగామ అర్బన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన టీఆర్టీ ఫలితాలు వివిధ జిల్లాల్లోని స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలను చూసిన అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌పై సంబంధంలేని వివరాలు ఉండడంతో కంగుతింటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఎంతోకాలంగా కష్టపడి పరీక్ష కు ప్రిపేర్ అయితే.. టీఎస్పీఎస్సీ అధికారులు తమ జీవితాలతో చెలగాటమాడారని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో అధి కారులు సాంకేతిక తప్పిదం జరిగిందని తప్పించుకుని మరోమారు నిరుద్యోగులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, పరీక్ష రాసిన అనంతరం తాము చూసుకున్న ఫైనల్‌కీ మార్కులకు ప్రభుత్వం ప్రకటించిన ఫలితాలకు కూడా వ్యత్యాసం ఉండడం పలు అనుమానాలకు తావిస్తోందని వారు వాపోతున్నారు. ఫలితాల్లో తప్పులు.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఎన్. సాయిబాబు బీసీ బీ కులానికి చెందిన పురుషుడు. ఈయనకు ఫైనల్ కీలో 58 మార్కులు వచ్చాయి. కాగా, ఫలితాల్లో మాత్రం ఎస్సీ కేటగిరీగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళగా చూపించి 54 మార్కులు ఉన్నట్లు ప్రకటించారు. వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన సీహెచ్.కల్యాణి బీసీ బీకి చెందిన మహిళ. ఈమెను బీసీ డీ పురుషుడిగా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినట్లు ఫలితాల్లో చూపించారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జె. రమేష్ బీసీ బీ పురుషుడు. ఈయనను నల్లగొండ జిల్లా బీసీ డీ అభ్యర్థిగా ఫలితాలు ప్రకటించారు. ఇదే జిల్లాకు చెందిన పలువురు అభ్యర్థులకు సైతం ఫలితాలు తారుమారు వచ్చాయని ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఎస్టీ మహిళ అభ్యర్థికి రంగారెడ్డి జిల్లా వ్యక్తిగా, బీసీ డీగా చూపించారు. మారుతీరెడ్డి కరీంనగర్ జిల్లా ఓసీ అభ్యర్థిగా పరీక్షకు హాజరుకాగా, ప్రకటించిన ఫలితాల్లో బీసీ డీ, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అభ్యర్థిగా ప్రకటించారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం.. టీఎస్పీఎస్సీ ప్రకటించిన ఫలితాలు తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నాయి. చాలాకా లం పాటు కష్టపడి చదివి ఫలితాల కోసం ఎదురుచూస్తే తీవ్రనిరాశ కలిగించాయి. ప్రకటించిన ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ అధికారులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదు. –నోముల సాయిబాబు, జనగామ జిల్లా ప్రతిసారి ఇదే తంతు కొనసాగుతోంది.. టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న ప్రతి పోటీ పరీక్షల్లో తప్పులు దొర్లడం సర్వసాధారణమైంది. పరీక్ష రాసిన అభ్యర్థిలో ప్రతిసారి ఫలితాలు ఎలా వస్తాయో అనే ఆందోళన నెలకొంది. ప్రభుత్వం తక్షణమే చొరవచూపి ప్రకటించిన ఫలితాల్లో సాంకేతిక లోపాన్ని సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలి. –మారుతిరెడ్డి, కరీంనగర్ జిల్లా -
డిప్యూటీ తహసీల్దార్ అభ్యర్థి గాడిద..!!
శ్రీనగర్ : ఎవరినైనా తిట్టాలంటే గాడిద..! అనే పదానికి ఇంకా ఏవేవో జతచేసి వారి దుమ్ము దులుపుతాం. ఇక సరదా సంభాషణల్లో గాడిద గుడ్డు..! అనే పద ప్రయోగం కూడా ఉంది. ఎందుకంటే మనం గాడిదకు అంత అల్ప ప్రాధాన్యం ఇస్తాం. కానీ.. జమ్మూ కశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) గాడిదకు గొప్ప గౌరవాన్ని ఇచ్చింది. డిప్యూటీ తహసీల్దార్ పరీక్షలో పోటీ పడేందుకు గాడిదకు హాల్ టికెట్ జారీ చేసింది. అభ్యర్థి పేరు ‘కచౌర్ ఖర్’ (గోధుమ రంగు గాడిద) అంటూ, హాల్ టికెట్‌పై గాడిద ఫోటోని కూడా ముద్రించి నవ్వులపాలైంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎస్ఎస్బీ నిర్వాకంపై ట్విటర్, ఫేస్‌బుక్‌లలో కామెంట్ల వర్షం కురుస్తోంది. వేలకు వేలు జీతాలు తీసుకోవడమే కాకుండా అధికారుల అలసత్వం వల్ల గాడిదలకు పరీక్షలు నిర్వహించే స్థాయికి ఎస్ఎస్బీ చేరిందంటూ ఒక నెటిజన్ ఘాటైన ట్వీట్ చేశాడు. ఎస్ఎస్బీ చర్యలు నవ్వు తెప్పిస్తోంది. అది గాడిదకి హాల్ టికెట్ జారీ చేయడం ఒక విడ్డూరమైతే.. ఆ వార్త వైరల్ కావడం మరో విడ్డూరమంటూ ఫేస్బుక్లో మరో వ్యక్తి తన అసహనం వ్యక్తం చేశాడు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు ఎస్ఎస్బీ అధికారులు నిరాకరించారు. సాంకేతిక పొరపాటు వల్ల ఇలాంటి తప్పిదమే గతంలోనూ చోటు చేసుకుంది. 2015లో ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఎస్ఎస్బీ ఆవు పేరిట హాల్ టికెట్ జారీ చేసింది. దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో తన సర్వర్ నుంచి ఆవు పేరుతో నమోదైన అప్లికేషన్‌ను తొలగించింది. -
అడ్మిట్ కార్డు చూసి అవాక్కైంది..
సాక్షి, పాట్నా : సైన్స్ పరీక్ష రాసేందుకు తనకు ఇచ్చిన అడ్మిట్ కార్డును చూసిన బిహార్ విద్యార్థిని విస్తుపోయింది. బికినీ ధరించిన మహిళ ఫోటోగ్రాఫ్ ఉన్న అడ్మిన్ కార్డును చేతిలో పెట్టడంతో విద్యార్థిని అవాక్కైంది. దర్భంగా జిల్లాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఈ అడ్మిట్ కార్డును జారీ చేసింది. ఈ విషయాన్ని హోమ్‌సైన్స్ హానర్స్ విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సరైన ఫోటోతో కొత్త అడ్మిట్ కార్డు ఇవ్వాలని కోరింది. దరఖాస్తును, అడ్మిట్ కార్డును తాను సవ్యంగా పూర్తిచేసినా బికినీ ధరించిన మహిళ ఫోటోను ఆ కార్డులో ఇవ్వడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేసింది. కాగా, అభ్యర్ధి ఫోటోతో కూడిన అడ్మిట్ కార్డును సత్వరమే జారీ చేయాలని అధికారులను ఆదేశించామని ఎగ్జామినేషన్ కంట్రోలర్ చెప్పారు. అడ్మిట్ కార్డును ముద్రించిన ఏజెన్సీ నుంచి లిఖితపూర్వక వివరణను కోరినట్టు ఆయన తెలిపారు. -
ప్చ్... దేవుడికే ‘పరీక్ష’ పెట్టాలనుకున్నారు
సాక్షి, పట్నా : ఇలాంటి పొరపాట్లు దొర్లటం సహజమే కావొచ్చు. కానీ, విద్యావ్యవస్థపై విమర్శలు వినిపించే బిహార్‌లోనే ఈ ఘటన చోటు చేసుకోవటమే ఇక్కడ విశేషం. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతో హల్ టికెట్లో విద్యార్థికి బదులు.. వినాయకుడి ఫోటో.. కింద సంతకం కూడా గణేశ్ అని ఉంది. దీంతో దేవుడే వచ్చి పరీక్ష రాస్తాడా? అని సదరు విద్యార్థి ప్రశ్నిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్లితే... దర్భాంగలోని లలిత్ నారాయణ్ మిథిల యూనివర్సిటీలో కృష్ణ కుమార్ రాయ్ అనే విద్యార్థి బీకాం ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అక్టోబర్ 9 నుంచి పరీక్షలు మొదలు అవుతుండగా.. బుధవారం యూనివర్సిటీ అధికారులు అతనికి హాల్ టికెట్ జారీ చేశారు. అది చూసి అతని నోట మాట పడిపోయింది. వినాయకుడి ఫోటో, కింద గణేషుడి సంతకం.. పైగా ఆ విద్యార్థి అడ్రస్ కూడా తప్పుగా రాసి ఉంది. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యమే. ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తే చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కనీసం నేను చెప్పేది కూడా పట్టించుకోలేదు. మరి ఇప్పుడు దేవుడే వచ్చి పరీక్ష రాస్తాడా? అంటూ కృష్ణ ప్రశ్నిస్తున్నాడు. ఇక ఇదే విషయాన్ని యూనివర్సిటీ అధికారులను ప్రశ్నిస్తే.. హాల్ టికెట్లు ముంద్రించేందుకు బయట ప్రైవేట్ ప్రింటింగ్ మిషన్ల సాయం తీసుకుంటామని, బహుశా అక్కడ తప్పు దొర్లి ఉండొచ్చని.. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని చెబుతున్నారు. కాగా, ఇదే యేడాది మొదట్లో బిహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష సందర్భంగా ఓ అమ్మాయి హల్ టికెట్‌పై భోజ్‌పురి నటి అంతరా బిశ్వాస్(మోనాలిసా) టాప్ లెస్ ఫోటోను ముద్రించిన విషయం తెలిసిందే. -
హాల్‌టికెట్ ఇవ్వలేదంటూ విద్యార్థిని ఆందోళన
ఒంగోలు: రెండు పరీక్షలు ముగిసినా తనకు పరీక్ష హాల్‌టికెట్ ఇవ్వలేదంటూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ విద్యార్థిని ఝాన్సీ, తన తండ్రి జాన్సన్‌తో కలిసి ఒంగోలులోని కళాశాల ఎదుట సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. వారికి మద్దతుగా ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జలదంకి నరశింహారావు కూడా నిరసన తెలుపుతూ బాధితురాలికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ లింగసముద్రం మండలం ఆర్ఆర్ పాలేనికి చెందిన తనకు డీఆర్డీఏ ద్వారా మెరిట్ జాబితాలో తనకు సీటు వచ్చిందని తెలిపింది. డీఆర్డీఏ నుంచి కాలేజీకి అందాల్సిన డబ్బులు రావడం లేదని, డబ్బులు కడితేనే కాలేజీకి రావాలని కంప్యూటర్ సార్ పేర్కొన్నారని ఆరోపించింది. హాల్‌టికెట్ ఇవ్వాలని తన తండ్రి వచ్చి బతిమాలినా అందుకు సార్ అనుమతించలేదని, డైరెక్టర్‌ను కలిసేందుకూ ఒప్పుకోలేదని కన్నీటి పర్యంతమైంది. ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు విషయాన్ని ఆర్ఐవో దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఆయన నేరుగా కాలేజీకి చేరుకుని విద్యార్థినికి సంబంధించిన రికార్డులు పరిశీలించారు. అనంతరం కాలేజీ డైరెక్టర్ బయటకు వచ్చి విద్యార్థిని తండ్రితో, ఎంఎస్ఎఫ్ నాయకులతో మాట్లాడారు. హాల్‌టికెట్ ఇప్పించడంతో పాటు వార్షిక ఫీజు కోసం కూడా విద్యార్థినిపై ఒత్తిడి తేవద్దని ఎంఎస్ఎఫ్ నాయకులు సూచించారు. దీనికి డైరెక్టర్ అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. పరీక్ష ఫీజు మేమే కట్టాం: విద్యార్థిని పరీక్ష రాయకుండా చేయాలనే ఉద్దేశం మాకు లేదు. డీఆర్డీఏ నుంచి ఫీజు జమ కాకపోవడానికి కూడా కారణం మేము కాదు. మీసేవలో వారు దరఖాస్తు చేసే సమయంలో ఎస్సీ అని పేర్కొనాల్సిన చోట బీసీ డీ అని పడింది. దానిని సరిచేయడంలో జాప్యం జరుగుతుండడంతో ఫీజు జమకాలేదు. ఝాన్సీ అక్టోబరు 6వ తేదీ నుంచి కాలేజీకి రాలేదు. అయినా రెండుసార్లు యువతికి ఫోన్‌చేస్తే జ్వరం అంటూ సమాధానం వచ్చింది. దానినే తాము రిజిస్టర్లో కూడా నమోదు చేశాం. చివరకు విద్యార్థిని పరీక్ష ఫీజు సైతం చెల్లించకపోతే మేమే పరీక్ష ఫీజు కట్టాం. కనీసం ప్రాక్టికల్ పరీక్షలకు కూడా హాజరుకాలేదు. కాలేజీ వద్దకు వచ్చి బైఠాయించే వరకు నా దృష్టికి రాలేదు. హాల్‌టికెట్‌ను నెట్లో డౌన్లోడ్ చేసుకొని సంబంధిత సెంటర్లో నేరుగా పరీక్ష రాసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఈ నేపథ్యంలో మేము హాల్‌టికెట్ ఆపాల్సిన అవసరమే లేదు. – కళాశాల కరస్పాండెంట్ -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
- హాల్ టిక్కెట్ మిస్ అయిందనే కారణం ఆదోని టౌన్: హాల్ టిక్కెట్ మిస్ కావడంతో మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శనివారం కౌతాళం మండలం మల్లన్నహట్టి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన మహదేవ ఆదోని పట్టణంలో డిగ్రీ సెకండ్ ఇయర్ బీఎస్సీ చదువుతున్నాడు. ఆదోనిలోని ఏఏఎస్ కళాశాలలో మూడు రోజుల క్రితం పరీక్ష రాశాడు. శనివారం మరో పరీక్ష రాయడానికి ఆదోనికి వచ్చాడు. కళాశాల వద్దకు చేరుకొని హాల్‌టిక్కెట్‌ను చూడగా మిస్ అయినట్లు భావించాడు. పరీక్ష రాయించరని, అమ్మానాన్నలకు సమాధానం ఎలా చెప్పాలని మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికి చేరుకొని ఇంటివద్దనే పురుగుల మందు తాగాడు. పరిస్థితిని గమనించిన తల్లి రాగమ్మ, ఇరుగు పొరుగు మహిళలు మహదేవను ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహదేవ వాంగ్మూలాన్ని సేకరించిన ఔట్‌పోస్టు కానిస్టేబుల్ బీరప్ప..సమాచారాన్ని కౌతాళం పోలీసులకు అందజేశారు. -
27 వరకే హాల్‌టికెట్ల డౌన్లోడ్
ఏపీ ఎంసెట్ కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఏపీ ఎంసెట్-2016 ప్రవేశ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 27 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ ప్రొ.సీహెచ్.సాయిబాబు తెలిపారు. ఇంటర్ హాల్‌టికెట్ నంబర్‌ను తప్పుగా నమోదు చేసుకున్నవారితోపాటు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్, టీఎస్ఓఓఎస్ఎస్, ఆర్జీయూకేటీల నుంచి ఇంటర్ చదివినవారికి హాల్‌టికెట్ డౌన్లోడ్ సమయంలో ప్రత్యేకంగా డిక్లరేషన్ ఫారం ఇస్తారన్నారు. దాన్ని పూర్తిచేసి ధ్రువీకరణ పత్రాలతో మార్కుల జాబితాను అటెస్టేషన్ చేయించి ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఆఫీసుకు 30 లోగా పంపాలన్నారు. రూ. 10 వేల అపరాధ రుసుంతో ఈ నెల 27 వరకు దరఖాస్తుల్ని స్వీకరిస్తామన్నారు. రూ.5 వేలు అపరాధ రుసుంతో దరఖాస్తు చేసుకున్న వారికి, మెడిసిన్‌లో పలుమార్లు పరీక్షకు హాజరవుతున్నవారికి కాకినాడ రీజినల్ సెంటర్లోనే పరీక్షా కేంద్రాన్ని కేటాయిస్తామని చెప్పారు. -
హాల్ టికెట్ ఇవ్వలేదని...
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం మహబూబాబాద్: హాల్ టికెట్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించిన ఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వావిలాలలో బుధవారం జరిగింది. నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన ఎడ్ల రాంచంద్రు, మంజులల చిన్న కుమార్తె పావని మహబూబాబాద్‌లోని సోషల్ వెల్ఫేర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్(ఎంపీసీ) చదువుతోంది. తల్లిదండ్రులు మృతి చెందడంతో తాత వద్ద ఉంటోంది. అనారోగ్యం కారణంగా కొన్ని నెలలు కాలేజీకి వెళ్లలేదు. తర్వాత ఎన్విరాన్మెం ట్ ప్రాక్టికల్ పరీక్షకు హాజరై.. మళ్లీ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంది. వారం క్రితం పెద్దమ్మ కుమారుడితో కలసి కాలేజీకి వెళ్లి హాల్‌టికెట్ అడిగితే ప్రిన్సిపాల్ నిరాకరించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు కాలేజీలోనే ఉన్నా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందింది. వావిలాలలోని పెద్దనాన్న ఇంటికి వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. హాజరులేని కారణంగానే పావనికి హాల్‌టికెట్ ఇవ్వలేదని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. -
22 మంది విద్యార్థుల హాల్టికెట్లలో తప్పిదాలు
తిరుపతి: చిత్తూరు జిల్లాలో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల సందర్భంగా 22 మంది విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలను గుర్తించారు. ద్వితీయ భాషగా తెలుగుకు బదులు హాల్టికెట్లలో కొందరికి ఇంగ్లిష్, కొందరికి సంస్కృతం ఉండడంతో పరీక్ష ప్రారంభమైన తర్వాత విద్యార్థులు ఆలస్యంగా మేల్కొని ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు ఓఎంఆర్ పత్రాలను మార్చి ఇచ్చారు.ఇంటర్మీడియట్ తొలి సంవత్సరం పరీక్షలకు ‘ఒక్క నిమిషం’ బాగా ఎఫెక్ట్ చూపింది. వారి భవిష్యత్‌ను దెబ్బతీసింది.ఇంటర్ పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించకూడదన్న సర్కారు ఆదేశాలను అధికారులు తు.చ. తప్పకుండా పాటించారు. -
సచిన్ కుమారుడి ఫొటోతో కలకలం
ఆగ్రా: ఏ కాలేజీ కుర్రాడికైనా, ఉపాధ్యాయుడికైనా క్రికెట్ దేవుడు సచిన్, అర్జున్ టెండూల్కర్లు ఎవరో వాళ్లు ఎక్కడ ఉంటారో తెలిసే వుంటుంది. అయితే ఉత్తరప్రదేశ్ ఇంటర్ బోర్డు అధికారుల తీరే వేరు. ఆగ్రాలోని రాజా బలవంత్ సింహ్ కాలేజీ సెంటర్... విద్యార్థులకు జారీ చేసిన హాల్ టికెట్ ఇంటర్ బోర్డు అవినీతి, అరాచకాలకు అద్దం పట్టింది. సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఫోటోతో హాల్ టికెట్‌ను జారీ చేసింది. పరీక్షలకు ఒకే రోజు గడువు ఉన్నందున చివరి క్షణంలో హాల్ టికెట్ అందుకున్న అర్జున్ సింగ్ అనే టెన్త్ స్టూడెంట్ హాల్ టికెట్ పై అర్జున్ టెండూల్కర్ ఫొటో చూసి లబో దిబో మంటున్నాడు. వేరే వారి పేర్లతో పరీక్షలు రాయడం యూపీలో సాధారణ విషయమని, అంతెందుకు ఓ పాతిక వేలు పారేస్తే హఫీజ్ సయీద్ ఫొటోను అతికించినా అధికారులు వెరిఫై చేయకుండా హాల్ టికెట్ జారీ చేస్తారని విద్యా నిపుణులు విమర్శిస్తున్నారు. జంతువుల బొమ్మలతో కూడా హాల్ టిక్కెట్లు జారీ చేసిన ఘనత మనదేశ విద్యావిభాగాలకు ఉంది. గతేడాది మే నెలలో జమ్మూకశ్మీర్ లో ప్రొఫెషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జారీ చేసిన చేసిన హాల్ టిక్కెట్ లో ఆవు ఫొటో ముద్రించారు. గత జూన్ లో పశ్చిమ బెంగాల్ లో ఓ విద్యార్థి హాల్ టిక్కెట్ పై కుక్క ఫొటో ప్రత్యక్షం కావడంతో కలకలం రేగింది. -
సింగరేణి పరీక్షకు 70 వేల మంది హాజరు
కొత్తగూడెం: సింగరేణిలో ఖాళీగా ఉన్న 471 జూనియర్ అసిస్టెంట్ (క్లరికల్) పోస్టులకు ఆరు జిల్లాల్లోని 170 కేంద్రాలలో ఆదివారం పరీక్షలు నిర్వహించారు. మొత్తం 83,225 మందికి హాల్ టిక్కెట్లు పంపిణీ చేయగా 70,561 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో సింగరేణి సంస్థ డెరైక్టర్ (ఫినాన్స్, పా) పవిత్రన్‌కుమార్ లాటరీ ద్వారా పరీక్ష పత్రాన్ని ఎంపిక చేశారు. ఆదిలాబాద్‌లో 22 పరీక్ష కేంద్రాల్లో 7,915 మందికి గాను 6,271, హైదరాబాద్‌లో 6 కేంద్రాల్లో 5,277 మందికి 3,787 మంది, కరీంనగర్లో 53 పరీక్ష కేంద్రాల్లో 25,429 మందికి గాను 21,895 మంది, వరంగల్‌లో 21 కేంద్రాల్లో 14,576 మందికి గాను 12,366 మంది, ఖమ్మంలో 41 కేంద్రాల్లో 20,799 మందికి గాను 17,810 మంది, మంచిర్యాలలో 27 పరీక్ష కేంద్రాల్లో 9,229 మందికి గాను 8,432 మంది హాజరయ్యారు. -
హాల్‌టికెట్ లేకున్నా ఎడ్‌సెట్ రాయొచ్చు
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా నేడు జరిగే టీఎస్ ఎడ్‌సెట్-2015ను హాల్‌టికెట్ లేకున్నా రాయవచ్చని హైదరాబాద్ రీజినల్ సహాయకుడు డాక్టర్ ధర్మతేజా తెలిపారు. ఎడ్‌సెట్‌కు చెల్లించిన ఫీజు రశీదు, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో ఏదైనా ఒక పరీక్షాకేంద్రానికి గంట ముందుగా చేరుకొని అధికారులను సంప్రదించి అనుమతి తీసుకోవచ్చని పేర్కొన్నారు. జంటనగరాల్లో ఏర్పాటు చేసిన 32 పరీక్షా కేంద్రాల్లో 19,104 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం 98488 22381 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నేడు మండలిలో ఎడ్‌సెట్ ప్రశ్నపత్రం ఎంపిక టీఎస్ ఎడ్‌సెట్-2015 ప్రశ్నపత్రాన్ని శనివారం ఉదయం 6.45 నిమిషాలకు రాష్ట్ర ఉన్నత విద్య మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ పాపిరెడ్డి ఎంపిక చేయనునట్లు కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. -
హాల్ టిక్కెట్ కోసం వెళ్లి..విద్యార్థిని అదృశ్యం
హైదరాబాద్ (చాంద్రాయణగుట్ట): కళాశాలకు వెళ్లి హాల్ టిక్కెట్ తెచ్చుకుంటానంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ ఇంటర్ విద్యార్థిని కనిపించకుండా పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గౌలిపురా నల్లపోచమ్మ బస్తీకి చెందిన ప్రసాద్ కుమార్తె ఎ.ప్రసన్న లక్ష్మీ(19) ఇంటర్ విద్యార్థిని. గత నెల 21న కాలేజీకి వెళ్లి మొదటి సంవత్సరం సప్లమెంటరీ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్ తెచ్చుకుంటానంటూ తల్లికి చెప్పి వెళ్లింది. రాత్రి వరకు కూడా ప్రసన్న లక్ష్మీ ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు తెలిసిన వారి దగ్గర ఆరా తీశారు. అమ్మాయి ఆచూకీ ఎంతకీ తెలియకపోవడంతో తండ్రి ప్రసాద్ మంగళవారం ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో గాని 9490616500 నంబర్లో గానీ సమాచారం అందించాలని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు. -
ఇంటర్‌విద్యార్థులకు అందని హాల్‌టికెట్లు
-
హాల్‌టికెట్ల హైడ్రామా
నెల్లూరు(విద్య) : నెల్లూరు రూరల్ మండలం సౌత్‌మోపూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రం వద్ద బుధవారం హైడ్రామా నడిచింది. ఎనిమిది మంది విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో వారు కళాశాల భవనంపైకి ఎక్కి నినాదాలు చేశారు. పరీక్ష జరుగుతున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కళాశాల ప్రిన్సిపల్‌గా మాల్యాద్రిచౌదరి పనిచేస్తున్నారు. వాసవి, సాయికుమార్ అనే సీనియర్ ఇంటర్ విద్యార్థులు చంద్రశేఖర్, రాజేంద్రబాబు, వెంకటేష్, అభిలాష్, అజయ్‌కుమార్, రాజేంద్రలు అనే జూనియర్ ఇంటర్ విద్యార్థులకు హాజరుతగ్గడంతో బోర్డు నిబంధనలను అనుసరించి హాల్‌టికెట్లు ఇచ్చేది లేదని ప్రిన్సిపల్ తేల్చిచెప్పేశారు. వారిలో బైపీసీ జూనియర్ ఇంటర్ విద్యార్థులు ఐదుగురు, ఎంపీసీ ఒకరు, సీనియర్ ఇంటర్లో ఎంపీసీ ఒకరు, బైపీసీ ఒకరు ఉన్నారు. ఆర్ట్స్ విద్యార్థులకు అటెండెన్స్ సరిపోకపోతే కాండోనేషన్ ఫీజు కట్టించుకొని పరీక్షలు రాయించవచ్చుననేది బోర్డు నిబంధన. సైన్స్ విద్యార్థులు ఖచ్చితంగా అటెండెన్స్ ఉండి తీరాల్సిందే. 60 నుంచి 70 శాతం అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు ఈ అవకాశం ఉంటుంది. అయితే ఈ కళాశాల విద్యార్థులకు 40 నుంచి 60 శాతం ఉండటంతో ప్రిన్సిపల్ వీరికి హాల్‌టికెట్లు ఇవ్వకపోవడంతో వారు ఈ విద్యాసంవత్సరాన్ని నష్టపోవాల్సి వచ్చింది. ఎంతమంది సర్దిచెప్పినా ప్రిన్సిపల్ ససేమిరా అనడంతో విద్యార్థులు ఏమీ చేయలేకపోయారు. కళాశాల భవనంపై చేరి నినాదాలు చేశారు. సెల్ఫ్ సెంటర్‌పై వివాదాలు... సౌత్‌మోపూరు కళాశాల సెల్ఫ్సెంటర్. అక్కడ చదివే విద్యార్థులు అక్కడే పరీక్షలు రాస్తారు. సుమారు 212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఏడాది పొడవునా విద్యార్థుల అటెండెన్స్ విషయం పట్టించుకోవాల్సిన ప్రిన్సిపల్ ఆ విషయాన్ని పరీక్షలప్పుడే పట్టుబట్టడంపై పలు వివాదాలకు తావిస్తోంది. వారి తల్లిదండ్రులకు ఫోన్ చేశామని ప్రిన్సిపల్ వాదిస్తున్నారు. ప్రిన్సిపల్ విద్యాసంవత్సరం మొత్తం మీద వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని స్థానికుల వాదన. అయితే విద్యార్థుల వద్ద నుంచి తెల్లకాగితాలపై సంతకాలు తీసుకొని వాటినే షోకాజ్ నోటీసులుగా చూపుతూ ప్రిన్సిపల్ వాదనకు దిగడం విడ్డూరమని గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న డీవీఈఓ బాబు జాకబ్ కళాశాలను సందర్శించారు. పూర్వాపరాలను ఆరా తీశారు. డీవీఈఓ చెప్పినా ప్రిన్సిపల్ ఒప్పుకోకపోవడంతో ఆయన కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అప్పటికే పరీక్షా సమయం కాస్త అయిపోయింది. ఇక చేసేదిలేక ప్రిన్సిపల్‌ను కలెక్టర్‌కు వ్యక్తిగతంగా సంజాయిషీ ఇవ్వమన్నారు. కనీసం గురువారం జరిగే సెకండియర్ పరీక్షను రాసే ఇద్దరికన్నా అవకాశం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. అందరూ పేద విద్యార్థులే.. కళాశాలలో చదివే విద్యార్థుల ఆర్థిక నేపథ్యం అంతంతమాత్రమేనని సమాచారం. పుస్తకాలు, ఫీజులు కట్టాలంటే ఇంటర్మీడియట్ స్థాయి విద్యార్థులు కూలి పనులకు వెళ్లి వచ్చిన సంపాదనతో ఫీజులు కడతారనేది స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమం లో అనేక మంది దాతలు కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు కృషిచేస్తున్నారు. విద్యాసంవత్సరం అంతటిలో ఇంత పట్టుపట్టి ఉంటే వారు కళాశాలకు వచ్చి ఉండేవారని విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. నా గొంతులో ప్రాణం ఉండగా మీరు ఎలా పరీక్ష రాస్తారో చూస్తానంటూ జీఓను సాకుగా చూపడం పలువురు విస్మయానికి గురిచేసింది. అధికారు లు స్పందించి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
హాల్‌టికెట్ ఇవ్వలేదని విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
విజయనగరం(ఎస్. కోట): హాల్ టికెట్ ఇవ్వలేదని కలత చెందిన విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన విజయనగరం జిల్లా వేపాడ మండలం వల్లాలపుడి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. వేపాడ మండలం వల్లాలపుడి గ్రామానికి చెందిన బైల ధనలక్ష్మి(17) వేపాడ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ రోజు ద్వితీయ సంవత్సరం పరీక్ష జరగనుండగా తన హాల్ టికెట్ ఇవ్వాలని కళాశాల సిబ్బందిని కోరింది. దానికి వారు నిరాకరించడంతో మనస్థాపానికి చెందిన ధనలక్ష్మి ఆత్మహత్య యత్నం చేసింది. పరిక్ష రాయడానికి అవసరమైన హాజరు లేకపోవడంతోనే హాల్ టికెట్ ఇవ్వడాన్ని నిరాకరించామని కళాశాల సిబ్బంది అంటున్నారు. విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ఎంసెట్ ప్రశాంతం
ఏలూరు సిటీ/భీమవరం టౌన్, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడిసిన్ కోర్సుల ప్రవేశ పరీక్ష (ఎంసెట్-14) జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. ఒక్క నిమిషం ఆలస్యమైన కారణంగా పదిమంది విద్యార్థులు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు. ఏలూరు, భీమవరం కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలకు 14 వేల 90 మంది హాజరు కావాల్సి ఉండగా, 13వేల 184 మంది మాత్రమే హాజరయ్యూరు. 906 మంది గైర్హాజరయ్యారు. జెడ్పీ సీఈవో, ఎంసెట్ జిల్లా కన్వీనర్ డి.వెంకటరెడ్డి ఏలూరులోని పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా పరీక్షలను ప్రశాంతంగా పూర్తిచేశామని చెప్పారు. హాల్ టికెట్‌తో పాటు ఆన్లైన్ అప్లికేషన్ ఫారం, ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలను అందించని విద్యార్థులు జూన్ 1వ తేదీ లోగా హైదరాబాద్‌లోని ఎంసెట్ కార్యాలయానికి చేరేలా వాటిని పంపించాలని ఎంసెట్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ డి.రంగరాజు సూచించారు. ఎండవేడిమి తీవ్రంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల వద్ద సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరులోని పరీక్షా కేంద్రాలను ఆర్డీవో బి.శ్రీనివాసరావు తనిఖీ చేశారు. సీఆర్ఆర్ మహిళా కళాశాల, సెయింట్ థెరిస్సా మహిళా డిగ్రీ, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలల్లో కొన్నిచోట్ల లైటింగ్ సక్రమంగా లేకపోవటంతో అప్పటికప్పుడు లైట్లు ఏర్పాటు చేశారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రతి గదిలో తాగునీటి సౌకర్యం ఉందోలేదో పరిశీలించి, లేనిచోట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. 906 మంది గైర్హాజరు : ఎంసెట్ పరీక్షకు జిల్లావ్యాప్తంగా 13,184 మంది విద్యార్థులు హాజరయ్యారని ఏలూరు రీజినల్ కన్వీనర్ డాక్టర్ ఎ.ఏసుబాబు, భీమవరం రీజినల్ కన్వీనర్ రంగరాజు తెలిపారు. ఏలూరులో 11 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన ఇంజినీరింగ్ పరీక్షకు 6,982 మంది హాజరుకావాల్సి ఉండగా.. 430 మంది గైర్హాజరయ్యారు. 6,552మంది పరీక్ష రాశా రు. 4 కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్ పరీక్షకు 2,211మంది పరీక్ష రాయాల్సిఉండగా, 1,989 మంది పరీక్ష రాశారు. 222మంది గైర్హాజరయ్యారు. భీమవరంలో ఇంజినీరింగ్ పరీక్షకు 4,130 మందికి గాను, 3,918 మంది హాజరయ్యారు. 212 మంది పరీక్ష రాయలేదు. రెండు కేంద్రాల్లో నిర్వహించిన మెడిసిన్ పరీక్షకు 767 మంది హాజరుకావాల్సి ఉండగా, 725 మంది పరీక్ష రాశారు. 44 మంది హాజరుకాలేదు. -
నేడు పాలిసెట్
తొలిసారిగా ఓఎమ్మార్ షీట్ల వినియోగం జిల్లా పరిధిలో విద్యార్థులు 20,334 మంది నిమిషం ఆలస్యమైనాఅనుమతించరు విశాఖపట్నం , న్యూస్‌లైన్ : డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి బుధవారం నిర్వహించనున్న పాలిసెట్-2014 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా పరిధిలో 20,334 మంది దీనికి హాజరవుతున్నారు. విశాఖలో 13,740 మంది, జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు, భీమిలి కేంద్రాల్లో 6,594 మంది పరీక్ష రాయనున్నారు. తొలిసారిగా ఈ పరీక్షకు ఓఎమ్మార్ షీట్లు వినియోగిస్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హాల్ టికెట్లు అందజేశారు. హాల్ టికెట్లు అందని వారికి విశాఖ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం, పాడేరుల్లోని పాలిటెక్నిక్ కళాశాలల కార్యాలయాల్లో డూప్లికేట్ హాల్ టికెట్లు ఇవ్వడానికి చర్యలు చేపట్టారు. వెబ్సైట్లో నేరుగా హాల్ టికెట్లు పొందడానికి అభ్యర్థులకు నిర్వాహకులు అవకాశం కల్పించారు. బుధవారం ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 11 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. బుక్‌లెట్‌లో పొందుపరిచిన నియమ, నిబంధనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలని పాలిసెట్ కో-ఆర్డినేటర్ కె.సంధ్యారాణి తెలిపారు. సెల్‌ఫోన్, కాలిక్యూలేటర్‌ను కేంద్రాల్లోకి అనుమతించబోమన్నారు. -
పరీక్ష ఫీజు కోసం స్కూల్ యాజమాన్యం ఒత్తిడి
బోయిన్పల్లి, న్యూస్‌లైన్: పరీక్ష ఫీజు కట్టాలని.. లేకపోతే మీ అబ్బాయికి హాల్‌టికెట్ ఇచ్చేది లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను హెచ్చరించింది. ఫీజు కట్టే ఆర్థిక పరిస్థితి లేకపోవడంతో ఆ దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన భార్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు...పాతబోయిన్‌పల్లి డివిజన్ బృందావన్‌కాలనీలో నివాసముండే లక్ష్మి (32), వెంకన్న భార్యాభర్తలు. భర్త డ్రైవర్ కాగా..భార్య కూలీ పని చేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. పెద్ద కుమార్తె రాజేశ్వరి డిగ్రీ, చిన్నకుమార్తె రజని ఇంటర్ చదువుతుండగా... కుమారుడు ప్రదీప్ మల్లికార్జున కాలనీలోని ఎంకేఆర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ప్రదీప్ త్వరలో జరిగే 10వ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.కాగా, ప్రదీప్‌కు సంబంధించిన 10వ తరగతి పరీక్ష ఫీజును వెంటనే చెల్లించాలని తల్లిదండ్రులపై స్కూల్ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. లేకపోతే హాల్ టికెట్ ఇచ్చేదిలేదని, పరీక్ష కూడా రాయనివ్వబోమని హెచ్చరించింది. గురువారం రాత్రి ప్రదీప్ పరీక్ష ఫీజు కట్టాలని లక్ష్మి భర్తను అడిగింది. అసలే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాం.. డబ్బు ఎక్కడి నుంచి తేవాలని భర్త అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్రమనస్తాపానికి గురైన లక్ష్మి ఇంట్లోకెళ్లి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. స్థానికులు మంటలను ఆ ర్పి ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
నేటి నుంచి ప్రారంభం 99,466 మంది విద్యార్థులు..130 పరీక్ష కేంద్రాలు ఉదయం 8 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి 9 గంటలు దాటిన తరువాత నో... ఎంట్రీ ఆర్ఐవో ఎం. రూఫస్‌కుమార్ వెల్లడి గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ జిల్లాలో బుధవారం నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 99,466 మంది విద్యార్థులు హాజరుకానుండగా ఇందుకు 130 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. వీరిలో ప్రథమ సంవత్సర పరీక్షలకు 48,637 మంది, ద్వితీయ సంవత్సర పరీక్షలకు 50,829 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాలకు ఉదయం 8.00 గంటలకల్లా చేరుకోవాలని ఇంటర్‌బోర్డు ఆర్ఐవో ఎం. రూఫస్‌కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఉదయం 8.30 నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని, 8.45 తరువాత వచ్చే వారు ఆలస్యానికి గల కారణం తెలియజేయాల్సి ఉంటుందన్నారు. 9.00 గంటల తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ లోపలకు అనుమతించే ప్రసక్తే లేదన్నారు. విద్యార్థులను సకాలంలో కేంద్రాలకు పంపించడంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి హాల్ టికెట్, పెన్ను, పెన్సిల్ మినహా మరే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు మినహా ఇతరులెవ్వరూ సెల్ఫోన్లు కలిగి ఉండరాదని స్పష్టం చేశారు. మాల్ ప్రాక్టీసుకు పాల్పడి కఠిన చర్యలకు గురి కాకుండా ప్రతి విద్యార్థి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీసుకు పాల్పడితే అందుకు పరీక్ష కేంద్రాల్లో ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్ మెంటల్ అధికారులు బాధ్యత వహించాలన్నారు. కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్ల వసతి కల్పించామని చెప్పారు. ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ, విద్యార్థులను కేంద్రాలకు తరలించేందుకు ముఖ్యమైన రూట్లలో అదనపు సర్వీసులు నడపాల్సిందిగా ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో వివిధ రకాల మందులను ఏఎన్ఎంల పర్యవేక్షణలో అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి తావులేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షలకు సంబంధించిన సమస్యలు, కేంద్రాల్లో అవకతవకలను అధికారుల దృష్టికి తెచ్చేందుకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా సమస్యలు వుంటే పరీక్షలు జరిగే రోజుల్లో 0863-2222087 నంబర్ ద్వారా తెలియజేయాలని సూచించారు. -
ఐటీఐ పరీక్ష ఆగమాగం
ప్రశ్నపత్రాల కొరతతో పక్కకేంద్రాలకు పరుగులు జిరాక్స్ కోసం కేంద్రం దాటిన ప్రశ్నపత్రాలు.. సెమిస్టర్పై అవగాహన కల్పించని నిర్వాహకులు హాల్‌టికెట్ల కోసం సెంటర్ల వద్దే బేరసారాలు భద్రాచలం, న్యూస్‌లైన్: ఐటీఐ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. తొలిసారి ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానంపై ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు సరైన అవగాహన కల్పించకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రవేశపెట్టిన సెమిస్టర్ విధానం ఆదిలోనే అభాసుపాలైంది. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి ఐటీఐ పరీక్షలు ప్రారంభయ్యాయి. భద్రాచలంలోని ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న క్రాంతి ఐటీఐ, శ్రీ రామ, పవన్ ఐటీఐల విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కేంద్రంగా ఎంపిక చేశారు. భాగ్యలక్ష్మి, సారపాకలోని రామభద్ర ఐటీఐ విద్యార్థులు పాలిటె క్నిక్ కళాశాలలో పరీక్ష రాశారు. సెమిస్టర్ విధానంలో భాగంగా రెండు రోజులు రెండేసి పేపర్ల చొప్పున ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహించారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ మెకానిక్, వైర్మన్, కోపా, డీఎం సివిల్ తదితర ట్రేడ్లకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్షలు ఏర్పాటు చేశారు. ఓఎంఆర్ షీట్లో సర్కిల్స్‌ను దిద్దేందుకు బ్లాక్‌బాల్ పాయింట్ పెన్నునే ఉపయోగించాలనే నిబంధన విధించారు. ఇన్విజిలేటర్ సూచించినా పలువురు విద్యార్థులు దీన్ని పట్టించుకోలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చాలామంది బ్లాక్ బాల్‌పాయింట్ పెన్ను తీసుకురాలేదు. నిర్వాహకులు అప్పటికప్పుడు బయటినుంచి తెప్పించి ఇచ్చారు. సెమిస్టర్ విధానంపై సరైన అవగాహన కల్పించకపోవడం వల్లే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఇన్విజిలేటర్లు అన్నారు. కేంద్రాల వద్దే హాల్‌టికెట్ల పంపిణీ భద్రాచలంలో పలు ప్రైవేట్ ఐటీఐ కళాశాలలు కేవలం ఫీజుల కోసమే విద్యార్థులను కాలేజీలో చేర్పించుకుంటున్నట్లు మంగళవారం ప్రత్యక్షంగా రుజువైంది. పరీక్షకేంద్రాల వద్దే కొన్ని ప్రైవేట్ కళాశాలల నిర్వాహకులు హాల్‌టికెట్లు పంపిణీ చేశారు. ఫీజులు చెల్లించిన వారికి మాత్రమే హాల్‌టికెట్లు ఇచ్చారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు కేవలం కళాశాలల తనిఖీ, పరీక్షల సమయంలోనే కనిపిస్తున్నట్లు వెల్లడైంది. ముందస్తు ఒప్పందంలో భాగంగానే నిర్వాహకులు ఇలా చేస్తుంటారని విద్యార్థులు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. పరీక్షల ముందురోజు నాటికే విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వాల్సి ఉండగా..ఫీజుల కోసం కొన్ని కళాశాలల నిర్వాహకులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులతో బేరసారాలు ఆడుతూ కనిపించారు. అప్పటికప్పుడు ఎంతోకొంత ఇచ్చినవారికే హాల్‌టికెట్లు అందజేశారు. ప్రశ్నపత్రాల కొరతతోఇన్విజిలేటర్ల పరుగులు ఎలక్ట్రికల్, ఫిట్టర్, ఇండస్ట్రియల్ మెకానిక్ ప్రశ్నపత్రాలు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రాకపోవడంతో ఇన్విజిలేటర్లు వాటికోసం పరుగులుతీయాల్సి వచ్చింది. పక్క పరీక్ష కేంద్రాలకు వెళ్లి ప్రశ్నపత్రాలను తెచ్చారు. ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రాలు అసలే రాకపోవడంతో ఆ విభాగం విద్యార్థులను ఒక చోట కూర్చోబెట్టి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో రెండుసెంటర్లలో గైర్హాజరైన విద్యార్థుల ప్రశ్నపత్రాలను వీరికి అందజేశారు. ఇలా సర్దుబాటు చేసినా పాలిటెక్నిక్ కళాశాల సెంటర్లో ఎలక్ట్రీషియన్ ట్రేడ్ విభాగం పేపర్లు 37 తక్కువ రావడంతో...ఓ పేపర్ తీసుకెళ్లి జిరాక్స్ తీయించి విద్యార్థులకు పంపిణీ చేశారు. డిగ్రీ కళాశాలలో డిక్టేషన్..? ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో నిర్వాహకులతో ముందస్తు ఒప్పందం నేపథ్యంలో విద్యార్థులకు జవాబులు డిక్టేట్ చేసినట్లు తెలిసింది. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా చెప్పుకునే ఓ వ్యక్తికి ప్రైవేటు ఐటీఐ కళాశాలల నిర్వాహకులు పెద్ద మొత్తంలో ముట్టజెప్పారనే ఆరోపణలు వస్తున్నాయి. పరీక్షల ప్రారంభానికి ముందు ఐటీఐ నిర్వాహకుల వాహనంలోనే సదరు అధ్యాపకుడు నేరుగా కేంద్రంలోకి రావటం గమనార్హం. పేపర్లు ఆసల్యంగా రావటంతోనే సమస్య: ఎం. మురళీకృష్ణ, పరిశీలకులు ప్రశ్నపత్రాలు ఆలస్యంగా వచ్చాయి. సోమవారం అర్ధరాత్రి పోలీస్‌స్టేషన్‌కు వచ్చాయి. మంగళవారం ఉదయం వెళ్లి తెచ్చుకున్నాం. పేపర్లు తక్కువగా వచ్చిన మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. గైర్హాజరైన విద్యార్థుల పేపర్లు సర్దుబాటు చేశాం. -
రేపు వీఆర్వో, వీఆర్ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన
గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని కలెక్టర్ సురేశ్‌కుమార్ తెలిపారు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆదివారం కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాలను జఠ్టఠట.జీఛి.జీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు. వీఆర్వో అభ్యర్థులకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో, వీఆర్ఏ అభ్యర్థులకు ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో ఉదయం 9 గంటలకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. హాల్ టికెట్, విద్యార్హతలు, పుట్టిన తేదీ, కుల, నేటివిటీ ఒరిజనల్ సర్టిఫికెట్లు, 3 సెట్ల జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్టుసైజు ఫొటోలు, అభ్యర్థులు వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. -
టెన్త్ హాల్ టికెట్ల జారీలో జాప్యం
సాక్షి, ముంబై: ఈ ఏడాది పదో తరగతి (ఎస్ఎస్సీ) పరీక్షలు రాసే విద్యార్థులకు ‘హాల్ టికెట్’ జారీ చేయడంలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలు ప్రారంభం కావడానికి నెల రోజుల సమయమే ఉంది. కానీ ఎస్ఎస్సీ బోర్డుకు చెందిన ముంబై రీజియన్ మండలి ఈ ఏడు పరీక్షలు రాసే విద్యార్థుల ‘ప్రీ-లిస్టు’ ఇంతవరకు ఆయా పాఠశాలలకు పంపించలేదు. బోర్డు నుంచి వచ్చిన జాబితాను పరిశీలించి అందులో ఏవైనా తప్పులుంటే సంబంధిత పాఠశాలలు వాటిని బోర్డు దృష్టికి తీసుకెళతాయి. ఈ తప్పులను సరిదిద్దిన తర్వాత హాల్ టికెట్లు ముద్రిస్తారు. కానీ ఇంతవరకు ప్రీ-లిస్టు జాడ లేకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు జారీచేయడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షలు రాసే విద్యార్థుల జాబితా ఏటా డిసెంబర్లో బోర్డుకు పంపిస్తారు. ఆ తర్వాత జనవరి మొదటి వారంలో ఆయా పాఠశాలలకు ప్రీ-లిస్టు పంపిస్తారు. అందులో దొర్లిన తప్పులను సరిచేసి తిరిగి బోర్డుకు పంపిస్తారు. ముద్రణ పనులు పూర్తిచేసుకుని ఫిబ్రవరి రెండో వారంలో విద్యార్థుల చేతికి హాలు టికెట్లు వస్తాయి. కాని ఈ సారి జనవరి పూర్తికావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు ప్రీ-లిస్టు పంపించలేదు. ప్రీ-లిస్టు పరిశీలించడానికి కేవలం రెండు రోజుల సమయమే మిగులుతుందని ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడిజ్ అభిప్రాయపడ్డారు. జాబితాలో విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేది, కులం, ఏ మీడియంలో పరీక్షలు రాస్తారు తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయా..? అనేది పరిశీలిస్తారు. అందుకు బోర్డు వారం రోజుల గడువు ఇస్తుంది. కాని ఈ ఏడు ఆలస్యం కావడంతో ప్రీ లిస్టును పరిశీలించడానికి కేవలం రెండు రోజులే లభిస్తాయని రెడిజ్ అన్నారు. సమయం చాలా తక్కువగా లభించడంతో ఈ తొందరపాటులో హాలు టికెట్‌పై తప్పులు దొర్లే ప్రమాదముందని ఆయన అన్నారు. -
31 నుంచి ‘టెట్’ హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9న నిర్వహించనున్న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కు హాజరయ్యే అభ్యర్థులు 31 నుంచి aptet.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచించాయి. అదనపు సమాచారం కోసం 040-23232340, 23232349 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపాయి. -
పరీక్ష.. ప్రయాస
=11నుంచి జేఎన్టీయూహెచ్ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు =హాజరు కానున్న 2.5 లక్షలమంది విద్యార్థులు =ఇంకా అందని హాల్‌టికెట్లు.. అయోమయంలో విద్యార్థులు సాక్షి, సిటీబ్యూరో: ఇంజినీరింగ్ విద్యార్థులకు జేఎన్టీయూహెచ్ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నాలుగు రోజుల్లో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండగా నేటివరకు బీటెక్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వలేదు. శని, ఆదివారాలు సెలవు దినాలను మినహా ఇస్తే.. విద్యార్థులు హాల్‌టికెట్లు పొందేందుకు రెండ్రోజులే సమయం ఉంది. దీంతో పరీక్షల సమయంలో చదువుకోవాల్సిన లక్షలాది మంది విద్యార్థులు.. ప్రిపరేషన్ మానేసి హాల్‌టికెట్ల కోసం కళాశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు, ఇటు వర్సిటీ అధికారులు స్పందించట్లేదు. జంబ్లింగ్‌తో మళ్లీ తంటా! ఈనెల 11నుంచి ప్రారంభం కానున్న జేఎన్టీయూహెచ్ బీటెక్ సెమిస్టర్ పరీక్షలు సుమారు 2.5లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. సెమిస్టర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను అరికట్టేందుకు జేఎన్టీయూహెచ్ గతేడాది నుంచి జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ విధానంలో పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండడంతో విద్యార్థులకు అవ స్థలు పడుతున్నారు. అంతేకాదు.. కొత్త విధానంలో విద్యార్థుల హాల్‌టికెట్లను పరీక్ష కేంద్రంలోనే జారీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. విద్యార్థి హాల్‌టికెట్ ఏకారణంగానైనా మిస్సయితే.. తమ విద్యార్థి కనుక పేరెంట్ కళాశాల్లో డూప్లికేట్ ఇచ్చేవారు. తాజాగా జంబ్లింగ్ వలన హాల్‌టికెట్ మిస్సయితే ఏ ప్రాతిపదికన డూప్లికేట్ ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇబ్బందులను పరిశీలిస్తాం: రిజిస్ట్రార్ హాల్‌టికెట్లు వెంటనే జారీ అయ్యేలా చర్యలు తీసుకుంటాం. జంబ్లింగ్ విధానంలో పరీక్ష కేంద్రం 10కిలోమీటర్ల పరిధిలోనే ఉండాలి. దూరం ఎక్కువ ఉన్నట్లు ఫిర్యాదులు, విన ్నపాలు వస్తే సెల్ఫ్ సెంటర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. - ఎన్వీ రమణరావు, రిజిస్ట్రార్