
సాక్షి, పాట్నా : సైన్స్ పరీక్ష రాసేందుకు తనకు ఇచ్చిన అడ్మిట్ కార్డును చూసిన బిహార్ విద్యార్థిని విస్తుపోయింది. బికినీ ధరించిన మహిళ ఫోటోగ్రాఫ్ ఉన్న అడ్మిన్ కార్డును చేతిలో పెట్టడంతో విద్యార్థిని అవాక్కైంది. దర్భంగా జిల్లాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఈ అడ్మిట్ కార్డును జారీ చేసింది. ఈ విషయాన్ని హోమ్‌సైన్స్ హానర్స్ విద్యార్థిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సరైన ఫోటోతో కొత్త అడ్మిట్ కార్డు ఇవ్వాలని కోరింది.
దరఖాస్తును, అడ్మిట్ కార్డును తాను సవ్యంగా పూర్తిచేసినా బికినీ ధరించిన మహిళ ఫోటోను ఆ కార్డులో ఇవ్వడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేసింది. కాగా, అభ్యర్ధి ఫోటోతో కూడిన అడ్మిట్ కార్డును సత్వరమే జారీ చేయాలని అధికారులను ఆదేశించామని ఎగ్జామినేషన్ కంట్రోలర్ చెప్పారు. అడ్మిట్ కార్డును ముద్రించిన ఏజెన్సీ నుంచి లిఖితపూర్వక వివరణను కోరినట్టు ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment