టెన్త్ హాల్ టికెట్ల జారీలో జాప్యం | late on 10th class hall tickets distribution | Sakshi
Sakshi News home page

టెన్త్ హాల్ టికెట్ల జారీలో జాప్యం

Published Fri, Jan 31 2014 5:49 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 AM

late on 10th class hall tickets distribution

 సాక్షి, ముంబై: ఈ ఏడాది పదో తరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షలు రాసే విద్యార్థులకు ‘హాల్ టికెట్’ జారీ చేయడంలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పరీక్షలు ప్రారంభం కావడానికి నెల రోజుల సమయమే ఉంది. కానీ ఎస్‌ఎస్‌సీ బోర్డుకు చెందిన ముంబై రీజియన్ మండలి ఈ ఏడు పరీక్షలు రాసే విద్యార్థుల ‘ప్రీ-లిస్టు’ ఇంతవరకు ఆయా పాఠశాలలకు పంపించలేదు. బోర్డు నుంచి వచ్చిన జాబితాను పరిశీలించి అందులో ఏవైనా తప్పులుంటే సంబంధిత పాఠశాలలు వాటిని బోర్డు దృష్టికి తీసుకెళతాయి. ఈ తప్పులను సరిదిద్దిన తర్వాత హాల్ టికెట్లు ముద్రిస్తారు. కానీ ఇంతవరకు ప్రీ-లిస్టు జాడ లేకపోవడంతో విద్యార్థులకు హాల్ టికెట్లు జారీచేయడంలో జాప్యం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 పరీక్షలు రాసే విద్యార్థుల జాబితా ఏటా డిసెంబర్‌లో బోర్డుకు పంపిస్తారు. ఆ తర్వాత జనవరి మొదటి వారంలో ఆయా పాఠశాలలకు ప్రీ-లిస్టు పంపిస్తారు. అందులో దొర్లిన తప్పులను సరిచేసి తిరిగి బోర్డుకు పంపిస్తారు. ముద్రణ పనులు పూర్తిచేసుకుని ఫిబ్రవరి రెండో వారంలో విద్యార్థుల చేతికి హాలు టికెట్లు వస్తాయి. కాని ఈ సారి జనవరి పూర్తికావస్తోంది. అయినప్పటికీ ఇంతవరకు ప్రీ-లిస్టు పంపించలేదు.
 ప్రీ-లిస్టు పరిశీలించడానికి కేవలం రెండు రోజుల సమయమే మిగులుతుందని ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడిజ్ అభిప్రాయపడ్డారు. జాబితాలో విద్యార్థి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేది, కులం, ఏ మీడియంలో పరీక్షలు రాస్తారు తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయా..? అనేది పరిశీలిస్తారు. అందుకు బోర్డు వారం రోజుల గడువు ఇస్తుంది. కాని ఈ ఏడు ఆలస్యం కావడంతో ప్రీ లిస్టును పరిశీలించడానికి కేవలం రెండు రోజులే లభిస్తాయని రెడిజ్ అన్నారు. సమయం చాలా తక్కువగా లభించడంతో ఈ తొందరపాటులో హాలు టికెట్‌పై తప్పులు దొర్లే ప్రమాదముందని ఆయన అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement