సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 9న నిర్వహించనున్న టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) కు హాజరయ్యే అభ్యర్థులు 31 నుంచి aptet.cgg.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారవర్గాలు సూచించాయి. అదనపు సమాచారం కోసం 040-23232340, 23232349 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపాయి.