TET
-
డీఎస్సీ సిలబస్‌తో డీలా!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిగో డీఎస్సీ.. అదిగో డీఎస్సీ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డీఎస్సీ సిలబస్‌ను మాత్రమే విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సిలబస్‌తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు ఎప్పుడూ లేని రీతిలో ఇంటరీ్మడియెట్ వరకు సిలబస్‌ను ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులు 3–10 తరగతుల సిలబస్‌ను మాత్రమే చదవాలని చెబుతూనే.. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్‌ను ఇవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. 2018 డీఎస్సీలోనూ ఇలాగే చెప్పిందొకటి, పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు. 2014 డీఎస్సీలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి టీడీï³ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్‌పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు, విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. హైసూ్కల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు. అలాగే పరీక్షల నిర్వహణపైనా విజ్ఞప్తులు చేశారు. బోధించే తరగతులకు మించి సిలబస్..టెట్ సిలబస్సే డీఎస్సీ పరీక్షలకు కూడా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డీఎస్సీ సిలబస్‌లో ప్రకటించారు. కానీ, సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియెట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలిక పెట్టారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధన చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డీఎస్సీ సిలబస్ ఉండేది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు 6 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది. దీన్ని ఆధారం చేసుకునే ప్రశ్నపత్రాలను రూపొందించేవారు. కానీ, 2014, 2018 డీఎస్సీల్లో మాత్రం సిలబస్‌ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు, విద్యా రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఊస్టింగేనా?ఎస్జీటీ, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పాఠశాల విద్యా శాఖ సిలబస్‌ను ప్రకటించింది. కానీ హైసూ్కళ్లల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్‌ను ప్రకటించలేదు. అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెబుతున్నట్టుగానే భావించాల్సి వస్తోంది. 2018 ఫిబ్రవరి స్పెషల్ డీఎస్సీలో ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు 852 పోస్టులను గుర్తించి సుమారు 602 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈసారి వారికి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ విద్యావిధానం–2020 నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ పరీక్షపైనా అభ్యంతరాలు..జూలైలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మాదిరిగానే డీఎస్సీని కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సెషన్లలో రోజుల తరబడి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ.. జిల్లా స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లాలవారీగా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై గతంలో అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను అభ్యర్థించారు. నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో అది కూడా టెట్ మాదిరిగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పది రోజులు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
టెట్ ఫీజు తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫీజును రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. గతంలో పేపర్–1 లేదా పేపర్–2 పరీక్ష రాసేందుకు రూ. వెయ్యిగా ఉన్న ఫీజును రూ. 750కి తగ్గించింది. పేపర్–1, పేపర్–2 పరీక్షలు రాసే అభ్యర్థులకు గతంలో రూ. 2 వేలుగా ఉన్న ఫీజును రూ. తాజాగా వెయ్యికి తగ్గించింది. అలాగే టెట్ రాసిన అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గురువారం అర్ధరాత్రి విడుదల చేసింది.దీంతోపాటు సమగ్ర సమాచార బులెటిన్‌ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. టెట్ పేపర్లో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. వాటికి 150 మార్కులుంటాయి. చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 ఇంగ్లీష్, మేథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి ఒక్కో విభాగం నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 60 శాతం, బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీలు ఇతర రిజర్వేషన్ కేటగిరీలు 40 శాతం మార్కులు సాధిస్తే అర్హత పొందినట్లుగా పరిగణిస్తారు.టెట్ పరీక్ష 2025 జనవరి 1 నుంచి 20 వరకు జరగనుంది. çహాల్‌టికెట్లను డిసెంబర్ 27 నుంచి 2025 జనవరి 20 మధ్య డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించారు. ఫలితాలను ఫిబ్రవరి 5న వెల్లడిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. ఇది ఈ నెల 20వ వరకు కొనసాగుతుంది. టెట్ అర్హత సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటులో ఉంటుంది. ఉపాధ్యాయ నియామకంలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. -
జనవరి 1 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీజీ టెట్) 2025 జనవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ జరగనుంది. పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సోమవారం ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఈ ఏడాది టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇది రెండోసారి. జాబ్ క్యాలెండర్లో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్ రాసే అవకాశం కలి్పంచారు. తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్ మంగళవారం https:// schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెట్ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది. పేపర్–2లో తక్కువ ఉత్తీర్ణత రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్–1, బీఈడీ అర్హులు పేపర్–2తో పాటు పేపర్–1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్–1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు. పేపర్–2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్–2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
-
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. రేపట్నుంచి అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. దరఖాస్తులు స్వీకరించేందుకు చివరి తేదీ నవంబర్ 20న చివరి తేదీ విధించింది. జనవరి ఒకటి నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు ప్రారంభించింది. -
మంత్రి లేక టెట్ ఫలితాలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్షల (ఏపీ టెట్ జూలై–2024) ఫలితాలు ఆలస్యం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం ప్రకటించాల్సి ఉండగా, విద్యాశాఖ మంత్రి లోకేశ్ విదేశీ పర్యటన ఫలితాలకు అడ్డంకిగా మారింది. అక్టోబర్ 3 నుంచి 21వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు.వాస్తవానికి గతనెల 27న ప్రకటించాల్సిన ఫైనల్ కీ సైతం రెండు రోజులు ఆలస్యంగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. కాగా టెట్ ఫలితాలను సోమవారం ప్రకటించి, 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 6న విడుదల చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, మంత్రి వచ్చాక టెట్ ఫలితాలు, డీఎస్పీ నోటిఫికేషన్‌పై సోమవారం నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. -
టెట్‌పై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి కోరారు. స్కూల్ అసిస్టెంట్ (2ఏ) ఇంగ్లిష్ సబ్జెక్టులో ఎలాంటి పొరపాట్లు జరగలేదని, ఈ పేపర్లో పార్ట్–2లో మాతృభాష ఎంపిక పైనా తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులో తలెత్తిన సమస్యను పరిష్కరించకపోవడంతో పరీక్ష సమయంలో మాతృభాష స్థానంలో ఇంగ్లిష్ మాత్రమే వచ్చిందని జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.టెట్ ఎస్ఏ–2 ఇంగ్లిష్ పేపర్ రెండో సెక్షన్లో అభ్యర్థుల మాతృ భాషకు అనుగుణంగా తెలుగు, తమిళం, కన్నడ, ఒరియా తదితర భాషలు ఉంటాయని, అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న భాషనే ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ ఇక్కడ మాతృభాషగా తెలుగు ఎంపిక చేసుకుంటే ఇంగ్లిష్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోందని, వాస్తవానికి అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు. దీనిపై ఎలాంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలిపారు. టెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి అనుసరించిన విధానాలనే ఇప్పుడూ అనుసరించామని కృష్ణారెడ్డి వివరించారు. -
AP: హామీ గాలికి.. ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే!
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిల్లుతున్నాయి. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తిచేస్తామని స్వయానా ముఖ్యమంత్రే చెప్పడంతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్‌ను మార్చడం వారికి ఆందోళన కలిగిస్తోంది. టెట్, డీఎస్సీ మధ్య కనీసం 90 రోజులు గడువు కావాలని నిరుద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేయడం వల్లే టెట్ షెడ్యూల్‌ను మార్చామని ప్రభుత్వం చెబుతోంది. అలాగే కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసినవారికి కూడా అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటోంది. అయితే నిజానికి వచ్చే విద్యా సంవత్సరం వరకు ఈ పోస్టులను భర్తీ చేసే ఆలోచన ప్రభుత్వానికి లేనట్టు తెలుస్తోంది. కొత్త షెడ్యూల్ ప్రకారం టెట్‌ను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించనుంది. టెట్ ఫలితాలను నవంబర్‌లో విడుదల చేయనుంది. ఆ తర్వాత మూడు నెలలకు అంటే వచ్చే ఏడాదిలోనే డీఎస్సీ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మరో 8 నెలలపాటు డీఎస్సీ శిక్షణలోనే అభ్యర్థులు గడపనున్నారు. దీంతో అన్నాళ్లపాటు ఉపాధి లేకుండా ఉండటం ఎలా అనే బెంగ వారిలో గుబులు రేపుతోంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందులను తలుచుకుని తల్లడిల్లుతున్నారు. ఆరు నెలల్లో పోస్టుల భర్తీ అని.. చివరకు తూచ్తొలుత చంద్రబాబు డిసెంబర్ నాటికి పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని ప్రకటించారు. అందుకనుగుణంగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. ఈ మేరకు ఆగస్టులో టెట్ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంతో సెప్టెంబర్‌లోనే డీఎస్సీ కూడా పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. కానీ ఇప్పుడు టెట్ (జూలై) పరీక్షలను అక్టోబర్‌కు మార్చారు. ఈ ఫలితాలను నవంబర్‌లో విడుదల చేస్తామని షెడ్యూల్లో పేర్కొన్నారు. గతంలో ప్రకటించిన మేరకు టెట్‌కు, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఇచ్చినట్టయితే డీఎస్సీ నోటిఫికేషన్ ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి నుంచి మూడు నెలల అనంతరం పరీక్షలు నిర్వహించి వచ్చే ఏడాది జూన్, జూలైలో పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనుంది.సంఘాల పేరుతో కాలయాపనగత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతోపాటే టెట్‌ను ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించగా 2.33 లక్షల మంది హాజరయ్యారు. ఈ ఫలితాలను జూన్ 25న ప్రకటించారు. వాస్తవానికి ఎన్నికల కోడ్ లేకుంటే ఏప్రిల్‌లోనే డీఎస్సీ పరీక్షలు పూర్తయ్యేవి. కానీ కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి గత డీఎస్సీని రద్దు చేసింది. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి అవకాశం ఇవ్వాలని మరోసారి టెట్ నిర్వహణకు ఈ నెల 2న నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే, టెట్‌కు, డీఎస్సీకి మధ్య కనీసం 90 రోజుల గడువు కావాలని నిరుద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి వస్తోందంటూ షెడ్యూల్‌ను మళ్లీ మార్చారు. వాస్తవానికి గతంలో టెట్ అర్హత సాధించిన అభ్యర్థులకు ఆలస్యం లేకుండా డీఎస్సీ నిర్వహించి, ఈ ఏడాది బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి మరో డీఎస్సీలో అవకాశం కల్పించాలని టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ వారి అభ్యర్థనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. వాస్తవానికి కొత్త ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను 2025 ఏప్రిల్‌లో ఉద్యోగ విరమణ చేసే సిబ్బంది సంఖ్య ఆధారంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడే డీఎస్సీని ప్రకటిస్తే పోస్టులను భర్తీ చేయడం ఎలా అని టెట్ షెడ్యూల్‌ను మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2025–26 విద్యా సంవత్సరంలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఎవరూ అడగకపోయినా మరోసారి టెట్ నిర్వహణ అనడం, ఇచ్చిన తొలి నోటిఫికేషన్‌నే వాయిదా వేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.ఇది ముమ్మాటికీ మోసమే..అధికారంలోకి వచ్చాక వెంటనే మొదటి సంతకం మెగా డీఎస్సీపై చేస్తామని నిరుద్యోగులకు చంద్రబాబు మాటిచ్చారు. కానీ గత ప్రభుత్వం ప్రకటించిన 6,100 పోస్టులకు మరో 10 వేల పోస్టులు మాత్రమే కలిపి నోటిఫికేషన్ ఇవ్వడం లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేయడమే. మెగా డీఎస్సీ వస్తుందని నమ్మిన నిరుద్యోగులకు మొండిచేయి చూపించారు. కొన్ని జిల్లాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య బాగా తక్కువగా ఉంది. డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ ముగిస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వాయిదాలు వేయడం వెనుక కుట్ర ఉంది. చిన్న చిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు ఆ ఉద్యోగాలు వదులుకుని శిక్షణ తీసుకుంటున్నారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే లక్షలాదిమందికి ఆర్థిక కష్టాలు తప్పవు. ఇచ్చిన మాట ప్రకారం డిసెంబర్ నాటికి డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేయాలి. అలాగే జీవో నం.117ను తక్షణమే రద్దు చేయాలి. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్‌పై స్పష్టత ఇవ్వాలి. మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి. – రామచంద్ర ఎంబేటి, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ ఐక్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు -
టెట్ వాయిదా
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన షెడ్యూల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్ సురేశ్ కుమార్ తెలిపారు. పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.ఫలితాలను నవంబర్ 2న వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు https://cse.ap.gov.in/ లో చూడొచ్చని తెలిపింది. మారిన టెట్ షెడ్యూల్ ఇదీ.. ⇒ ఫీజులు చెల్లించేందుకు గడువు: 03–08–2024⇒ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు: 03/08/2024⇒ ఆన్లైన్లో మాక్ టెస్ట్ నిర్వహణ: 19/09/2024 నుంచి..⇒ హాల్‌టికెట్ల డౌన్లోడ్: 22/09/2024 నుంచి పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు⇒ ప్రాథమిక ‘కీ’: 04/10/2024 నుంచి⇒ ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి 21/10/2024 వరకు⇒ ఫైనల్ ‘కీ’ విడుదల: 27/10/2024 ⇒టెట్ ఫలితాల వెల్లడి: 02/11/2024 -
ఏటా రెండుసార్లు టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏటా రెండు సార్లు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఏటా ఏప్రిల్ లేదా మే నెలలో ఒకసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహిస్తుండగా.. ఇకపై రెండుసార్లు ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. ఈమేరకు సవరణ ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం జారీ చేశారు. ఒక అభ్యర్థి టెట్ పరీక్షను ఎన్నిసార్లు అయినా రాయొచ్చని, మెరుగైన మార్కుల కోసమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడితో పాటు ఎస్సీఈఆర్టీ సంచాలకులను ఆయన ఆదేశించారు. -
ఏపీ టెట్ ఫలితాలు విడుదల
సాక్షి,విజయవాడ: ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం(జూన్25) మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. టెట్ ఉత్తీర్ణత శాతం 58.4 శాతం ఉండగా మొత్తం 1,37,903 మంది అభ్యర్ధులు అర్హత సాధించారు. ఎస్జీటీ రెగ్యులర్ పేపర్-1 కు 78,142 అభ్యర్థులు అర్హత సాధించగా ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ -1కు 790 మంది అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ రెగ్యులర్ పేపర్ -2 కు 60,846 అభ్యర్థులు అర్హత సాధించారు. స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్- 2కు 1,125 మంది అర్హులయ్యారు. -
మరోసారి ‘టెట్’తో డీఎస్సీ ఆలస్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించింది. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో నిర్వహించిన టెట్‌కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ) అర్హత పరీక్ష పేపర్–1ఏని 1,13,296 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్–1బి, పేపర్–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్లో ప్రకటించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టుల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.తద్వారా ఆ పోస్టులను తామే భర్తీ చేశామన్న క్రెడిట్‌ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేందుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇదే కోవలో మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
టెట్‌లో పెరిగిన ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. డీఎడ్ అర్హతతో నిర్వహించే పేపర్–1లో 57,725 మంది (67.13%), బీఈడీ అర్హతతో రాసే పేపర్–2లో 21,842 మంది (34.18%) అర్హత సాధించారు. 2023తో పోలిస్తే ఈ సంవత్సరం పేపర్–1లో 30.24 శాతం, పేపర్–2లో 18.88 శాతం ఉత్తీర్ణత పెరిగింది. మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకూ రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టేందుకు గత ఏడాది నుంచి సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో రెండేళ్లుగా టెట్ రాసేవారి సంఖ్య పెరుగుతోంది. టెట్ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు ఉండేలా సవరణ చేశారు.ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల్లో టెట్‌కు వెయిటేజ్ ఇస్తారు. ఈసారి ఇన్సర్విస్ టీచర్లు కూడా ఈ పరీక్ష రాశారు. ప్రతీ పేపర్లోనూ దాదాపు 5 వేల మందికిపైగా హాజరయ్యారు. వాస్తవానికి 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత పొందాల్సి ఉంది. కానీ 2010కి ముందు నియమించిన టీచర్లకు పదోన్నతుల్లో టెట్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో టెట్ రాసే ఇన్ సర్విస్ టీచర్ల సంఖ్య తగ్గింది. మొత్తం 7 భాషల్లో పరీక్ష నిర్వహించినా, తెలుగు మీడియం నుంచే ఎక్కువమంది హాజరయ్యారు. మళ్లీ రాస్తే ఫీజు ఉండదు: రేవంత్‌రెడ్డి టెట్ ఫీజు పెంపుపై పరీక్ష సమయంలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని చెప్పింది. కంప్యూటర్ బేస్డ్గా టెట్ నిర్వహించడంతో ఫీజు పెంచారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించారు.ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటం వల్లే టెట్ ఫీజు తగ్గించలేకపోయామన్నారు. టెట్‌లో ఫెయిల్ అయిన వారికి మరోసారి రాసేప్పుడు ఫీజు నుంచి ఉపశమనం ఇస్తామన్నారు. 2024 టెట్ ఉత్తీర్ణులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఇస్తామని చెప్పారు. -
తెలంగాణ టెట్ దరఖాస్తుల గడువు పెంపు
హైదరాబాద్: తెలంగాణలో టెట్ దరఖాస్తుల గడువును పెంచారు. ఈ నెల 20 వరకు గడువును ప్రభుత్వం పెంచింది. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు ఆప్లికేషన్‌ను ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు సాక్షి ముందే కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపినట్లు సాక్షి తన కథనంలో పేర్కొంది. ఇదీ చదవండి: 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు! -
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ఇదే మా హెచ్చరిక.. సీఎం రేవంత్‌కు హరీష్‌రావు లేఖ
సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచడం వల్ల నిరుద్యోగులకు జరుగుతున్న నష్టం గమనించాలంటూ సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం టెట్ ఫీజులను భారీగా పెంచడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించడం విద్యార్థులు, నిరుద్యోగును మోసం చేయడమేనన్నారు. అనేక కష్టాలకు ఓర్చి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులు, నిరుద్యోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడం బాధాకరం. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’’ అని హరీష్‌రావు లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో టెట్ ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకున్నారు. ఈ ఏడాది ఒక పేపర్‌కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్‌తో పోల్చితే డబుల్‌గా ఉండటం గమనార్హం. మాటను నిలబెట్టుకోవాలి. వెంటనే టెట్ ఫీజులు తగ్గించాలని బిఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నాం’’ అని హరీష్‌రావు తెలిపారు. ఇదీ చదవండి: ఫోన్ ట్యాపింగ్ కేసులో తెరపైకి కొత్త పేరు -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
టెట్ ఫీజుపై టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫీజును అమాంతం రెండింతలకుపైగా పెంచడంపై నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఫీజును తగ్గించాల్సిందేనని విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపడుతున్నాయి. ఎన్నికల సమయం కావడంతో విపక్షాలూ తమ వంతు పాత్ర పోషించే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇలా చేయడం సరికాదని ప్రభుత్వ వర్గాల్లోనే తర్జన భర్జన జరుగుతోంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా దీనిపై ఆరా తీసినట్టు విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. అతి తక్కువ ఫీజులతో పోటీ పరీక్షలు నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెప్పింది. అయితే దీనికి విరుద్ధంగా టెట్ ఫీజును భారీగా పెంచిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2017 వరకూ టెట్‌కు ఒక్కో పేపర్‌కు రూ.200 ఉండేది. ఆ తర్వాత ఇది రూ.300 అయింది. 2023లో కూడా టెట్ ఫీజును రెండు పేపర్లకు కలిపి రూ. 400 చేసినా పెద్దగా విమర్శలు రాలేదు. కానీ ఇప్పుడు ఏకంగా ఒక పేపర్‌కు రూ. వెయ్యి, రెండు పేపర్లయితే రూ. 2 వేలు ఫీజు నిర్ణయించారు. ఈ ఏడాది దాదాపు 3 లక్షల మంది బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులు టెట్ రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఫీజు తగ్గించలేమా? ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు టెట్ ఫీజు పెంపుపై వస్తున్న విమర్శలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు విద్యాశాఖ ఉన్నతాధికారులను కూడా సంప్రదించినట్టు తెలిసింది. ఫీజు పెంపు అంశం తమ ముందు అసలు చర్చకే రాలేదని, అధికారుల స్థాయిలోనే ఇది జరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ నిరుద్యోగుల ఆగ్రహాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తోందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఫీజును భారీగా పెంచే ముందు అధికారులు ప్రస్తుత పరిస్థితిని గమనంలోకి తీసుకుని ఉండాలని సీఎంవో భావిస్తున్నట్టు తెలిసింది. సమస్య మరింత జఠిలం కాకముందే ఫీజు తగ్గింపు అంశాన్ని పరిశీలించాలని సీఎంవో భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను కోరిందని సమాచారం. అయితే ఫీజు పెంపు సమంజసమేనని అధికారులు సమర్థించుకుంటున్నారు. ఉపాధ్యాయ నియామక పరీక్షకు నిర్ణయించిన ఫీజు విషయంలోనూ తొలుత కొంత వ్యతిరేకత వచి్చనా, తర్వాత సద్దుమణిగిందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఆన్లైన్లో టెట్ నిర్వహించడం వల్ల వ్యయం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. సర్వర్ల నిర్వహణకు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాలని అంటున్నారు. ఈ కారణంగానే టెట్ ఫీజు పెంచాల్సి వచ్చిందనేది అధికారుల వాదన. కాగా, దీనిపై పునరాలోచన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇది అన్యాయం లక్షల మంది పేద విద్యార్థులు అప్పులు చేసి, టెట్ కోచింగ్ తీసుకున్నారు. టీచర్ కొలువులు వస్తాయని గంపెడాశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టెట్ ఫీజులను రూ. 400 నుంచి రూ. వెయ్యికి పెంచడం అన్యాయం. ఆన్లైన్ ఫీజు పేరుతో పేదలపై భారం మోపడాన్ని ఎంతమాత్రం ఊరుకోం. ఫీజు తగ్గించకపోతే ఆందోళన చేపడతాం. –ఆర్ఎల్ మూర్తి, టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు) ఏం చెప్పారు? ఏం చేస్తున్నారు? పోటీ పరీక్షల ఫీజులు తగ్గిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పింది. అందుకు విరుద్ధంగా టెట్ ఫీజును రెండింతల నుంచి నాలుగింతలకుపైగా పెంచింది. ఇది పేద విద్యార్థులకు మోయలేని భారం. నిరుద్యోగుల పట్ల కనీస కనికరం కూడా చూపకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం దారుణం. ప్రభుత్వం చెప్పిందేంటో? చేస్తున్నదేంటో? ప్రజలు అర్థం చేసుకోవాలి. –రావుల మనోహర్‌రెడ్డి (బీఈడీ, డీఎడ్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు) -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్‌లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
మే 20 నుంచి టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను మే 20 నుంచి జూన్ 3 వరకూ నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన గురువారం ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్, సమాచార బులెటిన్‌ను ఈ నెల 20న స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో వెల్లడిస్తామని తెలిపారు. కంప్యూటర్ బేస్డ్గా జరిగే ఈ పరీక్షకు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులు పంపుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ను గత నెల 29న విడుదల చేసిన సంగతి తెలిసిందే. డీఎస్సీ దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే మొదలు కాగా, ఈ గడువు ఏప్రిల్ 3తో ముగుస్తుంది. టెట్‌లో అర్హత సాధిస్తే తప్ప డీఎస్సీ రాసేందుకు అర్హత ఉండదు. దీనివల్ల టెట్ అర్హత లేని బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు డీఎస్సీ రాసే వీలు ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్‌ను డీఎస్సీకి ముందే నిర్వహించాలని, ఇందులో అర్హత సాధించిన వారికి డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ దరఖాస్తు తేదీలను కూడా పొడిగించారు. జూన్ 6 వరకూ డీఎస్సీ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు దేవసేన తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్లైన్ మోడ్‌లో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తు న్నట్టు కమిషనరేట్ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో పని చేస్తున్న ఉపాధ్యాయులకూ ఇదే టెట్‌లో పాల్గొనేందుకు చాన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు వెల్లడవ్వాల్సి ఉంది. టీచర్ల పదోన్నతులకు టెట్ తప్పనిసరి చేయడంతో 80 వేల మంది ఉపాధ్యాయులు టెట్ రాయాల్సి ఉంటుంది. -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్‌టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్‌కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
టెట్, టీఆర్టీపై నేడు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ), టీచర్ అర్హత పరీక్ష (టెట్)ల మధ్య తగిన సమయం ఉండేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ విషయంలో తన నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ, టెట్ పరీక్షల మధ్య తగిన సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం.పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత నోటిఫికేషన్లను రద్దు చేసి, రెండు పరీక్షల మధ్య తగిన సమయం ఇస్తూ తిరిగి నోటిఫికేషన్లు జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని వారు కోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ రామకృష్ణప్రసాద్ మరోసారి విచారణ జరిపారు. పరీక్షలపై తీవ్ర ప్రభావం.. ప్రభుత్వ న్యాయవాది వీకే నాయుడు వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు అభ్యర్థుల కోసం మొత్తం నోటిఫికేషన్లను నిలుపుదల చేయడం సరికాదన్నారు. పరీక్ష నిర్వహణను వాయిదా వేస్తే టీసీఎస్ సంస్థ పరీక్షల నిర్వహణకు మరో స్లాట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. దీనివల్ల అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు. అందువల్ల పరీక్షల నిర్వహణలో జాప్యం చేయలేమన్నారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు, న్యాయవాది జవ్వాజి శరత్చంద్ర వాదనలు వినిపిస్తూ.. టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12న, టెట్‌కు 8న నోటిఫికేషన్లు జారీ చేశారని తెలిపారు. టెట్‌లో అర్హత సాధించిన వారు టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. టెట్ ఫలితాలను మార్చి 14న విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే అంటే మార్చి 15న టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తారని వివరించారు. టెట్ పరీక్ష సిలబస్ చాలా ఎక్కువని, ఆ పరీక్షకు హాజరయ్యేందుకు ఉన్న గడువు కేవలం 19 రోజులు మాత్రమేనన్నారు. ఇది ఎంత మాత్రం సరిపోదని, టీఆర్టీ పరీక్షకు సైతం తక్కువ సమయమే ఉందని వారు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
అంతా సిద్ధం!
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు విద్యా శాఖ ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. తొలి రోజు గురువారం దాదాపు 10 వేల దరఖాస్తులు అందాయి. ఈ నెల 27 నుంచి మార్చి 9 వరకు జరగనున్న టెట్‌కు సుమారు 5.50 లక్షల మంది హాజరవుతారని అంచనా. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షకు రాష్ట్రంలో 185 సెంటర్లు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంలలో 22 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో టెట్ నిర్వహణలో కొందరు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మందికి రాష్ట్రం వెలుపల కూడా సెంటర్లు కేటాయించడంతో పరీక్ష రాయలేకపోయారు. కానీ ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని సెంటర్లలో 12 రోజుల్లో రెండు సెషన్స్ కింద స్లాట్లను సిద్ధం చేశారు. రోజుకు 60 వేల మంది చొప్పున 7.20 లక్షల మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లాలోని అభ్యర్థులు వారికి దగ్గరలోని సెంటర్లో స్లాట్‌ను ఎంచుకుంటే అక్కడే పరీక్ష రాసే అవకాశం లభిస్తుంది. ఏప్రిల్ 14 నాటికి పోస్టింగులు! సోమవారం డీఎస్సీ–2024 నోటిఫికేషన్‌కు కూడా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్లైన్ పరీక్ష జరుగుతుంది. డీఎస్సీకి కూడా 185 సెంటర్లలో రెండు సెషన్స్‌లో స్లాట్లు సిద్ధం చేసింది. ఫలితాలను ఏప్రిల్ 7న ప్రకటించి, తర్వాత వారం రోజుల్లో ఏప్రిల్ 14 నాటికి పోస్టింగులు ఇచ్చేయాలన్న లక్ష్యంతో విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లాల వారీగా పోస్టులను ప్రకటించగా, రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. గత పరీక్షల మాదిరిగానే ప్రకటించిన షెడ్యూల్ మేరకు టెట్‌తో పాటు డీఎస్సీ కూడా పూర్తిచేసి, ఎలాంటి ఆటంకాలు లేకుండా నియాకమ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2019 జూన్ నుంచి ప్రభుత్వం ఇచ్చిన పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని నోటిఫికేషన్లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేసింది. ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం పోరాడుతున్న 1998, 2008 డీఎస్సీ అభ్యర్థులకు కూడా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం న్యాయం చేసి, మినిమం టైమ్ స్కేల్‌తో పోస్టింగ్‌లు ఇచ్చింది. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మిగిలిన బ్యాక్లాగ్ పోస్టులు సైతం భర్తీ చేయడంతో పాటు మొత్తం 14,219 ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేసింది. ఈ డీఎస్సీ టీచర్లు ఎంతో ప్రత్యేకం గతంలో నిర్వహించిన డీఎస్సీల్లో ఎంపికైన వారికి, ఈసారి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించే అభ్యర్థులకు ఎంతో తేడా ఉంటుంది. ఈసారి టీచర్లకు జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ – 2020) ప్రకారం శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం బోధన, సీబీఎస్ఈ, టోఫెల్, ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్‌ను అమలు చేస్తోంది. ఈ బోధనకు అనుగుణంగా ఈ డీఎస్సీలో టీచర్లుగా ఎంపికైనవారికి ఇంటర్నేషనల్ బాకలారియెట్, టెక్నాలజీ వినియోగం, టోఫెల్, టీచింగ్ ఎఫిషియనీ్సపై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇస్తారు. సర్టిఫికెట్లు కూడా ఇస్తారు. గతంలో ఈ తరహా శిక్షణ ఎప్పుడూ ఇవ్వలేదు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు అవసరానికి అనుగుణంగా శిక్షణ ఇవ్వడం తప్ప, ప్రాథమిక స్థాయి నుంచే పూర్తిస్థాయి శిక్షణ లేదు. టెట్ నిబంధనలు సడలింపు టెట్ అభ్యర్థులకు మేలు చేసేలా పాఠశాల విద్యాశాఖ నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్ పేపర్–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అన్న నిబంధనను తొలగించి, ఈ మార్కులను 40 శాతానికి తగ్గించింది. దీనివల్ల ఎక్కువ మంది టెట్ రాసేందుకు అవకాశం వచ్చింది. ఒకటి నుంచి ఐదో తరగతి బోధనకు ఉద్దేశించిన టెట్ పేపర్–1 రాసేందుకు ఇంటర్లో 50 శాతం మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా 50 శాతం మార్కులతో ఇంటర్/సీనియర్ సెకండరీతో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. కనీసం 50 శాతం మార్కులతో ఇంటరీ్మడియట్, రెండేళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. లేదా డిగ్రీ తర్వాత రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్–1 రాసేందుకు అర్హులు. ఎస్సీ ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కుల సడలింపునిచ్చిది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్‌ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టెట్.. ఇదేమి టెస్ట్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడం విద్యాశాఖకు సవాల్‌గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్ పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు. అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మొండిగా టెట్ పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి. టెట్ తప్పని సరి అనుకుంటే కొత్తవారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి. కానీ దీన్ని అంగీకరించేది లేదని 2012 తర్వాత నియమితులైన టీచర్లు స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే కోర్టుకెళ్తామని చెబుతున్నారు. దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది. ఎన్ని లింకులో..: టెట్‌లో ఉత్తీర్ణులైన వారే టీచర్ పోస్టుకు అర్హులు. టెట్‌లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది. ఈ మేరకు కేంద్రం నిబంధన విధించింది. పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి. అప్పుడే మెగా డీఎస్ఈ చేపట్టడం సాధ్యమవుతుంది. ఇలా ఒకదానికి మరొకటి లింక్ ఉండటంతో సమస్య కొలిక్కి వచ్చే పరిస్థితి కన్పించడం లేదు. మరోవైపు మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇలా సంక్లిష్టంగా మారిన ఈ సమస్యపై త్వరలో చర్చించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి ఓ నివేదిక ఇచ్చే యోచనలో ఉన్నారు. టీచర్లలో సిలబస్ ఆందోళన టెట్ రాయాల్సిన చాలామంది ఉపాధ్యాయుల్లో ఆందోళన క న్పిస్తోంది. ఇప్పుడున్న సిలబస్ ప్రకారం పరీక్ష రాయడం కష్టమని వారు భావిస్తున్నారు. సర్విస్‌లో ఉన్న టీచర్లు దశాబ్దాల తరబడి ఏదో ఒక సబ్జెక్టును మాత్రమే బోధిస్తున్నారు. మేథ్స్ చెప్పే టీచర్‌కు సైన్స్, సైన్స్ చెప్పే టీచర్‌కు మేథ్స్‌లో అవగాహన ఉండే అవకాశం లేదు. అన్ని సబ్జెక్టులపై పట్టు ఉంటే తప్ప టెట్ అర్హత పొందడం కష్టం. ఇప్పటి యువకులతో పరీక్షలో పోటీ పడలేమని భావిస్తున్నారు. ఈ కారణంగానే టెట్ అనివార్యమైతే సులభంగా ఉండే డిపార్ట్మెంటల్ పరీక్ష మాదిరి ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతు న్నారు. జనరల్ అభ్యర్థులకు 150 మార్కులకు 90 మార్కులు వస్తేనే అర్హత లభిస్తుంది. కాగా కోచింగ్ తీసుకున్నప్పటికీ బీఈడీ అభ్యర్థులు రాసే పేపర్–2లో ఓసీలు 5 శాతం మాత్రమే అర్హత సాధిస్తుండటం గమనార్హం. టెట్ ఎంతో కీలకం కేంద్ర ప్రభుత్వం 2010లో విద్యా హక్కు చట్టాన్ని తెచ్చింది. దీని ప్రకారం టీచర్‌గా పనిచేయాలనుకునే వారు టెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆ అర్హత ఉంటేనే పదోన్నతి పొందడానికి కూడా అర్హులు. దీని అమలుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ 2012లో ఆదేశాలు జారీ చేసింది. అయితే 2012 కన్నా ముందు ఎక్కడా టెట్ లేదనే అభిప్రాయంతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇదే 2022 వరకు కొనసాగుతూ వచ్చింది. కాగా 2022లో పదోన్నతులు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో సమస్య మొదలైంది. టెట్ అర్హత ఉన్న టీచర్లు కోర్టును ఆశ్రయించారు. దీంతో పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని కోర్టు తీర్పు చెప్పింది. ఫలితంగా టెట్ పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు అనివార్యమైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో 2012 కన్నా ముందు నియమితులైన వారు 80 వేల మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా టెట్ అర్హత ఉన్నవాళ్ళే. కాగా పదోన్నతులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని విద్యాశాఖ మరోసారి కోరినప్పటికీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ అంగీకరించలేదు. టెట్‌పై ఉద్యమిస్తాం ఏళ్ళ తరబడి బోధించే ఉపాధ్యాయుడికి టెట్ తప్పనిసరి చేయడం సహేతుకం కాదు. ఈ చట్టం తెచ్చినప్పుడే వ్యతిరేకించాం. ఈ ఒక్కసారైనా టెట్ లేకుండా పదోన్నతులు ఇవ్వాలి. కానీ టెట్‌నే కొలమానంగా భావిస్తే మాత్రం ఉద్యమిస్తాం. - పి.నాగిరెడ్డి (టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) ప్రభుత్వమే ఆలస్యం చేసింది టెట్‌పై ప్రభుత్వమే ఆలస్యం చేసింది. ఈ కారణంగానే పదోన్నతులు రాకుండా ఆగిపోయాయి. శాఖపరమైన టెట్ నిర్వహిస్తే ఇప్పటికే ఉపాధ్యాయులు అర్హత సాధించే వాళ్ళు. టెట్ లేకుండా ముందుకెళ్ళడం కష్టమే. కాబట్టి ఉపాధ్యాయులు దీనికి సిద్ధపడాల్సిందే. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి) డిపార్ట్మెంటల్ పరీక్షలా నిర్వహించాలి టెట్ అర్హత పొందకుండా పదోన్నతులు పొందడం కష్టమే. అయితే దీర్ఘకాలంగా పనిచేస్తున్న టీచర్లకు టెట్ పరీక్ష అంతర్గతంగా నిర్వహించాలి. ఇతర విద్యార్థులతో కాకుండా వేరుగా చేపట్టాలి. దీన్నో డిపార్ట్మెంటల్ టెస్ట్లా చేపడితే మేలు. – పింగిలి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్‌లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
TS TET 2024: ఏప్రిల్‌లో టెట్!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. విద్యాశాఖపై సీఎం సమీక్షలో ఈ అంశం చర్చకు వచ్చింది. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి కల్పించడానికి టెట్ అనివార్యమని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెబు తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో ఈ పరీక్ష నిర్వ హించే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో 1.03 లక్షల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 2012కు ముందు టెట్ లేకపోవడంతో అంతకుముందే ఉన్న దాదాపు 60 వేల మంది టీచర్లకు ఈ అర్హత లేదు. మరోవైపు టెట్ ఉంటే తప్ప పదోన్నతులు కల్పించడానికి వీల్లేదని 2012లోనే కేంద్రం తెలిపింది. అయితే టెట్ పరీక్ష నిర్వహించే వరకూ ఈ నిబంధనను అమలు చేయలేమని పే ర్కొంటూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో మిన హాయింపు ఇచ్చింది. కేంద్రం తాజాగా మరోసారి ఈ నిబంధనను తెరపైకి తేవడం, సుప్రీంకోర్టు కూడా టెట్ తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో గత ఏడాది నుంచి పదోన్నతులు నిలిచిపోయాయి. మెగా డీఎస్సీకీ టెట్ ఆటంకం రాష్ట్రంలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో దీని అమలుపై అధికారులతో సీఎం చర్చించారు. మెగా డీఎస్సీ చేపట్టాలంటే, ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత రావాలి. రాష్ట్రంలోని దాదాపు 10 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులను సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారా భర్తీ చేస్తారు. ఇవి కాకుండా ఇప్పటికే 12 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు ఎస్జీటీలు మొత్తం కలిపి 22 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. టెట్ లేని కారణంగా పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే టెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టెట్ ఎవరికి? రాష్ట్రంలో సర్వీస్‌లో ఉన్న వారికి డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి ప్రత్యేకంగా టెట్ పరీక్ష నిర్వహించాలని టీచర్లు కోరుతున్నారు. వీరితో పాటు బీఎడ్, డీఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ పరీక్ష రాస్తారు. ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేయాలన్నా టెట్ తప్పనిసరి. కాగా ఏడాదికి రెండు సార్లు టెట్ చేపట్టాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నా, ఇది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పుడు సర్వీస్‌లో ఉన్నవారికి విధిగా టెట్ నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొనడంతో, అందరికీ కలిపి సాధారణ టెట్ నిర్వహించాలని విద్యాశాఖ ప్రభుత్వానికి నివేదించింది. టెన్త్ పరీక్షలు ముగిసిన వెంటనే ఏప్రిల్ మొదటి వారంలో టెట్ చేపట్టాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే 45 ఏళ్ళు దాటిన ఉపాధ్యాయులు టెట్‌కు సన్నద్ధమవ్వాల్సిన అవసరం ఉందని, పరీక్షల్లో ఇచ్చే సిలబస్‌పై కొంత కసరత్తు చేయాల్సి ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంత వ్యవధి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. ప్రత్యేకంగా ఉంటేనే బాగుంటుంది టెట్ వీలైనంత త్వరగా చేపట్టడం మంచిది. ఇది పాసయితేనే ప్రమోషన్లు పొందే వీలుంది. అయితే బోధన అనుభవం ఉన్న ఉపాధ్యాయులకు అంతర్గత పరీక్ష మాదిరి పరీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. వారికి ప్రత్యేక సిలబస్‌తో పరీక్ష పెట్టాలి. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) -
పదోన్నతులకు టెట్ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధానం వెల్లడించకపోతే పదోన్నతులు క్లిష్టంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పాఠశాల విద్యాశాఖాధికారులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా ముందుగా దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాయి. వీలైనంత త్వరగా డిపార్ట్మెంటల్ పరీక్ష తరహాలో దీన్ని నిర్వహించాలని సూచిస్తున్నాయి. టెట్ చేపట్టమని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా అధికారులు పెద్దగా పట్టించుకోలేదని, దీనివల్ల తాము నష్టపోయామని పేర్కొంటున్నాయి. జాతీయ విద్యా విధానం–2020 అమలుకు సిద్ధమవుతున్న నేపథ్యంలోనూ టెట్ అర్హతకు ప్రాధాన్యత పెరిగిందని వారు అంటున్నారు. ఎప్పుడో చెప్పిన కేంద్రం ప్రతి ఉపాధ్యాయుడు విధిగా టెట్ పాసవ్వాలని కేంద్రం 2012లోనే నిబంధన విధించింది. పాసైన వారికే పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. వాస్తవానికి 2012కు ముందు రాష్ట్రంలో టెట్ లేదు. జిల్లా నియామక మండలి పరీక్ష ద్వారానే టీచర్ల ఎంపిక జరిగింది. అందువల్ల అనేక మందికి టెట్ అర్హత ఉండే అవకాశం లేదని రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. టెట్ తప్పనిసరి నుంచి మినహాయింపు పొందింది. రాష్ట్రావిర్భావం తర్వాత కూడా ఇదే విధానం కొనసాగుతోంది. తాజా గా దీనిపై కేంద్రం మళ్ళీ స్పందించింది. ఉపాధ్యాయులందరికీ టెట్ తప్పనిసరి చేయాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టారు. ఎన్నికల ముందు జరిగిన ఈ ప్రక్రియపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. టెట్ అర్హత ఉంటేనే పదోన్నతి కల్పించాల్సి ఉంటుందనే నిబంధనను కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో కోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. దీనిపై నిర్ణయం తీసుకునేలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఖాళీలు తెలిసేందుకూ వీల్లేదు! రాష్ట్రంలో టెట్ ఉత్తీర్ణులు 4 లక్షల మంది ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయ పోస్టుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు. కాగా ప్రభుత్వ టీచర్లు 1.05 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2012 తర్వాత రిక్రూట్ అయిన 15 వేల మందికి మాత్రమే టెట్ అర్హత ఉంది. అంటే దాదాపు 90 వేల మంది టీచర్లకు అర్హత లేదు. దీంతో వీళ్ళు పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉండదు. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ ఆగిపోవడంతో కచ్చితమైన ఖాళీలు తెలిసే వీల్లేకుండా పోయింది. దీంతో టీచర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకూ బ్రేకులు పడుతున్నాయి. దీన్ని నివారించేందుకు 80 వేల మంది టీచర్లకు డిపార్ట్మెంట్ టెస్ట్ మాదిరి అంతర్గతంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఇదొక్కటే ప్రస్తుతం ఉన్న మార్గమని సూచిస్తున్నారు. ఏప్రిల్ లోపు ఈ తరహా టెట్ నిర్వహిస్తే.. వచ్చే జూన్, జూలైలో పదోన్నతులు చేపట్టేందుకు వీలుంటుందని చెబుతున్నారు. అయితే ప్రభుత్వం దృష్టి పెడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కన్పించడం లేదు. -
బదిలీలకు ఓకే.. పదోన్నతులకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పదోన్నతులను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. బదిలీలను మాత్రం యథా విధిగా కొనసాగిస్తున్నట్టు తెలిపింది. అయితే గతంలో వెల్లడించిన షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. గత షెడ్యూల్ ప్రకారం ఈ నెల 4వ తేదీన బదిలీ ఉత్తర్వులు టీచర్లకు అందాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ నెల 9వ తేదీన అధికారిక ఆదేశాలు ఇవ్వనున్నారు. బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్ మంగళవారం జిల్లా విద్యాశాఖ అధి కారులకు ఆదేశించారు. బదిలీల కోసం టీచర్ల నుంచి అందిన దరఖాస్తుల్లో మార్పులు, చేర్పు లను 4వ తేదీ కల్లా పూర్తి చేయాలని, 5వ తేదీన సీనియారిటీ జాబితాను వెల్లడించాలని తెలి పారు. ఈ నెల 6, 7 తేదీల్లో టీచర్లు బదిలీ కావా ల్సిన పాఠశాలల వివరాలతో వెబ్ ఆప్షన్లు ఇవ్వా లని, వీటిల్లో మార్పులుంటే 8వ తేదీ నాటికి పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీన బదిలీ ఉత్తర్వులు సంబంధిత ఉపాధ్యా యులకు అందించాలని స్పష్టం చేశారు. టెట్ తెచ్చిన తిప్పలు: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి గత నెల ఒకటవ తేదీన విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా ముందుగా ప్రధానోపాధ్యాయుల ఖాళీలు గుర్తించి, వాటిని స్కూల్ అసిస్టెంట్ల ద్వారా భర్తీ చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఇదే క్రమంలో స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలను గుర్తించి, ఎస్జీటీల ద్వారా 70 శాతం నింపేందుకు వీలుగా దరఖాస్తుల పరిశీలన వరకూ వెళ్ళింది. ఈ దశలో సీనియారిటీలో హేతుబద్ధత కొరవడిందని కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో మల్టీజోన్–2 పరిధిలోని ప్రమోషన్లు తొలుత నిలిపివేశారు. ఇదే సమయంలో కేంద్ర నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పాసయిన వారికే పదోన్నతులు ఇవ్వాలని మరికొంతమంది కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి 2010లో కేంద్రం ఈ నిబంధనను తెచ్చింది. కానీ రాష్ట్రంలో టెట్ 2011 నుంచి ఏర్పాటు చేశారు. ఈ కారణంగా అంతకుముందు నియమితులైన టీచర్లకు టెట్ అర్హత ఉండే ఆస్కారం లేదనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం దీనికి మినహాయింపు ఇచ్చింది. అయితే ఇది కేవలం సర్వీస్‌లో కొనసాగడానికేనని, పదోన్నతులకు టెట్ ఉండాలన్న వాదనను కోర్టు సమర్థించింది. ప్రమోషన్లపై స్టే ఇచ్చింది. న్యాయపరంగా ఈ అంశాన్ని పరిష్కరించడం ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని భావించిన అధికారులు, ప్రమోషన్ల అంశాన్ని పక్కనబెట్టేశారు. రిలీవర్ వస్తేనే స్థాన చలనం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 78 వేల మంది బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తప్పనిసరిగా బదిలీ అయ్యే వారి సంఖ్య 40 వేలకుపైనే ఉంటుంది. సీనియారిటీ ప్రకారం చూస్తే 58 వేల మందికి బదిలీకి ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇక ఉపాధ్యాయుడికి బదిలీ అయినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు ఉంటేనే రిలీవ్ చేయాలని హెచ్ఎంలకు సూచించారు. అంటే రిలీవ్ అయ్యే టీచర్ బోధించే సబ్జెక్టుకు సంబంధించిన మరో టీచర్ బదిలీపై వస్తేనే ప్రస్తుతం ఉన్న టీచర్‌ను రిలీవ్ చేయాలని ఆదేశించారు. దీంతో 58 వేల మంది టీచర్ల బదిలీకి ఆస్కారమున్నా, 25 వేల మందికి మించి స్థాన చలనం ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ మార్గదర్శకాల ప్రకారం.. టీచర్ 8 ఏళ్ళు, హెచ్ఎం 5 ఏళ్ళు ఒకేచోట ఉంటే తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకేచోట కనీసం రెండేళ్ళుగా పనిచేస్తున్న టీచర్లు బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. -
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,139 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ♦మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్షకేంద్రంలోని ప్రవేశం ఉండదు. అభ్యర్థులు ఓఎమ్మార్ పత్రంలో వివరాలు బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌లో పేరులో ఏమైనా స్వల్ప అక్షరదోషాలు, వివరాలు సరిగ్గా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్‌టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా లేకున్నా ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవడంతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఇతర ఫొటో ఐడీ కార్డులతో సంబంధిత డీఈఓలను సంప్రదించాలి. వారి అనుమతితోనే పరీక్షకు అనుమతిస్తారు. -
టెట్‌పై పట్టు ఏదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయ శిక్షణ తీసుకుంటున్నా.. ఆ తర్వాత ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో మాత్రం చాలా మంది ఫెయిలవుతున్నారు. బీఎడ్ విద్యార్హతతో రాసే పేపర్–2లో 2011 నుంచి ఇప్పటివరకు ప్రతిసారీ ఉత్తీర్ణత శాతం సగం కూడా దాటలేదు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్క 2022లో తప్ప ఎప్పుడూ ఉత్తీర్ణత 30% కూడా దాటకపోవడం గమనార్హం. ప్రభు త్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ ఇస్తా మని గతేడాది ప్రకటించడంతో.. ప్రైవేటు బడుల్లో పనిచేస్తున్నవారు సహా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు కోచింగ్ కేంద్రాలకు వెళ్లి మరీ టెట్ కోసం సిద్ధమయ్యారు. అయినా పాస్ శాతం తక్కువే నమోదైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్‌తోపాటు టెట్ నోటిఫికేషన్ ఇచ్చేవారని.. టీచర్ పోస్టుల భర్తీపై నమ్మకం ఉండేదని అభ్యర్థులు చెప్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డాక 2017లో మినహా ఇంతవరకు టీచర్ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో టెట్‌పై అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, సీరియస్‌గా ప్రిపేర్ కాకుండానే పరీక్షలు రాస్తున్నారని నిపుణులు అంటున్నారు. అందని అర్హత గీటురాయి: టెట్ ప్రశ్నపత్రం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత పొందాలంటే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 90 మార్కు లు, బీసీలు 75 మార్కులు, ఎస్సీ, ఎస్టీలు 60 మార్కులు సాధించాలి. పేపర్–1 (డీఎడ్ అర్హతతో రాసేది)తో పోలిస్తే, పేపర్–2 (బీఎడ్ అర్హతతో రాసేది) కష్టంగా ఉంటోందని పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చెప్తున్నారు. మేథ్స్, ఇంగ్లిష్ పై పట్టు ఉంటే తప్ప కనీసం 90 మార్కులు సాధించడం కష్టమేనని.. ముఖ్యంగా మేథ్స్‌లో సరైన సమాధానం రాబట్టేందుకు ఎక్కువ సమయం పడుతోందని అంటున్నారు. కనీసం 6 నెలల పాటు మోడల్ ప్రశ్నలు చేసి ఉంటేనే ఇది సాధ్యమవుతుందని వివరిస్తున్నా రు. ఇక ఇంగ్లిష్‌లో ప్రధానంగా జాతీయాలు, మోడ్రన్, అడ్వాన్స్డ్ లాంగ్వేజ్ నుంచి ప్రశ్నలు ఇస్తున్నారని.. వీటికి తగ్గ ప్రిపరేషన్ ఉండటం లేదని స్పష్టం చేస్తున్నారు. అదే పేపర్–1 ఇంటర్మీడియట్ స్థాయిలో ఉంటోందని.. బోధన మెళకువలు, మోడ్రన్ టీచింగ్ మెథడ్స్‌పై దృష్టి పెడితే తేలికగా గట్టెక్కగలుగుతున్నారని నిపుణులు అంటున్నారు. నాలుగున్నర లక్షల మందిలో.. రాష్ట్రంలో 1.5 లక్షల మంది డీఎడ్ ఉత్తీర్ణులు, 4.5 లక్షల మంది బీఎడ్ ఉత్తీర్ణులు కలిపి ఆరు లక్షల మందికిపైగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారు. వీరిలో సుమారు 4 లక్షల మంది మాత్రమే ఇప్పటివరకు టెట్ ఉత్తీర్ణత సాధించగలిగారు. టెట్‌లో పేపర్–1 పాసైతే.. 1–5 వరకూ బోధించే ‘సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)’ పోస్టులకు.. పేపర్–2 పాసైతే పదో తరగతి వరకు బోధించే ‘స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ)’ పోస్టులకు పోటీపడే వీలు ఉంటుంది. డీఎడ్ పూర్తిచేసినవారు పేపర్–1 మాత్రమే రాసే వీలుండగా.. బీఎడ్ వారు పేపర్–1, పేపర్–2 రెండూ రాయవచ్చు. అయితే పేపర్–1 కాస్త సులువుగా ఉంటుండటంతో.. చాలా మంది బీఎడ్ వారు పేపర్–1పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని, ఇదికూడా పేపర్–2లో అర్హత శాతం తగ్గడానికి కారణమవుతోందని నిపుణులు చెప్తున్నారు. ఇంగ్లిష్, మేథ్స్‌కు కష్టపడాలి కేవలం 45 రోజుల్లోనే టెట్‌కు ప్రిపేర్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. ఇంగ్లిష్, మేథ్స్‌లో మంచి మార్కులు సాధిస్తేనే అర్హత సాధించవచ్చు. దీనికి ప్రత్యేక సన్నద్ధత అవసరం. టీచర్ పోస్టులు వస్తాయనే ఆశతో కోచింగ్ కేంద్రాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నాం. కానీ టీచర్ నోటిఫికేషన్ రాకపోవడం నిరాశగా ఉంది. – స్వాతి, టెట్ అభ్యర్థి, భూపాలపల్లి నియామకాలుంటేనే ఉత్సాహం టెట్ ఉత్తీర్ణులు లక్షల్లో ఉన్నారు. టీచర్ పోస్టులు వస్తాయని ఆశతో ఉన్నాం. కానీ ఏటా నిరాశే ఎదురవుతోంది. నియామక నోటిఫికేషన్ వస్తేనే మాకూ ఉత్సాహంగా ఉంటుంది. ఈసారైనా రిక్రూట్మెంట్ నిర్వహిస్తారని ఆశిస్తున్నాం. – ఇఫ్రాన్ పాషా, టెట్ అభ్యర్థి, ములుగు జిల్లా -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్‌లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్‌ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
త్వరలో టెట్ పరీక్ష! తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం.. ‘కానీ, ఎందుకు?’
సాక్షి, హైదరాబాద్: త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై వెంటనే కసరత్తు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం దీనికి ఆమోదం తెలిపింది. మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన ఈ సమావేశంలో పాల్గొన్నారు. విద్యాశాఖలో దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అంశం ఇందులో చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తవకుండా నియామకాలు చేపట్టలేమని అధికారులు మంత్రులకు వివరించినట్టు సమాచారం. దీంతో నిరుద్యోగుల్లో అసంతృప్తిని పోగొట్టేందుకు తక్షణమే టెట్ నిర్వహించాలని భావించినట్టు తెలిసింది. భర్తీ కోసం ఎదురుచూపులే..! రాష్ట్ర అవతరణ తర్వాత 2016లో తొలిసారిగా టెట్ నిర్వహించారు. తర్వాత 2017, 2022లలోనూ నిర్వహించారు. ఇందులో గతేడాది టెట్ పరీక్ష సమయంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తున్నాయన్న ఆశతో ఎక్కువ మంది పరీక్ష రాశారు. కానీ ఏడాది గడచినా నియామకాలేవీ చేపట్టలేదు. 2016 నుంచి టెట్ అర్హత పొందిన వారంతా ఉద్యోగాల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేస్తే తప్ప కొత్త నియామకాలు చేపట్టలేమని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ ప్రక్రియ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు హడావుడి జరిగినా, కోర్టు వివాదాల కారణంగా వాయిదా పడింది. 22వేల ఖాళీలు.. బోధనకు ఇబ్బంది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు గతంలో విద్యాశాఖ అంచనా వేసింది. కానీ 12 వేల పోస్టులే ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల కొరతతో చాలా పాఠశాలల్లో బోధనకు ఇబ్బంది అవుతోంది. ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపట్టిన నేపథ్యంలో ఈ సమస్య ఇంకా పెరిగింది. కొన్ని పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)లను ఉన్నత తరగతుల బోధనకు పంపుతున్నారు. కోర్టు వివాదాలకు దారితీసే రీతిలో విద్యాశాఖ వ్యవహరించడం వల్లే పదోన్నతులు, బదిలీలు ముందుకెళ్లడం లేదని.. టెట్ చేపట్టినా ఉపయోగం ఏమిటని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేకుండా టెట్ దేనికి? రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే లక్షల మంది టెట్ ఉత్తీర్ణులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు కల్పిస్తే నియామకాలు చేపట్టవచ్చు. ఇవేవీ చేయకుండా టెట్ చేపడితే ప్రయోజనం ఏమిటి? ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’
సాక్షి, శ్రీకాకుళం: ఆత్మహత్యలు ఆగడం లేదు. పరీక్ష బాగా రాయలేకపోయినందుకు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మరువక ముందే పాతపట్నంలో మళ్లీ అలాంటి సంఘటన జరిగింది. ‘డాడీ నన్ను క్షమించు.. నా చావుకు ఎవరూ కారణం కాదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి పాతపట్నం బాలాజీ నగర్‌కు చెందిన యువతి సారా నేపాలి (27) గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం కోర్టు కూడలి ఎదురుగా ఉన్న బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న సారా నేపాలి గురువారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. కాస్త తలనొప్పిగా ఉందంటూ తల్లితో చెప్పి తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. గదిలోకి వెళ్లిన అమ్మాయి ఎంతకూ తిరిగి రాకపోవడంతో తల్లి ఆ గదికి వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి వారు హతాశులైపోయారు. వెంటనే ఆమెను కిందకు దించి కారులో పాతపట్నం ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సారా నేపాలి మృతి చెందినట్లు వైద్యుడు సందీప్ ధ్రువీకరించారు. పోలీసులకు కూడా సమాచారం అందించడంతో ఎస్ఐ టి.కామేశ్వరరావు, పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గదిని పరిశీలించారు. చదవండి: World Suicide Prevention Day 2022: ఆందోళన పరుస్తున్న ఆత్మహత్యలు అక్కడ సూసైడ్ నోట్‌తో పాటు సెల్ ఫోన్, డైరీని స్వాదీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్లో డాడీ నన్ను క్షమించు..నా చావుకు ఎవరు కారణం కాదు అంటూ రాసి ఉంది. నేపాలి ఎంఎస్సీ, బీఈడీ చదివింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం టెట్ పరీక్షల కీ విడుదల చేసింది. సారా ఓసీ కాబట్టి 150కి 90 మార్కులు రావాలి, కానీ 87 మార్కులు రావడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గతంలో సారా నేపాలి పాతపట్నం ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసింది. సారాకు ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు ఉన్నాడు. అక్కలకు వివాహాలయ్యాయి. తమ్ముడు డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రి దమ్మర్ బహదూర్ పాతపట్నం గురుకుల పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తుంటారు. తల్లి సరస్వతీ దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
AP TET 2022: ప్రారంభమైన ఏపీ టెట్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు (ఏపీటెట్)–ఆగస్టు 2022 శనివారం (నేటి) నుంచి ప్రారంభమయ్యాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 21 వరకు కంప్యూటరాధారితంగా ఇవి జరుగుతాయి. ఈ పరీక్షలకు 5.25 లక్షల మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో 150 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటుచేశారు. రాష్ట్రంతోపాటు ఒడిశా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోనూ వీటిని ఏర్పాటుచేశారు. ఇక టెట్ ఉత్తీర్ణత సర్టిఫికేట్ చెల్లుబాటు ఇంతకుముందు ఏడేళ్లుగా ఉండేది. కానీ, కేంద్ర ప్రభుత్వం దీన్ని మార్పుచేసి చెల్లుబాటును జీవితకాలంగా ప్రకటించింది. వెయిటేజీతో పెరిగిన అభ్యర్థులు ఇక ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంటు టీచర్ పోస్టుల అర్హత కోసం నిర్వహించే ఈ పరీక్షల్లో వచ్చే మార్కులకు డీఎస్సీ ఎంపికల్లో 20 శాతం వెయిటేజీ ఇవ్వనుండడంతో కొత్తగా డీఎడ్, బీఈడీ కోర్సులు పూర్తిచేసిన వారితో పాటు గతంలో ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు కూడా తమ స్కోరు పెంచుకునేందుకు ఈసారి టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ రిజర్వుడ్ అభ్యర్థుల అర్హత మార్కులను 45 నుంచి 40కి తగ్గించారు. దీనివల్ల కూడా అదనంగా మరో 50వేల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల సంఖ్య పెరగడం.. రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు తగినన్ని లేకపోవడంతో పలువురు అభ్యర్థులకు ఇతర రాష్ట్రాల్లోని సెంటర్లను కేటాయించారు. దీంతో వారు ఇబ్బందికి గురవుతున్నారు. -
AP TET Notification 2022: ఏపీలో టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్–ఆగస్టు 2022)ను ఆగస్టు 6 నుంచి 21వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఈనెల 15 నుంచి జూలై 15వ తేదీ వరకు టెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఈనెల 16 నుంచి జులై 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలి. aptet.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులకు సహకరించేందుకు ఈనెల 13 నుంచి విద్యా శాఖ కార్యాలయంలో హెల్ప్ డెస్కును ఏర్పాటు చేస్తున్నారు. జూలై 26వ తేదీ నుంచి ఆన్లైన్ మాక్ టెస్టులు నిర్వహిస్తారు. జూలై 25 నుంచి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తారు. ఒకసారి దరఖాస్తు సమర్పించాక సవరణలకు అవకాశం ఉండదు. అందువల్ల అభ్యర్థులు దరఖాస్తును నింపిన తర్వాత అన్ని వివరాలు జాగ్రత్తగా సరిచూసుకొని సబ్మిట్ చేయాలి. టెట్ సిలబస్‌ను కూడా పాఠశాల విద్యా శాఖ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌లో పొందుపరిచింది. పరీక్షలిలా.. పరీక్షలు పేపర్ 1ఏ, పేపర్ 1 బీ, పేపర్ 2 ఏ, పేపర్2 బీలుగా జరుగుతాయి. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు జరుగుతాయి. ప్రాథమిక కీని ఆగస్టు 31న విడుదల చేస్తారు. దానిపై సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. తుది కీని సెప్టెంబర్ 12న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 14న ఫలితాలు ప్రకటిస్తారు. డీఎస్సీలో వెయిటేజి టెట్‌లో అర్హతకు నిర్ణీత మార్కులను పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. ఆ మార్కులు సాధిస్తేనే టెట్‌లో క్వాలిఫై అయినట్లుగా పరిగణిస్తారు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు 60 శాతం రావాలి. బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు రావాలి. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండేది. తాజా నిబంధనల ప్రకారం జీవితకాలం చెల్లుబాటు అవుతుంది. టెట్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల స్కోరుకు ఉపాధ్యాయ నియామకాల్లో (డీఎస్సీలో) 20 శాతం మేర వెయిటేజీ కల్పిస్తారు. వీరు అర్హులు డీఎల్ఈడీ, బీఈడీ, లాంగ్వేజ్ పండిట్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు, 2020–22 బ్యాచ్‌లోని అభ్యర్థులు ఈ టెట్‌కు అర్హులు. గతంలో ఏపీ టెట్‌లో ఉత్తీర్ణులైన వారిలో మార్కుల స్కోరును పెంచుకోవాలనుకొనే వారు కూడా ఈ టెట్‌కు హాజరుకావచ్చు. 1 నుంచి 5 తరగతుల బోధనకు సంబంధించిన టీచర్లు పేపర్ 1–ఏకు హాజరుకావాలి. 6 నుంచి 8వ తరగతుల బోధనకు పేపర్–2ఏ రాయాలి. 1 నుంచి 5 తరగతులలోని స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ అభ్యర్ధులు పేపర్–1బీ రాయాలి. 6 నుంచి 8వ తరగతుల స్పెషల్ ఎడ్యుకేషన్ బోధనకు పేపర్–2బీకి హాజరుకావాలి. 1 నుంచి 8 తరగతుల బోధన అభ్యర్ధులు పేపర్–1ఏ, పేపర్–1బీ, పేపర్–2ఏ, పేపర్–2బీలను రాయాలి. అభ్యర్ధులు వారు హాజరుకాబోయే పేపర్లకు వేర్వేరుగా రూ.500 చొప్పున ఫీజు చెల్లించాలి. పరీక్షలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఒడిసాలలో నిర్వహిస్తారు. -
ఏపీ టెట్–2022 నోటిఫికేషన్ విడుదల ఎప్పుడంటే..?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టెట్ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం నోటిఫికేషన్, సిలబస్, పరీక్షల తేదీలు, పరీక్ష రుసుం తదితర వివరాలకు aptet.apcfss.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు శుక్రవారం ఉదయం 10.30 నుంచి ఈ వెబ్సైట్ నుంచి సమాచారాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
తెలంగాణలో కష్టాల టెట్.. అభ్యర్థులకు తిప్పలు, పరీక్ష రాసేదెలా?
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12న జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, అభ్యర్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో తికమక, హాల్ టికెట్లలో ఫొటో ఉంటే సంతకం ఉండటం లేదని, సంతకం ఉంటే ఫొటో కనిపించడం లేదని పలువురు అభ్య ర్థులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖాధికారుల చుట్టూ తిరిగినా వాళ్లు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సొంత ప్రాంతంలో కాకుండా, పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయితే, హాల్టికెట్లలో ఫలానా కాలేజీ అని మాత్రమే పేర్కొ న్నారు. ఒకే పేరుతో జిల్లా కేంద్రంలో రెండు మూడు కాలేజీలున్నాయి. దీంతో ఏ కాలేజీలో పరీక్ష రాయాలో తెలియని గందరగోళంలో అభ్యర్థులు న్నారు. పరీక్ష కేంద్రం ఫోన్ నంబర్లు అందు బాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా, ఆ నంబర్లకు ఫోన్ చేస్తే స్పందన ఉండటం లేదని, ఎక్కువ సేపు ఎంగేజ్లో ఉంటోందని పలువురు అభ్యర్థులు తెలిపారు. పరీక్షకు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగు తోంది. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం మొత్తం 6,29,352 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశారు. తప్పుల సవరణకు అవకాశమేది? టెట్ పరీక్ష నిర్వహణపై అధికారులు మొదటినుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో చాలా రోజులు సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కాలేదు. దరఖాస్తు సమయంలో సంతకం, ఫొటోలు సరిగా అప్లోడ్ అవలేదని అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. దరఖాస్తులు అప్లోడ్ చేసిన తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలనే డిమాండ్ వచ్చింది. అయితే టెట్ నిర్వహణ అధికారులు ఇవేవీ పట్టించుకోలేదని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తంచేశారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ తర్వాత ఫొటోలు, సంతకాలు లేకపోతే డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్లపై ఫొటో అంటించి, సంతకాలు చేసి, గెజిటెడ్ ధ్రువీకరణ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారిని కలిస్తే పరిశీ లించి న్యాయం చేస్తారని వెసులుబాటు కల్పించారు. అయితే, డీఈవోలు ఇతర అధికార పనుల్లో ఉండటం, సవరణల కోసం వచ్చే అభ్యర్థులు ఎక్కు వగా ఉండటంతో సవరణలు పరిశీలించే అవకాశం ఉండటం లేదని అభ్యర్థులు అంటున్నారు. కింది స్థాయి అధికారులకు ఈ బాధ్యత అప్పగించినా, రోజుల తరబడి తిరిగితే తప్ప పనిజరగడం లేదని చెబుతున్నారు. స్పష్టత లేక గందరగోళం.. ►ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆలస్యంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పక్క జిల్లాల్లో పరీక్ష కేం ద్రాలు కేటాయించారు. వరంగల్ పట్టణంలో ఒకే పేరుతో 3 కాలేజీలు (బ్రాంచీలు) ఉన్నాయి. కాలేజీ పేరు ఇచ్చి.. వరంగల్ అంటూ హాల్ టికెట్లో పేర్కొన్నారు. అయితే ఏ బ్రాంచ్ అనేది స్పష్టం చేయలేదు. హాల్ టికెట్లో ఇచ్చిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే స్పందన కన్పిం చలేదు. ►ఖమ్మంకు చెందిన ఓ అభ్యర్థి హాల్ టికెట్‌పై తన సంతకం పడలేదు. మళ్లీ ఫొటో, సంతకం అం టించి, గెజిటెడ్ అధికారి చుట్టూ తిరిగి ధ్రువీ కరణ చేయించారు. డీఈవో కార్యాలయంలో అధికారులు రెండు రోజులైనా స్పందించలేదని ఆ అభ్యర్థి తెలిపారు. సంతకం కోసం రెండు రోజులా? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) హాల్ టికెట్ డౌన్ లోడ్ చేశాక చూసుకుంటే ఫొటో పక్కన ఉండాల్సిన సంతకం లేదు. దీంతో రెండు రోజుల పాటు హనుమకొండలోని డీఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి డీఈఓ కార్యాలయం ఏడీ పర్మిట్ చేస్తూ హాల్ టికెట్‌పై సంతకం చేశారు. –ఎండీ ఖరీముల్లా, టెట్ అభ్యర్థి, హనుమకొండ -
AP: ఆగస్టులో ‘టెట్’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ టీచర్ పోస్టుల భర్తీకి కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2022) ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. పేపర్లవారీగా పరీక్షల తేదీలు, ఇతర సమాచారంతో త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనుంది. టెట్ రాసేందుకు అభ్యర్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సినా గత సర్కారు పట్టించుకోలేదు. అధికారంలో ఉండగా టెట్, డీఎస్సీ కలిపి టీచర్ ఎలిజిబులిటీ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టెట్ కమ్ టెర్ట్) పేరుతో నిర్వహించినా క్వాలిఫైడ్ అభ్యర్థుల ధ్రువపత్రాలను ఏడేళ్లుగా కాకుండా ఆ పరీక్ష వరకు మాత్రమే పరిమితం చేసింది. ఇలా రెండు పరీక్షలు కలిపి నిర్వహించడంతో అభ్యర్ధులు నష్టపోయారు. 2018లో టెట్ నిర్వహించాల్సి ఉన్నా ఎన్నికలు రావడంతో నిలిచిపోయింది. డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ దీర్ఘకాలంగా టెట్ నిర్వహించకపోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. టెట్ మార్కులకు ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ)లో వెయిటేజీ కల్పించడంతోపాటు బీఈడీ, ఎంఈడీ అభ్యర్థులను ఎస్ఏ పోస్టులకు కూడా అర్హులుగా ప్రకటించడంతో గతంలో క్వాలిఫై అయిన వారు సైతం మరోసారి రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెట్ మార్కులకు డీఎస్సీలో 20 శాతం మేర వెయిటేజీ ఉన్నందున వీటికి ప్రాధాన్యత ఏర్పడింది. టెట్ ఉత్తీర్ణత సర్టిఫికెట్ చెల్లుబాటు గతంలో ఏడేళ్లు మాత్రమే ఉండగా గతేడాది ఎన్సీటీఈ దీన్ని సవరించి జీవితకాలం చెల్లుతుందని ప్రకటించింది. వెబ్సైట్లో ప్యాట్రన్, సిలబస్ టెట్ 2021 విధివిధానాలు, సిలబస్‌ను పాఠశాల విద్యాశాఖ గతంలో విడుదల చేసింది. సిలబస్‌ను https://aptet.apcfss.in వెబ్సైట్లో పొందుపరిచింది. టెట్‌లో రెండు పేపర్లు (పేపర్ 1, పేపర్ 2) ఉంటాయి. వీటిని 1 ఏ, 1 బీ, 2 ఏ, 2 బీ అని నిర్వహిస్తారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఎన్సీటీఈ మార్పులు చేయడంతో ప్రభుత్వం ఆ మేరకు సవరణలు చేసింది. గతంలో టెట్‌కు సంబంధించి జారీ చేసిన జీవో 23కు సవరణలు చేస్తూ జీవో 27 విడుదల చేసింది. దీని ప్రకారం అభ్యర్ధులకు మేలు చేకూరేలా టెట్ నోటిఫికేషన్లో పొందుపర్చనున్నారు. ఎవరెవరు ఏ పరీక్ష రాయాలంటే.. ► రెగ్యులర్ స్కూళ్లలో 1 – 5 తరగతుల్లో టీచర్ పోస్టులకు పేపర్ 1ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూళ్లలో 1 – 5 తరగతులు బోధించాలంటే పేపర్ 1బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6 – 8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2బీలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ► టెట్‌లో అర్హత మార్కులు గతంలో మాదిరిగానే ఉండనున్నాయి. జనరల్ అభ్యర్ధులకు 60 శాతం, బీసీ అభ్యర్ధులకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. టెట్ తరువాత డీఎస్సీపై దృష్టి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం టెట్ నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది. అయితే వెను వెంటనే కరోనా రావడంతో రెండేళ్లుగా టెట్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో తొలుత టెట్ నిర్వహించి అనంతరం టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించేందుకు సన్నద్ధమవుతోంది. -
ఆ అభ్యర్థులకు నిరాశ! టెట్‌లో ప్రత్యేక పేపర్ లేనట్టే...
సాక్షి, హైదరాబాద్: భాషాపండితులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ప్రత్యేకంగా నిర్వహించే ఆలోచనేమీలేదని అధికారవర్గాలు స్పష్టమైన సంకేతాలిచ్చాయి. దీంతో రాష్ట్రంలోని దాదాపు 30 వేల మంది భాషాపండితులు నిరాశకు గురయ్యారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఈ అవకాశం కల్పించారని వారు రాష్ట్రప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి సానుకూల స్పందనరాలేదు. విజ్ఞప్తులు, విన్నపాలు కొనసాగుతున్న క్రమంలోనే టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 12తో ముగిసింది. మొత్తం 6,29,352 దరఖాస్తులు అందాయని, ఇందులో పేపర్–1 రాసేవారి సంఖ్య 3,51,468, పేపర్–2 రాసేవారి సంఖ్య 2,77,884 ఉందని అధికారులు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సోమవారం ప్రారంభించే వీలుందని అధికారవర్గాలు పేర్కొన్నాయి. జూన్ 12న రాష్ట్రవ్యాప్తంగా టెట్ జరుగుతుంది. తమకు తెలియని సిలబస్‌తో టెట్ రాయడం కష్టమనే భావనలో భాషా పండితులున్నారు. హిందీ, తెలుగు భాషాపండిట్ కోర్సు పూర్తి చేసిన ఈ అభ్యర్థులు టెట్ పేపర్–2 రాసేందుకు అర్హులు. (చదవండి: బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!) అయితే, వీరు ప్రధానంగా సంబంధిత భాషపైనే శిక్షణపొంది ఉంటారు. 60 శాతం భాషాపరమైన సిలబస్ నుంచి పరీక్ష నిర్వహిస్తే టెట్‌లో పోటీ పడగలమని వీరు చెబుతున్నారు. కానీ, ప్రస్తుతం గణితం, సైన్స్‌సహా మిగతా సిలబస్‌తో వీళ్లు టెట్ రాయాల్సి వస్తోంది. ఇది తమకు ఇబ్బందిగానే ఉంటుందని వారి వాదన. రాష్ట్రంలో ప్రస్తుతం 20 వేల మంది తెలుగు పండిట్లు, 10 వేల మంది హిందీ పండితులున్నారు. ఆన్లైన్ అవస్థలు.. టెట్ దరఖాస్తుల సమయంలో అనేక సమస్యలు ఎదురైనట్టు అభ్యర్థులు చెబుతున్నారు. దరఖాస్తుపై కొంతమంది ఫొటోలు ఆప్‌లోడ్ అయినా, సంతకాలు నిర్దేశిత ప్రాంతంలో పొందుపర్చలేకపోయామని, సాంకేతిక ఇబ్బందులే దీనికి కారణమని చెబుతున్నారు. సమీపంలోని పరీక్ష కేంద్రాలు ఆన్లైన్లో చూపించలేదని ఎల్బీనగర్కు చెందిన చైతన్య, రఘురాం అనే అభ్యర్థులు తెలిపారు. అయితే, దరఖాస్తులు తాము చెప్పిన రీతిలో లేని పక్షంలో తిరస్కరిస్తామని అధికారులు అంటున్నారు. దీంతో పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ తరహాలో పేపర్–3 ఉండాలి భాషాపండితులకు 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేపర్–3 నిర్వహించింది. అదే తరహాలో ఇక్కడా భాషపైనే ఎక్కువ సిలబస్‌తో ప్రశ్నలు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలా అయితేనే 30 వేల భాషాపండితులకు ప్రభుత్వం న్యాయం చేయగలుగుతుంది. కానీ, దీన్ని పట్టించుకోకపోవడంతో ఆశలన్నీ అడియాసలయ్యాయి. – సి.జగదీశ్ (రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు, రాష్ట్ర అధ్యక్షుడు) (చదవండి: టెట్ పరీక్ష కేంద్రాలు బ్లాక్) -
అంచనాలకు మించి టెట్ దరఖాస్తులు...పరీక్ష కేంద్రాలు బ్లాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది. దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండురోజులు గడువు ఉండగానే హైదరాబాద్– రంగారెడ్డి– మేడ్చల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది. నగరం నుంచి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండటంతో పరీక్ష కేంద్రాల జాబితా నుంచి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి. వాస్తవంగా టెట్ పరీక్ష ఎంత మంది రాస్తారన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు. ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు సంఖ్య అభ్యర్థులను ఇబ్బందుల్లో పడేసింది. టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా.. ఈ నెల 12తో గడువు ముగియనుంది. ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో (సోమవారం) ఆఖరిరోజు. పరీక్షకు హజరయ్యేందుకు ఆ¯న్లైన్లో టెట్ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో ఆఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారితో పాటు ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది. లక్ష మందికి పైగా.. మహానగర పరిధిలో సుమారు లక్ష మందికి పైగా బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన, పూర్తి చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా. దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తులు సంఖ్య ఎగబాగుతున్నట్లు తెలుస్తోంది. పోటీ పరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్య ర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దానికంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. వాస్తవంగా టీచర్ల పోస్టుల కోసం అయిదేళ్లుగా నోటిఫికేషన్ లేకుండాపోయింది. 2017లో టీఆర్టీ నిర్వహించగా.. ఇప్పటివరకు ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వం ఎలాగైనా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందనే నమ్మకంతో ఏటా బీఎడ్, డీఎడ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్ బీఈడీ కాలేజీలుండగా అందులో ప్రతి ఏటా 5,640 మంది విద్యార్థులు బీఈడీ కోర్సు పూర్తిచేస్తూ వస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నారు. బీఎడ్, డీఎడ్ కోర్సులు పూర్తి చేసి టెట్ కోసం ఎదురుచూస్తున్న వారితోపాటు పాత అభ్యర్థులు సైతం ఈసారి దరఖాస్తు చేసుకుంటుండంతో సంఖ్య మరింత ఎగబాగుతోంది. సొంత జిల్లాలో చాన్స్ మిస్.. టెట్ పరీక్ష కేంద్రాల జాబితాను హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు బ్లాక్ కావడంతో అభ్యర్థులు సొంత జిల్లాల్లో కాకుండా ఇతర జిల్లాల్లో పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్లను ఎంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మహిళా అభ్యర్ధులైన గర్భిణులు, చిన్నపిల్లల తల్లులతో పాటు వికలాంగులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరీక్ష రాయడం మరో పరీక్షగా తయారైంది. ఈసారి బీఈడీ అభ్యర్థులకు రెండు పేపర్లకు చా¯న్స్ ఉండడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అవకాశం ఉన్నా.. మహానగర పరిధిలో మరిన్ని పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉన్నా.. జాబితా నుంచి నగర జిల్లాలు తొలగించడం విస్మయానికి గురిచేస్తోంది. నగరం చుట్టూ ఇంజినీరింగ్, ఇతర కాలేజీలు అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలోనే సగానికిపైగా అభ్యర్థులు నగర పరిధిలోనే పరీక్షలు రాసేవారు. ఈసారి మాత్రం పరీక్ష కేంద్రాలు పరిమితి సంఖ్యలో కేటాయించి బ్లాక్ చేయడం పట్ల అభ్యర్థుల్లో నిరాశ నెలకొంది. మరోవైపు టెట్ అప్లికేషన్ల సందర్భంలో, ఇతర సమాచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు కూడా పనిచేయడం లేదు. టెట్ దరఖాస్తుల్లో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం లేకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అప్లికేషన్లలో టెక్నికల్, టైప్ ఎర్రర్స్‌తో పాటు ఫొటోలూ సరిగా రాలేదు. వాటిని సరిచేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ లేక అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. (చదవండి: చదివింపుల్లేవ్.. విదిలింపులే!) -
టెట్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్! ఒక్కసారి రాస్తే చాలు..
సాక్షి, హైదరాబాద్: టెట్‌కు సంబంధించి ఇటీవల మంత్రుల కమిటీ చేసిన కొన్ని సవరణలను ప్రభుత్వం ఆమోదించింది. గతం లో టెట్‌లో సాధించిన అర్హత కాలపరిమితి ఏడేళ్లుగా ఉండేది. దీన్ని ఇప్పుడు జీవితకాలానికి పొడిగించారు. జాతీయ ఉపాధ్యాయ మండలి (ఎన్సీటీఈ) రెండేళ్ళ క్రితం ఈ మేరకు మార్పులు చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అనుగుణంగా మార్పులు చేసింది. దీని ప్రకారం 2011 ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఆ మార్పు వర్తిస్తుంది. అంటే అప్పటినుంచి జరిగిన టెట్‌లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రం ఇప్పుడూ చెల్లుబాటు కానుంది. రాష్ట్రంలో ఇప్పటికే టెట్ పాసైనవారు సుమారు 3 లక్షల మంది ఉంటారని అంచనా. జూన్ 12న టెట్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ను జూన్ 12వ తేదీన నిర్వహించనున్నట్టు ప్రభుత్వం గురువారం తెలిపింది. ఇందుకు సంబంధించిన నోటి ఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పాఠశాల విద్య (ఎస్సీఈఆర్టీ) డైరెక్టర్ రాధారెడ్డి సంబంధిత ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సమగ్ర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను ఈ నెల 25వ తేదీన ‘టీఎస్‌టెట్. సీజీజీ.జీవోవీ.ఇన్’వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపారు. కాగా టెట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ కేటగిరీ విద్యార్థులకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే అర్హత సాధించినట్లుగా పరిగణిస్తారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.00 వరకు, పేపర్–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుంది. (చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు) -
Teacher Eligibility Test: టెట్–2021 విధానం, సిలబస్ ఖరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి అభ్యర్థులకు ముందుగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)–2021 పేపర్ల విధివిధానాలు, సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం విడుదల చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సిలబస్‌ను ‘హెచ్‌టీటీపీఎస్://ఏపీటీఈటీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఐఎన్’లో అందుబాటులో ఉంచామని మంత్రి సురేష్ తెలిపారు. రాష్ట్రంలో టెట్ నిర్వహణపై ప్రభుత్వం మార్చి 17న జీవో 23 ద్వారా మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. టెట్‌కు సంబంధించిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.. టెట్‌లో రెండు పేపర్లు.. ► టెట్‌లో 2 పేపర్లు (పేపర్–1, పేపర్–2) ఉంటాయి. పేపర్ 1–ఏ, 1–బీ, 2–ఏ, 2–బీలుగా వీటిని నిర్వహిస్తారు. ► రెగ్యులర్ స్కూళ్లలో 1–5 తరగతుల టీచర్ పోస్టులకు పేపర్ 1–ఏలో అర్హత సాధించాలి. ► దివ్యాంగులు, ఇతర విభిన్న ప్రతిభావంతులు స్పెషల్ స్కూల్స్‌లో 1–5 తరగతులు బోధించాలంటే పేపర్ 1–బీలో అర్హత తప్పనిసరి. ► రెగ్యులర్ స్కూళ్లలో 6–8, ఆ పై తరగతులు బోధించాలంటే పేపర్ 2–ఏలో అర్హత సాధించాలి. అలాగే స్పెషల్ స్కూళ్లలో ఇవే తరగతులకు పేపర్ 2–బీలో అర్హత తప్పనిసరి. ఆయా పేపర్ల పరీక్ష విధానం ఇలా.. -
Teacher Eligibility Test: టెట్ పాసైతే జీవితకాలం అర్హత
సాక్షి, అమరావతి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన తరువాత అభ్యర్థులకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను ప్రవేశపెట్టడంతో పాటు ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు రూపొందించింది. జాతీయస్థాయిలో ప్రత్యేకంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)ని సీబీఎస్ఈ ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును తప్పనిసరిగా నిర్వహించాలని, ఏడాదికి కనీసం రెండుసార్లు ఈ టెట్ పరీక్ష పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. టెట్ అర్హత ధ్రువపత్రాల అర్హత కాలపరిమితిని ఏడేళ్లుగా ఎన్సీటీఈ చేసింది. 2011 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో టెట్ విధానం అమల్లోకి వచ్చింది. టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్లు మాత్రమే ఉండడంతో ఆ గడువు ముగిసిన అభ్యర్థులు మళ్లీ టెట్‌ను రాయవలసి వచ్చేది. ఇప్పుడు ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలం చేయడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. 2011 నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నామని, ఇప్పటికే ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారికి ఇచ్చిన ధ్రువపత్రాల కాలపరిమితి ముగిసి ఉంటే వాటిని జీవితకాలానికి పునరుద్ధరించడమో, కొత్త ద్రువపత్రాలు జారీ చేయడమో చేయాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గతంలో ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారు ఆ సర్టిఫికెట్ల పరిమితి ఏడేళ్లు దాటినా నిశ్చింతగా ఉండవచ్చు. వాటి కాలపరిమితి జీవిత కాలానికి పెంచడంతో మళ్లీ టెట్ రాయాల్సిన పనిలేదు. అయితే డీఎస్సీలో టెట్ అర్హత మార్కులకు 20 శాతం మేర వెయిటేజి ఇస్తున్నారు. దీనివల్ల టెట్ వెయిటేజి స్కోరును పెంచుకోవడానికి అభ్యర్థులు టెట్‌ను పలుమార్లు రాస్తున్నారు. చదవండి: పరీక్షల రద్దుతో హ్యాపీనా? -
Teachers Eligibility Test: టెట్ అభ్యర్థులకు కేంద్రం తీపికబురు..
న్యూఢిల్లీ: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు కేంద్ర విద్యాశాఖ తీపికబురు అందించింది. టెట్ క్వాలిఫైయింగ్ సర్టిఫికెట్ గడువును 7 సంవత్సరాల నుంచి జీవిత కాలం పొడిగిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియల్ నిశాంక్ కీలక ఆదేశాలను జారీచేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రకారం 2011, ఫిబ్రవరి నుంచి ఈ పెంపును అమలు పరచాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉపాధ్యాయ రంగంలో స్థిరపడాలనే వారికోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అభ్యర్థులందరికి ఉపాధి అవకాశాలు పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటికే 7 సంవత్సరాల గడువు ముగిసిన అభ్యర్థులకు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త సర్టిఫికెట్ల జారీలో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే, గతంలో టెట్‌కు 7 సంవత్సరాల అర్హత ఉండేది. అదే విధంగా, ఒక అభ్యర్థి టెట్‌ను ఎన్నిసార్లయినా రాసుకోవచ్చన్న విషయం తెలిసిందే. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ -
ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందా.. ఉండదా?
సాక్షి, హైదరాబాద్: లక్షల మంది నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ నియామకాలు రాష్ట్రంలో ఇప్పట్లో జరిగేనా? అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేని పరిస్థితి. ప్రభుత్వం భర్తీ చేస్తామని ప్రకటించిన 50 వేల ఉద్యోగాల్లో 10 వేల వరకు టీచర్ పోస్టులున్నాయి. అయితే వాటి భర్తీ విధానమే ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను నాలుగేళ్లుగా నిర్వహించకుండా, ఉపాధ్యాయ నియామకాలను పట్టించుకోకుండా పక్కన పడేసిన విద్యాశాఖ.. ఇప్పుడు టెట్ నిర్వహిస్తుందా.. లేదా? అన్నది గందరగోళంగా మారింది. ఓవైపు ఒకే పరీక్ష ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని చెబుతూనే మరోవైపు టెట్ నిర్వహిస్తామని సమాధానమిస్తోంది. దీంతో టెట్ పరిస్థితేంటి? టీచర్ల నియామకాలు ఎలా చేపడతారన్న దానిపై గందరగోళం నెలకొంది. మంత్రిది ఓ మాట.. విద్యాశాఖది మరో మాట టెట్, టీఆర్టీల విషయంలో ప్రభుత్వ వర్గాల నుంచే భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉపాధ్యాయ నియామకాలను పాత పద్ధతిలో ఒకే పరీక్ష ద్వారా చేపడతామని అసెంబ్లీలోనే వెల్లడించారు. అంటే టెట్ ఉండదా? లేదంటే టెట్‌ను కలుపుకొని టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు) నిర్వహిస్తారా అన్న స్పష్టత రావాల్సి ఉంది. ఈ విషయాన్ని మంత్రి ప్రకటించి 15 రోజులు గడిచినా దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కనీసం ఓ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని గవర్నింగ్ బాడీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ కావాల్సి ఉంది. ఇదే విషయాన్ని పేర్కొంటూ రాష్ట్రంలో టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని మండలిలో ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు టెట్ వ్యాలిడిటీ విషయంలో ఎన్సీటీఈ తుది నిర్ణయం తీసుకున్నాక రాష్ట్రంలో టెట్ నిర్వహిస్తామని విద్యా శాఖ వెల్లడించింది. ఈ లెక్కన టెట్ ఉంటుందా.. ఉండదా? లేదంటే టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తారా? అన్నది తేలాల్సి ఉంది. టెట్ లేదా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే.. రాష్ట్రంలో 2017లో టెట్ నిర్వహించారు. అప్పటి నుంచి ఇప్పటివరకూ టెట్ నిర్వహించలేదు. దీంతో గతంలో టెట్‌లో అర్హత సాధించినా, ఆ తర్వాత ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు దాదాపు 3 లక్షల మంది ఉన్నారు. ఈ నాలుగేళ్లలో ఉపాధ్యాయ విద్యను పూర్తి చేసుకొని టెట్ రాసేందుకు ఎదురుచూస్తున్న వారు మరో 2 లక్షల మంది ఉన్నారు. అయితే ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీని నిర్వహించే అంశంపై ఆలోచనలు చేస్తోంది. అది నిర్వహిస్తే పాత టెట్లలో అర్హత సాధించి ఇప్పటికీ వ్యాలిడిటీ కలిగిన 3 లక్షల మంది విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలక అంశం. మరోవైపు పాత టెట్లలో అర్హత సాధించి ఏడేళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన మరో 3 లక్షల మంది విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదీ ప్రధానమే. వ్యాలిడిటీ కోల్పోయిన వారి విషయంలో న్యాయ సలహా తీసుకుని విధానపర నిర్ణయం ప్రకటిస్తామని ఎన్సీటీఈ పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏపీలో నిర్వహించినా.. ఆంధ్రప్రదేశ్‌లో టెట్ కమ్ టీఆర్టీ కలిపి నిర్వహించారు. అయితే ఆ నియామకాల్లో గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. టెట్ కమ్ టీఆర్టీలో భాగంగా 50 మార్కులకు నిర్వహించిన టెట్‌కు సంబంధించిన పార్ట్–ఏలో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని, లేదంటే పాత టెట్‌లో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకొని నియామకాలు చేపట్టారు. ఇక గతంలో టెట్‌లో అర్హ్హత సాధించని వారి విషయంలో మాత్రం టెట్ కమ్ టీఆర్టీలోని పార్ట్–ఏలో అర్హత సాధిస్తే టీఆర్టీకి సంబంధించిన పేపరును మూల్యాంకనం చేసి నియాకమల్లో పరిగణనలోకి తీసుకున్నారు. దీనివల్ల కొంత గందరగోళం నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాలని ఎన్సీటీఈ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహిస్తే ప్రైవేటు టీచర్లకు టెట్ ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు జాతీయ స్థాయిలో రెండూ కలిపి నిర్వహించిన సందర్భమూ లేదు. ఈ గందరగోళం నేపథ్యంలో టెట్‌ను వేరుగానే నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం గత నెల 17న జీవో 23ని జారీ చేసింది. సెంట్రల్ స్కూళ్లకు టెట్ తప్పనిసరి జాతీయ స్థాయిలో కేంద్రం ఏటా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్టును (సీటెట్) నిర్వహిస్తోంది. అందులో అర్హత సాధించిన వారిని మాత్రమే సీబీఎస్ఈ స్కూళ్లు, ఇతర కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీలో పరిగణనలోకి తీసుకుంటోంది. జాతీయ స్థాయిలో ఇంతవరకు టెట్‌ను, ఉపాధ్యాయ నియామక పరీక్షను కలిపి నిర్వహించే ఆలోచన చేయలేదు. రెండింటినీ వేర్వేరుగానే చూస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఉపాధ్యాయ నియామకాలు ఎప్పుడు చేపడుతుందో వేచి చూడాల్సిందే. వివాదాల్లోకి వెళ్లొద్దు.. టెట్ నిర్వహించాలి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ వేగంగా జరగాలంటే ప్రభుత్వం వివాదాల్లోకి వెళ్లొద్దు. వెంటనే టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాలి. ఆ పరీక్ష అయిన 15 రోజుల్లో టీఆర్టీ పరీక్ష నిర్వహించినా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించే వీలున్నా వివాదాలు చుట్టుముట్టే ఆస్కారం ఉంది. 2017 వరకు నిర్వహించిన టెట్లలో అర్హత సాధించిన వారి విషయంలో వెయిటేజీ ఇవ్వడం, లేదా పాత, కొత్త టెట్లలో ఎందులో ఎక్కువ స్కోర్ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇదీ సమస్యాత్మకమే. మరోవైపు ప్రైవేటు టీచర్‌గా పని చేయాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. కాబట్టి వారికోసం టెట్‌ను నిర్వహించక తప్పదు. ఇలాంటప్పుడు సులభ విధానాన్నే ప్రభుత్వం ఎంచుకుంటే సమస్య ఉండదు. - పి.శంకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యా విభాగం సామర్థ్యాలను నిర్ణయించేదెలా? రెండున్నర గంటల్లో టెట్ కమ్ టీఆర్టీ పరీక్ష నిర్వహించి 30 ఏళ్ల పాటు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడి సామర్థ్యాలను నిర్ణయించడం సాధ్యమా? టెట్ వేరు. టీఆర్టీ వేరు. ఉపాధ్యాయుడు కావాల్సిన అర్హతలు ఉన్నాయా? లేదా? నిర్ణయించేందుకు నిర్వహించేది టెట్. ఉపాధ్యాయులుగా నియమించేందుకు నిర్వహించేది టీఆర్టీ. అలాంటప్పుడు రెండింటినీ కలిపి ఎలా నిర్వహిస్తారు. కోచింగ్ తీసుకొని, బిట్స్ బట్టీ పట్టి వచ్చే వారికి ఉద్యోగాలు వస్తాయి. అలాంటి వారు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దుతారు. అందుకే టెట్ వేరుగానే ఉండాలి. నియామక పరీక్షను కఠినతరం చేయాలి. డిస్క్రిప్టివ్ విధానం ఉండాలి. క్లాస్‌రూం డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ పద్ధతిలో టీచర్లను నియమించాలి. అప్పుడే వారికి సామర్థ్యాలు ఉన్నాయా.. లేదా? తెలుస్తాయి. - ఉపేందర్‌రెడ్డి, ఎస్సీఈఆర్టీ రిటైర్డ్ ప్రొఫెసర్ చదవండి: ఆదమరిస్తే అంతే! -
టెట్, డీఎస్సీ, బదిలీలు, భర్తీ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే నాడు–నేడు ద్వారా 45 వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్న విషయం తెలిసిందే. రన్నింగ్ వాటర్‌తో మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం, కుర్చీలు, బెంచీలు, ర్యాకులు, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు మరమ్మతులు, రంగులు ఇలా పలు రకాల సదుపాయాలు కల్పిస్తుండగా మొదటి దశ కింద 15 వేలకు పైగా స్కూళ్లలో పనులు మార్చి ఆఖరుకు పూర్తిచేయనున్నారు. ఇతర దశల పనులకు సంబంధించి కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు కూడా విద్యాశాఖ కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే తదుపరి చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. తొలుత ‘టెట్’ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ ప్రకటించటానికి ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. 2018లో టెట్ రెండుసార్లు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆ పరీక్షలు జరగలేదు. డీఎడ్ పూర్తిచేసిన కొత్త బ్యాచ్‌ల అభ్యర్థులు టెట్ కోసం నిరీక్షిస్తున్నారు. వారు డీఎస్సీకి దరఖాస్తు చేయాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరి కావడంతో తొలుత టెట్ నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గతంలో రాసినవారితోపాటు ఏడేళ్ల కాలపరిమితి దాటిన వారు (గతంలో ఉత్తీర్ణులు) ఈసారి టెట్ పరీక్షకు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉంది. గతంలో టెట్‌కు 3,97,957 మంది దరఖాస్తు చేయగా 3,70,576 మంది హాజరయ్యారు. ఈసారి ఈ సంఖ్య 5 లక్షలకు పైగా ఉండే అవకాశముంది. ఆంగ్ల నైపుణ్యాలకు పరీక్ష టెట్, డీఎస్సీ సిలబస్‌లో ఈసారి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం నేపథ్యంలో ఇంగ్లీషులో అభ్యర్థుల బోధనా నైపుణ్యాలను పరీక్షించేలా చర్యలు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి టెట్‌లో ఇంగ్లీషు ప్రొఫిషియన్సీ కింద అదనంగా పరీక్ష నిర్వహించనున్నారు. ఈమేరకు పాఠశాల విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సిలబస్ రూపొందిస్తోంది. పాఠ్యపుస్తకాల్లో అంశాలను కూడా గత ఏడాది మార్పు చేసినందున డీఎస్సీ సిలబస్‌లోనూ మార్పులు జరగనున్నాయి. మరోసారి బదిలీలకు అవకాశం! టెట్ –2021 నిర్వహించిన అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులో ఉన్న ఖాళీలన్నిటినీ భర్తీ చేసేలా పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఈ డీఎస్సీలో ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చే ముందు మరోసారి టీచర్ల బదిలీలకు అవకాశం కల్పించనున్నారు. ఇటీవల బదిలీల సందర్భంగా మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీల్లోని పాఠశాలల్లో టీచర్ స్థానాలు ఖాళీ అయిపోకుండా విద్యాశాఖ దాదాపు 15 వేల వరకు పోస్టులను బ్లాక్ చేసి ఉంచింది. ఈ పోస్టులను ఇప్పటికే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న, సర్వీసులో ఉన్న టీచర్లతో సీనియార్టీని అనుసరించి భర్తీ చేయనున్నారు. ఇందుకు అనుగుణంగా బదిలీలకు అవకాశం కల్పిస్తారు. ఈ బదిలీల ప్రక్రియ అనంతరం డీఎస్సీలో ఎంపికైన కొత్త టీచర్లకు గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వనున్నారు. ప్రత్యేక కేటగిరీ పోస్టుల భర్తీ ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకోసం 2018లో నిర్వహించిన ప్రత్యేక డీఎస్సీలో 403 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా కొన్ని మాత్రమే భర్తీ అయ్యాయి. వాటికి మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. 2018 జనరల్ డీఎస్సీకి సంబంధించి పలు న్యాయవివాదాలు తలెత్తడంతో ఆ పోస్టుల భర్తీ విద్యాశాఖకు కత్తిమీద సాములా మారింది. వివాదాలను ఒక్కొక్కటే పరిష్కరిస్తూ దాదాపు అన్ని పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇచ్చారు. -
టెట్ ఇంకెప్పుడో..! అభ్యర్థుల్లో ఆందోళన
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్ష (టీఆర్టీ) రాయాలంటే కచ్చితంగా ఉండాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై అడుగులు ముందుకు పడట్లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సీఎం ఆదేశాలు జారీ చేసి నెల కావొస్తున్నా టెట్ నిర్వహణపై ఉన్నత స్థాయిలో ఎలాంటి కదలిక లేదు. టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే అందుకు అవసరమైన కార్యాచరణ ఒక్కటీ మొదలు కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాకముందే టెట్ నిర్వహించాలని అభ్యర్థులకు కోరుతున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి ఖాళీల వివరాలను విద్యా శాఖ ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది. ఇప్పటివరకు వాటికి ఇంకా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ ఆమోదం వస్తే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ప్రస్తుతం టెట్ నిర్వహించకుండా ముందుకు పోతే లక్షల మంది పోస్టుల భర్తీకి దూరం అయ్యే ప్రమాదం నెలకొంది. నెలన్నరలో వ్యాలిడిటీ ముగింపు.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టెట్ వ్యాలిడిటీ ఏడేళ్లు. 2011 నుంచి రాష్ట్రంలో నిర్వహించిన ఆరు టెట్లలో మూడు టెట్ల (2011 ఒకసారి, 2012లో రెండుసార్లు) వ్యాలిడిటీ ఇప్పటికే ముగిసిపోయి 4 లక్షల మంది అభ్యర్థులు టెట్ అర్హత కోల్పోయారు. ఇక 2014 మార్చి 16న నిర్వహించిన టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ వచ్చే మార్చి 16వ తేదీతో ముగియనుంది. అందులోనూ మరో 1.5 లక్షల మంది అభ్యర్థులు అర్హతను కోల్పోతారు. మరోవైపు రాష్ట్రంలో 2015లో ఒకసారి టెట్ నిర్వహించగా, 2017లో చివరి టెట్‌ను నిర్వహించారు. ఏటా రెండు సార్లు నిర్వహించాల్సిన టెట్‌ను గత మూడేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. దీంతో గడిచిన మూడేళ్లలోనూ మరో 1.5 లక్షల మంది బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు అసలు టెట్ రాయలేదు. ఇప్పుడు వారంతా టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా మొత్తం దాదాపు 5.5 లక్షల మంది అభ్యర్యుర్థులకు టెట్ కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గత నెలలోనే ఓకే చెప్పిన నేపథ్యంలో వెంటనే టెట్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. టెట్ నిర్వహించకుండా టీఆర్టీ నోటిఫికేషన్ వస్తే తమకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలలు అవసరం.. రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష నిర్వహణ, ఫలితాల వెల్లడికి కనీసం 3 నెలల సమయం పడుతుంది. అందుకే విద్యా శాఖ త్వరగా టెట్ నిర్వహణకు చర్యలు చేపడితేనే తమకు టీఆర్టీ రాసే అవకాశం వస్తుందని పేర్కొంటున్నారు. మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్? టీఆర్టీ నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యా శాఖ ఇప్పటివరకు ఉన్న ఖాళీల వివరాలను ఆర్థిక శాఖకు పంపింది. ఇప్పటికిప్పుడు 8 వేల పోస్టులు భర్తీ చేయొచ్చని పేర్కొంది. మరోవైపు ఉపాధ్యాయుల పదోన్నతుల కోసం ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపించింది. అందులో 8 వేలకు పైగా పోస్టుల్లో పదోన్నతులు కల్పించొచ్చని పేర్కొంది. పదోన్నతులు చేపట్టాక టీఆర్టీ నోటిఫికేషన్ ఇస్తే 15 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే వీలుంటుంది. అయితే పదోన్నతుల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి విద్యా శాఖకు ఇంకా ఆమోదం రాలేదు. ఇప్పటికిప్పుడు ఆమోదం తెలిపినా పదోన్నతులు ఇచ్చేందుకు కనీసం 15 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం అవుతుంది. అయితే ఫిబ్రవరి మొదటి వారంలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే ఫిబ్రవరిలో టీఆర్టీ నోటిఫికేషన్ జారీ కుదరదు. ఇక మార్చి తర్వాతే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో వీలైనంత త్వరగా టెట్ నిర్వహిస్తే తాము టీఆర్టీకి సిద్ధం అయ్యేందుకు సమయం దొరుకుతుందని అభ్యర్థులు పేర్కొంటున్నారు. -
2021లో ఉద్యోగ జాతర
సాక్షి, అనంతపురం విద్య: 2021లో నూతన సంవత్సరం పురస్కరించుకొని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఉద్యోగ జాతర చేయనుంది. ముచ్చటగా స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీ, రెగ్యులర్ డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వనుంది. టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ) అనంతరం రెగ్యులర్ డీఎస్సీ జారీ చేయనుంది. స్పెషల్ డీఎస్సీ, లిమిటెడ్ డీఎస్సీల నోటిఫికేషన్లకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థికి టెట్ (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) అర్హత తప్పనిసరి. ఒక సారి టెట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే ఉపాధ్యాయ ఉద్యోగ నియామక పరీక్ష రాయడానికి అర్హత వస్తుంది. గతంలో 20 శాతం టెట్‌కు, 80 శాతం వెయిటెజీ డీఎస్సీకి ఇచ్చారు. తప్పనిసరిగా ఎన్సీటీఈ మార్గదర్శకాలను అనుసరించి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన నిర్ణయాలను అనుసరిస్తోంది. ఈక్రమంలో ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఎస్సీఈఆర్టీ టెట్ సిలబస్ రూపకల్పన పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత సిలబస్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. టెట్‌లో ఈ దఫా ఇంగ్లిష్‌కు అధికంగా వెయిటేజీ కల్పించనున్నారు. దీంతో నూతన సిలబస్‌ను రూపకల్పన చేశారు. ఫిబ్రవరిలోపు లిమిటెడ్ డీఎస్సీ.. గత డీఎస్సీలో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులభర్తీకి లిమిటెడ్ డీఎస్సీ పేరుతో ఫిబ్రవరిలోపు నోటిఫికేషన్ ఇవ్వనున్నా రు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. కొన్ని కేటగిరీల్లో భర్తీకి నోచుకోని దివ్యాంగ, ఓసీ మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీల్లో పోస్టులను జిల్లాలో భర్తీ చేస్తున్నారు. లిమిటెడ్ డీఎస్సీకి సంబంధించి మోడల్ స్కూల్లో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. మోడల్ స్కూల్లో జోన్ వారీగా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో నాలుగో జోన్లో టీజీటీలో 4, పీజీటీలో 68 పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన రోస్టర్ పాయింట్లు రెండు రోజుల్లో నిర్ధారించనున్నారు. మోడల్ స్కూళ్లలో మొత్తం 72 పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ డీఎస్సీ.. దివ్యాంగ విద్యార్థులు, ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు బోధించడానికి స్పెషల్ బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు స్పెషల్ డీఎస్సీ రాయడానికి అర్హులు. ఈ నేపథ్యంలో గతేడాది స్పెషల్ డీఎస్సీ నిర్వహించారు. ఇందులో భర్తీ కాకుండా మిగిలిన పోస్టులు స్పెషల్ డీఎస్సీలో భర్తీ చేస్తారు. గతేడాది నిర్వహించిన స్పెషల్ డీఎస్సీలో 10 పోస్టులు భర్తీ కాలేదు. ఈ 10 పోస్టులకు స్పెషల్ డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారు. స్పెషల్ బీఈడీ/స్పెషల్ డీఈడీ చేసిన వారు మాత్రమే స్పెషల్ డీఎస్సీ రాయడానికి అర్హులు. -
టీఆర్టీ కంటే ముందే టెట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. టెట్ నిర్వహించకుండా పోస్టులను భర్తీ చేస్తే అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ముందుగా టెట్ నిర్వహించడంపై విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కాగా, ప్రస్తుతం ఉపాధ్యాయ ఖాళీలు 8వేల వరకు ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. అయితే వాటిల్లోనూ మార్పులు ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ పాఠశాలల హేతుబద్దీకరణ చేపడితే పోస్టుల సంఖ్య 5వేలకు మించకపోవచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే అర్హత కలిగిన సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తే మాత్రం 12వేలకు పైగా పోస్టులు రావచ్చని వెల్లడించారు. చదవండి: (ఖజానాకు మరో రూ. 1,500 కోట్లు!) లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: డిగ్రీ లెక్చరర్ల బదిలీలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘డిగ్రీ కాలేజీల్లో అర్ధరాత్రి బదిలీలు’శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యా సంవత్సరం మధ్యలో, ప్రభుత్వ ఆమోదం లేకుండా ఎలా బదిలీ చేస్తారని ఉన్నతాధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ బదిలీల వ్యవహారంపై మంగళవారం ఆమె సమగ్రంగా సమీక్షించనున్నారు. మరోవైపు ఈ బదిలీల వ్యవహారంపై ఉన్నతాధికారులు కూడా స్పందించారు. బదిలీలు పొందిన లెక్చరర్లను రిలీవ్ చేయవద్దని సోమవారం ఆదేశాలు జారీచేశారు. అయితే అప్పటికే బదిలీ పొందిన లెక్చరర్లంతా కొత్త స్థానాల్లో చేరిపోయారు. దీంతో బదిలీ స్థానాల్లో చేరిన తర్వాత నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వడం ఏంటని మరికొంతమంది లెక్చరర్లు ప్రశ్నిస్తున్నారు. వారిని తిరిగి పాత స్థానాల్లోకి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. -
టెట్టా.. టెట్ కమ్ టీఆర్టీనా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో వాటి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో కోటి ఆశలు వెల్లివిరుస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాటు టీచర్‌పోస్టులు భర్తీచేయకుండా కాలక్షేపం చేసింది. ప్రయివేటుకు ప్రోత్సాహం అందించేందుకు వీలుగా ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు లేక బోధన కుంటుపడినా పట్టించుకోలేదు. గత ఏడాది అక్టోబర్‌లో 7,902 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినా నిబంధనల్లో సమస్యల కారణంగా వాటిపై న్యాయ వివాదాలు ఏర్పడి నేటికీ తేలలేదు. ఈ నేపథ్యంలో ఖాళీ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశించడంతో విద్యాశాఖ ఆ అంశంపై ప్రస్తుతం దృష్టి సారించింది. రానున్న నోటిఫికేషన్ కోసం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ పోస్టుల అర్హతకు అవసరమైన టీచర్ ఎలిజిబులిటీ టెస్టు (టెట్)ను వేరేగా నిర్వహిస్తారా? లేక టీచర్ రిక్రూట్మెంట్తో కలిపి పెడతారా? అని తర్జనభర్జన పడుతున్నారు. గత ప్రభుత్వం తడవకో విధానాన్ని అనుసరించడంతో ఈసారి ఏ విధానం అమలు చేస్తారోనన్న ఆందోళనలో ఉన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీలో నిర్దిష్ట పద్ధతిని పాటించకపోవడంతో అభ్యర్ధుల్లో ఈ గందరగోళం నెలకొంది. టెట్‌ను రిక్రూట్‌మెంటును కలిపేసి.. ఏటా రెండుసార్లు టెట్ పెట్టాల్సి ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ ప్రభుత్వం పెట్టలేదు. అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్ణయించిన పోస్టుల భర్తీకోసం ప్రభుత్వం టెట్‌ను, డీఎస్సీ రెండిటినీ కలిపి 2015లో నిర్వహించింది. ఆ తరువాత మళ్లీ టెట్, డీఎస్సీల ఊసేలేదు. అభ్యర్థుల నుంచి టీచర్ పోస్టుల భర్తీకి ఆందోళనలు రావడంతో 2018 ఫిబ్రవరి, మేలలో టెట్‌ను పెట్టారు. తరువాత డీఎస్సీ–2018కు వచ్చేసరికి విధానాన్ని మార్పుచేశారు. 2018 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంటు, భాషాపండితుల పోస్టులకు రిక్రూట్మెంటు టెస్టును పెట్టారు. బీఈడీ అభ్యర్ధులకు కొత్తగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అవకాశం కల్పిస్తూ ఎన్సీటీఈ నిర్ణయం తీసుకోవడంతో ఎస్జీటీ పోస్టులకు టెట్ కమ్‌టీఆర్టీని పెట్టారు. కాలపరిమితి ముగుస్తుండడంతో.. ఏడేళ్ల కాలపరిమితి నిబంధనతో ప్రస్తుతం 2014 టెట్, 2018 టెట్లలో ఉత్తీర్ణత సాధించిన వారికి మాత్రమే డీఎస్సీకి అర్హత ఉంటుంది. అయితే గతంలో టెట్‌లో ఉత్తీర్ణులై కాలపరిమితి దాటిన వారు, టెట్లలో అర్హత సాధించలేని వారు టెట్ కోసం ప్రస్తుతం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం టెట్‌ను ఏటా నిర్వహించి ఉన్నట్లయితే ఏదో ఒకసారి తాము అర్హత సాధించి టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేదని వారు పేర్కొంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీకి నిర్ణయించడంతో ఈసారి ఏ విధంగా పరీక్ష నిర్వహిస్తారన్న చర్చ వారిలో కొనసాగుతోంది. టెట్‌ను వేరేగా పెడితేనే ఆధ్రువపత్రానికి ఏడేళ్లపాటు వేలిడేషన్ ఉంటుంది కనుక అదే తమకు మేలని వారు అభిప్రాయపడుతున్నారు. టీడీపీ హయాంలో ఒక్కోసారి ఒక్కో విధానం ఉపాధ్యాయ పోస్టుల నియామకాలను గతంలో డీఎస్సీ ద్వారా ఎంపిక పరీక్ష నిర్వహించి భర్తీ చేసేవారు. జాతీయ విద్యాహక్కు చట్టం ఏర్పాటు తరువాత టీచర్‌పోస్టుల ఎంపికకు టీచర్ ఎలిజిబులిటీ టెస్టును నిర్వహించాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. ఏ రాష్ట్రమైనా టీచర్ ఎలిజిబులిటీ టెస్టును తప్పనిసరిగా పాటించాలని అందులో పేర్కొన్నారు. ఈ టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే టీచర్ పోస్టులకు అర్హులవుతారు. ఆయా రాష్ట్రాలు టీచర్ పోస్టుల భర్తీకి తమతమ పద్ధతుల్లో ఎంపిక పరీక్షలు నిర్వహించినా టెట్ పాసైన వారిని మాత్రమే వాటికి అనుమతించాలి. టెట్ పాసైన వారికి ఆ ధ్రువపత్రం చెల్లుబాటు ఏడేళ్ల వరకు ఉంటుంది. అయితే తమిళనాడు ప్రభుత్వం తాను ప్రత్యేక పరీక్ష నిర్వహించకుండా టెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగానే ఎంపికలు నిర్వహించగా, బీహార్ వంటి కొన్ని రాష్ట్రాలు టెట్‌ను లేకుండా నేరుగా తమ ఎంపిక పరీక్షల ద్వారానే టీచర్‌పోస్టుల భర్తీ చేపట్టాయి. దీంతో టీచర్ పోస్టులకు ఈ అర్హత పరీక్ష తప్పనిసరిగా నిర్వహించాల్సిందేనని ఎన్సీటీఈ ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి ఏపీలో కూడా 2009లో విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా 2011 జులైలో మొదటి టెట్‌ను, 2012 జనవరిలో రెండో టెట్‌ను, అదే ఏడాది జూన్‌లో మూడో టెట్‌ను నిర్వహించారు. ఆ తరువాత 2013లో టెట్ నోటిఫికేషన్ వచ్చినా ఆ పరీక్షను మళ్లీ 2014 మార్చిలో పెట్టారు. ఈ టెట్‌లో పేపర్1లో 40,688 మంది, పేపర్2లో 115510 మంది అర్హత సాధించారు. -
టెట్ నిర్వహణకు చర్యలు చేపడతాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అన్ని చర్యలు చేపడతామని విద్యాశాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలపై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా టెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 2 టెట్ల వ్యాలిడిటీ ముగిసిపోయిందని, జూన్ గడిస్తే మరో టెట్ వ్యాలిడిటీ ముగిసిపోతుందని, ఇక టెట్ ఎప్పుడు నిర్వహిస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో అనాథ పిల్లలు అనే వారే ఉండకూడదని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. పాఠశాలల్లో డ్రాపవుట్స్, ఔట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్స్ లేకుండా చూడాలన్నారు. బడి మానేసే వారు ఎందుకు మానేశారో తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు అనాథలుగా ఉండటానికి వీల్లేదని, ప్రభుత్వం వారిని అక్కున చేర్చుకుంటుందన్నారు. గురుకులాల్లో సీట్లు లేకపోయినా అలాంటి వారిని చేర్చుకునేలా సీఎం కేసీఆర్‌తో చర్చించి ప్రత్యేక ప్రవేశాలకు చర్యలు చేపడతామన్నారు. ప్రభుత్వ విద్యపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా ప్రమాణాల పెంపునకు కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. మన విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడేలా తీర్చిదిద్దాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, అధ్యాపకుల నియామకాలకు చర్యలు చేపడతామన్నారు. ఇతర దేశాలతో పోల్చినా మన రాష్ట్రంలోనే అత్యధికంగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:17 ఉందన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు.. నాలుగేళ్లలో పరీక్షల నిర్వహణలో మార్పులు తెచ్చామని, ఈసారీ పరీక్షలను పక్కాగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందనారు. ఈసారి సీఎం కేసీఆర్ ప్రాధాన్య అంశాల్లో విద్య కూడా ఉందన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే మంత్రులు, ఎంఎల్ఏల కాలేజీలను మూసేసిన సందర్భాలు ఉన్నాయన్నారు. నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు తప్పవన్నారు. సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యను అందించాలని, అందుకు అవసరమైన మార్పులను సిలబస్‌లో తీసుకురావాలని అన్నారు. నాలుగేళ్లలో చేపట్టిన సంస్కరణల వల్ల ఇంజనీరింగ్ విద్యలో ప్రమాణాలు పెరిగాయన్నారు. ఇంటర్లో ఆన్లైన్ ప్రవేశాలపై స్పందిస్తూ అవి కాలేజీల వారీగానే ప్రవేశాలు ఉంటాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు చేపడతామన్నారు.ప్రైవేటు వర్సిటీల చట్టం తెచ్చామని, నిబంధనలను రూపొందించి ప్రైవేటు వర్సిటీలకు అనుమతిస్తామన్నారు. ఇంటర్మీడియట్ హాల్టికెట్లలో తప్పుల విషయంలో స్పందిస్తూ ఎవరైనా విద్యార్థులకు నష్టం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు చేపడతామన్నారు. డిగ్రీలు పూర్తయ్యాక కూడా యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవన్నారు. మీడియంపై లోతుగా పరిశీలన తల్లిదండ్రులు ఇంగ్లిష్ మీడియం విద్యను కోరుకుంటుండగా, ప్రాథమిక విద్య మాతృభాషలోనే జరగాలన్న వాదనలు ఉన్నాయని, దీనిపై ఉన్నతస్థాయిలో మరింత లోతుగా చర్చించాల్సి ఉందన్నారు. సీఎం కేసీఆర్‌తో చర్చించి మరోసారి సమావేశం నిర్వహించి తగిన చర్యలు చేపడతామన్నారు. మహిళా యూనివర్సిటీ విషయంలో తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. విద్యకు బడ్జెట్లో ఎక్కువ నిధులే కేటాయించామని, అయితే అవి విద్యాశాఖ పేరుతో రానుందున అలా భావిస్తున్నారన్నారు. పాఠశాలల్లో టాయిలెట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించామని, మిషన్ భగీరథ ద్వారా ప్రతి పాఠశాలకు మంచి నీటి కనెక్షన్ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, యూనివర్సిటీ వైస్ చాన్సలర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పరిశీలనలో టెట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేందుకు విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రతి ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే 2011లో నిర్వహించిన మొదటి టెట్ వ్యాలిడిటీ గతేడాదితో ముగిసిపోయింది. 2012 జనవరిలో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ కూడా గత నెలతోనే ముగిసిపోయిం ది. ఇక 2012 జూన్‌లో నిర్వహించిన టెట్ వ్యాలిడిటీ వచ్చే జూలై నెలతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం వస్తుందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం కనుక అనుమతిస్తే వార్షిక పరీక్షల తరువాత వచ్చే మే నెలలో టెట్‌ను నిర్వహించే అవకాశాలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడితే టెట్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లో బోధించాలన్నా టెట్‌లో అర్హత సాధించి ఉండాల్సిందే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన 2011 టెట్, 2012 జనవరి, జూన్లలో నిర్వహించిన టెట్‌లకు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో సగం మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అయినందున తెలంగాణ విద్యార్థులు కనీసంగా 6 లక్షల వరకు ఉంటారు. వారిలో తమ టెట్ 7 ఏళ్ల వ్యాలిడిటీ కోల్పోయిన వారు కనీసంగా 2 లక్షల మంది వరకు ఉండే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఉంది. దీంతో తమ స్కోర్‌ను పెంచుకునేందుకు టెట్‌కు హాజరయ్యే వారు మరో 2 లక్షల మందికిపైగా ఉండే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం టెట్కోసం దాదాపు 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టెట్ నిర్వహణకు అనుమతించాలని విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. -
స్పెషల్ డీఎస్సీ కోసం ఆందోళన
పాడేరు రూరల్: ఐటీడీఏ పరిధిలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్పెషల్ డీఎస్సీ నిర్వహించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అరుకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు తెడబారికి సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. టెట్ క్వాలీఫైడ్ డీఎడ్ అభ్యర్థులు బుధవారం పాడేరులో భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పాత బస్టాండ్ నుంచి సినిమాహాల్ సెంటర్ మీదుగా ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఐటీడీఏ కార్యాలయం వద్ద బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సురేష్‌కుమార్ మాట్లాడారు. బీఎడ్ చది విన వారికి కూడా ఎస్జీటీ పోస్టుల్లో అవకాశం కల్పి స్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోట్‌ను వెనక్కి తీసుకోవాలని, స్పెషల్ డీఎస్సీ కోసం వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి డీఎడ్ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అనంతరం ఐటీడీఏ ఇన్చార్జీ పీవో డీకే బాలాజీకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గిరిజన నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు కె.వై.కుమార్, కార్యదర్శి టి.విజయ్‌కుమార్, నాయకులు కె.కుస్టో, సోమేష్, డి.ధనురాష్, శ్యామ్యుల్, ఏజెన్సీ 11 మండలాల నుంచి డీఎడ్ అభ్యర్థులు పాల్గొన్నారు. -
టెట్‌ను రద్దు చేస్తారా.. దూకేయమంటారా ?
ఒంగోలు: అక్రమాల టెట్‌ను రద్దు చేస్తారా..లేక ఓవర్‌హెడ్ ట్యాంక్‌పై నుంచి కిందకు దూకేయమంటారా..అంటూ దాదాపు 100 మంది పీఈటీ టెట్ అభ్యర్థులు ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో స్థానిక అద్దంకి బస్టాండ్‌లోని ఓవర్‌హెడ్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో ఒన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని దిగిరావాలంటూ సూచించారు. టీడీపీ నాయకురాలితో వాగ్వాదం ఓవర్‌హెడ్ ట్యాంక్ ఎక్కి ఆందోళన చేయడం సరికాదని, సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు అందరు దిగి రావాలంటూ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఈ సందర్భంలో అభ్యర్థులు ససేమిరా అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నాయకురాలు ఒకరు వచ్చి ఎమ్మెల్యేతో మాట్లాడుదాం రండి.. అంటూ సూచించారు. ఈ క్రమంలో అభ్యర్థులు అసహనానికి గురయ్యారు. తమ ఓట్ల కోసం ఇళ్లకు వస్తారు.. ఇంతమందిమి ఆందోళన చేస్తుంటే వచ్చి తమ సమస్యను వినేందుకు ఓపిక లేదా.. ఎమ్మెల్యే అయినా.. ఎమ్మెల్సీ అయినా.. మంత్రి అయినా ఇక్కడకే రావాలంటూ పట్టుబట్టారు. జిల్లాలో 1200 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది అభ్యర్థులు ఉన్నారని పేర్కొన్నారు. నిజంగా తమ సమస్య పరిష్కారం కోరుకునే వారే అయితే తమకు సంఘీభావంగా తమతో పాటు బైఠాయించి ప్రజానాయకులను రప్పించి హామీ ఇప్పించాలని పట్టుబట్టారు. ముందస్తు జాగ్రత్తలో పోలీసులు ఒక వైపు మహిళా నాయకురాలితో అభ్యర్థులు మాట్లాడుతుండగానే పోలీసులు ఓవర్‌హెడ్ ట్యాంక్‌పైకి చేరుకున్నారు. అభ్యర్థులకు నచ్చజెప్పి కిందకు దింపేందుకు యత్నించారు. అభ్యర్థులు మెట్ల మీదనే బైఠాయించి దిగకపోవడంతో పోలీసులు కూడా చేసేది లేక దిగువవున ఉన్న వారితో చర్చలు మొదలు పెట్టారు. అభ్యర్థులు మీడియా ఎదుట తమ సమస్యను ఏకరువు పెట్టారు. ఎస్సీఈఆర్టీ ప్రకారం పీఈటీ అభ్యర్థులకు టెట్ ఉండదన్నారు. కేంద్రం స్థాయిలో సైతం కేవలం సిటెట్ మాత్రమే ఉంటుందని, ఒకసారి ఉత్తీర్ణత సాధిస్తే మరోమారు హాజరు కావాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నూతనంగా టెట్ అనే పరీక్ష తీసుకొచ్చి దానికి వెయిటేజీ నిర్ణయించి నిరుద్యోగులను దగా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. టెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమేనని, దానికి వెయిటేజీ కేటాయించడంలోనే అక్రమాలకు మార్గం సుగమం అయిందన్నారు. వెయిటేజీ కోసం టెట్ పరీక్ష నిర్వహించిన ప్రతిసారీ నిరుద్యోగి రూ.500 పరీక్ష ఫీజు, అప్లోడింగ్ కోసం కంప్యూటర్ సెంటర్లలో వంద రూపాయలతో పాటు కోచింగ్ కోసం కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు వెచ్చించాల్సి రావడం, మరో వైపు ఉపాధి కూడా కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులు చాలవన్నట్లు ఈ నెల 19న జరగాల్సిన పీఈటీ టెట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు మీడియాలో రావడం తమను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ప్రధానంగా ఒక పీఈటీ రింగ్ లీడర్‌గా వ్యవహరించి ఎవరైతే అక్రమంగా పరీక్షలో పూర్తిస్థాయి మార్కులు రావాలని భావించారో వారికి తమిళనాడులో ఒకే సెంటర్ వచ్చేలా చేశారని, తద్వారా తాము ఎంత బాగా రాసినా లీకైన పేపర్ ద్వారా వారు పూర్తి మార్కులు సాధించి డీఎస్సీలో ఉద్యోగాలన్నీ కైవసం చేసుకోవడం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తమిళనాడు, బెంగళూరు, తెలంగాణలోని సెంటర్లకు దరఖాస్తు చేసుకున్న ఏపీ పీఈటీ అభ్యర్థులకు ఏపీలోని సెంటర్లనే కేటాయించాలని, గతంలో కేటాయించిన ప్రశ్నపత్రాన్ని మార్చి వేసి నూతన ప్రశ్నపత్రాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. టెట్‌కు వెయిటేజీని రద్దు చేయాలన్నారు. టెట్ నోటిఫికేషన్, టెట్ పరీక్షకు మధ్య సమయం కూడా పెంచాలంటూ నినాదాలు చేశారు. ఎట్టకేలకు ఆందోళన విరమణ సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి జరిపిన చర్చలు చివరకు ఫలించాయి. తొలుత జేసీతో మాట్లాడించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తీరా ఆమె కూడా అందుబాటులో లేరని తెలియడంతో మరోసారి అభ్యర్థులు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం గ్రీవెన్స్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకు పోలీసులు కూడా గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తో మాట్లాడించేందుకు అనుమతిస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు ఓవర్ హెడ్ ట్యాంక్‌పై నుంచి దిగి వచ్చారు. -
టెట్ రాసి వస్తూ..
కోట: టెట్ రాసి వస్తూ.. అనుమానాస్పదస్థితిలో ఓ యువతి మృతి చెందగా, ఆమెకు తోడుగా వెళ్లిన అత్త తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మండలంలోని చిట్టేడు వద్ద గురువారం రాత్రి జరిగింది. పోలీసులు, యువతి బంధువుల సమాచారం మేరకు.. చిల్లకూరు మండలం అన్నంబాక గ్రామానికి చెందిన బొమ్మిళ్ల పెద్దసుబ్బయ్య,లక్ష్మమ్మ కుమార్తె నాగరాజమ్మ (25) ఎంఏ, బీఈడీ చేసి ఉద్యోగ వేటలో ఉంది. గురువారం కావలి సర్వోదయ కళాశాలలో టెట్ రాసేందుకు ఆమె అత్త సుబ్బమ్మను తోడుతీసుకుని వెళ్లింది. మధ్యాహ్నం పరీక్ష రాసిన అనంతరం నెల్లూరులో వాకాడు డిపో ఎక్స్‌ప్రెస్ సర్వీసు ఎక్కారు. చిట్టేడు వరకు బస్సు టికెట్ తీసుకున్నారు. చిట్టేడులో బస్సు దిగి అన్నంబాకకు వెళ్లాల్సి ఉంది. అయితే చిట్టేడు స్టాపింగ్ వద్ద బస్సు ఆగకుండా వెళ్లిపోయింది. ఆలస్యంగా గుర్తించిన కండక్టర్ వారిని చంద్రశేఖరపురం వద్ద దించి వెళ్లినట్లు సమాచారం. అప్పటికే రాత్రి 10 గంటలు అయింది. దీంతో నాగరాజమ్మ తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి చిట్టేడు వద్దకు వచ్చి తమను తీసుకెళ్లాలని చెప్పింది. అయితే 10.30 గంటల సమయంలో చిట్టేడు ప్రధాన రహదారిపై మహిళ అరుపులు వినపడడంతో స్థానికులు గుమికూడారు. రక్తపు మడుగులో పడి ఉన్న నాగరాజమ్మను గుర్తించారు. ఆమె కు కొద్ది దూరంలోనే ఆమె అత్త సుబ్బమ్మ పడి ఉంది. వారిని వెంటనే ప్రైవేట్ వాహనంలో నెల్లూరుకు చికిత్స కోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగరాజమ్మ మృతి చెందగా ఆమె అత్త సుబ్బమ్మ అపస్మారకస్థితిలో ఉంది. ఘటనపై పలు అనుమానాలు చిట్టేడు దాటి రెండు కిలో మీటర్లు వచ్చేసిన వీరు చంద్రశేఖరపురం వద్ద దిగారు. వెనక్కి వెళ్లేందుకు రోడ్డుపై వెళ్లే వ్యాన్ వంటి వాహనం ఆపి అందులో ఎక్కినట్లు తెలుస్తోంది. చిట్టేడు వద్ద వాహనంలో నుంచి ఆ ఇద్దరిని గెంటి వేసినట్లు ప్రమాదం తీ రును బట్టి తెలుస్తోంది. కింద పడటంతో నాగరాజమ్మ తలకు తీవ్రగాయమైంది. ఆగకుండా వెళ్తున్న వాహనంలో నుంచి ఇద్దరు కింద పడడాన్ని చూశామని చిట్టేడు గ్రామస్తులు చెబుతున్నా రు. వాహనంలో ఏం జరిగింది.. వారిని ఎందుకు నెట్టేశారు అనేది అంతుపట్టడం లేదు. ప్రమాదంలో గాయపడిన సుబ్బమ్మ మాట్లాడలేని స్థితిలో ఉంది. ఆమె నోరు విప్పితే ప్రమాదం జరిగిన తీరుపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు. చిట్టేడు నుంచి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు వచ్చిన సంబంధీకులు రక్తపు మడుగులో పడి ఉన్న ఇద్దరిని చూసి స్థానికుల సాయంతో నెల్లూరుకు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాగరాజమ్మ మృతి చెందినట్లు ఆమె బాబాయ్ నాగరాజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్సై నారాయణరెడ్డి తెలిపారు. నాగరాజమ్మ మృతితో అన్నంబాకలో విషాదఛాయలు అలముకున్నాయి. -
‘టెట్’ ఇదేం పని!
పాడేరు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. డీఎస్సీ అర్హత కోసం ముందుగా నిర్వహించే టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)కు ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వడంతో ఏజెన్సీ వ్యాప్తంగా సుమారు 3 వేల మంది అభ్యర్థులు పేపర్–1(ఎస్జీటీ), పేపర్–2(స్కూల్ అసిస్టెంట్), పేపర్–3 (లాంగ్వేజ్ పండిట్) పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తు చేసుకున్న సమయంలో గతంలో మాదిరిగా పరీక్షకు హాజరయ్యే జిల్లా పేరును ఎంచుకోవాలని ప్రస్తావించలేదు. పరీక్ష కేంద్రం జిల్లా కోసం తర్వాత ఆప్షనల్ ఎంచుకోవాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఈ విషయం ముందుగా ప్రకటించకపోవడం తో అభ్యర్థులు పెద్దగా పట్టించుకోలేదు. దరఖాస్తు గడువు ముగిసిన రెండు రోజుల తర్వాత టెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 29 వరకు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలని సెల్ఫోన్లకు మెసెజ్‌లు పంపించింది. సెల్ సిగ్నల్ అందుబాటులో ఉన్న అభ్యర్థులు వెంటనే ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి పరీక్ష కేంద్రాలను ఎంచుకున్నారు. కానీ ఏజెన్సీలో సమాచార వ్యవస్థ పూర్తిగా లేకపోవడంతో మారుమూల గ్రామాల్లో అభ్యర్థులకు ఈ విషయం తెలియలేదు. చివరి రోజు కొంతమంది ఆన్లైన్ సెంటర్లకు వచ్చి సెంటర్లకు ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నించగా విశాఖ జిల్లాల్లో పరీక్ష సెంటర్లు ఖాళీగా లేవని కర్ణాటక, చెన్నై, హైదరబాద్ వంటి ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం వంటి జిల్లాల్లో ఎంపిక చేసుకోవాలని సూచిస్తున్నాయి.దీంతో అభ్యర్థులు షాక్ తిన్నారు. దూరం కారణంగా చాలా మంది అభ్యర్థులు ఆ సెంటర్లను ఎంపిక చేసుకోలేదు. ఈ విషయాన్ని పలువురు అభ్యర్థులు పాడేరు ‘సాక్షి’ కార్యాలయానికి వచ్చి చెబుతూ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పునఃసమీక్ష చేసి విశాఖ జిల్లాలోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం నిరుద్యోగుల జీవితాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి చెట్టి వినయ్ అన్నారు. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న కొందరు గిరిజన అభ్యర్థులు మంగళవారం ఆయనను కలిసి సమస్యను విన్నవించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా గిరిజన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. -
ముగిసిన టెట్ దరఖాస్తు గడువు
అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మొత్తం 3,97,957 దరఖాస్తులు వచ్చాయని, ఈ గురువారంతో టెట్ దరఖాస్తు సమర్పణ గడువు ముగిసిందని ఏపీ ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ..పేపర్1కు 1,69.085 మంది, పేపర్ 2ఏ(సోషల్)కు 66,063, పేపర్2ఏ(మ్యాథ్స్,సైన్స్)కు 76,180 మంది, పేపర్ 2ఏ(ఇంగ్లీషు)కు 11,015 మంది, పేపర్ 2ఏ లాంగ్వేజ్ టీచరల్‌కు 59,469 మంది, పేపర్ 2బీకు 16,145 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చామని తెలిపారు. 4 పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించి అభ్యర్థుల మొబైళ్లకు సంక్షిప్త సందేశాలు పంపామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి29 వరకు ఆన్లైన్లో తమకు నచ్చిన జిల్లా కేంద్రాన్ని అభ్యర్థులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సదరు జిల్లాల్లో అభ్యర్థులు పరిమితికి మించితే తదుపరి జిల్లా కేంద్రం ఎంపిక చేసుకునే వీలు కల్పించినట్లు చెప్పారు.ఇంప్రూవ్ మెంట్ కోసం ఇంతకుముందు టెట్ ఉత్తీర్ణులైన వారు అత్యధికంగా తిరిగి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో మాక్‌టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా వివరించారు. -
అయోమయం..ఆందోళన
కడప, బద్వేలు : డిప్లొమో ఇన్ ఎడుకేష్యన్ (డీఎడ్) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఏడాది విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2016–17 ఏడాదిలో మొదటి సంవత్సరం అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది వారికి నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలు చేపట్టలేదు. ప్రస్తుతం వారంతా రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇవి ముగిసిన మరో మూడు నెలల్లోనే రెండవ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల అనంతరం టెట్‌కు చదవాలా.. రెండవ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధం కావాలా.. అనే సందేహంలో విద్యార్థులు ఉన్నారు డీఎడ్ ప్రవేశాలు 2016–17 విద్యా సంవత్సరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా జూన్ నెలలో జరగాల్సిన అడ్మిషన్లు నవంబరులో జరగడంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో వారికి వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా చదవి పరీక్షలు రాయడం వల్ల ఫలితాల్లో ప్రభావం పడుతుందని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 78 డీఎడ్ కళాశాలలుండగా, వీటిలో 6,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల్లో ఆందోళన.. 2017–18 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు తమకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో అని ఎదురు చూస్తున్నారు. తమ కంటే ముందు చేరిన విద్యార్థులే ప్రస్తుతం మొదటి ఏడాది పరీక్షలు రాస్తున్నారని, తమకు ఎప్పుడు నిర్వహిస్తారో అని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా వీరిలానే ఒకే ఏడాది రెండు పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొంది. రెండవ సంవత్సరం తరగతులు జరుగుతుండగా.. తాము చదివి వదిలేసిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి రావడంతో సన్నద్ధానికి సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉందని వాపోతున్నారు. మండే ఎండలోనే సన్నద్ధం.. సరైన ప్రణాళిక లేకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటిం చడం.. వాటిని కూడా వేసవిలో నిర్వహించడం వి ద్యార్థులకు ఇబ్బందిగా మారింది. మండుటెండల్లో ç పరీక్షలు రాయడం ఫలితాలపై ప్రతికూల ప్రభా వం చూపుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ ఎలా..! ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గతంలో టెట్ అవకాశం కల్పించారు. ప్రస్తుతమూ కల్పించాలని వారంతా కోరుతున్నారు. అవకాశం కల్పిస్తే టెట్‌కు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఆయోమయంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభించి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావని వారు పేర్కొంటున్నారు. -
ఇక డీఎస్సీ హడావుడి
జిల్లాలో ఖాళీల వివరాలుజిల్లాలో 2020 వరకు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయుల ఖాళీలను ప్రభుత్వం సేకరించింది. గత డీఎస్సీలో జిల్లావ్యాప్తంగా మూడు వందల లో పు పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ 104 పో స్టులు, ఎస్జీటీ 206, భాషోపాధ్యాయులు 40, పీఈటీలు 6 ఖాళీలు ఉన్నా యి. ప్రస్తుతం చేపట్టనున్న డీఎస్సీలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కడప ఎడ్యుకేషన్ :రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేయుటకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు జులై 6న ప్రకటన విడుదల కానుంది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో హడావుడి నెలకొంది. ఎలాగైన ఉపాధ్యాయ పోస్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి విద్యావ్యవస్థను పరిపుష్టి చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే పాఠశాలల్లో సమగ్ర కనీస వసతుల కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,300 కోట్లు కేటాయించనున్నారు. అలాగే విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లాకు ఇరువురు డీఈఓలను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఒకరు ప్రాథమిక, మరొకరు ఉన్నత విద్య బాధ్యతలను చూడనున్నారు. అలాగే టెట్, డీఎస్సీ ప్రకటనలకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. టెట్ పరీక్షల షెడ్యూల్ టెట్ ప్రకటనను మే 4న ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫీజును మే 5నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చు. దరఖాస్తులను మే 5 నుంచి 23వ తేదీ వరకూ సమర్పించవచ్చు. నమూనా పరీక్షల (మాక్ టెస్టు) ఏప్రిల్ 25న ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 3 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ 10, 11,12 తేదీల్లో పేపర్ 1, పేపర్–2ఏ పరీక్ష 13,15,17,19 తేదీల్లో, పేపర్ 2బీ పరీక్ష 21న ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ ప్రాథమిక కీ జూన్ 22న, తుది కీ 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. డీఎస్సీకి సంబంధించి డీఎస్సీకి సంబంధించి జూలై 6 ప్రకటన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబం ధించి జూలై 6 నుంచి ఆగష్టు 8 వరకు ఫీ జు చెల్లించవచ్చు. దరఖాస్తులను జూలై 7 నుం చి ఆగష్టు 9 వరకు సమర్పించవచ్చు. నమూనా పరీక్ష (మాక్ టెస్ట్) ఆగష్టు 1వ తేదీ నుం చి ఆన్లైన్లులో అందుబాటులో ఉండనుంది. సంబంధిత పరీక్షకు కావల్సిన హాల్‌టికెట్లను ఆగష్టు 15 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. టీఆర్టీ పరీక్షను ఆగష్టు 23 నుంచి 30 వరకు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత పరీక్షలను కూడా రెండు పూటల నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీ ఆగష్టు 31న విడుదల కానుంది. తుది కీ సెప్టెంబర్ 10న విడుదల చేసి, 15వ తేదీ ఫలితాలను ప్రకటించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. సిలబస్‌ను ప్రకటించాలి డీఎస్సీ ప్రకటన విడుదలపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిలబస్‌ను కూడా ప్రకటిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతోపాటు గతంలో పాఠశాల విద్యాశాఖ వారే పరీక్షను నిర్వహించేవారు. దీంతో సిలబస్‌పై అభ్యర్థులకు కొంత అవగాహన ఉండేది. అలాంటిది ఈ సారి డీఎస్సీని ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. వీరు నిర్వహించే పరీక్షకు సిలబస్ ఏ విధంగా ఉంటుందోనని అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అలాగే సిలబస్ రూపకల్పనలో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యతనిస్తూ నూతన సాంకేతిక సమాచార అంశాలను పొందుపరచాలని అభ్యర్థులు సూచిస్తున్నారు. డీఎడ్ అభ్యర్థులకు మే 17 నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి గడువు చాలా తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస త్వరగా ప్రకటిస్తే మంచిదని సూచిస్తున్నారు. -
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు
-
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ప్రకటన చేశారు. మే 4న టెట్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసకమిషన్ ఆన్లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు. ఆరు కేటగిరీల్లో(ఎస్జీటీ, ఎస్ఏ, పీఈటీ, ఎల్పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెట్, డీఎస్సీల సిలబస్‌ను వారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ : 6-7-2018 దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ హాల్ టికెట్స్ : 15-08-2018 పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు ) ప్రాథమిక కీ : 31-08-2018 అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ ఫైనల్ కీ :10-09-2018 తుది ఫలితాలు : 15-09-2018 ఖాళీల వివరాలు ఎస్జీటీ - 4,967 ఎస్ఏ - 2978 లాంగ్వేజ్ పండిట్స్ - 312 పీఈటీ - 1056 మ్యూజిక్, డాన్స్ - 109 మోడల్ స్కూల్స్ - 929 -
ఏపీలో ఇప్పట్లో డీఎస్సీ లేనట్లే..!
సాక్షి, విజయవాడ: ఈ నెల 29న పదో తరగతి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఏపీ మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సోమవారం విజయవాడలో విద్యాశాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. డీఎస్సీ ఇప్పట్లో లేదని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. డీఎస్సీ కంటే ముందు మరో టెట్ నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు మంత్రి పేర్కొన్నారు. జూన్ 18న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహిస్తామన్నారు. మంత్రి తాజా ప్రకటనతో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకున్నవారికి ఈ ఏడాది కూడా నిరాశ మిగిలింది. -
త్వరలో టెట్ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ జారీపై విద్యా శాఖ దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేందుకు కసరత్తు చేస్తోంది. గతేడాది విద్యా శాఖ జూలై 23న టెట్ నిర్వహించింది. అయితే ఈసారి అంతకుముందే టెట్ నిర్వహించాలని భావిస్తోంది. అంతేకాదు ఈసారి ఆన్లైన్లో టెట్‌ను నిర్వహించే యోచన కూడా చేస్తోంది. అయితే అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో ఆన్లైన్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోంది. ప్రతిపాదనలకు ప్రభుత్వం ఓకే చెప్పగానే నోటిఫికేషన్ జారీ చేస్తామని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గతేడాది టెట్‌లో పేపర్–1 పరీక్ష రాసేందుకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 98,848 మంది హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో 56,708 మంది (57 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్–2 పరీక్ష రాసేందుకు 2,56,265 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. వారిలో కేవలం 45,055 మంది (19.51 శాతం) అర్హత సాధించారు. అంటే రెండు పేపర్లలో కలిపి దరఖాస్తు చేసిన వారిలో ఇంకా 2.5 లక్షల కంటే ఎక్కువ మంది టెట్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) ఫైనలియర్ చదువుతున్న మరో 25 వేల మంది అభ్యర్థులు టెట్ రాయనున్నారు. -
తప్పులు... తిప్పలు...
విజయనగరం అర్బన్:ఉపాధ్యాయ పోస్టుల అర్హతకు నిర్వహిస్తున్న పరీక్ష(టెట్)లో మొదటినుంచీ గందరగోళం చోటు చేసుకుంటోంది. నిర్వాహకుల నిర్లక్ష్యం అభ్యర్థుల పాలిట శాపంగా మారుతోంది. ఇప్పటికే ప్రకటించిన మార్కులు తారుమారయిన విషయంతో ఆందోళన చెందుతున్న అభ్యర్థులకు వాటి సవరణ ప్రక్రియలోనూ తిప్పలు తప్పడం లేదు. జవాబులు, మార్కులు చూసుకొని తప్పులుంటే అభ్యర్థులు సవరణకు విన్నవించుకోవడానికి వీలుగా టెట్ నిర్వాహకులు వెబ్ సైట్‌ను రూపొందించి ప్రకటించారు. ఈ మేరకు ఈ నెల 22 నుంచి నెలాఖరు వరకు ఫిర్యాదు ఇచ్పుకోవాలని షెడ్యూల్ ప్రకటించారు. ప్రకటించి నాలుగు రోజులవుతున్నా సంబంధిత వెబ్సైట్ తెరుచుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు టెట్ హెల్ప్‌లైన్(ఫోన్ నంబర్: 9121148061) కేంద్రం నుంచి సందేహాలను తీర్చడం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌కి సంబంధించిన పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరై తమ ప్రతిభను ప్రదర్శించుకున్నారు. పనిచేయని వెబ్సైట్... నెల్లిమర్లకు చెందిన పేపర్–3 హిందీ సబ్జెక్ట్ అభ్యర్ధి పి.సునీత ప్రాధమిక ‘కీ’ అభ్యంతరాలపై విడుదల చేసిన ‘కీ’ అనుసరించి 100 మార్కులకు పైగా రావాల్సి ఉన్నా ఆమె క్వాలిఫై కానట్టు తేల్చారు. దీనిపై ఆమె టెట్‌కు సంబంధించిన వెబ్సైట్లో ఫిర్యాదు చేయగా వారు పంపించిన మార్కులుగాని, జవాబు పత్రంగానీ తనకు సంబంధించినది కాకుండా వేరేది ఇచ్చారు. ఈ సమస్యను తిరిగి చెప్పుకోవడానికి నిర్వాహక వ్యవస్థ అందుబాటులో లేదు. ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నవారు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఈ విషయంలో టెట్ నిర్వాహక హెల్ప్‌లైన్ సెంటర్‌కు తెలియజేసినప్పటికీ వారి నుంచి స్పందన లభించలేదని వాపోతున్నారు. రెండురోజులుగా ప్రయత్నిస్తే ఎట్టకేలకు కొందరికి అదృష్ట వశాత్తూ ఫోన్ పలికినా అటునుంచి అసహన సమాధానం వచ్చిందని చెబుతున్నారు. ఫిర్యాదుల సవరణకు ఈ నెల 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉండటంతో సమస్య ఎలా పరిష్కారం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు దిద్దలేనపుడు టెట్ మరలా జరపాలి పేపర్–3 హిందీ సబ్జెక్ట్ టెట్ రాశాను. ప్రాధమిక ‘కీ’కి వెబ్సైట్లో పెట్టిన నా జవాబు పత్రానికి సంబంధం లేదు. ఈ తప్పిదాన్ని సవరించాలని కోరుతూ నిబంధనల మేరకు రూ.200లు ఆన్లైన్లో రుసుం చెల్లించాను. ఈ నెల 31లోపు గడువుగా ప్రకటించారు. ఇంత వరకు సంబంధిత వెబ్సైట్ ఓపెన్ కావడంలేదు. హెల్ప్‌లైన్ సెంటర్లో టెట్ నిర్వాహకుల సమాధానాలు నిర్లక్ష్యంగా వస్తున్నాయి. అభ్యర్థుల సందేహాలు తీర్చలేకపోతే టెట్ని మరలా జరిపి న్యాయం చేయాలి. – పి.సునీత, టెట్ అభ్యర్థిని, నెల్లిమర్ల -
టెట్ పాసైన గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ
ఒంగోలు సెంట్రల్: గత ఏడేళ్లలో టెట్‌లో అర్హత సాధించి 2018 డీఎస్సీ పరీక్ష రాయబోయే గిరిజన యువతీ, యువతకులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇన్చార్జి అధికారి బి.శివయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు, వెంకటాచలం మండలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో 2 నెలల పాటు ఉచిత భోజనం, వసతి కల్పిస్తూ శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26న నెల్లూరు ఐటీడీఏ కార్యాలయంలో ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు, ఆధార్ కార్డు, మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రంతో అభ్యర్థులు రావాలని సూచించారు. ఇతర వివరాలకు 81878 99877 సెల్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
‘టెట్’ ర్యాంకుల్లో గందరగోళం!
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష ర్యాంకుల్లో గందరగోళం నెలకొంది. పేపర్–1, పేపర్–2, పేపర్–3 పరీక్షల్లో మీడియంల వారీగా అత్యధిక మార్కులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పేపర్–3 ఇంగ్లిష్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 122 మార్కులే టాప్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని మంగళవారం పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. కాగా అనంతపురం నగరంలోని తేజ కోచింగ్ సెంటర్ విద్యార్థి అంకే వెంకటేష్ పేపర్–3 ఇంగ్లిష్‌లో 125 మార్కులు సాధించాడు. ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలో 122 మార్కులే అధికమని ప్రకటించిందని, తాను 125 మార్కులు సాధించానని వెంకటేష్ పేర్కొన్నారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ ప్రతి అంశంలోనూ గందరగోళమేనని అభ్యర్థులు వాపోయారు. చివరకు ఫలితాలు వచ్చిన తర్వాత మార్కుల ప్రకటించడంలోనూ అదే గందరగోళం నెలకొందని అభ్యర్థులు మండిపడుతున్నారు. -
టెట్‌లో జిల్లా సూపర్‌హిట్
శృంగవరపుకోట రూరల్ : ధర్మవరం మేజరు పంచాయతీకి చెందిన వేమన కుసుమ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) 150/139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జిటి) టెట్ ఫలితాల్లో పేపర్ 1లో 139 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. డైట్ పోటీ పరీక్షల్లో కూడా ఈమె జిల్లా ప్రథమ స్థానంలో నిలిచి నెల్లిమర్ల మండలం వేణుగోపాలపురంలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా శిక్షణ పొందింది. తండ్రి అప్పలరాజు ధర్మవరంలో టైలర్‌గా పనిచేస్తుండగా తల్లి సన్నమ్మడు గృహిణి. ఈ సందర్భంగా అప్పలరాజు విలేకరులతో మాట్లాడుతూ తనకు ముగ్గురు కుమార్తెలున్నారని,, రెండో కుమార్తె కుసుమ చిన్నప్పటి నుంచి చదువులో చక్కని ప్రతిభ కనబరుస్తూ అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానాలు సాధించిందని తెలిపారు. ఆమెను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, స్థానికులు అభినందించారు విజయనగరం అర్బన్: ఉపాధ్యాయ పోస్టుల నియామక పరీక్షకు అర్హత కోసం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)లో జిల్లా అభ్యర్థులు భారీ సంఖ్యలో అర్హత సాధించారు. పరీక్ష ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. పేపర్–1, 2, 3 అభ్యర్థులను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా 15,331 మంది దరఖాస్తు చేసుకోగా 94.08 శాతంతో 14,423 మంది హాజరయ్యారు. తాజాగా అందిన సమాచారం మేరకు 80 శాతం అర్హత సాధించి ఉంటారని తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్వహించిన వివిధ శిక్షణ కేంద్రాల అభ్యర్థులు అధికసంఖ్యలో అర్హత సాధించారు. తాజాగా అందిన సమాచారం మేరకు పేపర్–1 కి సంబంధించి అధిక మార్కులు సాధించిన వారి వివరాలివి. వినెక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు అల్లాడ లావణ్య (137), రొబ్బి జ్యోతి (132), మెయిద కృష్ణవేణి (130), బాలి కుమారి (130) ఉన్నారని ఆ సంస్థ డైరెక్టర్ సారిపల్లి శ్రీనివాసరావు తెలిపారు. తమ విద్యార్థులు అయ్యప్ప (135), హేమ (133), పిళ్లా జగదీశ్వరి (133), బి.బిందుకుమారి (131), ఎస్.విజయ (131), టి.రోజారమణి (130) ఉన్నారని శ్రీశ్రీ కోచింగ్ సెంటర్ శ్రీనివాసరావు తెలిపారు. అధిక మార్కులు సాధించిన అభ్యర్ధుల వివరాలు ఇంకా సేకరించాల్సి ఉందన్నారు. శ్రీసాహితీ కోచింగ్ సెంటర్, తెలుగు స్టడీ సర్కిల్లకు చెందిన అభ్యర్థుల్లో వాడపల్లి నాగమణి (132), శెట్టి తేజస్వరి (129), లోపింటి రవికుమార్ (129), జి.చిరంజీవి (119) ఉన్నారని ఆ కోచింగ్ సెంటర్ రైరెక్టర్లు రెడ్డిపల్లి రమేష్‌కుమార్, సారిపల్లి గౌరీశంకర్ తెలిపారు. పరీక్షకు హాజరయిన 1200 మందిలో శతశాతం అర్హులయ్యారని తెలిపారు. -
అటెండర్ కుమార్తె స్టేట్ ఫస్ట్
కర్నూలు(సిటీ): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో ఓ అటెండర్ కుమార్తె రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటారు. టెట్ ఫలితాలను రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో కర్నూలు నగరంలోని పూలబజార్‌కు చెందిన సి.పద్మాజీరావు, హేమ దంపతుల కుమార్తె సి.భారతి పేపర్–1లో 150 మార్కులకు 141 సాధించారు. తద్వారా మొదటిర్యాంకు కైవసం చేసుకున్నారు. పద్మాజీరావు చేనేత, జౌళి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. రెండో కుమార్తె సి.భారతి 2014–16 విద్యా సంవత్సరంలో డీఎడ్ పూర్తి చేశారు. టెట్ పరీక్షకు మొదటిసారి హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలోనే అత్యుత్తమ ఫలితాన్ని రాబట్టారు. ఈమె ప్రాథమిక, సెకండరీ విద్య అంతా కర్నూలులోని కింగ్ మార్కెట్ దగ్గర ఉన్న ఉన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్మీడియట్ హజీరా కాలేజీలో పూర్తి చేశారు. పద్మాజీరావు తనలా పిల్లలు ఉండకూడదని, ఉన్నతస్థాయికి ఎదగాలని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. తండ్రి కష్టాన్ని కళ్లారా చూస్తున్న భారతి చిన్నప్పటి నుంచే చదువులో రాణిస్తున్నారు. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె తెలిపారు. టెట్ కోచింగ్‌ను స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని ప్రతిభా కోచింగ్ సెంటర్లో తీసుకున్నారు. ఆరు నెలల పాటు రోజుకు పది గంటల పాటు ప్రిపేర్ అయ్యారు. టెట్ ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు.. పేపర్–1లో జిల్లా అభ్యర్థులు సి.అష్మా (136 మార్కులు), సన శైలజ (133), బోయ శివ (133), కంబహం రోహిణి (132), కురువ హరిప్రసాద్ (132) అత్యుత్తమ మార్కులు సాధించారు. విశ్వవాణి విజయభేరి టెట్ ఫలితాల్లో విశ్వవాణి కోచింగ్ సెంటర్ అభ్యర్థులు విజయభేరి మోగించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఎన్కే మద్దిలేటి తెలిపారు. టెట్–3లో ఆర్.ప్రసన్న లక్ష్మి (118 మార్కులు), పి.వెంకటేశ్వరి (118), మైమున్సీ (116), రామకృష్ణ (115), గోపీనాథ్ (118), సుజాత (116), ప్రసాదరావు (115)తో పాటు మరో పది మంది రాష్ట్రస్థాయిలోనే అత్యుత్తమ మార్కులు సాధించారని ఆయన వెల్లడించారు. టీచర్స్ అకాడమీ... టీచర్స్ అకాడమీలో టెట్ శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో 90 శాతం అర్హత సాధించారని ఆ సంస్థ డైరెక్టర్ పి.శ్రీరామ్ తెలియజేశారు. 400 మందికి పైగా 125 మార్కులు సాధించారన్నారు. ఎంతో అనుభవం ఉన్న అవనిగడ్డ ఫ్యాకల్టీతో క్లాసులు చెప్పించడం వల్లే సంస్థ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే ఉత్తమ ఫలితాలు వచ్చాయన్నారు. విజేత కోచింగ్ సెంటర్... స్థానిక విజేత స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో టెట్ శిక్షణ తీసుకున్న వారిలో పేపర్–1లో 130 నుంచి 140 మార్కుల మధ్య 8 మంది, 100 నుంచి 130 మార్కుల మధ్య వంద మందికి పైగా సాధించినట్లు ఆ కోచింగ్ సెంటర్ వ్యవస్థాపకులు ఎం.వి.రమణ, అకడమిక్ డైరెక్టర్ ఉమామహేశ్వరి తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన వారిలో 92 శాతం మంది అత్యుత్తమ మార్కులతో ఉత్తీర్ణత సాధించారన్నారు. -
టెట్ 'కీ'పై 16 వేల అభ్యంతరాలు
సాక్షి, అమరావతి: ఇటీవల నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ప్రాథమిక కీపై 16వేల అభ్యంతరాలు వచ్చాయి. ఈ నెల 4న ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రాథమిక కీని విడుదల చేసింది. టెట్ పేపర్-1పై అత్యధికంగా 9,867 అభ్యంతరాలు రాగా, 9,867, పేపర్-2పై 4,162, పేపర్-3పై అభ్యర్థుల నుంచి 1,858 అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. తుది కీ విడుదలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా, ఈ నెల 16న ఏపీ టెట్ ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. -
విధి పరీక్షలో ఓడి..
స్వప్నం చెదిరిపోయింది.. ఆశలు ఆవిరయ్యాయి..రోజులు బాగుపడతాయన్న నమ్మకం వమ్ము అయింది..ఉద్యోగం వస్తే కుటుంబ పరిస్థితులు చక్కబడతాయన్న వారి ఎదురుచూపులు నిరర్థకమయ్యాయి..పేదరికాన్ని ఎదిరించి జీవనపోరాటం చేస్తున్న ఆ కుటుంబం చివరకు విధి పరీక్షలో చిక్కుకుని విషాదసాగరంలో మునిగిపోయింది. టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసేందుకు వెళ్తున్న ఓ యువకుడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు పొట్టన పెట్టుకుంది. అతడి కుటుంబాన్ని వీధిపాలుజేసింది. సబ్బవరం(పెందుర్తి): జిల్లాలోని మాకవరపాలెం మండలంలోని పైడిపాల గ్రామానికి చెందిన ముంజేటి పోతురాజు(34), అదే మండలంలోని చినరాజుపల్లికి చెం దిన దుంగల నాగరాజు(34) స్నేహితులు. వీరిద్ద రూ ఎమ్మెస్సీ, బీఈడీ పూర్తి చేసి బతుకు తెరువు కోసం మాకవరంలోని అన్‌రాక్ అల్యూమినియం కంపెనీలో పనిచేస్తున్నారు. చినముషిడివాడలోని ఆయాన్ డిజిటల్ జోన్ పరీక్షా కేంద్రంలో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) రాసేందుకు కోటి ఆశలతో వీరిద్దరూ మంగళవారం ఉదయం బైక్‌పై బయలుదేరారు. సబ్బవరం మండలం ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై బొర్రమ్మగెడ్డ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని అధిగమించే క్రమంలో పెందుర్తి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న వ్యాన్ వీరి వాహ నాన్ని ఢీకొంది. దీంతో వాహనంపై వెనుక కూర్చున్న పోతురాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం నడుపుతున్న దుంగల నాగరాజు స్వల్పగాయాలతో బయటపడ్డా డు. ఎస్ఐ ఎన్.ప్రభారరెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. పోతురాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పైడిపాలలో విషాదం మాకవరపాలెం: టెట్ రాసేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముంజేటి పోతురాజు(34)స్వగ్రామమైన పైడిపాలలో విషాదఛాయలు అలముకున్నాయి. పోతురాజు మరణవార్త వినగానే కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. బీఈ డీ పూర్తి చేసిన పోతురాజు అన్‌రాక్‌లో ప్రోసెస్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి మే14, 2015లో వివాహం జరిగింది. పోతురాజుకు భార్య సుధామాధురి, ఏడాదిన్నర పాపతో పాటు తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. భార్య, తల్లి ఇతనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తల్లి రెక్కల కష్టంతోనే చదువు.. 18 ఏళ్ల క్రితం తండ్రి మృతి చెందడంతో ఏ ఆధారం లేని తల్లి మంగమ్మ కూలి పనులు చేస్తూ పోతురాజును చదివించింది. చిన్నపాటి ఉద్యోగం చేస్తున్న ఇతడి కష్టంతోనే కుటుంబ పోషణ జరుగుతోంది. ఇంతలో రోడ్డు ప్రమాద రూపంలో మృత్యు వు పోతురాజును కబళించడంతో ఈ కుటుంబానికి దిక్కుతో చని పరిస్థితి ఏర్పడింది. వివాహమైన రెండేళ్లకే భర్తను కోల్పోయిన భార్య, ఏడాదిన్నరకే తండ్రి ఆలనకు దూరమైన ఆ చిన్నారిని చూసిన వారంతా కంటతడి పెట్టారు. మృతుడి నివాసం వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. -
అర్హత పరీక్ష!
ఈమె పేరు కళావతి. బత్తలపల్లి మండలం జ్వాలాపురం గ్రామానికి చెందిన టెట్ అభ్యర్థినికి పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాన్ని కేటాయించారు. ఉదయం 9 గంటలకే కేంద్రానికి చేరుకుంది. గురువారం రోజునే ఎంటెక్ విద్యార్థులకు పరీక్ష ఉండటంతో విద్యార్థులు కళాశాలఆవరణలోనే నిరీక్షిస్తున్నారు. వారంతా టెట్‌కే వచ్చారని భ్రమించిన కళావతి 9.45గంటలు దాటినా అక్కడే ఉండిపోయింది. చివరకు అనుమానంతో విచారించగాఅసలు విషయం తెలుసుకొనిపరీక్ష హాలులోకి వెళ్లగా అప్పటికే సమయం మించిపోవడంతో నిర్వాహకులు ససేమిరాఅన్నారు. ‘సార్.. కాళ్లుపట్టుకుంటా అనుమతించండి’అని వేడుకున్నా ఫలితం లేకపోయింది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) రెండవ రోజు గురువారం కూడా అభ్యర్థులు తీవ్ర ఇక్కట్లకు లోనయ్యారు. జిల్లా కేంద్రంలోని పీవీకేకే కళాశాల కేంద్రంలో ఆలస్యం కారణంగా ఓ విద్యార్థినిని పరీక్షకు అనుమతించలేదు. రెండో రోజు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అనంతపురం, బెంగళూరు కేంద్రాల్లో మొత్తం 1,468 మంది అభ్యర్థులకు గాను 1,405 మంది హాజరయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు పీవీకేకే, షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాలను పరిశీలించారు. అలాగే జిల్లా పరిశీలకులు జనార్దనరెడ్డి, ఆయా కేంద్రాల పరిశీలకులు కేంద్రాలను తనిఖీ చేశారు. బెంగళూరులో పరిశీలకులు సాయిబాబా వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండోరోజూ ఆ కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలు ఉండగా రెండోరోజూ రెండు కేంద్రాలకు అభ్యర్థులను కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ రాయలేదు. అలాగే షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ రెండు పూటలా కేవలం 71 మందిని మాత్రమే కేటాయించారు. వెంటాడిన సాంకేతిక సమస్య హిందూపురం సప్తగిరి కళాశాలలో రెండో రోజూ సాంకేతిక సమస్య తలెత్తింది. 9.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11.15 గంటలకు మొదలైంది. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. నిర్వాహకుల తీరుపై మండిపడ్డారు. ఆన్లైన్ నిర్వహణపై అవగాహన లేకనే ఈ పరిస్థితి తలెత్తిందంటూ అభ్యర్థులు వాపోయారు. -
బిక్కమొహం
టెట్ అభ్యర్థులంతా బిక్కమొహం వేశారు. తొలిసారిగా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడంతో అవగాహన లేనివారంతా ఇబ్బందులు పడ్డారు. చాలా మందికి కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడంతో ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు. ఇక హిందూపురం కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటన్నర ఆలస్యంగా పరీక్ష ప్రారంభమైంది. అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) బుధవారం ప్రారంభమైంది. జిల్లాలో ఆరు కేంద్రాలతో పాటు బెంగళూరు నగరంలోని 9 కేంద్రాలను జిల్లా విద్యాశాఖ పర్యవేక్షిస్తోంది. తొలిరోజు 79 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,639 మంది అభ్యర్థులకు గాను 1,560 మంది హాజరయ్యారు. వీరిలో అనంతపురం జిల్లాలో 703 మందికి గాను 681 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. అలాగే బెంగళూరులో 936 మందికి గాను 879 మంది హాజరయ్యారు. 57 మంది గైర్హాజరయ్యారు. హిందూపురంలో గంటన్నర ఆలస్యంగా... హిందూపురం పట్టణంలోని సప్తగిరి కళాశాల కేంద్రంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో కొందరి విద్యార్థులు గంటన్నర ఆలస్యంగా పరీక్ష మొదలు పెట్టారు. అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు. వీరికి గడువు సమయం పొడిగించి రాయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దనాచార్యులు, జిల్లా పరిశీలకులు జనార్దన్‌రెడ్డి, కేంద్రాల పర్యవేక్షులు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ వివిధ సెంటర్లను పరిశీలించారు. రెండు కేంద్రాల్లో అభ్యర్థులు లేరు జిల్లాలో ఆరు కేంద్రాలుండగా తొలిరోజు రెండు కేంద్రాల్లో అభ్యర్థులనే కేటాయించలేదు. రాప్తాడు మండలం హంపాపురం వద్దనున్న ఎస్వీఐటీ కళాశాల, గుత్తి గేట్స్ కళాశాల కేంద్రాల్లో ఒక్క అభ్యర్థీ పరీక్ష రాయలేదు. షిర్డీసాయి ఇంజినీరింగ్ కళాశాలలోనూ కేవలం 50 మందిని మాత్రమే కేటాయించారు. -
టెట్ రాస్తున్నారా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్)–2018కు హాజరయ్యే అభ్యర్థులు పూర్తిగా సన్నద్ధంకావాలని డీఈవో బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లాలో 18 కేంద్రాల్లో బుధవారం నుంచి మార్చి 3వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయని చెప్పారు. కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించే ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కొన్ని సూచనలు పాటించాలని సూచించారు. ♦ అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు గంట ముందుగా చేరుకోవాలి. ♦ హాల్ టిక్కెట్‌పై ఉన్న పరీక్ష కేంద్రం, తేదీ, సమయం, రిజిస్టర్ నంబరు సరిచూసుకోవాలి.. ♦ అడ్మిట్ కార్డుపై ఉన్న పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ‘లాగిన్’ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కంప్యూటర్లో ఉన్న వివరాలు సరిచూడాలి. అన్నీ సరిగా ఉంటే ‘కన్ఫర్మ్’ అని, లేకుంటే ‘ఐ డెనీ’ అని క్లిక్ చేయాలి. ♦ కంప్యూటర్ బాగా పనిచేస్తుందని, వివరాలు అందుబాటులో ఉన్నాయని క్లిక్ చేయాలి. ♦ అనంతరం నేను ప్రారంభించుటకు సిద్ధంగా ఉన్నాను అని క్లిక్ చేయాలి. ♦ ఇచ్చిన నాలుగు జవాబుల నుంచి సరైన దాన్ని ఎన్నుకొని క్లిక్ చేయాలి. ♦ పరీక్ష రాస్తున్నప్పుడు మిగిలిన సమయం కంప్యూటర్లో పరిశీలించవచ్చు. ♦ జవాబు రాయని ప్రశ్నలు ఎరుపు, ప్రయత్నించని ప్రశ్నలు తెలుపు, ప్రయత్నించిన ప్రశ్నలు ఆకుపచ్చ, పునఃపరిశీలనకు గుర్తించిన ప్రశ్నలు, జవాబు ఇచ్చిన ప్రశ్నలు ఊదా రంగులలో కనిపిస్తాయి. ♦ ప్రశ్నకు జవాబు రాసిన అనంతరం ‘సేవ్’ తర్వాత ‘నెక్స్›్ట’ బటన్ నొక్కాలి. ♦ కుడివైపు సెక్స్న్ బటన్ నొక్కడం వల్ల జవాబు ఇచ్చిన, ఇవ్వని, పునఃపరిశీలన ప్రశ్నలు కనిపిస్తాయి. ♦ కంప్యూటర్లో ఇచ్చిన అక్షరాల సైజు కనిపించకపోతే వెంటనే ఇన్విజిలేటరు దృష్టికి తీసుకెళ్లాలి. ♦ పరీక్ష సమయం 2.30 గంటలు పూర్తి కాగానే ‘సబ్మిట్’ అని బటన్ యాక్టివేట్ చేయాలి. ♦ దృష్టి లోపం ఉన్నవారికి, అంగవికలాంగులకు అదనంగా 50 నిమిషాలు సమయం ఇవ్వనున్నారు. -
పకడ్బందీగా టెట్
నెల్లూరు(పొగతోట): టీచర్స్ ఎల్జిబిలిటీ టెస్ట్ 2018 (టెట్) ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన చాంబర్లో నిర్వహించిన ఏపీ టెట్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు టెట్ పరీక్షలు ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు తెలిపారు. విట్స్ కావలి, శ్రీవెంకటేశ్వర కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ (నార్త్‌రాజుపాళెం), నారాయణ ఇంజినీరింగ్ కాలేజీ (ముత్తుకూరు రోడ్డు), ఐమాన్ డిజిటల్ జోన్ కాలేజీ (కొడవలూరు), ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విద్యానగర్), ఆదిశంకర ఇంజినీరింగ్ కాలేజీ, గూడూరు (రెండు సెంటర్లు), రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ (కడనూతల) సెంటర్లలో టెట్ నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు నిర్వహించే కళాశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీల్లో ఉన్న సభ్యులు కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి, నివేదికలను డీఈఓకు అందజేయాలని సూచించారు. టెట్‌కు హాజరయ్యే అభ్యర్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్ష నిర్వహించే సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇన్విజిలేటర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదన్నారు. టెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల వద్ద బ్లూటూత్, సెల్ఫోన్లు ఉండకుండా పరిశీలించాలన్నారు. వాటర్ బాయ్స్ సెల్ఫోన్లతో పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లకుండా ఇన్విజిలేటర్లు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఈఓ శామ్యూల్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ విజయకుమార్, డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ వరసుందరం, పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
టెట్ హాల్‌టికెట్ల జారీలో నిర్లక్ష్యం
ఒంగోలు: టీచర్స్ ఎలిజబిలిటీ టెస్టు (టెట్) హాల్ టికెట్ల జారీలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దీని అనంతరం డీఎస్సీలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థులకు ఈ వ్యవహారం పిడుగుపాటుగా మారింది. స్థానికంగా కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ 6వ లైనులో నివాసం ఉంటున్న ఎస్.సాయి పద్మిని టెట్ పరీక్షకు దరఖాస్తుచేసుకోగా ఇటీవల హాల్ టికెట్ నంబర్ 1710714314404 జారీ అయింది. అయితే ఆమెకు పరీక్ష కేంద్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరి పేట రోడ్డులో కేశనపల్లిలో ఉన్న కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌ను కేటాయించారు. దీంతో ఆ సెంటర్‌ను విచారించుకునేందుకు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. తీరా ఎంత విచారించినా ఆ పేరుతో ఎటువంటి పరీక్ష కేంద్రం అక్కడ లేదు. దీంతో తమ కుమార్తె ఎలా పరీక్ష రాయాలో ఎలో రాయాలో తెలియక ఆందోళనతో బు«ధవారం రాత్రి మీడియాను ఆశ్రయించారు. పలువురు విద్యార్థులకు కూడా ఇలానే తప్పులు దొర్లాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలి: విద్యార్థిని తల్లి జ్యోతి టెట్ పరీక్ష రాయడం ద్వారా నాలుగేళ్లలోపు జరిగే టీచర్ పరీక్షలకు అర్హత ఉంటుంది. అయితే పరీక్ష కేంద్రం అడ్రెసే లేకపోతే పరీక్ష ఎలా రాయాలి? మేము ఇప్పటికే సెంటర్‌కోసం అనేక విధాలుగా తిరిగాం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మాత్రమే ఉంది. కానీ నరసరావుపేట , గుంటూరు జిల్లా అని హాల్‌టిక్కెట్‌లో ఇచ్చారు. తక్షణమే సెంటర్‌కు సంబంధించి స్పష్టత తెలియజేయాలి. -
టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి
నల్లగొండ రూరల్ : టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ రో డ్డులోని పాల్టెక్నిక్ కాలేజీ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. ప్రస్తుతం ఖాళీగా లిగా ఉన్న 2లక్షల 60 వేల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులపై పక్షపాత వైఖరి అవలంభిస్తోందని విమర్శించారు. ఈనెల 24, 26 తేదీల్లో నిర్వహించే టీఆర్టీ íపరీక్షలను సిలబస్ కారణంగా రెండు నెలలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చుక్క సైదులు, నర్సింహ, పరుశురాం, హరీష్, నాగరాజు, శ్రీలత, నాగలక్ష్మి, సంధ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
15 నుంచి టెట్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ
కడప, వైవీయూ : కడపలోని శ్రీసాయి బ్రహ్మేంద్ర ఎడ్యుకేషనల్ అండ్ కెరీర్ గైడెన్స్ సెంటర్లో టెట్ అభ్యర్థులకు ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉచిత ఆడియో క్లాసులు నిర్వహిస్తున్నట్లు సంస్థ సమన్వయకర్త ఎస్.మహమ్మద్ మౌలానా ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీషు గ్రామర్, సైకా లజీ సబ్జెక్టులకు సంబంధించి ఈ ఉచిత తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ పేర్లను సంస్థ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 9618299345 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
‘టెట్’ కష్టాలు!
అనంతపురం ఎడ్యుకేషన్: రాయదుర్గానికి చెందిన ఎం. అలేఖ్య టెట్ పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అమ్మాయికి ఒంగోలులో టెట్ కేంద్రం వేశారు. తండ్రి రమణ ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఆయన కూతురును తీసుకుని ఒంగోలుకు వెళ్లి పరీక్ష రాయించాలంటే రెండు రోజులు సెలవు పెట్టాలి. పైగా వేలాది రూపాయలు ఖర్చు. ♦ అనంతపురం నగరానికి చెందిన బి.మదన ప్రతాప్‌రెడ్డి పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేశాడు. దరఖాస్తు సమయంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇవేవీ లేకుండా బెంగళూరు నగరంలో కేంద్రం వేశారు. ♦ యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి ప్రతాప్‌రెడ్డి అనే అభ్యర్థి టెట్ పేపర్–2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్లైన్లో హాల్‌టికెట్ కనిపించడం లేదు. పుట్టినరోజు, దరఖాస్తు ఐడీ నంబరు, ఆధార్‌నంబరు నమోదు చేసినా ‘డిటైల్స్ నాట్‌ఫౌండ్) అని వస్తోంది. దీంతో ప్రతాప్‌రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ♦ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 1వ తేదీ వరకు టెట్ 1, 2, 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసలే ఆన్‌లైన్‌పై అవగాహన లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే... సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు తమ హాల్‌టికెట్లు ఆన్లైన్లో కనిపించడం లేదని వాపోతున్నారు. రాయదుర్గం పట్టణంలోనే సుమారు వందమంది అభ్యర్థులు పేపర్–1, 2, 3 పరీక్షలు రాస్తుంటే వీరిలో 80 మందికిపైగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కేంద్రాలు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థినులకు తప్పని ఇక్కట్లు సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడిన మహిళా అభ్యర్థినులు తీవ్ర ఇక్కట్లు పడనున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ప్రయాణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. దీనికితోడు ఖర్చు కూడా భారీగా వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో పాటు మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లో కేంద్రాలకు మహిళా అభ్యర్థులు వెళ్లాలంటే కచ్చితంగా తోడుగా కుటుంబీకులను తీసుకెళ్లాలి. అందులోనూ ముందు రోజు వెళ్లాల్సి ఉంటుంది. పోను,రాను ప్రయాణం, భోజన, వసతి ఖర్చులన్నీ కలిపితే వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ తలచుకుని ఆర్థిక ఇబ్బందులున్న కొందరు పరీక్ష రాసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. కాగా టెట్ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. హాల్‌టికెట్లు రాని కొందరు ఇక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. -
చిక్కులు.. సందేహాలు
శ్రీకాకుళం: ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం పూర్తిచేస్తుందా? లేక ప్రకటనలతో సరిపుచ్చుతుందా? అని బీఎడ్ అభ్యర్థులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబరులోనే డీఎస్సీ నోటిఫికేషన్ అని ప్రకటించినా ఇప్పటివరకు దానికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఖరారు కాలేదు. డీఎస్సీకి అర్హత పరీక్షగా భావించే టెట్ విషయంలో రోజుకో సవరణ జీఓ విడుదల చేస్తూ ప్రభుత్వం అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేస్తోంది. జనవరి 12న విడుదల చేసిన జీవోతో బీఎడ్ అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. గతంలో ఇలా గతంలో టెట్ పరీక్షలకు సంబంధించి తెలుగు పండిట్, హిందీ పండిట్ అభ్యర్థులకు టెట్ పేపరు–2 నిర్వహించేవారు. టీపీటీ, హెచ్‌పీటీ అభ్యర్థులు సాంఘికశాస్త్రం, గణితం సబ్జెక్టును ఎంచుకుని పరీక్ష రాసేవారు ఏదో ఒకటి ఎంచుకుని 60 మార్కులకు ఆయా సబ్జెక్టుల్లో సన్నద్ధమయ్యేవారు. గత ఏడాది జనవరిలో హిందీ భాష పండితులు.. టెట్ పరీక్ష పేపరు–2లో హిందీకి సంబంధించిన కంటెంట్‌ను 60 మార్కులకు పెట్టాలని డిమాండ్ చేశారు. అప్పటి నుంచి ఏడాదిగా పట్టించుకోని ప్రభుత్వం.. టెట్ ప్రకటన విడుదల చేసిన నెల రోజుల తర్వాత కొత్త జీవో విడుదల చేసింది. దీంతో కొత్త తల నొప్పులు మొదలయ్యాయి. సాధారణంగా బీఎడ్ అభ్యర్థులు మెథడాలజీలో మొదటి సబ్జెక్టుగా సైన్సు, సోషల్, గణితాన్ని ఎన్నుకుని రెండో మెథడాలజీగా తెలుగు గానీ ఇంగ్లిషునుగానీ ఎంచుకుంటారు. ఇలా ఎంచుకుని బీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఎంఏ తెలుగు లేదా ఇంగ్లిషు చేస్తే వారు డీఎస్సీలో తమ సబ్జెక్టుతోపాటు భాష పండిత పరీక్ష రాసుకునేందుకు అర్హులవుతారు. గతంలో టెట్ పేపరు–2కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డీఎస్సీలో పండిట్స్ పరీక్ష కూడా రాసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.కానీ ప్రస్తుతం అలా పండిట్ పరీక్ష రాయాలనుకునే అభ్యర్థులు పేపరు–2 నుంచి పేపరు–3కి మారాలని సూచించింది. తెలుగు పండిట్స్‌కు దరఖాస్తు చేసుకున్న పీజీ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ వారి మెథడాలజీని బట్టి సాంఘిక, బయాలజీ, ఫిజికల్ సైన్సు, గణితం పరీక్షలకు అర్హులవుతారు. రెండింటినీ రాయాలంటే.. సాధారణంగా చాలా మంది అభ్యర్థులు తమ మెథడాలజీ ప్రకారమే టెట్‌కు సన్నద్ధం అవుతారు. వీరికి అర్హత ఉంటే పండిత పరీక్ష కూడా రాసుకునేందుకు టెట్ మార్కులనే పరిగణనలోకి తీసుకునేవారు. ప్రస్తుతం భాష పండిత పరీక్ష రాయాలంటే పేపరు–3 రాయాలని జీఓ విడుదల చేశారు. దీంతో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ప్రభుత్వం పేపరు–2 నుంచి పేపరు–3కి మారేందుకు అవకాశం కల్పించింది. తిరిగి పేపరు–2 రాయాలంటే మరోమారు దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు ఉందా లేక కొత్తగా దరఖాస్తు చేసుకోవాలా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. దీంతోపాటు ఆయా పరీక్షలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాల్సిందే. ఒకవేళ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్నా ఇప్పటికే గడువు ముగిసింది. ప్రభుత్వం ఒకే ఫీజుతో స్కూల్ అసిస్టెంట్, భాష పండిత పరీక్ష రాసుకునేలా అవకాశం కల్పించాలని పలువురు అభ్యర్థులు కోరుతున్నారు. ప్రభుత్వం పేపరు–3కి ఎటువంటి సిలబస్ ఉంటుందో అనే విషయాన్ని పేర్కొనలేదు. ఒకవేళ సిలబస్ పెంచితే ఎలా సన్నద్ధమవ్వాలనే వారికి ప్రశ్నార్థకంగా మారింది. -
ఎ‘ట్టెట్టా’!
ఎస్కేయూ/అనంతపురం ఎడ్యుకేషన్ : టెట్(టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) పేరు విం టేనే అభ్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీ – టెట్ (సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్) సిలబస్ ఆధారంగా టెట్ విధివిధానాలు, నిబంధనలను రూపొందిస్తుండటంతో టెట్ సిలబస్ గతంతో పోలిస్తే మూడింతలు అధికంగా ఉంది. కనీస అర్హత సాధిస్తామా, లేదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ♦ టెట్ రాత పరీక్షల్లో అన్ని మెథడాలజీ సబ్జెక్టుల వారికీ ఇబ్బందులున్నాయి. బయాలజీ సైన్సెస్ స్కూల్ అసిస్టెంట్‌కు సన్నద్ధమయ్యే అభ్యర్థుల సమస్యలు జఠిలంగా ఉన్నాయి. టెట్‌లో నిర్ధేశించిన సిలబస్ ప్రకారం కేటాయించిన ఈ 150 మార్కుల్లో బయాలజికల్ సైన్సెస్ వారికి కేవలం బయాలజీ, మెథడాలజీ రెండూ కలుపుకొని 18 మార్కుల సిలబస్ మాత్రమే తెలిసి ఉంటుంది. తక్కిన 132 మార్కుల కోసం కొత్తగా చదవాలి. దరఖాస్తుకు, పరీక్షకు గడువు కేవలం నామమాత్రంగానే ఉంది. టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ ఇస్తుండటంతో ప్రతి మార్కు కీలకమైన నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారు. ♦ బీఈడీ(ఇంగ్లిష్), (తెలుగు), టీపీటీ పూర్తి చేసిన లాంగ్వేజెస్ అభ్యర్థులు ఇదివరకు సోషల్ స్టడీస్‌లో టెట్ రాయాల్సి ఉండేది. తాజాగా ఈ అభ్యర్థులను పరిగణలోకి తీసుకుని టెట్ – 3 పేరుతో నూతన సిలబస్ ఖరారు చేశారు. స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లిష్‌కు 60 మార్కులు కేటాయించారు. గతంలో ఈ 60 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా సోషల్ స్టడీస్‌లోనే వచ్చేవి. నూతనంగా సిలబస్ మార్చినప్పటికీ దాని రూపకల్పన పూర్తి కాలేదు. దీంతో వీరికీ ఇబ్బందులు తప్పలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజెస్ వారికి ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులోకి రాకపోవడంతో వారు దరఖాస్తు చేసుకోలేదు. అందువల్ల టెట్ పరీక్ష వాయిదా వేయాలని కోరుతున్నారు. టెట్ స్వరూపాన్నే మార్చి.. ఆవేదన మిగిల్చి.. విద్యాహక్కు చట్టం ప్రకారం ఎన్సీటీఈ(నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) టెట్ సిలబస్‌ను రూపొదించింది. వాస్తవానికి టెట్ పరీక్షను బట్టే ఉద్యోగ ఎంపిక పూర్తి చేయాల్సి ఉన్నా టెట్‌లోని సిలబస్ కొంత, డీఎస్సీ సిలబస్ కొంత తీసుకుని టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. టెట్ 150 మార్కులకు నిర్వహిస్తే.. ఇందులో వచ్చిన మార్కులను 20 శాతం డీఎస్సీలో వెయిటేజీ ఇస్తున్నారు. తక్కిన 80 శాతం వెయిటేజీ కోసం డీఎస్సీ పరీక్ష నిర్వహిస్తున్నారు. ♦ ‘టెట్’ను కాదని టీఆర్టీ.. తిరిగి టెట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారిగా జులై – 2011లో టెట్ నిర్వహించారు. రెండో దఫా టెట్ జనవరి 2012లో జరిగింది. మొదటి టెట్ కన్నా రెండో టెట్ పరీక్ష చాలా కఠినంగా ఉండటంతో బోనస్ మార్కులు కలిపి ఫలితాలు విడుదల చేశారు. తిరిగి మూడో టెట్‌ను జులై – 2013లో, నాలుగో టెట్‌ను మార్చి – 2014లో నిర్వహించారు. అయితే అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టెట్‌ను రద్దు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది. అయితే ఒకసారి టెట్‌కు అర్హత సాధిస్తే ఏడేళ్ల వరకు చెల్లుబాటవుతుంది. అందువల్ల అప్పటికే అర్హత సాధించినవారు టెట్‌ను రద్దుపై తీవ్ర అభ్యంతరం తెలి పారు. దీంతో టీడీపీ ప్రభుత్వం టెట్ కమ్ టీఆర్టీ పేరుతో ఒకే పరీక్ష నిర్వహిం చింది. అయితే తిరిగి టెట్, డీఎస్సీ రెండు పరీక్షలు పెడుతున్నారు. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు తరచూ మారుతుండటంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. పొంతన లేని సిలబస్ మేథమేటిక్స్ కష్టమనే బయాలజికల్ సైన్సెస్ కోర్సులు తీసుకున్నాము. టెట్‌లో మేథమేటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ప్రవేశపెట్టారు. మేథమేటిక్స్ బేసిక్ అయితే నేర్చుకోవచ్చుగానీ లోతైన సిలబస్ ఇచ్చారు. – భారతి, అనంతపురం సిలబస్ మూడింతలైంది గతంలో కన్నా మూడింతలు అధిక సిలబస్‌ను రూపొందించారు. దీంతో ప్రిపేరేషన్ చాలా భారంగా మారింది. తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ చదవాలంటే ఆందోళనగా ఉంది. – రాజేశ్వరి, గుంతకల్లు అర్హతమార్కులు తగ్గించాలి టెట్‌లో అర్హత మార్కులు అధిక శాతంగా నిర్ణయించారు. ఏ మాత్రం సంబంధం లేని సిలబస్‌ను ప్రవేశపెట్టారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత మార్కులు తగ్గించాలి. – సావిత్రి, అనంతపురం -
ఫిబ్రవరి 21 నుంచి టెట్ నిర్వహణ
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ పరీక్ష జనవరి 17 నుంచి 27 వరకు నిర్వహించాలనుకున్నారు. గడువు తక్కువగా ఉందని అభ్యరులు ఆందోళన చేయడంతో ఫిబ్రవరి 15 వరకు గడువును పెంచారు.. ఈ గడువు సరిపోదనడంతో ప్రభుత్వం ఫిబ్రవరి 21కి టెట్‌ను వాయిదా వేసింది.దీంతో అభ్యర్థుల అందోళనకు తెరపడింది. టెట్ తాజా షెడ్యూల్ : హాల్‌టికెట్టు డౌన్లోడ్: ఫిబ్రవరి 10 నుంచి పెపర్–1, పేపర్–2 అన్లైన్ పరీక్షల షెడ్యూల్: ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు ప్రాథమిక కీ విడుదల : మార్చి 4 ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: మార్చి 4 నుంచి 9 వరకు ఫైనల్ కీ విడుదల : మార్చి 12 ఫలితాల ప్రకటన: మార్చి 16 -
టెట్ మరోసారి వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలను (టెట్)– 2017ను ప్రభుత్వం మరోసారి వాయిదా వేసింది. ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగాల్సిన ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకూ టెట్ జరగనుంది. మార్చి 12న టెట్ కీ విడుదల చేసి, 16న ఫలితాలను వెల్లడిస్తారు. టెట్ వాయిదాకు సంబంధించి పూర్తి వివరాలను రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. టెట్‌కు దాదాపు 4.50లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్జీటీ పేపర్-1కు 1,80,749 మంది, పేపర్-2కు 2,12,795 మంది దరఖాస్తు చేసుకున్నారు. భాషా పండితులు పేపర్‌కు 53, 289 మంది అప్లై చేసుకున్నారు. టెట్‌కు సిద్ధమవ్వడానికి తగినంత వ్యవధి లేదని, సిలబస్ కూడా ఎక్కువ ఉందని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గతంలో కూడా వాయిదా వేశారు. -
టెట్ అభ్యర్థులకు షాక్!
ఇప్పటికే డోలాయమానంలో ఉన్న టెట్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తరువాత డీఎస్సీకి సంబంధించి టెట్ ప్రకటన విడుదల కావడంతో నిరుద్యోగ బీఈడీ అభ్యర్థుల్లో ఆశలు మొలకెత్తాయి. గత నెల రోజులుగా వీరంతా దూర ప్రాంతాలకు వెళ్లి శిక్షణ పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కొత్తగా మరో జీవోను సర్కార్ తెరపైకి తెచ్చింది. ఇది టీపీటీ, హెచ్‌పీటీ అభ్యర్థులకు అనుకూలంగా ఉండగా..బీఈడీ సెకెండ్ మెథడ్స్ అభ్యర్థులకు గడ్డు పరిస్థితి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. రాజాం: నిరుద్యోగుల జీవితాలతో సర్కార్ ఆటలాడుతోంది. తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల విషయంలో కూడా అలాగే వ్యవహరిస్తోంది. గతంలో నిర్వహించిన టెట్‌లకు సంబంధించి బీఈడీ వాళ్లతోపాటు టీపీటీ, హెచ్‌పీటీ వాళ్లకు కూడా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి టెట్ పేపర్–2 పరీక్ష ఉండేది. ఈ పరీక్ష 150 మార్కులకు ఉండగా ఇందులో సోషల్ లేదా గణితం సబ్జెక్టును ఎంచుకొని పరీక్ష రాయాల్సి ఉండేది. ఈ రెండు సబ్జెక్టుల్లో ఏదో ఒకటి ఎంచుకోవడం ద్వారా 60 మార్కులకు హెచ్‌పీటీ, టీపీటీ వాళ్లు కూడా సైన్సు లేదా సోషల్ సబ్జెక్టును ప్రిపేర్ కావాల్సి వచ్చేది. అయితే గత ఏడాది జనవరిలో హిందీ భాషోపాధ్యాయులు టెట్ పరీక్షలో పేపర్–2లో హిందీ భాషకు సంబంధించి 60 మార్కులకు కంటెంట్‌ను పెట్టాలని డిమాండ్ చేశారు. వాటిని ఇప్పటి వరకు పరిశీలించని ప్రభుత్వం టెట్ ప్రకటన జారీచేసిన నెల రోజులు అనంతరం కొత్త జీవోతో తలనొప్పులకు తెరతీసింది. గంగరగోళంగా కొత్తజీవో... ఈ నెల 12న ప్రభుత్వం విడుదల చేసిన ఈ కొత్తజీవోలో భాషా పండితులకు సంబంధించి తెలుగు, హిందీ, ఇంగ్లిష్ అభ్యర్థులు మూడవ ఆప్షన్‌ను ఎంచుకోవడంతోపాటు 60 మార్కులు వారి భాషకు సంబంధించిన కంటెంట్‌ను రాయాల్సి ఉంది. ఈ విధానం కేవలం తెలుగు పండిట్, హిందీ పండిట్, కళాశాల్లో ట్రైనింగ్ అయిన వారికి మాత్రమే వర్తించే విధంగా మారింది. రాష్ట్రంలో ఎక్కువుగా బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో బీఈడీ చేసిన అభ్యర్థులు ఒక సబ్జెక్టును సోషల్, బయాలజీ, ఫిజికల్ సైన్సు, గణితం ఎంచుకోగా రెండో మెథడ్‌ను తెలుగు, ఇంగ్లిష్లను ఎక్కువుగా ఎంపిక చేసుకున్నారు. వీరంతా ఇప్పటి వరకు టెట్–2 పేపర్‌కు సంబంధించి గణితం లేదా సోషల్ సబ్జెక్టుల్లో పరీక్ష రాసి డీఎస్సీకి అర్హత సాధించే వారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా బీఈడీ కళాశాలల్లో సెకెండ్ మెథడ్‌గా ఇంగ్లిష్, తెలుగు చేసిన అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వీరు ఇదివరకే టెట్–2కు దరఖాస్తు చేసి ఉండగా ఇప్పుడు కొత్త జీవోతో నెట్లో వీరి ఆప్షన్‌ను మార్చుకోవాలో, ఉంచుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరు ఒక వైపు టెక్నికల్ సబ్జెక్టుల పరిధిలోకి రాగా మరోవైపు ఇంగ్లిష్, తెలుగు పండిట్ పరిగణలోకి కూడా వస్తారు. పండిట్ ప్రాతిపదికన టెట్ రాయాలనుకుంటే వీరంతా బీఈడీలో మొదటి మెథడాలజీగా చేసిన సైను, గణితం, సోషల్, బయలాజికల్ సైన్సు వంటి సబ్జెక్టులను కోల్పోవాల్సి వస్తుంది. అంతా గందరగోళం టెట్ నోటిఫికేషన్ వెలువడగానే చాలా మంది అభ్యర్థులు తమ ఉద్యోగాలను, ప్రైవేటు ఉద్యోగాలను, ఇంటి వద్ద వ్యవసాయ పనులను విడిచిపెట్టేశారు. ఎలాగైనా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే ఆశతో అప్పులుచేసి సుదూర ప్రాంతాలకు కోచింగ్‌ల కోసం వెళ్లారు. గత నెల రోజులుగా సిలబస్ ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతం మళ్లీ సిలబస్ ప్రకటించడంతో వీరంతా ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ఇంగ్లిష్ మెథడాలజీ అభ్యర్థులు బీఈడీలో రెండవ మెథడ్‌గా తెలుగు తీసిన అభ్యర్థులు అయోమయానికి గురౌతున్నారు. కొందరికి మోదం ఇదిలా ఉండగా ఈ కొత్త జీవోతో హిందీ, తెలుగు పండిట్ ట్రైనింగ్ కళాశాలల్లో శిక్షణ పొందిన అభ్యర్థులు మాత్రం ఆనందంగా ఉన్నారు. ప్రధానంగా హిందీ పండిట్ ట్రైనీ అభ్యర్థులు సోషల్ సబ్జెక్టు లేదా గణితం చదవలేక టెట్ కోసం ఆపసోపాలు పడేవారు. ఈ కొత్త జీవోతో వీరికి సబ్జెక్టుకు సంబంధించి 60 మార్కులు అదనంగా కలవనున్నాయి. -
ఏపీ టెట్ పరీక్షలు వాయిదా
-
ఏపీ టెట్ పరీక్షలు ఫిబ్రవరి 5కు వాయిదా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)– 2017ను ప్రభుత్వం మూడు వారాలపాటు వాయిదా వేసింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 5 నుంచి 15 వరకు జరగనున్నాయి. టెట్‌కు సిద్ధమవ్వడానికి తగినంత వ్యవధి లేదని, సిలబస్ కూడా ఎక్కువ ఉందని అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమవడంతో గడువు పొడిగించినట్టు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. టెట్ ఫలితాలను ఫిబ్రవరి 26న విడుదల చేస్తామన్నారు. టెట్ షెడ్యూల్‌ను ఈ నెల 14న విడుదల చేసిన సంగతి తెలిసిందే. టెట్‌ను వాయిదా వేసినప్పటికీ డీఎస్సీ నిర్వహణపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి గంటా స్పష్టం చేశారు. -
పరీక్షలు సరే.. గడువేది?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు కసరత్తు ముమ్మరం చేసింది. ఈ డీఎస్సీ రాసేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు సంబంధించి ఈనెల 14న నోటిఫికేషన్ కూడా జారీచేసింది. ఈనెల 18వ తేదీనుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ అనంతరం.. జనవరి 17 నుంచి 27వ తేదీవరకు ఆన్లైన్ (కంప్యూటరాధారితంగా)లో వీటిని నిర్వహించనున్నారు. అంతవరకు బాగానే ఉన్నా ప్రభుత్వం ఈసారి పరీక్షలకు అతి తక్కువ సమయం కేటాయించిందని నిరుద్యోగ అభ్యర్థులు వాపోతున్నారు. టెట్‌కు ఈసారి సిలబస్‌ను కూడా ఇంతకు ముందుకన్నా పెంచారని, ఈ నేపథ్యంలో ప్రిపరేషన్‌కు ప్రస్తుతమిచ్చిన వ్యవధి సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ తరువాత కనిష్టంగా 45 రోజుల సమయం ఉండాలని, కానీ కేవలం 17 రోజులు మాత్రమే ఉండడంతో ప్రిపరేషన్‌ను పూర్తి చేయలేకపోతున్నామని వాపోతున్నారు. సమయాన్ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 150 మార్కులకే అయినా... టెట్‌ను ఈసారి ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ తరహాలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో నిర్వహిస్తున్నారు. ఎలిమెంటరీ తరగతులకు పేపర్–1, ఆపై తరగతులకు పేపర్ –2 కింద వేర్వేరుగా సిలబస్‌లు ఇచ్చారు. ఒక్కో పేపర్లో ఇచ్చే ప్రశ్నలు 150 మాత్రమే అయినా వాటి సిలబస్‌ను చాలా ఎక్కువగా పొందుపరిచారని చెబుతున్నారు. పేపర్–1లో చైల్డ్ డెవలప్మెంట్, బోధనా పద్ధతులు, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్ ), మేథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అనే అయిదు విభాగాల్లో 30 మార్కుల చొప్పున 150 మార్కులకు 150 ప్రశ్నలుంటాయి. పేపర్2లో చైల్డ్ డెవలప్మెంట్, బోధనా పద్ధతులు, లాంగ్వేజ్–1, లాంగ్వేజ్–2 (ఇంగ్లిష్)లలో 30 చొప్పున ప్రశ్నలు 30 మార్కులకు చొప్పున ఉంటాయి. ఇవి కాకుండా ఆయా ప్రత్యేక మెథడాలజీలకు సంబంధించి మేథమెటిక్స్, సోషల్స్టడీస్, ఇతర అంశాలకు 60 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఈ సిలబస్ ఎక్కు వగా ఉండడం, ప్రామాణిక పుస్తకాలు కూడా అందుబాటులో లేకపోవడంతో అభ్యర్థులు అవస్థలు పడుతున్నారు. మళ్లీ టెట్ నిర్వహిస్తారా? టెట్‌ను ఏటా రెండుసార్లు నిర్వహించడానికి అవకాశముంది. అయితే ప్రభుత్వం గత మూడునాలుగేళ్లుగా టెట్‌ను నిర్వహించడం లేదు. దీంతో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులు అనేక మంది టెట్‌ను రాయలేకపోయారు. మధ్యలో 2014లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ సమయంలో ప్రత్యేకంగా టెట్‌ను నిర్వహించకుండా టీచర్ ఎలిజిబులిటీ టెస్టు కమ్ టీచర్ రిక్రూట్మెంటు టెస్టు (టెట్ కమ్ టెర్ట్)ను నిర్వహించింది. అప్పట్లో రెండింటికీ కలిపి ఒకే ప్రశ్నపత్రాన్ని రూపొందించి ఇచ్చింది. టీచర్ ఎలిజిబులిటీ, రిక్రూట్మెంటు ప్రశ్నలను పార్టు–1, పార్టు–2 కింద వేర్వేరుగా చేసి ఇచ్చారు. ఇప్పుడు 2014 టెర్ట్ రాసిన వారిని టీచర్ ఎలిజిబులిటీ టెస్టు రాసిన వారిగా పరిగణిస్తారా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. అప్ప ట్లో టెట్‌ను వేరేగా నిర్వహించనందున ఈ పరిస్థితి ఏర్పడింది. కోచింగ్సెంటర్ల చుట్టూ ప్రదక్షిణలు ప్రభుత్వం మూడున్నరేళ్ల తరువాత డీఎస్సీని ప్రకటించడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఈ పోస్టుల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే టెట్ రాసిన వారితో పాటు కొత్తవారు కూడా టెట్‌కు ప్రిపేర్ అవుతున్నారు. టెట్‌కు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ ఉన్నందున ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు వేలాది మంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. అవనిగడ్డలోని కోచింగ్ సెంటర్లో అయితే ఖాళీలు లేవంటూ అభ్యర్థులను వెనక్కు పంపిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టెట్‌తో సహీ డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు తమకు సరిపడా వ్యవధి ఇవ్వాలని, అదే సమయంలో 2014లో టెట్ కమ్ టీఆర్టీని రాసిన వారు మళ్లీ టెట్ రాయాలో వద్దో కూడా స్పష్టతనివ్వాలని అధికారులను కోరుతున్నారు. -
టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి : ఉపాధ్యాయ నియామకాల అర్హత పరీక్ష అయిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్) నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. పరీక్షలు జనవరి 17 నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తారు. టెట్‌కు హాజరయ్యేందుకు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, అనంతరం సంబంధిత దరఖాస్తులను ఆన్లైన్లో ‘http://cse.ap.gov.in’ ద్వారా సమర్పించాలి. టెట్ షెడ్యూల్, ఇతర సమాచారాన్ని కూడా ఇదే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏపీ టెట్ పేపర్-1, పేపర్-2లలో వేర్వేరుగా జరగనుంది. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో తొలిసారిగా ఈ టెట్ నిర్వహిస్తున్నారు. టెట్‌లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డీఎస్పీ రాయడానికి అర్హులు. -
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: డీఎస్సీకి హాజరు కావాలంటే తప్పనిసరిగా అర్హత సాధించాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్‌ను ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం అమరావతిలో విడుదల చేశారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్ 14న విడుదల చేస్తామని, అభ్యర్థులు డిసెంబర్ 18 నుంచి జనవరి 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. టెట్ పరీక్షను జనవరి 17 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఏపీలో ఇటీవల డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను డిసెంబర్ 15న విడుదల చేయనున్నారు. డీఎస్సీకి హాజరు కావాలంటే టెట్‌లో తప్పనిసరిగా అర్హత సాధించాలి. కాబట్టి టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహిస్తున్నారు. టెట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు http://cse.ap.gov.in/ లో పొందవచ్చు టెట్ మెటీరియల్, పాత ప్రశ్నాపత్రాలు, ఆన్లైన్ టెస్టుల కోసం క్లిక్ చేయండి ముఖ్య తేదీలు నోటిఫికేషన్ జారీ: డిసెంబర్ 14, 2017 దరఖాస్తులు ప్రారంభం: డిసెంబర్ 18, 2017 దరఖాస్తులకు చివరి తేది: జనవరి 1, 2018 హాల్‌టికెట్ డౌన్లోడ్ ప్రారంభం: జనవరి 9, 2018 ఆన్లైన్ పరీక్ష తేది: 2018 జనవరి 17 నుంచి 27 వరకు ప్రాథమిక కీ విడుదల: జనవరి 29, 2018 ఫైనల్ కీ విడుదల: ఫిబ్రవరి 6, 2018 తుది ఫలితాలు: ఫిబ్రవరి 8, 2018 వెబ్సైట్: http://cse.ap.gov.in -
టెట్... ఓకే
గతంతో పోల్చుకుంటే సులభంగా ప్రశ్నలు ► ఈసారి ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం ► పేపర్–1లో 88.59 శాతం, పేపర్–2లో 90 శాతం హాజరు ► రెండు ప్రశ్నలకు సరిగ్గా లేని తెలుగు అనువాదం ► ఈ నెల 25 లేదా 26న ‘కీ’లు సాక్షి, హైదరాబాద్ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ప్రశాంతంగా ముగిసింది. పేపర్–1 పరీక్షకు 88.59 శాతం, పేపర్–2 పరీక్షకు 90.09 శాతం అభ్యర్థులు హాజరయ్యారు. పేపర్–1 పరీక్షకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా 98,905 మంది హాజరయ్యారు. 12,742 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2 పరీక్షకు 2,56,265 మంది దరఖాస్తు చేసుకోగా.. 2,30,881 మంది హాజరయ్యారు. 25,384 మంది గైర్హాజరయ్యారు. ప్రశ్నలు గతంలో కంటే ఈసారి కాస్త సులభంగా ఉన్నట్లు విద్యార్థులు, సబ్జెక్టు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈసారి టెట్‌లో ఎక్కువ మంది అర్హత సాధించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. విషయ పరిజ్ఞాన సంబంధ, అవగాహనకు సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా అడిగారు. గణితం, ఇంగ్లిష్ బాగా రాయగలిగిన వారికి 110 కంటే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. పేపర్–2 గణితం అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మొత్తానికి పరీక్షలకు హాజరైన వారిలో ఎక్కువ మంది 85 నుంచి 110 మార్కుల వరకు పొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాస్త బాగా చదివిన వారికి 110–135 వరకు మార్కులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. పేపర్–1 సైకాలజీలో ఒక ప్రశ్నకు తెలుగు అనువాదం ఇంగ్లిష్తో పోల్చితే వేరుగా ఉందని, పేపర్–2లోనూ ఒక ప్రశ్నకు అనువాదం సరిగ్గా లేదని అభ్యర్థులు తెలిపారు. అలాగే పేపర్–1 సోషల్ ‘సి’ప్రశ్నపత్రంలో 127వ ప్రశ్నకు తెలుగు అనువాదం సరిగ్గా లేదని వివరించారు. పరీక్షల ‘కీ’లను ఈ నెల 25న లేదా 26న విడుదల చేసే అవకాశం ఉంది. పేపర్–1లో కామారెడ్డి, వనపర్తిలో అధిక హాజరు టెట్ పేపర్–1లో కామారెడ్డి, వనపర్తి జిల్లాల్లో అత్యధికంగా హాజరు శాతం నమోదైంది. కామారెడ్డిలో 98.11 శాతం మంది అభ్యర్థులు హజరు కాగా.. వనపర్తి జిల్లాలో 98.02 శాతం మంది హాజరయ్యారు. సంఖ్యాపరంగా చూస్తే ఎక్కువ మంది రంగారెడ్డి (14,774), ఖమ్మం (10,093) జిల్లాల నుంచి హాజరయ్యారు. మేడ్చల్ జిల్లాలో తక్కువ హాజరు శాతం (78.70%) నమోదైంది. పేపర్–2 పరీక్షలో కామారెడ్డిలో అధిక శాతం (97.81) హాజరు నమోదైంది. సంఖ్యాపరంగా రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ మంది అభ్యర్థులు (27,227) పేపర్–2కు హాజరయ్యారు. భార్య కోసం వచ్చి దొరికిపోయిన టీచర్ వనపర్తి విద్యావిభాగం: టెట్‌లో తన భార్యకు సహకరించేందుకు పరీక్ష హాలుకు వచ్చిన ఓ స్కూలు అసిస్టెంట్ అడ్డంగా దొరికిపోయాడు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాన్‌గల్ మండలం రేమొద్దుల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంట్ (ఇంగ్లిష్)గా పనిచేస్తున్న పరందామయ్య వనపర్తిలో జరిగిన టెట్–1 పరీక్షకు హాజరయ్యాడు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, అదికూడా స్కూలు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆయనకు ఈ పరీక్ష రాసే అవసరమే ఉండదు. ఆయన పరీక్ష రాయడాన్ని గమనించిన కొందరు అభ్యర్థులు.. డీఈవోకు ఫిర్యాదు చేశారు. పరీక్ష కేంద్రానికి వచ్చిన డీఈవో సుశీందర్‌రావు.. పరందామయ్యను నిలదీశారు. అదే పరీక్ష కేంద్రంలో మరో గదిలో తన భార్య విజయలక్ష్మి టెట్ రాస్తోందని, ఆమెకు స్కోర్ పెంచేందుకు సాయం కోసం వచ్చినట్లు అంగీకరించాడు. దీంతో డీఈవో వెంటనే పరందామయ్యను సస్పెండ్ చేశారు. మాస్ కాపీయింగ్ కోసం యత్నించారంటూ వనపర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్ట్రెచర్‌పై పరీక్షకు.. వికారాబాద్: టెట్ పరీక్షకు ఆదివారం ఓ మహిళ స్ట్రెచర్‌పై వచ్చింది. మహబూబ్‌నగర్ పట్టణం ఇబ్రహీంబాగ్‌కు చెందిన చెన్నమ్మకు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. అయినా పరీక్ష కోసం వికారాబాద్‌లోని అనంతగిరిపల్లి సాంఘిక గురుకుల పాఠశాలకు వచ్చింది. చెన్నమ్మను ఆమె తల్లిదండ్రులు ఆదివారం ఉదయం అంబులెన్స్‌లో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. స్ట్రెచర్‌పై లోపలికి తీసుకెళ్లి పరీక్ష రాయించారు. జీవిత ఖైదీ.. అయితేనేం..! నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్‌లో భూమేశ్ అనే జీవిత ఖైదీ టెట్ పరీక్షకు హాజరయ్యాడు. బాన్సువాడకు చెందిన ఈయనకు హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడింది. నిజామాబాద్ జైలులో శిక్ష అనుభవిస్తున్న భూమేశ్.. టెట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. జైలు అధికారుల అనుమతితో ఆదివారం హరిచరణ్ మార్వాడీ పాఠశాలలో టెట్–1 పరీక్ష రాశాడు. పరీక్ష హాల్ వద్ద సొమ్మసిల్లిన గర్భిణి చెన్నారావుపేట(నర్సంపేట): వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం అమీనాబాద్ మోడల్ స్కూల్ సెంటర్లో టెట్–2 పేపర్ రాసేందుకు వచ్చిన ఓ గర్భిణి సొమ్మసిల్లి పడిపోయింది. అభ్యర్థులను తనిఖీ చేసి పరీక్ష హాల్లోకి పంపిస్తుండగా కొత్తగూడ మండలం ముస్మికి చెందిన మౌనిక సొమ్మసిల్లి కిందపడిపోయింది. సెంటర్లో అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది ఆమెకు సపర్యలు చేసి ఓఆర్ఎస్ ద్రావణం తాగించారు. 15 నిమిషాల తర్వాత మౌనిక తేరుకుని పరీక్ష రాసింది. 15 నిమిషాల ఆలస్యం.. ఎగ్జామ్‌కు దూరం సిరిసిల్ల: పరీక్ష కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఓ అభ్యర్థి పరీక్షకు దూరం కావాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన లకావత్ శ్రీలత.. సిరిసిల్లలోని కుసుమ రామయ్య ఉన్నత పాఠశాలలో పరీక్ష రాయాల్సి ఉంది. కానీ పరీక్ష కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. దీంతో అధికారులు ఆమెను పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. కన్నీళ్లు పెట్టుకుంటూ ‘ప్లీజ్ సార్..’అని వేడుకున్నా కనికరించలేదు. -
బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే టెట్
-
బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే టెట్
నేడే పరీక్ష సాక్షి, హైదరాబాద్: టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్నే వాడాలని టెట్ కన్వీ నర్ శేషు కుమారి సూచించారు. ఆది వారం జరగనున్న ఈ పరీక్షకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,574 కేంద్రాల్లో పరీక్ష జర గనుండగా.. 3,67,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. పేపర్–1కు సం బంధించి ప్రశ్నపత్రం సెట్‌ను ఆదివారం ఉదయం 6 గంటలకు, పేపర్–2 ప్ర శ్నపత్రం సెట్‌ను ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రాలకు అందించనున్నారు. -
రేపు టెట్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆదివారం (23న) జరగనుంది. 1,574 కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 3,67,912 మంది హాజరవనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపరు–1కు 1,11,647 మంది; మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు జరిగే పేపరు–2కు 2,56,265 మంది హాజరవుతారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. టెట్ నిలుపుదలకు హైకోర్టు తిరస్కృతి కంటెంట్ ఆధారంగా ప్రశ్నలివ్వడంలో తప్పులేదని వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యా శాఖ నిర్వ హించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిలుపుదలకు ఉమ్మడి హైకోర్టు నిరాకరించింది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించ బోయే వారికి టెట్‌లో సీనియర్ సెకండరీ స్కూల్ (ఇంటర్) కంటెంట్ ఆధారంగా ప్రశ్నలు ఇవ్వడం లో తప్పేముందని పిటిషనర్లను ప్రశ్నించింది.ఇటువంటి ప్రశ్నలు ఇవ్వడం జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధమేమీ కాదని వ్యాఖ్యానించింది. టెట్‌లో ఇంటర్ స్థాయి సిలబస్ ఆధారంగా ప్రశ్నలు ఉంటాయంటూ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫి కేషన్‌ను సవాలు చేస్తూ నల్లగొండకు చెందిన జి.సునీత, మరికొందరు వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఇంటర్ స్థాయి ప్రశ్నలు ఇవ్వడం సరికాదని, దీనివల్ల టెట్‌లో అర్హత సాధించడం కష్టతరమవుతుందని తెలిపారు. కనుక టెట్ పరీక్షను నిలుపుదల చేస్తూ ఉత్తర్వు లివ్వాలని కోరారు. న్యాయమూర్తి ఇందుకు తిరస్కరించారు. సిలబస్ కంటెం ట్‌పై ఎన్‌సీటీఈలో పరిమితులు ఎక్కడున్నాయో చూపాలన్నారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు విషయ పరిజ్ఞానం నిమిత్తమే ప్రభుత్వం ఈ నోటిఫి కేషన్ జారీ చేసినట్లుందన్నారు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే స్థాయిలో ఉపాధ్యాయులు ఉండాలన్న న్యాయమూర్తి, టెట్ నిలుపుదలకు నిరాకరించారు. తదుపరి విచారణను వాయిదా వేశారు. గ్రూప్–1 ఇంటర్వ్యూల నిలిపివేతకు నో... గ్రూప్–1 ఇంటర్వ్యూల నిలుపుదలకు హైకోర్టు నిరాకరించింది. ఉమ్మడి రాష్ట్రం లో జారీ చేసిన 2011 నోటిఫికేషన్ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతుంటే సాంకేతిక కారణాలను చూపుతూ వాటిని నిలిపేయాలని కోరడం సరికాదని వ్యాఖ్యానించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మరో సారి స్పష్టం చేసింది. గ్రూప్–1 రాత పరీక్షల ఆధారంగా తయారు చేసిన తాత్కా లిక జాబితాలో లోపాలున్నాయని, అందువల్ల ఇంటర్వ్యూలను నిలిపేయాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి విచారణ జరిపారు. 2011 నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు పోస్టుల భర్తీ ప్రక్రియ సాగుతోందని గుర్తు చేశారు. ఇప్పుడు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ ఆ ప్రక్రియను ఆపాలనడం సరికాదంటూ విచారణను వాయిదా వేశారు. -
టెట్‌కు ఏర్పాట్లు చేయండి
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఈ నెల 23వ తేదీన నిర్వహించనున్నారని, నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. టెట్ నిర్వహణపై బుధవారం కలెక్టర్ తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టెట్‌ను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని చెప్పారు. పేపర్–1 23న ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని, పేపర్–2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ పరీక్షకు మొత్తం 31,759 మంది హాజరుకానుండగా 95 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించా రు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అంతరా యం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద వైద్య శిబిరాలను అందుబాటులో ఉంచాలని, సకాలంలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మీబాయి, డిప్యూటీ డీఈఓ మురళీధర్, జిల్లా పరీక్షల నిర్వహణ అసిస్టెంట్ కమిషనర్ కె.శ్రీనివాస్, ఏసీపీ గణేష్, ఆర్టీసీ ఆర్ఎం జగన్, సూపరింటెండెంట్ పవన్ తదితరులు పాల్గొన్నారు. -
టెట్‌లో అన్యాయం
- డీఎడ్–డిగ్రీ వారికి పేపర్–2 రాసేందుకు అనుమతి నిరాకరణ - డిగ్రీలో 50 శాతం మార్కులు లేని జనరల్ అభ్యర్థులు ఔట్ సాక్షి, హైదరాబాద్: విద్యా శాఖ అనాలో చిత నిర్ణయాలవల్ల అనేక మంది ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అభ్యర్థులకు అన్యాయం జరగనుంది. త్వరలో నిర్వహించనున్న టెట్‌కు వేల మంది అభ్యర్థులు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) పూర్తి చేసి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు లక్షల మంది ఉన్నారు. వారికి టెట్ పేపర్–2 రాసేందుకు విద్యా శాఖ ఈసారి అనుమతి ఇవ్వలేదు. దీంతో వారంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను తుంగలో తొక్కి లక్షల మంది అభ్యర్థులకు విద్యా శాఖ అన్యాయం చేస్తోంది. 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) పూర్తి చేసిన జనరల్ అభ్యర్థులను కూడా టెట్‌కు అనుమతించలేదు. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లో టీచర్లుగా పనిచేయాలనుకునే వారు కూడా కచ్చితంగా టెట్‌లో అర్హత సాధించాలని ఎన్సీటీఈ స్పష్టం చేసింది. ఈ నిబంధనలతో 45 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కనీసం ప్రైవేటు పాఠశాలల్లోనైనా ఉపాధి పొందలేని పరిస్థితి నెలకొంది. నిబంధనలు ఏం చెబుతున్నాయంటే... విద్యా హక్కు చట్టం ప్రకారం 2010లో టీచర్లు కావాలనుకునే వారికి టెట్‌ను ఎన్సీటీఈ తప్పనిసరి చేసింది. ఈ మేరకు 2010 ఆగస్టు 23న టెట్ మార్గదర్శకాలను జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారు 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు (ఈ మార్గదర్శకాలు వచ్చే నాటికంటే ముందుగా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు) డీఎడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలని, వాటితోపాటు టెట్ పేపర్–1లో కచ్చితంగా అర్హత సాధించి ఉండాలని స్పష్టం చేసింది. 6, 7, 8 తరగతులకు బోధించాలనుకునే వారు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతో పాటు (ఈ మార్గదర్శకాలు వచ్చే నాటికంటే ముందు పూర్తి చేసిన వారు 45 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు) బీఎడ్ పూర్తి చేసి ఉండాలని, డీఎడ్‌తో పాటు డిగ్రీ పూర్తి చేసిన వారు కూడా పేపర్–2 పరీక్షకు హాజరుకావొచ్చంది. నిబంధనలను పక్కన పెట్టి.. టీచర్లుగా నియమితులయ్యే వారికి ఉండాల్సిన నిర్ణీత అర్హతలను సాకుగా చూపి వారికి అన్యాయం చేస్తోంది. నిర్ణీత అర్హత 50 శాతం మార్కులు ఉండాలని ఎన్సీటీఈ చెప్పిందంటూ వారంతా టెట్ రాయడానికి వీల్లేకుండా చేస్తోంది. కానీ 2015 డిసెంబర్ 23 నుంచి ఎన్సీటీఈ అమల్లోకి తెచ్చిన ‘ఉపాధ్యాయుల కనీస అర్హతలు–2014’లో అలాంటిదేమీ లేదు. అయినా విద్యా శాఖ ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి నిరుద్యోగులకు అన్యాయం చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల్లో బోధించే వారికి కూడా టెట్‌ను తప్పనిసరి చేసిన విద్యా శాఖ ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం అన్ని అర్హతలున్న వారిని కూడా టెట్‌కు హాజరు కాకుండా చేస్తోంది. డీఎడ్ పూర్తి చేసి, ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు 50 వేల మందికి పైగా అభ్యర్థులు ఉన్నారు. వారికి టెట్ పేపర్–2 రాసే అవకాశం ఇవ్వట్లేదు. గతంలో 4 టెట్‌లలోనూ వారికి అవకాశం ఇచ్చి ఈసారి మాత్రం ససేమిరా అంటున్నారు. -
టెట్ దరఖాస్తు గడువు 30 వరకు పెంపు
సాక్షి, హైదరాబాద్: టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు టెట్ కన్వీనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. అలాగే బీఈ/బీటెక్ చదివి బీఈడీ 2015–17 బ్యాచ్‌కు చెందిన.. ప్రస్తుతం రెండో ఏడాది నాలుగో సెమిస్టర్ చదువుతున్న అభ్యర్థులు టెట్ పేపర్–2 పరీక్షకు అర్హులుగా పేర్కొన్నారు. వీరు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
టెట్ సిలబస్‌లో స్వల్ప మార్పులు
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సిలబస్‌లో విద్యా శాఖ స్వల్ప మార్పులు చేసింది. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అంశాన్ని టెట్ సిలబస్‌లో చేర్చింది. బోధన పద్ధతులు అంశంలో దీన్ని చేర్చింది. ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ అంశాలను ఇందులో పేర్కొంది. టెట్‌లో వీటిపైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. -
నేటి నుంచి టెట్ దరఖాస్తులు
బీఎడ్, డీఎడ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులూ పరీక్ష రాయొచ్చు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) దరఖాస్తులు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ రాయవచ్చు. అయితే టెట్‌లో అర్హత సాధించినంత మాత్రాన ఉపాధ్యాయ పోస్టులకు అర్హులు కాదు, నిర్ణీత నిబంధనలు పూర్తిచేయాల్సి ఉంటుంది. టెట్‌కు సంబంధించిన వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు ఈనెల 22 వరకు, ఆన్లైన్లో దరఖాస్తులకు 23వ తేదీ వరకు గడువు ఉంటుంది. వచ్చే నెల 23న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్–2 పరీక్ష ఉంటుంది. ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేస్తారు. పేపర్–1కు, పేపర్–2కు రూ.200 చొప్పున పరీక్ష ఫీజుగా నిర్ణయించారు. రెండింటికి దరఖాస్తు చేసినా రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ్టట్ట్ఛ్ట. ఛిజజ.జౌఠి.జీn వెబ్సైట్లో పొందవచ్చు. అన్ని జిల్లా కేంద్రాల్లో రాతపరీక్ష ఉంటుంది. 45 శాతం మార్కులు ఉండాలి పేపర్–1కు హాజరయ్యేవారు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై (ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం) డీఎడ్ పూర్తి చేసి ఉండాలి. అదే 2015 డిసెంబరు 23కంటే ముందు డీఎడ్‌లో చేరినవారు, ఇప్పటికే డీఎడ్ పూర్తిచేసిన వారు ఇంటర్లో 45 శాతం మార్కులు సాధించి ఉంటే సరిపోతుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 40 శాతం మార్కులు సాధించి ఉంటే చాలు. పేపర్–2కు హాజరయ్యేవారు డిగ్రీ, బీఎడ్ ఉత్తీర్ణులై ఉండాలి. మార్కుల విధానం డీఎడ్‌కు తరహాలోనే వర్తిస్తుంది. హెల్ప్‌లైన్ కేంద్రాల వివరాలు టెట్ కార్యాలయం: 9133353370, 9133353371 వెబ్సైట్ సంబంధ సమస్యలుంటే: 9133353372, 9133353373 సాంకేతిక సమస్యలు తలెత్తితే: 9133353374, 9133353375 సీజీజీ హెల్ప్‌డెస్క్ నంబర్లు: 9133353376, 9133353377 డిగ్రీ డీఎడ్ వారికి అవకాశం కల్పించాలి డిగ్రీతోపాటు డీఎడ్ ఉన్న వారికి టెట్ రాసే అవకాశం కల్పించాలని పాఠశాల విద్య కమిషనర్ కిషన్‌కు డీఎడ్, బీఎడ్ విద్యా సంఘాలు విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందించారు. కాగా టెట్‌లో ఓసీ (జనరల్) అభ్యర్థులకు అర్హత మార్కులను తగ్గించాలని ఓసీ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. -
టీఎస్ టెట్–2017 నోటిఫికేషన్ విడుదల
రేపట్నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష–2017 నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తుల స్వీకరణ, ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభం కానుంది. పరీక్షల నిర్వహణ, సిలబస్ తదితర సమాచారాన్ని సోమవారం నుంచి టీఎస్ టెట్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టెట్ కన్వీనర్ వెల్లడించారు. జూలై 23న టెట్ నిర్వహించి ఆగస్టు 5న ఫలితాలు ప్రకటించనున్నారు. -
జూలై 23న టెట్
ఈ నెల 10న నోటిఫికేషన్ జారీ చేస్తాం: కడియం - డీఎస్సీ స్థానంలో ‘టీచర్ సెలక్షన్ టెస్ట్’ - ఆగస్టు 6న 8,792 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. ఈ ఏడాది మొత్తంగా 17 వేల పోస్టుల భర్తీ - వచ్చే ఏడాది మరో 10 వేల పోస్టులు భర్తీ చేస్తామన్న డిప్యూటీ సీఎం - త్వరలో వైద్యారోగ్య శాఖలో 2 వేల పోస్టులు: ఘంటా సాక్షి, హైదరాబాద్: ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఈ నెల 10న టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని.. వచ్చే నెల 23న పరీక్ష నిర్వహిస్తామని ప్రకటిం చింది. ఫలితాలను ఆగస్టు 5న విడుదల చేస్తామని, ఆ మరునాడే ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపింది. ఈ అంశంపై బుధవారం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, ఇతర అధికారులు సచివాలయంలో సమావేశమై చర్చించారు. అనంతరం కడియం వివరాలను వెల్లడించారు. ఈనెల 10వ తేదీన టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని, 12వ తేదీ నుంచి ఫీజు చెల్లింపు, ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ చేపడతామని తెలిపారు. వచ్చే నెల 23న టెట్ నిర్వహించి, ఆగస్టు 5న ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఈ పరీక్ష విద్యా శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతుందని తెలిపారు. న్యాయ వివాదాలు తలెత్తకుండా.. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాల ప్రకారం టెట్ తప్పనిసరని... 2016 మే తరువాత రాష్ట్రంలో 26,100 మంది బీఎడ్ (18 వేలు), డీఎడ్ (8,100) పూర్తి చేసుకున్నారని కడియం తెలిపారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయ వివాదాలు రాకుండా ఉండాలంటే వారి కోసమైనా టెట్ పెట్టాల్సి ఉందని.. అందుకే టెట్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కొత్తవారితోపాటు, ఇప్పటివరకు అర్హత సాధించనివారు, అర్హత సాధించినా మార్కులు పెంచుకోవాలనుకునే వారు కూడా ఈ టెట్‌కు హాజరుకావచ్చని తెలిపారు. వచ్చే ఏడాదీ టీచర్ పోస్టుల భర్తీ.. ఈ ఏడాది పాఠశాలలు, గురుకులాల్లో కలిపి 17 వేల పోస్టులను భర్తీ చేస్తున్నామని కడియం వెల్లడించారు. వివిధ గురుకులాల్లో 17,592 పోస్టులు (14,074 టీచింగ్, 3,518 నాన్ టీచింగ్) ఖాళీగా ఉండగా 8,436 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని.. మిగతా 6 వేల పోస్టులను వచ్చే ఏడాది భర్తీ చేస్తామని తెలిపారు. ఇక టెట్ తరువాత ప్రభుత్వ స్కూళ్లలో 8,792 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇవి 2016 సెప్టెంబర్ వరకున్న ఖాళీలేనని, తర్వాత మరో 5 వేల వరకు ఖాళీలు ఏర్పడ్డాయని చెప్పారు. ఈ ఖాళీ పోస్టులకు, గురుకులాల్లోని 6 వేల పోస్టులకు వచ్చే ఏడాది నోటిఫికేషన్ ఇస్తామన్నారు. కొత్త జిల్లాల ప్రకారమే.. వివాదాలతో నియామకాల ప్రక్రియ ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో.. అర్హతలపై న్యాయశాఖ, జీఏడీ, ఆర్థిక శాఖలతో సంప్రదించామని కడియం వెల్లడించారు. 31 జిల్లాల వారీగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని... ఆయా జిల్లాల వారీగా రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిర్ణయించామని తెలిపారు. ఈ పోస్టుల భర్తీలో జోనల్ సమస్య ఉండదన్నారు. 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) 1,260 పోస్టులను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇక టీఎస్టీ నిర్వహణ: ఘంటా చక్రపాణి ఇక టెట్ ఫలితాలు వెల్లడైన మరునాడే 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ‘టీచర్ సెలెక్షన్ టెస్టు (టీఎస్టీ)’నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో పోస్టులను భర్తీ చేసినందున డీఎస్సీగా పిలిచారని.. ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించనున్నందున ‘టీఎస్టీ’గా చేపట్టనున్నామని వివరించారు. అన్ని కలసివస్తే రెండేళ్లలో 25 వేల పోస్టుల భర్తీ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. ‘‘ఇప్పటికే 24 నోటిఫికేçషన్ల ద్వారా 5,999 పోస్టులను భర్తీ చేశాం. 7,306 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. మరో 2,347 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చాం. త్వరలో వైద్యారోగ్య శాఖలో 2వేలకు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం. టీఎస్టీ పోస్టులు 8,792 కలుపుకొంటే రెండేళ్లలో దాదాపు 25 వేల పోస్టుల భర్తీ లక్ష్యానికి చేరుకుంటాం..’’అని చెప్పారు. ఇక గ్రూప్–2 పరీక్ష విషయంలో కటాఫ్ మార్కులను ఏ సర్వీసు కమిషన్ ప్రకటించదని.. నియామకాల ప్రక్రియ పూర్తయ్యాక ప్రకటిస్తాయని చక్రపాణి చెప్పారు. ఏ పరీక్షా కేంద్రంలోనూ ఒకే వరుసలో ఉన్న వారు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎంపిక కాలేదని.. హైదరాబాద్ 1.79 లక్షల మంది పరీక్ష రాస్తే 1,500 వరకు ఎంపికయ్యారని, నిజామాబాద్‌లో 30 వేల మంది రాస్తే 133 మంది ఎంపికయ్యారని చెప్పారు. గ్రూప్–2 విషయంలో అనుమానాలు అవసరం లేదని.. వెబ్సైట్లో జాబితాలు పెట్టామని, పరిశీలించుకోవచ్చని పేర్కొన్నారు. టెట్ షెడ్యూల్ ఇదీ.. ఈ నెల 10న: టెట్ నోటిఫికేషన్ జారీ 12న: అందుబాటులోకి పూర్తిస్థాయి నోటిఫికేషన్, సమాచార బులెటిన్ 12 నుంచి 22 వరకు: ఆన్లైన్లో ఫీజుల చెల్లింపు 13 నుంచి 23 వరకు: ఆన్లైన్లో (http://tstet.cgg.gov.in) దరఖాస్తులు జూలై 17 నుంచి: హాల్‌టికెట్ల డౌన్లోడ్ జూలై 23న: టెట్ పరీక్ష (పేపర్–1 ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు. పేపర్–2 మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5.00 వరకు) ఆగస్టు 5న: టెట్ ఫలితాలు విడుదల ఆగస్టు 6న: టీఎస్టీ నోటిఫికేషన్ -
టెట్, డీఎస్సీపై ప్రకటన వచ్చేసింది
హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగాల జాతర వేగం పుంజుకుంది. ఇప్పటికే గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువరించి పరీక్షలు కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల తిరిగి ఇదే గురుకులాల్లో డీఎల్, జేఎల్ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. తాజాగా త్వరలో నిర్వహించబోయే డీఎస్సీకి ముందు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం ఆ వివరాలు తెలియజేశారు. ఈ నెల 10న టెట్ పరీక్ష కోసం ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే నెల(జూలై) 23న పరీక్ష ఉంటుందని చెప్పిన ఆయన ఆగస్టు 5న ఫలితాలు విడుదల చేస్తామని, ఆ వెంటనే డీఎస్సీ నిర్వహించేందుకు ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. -
ఏటా రెండు టెట్లు ఏవీ?
-
ఏటా రెండు టెట్లు ఏవీ?
ఎన్సీటీఈ మార్గదర్శకాలు బేఖాతరు! ► తెలంగాణ ఏర్పాటయ్యాక మూడేళ్లలో నిర్వహించింది ఒకటే టెట్ ► ఇప్పటివరకు అర్హత సాధించింది 3 లక్షల మంది ► ఎదురుచూస్తున్న వారు మరో 2.5 లక్షలు ► డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ల నియామక నిబంధనల్లో ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) అర్హత తప్పనిసరిగా పేర్కొన్న విద్యాశాఖ.. దాని నిర్వహణపై మాత్రం అలసత్వం ప్రదర్శిస్తోంది. లక్షల మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్న టెట్‌ను ఏటా రెండు సార్లు నిర్వహించాలన్న జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలనూ బేఖాతరు చేస్తోంది. ప్రస్తుతం గురుకుల టీచర్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండటం, త్వరలో పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానున్న నేపథ్యంలో టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అయినా టెట్ నిర్వహణపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి దృష్టి పెట్టడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే టెట్‌లో అర్హత సాధించిన వారు 3 లక్షల మంది ఉన్నారని, ఇప్పుడు టెట్ అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించిన నేపథ్యంలో అభ్యర్థులు ఆందోళనలో మునిగిపోతున్నారు. ఇక మరోవైపు టీచర్ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉంది. దీంతో ఇప్పటికే టెట్‌లో అర్హత పొందినవారు కూడా స్కోర్ పెంచుకునేందుకు టెట్ నిర్వహించాలని కోరుతున్నారు. ప్రైవేటులో బోధనకూ టెట్ కావాల్సిందే ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ స్కూళ్లేకాదు ప్రైవేటు స్కూళ్లలోనూ టెట్ అర్హులు మాత్రమే ఉపాధ్యాయులుగా పనిచేయాలి. రాష్ట్రంలోని 29 వేలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో టెట్‌లో అర్హత సాధించిన వారినే ఉపాధ్యాయులుగా నియమిస్తున్న నేపథ్యంలో.. 11 వేలకుపైగా ఉన్న ప్రైవేటు స్కూళ్లలోనూ కచ్చితంగా అమలు చేయాలని గతంలో విద్యాశాఖ భావించింది. కానీ ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయుల్లో 64 శాతం మంది టెట్‌లో అర్హత సాధించనివారు, ఎలాంటి ఉపాధ్యాయ శిక్షణ పొందని వారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్ చేసిన వారు ఉన్నత పాఠశాల్లో సైన్స్, గణితం వంటి సబ్జెక్టులను బోధిస్తున్నారు. వారిలో ఉపాధ్యాయ శిక్షణ పొందని వారు ఇంగ్లిషు బోధిస్తున్నారు. ఇలాంటి వారికి బోధనకు సంబంధించిన పదజాలంపై పట్టులేదు. పాఠ్య పుస్తకాల నేపథ్యం, తాత్వికత, అభ్యాసాలు, విద్యా ప్రమాణాల గురించి అవగాహన ఉండదు. కేవలం పాఠం వివరించి, జ్ఞాపకం చేయించడం, వారాంతంలో పరీక్షలు నిర్వహించడం వంటివే చేస్తున్నారు. అయినా ఉపాధ్యాయ శిక్షణ, టెట్ నిర్వహణ వంటి అంశాలను విద్యాశాఖ పట్టించుకోవడం లేదు. ఆరేళ్లలో ఐదు టెట్లే! ఎన్సీటీఈ 2011లో టెట్ నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఐదు సార్లు టెట్ నిర్వహించారు. నిబంధనల ప్రకారమైతే ఏటా రెండుసార్లు చొప్పున ఆరేళ్లలో 12 సార్లు టెట్ నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడుసార్లు టెట్ నిర్వహించగా.. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండుసార్లే నిర్వహించారు. అందులోనూ ఒకటి ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన నోటిఫికేషనే. తెలంగాణ ఏర్పాటయ్యాక ఈ మూడేళ్లలో నిర్వహించింది ఒకే ఒక్క టెట్. మొత్తంగా ఐదుసార్లు నిర్వహించిన టెట్లలో తెలంగాణకు చెందిన వారు దాదాపు 3 లక్షల మంది అర్హత సాధించినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. మరో 2.5 లక్షల మంది టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. -
టెట్..ఇక తప్పనిసరి
ప్రైవేట్ పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్ధులకు పాఠాలు బోధించాలంటే టీచర్లు టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత సాధించి ఉండాల్సిందే. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుండడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల్లో ఆందోళన నెలకొంది. ఆలేరు యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 145 ప్రైవేట్ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక–25, ప్రాథమికోన్నత–30, ఉన్నతపాఠశాలలు–90 ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. దీంతో పాటుగా టెట్‌లో క్వాలిఫై అయిన ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలల యాజమాన్యం వేతనం ఎక్కువగా ఇచ్చే అవకాశముంది. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ బడుల్లో బోధించాలంటే టెట్ తప్పనిసరి. ఇటీవల ప్రైవేట్ పాఠశాలలను ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. అనేక పాఠశాలల్లో టెట్ క్వాలిఫై కానివారు బోధిస్తున్నారని తేలింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి టెట్‌లో క్వాలిఫై అయినవారినే ఉపాధ్యాయులుగా నియమించుకునేలా ఆదేశాలు జారీచేయనున్నారు. అనుభవం లేని ఉపాధ్యాయులతో.. జిల్లాలోని పలు పాఠశాలల్లో అనుభవం లేని ఉపాధ్యాయులచే బోధన జరుపుతున్నారు. విద్యార్ధులకు ఆ«ధునిక పరిజ్ఞానంతో విద్యాభోధన అంటూ వేలాది రూపాయల్లో ఫీజులను వసూలు చేస్తున్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ విద్యార్హత ఉన్నవారితో భోదిస్తున్నారు. సరైన విద్యార్హతలు లేకుండానే నియమిస్తున్నారు. అయితే బీఎడ్, డీఎడ్ శిక్షణతో పాటు టెట్ తప్పనిసరి ఉండాలనే నిబంధనతో ప్రైవేట్ యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ఇలా అయితే ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులైన అభ్యర్ధులు దొరకగా ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంది. దీంతో పాటుగా ప్రైవేట్ యాజమాన్యాలు 1 నుండి 5, 1 నుండి 7 తరగతులకు ఆప్‌గ్రేడ్ కావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 5 నుండి 7, 6నుండి 10 తరగతుల వరకు ఆప్‌గ్రేడ్ కావాలంటే టెట్ అర్హత ఉన్న ఉపాధ్యాయులను నియమించుకోవాల్సిందే. పాఠశాల కమిటీలేవీ.. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాఠశాల కమిటీ ఏర్పాటు చేయాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ నిర్ణయం ప్రకారమే పాఠశాలలోని సౌకర్యాల ఆధారంగా ఫీజులు నిర్ణయించాల్సి ఉం టుంది. విద్యాశాఖ కూడా పాఠశాల ఫీజులకు సంబంధించి ఆదేశాలిచ్చింది. ప్రతినెల తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలని నిబంధన ఉన్న అమలుకు నోచుకోవడం లేదు. టెట్ అర్హతపై విమర్శలు ఉపా«ధ్యాయ ఉద్యోగం సంపాదించుకోవడానికి అర్హత అభ్యర్థులకు ప్రభుత్వం సంకెళ్లు వేస్తుందని ఆరోపి స్తున్నారు. అర్హత సాధించినవారే డీఎస్సీ రాసేందుకు అర్హులని పేర్కొనడంతో పలు విమర్శలకు దారితీస్తున్నాయి. టెట్‌ను మొదటి నుంచి ఉపాధ్యాయ సంఘాల నాయకులు, నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీంతోపాటుగా ప్రైవేట్‌స్కూళ్లలో బోధన జరపాలంటే టెట్ క్వాలిఫై ఉండాలని విద్యాశాఖ పేర్కొనడంతో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిబంధనలు ఇవీ.. బీఎడ్, డీఎడ్ చేసిన ఉపాధ్యాయులు ఉండాలి. వీరికి కనీస వేతనాలు అమలుచేయాలి. పీఎఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలి. ఉపాధ్యాయుల పేర్లు, వారి విద్యార్హతలు తెలిపే వివరాలను, వారి జీతభత్యాలను పాఠశాల ఆవరణలోని బోర్డుపై అడ్మిషన్లకు ముందే పెట్టాలి. ఫీజుల వివరాలను బోర్డుపై పెట్టాలి. ఇష్టానుసారంగా ఫీజులు పెంచే అధికారం లేదు. మేనెజ్మెంట్ కమిటీ నిర్ణయం మేరకు పెంచాలి. దీంట్లో విద్యార్థుల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. విద్యాహక్కు చట్టం ప్రకారం వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు 25శాతం సీట్లను కేటాయించాలి. క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలకు సరిపడే స్థలం ఉండాలి. 14సంవత్సరాలలోపు పిల్లలను పాఠశాలలో చేర్చుకునేటప్పుడు ఎలాంటి ప్రవేశపరీక్ష నిర్వహించరాదు. డోనేషన్లు, బిల్డింగ్ ఫండ్, మేనేజ్మెంట్ ఫీజు, వార్షికోత్సవాలు వివిధ కార్యక్రమాల పేరిట ఫీజులను వసూలు చేయవద్దు. కేవలం ట్యూషన్ ఫీజులను మాత్రమే తీసుకోవాలి. -
టెట్ ఉండాల్సిందే!
గురుకుల ఉపాధ్యాయ నియామకాలపై స్పష్టత ఇచ్చిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయులుగా పనిచేయాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించి ఉండాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయ నియామకాల్లో టెట్‌కు వెయిటేజీ ఇవ్వాలా, వద్దా అన్నదానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీనిపై ఇదివరకే ప్రభుత్వానికి లేఖ రాసినట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లో టీజీటీగా నియమితులయ్యేవారు 8వ తరగతి వరకు బోధిస్తారు కాబట్టి టెట్‌లో అర్హత సాధించిన వారినే ఆ పోస్టుల భర్తీ పరీక్ష రాసేందుకు అనుమతించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గురుకుల పోస్టులపై గందరగోళం: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం ఇటీవల పరీక్షల విధానాన్ని (స్కీం) ప్రకటించింది. అందులో టెట్ ప్రస్తావన లేదు. దీంతో టెట్‌లో అర్హత సాధించిన వారే ఆ పరీక్ష రాయాలా, అర్హత సాధించని వారు కూడా రాయవచ్చా అన్న గందరగోళం నెల కొంది. అసలు ఇప్పటివరకు విద్యాశాఖ చేపడుతున్న ఉపాధ్యాయ నియామక పరీక్షకు 80 శాతం, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో గురుకుల టీచర్ల భర్తీలో టెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలా, వద్దా.. అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని టీఎస్పీఎస్సీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రభుత్వం విద్యాశాఖను వివరణ కోరగా.. నిబంధనల ప్రకారం టెట్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లందరికీ టెట్ తప్పనిసరని ఎన్సీటీఈ చెబుతోందని పేర్కొంది. అయితే టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇస్తారా, లేదా... టెట్‌ను అర్హత పరీక్షగానే చూడాలా అన్న విషయంలో గురుకుల సొసైటీలు, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. -
విద్యా వలంటీర్ల భర్తీకి నోటిఫికేషన్
- తొలుత 9,335 పోస్టుల్లో నియామకానికి చర్యలు - తరువాత మరో 2 వేలకుపైగా భర్తీకి నిర్ణయం - శ్రీనివాస ప్రాంతానికి చెందిన వారికే ప్రాధాన్యం - మెరిట్ ప్రకారం నియామకాలు.. టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల్లో విద్యా వలంటీర్ల నియామకం కోసం జిల్లా విద్యాశాఖ కార్యాలయాలు బుధవారం నోటిఫికేషన్లు జారీ చేశాయి. పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా 9,335 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జిల్లాల చెందిన విద్యాశాఖ వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని సంబంధిత మండల విద్యాధికారుల (ఎంఈవోల)కు అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించి మండలాల వారీగా మెరిట్ జాబితాలను రూపొందించి నియామకాలు చేపడతారు. ఈనెల 16వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 20వ తేదీ వరకు విద్యా వలంటీర్ల సేవలు వినియోగించుకుంటారు. వారికి నెలకు రూ.8 వేల గౌరవ వేతనం అందజేస్తారు. మార్గదర్శకాలివీ.. విద్యా వలంటీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారికి ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నుంచి 44 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో అర్హత సాధించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటే జీ ఇస్తారు. మండలాల వారీగా రోస్టర్ పాయింట్లను కేటాయించి, మెరిట్ జాబితాలను రూపొందించాలి. నియామకాల సమయంలో మాత్రం ఆయా నివాస ప్రాంతానికి చెందిన వారికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గ్రామానికి చెందిన వారు అందుబాటులో లేకపోతే పక్క గ్రామానికి చెందిన వారిని నియమిస్తారు. సంబంధిత గ్రామంలో, పక్క గ్రామంలో అర్హులైన అభ్యర్థులు లేకపోతే మండలం మెరిట్ జాబితాలోని జనరల్ లిస్టు నుంచి అభ్యర్థులను నియమిస్తారు. ఆ మండలంలో అభ్యర్థులు లేకపోతే పక్క మండ లానికి చెందిన వారిని నియమిస్తారు. ఇక విద్యా వలంటీర్‌గా నియమితులయ్యేవారు ఆ గ్రామంలోనే ఉండి బోధన చేపడతామని స్కూల్ మేనేజ్మెంట్ కమిటీతో ఒప్పందం చేసుకోవాలని, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ ఉండాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ నియామకాలకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవ హరించే జిల్లా స్థాయి కమిటీ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నియామకాలను ఈనెల 15లోగా పూర్తి చేయాలని, 16వ తేదీ నుంచి విద్యా వలంటీర్లు పాఠశాల్లో బోధించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతమున్న ఖాళీలను విద్యా వలంటీర్లతో భర్తీ చేస్తున్నా.. పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య, అవసరాల ఆధారంగా త్వరలోనే మరో 2 వేలకుపైగా విద్యా వలంటీర్లను నియమించేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. -
సిలబసే కొంపముంచిందా?
♦ నిరాశపరిచిన ‘టెట్’ ♦ సగానికిపైగా అనుత్తీర్ణత ♦ ఆందోళనలో అభ్యర్థులు నిజామాబాద్‌అర్బన్ : టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలు అభ్యర్థులను నిరాశపరిచాయి. గతంలో ఎన్నడూ లేనంతగా తక్కువ ఉత్తీర్ణత నమోదవడంతో అందరూ ఆందోళన చెందుతున్నారు. టెట్‌పై స్పష్టత కరువవడం, సిలబస్‌లు కొంపముంచాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత నెల 22వ తేదీన టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు చూసిన అభ్యర్థులు అవాక్కయ్యారు. జిల్లా వ్యాప్తంగా టెట్ పేపర్-1కు సంబంధించి 8,595 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 4,910 మంది(57.13 శాతం) అభ్యర్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. పేపర్-2కు 19,930 అభ్యర్థులు హాజరుకాగా 4,500 మంది(22.58 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 77.42 శాతం అనుత్తీర్ణులవ్వడం గమనార్హం. టెట్ ఉత్తీర్ణులు కాకపోవడంతో డీఎస్సీకి అర్హత సాధించలేకపోయారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సిలబస్‌పై గందరగోళం.. టెట్‌లో తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడానికి సిలబస్‌తోపాటు, పరీక్ష తరచూ వాయిదా పడుతూ రావడం కారణంగా తెలుస్తోంది. ఏడాది కిందట టెట్‌కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పటి నుంచి పరీక్ష తేదీ ప్రకటన వరకు ఎలాంటి సిలబస్ విధివిధానాలు ప్రకటించలేదు. మరోవైపు కోచింగ్ సెం టర్లు సైతం ఎవరికి తోచిన సిలబస్‌ను వారు బోధిం చారు. చాలా మంది మార్కెట్లో లభించిన పోటీ పరీక్ష ల పుస్తకాలు కొనుగోలు చేసి చదివారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో.. తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సిలబస్ ఉంటుందని భావించి పలువురు బోల్తాపడ్డారు. సిలబస్ ఎలా ఉంటుందో తెలియకపోవడం, పరీక్ష తేదీ తరయచూ వాయిదా పడుతూ రావడంతో అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు. కోచింగ్‌లతో ఫలితమేమి? జిల్లా కేంద్రంతో పాటు పలు పట్టణాల్లో కలిపి పోటీపరీక్షల కోచింగ్ సెంటర్లు 36 ఉన్నాయి. డీఎస్సీ, టెట్‌కు సంబంధించి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకముందే బ్యాచ్‌లు నిర్వహించారు. నోటిఫికేషన్ ఇచ్చాక బ్యాచ్‌ల జోరు పెరిగింది. వేలాది మంది ఆయా కోచింగ్ సెంటర్లలో చేరి కోచింగ్ తీసుకున్నారు. కోచింగ్ సెంటర్లు ఒక్కో అభ్యర్థినుంచి కనీసం రూ. 5 వేలు వసూలు చేశాయి. ఈ ఏడాది జిల్లా కేంద్రంలో నాలుగు కోచింగ్ సెంటర్లు వెలిశాయి. అభ్యర్థులను ఎక్కువ మొత్తంలో చేర్చుకున్న పలు కోచింగ్ సెంటర్లు.. స్థలం సరిపోక కళ్యాణ మండపాలు, కుల సంఘాలు, ఇతర భవనాలను అద్దెకు తీసుకొని మరీ కోచింగ్ ఇచ్చాయి. కానీ ఫలితాలు మాత్రం ఆశించిన విధంగా రాలేదు. వేలాది రూపాయలు బూడిదలో పోసినట్తైదని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలి టెట్ -2లో దారుణమైన ఫలితాలు వచ్చాయి. సెలబస్‌పై స్పష్టత లేకపోవడంతో చాలా మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. డీఎస్సీకంటే ముందే మరోసారి టెట్ -2 నిర్వహించాలి. - కె.శ్రీనివాస్, టెట్-2 అభ్యర్థి -
వికసించిన విద్యా కుసుమం
♦ టెట్‌లో స్టేట్ టాపర్‌గా స్నేహలత ♦ తెలంగాణ వ్యాప్తంగా మెతుకుసీమ ఖ్యాతి పాపన్నపేట: స్నేహలత.. విద్యాకుసుమమై వికసించింది. టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచింది. మెతుకుసీమ ఖ్యాతిని తెలంగాణ వ్యాప్తంగా చాటిచెప్పింది. పాపన్నపేట మండలం ముద్దాపూర్‌కు చెందిన ఊరడి స్నేహలత శుక్రవారం ప్రకటించిన టెట్-1పేపర్(డైట్)లో 150 మార్కులకుగానూ 134 మార్కులు సాధించింది. మొదటి ప్రయత్నంలోనే స్టేట్ టాపర్‌గా నిలవడం గమనార్హం. మాస్టారింట్లో మెరిసిన ముత్యం ముద్దాపూర్ గ్రామానికి చెందిన ఊరడి పోచమ్మ దినసరి కూలీ. రెక్కలు ముక్కలు చేసుకుంటూ కొడుకు నర్సింలును చదివించి టీచర్‌ను చేసింది. నర్సింలు ప్రస్తుతం కొల్చారం ఉన్నతపాఠశాలలో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. నర్సింలు-విజయలక్ష్మి దంపతులకు స్నేహలత, సంపత్‌కుమార్ సంతానం. స్నేహలత చిన్నప్పటి నుంచే చదువులో చురుకైన విద్యార్థిని. ఒకటి నుంచి 7వ తరగతి మెదక్ పట్టణంలోని సరస్వతి శిశుమందిర్‌లో, 8వ తరగతి కృష్ణవేణి టాలెంట్స్కూల్, 9, 10 తరగతులు వర్గల్ నవోదయలో, ఇంటర్ బోడుప్పల్లో చదివి, రంగారెడ్డి జిల్లా సూరారంలో డైట్ పూర్తిచేసింది. ఇంటర్ తరువాత బీవీఆర్ఐటీలో ఇంజనీరింగ్‌లో సీటు వచ్చినప్పటికీ ఉపాధ్యాయ వృత్తిపై మమకారంతో డైట్ పూర్తిచేసింది. అనంతరం మొదటిసారిగా అర్హతపరీక్ష రాసి 134 మార్కులు సాధించింది. స్మితాసబర్వాల్ ఆదర్శం జిల్లా కలెక్టర్‌గా పనిచేసి ప్రస్తుతం సీఎం కేసీఆర్ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న స్మితాసబర్వాల్ నా ఆదర్శం. ఐఏఎస్ లక్ష్యంగా చదువు కొనసాగిస్తా. నిరుపేదల అభివృద్ధే ధ్యేయంగా కలెక్టర్‌గా సేవలందిస్తా. అంత వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి సివిల్స్ సాధిస్తా. నా తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకం మేరకు ఈరోజు టెట్‌లో స్టేట్ టాపర్‌గా నిలిచాను. - స్నేహలత -
టెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: టెట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కిషన్ ఈరోజు ఉదయం 11 గంటలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను విడుదల చేశారు. పేపర్-1లో 54.45 శాతం, పేపర్-2లో 24.05 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. గత నెల 22న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,75,552 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,082 మంది (90.55 శాతం) హాజరయ్యారు. ఇందులో పేపరు-1 రాసేందుకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా, 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 రాసేందుకు 2,74,339 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,924 మంది (91.83 శాతం) హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను www.sakshieducation.com, tstet. cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. ఫలితాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నేడు టెట్ ఫలితాలు
ఉదయం 11 గంటలకు విడుదల విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో వెల్లడికి చర్యలు పరీక్షకు 3.40 లక్షల మంది హాజరు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాల విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమం అయింది. ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత నెల 22న జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3,75,552 మంది దరఖాస్తు చేసుకోగా, 3,40,082 మంది (90.55 శాతం) హాజరయ్యారు. ఇందులో పేపరు-1 రాసేందుకు 1,01,213 మంది దరఖాస్తు చేసుకోగా, 88,158 మంది (87.10 శాతం) హాజరయ్యారు. పేపర్-2 రాసేందుకు 2,74,339 మంది దరఖాస్తు చేసుకోగా, 2,51,924 మంది (91.83 శాతం) హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను www.sakshieducation.com, tstet. cgg.gov.in వెబ్సైట్లలో పొందవచ్చు. ఇక ఈ పరీక్షను నిర్వహించి నెల రోజులు కావస్తున్నా ఫలితాల వెల్లడిలో విద్యాశాఖ కావాలనే జాప్యం చేస్తోందని అభ్యర్థులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫలితాల ను వెంటనే విడుదల చేయాలనే డిమాం డ్తో ఈనెల 20న టెట్ కార్యాలయం, విద్యా శాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమం తలపెట్టారు. ఈ మేరకు ఫలితాల విడుదలకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. -
పెళ్లి పీటల నుంచి టెట్‌కు నవ వధువు
నిర్మల్ టౌన్ : ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని బాలుర జూనియర్ కళాశాలలో ఆదివారం జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు నవ వధువు హాజరైంది. జైనూర్‌కు చెందిన అర్చనకు కిషోర్‌తో ఆదివారం ఉదయం 11 గంటలకు పెళ్లి జరిగింది. వివాహం పూర్తయిన వెంటనే రెండో పేపర్ పరీక్ష రాయడానికి మధ్యాహ్నం నిర్మల్‌కు బయలుదేరి వచ్చింది. పెళ్లి పందిరి నుంచి పెళ్లి బట్టలతో నేరుగా పరీక్షకు హాజరైంది. ఆమె పరీక్ష రాయడంతో అందరూ ఆశ్చర్యంగా చూశారు. టెట్ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కనుక పెళ్లికాగానే వ చ్చి పరీక్షరాయాల్సి వచ్చిందని నూతనవధువు అర్చన తెలిపారు. -
టెట్ ప్రశాంతం
► పరిశీలించిన కలెక్టర్, ఏజేసీ, రాష్ట్ర పరిశీలకుడు, డీఈఓ ► షాద్‌నగర్‌లో ఓఎమ్మార్ షీట్‌ను ఎత్తుకెళ్లిన అభ్యర్థి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ సీ-సెంటర్లో ► అరగంట ఆలస్యం డెలివరీ అయిన వెంటనే పరీక్ష రాసిన మహిళ ► పేపర్-1కు 24,625కు 21,525 హాజరు, 3,100 గైర్హాజరు ► పేపర్ -2కు 40,218కు 36,258 అభ్యర్థులు హాజరు, 3,960 గైర్హాజరు పాలమూరు యూనివర్సిటీ/మహబూబ్‌నగర్ న్యూటౌన్ : జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు విద్యా శాఖ అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. కొన్ని కేంద్రాలలో చెదురు మదురు ఘటనలు మినహా పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థులు ఆయా కేంద్రాలకు గంట ముందే చేరుకోవడం జరిగింది. అభ్యర్థులను పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపించారు. జిల్లా మొత్తంలో 171పరీక్ష కేంద్రాలలో పేపర్ 1కు 24,625అభ్యర్థులకు గాను 21,525మంది హజరయ్యారు. 3,100మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. రెండో పేపర్‌కు 40,218మందికి గాను 36,258మంది హజరయ్యారు. 3,960మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ తీరును రాష్ట్ర పరిశీలకుడు గోపాల్‌రెడ్డి భూత్పూర్లోని పలు సెంటర్స్‌ను పరిశీలించాడు. జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ హైస్కూల్ సెంటర్‌ను కలెక్టర్ టీకే శ్రీదేవి పరిశీలించారు. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ బి.రంజిత్‌ప్రసాద్, డీఈఓ విజయలక్ష్మీబాయి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంటల్, రూట్ అధికారులు, సూపరింటెండెంట్ల ద్వారా తెలుసుకున్నారు.జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అభ్యర్థులను రాష్ట్రస్థాయి నుంచి కేటాయించడంతో పరీక్ష కేంద్రం వద్ద వారి పేర్లు లేకపోవడంతో అభ్యర్థులు పరీక్ష కేంద్రం అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పరీక్ష ఆరగంట అలస్యంగా ప్రారంభమయ్యింది. నవాబ్‌పేటతో పాటు వనపర్తిలో ఉదయం ప్రారంభమయిన పేపర్ 1పరీక్షలో గైర్హాజరయిన అభ్యర్థుల స్థానంలో ఇతరులకు పేపర్ కోడ్ కేటాయించడం అధికారులను గందరగోళానికి గురి చేసింది. జిల్లా విద్యా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి పరీక్ష సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు. షాద్‌నగర్ మండలం మొగిలిగిద్దలోని జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో ఓఎమ్మార్ షిట్ను ఎత్తుకెళ్లాడు. ఆ అభ్యర్థిపై విద్యశాఖ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భూత్పూర్లో పేపర్-2 రాసేందుకు షాద్‌నగర్‌కు చెందిన మహిళ జెడ్పీ ఉన్నత పాఠశాల సెంటర్‌కు 8 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. పరీక్ష కేంద్రాల ఎదుట పడిగాపులు కూతురు, భార్య, అక్క, చెల్లెలు, తమ్ముడు ఇలా కుటుంబ సభ్యులు టెట్ పరీక్ష రాస్తుంటే వారి కుటుంబ సభ్యులు పరీక్ష కేంద్రాల ఎదుట పడిగాపులు కాశారు. కొంత మంది చిన్నారులను పెట్టుకొని సెంటర్స్ వద్ద పరీక్ష రాస్తున్న తల్లులు ఎప్పుడు బయటకు వస్తారో అంటూ ఎదురు చూశారు. చాలా మంది అభ్యర్థులకు వేరు వేరు ప్రాంతాల్లో సెంటర్స్ పడడంతో చిన్నారులను వెంట తీసుకెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని పరీక్ష కేంద్రాల సమీపంలో కనీస వసతలు లేకపోవడంతో పరీక్ష రాయడానికి వెంట వచ్చిన వారు ఇబ్బందులు పడ్డారు. -
బిడ్డకు జన్మనిచ్చి వెంటనే టెట్ రాసిన మహిళ
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో టెట్ పరీక్ష రాయడానికి వచ్చిన ఓ మహిళకు ఉన్నట్టుండి పురుటినొప్పులు రావడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. పండంటి శిశువును ప్రసవించిన తర్వాత ఆమె తిరిగి నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసింది. మల్దకల్ మండలానికి చెందిన కవిత తొమ్మిది నెలల గర్భవతి. ఆదివారం జిల్లా కేంద్రంలోని మోడ్రన్ హైస్కూల్లో టెట్ రాసేందుకు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుంది. పురుటి నొప్పులు రావడంతో 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే శిశువుకు జన్మనిచ్చింది. విశ్రాంతి తీసుకోకుండా పట్టుబట్టి వెంటనే పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్షలో పాల్గొంది. -
టెట్‌లో ‘అర్హత’ తంటా!
♦ ఒక్కో కేటగిరీలో ఒక్కోలా మార్కులు ♦ నష్టపోతున్నామంటూ ఓసీల ఆవేదన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో కనీస అర్హత మార్కులతో అభ్యర్థులకు తంటా తప్పడం లేదు! ఒక్కో రిజర్వేషన్ కేటగిరీలో ఒక్కోలా అర్హత మార్కులు ఉండటంతో తాము నష్టపోతున్నామని ఓసీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఓసీలకు 90 మార్కులు (60 శాతం), బీసీలకు 75 మార్కులు (50 శాతం), ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 60 మార్కులు (40 శాతం) వస్తే టెట్‌లో అర్హత సాధించినట్లు పరిగణనలోకి తీసుకుంటుండటంతో తాము నష్టపోవాల్సి వస్తోందని వాపోతున్నారు. దాన్ని అర్హత పరీక్షగానే చూడకుండా... మార్కులకు వెయిటేజీ కూడా ఉండటం వల్ల తాము ఉద్యోగ అవకాశాలకు దూరమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఉదాహరణకు 2014లో నిర్వహించిన టెట్ తీసుకుంటే.. నల్లగొండ జిల్లాలో లాంగ్వేజ్ పండిట్ (హిందీ) కోసం 689 మంది పరీక్ష రాస్తే అందులో జనరల్ అభ్యర్థులు ముగ్గురే అర్హత సాధించారని వారు పేర్కొంటున్నారు. ఇక బీసీలు 415 మంది, ఎస్సీలు 185 మంది, ఎస్టీలు 75 మంది, వికలాంగులు 11 మంది అర్హత సాధించారని, ఇతర కేటగిరీలు, వేరే జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అయితే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలే ఆ నిబంధన విధించిందని అధికారులు పేర్కొంటున్నారు. కనీస అర్హత మార్కులు 60 శాతంగా పరిగణనలోకి తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు కన్సెషన్ ఇవ్వాలని ఎన్సీటీఈ మార్గదర్శకాలే చెబుతున్నాయంటున్నారు. హిందీలో సోషల్ ప్రశ్నపత్రమా? రాష్ట్రంలో టెట్ అధికారుల నిర్వాకం వల్ల తాము కూడా నష్టపోవాల్సి వస్తోందని హిందీ పండిట్ అభ్యర్థులు చెబుతున్నారు. తాము పరీక్ష రాసే సబ్జెక్టు హిందీ అయినప్పుడు ఆ సబ్జెక్టు ప్రశ్నపత్రాన్ని హిందీ లేదా ఇంగ్లిషులో ఇస్తే ఫర్వా లేదని, అయితే పేపర్-2లో 60 మార్కులకు ఉన్న సోషల్ సబ్జెక్టు పేపర్ కూడా హిందీ, ఇంగ్లిష్‌లో ఇవ్వడంతో నష్టపోతున్నామంటున్నారు. పదో తరగతి వరకు సోషల్ను తెలుగు మీడియంలో చదివినందున ఆ ప్రశ్నపత్రాన్ని అదే భాషలో ఇవ్వాలని కోరుతున్నారు. హిందీ భాషలో సోషల్ పదజాలం ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. -
నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
పేపర్ –1 పరీక్ష సమయంలో మార్పులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్‌టికెట్లను ఈ నెల 13 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ డైరెక్టర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. 3.73 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఈ టెట్‌ను ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే ఈ నెల 22న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో పరీక్ష కేంద్రాలు మారాయని పేర్కొన్నారు. గతంలో డౌన్లోడ్ హాల్‌టికెట్లు పనికిరావని, ఈ నెల 13 ఉదయం 11 గంటల తర్వాత తాజా హాల్‌టికెట్లు tstet.cgg. gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కొత్త హాల్టికెట్లలో ఉన్న కేంద్రాల్లోనే పరీక్షలకు హాజరు కావాలని పేర్కొన్నారు. ముందస్తు షెడ్యూల్లో పేర్కొన్నట్లు కాకుండా పేపర్–1 పరీక్ష సమయంలో మార్పులు చేసినట్లు తెలిపారు. పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుందని పేర్కొన్నారు. పేపరు-2 పరీక్ష సమయంలో ఎలాంటి మార్పు లేదని, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని వివరించారు. హాల్‌టికెట్ వెనక ఉన్న సూచనలను అభ్యర్థులు క్షుణ్నంగా చదవాలని సూచించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ డేటాను సేకరిస్తున్నామని, పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో హాల్‌టికెట్‌లో కేటాయించిన స్థలంలో సంతకం చేయాలని, ఎడమ చేతి బొటన వేలి ముద్రలు వేయాలని చెప్పారు. నిర్ణీత పరీక్ష సమయానికి మించి ఆలస్యమైతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్ల వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమన్నారు. -
టీచర్ అభ్యర్థులకు ‘టెట్’ తిప్పలు!
* సంబంధం లేని సబ్జెక్టులతో తంటాలు.. * అధిక సిలబస్‌తో ఆందోళన * ఇంటర్, డిగ్రీల్లోనూ చదవని సబ్జెక్టుల ప్రశ్నలు సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన రామకృష్ణ 2009లో బీఎస్సీ పూర్తి చేశాడు. ఉపాధ్యాయుడిగా జీవితంలో స్థిరపడాలని భావించి ఎడ్‌సెట్ రాశాడు. కష్టపడి చదివి ర్యాంకు సాధించి.. ప్రభుత్వ కాలేజీలో బీఎడ్ పూర్తి చేశాడు. డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తుండగానే... 2010 ఆగస్టులో జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ‘టెట్’ పేరిట పిడుగువేసింది. ఇది మరో పరీక్షకు సిద్ధం కావాల్సిన పరిస్థితి కల్పించింది. 2011లో విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పరీక్షకు విస్తృతమైన సిలబస్‌ను ప్రకటించింది. దీంతో ఆందోళనలో పడడం రామకృష్ణ వంతయింది. తాను ఇంటర్, డిగ్రీలో చదువుకున్న సబ్జెక్టులకు సంబంధం లేని గణితం అదనంగా వచ్చి చేరింది. దానికితోడు అర్హతా మార్కుల శాతమూ ఎక్కువే. దీంతో 2011 నుంచి నిర్వహించిన మూడు టెట్‌లలోనూ రామకృష్ణ అర్హత సాధించలేదు. ఇక తాను టీచర్ ఉద్యోగం సాధించలేనేమోనని ఆయన ఆవేదనలో కూరుకుపోయాడు. రాష్ట్రంలో టెట్ కోసం సిద్ధమవుతున్న లక్షల మంది అభ్యర్థులందరిదీ దాదాపు ఇదే పరిస్థితి. దేవరకొండకు చెందిన ప్రమీల కూడా ఇదే ఆందోళన, మానసిక వేదనతో ఆత్మహత్యకు పాల్పడింది. లక్షల మంది అనర్హులే.. మొత్తంగా ఇప్పటివరకు నాలుగుసార్లు నిర్వహించిన టెట్లలో 55 శాతానికి మించి అభ్యర్థులు అర్హత సాధించకపోవడం గమనార్హం. 2011లో తొలిసారి నిర్వహించిన టెట్ పేపర్-2కు 3,61,206 మంది హాజరైతే... 1,71,437 మందే అర్హత సాధించారు. 2012లో నిర్వహించిన రెండో టెట్ 4,15,137 మంది రాస్తే.. 2,04,126 మంది, అదే ఏడాది నిర్వహించిన మూడో టెట్‌ను 4.14 లక్షల మందిరాస్తే.. 2,01,087 మంది, 2014 మార్చిలో నిర్వహించిన నాలుగో టెట్ పేపర్-2కు 3,40,561 మంది హాజరైతే... 1,10,099 మంది (32 శాతమే) అర్హత సాధించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పండిట్, డీఎడ్ అభ్యర్థులకూ తప్పని తంటా! సంబంధంలేని సిలబస్‌తో పరీక్ష రాయడమన్నది బీఎడ్ పూర్తిచేసినవారికే కాదు... పండిత శిక్షణ, డీఎడ్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకూ తప్పలేదు. వాస్తవానికి ఇంటర్‌తో డీఎడ్ చేసిన అభ్యర్థి 1 నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు మాత్రమే అర్హులు. వారు టెట్ పేపర్-1లో భాగంగా 30 మార్కులు గణితం ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి వస్తోంది. ఇక తెలుగు, ఉర్దూ, హిందీ పండితులైతే ఆయా భాషా సబ్జెక్టులను మాత్రమే బోధిస్తారు. కానీ వారికి ఇంగ్లిషు, సాంఘిక శాస్త్రం తంటాలు తప్పడం లేదు. వారు టెట్ పేపర్-2లో అర్హత సాధిస్తేనే పండిట్ పోస్టుల కోసం డీఎస్సీ రాసేందుకు అర్హులు. ఇక సాంఘికశాస్త్రం బీఎడ్ వారికి తెలుగు, ఇంగ్లిషు ‘పరీక్ష’ పెడుతున్నారు. 9, 10 తరగతులకు అవసరమే లేదు ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ పేపర్-1 పరీక్షను ఒకటి నుంచి ఐదు తరగతుల వారికే నిర్వహించాలి. పేపర్-2 పరీక్ష 6, 7, 8 తరగతులకు బోధించాలనుకునే వారికి నిర్వహించాలి. కానీ రాష్ట్రంలో 9, 10 తరగతులు బోధించే వారికి కూడా టెట్ నిర్వహిస్తున్నారు. అయితే తాము ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారమే తాము ఈ పరీక్ష నిర్వహిస్తున్నామని టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి తెలిపారు. మరోవైపు ఉపాధ్యాయ అభ్యర్థి ప్రమీల ఆత్మహత్యపై విద్యాశాఖ ప్రభుత్వానికి మంగళవారం నివేదిక పంపింది. ఆమె టెట్ కోసం చేసిన దరఖాస్తు వివరాలను నివేదికలో పేర్కొంది. కనీస అవగాహన తప్పనిసరి ‘‘టీచర్‌గా బడిలోకి వెళ్లే వారికి అన్ని అంశాలపై కనీస అవగాహన తప్పనిసరిగా ఉండాలి. టెట్ సిలబస్ అంత కష్టతరంగా లేదు. అన్ని సబ్జెక్టులకు సంబంధించి మౌలిక అంశాలే ఉన్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ప్రమాణాలు ఉండటం లేదు. ఇలాంటి మౌలిక అంశాలపై కూడా అవగాహన లేకపోతే కష్టమవుతుంది..’’ - విద్యావేత్త చుక్కా రామయ్య స్కూల్ అసిస్టెంట్లకు టెట్ రద్దు చేయాలి ‘‘టెట్‌లో సంబంధంలేని సబ్జెక్టుల సిలబస్‌ను తొలగించాలి. స్కూల్ అసిస్టెంట్ అంటేనే సబ్జెక్టు టీచర్. తాను బోధించే సబ్జెక్టులోనే టెట్‌ను నిర్వహించాలి. 9, 10 తరగతులకు బోధించే వారికి టెట్‌ను రద్దు చేయాలి. భాషా పండితులకు వారు బోధించే భాషల్లోనే టెట్ నిర్వహించాలి. ఇంగ్లిషు, సోషల్ సిలబస్ తొలగించాలి..’’ - మధుసూదన్, శ్రీనివాసరెడ్డి, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవేదన చెందవద్దు ‘‘విద్యార్థులంతా జీవితం ఎంతో విలువైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తాము విజయం సాధించలేదనే ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒత్తిడిని నియంత్రించుకోవాలి. పాజిటివ్ థింకింగ్ ముఖ్యం..’’ - జవహర్‌లాల్‌నెహ్రూ, సైకాలజిస్టు -
మే 22న టెట్ : పరీక్షా కేంద్రాలు ఖరారు
హైదరాబాద్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు అవసరమైన పరీక్ష కేంద్రాలను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈ నెల 22న జరిగే ఈ పరీక్షకు జిల్లా కేంద్రాలు, డివిజన్లలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థల్లో 1,618 కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. నిర్వహణ బాధ్యతలను కలెక్టర్లు, డీఈవోలకు అప్పగించింది. ఇన్విజిలేటర్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులను, లెక్చరర్లను నియమించేందుకు చర్యలు చేపట్టింది. వాస్తవానికి మే 1వ తేదీనే జరగాల్సిన టెట్‌ను ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3.72 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. 22వ తేదీన ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుంది. ఫలితాలను జూన్ 1న విడుదల చేస్తారు. అభ్యర్థులంతా ఈ నెల 13 నుంచి 22వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా విద్యా శాఖ చర్యలు చేపట్టింది. ఈ పరీక్షకు మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అత్యధికంగా 64,030 మంది నిరుద్యోగులు టెట్ పేపర్-1, పేపర్-2 రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి కోసం ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే అత్యధికంగా 277 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక మొత్తంగా పేపర్-1 రాసేందుకు 99,993 మంది, పేపర్-2 రాసేందుకు 2,72,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. -
తెలంగాణ ఎంసెట్, టెట్ తేదీల ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో వాయిదా పడ్డ ఎంసెట్, టెట్ పరీక్షల తేదీలను ఖరారు చేశారు. ఈనెల 15న ఎంసెట్, 22న టెట్లను నిర్వహించనున్నారు. తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖ అధికారులతో సోమవారం చర్చించిన అనంతరం.. మీడియా సమావేశంలో తేదీలను ప్రకటించారు. ఎంసెట్ రాసే అభ్యర్థులు ఈ నెల 12 నుంచి, టెట్ అభ్యర్థులు 13 నుంచి హాల్ టికెట్లను నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చని కడియం శ్రీహరి సూచించారు. ఈ నెల 27న ఎంసెట్ ఫలితాలను ప్రకటిస్తారు. జూన్ నెలలో ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం అవుతాయి. వాస్తవానికి ఏపీ ఎంసెట్ ఏప్రిల్ 29న నిర్వహించగా, ఆ తర్వాత సోమవారమే.. అంటే మే 2వ తేదీనే తెలంగాణ ఎంసెట్ నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. మే 1వ తేదీ ఆదివారం నాడు టెట్ నిర్వహిస్తామన్నారు. అయితే, జూనియర్ కళాశాలలపై తెలంగాణ ప్రభుత్వం విజిలెన్సు దాడులు చేయిస్తుండటంతో.. దానిపై తెలంగాణ ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాల జేఏసీ భగ్గుమంది. టెట్, ఎంసెట్ నిర్వహణకు సహకరించేది లేదని, కళాశాలలు తెరవబోమని అల్టిమేటం ఇచ్చింది. దాంతో తప్పనిసరిగా ఈ రెండు ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రభుత్వ కళాశాలల్లోనే ఈ పరీక్షలను నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. దానికి తగినట్లుగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తాజా షెడ్యూలు ప్రకటించారు. ఇంతకుముందు ప్రైవేటు కళాశాలల్లో కూడా పలువురు విద్యార్థులకు సెంటర్లు ఉండటంతో, అవన్నీ మారుతాయి కాబట్టి ఈ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా కొత్తగా మళ్లీ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఇచ్చిన సెంటర్లో మాత్రమే పరీక్ష రాయాల్సి ఉంటుంది. -
టెట్, ఎంసెట్ వాయిదాపై నిరసన
కవాడిగూడ: రాష్ట్రంలో టెట్, ఎంసెట్ పరీక్షలను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ క్రి ష్ణ మాట్లాడుతూ ఆదివారం జరగాల్సిన టెట్, సోమవారం జరగాల్సిన ఎంసెట్ పరీక్షలకు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు సిద్ధంగా ఉన్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పరీక్షలను వాయిదా వేయలని నిర్ణయించడం దారుణమన్నారు. ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థలతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించకుండా దూకుడుగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నిరుద్యోగ అభ్యర్థులు రూ.వేలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్న తరుణంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా జాతీయ స్థాయిలో నిట్ పరీక్ష నిర్వహించాల్సి ఉన్నా అందుకు ముందస్తుగా సిద్దం చేయకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. నీట్ పరీక్షకు, అందుకు సంబంధించిన సిలబస్ అలవాటు పడేంత వరకు రెండేళ్ల గడువు కోరాలన్నారు. కార్యక్రమంలో నాయకులు రాసమల్ల శ్రీనివాస్, నాయకులు గంగనబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
భవిష్యత్తును అంధకారం చేయడమే: లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్, టెట్ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఆకస్మాత్తుగా వాయిదా వేయడం విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఓవర్సీస్ ఫ్రెండ్స ఆఫ్ బీజేపీ అమెరికా శాఖ అధ్యక్షుడిగా ఎన్నికైన రామకృష్ణారెడ్డి అభినందన కార్యక్రమం హైదరాబాద్‌లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఎంసెట్, టెట్ పరీక్షలను వాయిదా వేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. విద్యా విధానంలో లోటుపాట్లుంటే సవరించాల్సిందేనని, అయితే అది సామరస్యంగా చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జి.కిషన్ రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రిటైర్డు డీజీపీ వి. దినేశ్ రెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి , జి.మధుసూదన్ రెడ్డి, జి.ప్రేమేందర్ రెడ్డి, కె.రాములు,పద్మజా రెడ్డి, హనీఫ్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
‘టెట్ వాయిదా ప్రభుత్వ వైఫల్యమే’
సాక్షి, హైదరాబాద్: టెట్, ఎంసెట్ వంటి కీలకమైన పరీక్షల వాయిదాకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ విద్యా సంస్థలతో సమన్వయం చేసుకోవడం ప్రభుత్వానికి చేతకావడం లేదని దుయ్యబట్టారు. పరీక్షలు వాయిదా పడటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విద్యాసంస్థల్లో తనిఖీలు, పరిశీలన చేయడానికి ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యా మండలి ఉన్నా.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని అన్నారు. మే 1న టెట్, 2న ఎంసెట్‌ను యథావిధిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
30 వరకు టెట్ దరఖాస్తుల్లో మార్పులకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: టెట్ దరఖాస్తుల్లో మార్పులకు ఈనెల 30 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు టెట్ డెరైక్టర్ జగన్నాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పేపరు, లాంగ్వేజి, సబ్జెక్టు, ఫొటో తదితర వివరాల్లో పొరపాట్లు ఉంటే ఎస్సీఈఆర్టీ కార్యాలయంలోని టెట్ విభాగంలో సంప్రదించి సవరించుకోవాలని సూచించారు. తొలుత 29వ తేదీ వరకే ఈ అవకాశం ఇచ్చినా 30 వరకు పొడిగించినట్లు వెల్లడించారు. -
14న టెట్, 15న ఎంసెట్?
► లేదంటే 21, 22 తేదీల్లో నిర్వహణ ► రెండు మూడు రోజుల్లో ఖరారు: పాపిరెడ్డి సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు విద్యా సంస్థల సహాయ నిరాకరణ నేపథ్యంలో మే 2న జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ నిర్వహణను వాయిదా వేసిన ప్రభుత్వం, వాటిని తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై కసరత్తు చేస్తోంది. ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష మే 22న ఉన్నందున మే 15లోగా ఎంసెట్‌ను నిర్వహించాలని భావిస్తోంది. జేఈఈ అడ్వాన్స్డ్తోపాటు ఇతర రాష్ట్రాల ప్రవేశ పరీక్షలూ రాసే విద్యార్థులుంటారు గనుక వాటికి కూడా సన్నద్ధమయ్యేందుకు సమయమివ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎంసెట్‌ను మే రెండో వారంలోనే నిర్వహించాలని భావించినా పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ సెకండియర్‌లో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) నిర్వహించే ఈసెట్-2016 పరీక్ష మే 12వ తేదీన్నే ఉంది. అందుకే మే 15వ తేదీన ఎంసెట్‌ను నిర్వహిస్తే ఎలా ఉంటుందని ఉన్నత విద్యా మండలి యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 2.46 లక్షల మంది ఎంసెట్‌కు హాజరు కానున్నందున ప్రభుత్వ విద్యా సంస్థల్లో వారందరికీ సరిపడ పరీక్ష కేంద్రాల ఏర్పాటుపై ఎంసెట్ కమిటీ దృష్టి సారించింది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఆది లేదా సోమవారాల్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో చర్చించి ఎంసెట్ నిర్వహణ తేదీని ఖరారు చేస్తామని ఉన్నత విద్యా మండలి చైర ్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. టెట్పైనా తర్జనభర్జన మే 1న నిర్వహించాల్సిన టెట్‌ను కూడా వాయిదా వేసిన ప్రభుత్వం, దాని నిర్వహణపైనా దృష్టి సారించింది. దీన్ని మే 14న నిర్వహిస్తే ఎలా ఉంటుందనివిద్యా శాఖ ఆలోచిస్తోంది. మే 14న జరిగే డిపార్ట్మెంటల్ పరీక్షకు ఎక్కువ మంది టీచర్లు, లెక్చరర్లు హాజరయ్యే పక్షంలో టెట్‌ను మే 21 లేదా 22న నిర్వహించే అవకాశముంది. పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ విద్యా సంస్థల లెక్కలు తేల్చే పని రెండు మూడు రోజుల్లో పూర్తవనుంది. ప్రభుత్వ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లోనూ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని యోచిస్తోంది. జూనియర్, డిగ్రీ కాలేజీలు, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, పాలిటెక్నిక్, బీఎడ్, డీఎడ్ కాలేజీల వంటి ప్రభుత్వ విద్యా సంస్థలనూ సంప్రదిస్తోంది. సెట్లన్నీ ప్రభుత్వ కేంద్రాల్లోనే: పాపిరెడ్డి ఎంసెట్, టెట్ నిర్వహణకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇతర ప్రవేశ పరీక్షల కేంద్రాలను కూడా ప్రభుత్వ సంస్థల్లోకే మార్చాలని నిర్ణయించినట్టు పాపిరెడ్డి తెలిపారు. పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసె ట్ తదితర పోటీ పరీక్షలన్నింటి కేంద్రాలనూ ప్రైవేటు విద్యా సంస్థల నుంచి తొలగించి ప్రభుత్వ సంస్థల్లోనే ఏర్పాటు చేయాలని ఆయా సెట్స్ కన్వీనర్లను ఆదేశించారు. పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ నిర్వహణకు సమయమున్నందున వాటి నిర్వహణ తేదీల్లో మార్పేమీ ఉండబోదని, అవన్నీ ముందుగా ప్రకటించినట్టుగానే జరుగుతాయని వెల్లడించారు. యథాతథంగా మిగతా సెట్స్ 12-5-2016 ఈసెట్ 19-5-2016 ఐసెట్ 27-5-2016 ఎడ్‌సెట్ 29-5-2016 పీజీఈసెట్ 24-5-2016 లాసెట్ (మూడేళ్లు, ఐదేళ్లు) 3-6-2016 నుంచి పీఈసెట్ -
'మాకు, సీఎంకు గొడవలు పెడుతున్నారు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలకు ఆహ్వానించే వరకూ బంద్‌పై వెనక్కి తగ్గేది లేదని ప్రైవేట్ విద్యాసంస్థల జేఏసీ స్పష్టం చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టెట్, ఎంసెట్ పరీక్షలకు సెంటర్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. అయితే తాము పోలీసుల తనిఖీలను మాత్రమే వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. కొంతమంది తమకు, సీఎంకు మధ్య గొడవలు పెడుతున్నారంటూ ప్రైవేట్ విద్యా సంస్థల జేఏసీ ఆరోపించింది. -
టెట్, ఎంసెట్ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొనండి
-ప్రభుత్వ ఉద్యోగులకు టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ పిలుపు -సర్కారుకు టీఎన్జీవోల సంపూర్ణ మద్దతు -ప్రైవేట్ కళాశాలలు బంద్ ఉపసంహరించుకోవాలి కరీంనగర్ : విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్వహించే టెట్, ఎంసెట్ విధుల్లో ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనాలని టీఎన్జీవోస్ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కరీంనగర్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన టీఎన్జీవోలతో అత్యవసరంగా సమావేశమై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో విద్యాప్రమాణాలు పెంచే దిశలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం తీరును ఖండించారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలు చేపడుతోందని సమర్థించారు. విద్యాసంస్థల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు టీఎన్జీవో సంఘం మద్దతునిస్తుందని తెలిపారు. విద్యాసంస్థల పర్యవేక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. టెట్, ఎంసెట్‌లను బహిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్ణయించుకోవడం సరికాదన్నారు. ప్రైవేట్ కాలేజీలు బంద్ ఉపసంహరించుకుని పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కోరారు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వాయిదా వేసిన టెట్, ఎంసెట్ నిర్వహణకు ఉద్యోగుల సహకారం పూర్తిగా ఉంటుందన్నారు. అవసరమనుకుంటే గౌరవ వేతనం లేకుండా విధులు నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎంఏ.హమీద్, జిల్లా అధ్యక్షుడు మారం జగదీశ్వర్, కార్యదర్శి వేముల సుగుణాకర్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు నాగుల నర్సింహస్వామి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అశోక్, కేంద్ర సంఘం నాయకులు రాజయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రాంకిషన్‌రావు, వేముల రవీందర్, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు దారం శ్రీనివాస్‌రెడ్డి, కాళీచరణ్ పాల్గొన్నారు. -
టెట్, ఎంసెట్ వాయిదా
► తనిఖీలపై విద్యాసంస్థల సహాయ నిరాకరణతో ప్రభుత్వ నిర్ణయం ► మే 20లోగా నిర్వహించేలా చర్యలు: ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: మే 1వ తేదీన జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), మే 2వ తేదీన జరగాల్సిన ఎంసెట్ పరీక్షను వాయిదా వేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే టెట్, ఎంసెట్‌లను బహిష్కరిస్తామని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు, ప్రైవేటు విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలు చేస్తున్న బెదిరింపులకు లొంగేది లేదని, తనిఖీలు జరిగి తీరుతాయని స్పష్టంచేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉపాధ్యాయుల పర్యవేక్షణతో, ప్రభుత్వ విద్యా సంస్థలకు చెందిన సిబ్బందితో టెట్, ఎంసెట్‌లను మే 20వ తేదీలోగా నిర్వహిస్తామని తెలిపారు. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. టెట్, ఎంసెట్‌ను బహిష్కరిస్తామని ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ గురువారం రాత్రి కడియం శ్రీహరి, విద్యాశాఖ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో పరీక్ష కేంద్రాలు ఆయా ప్రైవేటు విద్యా సంస్థల్లోనే ఉన్నందున పరీక్షల వాయిదాకు నిర్ణయం తీసుకున్నారు. నీట్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఎంసెట్, నీట్ పరీక్షల అంశంపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎంసెట్‌కు దరఖాస్తులు స్వీకరించిన అంశంతోపాటు పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయన్న విషయాన్ని కేంద్రంతో చర్చించాలన్న ఆలోచనకు వచ్చారు. ఈ భేటీ తర్వాత సమావేశంలో చర్చించిన అంశాలను వివరిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. బోగస్‌లను ఏరేస్తాం.. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు విద్యా సంస్థల్లో పరిస్థితిని చూసి చలించామని, అందుకే తనిఖీలు చేయాలని నిర్ణయించినట్టు సీఎం సమావేశంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రైవేటు విద్యాసంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అందులో భాగంగానే పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బోగస్ విద్యా సంస్థలను ఏరి వేసేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని పునరుద్ఘాటించారు. అయితే ఈ చర్యలను.. ప్రైవేటు విద్యా సంస్థల జేఏసీగా చెప్పుకుంటున్న వారు వ్యతిరేకించడాన్ని సీఎం తప్పు పట్టారు. విద్యా సంస్థల పర్యవేక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోకుంటే ఎవరు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. విద్యాసంస్థల్లో తనిఖీలు చేయవద్దని డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తనిఖీలు నిర్విహ ంచకుంటే ఏ విద్యాసంస్థ ఎలా నడుస్తోంది? ప్రమాణాలు పాటిస్తున్నారా? ఎవరైనా తప్పులు చేస్తున్నారా? అన్న విషయాలు ఎలా తెలుస్తాయని సీఎం అన్నారు. విద్యా వ్యవస్థను నీరుగార్చేలా ప్రైవేటు విద్యా సంస్థల ప్రవర్తన ఉందని, ఇది సరికాదని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో పోలీసు తనిఖీలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కానీ తనిఖీలు విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయని, ఇందులో అనేక సంస్థలు భాగస్వామలుగా ఉంటాయని తెలిపారు. థర్డ్ పార్టీగా బిట్స్ పిలానీ, ట్రిపుల్ఐటీ లాంటి సంస్థలు కూడా ఉంటాయని వెల్లడించారు. నాణ్యత ప్రమాణాల పెంపు కోసం తనిఖీలు జరిపించి తీరుతామని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కడియంను ఆదేశించారు. -
టెట్, ఎంసెట్‌ను బహిష్కరిద్దామా..?
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు విద్యాసంస్థల్లో పోలీసుల తనిఖీలు ఆపకుంటే ప్రభుత్వం చేపట్టే రాష్ట్రస్థాయి పోటీ, ప్రవేశ పరీక్షల నిర్వహణకు సహకరించొద్దని సర్వసభ్య సమావేశంలో పలు ప్రైవేటు విద్యాసంస్థల సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వచ్చే నెల 1, రెండో తేదీల్లో జరిగే టెట్, ఎంసెట్‌ను ప్రైవేటు విద్యాసంస్థల కేంద్రాల్లో బహిష్కరించాలని సూచించారు. ప్రవేశ పరీక్షలను అడ్డుకుంటే ప్రజలు, ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం లేకపోలేదని పలువురు అభిప్రాయపడ్డారు. కేజీ టు పీజీ ప్రైవేటు విద్యాసంస్థలకు యాజమాన్యాలు స్వచ్ఛంధంగా తాళాలు వేసి డిప్యూటీ సీఎంకు తాళం చెవులు అప్పగించాలని ఇంకొందరు సూచించారు. వీటన్నింటి కంటే ముందుగా విద్యాసంస్థల్లో పోలీసుల జోక్యంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించి, తనిఖీలపై స్టే ఆర్డర్ తెచ్చుకుంటే మంచిదన్నారు. మరోపక్క పోలీసుల తనిఖీలను నిరసిస్తూ... బహిరంగ సభ నిర్వహించాలని కొందరు నాయకులు సూచించారు. అవసరమైతే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు తమ డిమాండ్లను వివరించి, సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిదని ఆయా సంఘాల నాయకులు ప్రతిపాదించారు. -
నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
మే 1న రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టెట్ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ వెబ్సైట్ (http://tstet.cgg.gov.in) ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,72,130 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని... అందులో పేపర్-1కు 99,993 మంది, పేపర్-2కు 2,72,137 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అత్యధికంగా 64,030 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆదిలాబాద్ జిల్లా నుంచి తక్కువగా 15,413 మంది ఈ పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. మే 1న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వివరించారు. మే 10 లేదా 11న ఫలితాలను ప్రకటించే అవకాశముంది. వివరాలు సరిచూసుకోండి.. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత అభ్యర్థులు అందులోని వివరాలను సరిచూసుకోవాలి. అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టినతేదీ, కులం, జెండర్, వైకల్యం లాంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా, లేదా పరిశీలించాలి. పొరపాట్లు దొర్లితే పరీక్షహాల్లో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీ జాబితాలో వాటిని సరి చేయించుకోవాలి. ఫొటో, అభ్యర్థి హాజరయ్యే పేపర్, లాంగ్వేజ్-1 వంటి వివరాలు సరిగా లేకపోతే... వాటిని సరి చేసుకునేందుకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో టెట్ సెల్‌ను ఈనెల 25 నుంచి 29 మధ్య సరైన ఆధారాలతో సంప్రదించాలి. హాల్‌టికెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో ముద్రించి ఉన్న ఫొటో కింద అలాంటి ఫొటోనే అతికించి సంతకం చేయాలి. పరీక్ష సందర్భంగా పైభాగాన్ని అభ్యర్థి తన వద్ద ఉంచుకుని, కింది భాగాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. -
టెన్త్ వరకు చదివిన భాషే లాంగ్వేజ్-1
టెట్‌పై కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: మే 1న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ సందేహాలపై టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి స్పష్టతనిచ్చారు. దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు వాటిని కచ్చితంగా సరిచూసుకోవాలని తెలిపారు. ఆయన చేసిన పలు సూచనలు.. ► అభ్యర్థులు ఏ సబ్జెక్టులో ఉపాధ్యాయులు కావాలనుకుంటారో ఆ సబ్జెక్టులోనే టెట్ రాయాలి. ► పదో తరగతి వరకు అభ్యర్థి చదివిన మీడియాన్నే ప్రథమ భాషగా (లాంగ్వేజ్-1) ఎంచుకోవాలి. ► భాషా పండితులు/స్కూల్ అసిస్టెంట్లు తమ కోర్సుకు సంబంధించిన భాషనే లాంగ్వేజ్-1గా ఎంచుకోవాలి. ►దరఖాస్తులో పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతలు, లాంగ్వేజ్-1 కింద ఎంచుకున్న భాష, పరీక్ష రాయదలచిన సబ్జెక్టులు, (మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్), పరీక్ష కేంద్రాల వివరాల్లో సబ్మిట్ చేసిన తర్వాత మార్పు ఉండదు. ► అయినప్పటికీ ఏవైనా మార్పులు ఉంటే ఫిర్యాదుల బాక్స్ ద్వారా పంపించాలి. ► గతంలో టెట్‌కు హాజరైతే దానికి సంబంధించిన హాల్ టికెట్ నంబరు కోసం aptet.cgg.gov.in వెబ్సైట్లో పొందవచ్చు. ఒకవేళ లేకపోతే తెలంగాణ టెట్ సెల్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాలి. -
టెట్ పరీక్షకు భారీగా దరఖాస్తులు
హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 15 నుంచి ఫీజు చెల్లింపు, 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పది రోజుల్లోనే 1,28,464 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఈ వారం రోజుల్లో మరో 1.50 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇక 2013లో నోటిఫికేషన్ జారీ చేసిన టెట్‌కు రాష్ట్రంలో 2,50,103 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈసారి ఆ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
'టెట్ లేకుండా డీఎస్సీ నిర్వహించాలి'
కరీంనగర్: తెలంగాణ ప్రభుత్వం టెట్‌ను వాయిదా వేసి నిరుద్యోగులను ఆందోళనకు గురిచేయొద్దని టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సూచించారు. బుధవారం కరీంనగర్లో నిరుద్యోగ గర్జనలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. టెట్ లేకుండా డీఎస్సీని నిర్వహించి రాష్ట్రంలోని 43 వేల ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇచ్చేంతవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఇందుకోసం విద్యార్థులతో కలిసి చదువు-ఉద్యమించు, ఉద్యోగం-సాధించు నినాదంతో పోరాడుతామని ఆయన వెల్లడించారు. -
టెట్ వాయిదా
♦ ‘పరీక్ష’పై కేంద్రం కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో నిర్ణయం ♦ మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 9న నిర్వహించ తలపెట్టిన ఈ పరీక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ జి.కిషన్ సోమవారం ప్రకటించారు. దేశవ్యాప్తంగా టెట్ పరీక్షల కోసం అవలంబిస్తున్న నిబంధనల విశ్లేషణ, పరీక్ష నిర్వహణ విధానం, ఉపాధ్యాయుల ఎంపిక తదితర అంశాలపై అధ్యయనానికి కేంద్రం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా ఉపాధ్యాయుల ఎంపికలో ప్రమాణాలు పాటించేందుకు సీబీఎస్ఈతో సహా అన్ని రాష్ట్రాల విద్యాశాఖలు ఇప్పటికే ఏడు సార్లు టెట్ నిర్వహించాయని, అయితే ఈ పరీక్షల్లో పలు సమస్యలు ఉత్పన్నమైనట్లు కేంద్రం గుర్తించిందని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని కమిటీని మానవ వనరుల శాఖ ఆదేశించిందని, కమిటీ నివేదిక అనంతరం రూపొందించే నూతన నిబంధనల మేరకు టెట్ నిర్వహణపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరింత ఆలస్యం కానున్న డీఎస్సీ టెట్ వాయిదాపడడంతో ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహించే డీఎస్సీ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ నివేదిక ఇచ్చేందుకు మూడు నెలల సమయం ఉంది. ఆ నివేదిక వచ్చాక టెట్ నిర్వహించే అవకాశం ఉంది. టెట్ నిర్వహించకుండా డీఎస్సీ పరీక్షలు జరిగే అవకాశం లేకపోవడంతో ఇప్పట్లో ఉపాధ్యాయుల నియామకం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. -
ఏప్రిల్ 9న టెట్
షెడ్యూల్ జారీ చేసిన విద్యాశాఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురుచూస్తున్న ‘ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)’ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 9వ తేదీన టెట్ పరీక్ష జరుగనుంది. దీనికి దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 29 నుంచే ప్రారంభం కానుంది. పరీక్ష ఫీజు రూ. 200. 29వ తేదీ నుంచే ఫీజులు చెల్లించి, మార్చి 1 నుంచి ఆన్లైన్ (http://tstet.cgg. gov.in)లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు. 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఏప్రిల్ నెలాఖరులో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని, జూన్‌లో పరీక్ష నిర్వహిస్తామని గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే డీఎస్సీ పరీక్షకు హాజరుకావాలంటే టెట్‌లో ఉత్తీర్ణత సాధిం చడం తప్పనిసరి. దీంతో టెట్ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ గతేడాది నవంబర్లోనే జారీ చేసింది. నిబంధనలు, అర్హతలు, ఇతర వివరాలతో కూడిన మార్గదర్శకాలను డిసెంబర్ 12న విడుదల చేసింది. కానీ వరంగల్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. తరువాత కూడా పలు కారణాలతో దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో ‘టెట్’ నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఆమోదం కోసం విద్యా శాఖ లేఖ రాసింది. శుక్రవారం ఎన్నికల కమిషన్ అనుమతివ్వడం, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ‘టెట్’ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 29 నుంచి దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభిస్తామని పాఠశాల విద్యా డెరైక్టర్ జి.కిషన్ తెలిపారు. కాగా ఈసారి టెట్‌కు 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరవుతారని అధికారుల అంచనా. ఇదీ టెట్ షెడ్యూల్ ఫిబ్రవరి 29 నుంచి: వెబ్సైట్ నుంచి పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 14 వరకు: ఫీజులు, దరఖాస్తులకు సంబంధించి ఫిర్యాదుల స్వీకరణ మార్చి 1 నుంచి 15 వరకు: ఆన్లైన్లో దరఖాస్తుల నమోదు ఫిబ్రవరి 29 నుంచి ఏప్రిల్ 9 వరకు: హెల్ప్ డెస్క్ సేవలు మార్చి 30వ తేదీ నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం ఏప్రిల్ 9న: ‘టెట్’ పరీక్ష (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పేపర్-1 (డీఎడ్ అభ్యర్థులకు), మధ్యాహ్నం 2:30 నుంచి 5 వరకు పేపర్-2(బీఎడ్, పండిట్ అభ్యర్థులకు) ఏప్రిల్ 23న: ఫలితాల వెల్లడి -
‘టెట్’ గైడ్‌లైన్స్ ఖరారు
-
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త
-
డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త
ఆర్థిక శాఖ ఆమోదం అనంతరం పోస్టుల సంఖ్యపై స్పష్టత: కడియం జూన్ 2వ వారంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష జూలై రెండో వారం నాటికి నియామకాలు 18 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసే అవకాశం మార్చి 1న టెట్ నోటిఫికేషన్.. ఏప్రిల్ 9న పరీక్ష! టెట్‌లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు పలు జిల్లాల్లో కొత్త పోస్టుల సృష్టి విద్యాశాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. వచ్చే ఏప్రిల్ చివరి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూలై రెండో వారంలోగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ సహా సంక్షేమశాఖల పరిధిలోని పాఠశాలల్లో దాదాపు 18 వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఈ మేరకు ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను విద్యాశాఖ ప్రభుత్వానికి అందజేసింది. అయితే ఆర్థిక శాఖ ఆమోదం తరువాతే పోస్టుల వివరాలను వెల్లడించనుంది. ఈ మేరకు డీఎస్సీ, టెట్లపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. ముందుగానే టెట్: ఉపాధ్యాయ అర్హత పరీక్షను (టెట్) డీఎస్సీ కంటే ముందే నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించారు. టెట్‌లో అర్హత సాధించిన వారినే డీఎస్సీ రాసేందుకు అనుమతిస్తారు. టెట్ నిర్వహణకు మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశముంది. ఏప్రిల్ రెండో వారంలో టెట్ నిర్వహించి, అదే నెల మూడో వారంలో ఫలితాలు వెల్లడిస్తారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను కడియం శ్రీహరి ఆదేశించారు. ఈ లెక్కన టెట్ నోటిఫికేషన్‌ను మార్చి 1న జారీ చేసి... పరీక్షను ఏప్రిల్ 9న (రెండో శనివారం) లేదా 10న (ఆదివారం) నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, ఓఎంఆర్ జవాబు పత్రాన్ని వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక డీఎస్సీ పరీక్షను జూన్ రెండో శనివారం (11వ తేదీన) నిర్వహించే అవకాశం ఉంది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలతో షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు. ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా టెట్ రాయవచ్చు. ‘టెట్’కు ఏడేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది కనుక ఈ అవకాశం కల్పిస్తారు. అయితే వారు డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే నాటికి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు పూర్తిచేసి, టెట్‌లో అర్హత సాధించి ఉండాలి. మొత్తంగా నోటిఫికేషన్లు జారీ చేసిన నాటి నుంచి టెట్ ప్రక్రియను 60 రోజుల్లో, డీఎస్సీ ప్రక్రియను 75 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఉపాధ్యాయ ఖాళీల వివరాలను ఆర్థిక శాఖ, ముఖ్యమంత్రి ఆమోదం లభించిన తరువాత వెల్లడిస్తామని కడియం చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియామకాలను పూర్తి చేస్తామన్నారు. మరోవైపు అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయ పోస్టులకు ఒకే పరీక్ష నిర్వహించాలని ఇది వరకే ప్రాథమికంగా నిర్ణయించారు. దీనిపై మరోసారి చర్చించి తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. కొత్త పోస్టుల సృష్టి..! వివిధ జిల్లాల్లో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ల కొరత తీవ్రంగా ఉంది. సబ్జెక్టు టీచర్లు లేక బోధన దెబ్బతింటోంది. దీంతో ఖాళీల భర్తీతో పాటు అదనపు పోస్టుల అవసరం ఉంది. అలాగే మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో పెద్ద సంఖ్యలో ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉండటమే కాకుండా కొన్ని అదనపు పోస్టులు అవసరం. ఈ నేపథ్యంలో కొత్త పోస్టులను సృష్టించాలని నిర్ణయించారు. దీనికోసం ఏయే జిల్లాల్లో ఎన్ని పోస్టులు అవసరమన్న ప్రతిపాదనలను ఆర్థిక శాఖకు పంపాలని నిర్ణయించారు. ఆర్థిక శాఖ ఆమోదం తరువాతే కొత్త పోస్టులు ఎన్ని వస్తాయన్నది తేలనుంది. విద్యాశాఖ మాత్రం వివిధ కేటగిరీల్లో నాలుగైదు వేల వరకు అదనపు పోస్టులు అవసరమని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక ఇప్పటికే ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 10,961 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు వచ్చే అదనపు పోస్టులు, వివిధ మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టులు కలిపితే 18 వేలకు పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశముంది. ప్రభుత్వ/జెడ్పీ స్కూళ్లలో ఖాళీలివీ.. జిల్లా ఖాళీలు మహబూబ్‌నగర్ 2,024 ఆదిలాబాద్ 1,818 రంగారెడ్డి 1,442 మెదక్ 1,257 నిజామాబాద్ 944 హైదరాబాద్ 763 ఖమ్మం 724 నల్లగొండ 689 కరీంనగర్ 666 వరంగల్ 634 మొత్తం 10,961 నష్టపోయిన వారిపై విధానపర నిర్ణయం: కడియం వివిధ డీఎస్సీలకు సంబంధించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసే విషయంలో విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లో ఎంత మంది నష్టపోయారు, వారికి ఎలా న్యాయం చేయవచ్చు, న్యాయపరమైన సమస్యలేమైనా ఉన్నాయా? అన్న అంశాలపై పరిశీలన జరిపామన్నారు. వారికి న్యాయం చేసే అంశంపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. -
టెట్ నిబంధనల్లో మార్పులు!
చివరి సంవత్సరం విద్యార్థులకు అవకాశంపై తర్జనభర్జన వార్షిక పరీక్షల్లో ఫెయిలై టెట్‌లో అర్హత సాధిస్తే సమస్యలు డిగ్రీ ఉన్న డీఎడ్‌లకు పేపర్-2 రాసే అర్హత తొలగింపు {పభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు టెట్ దరఖాస్తుల స్వీకరణ వాయిదా పడే అవకాశం! జనవరి 24న పరీక్ష నిర్వహణపైనా సందేహాలు 5 లక్షల మందికి ఎదురుచూపులే సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో పలు మార్పులు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన ఉత్తర్వులు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం, కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలో వాటిని సవరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ తర్వాతే టెట్‌కు దరఖాస్తులు స్వీకరించనుంది. తొలుత వరంగల్ ఉప ఎన్నికల తరువాత టెట్ దరఖాస్తులను స్వీకరించాలని భావించినా.. ఈ సవరణల నేపథ్యంలో వాయిదా వేసింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు టెట్ నిబంధనల్లో సవరణలను పేర్కొంటూ విద్యాశాఖ సోమవారం సాయంత్రమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. ఈ సవరణలను డిసెంబర్ మొదటి వారంలోగా జారీ చేస్తే... ముందుగా నిర్ణయించిన మేరకు జనవరి 24న టెట్‌ను నిర్వహించే అవకాశం ఉంటుంది. లేకపోతే పరీక్ష కూడా వాయిదా పడనుంది. మొత్తంగా టెట్ కోసం ఎదురుచూస్తున్న దాదాపు 5 లక్షల మందికి నిరాశ తప్పేలా లేదు. కొత్త రూల్స్ ప్రతిపాదనలివీ.. ఇంతకుముందు బీఎడ్, డీఎడ్ వంటి ఉపాధ్యాయ కోర్సు ఫైనలియర్ చదువుతున్నవారిని కూడా టెట్ రాసేందుకు అనుమతించారు. టెట్ సర్టిఫికెట్‌కు ఏడేళ్ల వ్యాలిడిటీ, నియామకాల్లో 20 శాతం మార్కుల వెయిటేజీ ఉంది. అయితే కోర్సు ఫైనలియర్లో ఫెయిలై, టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నారు. వారు తమ కోర్సులో తర్వాతి ఏడాది ఉత్తీర్ణులవుతున్నా... తిరిగి టెట్ రాయకపోవడమో, రాసినా అర్హత సాధించకపోవడమో జరుగుతోంది. కానీ డీఎస్సీ నియామకాల సమయంలో బీఎడ్/డీఎడ్‌లో పాస్ కావడానికి ముందే రాసిన టెట్‌ను చూపిస్తుండడంతో సమస్యలు వస్తున్నాయి. దీనితో న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశమూ ఉంది. దీంతో ఫైనలియర్ విద్యార్థులకు టెట్ రాసే అవకాశం ఇవ్వొద్దని భావిస్తున్నారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు బోధించేందుకు (ఎస్జీటీ పోస్టులు) డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. వారు టెట్ పేపర్-1 రాయాలి. 6 నుంచి 8వ తరగతి వరకు (స్కూల్ అసిస్టెంట్ పోస్టులు) బోధించాలంటే బీఎడ్ చేసిన అభ్యర్థులు అర్హులు. వారు టెట్ పేపర్-2లో రాయాలి. అయితే బీఎడ్ చేసినవారు పేపర్-1 రాసేందుకు అనర్హులని ఎన్సీటీఈ స్పష్టం చేసింది. దీంతో ఎస్జీటీ పోస్టులన్నీ డీఎడ్ అభ్యర్థులకే పరిమితమయ్యాయి. అయితే రాష్ట్రంలో డీఎడ్ అభ్యర్థులకు డిగ్రీ ఉంటే పేపర్-2 రాసేందుకు ప్రస్తుతం అవకాశముంది. దీనిపై బీఎడ్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో డీఎడ్‌తో డిగ్రీ ఉన్నవారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అవకాశం ఇవ్వవద్దన్న డిమాండ్ ఉంది. దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అలాగే టెట్ కనీస అర్హత మార్కుల విధానం, విద్యార్హత పరీక్షలైన ఇంటర్, డిగ్రీలలో కనీస మార్కులు ఉంటేనే (45 శాతం ఉండాలా?.. 50 శాతం ఉండాలా?) టెట్ రాసేందుకు అనుమతిచ్చే అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఇక జనవరి 24న టెట్ నిర్వహణకు విద్యాశాఖ చర్యలు చేపట్టడంతో ప్రైవేటు స్కూళ్ల టీచర్లు మూకుమ్మడి సెలవులు పెట్టి పరీక్షకు ప్రిపేరవ్వడానికి సిద్ధమయ్యారు. అయ్యాయి. దీంతో యాజమాన్యాలు గగ్గోలు పెడుతూ విద్యాశాఖ ఉన్నతాధికారుల వద్దకు వెళ్లాయి. పరీక్షల సమయంలో టెట్ పెడితే ఇబ్బందులు వస్తాయని.. ఏప్రిల్, మే నెలల్లో టెట్ నిర్వహించాలని కోరాయి. దీనిపైనా నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. -
టెట్ దరఖాస్తులకు బ్రేక్!
ఎన్నికల సంఘం నుంచి రాని స్పష్టత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు ఈనెల 18 నుంచి చేపట్టాల్సిన ఫీజు చెల్లింపు, 19వ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ ప్రక్రియకూ బ్రేక్ పడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి మంగళవారం స్పష్టత వస్తే, బుధవారం నుంచి దరఖాస్తులను ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది. అయితే, ఎన్నికల సంఘం నుంచి వివరణ వచ్చేసరికి కొంత సమయం పడుతుందని సమాచారం అందింది. దీంతో ఉప ఎన్నిక తరువాతే ఫీజు చెల్లింపు, దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా టెట్‌ను ఎలా నిర్వహిస్తారని ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులు ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ స్పష్టత కోరింది. టెట్‌కు అనుమతి ఇవ్వండి టెట్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని డీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసింది. సచివాలయంలో మంగళవారం భన్వర్‌లాల్‌ను సంఘం ప్రతినిధులు కలిశారు. టెట్ ఉద్యోగ పరీక్ష కాదని, గత ఏడాది సాధారణ ఎన్నికల సమయంలోనూ టెట్ నిర్వహణకు అనుమతి ఇచ్చారని అభ్యర్థులు పేర్కొన్నారు. ఆయనను కలిసిన వారిలో డీఎడ్ సంఘం నాయకులు రామ్మోహన్‌రెడ్డి, రవి, భారతి తదితరులు ఉన్నారు. -
టెట్, డీఎస్సీలకు వేర్వేరు పరీక్షలు!
-
టెట్, డీఎస్సీలకు వేర్వేరు పరీక్షలు!
విద్యాశాఖ నిర్ణయం * జనవరి 24న టెట్ నిర్వహించేందుకు కసరత్తు * మార్చి లేదా ఏప్రిల్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ * వేర్వేరు పరీక్షలపై 3 లక్షల మంది అభ్యర్థుల ఆందోళన * ఏపీ తరహాలో రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్ * గతంలో టెట్ రాసినవారికి వెయిటేజీ ఇవ్వాలని విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: టెట్, డీఎస్సీ కలిపి నిర్వహిస్తారా? వేర్వేరుగా నిర్వహిస్తారా అన్న సందిగ్ధానికి తెరపడింది. ఈ రెండు పరీక్షలను వేర్వేరుగా నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,961 ఉపాధ్యాయ నియామకాలకు జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) ఆధ్వర్యంలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణపై విద్యాశాఖ దృష్టి సారించింది. వచ్చే జనవరిలో టెట్‌ను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఇందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. జనవరి 24న టెట్‌ను నిర్వహించాలని భావిస్తోంది. నిర్వహణ తేదీపై అధికారికంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జనవరిలో టెట్ నిర్వహిస్తే మార్చి లేదా ఏప్రిల్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. టెట్ కన్వీనర్‌గా పాఠశాల విద్యాశాఖ అదనపు డెరైక్టర్ గోపాలరెడ్డిని నియమించినట్టు తెలిసింది. ఇలా వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడాన్ని డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్న దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు. టెట్, డీఎస్సీ రెండూ కలిపి నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా టెట్‌లో అర్హత సాధించాలన్న పేరుతో ఉద్యోగ నియామక పరీక్షలకు అభ్యర్థులను దూరం చేయడం సరైంది కాదని పేర్కొంటున్నారు. రెండూ కలిపి పరీక్ష నిర్వహించి, మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గతంలో టెట్ రాసి అర్హత సాధించిన వారికి ఆంధ్రప్రదేశ్ తరహాలో వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎప్పట్నుంచో డిమాండ్ రాష్ట్రంలో టెట్, డీఎస్సీలను (టీఆర్టీ) కలిపి నిర్వహించాలన్న డిమాండ్ ఎప్పట్నుంచో ఉంది. ప్రవేశ పరీక్షల్లో అర్హత సాధించి, ఉపాధ్యాయ కోర్సులు పూర్తి చేసి వస్తున్న అభ్యర్థులు టీఆర్టీలో మెరిట్ సాధిస్తేనే ఉద్యోగం పొందుతున్నారు. ఏ ఉద్యోగానికి కూడా ఇన్ని రకాల పరీక్షలు లేనపుడు.. ఉపాధ్యాయ పోస్టుకు మాత్రం అదనంగా మళ్లీ టెట్‌లో అర్హత సాధించాలన్న నిబంధన సరికాదని అభ్యర్థులు చెబుతున్నారు. 2013లో టెట్, టీఆర్టీ కలిపి నిర్వహించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫారసులు, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనల మేరకు టెట్, టీఆర్టీ కలిపి టెర్ట్‌గా (టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్టు) నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే అప్పట్లో రాష్ట్ర విభజన ఆందోళనల నేపథ్యంలో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టలేదు. అప్పట్లో ఇచ్చిన నోటిఫికేషన్ ను కూడా రద్దు చేశారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత ఇటీవల ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో ప్రత్యేకంగా టెట్ అవసరం లేదని పేర్కొంది. గతంలో డీఎస్సీని 100 మార్కులకు నిర్వహించేవారు. ఏపీలో టెర్ట్, డీఎస్సీ కలిపి 200 మార్కులకు పరీక్ష నిర్వహించారు. మెరిట్, రోస్టర్ కమ్ రిజర్వేషన్ల ఆధారంగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. అలాగే గతంలో టెట్‌లో అర్హత సాధించిన వారికి 20 శాతం వెయిటేజీ ఇస్తామని తెలిపింది. అయితే ఇది, ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధమంటూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టులో వాదనలు జరిగాయి. చివరకు ప్రభుత్వ నిర్ణయంతో హైకోర్టు ఏకీభవించింది. అభ్యర్థుల పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై అభ్యర్థులు డివిజన్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లారు. -
టెట్టా... టెర్టా!
* టెట్ వేరుగానా లేక ఎంపిక పరీక్షతో కలిపి నిర్వహించాలా? * ఉపాధ్యాయ అర్హత పరీక్షపై విద్యాశాఖ ఆలోచనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే జనవరి నాటికి కొత్త టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భర్తీ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వేరుగా నిర్వహిం చాలా? లేక ఉపాధ్యాయ నియామక పరీక్షతో (టీఆర్టీ) టెట్‌ను కలిపి.. టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్టు (టెర్ట్) పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలా? అన్న అంశంపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ఇటీవల టీచర్ల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ చేపట్టిన అనంతరం 7,974 పోస్టుల అవసరం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. ఈ లెక్కలు తేలాక.. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరవడానికి ముందే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అసలు టెట్ అవసరమా? అన్న అంశాన్ని తేల్చేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) జారీ చేసిన టెట్ మార్గదర్శకాలనూ పరిశీలించే పనిలో పడింది. ఎన్సీటీఈ ఆదేశాల మేరకు 2011 మే నెలలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించింది. ఆ తరువాత మూడు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపిక పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతో పాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదన వ్యక్తమయింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 2013లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు టెట్, డీఎస్సీల నేతృత్వంలోని టీఆర్టీ వేర్వేరుగా కాకుండా రెండూ కలిపి టెర్ట్ పేరుతో నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తరువాత చివరి నిమిషంలో ఉమ్మడి పరీక్షపై వెనక్కి తగ్గింది. ఇక ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. వేర్వేరు పరీక్షలు కాకుండా టీఈఆర్టీ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్టీ) ఈ పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనలు ఉన్నాయి. వీలుకాకపోతే టెట్‌ను వేరుగా నిర్వహించడాన్నీ పరిశీలించాలని భావిస్తోంది. మరోవైపు ఏపీలో ఇటీవల రెండింటికి ఒకే రోజు టెర్ట్ను రెండు పేపర్లుగా నిర్వహించారు. అయితే రెండూ కలిపి నిర్వహించడం ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధమంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తుది తీర్పు రావాల్సి ఉంది. అది వ చ్చే వరకు వేచి చూడాలని, ఆ తీర్పు ప్రకారం తాము ముందుకు సాగాలన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి. -
బాబోయ్..డీఎస్సీ
టెట్ కమ్ టీఆర్టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి బాబు మార్కు కొర్రీలు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో చేసిన మాటల గారడీలో భాగంగా రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలను వంచించిన విధంగానే నిరుద్యోగ యువతతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. పాలకుల అనాలోచిత నిర్ణయాలతో అభ్యర్థులు వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తోంది.. నెల్లూరు(విద్య) : జిల్లాలో 416 పోస్టులను టెట్, టీఆర్టీ (టీచర్ అర్హత పరీక్ష) నోటిఫికేషన్లో చూపారు. ఆర్థిక శాఖ ఆమోదం సాకుతో 20 శాతం కుదించారు. ప్రస్తుతం ఉన్న 333 పోస్టుల కు 6వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ప్రతి అభ్యర్థి అర్హత పరీక్ష ఫీజుగా రూ.250 చెల్లించాలి. 6వేల మందికి సుమారు రూ.15 లక్షలు ఒక్క జి ల్లా నుంచే ఖజానాకు రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 9,061 పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 15 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 15 లక్షల మంది నిరుద్యోగులు రూ.250 చొప్పున ప్రభుత్వ ఖజానా నింపేం దుకు తమవంతు బాధ్యతను తమకు తెలియకుండానే భుజాలపైకి ఎత్తుకున్నారు. నిరుద్యోగులతో చెలగాటం పరీక్ష రుసుం రూ.250 బ్యాంక్‌లో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్నెట్ సెం టర్లో రూ.30 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. జెరాక్స్ కాపీలకు రూ.20 నుంచి రూ.50 ఖర్చవుతోంది. రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు జెరాక్స్ పత్రాలను విద్యాశాఖకు అందజేసేందుకు రూ.35 నుంచి రూ.50 వెచ్చించాల్సి వస్తోంది. మారుమూల ప్రాంతాల నుంచి నిరుద్యోగులు నెల్లూరుకు చేరుకునేందుకు రూ.100 నుంచి రూ.150 ఖర్చవుతోంది. ఒక్కో అభ్యర్థి సగటున రూ.400 ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యలను వారు తప్పుపడుతున్నారు. కాంపిటేటివ్ పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకుంటే ధ్రువపత్రాల జెరాక్స్‌లను అం దజేసే ప్రక్రియ ఎక్కడా లేదని వారు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. దరఖాస్తులను అందజేసేందుకు గర్భిణులు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. స్పష్టతలేని నోటిఫికేషన్ అర్హత పరీక్షకు వెలువడిన నోటిఫికేషన్లో బీఎస్సీ, బీకాం, ఓపెన్ యూనివర్సిటీ, భాషాపండితులు, ఇంటర్ తత్సమాన అర్హత తదితర అం శాలపై ఇంతవరకు స్పష్టత రాలేదు. ఈ నెల 16న ముగిసే ఆన్లైన్ చెల్లింపుల గడువును బుధవారం వరకు పొడిగించారు. ధ్రువీకరణ పత్రాల స్వీకరణకు ఫిబ్రవరి 5 వరకు నిర్ణయించారు. సెలవులు రావడంతో గడువు తేదీలను పొడిగించామని ప్ర భుత్వం చెప్పుకుంటోంది. వాస్తవానికి నిరుద్యోగుల నుంచి మరింత సొమ్ము చేసుకునేందుకు ఈ గడువు పనికొస్తుందని అభ్యర్థులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఉన్న పోస్టులకు రెండిం తలు, మూడింతలు అభ్యర్థులు దరఖాస్తులు చే సుకోవడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తోంది. విధులకు దూరంగా... ఆన్లైన్లో అప్లికేషన్లు అప్లోడ్ చేసిన తర్వాత వాటి ప్రతులను విద్యాశాఖకు అందజేసే క్రమం లో ఉపాధ్యాయ సిబ్బంది డిసెంబర్ నుంచి సా ధారణ విధులకు దూరమయ్యారు. కలెక్షన్ కమిటీలో డిప్యూటీ ఈఓ, ఏడీస్థాయి, గెజిటెడ్ హెచ్ఎంలు, ఉపాధ్యాయులు సుమారు 50 మంది ఫిబ్రవరి 5 తేదీ వరకు సాధారణ విధులకు హా జరయ్యే పరిస్థితి లేదు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న తర్వాత జెరాక్స్ కాపీలను స్వీకరిం చడం అర్థంలేని పని. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఆన్లైన్లో అప్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లు కూడా ఆన్లైన్లోనే వస్తాయనేది సాధారణ ప్రజలకు కూడా తెలిసిన విషయం. ప్రభుత్వం ఈ అంశాన్ని విస్మరించి భారీ స్థాయిలో సి బ్బందిని దరఖాస్తుల స్వీకరణకు నియమించడం ఎంతవరకు సమంజసమని పలువురు చర్చించుకుంటున్నారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు దరఖాస్తుల స్వీకరణలో నిమగ్నమవడం విద్యార్థులకు తీరని నష్టమని వారి తల్లిదండ్రులు అంటున్నారు.ఇలా సాధ్యం కాని హామీల్లో భాగంగా ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఇన్ని అవకతవకల మధ్య డీఎస్సీకి అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నిర్వహణ, జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ప్రభుత్వం పరీక్షను నిర్వహిస్తుందా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. డీఎస్సీ దరఖాస్తు పాట్లు నగరంలోని మూలాపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో టెట్ కమ్ టీఆర్టీ దరఖాస్తుల జెరాక్స్ పత్రాలను అందజేసేందుకు జిల్లావ్యాప్తంగా వచ్చే అభ్యర్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, దరఖాస్తులు ఇచ్చేందుకు చాలాసేపు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. బుధవారం వరకు 7,110 దరఖాస్తులు స్వీకరించారు. -
డీఎస్సీ అభ్యర్థులకు ని‘బంధనాలు’
విజయనగరం అర్బన్ : జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబులిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్ టీ)లో గందరగోళం నెలకొంది. ఆరు మాసాల పాటు ఊరించి ఎట్టకేలకు జారీ చేసిన నోటిఫికేషన్లో అడ్డగోలు నిబంధనలు చూసి అభ్యర్థులు కుంగి పోతున్నారు. టెట్, డీఎస్సీ-2014 రెండు పరీక్షలూ కలిపి రాయడం, పరీక్షలకు సిలబస్, వివిధ కేడర్ పోస్టుల అర్హతలు, స్థానికత, దూరవిద్య వంటి పలు అంశాలపై అడ్డగోలు నిబంధనలు పెడ్డడంతో అభ్యర్థులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు. పోటీకి అవకాశం ఇవ్వని స్థానికత సమస్య రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు స్థానిక సమస్యను ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల విద్యాభ్యాసన జరిగిన ప్రాంతాన్నే వారికి స్థానికంగా గుర్తిస్తారు. 10వ తరగతి వరకు ఏడేళ్లపాటు ఏ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తే ఆ జిల్లానే స్థానిక జిల్లాగా గుర్తిస్తారు. అయితే రాష్ట్ర విభజన తరువాత వచ్చిన డీఎస్సీలో తెలంగాణా జిల్లాల్లో విద్యాభ్యాసం చేసిన వారికి ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. ఈ నిబంధన వల్ల పలు వర్గాల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడాపాఠశాల తెలంగాణ ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ చదివిన విద్యార్థులందరికీ ప్రస్తు త డీఎస్సీలో అవకాశం కల్పించలేదు. వీరితో పాటు ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని హైదరాబాద్, తెలం గాణా జిల్లాలకు వలసవెళ్లి వారి పిల్లలున్నారు. వారి పరిస్థితీ ఇదే. మరిన్ని నిబంధనలు డీఎస్సీ-2014కు ప్రభుత్వం విధించిన నిబంధనలు ని రుద్యోగుల పాలిట ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు డీఎస్సీకి అర్హత కో ల్పోయే ప్రమాదం ఏర్పడింది. గతంలో అభ్యర్థు లు డీఎస్సీ రాతపరీక్షకు హాజరై, వారు టీచర్ పో స్టుకు ఎంపికైన తర్వాతే సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు. ప్రస్తుతం నోటిఫికేషన్లో అలా లేదు. డీఎ స్సీకి దరఖాస్తు చేసే సమయంలో ఆన్లైన్లో ఏ యే విద్యార్హతలున్నట్టు అభ్యర్థులు పేర్కొన్నారో .... ఆ సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు, ఆన్లైన్ దరఖాస్తు ప్రింటవుట్ జతచేసి డీఎస్సీ కౌంటర్లలో సమర్పించాలి. ఇదే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు. విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇంకా చేతికి అందని అభ్యర్థులు ఈ డీఎస్సీలో అవకాశం కో ల్పోయే ప్రమాదం ఉంది. డీఈడీ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్ప టివరకు ఆ ఫలితాలు ప్రకటించలేదు. దీంతో వీరు డీఎస్సీ-2014కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. గతంలో మాత్రం డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థుల ను కూడా డీఎస్సీకి అనుమతించారు. బీకాం అభ్యర్థులకు నిరాశే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీకాం అభ్యర్థులకు అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం... సబ్జెక్టుల విషయంలో నిబంధనలు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన 38 జీఓ ప్రకారం కనీసం నాలుగు సబ్జెక్టులున్న వారు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అయితే ఇక్కడ యూనివర్సిటీ జారీ చేస్తున్న బీకాం డిగ్రీలో మూడు సబ్జెక్టులు మాత్రమే ఉంటున్నా యి. వీటిలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం బీకాం అభ్యర్థులకు నాలుగు సబ్జెక్టులు లేకపోవడంతో వీరి దరఖాస్తులు స్వీకరించడం లేదు. వికలాంగులకూ తప్పని పాట్లు ఓహెచ్, వీహెచ్, హెచ్‌హెచ్ అభ్యర్థుల విషయంలో సర్టిఫికెట్లు ఎవరు జారీ చేయాలన్న విషయంలో కూడా స్పష్టత లేదు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టు అర్హత విషయంలో కూడా స్పష్టత కొరవడింది. గతంలో ప్రభుత్వం శాశ్వత కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయగా... తాజాగా మీ-సేవ ద్వారా తీసుకున్న కు లధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు. దూరవిద్య అభ్యర్థుల ఇక్కట్లు దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి, డీఎస్సీకి హజరవుతున్న అభ్యర్థులకు కూడా ఇక్కట్లు తప్పలేదు. డీఎస్సీ నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు తప్పనిసరిగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీతోపాటు బీఈ డీ పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టంగా పేర్కొంది. దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన కొందరు అభ్యర్థులు 10వ తరగతి తర్వాత నేరుగా డిగ్రీకి హాజరయ్యారు. దీంతో వీరికి ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ లేదు. ఈ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించేం దుకు అవాంతరాలు ఎరురవుతున్నాయి. ఇంటర్మీడియె ట్ లేని కారణంగా వీరి దరఖాస్తులు అప్లోడ్ కావడంలేదు. దూర విద్యను ప్రోత్సహిస్తున్నామని బాకా ఊదుతున్న ప్రభుత్వం, ఉద్యోగాల విషయంలో అడ్డగోలు ని బంధనలు పెట్టడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నా రు. గత డీఎస్సీల్లో ఎన్నడూ ఈ నిబంధన లేదు. ఇం టర్మీడియెట్ లేకపోయినా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా గుర్తించాలని అభ్యర్థులు కోరుతున్నారు. డీఎస్సీ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి అధికారులు రోజకోరకంగా స్పష్టతలేని ప్రకటనలు చేస్తున్నారు. అసలు అనుకున్న సమయానికి డీఎస్సీ జరుగుతుందో లేదో అన్న సందేశం కలుగుతోంది. ఈ పరీక్షపై నిర్థిష్టమైన, స్పష్టమైన విధానాన్ని అభ్యర్థులకు వివరించాలి. -ఐ. సింహాచలం, డీఎడ్ అభ్యర్థి, జిన్నాం, గజపతినగరం. చదివే సమయం ఏదీ? అన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచ మంతా ఈజీ ప్రొసెస్‌లో ఉంటే.. డీఎస్సీలో మాత్రం అన్ని సర్టిఫికెట్లను సబ్మిట్ చేయాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నా రు. ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దార్ కార్యాల యం చుట్టూ, కాలేజీల చుట్టూ తిరగడానికే సరిపోతుం ది. చదువుకోవడానికి సమయం ఎక్కడుంది..? -కె.కిరణకుమారి, బీఎడ్ అభ్యర్థి , విజయనగరం. నా పేరు తాటి తూరి సరోజా గాయత్రి. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా అక్కింపేట స్పోర్ట్స్ స్కూల్లో 4వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివాను. పీఈటీ పోస్టుకు విద్యార్హత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సర్టిఫికెట్‌కు ప్రస్తుత డీఎస్సీకి అర్హత లేదని ఆన్లైన్లో దరఖాస్తును తీసుకోవడం లేదు. తండ్రి స్థానికేతరుడు కావడం వల్ల తెలంగాణ డీఎస్సీకి కూడా అర్హత లేదు. దీన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. నూతన నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి.. మా చే తుల్లోలేదని చెబుతున్నారు. - ఇది ఈమె ఒక్కరి సమస్యే కాదు. స్థానికత సమస్యతో జిల్లాలో పలువురు ఆందోళన చెందుతున్నారు. -
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలో మొత్తం 688 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి గతంలో ఎన్నడూ లేని విధంగా టెట్, డీఎస్సీలకు ఉమ్మడిగా రాత పరీక్షను నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్టి)ల ఉమ్మడి పరీక్షకు బుధవారం నుంచి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. జిల్లాలో మొత్తం 839 టీచర్ పోస్టులు ఖాళీగా ఉండగా ప్రభుత్వం కేవలం 688 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో 151 పోస్టులకు ప్రభుత్వం కోత విధించింది. స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడు టీచర్లు, వ్యాయామోపాధ్యాయ పోస్టులను నోటిఫికేషన్లో ప్రకటించారు. స్కూలు అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, ఇంగ్లిష్ , ఫిజికల్ ఎడ్యుకేషన్, తెలుగు గ్రేడ్-2 భాషా పండితులు ఒక్క పోస్టు కూడా ఈ డీఎస్సీలో ప్రకటించలేదు. ఈ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 3వ తేదీ నుంచి 2015 జనవరి 17వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఠీఠీఠీ.ఛీట్ఛ్చఞ.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అభ్యర్థులు తమ వివరాలన్నింటినీ ఆ దరఖాస్తులో అప్లోడ్ చేయాలి. వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం దరఖాస్తు ప్రింటవుట్ కాపీ తీసుకొని దానికి అభ్యర్థుల విద్యార్హతలు, స్టడీ సర్టిఫికేట్లు, కులధ్రువీకరణ పత్రాలు, ఇతర అర్హతా పత్రాలను స్వయంగా సంతకాలు చేసి ప్రింటవుట్ కాపీని జతపరిచి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలి. ఈ వివరాలన్నీ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ధ్రువీకరిస్తేనే ఆ విద్యార్థుల హాల్‌టికెట్లు జనరేట్ అవుతాయి. అభ్యర్థులు దరఖాస్తును ఆన్లైన్లో సమర్పించిన తర్వాత తప్పనిసరిగా ఆ ప్రింటవుట్‌ను డీఈఓ కార్యాలయంలోనే అందజేయాలి. దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించకుండా నేరుగా డీఈఓ కార్యాలయాల్లో స్వీకరించరు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మేలో రాత పరీక్షలు ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి నిర్వహిస్తున్న టెట్, టి.ఆర్.టి. ఉమ్మడి రాతపరీక్షను 2015 మేలో నిర్వహించనున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు 2015 మే 9న, భాషా పండితులు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్లకు మే 10న, స్కూలు అసిస్టెంట్లు (లాంగ్వేజెస్ అండ్ నాన్ లాంగ్వేజెస్) మే 11న రాతపరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ రాత పరీక్షకు సంబంధించిన సిలబస్, మార్గదర్శకాలు, జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను వెబ్సైట్లో ఉంచారు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. భారీగా దరఖాస్తులు టి.ఆర్.టి, టెట్ ఉమ్మడి పరీక్షకు జిల్లా నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేయనున్నారు. రాష్ట్రంలో మరే ఇతర జిల్లాల్లో లేని విధంగా డీఈడీ, బీఈడీ కళాశాలలున్నాయి. జిల్లాలో మొత్తం 45 బీఈడీ కళాశాలలు, 64 డీఈడీ కళాశాలలున్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం సుమారు 10 వేల మంది అభ్యర్థులు బీఈడీ, డీఈడీ సర్టిఫికేట్లతో కళాశాల నుంచి బయటకు వస్తున్నారు. డీఎస్సీపై ఆశతో విద్యార్థులందరూ వివిధ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లోని ఖాళీల వివరాలు, డీఎస్సీకి ప్రకటించిన పోస్టులు, కుదించిన పోస్టుల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం. -
ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు కొత్త సిలబస్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ శుక్రవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టెర్ట్)లను కలిపి ఈసారి ఒకే పరీక్షను 200 మార్కులకు నిర్వహిస్తున్నందున ఈ కొత్త సిలబస్‌ను రూపొందించారు. ఈసారి టెర్ట్లో మండల, జిల్లా పరిషత్, ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలన్నిటినీ కలుపుకొని 10,313 పోస్టులు భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్), లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్, సెకండరీ ఎడ్యుకేషన్ టీచర్లు (ఎస్జీటీ)కు వేర్వేరు సిలబస్‌ను ప్రకటించారు. ఆయా విభగాల పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లోని నైపుణ్యాలను సమగ్రంగా అంచనా వేసేలా పలు అంశాలను ఇందులో చేర్చారు. గతంలో టెట్‌కు ఒక సిలబస్, డీఎస్సీకి మరో సిలబస్ ఉండేది. ఈసారి అందుకు భిన్నంగా రెండింటినీ కలపడంతో పాటు మరిన్ని కొత్త అంశాలను కూడా జోడించారు. అభ్యర్థుల నైపుణ్యాల పరిశీలన లక్ష్యంగా, వారికి అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఉండేలా దీనిని రూపొందించారు. ఈ సిలబస్ సమగ్ర సమాచారాన్ని ‘ఏపీడీఎస్సీ.సీజీజీ.జీఓవీ.ఇన్’ అనే వెబ్సైట్లో పొందుపరిచారు. ఈ సిలబస్ ప్రకారం భాషా పండితుల పోస్టులకు ఆయా భాషలపై ప్రాధాన్యమిస్తూ ఇచ్చే ప్రశ్నలు 70 మార్కులకు మాత్రమే ఉంటాయి. మిగతా 130 మార్కులు భాషా పండితులకు సంబంధం లేనివే ఉంటాయి. ఇంగ్లిష్ (గ్రామర్), గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టు అంశాలతో పాటు బోధనాంశాలపై వారికి ప్రత్యేక సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు 180 మార్కులకు, మిగతా అన్ని విభాగాల్లో 200 మార్కులకు సిలబస్‌ను ఇచ్చారు. పీఈటీలకు కూడా ఈసారి కొత్త అంశాలను చేర్చారు. స్కూల్ అసిస్టెంట్లు (లాంగ్వేజెస్) పోస్టులకు సిలబస్ * తెలుగు, ఉర్దూ, హింద, తమిళ్, కన్నడ, ఒరి యా, సంస్కృతం పోస్టులకు పార్ట్ - 1లో జనరల్ నాలెడ్జి, కరెంట్ అఫైర్స్లలో 10 మార్కుల ప్రశ్నలుంటాయి. * పార్టు- 2లో శిశు అభివృద్ధి, బోధన అంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తా రు. పార్టు - 3లో భాషలకు సంబంధించిన అం శాలతో పాటు అందులోని బోధనా పద్ధతులపై 70 మార్కులు ఉంటాయి. * పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్న లు ఉంటాయి. పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులు, వాటి బోధనా విధానాల పై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. స్కూల్ అసిస్టెంట్లు (నాన్ లాంగ్వేజెస్) సిలబస్ వీరికి నాన్ లాంగ్వేజెస్‌లో ఇంగ్లిష్, గణితం, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్లకు వేర్వేరు సిలబస్‌లను ప్రకటించారు. ప్రతి పేపర్లో పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అభివృద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. * పార్టు - 3 నుంచి సబ్జెక్టులవారీగా కొన్ని మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లిష్‌లో పార్టు - 3లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 70 మార్కులకు, పార్టు- 4 లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కృతం భాషలపై అభ్యర్థి ఆప్షన్‌ను అనుసరించి సంబంధిత భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లలో 60 మార్కులకు ప్రశ్నలిస్తారు. గణితంలో పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషలను ఆప్షన్‌గా పెట్టుకున్న వారికి ఆయా భాషల సాహిత్యాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 4 లో ఇంగ్లిష్ భాష, బోధన నైపుణ్యాలపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్సు సబ్జెక్టు బోధన పద్ధతులపై 100 మార్కులకు ప్రశ్నలుంటాయి. ఇందులో గణితంలో 70 మార్కులకు, ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ సబ్జెక్టులలో చెరొక 15 మార్కులకు ప్రశ్నలిస్తారు. ఇదే కేటగిరీలోని ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, బయోలాజికల్ సైన్స్ పోస్టులకు ఆయా సబ్జెక్టులకు ప్రాధాన్యమిస్తూ 200 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. భాషా పండితులు భాషా పండితుల పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు, పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలుంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాతో 70 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 30 మార్కులకు, పార్టు - 5లో గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లో సబ్జెక్టు, బోధనాంశాలపై 60 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పీఈటీ పోస్టులకు పీఈటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 30 మార్కులకు, పార్టు- 2లో ఇంగ్లిష్ గ్రామర్ బోధనాంశాలపై 30 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. పార్టు - 3లో ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్టులో 120 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్స్, ఫిలాసఫీ, చరిత్ర, ఆర్గనైజేషన్, అడ్మినిస్ట్రేషన్, సైకాలజీ, మెటీరియల్స్ అండ్ మెథ డ్స్, అనాటమీ, ఫిజియాలజీ, కినెసియాలజీ (అవయవాల కదలిక), హెల్త్ ఎడ్యుకేషన్, సేఫ్టీ ఎడ్యుకేషన్, ఫిజియాలజీ ఆఫ్ ఎక్సర్సైజ్, యోగా, ఆఫీషియేటింగ్, కోచింగ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌పై సిలబస్ ప్రకటించారు. ఎస్జీటీ పోస్టులకు సిలబస్ * ఎస్జీటీ పోస్టులకు పార్టు - 1లో జనరల్ నాలెడ్జి, కరెంటు అఫైర్స్‌పై 10 మార్కులకు ప్రశ్నలుంటాయి. * పార్టు - 2లో శిశు అృవద్ధి, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. పార్టు - 3లో తెలుగు, ఉర్దూ, హిందీ, తమిళ, కన్నడ, ఒరియా, సంస్కతం భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో సాహిత్యాంశాలు, బోధనాంశాలతో 35 మార్కులకు ప్రశ్నలిస్తారు. * పార్టు - 4లో ఇంగ్లిష్ గ్రామర్, బోధన పద్ధతులపై 35 మార్కులకు, పార్టు - 5లో గణితం సబ్జెక్టు, బోధన పద్ధతులపై 30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. * పార్టు - 6లో పర్యావరణ శాస్త్రం 1, 2 కింద సబ్జెక్టు బోదన పద్ధతులపై 40 మార్కులకు సిలబస్ ఇచ్చారు. ఇందులో జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనమిక్స్ తదితర అంశాలను పొందుపరిచారు. -
ఏపీలో టెట్, డీఎస్సీలకు ఒకటే పరీక్ష
‘టెట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్’గా కొత్త పేరు కొత్త నిబంధనల్ని విడుదల చేసిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: టీచర్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్), టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌లకు ఇకనుంచి ఉమ్మడిగా ఒకే పరీక్షను నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం బుధవారం జీఓఎంఎస్ నంబర్-38ను విడుదల చేసింది. ఇప్పటివరకు ఈ రెండు పరీక్షలు వేర్వేరుగా జరుగుతుండగా ఇపుడీ కొత్త ఉమ్మడి విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు గెజిట్‌లో పేర్కొంది. దీనికి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కమ్ టీఆర్టీ)గా నామకరణం చేసి కొత్త విధివిధానాలను ప్రకటించింది. ప్రభుత్వ, జిల్లా, మండల ప్రజాపరిషత్తులు, ప్రత్యేక, ఐటీడీఏ, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్ తదితర సంస్థలకు చెందిన స్కూళ్లలోని ఉపాధ్యాయ పోస్టులన్నిటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. టెట్ కమ్ టీఆర్టీ రాతపరీక్షలో ఎస్జీటీ, పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంటు పోస్టులకు 200 మార్కులకు పరీక్షలుంటాయి. మెరిట్, రోస్టర్ విధానంలో నియామకాలు చేపడతారు. నోటిఫికేషన్ వెలువడే నాటికి నిర్దేశించిన విద్యార్హతలు, వృత్తి శిక్షణార్హతలు ఉన్నవారు మాత్రమే ఈ పరీక్షలకు అర్హులు. గతంలో ఏపీ టెట్ రాసిన అభ్యర్థులు, కొత్త ఉమ్మడి పరీక్షలో అర్హతమార్కులు సాధించిన అభ్యర్థులు ప్రస్తుత టీచర్ ఎంపిక పరీక్షలకు అర్హులే. గణితం, భౌతికశాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం, ఆంగ్లం, తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా, సంస్కృతం, ఫిజికల్ ఎడ్యుకేషన్లలో స్కూల్ అసిస్టెంటు పోస్టులకు సంబంధించి ఆయా అభ్యర్థుల నిర్ణీత అర్హతలను జీఓలో సబ్జెక్టుల వారీగా పొందుపరిచింది. డిగ్రీతోపాటు బీఈడీ తత్సమాన పరీక్షలను పూర్తిచేసిన వారిని అర్హులుగా పేర్కొంది. డీఈడీలకు మాత్రమే ఎస్జీటీ పోస్టులు బీఈడీ పూర్తిచేసిన వారికి కూడా ఎస్జీటీ (స్పెషల్ గ్రేడ్ టీచర్) పోస్టులకు అర్హత కల్పిస్తామని మొన్నటివరకూ చెప్పుకొచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మొండిచేయి చూపింది. కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఎస్జీటీ పోస్టులను కేవలం డీఈడీ పూర్తిచేసిన వారికే పరిమితం చేసింది. ఇంటర్మీడియెట్‌తోపాటు రెండేళ్ల డీఈడీ, తత్సమాన పరీక్షలు పూర్తిచేసినవారు మాత్రమే అర్హులుగా జీఓలో స్పష్టంచేసింది. తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడ, ఒరియా, తమిళ ం, సంస్కృతం పండిట్ పోస్టులకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు అర్హతలను జీఓలో వివరించింది. పరీక్షల విధానం స్పెషల్ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు నిర్వహించే 180 మార్కుల పరీక్షకు మూడుగంటల సమయాన్ని నిర్దేశించారు. ఇందులో జీకే, శిశు బోధన, భాష, ఇంగ్లిష్ మెథడాలజీ, గణితం మెథడాలజీ, పర్యావరణం మెథడాలజీలపై ప్రశ్నలుంటాయి. భాషా పండితుల పోస్టులకు జీకే, శిశుబోధన, భాష, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ స్టడీస్‌లపై 200 మార్కులకు ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. పీఈటీ పోస్టులకు 180 మార్కులకు, వివిధ సబ్జెక్టులలోని స్కూల్ అసిస్టెంటు పోస్టులకు 200 మార్కులకు పరీక్షలు పెడతారు. కేటగిరీల వారీగా క్వాలిఫైడ్ మార్కులు వివిధ కేటగిరీల అభ్యర్థులకు క్వాలిఫైడ్ మార్కులను కూడా జీఓలో వివరించారు. ఓసీలు 60 శాతానికి పైగా, బీసీలు 50శాతం పైగా, ఎస్సీ, ఎస్టీ, ఇతరులు 40 శాతం పైగా మార్కులు సాధించినవారే ఆయా పోస్టుల ఎంపికకు అర్హులుగా పరిగణిస్తారు. వారికి మాత్రమే ఆయా పోస్టులకు అర్హత సాధించినవారిగా ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు జారీచేస్తారు. గతంలో ఏపీ టెట్‌లో అర్హత సాధించిన వారు కూడా మళ్లీ ఈ ఉమ్మడి పరీక్షను రాయాల్సి ఉంటుంది. వీరు గతంలో సాధించిన టెట్ మార్కులు, ప్రస్తుత ఉమ్మడి పరీక్షలో సాధించిన మార్కులను అనుసరించి ఏది ఎక్కువగా ఉంటే దానికి అనుగుణంగా 20 శాతం వెయిటేజీని ఇస్తారు. ఈ ఉమ్మడి పరీక్ష ఏడాది కాలపరిమితికే ఉంటుంది. ఎంపిక కమిటీ పరీక్షలో అర ్హత మార్కులు సాధించిన వారిని పోస్టులకు ఎంపిక చేయడానికి జిల్లాల స్థాయిలో ఎంపిక కమిటీలను ఏర్పాటుచేస్తారు. జిల్లా కలెక్టర్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ వైస్ చైర్మన్, డీఈఓ కార్యదర్శిగా ఉండే ఈ కమిటీలో జెడ్పీ సీఈఓ, మున్సిపల్ కమిషనర్, కార్పొరేషన్ కమిషనర్, ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారు. -
టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలు ఖరారు
హైదరాబాద్: ఏపీలో టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష), టీచర్ పోస్టుల భర్తీకి విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. ఎస్జీటి, స్కూల్ అసిస్టెంట్, పీఈడీ పోస్టుల భర్తీకి నిబంధనలు ఖరారు చేశారు. ఎస్జీటి పోస్టులకు 180 మార్కులకు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీలు ఉంటాయి. ఓసీలకు 40 సంవత్సరాలు,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 సంవత్సరాలు వయోపరిమితిగా నిర్ణయించారు. ** -
‘మొత్తం పాఠశాల జీవితమే.. విద్యాప్రణాళిక’
బోధనా పద్ధతులు టెట్, డీఎస్సీ పరీక్షలకు సంబంధించి తెలుగు బోధనా పద్ధతులు విభాగంలో ‘ప్రణాళికా రచన- పాఠ్యగ్రంథాలు’, ‘పాఠ్యబోధనా ప్రక్రియలు- ఆధునిక బోధనా పద్ధతులు’ పాఠ్యాంశాలు కీలకమైనవి. ఈ అధ్యాయాల నుంచి గతంలో అడిగిన ప్రశ్నలు, మాదిరి ప్రశ్నలను పరిశీలిద్దాం. మాదిరి ప్రశ్నలు 1. తరగతి బోధనకు మార్గనిర్దేశనం చేసి, ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో ఆ శిస్తున్న ప్రవర్తనా మార్పుల్ని సూచించేవి? 1) ఉద్దేశాలు 2) గమ్యాలు 3) లక్ష్యాలు 4) స్పష్టీకరణలు 2. విద్యార్థికి సంబంధించిన మొత్తం పాఠశాల జీవితమే విద్యాప్రణాళిక అని పేర్కొంది? 1) ఫిలిప్స్ టేలర్ 2) పౌల్ హార్ట్స 3) జె.ఎస్. కేర్ 4) సెకండరీ విద్యా కమిషన్ 3. ఉపాధ్యాయుని పని తీరు, సామర్థ్యాన్ని తెలిపే ప్రణాళిక? 1) సమగ్ర పథకం 2) పాఠ్యపథకం 3) వార్షిక ప్రణాళిక 4) సంస్థాగత ప్రణాళిక 4. భాషా బోధనలో యూనిట్ అంటే? 1) ఒక పద్యభాగం 2) ఒక గద్యభాగం 3) ప్రతిపాఠం ఒక యూనిట్ 4) ఒక పద్యపాఠం, ఒక గద్యపాఠం రెండూ కలిపి 5. అభ్యాసం చేయడం ద్వారా విద్యార్థుల్లో పునర్బలనం చేకూర్చడానికి తోడ్పడే గ్రంథం? 1) వాచక పుస్తకం 2) ఉపవాచకం 3) కృషి పుస్తకం 4) ఉపాధ్యాయ కరదీపిక 6. ఉపవాచక బోధనోద్దేశాలకు అనుగుణమైన పఠన విధానం? 1) విస్తార - మౌన పఠనం 2) క్షుణ్న పఠనం 3) ప్రకాశ - మౌన పఠనం 4) విస్తార - బాహ్య పఠనం 7. పాఠశాల, సమాజానికి మధ్య సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచడం ఏ ప్రణాళిక ముఖ్య లక్షణం? 1) విద్యా 2) సంస్థాగత 3) విషయ 4) వార్షిక ప్రణాళిక 8. తరగతి గదుల్లో సంప్రదాయంగా బోధించే విషయాలే కాకుండా పాఠశాలలో విద్యార్థి అన్ని అనుభవాల మొత్తాన్ని ఏమంటారు? 1) విద్యా ప్రణాళిక 2) వార్షిక ప్రణాళిక 3) సంస్థాగత ప్రణాళిక 4) సమగ్ర ప్రణాళిక 9. కృత్యాధార బోధనను మొదట ఏ దశలో ప్రవేశపెట్టారు? 1) ప్రాథమిక స్థాయి 2) ప్రాథమికోన్నత స్థాయి 3) ఉన్నత స్థాయి 4) ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలు 10. {పస్తుతం బోధన ఉపాధ్యాయ కేంద్రీకృతం కాకుండా, శిశు కేంద్రీకృతంగా సాగాలని ఎవరన్నారు? 1) రూసో 2) పెస్టాలజీ 3) బెంజిమన్ బ్లూమ్ 4) ప్రోబెల్ 11. వ్యాకరణ బోధనకు అనుకూలమైన పద్ధతి? 1) నిగమనోపపత్తి 2) అనుమానోపపత్తి 3) ప్రయోగ పద్ధతి 4) అనుసంధాన 12. పాఠశాల స్థాయిలో ప్రయోజనకరం కాని పద్ధతి? 1) చర్చా పద్ధతి 2) ఉపన్యాస పద్ధతి 3) ఉదాహరణ పద్ధతి 4) ప్రశ్నోత్తర పద్ధతి 13. ఏ బోధనలో వ్యాకరణాంశాల చర్చ ఉండకూడదు? 1) పద్యబోధన 2) గద్యబోధన 3) ఉపవాచకం 4) వ్యాసరచన 14. ఉపాధ్యాయుడి బోధనా సాఫల్యం ఏ సోపానంపై ఆధారపడి ఉంటుంది? 1) మూల్యాంకనం 2) ప్రదర్శనం 3) ఉన్ముఖీకరణం 4) పునర్విమర్శ 15. వపన్ అనే విద్యార్థికి సాహితీవేత్తలపట్ల గౌరవ భావం ఉంది. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? 1) భాషాభిరుచి 2) సాహిత్యాభిరుచి 3) సృజనాత్మక శక్తి 4) సముచిత మనోవైఖరి 16. బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థులను భాగస్వాములుగా చేసే పద్ధతి? 1) చర్చా పద్ధతి 2) ప్రశ్నోత్తర 3) కథాకథన 4) నాటకీకరణ పద్ధతి 17. ఉపాధ్యాయుడు పల్లె గొప్పదా! పట్నం గొప్పదా! అనే అంశంపై రచన చేయిస్తే.... అది? 1) ఊహాత్మక వ్యాసం 2) సంవాదాత్మక వ్యాసం 3) వర్ణనాత్మక వ్యాసం 4) ఆలోచనాత్మక వ్యాసం 18. పూర్వ జ్ఞానపరిశీలనం, ఉన్ముఖీకరణం, శీర్షి కా పఠనం... అనేవి ఎందులోని ఉప సోపానాలు? 1) ప్రదర్శనం 2) గైహికం 3) ప్రవేశం 4) పునర్విమర్శ 19. దేన్ని పాఠశాల స్థాయిలో అన్ని తరగతు లకు, అన్ని రకాల పాఠ్యాంశాల బోధనకు బహుళ ప్రయోజనకారిగా పేర్కొంటారు? 1) పఠన పద్ధతి 2) ప్రశ్నోత్తర పద్ధతి 3) చర్చా పద్ధతి 4) కథాకథన పద్ధతి 20. కృత్యాధార బోధన ముఖ్య ఉద్దేశం? 1) ప్రాతిపదిక విద్య 2) స్వయం అధ్యయన శక్తి 3) గుణాత్మక విద్యాసాధన 4) ప్రయోగాత్మక విద్య 21. {పాజెక్టు పద్ధతికి ఎవరు ప్రతిపాదించిన విద్యాతత్వ మూల సూత్రాలే ఆధారం? 1) పెస్టాలజీ 2) రూసో 3) ప్రోబెల్ 4) జాన్‌డ్యూయి 22. స్వయం వివర్తనం, స్వయం ప్రకాశం, స్వయం ప్రకటన అనేవి ఏ పద్ధతి ప్రధానాంశాలు? 1) క్రీడా పద్ధతి 2) కిండర్‌గార్డెన్ 3) మాంటిసోరి 4) ప్రాజెక్టు పద్ధతి 23. గద్యబోధనలో వ్యాకరణాన్ని ఎప్పుడు బోధించాలి? 1) పాఠ్యాంశం చివర 2) యూనిట్ చివర 3) ప్రత్యేక పీరియడ్‌లో 4) బోధనలో అంతర్భాగంగా 24. ‘కవికి గీటురాయి గద్యం అయితే, గద్యానికి గీటురాయి వ్యాసం’ అని ఎవరన్నారు? 1) పరవస్తు రంగాచార్యులు 2) ఆచార్య రామచంద్ర వర్మ 3) ఆచార్య రామచంద్ర శుక్లా 4) కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి 25. ఉపాధ్యాయుడు విద్యార్థులతో వ్యాకరణ బోధనలో లక్షణ, లక్ష్య సమన్వయం చేయ డాన్ని ఏమంటారు? 1) ప్రయోగ పద్ధతి 2) అనుసంధాన పద్ధతి 3) నిగమనోపపత్తి పద్ధతి 4) అనుమానోపపత్తి పద్ధతి గతంలో అడిగిన ప్రశ్నలు పాఠ్య ప్రణాళిక - పాఠ్యగ్రంథాలు 1. యం.బి.బచ్ నిర్వచనం ఆధారంగా పాఠశాల కార్యక్రమాలను అభివృద్ధి చేయ డానికి ఒక పాఠశాల తన అవసరాలను, అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకొని తయారుచేసుకునే అభివృద్ధి ప్రణాళిక? 1) పాఠ్యప్రణాళిక 2) విషయ ప్రణాళిక 3) సమగ్ర పథకం 4) సంస్థాగత ప్రణాళిక 2. ఉపాధ్యాయులు ఒక అంశాన్ని బోధించే టప్పుడు దానికి సంబంధించిన అదనపు సమాచారం, జ్ఞానం, వివరణకు ఉపకరించేవి? 1) పరామర్శ గ్రంథాలు 2) పాఠ్యపుస్తకాలు 3) సమస్యాపురాణం 4) కృషి పుస్తకాలు 3. బ్యూచాంపీ నిర్వచనాన్ని అనుసరించి పాఠశాలలో విద్యార్థులకు విద్యానుభవాలు కలిగించడం కోసం సాంఘిక సమూహం రూప కల్పన? 1) విద్యా ప్రణాళిక 2) సాంఘిక ప్రణాళిక 3) యూనిట్ ప్రణాళిక 4) సంస్థాగత ప్రణాళిక 4. క్షుణ్న పఠనాభివృద్ధి, భాషా సామర్థ్యాల సాధనకు తోడ్పడేది? 1) అధ్యాపక దర్శిని 2) ఉపవాచకం 3) కృషిపుస్తకం 4) వాచకం 5. విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడేది విద్యాప్రణాళిక అయితే పాఠ్యప్రణాళిక? 1) శాశ్వత ప్రయోజనానికి తోడ్పడేది 2) పాక్షిక ప్రయోజనానికి తోడ్పడేది 3) సాంకేతిక ప్రయోజనానికి తోడ్పడేది 4) అలౌకిక ప్రయోజనానికి తోడ్పడేది పాఠ్యబోధన ప్రక్రియలు - ఆధునిక బోధనా పద్ధతులు 6. మనోవైజ్ఞానిక సూత్రాలకు విరుద్ధమైన గద్యబోధనా పద్ధతి? 1) పఠన పద్ధతి 2) ఉదాహరణ పద్ధతి 3) చర్చా పద్ధతి 4) ప్రవచన పద్ధతి 7. పద్య బోధనలో ఉన్నత తరగతులకు ఉత్త మమైన ఆధునిక పద్ధతి? 1) తాత్పర్య పద్ధతి 2) పఠన పద్ధతి 3) ఖండ పద్ధతి 4) పూర్ణ పద్ధతి 8. పఠనౌత్సుక్యం పెంపొందించి, పఠన సామర్థ్యం ఎక్కువ చేయడం ద్వారా విద్యార్థుల వినోద విజ్ఞానాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యం కలిగిన బోధన? 1) పద్యబోధన 2) వ్యాస బోధన 3) గద్యబోధన 4) ఉపవాచక బోధన 9. {ఫాన్సిస్చాస్, జె.లైడ్ ట్రంప్ అనే విద్యావేత్తలు వ్యాప్తి చేసిన భావన? 1) కార్యక్రమయుత భావన 2) బృంద బోధన 3) సూక్ష్మబోధన 4) పర్యవేక్షణాత్మక అధ్యయనం 10. విద్యార్థుల శక్తియుక్తులను బలోపేతం చేయడానికి వారి జ్ఞానేంద్రియాలు ప్రేరేపిస్తే వారు అత్యంత సమర్థంగా అభ్యసించ గలుగుతారని భావించినవారు? 1) కాల్డ్వెల్ కుక్ 2) హెలెన్ పార్క హర్ట్స 3) మాంటిసోరి 4) ప్రోబెల్ 11. వ్యాకరణ సూత్రం చెప్పి, సూత్రంలోని పారిభాషిక పదాలు వివరించి, ఆ సూత్రంతో లక్ష్య లక్షణ సమన్వయం చేయడం? 1) అనుమానోపపత్తి పద్ధతి 2) నిగమోపపత్తి పద్ధతి 3) చారిత్రక వ్యాకరణం 4) ప్రాయోగిక పద్ధతి 12. కాలక్రమంలో ఒక యుగం నుంచి మరో యుగం వరకు భాషలో పరిణామాలను గుర్తించి, తెలిపే భాగం? 1) ప్రాయోగిక వ్యాకరణం 2) వర్ణనాత్మక వ్యాకరణం 3) చారిత్రక వ్యాకరణం 4) తులనాత్మక వ్యాకరణం 13. గద్యబోధన ఉద్దేశం? 1) విద్యార్థుల్లో భాషా జ్ఞానం అభివృద్ధి చేయడం 2) పదస్వరూప, స్వభావాలను గ్రహింప జేయడం 3) రచనా నైపుణ్యాన్ని అభివృద్ధి పరచడం 4) కవితా ప్రశంస మార్గాలు తెలిపి ఉత్తమ విమర్శకులు కావడానికి సహాయ పడటం 14. వ్యాఖ్యాన పద్ధతి ఉపకరించే బోధన? 1) కథాబోధన 2) నాటక బోధన 3) వ్యాకరణ బోధన 4) ఉపవాచక బోధన 15. పాఠశాల బోధనాభ్యసన ప్రక్రియలో భాగంగా విద్యార్థులు సంవత్సరమంతా నిర్వహించే తోటపని, పాఠశాల బ్యాంకు వంటి ఉద్యమాలు? 1) సంకీర్ణ ఉద్యమాలు 2) సాంస్కృతిక ఉద్యమాలు 3) పర్యావరణ ఉద్యమాలు 4) భాషోద్యమాలు సమాధానాలు: 1) 4; 2) 1; 3) 1; 4) 4; 5) 2; 6) 4; 7) 4; 8) 4; 9) 2; 10) 3; 11) 2; 12) 3; 13) 1; 14) 2; 15) 1. -
ఈ ఏడాది టెట్ యథాతథం: గంటా
విశాఖపట్నం : ఈ ఏడాది టెట్‌ను యథతథంగా నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.... వచ్చే ఏడాది నుంచి టెట్ కొనసాగింపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టీచర్ల బదిలీలలో రేషనలైజేషన్ విధానాన్ని చేపడతామన్నారు. డీఎస్సీ ఉద్యోగాల భర్తీ అయ్యే వరకు విద్యా వాలంటీర్ల సర్వీసును కొసాగిస్తామని గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.