ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలు | andhra pradesh dsc exam schedule released | Sakshi
Sakshi News home page

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలు

Published Sat, Apr 28 2018 12:10 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ప్రకటన చేశారు. మే 4న టెట్‌‌, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస​కమిషన్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు.

ఆరు కేటగిరీల్లో(ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీఈటీ, ఎల్‌పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెట్‌, డీఎస్సీల సిలబస్‌ను వారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్‌ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement