DSC
-
డీఎస్సీ ఎప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ అభ్యర్థులతో ఆటలాడుతోంది. తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీతో 25 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు.. సీఎం కాగానే 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. ఇప్పటికి 8 నెలలు పూర్తయినా డీఎస్సీపై ఎలాంటి ప్రకటనా చేయకపోవడంపై ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వం నిలువునా మోసంచేసిందంటూ మంగళవారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం రద్దు చేసి, మెగా డీఎస్సీ పేరుతో తమ జీవితాలతో ఆటలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సీఎం చంద్రబాబు 16,347 పోస్టులకు తొలి సంతకం చేసి, గత డిసెంబర్‌కే భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. కానీ 8 నెలలు అవుతున్నా నోటిఫికేషన్ ఇవ్వకపోగా పలు సాకులతో వాయిదా వేస్తున్నారని ఉపాధ్యాయ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నెల క్రితమే జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలను తెప్పించుకుంది. ఆ వివరాలను కూడా వెల్లడించలేదు. నోటిఫికేషన్‌పై నిరుద్యోగులను ఇన్ని నెలలుగా మభ్యపెట్టి, వాస్తవ పరిస్థితులను వెల్లడించకపోవడంతో అభ్యర్థులు రోడ్డెక్కుతున్నారు. నోటిఫికేషన్‌పై నోరు విప్పని ప్రభుత్వం ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’.. అంటూ ఎన్నికల్లో నారా చంద్రబాబుతో పాటు కూటమి ముఖ్య నాయకులంతా తెగ ప్రచారం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మాట మార్చేశారు. ఉన్నవి 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అని ప్రకటించారు. అంతేగాకుండా, గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. తర్వాత కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ జూలై 2న నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో పరీక్షలంటూ ప్రచారం చేసింది. అనంతరం టెట్‌కు, డీఎస్సీకి 90 రోజుల గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్ కు, తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి మూడు నెలలైనా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ప్రకటించలేదు. దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్థికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నా, కనీసం విద్యాశాఖ మంత్రి కూడా ఫలనా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం చేయడంలేదు. ఏడాది కాలంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు చదవాలో లేదో కూడా తెలియని గందరగోళంలో ఉన్నారు. ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఇన్ని పోస్టులు లేకపోవడం వల్లే నోటిఫికేషన్ ఇవ్వడంలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సీఎం మొదటి సంతకం ఏమైంది? అధికారంలోకి వస్తే మొదట మెగా డీఎస్సీ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నికల ముందు కూటమి నేతలు యువతకు హామీ ఇచ్చారు. సీఎం చంద్రబాబు 16 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామంటూ తొలి సంతకం చేశారు. అయినా భర్తీ ప్రక్రియ చేపట్టకుండా కాలయాపన చేయడం అన్యాయం. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. ఇక ఓపిక పట్టే పరిస్థితి యువతకు లేదు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలి. లేకపోతే పోరాటాలతోనే ప్రభుత్వానికి సమాధానం చెబుతాం. – జి.రామన్న, డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అభ్యర్ధుల జీవితాలతో చెలగాటం డీఎస్సీ కోసం ఇప్పటికి రెండుసార్లు కోచింగ్ తీసుకున్నా. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటే అందరం నమ్మాం. డిసెంబర్ అన్నారు.. జనవరి వెళ్లిపోతోంది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో మాత్రం ఎవరూ చెప్పరు. డీఎస్సీ అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. – లలిత్, డీఎస్సీ అభ్యర్థి, తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా రెండేళ్ల నుంచి శిక్షణ తీసుకుంటున్నాం.. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. 16 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. రకరకాల సాకులతో వాయిదా వేస్తున్నారు. రెండేళ్ళ నుంచి శిక్షణ తీసుకుంటున్నాం. – మండల శ్రీను, శ్రీకాకుళం, శ్రీకాకుళం జిల్లా -
పదో ర్యాంకు వచ్చినా.. ఉద్యోగం ఇస్తలేరు..
ఖానాపురం: పేద కుటుంబం.. కష్టపడి చదువుకున్నాడు. పరీక్షలు రాసి పదో ర్యాంకు సాధించాడు. ఇక ఉద్యోగం వచ్చినట్లేనని సంతోషపడ్డాడు. కానీ, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొలువుకు దూరమయ్యాడు. జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేసినా కనికరించడం లేదు. తనకు ఉద్యోగం ఇప్పించండని వేడుకున్నా ఫలితం లేదు. ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడు. వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ డీఎస్సీ–2024 ఫలితాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సెంకడరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. దీంతో అక్టోబర్ 29న సర్టీఫికెట్ల పరిశీలన కూడా ముగిసింది. గతేడాది నవంబర్ 2న విడుదల చేసిన 1:1 జాబితాలో పేరు లేదు. తనకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంతోపాటు సాంకేతిక సమస్య కారణంగా ఉద్యోగం రాలేదని మహేందర్‌తోపాటు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీ విభాగంలో తనకంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిన వారికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఇప్పటికైనా తనకు ఉద్యోగం ఇవ్వాలని మహేందర్‌తోపాటు ఆయన కుమారులు కోరుతున్నారు.సకాలంలో ఆర్సీఐ సర్టీఫికెట్ ఇవ్వలేదుఆర్సీఐ (రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) రిజిస్ట్రేషన్ సర్టీఫికెట్‌ను సరైన సమయంలో కార్యాలయంలో అందించలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫైల్‌ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు పంపించాం. ఇతర జిల్లాలతో సంబంధం లేకుండా సంబంధిత ఫైల్‌ను తిరస్కరించి తిరిగి పంపించారు. దీంతో ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మహేందర్‌కు ఉద్యోగాన్ని ఇవ్వలేదు. – మామిడి జ్ఞానేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారి -
డీఎస్సీపై పూటకో మాట.. రోజుకో మెలిక
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మెగా డీఎస్సీ హామీ అమలుపై చీకట్లు కమ్ముకున్నాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి సంతకం చేసి 16,347 టీచర్ పోస్టులను ప్రకటించారు. డిసెంబర్ నాటికి భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తామని చెప్పి, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన 6,100 పోస్టుల డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఏడు నెలలు దాటినా నోటిఫికేషన్ ప్రకటించకపోగా.. వాయిదాలకు మరిన్ని కారణాలు వెదుకుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జిల్లాల్లో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల వివరాలు అందించాలని మరోసారి విద్యాశాఖను కోరడం గమనార్హం. దీంతో ప్రభుత్వం గతంలో ప్రకటించిన 16,347 పోస్టుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినన్ని పోస్టులు లేకపోవడంతోనే నోటిఫికేషన్ ఇవ్వడం లేదన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబు జూన్ 13న మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేసి పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖను ఆదేశించారు. దీంతో సెప్టెంబర్‌లో డీఎస్సీ పూర్తవుతుందని అభ్యర్థులు భావించారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయానా ముఖ్యమంత్రే ప్రకటించడంతో అర్హత గల అభ్యర్థులు ప్రైవేటు ఉద్యోగాలను వదిలేసి పరీక్ష కోసం సిద్ధమయ్యారు. అయితే, కొత్తగా బీఈడీ చేసిన వారికి కూడా అవకాశం కల్పించేందుకు జూలైలో ఏపీ టెట్–2024 నోటిఫికేషన్ జారీ చేశారు. టెట్ పూర్తయి మూడు నెలలు గడిచిపోయింది. అయినా.. డీఎస్సీ నిర్వహణకు మాత్రం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. నోటిఫికేషన్ పేరుతో హడావుడి ఎన్నికల వేళ 25 వేల టీచర్ పోస్టులని చెప్పినా.. 16,347 పోస్టులను మాత్రమే ప్రభుత్వం ప్రక టించింది. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకు న్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పి స్తామంటూ ఆగస్టులో టెట్ పరీక్షలు నిర్వహించేలా జూలై 2న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చి ఆ గస్టులో పరీక్షలంటూ పేర్కొంది. ఇది చేయకపో గా మళ్లీ టెట్‌కు డీఎస్సీకి 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెపె్టంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితా లు వచ్చి రెండు నెలలు గడిచినా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం వెలవడలేదు. మరోపక్క ప్రకటించిన పోస్టుల్లో గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పాఠశాలల్లో (ఆశ్రమ్) దా దాపు 15 ఏళ్లుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వి ధానంలో పని చేస్తు న్న ఉపాధ్యాయులను తొలగించేందుకు కుట్ర ప న్నింది. వారికి డీఎస్సీలో ఎ లాంటి వెయిటేజీ ఇ వ్వకుండానే దాదాపు 1,150 ఖాళీలను రెగ్యులర్ విధానంలో భర్తీకి చూపించింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పని చేస్తున్న వారు రోడ్డున పడే పరిస్థితి తలెత్తింది. పైగా గత కొన్ని నెలలుగా ఈ విభాగం కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయ అభ్యర్థుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో వారి దృష్టి మళ్లించేందుకు జిల్లాల వారీగా ఖాళీల వివరాలు పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించడం డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఆలస్యం చేయడానికేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు దగా’
తాడేపల్లి : మెగా డీఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగా చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి, తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు.తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్‌మీట్ నిర్వహించిన మేరుగు నాగార్జున.. చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టారు. ‘ ప్రజలకు సంక్షేమం అందించాల్సిందిపోయి వార్నుంచే డబ్బులు గేసుకుంటున్నారు. దీపం పథకానికి రూ.4500 కోట్లు అవసరమైతే రూ.800 కోట్లతో సరిపెట్టారు. ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయటం?, అన్నా క్యాంటీన్‌కు ఒకసారి వెళ్తే రెండో సారి వెళ్లే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు. వృద్దులు, వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో అడుకుంటున్నారు.రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని దగా చేశారు. రైతులకు అండగా ఉంటూ రేపు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం.వ్యవసాయం దండగా అని తన పుస్తకంలో రాసుకున్న వ్యక్తి చంద్రబాబు. జగన్ హామీ ఇచ్చాడంటే దాన్ని అమలు చేసి చూపించాడు. చంద్రబాబు ఏనాడూ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి పేరుతో ఒక్క పైసా కూడా యువకులకు ఇవ్వలేదు. వాలంటీర్లను ఉద్యోగాల్లో నుండి తొలగించారు.ప్రభుత్వం అసూయ, కక్షలతో పరిపాలన చేస్తోంది. చివరికి ఐపీఎస్, ఐఏఎస్‌లను కూడా వదలకుండా వేధింపులకు గురి చేస్తున్నారు. ఆరు నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజలకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది’అని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: టార్గెట్ నాగబాబు.. లోకేష్‌కు బూమరాంగ్! -
డీఎస్సీ సిలబస్‌తో డీలా!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. ఇదిగో డీఎస్సీ.. అదిగో డీఎస్సీ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తున్న ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం డీఎస్సీ సిలబస్‌ను మాత్రమే విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సిలబస్‌తో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు ఎప్పుడూ లేని రీతిలో ఇంటరీ్మడియెట్ వరకు సిలబస్‌ను ఇవ్వడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ అభ్యర్థులు 3–10 తరగతుల సిలబస్‌ను మాత్రమే చదవాలని చెబుతూనే.. స్కూల్ అసిస్టెంట్ పరీక్షకు ఇంటర్ సిలబస్‌ను ఇవ్వడం అభ్యర్థులను కలవరపెడుతోంది. 2018 డీఎస్సీలోనూ ఇలాగే చెప్పిందొకటి, పరీక్షకు ఇచ్చిన సిలబస్ మరొకటి కావడంతో నాడు చాలా మంది అభ్యర్థులు నష్టపోయారు. మరోసారి ఇప్పుడు కూడా ప్రభుత్వం ఇదే మాదిరిగా వ్యవహరిస్తుండటంతో మరోసారి నష్టపోక తప్పదని అభ్యర్థులు వాపోతున్నారు. 2014 డీఎస్సీలోనూ ఇదే విధానం అనుసరించడంతో అభ్యంతరాలు వ్యక్తమైనా నాటి టీడీï³ సర్కారు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో డీఎస్సీ ఫైల్‌పై సీఎం చంద్రబాబు సంతకం చేసినప్పుడే సిలబస్‌పై సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని పలువురు అభ్యర్థులు, విద్యారంగ నిపుణులు ప్రభుత్వాన్ని కోరారు. హైసూ్కల్ బోధనకు ఇంటర్ సిలబస్ ఇవ్వడం సరికాదన్నారు. అలాగే పరీక్షల నిర్వహణపైనా విజ్ఞప్తులు చేశారు. బోధించే తరగతులకు మించి సిలబస్..టెట్ సిలబస్సే డీఎస్సీ పరీక్షలకు కూడా ఉంటుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 3 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ ఉంటుందని తాజాగా డీఎస్సీ సిలబస్‌లో ప్రకటించారు. కానీ, సిలబస్ వివరణలో మాత్రం ఇంటర్మీడియెట్ వరకు ప్రశ్నలు ఉంటాయని మెలిక పెట్టారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధన చేస్తుండగా, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధిస్తున్నారు. బోధించే తరగతులకు అనుగుణంగా అంతవరకే గతంలో డీఎస్సీ సిలబస్ ఉండేది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు మూడో తరగతి నుంచి 8వ తరగతి వరకు, స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పోస్టులకు 6 నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మాత్రమే ఉండేది. దీన్ని ఆధారం చేసుకునే ప్రశ్నపత్రాలను రూపొందించేవారు. కానీ, 2014, 2018 డీఎస్సీల్లో మాత్రం సిలబస్‌ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం అనూహ్యంగా పెంచేసింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బోధించే తరగతులకు మించి సిలబస్ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు, విద్యా రంగ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఊస్టింగేనా?ఎస్జీటీ, టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు పాఠశాల విద్యా శాఖ సిలబస్‌ను ప్రకటించింది. కానీ హైసూ్కళ్లల్లో బోధించే స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులకు సిలబస్‌ను ప్రకటించలేదు. అంటే ఈ విభాగంలో పోస్టులు లేవని ప్రభుత్వం చెబుతున్నట్టుగానే భావించాల్సి వస్తోంది. 2018 ఫిబ్రవరి స్పెషల్ డీఎస్సీలో ఎస్ఏ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో దాదాపు 852 పోస్టులను గుర్తించి సుమారు 602 పోస్టులు భర్తీ చేశారు. కానీ ఈసారి వారికి అవకాశం లేకపోవడంతో డిగ్రీతో పాటు బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జాతీయ విద్యావిధానం–2020 నిబంధనల ప్రకారం ప్రతి పాఠశాలలోనూ తప్పనిసరిగా ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. ఆన్లైన్ పరీక్షపైనా అభ్యంతరాలు..జూలైలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) మాదిరిగానే డీఎస్సీని కూడా ఆన్లైన్లోనే నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్‌లో కాకుండా ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం అభ్యర్థులకు నష్టం చేస్తుందనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సెషన్లలో రోజుల తరబడి ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తే నష్టం జరుగుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ.. జిల్లా స్థాయిలో టీచర్ పోస్టుల భర్తీకి చేపట్టే పరీక్ష కాబట్టి పరీక్షను కూడా ఉమ్మడి జిల్లాలవారీగా ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై గతంలో అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను అభ్యర్థించారు. నాడు సానుకూలంగా స్పందించిన మంత్రి ఇప్పుడు మాత్రం ఆన్లైన్లో అది కూడా టెట్ మాదిరిగా ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పది రోజులు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఏపీలో నిరుద్యోగులు గందరగోళం
-
నవతకు షాకిచ్చిన అధికారులు
-
డీఎస్సీ పోస్టులు పెంచాలంటూ అభ్యర్థుల ఆందోళన
అనంతపురం అర్బన్: డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ అనంతపురంలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల మంది ఎస్జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ సోమవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. రాస్తారోకో విరమించాలని కోరిన పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.అధికారులే స్వయంగా వచ్చి తమ గోడు వింటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు డీఆర్ఓ వారి వద్దకు వచ్చారు. అభ్యర్థులు వారి సమస్యలను డీఆర్వోకు వివరించి, వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నూరుల్లా, డీఎస్సీ అభ్యర్థులు ముజీబ్, రాము తదితరులు మాట్లాడారు.అనంతపురం జిల్లాకు ఈ డీఎస్సీలో కేవలం 181 ఎస్జీటీ పోస్టులే కేటాయించి వేలమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం వెయ్యి ఎస్జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీఓ 117ను రద్దు చేయాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ద్వితీయ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. జిల్లా మొత్తానికి ఒకేరకమైన పరీక్ష పత్రంతో పరీక్ష నిర్వహించాలన్నారు. -
తరగతి గదిలో కొత్త తరం!
సాక్షి, హైదరాబాద్: ఇటీవల డీఎస్సీ ద్వారా ఎంపికైన 10,006 మంది కొత్త ఉపాధ్యాయులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు. వాస్తవానికి వారి నియామక తేదీ ఈనెల 10 అని, అన్ని జిల్లాల డీఈవోలు పేర్కొన్నారు. ప్రతీ జిల్లాలోను కౌన్సెలింగ్ చేపట్టిన తర్వాత వారికి ప్రభుత్వ స్కూళ్లను కేటాయించారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఎక్కువ మంది సొంత మండలాల్లోనే విధుల్లో చేరారు. ఇతర మండలాలకు వెళ్లిన వాళ్లు 20 శాతం ఉండొచ్చని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎస్జీటీలు చేరిన వాటిలో 85 శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలే ఉన్నట్టు తెలిసింది. వీటిలో గరిష్టంగా 20 మంది విద్యార్థులే ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తికానందున బుధవారం కూడా కొనసాగినట్టు వార్తలొచ్చాయి. టీచర్లు రిలీవ్...ఇటీవల జరిగిన సాధారణ బదిలీలు, పదోన్నతుల్లో స్థాన చలనం జరిగిన ఉపాధ్యాయులకు కొత్త టీచర్లు రావడంతో విముక్తి లభించింది. ఒకే ఉపాధ్యాయుడు ఉండటం, ఇతర ప్రాంతాల నుంచి తీసుకునే వెసులుబాటు లేకపోవడంతో దాదాపు 7 వేల మంది టీచర్లు బదిలీ అయినప్పటికీ ఇంతకాలం రిలీవ్ కాలేదు. డీఎస్సీ ద్వారా కొత్త టీచర్లు రావడంతో వారికి బాధ్యతలు అప్పగించి రిలీవ్ అయ్యారు. అయితే మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 317 మంది బాధితుల వ్యవహారం ఇప్పటికీ కొలిక్కి రాలేదు. కొత్త నియామకాలకు ముందే ఈ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.ఆగని డిప్యుటేషన్లుకొత్త టీచర్ల నియామకంతో ఖాళీలు భర్తీ అవుతున్న నేపథ్యంలో... మళ్లీ డిప్యుటేషన్ల అంశం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. అనారోగ్య కారణాలతో డిప్యుటే షన్లు చేస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. డిప్యుటే షన్ల కమిటీ పరిశీలనకు పంపకుండానే ఇష్టానుసారం డిప్యూటేషన్ బాధ్యతలు ఇస్తున్నారని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చావా రవి తెలిపారు. తాజాగా మేడ్చల్ జిల్లాలో ఏడుగురికి ఈ తరహాలో అనుమతి ఇవ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మరి కొన్ని డిప్యుటేషన్లు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగు తున్నాయని, ఇవన్నీ పైరవీలేనని సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలకు ఇతర ప్రాంతాల నుంచి సర్దుబాటు పేరుతో అక్రమ డిప్యుటేషన్లు ఇస్తున్నారని పీఆర్టీయూ–తెలంగాణ నాయకుడు ఎం.చెన్నయ్య ఆరోపించారు. చదివిన బడిలో ఉపాధ్యాయుడిగా!ఖానాపురం: విద్యాబుద్ధులు నేర్చిన పాఠశాల లోనే ఉపాధ్యా యునిగా ఉద్యో గం వస్తే?.. అలా ంటి అరుదైన అవకాశం పొందారు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటకు చెందిన వెంకటేశ్వర్లు. ఆయన 1998 నుంచి 2002 వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడు నుంచి పదో తరగతి వరకు చదివారు. డీఎస్సీ–2024లో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయునిగా ఎంపికైన వెంకటేశ్వర్లు బుధవా రం విధుల్లో చేరగా.. స్థానికులు అభినందించారు. -
సమయం లేదు.. డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు..పరుగులు (ఫొటోలు)
-
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా
-
TG: డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు(మంగళవారం) జరగాల్సిన డీఎస్సీ-2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన సంగతిత తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే.. డాటా రానందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. రేపు(బుధవారం) కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
ఆశ పెట్టి.. నిరుద్యోగితో ఆడుకున్నారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ఆ యువకుడికి ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 24 గంటలు కూడా లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన కారంగుల సాయిరెడ్డి డీఎస్సీలో మంచి మార్కులు సాధించారు. ఈ నెల 8న ఆయనకు డీఈవో కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. ‘మీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు సోషల్ స్టడీస్‌లో సెలెక్ట్ అయ్యారు. 9న కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకోవాలి’అని ఫోన్ చేసి చెప్పారు. అదే రోజు రాత్రి ఆయన సెల్‌ఫోన్‌కు మెసేజ్ కూడా వచ్చింది. 9న ఉదయం కామారెడ్డికి చేరుకున్న సాయిరెడ్డి.. జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేసిన బస్సులో హైదరాబాద్ బయలు దేరారు.బస్సుకు అతికించిన జాబితాలో కూడా సాయిరెడ్డి పేరుంది. హైదరాబాద్‌కు వెళ్లిన సాయిరెడ్డికి అక్కడ సీఎం ప్రోగ్రాం ముగిసిన తరువాత నియామక పత్రాలు ఇచ్చేటపుడు జాబితాలో పేరు లేదన్నారు. దీంతో గురువారం డీఈవో రాజును కలవగా, పొరపాటు జరిగిందని, మీరు సెలెక్ట్ కాలేదని సమాధానం ఇచ్చారు. ‘మీకన్నా ముందు ర్యాంకు వాళ్లకు వెళ్లాల్సిన మెసేజ్, ఫోన్ కాల్ మీకు వచ్చింది, సారీ’అంటూ చెప్పారు. దీంతో సాయిరెడ్డి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. తొలుత జాబితాలో పేరు ఉన్నట్టుగా చూపి, చివరకు ఇలా లేదని చెప్పడంలో ఏదో కుట్ర దాగుందని అనుమానం వ్యక్తం చేశారు. -
మీరే మా వారధులు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘మీరే మా ప్రతినిధులు. మా వారధులు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా కింది స్థాయికి తీసుకెళ్లాల్సింది మీరే. ప్రభుత్వం ఎన్ని పాలసీలు చేసినా పిల్లలు వచ్చేది మీ దగ్గరికే. మేము ఎన్ని చేసినా అమలు చేయాల్సిన పిల్లర్స్ మీరే. తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దేది మీరే. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి మీరే బాధ్యులు. మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది. భావితరాలను నిర్మించే బాధ్యత మీది’అని డీఎస్సీ–24లో ఎంపికైన ఉపాధ్యాయులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఎంపికైన 10,006 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించడానికి ప్రభుత్వం బుధవారం ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్క, రాజ్యసభ ఎంపీ అభిషేక్ సింఘ్వీ, ఎమ్మెల్సీ కోదండరాం, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు పాల్గొన్నారు. కార్యక్రమం చివర్లో కొందరు అభ్యర్థులకు సీఎం, మంత్రులు నియామక పత్రాలు అందజేశారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ భవిష్యత్తు తెలంగాణ తరాలను నిర్మించడానికి సంపూర్ణ కృషి చేయాలని సభకు హాజరైన వేల మంది ఉపాధ్యాయులతో ప్రతిజ్ఞ చేయించారు. కేసీఆర్ కొడుకు, అల్లుడు, బిడ్డకు ఉద్యోగాలిస్తే కాదు.. వేలాది, లక్షాలాది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చిన నాడే తెలంగాణ పండుగ చేసుకుంటుందని చప్పట్లతో ఆయనకు తెలియజేయాలని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ బడుల్లో చదువుతున్నామని గర్వంగా చెప్పుకునేలా.. ‘ప్రభుత్వ బడులకు పంపాలంటే తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారు. ఉపాధి కూలీ అయినా సరే వారి పిల్లలను కాన్వెంట్, ప్రైవేటు స్కూళ్లకు పంపాలనుకుంటున్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌తో కలిపి 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే... కేవలం 10 వేల ప్రైవేటు పాఠశాలల్లో ఏకంగా 34 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు బడుల్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్లు, అనుభవం ఉన్న వాళ్లు ఉన్నారా? దీనికి కారణం ఏమిటో మీరు ఆలోచించాలి. ప్రభుత్వ పాఠశాల్లో చదువుకుంటున్నట్లు విద్యార్థులు గర్వంగా చెప్పుకొనేలా వ్యవస్థలను నిర్మిస్తున్నాం. వచ్చే 100 ఏళ్లకు అవసరమైన విద్యా విధానాన్ని రూపొందించడానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళితో విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం. ప్రభుత్వ బడులకు ఉచిత విద్యుత్‌తోపాటు అటెండర్లను పెట్టాం. ప్రతి స్కూల్లో టాయిలెట్స్, మంచినీరు, క్లాస్‌రూమ్స్‌ను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నాం’అని సీఎం రేవంత్ అన్నారు. అలాగే వెయ్యి రెసిడెన్షియల్ స్కూళ్లను యంగ్ ఎండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ. 125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తామని.. తొలి విడతగా 25 నియోజకవర్గాల్లో నిర్మాణ పనులను ఈ నెల 11న ప్రారంభిస్తున్నట్లు సీఎం వివరించారు. సర్కారు బడుల్లో సీఎంలు, రాష్ట్రపతులను తయారు చేయాలి.. ‘తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎమ్మెల్యేలు, సీఎంలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొనే సీఎం అయ్యా. ఉపముఖ్యమంత్రి భట్టితోపాటు కేశవరావు, కోదండరాం ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నారు. అబ్దుల్ కాలం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొనే గొప్ప శాస్త్రవేత్త కావడంతోపాటు రాష్ట్రపతి అయ్యారు’అని సీఎం రేవంత్ గుర్తుచేశారు. రూ. 15 వేలకే ఇంజనీర్ దొరుకుతున్నా రూ. 60 వేలిచ్చినా మేస్త్రీ దొరకట్లేదు.. రాష్ట్రంలోని ఐటీఐలను టాటా గ్రూపు భాగస్వామ్యంతో 75 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని సీఎం రేవంత్ తెలిపారు. రూ. 15 వేలకే ఉద్యోగం చేయడానికి ఇంజనీర్లు వస్తున్నారని... కానీ నైపుణ్యంగల మేస్త్రీ నెలకు రూ. 60 వేలిచ్చినా దొరకడం లేదని సీఎం అన్నారు. నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించి ఏటా 20 వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సు చివరి ఏడాదిన్నరలో ప్రాక్టికల్స్ శిక్షణ, ఇంటర్న్íÙప్ ఇప్పించనున్నట్లు చెప్పారు. డ్రగ్స్ నుంచి క్రీడలకు మళ్లింపు... తెలంగాణ కోసం పోరాడిన యువత నేడు మత్తుకు బానిసైందని.. గత పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్, గంజాయి మహమ్మారి వ్యాపించిందని సీఎం రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే యువతను క్రీడల వైపు మళ్లించి 2028 ఒలింపిక్స్‌లో తెలంగాణ నుంచి బంగారు పతకాలు సాధించాలనే ఆలోచనతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. -
ప్రభుత్వ స్కూల్లో చదివిన నేను ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిని
-
ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రాదు: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రెండుసార్లు కోరి కొరివి దెయ్యాన్ని తెచ్చుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో బుధవారం ఉపాధ్యాయ నియామక పత్రాల అందజేత కార్యక్రమం ఆయన పాల్గొని మాట్లాడారు. ‘మిమ్మల్ని చూస్తే దసర పండగ మూడు రోజులు ముందే వచ్చిందా అనిపిస్తోంది. సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని గతంలో ఆశించారు. కానీ, గత సీఎం నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే ప్రయత్నం ఏనాడు చేయలేదు. మా ప్రభుత్వం వచ్చాక విద్యాశాఖలో కీలక నిర్ణయాలు తీసుకున్నాం.వివాదం లేకుండా 21వేల మంది టీచర్లకు ప్రమోషన్లు కల్పించాం. నిరుద్యోగుల సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఉద్యోగాలు రావాలంటే కేసీఆర్, కేటీఆర్, హరీశ్, కవిత ఉద్యోగాలు ఊడగొట్టాలని ఆనాడే చెప్పా. తండ్రీ కొడుకుల కొలువులు ఊడగొడ్తే.. మీకు కొలువులు వస్తున్నాయి. ఏదో రకంగా నోటిఫికేషన్లు అడ్డుకోవాలని కుట్రలు చేశారు. ఉద్యోగాలు ఇస్తుంటే కొందరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తెలంగాణ సమాజం మీద మీకెందుకంత కోపం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొడతామని బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు.నేను ప్రభుత్వం పాఠశాలలోనే చదువుకున్నా. ఇకపై బీఆర్ఎస్ అధికారంలోకి రాదు.ప్రభుత్వ స్కూళ్లకు పంపడానికి కొందరు నామోషీగా ఫీలవుతున్నారు. పేదోళ్లు తాళిబొట్టు తాకట్టుపెట్టి ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. బడ్జెట్లో విద్యారంగానికి రూ. 21 వేల కోట్లు కేటాయించాం. ఏనాడైనా నిరుద్యోగులకు ఇవ్వాలని ఆలోచనా చేశావా?. అసెంబ్లీకి రావు (కేసీఆర్).. సలహాలు, సూచనలు ఇవ్వవు. మంచి పనులు చేస్తే.. కాళ్లల్లో కట్టెలు పెట్టి అడ్డుకుంటున్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదనం చేసిన పేద ప్రజలను పట్టించుకోలేదు. కేవలం 60 రోజుల్లో డీఎస్సీ నియామకాల ప్రక్రియ పూర్తి చేశాం. నిరుద్యోగుల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ.ఇవాళ్టి కార్యక్రమం జరగొద్దని కుట్రలు చేసిండ్రు. పదేళ్లు ఏలిన వారు పది నెలల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. ఆ అవకాశం తెలంగాణ ప్రజలు వారికి ఇవ్వరు. తెలంగాణ బిడ్డలకు నాణ్యమైన విద్యను అందించి విద్యార్థులను ఉన్నతంగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. నాతో పాటు ఇక్కడున్న చాలా మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవాళ్ళమే. తెలంగాణలో 30వేల పాఠశాలల్లో 24 లక్షల మంది చదువుకుంటున్నారు. తెలంగాణలోని 10వేల పాఠశాలల్లో 34లక్షల మంది చదువుకుంటున్నారు.ప్రభుత్వ పాఠశాలకు పంపించడం నామోషీగా భావిస్తున్న పరిస్థితికి కారణం ఎవరో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తున్నాం.ప్రతీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో రూ.125 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈ నెల 11న పనులు ప్రారంభించుకోబోతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నామని గర్వంగా చెప్పుకునేలా వ్యవస్థను తయారు చేస్తాం. ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం చేపట్టాం.తెలంగాణలో ప్రతీ ఏటా 1లక్షా 10వేల మంది ఇంజనీరింగ్ పూర్తి చేసి బయటకు వస్తున్నారు. కానీ ఉద్యోగాలు పొందలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించబోతున్నాం.త్వరలో గచ్చిబౌలిలో స్పోర్ట్స్ ఏర్పాటు చేయబోతున్నాం. మీరే తెలంగాణ భవిష్యత్ నిర్మాతలు. తెలంగాణ పునర్మిర్మాణానికి మీవంతు కృషి చేయండి’ అని అన్నారు. -
కొత్త గురువులకు సరికొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్త టీచర్లు రాబోతున్నారు. 11,062 మందిని డీఎస్సీ ద్వారా నియమించబోతున్నారు. వాస్తవానికి వీళ్లంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వాళ్లే. బోధనకు అవసరమైన బీఈడీ, డీఎడ్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వాళ్లే. అంతిమంగా డీఎస్సీ పరీక్షలోనూ ర్యాంకు కొట్టినోళ్లే. ఇన్ని ఉండీ వీళ్ళకు మళ్లీ శిక్షణ ఏంటి? అనే అనుమానం రావొచ్చు. కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు చెప్పింది. దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్‌ను రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) తీసుకుంటోంది. అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్‌ను కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9న టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా, ఆ తర్వాత నెల రోజులపాటు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నారు. విలువలే ముఖ్యం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్రమార్గం పడుతోందన్న ఆరోపణలున్నాయి. విలువల్లేని టీచర్లపై విమర్శలొస్తున్నాయి. అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడైన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాలికల చట్టాలు, మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు. అవసరమైతే మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు కృషి చేసేలా ప్రేరణపరమైన క్లాసులు ఇప్పించనున్నారు. టెక్నాలజీపై పట్టు విద్యా వ్యవస్థలో సాంకేతికత వేగంగా చొచ్చుకుపోతోంది. టీచర్ కన్నా విద్యార్థే ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా సవాలక్ష అంశాలను తెరమీదకు తెస్తున్నాడు. వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం. టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయడం వంటి మెళకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు. బోధనలో త్రీడీ, వర్చువల్ రియాలిటీ, ఆగుమెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైనా మెళకువలు నేరి్పంచనున్నారు. మార్పు దిశగా అడుగులు కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశారు. ఆ సమయంలో వారి బీఈడీ సిలబస్‌లో ఉన్న పాఠ్యాంశాలు వేరు. ఇప్పుడు బోధన విధానం, విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కన్పిస్తోందనేది జాతీయ విద్యా సర్వే నివేదికల సారాంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్ధికి మధ్య సమన్వయం, సరికొత్త మెళకువలతో బోధన వంటి టెక్నిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ మంచిదే: పింగిళి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) నేటి విద్యావిధానంలో మార్పులను అందిపుచ్చుకునేందుకు కొత్త టీచర్లకు శిక్షణ అవసరం. చట్టాలను వారికి తెలియజెప్పాలి. ఎప్పుడో బీఈడీ చేసిన వారికి ఈ తరహా పునశ్చరణ మేలు చేస్తుంది. అయితే, వేగంగా మారుతున్న సమాజంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు తరచూ చేపట్టాల్సిన అవసరం ఉంది. అంకిత భావం పెరుగుతుంది : సయ్యద్ ఫౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) పోటీ పరీక్షల్లో విజయం సాధించి, టీచర్‌గా వచ్చే వ్యక్తికి ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అంకిత భావం పెరుగుతుంది. కొత్త తరం ఉపాధ్యాయులకు సరైన మార్గనిర్దేశం ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తెస్తారు. -
9న టీచర్ నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు. ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. -
TS DSC Results 2024: తెలంగాణ DSC ఫలితాలు విడుదల
-
తెలంగాణ DSC - 2024 ఫలితాలు విడుదల
-
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి ,హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్స్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చాం 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశాం మేం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం గత సర్కార్ విద్యా వ్యవస్థను నిర్విర్యం చేసింది 10ఏళ్లలో 7వేల టీచర్ పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు పోస్టుల వారీగా చూస్తే..పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. -
ఇవాళ తెలంగాణ DSC 2024 ఫలితాలు విడుదల
-
డీఎస్సీ–2008 బీఈడీ అభ్యర్థులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008లో ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థులను ఉమ్మడి జిల్లాలవారీగా కాంట్రాక్టు సర్విసుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 1,300 మంది అభ్యర్థులకు ఈ ఉత్తర్వులతో కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా అవకాశం లభించనుంది. డీ.ఎడ్ విద్యార్హతగల అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2009 జనవరి 29న జారీ చేసిన జీవో–28 కారణంగా ఉద్యోగాలు పొందని బీఈడీ అభ్యర్థుల వివరాలను ప్రభుత్వం పాఠశాల విద్య డైరెక్టర్‌ను కోరింది.ఈ మేరకు డీఎస్సీ–2008లో ఎఫెక్ట్ అయిన బీఈడీ అభ్యర్థుల వివరాలను ఉమ్మడి జిల్లాలవారీగా సేకరించి జాబితా రూపొందించినట్లు పాఠశాల విద్య డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. వెరిఫికేషన్ ఫాంలను కూడా రూపొందించి www.rchooedu.tea nfana.gov.in వెబ్సైట్లో అందుబాటలో ఉంచినట్లు తెలిపారు. డీఎస్సీ–2008 బీఈడీ అభ్యర్థులు ఈ వెబ్సైట్ నుంచి వెరిఫికేషన్ ఫాంలను డౌన్లోడ్ చేసుకొని వివరాలు నింపడంతోపాటు కాంట్రాక్టు సేవల్లో పనిచేయడానికి సమ్మతి తెలియజేస్తూ పూర్వ జిల్లా డీఈవోకు సమర్పించాలన్నారు. ఈ నెల 27 నుంచి అక్టోబర్ 10 వరకు ఉమ్మడి జిల్లా డీఈవో వద్ద సరి్టఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని తెలిపారు. ఆ తరువాత దరఖాస్తులను అనుమతించబోరని స్పష్టం చేశారు. -
6,000 పోస్టులతో మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: మరో ఆరు వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ వేయబోతున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను రూపొందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని 17,862 ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్‌ను అందించేందుకు జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని గురువారం రవీంద్రభారతిలో గురుపూజ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భట్టి మాట్లాడుతూ, ప్రగతిశీల సమాజ నిర్మాణంలో టీచర్లది కీలకపాత్ర అని కొనియాడారు. 2007లో ఆంగ్ల మాధ్యమ బోధనపై విమర్శలు వచ్చినా, టీచర్లు సహకరించారని భట్టి గుర్తు చేశారు. ప్రపంచంతో పోటీ పడేలా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన ఉపాధ్యాయులను కోరారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలను మరో పదిరోజుల్లో వెల్లడించనున్నట్టు తెలిపారు. రూ.667 కోట్లతో ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వాటి నిర్వహణ బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అప్పగించామణి చెప్పారు. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను అందించడానికి నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, 63 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని భట్టి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.300 కోట్లు వెచ్చించామని, ఉస్మానియా వర్సిటీకి రూ.వంద కోట్లు కేటాయించామని వివరించారు. విద్యారంగంలో సమూల మార్పుకే విద్యా కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పూర్తి రీయింబర్స్మెంట్.. ప్రభుత్వ స్కూళ్లలో చదివిన విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యకు సంబంధించి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేందుకు ఆలోచిస్తున్నట్టు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని, టీచర్లు కూడా స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు కృషిచేయాలని సూచించారు. అలాగే విద్యారంగంలో తీసుకు వస్తున్న సంస్కరణలకు సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, అణగారిన వర్గాల కొత్తతరం ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు వస్తోందని, వారిని తీర్చిదిద్దాల్సిన బాధ్యత టీచర్లపై ఉందని అన్నారు. మారుతున్న కాలంతో పాటు ఉపాధ్యాయులూ ఆప్‌గ్రేడ్ కావాల్సిన అవసరం ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఇంటర్‌బోర్డ్ కార్యదర్శి శృతి ఓజా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, ఎమ్మెల్సీలు కూర రఘోత్తమ్‌రెడ్డి, ఎ.నర్సిరెడ్డి, ఎ.వెంకటనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందించిన 150 మంది అధ్యాపకులను మంత్రి పొన్నం ప్రభాకర్ సత్కరించారు. -
సెప్టెంబర్ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక ప్రక్రియను సెప్టెంబర్ ఆఖరి వారం నుంచి మొదలు పెట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు చేపట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరుకు తుది కీ విడుదల చేసే వీలుంది. మరోవైపు జిల్లాల వారీగా పోస్టులు, డీఎస్సీ పరీక్ష రాసిన వారి వివరాలను క్రోడీకరిస్తున్నారు. రోస్టర్ విధానం, వివిధ కేటగిరీ పోస్టుల విభజనపై అధికారులు దృష్టి పెట్టారు. పరీక్ష ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించడం వల్ల ఫలితాలను తేలికగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఫైనల్ కీ విడుదల చేసిన రోజు.. లేదా మర్నాడు ఫలితాలను వెల్లడించే వీలుంది. ఆ తర్వాత వారం రోజుల్లో సీనియారిటీ జాబితాను రూపొందించే యోచనలో ఉన్నారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇటీవల పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. కేంద్రీకృత ప్రక్రియరోస్టర్ విధానం, జిల్లాల వారీగా పోస్టులకు సంబంధించిన డేటా, ఇతర అంశాలన్నీ రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టరేట్ పరిధిలోనే చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ టీచర్ పోస్టుకు ముగ్గురు చొప్పున మెరిట్ పద్ధతిన ఎంపిక చేసి, ఆ జాబితాను మాత్రమే జిల్లా కేంద్రాలకు పంపాలని నిర్ణయించారు. జిల్లా ఎంపిక కమిటీ ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేస్తుంది. వ్యక్తిగత వివరాల విచారణ నివేదికలను తెప్పించేందుకు అన్ని జిల్లాల పోలీసు అధికారులకు కేంద్ర కార్యాలయం నుంచే జాబితాలు పంపాలని భావిస్తున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మూడోవారంలో ముగించి, జిల్లా కేంద్రాల్లో నియామక ప్రక్రియను నాలుగోవారం నుంచి మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఒక వేళ ఇది ఆలస్యమైతే అక్టోబర్ మొదటి వారంలో నియామక ప్రక్రియ ఉండవచ్చని ఓ అధికారి తెలిపారు. ఏదేమైనప్పటికీ అక్టోబర్ చివరి నాటికి నియామక ఉత్తర్వులను అభ్యర్థులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఉప వర్గీకరణ అంశంపై సందేహాలు..కొత్తగా భర్తీ చేసే అన్ని ఉద్యోగ నియామకాల్లో షెడ్యూ ల్డ్ కులాల ఉప వర్గీకరణను అమలు చేస్తామని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల శాసనసభలో తెలిపా రు. అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తెస్తామన్నారు. అ యితే, డీఎస్సీ నోటిఫికేషన్‌ను వర్గీకర ణపై తీర్పు రాక ముందే ఇచ్చారు. కాబట్టి ఈ నియామకాలకు వర్గీకర ణ అంశం చేరిస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయ ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అ యితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ వర్గీకరణ అంశం ముందుకొస్తే అనుకున్న తేదీల్లో ఉపాధ్యాయ నియామకాలు కష్టమేనని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఈ ఏడాది డీఎస్సీ పోస్టుల భర్తీ లేనట్లే!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ అభ్యర్థుల భవిష్యత్తుతో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్ర భుత్వం ఆడుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా 16 వేల టీచర్ పోస్టులు భర్తీచేస్తామని గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు ఈ ఫైల్‌పైనే తొలి సంతకం చేసి అభ్యర్థులో ఆశలు కల్పించారు. దీంతో వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ జరుగుతుందని వారంతా ఆశించారు. అదంతా హంబక్కేనని.. ప్ర కటించిన గడువులోగా పోస్టుల భర్తీ చేపట్టే యోచనలో ప్రభుత్వం లేదని తెలుస్తోంది. మంగళవారం అసెంబ్లీలో మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ చేసిన ప్రకటనే చూస్తే ప్రభుత్వం ఉద్దేశం స్పష్టమవుతోంది. వచ్చే ఏడాది విద్యా సంవ త్సరం ప్రారంభం అయ్యేనాటికి టీచర్ పోస్టు లు భర్తీ చేసేలా ప్రణాళికలున్నాయని ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వెల్లడించారు. లోకేశ్ ఏమన్నారంటే..‘నాడు–నేడు’పై విచారణ జరుగుతోంది..జగన్ ప్రభుత్వ హయాంలో నాడు–నేడు కింద రెండు దశల్లో 38 వేల పాఠశాలల్లో రూ.15 వేల కోట్ల పనులకు శ్రీకారం చుట్టారని.. అందులో రూ.9,425 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. నాడు–నేడు పనులపై విచారణ జరుగుతోందని నివేదిక అందాక, తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రైవేట్ పాఠశా లలకు దీటుగా ప్రభుత్వ బడులను బలోపేతం చేయడానికి కృషిచేస్తామ న్నారు. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను దత్తత తీసుకుంటామని ముందుకొస్తున్నారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. 2018 గ్రూప్–1 రిక్రూట్మెంట్పై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో రూ.300 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. 781 కి.మీ.ల యూజీడీ పనులు పూర్తి.. గ్రేటర్ విశాఖ పరిధిలో 781 కి.మీ యూజీడీ పనులు పూర్తయినట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. విశాఖలో 19 ఎస్టీపీలు ఉన్నాయని, వీటిద్వారా 179 ఎంఎల్డీ శుద్ధిచేసిన నీటిని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నామన్నారు. అలాగే, అన్ని జిల్లాల్లో ఎస్టీపీల కోసం రూ.300 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.కేంద్ర నిధులు దుర్వినియోగం కాలేదు..రాష్ట్రంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం కాలేదని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు మళ్లింపు జరగలేదని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎస్సీల సంక్షేమ కోసం ఐదేళ్లలో రూ.58,249 కోట్లు ఖర్చుచేశారన్నారు. -
డీఎస్సీపై స్టేకు నిరాకరణ
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ పరీక్షలను నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు ఇప్పటికే మొదలైనందున జోక్యం చేసుకోలేమని.. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. తుది ఉత్తర్వుల మేరకు ఫలి తాలు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరినా కుదరదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ఫిబ్ర వరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువా రం నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 5 వరకు సాగనున్నాయి. అయితే సన్నద్ధతకు సరిగ్గా సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారని, స్టే ఇవ్వాలని కోరు తూ వికారాబాద్ జిల్లా నాగులపల్లికి చెందిన రాంపల్లి అశోక్‌తోపాటు మరో 9 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయ వాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం సమయం ఇవ్వకుండా అత్యవసరమన్నట్లు డీఎస్సీ నిర్వహి స్తోందన్నారు. సన్నద్ధతకు సరైన సమయం ఇవ్వని కారణంగా చాలామంది టీచర్ పోస్టు పొందలేకపోయే ప్రమాదం ఉందని చెప్పారు. 2022 నుంచి పిటిషనర్లు గ్రూప్–1, గ్రూప్–2తోపాటు కేంద్ర ప్రభుత్వం నిర్వహి స్తున్న పలు పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారన్నారు. ఈ కారణంగా డీఎస్సీకి సిద్ధం కావడానికి తగిన సమయం లేకుండా పోయిందని చెప్పారు. డీఎస్సీ పరీక్షలపై స్టే విధించి సన్నద్ధకు సమయం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టొదు: ఏఏజీప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, గురువారం నుంచి ప్రారంభమయ్యాయని చెప్పారు. దాదాపు 2.5 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలు రాయడానికి సిద్ధమయ్యారన్నారు. 10 మంది కోసం లక్షల మంది జీవితాలను ఫణంగా పెట్ట వద్దని కోరారు. 81.5% మంది పరీక్ష లకు హాజరవుతున్నారన్నారు. పిటిషనర్లు ఏయే పరీక్షలకు హాజరయ్యారు.. వారి హాల్‌టికెట్ల వివరాలు సమర్పించలేదని పేర్కొన్నారు. పరీక్షను వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఈ డీఎస్సీ పరీక్షలకు వర్తించదని వెల్లడించారు. తుది తీర్పు మేరకు ఫలితాలు వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ల న్యాయవాది విజ్ఞప్తి చేయగా.. ఏఏజీ అభ్యంతరం చెప్పారు.ఇప్పటికే పలు పరీక్షల రద్దుతో నిరుద్యోగులు విసిగిపోయారని, తుది తీర్పు మేరకే ఫలితాల వెల్లడి అంటే వారు మరింత నిరుత్సాహంలో కూరుకుపోతారన్నారు. ఏఏజీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ.. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని చెప్పారు. -
తెలంగాణలో డీఎస్సీ ఎగ్జామ్స్ షురూ
-
తెలంగాణ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్
-
నేటినుంచే డీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) గురువారం నుంచి మొదలు కానుంది. వచ్చే నెల 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. అయితే మధ్యలో 6 రోజుల పాటు సెలవులు ఉన్నాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. దర ఖాస్తు గడువు పొడిగించడంతో ఇటీవల టెట్ అర్హత పొందిన 48 వేల మంది కూడా వీరిలో ఉన్నారు. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) పరీక్షకు 1.60 లక్షల మంది, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ (ఎస్జీటీ) పోస్టుల కోసం 80 వేల మంది దరఖాస్తు చేశారు. మిగతా వారిలో భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులున్నారు. తొలిసారిగా కంప్యూటర్ బేస్డ్ (ఆన్లైన్)గా జరిగే ఈ పరీక్ష కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మొత్తం 56 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా..ఒక్క గ్రేటర్ హైదరాబా ద్ పరిధిలోనే 27 కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. బయో మెట్రిక్ హాజరు: అభ్యర్థులకు బయో మెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని విద్యాశాఖ సూచించింది. ప్రతి రోజూ రెండు షిఫ్టులుగా పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ ఒక విడత, సాయంత్రం 2 నుంచి 4.30 గంటల వరకు మరో విడత ఉంటుంది. జూలై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో పరీక్ష ఉండదు. ఎస్ఏ పరీక్షను జూలై 18, 20, 22, 24, 25, 30, 31, ఆగస్టు 1, 2 తేదీల్లో చేపడతారు. పీఈటీ పరీక్షను జూలై 18, 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు. భాషా పండితులకు జూలై 26, ఆగస్టు 2, 5 తేదీల్లో డీఎస్సీ ఉంటుంది. పీఈటీలకు ఆగస్టు 5న, ఎస్జీటీలకు జూలై 19, 22, 23, 26, ఆగస్టు 1వ తేదీన పరీక్ష ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేషన్‌కు జూలై 20న నిర్వహిస్తారు. ఆరేళ్ల తర్వాత..: ఉమ్మడి రాష్ట్రంలో 2012 ఆగస్టు 27, 28, 29 తేదీల్లో డీఎస్సీ నిర్వహించారు. చివరిసారిగా 2018 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు టీచర్స్ రిక్రూట్మెంట్ (టీఆర్టీ) పేరుతో జరిగింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ డీఎస్సీ జరుగుతోంది. దీంతో నిరుద్యోగులు ఈ పోస్టులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి 2023లో 5 వేల పోస్టులకు డీఎస్సీ నిర్వహించాలనుకున్నా వివిధ కారణాల వల్ల ఆగిపోయింది. వివాదాల మధ్య..: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేస్తారని భావించినా కేవలం 11,062 పోస్టులకే డీఎస్సీ నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర్నుంచీ రకరకాల వివాదాలు చుట్టుముట్టాయి. ఖాళీలన్నీ డీఎస్సీలో చేర్చాలని నిరుద్యోగులు పట్టుబట్టారు. ఆ తర్వాత టెట్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో డీఎస్సీ నిర్వహణకు మరికొంత సమయం ఇవ్వాలన్న డిమాండ్ తెరమీదకొచ్చింది. టెట్, డీఎస్సీ సిలబస్ వేరని, ఇప్పటికిప్పుడు పరీక్ష చేపడితే సన్నద్ధత కష్టమని కొత్తగా టెట్ ఉత్తీర్ణులైనవారు ఆందోళనకు దిగారు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. హాల్ టికెట్ల డౌన్లోడ్ సమయంలో కూడా డీఎస్సీ నిర్వహణపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పటికీ 20 శాతం మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోలేదు. వీరిలో కోర్టును ఆశ్రయించిన వాళ్ళు కూడా ఉన్నారు. న్యాయస్థానం చివరి నిమిషంలో తమకు అనుకూలంగా ఆదేశాలు ఇస్తుందనే ఆశతో వీరు ఉన్నారు. అయితే డీఎస్సీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గురువారం నుంచి పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. -
అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో.. డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) హాల్ టికెట్లలో గందరగోళం చోటు చేసుకుంది. అబ్బాయి హాల్ టికెట్‌పై అమ్మాయి ఫొటో, అమ్మాయి హాల్ టికెట్‌పై అబ్బాయి ఫొటో, సంతకం ఉండటాన్ని అభ్యర్థులు గుర్తించారు. దీనిపై విద్యాశాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు వాపోయారు. సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడో పొరపాటు జరిగిందని, హాల్ టికెట్ల రూపకల్పనలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.తప్పులు సరిచేస్తామంటున్న విద్యాశాఖడీఎస్సీ పరీక్ష ఈ నెల 18 నుంచి మొదలవుతుంది. పరీక్షకు సీరియస్‌గా సన్నద్ధమవుతున్న యువత హాల్ టికెట్ల గందరగోళంతో కంగారు పడుతోంది. అయితే ఈ తప్పిదాలకు విద్యాశాఖ కారణం కాదని అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వివరణ ఇచ్చారు. అసలు తామెలా ఫొటోలు, సంతకాలు మారుస్తామని వారు అంటున్నారు. సిస్టమ్ జనరేటెడ్ హాల్ టికెట్లను తాము చూసే అవకాశమే లేదంటున్నారు. తప్పులు దొర్లినట్టు వచ్చిన అభ్యర్థులకు తక్షణమే సరిచేసి న్యాయం చేస్తున్నామని విద్యాశాఖ వెల్లడించింది.మొదట్నుంచీ వివాదమేడీఎస్సీ నిర్వహణ మొదట్నుంచీ వివాదాస్పదమే అవుతోంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన వారికి ప్రిపరేషన్ లేకుండా డీఎస్సీ పెట్టడంపై అభ్యర్థులు, రాజకీయ నేతల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. ఇవన్నీ కోచింగ్ కేంద్రాలు, రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే నేతలు సృష్టించినవేనని ప్రభుత్వం కొట్టి పారేసింది. తాజాగా హాల్ టిక్కెట్లు ఈ నెల 11 నుంచి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, చాలా చోట్ల అవి డౌన్లోడ్ కావడం లేదనే ఫిర్యాదులొచ్చాయి. దీనిపై విద్యాశాఖ సోమవారం వివరణ ఇచ్చింది. అన్ని చోట్ల డౌన్లోడ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పింది. దీంతో పెద్ద ఎత్తున సోమవారం విద్యార్థులు హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు.ఫొటోల తారుమారుమేడ్చెల్ జిల్లా దమ్మాయి గూడ బాలాజీ నగర్‌కు చెందిన పల్లెపు రామచంద్రయ్య డీఎస్సీ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేశాడు. హాల్ టికెట్లో అతని పేరు సక్రమంగానే ఉంది. కానీ ఫొటో మాత్రం ఎవరో అమ్మాయిది వచ్చింది. సంతకం కూడా తనది కాదని గుర్తించాడు. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందినన రుద్రారపు భవ్య డీఎస్సీలో ఎస్ఏ పోస్టుకు అప్లై చేసింది. ఆమె ఫొటో బాదులు వేరే అబ్బాయి ఫొటో వచ్చింది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించింది. తక్షణమే స్పందించిన అధికారులు ఆమె ఫొటో వచ్చేలా చేశారు.నిజంగా నెట్ సెంటర్లదే తప్పా?అభ్యర్థులు నెట్ సెంటర్లలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారి ఫొటో, సంతకాలను డిజిటల్ చేసి ఇస్తుంటారని తెలిపారు. ఎక్కువ మంది ఉండటంతో నెట్ యజమానులు ఒకరి ఫొటోకు బదులు వేరొకరి ఫొటో పెట్టారని అంటున్నారు. దరఖాస్తు చేసేటప్పుడు ఏ ఫొటో, సంతకం ఉంటుందో హాల్ టికెట్‌లోనూ అదే వస్తుందని, దీనికే తమను నిందిస్తే ఎలా అని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. -
DSCపై బీఆర్ఎస్ ఓవర్ యాక్షన్.. జీవన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
-
మా పోరాటం ఆగదు.. సీఎం రేవంత్ కు హెచ్చరిక
-
సచివాలయాన్ని ముట్టడించిన నిరుద్యోగలు
-
తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య డీఏస్సీ వార్
-
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
ఎగ్జామ్ పై రాజకీయం..
-
నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’!
వారం రోజుల్లో మొదలుకానున్న డీఎస్సీ పరీక్షలు.. అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్–2 పరీక్షలు.. ప్రిపరేషన్‌కు సమయం సరిపోని పరిస్థితి.. దీంతో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలంటూ అభ్యర్థుల ఆందోళనలు.. ఏమాత్రం వెనక్కితగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న సర్కారు.. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీచార్జీలు.. కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటున్న విద్యావేత్తలు.. సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీచార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు.. .. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది. సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమే అయినా.. నిరుద్యోగుల డిమాండ్లు, విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయి.సిలబస్ ఎక్కువ.. సమయం తక్కువ టీచర్ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ బాగా పెరిగింది. మొత్తం 14 సబ్జెక్టులు చదవాలి. కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. రోజుకో సబ్జెక్ట్ పూర్తి చేయడం ఎలా? ఇది ఆందోళన రేపుతోంది. పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి. – ఐ.సుజిత, డీఎస్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లాసాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల (డీఎస్సీ)కు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్ ఆధారి తంగా పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఆన్లైన్ కేంద్రాలను సైతం ఎంగేజ్ చేసుకుంది. డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తికానుండగా.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన వస్తోంది. సమయం తక్కువగా ఉండటంతో.. రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 4 నుంచి జూన్ 20వ తేదీ వరకు కొనసాగింది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధంకావడానికి కనీసం 45 రోజులు ఉండాలి. కానీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గ్రూప్–2 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజా తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. ఈసారి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటంతో.. రెండింటికీ సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారింది. ఆందోళనలకు దిగుతున్న అభ్యర్థులు ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉందని.. ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెట్ పరీక్ష ఫలితాలను కూడా వారం క్రితమే విడుదల చేశారని.. డీఎస్సీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టిందని పేర్కొంటున్నాయి. రెండు నెలలు వాయిదా వేయాలి ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నెలలోపే రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదు. కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సిద్ధమవాలో అర్థంకాని పరిస్థితి. ఇది అభ్యర్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. టీచర్ నియామక పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేస్తే మేలు జరుగుతుంది. – కేశమోని మనోజ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా (డీఎస్సీ, గ్రూప్–2 పరీక్షల అభ్యర్ధి) పరీక్షలు వాయిదా వేయాలంటే.. పోలీసులతో కొట్టిస్తున్నారు డీఎస్సీ పరీక్షలకు కాస్త సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతుంటే స్పందించని సీఎం.. నిరుద్యోగులపై మాత్రం లాఠీచార్జి చేయిస్తున్నారు. ప్రజాపాలన అంటే.. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, ఇచి్చన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమేనా? 25వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తానన్న సీఎం రేవంత్.. కేవలం 11 వేలకే టీచర్ పోస్టులను పరిమితం చేశారు. పైగా విద్యార్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదు – గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు కొంత సమయం ఇస్తే బాగుండేది టెట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహిస్తే బాగుండేది. అలాగాకుండా ముందే షెడ్యూల్ ప్రకటించి, తర్వాత టెట్ ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జాబ్ కేలండర్ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్–1 పరీక్షలు సవ్యంగా నిర్వహించిందన్న పేరు వచి్చంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. – ప్రొఫెసర్ కోదండరామ్, టీజేఎస్ అధ్యక్షుడు లాఠీచార్జీలు కాదు.. సమస్యను పరిష్కరించాలి రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రాజకీయ పారీ్టల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆతృత, ఆందోళన పెరిగాయి. వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూల్, ఇప్పటికే ప్రకటించిన పోటీపరీక్షల రీషెడ్యూల్‌పై టీజీపీఎస్సీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇస్తే మొత్తం సమస్య మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వపరంగా స్పందించడమో లేక ఉద్యమిస్తున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి నచ్చజెప్పడమో చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లాఠీచార్జీలు, దాడులకు దిగడం మంచిది కాదు. దీనితో అసలు సమస్య పోయి పోలీసులు దాడులకు దిగారంటూ మరో సమస్య తెరపైకి వస్తోంది. – ప్రొఫెసర్ హరగోపాల్, హక్కుల కార్యకర్త, విద్యావేత్త వెబ్సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం రాత్రి వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు www. schooledu. telangana. gov. in వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల భర్తీ కోసం సుమారు 2.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి. -
ఈ ఏడాది డీఎస్సీ లేనట్టే
-
పరీక్షల వాయిదాకు గూడుపుఠాణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల వాయిదాకు దొంగలు గూడు పుఠాణి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధనదాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్‌కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పుట్టగతులుండవనే కుట్రలు ‘పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. హరీశ్, కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నా.. పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా, రంగాలు పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి.పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవనే వారు కుట్రలు చేస్తున్నారు..’అని సీఎం ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశాయి ‘కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్.. ముందుంది మొసళ్ల పండగ. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయి. కాంగ్రెస్ పారీ్టతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్‌హౌస్‌లోనే పడు కో. నాలుగు రోజులుగా హరీశ్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ వాళ్లకు నొప్పి తెలియలేదు..’అని రేవంత్ విమర్శించారు.ఆగస్టు 15లోపు రుణమాఫీ ‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కార్యకర్తల కష్టంతోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగా. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటిస్తుంది. నాయకుల ఎన్నికలు ముగిశాయి.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పటివరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
మాతో రాజాకీయం చేస్తే ఊరుకోం..
-
షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో డీఎస్సీ పరీక్ష
హైదరాబాద్, సాక్షి: షెడ్యూల్ ప్రకారమే తెలంగాణలో డీఎస్సీ పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుత నోటిఫికేషన్‌ను రద్దు చేసి మరిన్ని పోస్టులను జత చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలన్న డిమాండ్‌తోపాటు ఎగ్జామ్‌ను కొంతకాలంపాటు వాయిదా వేయాలన్న డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11వ తేదీ నుంచి డీఎస్సీ హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాబులో ఉంచనుంది విద్యాశాఖ. జులై 18వ తేదీ నుంచి ఆగష్టు 5వ తేదీ దాకా పరీక్షలు జరగనున్నాయి. టెట్‌కు, డీఎస్సీకి భిన్నమైన సిలబస్ ఉండటంతో చదవడానికి సమయం సరిపోవడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. ఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని, అక్టోబర్‌లో 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలని రాజకీయ పార్టీల యువజన, విద్యార్థి అనుబంధ సంఘాలు ఆందోళన సైతం చేపట్టాయి.2.79 లక్షల దరఖాస్తులు..రాష్ట్రంలో మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గత ఫిబ్రవరి 28న పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల గడువు జూన్ 20వ తేదీతో ముగిసింది. మొత్తం 2.79 లక్షల దరఖాస్తులు అందాయి. అభ్యర్థులపరంగా చూస్తే.. సుమారు 2 లక్షల వరకు ఉంటారని అంచనా.రెండు షిఫ్టుల్లో..సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. జులై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జులై 19 నుంచి 22 వరకు వివిధ మాధ్యమాల ఎస్జీటీ పరీక్షలు జరుగుతాయి. జులై 20న ఎస్జీటీ, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ , జులై 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, జులై 24న స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, జులై 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్‌టీచర్ పరీక్ష, జులై 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహిస్తారు. -
మెగా డీఎస్సీ నిర్వహించాలని, ప్రస్తుత డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్
-
త్వరలో జాబ్ కేలండర్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, నిరుద్యోగులందరికీ మేలు జరిగేలా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చించి జాబ్ కేలండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో దాదాపు మూడు గంటలకు పైగా ఆయన సమావేశమయ్యారు.భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.శివసేనారెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పవన్ మల్లాది, ప్రొఫెసర్ రియాజ్, టీచర్ల జేఏసీ నేత హర్షవర్ధన్‌రెడ్డి, విద్యార్థి సంఘాల నాయకులు చనగాని దయాకర్, మానవతారాయ్, బాల లక్షి్మ, చారకొండ వెంకటేశ్, టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీలో భాగంగా నిరుద్యోగుల డిమాండ్ల గురించి సీఎం ఆరా తీశారు. సీఎస్ శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులతో నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించేందుకున్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకారం భర్తీకి ప్రయత్నాలు: సీఎం ‘నిరుద్యోగులకు ఇచి్చన హామీ ప్రకారం ఇప్పటికే 28,942 ఉద్యోగ నియామకాలు చేపట్టాం. గ్రూప్–1,2,3 ఉద్యోగాలకు సంబంధించి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కోర్టు చిక్కులన్నింటినీ అధిగమించాం. జాబ్ కేలండర్ ప్రకారం పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాల భర్తీ కోసం ప్రయతి్నస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ నియామక పరీక్షలు, ఇతర బోర్డులు నిర్వహించే పరీక్షలతో ఆటంకాలు కలగకుండా రాష్ట్రంలోని నిరుద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా కేలండర్ రూపొందిస్తున్నాం.ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం కూలంకషంగా కసరత్తు చేస్తోంది. కొందరు మాత్రం రాజకీయ ప్రయోజనల కోసం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. వారు చేస్తున్న కుట్రలతో నోటిఫికేషన్లలోని నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోవడంతో పాటు నోటిఫికేషన్లు రద్దయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కొన్ని రాజకీయ పారీ్టలు, స్వార్ధపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావొద్దు. గత ప్రభుత్వం లాగా మేం తప్పుడు నిర్ణయాలు తీసుకోలేం. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిబంధనలు మారిస్తే చట్టపరంగా తలెత్తే అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే చాన్స్: టీజీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలన్న డిమాండ్‌పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా టీజీపీఎస్సీ అధికారులు మాట్లాడుతూ.. గత ప్రభుత్వం 2022లో నిర్వహించిన గ్రూప్–1 పరీక్ష పేపర్ లీకేజీ కారణంగా రెండుసార్లు వాయిదా పడిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంలో ఉన్న పిటిషన్‌ను వెనక్కు తీసుకుని, పాత నోటిఫికేషన్‌ను రద్దు చేయడంతో పోస్టుల సంఖ్యను పెంచి కొత్తనోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు.12 ఏళ్ల తర్వాత నిర్వహించిన గ్రూప్–1 పరీక్షకు 4 లక్షల మంది హాజరయ్యారని, ప్రిలిమ్స్‌ను పూర్తి చేశామని, నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం 1:50 పద్ధతిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు ఆ నిష్పత్తిని 1:100కు పెంచితే కోర్టులు జోక్యం చేసుకునే అవకాశముందని, అదే జరిగితే మళ్లీ నోటిఫికేషన్ నిలిచిపోతుందని చెప్పారు. నోటిఫికేషన్‌లోని నిబంధనల మార్పు న్యాయపరంగా చెల్లుబాటు కాదని, బయోమెట్రిక్ పద్ధతి పాటించలేదన్న ఏకైక కారణంతో హైకోర్టు గ్రూప్–1 పరీక్షను రెండోసారి రద్దు చేసిందని గుర్తు చేశారు. 1999లో యూపీపీఎస్సీ వర్సెస్ గౌరవ్ ద్వివేది కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వారు ఉదహరించారు. గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు సాధ్యం కాదు గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాల పెంపు అంశం కూడా సమావేశంలో చర్చకు వచి్చంది. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నందున పోస్టులు పెంచడం ఇప్పుడు సాధ్యం కాదని, అలా జరిగితే అది నోటిఫికేషన్ ఉల్లంఘన అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కాగా గ్రూప్–2, డీఎస్సీ పరీక్షలు వెంటవెంటనే ఉండడంతో అభ్యర్థులు నష్టపోవాల్సి వస్తోందని విద్యార్థి సంఘాల నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. జూలై 17 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలున్నాయని, వెంటనే 7, 8 తేదీల్లో గ్రూప్–2 పరీక్ష ఉండడంతో విద్యార్థులు ప్రిపరేషన్‌కు ఇబ్బంది అవుతుందని వివరించారు. కాగా టీజీపీఎస్సీ, విద్యాశాఖలు చర్చించి ఈ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటాయని సీఎం వారికి హామీ ఇచ్చారు. -
గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో నిర్వహించాలని డిమాండ్
-
మెగా కాదు.. దగా డీఎస్సీ!
అనంతపురం అర్బన్/ సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ అంటూ అనంతపురం జిల్లాకు సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పలువురు ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్జీటీ పోస్టుల సంఖ్య అతి తక్కువగా చూపుతూ మెగా డీఎస్సీ అని చెప్పడం సరికాదని మండిపడ్డారు. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం అనంతపురం పట్టణంలో వందలాది మంది అభ్యర్థులు ర్యాలీ నిర్వహించారు.అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ అభ్యర్థులు విష్ణు, గంగాధర్, జ్యోతి, హర్షబాను తదితరులు మాట్లాడుతూ ఎస్జీటీ పోస్టుల కేటాయింపులో ప్రభుత్వం అనంతపురం జిల్లాను చిన్నచూపు చూస్తోందన్నారు. జిల్లాలో డీఎడ్ చేసి ఎస్జీటీ పోస్టులకు సిద్ధమవుతున్న వారు వేల సంఖ్యలో ఉన్నారన్నారు. కానీ, జిల్లాకు కేవలం 183 ఎస్జీటీ పోస్టులు కేటాయించడం సరికాదన్నారు.డీఎస్సీ కోసం ఎదురు చూస్తూ తల్లిదండ్రులు పంపిన డబ్బులతో హాస్టళ్లు, రూముల్లో ఉంటూ శిక్షణ తీసుకుంటూ చదువుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తగినన్ని పోస్టులు లేకపోతే తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. అనంతపురం జిల్లాలో కనీసం అంటే వెయ్యి ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటన్నింటినీ భర్తీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో జి.రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఎస్జీటీ పోస్టుల సంఖ్య పెంచాలి: డీవైఎఫ్ఐరాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టుల భర్తీలో నాలుగు జిల్లాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పేర్కొంది. మెగా డీఎస్సీకి సంబంధించిన తొమ్మిది అంశాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు రాసిన లేఖను డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.రాము, జి.రామన్న శనివారం మీడియాకు విడుదల చేశారు.‘మెగా డీఎస్సీలో ప్రకటించిన ఎస్జీటీ పోస్టుల విషయంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 104, ప్రకాశం జిల్లాలో 124, శ్రీకాకుళం జిల్లాలో 144, అనంతపురం జిల్లాలో 183పోస్టులు మాత్రమే చూపించారు. ఆ నాలుగు జిల్లాలకు పోస్టుల సంఖ్య పెంచి అభ్యర్థులకు న్యాయం చేయాలి. అప్రెంటీస్ విధానాన్ని, జీవో 117ను రద్దు చేయాలి. వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలి. ప్రస్తుతం ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయగా, ఇంకా ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది వెల్లడించాలి.గతంలో రద్దు చేసిన పాఠశాలలను, పీఈటీ పోస్టులను పునరుద్ధరించాలి. ఈ సంవత్సరం చివరి నాటికి రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయుల లెక్కలు, రాష్ట్రంలో ఉన్న సింగిల్ టీచర్ పాఠశాలలను దృష్టిలో పెట్టుకుని పోస్టులు భర్తీ చేయాలి. ఉపాధ్యాయుల పదవీవిరమణ వయసును 62ఏళ్ల నుంచి 58 ఏళ్లకు తగ్గించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. -
డీఎస్సీ షెడ్యూల్ విడుదల ?
-
జూలై 18 నుంచి డీఎస్సీ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు తొలిసారిగా ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన షెడ్యూల్‌ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్ పోస్టుల కోసం 2,79,956 మంది దరఖాస్తు చేసుకున్నారు.అయితే, గతంలో జూలై 17 నుంచి 31 వరకు మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ.. తాజాగా జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ప్రతిరోజూ సీబీఆర్టీ విధానంలో రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.తొలిరోజు జూలై 18న స్కూల్ అసిస్టెంట్ (సోషల్, ఫిజికల్ సైన్స్) తెలుగు మీడియం పోస్టులకు ఫస్ట్ షిఫ్ట్‌లో, సెకండ్ షిఫ్ట్‌లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు పరీక్ష నిర్వహించనున్నారు. చివరి రోజు ఆగస్టు 5న ఫస్ట్ షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు, సెకండ్ షిఫ్ట్‌లో లాంగ్వేజీ పండిట్ (హిందీ) పోస్టులకు పరీక్ష జరగనుంది. -
జాబ్ కేలండర్ ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి, గెలిచిన తరువాత వారిని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. గురువారం ఆయనను పలువురు నిరుద్యోగులు కలిసి తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వారి పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు జాబ్ కేలెండర్ పేరుతో పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, దాదాపు 10 పరీక్షలకు సంబంధించి తేదీలతో సహా నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు. అయి తే వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. జాబ్ కేలెండర్ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. గ్రూప్–1కు సంబంధించి తమ ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్‌కు కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే కలిపారని పేర్కొన్నారు. ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదని, అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. గ్రూప్– 1 మెయిన్స్‌కు సంబంధించి 1:100 ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రస్తుత డిప్యూటీ సీఎం గతంలో డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయడంలేదని ప్రశ్నించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాబ్ కేలెండర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో.. వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు. -
గత ఐదేళ్లలో 23,699 టీచర్ పోస్టులు భర్తీ
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ అంటూ చాటింపు వేస్తున్న టీడీపీ పెద్దలు గత ప్రభుత్వం ఏకంగా 23,699 టీచర్ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కప్పిపుచ్చుతున్నారు. ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించడం, ఆ తరువాత పరీక్షలు నిర్వహించకుండా తాత్సారం చేయడం టీడీపీ హయాంలో రివాజు. 2014, 2018లోనూ ఆర్భాటంగా డీఎస్సీలు ప్రకటించి పోస్టులు భర్తీ చేయకుండా వదిలేసింది.అనంతరం డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలన్న తలంపుతో వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతి పాఠశాలలలో నూరు శాతం ఉపాధ్యాయులు ఉండేలా చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా టీచర్ ఖాళీలను భర్తీ చేసింది. కేజీబీవీల్లో సైతం 1,200 రెగ్యులర్ టీచర్లను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 6,100 ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి షెడ్యూల్ ప్రకటించింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కూడా నిర్వహించింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ఫలితాలు ప్రకటించలేదు. అన్యాయాలను సరిదిద్ది..చంద్రబాబు హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఓ ప్రహసనంగా మార్చేశారు. గతంలో నాలుగేళ్లు అధికారాన్ని అనుభవించి ఎన్నికలకు ముందు ఏడాది 2018లో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. అది సక్రమంగా నిర్వహించలేక చేతులెత్తేశారు. ఫలితంగా అభ్యర్థులకు అన్యాయం జరగడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇందులో 7,902 ఉపాధ్యాయ పోస్టులకుగానూ 300 పోస్టులను భర్తీ చేసి చేతులెత్తేశారు. అంతకు ముందు 2014లోనూ 10,313 పోస్టులతో డీఎస్సీ ప్రకటించి పరీక్షలు నిర్వహించి పోస్టుల భర్తీని గాలికి వదిలేశారు. 1998లో ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహించి టీచర్ అభ్యర్థులను నిలువుగా మోసం చేశారు. 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశగా ప్రత్యేక విధానాన్ని రూపొందించింది. ఒక్క పాఠశాల కూడా మూతపడకుండా, ఏ ఒక్క టీచర్ అభ్యర్థికీ అన్యాయం జరగకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో 2018 డీఎస్సీలో దగాపడ్డ అభ్యర్థులకు న్యాయం చేసింది. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి సారించి సుమారు 7,254 మంది అభ్యర్థులకు ఉపాధ్యాయులుగా పోస్టింగ్ ఇచ్చింది.2018 లిమిటెడ్ డీఎస్సీ అభ్యర్థులు 24 మందికి పోస్టులిచ్చింది. 2019లోనే స్పెషల్ డీఎస్సీ వేసి 521 పోస్టులను భర్తీ చేసింది. ఇక 1998 డీఎస్సీ ద్వారా అన్యాయానికి గురైన 4,059 మంది అభ్యర్థులకు న్యాయం చేసేందుకు మినిమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) కింద 3,864 మందికి పోస్టింగ్ ఇచ్చారు. 2008 డీఎస్సీలో మిగిలిపోయిన 1,910 మందిని ఎంటీఎస్ టీచర్లుగా నియమించారు. తెలంగాణలో 1998, 2018 డీఎస్సీ అభ్యర్థులు పోస్టింగ్స్ కోసం ఇప్పటికీ నిరీక్షిస్తున్నా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకున్నది లేదు. -
మరోసారి ‘టెట్’తో డీఎస్సీ ఆలస్యం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 6,100 టీచర్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరిలో గత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతోపాటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు సైతం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా టెట్ నిర్వహించింది. అయితే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా టెట్ నిర్వహించలేదని పేర్కొన్నారు. అంటే.. మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.గతంలో నిర్వహించిన టెట్‌కు సంబంధించి సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్ జీటీ) అర్హత పరీక్ష పేపర్–1ఏని 1,13,296 మంది, స్కూల్ అసిస్టెంట్ టీచర్ల అర్హత పరీక్ష పేపర్–2ఏని 1,19,500 మంది, ప్రత్యేక విద్య ఉపాధ్యాయ అర్హత పరీక్ష పేపర్–1బి, పేపర్–2బిలను 3,111 మంది రాశారు. దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 2.33 లక్షల మంది టెట్‌కు హాజరయ్యారు. వాస్తవానికి మార్చి∙20న టెట్ ఫలితాలు ప్రకటించాలని షెడ్యూల్లో ప్రకటించినా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆలస్యమైంది.అయితే, అభ్యర్థులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ టెట్ ఫలితాల ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. అయితే, టీడీపీ వర్గాల ఒత్తిడితో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించలేదు. ఇప్పటికే నిర్వహించిన టెట్ ఫలితాలు ప్రకటించాల్సింది పోయి, మరోసారి టెట్ నిర్వహించేందుకే ప్రస్తుత ప్రభుత్వం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇదే జరిగితే.. డీఎస్సీ నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.కొత్త ప్రభుత్వం ఉద్దేశం ఇదేనా?వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రూప్–1, గ్రూప్–2, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, జూనియర్ కళాశాలల లెక్చరర్లు, పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు, తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిలో పలు పోస్టులకు ప్రిలిమ్స్ కూడా నిర్వహించి ఫలితాలను ప్రకటించింది. మెయిన్స్ పరీక్షలు జరిగే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో కొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో నియమితులైన చైర్మన్, సభ్యులు ఉన్నంతకాలం ఈ పోస్టుల భర్తీ చేపట్టకూడదనే ఉద్దేశంతో కొత్త ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.తద్వారా ఆ పోస్టులను తామే భర్తీ చేశామన్న క్రెడిట్‌ను కొట్టేయడమే కొత్త ప్రభుత్వ ఉద్దేశమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తప్పించేందుకు రాజీనామా చేయాలని వారిపై ఒత్తిడి తోపాటు అవసరమైతే వారిపై కేసుల నమోదుకు కూడా పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇదే కోవలో మరోసారి టెట్ నిర్వహణ పేరుతో డీఎస్సీని ఆలస్యం చేసేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. -
AP: డీఎస్సీ, పెన్షన్లకు కేబినెట్ ఆమోదం
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన భేటీలో పలు అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ భేటీలో భాగంగా ఐదు సంతకాలకు ఆమోదం తెలిపారు. డీఎస్సీ, పెన్షన్లు, అన్నా క్యాంటీన్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సెన్సస్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. హెల్త్ యూనివర్సిటీ పేరు పునరుద్ధరణకు కూడా ఆమోదం తెలిపారు. -
Big Question: మోదీని పక్కకు నెట్టి చంద్రబాబు నయా మోసం
-
‘టెట్’ దరఖాస్తు గడువు పెంపు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్)కు దరఖాస్తు గడువు పెంచాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. టెట్ దరఖాస్తు గడువు ఈ నెల 10(నేటి)తో ముగుస్తుంది. దీన్ని మరో వారం రోజుల పాటు పెంచాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి పంపింది. దీనిపై బుధవారం అధికారిక ఉత్తర్వులు వెలువడే వీలుంది. సర్వీస్ టీచర్ల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు టెట్ రాసే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. 3లక్షలు వస్తాయనుకుంటే 2లక్షలు కూడా దాటలేదు టెట్‌కు ఇప్పటి వరకూ 1,93,135 దరఖాస్తులొచ్చాయి. 2016లో 3.40 లక్షలు, 2017లో 3.29 లక్షలు, 2022లో 3.79 లక్షలు,2023లో 2.83 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ పదోన్నతుల కోసం సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయాలన్న నిబంధన ఉండటంతో ఈసారి 3 లక్షల అప్లికేషన్లు వస్తాయని అధికారులు అంచనా వేశారు. ఎన్సీటీఈ నుంచి సమాధానం వస్తేనే స్పష్టత 80 వేల మంది టీచర్లు టెట్ అర్హత కోసం దరఖాస్తు చేయాల్సి ఉండగా వారు ముందుకు రాలేదు. సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్‌కు టెట్ అవసరం. కానీ ఎస్జీటీగా ఉన్న వ్యక్తి ప్రాథమిక స్కూల్ హెచ్ఎంగా వెళితే, అది సమాన హోదాగా టీచర్లు చెబుతున్నారు. మరోవైపు స్కూల్ అసిస్టెంట్లు ప్రాథమిక, ఉన్నత పాఠశాల హెచ్ఎంగా వెళ్ళినా హోదాలో మార్పు ఉండదనే వాదన టీచర్లు లేవనెత్తారు. అలాంటప్పుడు టెట్‌తో అవసరం ఏమిటనే దానిపై ఉపాధ్యాయ సంఘాలు స్పష్టత కోరాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్య అధికారులు దీనిపై స్పష్టత ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ)కి లేఖ రాశారు. ఒకటి రెండు రోజుల్లో దీనికి సమాధానం వస్తుందని ఆశిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టీచర్లు ఏయే పేపర్లు రాయాలి? ఎంత మంది రాయాలనే విషయాల్లో స్పష్టత వస్తుంది. పరీక్ష తేదీల్లో మార్పులు ఉండవు.. కేవలం దరఖాస్తు చేసుకోవడానికి, ఆన్లైన్ ఫీజు చెల్లింపుకు మాత్రమే గడువు పెంచే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప పరీక్ష తేదీల్లో మార్పు ఉండదని స్పష్టం చేస్తున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం టెట్ పరీక్ష మే 20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ జరుగుతుంది. ఫలితాలను జూన్ 12న వెల్లడిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారు డీఎస్సీ రాసేందుకు వీలుగా ఆ పరీక్ష గడువునూ పెంచారు. డీఎస్సీకీ అంతే.. పెద్దగా దరఖాస్తుల్లేవ్ డీఎస్సీ జూలై 17 నుంచి 31వ తేదీ వరకూ జరుగుతుంది. అయితే డీఎస్సీకి కూడా ఇప్పటి వరకూ పెద్దగా దరఖాస్తులు రాలేదు. పోస్టులు పెరిగినా కొత్తగా వచ్చిన దరఖాస్తులు తక్కువగానే ఉన్నాయి. రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీని ప్రకటించింది. దీనికి కొత్తగా వచ్చిన దరఖాస్తులు 37,700. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్ కోసం 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గడువు పెంచాల్సిందే : రావుల మనోహర్ రెడ్డి (డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు) టెట్ అప్లికేషన్స్ గడువు పెంచి ఎడిట్ ఆప్షన్ ఇవ్వాలి. ఉగాది, రంజాన్ సెలవుల కారణంగా రాష్ట్రంలో మీ సేవా సెంటర్లు అందుబాటులో ఉండటం లేదు. మొబైల్లో టెట్ దరఖాస్తులు పూర్తి చేయడం ఇబ్బందిగా ఉంది. స్పష్టత వచ్చే దాకా పెంచాలి : చావా రవి (టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) సర్వీస్ టీచర్లలో ఎంత మంది టెట్ రాయాలి? ఏ పేపర్ రాయాలి? అనే అంశాలపై విద్యాశాఖ స్పష్టత ఇవ్వలేదు. ఎన్సీటీఈ వివరణ వచ్చిన తర్వాత ఓ స్పష్టత ఇస్తామని అధికారులు తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని టెట్ దరఖాస్తుల గడువు పెంచాలి. -
ఈసీ ఆదేశాలు.. ఏపీలో డీఎస్సీ వాయిదా
సాక్షి, విజయవాడ: ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. నేటి నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 4 తర్వాత డిఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్ జరగాల్సి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసేంది కాగా, ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ పరీక్షా ఫలితాల విడుదలకు ఈసీ బ్రేక్ వేసింది. -
ఓపెన్ స్కూల్ చదివితే డీఎస్సీకి చాన్స్ లేనట్టే
సాక్షి, హైదరాబాద్: ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. వీళ్లు గతంలో టెట్ పాసయినా ఉపాధ్యాయ నియామకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరాకరించాలని నిర్ణయించారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నారు. దీనివల్ల దాదాపు 25 వేల మంది డీఎస్సీకి దూరమయ్యే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్ కోర్సులు నిర్వహించింది. వీటిని రెగ్యులర్ డీఎడ్ కోర్సులతో సమానంగా భావించారు. ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌కు హాజరయ్యారు. టెట్ దరఖాస్తులో అర్హత కాలంలో డీఎడ్‌కు బదులు ‘ఇతరులు’అనే కాలంతో వీళ్లు దరఖాస్తు చేసేవాళ్లు. కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చెప్పింది. రెగ్యులర్ డీఎడ్‌తో ఇది సమానం కాదని పేర్కొంది. నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికెట్తో కేవలం ప్రైవేటు స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది. టెట్‌కు, డీఎస్సీకి ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా, వెరిఫికేషన్‌లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. -
డీఎస్సీ–2024 నిర్వహణపై ‘ఈసీ’కి లేఖ
సాక్షి, అమరావతి: ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన ‘టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (టెట్) ఫలితాల ప్రకటన, డీఎస్సీ–2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత టెట్ ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్నా.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన, డీఎస్సీ నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డీఎస్సీ నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసీ కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం టెట్, డీఎస్సీని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51 వేల మంది ఎస్టీజీ పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామన్నారు. ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామన్నారు. -
డీఎస్సీ ప్రక్రియ నిలిపివేయలేం: హైకోర్టు
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చేపట్టిన డీఎస్సీ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీఎస్సీ విషయంలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఉపాధ్యాయుల నియామకం పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికప్పుడు జోక్యం చేసుకోలేమంది. హడావుడిగా పిటిషన్ దాఖలు చేసి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటే ఎలా అంటూ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు సవాలు చేశారని గుర్తు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలిపింది. ఉపా«ద్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హతలు కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, ఈ విషయంలో అన్ని స్కూళ్లను ఒకే రకంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాఠశాలల్లో వివిధ ఉపాధ్యాయ పోస్టుల మార్గదర్శకాల జీవోలు 11, 12 కు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల పాఠశాలల్లో ఇంగ్లిష్ నైపుణ్యం ఉన్న వారిని టీచర్లుగా నియమించడం లేదని, వారికి ఇంగ్లిష్ నైపుణ్య పరీక్ష నిర్వహించడం లేదని తెలిపారు. రెసిడెన్షియల్, మోడల్, గురుకుల పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీషు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇలా వివక్ష చూపడానికి వీల్లేదన్నారు. అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే నియామకాలు... రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఉపాధ్యాయులుగా ఎంపికైన తరువాత రెండేళ్లు వారికి నైపుణ్య తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. పిటిషనర్ గతంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియంను సవాలు చేశారని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టడాన్నే పనిగా పెట్టుకున్నారన్నారు. ఎన్సీటీఈ నిబంధనలకు అనుగుణంగా నియామకాలు చేస్తున్నామని తెలిపారు. ఈ దశలో ఇంద్రనీల్ జోక్యం చేసుకుంటూ, డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తయితే తమ వ్యాజ్యం నిరర్ధకమవుతుందని, అందువల్ల ఆ ప్రక్రియ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. -
ఎన్నికల కమిషన్ చేతిలో డీఎస్సీ భవితవ్యం
రాష్ట్రంలో 144 సెక్షన్ రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ప్రతి అభ్యర్థి ప్రచారానికి, ర్యాలీలకు అనుమతి తీసుకోవాలని ఇందుకోసం సవిధ యాప్‌ను వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటికే 398 అభ్యర్థనలు వచ్చాయన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఎన్నికల వ్యయం అమల్లోకి వస్తుందన్నారు. 85 ఏళ్లు దాటిన వారు ఇంటి వద్దే ఓటేసే అవకాశం ఉన్నా, ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో 2 శాతం మందే వినియోగించుకున్నారని, చాలామంది పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయడానికే ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు. సాక్షి, అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అంతవరకు టెట్ పరీక్షల ఫలితాలను కూడా ప్రకటించవద్దని ఆదేశించినట్లు తెలిపారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో 6,100 పోస్టులకు 4.72 లక్షల మంది పోటీపడుతున్నట్లు తెలిపారు. డీఎస్సీ నిర్వహించాలని కొందరు, వాయిదా కోరుతూ మరికొందరు మెయిల్స్, ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లేఖ రాయనుందని, ఇందుకోసం సీఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని స్పష్టం చేశారు. పటిష్టంగా ఎన్నికల నియమావళి అమలు రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. గత మూడు రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, వస్తువులు జప్తు చేశామన్నారు. కోడ్ ఉల్లంఘించిన వారిపై 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 46 మందిపై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందులో 40 మంది వలంటీర్లు ఉన్నారని, వారిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. మరో ఇద్దరు రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న గోడ రాతలు, బ్యానర్లు, ఇతర వస్తువులు మొత్తం 1,99,000 తొలగించగా, ప్రైవేటు స్థలాల్లో 1,15,000 తొలగించినట్లు తెలిపారు. అనుమతి లేకుండా ప్రచారం కోసం ఆస్తులను వినియోగించిన వారిపై 94 కేసులు, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేసినవారిపై 37 కేసులు నమోదు చేశామన్నారు. కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ డిస్టిలరీల నుంచి మద్యం ఉత్పత్తి, గొడౌన్ల నుంచి మద్యం నిల్వల వివరాలు తెప్పించి, గతేడాది గణాంకాలతో పోల్చి చూస్తున్నామని, ఎక్కడా మద్యం అమ్మకాలు పెరగలేదన్నారు. ఇంతవరకు అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలు కనిపించలేదన్నారు. ప్రధాని భద్రత కేంద్ర హోంశాఖ అంశం ప్రధాని భద్రత కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఎస్పీజీ పరిధిలోనికి వస్తుందని, సీఈవో పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. ప్రధాని సభ భద్రతా వైఫల్యాలపై వివిధ రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామన్నారు. రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక ఘటనలు రీపోలింగ్ వంటివి లేకుండా ఎన్నికలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కోడ్ వచ్చిన తర్వాత గిద్దలూరు, ఆళ్లగడ్డ, మాచర్లల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై గురువారం స్వయంగా వచ్చి నివేదిక ఇవ్వాలని ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్లు తెలిపారు. వారి వివరణ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇస్తామన్నారు. సీవిజిల్‌తో సత్వర పరిష్కారం ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఓటరు సీవిజిల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ఆయన పిలుపునిచ్చారు. సీవిజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లోనే చర్యలు తీసుకుంటామని, అదే నేరుగా తమకు ఫిర్యాదు చేస్తే సంబంధిత అధికారికి పంపి వివరణ తీసుకొని చర్యలు చేపట్టడానికి చాలా సమయం పడుతుందన్నారు. కోడ్ ఉల్లంఘన అంశాలు వీడియో తీసి యాప్‌లో అప్లోడ్ చేస్తే వాటిపై తక్షణం స్పందించడానికి 1,173 ప్లైయింగ్ స్క్వాడ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటి వరకు సీవిజిల్ యాప్ ద్వారా 1,307 ఫిర్యాదులు వస్తే అందులో 40 తప్ప అన్నీ పరిష్కరించినట్లు తెలిపారు. -
డీఎస్సీ హడావుడి షురూ
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ హడావుడి మొదలైంది. మంచి కోచింగ్ కేంద్రాల కోసం టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు వెతుకుతున్నారు. అయితే వారిని ఆకర్షించేందుకు కోచింగ్ కేంద్రాలు లోతైన మెటీరియల్ ఇస్తామని, సబ్జెక్ట్ నిపుణులతో ప్రత్యేక క్లాసులు చెప్పిస్తామని ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 పోస్టులతో డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. వచ్చే జూలై 17 నుంచి 31 వరకూ ఆన్లైన్ పద్ధతిలో పరీక్ష జరుగుతుంది. గత ఏడాది డీఎస్సీకి 1.70 లక్షల దరఖాస్తులు వస్తే, ఇవి కాకుండా కొత్తగా ఇప్పటి వరకూ మరో 25 వేల మంది వరకూ దరఖాస్తు చేశారు. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహిస్తున్నారు. దీంతో గడువు ముగిసే నాటికి మరో లక్ష మంది వరకూ డీఎస్సీకి దరఖాస్తు చేసే అవకాశముంది. మొత్తంగా 3 లక్షల మంది ఈ ఏడాది డీఎస్సీకి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కోచింగ్ తీసుకునేందుకు 1.50 లక్షల మందికిపైగా హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తేలికగా ఉండదని... ఉపాధ్యాయ నియామక ప్రక్రియ ఈసారి కఠినంగా ఉంటుందని కొన్ని కోచింగ్ కేంద్రాలు చెబుతున్నాయి. ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ తరహా ప్రచారానికి తెరలేపాయి. 2017 నుంచి డీఎస్సీ నోటిఫికేషన్ లేకపోవడం, టెట్ ఉత్తీర్ణత సాధించినవారి సంఖ్య ఏటా పెరుగుతుండటంతో దరఖాస్తుదారుల సంఖ్య భారీగానే ఉంటుందని అనుకుంటున్నారు. పోటీ పెరిగిన నేపథ్యంలో వడపోత విధానాలపై విద్యాశాఖ కసరత్తు మొదలుపెట్టిందని వారు అంటున్నారు. గతంలో మాదిరి తేలికైన, సూటి ప్రశ్నలు వచ్చే వీల్లేదని అంచనా వేస్తున్నారు. మ్యాథ్స్, సైన్స్ సహా సైకాలజీ సబ్జెక్టుల్లోనూ కఠినమైన రీతిలో ప్రశ్నలు రూపొందించొచ్చని చెబుతున్నారు. నూతన విద్యావిధానం అమలులోకి వస్తున్న తరుణంలో బోధన పద్ధతుల నుంచి లోతైన ప్రశ్నలు ఉంటాయంటున్నారు. జాతీయ, అంతర్జాతీయ బోధన మెళకువలను అభ్యర్థుల నుంచి తెలుసుకునే వ్యూహం డీఎస్సీలో ఉంటుందని నిపుణులూ అంటున్నారు. గత కొంతకాలంగా బీఈడీ, డీఎడ్‌లో ఇవన్నీ లేవని, కాబట్టి కొత్త విషయాలను అవగాహన చేసుకుంటే తప్ప డీఎస్సీ తేలికగా రాయడం కష్టమనే వాదనను కోచింగ్ కేంద్రాలు ప్రచారం చేస్తున్నాయి. అయితే, నిర్దేశించిన సిలబస్ నుంచే ప్రశ్నపత్రం ఉంటుందని, కాకపోతే నవీన బోధన విధానాలు, సైకాలజీ నుంచి సరికొత్త విషయాలతో ప్రశ్నపత్రం రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు అంటున్నాయి. దీనినిబట్టి అకడమిక్ పుస్తకాలకు అందని రీతిలో డీఎస్సీ ఉంటుందా? అనే సందేహాలు అభ్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి. పోటీ పెంచుతున్న కోచింగ్ సెంటర్లు కొత్త స్టడీ మెటీరియల్ రూపకల్పన, ఫ్యాకల్టీ ఎంపికపై కోచింగ్ కేంద్రాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. మూడు నెలల కాల పరిమితితో కూడిన డీఎస్సీ కోచింగ్ సిలబస్ రూపొందిస్తున్నాయి. సొంతంగా మెటీరియల్ తయారు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే 20 ప్రముఖ కోచింగ్ సెంటర్లు విస్తృతంగా ప్రచార కార్యక్రమంలో ఉన్నాయి. మరో వంద వరకూ చిన్నాచితక సెంటర్లు వెలిశాయి. స్వల్పకాలిక కోచింగ్‌కు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ. 2.50 లక్షల వరకూ డిమాండ్ చేస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుల ఆధారంగా కోచింగ్ ఉంటుందని చెబుతున్నాయి. డీఎస్సీ రాసేవారిలో నాలుగేళ్ల ముందు బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులైన వారున్నారు. ఒక్కసారిగా సిలబస్ మారుతోందనే ప్రచారంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. కొత్త తరహా ప్రశ్నపత్రం వస్తే కష్టమనే భావన బలపడుతోంది. అయితే, మెథడాలజీ, సబ్జెక్టులపై అవగాహన ఉంటే ఇబ్బంది ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఏదేమైనా కోచింగ్ కోసం ఈ తరహా అభ్యర్థులు హైదరాబాద్‌ను ఆశ్రయిస్తున్నారు. -
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు దరఖాస్తులను స్వీకరించననున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఆన్లైన్లోనే పరీక్ష నిర్వహించనున్నారు. మే 20 నుంచి జూన్ 3 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 17 నుంచి 31 వరకు తెలంగాణ డీఎస్సీ పరీక్షలు జరపనున్నారు ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. -
తెలంగాణలో టెట్ నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఆమోదం తెలిపింది. డీఎస్సీ కంటే ముందే టెట్ నిర్వహించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌కు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో త్వరలో టెట్ నోటిఫికేషన్ వెవువడనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 3 లక్షల మంది అభ్యర్థులకు డీఎస్సీ రాసే అవకాశం దక్కనుంది. ఇప్పటికే తెలంగాణలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎస్సీ ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ కోటాలో 5 ఏళ్ల పాటు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మొత్తం ఉద్యోగాల్లో 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా.. 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు; స్పెషల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 220 స్కూల్ అసిస్టెంట్, 796 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. చదవండి: గ్రూప్-1 దరఖాస్తు గడువు పొడిగింపు -
AP: డిఎస్సీ-2024 షెడ్యూల్లో మార్పులు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో 6100 ఉపాధ్యాయుల నియామకం కోసం ప్రకటించిన డిఎస్సీ-2024 పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేసినట్లు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. డిఎస్సీ-2024 పరీక్ష కోసం ఫిబ్రవరి 25 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 15 వ తేదీ నుంచి డిఎస్సీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల ఈ పరీక్షలను మార్చి 30 వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహిస్తున్నామని మంగళవారం నాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 14 రోజుల పాటు రెండు సెషన్లలో పరీక్షలను నిర్వహించేలా టైం టేబుల్ ను రూపొందించామన్నారు. డిఎస్పీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న వారు షెడ్యూల్ మార్పును గమనించాలని ఆయన సూచించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు(ఎస్జీటీ) అర్హతలను మార్చడం, టెట్ పరీక్షకు డిఎస్సీ పరీక్షకు మధ్యన తగిన సమయం ఇవ్వడం తదితర కారణాల వల్ల షెడ్యూల్ లో మార్పులు అనివార్యమయ్యాయని మంత్రి వివరించారు. సెంటర్లను ఎంపిక చేసుకోడానికి మార్చి 20 నుంచి వెబ్ ఆప్షన్లు ద్వారా అభ్యర్ధులకు అవకాశం కల్పిస్తున్నామని, హాల్ టిక్కెట్లను మార్చి 25 వ తేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నూతన షెడ్యూల్ ద్వారా లభించిన అవకాశాన్ని అభ్యర్ధులందరూ సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని మంత్రి బొత్స సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. -
డీఎస్సీ పరీక్షల షెడ్యూలు మార్పు
సాక్షి, అమరావతి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ–2024 పరీక్షల షెడ్యూలును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా నూతన షెడ్యూలును రూపొందించినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనితోపాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. టెట్ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 15 నుంచి ఉపాధ్యాయ నియామకం కోసం డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కావలసి ఉంది. కానీ, టెట్ పరీక్షకు.. డీఎస్సీ పరీక్షకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులుచేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని సురేష్‌కుమార్ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఐఐటి జేఈఈ తదితర ఎంట్రన్స్ పరీక్షలు ఉండటంతో పరీక్ష కేంద్రాలు అందుబాటులో లేకపోవడంవల్ల మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకూ ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహించేలా షెడ్యూలు రూపొందించామని చెప్పారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయమిస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. డీఎస్సీ నూతన షెడ్యూల్ వివరాలు.. ► మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు సెషన్ల చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 7న టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు నిర్వహిస్తారు. ► ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ పరీక్షలను నిర్వహిస్తారు. ► మార్చి 20 నుంచి పరీక్షా రాయటానికి అభ్యర్థులకు సెంటర్లు ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. ► మార్చి 25 నుంచి అభ్యర్థులు తమ హాల్–టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీఓ–11లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీఓ–22ను గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ DSC https:// apdsc. apcfss. in/ వెబ్సైట్లో చూసుకోవచ్చునని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. -
ఏపీ DSCపై రామోజీ విషపురాతలు
-
డీఎడ్ అర్హులకే ఎస్జీటీ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: మెగా డీఎస్సీలో ఎస్జీటీ పోస్టులకు డీఎడ్ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పేపర్–2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది. ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్లైన్ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు. పరీక్షాకేంద్రాలు ఇవీ.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి. వయో పరిమితి మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18–46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. నియామక విధానం రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్ వెయిటేజ్ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్ పొంది ఉండాలి. టెట్ పేపర్ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్ (రిజర్వేషన్ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి. పేపర్–1 టెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్ చేయాలి. -
రాజధానిలోనే ఎక్కువ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీలో అత్యధిక పోస్టులు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 878 టీచర్ పోస్టులు భర్తీ చేయనుండగా రంగారెడ్డి జిల్లాలో 379 ఖాళీలున్నట్లు అధికారులు తేల్చారు. ప్రాథమిక విద్యను బోధించే సెకండరీ గ్రేడ్ స్కూల్ టీచర్లు (ఎస్జీటీల) అవసరం ఎక్కువగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా టీచర్ పోస్టులు ఈ విధంగా ఉన్నాయి. -
11,062 పోస్టులతో రేపు డీఎస్సీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియా మకాలకు సంబంధించిన డీఎస్సీ నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది. మే 3వ వారంలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. పది రోజులపాటు పరీక్ష నిర్వహించే వీలుందని... ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తం 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. దీంతో నోటిఫికేషన్ వెలువడటమే తరువాయి. వాస్తవానికి బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని భావించినా షెడ్యూల్ ఖరారు, సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండటంతో ఒకరోజు ఆలస్యం కావొచ్చని అధికారులు తెలిపారు. గతేడాది 5,089 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. వాటితోపాటు కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కారణంగా పాత నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అయితే గతంలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకొనేలా సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. ఎస్జీటీ పోస్టులే ఎక్కువ.. విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నట్లు లెక్కగట్టారు. వాటిల్లో ఎస్జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉండే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. పదోన్నతుల ద్వారా ఎస్జీటీలతో 70 శాతం వరకూ భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండటంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500–2,000 వరకూ ఎస్ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పీఈటీలు ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుందని తెలుస్తోంది. గతేడాది ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులొచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్రమత్తంగా అధికారులు డీఎస్సీపై నిరుద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇప్పటికే ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉత్తీర్ణులయ్యారు. వాళ్లంతా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు. ప్రశ్నపత్రాలు మొదలుకొని ఫలితాల వరకూ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగా సాఫ్ట్వేర్ రూపకల్పనపై మరింతగా దృష్టి పెట్టారు. పాస్వర్డ్స్, ఆన్లైన్ వ్యవస్థ భద్రతాంశాలను ఉన్నతాధికారులు సమీక్షించారు. సాంకేతిక విభాగంలో ప్రైవేటు సంస్థల పాత్ర ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు విద్యాశాఖ సిబ్బందిని ఆదేశించారు. కీలకపాత్ర పోషించే అధికారులు ప్రతి అంశాన్నీ పరిశీలించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలొచ్చాయి. -
11 వేల పోస్టులతో డీఎస్సీ!
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లోపే వీలైనంత త్వరగా డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. డీఎస్సీ ద్వారా మొత్తం 11 వేల టీచర్ పోస్టుల భర్తీ ఉండొచ్చని అధికార వర్గాలు సూచనప్రాయంగా చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని రెండ్రోజుల క్రితం కలిసిన ఉన్నతాధికారులు.. టీచర్ పోస్టుల ఖాళీలు, వాటి భర్తీ విధానం, న్యాయపరమైన చిక్కుల గురించి వివరించారు. పదోన్నతుల ద్వారా భర్తీ చేసే ఖాళీలు విడిచిపెట్టి మిగతా వాటిని డీఎస్సీలో చేర్చాలని ఈ భేటీలో సీఎం నిర్ణయించారు. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆర్థిక శాఖ ఆమోదానికి ఫైల్‌ను పంపింది. దానికి అనుమతి రావాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో ఇది పూర్తవుతుందని, వెనువెంటనే ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చే వీలుందని అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే ఓసారి నోటిఫికేషన్... గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ముందు 5,089 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పోస్టులకు 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే డీఎస్సీ పరీక్ష తేదీల సమయంలోనే అసెంబ్లీ పోలింగ్ తేదీలు రావడంతో డీఎస్సీని రద్దు చేయాల్సి వచ్చింది. అదీగాక.. డీఎస్సీలో ప్రకటించిన 5,089 పోస్టులు కూడా రోస్టర్ విధానం తర్వాత కొన్ని జిల్లాల్లో ఖాళీల్లేని పరిస్థితి తలెత్తింది. నాన్–లోకల్ జిల్లా కోటాలో డీఎస్సీకి వెళ్లేందుకూ పోస్టులు లేకపోవడం నిరుద్యోగులను నిరాశపరిచింది. లోపాల్లేకుండా చూడాలి.. నిరుద్యోగుల్లో డీఎస్సీ నిర్వహణ ఆనందం నింపు తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాల్లే కుండా చూడాలి. వీలైనంత త్వరగా టీచర్ల పదోన్నతులు చేపట్టి.. ఖాళీలను భర్తీ చేయాలి. – రామ్మోహన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు, డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం ఖాళీలు ఎన్ని?.. భర్తీ చేసేవి ఎన్ని? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు సహా మొత్తం టీచర్ పోస్టులు 21 వేల వరకూ ఖాళీగా ఉన్నాయి. వాటిలో స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతి కలి్పంచడం ద్వారా 1,974 హెచ్ఎం పోస్టులను, ప్రమోషన్ల ద్వారా 2,043 ప్రాథమిక పాఠశాలల హెచ్ఎం పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,200 వరకూ ఖాళీలు ఉండగా వాటిలో 70 శాతం ప్రమోషన్ల ద్వారా మిగిలిన 30 శాతం పోస్టులను నేరుగా భర్తీ చేయాల్సి ఉంటుంది. పదోన్నతుల ప్రక్రియకు కోర్టు చిక్కులున్నాయి. కాబట్టి నేరుగా భర్తీ చేసే పోస్టులను డీఎస్సీ పరిధిలోకి తెచ్చే యోచనలో అధికారులు ఉన్నారు. అలాగే సెకండరీ గ్రేడెడ్ ఉపాధ్యాయుల పోస్టుల్లో 6,775 ఖాళీలున్నాయి. వాటిని భర్తీ చేసేందుకే ప్రయత్నిస్తున్నారు. పండిట్, పీఈటీ పోస్టులు దాదాపు 800 వరకూ ఉండొచ్చని అంచనా వేశారు. ఈ లెక్కన మొత్తంగా 11 వేలకుపైగా పోస్టులను డీఎస్సీ ద్వారా భర్తీ చేసే అవకాశం ఉంది. -
నిబంధనల ప్రకారమే డీఎస్సీ
సాక్షి, అమరావతి: డీఎస్సీ–2024లో ప్రతి అంశంలోను పూర్తి జాగ్రత్తలు తీసుకున్నామని, అభ్యర్థులకు ఎటువంటి గందరగోళం లేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులకు నష్టం జరగకుండా జీవో నం.77 ప్రకారం రోస్టర్ పాయింట్లు చూపించామని చెప్పారు. ప్రస్తుత డీఎస్సీని 2018 డీఎస్సీ నిబంధనల ప్రకారమే నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తు నుంచి పరీక్ష వరకు అప్పటి నిబంధనలే ఉంటాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ ‘ఈనాడు’ పత్రిక డీఎస్సీ అభ్యర్థులను గందరగోళంలోకి నెట్టేలా కథనం ప్రచురించిందన్నారు. రోస్టర్ విధానం తెలియకుండా ఆ పత్రిక ప్రచురించిన కథనం డీఎస్సీ అభ్యర్థులను ఆందోళనకు గురిచేసేలా ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో ఇచ్చిన జీవో 77 ప్రకారం అన్ని రోస్టర్లను చూపించామని, కానీ, బ్యాక్లాగ్ పోస్టుల విషయంలో ఆ సంవత్సరం రిక్రూట్మెంట్ రోస్టర్లను అలాగే కొనసాగించాలని అన్నారు. జీవో ప్రకారం పాయింట్లు ప్రోస్పెక్టివ్గానే ఉంటాయిగానీ, రెట్రోస్పెక్టివ్‌గా ఉండదని చెప్పారు. ఆయన చెప్పిన వివరాలివీ.. ♦ మొదటి దరఖాస్తుదారులకు ఈడబ్లు్యఎస్ కోటా కనిపించలేదనడంలోనూ వాస్తవం లేదు. దరఖాస్తులు ప్రారంభమైన తేదీ నుంచే ఆప్షన్లో ఈడబ్లు్యఎస్ కోటా ఉంది. ఈనాడులో రాసింది తప్పు. ♦ పరీక్ష ఫీజుపైనా తప్పుగా రాశారు. వాస్తవానికి అభ్యర్థి అప్లికేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు మాత్రమే వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా 2018 డీఎస్సీ నిబంధనే. ♦ స్థానికేతర అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకున్న సమయంలో స్థానికేతర ఆప్షన్ (ఓపెన్) ఇవ్వవచ్చు. ఒకసారి ఈ ఆప్షన్ ఎంచుకుని దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థి నియామకం కూడా ఎంచుకున్న జిల్లాకే పరిమితం అవుతుంది. ఇదే విధానం జోనల్ పోస్టులకూ వర్తిస్తుంది. అలాగే దరఖాస్తు చేసుకోవాలి. ♦ డీఎస్సీ వెబ్‌సైట్‌కు సర్వర్ సమస్య ఎప్పుడూ లేదు. ఇప్పటివరకు టెట్ – 2024కు 3,17,950 దరఖాస్తులు అందాయి. డీఎస్సీకి 3,19,176 మంది నమోదు చేసుకున్నారు. సర్వర్ సమస్య ఉంటే ఇంత మంది దరఖాస్తు చేసుకోలేరు. అభ్యర్థులు కొందరికి ఫీజు చెల్లించే సమయంలో ఇంటర్నెట్ సమస్య ఉత్పన్నమై ఉంటుంది. దరఖాస్తు అనంతరం అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పించాం. ఎవరైనా ఫీజు చెల్లించి ‘జర్నల్ నంబర్’ రాకుంటే చెల్లించిన ఫీజు మొత్తం వారి బ్యాంకు ఖాతాలో ఐదు రోజుల్లో తిరిగి జమ అవుతుంది. ♦ డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన ఫిబ్రవరి 12 నుంచే దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. బుధవారం వరకు మొత్తం 2,40,119 మంది ఫీజు చెల్లించారు. ♦సెంటర్ టెట్ (సీటెట్) విషయంలో కొందరికి అవగాహన లేదు. వాస్తవానికి ఏపీ విద్యా శాఖ వద్ద సీటెట్ డేటాబేస్ ఉండదు. సీటెట్ అభ్యర్థులు మొత్తం మార్కులు, గరిష్ట మార్కులను వారే స్వయంగా నమోదు చేయాలి. ఏపీ టెట్ అభ్యర్థులు మాత్రం హాల్ టికెట్ నంబరు నమోదు చేస్తే సరిపోతుంది. అభ్యర్థులకు ఎడిట్ అవకాశం దరఖాస్తులకు ఎడిట్ ఆప్షన్ లేకండా 30 వేల మంది అవస్థలు పడుతున్నారని అనడం కూడా సరికాదు. దరఖాస్తు సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలని, తప్పులు జరిగితే సవరించే అవకాశం లేదని బులెటిన్‌లోనే పేర్కొన్నాం. కానీ అభ్యర్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని అప్లికేషన్‌ను ఎడిట్ చేసుకొనే అవకాశం కల్పించాం. అభ్యర్థులు మొదట వెబ్సైట్లో డిలీట్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాత జర్నల్ నంబర్, మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసి డిలీట్ ఆప్షన్ పొందవచ్చు. దీనిద్వారా ఎలాంటి రుసుం చెల్లించకుండా తప్పులు సరిదిద్దుకుని తిరిగి అప్లై చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎంచుకున్న పోస్టు, జిల్లా తప్ప మిగిలిన అన్ని అంశాలూ ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అభ్యర్థి తన పేరులో స్పెల్లింగ్ తప్పుగా ఉంటే పరీక్ష కేంద్రంలో నామినల్ రోల్స్‌లో సంతకం చేసే సమయంలో తప్పును సవరించుకునే అవకాశం ఉందని సురేష్ కుమార్ తెలిపారు. 25 వరకు ఫీజు చెల్లింపు గడువు డీఎస్సీ అభ్యర్థులు ఫీజు చెల్లించే గడువును పెంచినట్టు పాఠశాల కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఈనెల 25వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని, ఈ ఆవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే, హెల్ప్ డెస్క్ సమయాన్ని ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పొడిగించామని తెలిపారు. -
అంతా సిద్ధమే.. అయినా ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం వరుసగా ప్రకటనలు చేస్తున్నా.. ఆ దిశగా ముందడుగు పడటం లేదని నిరుద్యోగులు, ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకేళ్లుగా ఉపాధ్యాయ పోస్టుల కోసం సిద్ధమవుతున్నామని, వీలైనంత త్వరగా ప్రక్రియ ప్రారంభించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ వేసినా.. టీచర్ల పదోన్నతులు, బదిలీలు, టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)లో అర్హత వంటి ఇబ్బందులతో నియామక ప్రక్రియ ఆగిపోయిందని గుర్తుచేస్తున్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించడం సంతోషకరమని.. కానీ ఇప్పటికే ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించి, ఆటంకాలను తొలగించడంపై దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని, ఆలోగానే భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. నాలుగు లక్షల మందికిపైగా.. రాష్ట్రంలో ఉపాధ్యాయ విద్య కోర్సులు పూర్తి చేసి, టెట్ కూడా పాసైన వారు సుమారు 4 లక్షల మందికిపైగా ఉన్నారు. వారంతా టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో ఏళ్లకేళ్లుగా డీఎస్సీ కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకుంటున్నవారు కూడా ఉన్నారు. కొత్త సర్కారు మెగా డీఎస్సీ వేస్తామనడం, ఇటీవల సీఎం రెండుసార్లు టీచర్ పోస్టుల భర్తీపై సమీక్షించినా.. నోటిఫికేషన్ జారీ దిశగా ప్రక్రియ ఏదీ మొదలవకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో మెగా డీఎస్సీపై చర్చ జరిగిందని, ఖాళీల గుర్తింపు, ఇతర అంశాలపై కసరత్తు చేపట్టాలని సీఎం ఆదేశించారని మంత్రులు చెప్పడంపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డీఎస్సీ వేసినా ఆగిపోయి.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2017లో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నిర్వహించారు. తర్వాత ఆ ఊసే లేదు. గత ఏడాది డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా.. 5,089 పోస్టులే ఉన్నాయి. ఆరేళ్ల తర్వాత డీఎస్సీ వేశారని, పోస్టులు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. కొత్త రోస్టర్ విధానంతో కొన్ని జిల్లాల్లో పోస్టులే లేకుండాపోయాయని నిరాశ వ్యక్తం చేశారు. దీనికితోడు పదోన్నతులు, బదిలీల సమస్యలతో డీఎస్సీ వాయిదా పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ మంత్రులు, అధికారులకు అభ్యర్థులు వినతిపత్రాలు సమర్పించారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. సీఎం కూడా టీచర్ పోస్టుల భర్తీపై రెండు సార్లు అధికారులతో సమీక్షించి.. సమగ్ర నివేదిక కోరారు. అధికారులు లెక్కలన్నీ తేల్చి.. పదోన్నతుల ద్వారా కొన్ని, నేరుగా జరిగే నియామకాల మరికొన్ని.. కలిసి 21వేల టీచర్ పోస్టుల భర్తీ అవసరమని నివేదించారు. సీఎం రేవంత్ కూడా మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనేక మంది ప్రైవేటు స్కూళ్లలో ఉద్యోగాలు మానుకుని మరీ డీఎస్సీ కోసం సిద్ధమవుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుకున్నస్థాయిలో వేగం కనిపించడం లేదని.. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వస్తే మళ్లీ మొదటికి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం డీఎస్సీ కోసం రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అధికారులు ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించడం, సీఎం రివ్యూ చేయడంతో ఆశలు నెరవేరుతున్నాయన్న ఆనందం కనిపించింది. కానీ నోటిఫికేషన్ దిశగా అడుగు ముందుకు పడకపోతుండటంపై నిరుద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. – రావుల రామ్మోహన్‌రెడ్డి, డీఎడ్. బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బదిలీలు, పదోన్నతులతో లింకు పూర్తిస్థాయిలో టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపడితే తప్ప వాస్తవ ఖాళీలను నిర్థారించలేమని విద్యాశాఖ అధికారులే చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు 13వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పదోన్నతుల ద్వారా మరో 8 వేల వరకు పోస్టులు ఖాళీ అవుతాయని అంటున్నారు. మరోవైపు పదోన్నతుల విషయంలో పలు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ముఖ్యంగా టీచర్ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణులకు మాత్రమే పదోన్నతులు ఇవ్వాలంటూ.. 2012 తర్వాత నియమితులైన టీచర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కేంద్ర నిబంధనలను పరిశీలించి.. పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని తేల్చింది. గత ఏడాది చేపట్టిన టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని దాదాపు 80వేల మంది టీచర్లు ‘టెట్’రాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మారిన సిలబస్ నేపథ్యంలో కొత్త అభ్యర్థులతో సమానంగా పాత టీచర్లు టెట్ రాయడం కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం లేవనెత్తుతున్నాయి. ‘టెట్’నిర్వహణ, టీచర్ల బదిలీల విషయంలో ఇది చిక్కుముడిగా మారింది. మరోవైపు భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి అవసరం. వీటన్నింటితో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెప్తున్నాయి. అన్ని అడ్డంకులను ఛేదించుకుని లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ రావడం కష్టమేనని అంటున్నాయి. టీచర్లకు టెట్ నిర్వహించాలి టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి. ఎన్నో ఏళ్లుగా బోధిస్తున్న టీచర్లకు ఈ పరీక్షను అంతర్గత పరీక్షలా నిర్వహించాలి. ఇది ఎంత త్వరగా చేపడితే అంత మంచిది. ఇప్పటికే స్కూళ్లలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. నిర్వహణ పోస్టులైన డీఈవో, ఎంఈవోల పోస్టుల్లో చాలావరకు ఖాళీగా ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి -
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
ఎస్జీటీలుగా 2008–డీఎస్సీ అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2008 అభ్యర్థులను ఎస్జీటీలుగా నియమించే అంశాన్ని పునఃపరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. నాటి డీఎస్సీ మెరిట్ జాబితా ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని ఈ సమస్యకు ఏపీ సర్కార్ కొంత ఉపశమన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది. అయితే తెలంగాణలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది. 2008– డీఎస్సీ నోటిఫికేషన్లో తమ కంటే తక్కువ అర్హత ఉన్న డీఎడ్ అభ్యర్థులకు 30 శాతం ఎస్జీటీ పోస్టులను రిజర్వు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బీఎడ్ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. ఒకే రకమైన పోస్టులకు అర్హత ఎక్కువున్న వారిని కాదని.. తక్కువ ఉన్న వారిని నియమించడం చట్టప్రకారం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాదులు వాదించారు. ‘ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు చేసేటప్పుడు రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4)కు లోబడి క్లాసిఫికేషన్ చేయాలిగానీ.. ఇష్టం వచ్చి నట్లు నిర్ణయం తీసుకోవడం చెల్లదు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ–2008 బీఎడ్ అభ్యర్థుల విషయంలో ఆ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. వారికి 60 ఏళ్లు వచ్చే వరకు కాంట్రాక్టు ఉద్యోగాల్లో కొనసాగిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా అమలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కారణంగానే వివాదం ఏళ్లుగా కొనసాగుతోంది. కనీసం ఖాళీగా ఉన్న పోస్టుల్లో నాటి బీఎడ్ అభ్యర్థులను నియమిస్తే అందరికీ ఉపశమనం లభిస్తుంది’అని పేర్కొ న్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది గోవింద్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘ఏపీ ప్రభుత్వం సంక్షేమ రాష్ట్రం. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే ఏ నిర్ణయమైనా తీసుకుంటుంది. ఇందులో భాగంగానే మానవతా ధృక్పథంతో అలోచించి అర్హులైన డీఎస్సీ 2008 అభ్యర్థులను కాంట్రాక్టు ఉద్యోగులుగా నియమించింది’అని నివేదించారు. వాదనలు విన్న ధర్మాసనం.. బీఎడ్ అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమించే అంశాన్ని పునః పరిశీలించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్‌ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఈనెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ
-
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను బుధవారం మధ్యాహ్నాం విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం అవుతుందని.. ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారాయన. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాల్ని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 డీఎస్సీని ప్రకటిస్తున్నాం. ఏడు మేనేజ్ మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని ప్రకటిస్తున్నాం. మెగా డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో ముగస్తుంది. విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. మా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో రూ.73 వేల కోట్లు విద్య పై ఖర్చు చేసింది అని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు. డీఎస్సీ ప్రక్రియ ఇలా.. ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్‌తో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్లైన్లో 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య https://cse.ap.gov.in/loginhome లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 24వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. మార్చి 5వ తేదీ నుంచి హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల అవుతుందని.. ఏప్రిల్ 1వ తేదీన కీలో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారాయన. ఏప్రిల్ 7వ తేదీన డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. టెట్ ప్రక్రియ ఇలా.. ఈ నెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ (నోటిఫికేషన్‌తో) ప్రారంభం అవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీల్లో https://cse.ap.gov.in/loginhome వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. 19వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. 23 వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ దాకా ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారు. మార్చి 14వ తేదీన టెట్ తుదిఫలితాలు వెలువడతాయి. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in/loginhome వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారాయన. -
6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 6,100 పోస్టులతో మెగా డీఎస్సీ - 2024 రానుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను పెంపొందిస్తూనే టీచర్ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్యాశాఖతో పాటు గిరిజన, సాంఘిక, బీసీ సంక్షేమ శాఖల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణ స్థాయిలో బోధన కొనసాగేలా భారీగా ఉపాధ్యాయులను నియమించనుంది. ఎస్సీఈఆర్టీ పర్యవేక్షణలో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ సిలబస్) విధానాన్ని ప్రవేశపెట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఏడాది టీచర్లకు ఈ విధానంపై సమగ్రంగా శిక్షణ ఇచ్చి 2025–26 విద్యా సంవత్సరంలో 1వ తరగతి నుంచి ఐబీని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి పదో తరగతి విద్యార్థులు ‘ఐబీ’ బోర్డు సర్టిఫికేషన్ పరీక్షలు రాసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ఫిబ్రవరి 16న నుంచి చివరి విడత ‘వైఎస్సార్ చేయూత’ పంపిణీ చేపట్టనున్నారు. సుమారు 27 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ప్రభుత్వం రూ.5,060.40 కోట్లు జమ చేయనుంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మీడియాకు మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. 2.20 లక్షల శాశ్వత ఉద్యోగాలు! మెగా డీఎస్సీ 2024లో భాగంగా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. అంతకంటే ముందు 8 రోజుల పాటు డీఎస్సీ అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాం. డీఎస్సీ 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్లు వయో పరిమితిని నిర్దేశించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు కల్పించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 నుంచి ఒక్క విద్యా రంగంలోనే 14,219 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేపట్టింది. 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల విధానాన్ని తేవడంతో 7,761 పోస్టుల్లో కొత్త ఉపాధ్యాయులు చేరారు. డీఎస్సీతో పాటు అటవీ శాఖలో ఫారెస్టు రేంజర్లతో సహా వివిధ విభాగాల్లో 689 పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నాం. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను నెలకొల్పి ఒక్కసారే 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది. ఇలా వివిధ శాఖల్లో కలిపి ఇప్పటికే 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలను కల్పించాం. తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 7 వేల పోస్టులతో కలిపి 2.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించినట్లు అవుతుంది. ‘చేయూత’తో రూ.19,188 కోట్లు పేద మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత లక్ష్యాలుగా వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి ‘వైఎస్సార్ చేయూత’ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సీఎం జగన్ ఇచ్చిన మాట ప్రకారం 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. తద్వారా వారి జీవనోపాధిని పెంపొందిస్తూ నెలకు అదనపు ఆదాయం కింద రూ.7 వేల నుంచి రూ.10 వేలు సంపాదించేలా తోడ్పాటునిచ్చారు. 14 లక్షల మంది స్వయం ఉపాధి మార్గాలతో సంతోషంగా జీవిస్తున్నారు. 2020లో చేయూతను ప్రారంభించగా మొదటి విడతగా 24,00,11 మందికి రూ.4500.20 కోట్లు, రెండో విడతలో 24.95 లక్షల మందికి రూ.4,679 కోట్లు, మూడో విడతలో 26.39 లక్షల మంది రూ.4.949 కోట్లు పంపిణీ చేశాం. ఏటా లబ్ధిదారుల సంఖ్య పెరుగుతున్నా ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పలేదు. తాజాగా నాలుగో విడతలో 27 లక్షల మంది ఖాతాల్లోకి రూ.5,060 కోట్లు జమ చేస్తాం. ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు జగనన్న చేయూత కార్యక్రమం కొనసాగుతుంది. పథకం కింద నాలుగు విడతల్లో కలిపి సుమారు రూ.19,188 కోట్ల ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఎస్ఈఆర్టీతో ఐబీ భాగస్వామ్యం.. పేదలకు, సంపన్నులకు తేడా నాణ్యమైన విద్య మాత్రమే. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ తీసుకొస్తున్నాం. ఐబీ విద్యా విధానంలో చదవడానికి ఏడాదికి రూ.7 లక్షల నుంచి రూ.36 లక్షల దాకా ఖర్చవుతుంది. సంపన్నుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే డిజిటల్ సదుపాయాలు, ఐఎఫ్‌పీలు, ట్యాబ్‌లను పేద పిల్లలకు కూడా అందుబాటులోకి తేవడంతో మార్పు మొదలైంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ బోధనలో ఐబీని భాగస్వామ్యం చేస్తున్నాం. ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయి ఉద్యోగాలను అందుకోవాలన్నదే సీఎం జగన్ లక్ష్యం. ప్రభుత్వంతో ఒప్పందానికి ఐబీ సంస్థ ముందుకు వచ్చింది. సంపన్నుల పిల్లలకే కాదు నిరుపేదలకూ తాము సేవలందిస్తామని ప్రకటించింది. 2024–25లో ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులతో పాటు సంబంధిత ఇతర అధికార్లకు శిక్షణ ఇచ్చి వారి సామర్థ్యాన్ని, నైపుణ్యాలను పెంచిన తర్వాత 2025–26 విద్యా సంవత్సరం జూన్ నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ మొదలవుతుంది. 2026–27 విద్యా సంవత్సరం నాటికి రెండో తరగతికి విస్తరిస్తాం. ఇలా ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ 2035 నాటికి పదో తరగతి, 2037 నాటికి ప్లస్ 2 తరగతి విద్యార్థులు ఐబీ బోర్డు జాయింట్ సర్టిఫికేషన్‌తో పరీక్షలు రాస్తారు. ఈ సర్టిఫికెట్తో ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధ వర్శిటీల్లో ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ బడుల్లో ఐబీ భాగస్వామ్యం చేయాలన్న ప్రతిపాదనను మంత్రి మండలి హర్షధ్వానాలతో ఆమోదించింది. ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు రాష్ట్రంలో విండ్, సోలార్, గ్రీన్ ఎనర్జీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తూ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ప్రతిపాదనలను మంత్రి మండలి ఆమోదించింది. ఇందులో భాగంగా గ్రీన్కో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ 1,500 మెగావాట్ల సామర్థ్యంతో సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుకు నంద్యాల జిల్లా గడివేముల మండలం చిన్నక్కపల్లెలో 1,272.07 ఎకరాలు, మిడ్తూరు మండలం మాసాపేట, నాగలూటి గ్రామాల్లో 1,011.44 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడలో అవసరమైన భూములను గుర్తించనుంది. సోలార్, విండ్‌తో సహా పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఇండోసోల్ సోలార్ పవర్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అవసరమైన భూములు కేటాయించేందుకు ఎస్పీవీ ఏర్పాటు ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ► జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ రూ. 12,065 కోట్ల పెట్టుబడులతో 3,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా 3,350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది. వైఎస్సార్ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్‌లో 850 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను నెలకొల్పుతుంది. ► నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ రూ.1,287 కోట్ల పెట్టుబడితో 171.60 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు విండ్ పవర్ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ► ఆగ్వా గ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.4 వేల కోట్ల పెట్టుబడులతో శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1,000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉపాధి దక్కుతుంది. ► ఎకోరెన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,350 కోట్ల పెట్టుబడులతో కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్ ప్రాజెక్ట్‌ను స్థాపిస్తోంది. తద్వారా 200 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ► రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,600 కోట్ల పెట్టుబడితో శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు కల్పించనుంది. ► అప్పర్ సీలేరు పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో భాగంగా 150 మెగావాట్లు చొప్పున 9 యూనిట్లు ఏర్పాటుకు పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేయాలన్న ఏపీ జెన్కో ప్రతిపాదనను మంత్రి మండలి ఆమోదించింది. రూ.12,264.36 కోట్లతో పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అందుబాటులోకి రానుంది. బయో ఎనర్జీ, రీసైక్లింగ్, సిమెంట్ పరిశ్రమలు.. ► వైఎస్సార్ కడప జిల్లాలో రెండు విడతల్లో రూ.5,400 కోట్ల పెట్టుబడులతో ఏసీసీ సిమెంట్స్ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం. దీని ద్వారా ఏడాదికి 8 మిలియన్ టన్నుల క్లింకర్, 4 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి జరుగుతుంది. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి 36 నెలల్లో పూర్తి చేయనుంది. దీనివల్ల 800 మంది ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ► అగర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు విడతల్లో రూ.3200 కోట్లతో లిథియం అయాన్ రీసైక్లింగ్, ఇ–వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తద్వారా ప్రత్యక్షంగా 3,200 మందికి ఉద్యోగాలు దక్కుతాయి. ► రాష్ట్రంలో రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ రెండు విడతల్లో 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ యూనిట్లను ఏర్పాటు చేయనుంది. రూ.1,920 కోట్ల పెట్టుబడితో 1,920 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అందించనుంది. ► పట్టాభి ఆగ్రో ఫుడ్స్ లిమిటెడ్ రెండు విడతల్లో రూ.1,153 కోట్ల పెట్టుబడితో బియ్యం ఆధారిత యూనిట్లను ఏర్పాటు చేయనుంది. 2,500 మందికి ఉపాధి కల్పించనుంది. పులిచింతల నిర్వాసితుల ఇళ్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు.. ► పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టు పరిధిలో 5,376 నిర్వాసిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఇస్తున్న ఇళ్ల పట్టాలు, ఇళ్లకు సంబంధించిన రూ.52 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.8 కోట్ల రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ ఛార్జీల మినహాయింపు. ► పల్నాడు జిల్లా నరసరావుపేటలో జామియా మసీదు షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణంలో ఆస్తి పన్ను మినహాయింపునకు ఆమోదం. ► నేచురల్ గ్యాస్‌పై వ్యాట్ 24.5 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు. ► లార్జ్ అండ్ మెగా ప్రాజెక్టులకు వివిధ పాలసీల్లో భాగంగా రాయితీలు ఇవ్వాలన్న స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ప్రతిపాదనలకు ఆమోదం. ► 4వ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ రూల్స్ 2024 ప్రతిపాదనలకు ఆమోదం. ► చట్టసభలకు కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు అధికారులు, చట్టసభల సిబ్బంది తదితరులకు శిక్షణ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో ఏపీ లెజిస్లేచర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ స్టడీస్ అండ్ ట్రైనింగ్ సంస్థ ఏర్పాటు, డైరెక్టర్(నాన్ కేడర్) పోస్టుకు కేబినెట్ ఆమోదం. ► ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్ సెక్రటేరియట్లో 27 పోస్టుల భర్తీ, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ –1987కి సవరణలు, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ యాక్ట్ –1992 సవరణలకు ఆమోదం. ► ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోలగట్ల అలనా మీనాక్షికి విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో 500 గజాలు, అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి 1,000 చదరపు గజాల నివాస స్థలం కేటాయింపు. ► తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మల్లవారిపాలెంలో ఐఐఐటీ శ్రీసిటీలో ఏర్పాటుకు 42.23 ఎకరాల కేటాయింపు. మరికొన్ని అంశాలకూ ఆమోదం ► రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో పని చేస్తున్న బోధనేతర సిబ్బంది పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు. ► ప్రతి గ్రామ పంచాయితీకి తప్పనిసరిగా పంచాయతీ కార్యదర్శి ఉండాలన్న నిర్ణయానికి ఆమోదం. ► ఏపీ డిస్కమ్‌లకు రూ.1,500 కోట్ల రుణాలపై ప్రభుత్వ గ్యారంటీ. ► అత్యంత మారుమూల ప్రాంతాల్లోని గిరిజన గ్రామాల్లో పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్ (పీవీజీటీ) ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు రూ.89.98 కోట్లతో ఏపీ డిస్కమ్‌లు రూపొందించిన డీపీఆర్‌కు ఆమోదం. -
మెగా డీఎస్సీ జోష్
విశాఖ విద్య: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెగా డీఎస్సీ నిర్వహణకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంతో నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. విద్యాశాఖ వర్గాలు, నిరుద్యోగ అభ్యర్థుల్లో బుధవారం దీనిపై సర్వత్రా చర్చ సాగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీ వస్తోందని నిరుద్యోగ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో జిల్లాల వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి. వీటిలో క్యాడర్ వారీగా ఎన్ని ఉన్నాయనే దానిపై అభ్యర్థులు ఆరా తీశారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రాతిపదికన నియామకాల ప్రక్రియ ఉండటంతో ఉపాధ్యాయ కొలువు దక్కించుకునేందుకు అభ్యర్థులు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపల్, గిరిజన సంక్షేమశాఖ యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలల్లో పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీలో ఖాళీలను గుర్తించారు. పట్టుదలతో సిద్ధమవుతున్నా.. డీఎడ్ పూర్తి చేశాను. డీఎస్సీ ప్రిపరేషన్ కోసమని నర్సీపట్నం ప్రాంతం నుంచి నా భర్తతో కలసి విశాఖ నగరానికి వచ్చాం. ఎలాగైనా డీఎస్సీలో పోస్టు దక్కించుకోవాలనే పట్టుదలతో సిద్ధమవుతున్నాను. అనుకున్నట్లుగానే మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదించటం సంతోషంగా ఉంది. – సింగంపల్లి వెంకట లక్ష్మి, కల్యాణలోవ, అనకాపల్లి జిల్లా కాలేజీలకు క్రేజ్ పెరుగుతుంది డీఎస్సీ నోటిఫికేషన్లు తరచూ ఉంటే, బీఈడీ, డీఎడ్ శిక్షణా కళాశాలలకు ఆదరణ ఉంటుంది. ఈ ప్రభుత్వ హయాంలో తప్పనిసరిగా మెగా డీఎస్సీ ఉంటుందని అంతా ఊహించినదే. నిరుద్యోగ అభ్యర్థులు కూడా అదే నమ్మకంతో ప్రిపరేషన్లో ఉన్నారు. మొత్తానికి అంతా శుభసూచికమే. – గొట్టేట రవి, సీనియర్ ఫ్యాకలీ్ట, ప్రభుత్వ డైట్ కాలేజీ, భీమునిపట్నం సీఎం మాట నిలుబెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నట్లుగానే డీఎస్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పాఠశాలల్లో అదనపు ఉపాధ్యాయులు అందుబాటులోకి వస్తారు. దీని వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులపై కూడా భారం తగ్గుతుంది. నోటిఫికేషన్ నాటికి ఇంకాస్తా పోస్టులు పెరుగుతాయనే నమ్మకం ఉంది. – చొక్కాకుల సూర్యనారాయణ, వైఎస్సార్ టీఎఫ్ అధ్యక్షుడు, విశాఖ జిల్లా సంతోషంగా ఉంది మెగా డీఎస్సీకి ప్రభుత్వం ఆమోదించటం సంతోషంగా ఉంది. డీఎడ్ చేసి గతంలో డీఎస్సీ రాశాను. ప్రస్తుతం బీఈడీ మాథ్య్ మెథడాలజీతో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ప్రయతి్నస్తున్నాను. టీచర్ పోస్టు సాధించాలని 2019 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. పోస్టుల సంఖ్య పెంచితే బాగుండేది. ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచిస్తుందనే నమ్మకం ఉంది. –కొమ్ము సూర్యకళ, ముడిదాం, విజయనగరం జిల్లా -
భేటీలో కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం
-
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ