టెట్‌ వాయిదా | Tet postponed: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టెట్‌ వాయిదా

Published Tue, Jul 9 2024 6:31 AM | Last Updated on Tue, Jul 9 2024 11:43 AM

Tet postponed: Andhra Pradesh

సాక్షి, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు ఈ నెల రెండో తేదీన విడుదల చేసిన షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. అభ్యర్థులు ఆగస్టు 3 వరకు ఫీజు చెల్లించవచ్చని కమిషనర్‌ సురేశ్‌ కుమార్‌ తెలిపారు. పరీక్షలు అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

ఫలితాలను నవంబర్‌ 2న వెల్లడించనున్నారు. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు  https://cse.ap.gov.in/  లో చూడొచ్చని తెలిపింది. 

మారిన టెట్‌ షెడ్యూల్‌ ఇదీ.. 
⇒ ఫీజులు చెల్లించేందుకు గడువు: 03–08–2024
⇒ ఆన్‌లైన్‌ దరఖాస్తులు సమర్పించేందుకు గడువు: 03/08/2024
⇒ ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌ నిర్వహణ: 19/09/2024 నుంచి..
⇒ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌: 22/09/2024 నుంచి 

 పరీక్షల నిర్వహణ: 03/10/2024 నుంచి 20/10/2024 వరకు
⇒ ప్రాథమిక ‘కీ’: 04/10/2024 నుంచి
⇒  ‘కీ’పై అభ్యంతరాల స్వీకరణ: 05/10/2024 నుంచి 21/10/2024 వరకు
⇒ ఫైనల్‌ ‘కీ’ విడుదల: 27/10/2024 
⇒టెట్‌ ఫలితాల వెల్లడి: 02/11/2024  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement