
వెంకటేష్‌కు వచ్చిన 125 మార్కుల జాబితా
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష ర్యాంకుల్లో గందరగోళం నెలకొంది. పేపర్–1, పేపర్–2, పేపర్–3 పరీక్షల్లో మీడియంల వారీగా అత్యధిక మార్కులను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా పేపర్–3 ఇంగ్లిష్‌లో రాష్ట్ర వ్యాప్తంగా 122 మార్కులే టాప్‌గా ప్రభుత్వం ప్రకటించింది. ఇదే విషయాన్ని మంగళవారం పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. కాగా అనంతపురం నగరంలోని తేజ కోచింగ్ సెంటర్ విద్యార్థి అంకే వెంకటేష్ పేపర్–3 ఇంగ్లిష్‌లో 125 మార్కులు సాధించాడు. ప్రభుత్వం మాత్రం ఈ పరీక్షలో 122 మార్కులే అధికమని ప్రకటించిందని, తాను 125 మార్కులు సాధించానని వెంకటేష్ పేర్కొన్నారు. టెట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచీ ప్రతి అంశంలోనూ గందరగోళమేనని అభ్యర్థులు వాపోయారు. చివరకు ఫలితాలు వచ్చిన తర్వాత మార్కుల ప్రకటించడంలోనూ అదే గందరగోళం నెలకొందని అభ్యర్థులు మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment