సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం ప్రకటన చేశారు. మే 4న టెట్, జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్లను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీ పరీక్షలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసకమిషన్ ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా నిర్వహిస్తుందని చెప్పారు.
ఆరు కేటగిరీల్లో(ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీఈటీ, ఎల్‌పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెట్, డీఎస్సీల సిలబస్‌ను వారంలోగా వెల్లడిస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ వివరాలు
నోటిఫికేషన్ : 6-7-2018
దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ
హాల్ టికెట్స్ : 15-08-2018
పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు )
ప్రాథమిక కీ : 31-08-2018
అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ
ఫైనల్ కీ :10-09-2018
తుది ఫలితాలు : 15-09-2018
ఖాళీల వివరాలు
ఎస్‌జీటీ - 4,967
ఎస్‌ఏ - 2978
లాంగ్వేజ్ పండిట్స్ - 312
పీఈటీ - 1056
మ్యూజిక్, డాన్స్ - 109
మోడల్ స్కూల్స్ - 929
Comments
Please login to add a commentAdd a comment