ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాస రావు
అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మొత్తం 3,97,957 దరఖాస్తులు వచ్చాయని, ఈ గురువారంతో టెట్ దరఖాస్తు సమర్పణ గడువు ముగిసిందని ఏపీ ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ..పేపర్1కు 1,69.085 మంది, పేపర్ 2ఏ(సోషల్)కు 66,063, పేపర్2ఏ(మ్యాథ్స్,సైన్స్)కు 76,180 మంది, పేపర్ 2ఏ(ఇంగ్లీషు)కు 11,015 మంది, పేపర్ 2ఏ లాంగ్వేజ్ టీచరల్‌కు 59,469 మంది, పేపర్ 2బీకు 16,145 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చామని తెలిపారు.
4 పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించి అభ్యర్థుల మొబైళ్లకు సంక్షిప్త సందేశాలు పంపామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి29 వరకు ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన జిల్లా కేంద్రాన్ని అభ్యర్థులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సదరు జిల్లాల్లో అభ్యర్థులు పరిమితికి మించితే తదుపరి జిల్లా కేంద్రం ఎంపిక చేసుకునే వీలు కల్పించినట్లు చెప్పారు.ఇంప్రూవ్ మెంట్ కోసం ఇంతకుముందు టెట్ ఉత్తీర్ణులైన వారు అత్యధికంగా తిరిగి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment