Ganta Srinivasa rao
-
గంటా దొంగ లెక్కలు ఒక భార్య.. రెండు పాన్ కార్డుల కథ
-
లోకేష్ పాక్కుంటూ పాదయాత్ర చేసినా వృథా: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ సీపీలోకి ఎవరైనా రావొచ్చని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సుపరిపాలన, పార్టీ సిద్ధాంతాలు నచ్చిన వారిని ఆహ్వానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అయితే పార్టీలో పదవులో, మరొకటో ఆశించి చేరవద్దని హితవు పలికారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు త్వరలో వైఎస్సార్ సీపీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలపై మంత్రి స్పందించారు. శనివారం జేడ్పీ సమావేశం ముగిశాక తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పై విధంగా వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్ర ఎందుకు చేయాలనుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డిలు చేసిన పాదయాత్రలకు అర్థం ఉందన్నారు. అప్పట్లో రాష్ట్రంలో అవినీతి పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని, ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాలు తెలుసుకోవాలని వారు పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ల తర్వాత కూడా ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి తలెత్తుకు తిరుగుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎంతో సంతృప్తిగా ఉన్న ప్రజలు తమను సాదరంగా ఆహా్వనిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పే ధైర్యం ఆ పార్టీ నాయకులకు లేదని విమర్శించారు. లోకేష్ 4 వేల కిలోమీటర్లు కాదు.. 40 వేల కిలోమీటర్లు పాక్కుంటూ పాదయాత్ర చేసినా టీడీపీని అధికారంలోకి తీసుకురాలేరన్నారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో మళ్లీ బిల్లు ప్రవేశపెడతామని, త్వరలోనే సీఎం వైఎస్ జగన్ విశాఖ నుంచి పరిపాలన సాగిస్తారని అమర్నాథ్ చెప్పారు. -
నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో టీడీపీ పెద్దల మరో భూబాగోతం బట్టబయలైంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన 1,110 ఎకరాల అసైన్డ్, లంక భూములను కొల్లగొట్టిన వ్యవహారం వెలుగు చూసింది. చంద్రబాబు సర్కారు అక్రమాల చిట్టాను సీఐడీ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారు. అసైన్డ్ భూముల దోపిడీ వ్యవహారంపై దుగ్గిరాలకు చెందిన వై.ప్రసాద్‌కుమార్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి చేపట్టిన దర్యాప్తులో మొత్తం అక్రమాల బండారం బయటపడింది. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను కాజేయడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, బినామీగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణే కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నారాయణ తన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట 169.27 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టినట్లు తేలింది. ఇందులో నారాయణతోపాటు మాజీ మంత్రి గంటా పాత్ర కూడా స్పష్టంగా వెలుగులోకి వస్తోంది. పలు సెక్షన్ల కింద కేసులు.. ఐదుగురి అరెస్టు అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు తాజాగా కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ సిబ్బంది కొల్లి శివరామ్, గట్లెం వెంకటేశ్‌ను రాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి దర్యాప్తు కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ముగ్గురు నిందితులను విశాఖలో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. పరిహారం రాదంటూ ఫలహారం.. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. ప్రధానంగా టీడీపీ పెద్దల కళ్లు అమరావతిలోని 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూములపై పడ్డాయి. అవన్నీ దళితులు, బలహీన వర్గాలకు చెందినవే. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్డీయే కమిషనర్, గుంటూరు కలెక్టర్లతోపాటు పలువురు అధికారులు నారాయణకు వివరించినా ఖాతరు చేయలేదు. వాటిని సొంతం చేసుకునేందుకు పక్కాగా పథకం వేశారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేయించారు. నారాయణ ఆదేశాలతో అధికారులు గ్రామాల్లో పర్యటించి కేవలం పట్టా భూములకే సర్వేలు చేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి సర్వే చేయడం లేదని అధికారులతో ప్రచారం చేయించారు. ఇదే అదనుగా నిరు పేదలైన దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు నారాయణ తన సమీప బంధువైన కేవీపీ అంజని కుమార్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను తాము కొనుగోలు చేస్తామని, లేదంటే అవన్నీ ప్రభుత్వ పరమైపోతాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పేదలను నమ్మించారు. వారిని బెదిరించి అతి తక్కువ ధరకు వాటిని తమపరం చేసుకున్నారు. నారాయణ అందుకోసం రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. ఇటు కాజేసి.. అటు లాగేసి! మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, సన్నిహితుల ద్వారా 89.90 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. రిజిస్ట్రేషన్ చట్టం 22–ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఈ భూములు అమరావతిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం పరిధిలో ఉన్నాయి. నారాయణ వీటిని 84 సేల్ డీడ్ల ద్వారా తన బంధువులు, సన్నిహితులైన ధూళిపాళ్ల వెంకట శివ పానకాలరావు, ఆయన భార్య పద్మావతి, కోడలు డి.సృజన, లక్ష్మిశెట్టి సుజాత, లక్ష్మిశెట్టి సూర్య నారాయణ, అంబటి సీతారాము, లక్కాకుల హరిబాబు, లక్కాకుల పద్మావతి, చిక్కాల విజయ సారథి, పరుచూరి వెంకయ్య భాస్కరరావు, పరుచూరి వి.ప్రభాకరరావు (గంటా బంధువులు), కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, భార్య కొండయ్య విజయ, కొండయ్య వెంకటేశ్ తదితరుల పేర్లతో కొనుగోలు చేశారు. నారాయణ తన బంధువులు, సన్నిహితులైన యాగంటి శ్రీకాంత్, కొల్లి శివరామ్, గుమ్మడి సురేశ్ పేరిట ఏకంగా 72 జీపీఏలు చేసి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఏ.గోపాల్ నిరాకరించారు. ఆయనపై టీడీపీ పెద్దలు ఎంత ఒత్తిడి తెచ్చినా సమ్మతించలేదు. దీంతో అసైన్డ్ భూములపై తాము చేసుకున్న సేల్ డీడ్ల ఆధారంగానే ఆ భూములను నారాయణ బంధువులు హస్తగతం చేసుకున్నారు. అనంతరం ఆ అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించినప్పుడు వాటిని తామే సీఆర్డీయేకు ఇచ్చినట్లుగా చూపించారు. అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య స్థలాలు పొందే జాబితాలో తమ పేర్లు ఉండేలా చేసుకున్నారు. తద్వారా భూసమీకరణ కింద ఇచ్చిన భూములకు ప్రతిగా ఎకరానికి 800 గజాల నివాస స్థలం, వంద గజాల వాణిజ్య స్థలాన్ని రాజధాని ప్రాంతంలో తమకు వచ్చేటట్లు చూసుకున్నారు. వియ్యంకుడితో భూ విందు! అమరావతిలో టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన 1,100 ఎకరాల్లో 169.27 ఎకరాల అసైన్డ్ భూములను మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, సన్నిహితుల పేరిట దక్కించుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అందులో 89.90 ఎకరాలను బంధువుల పేరిట నారాయణ కొల్లగొట్టగా మరో 79.45 ఎకరాలను ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువుల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించి అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూముల్లో మిగిలినవి టీడీపీ ముఖ్యులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్నాయి. వాటిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీఐడీ అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు ► కొల్లి శివరామ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగి) ► గట్లెం వెంకటేశ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగి) ► చిక్కాల విజయ సారథి, విశాఖపట్నం ► బడే ఆంజనేయులు, విశాఖపట్నం ► కొట్టి కృష్ణ దొరబాబు, విశాఖపట్నం గంటా కోటాలో మరో 79.47 ఎకరాలు అమరావతిలో మరో 79.47 ఎకరాల అసైన్డ్ భూములను కూడా నారాయణ తన వియ్యంకుడైన గంటా శ్రీనివాసరావు బంధువులు, సన్నిహితుల ద్వారా దక్కించుకున్నారు. బోరుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నేలపాడు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని వివిధ సర్వే నంబర్లలో 79.47 ఎకరాలను 76 సేల్ డీడ్ల ద్వారా తమపరం చేసుకున్నారు. కొట్టి కృష్ణ దొరబాబు, గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్‌లు వాటిపై జీపీఏ ఒప్పందాలు చేసుకుని ఆ భూములు తమకు చెందినవని చూపారు. దళారీలు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గుమ్మడి సురేశ్, సఫియుల్ రహమాన్, పొట్లూరి జయంత్, ఆల వెంకట సుబ్బయ్య, పిడపర్తి టిటుస్ బాబు, శీలం శ్రీనివాసరావు తదితరులు ఈ అసైన్డ్ భూములను నారాయణ తన బంధుగణం ద్వారా దక్కించుకోవడంలో పాత్ర పోషించారు. కాగా సీఐడీ అధికారులు అరెస్టు చేసిన కొట్టి కృష్ణ దొరబాబు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నమ్మిన బంటు కావడం గమనార్హం. టీడీపీ హయాంలో గంటా మంత్రిగా ఉండగా ఆయన్ను ఆంధ్రా వర్సిటీ దూరవిద్యా కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కాంట్రాక్టు విధానంలో నియమించారు. జాగ్రఫీలో పీహెచ్డీ చేసిన ఆయన ఉద్యోగం పొందిన సమయంలో వర్సిటీలో అలాంటి కోర్సు లేకున్నా అవకాశం కల్పించారు. -
సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో..!
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'రాష్ట్రపతికి కంప్లైంట్ల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టారు. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి భద్రతలు క్షిణించినట్లు అంట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. (40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్కసారి కూడా సొంతంగా!) టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బడికొస్తా పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ.. 'బడికొస్తా పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేసారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్టు రికార్డుల్లో రాసారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది' అని మరో ట్వీట్లో పేర్కొన్నారు. (12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి!) -
అందుకే సస్పెండ్ చేయించుకున్నారు: అవంతి
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చరిత్రాత్మక బిల్లులు తీసుకువచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. సచివాలయ మీడియా సమావేశంలో బుధవారం మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్ తీసుకువచ్చిన బిల్లులను చూసి సహించలేక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాకౌట్ చేశారని విమర్శించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కావాలనే సస్పెండ్ చేయించుకున్నారని, ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆధారాలతో సహా బయటపడటంతో టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడలేక సస్పెండ్ చేయించుకున్నారని పేర్కొన్నారు. 9 మంది ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పారు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టాలనుకోవడం సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం అని హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర వెనుకబడిందని, చంద్రబాబు బినామీలు కొన్న భూముల ధరలు పడిపోతాయని బాధపడుతున్నాడని అన్నారు. అప్పట్లో చంద్రబాబు భూములు బలవంతంగా లాక్కుంటున్నాడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆందోళన చేశాడని, ఇప్పుడు చంద్రబాబు తాన అంటే పవన్ తందాన అంటున్నాడని మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇక గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు అవకాశవాదులని, పదవి కోసం తమ పార్టీలోకి రావాలనుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు అబద్దాలు చెప్పకపోతే బ్రతకలేడని, గంటా శ్రీనివాసరావు అధికారం లేకపోతే బ్రతకలేడని విమర్శించారు. చంద్రబాబు ఒకసారి కులాన్ని.. మరోసారి ప్రాంతాన్ని రాజకీయాల కోసం ఉపయోగిస్తారని మండిపడ్డారు. సీఎం జగన్ ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదు.. అలాగే అనుకూలం కూడా కాదని మంత్రి పేర్కొన్నారు. -
పరిపాలనా రాజధానిగా విశాఖ సరైన నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా అయ్యే అవకాశాలున్నాయంటూ శాసనసభలో సీఎం వైఎస్ జగన్ ప్రకటనను స్వాగతిస్తున్నానని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తన అధికార ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. అధికారిక వికేంద్రీకరణలో భాగంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖ కావొచ్చన్న సీఎం నిర్ణయం మంచిదన్నారు. సముద్ర తీర ప్రాంతమైన విశాఖను పరిపాలనా రాజధాని చేయడం సరైనదేనని ఆయన అభిప్రాయపడ్డారు. రోడ్డు, రైలు, విమానయానం, జల రవాణాతో అనుసంధానమైన విశాఖ నగరం పరిపాలనా రాజధానిగా మారితే.. విశ్వనగరంగా, రాష్ట్ర ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల్ని నెరవేర్చే సిటీగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రణాళిక అడిగితే జారుకుంది సింగపూర్ కంపెనీ తీరుపై అసెంబ్లీలో మంత్రి బొత్స సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం వెనుక భారీ అవినీతి దాగుందని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. రాజధాని నిర్మాణ ప్రణాళిక లక్ష్యాలను ఎలా సాధిస్తారని తమ ప్రభుత్వం అడిగితే సింగపూర్ కంపెనీ సమ్మతించలేదని ఆయన తెలిపారు. రాజధాని అంశంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఎంఓయూ లక్ష్యాలను ఎలా సాధిస్తారో వివరిస్తే తాము ఒప్పందంపై ముందుకు వెళ్తామని ఆ కంపెనీతో చెప్పినప్పటికీ వారు మాత్రం తమ ప్రణాళికను వెల్లడించలేదన్నారు. పైగా.. ఆ కంపెనీయే స్వయంగా పరస్పర అంగీకారంతో విడిపోదామని చెప్పిందన్నారు. ఇంతవరకు అయిన ఖర్చును దామాషా ప్రకారం భరించడానికి ఒక అంగీకారానికి వచ్చామని చెప్పారు. ఉత్తరాంధ్ర వివక్షకు గురైంది స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన సాక్షి, అమరావతి : అభివృద్ధిలో శ్రీకాకుళం జిల్లా వివక్షకు గురైందన్న ఆవేదన తనకూ ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. విభజన చట్టంలో పేర్కొన్న 23 సంస్థల్లో ఒక్కటి కూడా శ్రీకాకుళం జిల్లాకు కేటాయించకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజధాని అంశంపై మంగళవారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుంటూ.. తాను శాసన సభాపతిగా కాకుండా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేగా తన అభిప్రాయం చెబుతున్నానన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయకపోతే ప్రజల్లో అసంతృప్తిని అరికట్టలేమన్నారు. అభివృద్ధికి కీలకమైన పోర్టు, ఎయిర్, రోడ్ కనెక్టివిటీ ఉన్న విశాఖపట్నం కంటే మెరుగైన కనెక్టివిటీ ఉన్న నగరం రాష్ట్రంలో ఏముందని ప్రశ్నించారు. అమరావతిలో దళితులకు అన్యాయం ఎమ్మెల్యే సుధాకర్‌బాబు సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో కూడా చంద్రబాబు అంటరానితనాన్ని పాటించారని వైఎస్సార్సీపీ సభ్యుడు సుధాకర్‌బాబు మండిపడ్డారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. అమరావతికి భూములు ఇచ్చిన వారిలో అగ్రకులాల వారికి స్థలాలు ఒక చోట కేటాయించి దళితులకు వేరేచోట కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ దళితులకు ద్రోహం చేసిందని.. దళితులకు స్థానంలేని రాజధాని నిర్మించాలని చంద్రబాబు భావించారని దుయ్యబట్టారు. విశాఖను చంద్రబాబు విస్మరించారు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సాక్షి, అమరావతి : హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చెందగల విశాఖపట్నంను చంద్రబాబు ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చేయాలన్న తమ వాదనను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. దక్షిణాఫ్రికా మాదిరిగా వికేంద్రీకరిస్తూ బహుళ రాజధానుల విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. -
ఏపీలో టీడీపీ ఖాళీ; మేమే ప్రత్యామ్నాయం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుందని బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఎంత తిరిగినా ఇదే జరుగుతుందని, ప్రజలు ఆయనను నమ్మరని అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరతారని చెప్పారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే బీజేపీకి ప్రాతినిథ్యం ఖాయమని, అసెంబ్లీలో బీజేపీకి మంచి స్థాయి వస్తుందని దీమా వ్యక్తం చేశారు. టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావును కలిసినట్టు ఆయన వెల్లడించారు. ఇద్దరు రాజకీయ నేతలు కలిస్తే ఏయే అంశాలు చర్చకు వస్తాయో అవే తమ మధ్య చర్చకు వచ్చినట్టు తెలిపారు. తమ అధిష్టానంతో కూడా గంటా చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. తమ పార్టీలో ఎవరైనా చేరవచ్చని, ఇది నిరంతర ప్రకియ అని పేర్కొన్నారు. ‘అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఏపీలో కూడా చాలా మంది నాయకులు మా పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రంలో 2024 నాటికి బీజేపీయే ఏకైక ప్రత్యామ్నాయం. తెలుగుదేశం పార్టీ కచ్చితంగా ఖాళీ అవుతుంది. చంద్రబాబు మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీడియా ఎంతో ప్రయత్నం చేస్తోందని, కానీ ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదు. చంద్రబాబు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. ఆ 23 సీట్ల కోసం ఇక కష్టపడకండి. మీ ఎమ్మెల్యేలందరినీ మేం తీసుకుంటాం. సహకరించండి’ అంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. చంద్రబాబు కూడా చేరతారేమో చూద్దాం అంటూ హాస్యమాడారు. కాగా, గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కమలం పార్టీలో చేరేందుకు తాను పావులు కదుపుతున్నట్టు వచ్చిన వార్తలను గంటా ఖండించకపోవడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు వ్యాఖ్యలు రాకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీజేపీలో గంటా శ్రీనివాసరావు చేరడం ఖాయమని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు. ఎప్పుడు, ఎక్కడ, ఎవరి సమక్షంలో చేరతారో నిర్ణయించుకోవాల్సింది ఆయనే అని వీర్రాజు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు, మాజీ మంత్రులు బీజేపీలోకి వెళ్లడంతో గంటా చేరిక కూడా లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
గంటా ఎప్పుడైనా ప్రజలకు సేవా చేశావా?
సాక్షి, విశాఖపట్నం : మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేతపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ హయాంలో వైఎస్సార్ సీపీ కుటుంబాలను ఇబ్బందులు పెట్టారని, చోడవరం, భీమిలి, అనకాపల్లి ప్రజలను వంచించిన ఘనత గంటాదని మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గంటా తప్పుడు రాజకీయాలకు శిక్షపడే సమయం దగ్గర పడిందని ఆయన అన్నారు. ఆయన ఎప్పుడైనా ప్రజలకు సేవ చేశారా అంటూ సూటిగా ప్రశ్నలు సంధించారు. వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు శ్రీనివాస్ వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి అవంతి శ్రీనివాసరావును విమర్శించే హక్కు ఎమ్మెల్యే గంటాకు లేదన్నారు. వైఎస్సార్ సీపీ విధానాలకు అనుగుణంగా అవంతి నిజాయితీగా పని చేస్తున్నారన్నారు. ఎన్నికలకో పార్టీ, నియోజకవర్గం మారే గంటాను జనం నమ్మే స్థితిలో లేరన్నారు. భీమిలీలో జనం తిప్పికొట్టడంతో ఉత్తర నియోజకవర్గానికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడ మూడు నెలలుగా కనిపించడం లేదని జనాలు ఆగ్రహంతో ఉన్నారని , విశాఖలో కార్పొరేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకున్న వ్యక్తి గంటా అని మండిపడ్డారు. -
టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
-
‘గంటా’.. ‘గణ’గణమనలేదు!
రాష్ట్రమంతటా చావుదెబ్బతిన్నా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయంతో చచ్చీచెడీ గెలిచిన నగర టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. ఐదేళ్లపాటు నగరంలో పార్టీని నడిపించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌కు ముందుగానే పార్టీ బాధ్యతల నుంచి తీసిపారేశారు. దాంతో అలిగిన వాసుపల్లి పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టనని భీష్మించుకున్నా పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గణబాబుల ఆశలపై అధినేత నీళ్లు చల్లేశారు. ఆనవాయితీగా ప్రతిపక్షానికి కేటాయించే అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని వీరిద్దరూ ఆశించారు. సీనియారిటీ, కుల సమీకరణలు తదితర లెక్కలు వేసుకొని మరీ కేబినెట్ మంత్రి హోదా కలిగిన ఆ పదవిపై ఆశలు పెంచుకున్నారు.అయితే అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు పీఏసీ చైర్మన్‌గిరీ ఇవ్వాలని నిర్ణయించడం ద్వారా గంటా, గణబాబులకు జెల్లకొట్టారు. సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాఅంతటా ఫ్యాన్ గాలి ఉధృతంగా వీచినా.. అప్పటి జీవీఎంసీ అధికారుల బ్లాక్మెయిల్ రాజకీయంతో విశాఖ నగరంలో మాత్రం టీడీపీ అభ్యర్థులు చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా బయటపడ్డారు. అలా నగరం నాలుగుదిక్కులా టీడీపీ ఎమ్మెల్యేలే ఉండటంతో పార్టీ అధినేత చంద్రబాబు పదవుల కేటాయింపులో వారికి ప్రాధాన్యత ఇస్తారని అందరూ ఆశించారు. ఆ మేరకు ప్రతిపక్ష పార్టీకి కేటాయించే ప్రజా పద్దుల కమిటీ(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ–పీఏసీ) చైర్మన్ పదవిని నగర టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎవరో ఒక్కరికి కట్టబెడతారని భావించారు. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలూ సీనియర్లే. గంటా శ్రీనివాసరావు వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలవగా, పివీజీఆర్ నాయుడు అలియాస్ గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబులు మూడుసార్లు, వాసుపల్లి గణేష్ వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో సహజంగానే వీరిలో ఎవరో ఒకరికి పీఏసీ చైర్మన్ పదవి దక్కుతుందని ఆశించారు. సామాజికవర్గ లెక్కల ప్రకారం వెలగపూడి మొదటి నుంచి ఆ పదవిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. ఇక తనకంటే ఎక్కువ దఫాలు గెలిచిన ఎమ్మెల్యేలు ఉండటంతో వాసుపల్లి గణేష్ కూడా ఏమో వస్తే రావచ్చు.. అన్న ఆశ తప్పించి.. ఆ పోస్టు గురించి పెద్దగా ప్రయత్నించిన దాఖలాల్లేవు. కానీ సుమారు ఎనిమిదేళ్లుగా బుగ్గకారుకు అలవాటు పడిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మూడుసార్లు గెలిచి సీనియర్ ముద్ర వేసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే గణబాబులు మాత్రం ఆ పదవి కోసం తీవ్రంగా పోటీ పడ్డారనే చెప్పాలి. గంటాకు మొండిచెయ్యి సామాజికవర్గ కోణంలో చూసినా.. సీనియర్ల లెక్క చూసినా.. తనకు కచ్చితంగా పీఏసీ చైర్మన్ పదవి వస్తుందని గంటా శ్రీనివాసరావు లెక్కలు వేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందునా.. ఎన్నికలైన కొద్దిరోజుల్లోనే గంటా పార్టీ ఫిరాయించేస్తారని, కమలం గూటికి వెళ్లిపోతారన్న వదంతులు బలంగా వినిపించాయి. ఆయన వ్యక్తిగత పర్యటనలకు శ్రీలంక. అమెరికా వెళ్లిన సందర్భాల్లో గంటా క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టేశారన్న వాదనలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో గంటాను మచ్చిక చేసుకునేందుకు కచ్చితంగా చంద్రబాబు పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెడతారని పార్టీలోని ఓ వర్గం అంచనా వేసింది. ఎన్నికల ముందు కూడా టికెట్ విషయంలో గంటాను చివరి క్షణం వరకు ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు కచ్చితంగా గంటాకు పదవి ఇచ్చి తనదారిలోకి తెచ్చుకుంటారన్న లెక్కలు వేశారు. కాపు సామాజికవర్గ కోణంలో కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో గంటా కంటే సీనియర్లు లేకపోవడంతో ప్రభుత్వపరంగా దక్కే ఒకే ఒక్క పీఏసీ పదవి ఆయనదేనన్న ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే తన రాజకీయాన్ని ప్రదర్శించి గంటాకు ఝలక్ ఇచ్చారు. గణబాబు ఆశలపై నీళ్లు ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ఈసారి చంద్రబాబు కరుణిస్తారని, గతంలో మంత్రి పదవి ఇవ్వని కారణంగా ఇప్పుడైనా బీసీ కోటాలో పీఏసీ పదవి ఇస్తారని గణబాబు ఆశిస్తూ వచ్చారు. గంటాకు కాకుంటే తనకే కచ్చితంగా వస్తుందని లెక్కలు వేసుకున్నారు. గంటాను బాబును నమ్మే పరిస్థితి లేదని, తమ నాయకుడికే కీలక పదవి వస్తుందని ఆయన వర్గీయులు కూడా బలంగా నమ్ముతూ వచ్చారు. కానీ చంద్రబాబునాయుడు విశాఖ ఎమ్మెల్యేలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోకుండా అనంతపురం జిల్లాకు చెందిన పయ్యావుల కేశవ్‌కు పీఏసీ పదవి కట్టబెట్టేశారు. దీంతో విశాఖ టీడీపీ శ్రేణులు, ప్రత్యేకించి గంటా, గణబాబు వర్గీయులు నైరాశ్యంలో మునిగిపోయారు. -
కేశవ్‌కు పదవి; టీడీపీలో అసంతృప్తి!
సాక్షి, అమరావతి: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్‌గా అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించడంపై సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్టు వెల్లడవుతోంది. చంద్రబాబు నిర్ణయంపై అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. శాసనసభలో తమను వాడుకుని కీలక పదవిని మాత్రం కేశవ్‌కు కట్టబెట్టడంపై వీరంతా సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబు నిర్ణయంతో వెంటనే కేశవ్ బుధవారం అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించడం సంప్రదాయంగా వస్తోంది. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కేశవ్, గంటా శ్రీనివాసరావు, అనగాని సత్యప్రసాద్, గద్దె రామ్మోహన్, గణబాబు తదితరులు ఈ పదవి ఆశించినా చంద్రబాబు కేశవ్‌వైపే మొగ్గు చూపారు. కేశవ్‌తో పాటు గంటా శ్రీనివాసరావు పేరును పరిశీలించారు. కానీ గంటా పార్టీ మారతారనే ప్రచారం నేపథ్యంలో కేశవ్‌ను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు. కేశవ్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడంతో బీసీ లేదా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఉంటుందని తొలుత ప్రచారం సాగింది. కానీ చివరకు చంద్రబాబు కేశవ్ పేరునే ఈ పదవికి ఖరారు చేశారు. -
టీడీపీ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేతగా నారా చంద్రబాబునాయుడు ఎన్నికయ్యారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్నారు. టీడీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో ఒకరు గైర్హాజరు కాగా మిగిలిన 21 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత తాను కాకుండా వేరే వారిని శాసనసభపక్ష నేతగా ఎంపిక చేయాలని భావించిన చంద్రబాబు చివరికి మనసు మార్చుకుని ప్రతిపక్ష నేత బాధ్యత స్వీకరించేందుకు సిద్ధమయ్యారు. శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న తర్వాత ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో కాలంతో పరుగెత్తి అనేక పనులు చేశామని చెప్పారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అనేక కార్యక్రమాలు చేశామని అయినా ప్రజాతీర్పు భిన్నంగా వచ్చిందన్నారు. అయినా 39.2 శాతం ఓట్లు రాబట్టామని తెలిపారు. ఏదైనా కొంతకాలం వేచిచూద్దామని, కొత్త ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దామని పార్టీ నేతలకు చెప్పారు. అన్నింటినీ నిశితంగా పరిశీలించి.. తర్వాతే స్పందిద్దామని చెప్పారు. టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో తమ వాణిని బలంగా వినిపించాలన్నారు. ఆయా నియోజకవర్గాల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించి, సకాలంలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ప్రతి ప్రాంతంలో ప్రజలతో నాయకులంతా మమేకం కావాలన్నారు. ఎక్కడా పార్టీపైన, ప్రభుత్వంపైన ప్రజల్లో వ్యతిరేకత లేదని, జగన్మోహన్రెడ్డిపై సానుభూతి ఉండడం వల్లే గెలిచారని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులపై ప్రజల్లో భిన్నాభిప్రాయం ఉందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందామని, అన్నివర్గాల ప్రజల మద్దతు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఓటమికి కారణాలేమిటని చంద్రబాబు అందరినీ ప్రశ్నించారు. ఒక్క ఛాన్స్ ఇవ్వాలనే జగన్ నినాదం బాగా పనిచేసిందని మెజారిటీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఓటమిపై పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాల్సివుందని, ఇందుకోసం కొద్దిరోజుల్లో మళ్లీ సమావేశమవుదాని చంద్రబాబు తెలిపారు. జగన్ ప్రమాణ స్వీకారానికి ప్రతినిధి బృందం ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా వైఎస్ జగన్ ఆహ్వానించిన నేపథ్యంలో వెళ్లాలా వద్దా అనే దానిపై సమావేశంలో చర్చించారు. ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళితే ఇబ్బందిగా ఉంటుందని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ తరఫున ప్రతినిధి బృందాన్ని పంపించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు వెళ్లి జగన్‌కు తన తరఫున శుభాకాంక్షలు తెలపాలని, తొలుత ఆయన ఇంటికి వెళ్లి తాను శుభాకాంక్షలు తెలుపుతూ రాసిన లేఖ ఇవ్వాలని సూచించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయం నుంచే కొద్దికాలం పనిచేయాల్సి ఉందని చంద్రబాబు చెప్పగా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గుంటూరు పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో ఉండదని, విజయవాడ అయితేనే బాగుంటుందని చెప్పారు. దీంతో మంగళగిరిలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ విజయవాడలోనే తాత్కాలికంగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఆ బాధ్యతను విజయవాడ ఎంపీ కేశినేని నానికి అప్పగించారు. కాగా శాసనసభాపక్ష సమావేశానికి విశాఖపట్నం వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు గైర్హాజరయ్యారు. పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ శాసనసభాపక్ష సమావేశం తర్వాత ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయదేవ్ నియమిస్తున్నట్లు చెప్పారు. లోక్‌సభలో టీడీపీ పక్ష నేతగా కింజరాపు రామ్మోహన్నాయుడు, రాజ్యసభలో టీడీపీ పక్ష నేతగా సుజనా చౌదరి ఉంటారని తెలిపారు. -
గంటా శ్రీనివాసరావు గెలిచే అవకాశం లేదు..
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఓటమి తప్పదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు. గంటా 25 ఏళ్ల రాజకీయ జీవితానికి నియోజకవర్గ ప్రజలు స్వస్తి చెప్పనున్నారని అన్నారు. సోమవారం విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానంలో బీజేపీ తరఫున పోటీ చేసిన తాను, లేక వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని, మంత్రి గంటా మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఏపీలో బీజేపీకి లోక్‌సభ సీట్లు గెలిచే అవకాశం లేదన్నారు. మూడు అసెంబ్లీ సీట్లలో గట్టిపోటీ ఇచ్చామని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచే అవకాశం ఉందని మీడియా ప్రశ్నించగా.. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్ సీపీ కోట్లాది రూపాయాల డబ్బు ఖర్చు చేశాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేశాయని విమర్శించారు. కేంద్రంలో ఇక నుంచి నరేంద్ర మోదీ వ్యతిరేక ఆటల సాగవని అన్నారు. ఎవరి సహాయ సహకారాలు లేకుండానే బీజేపీ 280 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమితో కలిపితే ఎవరూ ఊహించని ఫలితాలు రానున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసే ప్రయత్నాలన్నీ వృధా అవుతాయని అన్నారు. బీజేపీకి పార్లమెంట్ సీట్లు ఎక్కువ వస్తున్నాయని చాలామంది బాధపడేవారు ఎక్కువయ్యారని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి వచ్చి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయడం రెండు రోజుల ముచ్చటలా ఉందని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీకి 20 సీట్లు వస్తాయని అన్నారు. తమ దగ్గర ఉన్న పక్కా సమాచారంతోనే చెబుతున్నామని విష్ణుకుమార్ రాజు తెలిపారు. -
సర్కారు వేధింపు.. టీచర్లపై కక్ష సాధింపు!
విజయనగరం అర్బన్: అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న అనుమానంతో ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపుల పర్వానికి తెరలేపింది. రెండేళ్ల క్రితం చేపట్టిన నిరసనలకు సంబంధించిన కేసు సమసిపోయిందనుకున్న తరుణంలో 15 మంది ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులకు శుక్రవారం రాత్రి పోలీస్ యంత్రాంగం కోర్టు సమన్లు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ విభాగం నుంచి సేకరించిన నివేదికల ఆధారంగా అనుమానం ఉన్న వర్గాలపై వివిధ రూపాల్లో కొద్దిరోజులుగా వేధింపులు మొదలయ్యాయి. పోస్టల్ ఓటింగ్ భారీగా పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసుంటారని జిల్లావ్యాప్తంగా ప్రచారం సాగింది. ఇంటెలిజెన్స్ విభాగం కూడా ప్రభుత్వానికి అదే నివేదిక ఇచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇంకా కొందరు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాల్సి ఉన్నందున పాత కేసులను తిరగదోడితే వారు జాగ్రత్త పడే అవకాశం ఉందని భావించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2017నాటి కేసులో సమన్లు వెబ్ బదిలీ విధానాన్ని మానుకుని పాత విధానాన్నే అమలు చేయాలన్న డిమాండ్‌తో ఫ్యాప్టో, జాక్టో రాష్ట్ర కమిటీల రాష్ట్రవ్యాప్త పిలుపుతో 2017 జూన్ 21న జిల్లాలోని ఉపాధ్యాయులు కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఉపాధ్యాయుల తాకిడికి కలెక్టరేట్ ప్రధాన గేటు విరిగిపోయింది. కానీ రెండురోజుల తరువాత జిల్లా ఇన్చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు 15 మంది నాయకులపై కేసు పెట్టారు. కేసులను వెనక్కి తీసుకోవడానికి కలెక్టర్ వివేక్‌యాదవ్ చూపిన చొరవ ఫలించింది. ఆయన ఆదేశాల మేరకు గేట్లను ఉపాధ్యాయులే మరమ్మతు చేయించారు. దీంతో కేసు ముగిసిందని ఉపాధ్యాయులు భావించారు. కానీ.. వారందరికీ రెండేళ్ల తరువాత శుక్రవారం సమన్లు రావడం చర్చనీయాంశమైంది. కలెక్టర్, ఎస్పీలను కలిసిన ప్రతినిధులు కోర్టు సమన్లు అందుకున్న 15 మంది ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్, జిల్లా ఎస్పీ దామోదర్‌ను శనివారం కలిశారు. అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు గేటు మరమ్మతు చేయించేశామనీ, ఇప్పుడు మళ్లీ సమన్లు ఎందుకొచ్చాయో తెలియడం లేదని చెప్పారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కె.శేషగిరి, టి.సన్యాసిరావు, డి.ఈశ్వరరావు, కె.శ్రీనివాసన్ తదితరులు ఉన్నారు. కేవలం కక్ష సాధింపుతోనే పాత కేసులు తిరిగి తెరిచారని ఉపాధ్యాయ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
గంట శ్రీనివాస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన
-
‘మోదీ కోసం.. బాబు జీరో అయ్యారు’
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు నాయుడుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శల వర్షం కురిపించారు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. పోలవరం, అమరావతి సందర్శన యాత్రల పేరుతో కోట్లు ఖర్చుపెడుతూ చంద్రబాబు మతి, గతీ లేనట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీని ఎలాగైనా దెబ్బకొట్టాలని బాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఆ క్రమంలోనే జీరోగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. విశాఖను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత బీజేపీదేనని అన్నారు. విద్యా, వ్యవసాయం, సంక్షేమం, బెల్ట్‌షాప్‌లు తొలగించడం వంటి మేనిఫెస్టోతో బీజేపీ ప్రచారంలోకి రాబోతోందని వివరించారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవడం గంటాకు అలవాటని చురకలంటించారు. ఏ పార్టీ మారతారో చూడాలి.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న విష్ణుకుమార్‌రాజు మంత్రి గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక కుంభకోణాలు, దోపిడీలు చేసింది శ్రీనివాసరావేనని ఆరోపించారు. గంటా చరిత్ర చూస్తే.. అధికారం మారినప్పుడల్లా పార్టీ మారే వ్యక్తి అని విమర్శించారు. ‘25వ తేదీ వరకు సమయం ఉంది. గంటా మళ్లీ ఏ పార్టీ మారతారో చూడాలి. విశాఖ నార్త్‌లో పోటీ రెండు పార్టీల మధ్య కాదు. నీతి, నిజాయితీకి, అవినీతి పరుడైన గంటా శ్రీనివాసరావు మధ్య జరుగుతుంది’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు రాష్ట్రంలో పరిపాలనపై కంట్రోల్ పోయిందని విమర్శించారు. -
ఇక ‘ఉత్త’ర గంట
అనకాపల్లి.. చోడవరం.. భీమిలి.. ఇప్పుడు విశాఖ ఉత్తరం..పిల్లి పిల్లలను మార్చిన చందంగా ప్రతి ఎన్నికలకు నియోజకవర్గం మారుస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారికి విశాఖ ఉత్తర నియోజకవర్గం మీద పడ్డారు. ఏ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు పోటీ చేయకుండా.. ఎక్కడా స్థిరం లేకుండా, ఒకే రాజకీయ పార్టీలోనూ లేకుండా ఎన్నికలకో సెగ్మెంట్ మారుస్తున్న గంటా శ్రీనివాసరావు అడ్డగోలు సంపాదన, స్థిర, చరాస్తులను కూడబెట్టడంలో మాత్రం ఏకరీతినే దూసుకుపోయారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం :ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా ఏమాత్రం పట్టించుకోని, లెక్క చేయని గంటా నిర్వాకానికి ఆయన ‘ఇళ్లే’ ఓ ఉదాహరణ. గంటా విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీలో ఉంటున్న బహుళ అంతస్తుల భవంతిని ఇండియన్ బ్యాంకు ఇప్పటికే వేలం ప్రకటన వేస్తే.. ఆయన భీమిలిలో సముద్రతీరంలో కట్టుకున్న ఇల్లు ఓ వివాదాస్పద నిర్మాణం. సీఆర్‌జెడ్ నిబంధనలకు విరుద్ధంగా బీచ్ ఒడ్డున సొంతిల్లు కట్టుకున్నారన్న అపవాదు ఎదుర్కొన్నారు. ఇలా.. ఇళ్లతోనే మొదలైన ఆయన దోపిడీ పర్వానికి మొత్తం లెక్క కడితే కోట్లాది రూపాయలు ఉంటుందని టీడీపీ నేతలే అంచనా వేస్తున్నారు. ఐదేళ్లుగా గంటా గ్యాంగ్ భీమిలిలో సాగించిన భూదందాలతో మళ్లీ అక్కడ ముఖం చూపించలేని పరిస్థితి తెచ్చుకున్నారు. ఈలోగా అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి భీమిలి సమన్వయకర్త కాగానే గంటా అక్కడి నుంచి పరుగు అందుకున్నారు. సీఎం కుమారుడు లోకేష్ పేరు బూచిగా చూపించి ముందు భీమిలి నుంచి బయటపడ్డారు. ఇదే సమయంలో గంటాను విశాఖ ఎంపీగా పోటీ చేయించాలని బాబు తలపోస్తే.. బాలకృష్ణ చిన్నల్లుడు భరత్‌ను తెరపైకి తెచ్చి ఆ పోటీ నుంచి కూడా తప్పుకున్నారు. భీమిలికి లోకేష్ రాలేదు.. ఇటు లోక్‌సభ సీటు ఇప్పటికీ భరత్‌కు ఖరారు చేయలేదు. కానీ గంటా మాత్రం వ్యూహాత్మకంగా గత ఎన్నికల్లో బీజేపీకి కేటాయించిన విశాఖ ఉత్తర సీటును దక్కించుకున్నారు. ఎలాగోలా భీమిలి నుంచి బయటపడి టికెట్ అయితే తెచ్చుకున్నారు గానీ.. అప్పుడే ఉత్తర నియోజకవర్గ ప్రజలు గంటా భారం మాకొద్దు బాబోయ్ అంటున్నారు. ఎక్కడ ఎమ్మెల్యేగా చేసినా.. అక్కడ దోపిడీకి పాల్పడే గంటాను ఈ సారి ‘ఉత్త’చేతులతోనే పంపించేస్తామని ఉత్తర నియోజకవర్గ ప్రజలు ఘంటా బజాయించి మరీ చెబుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి బతకుదెరువు కోసం విశాఖ వలస వచ్చి ఓ దినపత్రికలో యాడ్ ఎగ్జిక్యూటివ్‌గా జీవితంలో ఆదాయ ప్రస్థానం మొదలుపెట్టిన గంటా ఆ తర్వాత షిప్పింగ్ రంగంలో వ్యాపారవేత్తగా ఎదిగారు. 1999లో అనూహ్య రీతిలో టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా, ఆ తర్వాత 2004లో చోడవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా, 2009లో ప్రజారాజ్యం తరఫున అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా, 2014లో భీమిలి నుంచి తిరిగి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవానికి 1999లో ప్రజాప్రతినిధిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన గంటాపై మొదట్లో పెద్దగా అవినీతి, అక్రమార్జన ఆరోపణలేమీ లేవు. కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమైన పరిణామాల నేపథ్యంలో 2011లో తొలిసారి మంత్రి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి క్రమక్రమంగా ఆరోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరడం.. గంటాకు మళ్లీ మంత్రి పదవి రావడం దరిమిలా.. మొదలైన అవినీతి, అక్రమార్జన పర్వం, దోపిడీ స్థాయి పరాకాష్టకు చేరిపోయింది. -
అందుబాటులో లేకుండా పోయిన ఏపీ మంత్రి..!
సాక్షి, అమరావతి : ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సీటుకు గండం వచ్చింది. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో తన కొడుకు, ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండడంతో ఆయన కంగుతిన్నారు. మరోవైపు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ టీడీపీలో చేరుతున్నారనే వార్తలు గంటాను మరింత కలవరపాటుకు గురిచేశాయి. అయితే లోకేష్ లేదంటే జేడీ కోసం భీమిలీ స్థానాన్ని చంద్రబాబు పరిశీలిస్తున్నారనే ఊహాగానాల నేపథ్యంలో గంటా అలకబూనినట్టు తెలిసింది. (అధిష్టానంపై గంటా, శిద్దా గుర్రు) ఈసారి ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని బాబు చేసిన సూచనను గంటా ఆమోదించడం లేదు. అధిష్టానం బుజ్జగింపుల పర్వానికి దూరంగా ఉండాలనే నేపథ్యంలో గంటా నిన్నటి నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. నిన్న సాయంత్రం అమరావతికి వెళ్తున్నానని చెప్పి హైదరాబాద్ వెళ్లినట్టుగా సమాచారం. అవసరమైతే పార్టీ మారైనా సరే ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని తన సన్నిహితుల వద్ద తేల్చిచెప్పినట్టు తెలిసింది. (గంటాకు ఎసరు?) -
గంటాకు ఎసరు?
సాక్షి, అమరావతి : మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు తనదైన శైలిలో ఎసరు పెట్టారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో తన కొడుకు, ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు పావులు కదుపుతుండడంతో ఆయన కంగుతిన్నారు. ఉండవల్లిలో శుక్రవారం జరిగిన విశాఖ పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో భీమిలి సీటును చంద్రబాబు ఆయనకు ఖరారు చేయలేదు. ఈ స్థానంలో లోకేష్ పోటీ చేస్తారని ఆయన కోసం త్యాగం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కుదిరితే విశాఖపట్నం ఎంపీ లేదా విశాఖ నార్త్, చోడవరం, గాజువాక అసెంబ్లీలో ఒక దాన్ని కేటాయించే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. దీంతో అవాక్కయిన గంటా జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు పలువురికి సీటు ఖరారు చేసి తన సీటును పెండింగ్‌లో పెట్టడంపై అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీటు కేటాయించే విషయంపై చర్చల కోసం శనివారం ఉదయం మళ్లీ రావాలని చంద్రబాబు సూచించినా.. గంటా వెళ్లలేదు. తన మొబైల్‌ను స్విచ్ ఆఫ్ చేసి పార్టీ ముఖ్యులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు లోకేష్ భీమిలిలో పోటీచేస్తే ఆయన తోడల్లుడు భరత్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని చాలా రోజుల నుంచి టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు లోకేష్ పేరు తెరపైకి రావడంతో భరత్ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. -
‘వైఎస్సార్ పాలన కోసమే ఆయన పోరాటం’
సాక్షి, అమరావతి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓట్ల కోసమో.. అధికారం కోసమో పోరాటం చేయటంలేదని, సమాజంలో సుపరిపాలన, స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన తీసుకురావటానికే పోరాడుతున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాయలు, అబద్దాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రానున్న కాలంలో భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయని విధంగా రాష్ట్ర ప్రజల కోసం వైఎస్ జగన్ పరిపాలన చేస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రజల కోసం.. సంక్షేమ రాజ్యం కోసం వైఎస్ జగన్ సీఎం అవ్వాలని స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావు ఓ మంత్రిగా ఉంటూ భీమిలిలో అభివృద్ది చేశారా అని ప్రశ్నించారు. కలెక్టర్ ఆఫీస్‌లో భూ రికార్డులు తారు మారు అవుతున్నాయంటే.. మంత్రి తీరు ఎలా వుందో అర్థం అవుతోంది అంటూ మండిపడ్డారు. 5 ఏళ్లుగా గంటా మంత్రిగా ఉన్నారు, ఏమి చేశారు.. అక్రమాలు, భూ కబ్జాలు తప్ప అంటూ ఆగ్రహం వ్యకం చేశారు. -
దయచేసి మంత్రి గంటా నా జోలికి రావొద్దు..
సాక్షి, విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారి విశాఖ వచ్చిన ఆయనకు శనివారం పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తాను కృతజ్ఞతలు చెప్పుకోవాలని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అని అన్నారు. ఇక నుంచి వైఎస్సార్ సీపీ గెలుపుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. (అవంతి పోకతో మొదలు.. టీడీపీకి చెదలు) ఎవ్వరికీ భయపడను.. విలువల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. నమ్మించి మోసం చేయడం ఆయనకు అలవాటేనని, స్వార్థ రాజకీయాల కోసం తాను పార్టీ మారలేదని అన్నారు. చంద్రబాబును ఎన్నడూ ఎంపీ సీటు అడగలేదని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాను భీమిలీ అసెంబ్లీ సీటు అడిగితే ఎంపీగా ఎందుకు పంపించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే భయపడనని, అలాంటిది చంద్రబాబుకు భయపడతానా అని ప్రశ్నించారు. ప్రతిపక్షం బలాన్ని చూసి భయపడ్డ చంద్రబాబు వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన 23మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకుని, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఎలా ఇచ్చారన్నారు. చంద్రబాబు తనకు రోల్ మోడల్ అని చెప్పుకునే మంత్రి గంటా శ్రీనివాసరావు మాటలు వాస్తవమేనని అవంతి శ్రీనివాస్ అంగీకరించారు. నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబే మంత్రి గంటాకు ఆదర్శమన్నారు. డబ్బుతో ఏదైనా చేయవచ్చని అనుకుంటే పొరపాటేనని, గంటా గురించి తెలియాలంటే మంత్రి అయ్యన్నపాత్రుడిని అడిగితే సరిపోతుందన్నారు. జిల్లా మంత్రిగా ఉన్న ఆయన ఒక్కరోజు కూడా సమన్వయకమిటీ సమావేశాలకు హాజరు కాలేదని, అలాంటిది తనపై ఆరోపణలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. గంటా టార్గెట్ అమరావతిలో సీఎం కుర్చీ.. తనపై పోటీ చేసే వ్యక్తి కూడా బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం తనదని ఆయన... దయచేసి మంత్రి గంటా తన జోలికి రావద్దొని ఇక నుంచి మీ పని మీరు చేసుకోండి...నా పని నేను చేసుకుంటాను అని అవంతి శ్రీనివాస్ హితవు పలికారు. టీడీపీ అధికార ప్రతినిధి అంటే ప్రతిపక్ష పార్టీని తిట్టడమే పని అని ఆయన అన్నారు. గంటా శ్రీనివాసరావు లక్ష్యం భీమిలి అసెంబ్లీ సీటు కాదని, ఏకంగా అమరావతిలో ముఖ్యమంత్రి కుర్చీ అని వ్యాఖ్యానించారు. గంటాను నమ్మి టీడీపీలోకి వెళ్లినవారిలో చింతలపూడి వెంకటరామయ్య, కన్నబాబుకు టికెట్ లేకుండా చేశారని గుర్తు చేశారు. భీమిలి నియోజకవర్గ ప్రజలను మంత్రి గంటా హీనంగా చూస్తారన్నారు. తానంతట తాను టీడీపీలోకి వెళ్లిలేదని, వాళ్లు పిలిస్తేనే వెళ్లానన్న అవంతి శ్రీనివాస్ ...తనకు రెండు లక్షలమంది విద్యార్థుల శక్తి ఉందన్నారు. -
కక్ష సాధింపు!
మధురవాడ(భీమిలి): మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నాయకుల ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో నాయకులు పెత్తనం చెలాయించడం చూశాం. తాజాగా జీవీఎంసీ 4వ వార్డు కొమ్మాది జేఎన్‌ఎన్‌యూఆర్–3 కాలనీలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిందనే నెపంతో జీవీఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో నడిచే ఆర్పీని తొలగిస్తున్నామని టీడీపీ నాయకులు ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. ఇదీ పరిస్థితి వారం రోజుల కిందట కే 3 కాలనీ కమ్యూనిటీ హాలులో డ్వాక్రా మహిళలకు పసుపు– కుంకుమ చెక్కుల పంపిణీకి సమావేశం నిర్వహించారు. దీనికి టీడీపీ 4వ వార్డు అధ్యక్షుడు మన్యాల సోంబాబు, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ ఆర్పీ(రిసోర్స్ పర్శన్) గా పనిచేస్తున్న రేణుకను తొలగించాలని తాము నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఇది సరికాదని... ఆమె బాగా పనిచేస్తున్నా ఎందుకు తొలగిస్తున్నారని అత్యధికులు ప్రశ్నించారు. దీనికి ఆయన ఇది మంత్రి గంటా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయమనిసెలవిచ్చి వెళ్లిపోయారు. పైగా గ్రూపునకు ఇద్దరు చొప్పున ఉండి అంతా బయటకు వెళ్లిపోవాలని చెప్పి కొందరితో సంతకాలు చేయించుకున్నట్టు స్థానిక డ్వాక్రా మహిళలు చెప్పారు. బాగా పనిచేస్తున్న మహిళని రాజకీయం పేరుతో తొలగించడం సరికాదని ఓబీలు యూవీవీ దుర్గా భవానీ, బి. సుగుణ, పి. రామూజీ, ఇ. గౌరి, వి. దేవి తదితరులు వాపోయారు. ఉన్నతాధికారులను ఆశ్రయిస్తా టీడీపీ నాయకుల ప్రకటనపై రేణుక మాట్లాడుతూ ఎనిమిదేళ్ల నుంచి ఇక్కడ ఆర్పీగా జీతం లేకుండా పనిచేశానన్నారు. ఇప్పుడు జీతం వస్తుందని పార్టీ మారానన్న వంక పెట్టి తనను తొలగిస్తున్నట్టు టీడీపీ నాయకుడు సోంబాబు ప్రకటించడం అన్యాయమని పేర్కొన్నారు. కాలనీలో 13 గ్రూపులు ఉండగా 10 గ్రూపులకు చెందిన వారు తానే ఆర్పీగా ఉండాలని కోరుతున్నా ఏకపక్షంగా టీడీపీ నాయకులు తొలగిస్తున్నట్టు చెప్పడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు అన్యాయం జరిగితే ఉన్నతాధికారుల ను ఆశ్రయిస్తానని రేణుకు చెప్పారు. సమాచారం లేదు సాధారణంగా ఆర్పీపై ఆరోపణలు, ఫిర్యాదులు వస్తే విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తాం. అత్యధికులు కోరుకున్నవారే ఆర్పీగా కొనసాగుతారు. తొలగింపు, మార్పు అవసరం అయితే పీడీ గారి ద్వారానే జరుగుతుంది. ఆర్పీ మార్పు విషయమై ఇంత వరకు మాకు సమాచారం లేదు. – లక్ష్మి, జీవీఎంసీ జోన్–1 ఏపీడీ -
ఫిబ్రవరి 27 నుంచి ఏపీ ఇంటర్ పరీక్షలు
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం విశాఖలో విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ప్ర«థమ, 28 నుంచి ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామని చెప్పారు. రాష్ట్రంలో 10,06,449 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతన్నారన్నారు. వీరిలో 5,25,729 మంది ప్రథమ, 4,80,720 మంది ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 1,448 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎథిక్స్ అండ్ హ్యూమన్ వేల్యూస్ పరీక్షలు జనవరి 28న, ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష జనవరి 30న ఉంటుందన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి పాల్గొన్నారు. -
గంటా పర్మిషన్తో నారాయణ విద్యసంస్థల్లో పీజులు బాదుడే బాదుడు
-
ల్యాండ్ పూలింగ్ పేరుతో భూ దంద చేస్తున్నారు
-
వర్సిటీల్లో ‘కమీషన్ల’ సదస్సులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి జిల్లాలో విశ్వవిద్యాలయాల్లో జ్ఞానభేరి సదస్సుల పేరిట ప్రభుత్వం భారీగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. ఈ సదస్సుల ముసుగులో రూ.100 కోట్లకుపైగా కమీషన్లు దండుకోవడానికి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సదస్సుల కోసం ఒక్కో జిల్లాల్లో ఒక్కో యూనివర్సిటీకి రూ.కోటి చొప్పున ఖర్చవుతుందని, ఈ భారాన్ని ఉన్నత విద్యామండలి, ఆయా యూనివర్సిటీలు చెరి సగం భరించాలని ఉన్నత విద్యాశాఖ తొలుత ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి సదస్సుకు ఆ జిల్లాలోని 12 వేల మంది విద్యార్థులను తరలించాలని, వారికి వక్తృత్వం, వ్యాస రచన తదితర పోటీలు నిర్వహించాలని సూచించింది. 10 ఈవెంట్లలో నిర్వహించే ఈ పోటీల్లో గెలుపొందిన మొదటి ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదును అందిస్తారు. ప్రథమ బహుమతి కింద రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేలు, తృతీయ బహుమతిగా రూ.25 వేలు ఇవ్వనున్నారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీలో ఇప్పటికే ఒక సదస్సు నిర్వహించారు. సదస్సుల నిర్వహణకు అయ్యే ఖర్చును వర్సిటీలు విద్యార్థుల నుంచి వసూలు చేసే ఫీజుల నుంచే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రతి జిల్లాకు రూ.10 కోట్లు జ్ఞానభేరి సదస్సు కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి చొప్పున ఖర్చు పెట్టాలని చెబుతూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ వ్యయాన్ని 10 రెట్లు పెంచేసింది. సదస్సు నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు ఇటీవల ప్రకటించారు. ప్రతి జిల్లాలో జ్ఞానభేరి సదస్సుకు ఎంత దుబారాగా ఖర్చు చేసినా రూ.3 కోట్లకు మించి కాదని, ఏకంగా రూ.10 కోట్ల చొప్పున కేటాయించడం దోపిడీకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పది రకాల ఈవెంట్లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద నగదు ప్రోత్సాహకంగా ఇచ్చే మొత్తం రూ.17.50 లక్షలే. ఇతర విద్యార్థులకు కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇస్తారు. పోటీల నిర్వహణ, సదస్సులో పాల్గొనే విద్యార్థులకు, భోజనం, రవాణా, ఇతర సదుపాయలు, వేదిక ఏర్పాటుకు అంతా కలిపి రూ.3 కోట్లకు మించి ఖర్చు కాదని అంచనా. కానీ, ప్రతి జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున 13 జిల్లాలకు రూ.130 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రూ.100 కోట్ల వరకు కమీషన్ల రూపంలో ప్రభుత్వ పెద్దలు తమ జేబుల్లో వేసుకోబోతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు నిధులేవీ? రాష్ట్రంలో వర్సిటీల్లో, వాటి పరిధిలోని కళాశాలల్లో మౌలిక సదుపాయాల్లేక విద్యార్ధులు, అధ్యాపకులు నానా అవస్థలు పడుతున్నారు. గత ఏడాది రూ.380 కోట్లు ఇస్తామని ప్రభుత్వం జీఓ ఇచ్చి నయాపైసా విడుదల చేయలేదు. ఈ బడ్జెట్లో నిధులే లేవు. సదుపాయాల కల్పనకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం జ్ఞానభేరి సదస్సుల పేరిట వ్యక్తిగత ప్రచారం కోసం రూ.వందల కోట్లు ధారపోయడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు. ఎన్నికల ముందు విద్యార్థులను మభ్యపెట్టేందుకే సీఎం సదస్సులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
పేద మహిళల కడుపు కొడతారా?
-
ఎమోషన్స్ చూడకుండా రొమాన్స్‌పై విమర్శలా?
ఆర్ఎక్స్ 100 సినిమా విజయోత్సవం నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరినాలో ఆదివారం రాత్రి ఉత్సాహంగా సాగింది. హీరో హీరోయిన్లు కార్తీకేయరెడ్డి, పాయల్ రాజ్‌పుత్ డ్యాన్స్‌లు చేస్తూ, ఫొటోలకు ఫోజులు ఇస్తూ సందడి చేశారు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): సినిమా సమీక్ష రాసే వారికి తమ సినిమాలోని 140 నిమిషాల ఎమోషన్స్ కనిపించటం లేదు.. కేవలం 6 నిమిషలా రొమాన్స్ మాత్రమే కనిపిస్తోందంటే వాళ్ల్ల ఆలోచన ఎంత తప్పుగా ఉందో అర్థం అవుతోందని ఆర్ఎక్స్ 100 చిత్ర దర్శకుడు అజయ్ భూపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మైండ్‌లో అలాంటివి లేవు కాబట్టి 140 నిమిషాల ఎమోషన్స్‌కు కనెక్ట్ అయ్యారని ఆయన అన్నారు. ఆదివారం వుడా చిల్డ్రన్ ఏరినాలో గౌరీ బాయి అసోసియేట్స్, మూన్ పవర్ ఈవెంట్స్ సంయుక్తంగా ఆర్ఎక్స్ 100 చిత్రం విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అజయ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో పాటలకు యూ ట్యూబ్‌లో కోట్ల వ్యూస్ వస్తున్నాయన్నారు. సినిమాలో రొమాన్స్ ఎందుకు అనేది సినిమా పూర్తిగా చూస్తే అర్థం అవుతుందని అలా కాకుండా నచ్చినట్లు రివ్యూలు రాసి సినిమా పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారన్నారు. సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలను బ్యాన్ చేయాలని మంత్రి గంటాను కోరారు. మెగాస్టార్ చిరంజీవికి మా సినిమా క్యూబ్‌ను పంపించామని ఈ రోజు మా చిత్రాన్ని ఆయన చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు. మంత్రి గంటా మాట్లాడుతూ రివ్యూలను బ్యాన్ చేయాలనే ఆలోచన మంచిదని ముఖ్యమంత్రి తో చర్చించి దాన్ని అమలు చేయటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వంద శాతం సినిమా షూటింగ్ చేసే చిత్రాలకు సబ్సిడీ ఇచ్చే అంశాన్ని చర్చిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రం నిర్మాత అశోక్ రెడ్డి, కో–ప్రొడ్యూసర్లు సురేష్ రెడ్డి, రవి కుమార్‌రెడ్డి, వెంకటరెడ్డి మ్యూజిక్ డెరెక్టర్ చైతన్య భరధ్వజ్, కెమెరామెన్ రామిరెడ్డి, గౌరీబాయి అసోసియేట్స్ అధినేత శివకుమార్, మూన్ పవర్ ఈవెంట్స్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామ్‌చరణ్ నుంచి సునీల్ వరకు అందరూ మెచ్చుకున్నారు ఆర్ఎక్స్ 100 చిత్రం చూసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి హీరో సునీల్ వరకు అందరూ సినిమా బాగుందని మెచ్చుకున్నారని హీరో కార్తీకేయ రెడ్డి అన్నారు. సినిమా పరిశ్రమలో ఎవరిని ఎదగనివ్వరనే ఒక అపోహ ఉంది. కానీ అది నిజం కాదు మాకు ఎవరు అండ లేరు.. మా కథలో దమ్ము ఉంది. మేము కష్టపడి చేశాం మా చిత్రాన్ని చూసి పంపిణీదారులు ముందుకు వచ్చి విడుదల చేశారు. ఇప్పుడు ప్రేక్షకులను అదరిస్తున్నారు. ఇకనైనా రివ్యూలు రాసేవారు కచ్చితంగా రాయాలని లేకుంటే మనివేయటమే మంచిందన్నారు. వైజాగ్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడ తన సినిమా విజయోత్సవం జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆర్ఎక్స్ 100 విజయోత్సవ వేదికపై మాట్లాడుతున్న మంత్రి గంటా తెలుగు సినిమాలే చేయాలని ఉంది ఇప్పటికే పంజాబీ, హిందీ సినిమాలు చేస్తున్నా అక్కడ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులు మంచి కథలను ఆదరిస్తున్నారని అందుకే తెలుగు సినిమాలే చేయాలని తనకు ఉందని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ అన్నారు. మొదటిసారి కథ విన్నప్పుడు ఈ రోల్ నేను చేయగలనా అనిపించింది. ఈ చిత్రంలో తన రోల్ ఛాలెజింగ్ ఉందన్నారు. జిగేలు రాణి పాటకుహీరో హీరోయిన్ల స్టెప్పులు విజయోత్సవంలో మునిగి తేలుతున్న ఆర్ఎక్స్ 100 హీరో కార్తీక్, హీరోయిన్ రాజ్‌పుత్ రంగస్థలంలోని జిగేలు రాణి పాటకు స్టేజ్‌పై డ్యాన్స్ చేసి వేదికను హోరెత్తించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రైల్వే జోన్ సాధన కోసం నిరసన రాత్రి
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించాలన్న డిమాండ్‌తో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన రాత్రి కార్యక్రమం చేపట్టారు. జ్ఞానాపురం వైపు ఉన్న రైల్వే స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు సాగిన ఈ కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైల్వేజోన్ అంశం దాదాపు 30 ఏళ్లుగా నడుస్తోందన్నారు. ఇది ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ అని, బోర్డు చైర్మన్ కూడా ఇది పొలిటికల్ విషయమని తెలియజేశారని గుర్తు చేశారు. వుడా మాజీ చైర్మన్ ఎస్.ఎ.రహమాన్ మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం వచ్చి పోరాడినప్పుడు జోన్ తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గత ఎన్నికల సభలో మోడీ ఎన్నో హామీలు ఇచ్చారని, అందులో రైల్వే జోన్ ఒకటని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు దానిని బీజేపీ నాయకులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఎన్జీవో జిల్లా ప్రెసిడెంట్, నాన్ పొలిటికల్ జేఏసీ కన్వీనర్, కె.ఈశ్వరరావు, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ రక్షణ వేదిక కన్వీనర్ ఎస్.ఎస్.శివశంకర్, వీజేఎఫ్ అధ్యక్షుడు శ్రీనుబాబు, ప్రత్యేక రాష్ట్ర పోరాట సమితి జి.ఎ.నారాయణరావు పాల్గొన్నారు. వేదికపై కూచిపూడి నాట్యం, మిమిక్రీ, మేజిక్‌షో, పేరడీ సాంగ్స్ తదితర పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
భూ కబ్జాలు కేరాఫ్ గంటా
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు టీడీపీ నాయకుడు, మంత్రి గంటా శ్రీనివాసరావు వేసిన 25 ప్రశ్నలకు సమాధానం చెబుతాం .. ముందు మేమడిగిన 25 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని జనసేన ఉత్తరాంధ్ర అధ్యక్షుడు శివశంకర్ ప్రశ్నించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ ఇమేజ్ దెబ్బతీయడానికి కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. వపన్‌పై విమర్శలు చేయడానికి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి నాలుగేళ్ల కాలం పట్టిందా? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పార్టీలు మారే మంత్రి గంటాకు నీతి నిజాయతీ గల పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నించే నైతికత లేదని విరుచుకుపడ్డారు. ఎవరిమీదైనా బురద జల్లడం ఒక్క టీడీపీకే చెందిందన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుపై మీరు మాట్లాడే తీరు నిసిగ్గుగా ఉందన్నారు. ఉత్తరాంధ్రపై మీకు అభిమానం ఉంటే..కేంద్రం విడుదల చేసిన రూ.350 కోట్లు వెనక్కి వెళ్లిపోతే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ను నాలుగేళ్లుగా ముంచిన చంద్రబాబు కానీ, విశాఖ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిన గంటా కానీ జనసేనాను ఏ విధంగా ప్రశ్నిస్తారంటూ నిలదీశారు. భూ కబ్జాలు కేరాఫ్ గంటా విశాఖ రూరల్ మండల పరిధిలోని పరదేశిపాలెం, పోతినమల్లయ్యపాలెం, ఎండాడ, రుషికొండ, చినగదిలి, భీమునిపట్నం ప్రాంతాల్లో భూ కబ్జాలకు గంటా కేరాఫ్‌గా నిలిచారన్నారు. మాజీ సైనిక ఉద్యోగులను బెదిరించి భూములను చౌకగా లాక్కున విషయం నిజం కాదా? చివరికి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని కూడా వదలకుండా కబ్జాలు చేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ బంధువు షాడో మంత్రిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో కూడా జోక్యం చేసుకోవడం నిజం కాదా? తహసీల్దార్ డిజిటల్ కీ దుర్వినియోగం చేసి రికార్డులను మాయం చేయించిన మీరు పవన్‌కు ప్రశ్నలు సంధించే అర్హత లేదన్నారు. మీ సహచర మంత్రి అయ్యన్నపాత్రుడు స్వయంగా విశాఖలో 6వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ఒప్పుకోవడం వాస్తవం కాదా? పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ విషయంలో మీ వియ్యంకుడు నారాయణకు మీరు సహకరించలేదా? బీఈడీ, ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టుల విషయంలో మీ భార్య, ఆమె సోదరుడు సుమారు 900 మంది నుంచి లక్షలు వసూళ్లు చేయడం నిజం కాదా? కోరుకున్న చోటకే పోస్టింగ్ కోసం లక్షలు లంచాలు తీసుకోవడం నిజం కాదా? అని నిలదీశారు. హోదాపై పోరాటంలో ఎవరికి చిత్తశుద్ధి ఉందో బహిరంగ చర్చకు సిద్ధమా? అని శివశంకర్ సవాల్ విసిరారు. -
నగరానికే అన్న క్యాంటీన్లు
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటైన అన్న క్యాంటీన్లను ఎట్టకేలకు ప్రారంభించారు. జీవీఎంసీ పరిధిలో 25 క్యాంటీన్లు మంజూరు కాగా.. తొలివిడతలో 13 క్యాంటీన్లకు శ్రీకారం చుట్టారు. గ్రామీణ జిల్లాలో ఒక్కటి ఏర్పాటు చేయలేదు. అర్బన్ ప్రాంతాల్లోనే క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ప్రభుత్వం.. గ్రామీణ జిల్లాలో పలు అవసరాల నిమిత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రతి రోజు వేలాది మంది వచ్చే నర్సీపట్నం, యలమంచలి, పాయకరావుపేట వంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉన్నప్పటికీ ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. జీవీఎంసీ పరిధిలో చిట్టివలస వద్ద ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. క్యాంటీన్లోనే మంత్రి గంటా, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు భోజనం చేశారు. మిగిలిన ప్రాంతాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ అన్న క్యాంటీన్లను అట్టహాసంగా ప్రారంభించారు. తొలిరోజు ఉచితం.. తొలిరోజు అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా వచ్చిన వారందరికీ ఉచితంగానే అల్పాహారం, భోజనం పెట్టారు. తొలిరోజు దాదాపు క్యాంటీన్లంటినీ 2 గంటలకే క్లోజ్ చేశారు. దీంతో 2 గంటల తర్వాత వచ్చిన వారు భోజనం లభించకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. నగర పరిధిలో విమ్స్, ఎంవీపీ, ఆర్ఈ హెచ్, నమ్మిదొడ్డి, చినగంట్యాడ, శ్రీహరిపురం, ములగాడ, మర్రిపాలెం, చిట్టివలస, అనకాపల్లి ఆస్పత్రి, టర్నర్ చౌల్ట్రీ, ఫ్రూట్ మార్కెట్, వాంబే కాలనీ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. మూడుపూటల నాణ్యమైన ఆహారం.. రూ.15కే మూడుపూటలా నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు మంత్రి గంటా తెలిపారు. చిట్టివలస వద్ద క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రికి భోజనం సదుపాయం కల్పించేందుకు రోజుకు రూ.63వరకూ ఖర్చవుతుందని, ఈ మొత్తం లో ప్రభుత్వం రూ.58 రాయితీగా భరిస్తూ కేవలం రూ.15కే సామాన్యులకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తోందన్నారు. జిల్లాలో ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్‌కు అప్పగించామని చెప్పా రు. ప్రాథమికంగా ప్రతి క్యాంటీన్లో పూటకు 350 మందికి భోజన సదుపాయాలు కల్పించామని, డిమాండ్‌ను బట్టి వెయ్యి మంది వరకూ కల్పిం చేందుకు చర్యలు చేపడతామన్నారు. ఆదివారం మినహా వారానికి ఆరు రోజులు ఈ క్యాంటీన్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. ఉదయం 7.30 నుం చి 10 గంటల వరకూ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకూ, రాత్రి 7.30నుంచి 9 గంటలవరకూ ఈ క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు. ఫేషియల్ రికగ్నేషన్‌ద్వారా ప్రతివ్యక్తికి ఒక టోకెన్ మాత్రమే విక్రయిస్తారని తెలిపా రు. ప్రతి క్యాంటీన్లో ఆర్వో ప్లాంట్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. -
గవర్నర్‌ను కలసిన మంత్రి గంటా
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): శ్రీకాకుళం పర్యటన ముగించుకుని స్వల్ప విరామం కోసం రామ్‌నగర్‌లోని ప్రభుత్వ అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. కొంత సేపు మాట్లాడారు. తొలిత కలెక్టర్ ప్రవీణ్ కుమార్, వుడా వీసీ బసంత్ కుమార్, జేసీ సృజన పుష్పగుచ్చాలతో గవర్నర్‌కు స్వాగతం పలికారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ హైదరాబాదు బయలుదేరి వెళ్ళారు. -
డీఎస్సీ అభ్యర్థులకు బ్యాడ్‌న్యూస్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చేదు వార్త. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ‘ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ‘ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టింది. మరిన్ని వివరాలు కావాలని అడిగింది. వాటికి సమాధానం ఇచ్చాం. త్వరలో అనుమతి రావొచ్చు. బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్సీటీఈ విడుదల చేసిన గెజిట్‌పై కూడా చర్చిస్తున్నాం. టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామ’ని మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. భయపడినట్టుగానే.. ముందునుంచి అనుకుంటున్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ మరోసారి వాయిదా పడింది. జులై 6న 10,351 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అంతకుముందు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయకపోవడంతో నోటిఫికేషన్ వాయిదా వేయాల్సి వచ్చింది. అభ్యర్థుల ఆవేదన ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడిందని అభ్యర్థులు మండిపడుతున్నారు. తమ జీవితాలతో పాలకులు ఆటలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుంటున్నామని, నోటిఫికేషన్ విడుదల చేయకుండా తమను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
పొలిటికల్ కారిడర్ 2nd July 2018
-
పాఠశాలలకు 3 రోజులు సెలవులు
సాక్షి, హైదరాబాద్ : అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం 3 రోజులు సెలవు ప్రకటించింది. జూన్ 19 నుంచి 21 వరకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సోమవారం మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతవరణ శాఖ సూచనల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలు కూడా తప్పని సరిగా సెలువుల ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. -
టెట్ పరీక్షపై స్పందించిన గంటా
సాక్షి, అమరావతి: టెట్ వ్యాయామ పరీక్షపై సామాజిక ప్రసార మాద్యమాల్లో వస్తున్న వార్తలపై మంత్రి గంటా శ్రీనివాస రావు స్పందించారు. టెట్ పరీక్ష పేపర్ లీకులపై వస్తున్న వార్తలను నమ్మకండని, అవన్నీ అవాస్తవాలని తెలిపారు. యధావిధిగా ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే ఈ నెల 19వ తేదీన టెట్ వ్యాయామ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉంటుందని స్పష్టం చేశారు. ఆన్లైన్లో పరీక్షా పశ్నా పత్రం లీకులకు అవకాశమే లేదని గంటా పేర్కొన్నారు. అన్లైన్ సెంటర్లోనూ పరీక్షకు ముందు నిర్ణీత సమయంలో మాత్రమే ప్రశ్నాపత్రం అందుబాటులోకి వస్తుందని గుర్తుచేశారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, ఎలాంటి లోపాలు లేకుండా పరీక్ష పటిష్టంగా నిర్వహిస్తామని తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో సెక్రటరీకి డిప్యూటేషన్‌పై సహాయకుడిగా పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు తేళ్ల వంశీకృష్ణను సస్పెండ్ చేయాలని గంటా పాఠశాల విద్యా కమీషనర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వంశీకృష్ణ అర్హత లేకపోయినా టెట్ వ్యాయమ పరీక్షకు దరఖాస్తు చేశారు. అదేవిధంగా ఏపీ ప్రభుత్వ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఆయన అభ్యర్థులకు ఓ కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రమంలో తమ కోచింగ్ సెంటర్లోని అభ్యర్థులను గట్టెక్కించేందుకు టెట్‌కు దరఖాస్తు చేశారు. ఈ ఆరోపణల నేపథ్యంలో వంశీకృష్ణను సస్పెండ్ చేస్తూ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. -
పొలిటికల్ కారిడర్ 4th June 2018
-
ముగిసిన టెట్ దరఖాస్తు గడువు
అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు మొత్తం 3,97,957 దరఖాస్తులు వచ్చాయని, ఈ గురువారంతో టెట్ దరఖాస్తు సమర్పణ గడువు ముగిసిందని ఏపీ ఉన్నత విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. విలేకరులతో మాట్లాడుతూ..పేపర్1కు 1,69.085 మంది, పేపర్ 2ఏ(సోషల్)కు 66,063, పేపర్2ఏ(మ్యాథ్స్,సైన్స్)కు 76,180 మంది, పేపర్ 2ఏ(ఇంగ్లీషు)కు 11,015 మంది, పేపర్ 2ఏ లాంగ్వేజ్ టీచరల్‌కు 59,469 మంది, పేపర్ 2బీకు 16,145 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ ద్వారా సమాధానాలు ఇచ్చామని తెలిపారు. 4 పరీక్షా కేంద్రాల ఎంపికకు సంబంధించి అభ్యర్థుల మొబైళ్లకు సంక్షిప్త సందేశాలు పంపామని వెల్లడించారు. ఈ నెల 25 నుంచి29 వరకు ఆన్లైన్లో తమకు నచ్చిన జిల్లా కేంద్రాన్ని అభ్యర్థులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించామని వివరించారు. సదరు జిల్లాల్లో అభ్యర్థులు పరిమితికి మించితే తదుపరి జిల్లా కేంద్రం ఎంపిక చేసుకునే వీలు కల్పించినట్లు చెప్పారు.ఇంప్రూవ్ మెంట్ కోసం ఇంతకుముందు టెట్ ఉత్తీర్ణులైన వారు అత్యధికంగా తిరిగి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 25 నుంచి ఆన్లైన్లో మాక్‌టెస్ట్ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా వివరించారు. -
‘ప్రజల మనిషి రామచంద్రమూర్తి’
సాక్షి, హైదరాబాద్: సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన నిలిచి పాలకులకు వాస్తవాలను తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. రామచంద్రమూర్తి 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సీనియర్ పాత్రికేయులు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో ఆదివారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మూర్తికి సామాజిక బాధ్యత ఎక్కువ అని, తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా నిర్వహించిన ‘దశ దిశ’కార్యక్రమం అత్యున్నతమైందని పేర్కొన్నారు. మారుతున్న సమాజంలో నిజాయితీతో పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిజాన్ని వృత్తిగానే కాకుండా ప్రవృత్తిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రామచంద్రమూర్తి అని, ఆయన ఓ విశ్వవిద్యాలయం లాంటివారని అన్నారు. ముక్కుసూటిగా చెప్పడం, నిరాడంబరత నైజమని పేర్కొన్నారు. గంభీర పరిస్థితుల్లోనూ తొణకని మనస్తత్వం ఆయనదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సమస్యలను పరిష్కరించే కోణంలో అన్ని రకాల భావజాలం కలిగిన వ్యక్తులతో సయోధ్య, చర్చకు వీలు కల్పించిన నేర్పు, ఓర్పు రామచంద్రమూర్తి సొంతమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ప్రశంసించారు. అనేక సంక్లిష్ట పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కొన్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనదని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటుకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎనలేనిదని అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి ‘సాక్షి’లో రాసిన త్రికాలం ఎడిట్ పేజీ వ్యాసాల సంకలనాన్ని మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలికాపీని జైపాల్‌రెడ్డికి అందజేశారు. అంతకుముందు 50 ఏళ్ల జర్నలిజం ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయులు ఎస్.వెంకటనారాయణ్‌ను రామచంద్రమూర్తి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, రక్షణ మంత్రి సలహాదారు సతీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి, పాశం యాదగిరి, జ్వాలా నరసింహారావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు కాకి మాధవరావు, ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. -
ఏపీ ఐసెట్-2018 ఫలితాలు
సాక్షి, విజయవాడ: ఎంబీఏ, ఎంసీఏ కోర్టులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్-2018 ఫలితాలను శనివారం విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ పరీక్షకి 48,635 మంది హజరుకాగా 45,037 మంది అర్హత సాధించారు. ఐసెట్‌లో 92.60 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 6 శాతం ఉత్తీర్ణత పెరిగినట్లు మంత్రి తెలిపారు. అన్ని సెట్ల పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించడంతోపాటు, ఫలితాలను కూడా వెల్లడించామని మంత్రి అన్నారు. మొదటిర్యాంక్ గుంటూరుకు చెందిన సీహెచ్ ప్రసన్న కుమార్ సాధించగా, రెండో, మూడో ర్యాంకులను వరుసగా అనంతపురానికి చెందిన భరత్ కుమార్ , సాయికుమార్ రెడ్డిలు కైవసం చేసుకున్నారు. -
ఏపీ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల
-
హతవిధీ.. ఏమిటిది?
ఇద్దరూ మంత్రులే... కానీ ఒకరు దర్జా ఒలకబోస్తారు. మరొకరేమో... వారి ముందు వినయంగా ఉంటారు. ఈ తేడా ఎందుకొస్తోందో అర్థం కాక.. జిల్లా ప్రజలు జుత్తు పీక్కుంటున్నారు. అధికారులతోగానీ... జిల్లా ఎమ్మెల్యేలతోగానీ... చేపట్టిన సమీక్షలు అమరావతిలోనో... పక్కనే ఉన్న విశాఖలోనో జరుగుతుంటాయి. అక్కడికే మన జిల్లా మంత్రి వెళ్తుంటారు. ఇదెంతవరకు సబబని ప్రశ్నిస్తే... అదేమీ అధికారికం అని తాను అనుకోవడంలేదని చెబుతుంటారు. చాలా విచిత్రంగా ఉన్న ఈ వ్యవహారం చూసే జిల్లావాసులకు మాత్రం తలకొట్టేసినట్టుంటోంది. సాక్షిప్రతినిధి, విజయనగరం:జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాసరావు అమరావతిలోనో... విశాఖపట్నంలోనో సమావేశాలు పెట్టి విజయనగరం జిల్లా రాజకీయ, పరిపాలనాంశాలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాకు చెందిన అదే హోదాలో ఉన్న మంత్రి సుజయ్ మాత్రం ఆయన ఎక్కడికి పిలిస్తే అక్కడకు వెళ్ల్లడం జిల్లా టీడీపీలో ఓ వర్గాన్ని తీవ్రంగా బాధిస్తోంది. పార్టీ విషయాలపైనసుజయ్ సమీక్షలు జరపకపోవడంపై పార్టీ వర్గాలు, జిల్లా సమస్యలపై చర్చించకపోవడంపై ప్రజలూ అసంతృప్తితో ఉన్నారు. రాజవంశ ఠీవి.. ఆ పౌరుషం కొందరిలో కనిపించదు. అలాగని సామాన్యులుగా మామూలు జనంలో కలిసిపోయే మనస్తత్వం కూడా వారిలో ఉండదు. పేరుకు రాజులమని చెప్పుకోవడం తప్ప ఆ స్థాయిని, గౌరవాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతూనే ఉంటారు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే జిల్లాలో ప్రజాప్రతినిధులుగా రాజ వంశం వారే ప్రధాన పదవుల్లో ఉన్నారు. వారిలో సుజయ్‌కృష్ణ రంగారావు ఒకరు. రాష్ట్ర గనులశాఖ మంత్రిగా ఉన్న ఆయనంటే బొబ్బిలి ప్రాంతంలో ఒకప్పుడు చాలా గౌరవం ఉండేది. కానీ విశ్వసనీయతను నిలుపుకోలేక, పదవి కోసం పార్టీ జెండా మార్చి తనకు తానుగా ప్రతిష్టను దిగజార్చుకున్నారు. పోనీ టీడీపీలోకి వెళ్లిన తర్వాతైనా తన స్థాయికి తగ్గట్టుగా నడుచుకుంటున్నారా అంటే అదీ లేదు. అక్కడా గుర్తింపునకు నోచుకోవడంలేదు. ఇన్చార్జి మంత్రిదే హవా... అధికార పార్టీలో చిన్న పదవిలో ఉన్నవారైనా తామెవరికీ తీసిపోనట్టు ప్రవర్తిస్తారు. కానీ సాక్షాత్తూ రాష్ట్ర మంత్రి పదవిలో ఉన్న సుజయ్ మాత్రం సాటి మంత్రి దగ్గర కాస్త తగ్గి ఉన్నట్టు కనిపిస్తున్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు నియమించిన తర్వాత రాజకీయ, పాలన పరిస్థితులపై సమీక్షించడానికి ఆయన జిల్లాకు రావడం లేదు. గడచిన ఎనిమిది నెలల్లో తొలిసారి వచ్చినపుడు అధికారులను పరిచయం చేసుకుని వెళ్లిపోగా ఆ తర్వాత ఒకటి రెండు ప్రారంభోత్సవాలకు, ఆగస్టు 15న జెండా ఆవిష్కరణకు మాత్రమే ఆయన వచ్చి వెళ్లారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా సమీక్షించాల్సిన బాధ్యత ఉండటంతో జిల్లా నేతలను, అధికారులను తాను ఎక్కడుంటే అక్కడకు పిలిపించుకుని మొక్కుబడిగా సమావేశం నిర్వహిస్తున్నారు. రాజధానిలోనే... రాజకీయ చర్చలు మరోవైపు తనకంటూ జిల్లాలో ఓ వర్గాన్ని ఏర్పరచుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు ఆయన పంచన చేరారు. ఈ నేపథ్యంలో జిల్లాలో నేతల మధ్య ఏర్పడే వివాదాలను అమరావతిలోనే కూర్చొని గంటా సెటిల్ చేస్తున్నారు. లేదా విశాఖలో చర్చలు జరుపుతున్నారు. తాజాగా అమరావతిలో జిల్లా టీడీపీ నేతలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మూడు రోజుల క్రితం మంత్రి సుజయకృష్ణ రంగారావు, కలెక్టర్ వివేక్‌యాదవ్‌ను విశాఖ రప్పించుని మాట్లాడారు. సుజయ్ మాత్రం గంటా ఎలా అంటే అలా, ఎక్కడికంటే అక్కడికి వెళుతూ ఆయన చెప్పినదానికల్లా తలాడిస్తున్నారు. ఇప్పటికే అశోక్‌గజపతిరాజు వ్యవహారాల్లో గంటా తలదూర్చినా ఆయన ఇంత వరకూ ఏమీ అనలేకపోతున్నారనే అపవాదు ఉంది. కానీ అశోక్ విషయంలో గంటా వ్యవహారశైలిపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, గంటాను మందలించారని ప్రచారం జరిగింది. కనీసం అలాంటిది సుజయ్ విషయంలో లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. -
నాలుగేళ్లపాటు చక్రం తిప్పిన సత్యవేణి
విశాఖ సిటీ: ఆమె మహా విశాఖ నగర పాలక సంస్థలో బాధ్యత గల ఉన్నతాధికారి. కానీ టీడీపీ కార్యకర్తలా వ్యవహరించేవారనే ఆరోపణలు వినిపించేవి. ముఖ్యంగా తూర్పు ఎమ్మెల్యేకు అనుచరురాలిగా ఉండే వారనే విమర్శలు వెల్లువెత్తేవి. ఆయన చెప్పిన పని చెయ్యడం మాత్రమే తన ప్రథమ కర్తవ్యంగా భావించిన ఆ జోనల్ కమిషనర్... మంత్రి గంటా విషయంలో మాత్రం మొండిగా ఉండేవారు. ఎమ్మెల్యే ఆదేశాలే తప్ప ఎవ్వరినీ పట్టించుకోకపోవడంతో మంత్రితో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎంతలా అంటే ఆమె బదిలీకి రంగం సిద్ధం చేసేంతలా. విషయం తెలుసుకున్న ఆ అధికారిణి.. ఎమ్మెల్యేతో పావులు కదిపి ఆ బదిలీ తనను బూరెల బుట్టలో పడేసేలా సొంతూరుకి పయనమయ్యేలా మార్చేసుకున్నారు. మంత్రి చక్రాన్ని అనుకూల దిశలో... తన నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు, ఇతర అంశాల విషయంలో జెడ్సీ సత్యవేణి అనుసరిస్తున్న వైఖరి మింగుడుపడని గంటా ఆమె బదిలీకి పట్టుబట్టారు. ఈ బదిలీ విషయం కొద్ది రోజులుగా నలుగుతున్న నేపథ్యంలో విషయం తెలుసుకున్న జెడ్సీ సత్యవేణి... మంత్రి సంధించిన బదిలీ బాణాన్ని తనదైన శైలిలో అనుకూల దిశకు మలచుకున్నారు. ఎమ్మెల్యే వెలగపూడి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రితో తన బదిలీ విషయంపై నాలుగు రోజుల పాటు ఆమె చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి గంటాతో సదరు ఎమ్మెల్యే, మంత్రి ఫోన్లో సంప్రదించినా బదిలీ చెయ్యాల్సిందే అని పట్టుబట్టారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీ చెయ్యాల్సి వచ్చింది. దీన్ని తనకు అనుకూలంగా మలచుకున్న సత్యవేణి సొంతూరైన కాకినాడకు అదనపు కమిషనర్‌గా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. దీంతో ఆమెను ఇక్కడి నుంచి పంపించాలన్న మంత్రి కల నెరవేరగా, బూరెల బుట్టలో పడ్డట్లుగా సొంతూరుకు ఆమె వెళ్లిపోయింది. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరన్న విషయం జోనల్ కమిషనర్ సత్యవేణి విషయంలో మరోసారి నిరూపితమైంది. విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం జీవీఎంసీ జోన్ – 1 కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన పీఎం సత్యవేణిని కాకినాడ అదనపు కమిషనర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీ వెనుక మంత్రి గంటా శ్రీనివాసరావు హస్తం ఉందనేది బహిరంగ రహస్యంగా జోన్ వర్గాలు చెబుతున్నాయి. నాలుగేళ్ల క్రితం జోనల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్యవేణి... 2014లో వెలగపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న కార్యకర్తగా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయన చేసే ప్రతి పనికీ ఈమె అండదండలు పుష్కలంగా ఉండేవని తెలుస్తోంది. జోనల్ కమిషనర్ నిర్వర్తించాల్సిన బాధ్యతలన్నింటినీ పక్కన పెట్టి.. ఎమ్మెల్యే చేసే ప్రతి కార్యక్రమానికి హాజరయ్యేవారు. ఫలితంగా జోన్ – 1 అభివృద్ధి కుంటుపడింది. గ్రీవెన్స్ ద్వారా వచ్చే వినతులను సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది జోన్లలో అన్నింటిదీ ఒకబాటైతే... ఈమె జెడ్సీగా పనిచేస్తున్న జోన్ – 1 దారి మాత్రం వేరు. అక్కడ అభివృద్ధి శూన్యం. ఆక్రమణలు బహిరంగం. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా అన్ని జోన్లలో స్వచ్ఛత విషయంలో జోనల్ కమిషనర్లు కఠినంగా వ్యవహరిస్తే... ఈమె మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయంలో ఫీల్డ్ విజిట్‌కి వెళ్లిన ప్రతిసారీ ప్రధాన కమిషనర్ హరినారాయణన్ బహిరంగంగా చీవాట్లు పెట్టినా ఆమె మాత్రం తన పంథా మార్చుకోలేదు. పైగా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిసారీ... కమిషనర్‌కు పై నుంచి ఆదేశాలు వచ్చేవని జీవీఎంసీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిధులు మురగబెట్టినా కనీస నిర్ణయాలు తీసుకోకపోయినా ఈ జెడ్సీ దర్జాగా సాగిపోయారు. మంత్రి చెబితే వినాలా..? ఎమ్మెల్యే వెలగపూడి పేరుతో ఆయన అనుచరులు చేసే ప్రతి ఆక్రమణకు జెడ్సీ సత్యవేణి వత్తాసు పలికేవారన్నది బహిరంగ రహస్యం. పార్కులు, ఖాళీ స్థలాలు దర్జాగా ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకోకుండా వ్యవహరించేవారు. చెరువులను అభివృద్ధి చేసి నీటి వనరులు పరిరక్షించుకోవాలని జీవీఎంసీ భావిస్తే... ఈమె మాత్రం ఆ చెరువులు ఆక్రమణకు గురైనా పట్టించుకోలేదు. వేసవిలో నీటి సరఫరా విషయంలోనూ సత్యవేణి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆరిలోవ పరిసర ప్రాంతాల ప్రజలు తాగునీటికి అవస్థలు పడ్డారు. ఈ విషయంలో 20 రోజుల క్రితం జీవీఎంసీ కమిషనర్ హెచ్చరికలు జారీ చేసినా ఆమె పట్టించుకోలేదు. మరోవైపు ఎమ్మెల్యే అండతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సత్యవేణి.. మంత్రి గంటా విషయంలో మాత్రం పూర్తి విరుద్ధంగా నడుచుకునేవారు. వెలగపూడి చెప్పే పనిని క్షణాల్లో పూర్తి చేసే ఆమె.. మంత్రి గంటా ఏ పనిచెప్పినా పట్టించుకునేవారే కాదు. ఫలితంగా పలు మార్లు గంటాకు, ఈమెకు మధ్య వాగ్వాదం జరిగింది. తరచూ మంత్రి గంటా చీవాట్లు పెట్టేవారు. ఇటీవల మంత్రి ప్రధాన అనుచరులు ఓ విషయంలో వాగ్వాదం జరిగిన సమయంలో నిన్ను బదిలీ చేయిస్తామని జెడ్సీని బహిరంగంగానే హెచ్చరించారు. -
టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం
సాక్షి, అమరావతి: ఏపీ టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఏ జిల్లా నుంచి అభ్యర్ధి దరఖాస్తు చేస్తే ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అదే విధంగా సీటింగ్ కేపాసిటీ లేకుండానే పలు కేంద్రాలకు అధికారులు హాల్ టికెట్లను జారీ చేశారు. మరో వైపు హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్‌లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి మూడో తేదీత వరకు ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే టెట్ నిర్వహణకు సంబంధించిన లోటుపాట్లతో మళ్లీ పరీక్షల వాయిదా పడుతుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులపై గంటా ఆగ్రహం టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల కేటాయింపుల్లో పొరపాట్లు చోటు చేసుకోవడం పై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంటా సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్ధులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నిలదీశారు. తొలిసారి ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ముందు నుంచి చెబుతున్నా అధికారుల అలసత్వం కనబరచడం సరికాదన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి గురువారం విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
ఫిబ్రవరి 21 నుంచి టెట్ నిర్వహణ
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ పరీక్ష జనవరి 17 నుంచి 27 వరకు నిర్వహించాలనుకున్నారు. గడువు తక్కువగా ఉందని అభ్యరులు ఆందోళన చేయడంతో ఫిబ్రవరి 15 వరకు గడువును పెంచారు.. ఈ గడువు సరిపోదనడంతో ప్రభుత్వం ఫిబ్రవరి 21కి టెట్‌ను వాయిదా వేసింది.దీంతో అభ్యర్థుల అందోళనకు తెరపడింది. టెట్ తాజా షెడ్యూల్ : హాల్‌టికెట్టు డౌన్లోడ్: ఫిబ్రవరి 10 నుంచి పెపర్–1, పేపర్–2 అన్లైన్ పరీక్షల షెడ్యూల్: ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు ప్రాథమిక కీ విడుదల : మార్చి 4 ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: మార్చి 4 నుంచి 9 వరకు ఫైనల్ కీ విడుదల : మార్చి 12 ఫలితాల ప్రకటన: మార్చి 16 -
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
సాక్షి, అమరావతి : ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ నోటిఫికేషన్ పై మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ప్రకటన చేశారు. ఈ నెల 15న డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు సిలబస్ ను విడుదల చేస్తామని, మొత్తం 12,370 పోస్టులకు డిసెంబర్ 26 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన బుధవారమిక్కడ తెలిపారు. 45 రోజుల పాటు అప్లికేషన్‌కు గడువు ఉంటుందని మంత్రి గంటా వెల్లడించారు. మార్చి 23, 24, 26 తేదీల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయులు అందుబాటులో ఉండేలా జూన్ 12 కల్లా భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. నోటిఫికేషన్ వివరాలు : 15-12-2017 న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల 26-12-2017 నుండి 8-02-2018 వరకు దరఖాస్తుల స్వీకరణ 09.03.2018 నుంచి అందుబాటులో హాల్‌టికెట్లు 05.05.2018 న ఫలితాల విడుదల 2018 జూన్ 12 నాటికి పోస్టింగ్‌లు సమస్యలపై ఇలా.. 1998, 2008, 2012 డిఎస్సీ అభ్యర్థుల సమస్యల పరిష్కరించడానికి ఎమ్యెల్సీ, అధికారులతో కమిటీ నియమిస్తున్నట్లు గంటా తెలిపారు. నివేదిక రాగానే అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పారు. రూ. 5 వేల కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. కార్పొరేట్ కాలేజీలపై ఇంకా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు. -
విశాఖ ఐఐఎంలో తరగతులు ప్రారంభం
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు వీటిని అధికారికంగా ప్రారంభించారు. విభజన చట్టంలో హామీ మేరకు ఇక్కడ ఐఐఎంను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో బెంగళూరు ఐఐఎం డెరైక్టర్ సుశీల్ వశాని తదితరులు పాల్గొన్నారు.