ఫిబ్రవరి 21 నుంచి టెట్‌ నిర్వహణ | tet starts from february 21st | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 21 నుంచి టెట్‌ నిర్వహణ

Published Mon, Jan 29 2018 9:04 AM | Last Updated on Mon, Jan 29 2018 9:04 AM

tet starts from february 21st - Sakshi

డీఎస్సీ అభ్యర్థులు

కడప ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) నిర్వహణ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.షెడ్యూల్‌ ప్రకారం ఆన్‌లైన్‌ పరీక్ష జనవరి 17 నుంచి 27 వరకు నిర్వహించాలనుకున్నారు. గడువు తక్కువగా ఉందని  అభ్యరులు ఆందోళన చేయడంతో   ఫిబ్రవరి 15 వరకు గడువును పెంచారు.. ఈ గడువు సరిపోదనడంతో  ప్రభుత్వం ఫిబ్రవరి 21కి టెట్‌ను వాయిదా వేసింది.దీంతో అభ్యర్థుల అందోళనకు తెరపడింది.

టెట్‌ తాజా షెడ్యూల్‌ :
హాల్‌టికెట్టు డౌన్‌లోడ్‌: ఫిబ్రవరి 10 నుంచి
పెపర్‌–1, పేపర్‌–2 అన్‌లైన్‌ పరీక్షల షెడ్యూల్‌:
ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3 వరకు
ప్రాథమిక కీ విడుదల : మార్చి 4
ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: మార్చి 4 నుంచి 9 వరకు
ఫైనల్‌ కీ విడుదల :  మార్చి 12
ఫలితాల ప్రకటన: మార్చి 16 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement