
సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీల ఢిల్లీ పర్యటనపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'రాష్ట్రపతికి కంప్లైంట్ల పేరుతో పచ్చ బ్యాచ్ ఢిల్లీలో కొత్త డ్రామాలు మొదలెట్టారు. నేరం చేసిన వారిపై కేసు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ చేసినట్లు, అవినీతిపరులను అరెస్ట్ చేస్తే రాజ్యాంగం విఫలం అయినట్లు, శాంతి భద్రతలు క్షిణించినట్లు అంట. మీ డ్రామాలు చూసి ఊసరవెల్లులు సిగ్గుపడుతున్నాయి' అంటూ విమర్శనాస్త్రాలు సంధించారు. (40 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఒక్కసారి కూడా సొంతంగా!)
టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్లను అందజేయాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బడికొస్తా పథకంలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. దీనిపై విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తూ.. 'బడికొస్తా పథకం పేరుతో లక్షా 82 వేల సైకిళ్లు బాలికలకు పంపిణీ చేసారట. ఎందరికి అందాయో, ఇచ్చినట్టు రికార్డుల్లో రాసారో దర్యాప్తులో వెల్లడవుతుంది. 30-40 ఏళ్ల కిందటి సైకిళ్లు ఇప్పటికీ రోడ్లపైన కనిపిస్తాయి. మూడేళ్లలోనే అమ్మాయిల సైకిళ్ల గంటలు ఎందుకు మూగబోయాయో శీను మాయ తెలియాల్సి ఉంది' అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. (12 కోట్ల కొనుగోళ్లలో రూ.5 కోట్ల అవినీతి!)
Comments
Please login to add a commentAdd a comment